తెలుగోళ్లపై నటి కస్తూరి అక్కసు 

కాంట్రావర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన నటి కస్తూరి మరో సారి వివాదంలో చిక్కుక్కున్నారు. భారతీయుడు చిత్రంలో కమల్ హాసన్ పక్కన మెరిసిన నటి కస్తూరి ప్రస్తుతం బిజెపి సభలో తెలుగువారిపై విద్వేష వ్యాఖ్యలు చేశారు. కస్తూరి వ్యాఖ్యలు దేశ వ్యాప్త సంచలనమయ్యాయి.  300 ఏళ్ల క్రితం తమిళనాడుకు వచ్చిన తెలుగు వాళ్లు అంతపురంలో చెలి కత్తెలుగా నియామకమయ్యారన్నారు.   తమిళ బ్రాహ్మణులు పరస్త్రీ వ్యామోహం, ఇతరుల ఆస్తులను  కొల్లగొట్టకూడదని చెబుతున్న కారణంగానే కొందరు తమిళులను వ్యతిరేకిస్తున్నారని ఆమె ఉక్రోశం వ్యక్తం చేశారు. రాష్ట్ర కేబినేట్ లో ఐదుగురు తెలుగు వచ్చిన మంత్రులున్నారని ఆమె అన్నారు. తమిళనాడుకు వలస వచ్చిన వారు తమిళులపై పెత్తనం సాగిస్తున్నారని కస్తూరి వ్యాఖ్యలు చేశారు. తెలుగు సినిమాల్లో మంచి మంచి పాత్రలు పోషించిన కస్తూరి తెలుగువారిపై అక్కసు వెళ్లగక్కడం తగదని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. తమిళనాడుకు  వలస వచ్చిన తెలుగు వాళ్లు తమిళ బ్రాహ్మణులను తమిళులు కాదనడం సరైంది కాదని కస్తూరి అన్నారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu