మనుషులను కారుతో తొక్కించేశాడు...

 

అమెరికాలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. డ్రగ్స్ మత్తులో తానేం చేస్తున్నాడో కూడా తెలియని ఓ వ్యక్తి తన కారును మనుషులమీదకు పోనిస్తూ భీభత్సం సృష్టించాడు. వివరాల ప్రకారం...యూఎస్ నేవీ మాజీ ఉద్యోగి రిచర్డ్ రోజస్ మద్యం సేవించి..న్యూయార్క్ సిటీలోని రద్దీ ప్రాంతం టైమ్స్ స్కేర్‌ సమీపంలోని 42 స్ట్రీట్‌లో కారు నడుపుతున్నాడు. సిగ్నల్ వద్ద యూ టర్న్ తీసుకున్నాడు. అంతవరకూ బాగానే ఉన్నా కొన్ని సెకన్లలో అక్కడ భీకర వాతావరణం సృష్టించాడు.కారు ఛేజ్ బ్యాంకు వద్దకు రాగానే రోడ్డుపై వెళ్తున్న దాదాపు 10 మందిపైకి దూసుకెళ్లింది. ఇలా ఒక్కసారి కాదు.. మూడుసార్లు జనాలపైకి కారును నడిపిన నేవీ వెటరన్‌.. పిట్టాల్లా మనుషులను తొక్కించేశాడు. ఈ ఘటనలో ఓ యువతి మృతిచెందగా, 20 మందికి పైగా గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉండగా ఘటన అనంతరం పారిపోవడానికి ప్రయత్నించిన రిచర్డ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu