జబర్దస్త్ లో మిస్ వైజాగ్ నక్షత్ర ... నెటిజన్స్ ఫైర్

జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ ప్రోమో మొత్తం ఫుల్ గా  నవ్వులే నవ్వులు. ఐతే ఈ వారం ప్రోమోలో అన్ని కూడా బయట రియాలిటీలో జరిగిన ఇన్సిడెంట్స్ ని తీసుకుని చేసినట్టు తెలుస్తోంది. బులెట్ భాస్కర్- ఫైమా- నాటీ నరేష్ స్కిట్ చూస్తే ఆ విషయం అర్ధమవుతుంది. వీళ్ళ స్కిట్ లో భాస్కర్ - ఫైమా పెళ్లి చేసుకున్నట్టు నటించారు. ఐతే భాస్కర్ ఫైమాని వదిలేసి వేరే అమ్మాయితో ఉండడాన్ని చూపించారు. అది తెలిసి ఫైమా లాగిపెట్టి భాస్కర్ ని కొట్టింది. రీసెంట్ గా సోషల్ మీడియాలో బాగా వైరల్ ఐన మిస్ వైజాగ్ నక్షత్ర స్టోరీ చూస్తే తెలుస్తుంది. అందులో నక్షత్ర తన భర్తను అలా కొట్టింది. ఆ క్లిప్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. దాన్ని స్పూఫ్ గా చేసి చూపించారు బులెట్ భాస్కర్ అండ్ టీమ్ . ఇక తర్వాత స్కిట్ ఇస్మార్ట్ ఇమ్మానుయేల్ స్కిట్ లో వర్ష ఇంట్లో దెయ్యాలు ఉన్నాయి అని చెప్పడంతో ఇమ్ము రియాజ్ అనే మాంత్రికుడిని దెయ్యాలను తరమడానికి పిలిచాడు. 10 గంటలకు వస్తానన్నారు అని ఇమ్ము అడిగేసరికి నేను 10 గంటలకు రాను 11 కె వస్తాను..అంటూ రీసెంట్ గా ఏపీలో వైసీపీ 11 సీట్లు మాత్రమే తెచ్చుకున్న విషయాన్నీ హైలైట్ చేస్తూ స్కిట్ చేశారు. దాంతో నెటిజన్స్ అంతా ఫుల్ ఫైర్ అవుతున్నారు. అసలు జబర్దస్త్ లో పాలిటిక్స్ ఎంట్రీ ఏంటి... రియాజ్ అని అడ్డం పెట్టుకుని ఆది వైసీపీని ట్రోల్ చేయడం మొదలు పెట్టాడు..తర్వాత నుంచి అందరూ అదే కంటిన్యూ చేస్తున్నారంటూ ఫైర్ అవుతున్నారు.  

Farmer Nethra : బిగ్ బాస్ 8 కి ఫార్మర్ నేత్ర!

  బిగ్ బాస్ సీజన్ సెవెన్ విజేతగా పల్లవి ప్రశాంత్ నిలిచిన విషయం అందరికి తెలసిందే. శివాజీ, యావర్, టేస్టీ తేజ, సందీప్ మాస్టర్, ప్రియాంక జైన్, శోభాశెట్టి, అమర్ దీప్ , శుభశ్రీ రాయగురు , నయని పావని , అశ్విని శ్రీ .. ఇలా అందరు క్రేజ్ ఉన్నవారే కాబట్టి ఆ సీజన్ గ్రాంఢ్ గా సక్సెస్ అయింది. ఇక తర్వాతి సీజన్-8 ఎప్పుడెప్పుడా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. మరి ఈ సీజన్ కి ఎవరు వెళ్ళే అవకాశం ఉందని అంటుంటే.. సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ గా ఫార్మర్ నేత్ర వెళ్లే అవకాశం ఉంది. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపించిన పేరు ఫార్మర్ నేత్ర(Farmer Nethra) .. వారధి ఫామ్స్( vaaradhi ) ని సొంతంగా స్టార్ట్ చేసిన నేత్ర అటు ప్రమోషన్స్.. ఇటు సేల్ తో బిజీగా ఉంటోంది. అయితే ఈ మధ్య వారధి ఫామ్స్ లోని మామిడికాయలో ప్రమోషన్ లో‌ భాగంగా ఇన్ స్టాగ్రామ్ లో  నేత్ర ఓ వీడియో చేయగా అది ఫుల్ వైరల్ అవుతోంది.  చిన్న రసాలు, పెద్ద రసాలు, నవని, బెంగినపల్లి అంటు తన ఫామ్ లోని మామిడి పండ్ల గురించి నేత్ర చెప్పింది. అయితే ఈ వీడియోని తీసుకొని సోషల్ మీడియా ట్రోలర్స్ ఇతర వీడియోలు చేస్తున్నారు. అవి ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. అయితే ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో ఎక్కడ చూసిన ఫార్మర్ నేత్రే కన్పిస్తుంది.  తనకి ఇన్ స్టాగ్రామ్ లో 103K ఫాలోవర్స్ ఉన్నారు. తను ఏ రీల్ చేసిన మినిమమ్ మిలియన్ వ్యూస్ వస్తున్నాయి. సోషల్ మీడియాలో ఇంతగా వైరల్ గా మారిన సెలబ్రిటీని బిగ్ బాస్ తీసుకురాకుండా ఉంటుందా అంటే ఉండదనే చెప్పాలి. ఫార్మర్ నేత్ర ఈ బిగ్ బాస్ - 8 కి వెళ్తుందనే న్యూస్ వైరల్ అవుతోంది. మోటివేషనల్ స్పీకర్ వంశీతో పెళ్లి చేసుకున్న తర్వాత కొన్ని నెలలకే వాళ్ళు విడిపోవడంతో ఫార్మర్ నేత్ర మరింతగా వైరల్ అయింది.   

Karthika Deepam2 : నీకు ఎలా థాంక్స్ చెప్పాలో అర్థం కావడం లేదు.. బావతో పెళ్ళి జరిగేనా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీకదీపం 2 '. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -86  లో... జ్యోత్స్నతో పెళ్లి ఇష్టం లేదని చెప్పడానికి కార్తీక్ అందరిని రెస్టారెంట్ కి పిలుస్తాడు. అదే రెస్టారెంట్ కి కావేరిని స్వప్న తీసుకొని వస్తుంది. వాళ్ళు రావడం చూసిన దీప.. శ్రీధర్ కి సైగ ద్వారా వాళ్ళని చూపిస్తుంది. వాళ్ళను చూసిన శ్రీధర్ కంగారుగా మళ్ళీ వస్తానంటూ పక్కకు వెళ్తాడు. కావేరి స్వప్నలు కార్తీక్ వాళ్ళున్న వైపు వస్తుంటే.. మేనేజర్ ఆపుతాడు. దాంతో కార్తీక్ పిలిచి మనవాళ్లే పంపించమని చెప్పగానే వాళ్ళు లోపలికి వస్తారు. కార్తీక్ అందరికి స్వప్న, కావేరిలని పరిచయం చేస్తాడు. నీ కాలు నొప్పి ఎలా ఉందని స్వప్నని కాంచన అడుగుతుంది. కాసేపటికి మీ నాన్న ఎక్కడ ఇంకా రావడం లేదని కార్తీక్ తో కాంచన అనగా.. వస్తారులే మీరు కూర్చోండని స్వప్న వాళ్లకు కార్తిక్ చెప్తాడు. ఇక స్వప్న అందరిని పరిచయం చేసుకుంటుంది. హ్యాండ్ వాష్ కోసం అంటు శ్రీధర్ దగ్గరికి దీప వెళ్తుంది. నీకు ఎలా థాంక్స్ చెప్పాలో అర్థం కావడం లేదని శ్రీధర్ అంటాడు. నేను మీ కోసం ఇదంతా చెయ్యలేదు.. పాపం కాంచన గారికి నిజం తెలిస్తే తట్టుకోలేదని దీప అంటుంది. మీరు అందరి జీవితాలతో ఆడుకుంటున్నారని శ్రీధర్ తో దీప అంటుంది. ఆ తర్వాత ఈ దీప ఎక్కడికి వెళ్ళిందంటూ జ్యోత్స్న బయటకు వస్తుంది. దీప, శ్రీధర్ తో మాట్లాడుతుందేంటి.. ఈ దీప ఏదో చేస్తుందని జ్యోత్స్న అనుకుంటుంది. కాసేపటికి దీప లోపలికి వస్తుంది అప్పుడే ఇక మేమ్ వెళ్తామంటూ కావేరి , స్వప్న లు అంటుంటే.. ఉండండి అని కార్తీక్ అంటాడు. వెళ్లనివ్వండి అని దీప అనగానే..కార్తీక్ ఆశ్చర్యంగా చూస్తాడు. మేమ్ ఏం ఉండడం లేదని కావేరి కోపంగా అంటుంది. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయాక శ్రీధర్ వస్తాడు. ఇప్పుడు పెళ్లి గురించి చెప్పడం కరెక్ట్ కాదని కార్తీక్ అనుకొని.. ఇప్పుడు పెళ్లి గురించి వద్దని అంటాడు. కశౌర్యకి ఐస్క్రీమ్ తీసుకోవడానికి కార్తిక్ వెళ్తాడు. బావ నాతో పెళ్లి గురించి మాట్లాడకుండా ఈ దీప చేస్తుందని జ్యోత్స్న అనుకుంటుంది. ఆ తర్వాత ఎందుకు ఇలా వింతగా ప్రవర్తిస్తున్నారు దీప అని కార్తీక్ అంటాడు. శ్రీధర్ గురించి కార్తీక్ కి చెప్పాబోతుంది. అప్పుడే శౌర్య వస్తుంది. నాకు నీరసంగా ఉందని దీప శౌర్యని తీసుకుని వెళ్తుంది. మరొకవైపు జ్యోత్స్న జరిగింది మొత్తం పారిజాతానికి చెప్తుంది. నన్ను బావ పెళ్లి చేసుకోవడం ఆ దీపకి ఇష్టం లేదని జ్యోత్స్న పారిజాతానికి చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Eto Vellipoyindhi Manasu : రేపటిలోగా దొంగని కనిపెడతా.. లేదంటే ఇళ్ళు వదిలి వెళ్ళిపోతా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు' ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -138 లో....రామలక్ష్మి దొంగతనం చేసిందని శ్రీవల్లి, శ్రీలతలు అంటుంటే.. సీతాకాంత్ మౌనం గా ఉంటాడు. నువు రామలక్ష్మి దొంగతనం చేసిందంటే నమ్మలేకపోతున్నావ్.. అందుకే ఏం మాట్లాడలేకపోతున్నావని  సీతాకాంత్ తో శ్రీలత అంటుంది. అప్పుడే ఆపండి అంటు ధన కోప్పడుతాడు. మా అక్కకి కష్టపడే గుణము ఉంది కానీ ఇలాంటి దొంగ బుద్ది లేదు.. కష్టపడి మా కుటుంబాన్ని పోషించిందని ధన‌  అంటాడు. అవును వదినకి ఒక రింగ్ దొరికితేనే అంత బయపడి వాళ్ళది వాళ్ళకి ఇచ్చేవరకు ప్రశాంతంగా లేదని సిరి అంటుంది. రామలక్ష్మి దొంగతనం చేసింది అనడం అర్థం లేదని పెద్దాయన అంటాడు.మరి రామలక్ష్మి లాకర్ లో పెట్టిన నగలు తనకి తెలియకుండా ఎలా మాయం అవుతాయని శ్రీలత అంటుంది. మీరు ఆపండి ఇప్పుడే మా నాన్నని రమ్మని పిలుస్తానంటూ ధన మాణిక్యానికి ఫోన్ చేసి అర్జెంట్ గా రమ్మని చెప్తాడు. ఆ తర్వాత మాణిక్యం ఇంట్లోకి వస్తాడు. ఏమైందని అడుగుతాడు. అసలు నువ్వు ప్రొద్దున ఎందుకు వచ్చావ్ అని ధన అడుగుతాడు. మందు తాగడానికి డబ్బుల కోసమని మాణిక్యం చెప్పగానే.. చూసారా అనవసరంగా మా రామలక్ష్మి దొంగతనం చేసిందని అంటున్నారు అని ధన అంటాడు. ఈ తండ్రి కూతుళ్ళు ముందే ఒక మాట అనుకుని ఉన్నారేమోనని శ్రీవల్లి అంటుంది. నా కూతురు అలాంటిది కాదని మాణిక్యం అంటాడు. ఈ స్థానంలో ఎవరున్నా నగలు పోవడం వెనకాల కారణం నీ కూతురే అనుకుంటారని శ్రీలత అనగానే.. నేను మాత్రం నువ్వే అనుకుంటాను.. నువ్వే దొంగతనం చేసి నా కూతురు పైన నెడుతున్నావ్.. నా కూతురు నీ కొడుకుని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదు.. అందుకే తనని ఇంట్లో నుండి పంపాలని ఇదంతా చేస్తున్నావని మాణిక్యం అంటాడు. అలా మాట్లాడతావేంటని అని మాణిక్యం పైకి సీతకాంత్ పైర్ అవుతాడు. ఇప్పుడు పోలీసులకి ఫోన్ చేస్తే వాళ్లే కనిపెడుతారని ధన ఫోన్ చేస్తుంటే.. రామలక్ష్మి ఆపి ఈ కుటుంబం పరువు కాపాడి, నా పై పడ్డ నిందని పోగొట్టుకునే అవసరం ఉంది.. రేపటివరకు ఈ దొంగతనం ఎవరు చేసారో కనిపెడుతానని రామలక్ష్మి అంటుంది. ఒకవేళ చేయకుంటే అని శ్రీవల్లి అనగానే.. ఇంట్లో నుండి వెళ్ళిపోతానని రామలక్ష్మి అంటుంది. ఆ తర్వాత ఈ సమస్య నుండి ఎలా బయటకు వస్తావ్ అల్లుడు కూడా సైలెంట్ గా ఉన్నాడని మాణిక్యం అనగానే.. నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో.. నీ వల్లే వాళ్ళకి ఛాన్స్ దొరికిందని రామలక్ష్మి అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : భార్యని టార్చర్ చేయలేదనడానికి సాక్ష్యం కావాలి!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -451 లో... అనామిక ఇచ్చిన కంప్లైంట్ తో పోలీసులు కళ్యాణ్ ని అరెస్ట్ చెయ్యడానికి వస్తారు. ఇప్పుడు మనం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని అది కళ్యాణ్ హ్యాపీగా ఉండేలా చూడాలని ధాన్యలక్ష్మితో రాజ్ అనగానే.. నాకేం అర్థం కావడం లేదు రాజ్.. మీ ఇష్టమని ధాన్యలక్ష్మి అంటుంది. కళ్యాణ్ నువ్వు ధైర్యంగా వెళ్ళు న్యాయం మనవైపు ఉందని కళ్యాణ్ కి రాజ్ చెప్తాడు. ఆ తర్వాత పోలీసులు కళ్యాణ్ ని తీసుకెళ్తారు. మరొకవైపు బంటుగాడు అప్పు దగ్గరికి వచ్చి.. కళ్యాణ్ ని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొని వెళ్లారని అనగానే.. అప్పు కంగారు గా వెళ్తుంటే కనకం ఆపుతుంది. ఎక్కడికి వెళ్ళేది.. నీతో తిరగడం వల్లే ఆ అనామిక కళ్యాణ్ పైన కేసు పెట్టింది. ఇప్పుడు నువ్వు వెళ్తే అది అనుకున్నదే నిజం చేసినట్టు అవుతుందని అప్పుతో కనకం అంటుంది. అక్కడ నా ఫ్రెండ్ ప్రాబ్లెమ్ లో ఉన్నాడు అమ్మ అని అప్పు చెప్పి వెళ్లిపోతుంటే.. నువ్వు ఇక్కడ నుండి వెళ్తే నేను చచ్చినట్టే అని కనకం తన పైన ప్రామిస్ వేయించుకుంటుంది. ఆ తర్వాత రాజ్ లాయర్ తో మనం ఎక్కడ తగ్గకూడదని మాట్లాడుతుంటే.. అప్పుడే కావ్య వచ్చి మీరు కూడా మీ తమ్ముడికి విడాకులు ఇప్పించాలని ఫిక్స్ అయ్యారా అని అడుగుతుంది. వెళ్తు వెళ్తు అనామిక ఏం అందో విన్నావు కదా అని రాజ్ అంటాడు. ఆ తర్వాత రాజ్ దగ్గరికి అపర్ణ వచ్చి విడాకులు ఇప్పించక తప్పదా అని అడుగుతుంది. కళ్యాణ్ సంతోషంగా ఉండాలంటే తప్పదని రాజ్ అంటాడు. అనామిక ఇంత పిచ్చిది ఏంట్రా.. మనం ఏం చెప్తే అది చేసింది. ఇప్పుడు ఏకంగా కళ్యాణ్ ని అరెస్ట్ చేయించింది. ఇప్పుడు మనం ఒకటి చేయాలి. రేపు దుగ్గిరాల ఫ్యామిలీ కోర్ట్ కి వెళ్తారు కదా.. అక్కడ మీడియా వాళ్ళని పిలిపించాలి. అప్పుడు ఇంకా పరువుపోతుంది ఇది కూడా అనామిక వల్లే అని దుగ్గిరాల ఫ్యామిలీ తనపై ఇంకా కోపంగా ఉంటారని రాహుల్ కి చెప్తుంది రుద్రాణి. మరుసటి రోజు కోర్ట్ ముందు కళ్యాణ్ కి నెగెటివ్ గా నినాదాలు చేస్తుంటారు. అప్పుడే రాజ్ వాళ్ళు వస్తారు. మీడియా వాళ్ళు ప్రశ్నలతో వేధిస్తుంటారు. ఆ తర్వాత కళ్యాణ్ వస్తాడు. కళ్యాణ్ ని కూడా ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతుంటారు. తరువాయి భాగంలో తన వైఫ్ ని ఎలాంటి టార్చర్ చెయ్యలేదు.. తనే ఇదంతా కావాలని చేస్తుందని ప్రూఫ్ తీసుకొని రావాలని కళ్యాణ్ తరుపున లాయర్ చెప్తాడు. ఆ తర్వాత తప్పు అయిందని చెప్పి నన్ను తీసుకొని వెళ్ళండి అని అనామిక అంటుంది. అది జరగదు అని కళ్యాణ్ అంటాడు. అయితే లాయర్ సాక్ష్యం తీసుకొని రమ్మని చెప్తున్నాడని అనామిక అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

మీరే తలకొరివి పెట్టాలి.. ఢీ స్టేజ్‌పై చైతన్య మాస్టర్ తల్లి కన్నీళ్లు

బుల్లితెర మీద  ఢీ షో ఎంతలా పేరు తెచ్చుకుందో అందరికీ తెలుసు. ఈ షోతో ఎంతో మంది డ్యాన్సర్లు, కొరియోగ్రాఫర్లు కూడా అయ్యారు. ఇదిలా ఉంటే ప్రతి సీజన్‌ సరికొత్తగా అలరిస్తూ వస్తోంది. కొత్త కొత్త కాన్సెప్టులతో ఈ డ్యాన్స్ రియాలిటీ షో ఆకట్టుకుంటుంది. ఇప్పుడు ఢీ సెలబ్రిటీ స్పెషల్ 2 స్టార్ట్ అయ్యింది. దీనికి శేఖర్ మాస్టర్, గణేష్ మాస్టర్ జడ్జిలుగా వ్యవహరిస్తున్న సంగతి విదితమే. గతంలో సదా,పూర్ణ ఈ షోలో జడ్జెస్ గా అలరించి వెళ్లారు.  ఇప్పుడు ప్రముఖ హీరోయిన్ హన్సిక హోస్ట్ గా చేస్తోంది. శ్రీ సత్య, ఆది కంటెస్టెంట్ల తరుఫున కోఆర్డినేటర్లుగా వ్యవహరిస్తున్నారు. ఇక లేటెస్ట్ ఎపిసోడ్ కి సంబంధించి  ప్రోమో రిలీజ్ అయ్యింది. అందులో హన్సిక కన్నీళ్లు పెట్టేసుకుంది. ఈ ప్రోమోలో చైతన్య మాస్టర్ తల్లితండ్రులు రావడంతో ఒక్కసారిగా స్టేజి మీద అంత ఎమోషనల్ ఐపోయారు. చైతన్య పేరెంట్స్ వెంకట సుబ్బారావు, లక్ష్మీ రాజ్యం వచ్చి తన కుమారుడు గురించి తలుచుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. చైతన్య ఫేమస్ గెటప్ బబ్లీ గెటప్ వేసుకుని చైతన్య  తండ్రి ఎంట్రీ ఇచ్చారు. ఆయన్ను చూడగానే.. శేఖర్ మాస్టర్.. ‘చైతన్య వచ్చాడన్నట్టు అనిపించింది" అంటూ ఎమోషనల్ అయ్యాడు. అందరూ  చైతన్యను గుర్తు చేసుకున్నారు.  చైతన్య మాస్టర్ తల్లి లక్ష్మీ రాజ్యం కూడా ఎంతో బాధపడింది. ‘వీళ్లంతా నా కొడుకులే. రేపు నేను చనిపోతే వస్తారా..? నన్ను మోస్తారా..? మీరే నన్ను మోయాలి. మీరే తలకొరివి పెట్టాలి. ఇదే నా కోరిక.. ఎందుకంటే నాకు నా కొడుకు లేడు కాబట్టి’ అంటూ ఏడ్చేసారికి పండు ఆమెను ఓదార్చాడు. ఇది చూసి హన్సిక కూడా కన్నీరు పెట్టుకుంది. ఢీ షోతో పాపులర్ ఐన చైతన్య మాస్టర్  గత ఏడాది మేలో బలవన్మరణానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు అతన్ని మరోసారి తలుచుకున్నారంతా.  

ఒకే ఇంట్లో బర్రెలక్కతో కిర్రాక్ ఆర్పీ!

  సీరియల్స్, కామెడీ అండ్ డ్యాన్స్, గేమ్ షోస్ ఇలా ఎన్నో ఉన్నాయి. అవన్నీ ఒకెత్తు బిగ్ బాస్ ఒక్కటే ఒకెత్తు.  తెలుగు బిగ్ బాస్ 7 సీజన్లను పూర్తి చేసుకుని  ఎనిమిదో సీజన్ కోసం రెడీ అవుతోంది. ఐతే రీసెంట్ గా బిగ్ బాస్ లోకి వెళ్లే వాళ్ళ పేర్లతో ఒక లిస్ట్ అనేది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బిగ్ బాస్ సీజన్ 8 సెప్టెంబర్ లో ప్రారంభం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.   సుమారు 20 మంది కంటెస్టెంట్స్ ఇంట్లోకి అడుగు పెడతారనే టాక్ వినిపిస్తోంది.   యూట్యూబ్, ఇన్ స్టాతో ఫేమస్ అయిన ఇన్ఫ్లయెన్సర్లను ఎక్కువగా బిగ్ బాస్ హౌస్‌కి తీసుకొచ్చే అవకాశం ఉందనే టాక్ నడుస్తోంది. బిగ్‏బాస్ సీజన్ 8 కంటెస్టెంట్స్ లిస్ట్.. 1.అంజలి పవన్.. యాంకర్.. 2.వింధ్య విశాక.. యాంకర్.. 3.నయని పావని.. యూట్యూబర్.. 4.కిర్రాక్ ఆర్పీ.. జబర్దస్త్ కమెడియన్.. 5.రీతూ చౌదరి.. యాంకర్.. 6.అమృతా ప్రణయ్.. 7.నిఖిల్.. యాంకర్.. 8.కుమారీ ఆంటీ.. 9.బర్రెలక్క.. 10.అనీల్ గీలా.. యూట్యూబర్.. 11.బుల్లెట్ భాస్కర్.. జబర్దస్త్ కమెడియన్.. 12.సోనియా సింగ్.. సినీనటి. 13.బమ్ చిక్ బబ్లూ.. యూట్యూబర్.. 14.కుషితా కల్లపు.. హీరోయిన్.. 15.వంశీ.. యూట్యూబర్.. 16.సుప్రిత.. సురేఖ వాణి కూతురు.. ప్రస్తుతం వీరితోపాటు మరికొందరి పేర్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ఇంకా ఫేమస్ అయ్యి ఆడియన్స్ కి బాగా తెలిసిన ముఖాలనే హౌస్ లోకి తీసుకురాబోతున్నారని వాళ్ళతో బిగ్ బాస్ టీమ్ సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. చాలా వరకు మసాలా కంటెస్టెంట్స్ ని , వాగుడుకాయల్ని, అలాగే పోట్లాడేవాళ్ళను బిగ్ బాస్ ఏరికోరి కంటెంట్ కోసం తీసుకొస్తూనే ఉంటుంది. మరి ఈసారి వీళ్ళే కాకుండా ఇంకా  అలాంటి ఇంటరెస్టింగ్ కంటెస్టెంట్స్ ఎవరు ఉండబోతున్నారో చూడాలి.

సైలెంట్‌గా రష్మీ.. ఆది సెటైర్లు... అసలు ఏమయ్యింది!

