జాతీయ గ్రంథం మద్భగవద్గీత
posted on Dec 8, 2014 10:25AM

హిందువుల పరమ పవిత్ర గ్రంథం భగవద్గీతకు ‘జాతీయ గ్రంథం’ హోదా వస్తోంది. భగవద్గీతకు జాతీయ హోదా కల్పిస్తామని భారతదేశ విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారు. భగవద్గీతకు 5.151 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆదివారం నాడు ఢిల్లీలో జరిగిన గీతా ప్రేరణ మహోత్సవంలో సుష్మా స్వరాజ్ పాల్గొని పై ప్రకటన చేశారు. ‘‘భగవద్గీతకు జాతీయ గ్రంథం హోదాల కల్పించేందుకు పార్లమెంటులో ప్రత్యేకంగా బిల్లును ప్రవేశపెట్టనున్నాం. అమెరికా పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ అమెరికా అధ్యక్షుడు ఒబామాకి భగవద్గీతను బహుమతిగా ఇచ్చిన విషయాన్ని మనం గుర్తుచేసుకోవాలి’’ అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విశ్వహిందూ పరిషత్ అధ్యక్షుడు అశోక్ సింఘాల్ పవిత్ర గ్రంథం భగవద్గీతకు జాతీయ గ్రంథం హోదాని ఇవ్వాలని చేసిన డిమాండ్‌కి ప్రతిస్పందిస్తూ సుష్మా స్వరాజ్ ఈ విషయాన్ని తెలిపారు.