అవమానం తట్టుకోలేక ఇల్లు వదిలి వచ్చేసిన రిషి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -895 లో....అందరూ భోజనం చేస్తుంగా మహేంద్ర ఎక్కడ అని ఫణింద్ర అడుగుతాడు. కాసేపటికి మహేంద్ర తాగి ఇంటికి వస్తాడు. మహేంద్ర పడిపోబోతుంటే రిషి వెళ్లి పట్టుకుంటాడు. అసలు ఇంట్లోకి రావద్దనుకున్న నువ్వు నాకోసం బయట తిరుగుతు ఉంటావని నీ కోసం వచ్చానని రిషితో మహేంద్ర అంటాడు. ఆ తర్వాత మహేంద్ర తాగి మాట్లాడతాడు. ఏదో ఒకటి మాట్లాడు అని దేవయానికి శైలేంద్ర సైగ చేయగానే.. మహేంద్రని తిట్టడం స్టార్ట్ చేస్తుంది.. ఏంటి మహేంద్ర రోజు ఇలా తాగి వస్తే ఎలా? ఇంట్లో కొడుకు కోడలు ఉన్నారని తెలియదు. ఇలా అయితే ఎలా అని దేవయాని రెచ్చిపోయి మాట్లాడుతుంటే బాధలో ఆలా మాట్లాడుతున్నాడని రిషి అంటాడు. ఇంకా ఎక్కువ మాట్లాడకని దేవయానిపై ఫణీంద్ర కోప్పడతాడు. ఛీ ఛీ  ఇలా తయారయ్యారేంటి బాధ ఉంటే ఇలా తాగి తందనాలు ఆడాలా అని దేవయాని అనగానే.. ఎవరు ఇక్కడ తాగి తందనాలు ఆడడం లేదని రిషి కోపంగా మాట్లాడుతాడు. ఇదేం తాగుడు, నాకైతే అర్థం కావడం లేదని దేవయాని అంటుంది‌. తాగాలి వదిన గారు కుట్రలు చేసి మనుషులని చంపుతుంటే వాళ్ళు రాక్షసులుగా మన చుట్టే ఉంటే ఆ బాధని పోగొట్టుకోవడానికి తాగాలని మహేంద్ర అంటాడు. ఇలా తాగితే మన కుటుంబ పరువు ఏమవుతుంది. మొహం పై ఉమ్మేస్తారు. నేను ఇంట్లో ఉండనని దేవయాని అనగానే.. రిషి కోపంగా ఇక ఆపండి మీరనే ప్రతి మాట నా గుండెలకి గుచ్చకుంటుంది. మా డాడ్ కి ఇంత అవమానం జరిగిన చోట నేను ఉండను. మీరే ఉండండి. మేమే వెళ్ళిపోతామని చెప్తాడు. వసుధారనీ లగేజ్ సర్దమని చెప్తాడు. నేను ఆ ఉద్దేశ్యంతో అనలేదని రిషిని దేవయాని ఆపే ప్రయత్నం చేసినా రిషి మాట వినడు. ఫణింద్ర చెప్పిన రిషి మాట వినడు. జగతి ఫొటోని, మహేంద్రలని తీసుకొని రిషి, వసుధారలు ఇంట్లో నుండి వెళ్ళిపోతారు.  ఏంటి మమ్మీ.. ఏదో అనమాన్నా అని ఏదో అనేసి వాళ్ళను ఇంట్లో నుండి వెళ్లేలా చేసావని దేవయానిని శైలేంద్ర అంటాడు. కాసేపటికి ఫణింద్ర వచ్చి.. దేవయానిని తిడుతాడు. మరొక వైపు రిషి మహేంద్ర, వసుధార వేరొక ఇంటికి వస్తాడు. ఇది ఎవరి ఇల్లు అని రిషిని వసుధార అడుగుతుంది. ఇది కూడా డాడ్ దే అని రిషి చెప్తాడు. ఆ తర్వాత మహేంద్ర గురించి రిషి బాధపడుతుంటే.. వసుధార ధైర్యం చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే  

కృష్ణని ఇంట్లో నుండి గెంటేసిన భవాని.. ఆ లెటర్ లో ఏం ఉంది?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -289 లో.. కృష్ణ చేసిన మోసం గురించి ముకుంద చెప్తుంది. అలాగే మురారిని ప్రేమించాను. తప్పని పరిస్థితిలో ఆదర్శ్ ని పెళ్లి చేసుకున్నాను. అది కూడా మురారి చేసుకోమని చెప్తేనే చేసుకున్నానని ముకుంద చెప్తుంది.. అదంతా వింటున్న భవాని గుండెపగిలినంత పని అయింది.  ఆ తర్వాత పెద్ద అత్తయ్య అంటూ ముకుంద ఏదో చెప్పబోతు ఉంటే.. షటప్ నువ్వు మాట్లాడకు అంటూ కృష్ణని మాట్లాడే ఛాన్స్ భవాని ఇవ్వదు.  ఆ తర్వాత రేవతి భవానికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా రేవతి పైకి గట్టిగా అరుస్తుంది భవాని. నా కళ్లముందు ఈ కృష్ణ తిరగడానికి వీలు లేదు. అలేఖ్య నువ్వు వెళ్లి తన లగేజ్ తీసుకొని రా అనగానే అలేఖ్య తీసుకొని వస్తుంది. ఇప్పటికిప్పుడు ఇక్కడ నుండి వెళ్ళమంటే ఎక్కడికి వెళ్తుందని ప్రసాద్ అంటాడు. పాపం కృష్ణ.. చాలా మంచిది పెద్దమ్మ అని మధు అంటాడు. రేవతి కూడా అలాగే మాట్లాడుతుంది. కానీ భవాని మాత్రo ఎవరి మాట వినదు.. ఆ తర్వాత మురారి తప్పేం లేదని కృష్ణ చెప్పి ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుంది. తను ఇంట్లో ఉన్నప్పటికీ జ్ఞాపకాలు గుర్తుకు చేసుకుంటుంది కృష్ణ. ఆ తర్వాత భవాని బాధపడుతుంది. మరొక వైపు ఇన్ని రోజులు దాచుకున్న నిజం చెప్పేసాను. ఇక మురారి వచ్చాక మురారికి నాకు పెద్ద అత్తయ్య పెళ్లి చేస్తుందని ముకుంద అనుకుంటుంది.  ఆ తర్వాత ముకుంద దగ్గరకి మధు వస్తాడు.. అనవసరంగా అమాయకురాలి జీవితంతో ఆడుకున్నావని అంటాడు. ముకుంద పొగరుగా సమాధానం చెప్తుంది. అప్పుడే భవాని వచ్చి.. మళ్ళీ కృష్ణని అమాయకురాలని అంటున్నావని మధు పై కోప్పడుతుంది. దీని అంతటికి కారణం మురారి.. ముగ్గురు జీవితలు నాశనం చేశాడని భవాని అంటుంది. మరొక వైపు కృష్ణ హాస్పిటల్ కీ వెళ్తుంది. అప్పుడే కృష్ణకి ఒక లెటర్ వస్తుంది. అది మురారి రాసింది. అందులో ముకుంద గురించి తను కృష్ణని ప్రేమిస్తున్నట్లు ఉంటుంది. అది చదివి కృష్ణ హ్యాపీగా ఫీల్ అవుతుంది.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

దుగ్గిరాల ఇంట్లో కనకం ఉండగలదా.. వాళ్ళిద్దరి మధ్య కొంచెం ఇష్టం కొంచెం కష్డం!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -228 లో.. దుగ్గిరాల వారింటికి కనకం, కృష్ణమూర్తి ఇద్దరు వస్తారు. వాళ్ళని చుసిన కావ్య హ్యాపీగా ఫీల్ అవుతుంది. వీళ్ళెందుకు వచ్చారన్నట్లుగా స్వప్న చూస్తుంది. మళ్ళీ ఎందుకు వచ్చారని రుద్రాణి అడుగుతుంది. కాసేపటికి రుద్రాణి వాళ్ళని తక్కువ చేసి మాట్లాడుతుంది. దాంతో రుద్రాణిపై ఇందిరాదేవి కోప్పడుతుంది. ఆ తర్వాత రాజ్ వాళ్ళని కూర్చోమని చెప్పి.. మీ కంటే నా భార్య నయం పుట్టింటి వాళ్లపై ఈగ కూడా వాలానియ్యదు.. స్వప్న చూడు మంచిగా రసం తాగుతుంది. ఇప్పటివరకు చూసాను, నీ భార్యకు చెప్తావని అయిన చవటలాగా చూస్తున్నావని రాహుల్ ని తిడతాడు రాజ్. ఆ తర్వాత స్వప్న వెళ్లి కనకాన్ని హగ్ చేసుకుంటుంది. ఆ తర్వాత కనకం కృష్ణమూర్తి లు అసలు వచ్చిన విషయం చెప్తారు. స్వప్నని వాళ్ళింటికి తీసుకొని వెళ్ళాలని కనకం అడుగుతుంది. త్వరగా తీసుకొని వెళ్ళండి అన్నట్లు రుద్రాణి మాట్లాడుతుంది. నీకు ఏమైనా బుద్ది ఉందా అసలు నీ కోడలికి శ్రీమంతం చెయ్యాలి కదా అని రుద్రాణిని ఇందిరాదేవి  అంటుంది. మీకు అభ్యంతరం లేకపోతే నువ్వు ఇక్కడే ఉండి స్వప్నని చూసుకో అని ఇందిరాదేవి చెప్తుంది. ఆ మాటకి స్వప్న టెన్షన్ పడుతుంది. ఆ తర్వాత మీరు చెప్పేది కూడా మా కూతురు మంచి కోసమే కదా అని కనకం సరే అంటుంది. మీరు నిర్ణయం తీసుకున్నాక నన్ను అడగడం దేనికి అంటూ అపర్ణ చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత కనకానికి ఇంట్లో ఉండడం వద్దని కావ్య చెప్తుంది. దాంతో ఇందిరాదేవి కోపంగా.. మేం నిర్ణయం తీసుకున్నాం అంతే అని అనగా.. కనకం తప్పక దుగ్గిరాల ఇంట్లో ఉంటుంది. మరొకవైపు కళ్యాణ్ ఇచ్చిన చీర కట్టుకొని చూసుకుంటుంది అప్పు. అప్పుడే కళ్యాణ్ వస్తాడు. చీర తీసి పక్కన పడేస్తుంది. కళ్యాణ్ కింద పడి ఉన్న చీరనీ చూసి.. నీకు ఇష్టం లేదు కదా అయినా ఉంచుకో అని చెప్తాడు. ఎంగేజ్ మెంట్ కాకుండా డైరెక్ట్ పెళ్లి అనుకుంటున్నారని కళ్యాణ్ చెప్పి వెళ్ళిపోతాడు.. ఆ తర్వాత అప్పు బాధపడుతుంది. మరొక వైపు అపర్ణ భోజనానికి రానని అనడంతో సుభాష్ నచ్చజెప్పి తీసుకొని వెళ్తాడు.. అందరు భోజనం చేస్తుండగా కనకాన్ని రుద్రాణి అవమానిస్తుటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

కృష్ణ మురారి ఇక లేరు.. ఇదేం ట్విస్ట్ రా మామ !

స్టార్ మా టీవీలో ప్రసారమయ్యే సీరియల్స్ కి క్రేజ్ వేరే లెవెల్ లో ఉంటుంది. అందులోను టీఆర్పీలో మొదటి స్థానంలో బ్రహ్మముడి ఉండగా, మూడవ స్థానంలో కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఉన్నాయి. తాజాగా గుప్పెడంత మనసు సీరియల్ కూడా టాప్ 10 కి చేరుకుంది. కృష్ణ ముకుంద సీరియల్ ఇప్పుడు కీలక మలుపు తిరగనుందా అంటే అవుననే చెప్పాలి. కథ ప్రారంభంలో.. ముకుంద, మురారి ఇద్దరు విదేశాలలో ఉన్నప్పుడు ప్రేమించుకుంటారు. ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల ఇండియాకి వస్తారు. ఇక ఇద్దరికి వేరు వేరు వ్యక్తులతో పెళ్ళిళ్ళు జరుగుతాయి. కృష్ణని మురారి పెళ్ళి చేసుకోగ, ముకుందని ఆదర్శ్ పెళ్ళి చేసుకుంటాడు. అయితే ఆదర్శ్, మురారి ఇద్దరు ఒకే కుటుంబంలో ఉండటంతో అసలు కథ మొదలవుతుంది. మురారి, ముకుంద. ఇద్దరు ప్రేమిసంచుకున్నారనే విషయం ఆదర్శ్ కి వాళ్ళిద్దరి పెళ్ళి తర్వాత తెలుస్తుంది దాంతో అతను మిలటరీలోకి వెళ్లి ఇక రాకుండా అక్కడే ఉంటాడు. ఇక ముకుంద ప్రేమించిన ప్రేమికుడు మురారి ఒకే ఇంట్లో ఉండటంతో తన మీద ఆశలు పెంచుకుంటుంది. అయితే మురారి పెళ్ళికి ముందున్న తన ప్రేమని మర్చిపోయి, కృష్ణని పెళ్ళి చేసుకొని ప్రేమిస్తుంటాడు. అయితే తాజాగా జరుగుతున్న ఎపిసోడ్ లలో.. మురారి తననే ప్రేమిస్తున్నాడని కృష్ణ తెలుసుకుంటుంది. కానీ ముకుంద తన ప్రేమ దక్కించుకోవడానికి మురారి వాళ్ళ పెద్దమ్మ భవానీతో.. మురారిని ప్రేమించిన నిజం చెప్పేస్తుంది.  మురారి, ముకుంద ప్రేమించుకున్న విషయం తెలిసిన భవాని కుప్పకూలిపోతుంది‌. ఇదేం చంఢాలం అని అనుకుంటూ ముకుందని తిడుతుంది. అయితే తాజాగా విడుదలైన ప్రోమోలో .. కృష్ణ, మురారి ఇద్దరు కార్లో వెళ్తూ మాట్లాడుకుంటారు. " ఎప్పటినుండో మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఐ లవ్ యూ " అని కృష్ణ చెప్తుంది. అప్పుడే వాళ్ళు వెళ్తున్న కార్ ని ఒక లారీ వచ్చి ఢీకొడుతుంది. దాంతో కృష్ణ, మురారి ఇద్దరు తీవ్రంగా గాయపడతారు. ఆ లారీలో నుండి ఒక అజ్ఞాత వ్యక్తి కిందకి దిగి, పగ తీరింది అన్నట్టుగా ఉంటాడు. మరి ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరు, కృష్ణ మురారి చనిపోతారా? బ్రతుకుతారా అనేది తెలియాల్సి ఉంది. ఇలాంటి కీలక మలుపుతో ఈ కథ మరింత ఉత్కంఠభరితంగా మారింది.

నయని పావని ఎగ్జిట్ ఇంటర్వ్యూ.. అన్ ఫెయిర్ ఎలిమినేషనా!

బిగ్ బాస్ సీజన్-7 ఉల్టా పుల్టా థీమ్ తో ఆకట్టుకుంది. హౌస్ లోని కొత్త కంటెస్టెంట్స్ లో అందరితో బాగా కలిసిన అమ్మాయి నయని పావని. ఈమె ఆరోవారం ఎలిమినేషన్ అయింది. అయితే ఇప్పుడు ఈ ఎలిమినేషన్ అన్ ఫెయిర్ అంటూ నెటిజన్లు ట్వీట్లు చేస్తుండగా.‌ ట్విట్టర్ లో నయని  పావని ట్రెండింగ్ లో ఉంది. తాజాగా విడుదలైన బిబి బజ్ ఎగ్జిట్ ప్రోమోలో యాంకర్ గీతు రాయల్ అడిగే ప్రశ్నలకు కన్నీళ్ళే సమాధానమంటూ, మౌనంగా ఉండిపోయింది నయని. హౌస్ లోకి మెరుపుతీగలా వెళ్ళి మెరుపులా బయటకు వచ్చేశావ్ కదా? ఏం అని ఊహించుకున్నావని గీతు అడుగగా.. లాస్ట్ వీక్ వరకు ఉందామని వెళ్ళానని నయని అంది. 2.0 లో భాగంగా అయిదుగురు కంటెస్టెంట్స్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వగా నయని పావని హౌస్ లోని అందరితో ఇట్టే కలిసిపోయిన విషయం అందరికి తెలిసిందే. హౌస్ లో ఎవరితో మీరు ఎక్కువగా ఉన్నారని గీతు అడుగగా.. మై డాడ్ శివాజీ గారు.. ఆయన్ని చూడగానే నాన్నలా అనిపించారు. రోజు పొద్దున్నే వెళ్ళి ఆయన్ని హత్తుకొని తర్వాత పనులు చేసేదాన్ని, పల్లవితో బాగా కలిసాను. భోలా ఏం లేదు డొల్లా అంటూ నయని అంది.  నువ్వు కాకుండా హౌస్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారని అనుకుమ్నావని గీతు అడుగగా.. అశ్విని అని అనుకున్నట్టుగా నయని అంది. తేజని కావాలనే నామినేట్ చేసావా అని అడిగితే.. అదేం లేదు, అతని ఆటకి అలా అనిపించిందని నయని అంది. ఇలా ఒక్కో కంటెస్టెంట్ గురించి తన పాయింటాఫ్ లో సమాధానాలు చెప్పుకొచ్చింది నయని. అయితే ఇప్పుడు నయని పావని ఇంటర్వ్యూ ఎమోషనల్ గా సాగిందని బయట టాక్ నడుస్తుంది. అయితే గీతు రాయల్ అడిగే ప్రశ్నలకు నయని కాస్త ఇబ్బంది పడిందంట. నయని పావని పోస్ట్ ఎలిమినేషన్ ఇంటర్వ్యూ ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ లో ఉంది.  

శివాజీకి హెల్త్ ఎమర్జెన్సీ.. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకి!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 రోజుకో ట్విస్ట్ తో ఆసక్తికరంగా సాగుతోంది. తాజాగా బిగ్ బాస్ ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. అదేంటంటే బిగ్ బాస్ హౌస్ నుండి శివాజీని బయటకు పంపించేశాడు. ఈ సీజన్ విన్నర్ అయ్యే అవకాశాలు ఎవరికి ఉన్నాయంటే ఎక్కువగా వినిపించే పేరు శివాజీ. ఆయన టాప్-5 లో ఖచ్చితంగా ఉంటానని మొదటి వారం నుంచే ప్రేక్షకులు బలంగా నమ్ముతున్నారు. అలాంటి శివాజీ సడెన్ గా హౌస్ నుండి బయటకు వచ్చాడు. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి నయని పావని ఎలిమినేట్ అయింది. అయితే ఆమెని బయటకు పంపించే సమయంలో శివాజీ చేసిన రిక్వెస్ట్ అందరినీ ఆశ్చర్య పరిచింది. నయని పావనిని కూతురిలా భావించిన శివాజీ.. ఎలిమినేషన్ సమయంలో ఆమె బాధని చూడలేక అవకాశముంటే ఆమెకి బదులుగా తనను బయటకు పంపించాలని కోరాడు. అయితే అది బిగ్ బాస్ రూల్స్ కి విరుద్ధమని హోస్ట్ నాగార్జున తెలిపాడు. దీంతో నయని పావని ఎలిమినేట్ అయింది. అయితే తాజాగా విడుదలైన ప్రోమోలో శివాజీని హౌస్ నుండి బయటకు పంపించడం సంచలనంగా మారింది. ప్రోమోలో "శివాజీ మిమ్మల్ని బయటకు తీసుకెళ్ళడం జరుగుతుంది" అని బిగ్ బాస్ చెప్పాడు. దీంతో "నేను బయటకు వెళ్తున్నాను" అంటూ హౌస్ మేట్స్ కి చెప్పిన శివాజీ బయటకు వచ్చేశాడు. ఆ సమయంలో హౌస్ మేట్స్ "వెళ్ళొద్దు" అంటూ ఎంతో బాధ పడ్డారు. పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్ అయితే కన్నీళ్ళు కూడా పెట్టుకున్నారు. హౌస్ నుంచి శివాజీ బయటకు వచ్చాడనే న్యూస్ ఫ్యాన్స్ ని, ప్రేక్షకులని షాక్ కి గురి చేసింది. అయితే ఆయన బయటకు రావడానికి ఆరోగ్య సమస్యే కారణమని తెలుస్తోంది. ఇటీవల ఒక టాస్క్ లో శివాజీ చేతికి బలమైన గాయమైంది. దీంతో ఆయన చేతికి తీవ్రమైన నొప్పి వస్తుంది. ఆ నొప్పి భరించలేక పోయిన శివాజీ.. బిగ్ బాస్ కి చెప్పడంతో.. ఆసుపత్రికి వెళ్ళడం కోసం బయటకు పంపించారు. వైద్య పరీక్షల అనంతరం మళ్ళీ శివాజీ హౌస్ లోకి అడుగు పెట్టనున్నారని సమాచారం. ఏది ఏమైనా శివాజీ హౌస్ నుంచి బయటకు వచ్చారనే వార్త బిగ్ బాస్ ఫ్యాన్స్ ని ఉలిక్కిపడేలా చేసింది. అయితే ఆయన మళ్ళీ హౌస్ కి వస్తున్నారని తెలుస్తుండటంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకుంటున్నారు.

నేనే డాడీ అనుకో.. నాకు కూతురు లేదు!

బిగ్ బాస్ హౌజ్ లో ఆరవ వారం కూడా మరో అమ్మాయి ఎలిమినేట్ అయి బయకొచ్చింది.  పోటుగాళ్ళుగా ఎంట్రీ ఇచ్చిన అంబటి అర్జున్, అశ్విని, నయని, పూజా మూర్తి, భోలే శావలి నుండి నయని పావని ఎలిమినేట్ అయింది. ఎలిమినేషన్ తర్వాత స్టేజ్ మీదకి వచ్చిన నయని మోస్ట్ ఎమోషనల్ అయింది. ‌ఇక నాగార్జున తన జర్నీ వీడియో చూపించి, తర్వాత హౌజ్ మేట్స్ తో మాట్లాడించాడు.  ఇక ఒక్కో హౌజ్ మేట్ గురించి మాట్లాడుతూ నయని ఏమోషనల్ అయింది‌. శోభా శెట్టి చాలా స్వీట్ అండ్ స్ట్రాంగ్ అని నయని అంది. ప్రియాంక ఎంతో ఓపికగా అందరికి వండిపెడుతుంది. అందరు తినాలని ఎప్పుడు ఉంటుంది. షీ ఈజ్ స్వీట్ అని అంది. అమర్ దీప్ నా ఫస్ట్ మూవీ హీరో, నేను అతని హీరోయిన్. అతనిలో ఫైర్ ఉంది. కానీ బయపడుతున్నాడు. గేమ్ బాగా ఆడు అమర్, తడపడకు చుట్టూ చూడకు సూటిగా ఆడు అని అమర్ దీప్ కి నయని చెప్పింది.  తేజ చాలా మంచోడు సర్. నన్ను అమ్మ అమ్మ అని పిలుస్తాడు. తిన్నావా తిన్నావా అని ఎప్పుడు నా గురించి ఆలోచిస్తుంటాడు. నవ్వించాలని ట్రై చేస్తాడు. అలా నయని అనగానే.. నథింగ్ పర్సనల్ , మిస్ యూ రా అని తేజ అన్నాడు. పూజ చాలా మంచిది. మా అక్క తర్వాత తనే నాకు బాగా కనెక్ట్ అయింది. మాట్లాడటానికి అందరు క్లోజ్ అయ్యారని నయని అనగా.. బయటకొచ్చిన తర్వాత కలుద్దామని నయని అంది. ఆట సందీప్.. చాలా కూల్ గా ఉంటాడు.  బయటకొచ్చాక మనమిద్దరం డ్యాన్స్ చేద్దామని అంది నయని. అంబటి అర్జున్.. ఎప్పుడు స్వీట్ అండ్ ఫేస్ లో నవ్వు ఉంటుంది మా టీమ్ కి ఒక లీడర్ ఉన్నాడని నయని అనగా.. "ఈ వీక్ మొత్తంలో యాక్టివ్ గా ఉంది నయని. ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లూజ్ అవ్వకు. బయటకొచ్చాక ఫస్ట్ నిన్నే కలిసేది"  అని అంబటి అర్జున్ అన్నాడు. గౌతమ్ కృష్ణ.. డాక్టర్ బాబు ప్రతీది నవ్వుతూ తీసుకుంటాడు. చాలా కూల్ అండ్ కామ్ అని నయని అంది. పల్లవి ప్రశాంత్.. చాలా జెన్యున్ ప్లేయర్. ఆట కోసం ఎంతైనా కష్టపడతాడని నయని అనగా.. అదేంటి వెళ్తున్నావా లేదు వెళ్ళవ్ నెక్స్ట్ నామినేషన్లో మనం కొట్టుకోవద్దా, నీ కోసం చాక్లెట్లు దాచానని పల్లవి ప్రశాంత్ అంటాడు. నయని పావని ఏడ్చేస్తుంది. శివాజీ గురించి మాట్లాడుతూ చాలా ఏడ్చేసింది నయని. "శివాజీ గారిని చూడగానే నాకు మా నాన్నే గుర్తొచ్చాడు సర్. రోజు పొద్దున్నే వెళ్ళి డాడీకి హగ్ ఇచ్చి నా డే స్టార్ట్ చేస్తాను సర్" అని నాగార్జునతో నయని అంది‌. ఐ మిస్ యూ డాడీ అని శివాజీతో నయని అనగానే శివాజీ కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. ఇక శివాజీ ఎమోషనల్ అవుతూ.‌. " నాకు కూతురు లేదు సర్. తనలో నేను కూతురిని చూసుకున్నాను. నన్నే డాడీ అనుకో అని తనతో చెప్పాను. సర్ తన బదులు నేను బయటకు రావొచ్చా సర్. నాకు చేయి నొప్పి కూడా ఉంది " అంటూ శివాజీ ఎమోషనల్ గా చెప్పగా.. ఆడియన్స్ ఓటింగ్ ని మనం మార్చలేం కదా శివాజీ అని నాగార్జున అన్నాడు. ఆ తర్వాత నయని పావని ఎలిమినేషన్ అయి బయటకి వెళ్లింది. ఇక నాగార్జున చూసి ఒక కంటెస్టెంట్స్ బయటకు వెళ్తుంటే ఇంతమంది బాధపడటం ఫస్ట్ టైమ్ చూస్తున్నానని నాగార్జున అన్నాడు.  

నయని పావని ఎలిమినేషన్.. మోస్ట్ హార్ట్ టచింగ్!

బిగ్ బాస్ హౌజ్ లో మోస్ట్ హార్ట్ టచింగ్ ఎపిసోడ్ గా ఆదివారం నాటి ఎపిసోడ్ మిగిలిపోతుందనే చెప్పాలి. ఎందుకంటే ఎవరూ ఊహించని విధంగా ఆరో వారం నయని పావని ఎలిమినేషన్ అయింది. ఇది అన్ ఫెయిర్ ఎలిమినేషన్ అని ఇప్పటికే చాలా ట్రోల్స్ వస్తున్నాయి. ఆదివారం నాటి ఎపిసోడ్ లో ఆరోవారం నామినేషన్లో ఉన్న ఒక్కొక్కరిని వరుసా ఒక్కొక్కరిని సేవ్ చేసుకుంటు రాగా చివర్లో పూజా మూర్తి, నయని పావని, అశ్విని శ్రీ ఉన్నారు. ఇక ఆ తర్వాత పూజామూర్తి సేవ్ అయింది. చివరగా అశ్విని శ్రీ, నయని పావని ఇద్దరు నామినేషన్లో ఉన్నారు. ఆదివారం నాటి గెస్డ్ లని పిలిచేశాడు నాగార్జున. భగవత్ కీసరి మూవీ డైరెక్టర్ అనిల్ రావిపుడి, హీరోయిన్ శ్రీలీల గెస్ట్ లు వచ్చారు. ఇక హౌజ్ లోని ఒక్కో కంటెస్టెంట్ గురించి చెప్తూ వారికి గైడెన్స్ ఇచ్చాడు అనిల్ రావిపుడి. కంటెస్టెంట్స్ తో ఆటలు ఆడి పాడించాడు. ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ ఫిల్ చేస్తూ ఆట ఆడించాడు నాగార్జున. అందులో టీమ్ - B గెలిచింది. దాంతో లగ్జరీ బడ్జట్ వారికే దక్కింది. ఆ తర్వాత గెస్ట్ లని పంపించి, నామినేషన్లో ఇన్న నయని, అశ్విని ఇద్దరిని యాక్టివిటి ఏరియాకి రమ్మని.. అక్కడ ఉన్న గాజు బీకర్లో బాటిల్ లో ఉన్న వాటర్ ని పోయమన్నాడు. నయని పావని గాజు బీకర్ లోని వాటర్ రెడ్ కలర్ లోకి మారాయి. అశ్వినివి ఎల్లో రంగులోకి మారాయి. దాంతో అశ్విని సేఫ్, నయని యూ ఆర్ నాట్ సేఫ్ అని నాగార్జున అన్నాడు. ఆ తర్వాత హౌజ్ మేట్స్ అందరికు గుడ్ బై చెప్పేసి వచ్చేసింది.  

అశ్విని శ్రీ ఎలిమినేషన్.. ఉల్టా పల్టా జరగనుందా?

బిగ్ బాస్ హౌస్ లో రోజు టాస్క్ లే కాకుండా, బిగ్ బాస్ ఇచ్చే ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లతో ఈ షో ఫుల్ క్రేజ్ ని సంపాదించుకుంటుంది. అయితే ఇప్పటికి ఐదు వారాల నుండి లేడీ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవ్వగా, ఈ వారం కుడా మరో అమ్మాయి ఎలిమినేట్ అవనుందా అంటే అవుననే తెలుస్తుంది. నామినేషన్లో ఉన్న కొత్త హౌజ్ మేట్స్ లో అశ్విని శ్రీ, పూజా మూర్తి, నయని పావని లీస్ట్ లో ఉన్నారు. అయితే ఈ వారం గేమ్ పరంగా నయని పావని బాగా ఆడింది. పూజా మూర్తి, అశ్విని శ్రీల మధ్య గొడవ ముదిరి అది హోస్ట్ నాగార్జున దగ్గరి దాకా రావడంతో మరింత ఇంట్రెస్ట్ గా మారింది. మరి ఈ ముగ్గురిలో హౌజ్ లో నుండి ఎవరు ఎలిమినేషన్ అవుతారనేది ఆసక్తిని రేకెత్తిస్తుంది. బిగ్ బాస్ హౌజ్ లోకి 2.0 లో గ్రాంఢ్ గా ఎంట్రీ ఇచ్చిన వారిలో భోలే శావలి బాగా ఆడకపోయినా తనకి మ్యూజిక్ లవర్స్ సపోర్ట్ ఉంది. అలాగే రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ సపోర్ట్ ఉంది. ఎప్పుడు పల్లవి ప్రశాంత్, శివాజీలతో ఉండే భోలే శావలిని అందరు బయాజ్(పక్షపాతం) గా ఉంటున్నాడని అనుకుంటున్నారు. అయిన అతను మాత్రం ప్రేక్షకుల హృదయాలను గెలవాలని వచ్చానని చెప్పడంతో అతనకి మరింత ఓటింగ్ పెరిగింది. ఇక నిన్న మొన్నటి దాకా ఓటింగ్ లో చివరి స్థానంలో ఉన్న శోభా శెట్టి కూడా తన ఆటతీరుతో మెరుగుపరుచుకుంది. హౌజ్ లో టేస్టీ తేజతో కలిసి టాస్క్ చేస్తూ ఓటింగ్ ని పెంచుకుంటుంది. ఇక పూజా మూర్తి రూడ్ బిహేవియర్ తో మరింత లీస్ట్ కి వెళ్ళింది. పూజా మూర్తి, అశ్విని శ్రీ, నయని పావని.. ఈ ముగ్గురు ఒకే ఓటింగ్ శాతంతో లీస్ట్ లో ఉన్నారు. అయితే ఇరవై, ముప్పై ఓట్ల తేడాతో అశ్విని శ్రీ చివరి స్థానంలో, ఆ తర్వాత నయని పావని ఉంది. ఈ చివరి రోజు ఓటింగ్ లో అశ్విని శ్రీకి ఓటింగ్ తక్కువ పడితే తనే ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. నయని పావనికి తక్కువ ఓటింగ్ పడితే తనే ఎలిమినేషన్ అయ్యేలా ఉంది. ఇక ఇప్పుడు ఎలిమినేషన్ అనేది ఈ ఇద్దరిలో ఎవరనేది తెలియాల్సి ఉంది. కొత్త కంటెస్టెంట్స్ లలో ఎంతో కొంత తెలిసిన అమ్మాయి నయని పావని. తను ఎలిమినేషన్ అయ్యే ఛాన్స్ లు తక్కువ ఉన్నాయి. అయితే అశ్విని శ్రీకి కూడా ఫ్యాన్ బేస్ ఉంది‌. దీంతో ఎవరు ఎలిమినేషన్ అవుతారనేది మరింత ఉత్కంఠభరితంగా మారింది.

బిగ్ బాస్ ఎపిసోడ్-42 రివ్యూ!

బిగ్ బాస్ హౌస్ లో ప్రతీ వారం కొత్త టాస్క్ లతో కంటెస్టెంట్స్ ని ఆడుకుంటున్నాడు బిగ్ బాస్. ఉల్టా పల్టా థీమ్ తో కొత్త ట్విస్ట్  లతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది ఈ షో. అయితే గ్రాంఢ్ లాంచ్ 2.0 తర్వాత సీరియల్ బ్యాచ్ బండారం బయటపడిందనే చెప్పాలి. నలుగురు కలిసి ఏది మాట్లాడుకోవాలన్నా కాస్త భయపడుతున్నారు. శనివారం నాగార్జున ఎంట్రీ కూల్ గా ఉంది. మళ్లీ పాత నాగార్జున వచ్చాడు. ఈ వీకెండ్ అంత కిక్ అనిపించలేదు. కెప్టెన్ గా ప్రిన్స్ యావర్ అవ్వడం సీరియల్ గ్యాంగ్ తట్టుకోలేకపోతున్నారు. ఇన్ని రోజులు సీరియల్ గ్యాంగ్ ఇష్టం వచ్చినట్లు వండుకొని తిన్నారు. ఆ రోజు కిచెన్ లో జరిగిన గొడవ యావర్ మనసులో ఉండిపోయింది. ఇక కూల్ డ్రింక్ దొంగతనం చేసిన అమర్ దీప్ ని యావర్ పట్టుకొని.. అడగాలి కదా, అసలు వీఐపీ రూమ్ కి నీకు ప్రవేశం లేదు కదా అని అడుగగా.. ఒక్కటే తీసుకున్నా, గ్యాస్ట్రిక్ ఉందని అమర్ దీప్ అన్నాడు. ఇక ఈ ఇష్యూలో ఆట సందీప్ వచ్చి గొడవని పెద్దది చేశాడు. ఈ ఇష్యూతో సందీప్ మాస్టర్ మరింత నెగెటివ్ అయ్యాడు. నాగార్జున ఈ ఇష్యూ మీద డిస్కస్ చేసి సీరియల్ గ్యాంగ్ కి వాతలు పెట్టాడు. మన వంటలక్క ప్రియాంక జైన్ కిచెన్ లో ఆధిపత్యం లేకపోయేసరికి తనలో తనే కుమిలిపోతుంది. భోలే షావలి కిచెన్ లో వంటలతో అదరగొడుతుంటే ప్రియాంక జైన్ మొహం మాడ్చుకుంటుంది. ఆట సందీప్ ప్రతీ వారం ఫెయిల్ అవ్వడంతో ప్రేక్షకుల దృష్టిలో నెగెటివ్ అవ్వడంతో ఈ సారి నామినేషన్లోకి వస్తే ఎలిమినేషన్ గ్యారంటీలా అనిపిస్తుంది. ఇక స్పాన్సర్ టాస్క్ లో హౌజ్ లోని ఆడవాళ్లు లిప్ స్టిక్ పెట్టుకొని ఒక టీ షర్ట్ కి కిస్ ఇచ్చారు. అలా ఎవరు చేశారో కనుక్కోమని హౌజ్ లోని మగవాళ్లని గెస్ చేయమనగా టేస్టీ తేజ కరెక్ట్ గా సమాధానం చెప్పాడు. ఇక శోభా శెట్టి, టేస్టీ తేజ కలిసి డేట్ కి వెళ్లారు. ఇక ఇదే ఊపులో శోభా శెట్టికి టేస్టీ తేజ లవ్ ప్రపోజ్ చేశాడు. ఇక డౌట్ రాకుండా చివరలో లవ్ యూ యాజ్ ఫ్రెండ్ అని చెప్పాడు టేస్టీ తేజ.  ఇక బ్రెయిన్ లెస్, యూజ్ లెస్, ఏమ్ లెస్ ఎవరనే ట్యాగ్ లు తీసుకొచ్చి, ఒక్కొక్కరుగా వచ్చి ఒక్కొక్కరికి ఒక్కో ట్యాగ్ ఇవ్వమన్నాడు నాగార్జున. భోలే షావలి వచ్చి బ్రెయిన్ లెస్ ట్యాగ్ ని అంబటి అర్జున్ కి ఇచ్చాడు. అశ్విని శ్రీకి బ్రెయిన్ లెస్ ట్యాగ్ ఇచ్చింది నయని పావని. గ్రూప్ టాస్క్ అన్నప్పుడు ఏది కరెక్ట్ చేయాలో అదే ఆలోచిస్తామని నయని పావని అశ్విని శ్రీని ఉద్దేశించి అనగా.. అదేం లేదు సర్. వాళ్ళు ముగ్గరు కలిసి డిస్కషన్ చేసుకుంటున్నారు. వాళ్ళ స్ట్రాటజీ అనేది నాకు చెప్పట్లేదని అశ్విని శ్రీ అనగా.. ఏం స్ట్రాటజీ అనేది లేదు సర్..  నేను  మాట్లాడేది తను తీసుకోవట్లేదు ఇకనుండి బుజ్జగిస్తూ చెప్తామని నయని పావని అంది. ఇక అమర్ దీప్ కి బ్రెయిన్ లెస్ ట్యాగ్ ఇచ్చాడు శివాజీ. కాసేపటికి హౌస్ లోకి దామిణి, రతిక రోజ్, శుభశ్రీ ఎంట్రీ ఇచ్చారు. వారిలో ఎవరైతే హౌస్ లోకి రీఎంట్రీ ఇస్తే బాగుంటుందో డిసైడ్ అవ్వమని హౌస్ మేట్స్ కి చెప్పాడు నాగార్జున. ఈ ముగ్గురిలో హౌస్ లోకి ఎవరు వస్తారనే ఆసక్తి ఇప్పుడు అందరిలోను నెలకొంది.

నిజాలు బయటపెట్టేసిన ముకుంద.. షాక్ లో భవాని!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -288 లో.. మురారి తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడతాడు. ముకుంద దూకుడు గురించి భయపడుతున్నానురా, ఎక్కడ కృష్ణకి నిజం చెప్తుందేమోనని భయపడుతున్నానురా అంటూ తన ఫ్రెండ్ తో మురారి చెప్పగా.. ఎందుకు రా టెన్షన్ ఇదంతా నువ్వు కృష్ణని ప్రేమిస్తున్నట్లు చెప్పకపోవడం వల్ల వచ్చిందని మురారితో తన ఫ్రెండ్ చెప్తాడు.  మరొకవైపు ఆ ఫేక్ కమాండర్ కోసం మధు వెతుకుతుంటాడు. ఇక కాసేపటికి అతను దొరుకుతాడు. అతడిని ఇంటికి తీసుకొస్తాడు మధు. ఆ తర్వాత ముకుంద తన గదిలో ఉండి ఫోన్ చూస్కుంటుంది. అందులో గీతిక కాల్ చేసినట్టుగా రిసీవ్డ్ కాల్స్ లో ఉంటుంది. అది చూసి నేను మాట్లడలేదు కదా ఎలా ఉంది, ఎవరు మాట్లాడారనే డౌట్ తో కృష్ణ దగ్గరికి వచ్చి.. నా ఫోన్ టచ్ చేసావా అని కృష్ణని అడుగుతుంది. కాసేపు ఆగు నీకే తెలుస్తుందని ముకుందతో కృష్ణ చెప్పేసి వెళ్లిపోతుంది. ఇక మధు ఆ ఫేక్ కమాండర్ ని భవాని దగ్గరికి తీసుకెళ్ళగా.. అతను భవాని కాళ్ళ మీద పడి క్షమించండి అని అంటాడు. ఏమైందని అడుగగా.. నేను సినిమాల్లో, సీరియల్స్ లలో చిన్నా చితక వేషాలు వేసుకునే వాడిని ఆ మేడమ్(ముకుంద) వచ్చి నన్ను కమాండర్ వేషం వేయమని చెప్పింది. ఏసీపీ సర్ వచ్చినప్పుడు మేడమ్ ఏం చెప్పమన్నారో అదే చెప్పాను మేడమ్ అని ఆ ఫేక్ కమాండర్ చెప్పి వెళ్ళిపోతాడు. ఇక భవాని రియలైజ్ అయి ముకుంద దగ్గరికి వెళ్ళి తన చెంప చెళ్లుమనిపిస్తుంది. ఛీ నిన్ను పేరు పెట్టి పిలవాలన్న అసహ్యంగా ఉంది. మాట్లాడు అని భవాని అనగానే..ఆదర్శ్ అంటే ఇష్టం లేక అని ముకుంద చెప్తుంది. మరి ఆదర్శ్ అంటే ఇష్టం లేకపోతే ఎందుకు పెళ్ళి చేసుకున్నావని, ఈ మాటేదే అప్పుడే చెప్పొచ్చు కదా అని భవాని అడుగుతుంది. చెప్పాను కానీ నా గొంతు నొక్కేశారు. నా మనసు చచ్చినా నా ప్రేమ బ్రతికే ఉంటుందని చేసుకున్నానని ముకుంద అంటుంది. " ప్రేమేంటి బ్రతికుండటమేంటి? ఏంటి ఈ చెత్త వాగుడు, ఛీఛీ పెళ్ళి అయ్యాక ప్రేమేంటి? ఇది ఏం మాట్లాడుతుంది. నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదని ప్రేమ గురించి మాట్లాడటమేంటి? ఛీఛీ ఏంటీ అసహ్యం.. లేదు, నువ్వు ఈ ఇంట్లోనే ఉంటే ఇంకా ఛండాలం చేస్తావ్. ఇప్పుడే మీ నాన్నకి ఫోన్ చేసి నిన్ను తీసుకెళ్ళమని చెప్తాను" అని భవాని వెళ్తుండగా.. తనని ఆపుతుంది ముకుంద. అలా మా నాన్నకి చెప్పేముందు నేను చెప్పేది ఒకసారి వినండి. విన్న తర్వాత ఏం చేస్తారో మీ విజ్ఞతకే వదిలేస్తున్నాని ముకుంద అనగానే.. షటప్ నా విజ్ఞత గురించి నువ్వు మాట్లాడుతున్నావా? చదువు విజ్ఞత గురించి కృష్ణ దగ్గర నేర్చుకోమని ముకుందతో భవాని అనగానే..  నేను తన దగ్గర నేర్చుకోవాలా? ఇంత దాకా వచ్చాకా నిజం చెప్పేస్తాను. వాళ్ళిద్దరు అగ్రిమెంట్ మ్యారేజ్ చేసుకొని వచ్చారు. ఈ రేవతి వాళ్ళిద్దరు అలా చేసినా ఒకే గదిలో ఉంచి కాపురం చేపించాలని చూస్తుంది. అందరు మీ వెనుక నాటకం ఆడుతున్నారని, మిమ్మల్ని మోసం చేస్తున్నారని ముకుంద అనగానే.. ఆ నిజం తట్టుకోలేక భవానికి కళ్లు తిరిగి పడిపోతుండగా.. అందరు పట్టుకోవడానికి వస్తే వద్దని చెప్తుంది. నేను మురారి ప్రేమించుకున్నాం. కుటుంబం, పరువు అంటూ మురారి నన్ను ఆదర్శ్ తో పెళ్ళికి ఒప్పించాడని భవానితో అంటుంది ముకుంద. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

హౌస్ మేట్స్ కి వార్నింగ్ ఇచ్చిన నాగార్జున.. యావర్ కి సపోర్ట్!

బిగ్ బాస్ సీజన్-7 ఇప్పుడు అందరిని ఆకర్షిస్తుంది. గత ఐదు వారాల నుండి వరుసగా అమ్మాయిలు ఎలిమినేట్ అవ్వడంతో.. గ్లామర్ కి ఇంపార్టెంటెన్స్ ఇచ్చే ఈ షో, ఆడియన్స్ ఓటింగ్ ని బట్టి బయటకు పంపించడమేంటని ప్రేక్షకులు భావిస్తున్నారు. శుక్రవారం వరకు కెప్టెన్సీ కోసం ఆటగాళ్ళు, పోటుగాళ్ళు టాస్క్ లు ఆడిన విషయం తెలిసిందే. అందులో ఆటగాళ్ళ టీమ్ నుండి యావర్ కెప్టెన్ గా ఎంపిక అయ్యాడు. అయితే శనివారం జరిగిన ఎపిసోడ్ లో.. నాగార్జున వచ్చీ రాగానే శుక్రవారం హౌస్ లో ఏం జరిగిందో ఆడియన్స్ కి బిగ్ స్క్రీన్ మీద చూపించాడు. దాని తర్వాత హౌస్ మేట్స్ తో మాట్లాడాడు. అమర్ దీప్ ని లేపి చప్పట్లు కొట్టాడు నాగార్జున. సర్ ఏంటి సర్ అని అమర్ దీప్ అనగానే.. చాలా బాగా ఇంప్రూవ్ అయ్యావ్. కానీ నీలో 50% మాత్రమే ఇచ్చావ్. ఐ వాంట్ యువర్ 100% అని నాగార్జున అన్నాడు. ఆ తర్వాత ప్రిన్స్ యావర్ ని లేపి.. టాస్క్ లలో నీ వంద శాతం ఎఫర్ట్స్ పెట్టావ్. సూపర్.. సెకండ్ కెప్టెన్ ఆఫ్ ది హౌజ్ అని చెప్పి చప్పట్లు కొట్టించాడు నాగార్జున.  కాసేపటికి పల్లవి ప్రశాంత్ ని లేపి.. ఎలా ఉంది కెప్టెన్ గా చేశావ్ కదా అని నాగార్జున అడుగగా.. బాగుంది సర్. కానీ నేను చెప్తే కొందరు వినలేదు సర్. అనవసరంగా ఫుడ్ వేస్ట్ చేస్తున్నారు సర్ అని ఆట సందీప్, ప్రియాంక జైన్, గౌతమ్ కృష్ణ గురించి చెప్పాడు. ఇక వాళ్ళు కావాలని చేయలేదని, అంతమందికి కాస్త ఎక్కువైందని అది కూడా పారేయలేదని ఫ్రిడ్జ్ లో పెట్టామని సీరియల్ బ్యాచ్ వివరణ ఇచ్చారు. ఇక ఒక్కసారికి అయితే ఒకే మళ్ళీ మళ్ళీ ఇలాగే జరిగితే నాకు చెప్పమని పల్లవి ప్రశాంత్ తో నాగార్జున అన్నాడు. ఇక కెప్టెన్ గా నీకు ఎదురైన సమస్యేంటని యావర్ ని నాగార్జున అడుగగా.. వీఐపీ రూమ్ లోని ఫ్రిడ్జ్ లో ఉన్న కూల్ డ్రింక్ నేను తాగాలా? హౌస్ మేట్స్ తాగాలా అని నాగార్జునని యావర్ అడిగాడు. అది నీ ఇష్టం. వీఐపీ రూమ్ లోకి నీకొక్కడికే పర్మిషన్ ఉంది. ఎవరు వెళ్ళకూడదు. రోజుకొక కూల్ డ్రింక్ నువ్వు తీసుకోవచ్చు. అది ఎవరికైనా ఇచ్చుకోవచ్చు అని నాగార్జున చెప్పాడు. ఇక ప్రియాంక జైన్ మధ్యలో మాట్లాడిందని చెప్పగా నేను కూడా చూశానని, తప్పేం కాదని యాక్షన్ ని బట్టి  రియాక్షన్ ఉంటుందని నాగార్జున అన్నాడు. ఆ తర్వాత యావర్, అమర్ దీప్ మధ్య జరిగిన డిస్కషన్ లో ఆట సందీప్ నువ్వు ఎందుకు వచ్చావని అతడికి వార్నింగ్ ఇచ్చాడు నాగార్జున.

స్వీట్ వార్నింగ్ ఇచ్చిన వసుధార.. కోపంతో ఊగిపోయిన శైలేంద్ర!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -894 లో.. కొత్త ఎండీ వసుధార అని మినిస్టర్ చెప్పగానే.. శైలేంద్ర, దేవాయని షాక్ అవుతారు. వసుధార నా భార్య అని నేను ఈ నిర్ణయం తీసుకోలేదు. తనకి కాలేజీ గురించి మొత్తం తెలుసు. తనైతే ఎండీ గా బాగుంటుందని నిర్ణయం తీసుకున్నానని రిషి అంటాడు. అందరు రిషి చెప్పిన దానికి క్లాప్స్ కొడుతారు. ఆ తర్వాత వసుధార అంటే నాకు ఇష్టమే కానీ ఆ చైర్ లో రిషి అయినా ఇంకా ఎవరైనా కూర్చుని ఉంటే బాగుండేదని దేవయాని అంటుంది. ఇప్పుడు నాకు ఇష్టం లేదని చెప్పాను కదా పెద్దమ్మ అని రిషి అంటాడు. ఆ తర్వాత రిషి వసుధార చెయ్యి పట్టుకొని తీసుకొని వెళ్లి.. ఎండీ చైర్ లో కూర్చోపెడతాడు. ఇప్పుడు నేను MD.. మీరు MH అని వసుధార అనగానే MH అంటే ఏంటి అని మినిస్టర్ అడుగుతాడు. వసుధార కవర్ చేస్తూ మిషన్ ఎడ్యుకేషన్ హెడ్ అని చెప్తుంది. ఇద్దరు కలిసి పని చేసి కాలేజీని ముందుకు తీసుకొని వెళ్ళండని మినిస్టర్ చెప్తాడు. ఆ తర్వాత మినిస్టర్ ని పంపించడానికి రిషి వాళ్ళు వెళ్తారు. కాసేపటికి ఎండీ చైర్ లో వసుధార హుందాగా కూర్చొని ఉంటే చూడలేని దేవయాని.. నక్క తోక తొక్కావని అంటుంది. ఎండీ చైర్ రాలేదు అన్న కోపం ఒకటి అయితే ఎండీ చైర్ లో నన్ను కూర్చోపెట్టారు అన్న కోపం మీకు ఎక్కువగా ఉందని శైలేంద్రతో వసుధార అంటుంది. ఆ తర్వాత నేను జగతి మేడమ్ అంత మంచిదాన్ని కాదు ఒక చెంప కొడితే రెండు చెంపలు వాయించే రకమని వసుధార చెప్తుంది.  కాసేపటికి రిషి వచ్చి వసు తో మాట్లాడుతాడు. మీరు మనస్పూర్తిగా నన్ను ఎండీ చైర్ లొ కూర్చోపెట్టారా అని వసుధార అడుగుతుంది. అవును మనస్పూర్తిగా కూర్చోపెట్టానని రిషి అంటాడు. ఆ తర్వాత శైలేంద్ర కోపంగా ఇంటికి వెళ్తాడు. మీరు చేసే ప్రతి పని నాకు తెలుసని శైలేంద్రతో ధరణి అనగానే.. అప్పటికే బాధలో ఉండి, మరింత చిరాకుతో శైలేంద్ర కొప్పడతాడు. ఎలాగైనా రిషి మాములుగా అయ్యాక  నిజం చెప్పాలని ధరణి అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

బిగ్ ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్.. ఆ ముగ్గురిలో హౌజ్ లోకి వచ్చేదెవరు?

బిగ్ బాస్ హౌజ్ లో ఉల్టా పల్టా థీమ్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. గడిచిన ఐదు వారాల్లో కిరణ్ రాథోడ్, షకీల, సింగర్ దామిణి,  రతిక రోజ్, శుభశ్రీ రాయగురు ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు కొత్తగా మరో ఐదుగురు ఎంట్రీ ఇచ్చి బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చాడు. కొత్తగా వచ్చిన హౌజ్ మేట్స్ ని పోటుగాళ్ళు అని చెప్పి వారితో టాస్క్ ఆడిస్తున్న విషయం తెలిసిందే. నిన్న శనివారం హౌస్ లో హౌజ్ మేట్స్ కి మరో బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చాడు బిగ్ బాస్. చివరి మూడు వారాల్లో ఎలిమినేట్ అయిన ముగ్గురిని హౌస్ లోకి తీసుకొచ్చాడు బిగ్ బాస్. దామిణి, రతికరోజ్, శుభశ్రీ రాయగురులని చూసిన హౌస్ మేట్స్ షాక్ అయ్యారు. ఇక ఒక్కొక్కరుగా వచ్చి ఓట్ ని రిక్వెస్ట్ చేశారు. తెలిసో తెలియకో తప్పులు చేశాను‌. వాటిని సరిదిద్దుకునే అవకాశం వచ్చింది. ఈ సారి ఆ తప్పుల్ని చేయనని తనకు ఓట్ చేయాలని రతిక రిక్వెస్ట్ చేసింది. దామిణి, శుభశ్రీలు కూడా అలాగే రిక్వెస్ట్ చేశారు.  కాసేపటికి వాళ్ళ ముగ్గురిని హౌస్ నుండి బయటకు పంపించేశాడు నాగార్జున. ఎలా ఉంది ఈ ఉల్టా పల్టా అని హౌస్ లోని వాళ్ళని నాగార్జున అడుగగా.. సూపర్ సర్, క్రేజీ అంటూ ఒక్కొక్కరు ఆశ్చర్యంగా చెప్పారు. ఇక హౌస్ లోని వాళ్ళకి నాగార్జున ఓట్ చేయమని చెప్పాడు. ఈ ముగ్గురిలో ఎవరైతే హౌస్ లోకి కరెక్టో వారికి ఓట్ చేయండి. హౌజ్ లోకి ఎవరు రావాలో మీ చేతుల్లో ఉందని నాగార్జున చెప్పాడు. ఇక అందరు తమ ఫేవరెట్ ఎవరు? ఎవరైతే హౌజ్ లో కరెక్ట్ అనే ఆలోచనల్లో పడ్డారు. మరి హౌజ్ మేట్స్ అంతా కలిసి ఎవరిని ఎన్నుకుంటారనదే ఇప్పుడు ఆసక్తిగా మారింది. దామిణి, రతిక, శుభశ్రీలలో విన్నర్ ఎవరో చెప్పకుండా సస్పెన్స్ లో పెట్టాడు బిగ్ బాస్. ఇప్పటికే 2.0 తో ఈ షో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న విషయం తెలిసిందే. ఇక ముందు కొత్త కంటెస్టెంట్ ఎంట్రీ ఇస్తే ఎలా ఉంటుంది. ఆట ఏ మలుపు తిరగనుందనే అనే ఉత్కంఠ ఇప్పుడు అందరిలో మొదలైంది. మరి ఈ ముగ్గురిలో హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చేది ఎవరు తెలియాలంటే ఫుల్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

భార్య కాళ్ళు పట్టుకున్న భర్త.. ఇది బ్రహ్మముడి మహిమేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -227 లో స్వప్న జాగ్రత్తగా ఉండడం లేదని అపర్ణ, రుద్రాణి తనపై కోప్పడతారు. ఎప్పుడు నీ కోడలిని జాగ్రత్తగా చూసుకోవాలని తెలియదా అని రుద్రాణిని ధాన్యలక్ష్మి అంటుంది. ఎప్పుడు అంటిపెట్టుకొని ఉండాలా అని రుద్రాణి అంటుంది. స్వప్నని చూసుకోవడానికి ఒక నర్సుని ఏర్పాటు చెయ్యాలని అపర్ణ అనగానే.. స్వప్న టెన్షన్ పడుతూ వద్దు ఆంటీ మా చెల్లి నన్ను చూసుకుంటుందని స్వప్న చెప్తుంది. ఆ తర్వాత కావ్య ఇంట్లో పని చేస్తుంది.. ఒక్కదానికి కష్టం అవుతుంది వద్దని ఇంట్లో వాళ్ళు అంటారు. ఫ్యామిలీ డాక్టర్ కి చెప్పి నర్సుని పంపించమని చెప్తానని సుభాష్ అంటాడు.  మరొకవైపు కళ్యాణ్ ని కలవడానికి అప్పు ఒక షాప్ దగ్గరికి వస్తుంది. లోపలికి వెళ్లేసరికి అనామిక, కళ్యాణ్ ఇద్దరు ఉంటారు. నీకొక గిఫ్ట్ తీసుకున్నామని కళ్యాణ్ అప్పుకి చెప్తాడు. నాకు గిఫ్ట్ ఎందుకని అప్పు అంటుంది. మమ్మల్ని కలిపింది నువ్వే కదా అని అనామిక చెప్తుంది. నువ్వు నా విషయంలో కళ్యాణ్ కి చేసిన హెల్ప్ గురించి చెప్పాడు. అందుకే అని అప్పు కోసం కొన్న చీరని అప్పుకి ఇస్తారు. నాకు చీర అంటే ఇష్టం లేదని తెలుసు కదా అని కళ్యాణ్ తో అప్పు అనగానే.. నేను చెప్పాను కదా అప్పుకి ఇలా అమ్మాయిలాగా పద్ధతిగా ఉండడం ఇష్టం ఉండదు. తనకి ఏ ఫీలింగ్స్ లేవు. తను ఒక స్టోన్ అంటూ అప్పు గురించి కళ్యాణ్ అనగానే.. అప్పు ఫీల్ అవుతుంది. అప్పు వెళ్తుంటే తనని ఆపిన కళ్యాణ్.. చీరని ఇస్తాడు. అప్పు బాధపడుతూ వెళ్తుంది. మరొక వైపు కావ్యకి కాలు బెనకడంతో నడవలేకపోతుంది. ఇబ్బందిగా గదిలోకి వస్తుండగా పడిపోబోతుంటుంది. అప్పుడే రాజ్ అది గమనించి కావ్యని పట్టుకుంటాడు. ఆ తర్వాత కావ్య కాలు నొప్పి ఉందని తెలుసుకొని రాజ్ వెళ్లి ఆయింట్ మెంట్ తీసుకొని వచ్చి కావ్య కాలు పట్టుకొని ఆయింట్ మెంట్ రాస్తుంటే కావ్య మురిసిపోతుంది. కాసేపటికి కావ్య కృష్ణుడు దగ్గరికి వెళ్లి నా భర్త నటనని ఆపి నిజంగా ప్రేమించేలా చెయ్ దేవుడా అని మొక్కుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

కొత్త కెప్టెన్ గా యావర్.. ఆటగాళ్ళ గెలుపు!

బిగ్ బాస్ హౌజ్ లో రోజుకో ట్విస్ట్ తో దూసుకెళ్తుంది. ఉల్టా పల్టా థీమ్ తో ఈ సీజన్ అన్ని సీజన్ల కంటే ఎక్కువ టీఆర్పీని సొంతం చేసుకుంటుంది. కారణం హౌజ్ లోకి కొత్తగా 2.0 గా వచ్చిన కంటెస్టెంట్సే కారణం. అంబటి అర్జున్, నయని పావని, పూజా మూర్తి, అశ్విని శ్రీ, భోలే శావలి ఈ అయిదుగురు కంటెస్టెంట్స్ హౌజ్ లోకి అడుగుపెట్టగా వీరికి పోటుగాళ్ళుగా, పాత కంటెస్టెంట్స్ కి ఆటగాళ్ళుగా విభజించాడు బిగ్ బాస్. అయితే గతవారం సీక్రెట్ రూమ్ కి పంపిన గౌతమ్ కృష్ణని  2.0 లో కలిపేశాడు బిగ్ బాస్. ఇక ఈ వారమంతా ఆటగాళ్ళు వర్సెస్ పోటుగాళ్ళ మధ్య పోటీ హోరాహోరీగా సాగింది. ఇక కొచెన్ లో ఉండే ప్రియాంక జైన్ కి కష్టంగా ఉందని ఏడ్చేసింది. టాస్క్ లు ఆడాక ఓపిక లేదని, మళ్ళీ వచ్చి పదిహేను మందికి అన్నం , కూర వండటం కష్టమని ప్రియాంక జైన్ అందరికి చెప్పుకుంటూ ఏడ్చేసింది.   స్ట్రాంగ్, ఫిట్, ఫాస్ట్, బెస్ట్ అంటూ సాగుతున్న టాస్క్ లలో నిన్నటివరకు ఆటగాళ్ళు, పోటుగాళ్ళు మధ్య సమానంగా ఉన్నారు. చివరిదైన ఎవరు బెస్ట్ అనే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇందులో ఆటగాళ్ళు గెలిచారు.  కాసేపటికి ఆటగాళ్ళ టీమ్ నుండి ఒకరు ఈ వారం కెప్టెన్ అవుతారని బిగ్ బాస్ ప్రకటించాడు. ఆటగాళ్ళందరికి తలో బెలూన్ ఇచ్చి, వీరిలో ఎవరికి పోటుగాళ్ళు సపోర్ట్ చేస్తున్నారో వారికి పిన్ ఇవ్వమని బిగ్ బాస్ చెప్పగా.. ఒక్కో బజర్ కి ఒక్కొక్కరుగా వచ్చి పిన్ ని ఇచ్చారు. ఇలా రౌండ్ ముగిసే సమయానికి చివరి ముగ్గురిలో అమర్ దీప్, టేస్టీ తేజ, యావర్ ఉన్నారు. ఇక అంబటి అర్జున్ వంతు రావడంతో.. అతను పిన్ తీసుకెళ్ళి టేస్టీ తేజకి ఇచ్చాడు. యావర్, అమర్ దీప్ లలో అమర్ కెప్టెన్సీకి అనర్హుడని, యావర్ అర్హుడని ఇచ్చాడు టేస్టీ తేజ. ఇక ఫైనల్ గా టేస్టీ తేజ, యావర్ ఇద్దరు ఉండగా.. నయని పావనికి అవకాశం వచ్చింది. తను ప్రిన్స్ యావర్ ని గెలిపించింది. దీంతో ఈ వారం హౌజ్ కెప్టెన్ గా ప్రిన్స్ యావర్ ఎన్నికయ్యాడు. పల్లవి  ప్రశాంత్ దగ్గరి కెప్టెన్‌ బ్యాడ్జ్ ని యావర్ కి ఇవ్వమన్నాడు బిగ్ బాస్. ఇలా ఈ వారం యావర్ రెండవ హౌజ్ కెప్టెన్ గా గెలిచాడు.  

అజాగ్రత్తగా ఉన్నావని స్వప్నని తిట్టిన దుగ్గిరాల ఫ్యామిలీ!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -226 లొ....అప్పు నిద్ర నుండి లేచి వచ్చి కాఫీ అడుగుతుంది. అన్నపూర్ణ కాఫీ తీసుకొని వస్తుంది. ఏంటి నువ్వు తెచ్చావ్ అమ్మ ఎక్కడ అని అప్పు అడుగుతుండగా.. అప్పుడే కనకం కృష్ణమూర్తి ఇద్దరు వస్తారు. ఎక్కడికి వెళ్లారని అప్పు అడిగిన.. కావ్య దగ్గరకి వెళ్లిన విషయం కనకం చెప్పదు. మరొక వైపు కావ్య గదిలోకి వస్తుంది. కాసేపటికి రాజ్ వస్తాడు. నువ్వు నిజంగా మొక్కు తీర్చుకోవడానికి వెళ్ళావా అని రాజ్ అడుగుతాడు. అంటే మీకు ఇంకా నమ్మకం రాలేదా అని కావ్య అంటుంది. ఏదయినా చెప్పి చేసే నువ్వు.. చెప్పకుండా వెళ్లినందుకు డౌట్ వచ్చిందని రాజ్ అంటాడు. కావ్య కావాలనే రాజ్ ని ఆటపట్టిస్తుంది. మళ్ళీ వెళ్తున్న అంటూ బట్టలు సర్దినట్లుగా చేసేసరికి.. రాజ్ నిజంగానే అనుకొని వద్దు, ఎక్కడికి వెళ్లకంటు రిక్వెస్ట్ చేస్తాడు. మరొకవైపు స్వప్న వాటర్ తాగుతుంటుంది. ఇందిరాదేవి స్వప్న కడుపు వంక చూస్తూ రుద్రాణి నీ కోడలు గురించి అలోచించావా అని రుద్రాణిని ఇందిరాదేవి అడుగుతుంది. దేని గురించి అడుగుతు‌న్నారని రుద్రాణి తెలియనట్టు అడుగుతుంది. స్వప్న కీ నాలుగు నెలలు పూర్తి అయ్యి అయిదు నెలలు వస్తుంది కదా శ్రీమంతం గురించి అని ఇందిరాదేవి అనగానే.. అలాంటివేం వద్దు. స్వప్న రాహుల్ ఇద్దరు ఏ పరిస్థితిలో పెళ్లి చేసుకున్నారో అందరికి తెలుసు కదా, పైగా స్వప్న పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ ఇప్పుడు శ్రీమంతం చేస్తే పరువు పోతుందని రుద్రాణి అంటుంది. ప్రతి ఆడపిల్లకి ఆ కోరిక ఉంటుంది కదా అని ఇందిరాదేవి అంటుంది. మరొక వైపు  స్వప్న కడుపు ఎలాగైనా పోగొట్టుకోవాలని అనుకుంటుంది. మరొక వైపు అప్పుకి కళ్యాణ్ ఫోన్ చేసి కలవాలని చెప్తాడు. దానికి అప్పు.. నేను రానని కోపంగా చెప్తుంది. మరొక వైపు రాజ్ తనని ప్రేమిస్తున్నట్లు నటించాడు అనే కోపంతో రాజ్ ని ఆటపట్టిసస్తుంది కావ్య. ఆ తర్వాత స్వప్న మెట్లపై నుండి పడిపోయి ప్రెగ్నెంట్ పోయిందని చెప్పొచ్చు అనుకొని మెట్లపై నుండి పడిపోతుంది. అప్పుడే కావ్య వచ్చి స్వప్నని పట్టుకుంటుంది. అందరు అంత అజాగ్రత్తగా ఉన్నావా అంటు స్వప్నని తిడుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

డూప్లికేట్ కమాండర్ ని పట్టుకున్నాడా.. ఇంట్లో వాళ్ళిద్దరి టెన్షన్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -287 లో.. భవాని కృష్ణ మాటలు గుర్తుకు చేసుకుంటుంది. కృష్ణ మాటలు చూస్తుంటే నన్ను నేను చూసుకుంటున్నట్లు ఉంది. ఎలాగైనా కృష్ణ ఆదర్శ్ ని తీసుకొని వస్తుందని భవాని అనుకుంటుంది. మరొకవైపు ఏసీపీ సర్ ఎక్కడికి వెళ్ళాడని ఆలోచిస్తుంటుంది కృష్ణ. అప్పుడే రేవతి వచ్చి.. ఇంకా రాలేదు. నువ్వు మురారి గురించి కంగారుపడకని రేవతి చెప్తుంది. నేను ఎలాగైన ఆదర్శ్ ని తీసుకొని వస్తానని భవాని అత్తయ్యకి మాటిచ్చాను కదా. అందుకే ఏసీపీ సర్ ఆదర్శ్ ని తీసుకొని రావడానికి వెళ్ళాడు కావచ్చని రేవతితో కృష్ణ చెప్తుంది. వాళ్ళ దగ్గరికి భవాని వచ్చి.. మురారి ఎక్కడ కన్పించడం లేదని అడుగుతుంది. ఆదర్శ్ కోసం వెళ్ళాడు కావచ్చని మేం అనుకుంటున్నామని కృష్ణ చెప్పాగానే.. భవాని హ్యాపీగా ఫీల్ అవుతుంది. మీ ఇద్దరునీ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. మీరు ఇద్దరు ఒకేలా ఆలోచిస్తారు. ఆదర్శ్ వచ్చాక ఇద్దరికి కలిపి రిసెప్షన్ చేస్తానని భవాని చెప్తుంది. మరొక వైపు మధు, అలేఖ్య ఇద్దరు ఎప్పటిలాగే పొట్లాడుకుంటారు. మరొకవైపు కృష్ణ తెల్లవారుజామున లేచి తులసి పూజ చేస్తుంది. అప్పుడే ముకుంద వచ్చి.. ఏం అప్లికేషన్ పెట్టుకున్నావంటు కృష్ణకి కోపం వచ్చేలా మాట్లాడుతుంది. కానీ కృష్ణ సైలెంట్ గా ముకుంద కీ కౌంటర్ వేసి వెళ్తుంది. మరొకవైపు కృష్ణ  ఆదర్శ్ ని తీసుకొని వస్తానని అంత కాన్ ఫిడెంట్ గా చెప్తుందంటే అసలేం చేస్తుందని అలేఖ్యని‌ ముకుంద అడుగుతుంది. నాకేం తెలియదని అలేఖ్య చెప్తుంది.  మరొక వైపు ముకుంద ఫోన్ కి గీతిక ఫోన్ చేస్తుంది. ముకుంద ఫోన్ కృష్ణ లిఫ్ట్ చేస్తుంది. గీతిక డూప్లికేట్ కమాండర్ గురించి మాట్లాడుతుంది. ఆ తర్వాత నేను అనుకున్నదే నిజమని కృష్ణ అనుకుంటుంది. ఈ విషయం మధుకి చెప్తుంది కృష్ణ. గీతిక ఏం మాట్లాడిందో చెప్తుంది.. ఆ డూప్లికేట్ కమాండర్ ని వెతికి తీసుకొని రమ్మని మధుని పంపిస్తుంది కృష్ణ. ఆ తర్వాత ముకుంద దగ్గరికి అలేఖ్య వచ్చి.. నీ మీద ఎంక్వయిరీ చేస్తున్నట్లు తెలుస్తుందని అలేఖ్య చెప్పగానే.. ముకుంద టెన్షన్ పడుతుంది. మధుకి అతను దొరికాడా లేదా అని కృష్ణ టెన్షన్ పడుతుంది. ఆ తర్వాత ఏం  జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

కొత్త ఎండీగా ఊహించని వ్యక్తి.. షాక్ లో ఆ ఇద్దరు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -893 లో.. రిషి ఎండీ సీట్ గురించి ఏం నిర్ణయం తీసుకున్నాడోనని శైలేంద్ర దేవాయని ఇద్దరు అనుకుంటారు. అప్పుడే రిషిపై నుండి కిందకి వస్తాడు. రిషి ఎండీ పదవి గురించి ఏం ఆలోచించావని దేవయాని అడుగుతుంది. నేను ఎండీ కుర్చీలో కూర్చోనని నేను చెప్పాను కదా అని రిషి అంటాడు. ఆ తర్వాత ఇంక ఎన్ని రోజులు ఎండీ చైర్ ఖాళీగా ఉంటుంది. జగతి ఉన్నప్పుడే కాలేజీ వెనుకబడింది. ఇంకా ఇప్పుడు ఎవరు లేకుంటే కాలేజీ పరిస్థితి ఏంటి? ఇప్పటికైన నిర్ణయం తీసుకో నాకు అయితే నువ్వు ఎండీగా ఉంటేనే బాగుంటుందనిపిస్తుందని దేవయాని అంటుంది. అవును ఎండీగా మన కుటుంబం నుండి ఉండాలి. ఆ నిర్ణయం బోర్డు మెంబెర్స్ కి వదిలెయ్యకు రిషి అని శైలేంద్ర చెప్తాడు. నువ్వు కూర్చో అన్నయ్య అంటే నాకు ఇష్టం లేకున్నా నువ్వు కూర్చోమంటే కూర్చుంటాను అని శైలేంద్ర అంటాడు. పక్కన ఉన్న దేవయాని నటిస్తుంది. నువ్వు ఎందుకు? రిషినే ఉంటే బాగుంటుందని కావాలనే దేవయాని అంటుంది. మన కుటుంబంలో నుండి ఒకరికి కూర్చోపెడతానని రిషి అంటాడు. అప్పుడే వసుధార వచ్చి రిషిని తీసుకొని వెళ్తుంది. మళ్ళీ కిందకి వచ్చిన వసుధార.. దేవయాని, శైలేంద్ర ఇద్దరికి కాలేజీని మీరు సొంతం చేసుకోలేరని సవాల్ విసురుతుంది. కాలేజీలో ఎండీగా రేపు చైర్ లో కూర్చునేది నేనే అని శైలేంద్ర కలలు కంటడు. మరుసటి రోజు ఉదయం అందరూ కాలేజీకీ వెళ్తారు. చాలా రోజుల తర్వాత రిషి కాలేజీలో అడుగుపెడుతాడు. రిషికి స్టూడెంట్స్ గ్రాంఢ్ గా వెల్ కమ్ చెప్తారు. అప్పుడే మినిస్టర్ కూడా వస్తాడు. అందరూ కలిసి జగతి ఫోటోకీ నమస్కారం చేస్తారు. ఆ తర్వాత మీటింగ్ లో కూర్చొని ఉంటారు. కాలేజీ ఎండీ గురించి ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఇందులో వాళ్ళ పేరు ఉంది ఇప్పుడు రివీల్ చేస్తున్నానని మినిస్టర్ చెప్తాడు. అందులో నా పేరు ఉంటుందని శైలేంద్ర అనుకోని సంబరపడతాడు. ఈ కాలేజీ కొత్త ఎండీ వసుధార అని మినిస్టర్ చెప్పగానే.. శైలేంద్ర దేవాయాని ఇద్దరు షాక్ అవుతారు. కాసేపటికి నా నిర్ణయం మీకు సరైనదని అనుకుంటున్నారని భావిస్తున్నానని రిషి అంటాడు. వసుధారకి ఎండీగా ఉండే అర్హతలు ఉన్నాయని రిషి అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.