  శ్రీదేవి డ్రామా కంపెనీ నెక్స్ట్ వీక్ ప్రోమో రీసెంట్  గా రిలీజ్ అయ్యింది. ఈ ప్రోమో చూస్తే ఫుల్ ఎంటర్టైన్ చేసేదిగా కనిపిస్తోంది. ఐతే ఈ షో ఆది, నాటీ నరేష్ కలిసి దొంగలుగా నటించారు. ఇక నాగదేవత జాతర జరిపించి ఆ ఊరి వాళ్ళ దగ్గర నుంచి డబ్బు కొట్టేయాలని వాళ్ళు ప్లాన్ వేశారు. అనుకున్నట్టుగానే ఈ జాతరను నిర్వహించడానికి రష్మీని, ఇంద్రజాను పిలిపించారు. వాళ్ళు ఎంటర్టైన్ చేయిస్తూ ఉన్నారు. ఈ షోలో కొంతమంది తెలంగాణ జానపద పాటలు పాడి అలరించారు. అలాగే బులెట్ భాస్కర్, రాకెట్ రాఘవకు మధ్య ఒక గేమ్ నిర్వహించారు. ఇక డాన్సర్ పండు వేసిన డాన్స్ ఐతే ఇరగదీసింది.. అందరూ ఆ డాన్స్ కి మెస్మొరైజ్ ఐపోయారు. అలాగే లాస్ట్ లో ఆది అంత్యాక్షరి ఆడించాడు. అందులో పాట మధ్యలో ఒక వర్డ్ మిస్ అవుతుంది. అదేంటో కనిపెట్టి పాట పాడాలన్నమాట. ఆ కాంటెస్ట్ కూడా ఆది నిర్వహించాడు. ఇక రోహిణి ఒక పాట పాడింది. ఐతే ఆ పదం తప్పుగా పాడేసరికి ఆది సెటైర్స్ వేసి నవ్వించాడు. ఐతే ఈ ప్రోమోలో ఎవరూ గమనించని ఒక ట్విస్ట్ ఉంది. ఏ ప్రోమోలో ఐనా సరే రష్మీ గలగలా మాట్లాడుతూ నవ్వుతూ తుళ్ళుతూ జోక్స్ వేస్తూ, తన మీద వేయించుకుంటూ ఉంటుంది. కానీ ఈ వారం రాబోయే షోలో రష్మీ చాల సైలెంట్ గా ఉంది. కారణం ఏంటో తెలీదు కానీ ప్రోమో మొత్తంలో ఆమె అసలు మాట్లాడని లేదు. మరి రష్మీ సైలెన్స్ వెనక కారణం ఏమిటో తెలీదు.  

Karthika Deepam2 : అదే రెస్టారెంట్ కి వచ్చిన రెండో భార్య, వాళ్ళ కూతురు.. షాక్ లో భర్త!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -85 లో.. నువ్వు వారం రోజులు స్కూల్ కి వెళ్లొద్దని శౌర్యతో దీప చెప్పగానే.. అప్పుడే కార్తీక్ వస్తుంటాడు. ఎందుకు వద్దు అంటున్నారని అడుగుతాడు. నర్సింహా గురించి చెప్తే పోలీస్ కంప్లైంట్ అంటాడని ఏం లేదు బాబు.. మా ఊరికి వెళ్ళాలి అనుకుంటున్నానని దీప చెప్తుంది. ఆ తర్వాత కార్తీక్ తో మాట్లాడను అని శౌర్య అనగానే.. ఎందుకని కార్తీక్ అంటాడు. నేను స్కూల్ కి రమ్మని చెప్పాను.. ఎందుకు రాలేదని శౌర్య అడుగుతుంది. నేను రానందుకు నాకు పనిష్మెంట్ ఇవ్వమని కార్తీక్ అనగానే.. ఇంకొకసారి ఇలా చేయనని ప్రామిస్ చేయమని శౌర్య అంటుంది. కాసేపటికి ఇంకొకసారి బాధ పెట్టనని కార్తిక్ ప్రామిస్ చేస్తాడు. నువ్వు స్కూల్ లో బాగా మాట్లాడవటా కదా ఇదిగో చాక్లెట్ అని కార్తీక్ ఇస్తాడు. నాతో పాటు నిన్ను రెస్టారెంట్ కి తీసుకొని వెళ్తానని కార్తీక్ అంటాడు. మీరు కూడ రండి అని దీపతో కార్తీక్ అనగానే.. నేను రానని దీప చెప్తుంది. శౌర్యని ఒక్కదాన్ని పంపించలేను.. అలా అని వాళ్ళతో వెళ్ళలేనని దీప అనుకుంటుంది. కార్తీక్, శౌర్య బలవంతం చెయ్యడంతో నేను వస్తానని దీప అంటుంది. మరొకవైపు శివన్నారాయణ జ్యోత్స్న, కార్తీక్ ల ఎంగేజ్మెంట్ గురించి మాట్లాడుకుంటారు. అప్పుడే కార్తీక్ వస్తాడు. ఏం మాట్లాడుకుంటున్నారని అడుగుతుంటే.. మీ గురించే.. మీ అమ్మ చెప్పలేదా అని సుమిత్ర అంటుంది. ఏం చెప్పావని పారిజాతం అంటుంది. నువ్వు అనుకున్నది అయితే కాదులే అని కార్తీక్ అంటాడు. ఆ తర్వాత జ్యోత్స్న రెస్టారెంట్ కి వెళదాం రెడీ అవ్వమని కార్తీక్ అంటాడు. దీప శౌర్యలు కూడా వస్తున్నారని కార్తిక్ అనగానే జ్యోత్స్న, పారిజాతం ఇద్దరు షాక్ అవుతారు.ఆ తర్వాత కావేరిని స్వప్న బయటకు తీసుకొని వెళ్తుంది. ఏ రెస్టారెంట్ కి వెళ్లాలో అర్ధం కాక కార్తీక్ ఫోన్ చేసి అడుగుతుంది. జ్యోత్స్న రెస్టారెంట్ కి రండి నేను ఇక్కడే ఉన్నానని కార్తీక్ చెప్పగానే.. స్వప్న సరే అంటుంది. ఆ తర్వాత దీప, శౌర్యలు రెస్టారెంట్ కి వస్తారు. మా కార్తీక్ రెస్టారెంట్ చూసావా ఎలా ఉందోనని శౌర్య అంటుంది. మీ అమ్మ పని చేసేది చాలా చిన్నగా ఉంటుందని జ్యోత్స్న అంటుంది. ఆ తర్వాత మేనేజర్ వచ్చి జ్యోత్స్న, కార్తీక్ ల పెళ్లి గురించి అడుగుతాడు. రెండు నెలల్లో ఉండొచ్చు అని జ్యోత్స్న అంటుంది. అందరు మాట్లాడుకుంటుంటే అప్పుడే స్వప్న, కావేరి వస్తుంటారు. వాళ్ళను దీప చూసి.. ఇప్పుడు శ్రీధర్ గారిని ఫ్యామిలీతో వాళ్ళు చూస్తే ప్రాబ్లమ్ అవుతుందని వాళ్ళు వస్తున్నారని శ్రీధర్ కి దీప సైగ చెయ్యడంతో.. వాళ్ళు రావడం చూసి శ్రీధర్ షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Eto Vellipoyindhi Manasu : రామలక్ష్మి దొంగతనం చేసి ఉంటుంది.. నాపై మాత్రం ఎవరికి డౌట్ రాలేదు!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -137 లో.. రామలక్ష్మి బీరువా కీస్ ఎక్కడ పెట్టానోనని చూస్తుంటుంది. ఇక్కడ పడేసావంటూ సీతాకాంత్ కీస్ ఇస్తాడు. నేను టేబుల్ పైన పెట్టాను.. అక్కడికి ఎలా వెళ్లాయంటూ డౌట్ పడుతూ రామలక్ష్మి బీరువా దగ్గరికి వెళ్లి చూసేసరికి నగలుండవు. దాంతో రామలక్ష్మి టెన్షన్ పడుతుంటే.. ఏమైందని సీతాకంత్ అడుగుతాడు. నగలు లేవని రామలక్ష్మి చెప్పగానే సీతాకాంత్ ఆశ్చర్యపోతాడు. దొంగతనం జరిగి ఉంటుంది. అందుకే కీస్ నేను పెట్టిన చోట లేవని రామలక్ష్మి అంటుంది. ఏం జరిగిందో తెలుసుకుందాం.. నువ్వు టెన్షన్ పడకని సీతాకాంత్ అంటాడు. ఆ తర్వాత కిందకి వచ్చి అందరికి.. ఆ విషయం చెప్పగానే అందరు షాక్ అవుతారు. రాత్రి రామలక్ష్మి బీరువా లో పెట్టింది. ఇప్పుడు చూస్తే నగలు లేవని సీతాకాంత్ అనగానే.. అలా ఎలా జరుగుతుందని శ్రీలత అంటుంది. సందీప్ మాత్రం టెన్షన్ పడుతుంటాడు. నేను ఇలా దూరంగా ఉంటే నా మీద డౌట్ వస్తుందని సందీప్ అనుకుంటాడు. దొంగతనం ఎవరు చేసారనది పోలీస్ కంప్లైంట్ ఇస్తే తెలుస్తుందని సీతాకాంత్ అనగానే దొంగతనం ఇంట్లో వాళ్లే చేసారని పెద్దాయన అంటాడు. ఆ తర్వాత రామలక్ష్మి దొంగతనం చేసే రకం కాదు కానీ దొంగతనం తనే చేసింది అనుకునేలా చెయ్యాలని శ్రీవల్లికి శ్రీలత చెప్తుంది. దాంతో శ్రీవల్లి దొంగతనం రామలక్ష్మి చేసి ఉంటుంది అనగానే‌.. అందరు షాక్ అవుతారు. అవును నేను చెప్పింది నిజమే ఇదిగో సాక్ష్యం కూడా ఉందని మాణిక్యానికి రామలక్ష్మి డబ్బులు ఇస్తున్న వీడియో సీతాకాంత్ కి చూపిస్తుంది. అందులో డబ్బులు ఇస్తున్నట్లు ఉంది. బంగారం ఇచ్చినట్లు ఎక్కడ ఉందని సీతాకాంత్ అంటాడు. మరి ప్రొద్దున అంత సీక్రెట్ గా ఎందుకు మాట్లాడుతుందని శ్రీవల్లి అంటుంది. నువ్వు అర్ధం లేకుండా మాట్లాడకు.. మాణిక్యాన్ని అమ్మ ఇంట్లోకి వద్దని చెప్పింది.. అందుకే బయట మాట్లాడుకున్నారని సీతాకాంత్ అంటాడు. మా నాన్న తాగడానికి డబ్బులు కావాలన్నాడు అందుకే డబ్బులు ఇచ్చాను. నేను దొంగతనం చెయ్యలేదని రామలక్ష్మి అంటుంది. అప్పుడు అన్ని వేళ్ళు రామలక్ష్మి వంకే చూస్తున్నాయ్.. ఎందుకంటే లాకార్ కీస్ తన దగ్గరే ఉన్నాయని శ్రీలత అంటుంటే.. సీతాకాంత్ మౌనంగా ఉంటాడు. నాపై మాత్రం ఎవరికి డౌట్ రాలేదని సందీప్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi :  లైవ్ లో ఇంటిగుట్టు బయటపెట్టేసిన అనామిక.. వాళ్ళిద్దరు ఎమోషనల్!

