కల్వకుర్తి అసెంబ్లీ ఫలితంపై ఉత్కంఠ

 

 

 

మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గ అసెంబ్లీ స్థానం ఎవరికి దక్కుతుందో అన్న ఉత్కంఠ బిజెపి, కాంగ్రెస్ పార్టీలో నెలకొంది. కల్వకుర్తి 1వ రౌండ్ నుంచి 28వ రౌండ్ వర కు నువ్వా.. నేటా అన్న ట్లు కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచందర్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థి తల్లోజు ఆచారి మధ్య తీవ్రపోటీ ఏర్పడింది. చివరి రౌండ్ లెక్కింపు లో కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డికి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి ఆచారిపై 157 ఓట్ల ఆధిక్యం లభించింది. ఓట్ల లెక్కింపులో జూపల్లి గ్రామ పోలింగ్ కేంద్రానికి సంబంధించిన ఈవీఎం మొరాయింది. దీంతో అధికారులు ఫలితాన్ని నిలిపివేశారు.అది తెరచుకోకపోతే మళ్లీ ఆ బూత్ లో రీపోలింగ్ పెట్టవలసి వస్తుందా అన్నది సమస్య. అయితే ఇప్పటికే మెజార్టీ తెలిసిపోయినందున దానిని కాపాడుకోవడానికి కాంగ్రెస్,అదిగమించడానికి బిజెపి ప్రయత్నిస్తాయి. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు తదుపరి నిర్ణయం తీసుకోనున్నట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. మరి ఈ సమస్యను ఎన్నికల సంఘం ఎలా పరిష్కారిస్తుందో వేచి చూడాలి.