కిటికిలు, తలుపుల మెష్ లో మురికి నిండిపోయిందా? ఇలా క్లీన్ చేస్కోండి..!

 


ఇంటిని స్టైలిష్‌గా,  ప్రత్యేకంగా కనిపించేలా చేయడానికి,  తరచుగా మెష్ చేసిన కిటికీలు ,  తలుపులను ఏర్పాటు చేసుకుంటారు. కానీ వాటిలో చిక్కుకున్న మురికిని తొలగించడం చాలా కష్టం.  మెష్ కారణంగా వెంటిలేషన్ సమస్య ఉండదు. కాబట్టి ఇంట్లో మెష్  కిటికీలు,  తలుపులు ఉండటం చాలా బాగుంటుంది. కాన మెష్ ను క్లీన్  చేయడం గురించే అందరి భయం.  అలా కాకుండా కొన్ని సులభమైన చిట్కాలు పాటించడం ద్వారా మెష్ ను సులువుగా క్లీన్ చేయవచ్చు. అది కూడా ఇంట్లోనే ఉండే పదార్థాలతో మెష్ క్లీన్ చేసే ద్రావణాన్ని తయారు చేసుకోవచ్చు. ఇందుకోసం కావలసిన పదార్థాలు,  తయారీ విధానం తెలుసుకుంటే..

కావలసిన పదార్థాలు..

1 స్ప్రే బాటిల్, కొబ్బరి నూనె
1 కాటన్ వస్త్రం, 1 టూత్ బ్రష్
1 నుండి 2 టీస్పూన్లు టార్టార్ పౌడర్
2 నుండి 3 టీస్పూన్ల లిక్విడ్ సోప్
1/2 కప్పు టీ నీరు

తయారీ విధానం..

ఒక గిన్నెలో టార్టార్ పౌడర్, లిక్విడ్ సోప్,  టీ వాటర్ కలిపి బాగా మిక్స్ చేయాలి. ఇలా చేస్తే మెష్ క్లీన్ చేసే ద్రావణం సిద్దమైనట్టే.. ఇక్కడ గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయం ఏమంటే.. పైన పేర్కొన్న పరిమాణం ప్రకారం  అన్ని వస్తువులను జోడించాలి, అప్పుడు మాత్రమే శుభ్రపరచడం సులభం అవుతుంది. ఇలా ఇంట్లోనే  క్లీనింగ్ లిక్విడ్ తయారు చేసుకోవాలి.  దీన్ని ఒక స్ప్రే బాటిల్ లో పోసుకోవాలి.

మెష్ న ఇలా శుభ్రం చేయాలి..

ఇంట్లో తయారుచేసిన క్లీనింగ్ లిక్విడ్‌ను తలుపు లేదా కిటికీ గ్రిల్‌పై పూర్తిగా స్ప్రే చేయాలి . ఇప్పుడు దీన్ని 10 నిమిషాలు అలాగే వదిలేయాలి. నిర్ణీత సమయం తర్వాత, టూత్ బ్రష్ తీసుకొని గ్రిల్‌ను పూర్తిగా స్క్రబ్ చేయాలి. ఇప్పుడు కాటన్ వస్త్రంతో కొద్దిగా తడిపి గ్రిల్‌ను పూర్తిగా తుడవాలి. చివరగా పొడి వస్త్రంతో తుడవాలి. ఇలా చేస్తే మెష్ ప్రకాశవంతంగా మెరుస్తుంది.

ఇలా కూడా క్లీనర్ తయారు చేసుకోవచ్చు..

ఒక స్ప్రే బాటిల్‌లో సమాన మొత్తంలో నీరు, వైట్  వెనిగర్ కలపాలి. ఉదాహరణకు..  ఒక కప్పు నీరు తీసుకుంటుంటే, ఒక కప్పు వైట్ వెనిగర్ కూడా కలపాలి. వెనిగర్ మురికి, గ్రీజును తగ్గించడంలో ప్రభావవంతంగా ఉంటుంది . ఇప్పుడు ఈ ద్రావణాన్ని మెష్‌పై పూర్తిగా స్ప్రే చేయాలి. మెష్‌లోని ప్రతి భాగం తడిగా ఉండేలా చూసుకోవాలి. దీన్ని కూడా కొంత సమయం పాటు అలాగే ఉంచాలి. తరువాత ఇప్పుడు మెష్‌ను పై నుండి క్రిందికి మైక్రోఫైబర్ క్లాత్ లేదా పాత టవల్‌తో తుడవాలి. ఇది మురికిని తొలగిస్తుంది. మెష్‌లో చాలా మురికి చిక్కుకుంటే పాత టూత్ బ్రష్‌ను ఉపయోగించవచ్చు. సున్నితంగా రుద్దడం ద్వారా మురికి తొలగిపోతుంది. ఇప్పుడు శుభ్రమైన గుడ్డను సాధారణ నీటిలో తడిపి శుభ్రం చేయాలి.  చివరకు పొడి గుడ్డతో శుభ్రం చేయాలి.  ఇలా చేస్తే మెష్ లో మురికి పూర్తీగా పోయి మెరుస్తుంది.

                                      *రూపశ్రీ.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu