జగన్ దగ్గరకి రాకుండా వుండాల్సింది.. అఖిలేష్ పశ్చాత్తాపం!
posted on Jul 24, 2024 6:14PM
లెవన్, శవన్ అలియాస్ జగన్ ఢిల్లీలో నిర్వహించిన ధర్నా కార్యక్రమానికి అనవసరంగా వచ్చినట్టు సమాజ్‌వాది పార్టీ నాయకుడు, ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ నాలుక కరుచుకున్నట్టు తెలుస్తోంది. జగన్ అసలు స్వరూపం గురించి సరిగా తెలియకపోవడం, విజయసాయిరెడ్డి తదితరులు అఖిలేష్ యాదవ్ దగ్గరకి వెళ్ళి కాళ్ళావేళ్ళా పడటంతో ఆయన జగన్ ధర్నా దగ్గరకి వచ్చారు. ఒక్క అఖిలేష్ యాదవ్ తప్ప చెప్పుకోదగ్గ నాయకులెవరూ అక్కడకి రాలేదు. జగన్ దగ్గరకి వచ్చిన అఖిలేష్ యాదవ్, ఇంకా ప్రముఖ నాయకులందరూ వస్తున్నారని, భూమి బద్దలు కాబోతోందని చెప్పారు కదా.. వాళ్ళందరూ ఏరి అని విజయసాయిరెడ్డి తదితరులను ప్రశ్నించారు. దాంతో వీళ్ళు ఆయనకు ఏదో చెప్పి మేనేజ్ చేశారు. ఇదేదో తేడా వ్యవహారం లాగానే వుందని అనుకుంటూ, అఖిలేష్ యాదవ్ అక్కడ నుంచి తిరిగి వెళ్ళే సమయంలో ఆంధ్రప్రదేశ్‌కి చెందిన, జగన్ అక్రమాలపై రాజీలేని పోరాటం చేస్తున్న జడ్జి రామకృష్ణ అఖిలేష్ దగ్గరకి వెళ్ళారు. ఆయనకి ఏ1 జగన్, ఏ2 విజయసాయిరెడ్డిల నేర చరిత్ర గురించి, వాళ్ళ అసలు స్వరూపం గురించి పూస గుచ్చినట్టు వివరించారు. అప్పటికి గానీ, తాను సంఘీభావం తెలిపింది ఒక క్రిమినల్‌కి అనే విషయం అఖిలేష్ యాదవ్‌కి అర్థం కాలేదు. ఈ క్రిమినల్ దగ్గరకి మనం అనవసరంగా వచ్చాం, ఇక్కడకి రాకుండా వుండాల్సింది అని అఖిలేష్ యాదవ్ అక్కడే వున్న తన సహచరులతో అన్నట్టు తెలుస్తోంది. మొత్తమ్మీద ఢిల్లీలో ధర్నా చేసిన జగన్ పరువు జాతీయ స్థాయిలో పోయినట్టు అయింది.