అమర్నాథ్ యాత్ర నిలిపివేత
posted on Jul 30, 2025 3:42PM
.webp)
భారీ వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడుతున్న ఘటనల నేపథ్యంలో అమర్నాథ్ యాత్రను నిలిపివేశారు. జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, హిమచల్ ప్రదేశ్ లలో భారీ వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ప్రతికూల వాతావరణానికి తోడు అమర్నాథ్ యాత్ర మార్గంలో పలు చోట్ల కొండచరియలు విరిగిపడుతుండటంతో పలు రహదారులు మూసుకుపోయి రాకపోకలు స్తంభించి పోయాయి.
ఈ నేపథ్యంలో గత్యంతరం లేని పరిస్థితుల్లో పహల్గామ్, బల్తాల్ మార్గాలలో అమర్ నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేసినట్లు అధకారులు ప్రకటించారు. ఈ మార్గాల్లో యాత్రను ఎప్పటి నుంచి అనుమతించేది తరువాత ప్రకటిస్తామని పేర్కొన్నారు. వాతావరణం అనుకూలించిన తరువాత రహదారులను క్లియర్ చేసి యాత్రికులను అనుమతిస్తామని వవిరించారు.