పడవ, బస్సు ప్రమాదాలు... 88 మంది...

 

గల్ఫ్‌లోని యెమెన్ దగ్గర ఎర్ర సముద్రంలో ఒక పడవ బోల్తా పడటంతో 70 మంది మరణించారు. ఈప్రమాదంలో చనిపోయినవారందరూ ఆఫ్రికాకు చెందినవారు. ఇథియోపియా నుంచి పడవలో యెమెన్ వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. బలమైన గాలులు, అలల తాకిడికి పడవ బోల్తా పడింది. ఈ మార్గంలో ప్రతి ఏటా వేలాదిమంది వలస వెళ్తూ వుంటారు. అలాగే నేపాల్‌‌లో బస్సు బోల్తా పడిన సంఘటనలో 18 మంది మరణించారు. ఆదివారం రాత్రి ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో 14 మంది అక్కడికక్కడే మరణించగా, మరో నలుగురు చికిత్స పొందుతూ మరణించారు. 38 మంది ప్రయాణికులు మాత్రమే ప్రయాణించాల్సిన ఈ బస్సులో 67మంది ప్రయాణిస్తున్నారు. అది కూడా ఒక పర్వతం లోంచి మలచిన ఇరుకు రహదారిలో ఈ ప్రమాదం జరిగింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu