గొట్టిపాటి ఇంటి వద్ద భారీ భద్రత...
posted on May 20, 2017 1:03PM

టీడీపీ వర్గ పోరు మరోసారి బయయపడింది. ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్సీ కరణం బలరాం వర్గాల మధ్య పాత కక్ష్యలు మరోసారి బయటపడ్డాయి. నిన్న రాత్రి బలరాం వర్గీయులపై, గొట్టిపాటి వర్గీయులు దాడి చేయడంతో ఇద్దరు మృతి చెందిన సంగతి తెలిసిందే. హత్యల నేపథ్యంలో అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కుమార్ ఇంటి వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేటలో ఉన్న ఆయన ఇంటి వద్ద కూడా భద్రతను పెంచారు. ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసులు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం వేమవరం గ్రామంలో 144 సెక్షన్ విధించారు.
ఇదిలా ఉండగా జరిగిన ఘటనపై స్పందించిన గొట్టిపాటి రవికుమార్ బలరాం వ్యాఖ్యలను ఖండించారు. తాను హత్యా రాజకీయాలకు వ్యతిరేకినని.. కరణం బలరాం తనపై కావాలనే ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. అందరినీ కలుపకొని వెళ్లాలనే తాను ప్రయత్నిస్తుంటానని.. వ్యతిగతంగా నష్టపోయినా పర్వాలేదు కానీ.. తాను మాత్రం హత్యా రాజకీయాలకు వ్యతిరేకమని అన్నారు. అంతేకాదు జరిగిన ఘటనను ఏపీ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు.