బిగ్ బాస్ సీజన్-7 లో మొదటి కెప్టెన్ గా పల్లవి ప్రశాంత్!

  బిగ్ బాస్ హౌజ్ లో సరికొత్తగా రూల్స్, టాస్క్ లు వచ్చాయని తెలిసిన విషయమే. అయితే ఉల్టా పుల్టా థీమ్ జనాలని ఆకర్షిస్తున్న ఈ సీజన్.. భారీ హిట్ గా నిలుస్తుంది.  హౌజ్ లోకి మొత్తం పద్నాలుగు మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇవ్వగా అందులో ఇప్పటికే కిరణ్ రాథోడ్, షకీల, దామిణి, రతిక.. నలుగురు ఎలిమినేట్ అవ్వగా పది మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. అయిదవ వారం టాస్క్ ల క్రేజ్ గా సాగింది.  సెంచురీ మ్యాట్రిసెస్ టాస్క్ లో ప్రియాంక జైన్ గెలిచి సెంచురీ మ్యాట్రిసెస్ ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత కెప్టెన్సీ టాస్క్ కొనసాగింది. నిన్న మొన్నటిదాకా సాగిన చిట్టీ ఆయిరే టాస్క్ లో టేస్టీ తేజ, గౌతమ్ కృష్ణ, ఆట సందీప్, పల్లవి ప్రశాంత్ తర్వాతి లెవెల్ కి వెళ్ళారు. ఆ తర్వాత రంగు పడుద్ది టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. గార్డెన్ ఏరియాలో ఒక సర్కిల్ గీసాడు. ఇక ఒక్కో కంటెస్టెంట్స్ కి ఒక్కో కలర్ ఇచ్చాడు. తెల్ల టీ షర్ట్ వేసుకున్న కంటెస్టెంట్స్ ఆ రంగుని ఒకరు మరొకరి టీ షర్ట్ మీద పూయాలి. ఈ టాస్క్ కు సంచాలకురాలిగా ప్రియాంక జైన్ వ్యవహరించింది. రంగు పడుద్ది టాస్క్ లో మూడు లెవెల్స్ ఉంటాయి. మెదటి లెవెల్ లో బజర్ వచ్చే టైమ్ కి ఎవరి టీ షర్ట్ మీద ఎక్కువ కలర్ ఉందో చూసి వాళ్ళు ఎలిమినేట్ అవుతారని బిగ్ బాస్ చెప్పగా మొదట ఆట సందీప్ ని అవుట్ అని ప్రియాంక జైన్ అనగా.. ఆట సందీప్ ఆర్గుమెంట్ తో అతడికి సపోర్ట్ చేస్తూ టేస్టీ తేజని ఎలిమినేట్ చేసింది ప్రియాంక జైన్. ఈ విషయంపై ప్రియాంక జైన్ కి నాగార్జున వార్నింగ్  ఇచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత బజర్ కు ఆట సందీప్ బయటకొచ్చాడు. ఇక ఫైనల్ లెవెల్ గౌతమ్ కృష్ణ, పల్లవి ప్రశాంత్ ల మధ్య జరిగింది. ఇందులో చివరి వరకు గౌతమ్ కృష్ణతో  ప్రశాంత్ పోరాడాడు. ఇందులో పల్లవి ప్రశాంత్ విజేత అని ప్రియాంక జైన్ ప్రకటించింది. ఆ తర్వాత బిగ్ బాస్ పల్లవి ప్రశాంత్ కి కెప్టెన్ బ్యాడ్జ్ పంపించి, ఆట సందీప్ చేతుల మీదుగా ఇప్పించాడు. ఆ తర్వాత తన గురువు శివాజీ కాళ్ళ మీద పడ్డాడు. నువ్వు గెలుస్తావని నాకు తెలుసురా, నా లెటర్ సాక్రిఫైజ్ చేసింది నువ్వు గెలుస్తావనే అని పల్లవి ప్రశాంత్ తో శివాజీ అన్నాడు.    

మానస్ గురించి దీపిక కామెంట్స్.. డైరెక్టరే తన ఎనర్జీ అంట!

దీపిక రంగరాజు ఈ పేరు తెలియకపోవచ్చు కానీ బ్రహ్మముడి కావ్య అని అంటే అందరు ఇట్టే గుర్తుపడతారు. బ్రహ్మముడి సీరియల్ తో తెలుగు రాష్ట్రాలలో ప్రతీ ఇంట్లో ఒక అమ్మాయిలా మారిపోయింది దీపిక‌ అలియాస్ కావ్య. తెలుగు అమ్మాయి కాకపోయిన తెలుగుతనం ఉట్టి పడేలా ఉంటుంది కావ్య. 'బ్రహ్మముడి' లో పాపులర్ ఉన్న పాత్ర కావ్యది. తన రీల్ లైఫ్ లో ఎలా పద్దతి గా ఉంటుందో రియల్ లైఫ్ లో కూడా అంతే పద్ధతిగా అణుకువగా ఉంటుంది దీపిక. బ్రహ్మముడి సీరియల్ లో కావ్య -రాజ్ ల జంట బుల్లితెరపై సంచలనం సృష్టిస్తుంది. కావ్య ఒకవైపు అత్తింటి గౌరవం, మరొకవైపు పుట్టింటి బరువు, భాద్యతలు చేపడుతూ అందరికి చేరువవుతుంది. మొదట రాజ్ కి ఇష్టం లేకుండా కావ్యని పెళ్ళి చేసుకుంటాడు రాజ్. అయితే ఇప్పుడిప్పుడే కావ్యకి దగ్గరవుతున్నాడు. అయితే తాజాగా జరుగుతున్న ఎపిసోడ్ లలో అనామికకి లవ్ ప్రపోక్ చేయమని కళ్యాణ్ కి చెప్పి వాళ్ళిద్దరిని ఒక్కటి చేసింది కావ్య. వినాయకుని విగ్రహాలు తీసుకొచ్చి కృష్ణమూర్తి పరువు కాపాడాడు రాజ్. ఇక అప్పు తన మనసులో కళ్యాణ్ మీద ఉన్న ఫీలింగ్స్ ని బయటపెట్టట్లేదు. ఇలాంటి టైమ్ లో స్వప్న ప్రెగ్నెంట్ అని మర్చిపోయి డ్యాన్స్ చేస్తే తనకి బుద్ది చెప్పింది కావ్య. అయితే రాజ్ రాసిన చీటీని చదివిన కావ్య ఆశ్చర్యపోతుంది. ఇలాంటి ట్విస్ట్ లతో ఈ సీరియల్ ఫుల్ ఎంగేజ్ అవుతుంది. అయితే ఇందులో కావ్య ప్రధాన పాత్రలో దీపిక ఆకట్టుకుంటుంది. కొన్ని నెలల క్రితం యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసింది దీపిక అలియాస్ కావ్య. రోజుకొక సర్ ప్రైజ్ చేస్తూ ఇన్ స్టాగ్రామ్ లో‌ కూడా యాక్టివ్ గా ఉంటుంది. అయితే తాజాగా తను 'ఆస్క్ మి సంథింగ్' స్టార్ట్ చేసింది. ఇందులో నెటిజన్లు అడిగే ప్రశ్నలకి సమాధానాలు చెప్పింది దీపిక. మీరు పుట్టింది ఎక్కడ అని ఒకరు అడుగగా.. చెన్నైలోని టీనగర్ అని చెప్పింది దీపిక. మీరు తమిళ్ అయిన తెలుగు చక్కగా మాట్లాడుతున్నారు ఎలా అని ఒకరు అడుగగా.. నా బ్లడ్ లోనే తెలుగు ఉంది అని దీపిక అంది. మీ ఫేవరెట్ నటీనటులు ఎవరని అడుగగా.. బ్రహ్మముడి సీరియల్ లోని కావ్య-రాజ్ అని దీపిక అంది. మానస్ గురించి చెప్పండి అనగా.. మానస్ గారు జెమ్, ఇంటలిజెంట్ అండ్ వెరీ సపోర్టివ్ అని అంది. డైరెక్టర్ కుమార్ పంతం గురించి చెప్పండి అని ఒకరు అడుగగా.. అతనే నా బూస్ట్. పొద్దున్నే షూట్ కి వచ్చిననుండి అయిపోయేవరకు వెరీ యాక్టివ్, పుల్ ఎనర్జీ ఇస్తాడు. ఇంక చాలా వరకు అందరికి సపోర్ట్ గా ఉంటాడు. అతను ఒక పెద్ద పవర్ స్టేషన్ అని దీపిక అంది. ఇలా  దీపిక తన ఇన్ స్టాగ్రామ్ లో సరదాగా కొన్ని విషయాలని పంచుకుంది.  

బ్యాక్ లుక్ లో బంపర్ ఆఫర్ ఇచ్చిన దీప్తి!

దీప్తి సునైనా షార్ట్ ఫిల్మ్స్ మ్యూజిక్ ఆల్బమ్ లతో ఎప్పుడు బిజీ గా ఉండే దీప్తి అందరికి సుపరిచితమే. ఎప్పుడు సోషల్ మీడియాలో తన అప్డేట్ ని ప్రేక్షకులకు ఇస్తూ ఉంటుంది ఈ బ్యూటీ.. షార్ట్ ఫిల్మ్స్ ద్వారా ఫేమ్ లోకి వచ్చింది. ఆ తర్వాత బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ అమ్మడు. దీప్తి సునైన షణ్ముఖ్ జస్వంత్ కలిసి షార్ట్ ఫిల్మ్స్ చేసి సన్నిహితంగా మారి లవ్ లో పడిపోయారు. ఎటు చూసిన సోషల్ మీడియాలో షణ్ముఖ్, దీప్తి సునైనల జంటనే కన్పిస్తుంది.  షణ్ముఖ్ జస్వంత్ బిగ్ బాస్ లో ఉన్నప్పుడు తనకి దీప్తి సపోర్ట్ బాగా ఉండేది. బిగ్ బాస్ నుండి బయటకు వచ్చాక షన్ను, దీప్తి సునైనా ఇద్దరు విడిపోయారు. వాళ్ళు విడిపోవడానికి కారణం బిగ్ బాస్ హౌస్‌లో షణ్ముఖ్ ఉన్నప్పుడు.. సిరితో క్లోజ్ గా ఉండడం వల్లనే.. వాళ్ళిద్దరికి బ్రేకప్ అయ్యిందని అప్పట్లో ఆ న్యూస్ వైరల్ గా మారిన విషయం అందరికి తెలిసిందే. షణ్ముఖ్, దీప్తి సునైన ఇద్దరు విడిపోయి.. ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు. అయితే రెండు మూడు సందర్బాలలో ఈవెంట్స్ లో ఎదురుపడినా పరిచయం లేనట్లుగా ఉన్నారు. కాగా ఇద్దరు ఒకరి గురించి మరొకరు ఇండైరెక్ట్ గా తమ ఇన్ స్టాగ్రామ్ పేజీలలో మాట్లాడుకుంటున్నారు. తాజాగా దీప్తి ఇన్ స్టాగ్రామ్ ని షేక్ చేసే ఫోటోలని షేర్ చేసింది. ఇప్పటి దాకా లిమిట్ దాటని దీప్తి.. ఇప్పుడు రెచ్చిపోయి ట్యాలెంట్ చూపిస్తోంది. రెడ్ సారి ఒక హాట్ అండ్ బోల్డ్ ఫోటో షూట్ చేసి,  అ ఫోటోలని తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది దీప్తి. మొత్తంగా పది ఫోటోలని పోస్ట్ చేయగా మొదటి ఫోటోలో తన కంప్లోట్ బ్యాక్ చూపిస్తూ, ఒక లెగ్ ని పైకి లేపి అందాలని ఆరబోసింది ఈ బ్యూటీ. ఈ ఫోటోలని చూసిన నెటిజన్లు నెగెటివ్ కామెంట్లతో రెచ్చిపోతున్నారు. అయితే దీప్తి మాత్రం ఈ పోస్ట్ కి వచ్చే కామెంట్లకి రిప్లై ఇవ్వట్లేదు. మరి తను చూసిందా లేదా తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. అయితే ఇప్పుడు ఈ పోస్ట్ దీనికి వస్తున్న కామెంట్లు తెగ వైరల్ అవుతున్నాయి.  

ఛాలెంజ్ విసిరిన కృష్ణ.‌. ముకుంద గర్వం దించనుందా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -281 లో.. ముకుంద ఎక్కడికి వెళ్ళిందని అలేఖ్యని అడుగుతుంది కృష్ణ. నాకేం తెలియదని అలేఖ్య చెప్పగానే.. మధుని కృష్ణ పక్కకి తీసుకొని వెళ్తుంది. ఏసీపీ సర్ తో ముకుంద వెళ్లే ఛాన్స్ ఉందా అని కృష్ణ అడుగుతుంది. అదేం ఉండదని మధు అంటాడు. మరొకవైపు మురారి కోసం భవాని ఎదరుచూస్తుంటుంది. అప్పుడే మురారి, ముకుంద కలిసి వస్తారు.. ఆదర్శ్ గురించి ఆఫీసర్ ఏమన్నాడని భవాని ఆత్రుతగా అడుగుతుంది. ఆదర్శ్ వాళ్ళతో మాట్లాడుతున్నాడంటా, ఎలాగైనా ఆదర్శ్ ని ఇంటికి తీసుకొని వస్తానని మాట ఇచ్చాడని మురారి చెప్పగానే.. ఇంట్లో అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక అందరు పూజకి ఏర్పాట్లు చెయ్యండని భవాని చెప్తుంది.. కృష్ణ మాత్రం మురారి తో మాట్లాడకుండా వెళ్ళిపోతుంది. ముకుందని నీతో పాటు తీసుకొని వెళ్ళావా అని మధు అడుగుతాడు. తీసుకొని వెళ్ళాల్సి వచ్చిందని మురారి అంటాడు.. ఆ తర్వాత వినాయకుడిని తీసుకొని ప్రభాకర్ వస్తాడు. అందరు బయటకు వెళ్తారు. ఇంతమందిమి పండుగ జరుపుకుంటున్నాం. మీ నాన్నని కూడా రమ్మని పిలువచ్చు కదా అని ముకుందతో ప్రభాకర్ అంటాడు. నేను పిలవను, అయిన మా నాన్న రాడని ముకుంద చెప్తుంది. వస్తాడు.. నీ నోటితోనే నువ్వు నాన్న రా అని పిలిచేలా చేస్తానని ముకుందతో కృష్ణ ఛాలెంజ్ చేస్తుంది. అది చూద్దామని ముకుంద అంటుంది.. ఆ తర్వాత పూజ కృష్ణ చేతుల మీదుగా జరుగుతుంది. నాతో ఎందుకు మాట్లాడడం లేదు కృష్ణ, ముకుందతో వెళ్లినందుక అని మురారి అంటాడు. మీ సంగతి తర్వాత చెప్తానని కృష్ణ అంటుంది. ఆ తర్వాత పూజ పూర్తవుతుంది. కాసేపటికి అందరు చీటీల ఆట ఆడుతారు. చీటీలలో తమ కోరికలకి రాస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

వెన్నులో వణుకుపుట్టించిన రిషి మాటలు.. దేవయాని, శైలేంద్రలకి టెన్షన్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -887 లో.. దేవయాని శైలేంద్ర ఇద్దరు జగతిపై చేసిన కుట్ర గురించి మాట్లాడుకుంటారు. ఇక నుండి మనం జాగ్రత్తగా ఉండాలి. జగతిని మనమే చంపేశామని ఎట్టి పరిస్థితుల్లో రిషికి తెలియకుడదు. మన గురించి మొత్తం తెలిసిన జగతి లేదు కానీ మనం చేసే కుట్రల గురించి తెలిసిన వసుధార ఎప్పుడు రిషి పక్కనే ఉంటుందని శైలేంద్రతో దేవయాని అంటుంది. ఆ తర్వాత అవును జాగ్రత్తగా ఉండాలి. వసుధారని కూడా అడ్డు తొలగించాలని శైలేంద్ర అనగానే.. ఎవరిని అడ్డు తొలగిస్తారంటూ వసుధార వస్తుంది. జగతి మేడమ్ ఇంటికి వచ్చాక ఏం కాదు. ఇక బతుకుతుందని అనుకున్నాను. మీరే ఏదో చేసారని అనుమానంగా ఉంది కానీ జగతి మేడమ్ చావుకి మీరే కారణమని తెలిస్తే మాత్రం రిషి సర్ మిమ్మల్ని వదిలిపెట్టడు. రిషి సర్ పై నిందని తొలగించి మళ్ళీ కాలేజీకి పంపిస్తానని మేడమ్ కి మాటిచ్చాను. అది నెరవేరుస్తానంటూ దేవయాని శైలేంద్ర ఇద్దరికి వసుధార మాస్ వార్నింగ్ ఇస్తుంది. ఆ తర్వాత కాసేపటికి రిషి వచ్చి.. ఏం మాట్లాడుకుంటున్నారని అడుగుతాడు. ఇంటి గురించి అని  దేవయాని, కాలేజీ గురించి అంటూ శైలేంద్ర కన్ఫ్యూషన్ అవుతుంటే.. నువ్వు చెప్పు వసుధార అని రిషి అడుగుతాడు. జగతి మేడమ్ గురించి అని వసుధార చెప్తుంది. కాసేపటికి శైలేంద్ర, దేవయాని వెళ్తారు. ఇద్దరు వెళ్లిపోయాక.. జగతిని  రిషి గుర్తుచేసుకొని బాధపడుతుంటే వసుధార దైర్యం చెప్తుంది. మరుసటి రోజు ఉదయం అందరు హాల్లో కూర్చొని ఉంటారు. మహేంద్రని పిలువమని ధరణితో ఫణింద్ర చెప్తాడు. వద్దు, డాడ్ ని ఒంటరిగా వదిలెయ్యండని రిషి అంటాడు. ఆ తర్వాత జగతిని గుర్తుకుచేసుకుంటు రిషి ఎమోషనల్ అవుతాడు. మా అమ్మ మనతో లేకుండా చేసిన వారెవరో నాకు తెలియాలి. నన్ను చంపాలని అనుకున్న వారు ఎవరు? నా ప్రాణలకి తన ప్రాణాలు అడ్డు పెట్టింది నా తల్లి అని రిషి ఎమోషనల్ అవుతాడు. అమ్మకి కొడుకుగా మాట ఇస్తున్న నిన్ను మాకు కాకుండా చేసినవారిని వదిలిపెట్టను. నీకు మాట ఇస్తున్నాను. ఇప్పుడు నాకు రెండు బాధ్యతలు ఒకటి మా డాడ్ ని చూసుకోవడం, ఇంకొకటి మా అమ్మని మాకు కాకుండ చేసిన వారిని పట్టుకోవడమని రిషి అంటుంటే.. దేవయాని, శైలేంద్ర లకి టెన్షన్ మొదలవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

స్వప్న ప్రెగ్నెంట్ కాదన్న విషయం తెలిసిపోతుందా.. వాళ్ళిద్దరిని చూసి అప్పు జెలస్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -220 లో... రాజ్ చేసిన సహాయానికి కృష్ణమూర్తి థాంక్స్ చెప్తాడు. ఆ తర్వాత ఇక అసలైన ఎంటర్టైన్మెంట్ మొదలు అయిందంటూ కళ్యాణ్ చెప్తాడు.. నేను అప్పు కలిసి ఇప్పుడు డాన్స్ చెయ్యబోతున్నామని చెప్పి, రా అప్పు అంటూ అప్పుని కళ్యాణ్ స్టేజ్ మీదకి పిలుస్తాడు. దాంతో అప్పు వెళ్తుంది. అప్పు వెళ్లడంతో అనామిక జెలస్ గా ఫీల్ అవుతుంది. నేను చేస్తాను అప్పు, నువ్వు వెళ్ళు అని అమామిక అనగానే, లేదు ఇద్దరు చెయ్యండని కళ్యాణ్ అంటాడు. లేదు మీరే చెయ్యండి మీ జంట బాగుంది అంటూ అప్పు కిందకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత కళ్యాణ్, అనామిక‌ ఇద్దరు కలిసి డాన్స్ చేస్తారు. అలా ఇంట్లో ఉన్న అందరు డాన్స్ లు చేస్తారు. ఇక అందరూ కలిసి డాన్స్ చేస్తుండగా, స్వప్న తను ప్రెగ్నెంట్ అన్న విషయం మర్చిపోయి డాన్స్ చేస్తుంటే.. స్వప్న పెట్టుకున్న బెల్ట్ కిందపడిపోతుంది. అది స్వప్న చూసుకోదు. కానీ కావ్య కిందపడిపోయి ఉన్న బెల్ట్ తీసుకొని స్వప్నని లాక్కొని గదిలోకి తీసుకొని వెళ్తుంది. ఏంటి ఇలా లాక్కొని వచ్చావ్ అంటూ కావ్యపై స్వప్న సీరియస్ అవుతుంది. నువ్వు ప్రెగ్నెంట్ అంటూ నాటకం ఆడుతున్న విషయం మర్చిపోయావా అని బెల్ట్ చూపిస్తుంది . ఇంకెన్ని రోజులు ఇంట్లో వాళ్లని ఇలా మోసం చేస్తావ్. నువ్వు చెప్పకుండా నన్ను చెప్పనివ్వుకుండా, నన్ను కూడా ఈ మోసం లో భాగం చేస్తున్నావని కావ్య అంటుంది. నువ్వు ఈ మోసం లో భాగం ఎప్పుడో అయిపోయావని స్వప్న అనగానే.. కావ్య షాక్ అవుతుంది. అవును పెళ్లికి ముందు కూడా నీకు నేను ప్రెగ్నెంట్ కాదన్న విషయం తెలుసు కానీ నువ్వు ఇంట్లో వాళ్లకి చెప్పలేదు కదా అని కావ్యదే తప్పు అన్నట్లుగా స్వప్న మాట్లాడుతుంది. ఆ తర్వాత ఇప్పుడు అందరికి వెళ్లి నిజం చెప్తానని కావ్య అనగానే.. వద్దు నాకు కొంచెం టైం ఇవ్వు, నేనే ఈ సమస్యని పరిష్కారిస్తానని స్వప్న అడుగుతుంది. సరే ఈ ఒక్కసారి వదిలిపెడుతున్నాను. నువ్వే అందరికి నిజం చెప్పాలని కావ్య చెప్పి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఈ కడుపుతోనే ఈ ప్రాబ్లమ్ అబార్షన్ అయిందని అందరిని నమ్మించాలని స్వప్న అనుకుంటుంది. ఆ తర్వాత అందరూ భోజనం చేస్తుంటారు. అనామిక, కళ్యాణ్  ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటారు.. అప్పు ఎక్కడ కన్పించడం లేదు. నేను వెళ్లి తీసుకొని వస్తానని కనకం వెళ్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

తిరుమలలో సుమ, రాజీవ్...

బుల్లితెర మీద ఫస్ట్ జనరేషన్ యాంకర్స్ లో ఇప్పటికీ ఎప్పటికీ ఎవర్ గ్రీన్ హోస్ట్ సుమ అన్న విషయం మనకు తెలుసు. యాంకర్ గా ఇండస్ట్రీలో ఆమెకు ఎంతో గుర్తింపు కూడా ఉంది. హీరోలు ఆమె డేట్స్ ఇచ్చాకే మూవీ ప్రొమోషన్స్ స్టార్ట్ చేసుకుంటారు. సొంతంగా యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తూ, మూవీ ఈవెంట్స్ కి, బుల్లి తెర షోస్ కి హోస్ట్ గా, ఫారెన్ లో ఏమన్నా షోస్ జరిగిన వాటికి అటెండ్ అవుతూ ఆమె  కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉంటారు. అంత బిజీగా ఉండే సుమ తన భర్త రాజీవ్ తో కలిసి రీసెంట్ గా తిరుమల వెళ్లారు.  ఈమె తాజాగా తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. ఇక ఈ పిక్స్ ని తన ఇంస్టాగ్రామ్  తిరుమల ఘాట్ రోడ్ లో కారు పక్కకు ఆపి తిరుమల అందాలను వీక్షిస్తూ ఉన్నటువంటి ఫోటోలను ఇన్స్టాగ్రామ్  లో  షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ఫోటోలలో రాజీవ్ ను చూస్తే వెంకటేశ్వర స్వామి మాలలో ఉన్న విషయం తెలుస్తోంది.  రాజీవ్ కనకాల కూడా ఇప్పుడు కొన్ని మూవీస్ లో నెగటివ్ రోల్స్ లో నటిస్తూ కెరీర్ పరంగా కొంత బిజీగానే ఉన్నారు. రీసెంట్ గా పెదకాపు మూవీ  ద్వారా ఆడియన్స్ ముందుకు వచ్చారు ఈయన. ఇండస్ట్రీలో  సుమ, రాజీవ్ ఇద్దరూ పోటాపోటీగా సంపాదిస్తున్నారని చెప్పొచ్చు.   హీరోయిన్ కావాలనుకున్న సుమ అందులో సక్సెస్ కాలేకపోయారు దాంతో బుల్లితెరకె అంకితమయ్యారు అలాగే హోస్టింగ్ క్వీన్ గా పేరు తెచ్చుకున్నారు. ఇక వీళ్ళ అబ్బాయి రోషన్ త్వరలోనే హీరోగా వెండి తెరపై సందడి చేయడానికి సిద్దమవుతున్నాడు. ఇండస్ట్రీలో సింగర్ సునీత, హోస్ట్ సుమ ఇద్దరూ మంచి బెస్ట్ ఫ్రెండ్స్.. సునీతో కొడుకు ఆల్రెడీ మూవీస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక సుమ కొడుకు వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నాడు.  

రష్మీ కన్నీటి వీడ్కోలు... కారణం వాళ్లేనా?

స్మాల్ స్క్రీన్ మీద జబర్దస్త్ కి, ఎక్స్ట్రా జబర్దస్త్ కి ఎంత పేరుందో అందరికీ తెలుసు. ఇక ఈ షోలో కనిపించే కమెడియన్స్ కి కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. వాళ్లకు కూడా ఫాన్స్ ఉన్నారు. ఒక విధంగా చెప్పాలంటే హీరోస్ కంటే వాళ్ళకే ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఫ్యాన్ పేజెస్ కూడా ఉన్నాయి.  ఐతే ఇప్పటికే చాలామంది యాంకర్స్ జడ్జెస్ ఈ షోస్ నుంచి తప్పుకున్నారు. ఇకపోతే   శుక్రవారం ఎక్స్ ట్రా జబర్దస్త్  కార్యక్రమానికి యాంకర్ రష్మీ హోస్ట్ గా చేస్తోంది. ఐతే ఈ షో హోస్ట్ గా  రష్మీ వెళ్ళిపోతున్నారంటూ ఒక న్యూస్  సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఐతే ఆమె ఎందుకు వెళ్ళిపోవాలి అనుకుంటున్నారు అనే విషయం మీద నెటిజన్స్ ఆరా తీస్తున్నారు.  ఈ షోకి కాస్త రేటింగ్ తగ్గేసరికి మల్లెమాల యాజమాన్యం  రెమ్యూనరేషన్ విషయంలో కోతలు పెట్టేసరికి   ఈ కార్యక్రమం నుంచి బయటకు రావాలని రష్మీ డిసైడ్ అయ్యారని సమాచారం. తనకు ఎంతో మంచి పేరు తీసుకు వచ్చిన ఈ షో నుంచి ఇలా వెళ్ళిపోవడం తనకు ఏ మాత్రం ఇష్టం లేకపోయినప్పటికీ తప్పనిసరి పరిస్థితిలో వెళ్ళిపోతుందట. ఈ షో ద్వారానే కాకుండ తాను నటించిన మూవీస్ ద్వారా  కూడా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రష్మీ హోస్ట్ గా వేరే  చానల్స్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యారంటూ ఒక టాక్ వినిపిస్తోంది.   ఆల్రెడీ అనసూయ ఇప్పటికే స్మాల్ స్క్రీన్ కి బైబై చెప్పేసి బిగ్ స్క్రీన్ మీద ఆఫర్స్ మీద ఆఫర్స్ అందుకుంటోంది. పేరుకు పేరు, డబ్బుకు డబ్బు. మరి రష్మీ కూడా అనసూయ ట్రెండ్ ఫాలో అవుతున్నట్టే కనిపిస్తోంది..ఎందుకంటే అదే షో, అదే కామెడీ అంతా అదే అనేసరికి ఆడియన్స్ లో కూడా ఒక రకమైన మొనాటనీ వచ్చేస్తుంది. కాబట్టి రష్మీ కూడా తెలివిగా ఆలోచించి బిగ్ స్క్రీన్ మీద, వేరే ఛానెల్స్ లోకి వెళ్ళడానికి ట్రై చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఆల్రెడీ బలగం వేణు, సుడిగాలి సుధీర్, గెటప్ శీను ఇలాంటి వాళ్లంతా జబర్దస్త్ తో పాటుగా మిగతా చానెల్స్ లోను, మూవీస్ లోనూ మంచి పేరు తెచ్చుకున్న విషయం తెలిసింది.

మోస్ట్ ఎమోషనల్ గా సాగిన చిట్టీ ఆయిరే టాస్క్!

బిగ్ బాస్ సీజన్-7 లో కంటెస్టెంట్స్ ల పర్ఫామెన్స్ రోజు రోజుకి ఆసక్తిని రేకెత్తిస్తుంది. ప్రతీ మనిషిలో ఒక ఎమోషన్ ఉంటుందంటూ ప్రతీ కంటెస్టెంట్ కి గతంలో ఒక బలం, బలహీనత ఉంటుందంటూ గుర్తుచేశాడు బిగ్ బాస్. గురువారం నాటి ఎపిసోడ్ లో.. మొదటగా అందరు గురువులుగా మారి యావర్ కి అయిదు తెలుగు పదాలని నేర్పించాలని బిగ్ బాస్ ఒక టాస్క్ చెప్పాడు. ఈ టాస్క్ లో యావర్ ఇంగ్లీష్ లో మాట్లాడితే అతని పార్టనర్ టేస్టీ తేజకి గుంజిళ్ళు తీయాలనే రూల్ చెప్పాడు బిగ్ బాస్. అందులో ఒక్కోక్కరు ఒక్కోలా కొన్ని పదాలని యావర్ కి నేర్పించారు. అక్కడ బిగ్ బాస్ చూసే ప్రేక్షకులకు కాస్త ఎంటర్టైన్మెంట్ దొరికింది‌. ఇక ఆ తర్వాత 'బుజ్జిగాడు' సినిమాలోని 'చిట్టీ ఆయిరే ' పాటని ప్లే చేశాడు బిగ్ బాస్. అదే పాటతో లింక్ చేస్తూ కంటెస్టెంట్స్ కి టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇందులో రూల్ ఏంటంటే.. ఇప్పుడు కంటెండర్ రేస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి వారి ఇంటి సభ్యుల నుండి లెటర్స్ వచ్చాయి. జోడీలోని ఏ ఒక్కరు డ్రాప్ అవుతారో, ఎవరు ముందుకెళ్తారో డిసైడ్ చేసుకోవాలని బిగ్ బాస్ చెప్పాడు. అయితే ఈ టాస్క్ లో ఎవరైతే కాంప్రమైజ్ అయి లెటర్ చదవొద్దని అనుకుంటారో వాళ్ళు గేమ్ నుండి అవుట్ అవుతారు. లెటర్ తీసుకొని చదివిన వాళ్ళు కెప్టెన్సీ కంటెండర్ తర్వాతి పోటీ లో ఉంటారని బాగ్ బాస్ చెప్పాడు. ఇక ఈ టాస్క్ లో భాగంగా మొదటగా గౌతమ్ కృష్ణ-శుభశ్రీ యాక్టివిటీ ఏరియాకి వెళ్ళారు. అక్కడ ఇద్దరికి చెరొక లెటర్ ఉంది. ఇక ఇద్దరు డిసైడ్ అయి.. శుభశ్రీ కాంప్రమైజ్ అయి తన లెటర్ ని మిషన్ లో వేసి, కెప్టెన్సీ రేస్ నుండి తప్పుకుంటుంది‌. అయితే గౌతమ్ తన స్వార్థం కోసం శుభశ్రీని డ్రాప్ అవ్వమన్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. ఇక ఆ తర్వాత వచ్చిన టేస్టీ తేజ- ప్రిన్స్ యావర్ లలో ఎవరో ఒకరు ముందుకు వెళ్దామని అనుకునే భాగంలో.‌. యావర్ ఎమోషనల్ అవుతాడు. " వేరే వాళ్ళని బాధపెట్టి నేను గెలవాలని ఎప్పుడు అనుకోను. ఒకసారి నాకోసం ఎవరైనా ఏమైనా చేస్తే, చచ్చేదాకా వారిని గుర్తుంచుకుంటాను. నాకోసం మా అన్న లెటర్ పంపించాడు. నా కోపం, నా భాధ నేను వ్యక్తపరుస్తాను. కానీ నువ్వు ఎంతసేపు కామెడీ అంటూ హౌజ్ లో ఉంటున్నావ్. నీలోని ఎమోషనల్ పర్సన్ కి ఇది మళ్లీ మళ్లీ రాదు " అని టేస్టీ తేజతో అమర్ దీప్ చెప్పాడు. అయితే వాళ్ళ అమ్మనాన్నలు ఏం రాస్తారో తనకి తెలుసని యావర్ తో చెప్పి, ఈ రెండు లెటర్స్ నీకే ఇస్తున్నాను, నీ ఇష్టం ఏం చేస్తావో అని టేస్టీ తేజ యావర్ కి ఇవ్వగా.. అతను తన లెటర్ ని మిషన్ లో వేసాడు. టేస్టీ తేజ ఎంత వద్దని చెప్పినా యావర్ వినలేదు. ఆ తర్వాత టేస్టీ తేజ ఆ లెటర్ చదువుతూ ఏడ్చేశాడు. ఈ ఎపిసోడ్ అంతా ఎమోషనల్ గా సాగుతు.. బిగ్ బాస్ ప్రేక్షకుల హృదయాలని గెలుచుకుంది.

ముకుంద, మురారీల ప్రేమ విషయం ప్రభాకర్ కనిపెట్టగలడా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -280 లో.. కృష్ణ మురారి ఇద్దరు బయటకి వెళ్తుంటే భవాని ఆపి.. మురారిని ఆదర్శ్ గురించి తెలుసుకోవడానికి పంపిస్తుంది. మురారి చేసేదేమీ లేక వెళ్తాడు. ఆ తర్వాత ఇదంతా ముకుంద ప్లాన్ అయి ఉంటుందా అని కృష్ణ అనుకుంటుంది. మరొక వైపు మురారి వెళ్తు వెళ్తు.. పాపం కృష్ణ డిస్సపాయింట్ అయింది కావచ్చు అనుకుంటు వస్తుంటే అప్పుడే ఎదురుగా ముకుంద వచ్చి.. మురారి బైక్ ని ఆపుతుంది. నేను వస్తానని ముకుంద అడుగుతుంది. దానికి వద్దని మురారి అంటాడు. అప్పుడు భవానికి ముకుంద ఫోన్ చేస్తుంది. నన్ను తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళట్లేదని భవానితో ముకుంద అనగా.. తనని తీసుకొని వెళ్ళమని భవానీ చెప్పగానే ముకుందని మురారి తీసుకొని వెళ్తాడు. మరొకవైపు ప్రభాకర్ , శకుంతల కలిసి కృష్ణ గురించి మాట్లాడుకుంటారు. ఉన్నన్ని రోజులు కృష్ణ కష్టసుఖలు తెలుసుకోవాలని అనుకుంటారు. అప్పుడే కృష్ణ వస్తుంది. చిన్నాన.. నువ్వు భవాని అత్తయ్యతో గణేషుడిని నీ తీసుకొని వస్తానని అన్నావట కదా అని అడుగుతుంది. అప్పుడు ప్రభాకర్.. నేను ఎప్పుడు అన్నానంటు అంటాడు. ఆ తర్వాత తీసుకొని వస్తానని చెప్తాడు. మరొకవైపు మురారి, ముకుంద ఇద్దరు ఆదర్శ్ గురించి తెలుసుకోవడానికి ఒక అతని దగ్గరికి వెళ్తారు. అతను ఆదర్శ్ రావడానికి ఇష్టపడడం లేదు. ఎవరితోని మాట్లాడడానికి కూడా ఇష్టపడడం లేదు. మీరు ఆదర్శ్ పై హోప్ పెట్టుకోకండని అతను చెప్తాడు. సరే మేం వెళతామని మురారి, ముకుంద ఇద్దరు బయలుదేర్తారు. మురారి బయటకు వస్తాడు. థాంక్స్ నా ప్రేమని అర్థం చేసుకుని అబద్ధం చెప్పినందుకని అతనికి ముకుంద చెప్తుంది. మరొకవైపు ముకుంద ఎక్కడ కన్పించడం లేదని కృష్ణ అనుకుంటుంది.  ఆ తర్వాత కృష్ణ దగ్గరికి భవాని వస్తుంది. మా చిన్నానని మీరు గణేషుడిని తీసుకొని రమ్మని చెప్పారా అని అడుగుతుంది. అవునని చెప్పి.. నేను  రేపు ఊరు వెళ్తున్నాను.  మూడు రోజుల్లో వస్తానని కృష్ణకి భవాని చెప్తుంది. మరొక వైపు ముకుంద, మురారి ఇద్దరు కాఫీ షాప్ కి వెళ్తారు. వాళ్లని ప్రభాకర్ చూస్తాడు. మరొక వైపు ఇంట్లో ఉన్న శకుంతల.. ఇంట్లో వాళ్లని పరిచయం చేసుకునే బిజీలో ఉంటుంది. కృష్ణ, రేవతి కలిసి ముకుంద ఎక్కడికి వెళ్ళిందని అలేఖ్యని అడుగుతారు. నాకేం తెలియదని అలేఖ్య చెప్తుంది.. ఆ తర్వాత ఏం జరిగింది తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.   

కృష్ణ మూర్తికి ఇంటి పత్రాలు ఇచ్చిన రాజ్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -219 లో.. వినాయకుడి పూజలో భాగంగా సీతారామయ్య ఒక పోటీ పెడతాడు. ఈ పోటీలో గెలిచినవారు పూజ చెయ్యాలని సీతారామయ్య చెప్తూ.. భార్యభర్తలు ఇద్దరు జంటగా కలిసి బాణంతో సెంటర్ పాయింట్ ని కొట్టాలనేది రూల్ అని అందరికి వివరిస్తాడు. అలా పోటీలో భాగంగా మొదటగా స్వప్న, రాహుల్ వచ్చి ప్రయత్నించి ఓడిపోతారు. ఆ తర్వాత కళ్యాణ్ అనామిక అనుకుంటారు కానీ కళ్యాణ్ ఆలోచించి.. అప్పు నువ్వు అయితే పర్ ఫెక్ట్ గా వెయ్యగలవని అప్పుని పిలుస్తాడు. ఆ తర్వాత అప్పు వచ్చి కళ్యాణ్ పక్కన నిలుచునేసరికి అనామిక జెలస్ గా ఫీల్ అయి.. నువ్వు వద్దు, నేను నేను అంటూ కళ్యాణ్ పక్కన నిల్చొని బాణం వేస్తుంది. వాళ్ళ గురి కూడా మిస్ అవుతుంది. ఆ తర్వాత రాజ్ కావ్య లు చిలిపి తగాధాలతో బాణం గురిపెడతారు. వాళ్ళిద్దరు కరెక్ట్ గురి చుసి కొట్టడంతో పాయింట్ లో బాణం తగులుతుంది. అలా ఈ పోటీలో రాజ్ కావ్య గెలిచి, వారి చేతుల మీదుగా వినాయకుడి పూజ జరిపించాలని అనుకుంటారు. పూజ మొదలవకముందే ఆ చీటీలో రాజ్ ఏం రాశాడో చూడాలని కావ్య అనుకుంటుంది. అందరికంటే ముందు కావ్య వెళ్లి.. ఆ గాజు హుండీలోని చీటీ తీసుకొని తన కొంగుకి ముడి వేసుకుంటుంది. మరొక వైపు అప్పు దగ్గరికి  కళ్యాణ్ వచ్చి.. ఎందుకు ఫోన్ కట్ చేస్తున్నావ్? అనామిక వాళ్ళు మా ఇంటికి పెళ్లి విషయం మాట్లాడడానికి వస్తున్నారని చెప్పడానికి కాల్ చేశానని కళ్యాణ్ అంటాడు.  అయితే నాకేంటి, నాతో నీకు అవసరం అయిపోయింది . ఇక మాటలు ఎందుకు అంటు కళ్యాణ్ పై అప్పు కోప్పడుతుంది. ఎందుకు అలా కోప్పడుతున్నావంటు కళ్యాణ్ అడుగుతాడు. అయిన అప్పు సమాధానం చెప్పదు. మరొక వైపు రాజ్ కావ్య ఇద్దరు కలిసి పూజ చేస్తారు. ఆ తర్వాత కావ్య ఇంటి పత్రాలు తీసుకొని వచ్చి రాజ్ చేతుల మీదుగా కృష్ణ మూర్తికి ఇప్పిస్తుంది. కృష్ణమూర్తి చాలా సంతోషపడతాడు. నా కూతురుని ఎలా చూసుకుంటారో ఏమోనని భయం వేసింది. ఇప్పుడు తెలిసింది చాలా బాగా చూసుకుంటున్నారని రాజ్ తో కృష్ణమూర్తి చెప్తాడు.  ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

జగతి దెయ్యమై దేవయాని మీద పగ తీర్చుకోనుందా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -886 లో.. జగతికి చేయాల్సిన కార్యక్రమం పూర్తవుతుంది. ఆ తర్వాత రిషి తన తండ్రిని ఒళ్ళో పడుకోబెట్టుకొని, తన తల్లి జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటాడు. అప్పుడే వసుధార వస్తుంది. మహేంద్ర సర్ పడుకున్నారని అనగానే.. ఏడ్చి ఏడ్చి పడుకున్నాడు డాడ్, ఆయన దుఃఖాన్ని చూడలేక పోతున్నానని రిషి బాధపడతాడు. కాసేపటికి ఇప్పుడు మీ అవసరం మహేంద్ర సర్ కీ చాలా ఉంది. మీరు సర్ ని బాగా చూసుకోండి. నాకు మా నాన్న తోడుగా  ఉన్నాడు. మీకు ఏదైనా అవసరం ఉంటే పిలవండని వసుధార చెప్పి వెళ్ళబోతుండగా, వసుధార చెయ్యి పట్టుకుంటాడు రిషి. నీ అవసరం ఇప్పుడే ఉంది వసుధార. చాలా బాధగా ఉంది. నీతో మాట్లాడాలని  ఉంది. ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. కాసేపు ఇక్కడే ఉండు వసుధారా అని రిషి అంటాడు. మీరేం ఆలోచించకండి సర్ అని వసుధార అంటుంది. అసలు ఇదంతా ఎవరు చేసారో తెలుసుకోవాలని ఉందని రిషి అంటాడు. సరే సార్ ఆ విషయం తెలుసుకోవడంలో మీకు నేను సపోర్ట్ గా ఉంటాను కానీ ఇప్పుడే కాదు కొంచెం టైం తీసుకోండి అని రిషికి వసుధార సలహా ఇస్తుంది. మరొక వైపు తన గదిలో ఉన్న దేవయాని.. జగతి ఫోటో చూస్తూ ఉంటుంది. అప్పుడే శైలేంద్ర వచ్చి.. ఏంటి మమ్మీ అలా చూస్తున్నావ్? కొంపతీసి బాధపడుతున్నావా అని అడుగుతాడు. అదేం లేదు.. కంగారుపడుతున్నానని దేవయాని అంటుంది. ఎందుకని శైలేంద్ర అడుగుతాడు. రిషికి మన గురించి తెలిసిపోతుందేమో అని దేవయాని అనగానే.. తెలిస్తే ఏంటి? తెలిస్తే వాన్ని కూడా చంపేస్తా అని శైలేంద్ర అంటాడు. కాసేపటికి జగతి ఫోటో దగ్గర ఉన్న దీపాలు ఆరిపోతాయ్. దాంతో దేవయాని ఒక్కసారిగా బయపడుతుంది. ఏంటి మమ్మీ అని శైలేంద్ర అడుగుతాడు. కొంపదీసి జగతి దెయ్యం అయ్యి మనల్ని పగపడుతుందా?  దీపాలు ఆరిపోయాయి. విండో కూడా ఓపెన్ లేదు, డోర్ క్లోజ్ ఉందని దేవయాని అనగానే.. అవన్నీ ఏం పట్టించుకోకని శైలేంద్ర చెప్తాడు. మరొకవైపు మహేంద్ర దగ్గరకు రిషి టిఫిన్ తీసుకొని వచ్చి.. తినిపిస్తే వద్దని మహేంద్ర అంటాడు. ఆ తర్వాత అందరు ఎవరికీ వారే జగతిని గుర్తుచేసుకుంటూ బాధపడతారు. దేవయాని, శైలేంద్ర ఇద్దరు మాత్రం హ్యాపీగా ఉంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

బిగ్ బాస్ బ్యూటీ అందాల జాతర.. నెటిజన్స్ కామెంట్ల మోత!

  సోషల్ మీడియాలో ఎప్పుడు హాట్ అండ్ బోల్డ్ ఫోటోలతో రీల్స్ తో కుర్రాళ్ళ మతిపోగొడుతున్నవారిలో ఇప్పుడు కిరణ్ రాథోడ్ చేరింది. కిరణ్ రాథోడ్.. బిగ్ బాస్ సీజన్-7 లో ఎలిమినేట్ అయిన మొదటి కంటెస్టెంట్. కిరణ్ రాథోడ్ బిగ్ బాస్ సీజన్-7 లోకి  పన్నెండవ కంటెస్టెంట్ గా అడుగుపెట్టింది. అయితే తనకి తెలుగు రాదు. ఇదే తను ఎలిమినేట్ అవడానికి ప్రధాన కారణంగా మిగిలింది. ఎందుకంటే హౌజ్ లో అందరితో కలవడానికి భాష కావాలి. తను మాత్రం హిందీ, ఇంగ్లీష్ లోనే మాట్లాడేది‌. దాంతో తోటి కంటెస్టెంట్స్ కి ఇబ్బందిగా మారింది.  కిరణ్ రాథోడ్ రాజస్థాన్ లో జన్మించింది. తనకి మాడలింగ్ మీద ఇంట్రెస్ట్ తో డిగ్రీ పూర్తయ్యాక ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తెలుగులో అల్లరి నరేష్ నటించిన 'కెవ్వు కేక' సినిమాలో కిరణ్ రాథోడ్ చేసింది. తను ఎక్కువగా తమిళంలో సినిమాలు చేసింది‌. అయితే తెలుగులో నువ్వు లేక నేను లేను సినిమాలో అరంగేట్రం చేసింది. భాగ్యలక్ష్మి బంపర్ డ్రా, ఉన్నత పాఠశాల, అందరు దొంగలే దొరికితే, చెప్పవే చిరుగాలి, నాని మొదలైన తెలుగు సినిమాల్లో చేసి క్రేజ్ సంపాదించుకుంది కిరణ్ రాథోడ్. మిధునరాశి సినిమాకి గాను ఉత్తమ నూతన ముఖ నటిగా తనకి అవార్డు కూడా వచ్చింది. బాలివుడ్ నటి రవీనా టండన్ కి కిరణ్ కజిన్ అని కొంతమందికే తెలుసు. అయితే ఎప్పుడు తను ఇన్ స్టాగ్రామ్ లో హాట్ అండ్ బోల్డ్ ఫోటోలతో ఎప్పుడు‌ ట్రెండింగ్ లో ఉంటుంది. కిరణ్ రాథోడ్ బిగ్ బాస్ లో నటిగా గ్లామర్ రోల్ ని చేయడంలో సక్సెస్ అయింది‌. అయితే తనకి కెమరా స్పేస్ తక్కువే  దొరికింది. హోస్ట్ నాగార్జున తనకి తెలుగు నేర్చుకోమని చెప్పిన తను పట్టించుకోకపోవడం, ఒకరు ఇద్దరు కంటెస్టెంట్స్ మాత్రమే కలిసి మాట్లాడటంతో బిగ్ బాస్ చూసే ప్రేక్షకులకు కిరణ్ రాథోడ్ అసలు హౌజ్ లో ఉందా అనే డౌట్ ఏర్పడింది. కాగా తనని తాను నిరూపించుకోవాడికి సమయం ఇవ్వలేదని పలువురు విమర్శకులు విమర్శిస్తున్నారు. బిగ్ బాస్ సీజన్-7 లో ఎంట్రీ కిరణ్ రాథోడ్ కి కమ్ బ్యాక్ ఇచ్చిందనే చెప్పాలి.   

ఫ్రూట్ నింజా టాస్క్ లో యావర్ విజేత.. సంఛాలక్ గా అమర్ దీప్ ఫెయిల్!

బిగ్ బాస్ హౌజ్ లో టాస్క్ లలో కంటెస్టెంట్స్ పర్ఫామెన్స్ ఇరగదీస్తున్నారు. అయితే మేం గ్రూప్ లుగా ఆడట్లేదంటూనే సీరియల్ బ్యాచ్ మరోసారి గ్రూప్ గా ఆడారు. ప్రతీసారీ , ప్రతీ టాస్క్ లో గ్రూప్ లుగా మాట్లాడుకుంటూ,  బిగ్ బాస్ రూల్స్ ఫాలో అవకుండా అన్ ఫెయిర్ గేమ్ ఆడుతున్నారు. శివాజీ-పల్లవి ప్రశాంత్ ప్రతీ టాస్క్ లో నీతిగా, నీజాయితీగా ఆడి గెలుద్దామని అనుకుంటున్నారు. కానీ ఈ సీరియల్ బ్యాచ్ చేసే పాలిటిక్స్ వల్ల వీరు రెండు, మూడు స్థానాలలో ఉంటున్నారు. అయితే శివాజీ-పల్లవి ప్రశాంత్ ల ఫెయిర్ ప్లే ప్రేక్షకులకు అర్థమవుతుంది. 'దొరికొతే దొంగ, దొరక్కపోతే దొర' టాస్క్ లో ఆట సందీప్- అమర్ దీప్ ఇద్దరు కలిసి అన్నీ తీసుకొద్దామని ముందే మాట్లాడుకున్నారు. అలాగే అన్నీ తెచ్చేశారు. దాంతో ఆ టాస్క్ లో సీరియల్ బ్యాచ్ అంతా ఓడిపోయింది. ఇక ఆ తర్వాత 'ఫ్రూట్ నింజా' టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇందులో బడ్డీస్ లోని ఒకరు లైన్ కి ఇవతల ఉండాలి, మరొకరు తలపై డబ్బా పెట్టుకొని జ్యూస్ టీపాయ్ దగ్గర ఉండాలి. ఇవతల ఉన్న వ్యక్తి లైన్ క్రాస్ చేయకుండా బత్తాయి విసిరితే, అవతల ఉన్న వ్యక్తి ఆ తల మీద ఉన్న డబ్బాలో పడేలా క్యాచ్ పట్టాలి. అలా పట్టిన తర్వాత జ్యూస్ తీయాలి. ఎవరెంత జ్యూస్ తీస్తారో వారే విజేత అని బిగ్ బాస్ ప్రకటించాడు. అయితే టాస్క్ మొదలైన నుండి అమర్ దీప్ లైన్ క్రాస్ చేసి బత్తాయిలు విసిరాడు. ఆట సందీప్ వాటిని క్యాచ్ సారిగ్గా పట్టుకోలేకపోయాడు. అయితే ఆట సందీప్ జ్యూస్  తీసే టైమ్ లో ఆ బుట్టలో బత్తాయిలు కాకుండా పక్కన ఉన్న బత్తాయిలని తీసుకున్నాడు. దాంతో పాటు బత్తాయి తొక్కని కూడా అందులో వేశాడు ఆట సందీప్. ఇక అది గమనించిన పల్లవి ప్రశాంత్ కౌంట్ చేసేప్పుడు  అందులో తొక్క తీయాలని చెప్పిన అమర్ దీప్ విని కూడా పట్టించుకోలేదు. అతను సంఛాలక్ కాబట్టి అతని నిర్ణయమే సరైనదని, అతనేం చెప్పిన కరెక్ట్ అని, అతని చేతిలో పవర్ ఉందని భావించి.. మొదటి స్థానం యావర్-టేస్టీ తేజలకి ఇచ్చి రెండవ స్థానం ఆట సందీప్-అమర్ దీప్ కి ఇచ్చుకోగా, మూడవ స్థానం శివాజీ- పల్లవి ప్రశాంత్ లకి ఇచ్చాడు. వీళ్ళిద్దరు ఇంత చీట్ చేసి ఆడిన శివాజీ-ప్రశాంత్ లు నింపిన జ్యూస్ కంటే ఒక్క మిల్లీ పాయింట్ మాత్రమే ఎక్కువ ఉన్నారు. అయితే ప్రిన్స్ యావర్ తన శక్తినంతా ఉపయోగించి అత్యధికంగా జ్యూస్ తీసి మొదటి స్థానంలో ఉన్నాడు. కన్నింగ్ సీరియల్ బ్యాచ్ పాలిటిక్స్ తో ఈ టాస్క్ లో రెండవ స్థానంలో ఉన్నారు. అయితే కెప్టెన్సీ కంటెండర్ రేస్ లో అత్తధికంగా 5 స్టార్స్ తో మొదటి స్థానంలో ఉన్నారు.  

దొరికితే దొంగ దొరక్కపోతే దొర... ప్రేక్షకుల మనసు గెలుచుకున్న శివాజీ!

బిగ్ బాస్ సీజన్-7 ఇప్పటికే ఉల్టా పల్టా థీమ్ తో అదరగొడుతుంది. కంటెస్టెంట్స్ కి కొత్త కొత్త టాస్క్ లతో బిగ్ బాస్ పరీక్షలు పెడుతున్నాడు. అయితే మంగళవారం నుండి కెప్టెన్సీ కోసం టాస్క్ లని ప్రారంభించాడు బిగ్ బాస్. ఇక మొదటి రోజు " గెలిపించేది మీ నవ్వే".. అనే టాస్క్ ఇవ్వగా అందులో పల్లవి ప్రశాంత్- శివాజీ మొదట బెల్ కొట్టారు. అయితే అమర్ దీప్-  ఆట సందీప్, గౌతమ్- శుభశ్రీల ఆర్గుమెంట్ తో సంఛాలక్ గా వ్యవహరించిన యావర్, శోభా శెట్టి ఏకీభవించి మొదటి స్థానం గౌతమ్-శుభశ్రీలకి ఇవ్వగా, రెండవ స్థానం  అమర్ దీప్- ఆట సందీప్, మూడవ స్థానం పల్లవి ప్రశాంత్- శివాజీలకి ఇచ్చారు. రెండవ రోజు బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్..  "దొరికితే దొంగ, దొరక్కపోతే దొర". ఇందులో బిగ్ బాస్ చెప్పినప్పుడు బడ్డీస్ లోని ఒక్కొక్క టీమ్ నుండి ఒకరు సీక్రెట్ రూమ్ లోకి వెళ్ళాలని, అక్కడికి వెళ్ళి బిగ్ బాస్ వస్తువులని తీసుకురమ్మన్నాడు. ఆయితే సీరియల్ బ్యాచ్ అమర్ దీప్- ఆట సందీప్, ప్రియాంక జైన్- శోభా శెట్టి అంతా గ్రూప్ గా ఆడారు. బిగ్ బాస్ చెప్పిన వస్తువులనే కాకుండా చెప్పనివి కూడా తీసుకొచ్చేసారు సీరియల్ బ్యాచ్. అయితే శివాజీ మాత్రం నీతిగా నిజాయితీగా ఆడాలని, అలా అన్నీ తీసుకురావద్దని వారితో చెప్తున్నా, ఎవరూ వినట్లేదు. దీంతో టాస్క్ పూర్తయ్యాక అందరిని ఒక లైన్ లో నిల్చోమన్నాడు బిగ్ బాస్.‌ ఇక టేస్టీ తేజ దొంగిలించిన ఫోన్ ని బ్యాగ్ లో వేసుకుంటడగా..పక్కనే ఉన్న శోభా దాన్ని లాక్కుంది. అది తన స్ట్రాటజీ అని అంది. ఇక టేస్టీ తేజ-యావర్ ఒక జోడీ కాబట్టి ఫోన్ కోసం యావర్ శోభాని టచ్ చేశాడు. పర్సనల్ ప్లేస్ లో చేయి పెట్టావని శోభా అనగానే యావర్ చేయి తీసాడు. ఇక ఆ తర్వాత నేను చెప్పిన వస్తువులని ఎడమ వైపు, చెప్పకుండా మీరు దొంగతనం చేసినవి కుడివైపు పెట్టమన్నాడు బిగ్ బాస్. ఆ తర్వాత నేను చెప్పకుండా తీసుకొచ్చిన వస్తువుల్లో తక్కువ ఎవరి దగ్గర ఉన్నాయో వారే విజేత అని తెలిపాడు. సీరియల్ బ్యాచ్ అంతా ఏడు, ఎనిమిది అదనంగా తీసుకొస్తే.. పల్లవి ప్రశాంత్ ఒకే ఒక వస్తువు అదనంగా తెచ్చాడు. శివాజీ మాత్రం బిగ్ బాస్ చెప్పిన వస్తువు ఒక్కటి మాత్రమే తెచ్చి, టాస్క్ రూల్స్ ని ఫాలో చేసి బిగ్ బాస్ చూసే ప్రేక్షకుల మనసు గెలిచాడు. ఇక సీరియల్ బ్యాచ్ అత్యాశ, దురాశ అన్నీ కలిసి వారిని ఓటమి అంచున నిల్చోబెట్టాయి.

జగతికి రిషి కన్నీటి వీడ్కోలు.. శైలేంద్రే కపటసూత్రధారి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ గుప్పెడంత మనసు. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్-885 లో... రిషి, వసుధారల పెళ్ళిని జగతి దగ్గరుండి జరిపిస్తుంది.‌ పెళ్ళి తర్వాత రిషి, వసుధారలు జగతి ఆశీర్వాదం తీసుకుంటారు. అలా ఆశీర్వదించిన జగతి ఒక్కసారిగా కుప్పకూళిపోతుంది. దాంతో అందరు షాక్ అవుతారు. ఏం జరిగిందోనని డైలామాలో అందరూ ఉంటారు. అప్పుడే నర్స్ ని పిలిచి చూడమంటాడు రిషి. జగతి పల్స్ చూసిన నర్స్.. చనిపోయిందని చెప్తుంది. దాంతో రిషి, వసుధారలతో పాటుగా మహేంద్ర, ఫణీంద్ర, ధరణి, చక్రపాణి షాక్ అవుతారు. శైలేంద్ర, దేవయాని మాత్రం హ్యాపీగా ఉంటారు. అసలు వీళ్ళెందుకు హ్యాపీగా ఉన్నారంటే.. అంతకముందు జగతి చనిపోవడానికి జ్యూస్ లో ట్యాబ్లెట్ ని కలుపుతాడు శైలేంద్ర. ఇక ఎవరికి డౌట్ రాకుండా ఆ జ్యూస్ ని నర్స్ తో  ఇప్పిస్తారు శైలేంద్ర, దేవయాని. అందుకని ఆ జ్యూస్ తాగిన జగతి చనిపోతుంది. శైలేంద్ర, దేవయానిల ప్లాన్ సక్సెస్ అయ్యినందుకు ఇద్దరు సంతోషంగా ఉంటారు. బయటకు మాత్రం బాధలో ఉన్నట్టు నటిస్తారు. ఇక చనిపోయిన జగతిని చూసి రిషి ఏడుస్తాడు. " లే అమ్మా.. నువ్వు చనిపోలేదు.. ఎవరు చనిపోయిందని అనకండి" అంటూ రిషి ఏడుస్తుంటే తనని వసుధార ఓదార్చుతుంది. మరొకవైపు మహేంద్ర కూడా తనకి అలా జరిగినందుకు కన్నీటి పర్యంతం అవుతాడు. ఆ తర్వాత జగతిని శ్మశానానికి తీసుకెళ్ళేముందు స్నానాలవి చేపిస్తుంటే‌‌.. తన దగ్గరికి జగతి వచ్చి మాట్లాడినట్టు రిషి ఊహించుకుంటాడు. నన్ను ఒదిలేసి వెళ్ళిపోయావా అమ్మా అంటు జగతిని రిషి అడుగగా.. లేదు నాన్న.. నువ్వు నన్ను అమ్మ అన్నావ్ ఆ తృప్తి చాలు అని జగతి అంటుంది. నువ్వు మాతో ఉండు అమ్మ అంటూ జగతితో అనగానే.. ఏం అయింది సర్ అని వసుధార అంటుంది. మా అమ్మ నన్ను విడిచి వెళ్ళిపోయింది వసుధార అంటూ రిషి కంటతడి పెట్టుకుంటాడు. ఇక వసుధార ఓదార్చుతుంది. శైలేంద్ర, దేవయాని ఒక పక్కకి వెళ్ళి మాట్లాడుకుంటారు. ఇక ఇది చివరి ఘట్టం, మనం మన నటనతో జీవించాలని దేవాయానితో శైలేంద్ర అనగా.. సరేనని చెప్తుంది దేవయాని. ఆ తర్వాత జగతిని శ్మశానానికి తీసుకెళ్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

అనామికతో కళ్యాణ్ పెళ్ళి.. కావ్యకి మరో షాక్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -218 లో.. తన పుట్టింటి వాళ్ళు రావడంతో కావ్య సంతోషపడుతు వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. మీరు చేసిన సహాయం మర్చిపోలేమని రాజ్ కి థాంక్స్ చెప్తాడు కృష్ణమూర్తి. మీ వల్లే మేం ఈ రోజు ఇలా ఉన్నామంటూ రాజ్ ని పొగడడం స్టార్ట్ చేస్తాడు కృష్ణమూర్తి. మరొక వైపు అనామిక వాళ్ళ అమ్మ నాన్నలతో దుగ్గిరాల వారి ఇంటికి వస్తుంది. అలా రావడం చూసిన కళ్యాణ్ టెన్షన్ పడుతు కావ్యకి చెప్తాడు. కావ్య కళ్యాణ్ ఇద్దరు వెళ్లి వాళ్ళని రిసీవ్ చేసుకుంటారు. కాసేపటికి అనామిక వాళ్ళ నాన్న దుగ్గిరాల ఇంట్లో వారిని పరిచయం చేసుకుంటాడు. మీతో ఒక విషయం చెప్పాలని వచ్చారని వాళ్ళు వచ్చారంటూ సీతరామయ్యకి కావ్య చెప్తుంది.  అందరూ హాల్లో కూర్చొని ఉంటారు. ఏం మాట్లాడాలని సీతరామయ్య అడుగుతాడు. ఇక అనామిక కళ్యాణ్ ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారు. వాళ్ళు చెప్పేలా లేరని అనామిక వాళ్ళ నాన్న చొరవ తీసుకొని.. వాళ్లిద్దరు ఒకరినొకరు ఇష్టపడుతున్నారని చెప్పగానే అందరు సంతోషపడతారు. మీకు వాళ్లకి పెళ్లి చేయడం ఇష్టం అయితే చెప్పండి ముహూర్తాలు పెట్టుకుందామని అనామిక వాళ్ళ నాన్న అనగానే.. సీతారామయ్య సరేనని ఒప్పుకుంటాడు. అలాగే కళ్యాణ్ తల్లి తండ్రులు ఒప్పుకోవాలని సీతారామయ్య అనగా.. ధాన్యలక్ష్మి, ప్రకాష్ లు కూడా ఒప్పుకుంటారు. పెళ్లికి అందరు ఒప్పుకోవడంతో కళ్యాణ్, అనామికతో పాటు కావ్య, రాజ్ లు సంతోషపడతారు. మంచి ముహూర్తం చూసి ఎంగేజ్మెంట్ చెయ్యాలని నిర్ణయించుకుంటారు. ఆ తర్వాత వినాయకుడి పూజ చెయ్యాలని ఇందిరాదేవి అనగానే.. పూజ మగవాళ్ళు ఎందుకు చెయ్యాలి. ఆడవాళ్లు ఎందుకు చెయ్యకూడదు? మేం చేస్తామని అనామిక అంటుంది. ఇక అందరూ ఆడవాళ్లు, మగవాళ్ళు మేం చేస్తామంటే మేం చేస్తామని అనగా అది చూసిన సీతారామయ్య.. ఒక పోటీ పెడతాను. అందులో ఎవరు గెలిస్తే వాల్లే పూజ చెయ్యాలని అంటాడు. అలా అనేసరికి ఆ ఆట ఆడడానికి అందరు బయటకు వెళ్తారు. కావ్య ఒకతే రాజ్ చీటీలో ఏం రాసి ఉంటాడని చూడాలి అనుకుంటుంది. అప్పుడే కనకం వచ్చి బయటకు తీసుకొని వెళ్తుంది. ఇక ఆడవాళ్లు, మగవాళ్ళు చెరొక వైపు ఉంటారు. తాడుతో  బలవంతంగా లాగిలి. లైన్ దాటి  ఎవరు వెళ్తారో వాళ్ళు ఒడిపోయినట్టు కాగా కావ్య వెళ్లి రాజ్ మీద పడిపోతుంది. ఆడవాళ్లు ఓడిపోయారని అనగానే లేదు దీన్ని మేం ఒప్పుకోమంటు మరొక పోటీ పెట్టమని అడుగుతారు. ఈ సారి ఇద్దరు జంటగా ఆడాలని ఇందిరాదేవి చెప్తుంది. దానికి అందరూ సరేనంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

