ఎదుగుదలకు నిత్య సూత్రం...' ఫోకస్'
posted on Mar 10, 2016 8:54AM
.jpg)
మనం ఎంతో ఇష్టం గా ఒక పని చేయటం మొదలు పెడతాం..ఇష్టం గా చేసే పని ఎప్పుడూ మనల్ని ఒక మెట్టు ఎక్కిస్తుంది ..ఆ మెట్టు ఎక్కిన సంబరం లో మనం ఉండగానే , మనల్ని ఆ మెట్టు మీద నుంచి పై మెట్టు మీదకి వెళ్ళకుండా కిందకి లాగటానికి ఒకో సారి ఎన్నో చేతులు ప్రయత్నిస్తుంటాయి. అప్పుడు మనం ఏం చేయాలి ?
మనందరి జీవితాలలో ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి అనుభవం ఎదురవుతూ వుంటుంది . అప్పుడు కోపం, ఉక్రోషం వస్తుంటుంది ..ఏం చేస్తే మనం వాళ్ళని ఎదుర్కోగలం ? అన్న ఆలోచన తినేస్తుంటుంది . దీనికి నిపుణులు చెబుతున్న సలహా ఏంటో తెలుసా ?
"మిమ్మల్ని ఎదగ నివ్వ కూడదు అనుకునే చేతులకి అంద నంత ఎత్తుకు ఎదగండి "అదెలా సాధ్యం ? అంటే నిపుణులు చెబుతున్న సూచనలు ఇవిగో మీకోసం ఇక్కడ ఇస్తున్నాం ..చదివేయండి..ఆలోచించండి ..ఆచరించండి ..

మనకి కావలసిన దానిమీద వుండాలి మన ఫోకస్
ఏ చెట్టు ఎదగాలో దానికి నీళ్ళు పోస్తాం మనం ..అంతే కాని అక్కరలేని పిచ్చి మొక్కకి కాదుగా . అలాగే మన ఆలోచనలు కూడా మనకి కాలసిన వాటి గురించి మాత్రమే వుండాలి కాని , అక్కరలేని వాటి గురించి ఉండకూడదు. మనం దేని మీద శ్రద్ద పెడితే అది మాత్రమే ఎదుగుతుంది." ఫోకస్ " మీ ఎదుగుదలకి, ఆనందానికి అతి ముఖ్యమయిన అంశం. అందుకే మీ ఫోకస్ ఎప్పుడూ మీరు చేసే పని మీదే పెట్టండి . దానిని మరింత శ్రద్దగా చేయగలుగు తారు . దానితో రిజల్ట్స్ కూడా అలాగే వస్తాయి. సో ...ఎదిగే కొద్ది గుర్తు పెట్టుకోవలసిన ముఖ్య సూత్రం ఇదే.