అంబటి అర్జున్ ఫేక్.. రైతుబిడ్డ గురించి అలా మాట్లాడటం కరెక్టేనా?

బిగ్ బాస్ సీజన్-7 లో కొత్త కంటెస్టెంట్స్ రాకతో వేరే లెవెల్ కి వెళ్ళిందనే చెప్పాలి. ఇక 2.0 లో వచ్చిన కంటెస్టెంట్స్ లలో అంబటి అర్జున్ బంఢారం బయటపడింది. నిన్న రాత్రి జరిగిన లైవ్ డిస్కషన్ లో అర్జున్ తన ముసుగు తీసేసి మాట్లాడటం మొదలెట్టాడు. హౌజ్ లో సోమవారం నామినేషన్ల తర్వాత నుండి కొత్త కంటెస్టెంట్స్ (పోటు గాళ్ళు), పాత కంటెస్టెంట్స్ (ఆటగాళ్ళు) మధ్య టాస్క్ లు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే నిన్న జరిగిన టాస్క్ లలో ఆటగాళ్ళ టీమ్ వరుసగా రెండింట్లో గెలిచి సత్తాచాటింది. ఇక ఆటగాళ్ళ టీమ్ లో ఉన్న అమర్ దీప్, శివాజీ , ఆట సందీప్, శోభా శెట్టి, పల్లవి ప్రశాంత్, యావర్, ప్రియాంక జైన్, టేస్టీ తేజ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఆట మధ్యలో సందీప్ మాస్టర్ చీట్ చేశాడని పూజామూర్తి అంది. అది చూడకుండా ఎలా అంటావని శోభా శెట్టి అంటుంది. ఇక వదిలేయ్ అని అంబటి అర్జున్ అన్నాడు. ఆ తర్వాత అందరు పడుకున్నాక అంబటి అర్జున్, పూజా మూర్తి ఇద్దరు హౌజ్ లోని కంటెస్టెంట్స్ గురించి మాట్లాడుకోవడం మొదలెట్టారు. అంబటి అర్జున్ హౌజ్ లోకి వచ్చే ముందు శివాజీ, పల్లవి ప్రశాంత్ దమ్మున్న ఆటగాళ్లు అని చెప్పాడు. ఇక నిన్న జరిగిన లైవ్ ఎపిసోడ్ లో మాత్రం.. ఆ పల్లవి ప్రశాంత్ గాడికి అసలు ఆటే రాదు, ఒకసారి మేమిద్దరం తలపడితే వాడికి నేనేందో తెలుస్తుందని, శివాజీ సపోర్ట్ లేకపోతే ఆడలేడని, ఫౌల్ గేమ్ ఆడుతున్నాడని పూజామూర్తితో అంబటి అర్జున్ అన్నాడు.‌ అయితే పల్లవి ప్రశాంత్ ని అంబటి అర్జున్ ని తక్కువ చేసి మాట్లాడాడంటూ నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. ఇన్ని రోజులు హౌజ్ లో ఎక్కువ గొడవలకు పోకుండా, టాస్క్ లలో అదరగొడుతూ ఒక కెప్టెన్ లా పోటుగాళ్ళ టీమ్ ని నడిపిస్తున్న అంబటి అర్జున్.. ఇప్పుడు స్ట్రాంగ్  ప్లేయర్ కాదని అందరి ఆట చూసి వచ్చి ఫేక్ గా ఉంటున్నాడని, అతని మాస్క్ నాలుగు రోజుల్లోనే తోసేశాడంటూ బిగ్ బాస్ రివ్యూలు ఇచ్చే యూట్యూబర్స్ అందరు చెప్పుకొస్తున్నారు. మరి అంబటి అర్జున్ ఫేక్ అని హౌజ్ లో వాళ్ళు కనిపెట్టగలరా? అసలు పల్లవి ప్రశాంత్ ని తక్కువ చూస్తున్న అంబటి అర్జున్ మాటతీరు సరైనదేనా ఇలాంటి ఆసక్తిర విషయాలతో బిగ్ బాస్ ముందు రోజుల్లో మరింత ఉత్కంఠభరితంగా మారనున్నట్లు తెలుస్తుంది.  

నయని పావని సింగిల్ అంట.. యావర్ కి ఈ హింట్ చాలంట!

బిగ్ బాస్ హౌజ్ లో కొత్త లవ్ ట్రాక్ మొదలైంది. మొదట్లో యావర్, ప్రశాంత్ లతో  రతిక బేబీ సినిమాని రిక్రియేట్ చేసింది. ఆ తర్వాత శుభశ్రీ, గౌతమ్ ల మధ్య లవ్ ట్రాక్ మొదలైన కొన్ని రోజులకే ప్రేక్షకులు శుభశ్రీని బయటకు పంపించేశారు. ఇక హౌజ్ లో గ్లామర్ రోల్ ని పంచుకునే బాధ్యత ప్రియాంక, శోభా శెట్టి మీద పడిన వాళ్ళు ఇప్పటికే రిలేషన్ లో ఉండటంతో పెద్దగా వర్కవుట్ కాలేదు. ఇక హౌజ్ లో లవ్ ట్రాక్ కోసం ఏకంగా అయిదుగురు కొత్త కంటెస్టెంట్స్ తీసుకొచ్చాడు. అయితే ఇందులో అంబటి అర్జున్ టాస్క్ ల మీద ఫోకస్ గా ఆడుతూ అమ్మాయిల జోలికి పోవట్లేదు. భోలే శావలి అందరికి బిస్కట్ లు వేస్తు కలిసి పోవాలనుకుంటున్నాడు. ఇక పూజా మూర్తి లావుగా ఉండటం వల్ల ఎవరు తనతో మాట్లాడటానికి సరిగ్గా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఇక మిగిలింది అశ్విని శ్రీ, నయని పావని. వీళ్ళిద్దరు ఇప్పుడు గ్లామర్ డాల్స్ గా మారారు. అశ్విని శ్రీ తన గ్లామర్ ని చూపిస్తూ ట్యాలెంట్ చూపిస్తుండగా, నయని పావని తన సోషల్ మీడియాలో ఎలా ఉందో అదే పద్దతిని హౌజ్ లో ఫాలో అవుతుంది. దీంతో తనతో ఎవరైన పులిహోర కలపాలని అనుకుంటున్నారు. ఆ పులిహోర బ్యాచ్ లో యావర్ మొదటి స్థానంలో ఉన్నాడు. నిన్నటి ఎపిసోడ్‌లో యావర్-నయని పావని మధ్య  జరిగిన మాటలన్నీ పులిహోరని మించి సాగాయి. నయని నువ్వు సింగిలేనా అని యావర్ అడుగగా.. ఎందుకని నయని అంది. ప్లీజ్ చెప్పొచ్చు కదా అని యావర్ అనడంతో.. ఎస్ నేను సింగిల్ అని నయని అంది. దీంతో యావర్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మొన్నటి ఎపిసోడ్ లో శివాజీతో.. మా ఇద్దరి జోడి ఎలా ఉందని యావర్ అడుగగా.. బాలేదని శివాజీ అనడంతో డల్ అయిపోయాడు మనోడు. ఇక మనోడు మెల్లమెల్లగా నయని పావనితో ఎక్కువ సమయం కలిసి ఉండటం, తను ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్లి తనతో పాటే ఉంటూ ఖాళీ దొరికినప్పుడల్లా బిస్కెట్లు వేస్తున్నాడు. యావర్-నయనిల మధ్య కొత్తగా మొదలైన ఈ లవ్ ట్రాక్ ఎలా ఉంటుందో చూడాలి మరి.  

కెప్టెన్ గా పల్లవి ప్రశాంత్ ఈజ్ బ్యాక్.. గురుశిష్యుల ఆనందతాండవం!

కెప్టెన్ ఈజ్ బ్యాక్.. రైతే రాజు పల్లవి ప్రశాంత్ రోజు రోజుకి ఫ్యాన్ బేస్ పెరుగుతుంది. బిగ్ బాస్ హౌజ్ లో ఇప్పటికే అయిదు వారాలు పూర్తి చేసుకొని ఆరవ వారం కొనసాగుతుంది. ఇందులో కెప్టెన్సీ పోటీ కోసం బిగ్ బాస్ రకరకాల టాస్క్ లు ఇస్తున్నాడు బిగ్ బాస్. పల్లవి ప్రశాంత్ కష్టపడి కెప్టెన్సీ పగ్గాలు చేపట్టాడు. అయితే మొన్న జరిగిన ఎపిసోడ్ లో బిగ్ బాస్ అందరి ముందు పల్లవి ప్రశాంత్ కెప్టెన్సీ బ్యాడ్జ్ ని తీసేసుకున్నాడు. హౌజ్ లోని వారిని అసలు కెప్టెన్ భాద్యతలు ఏంటివి అని వారి అభిప్రాయం తెలుసుకొని పల్లవి ప్రశాంత్ కెప్టెన్సీ బ్యాడ్జ్ ని తీసుకున్న బిగ్ బాస్.. నిన్నటి ఎపిసోడ్ లో కన్ఫెషన్ రూమ్ కి పిలిచి.. కెప్టెన్ గా నీ భాద్యతలు తెలుసుకోవాలని, ఇది నీకొక హెచ్చరిక అని బిగ్ బాస్ చెప్పగా.. పల్లవి ప్రశాంత్ తన వివరణ ఇచ్చాడు. కొందరు ఏం చెప్పినా చేయట్లేదని, వీడు చెప్తే వినేదేంది అన్నట్టుగా చూస్తున్నారని తను ఎదుర్కొంటున్న వాటిని బిగ్ బాస్ తో పల్లవి ప్రశాంత్ చెప్పగా.. కెప్టెన్ అంటే ఇంటి సభ్యులతో పనులు చేపిస్తు, కమాండింగ్ తో పాటు ఫెయిర్ డెషిషన్స్ తీసుకోవాలని పల్లవి ప్రశాంత్ తో బిగ్ బాస్ అన్నాడు. ఇకనుండి కెప్టెన్ గా సరిగ్గా బాధ్యతలని నిర్వర్తించాలని బిగ్ బాస్ చెప్తూ బ్యాడ్జ్  ని ప్రశాంత్ కి ఇవ్వగా.. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ మాదిరి బ్యాడ్జ్ తో బయటకొచ్చాడు పల్లవి ప్రశాంత్. ఇక బయటకు రాగానే గురువు శివాజీని హత్తుకున్నాడు. ఆ తర్వాత శివాజీ చేతిని ముద్దాడుతుంటాడు ప్రశాంత్. ఇక శిష్యుడితో గురువు.. నువ్వేంటో చూపించు అని అంటాడు.  దాంతో ఇక నుండి నేనేంటో చూపిస్తానని పల్లవి ప్రశాంత్ అన్నాడు. ఇలా పల్లవి ప్రశాంత్, శివాజీల మధ్య స్వచ్ఛమైన స్నేహం ఉందని మరోసారి ఋజువైంది.  

అలా దొరికేసింది కావ్య.. వాళ్ళిద్దరికి డౌట్ మొదలైన వేళ!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -225 లో... సీతారామయ్య, ఇందిరాదేవీలు కావ్యని ఇంటికి రమ్మని పిలుస్తారు. అప్పుడే రాజ్ వచ్చి ఇంత టెన్షన్ ఎందుకు పెట్టావని కావ్యపై కోప్పడతాడు. కావ్య ఇక్కడ ఉన్నట్లు మీకెలా తెలుసని సీతారామయ్యాని రాజ్ అడుగుతాడు. పూజారి గారు ఫోన్ చేసి చెప్పాడని సీతారామయ్య అంటాడు. మేం ఇక్కడ ఉన్నామని నీకెలా తెలుసని రాజ్ ని సీతరామయ్య అడుగగా.. కావ్య గురించి వెతుకుతుంటే బయట మీ కార్ కన్పించిందని రాజ్ అంటాడు.  ఆ తర్వాత రాజ్ కావ్య చెయ్యి పట్టుకొని తీసుకొని వెళ్తాడు. అది ప్రేమ అంటావా? అది కూడా నటననేనా అని సీతరామయ్యని ఇందిరాదేవి అడుగుతుంది. అది ప్రేమ వాడికి కావ్య అంటే ప్రేమ ఉందని సీతారామయ్య అంటాడు. మరొక వైపు మా కూతురు ఎక్కడ అంటు.. దుగ్గిరాల ఫ్యామిలీని కనకం నిలదిస్తునే ఉంటుంది. కనకం మాటలకు ఇంట్లో వాళ్ళు అవమానంగా ఫీల్ అవుతారు. అప్పుడే కావ్యను రాజ్ తీసుకొని వస్తాడు. కనకం దుగ్గిరాల ఫ్యామిలిని కించపరిచేలా మాట్లాడ్డం విన్న కావ్య కోపంగా ఆగు అమ్మా అని అరుస్తుంది. ఆ తర్వాత కనకం వచ్చి కావ్యని హాగ్ చేసుకొని.. ఎక్కడికి వెళ్ళావని అడుగుతుంది. నేను వచ్చేకంటే ముందు ఏం మాట్లాడుతున్నావ్? ఈ ఇంట్లో వాళ్ల గురించి నీకు తెలియదని కావ్య అనగానే.. అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళావ్? మీ వాళ్ళు మమ్మల్ని దోషులుగా చూస్తుంటే మా పరువు పోయిందని అపర్ణ గట్టిగా మాట్లాడుతుంది. ఆ తర్వాత మా కుటుంబాన్ని తిట్టే హక్కు మీకు ఎవరు ఇచ్చారని కావ్య తన పుట్టింటి వారిని అడుగుతుంది. అసలు ఎక్కడకి వెళ్ళావని అపర్ణ అడుగుతుంది. నేను చెప్తానంటూ సీతారామయ్య మధ్యలో కలుగుజేసుకొని.. తన కాపురం కుదుటపడితే ఒక రాత్రి గుడిలో నిద్ర చేస్తానని మొక్కుకుందంట అని సీతారామయ్య చెప్తాడు. ఆ విషయం చెప్పి వెళ్ళాలి కదా అని అపర్ణ అడుగగా.. పడుకున్న వాళ్ళని లేపి మరి చెప్పడం, ఎందుకని అనుకుని ఉంటుందని ఇందిరాదేవి అంటుంది. కాసేపటికి నేను ఇలా ఎవరికీ చెప్పకుండా వెళ్లినందుకు క్షమించండని కావ్య అందరికి చెప్తుంది. ఆ తర్వాత కనకం, కృష్ణమూర్తి ఇద్దరు మమల్ని క్షమించండి అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతారు. అదంతా విన్న రుద్రాణి, రాహుల్ కి ఇదంతా అబద్ధమని అన్పిస్తుందని అనుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

ఒట్టేసి చెప్తున్నా.. మళ్ళీ రిషీధారల కథ మొదలైనట్టేనా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -892 లో.. రిషి ఒంటరిగా కూర్చొని జగతి గురించి బాధపడుతుంటాడు. అప్పుడే చక్రపాణి రిషి దగ్గరికి వస్తాడు. జగతి మేడమ్ చాలా గొప్పవారు. మీరంటే తనకి బాగా ఇష్టం. మీతో ఉండాలి. తన ప్రేమని మీకు పంచాలని తాపత్రయపడింది. మీరు మీ అమ్మ  ప్రేమని తెలుసుకొని దగ్గర అయి.. మీ అమ్మ మాట కోసం నా కూతురిని పెళ్లి చేసుకున్నారని రిషితో చక్రపాణి అంటాడు. ఆ తర్వాత అదంతా చూస్తున్న దేవయాని వాళ్ళ దగ్గరకు వచ్చి.. మీకు ప్రేమ ఉన్నట్లు బాధ ఉన్నట్లు నటించకండని దేవయాని చక్రపాణితో దేవయాని అంటుంది. అలా అంటున్నారెందుకని చక్రపాణి అంటాడు. ఇంత వరకు మీ భార్య సుమిత్ర ఇక్కడికి రాలేదు. దాన్ని బట్టి ఏం అనుకోవాలి. మేం అంటే లెక్క లేదా? అసలు మీ భార్య ఎందుకు రావడం లేదు? పెళ్లికి కూడా రాలేదు. ఎందుకు రాలేదు అంటే ఏవేవో కారణాలు చెప్పారు. మీది అంత నటన అని దేవయాని అనగానే‌.. మీరు అలా అనకండి అని చక్రపాణి బాధతో అంటాడు. మరి ఎందుకు రావడం లేదని దేవయాని అడుగుతుంది. ఎందుకు అంటే తను లేదు. జగతి మేడం కంటే ముందే చనిపోయిందని చక్రపాణి చెప్తాడు. ఆ మాటలు విన్న రిషి షాక్ అవుతాడు. అవునా అసలు అలా ఎలా జరిగింది? నాకు ఎందుకు చెప్పలేదని రిషి అంటాడు. ఇప్పటికే బాధలో ఉన్న రిషి సర్ కి ఈ విషయం చెప్పి ఇంకా బాధపెట్టడం కరెక్ట్ కాదని నా కూతురు చెప్పనివ్వలేదు. నా పై సానుభూతి వద్దు ప్రేమ కావాలని మీరు ఇంటికి వచ్చినప్పుడు నా భార్య ఫోటో మీకు కన్పించకుండా ఉంచిందని రిషితో చక్రపాణి చెప్తాడు. ఆ తర్వాత రిషి గదిలో ఉండగా వసుధార వచ్చి దేని గురించి ఆలోచిస్తున్నారు. మీరు మళ్ళీ కాలేజీకీ రావాలి. మీరు వస్తేనే మిషన్ ఎడ్యుకేషన్ బాగుంటుందని వసుధార అంటుంది. నాకు మా అమ్మ గుర్తుకు వస్తుందని రిషి అనగానే.. ఎప్పుడు అదే అలోచిస్తూ ఉండకండని వసుధార అంటుంది. అలా అనగానే తల్లి నీ పోగొట్టుకొని పైకి నవ్వుతు ధైర్యంగా ఉండడానికి నేను వసుధారని కాదని రిషి అనగానే వసుధార షాక్ అవుతుంది. నాకు అంత తెలిసింది. అసలేం జరిగిందని వసుధారని రిషి అడుగుతాడు. రిషికి వసుధార జరిగిందంతా చెప్తుంది. నువ్వు గ్రేట్ వసుధార. ఎప్పుడు నా గురించి ఆలోచిస్తు నన్ను కాపాడుకుంటూ వస్తున్నావ్. మనం ఎప్పుడు కలిసే ఉండాలి. మనమెప్పుడు రిషిధారలమే అని వసుధార చేతిలో చెయ్యి వేసి రిషి మాటిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

ముకుందని ఇంటికి వెళ్ళిపోమన్న భవాని.. వద్దన్న కృష్ణ!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -286 లో.. ఏసీపీ సర్ ఇంట్లో లేని టైమ్ లో భవాని అత్తయ్యకి ఆదర్శ్ రాడన్న విషయం చెప్పావ్ అంటే నాకు ఏదో డౌట్ గా ఉందని ముకుందతో కృష్ణ అంటుంది. ఇందులో డౌట్ ఏం ఉందని ముకుంద అనగానే.. తేలుస్తా అన్ని విషయలు తేలుస్తా అని కృష్ణ చెప్తుంది. నాది మురారిది ఒకటే మాట అని ముకుంద కాన్ఫిడెంట్ గా కృష్ణకి చెప్తుంది. కానీ ముకుంద అబద్ధం చెప్పిందని కృష్ణకి స్పష్టంగా  అర్థం అవుతుంది.  మరొక వైపు భవానికి రేవతి భోజనం తీసుకొని వెళ్తుంటే కృష్ణ ఆపి.. నేను తీసుకొని వెళ్తానని భోజనం భవాని దగ్గరకి తీసుకొని వెళ్తుంది. కృష్ణ భవాని గదిలోకి వెళ్లేసరికి భవాని చీకటిలో కూర్చొని బాధపడుతుంటుంది. అత్తయ్య మీరు బాధపడకండి. ఆదర్శ్ ఖచ్చితంగా వస్తాడని భవానికి కృష్ణ ధైర్యం చెప్తుంది. రాడని అంత ఖచ్చితంగా చెప్తుంటే.. ఎలా వస్తాడని భవాని అడుగుతుంది. ఆ తర్వాత అంతా ఆలోచించిన భవాని.. ముకుంద నువ్వు మీ పుట్టింటికి వెళ్ళు అని అంటుంది. అలా అనగానే.. ఏంటి కథ అడ్డం తిరిగిందని ముకుంద షాక్ అవుతుంది. వద్దు అత్తయ్య.. నాకు ఒక వారం టైమ్ ఇవ్వండి ఆదర్శ్ ని తీసుకొని వస్తానని భవానికి కృష్ణ చెప్తుంది. అది విన్న తర్వాత కృష్ణ చెప్పిన దానికి భవాని ఒప్పుకుంటుంది. ఆ తర్వాత కృష్ణ ఆలోచిస్తుంటే రేవతి తన దగ్గరకి వచ్చి.. ఎందుకు ముకుందని వాళ్ళింటికి వద్దన్నావని అడుగుతుంది. ముకుంద ఎక్కడికి వెళ్ళదు. ఈ ఇంటిని వదిలిపెట్టి ఎక్కడకి వెళ్ళదు. ఎందుకంటే దానికి కారణం ఏసీపీ సర్ అని అనగానే.. కృష్ణకి నిజం తెలిసిపోయిందా అని రేవతి షాక్ అవుతుంది. ఏసీపీ సర్ మీద ఉన్న ప్రేమ వల్ల తను ఎక్కడికి వెళ్ళదు. నాకు అంతా తెలుసు అత్తయ్య. కానీ ఏసీపీ సర్ మనసులో ముకుంద లేదు అన్న విషయం కూడా తెలుసు. ఎలాగైనా ఆదర్శ్ ని వెతికి తీసుకొని వస్తాను. అందుకే చెప్పానని కృష్ణ అనగానే.. రేవతి హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరి ముకుంద ప్రేమిస్తుంది కదా అని ఇంటి నుండి ఏడుస్తూ నీ కోడలు వెళ్ళిపోతుందని అనుకున్నావా అని కృష్ణ అనగానే.. నువ్వు నా బంగారం అని కృష్ణని పొగుడుతుంది రేవతి.  మరొకవైపు ఏంటి కృష్ణ ఇలా చేసిందని మధు అనుకుంటాడు. అప్పుడే కృష్ణ వస్తుంది. ఏంటి కృష్ణ.. ముకుందని బయటకి పంపిస్తావని అనుకుంటే ఎందుకు వద్దన్నావని అడుగుతాడు. ముకుంద చెప్పింది అబద్ధం.. ఆదర్శ్ ని వెతికి తీసుకొని  రావాలని కృష్ణ  అనగానే.. నీకు సపోర్ట్ గా నేను ఉంటానని కృష్ణకి మధు చెప్తాడు. కాసేపటికి ఆ విషయం వెళ్లి అలేఖ్య చెప్తాడు. మరొక వైపు కృష్ణ అన్న మాటలు భవాని గుర్తుకుచేసుకొని.. కృష్ణ మీద నమ్మకం ఉంది ఎలాగైనా ఆదర్శ్ ను తీసుకొని వస్తుందని భవాని అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

శోభా శెట్టి ఎలిమినేషన్.. డేంజర్ జోన్ లో ప్రియాంక జైన్, అమర్ దీప్!

అనుకున్నదే అయింది.. ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చినట్టుగా తెలుస్తుంది. ‌నామినేషన్లో మొత్తం ఏడుగురు ఉండగా.. అతి ఎక్కువ మెజారిటీ ఓటింగ్ తో యావర్ మొదటి స్థానంలో ఉండగా.. కొత్తగా వచ్చిన హౌజ్ మేట్స్  నయని పావని, పూజా మూర్తి,  అశ్విని‌ శ్రీ తర్వాతి స్థానాలలో ‌ఉండగా చివరి మూడు స్థానాలలో అమర్ దీప్, ప్రియాంక జైన్ ఉండగా.. చిట్ట చివరి స్థానంలో శోభా‌శెట్టి ఉంది. దీంతో ఈ వారం శోభా శెట్టి ఎలిమినేషన్ గ్యారెంటీ అనిపిస్తుంది. అయుతే చివరి రోజు వరకు ఎంత ఓటింగ్ జరిగిన అమర్ దీప్, ప్రియంక జైన్, శోభా శెట్టి లలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారని ప్రేక్షకులు భావిస్తున్నారు. సీరియల్ బ్యాచ్ లో ఎవరూ తక్కువ కాదనట్టుగా చేస్తుంటారు. ఆట సందీప్ తన స్ట్రాటజీతో అమర్ దీప్ ని లెటర్ చదవకుండా డ్రాప్ అయ్యేలా చేశాడు. శోభా శెట్టి ప్రతీ ఆటలో ఫౌల్ గేమ్ ఆడుతు, ఎవరైనా ఎదురుతిరిగితే వారితో వితండవాదం చేయడం, ఏమైనా అంటే ఆడవాళ్ళతో‌ ఇలాగేనా మాట్లాడటమని సింపతీ గేమ్ ప్లే చేస్తుంది. ఇక ప్రియాంక కంటెంట్ కోసం కావలనే కిచెన్ లో లీడర్ గా, వంటలక్కలా అవ్వాలని ట్రై చేస్తుంది. ఇక అమర్ దీప్ ది అమాయకత్వవమో లేక అతని తెలివితేటలే ఇంతనా అనిపిస్తుంది. ఇక గ్యాప్ దొరికితే నలుగురు కలిసి.. నువ్వు వాడిని టార్గెట్ చేయు, నేను ఆమెని టార్గెట్ చేస్తా అంటూ డిస్కషన్ పెట్టుకుంటున్నారు. ఇప్పటిదాకా జరిగిన టాస్క్, గేమ్స్ లలో ప్రియంక జైన్, శోభా శెట్టి, అమర్ దీప్ అంతగా పర్ఫామెన్స్ ఇవ్వలేదు.  కొత్త కంటెస్టెంట్స్ కి ఓట్ల శాతం ఎక్కవ వస్తుంది‌. ఇక  అంబటి అర్జున్ ఫెయిర్ ప్లే ఆడుతూ శివాజీ దగ్గర మెలుకువలు నేర్చుకుంటున్నాడు. ఇక ఇప్పుడిప్పుడే పల్లవి ప్రశాంత్ ని అర్థం చేసుకుంటున్న అమర్ దీప్.. శివాజీ గూటిక చేరినట్టువా అనిపిస్తుంది ‌ అయితే అమర్ దీప్ ప్రతీ టాస్క్ లో ఆడాలనుకొని ఆటగాళ్ళని ఓడిస్తూనే ఉన్నాడుమ ఇదే కంటిన్యూ అవుతే హౌజ్ లో ఈ సీరియల్ బ్యాచ్ కి మరింత కష్టంగా ఉంటుంది. ఇక నామినేషన్లో ఉన్న ఈ ముగ్గురికి ఇంతక‌ముందు పడే ఓటింగ్ కూడా పడకపోవడంతో శోభా శెట్టి ఎలిమినేషన్ గ్యారెంటీలా తెలుస్తుంది. మరి మోనిత ఈ వారం హౌజ్  నుండి ఎలిమినేట్ అవ్వనుందా లేక ప్రియాంక జైన్ అవ్వనుందా అనేది తెలియాల్సి ఉంది. ఇంక ఓటింగ్ కి ఒక్కరోజే మిగిలి ఉండడంతో ప్రస్తుతం కొనసాగుతున్న ఓటింగ్ ప్రకారం అయితే శోభా శెట్టి, ప్రియాంక జైన్ లలో ఎవరో ఒకరు బయటకు వెళ్ళడం గ్యారెంటీ అనిపిస్తుంది. అమర్ దీప్ ఈ రెండు రోజుల్లో సరిగ్గా ఆడకపోతే తనకి కూడా కష్టమే.

బిగ్ బాస్ సీజన్-7 ఎపిసోడ్-38 రివ్యూ!

బిగ్ బాస్ సీజన్-7 అట్టహాసంగా ప్రారంభమైంది. ఇక హౌజ్ లోకి మొత్తం పద్నాలుగు మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇవ్వగా.. అందులో అయిదుగురు ఎలిమినేట్ అయ్యారు. గతవారం 2.0 గా మరో అయిదుగురు కొత్త కంటెస్టెంట్స్ లోపలికి వచ్చారు. కొత్త కంటెస్టెంట్స్ లోని అంబటి అర్జున్ పాతవాళ్ళని డామినేట్ చేస్తున్నాడు.  ఎందుకంటే అతనికి కండబలంతో పాటు బుద్ది బలం కూడా ఉందని నిన్న జరిగిన రాకెట్  టాస్క్ లో తెలిసి పోయింది. ఇంత అందమైన అమ్మాయిని, ఇంత పనిచేసే అమ్మాయిని, నీ చిరునవ్వుని చూస్తే చాలు, పొద్దున్నే పాల ప్యాకెట్ అవసరం లేదు నీ పాలబుగ్గలు ఉంటే చాలు‌. బయటకెళ్ళాక నేను హీరోగా నువ్వు హీరోయిన్ గా చేస్తే బాగుండు అనేంత అంత బాగున్నావని భోలే శావలి అనగా.. వద్దు వద్దురా బాబు అని అశ్విని శ్రీ అంది. టోటల్ గా మస్తు ఉంటావ్ రా అని అశ్విని శ్రీని అంటూ భోలే శావలి తన పులిహోర ఆపేశాడు. ముప్పై ఎనిమినదవ రోజు అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు పాటతో మొదలైంది‌. ఇక వాష్ రూమ్ దగ్గర అమర్ దీప్, ప్రియాంక జైన్ ఇద్దరు కాసేపు మాట్లాడుకున్నారు. ఈ రోజు ఎలాగైనా ఆడతా, నేనేంటో ప్రూవ్ చేసుకుంటా అని అమర్ దీప్ అన్నాడు. నీకు అవకాశం వచ్చినప్పుడు నువ్వు వెళ్ళు, నీ మీద నీకు అంత కాన్ఫిడెంట్ లేనప్పుడు ఎందుకు వెళ్ళావని ప్రియాంక జైన్ అంది. ఇక ఆ తర్వాత ఏదో ఒకటి ఆడాలని దూకావు, కానీ పెద్ద మైనస్ అయిందని టేస్టీ తేజ అనగా.. సరే అది పోనీయ్ రా, ఇప్పుడు మైనస్ ల గురించి మాట్లాడుకుంటే ఏం రాదని అమర్ దీప్ కవర్ చేసుకున్నాడు.  అందరూ నిన్ను వద్దని ప్రశాంత్ ని పంపించాలని అనుకున్నారంటే.. వాడు ఆల్రెడీ గేమ్స్ ఆడాడు. వాడి ఆట చూసారు‌. ఇప్పుడు మా ఆట కదా జనాలు చూడాల్సిందని అమర్ దీప్ అన్నాడు. ఆ తర్వాత గౌతమ్ కృష్ణతో భోలే శావలి బాస్కెట్ల మీద బిస్కెట్లు వేశాడు. దాన్ని నిజమే అని నమ్మిన గౌతమ్.. భోలే శావలికి థాంక్స్ చెప్తూ హగ్ చేసుకున్నాడు. ఆ తర్వాత గౌతమ కృష్ణకి స్పెషల్ పవర్ ఇచ్చాడు. ఇంట్లోని ఆహారాన్మియ, రేషన్ ని వేస్ట్ చేయకుండా ఉండేలా చూసుకోవాలని గౌతమ్ కృష్ణకి బిగ్ బాస్ చెప్పగా.. ప్రియాంక, ఆట సందీప్ ని డిప్యూటీగా తీసుకున్నాడు. ఆ తర్వాత క్లీనింగ్ కి యావర్, శోభా శెట్టి, పల్లవి ప్రశాంత్, అమర్ దీప్ లకి స్క్రబ్బర్ ఇచ్చాడు గౌతమ్ కృష్ణ.   ఇక మోనిత తన నిజస్వరూపం బయటపెట్టింది. నాకు డిప్యూటీ ఇవ్వకుండా క్లీనింగ్ ఇచ్చావ్ కదా అని మనసులో పెట్టుకొని ప్రియాంక, గౌతమ్ కృష్ణలతో రూడ్ గా ప్రవర్తించింది. కిచెన్ లో చాలా సేపు గొడవ జరిగింది. ఇక ఆ తర్వాత టాస్క్ లు కొనసాగాయి. మొదటి టాస్క్ లో ఆటగాళ్ళ టీమ్ గెలవగా, రెండవ టాస్క్ లో పోటుగాళ్ళ టీమ్ గెలిచింది. ఇక ఇప్పటిదాకా జరిగిన టాస్క్ లలో.. 3-1 తో పోటుగాళ్ళు లీడింగ్ లో ఉన్నారు. మరి కొత్తగా వచ్చిన హౌజ్ మేట్స్ నుండి కెప్టెన్ అవుతాడా లేక పాత హౌజ్ మేట్స్ నుండి కెప్టెన్ అవుతాడా తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే‌.

హౌజ్ లో శివాజీ టాప్ అయితే ఓటింగ్ లో యావర్!

బిగ్ బాస్ సీజన్-7 లో రోజు రోజుకి ఆటతీరుతో, మాటతీరుతో కంటెస్టెంట్స్ ఇరగదీస్తున్నారు. కెప్టెన్సీ రేస్ ఆసక్తికరంగా సాగుతుంది. కొత్త హౌజ్ మేట్స్ రావడంతో ఇప్పటిదాకా రెండు గ్రూప్ లుగా ఉన్నవాళ్ళంతా కలసిపోయినట్టు అనిపిస్తుంది. అయితే సీరియల్ బ్యాచ్ మాత్రం సపరేట్ గా వెళ్ళి మాట్లాడుకుంటున్నారు. నిన్నటి ఎపిసోడ్ లో అమర్ దీప్ బాగా "లో" గా ఫీల్ అవుతున్నట్టు తనకి అనిపిస్తుందని అందరితో చెప్పుకుంటూ సానుభూతి పొందాలని చూస్తున్నాడు. అయితే నక్క ఎంత దీన స్థితిలో ఉన్నా సానుభూతి చూపించొద్దని తర్వాత నిమిషమే అమర్ దీప్ ప్రూవ్ చేస్తున్నాడు. నిన్న జరిగిన టాస్క్ లో బిగ్ బాస్ చెప్పిన కలర్ గల వస్తువులని తీసుకురమ్మని చెప్పినప్పుడు.. అశ్విని శ్రీ దగ్గర వస్తువులని లాగేసుకొని ఫౌల్ గేమ్ ఆడాడు. ఆ తర్వాత ఆట‌ సందీప్, అమర్ దీప్, ప్రియాంక జైన్, శోభా శెట్టి కలిసి గుసగుసలు పెట్టుకున్నారు. ఇక పల్లవి ప్రశాంత్ కెప్టెన్సీ బ్యాడ్జ్ లాగేసుకున్నాక శివాజీ ఎమోషనల్ అయ్యాడు. శివాజీ ప్రతీ గేమ్ ని ఇంటలిజెన్స్ తో పాటు ఫెయిర్ గేమ్ ఆడాలని చెప్తూ వస్తున్న ఈ ఆట సందీప్, అమర్ దీప్ ఫౌల్ గేమ్స్ ‌ఆడుతున్నారు. లేదంటే ఆటగాళ్ళ టీమ్ ఇప్పుడు నెంబర్ వన్ ఉండేది. కానీ శివాజీ ఫెయిర్ గేమ్ వల్లనే ఆటగాళ్ళ టీమ్ ఇంకా కెప్టెన్సీ రేస్ లో నిలిచింది. ఇక నామినేషన్లో యావర్ టాప్ లో ఉన్నాడు. కొత్తగా వచ్చిన ‌హౌజ్ మేట్స్ లో పూజా మూర్తి, అశ్విని శ్రీ చివరి స్థానాలలో ఉండగా.. శోభా శెట్టి, ప్రియాంక జైన్ స్వల్ప ఓటింగ్ తేడాతో కొనసాగుతున్నారు. మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి.  

పల్లవి ప్రశాంత్ కెప్టెన్ బ్యాడ్జ్ లాగేసుకున్న బిగ్ బాస్.. శివాజీ ఎమోషనల్!

బిగ్ బాస్ హౌజ్ లో ఇప్పటికే అయిదు వారాలు పూర్తి చేసుకొని ఆరవ వారం కొనసాగుతుంది. ఇందులో కెప్టెన్సీ పోటీ కోసం బిగ్ బాస్ రకరకాల టాస్క్ లు ఇస్తున్నాడు. పల్లవి ప్రశాంత్ కష్టపడి కెప్టెన్సీ పగ్గాలు చేపట్టాడు. అయితే బిగ్ బాస్ లైవ్ లో అందరి ముందు తను కెప్టెన్సీ బ్యాడ్జ్ ని తీసేసుకున్నాడు. హౌజ్ లోని వారిని అసలు కెప్టెన్ భాద్యతలు ఏంటివి అని వారి అభిప్రాయం తెలుసుకున్నాడు బిగ్ బాస్.  కాస్త కమాండింగ్ ఉంటే బాగుండు అని పూజామూర్తి అంది. బిగ్ బాస్ తర్వాత కెప్టెనే బిగ్ బాస్ అని అంబటి అర్జున్ అన్నాడు. మేనేజింగ్ స్కిల్స్ ఉండాలని ఆట సందీప్ అన్నాడు‌. అందరిని ప్రాపర్ గా చూసుకుంటు వారిచేత సరిగ్గా పనులు చేపించాలని సీరియల్ బ్యాచ్ అన్నారు. ఇక పల్లవి ప్రశాంత్ కెప్టెన్ గా సరిగ్గా చేశాడని ఎవరు అనుకుంటున్నారో చేతిని లేపండి అని అనగా.. సీరియల్  సీరియల్ బ్యాచ్ లోని అమర్ దీప్, ఆట సందీప్, శోభా శెట్టి తప్ప అందరు పల్లవి ప్రశాంత్ కెప్టెన్ గా సరిగానే చేశాడని చెప్పారు. అయితే పల్లవి ప్రశాంత్ తన వివరణ ఇచ్చాడు. కొందరు ఏం చెప్పినా చేయట్లేదని, వీడు చెప్తే వినేదేంది అన్నట్టుగా చూస్తున్నారని తను ఎదుర్కొంటున్న వాటిని  పల్లవి ప్రశాంత్ చెప్పాడు. పల్లవి ప్రశాంత్ కెప్టెన్  గా సరిగ్గా చేయలేదని బిగ్ బాస్ బ్యాడ్జ్ లాగేసుకున్నాక గార్డెన్ ఏరియాకి వెళ్ళి ఏడ్చేశాడు ప్రశాంత్. అక్కడే ఉన్న శివాజీ.. కాసేపు ఓదార్చాడు. ఆ తర్వాత అతను కూడా ఎమోషనల్ అయ్యాడు. ‌ఇక లోపలికి వెళ్ళి అమర్ దీప్, అశ్విని శ్రీలతో పల్లవి ప్రశాంత్ గురించి చెప్పుకుంటూ ఎమోషనల్ అయ్యాడు శివాజీ. హౌజ్ మేట్ అయిన ఒక్కరోజుకే అతని పవరస్త్రాని లాగేసుకున్నారు. ఇప్పుడు కాళ్ళు, చేతులు విరగ్గొట్టుకొని ఆడి గెలిస్తే.‌‌. ఆ కెప్టెన్సీ బ్యాడ్జ్ ని తీసేసుకుంటారా అంటు వాపోయాడు శివాజీ. అతడిని చూసి అందరు ఎమోషనల్ అయ్యారు. ఇక  గార్డెన్ ఏరియాలో భోలే శావలి కూడా పల్లవి ప్రశాంత్, శివాజీల మధ్య  గల స్వచ్ఛమైన స్నేహాన్ని చూసి ఏడ్చేశాడు. ఇద్దరిది గురుశిష్యుల బంధమని, ఇలా ఎవరూ ఉండరని, బహుశా ఇక్కడే చూస్తున్నానంటూ పల్లవి ప్రశాంత్ తో చెప్తూ భోలే శావలి ఏడ్చేశాడు.  

మీ ఇంట్లో కరెంటు ఉందా ? అంటున్న అష్షు

అష్షు రెడ్డి అంటే చాలు సోషల్ మీడియాని షాక్ చేసే ఒక అందాల ఆటం బాంబు. ఎప్పుడూ కొత్తకొత్తగా కనిపిస్తూ కుర్రకారులు అలరిస్తూ ఉంటుంది. బుల్లితెర మీద ఈవెంట్స్ లో కనిపిస్తూ అలరిస్తూ ఉంటుంది. ఖాళీ ఉన్నప్పుడల్లా వాళ్ళ పేరెంట్స్ తో కలిసి రీల్స్ చేస్తూ తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా అలాంటి ఒక రీల్ చేసింది అష్షు.  "కరెంటు ఉంటేనే వెలుగు ఉంటది..కరెంట్ లేకపోతె చీకటైతది" అనే పాటకు వాళ్ళ ఫామిలీ మెంబర్స్ తో కలిసి డాన్స్ వేస్తూ వేయిస్తూ రీల్ చేసేసింది. ఇక ఈ రీల్ కి "మీ ఇంట్లో కరెంటు ఉందా ? ఫైనల్ గా మా అమ్మతో కూడా రీల్ చేయించాను" అంటూ ఒక నవ్వే ఎమోజి పెట్టింది. రెగ్యులర్ గా తన  ఇన్‏స్టాలో సూపర్ హాట్ ఫొటోస్ తో కేకపెట్టిస్తుంటుంది బ్యూటీ.. ఇక అప్పుడప్పుడు తన ఫ్యామిలీ అకేషన్స్‏ను, ఫ్రెండ్స్ తో వెకేషన్స్ ని  కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటుంటుంది. ఇక అష్షు ఆర్జివి బ్యూటీగా పేరు తెచ్చుకుంది. ఎప్పుడూ ఏదో ఒక హాట్ టాపిక్ తో న్యూస్ లో నిలుస్తూనే ఉంటుంది. నడుము మీద పవన్ కళ్యాణ్ పేరు రాయించుకుని, వాళ్ళ అమ్మకు కార్ గిఫ్ట్ గా ఇచ్చి, ఆర్జీవీతో కలిసి వెరైటీగా మూవీ ప్రమోషన్స్ చేస్తూ ఎప్పుడూ తనకో స్టైల్ ని క్రియేట్ చేసుకుంది..ఎలా ఉంటె లైం లైట్ లో ఉంటారు అష్షు రెడ్డికి బాగా తెలుసు. ఇక సోషల్ మీడియాలో రెగ్యులర్ అప్ డేట్స్ తో ఎక్కువగానే కనెక్ట్ అవుతూ ఉంటుంది. "సూపర్, అంటీ బాగా చేశారు..ఆంటీ వేసిన స్టెప్ హైలైట్...ఫెంటాస్టిక్ " అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేశారు.    

థాంక్యూ బంగారు బాబు... కీర్తి భట్ కాలి గోళ్లు ఫినిషింగ్ చేసిన కార్తిక్!

'మనసిచ్చి చూడు' సీరియల్ ద్వారా భానుగా పరిచయమయ్యింది కీర్తి భట్. ఆ తర్వాత  "కార్తీకదీపం" సీరియల్ లో జనరేషన్ చేంజ్ ఐనప్పుడు చిన్నప్పటి  హిమ పాత్రలో నటించి మెప్పించింది. అప్పటివరకూ కొంతమందికే తెలిసిన కీర్తి భట్ కార్తీక దీపం తర్వాత అందరికీ తెలిసిపోయింది. ఆ తర్వాత కీర్తి బిగ్ బాగ్ హౌజ్ లోకి  అడుగుపెట్టి తన రియల్ లైఫ్ గురించి చెప్పిందో అప్పటినుంచి తెలుగు ఆడియన్స్ ఆమె ఫాన్స్ ఇపోయారు. తాను పెళ్లి చేసుకుంటే తల్లయ్యే అదృష్టం లేదని కన్నీళ్లు పెట్టుకుంది.  ఆమె లైఫ్ స్టోరీ విన్న అందరి మనసు కరిగిపోయింది. అలాంటి కీర్తి లైఫ్ లోకి విజయ్ కార్తీక్ వచ్చాడు. ఆమెను పెళ్లి చేసుకుంటానంటూ ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు.  కన్నడ ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్‌గా కెరీర్‌ స్టార్ట్ చేసిన కార్తీక్ 2014లో సేడు అనే మూవీలో హీరోగా నటించాడు.   తెలుగులో  ఓ వెబ్‌సిరీలో, ఏబీ పాజిటివ్, చెడ్డీగ్యాంగ్‌ అనే మూడు మూవీస్ లో నటించాడు. ఐతే ఇప్పుడు కార్తిక్ తో కలిసి బుల్లితెర మీద వచ్చే ప్రతీ ఈవెంట్ లో కనిపిస్తోంది కీర్తి. ఇప్పుడు తన ఇన్స్టాగ్రామ్ లో కీర్తి ఒక పోస్ట్ ని పెట్టింది. అందులో కీర్తి కాలి గోళ్లు తీసాక నెయిల్ కట్టర్ తో వాటిని  ఫినిషింగ్ చేస్తూ కనిపించాడు. ఆ పిక్ ని పోస్ట్ చేసి అక్కడ "నేను బాలేని సమయంలో నా జీవితంలోకి వచ్చావు..థాంక్యూ బంగారు బాబు" అంటూ కామెంట్ పెట్టి అక్కడ సిగ్గు పడుతున్న ఎమోజిని కూడా పెట్టుకుంది. లైఫ్ లో ఎంతో దెబ్బ తిన్న కీర్తి లైఫ్ లోకి కార్తిక్ వచ్చి మంచి జీవితాన్ని ఇచ్చాడు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మాటీవీలో కొంత కాలం క్రితం జరిగిన ‘మా బోనాల జాతర’ ఈవెంట్ లో కాబోయే భర్త  విజయ్‌ కార్తీక్‌తో ఎంగేజ్‌మెంట్‌ జరుపుకుంది. అక్కడే  అత్తమామలను కూడా పరిచయం చేసింది. తమ కుటుంబంలోకి కూతురిలా ఆమెను ఆహ్వానిస్తున్నట్లు చెప్పి భావోద్వేగానికి గురైన విషయం తెలిసిందే.    

ఆదర్శ్ రాడని భవాని ఎమోషనల్.. తనమీదే అనుమానపడిన కృష్ణ!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -285 లో.. మధు ఎప్పటిలాగే రీల్స్ చేస్తూ బిజీగా ఉంటాడు. అప్పుడే మధు దగ్గరికి కృష్ణ వచ్చి.. ముకుంద గురించి మా చిన్నాన్నకి కూడా అర్థం అయిందని అనగానే అవునా ఏం అన్నాడని మధు అడుగుతాడు. నీ కాపురం చక్కదిద్దుకోమని చెప్పాడని కృష్ణ చెప్తుంది. మరొకవైపు భవాని ఇంటికి వస్తుంది. ఆ తర్వాత ముకుంద తన నటన మొదలుపెడుతుంది. మీ దగ్గర ఒక విషయం దాచానని భవానికి మకుంద చెప్తుంది. ఏంటి ఏం చెప్పావ్ అని టెన్షన్ గా అడుగుతుంది. ఆదర్శ్ గురించి మీకు అబద్ధం చెప్పాం. అందరూ ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు వాళ్ళకీ ఈ న్యూస్ చెప్పి బాధపెట్టడం ఎందుకని మురారి వద్దని అన్నాడు. అసలు విషయం ఏంటంటే.. ఆదర్శ్ ఇక్కడికి రావడానికి ఇష్టపడడం లేదట. ఫోన్ వాడడం లేదట, ఇక ఇక్కడికి రాడట అంటూ ముకుంద ఏడుస్తున్నట్లు నటిస్తుంది. ముకుంద మాటలు విని ఆదర్శ్ రాను అని అన్నాడ అంటూ భవాని ఎమోషనల్ అవుతుంది. ఆ తర్వాత ఏంటి ఏసీపీ సర్ ఎక్కడ ఉన్నాడు. ఈ విషయం చెప్పేటప్పుడు కావాలనే ఏసీపీ సర్ ఉండలేదా అని కృష్ణ ఆలోచిస్తుంది. అప్పుడే రేవతి కృష్ణ దగ్గరికి వచ్చి.. ఏమైందని అడుగుతుంది.. అసలు మురారితో  ముకుంద కలిసి ఎలా వచ్చింది మధ్య లో కలిసి ఏసీపీ సర్ తో వెళ్లిందా అని కృష్ణకి డౌట్ వస్తుంది. అసలు నిజం ఇంక కృష్ణకి తెలియదని అనుకొని.. అసలు నిజం తెలిస్తే కృష్ణ పరిస్థితి ఏంటో అని రేవతి అనుకుంటుంది. మరొక వైపు మురారి, ముకుంద అన్న మాటలు గుర్తుకు చేసుకొని ఎలాగైనా ఆదర్శ్ ని ఇంటికి తీసుకొని రావాలని మురారి అనుకుంటాడు. మరొక వైపు ముకుంద గీతికతో ఫోన్ మాట్లాడుతుంది. అతను మనం చెప్పినట్టే చెప్పి మంచిగా నటించాడు. ఇక ఆదర్శ్ వస్తాడంటూ నన్ను ఎవరు టార్చర్ చెయ్యరని ఫోన్ లో ముకుంద మాట్లాడుతుంది. అప్పుడే కృష్ణ వస్తుంది. నా మాటలు కృష్ణ విన్నాదా అని‌ ముకుంద టెన్షన్ పడుతుంది. కానీ కృష్ణ వినదు.. ఆ తర్వాత నువ్వు చెప్పింది వింటే నాకు డౌట్ వస్తుంది. పైగా మురారి ఇంట్లో లేనప్పుడు ఈ విషయం చెప్పావ్. నాకు డౌట్ గా ఉందని కృష్ణ అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే ‌.  

రిషిధార అంటే కేవలం పేరు కాదు ఒక ఎమోషన్

స్టార్ మా వచ్చే "గుప్పెడంత మనసు" సీరియల్ కి వీరాభిమానులు చాల మంది ఉన్నారు. అందులో జగతి, మహేంద్ర, రిషి, వసుధార పాజిటివ్ రోల్స్ లో కనిపిస్తే దేవయాని పెద్దమ్మ, శైలేంద్ర అన్నయ్య విలన్ రోల్స్ లో కనిపిస్తారు. ఇక జగతిని, రిషిని అభిమానించే రోల్ లో ధరణి ఉంటుంది. మొత్తం ఈ రోల్స్ మధ్య సక్సెస్ ఫుల్ రన్ అవుతున్న సీరియల్ ఇది. ఇక ఈ సీరియల్ లో వసుధార-రిషిని కలిపి "రిషిధార" అని పిలుస్తాడు మహేంద్ర సర్.  ఐతే మహేంద్ర అలియాస్ సాయికిరణ్ తన ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియో రీసెంట్ గా పోస్ట్ చేసాడు. అందులో "జగతి.. ఈ రిషిధార కనిపించట్లేదేంటి" అంటూ అడుగుతుండగా "ఏమన్నారు డాడ్" అంటూ రిషి ఎంట్రీ ఇచ్చేసరికి మహేంద్ర, జగతి స్టన్ ఐపోతారు. ఐతే ఈ బిట్ సీరియల్ లో జగతి ఉన్నప్పటిది. ఐతే ఈ బిట్ ని రిపీట్ పోస్ట్ చేసి  ఫ్యాన్స్ కామెంట్స్ లో పెట్టె 'రిషిధార' అనే పదాన్ని నేనే ఫస్ట్ టైం సీరియల్‌లో పిలిచాను" అంటూ క్యాప్షన్ పెట్టారు. ఇకపోతే ఇప్పుడు జగతి రోల్ ని చంపేసి ఆడియన్స్ ని హర్ట్ చేశారు సీరియల్ డైరెక్టర్. ఇక మహేంద్ర జగతితో ఫోటో తీసి ఆ పిక్ ని కూడా పోస్ట్ చేసుకుని "సో లాంగ్ జగ్గు" అని కామెంట్ పెట్టుకున్నారు. ఇక జగతి రోల్ కి శుభం కార్డు పడేసరికి బయట ఫుల్ గా ఎంజాయ్ చేస్తోంది. హాట్ ఫోటో షూట్స్ ని తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ యూత్ ని పిచ్చెక్కిస్తోంది. రీసెంట్ గా ఆమె నటించిన   'ప్రెట్టీ గర్ల్' అనే  వెబ్ సిరీస్ ఫస్ట్ లుక్ కూడా రిలీజైంది. "జగతి- మహేంద్ర కాంబినేషన్ ని చాల మిస్ అవుతున్నాం. ఐ మిస్ యు జగతి మేడం..జగతి- మహేంద్ర ఫన్నీ కాంబో..రిషిధార అంటే కేవలం పేరు కాదు ఒక ఎమోషన్" అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.  

వసుధార ఇచ్చిన క్లూతో సారథిని రిషి పట్టుకోగలడా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -891లో.. నేను కాలేజీలో అడుగుపెట్టలేనని రిషి అనగానే.. మీరు కాలేజీలో జరిగిన విషయాలన్ని మనసులో పెట్టుకోకండని చెప్తుంది వసుధార. మీ మీద పడ్డ నింద అబద్ధమని SI కి మంత్రి గారికి చెప్పానని వసుధార అనగానే దేవయాని శైలేంద్ర ఇద్దరు షాక్ అవుతారు. అది అబద్ధమని నాకు తెలుసు కానీ కారణం ఎవరో తెలియాలని రిషి అంటాడు. ఆ తర్వాత దానికి కారణం కూడ చెప్పాను సర్ అని వసుధార చెప్తుంది. అలా వసు అనగానే రిషి ఆశ్చర్యపోతాడు. జగతి మేడమ్ ఆ రోజు నాతో అబద్ధం చెప్పమని చెప్పారు. ఆ రోజు అలా అబద్ధం చెప్తేనే రిషి ప్రాణాలతో ఉంటాడని జగతి మేడమ్ ని ఎవరో భయపెట్టారు. అందుకే మేడమ్ అలా చేశారు. ఇప్పటివరకు మీపై జరిగిన అన్ని అటాక్ లు మేడమ్ ని భయపెట్టాడానికి చేసినవే సర్ అందుకే జగతి మేడమ్ అంత భయపడ్డారని వసుధార చెప్తుంది. ఎవరు మా అమ్మని భయపెట్టిందని తెలుసుకోవాలని రిషి అంటాడు.. తెలుసుకోవచ్చు సర్ శైలేంద్ర సర్ సపోర్ట్ చేస్తే అని అనగానే.. అందరూ షాక్ అవుతారు. ఎలా అని రిషి అడుగుతాడు. సారథి చెక్కు కాలేజీ లో ఇవ్వకుండా డైరెక్ట్ వెళ్లి మినిస్టర్ గారికి ఎందుకిచ్చాడు. సారథిని పట్టుకుంటే తెలుస్తుంది కదా.. అసలు మేడమ్ ని భయపెట్టింది కూడా అతనే కావచ్చని వసుధార అనగానే.. అవును అన్నయ్య వెంటనే సారథిని రమ్మను అని రిషి చెప్తాడు. దానికి శైలేంద్ర ఇబ్బందిగా సరే అంటాడు. మరొకవైపు మహేంద్ర జగతి జ్ఞాపకాలతో పిచ్చివాడు అవుతాడు. తాగి కిందకి వస్తు పడిపోతుంటే రిషి పట్టుకుంటాడు. ఆ తర్వాత మహేంద్ర తన బాధని చెప్పుకుంటాడు. మరొక వైపు వసుధార మాటలకు దేవయాని టెన్షన్ పడుతుంది. నువ్వేం టెన్షన్ పడకు. సారథిని ఇక్కడ నుండి పంపించేశానని శైలేంద్ర చెప్తాడు. మరొక వైపు మినిస్టర్ వచ్చి జగతి గురించి బాధపడుతాడు. త్వరలోనే జగతిని ఎవరు బయపెట్టారో కనుక్కోవాలని చెప్తాడు. కాసేపటికి రిషిని ఎండీగా బాధ్యతలు తీసుకోమని చెప్తాడు.  ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

రాజ్ నిజస్వరూపాన్ని తెలుసుకున్న సీతారామయ్య ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -224 లో.. కావ్య ఇంట్లో నుండి పోవడం ఎవరికీ తెలియదు. అసలు ఎందుకు వెళ్లిందో తెలియదు. మేం కావ్యని వెతికే పనిలోనే  ఉన్నాం. మాకు సపోర్ట్ చెయ్యండని కనకానికి ఇందిరాదేవి చెప్తుంది. ఇంతమందిని బాధపెట్టి అసలు   ఈ కావ్య ఎక్కడికి వెళ్లినట్టు అని రాజ్ కోపంగా ఉంటాడు.  మరొక వైపు గుడిలో కూర్చొని ఉన్న కావ్య దగ్గరకి పూజారి వస్తాడు. పూజారి పిలిచినా కావ్య పట్టించుకోకుండా ఆలోచనలో పడుతుంది. కావ్యని చూసిన పూజారి.. దుగ్గిరాల ఇంటి కోడలని అనుకొని వెంటనే సీతారామయ్యకి ఫోన్ చేసి మీ మనవరాలు గుడిలో ఉందని చెప్తాడు. ఆ తర్వాత సీతారామయ్య, ఇందిరాదేవి ఇద్దరు వెళ్తారు. అసలు ఇంటినుండి ఎందుకు వెళ్లిపోయిందో కారణం తెలుసుకొని ఇంటికి తీసుకొని వద్దామనుకుంటారు. ఆ తర్వాత దగ్గరికి వెళ్లి అసలు ఏమైంది? ఎందుకు ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వచ్చావని ఇందిరాదేవి అంటుంది. కాసేపటికి రాజ్ రాసిన చీటీ సీతరామయ్యకు ఇస్తుంది కావ్య. అది చదివి సీతారామయ్యా షాక్ అవుతాడు. ఇందిరాదేవి కూడా చదువుతుంది.. కావ్య ఏడుస్తూ తన బాధ వాళ్ళిద్దరికీ చెప్తుంది. ఇంటికి వెళదామని వాళ్ళు అనగానే.. ఏం చూసుకొని రావాలి ఐశ్వర్యం చూసా? అత్త ఆదరణ లేదు, భర్త ప్రేమ లేదు. ఏ దారి లేదు. అందుకే ఇక్కడ కూర్చొని ఉన్నానని కావ్య ఎమోషనల్ అవుతుంది. ఇంటికి వెళదాం పదా, నీకేం బాధ రాకుండా చూసుకుంటామని ఇందిరాదేవి అంటుంది. నేను ఎప్పటికి ఆ ఇంటి అతిధినే, ఇంకా ఆ ఇంట్లో సభ్యురాలిని కాలేకపోతున్నాను. ఇంకా ఎందుకు రావాలని కావ్య ఎమోషనల్ గా అంటుంది. రాజ్ ఇన్ని రోజులు నీపై చూపించే ప్రేమ అంతా నాటకమని, నీకు ముందు తెలిసింది. నాకు లేట్ గా తెలిసింది.. నీ భర్తని నువ్వే మార్చుకోవాలి. నా మనవడు మారలేని మూర్కుడు కాదు. సహానం కావాలని ఇందిరాదేవీ అంటుంది. నీ భర్త ప్రేమ నీకు దక్కాలని సంకల్పం ఉండాలి. రాజ్ లో మార్పు కోసం నీకు అండగా ఉంటామని కావ్యకి నచ్చజెప్పి ఇంటికి తీసుకొని వెళ్తుంటారు. అప్పుడే రాజ్ కోపంగా వచ్చి.‌. ఎందుకు చెప్పకుండా వచ్చావంటూ కోప్పడతాడు. ఏదో మొక్కు ఉందట, అందుకే వచ్చిందట  నీ భార్యని నువ్వు తీసుకొని వెళ్ళమని సీతారామయ్య చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

బిగ్ బాస్‌లో శివాజీ పుంజు పందెం కొట్టింది!

బిగ్ బాస్ సీజన్-7 గ్రాంఢ్ గా మొదలైన విషయం తెలిసిందే. రోజుకో మలుపు తిరుగుతూ సరికొత్తగా మారుతుంది. ఉల్టా పల్టా థీమ్ తో అదరహో అనిపిస్తుంది. ప్రతీ వీకెంట్ అత్యధిక టీఆర్పీ రేటింగ్ తో దూసుకెళ్తుంది. బిగ్ బాస్ హౌజ్ లో‌ మంగళవారం మొదలైన టాస్క్ లు కొనసాగుతున్నాయి. మొదటి రోజు కొత్త కంటెస్టెంట్స్ (పోటుగాళ్ళు) ఆధిక్యంలో ఉండగా, రెండవ రోజు ఆటగాళ్ళు టాస్క్ గెలిచారు.  కంటెస్టెంట్స్ కి మూడవ టాస్క్ గా " ఫాస్టెస్ట్ ఎవరు" అనే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇందులో రెండు టీమ్ ల నుండి ఒక్కొక్కరు రావాలి. "కలర్ కలర్ విచ్ కలర్ డు యూ వాంట్" అని కంటెస్టెంట్స్ అడిగితే బిగ్ బాస్ ఒక కలర్ చెప్తాడు.  అ కలర్ గల వస్తువులని హౌజ్ లో నుండి తీసుకొచ్చి రౌండ్ లోపల వేయాలని బిగ్ బాస్ చెప్పగా.. ‌ఆట సందీప్- అంబటి అర్జున్ తలపడగా.. అంబటి అర్జున్ మొదటి రౌండ్ లో గెలిచాడు. ఆ తర్వాత అశ్విని శ్రీ- అమర్ దీప్ ఇద్దరు తలపడగా తన దగ్గర అమర్ దీప్ లాక్కొని మ వచ్చి వేశాడు. ఆ తర్వాత టేస్టీ తేజ లేట్ గా రావడంతో.‌ వెల్ ట్రై తేజ అని బిగ్ బాస్ చెప్పాడు. ఆ తర్వాత అంబటి అర్జున్-ఆట సందీప్ ఇద్దరు తలపడగా అందులో లెమన్ కలర్ తీసుకురమ్మని బిగ్ బాస్ చెప్పగా.. పసుపు కలర్ కుర్చీ అంబటి అర్జున్ తీసుకొచ్చాడు. ఆకుపచ్చ కలర్ కుర్చీ ఆట సందీప్ తెచ్చాడు. దీంతో ఈ రౌండ్ ని క్యాన్సిల్ చేశాడు బిగ్ బాస్. ఆ తర్వాత ప్రియాంక జైన్ - నయని పావని తలపడగా.. సిల్వర్ కలర్ అని బిగ్ బాస్ చెప్పాడు. దీంతో ప్రియాంక తెలివిగా ఆలోచించి అక్కడే డంబెల్స్ ఉండే ఇనుల రాడ్ తీసుకొచ్చి ఫాస్ట్ గా ఆ రౌండ్ లో వేసింది. అలా ఇరు జట్లు తలపడగా చివరగా 'ఆటగాళ్లు' టీమ్ గెలించిందని బిగ్ బాస్ చెప్పాడు. దీంతో పల్లవి ప్రశాంత్, శివాజీ, యావర్, ఆట సందీప్ అందరు హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇక హౌజ్ లోకి శివాజీ వస్తూ.. " మా పుంజు పందెం కొట్టింది " అంటు తన సంతోషాన్ని వ్యక్తీకరించాడు. ఇలా హౌజ్ లో శివాజీ పెద్దన్నలాగా తోటి హౌజ్ మేట్స్ కి దగ్గరుండి జోష్ ని నింపుతూ.. ఆటతీరుతో, మాటతీరుతో అదుర్స్ అనిపించుకున్నాడు.

వైల్డ్ కార్డ్ ఎంట్రీ అశ్విని శ్రీ ఎవరో తెలుసా?

బిగ్ బాస్ సీజన్-7 లో గ్రాంఢ్ లాంచ్ 2.0 తర్వాత అంతా కొత్త హౌజ్ మేట్స్ అయినటువంటి పోటుగాళ్ళ మీదే ఉంది. నయని పావని, అంబటి అర్జున్, పూజా మూర్తి,  భోలే శావలి, అశ్విని శ్రీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన సంగతి తెలిసిందే. నిన్న మొన్నటి దాకా సీక్రెట్ రూమ్ లో ఉన్న గౌతమ్ కృష్ణ కూడా పోటుగాళ్ళ టీమ్ లోనే ఉన్నాడు. సోమవారం నామినేషన్ల ప్రక్రియ కొనసాగింది‌.‌ మంగళవారం నుండి ఆటగాళ్లు-పోటుగాళ్ల మధ్య టాస్క్ లు జరుగుతున్నాయి. నిన్న జరిగిన ఎపిసోడ్‌లో పోటుగాళ్ళ టీమ్ రెండు టాస్క్ లో గెలిచి ఆధిక్యంలో ఉండగా.. ఈ పోటుగాళ్ళ టీమ్ లో అంబటి అర్జున్ టీమ్ ని లీడ్ చేస్తున్నాడు. అయితే ఈ టీమ్ లోని అశ్విని శ్రీ గ్లామర్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అశ్విని శ్రీ తెలుగమ్మాయి. 1989  జూలై 12 న అశ్విని శ్రీ జన్మించింది. ఈమె హైదరాబాద్ లోనే పుట్టి పెరిగింది. అయితే మొదటగా తను షార్ట్ ఫిల్మ్ లలో నటించింది. వాటితో పెద్దగా గుర్తింపు రాకపోవడంతో సినిమాల్లోకి వచ్చింది. 2016 లో వెండితెరపై అరంగేట్రం చేసింది అశ్విని. సంపూర్ణేశ్ బాబు హీరోగా చేసిన "వినోదం 100 పర్సెంట్" అనే సినిమాలో లీడ్ రోల్ చేసింది. ఆ తర్వాత 2017 లో వచ్చిన "అమీర్ పేటలో", 2018 లో వచ్చిన " బిటెక్ బాబులు" , 2020 లో " నువ్వు నేను, ఒసేయ్ ఒరేయ్" వంటి సినిమాలల్లో నటించింది అశ్విని‌. అశ్విని ఇన్ స్టాగ్రామ్ లో చేసే రీల్స్, ఫోటోలకి ప్యాన్ బేస్ గట్టిగానే ఉంది. ఇన్ స్టాగ్రామ్ లో 356K ఫాలోవర్స్ ని కలిగి ఉంది. దీంతో తను నామినేషన్లో ఉన్నా ఈజీగా సేఫ్ అవుతుంది.  బిగ్ బాస్ హౌజ్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారంటే ఏ కంటెస్టెంట్ ఎక్కువ వారాలు ఉండరు. ఎందుకంటే హౌజ్ లో అప్పటికే ఉన్నవారితో అంత బాండింగ్ ఉండదు. మొన్న జరిగిన నామినేషన్లో సీరియల్ బ్యాచ్ శోభా శెట్టి, ప్రియాంక జైన్ ఇద్దరు కలిసి అశ్విని శ్రీని నామినేట్ చేయడంతో తను ఏడ్చేసింది. ఇక ఆ సీరియల్ గ్రూప్ చేసే పాలిటిక్స్ వల్ల తను మునుముందు హౌజ్ లో ఎలా ఉండగలదో, వాళ్ళని ఎలా ఎదుర్కుంటుందో చూడాలి. ఇన్ స్టాగ్రామ్ లో ఎప్పుడు ట్రెండింగ్ లో ఉండే అశ్విని శ్రీ.. టాప్-5 లో ఉంటుందా తెలియాలంటే మరికొన్ని వారాలు ఆగాల్సిందే.

రతికతో ఒక రోజు... మెసేజ్ చేయాల్సిందే!

  బిగ్ బాస్ సీజన్-7 రోజుకో కొత్త మలుపు తిరుగుతుంది. హౌజ్ లో రోజుకొక కొత్త టాస్క్ లతో క్రేజ్ సంపాదించుకుంటుంది. అయితే హౌజ్ లోకి మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చారు. అందులో అయిదు వారాల్లో కిరణ్ రాథోడ్, షకీల, దామిణి, రతికరోజ్, శుభశ్రీ ఎలిమినేట్ అయ్యారు. అయితే వీళ్ళ అయిదుగురిలో అత్యధిక క్రేజ్ సంపాదించుకుంది మాత్రం రతికరోజ్.  రతికరోజ్ బిగ్ బాస్ హౌజ్ లోకి టైటిల్ ఫేవరెట్ గా ఎంట్రీ ఇచ్చింది. అయితే తను పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్ లతో కలిసి ప్రేక్షకులకు 'బేబీ' సిమిమాని చూపించిన విషయం తెలిసిందే. రతిక కంటెంట్ కోసం మాట్లాడే విధానం, తన మాటలని తనే ఫ్లిప్ చేయడం, అక్కడివి ఇక్కడ, ఇక్కడవి అక్కడ చెప్పడంతో తనని రతిక బదులు రాధిక అని నెటిజన్లు ట్రోల్స్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ వారం రతిక బయటకొచ్చేస్తుందని అనగా సీరియల్ బ్యాచ్ తో కలిసిపోయింది. ఎలిమినేట్ అయి బయటకొచ్చేముందు కూడా శివాజీ, పల్లవి ప్రశాంత్ లతో అసలు మాట్లాడలేదు, అసలు చూడను కూడా చూడలేదు రతిక. దాంతో  సీరియల్ బ్యాచ్ ఇంపాక్ట్ రతిక మీద ఏ రెంజ్ లో ఉందో అర్థమవుతుంది. ఇక హౌజ్ లో తన గ్లామర్ కి ఫ్యాన్స్ కూడా ఆ రేంజ్ లోనే ఉన్నారు.  బిగ్ బాస్ నుండి బయటకొచ్చాక రతిక బిగ్ బాస్ లైవ్ చూస్తుంది. అయితే హౌజ్ లో రతిక గురించి ఇప్పుడు పెద్దగా ఎవరు ప్రస్తావించట్లేదనే చెప్పాలి. ఎందుకంటే కొత్త కంటెస్టెంట్స్ లలో నయని పావని, అశ్విని శ్రీ, పూజా మూర్తి, అంబటి అర్జున్, భోలే శావలి చేసే హడావిడి ముందు రతిక పేరు వినపడట్లేదు. ఇక తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో ఫ్యాన్ మీట్ పెడదామని అనుకుంటున్నాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు మెసెజ్ చేయడంటూ ఒక నోట్ ని పోస్ట్ చేసింది రతిక. దీంతో తనకి పాజిటివ్ కామెంట్లతో పాటుగా నెగెటివ్ కామెంట్లు వినిపిస్తున్నాయి. ఏ మోహం పెట్టుకొని కలుస్తావంటూ ఒకతను కామెంట్ చేయగా, ఆడుకున్నది చాలదా అని మరొకరు కామెంట్ చేశారు. మరికొందరు అయితే నేను రెడీ అని, నిజమేనా అని మరొకరు ఇలా మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. ఇక మరొక అభిమాని తన కోసం మాత్రమే బిగ్ బాస్ చూస్తున్నాని పోస్ట్ పెట్టగా అది తన ఇన్ స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసుకుంది రతిక. కాగా ఇప్పుడు ఈ పోస్ట్ వైరల్ గా మారింది.