ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ సంచలన నిర్ణయం..ఇక వారికి నో ఎంట్రీ

 

జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్వంలో జరిగిన భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇకపై పాక్ పౌరులను భారత్ లోకి అడుగుపెట్టనివ్వబోమని ప్రకటించింది. ఇప్పటికే ఇక్కడ ఉన్న పాక్ పౌరులు, పర్యటకులు తక్షణమే తమ దేశానికి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. భారత్ జారీ చేసిన ప్రత్యేక వీసాలను రద్దు చేసింది. 

పాక్ తో దౌత్య సంబంధాలను పూర్తిగా తెంచుకుంటున్నట్టు ప్రకటించింది. వెంటనే పాక్ హైకమీషనర్ దేశాన్ని వీడాలని సూచించింది. అటారి చెక్ పోస్టును వెంటనే మూసి వేస్తున్నట్టు తెలిపింది. ఇండస్ వాటర్ ఒప్పందాన్ని కూడా నిలిపివేస్తున్నట్టు పేర్కొంది. ఈ మేరకు కేబినెట్‌ భద్రతా కమిటీ భేటీలో చర్చించిన అంశాల్ని భారత విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ మీడియాకు వెల్లడించారు.  సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేయాలని నిర్ణయించిందన్నారు. ప్రత్యేక వీసాలను నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu