మాజీ ఎమ్మెల్యే కొడుకు కార్ల దొంగ
posted on Dec 8, 2014 12:43PM

ప్రజా ప్రతినిధుల పుత్ర రత్నాలకి, కార్లకి చాలా పెద్ద లింకు ఉన్నట్టుంది. కొంతమంది లీడర్ల కొడుకులు వేగంగా కార్లు నడిపి జనం ప్రాణాలతో ఆడుకుంటూ వుంటారు. మరికొంతమంది హైవేల మీద కార్ల రేసులు చేస్తూ ప్రాణాలమీదకి తెచ్చుకుంటూ వుంటారు. ఇప్పుడు మరోరకం పుత్రరత్నం వెలుగులోకి వచ్చాడు. ఈ పుత్రరత్నం కార్లను దొంగతనం చేయడంలో సిద్ధహస్తుడు. ఈ పుత్రరత్నం పేరు సుమన్. మహబూబ్ నగర్ జిల్లాకి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే గారికి ఇతగాడు ముద్దుల కొడుకు. హైదరాబాద్‌లో ఏదో చదవి వెలగబెడుతున్న ఈ కుర్రాడు జల్సాలకు బాగా అలవాటు పడ్డాడు. వాళ్ళ నాన్న డబ్బు ఇవ్వనన్నాడో ఏమోగానీ, తన జల్సాల కోసం కార్ల దొంగతనాలు మొదలుపెట్టాడు. కార్లు దొంగతనం చేయడం, వాటిలో గర్ల్ ఫ్రెండ్స్‌ని ఎక్కించుకుని ఎంజాయ్ చేయడం, ఆ తర్వాత ఆ కారును అమ్మేయడం.. నెక్ట్స్ ఇంకో కారు.. ఇలా ఇప్పటి వరకు చాలా కార్లని దొంగతనం చేశాడు. పాపం ఈ కుర్రాడికున్న మరో మంచి లక్షణం ఏమిటంటే, చాలా ఖరీదైన కార్ల జోలికే వెళ్తాడు.. తక్కువ ధర కార్లని పొరపాటున కూడా ముట్టుకోడు. ఎట్టకేలకి ఈ కార్ల దొంగ పోలీసులకు దొరికాడు.