ఎయిర్ పోర్టులో ప్రత్యక్షమైన యూట్యూబర్ హర్షసాయి

పరారిలో ఉన్న యూట్యూబర్ హర్షసాయి అకస్మాత్తుగా శంషాబాద్ ఎయిర్ పోర్టులో ప్రత్యక్షమయ్యాడు.  కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి తనపై అత్యాచారం చేసినట్లు ఓ సెలబ్రిటీ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో  ఆ సెలబ్రిటీ సెప్టెంబర్‌ నెల 24 వ తేదీన   హర్షసాయిపై నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెళ్లి పేరుతో మోసం చేశాడని ఆరోపించింది. రూ.2 కోట్ల రూపాయలు సైతం తీసుకున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. యువతి ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు  హర్షసాయిపై కేసు నమోదు చేశారు. కేసు నమోదైన తర్వాత హర్ష
సాయి పరారీలో ఉన్నాడు. అరెస్ట్ తప్పించుకోవడానికే హర్షసాయి విదేశాలకు పారిపోయినట్టు  ప్రచారం జరిగింది.  హర్షసాయి కోసం పోలీసులు గాలించారు. ఏ క్షణమైనా అరెస్ట్ అవుతాడన్న ప్రచారం జరుగుతుండగా తెలంగాణ హైకోర్టు అతడికి బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ మంజూరయిన తర్వాత  హర్ష సాయి  శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ప్రత్యేక్షమయ్యాడు. తనపై వచ్చిన ఆరోపణలు అసత్యమన్న హర్షసాయి నిజాలు బయటకొచ్చాయి కాబట్టే కోర్టు తనకు బెయిల్ ఇచ్చిందన్నాడు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu