డెన్మార్క్ ఓపెన్‌లో సైనా నెహ్వాల్ జోరు
posted on Oct 20, 2012 11:23AM

డెన్మార్క్ ఓపెన్‌లో భారత ఏస్ షట్లర్ సైనా నెహ్వాల్ జోరు కొనసాగుతోంది. శుక్రవారమిక్కడ జరుగుతున్న మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో మూడోసీడ్ సైనా లోకల్ స్టార్ టినెబాన్ 21-10, 21-11తో ఓడించి సెమీస్‌కు చేరింది. తొలిగేమ్ నుంచే ఆధిపత్యం కొనసాగించిన సైనా దూకుడైన ఆటతీరుతో బాన్‌ను బెంబేలెత్తించింది. ఆరంభంలోనే 18-9తో ఆధిక్యంలోకి దూసుకెళ్లిన సైనా అదేఊపులో 21-10తో ఆ గేమ్‌ను కైవసం చేసుకుంది. ఇక రెండో గేమ్‌లోనూ సైనాలో దూకుడు తగ్గలేదు. ఏ దశలోనూ టిన్ బౌన్‌కు పుంజుకునే అవకాశం ఇవ్వకుండా రెండో గేమ్‌ను 18 నిమిషాల్లో ముగించి మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. డెన్మార్క్ ఓపెన్‌లో నాలుగోసారి పాల్గొంటున్న సైనా తొలిసారి సెమీఫైనల్ దశకు చేరింది.