నిశిత్ మృతికి అతివేగం కారణం కాదట...
posted on May 20, 2017 12:16PM

ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిశిత్ నారాయణ ఇటీవలే మెట్రో పిల్లర్ ను ఢీకొని రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. అయితే నిశిత్ మరణానికి అతి వేగమే కారణని ఇప్పటికే నిర్ధారించారు కూడా. కానీ నిశిత్ మరణానికి అతి వేగం ఒక్కటే కారణం కాదని అంటున్నారు. కారులోని యాంత్రిక లోపమే నిశిత్ మరణానికి మరో కారణమని చెబుతున్నారు. నిశిత్ కారను పరిశీలించిన నిపుణులు ఈ విషయాలు. ప్రమాదం జరిగిన సమయంలో ఎయిర్ బ్యాగులు తెరుచుకోకపోవడంతోపాటు ఇంజిన్ ముందు సీటులోకి చొచ్చుకు వచ్చిందని చెబుతున్నారు. అంతేకాదు ప్రమాద సమయంలో కారు ఇంజిన్ క్యాబిన్‌లోకి చొచ్చుకు రావడం అందరినీ విస్మయపరుస్తోంది. అందులోని టెలిస్కోపీ స్టీరింగ్ రాడ్ సైతం పనిచేయకపోవడంతో అది నితిష్ చాతీకి బలంగా తాకింది. దీంతో స్టెర్నమ్ బోన్ విరిగి, ఊపిరితిత్తులు పగిలి నిషిత్ మరణించినట్టు పోస్టుమార్టంలో తేలింది. నిషిత్ మరణానికి ఇవే కారణమని అంటున్నారు. దీంతో పోలీసులు కారులోని సాంకేతిక అంశాలపై దృష్టి సారించి దర్యాప్తు చేస్తున్నారు. మరి ఇప్పటికే రోజుకో కోణం వెలుగుచూస్తుండగా.. ముందు మందు ఇంకెన్ని విషయాలు వెలుగు చూస్తాయో చూడాలి.