పల్లవి ప్రశాంత్ ని రతికరోజ్ మిస్ అవుతుందంట!  

బిగ్ బాస్ సీజన్-7 లో కొత్త కంటెస్టెంట్స్, కొత్త టాస్క్ లతో క్రేజ్ సంపాదించుకుంటుంది. అయితే హౌజ్ లోకి మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చారు. అందులో నాలుగు వారాల్లో కిరణ్ రాథోడ్, షకీల, దామిణి, రతికరోజ్ ఎలిమినేట్ అయ్యారు. అయితే వీళ్ళ నలుగురిలో అత్యధిక క్రేజ్ సంపాదించుకుంది మాత్రం రతికరోజ్.  రతికరోజ్ బిగ్ బాస్ హౌజ్ లోకి టైటిల్ ఫేవరెట్ గా ఎంట్రీ ఇచ్చింది. అయితే తను పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్ లతో కలిసి ప్రేక్షకులకు 'బేబీ' సిమిమాని చూపించిన విషయం తెలిసిందే. అయితే రతిక కంటెంట్ కోసం మాట్లాడే విధానం, తన మాటలని తనే ఫ్లిప్ చేయడం, అక్కడివి ఇక్కడ, ఇక్కడవి అక్కడ చెప్పడంతో తనని రతిక బదులు రాధిక అని నెటిజన్లు ట్రోల్స్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇక ఈ వారం రతిక బయటకొచ్చేస్తుందని అనగా సీరియల్ బ్యాచ్ తో కలిసిపోయింది. ఎలిమినేట్ అయి బయటకొచ్చేముందు కూడా శివాజీ, పల్లవి ప్రశాంత్ లతో అసలు మాట్లాడలేదు, అసలు చూడను కూడా చూడలేదు రతిక. దాంతో  సీరియల్ బ్యాచ్ ఇంపాక్ట్ రతిక మీద ఏ రెంజ్ లో ఉందో అర్థమవుతుంది. ఇక హౌజ్ లో తన గ్లామర్ కి ఫ్యాన్స్ కూడా ఆ రేంజ్ లోనే ఉన్నారు.  బిగ్ బాస్ నుండి బయటకొచ్చాక రతిక బిగ్ బాస్ లైవ్ చూస్తుంది. అయితే హౌజ్ లో రతిక గురించి శివాజీ, పల్లవి ప్రశాంత్ ఇద్దరు మాట్లాడుకున్న మాటలని పోస్ట్ చేసి, దానికి ఐ మిస్ యూ బోత్ ఆఫ్ యూ అని టైటిల్ కూడా పెట్టేసింది‌. " అన్న నీకు రతిక గుర్తుకు వస్తుందా? నాకు రాత్రంతా తెగ గుర్తుకు వచ్చింది అన్న, నిద్ర కూడా పట్టలేదని పల్లవి ప్రశాంత్ అనగా.‌. నాకు గుర్తుకు వచ్చింది కానీ ఏం చేస్తాం, చిన్న పిల్లరా అని శివాజీ అన్నాడు. అది చిన్న పిల్లేంటి అన్న, బర్రె పిల్ల, మస్త్ కోపం వస్తుంది అన్న అని ప్రశాంత్ అన్నాడు. బయటకు వెళ్ళాక కలుద్దాం లేరా, నువ్వు భాదపడకు, నాకు అర్థమైంది నీ బాధ అని శివాజీ అనగానే.. నా మీద ఎందుకు అన్న అంత కోపం, నన్ను నామినేట్ చేసిన కూడా మన పిల్లే కదా అని నేను మాట్లాడినానని పల్లవి ప్రశాంత్ అంటాడు. ఈ మాటలన్నీ తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన రతికరోజ్.. " దట్ ఈజ్ సో స్వీట్.. నేను కూడా మీ ఇద్దరిని మిస్ అవుతున్నాను" అని పోస్ట్ చేసింది.  

ముకుంద‌ ప్లాన్ సక్సెస్.. కృష్ణ ఏం చేయనుంది?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -279 లో.. ఆదర్శ్ గురించి భవానిని అడుగుతాడు ప్రభాకర్. కానీ భవాని దానికి సమాధానం చెప్పకుండా.. టాపిక్ డైవర్ట్ చేస్తుంది.. కాసేపటికి గుడ్ నైట్ అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది భవాని. ఇంట్లో అంత బాగానే ఉంది కానీ ముకుంద విషయమే కొంచెం డౌట్ గా ఉందని ప్రభాకర్ అనుకుంటాడు. మరొక వైపు ఎప్పుడు తాగుతూనే ఉంటావా అని  మధుని అలేఖ్య తిడుతుంది. మరొకవైపు వాళ్ళ పిన్ని, బాబాయ్ ల కోసం కృష్ణ వెతుకుతుంటుంది‌. ఇక అది గమనించి కృష్ణ దగ్గరికి  ముకుంద వచ్చి.. ఎవరికోసం వెతుకుతున్నావ్? మీ తొట్టి గ్యాంగ్ కోసమా అని అంటుంది. ఎందుకు అలా అంటావ్. మీ నాన్నని నేను బాబాయ్ అంటూ ఎలా పిలుస్తానని కృష్ణ అంటుంది. ఆ తర్వాత కృష్ణ వాళ్ళ  బాబాయ్ ని తక్కువ చేసి మాట్లాడుతుంది ముకుంద. దాంతో కృష్ణ కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతుంది. గదిలోకి వెళ్లిన కృష్ణ.. కోపంగా ముకుంద గురించి మురారికి చెప్తుంది. సంస్కారం లేని వాళ్ళతో నీకేంటి వదిలేయ్ అని మురారి చెప్తాడు. అయిన ముకుంద మాటలనే కృష్ణ గుర్తు చేసుకుంటుంది‌. తింగరి పిల్ల లాగా ప్రవర్తిస్తుంటే, అది చూసిన మురారి.. రోజు రోజుకి నీ చేష్టలతో తెగ నచ్చేస్తున్నావ్, కృష్ణ ఐ లవ్ యు అని తన మనసులో అనుకుంటాడు మురారి. మరొక వైపు ఎలాగైన ప్రొద్దున కృష్ణ , మురారి కలిసి వెళ్లకుండా ఆపాలని ముకుంద అనుకుంటుంది. కాసేపటికి ముకుంద దగ్గరికి శకుంతల వచ్చి ఆదర్శ్ గురించి అడుగుతుంది. తను అడిగే ప్రశ్నలకు ముకుంద చిరాకు పడుతు కోప్పడుతుంది. అప్పుడే కృష్ణ, మురారి ఇద్దరు వస్తారు. దూరంగా వుండి ప్రభాకర్ కూడా చూస్తుంటాడు. మా పిన్నికి సారి చెప్పు అని ముకుందని కృష్ణ అడుగుతుంది. నేను చెప్పనని ముకుంద అంటుంది. గొడవ వద్దు. తన తరుపున నేను సారీ చెప్తున్నాని మురారి అంటాడు. ఆ తర్వాత కృష్ణని గదిలోకి తీసుకొని వెళ్తాడు మురారి. మరొక వైపు ముకుంద చేసిన గొడవ గురించి అలేఖ్యతో మధు చెప్తాడు. మరుసటి రోజు ఉదయం కృష్ణ, మురారీ ఇద్దరు బయటకు వెళ్తుంటే భవాని వారిద్దరిని ఆపుతుంది. వేరే దగ్గరికి వెళ్లి ఆదర్శ్ గురించి తెలుసుకొని రా అని‌ మురారిని బయటకు పంపిస్తుంది భవాని. దాంతో కృష్ణ కూడ ఆగిపోతుంది. కాసేపటికి కృష్ణ బాగా ఆలోచిస్తుంటుంది. మమ్మల్ని వెళ్లకుండా చెయ్యడానికి ముకుంద ప్లాన్ చేసిందా అని కృష్ణ అనుకుంటుంది.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.