  స్టార్ మా‌ టీవీలో‌ ప్రసారమవుతున్న సీరియల్ ' బ్రహ్మముడి'. ఈ సీరియల్ ‌సోమవారం నాటి ఎపిసోడ్-450 లో.. అనామిక న్యూస్ ఛానెల్ లో డిబేట్ లో కూర్చుంటుంది. అనామిక అనే ఆడపిల్ల జీవితాన్ని ఆ దుగ్గిరాల ఫ్యామిలీ నాశనం చేసింది. అందరిలానే పెళ్లి గురించి, కాపురం గురించి కలలు కన్న అనామిక జీవితంలో చీకటి అలుముకుంది. దానికి కారణం ఆమె భర్త దుగ్గిరాల కళ్యాణ్.. అతడి తన ప్రియురాలు అప్పూ మాయలో పడి అనామికతో విడిపోవడానికి కళ్యాణ్ సిద్ధపడ్డాడు. ఈ దయనీయమైన కథని చూస్తూనే ఉండండి అంటూ సుకన్య ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తుంది. ప్రస్తుతం అనామిక గారితో పాటు ఉమెన్స్ వెల్ఫేర్ సంస్థ సభ్యురాలు శ్రీమతి ఝాన్సీ గారు కూడా మన స్టూడియోలోనే ఉన్నారు.. అనామిక గారు మాట్లాడండి అని యాంకర్ సుకన్య అంటుంది. దాంతో అనామిక అందుకుంటుంది. కళ్యాణ్ గొప్పింటి వాడే కానీ.. సంస్కారం తెలియదు. వాళ్లకు ఎన్ని కంపెనీలు ఉన్నా తను మాత్రం ఉద్యోగం చెయ్యడు. తింటాడు ఆ అప్పూతో కలిసి తిరుగుతాడు. వాళ్లిద్దరూ రెడ్ హ్యాండెడ్‌గా హోటల్ రూమ్‌లో దొరికేసినా సరే తప్పు అంతా నాదే అని నిందలు వేశాడు కళ్యాణ్.. అతడి ఫ్యామిలీ కూడా అతడినే సపోర్ట్ చేసిందని అనామిక చెప్తుంది . పడకగదిలో నాకు నరకం చూపిస్తాడు ఆ కళ్యాణ్. అదే విషయం ఇంట్లో అందరికి చెప్పినా ఎవ్వరూ నా తరపు నిలబడలేదు. పైగా విడాకులు కావాలని ఈ మధ్య టార్చర్ మొదలుపెట్టాడు నా భర్త.. ఇదిగోండి విడాకుల పత్రాలు అంటూ అనామిక డైవర్స్ పేపర్స్ చూపిస్తుంది. ఇటు దుగ్గిరాల ఫ్యామిలీ.. అటు కనకం ఫ్యామిలీ టీవీలో అనామిక మాట విని, చూసి షాక్ అవుతారు. ఇక ఝాన్సీ ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. ఏమ్మా అనామిక.. నీ పెళ్లి అయ్యి ఎంత కాలం అయ్యిందని ఝాన్సీ అడుగగా.‌‌. నాలుగైదు నెలలు అయ్యింది మేడమ్ అని అనామిక అంటుంది. ప్రేమ పెళ్లా పెద్దలు కుద్చిన పెళ్లా అని ఝాన్సీ అడుగగా.. అవును మేడమ్.. మొదట ప్రేమించుకున్నాం.. తర్వాత పెద్దలను ఒప్పించుకుని పెళ్లి చేసుకున్నామని అనామిక అంటుంది. మరి ప్రేమించినప్పుడు కళ్యాణ్ ఏం చెయ్యకుండా ఖాళీగా ఉంటాడని తెలియదా? అని ఝాన్సీ అంటుంది. తెలుసు. కవిత్వం రాసుకునేవాడు. అది చూసే ప్రేమించానని అనామిక చెప్తుంది.  పెళ్లి అయ్యాక కవిత్వం నచ్చలేదా? కవిత్వం రాసే మనిషి నచ్చలేదా? కవిత్వం రాయడం కళ మాత్రమే కాదు.. అది కూడా ఓ విద్యేనని నీకు తెలియదా అని ఝాన్సీ అడుగగా.. తెలుసు.. కానీ బిజినెస్ చూసుకోమంటే చూసుకోవడం లేదు.. అయిన మేడమ్... నేను ఇప్పుడు కేవలం నా కాపురం గురించి చర్చించడానికి మాత్రమే వచ్చానని అనామిక అంటుంది. ఇక కళ్యాణ్, అప్పులు రెడ్ హ్యాండెండ్ గా హోటల్ లో దొరికిందని , ఈ టీవీలోనే వచ్చిందని సీసీటీవీ ఫుటేజ్ చూపించగా ఝాన్సీ షాక్ అవుతుంది. ఆ తర్వాత అనామికకి సపోర్ట్ చేస్తుంది. మరోవైపు ఈ డిబేట్ చూస్తున్న దుగ్గిరాల ఫ్యామిలీ, కనకం ఫ్యామిలీ షాక్ లో ఉంటారు. ‌దుగ్గిరాల వారు కళ్యాణ్ వైపు జాలిగా చూస్తుంటే.. కనకం, కృష్ణమూర్తి ఇద్దరూ అప్పూ వైపు జాలిగా చూస్తారు.  పచ్చగా పండదు ఈ నేల.. బతుకులా ఉండదు ఏ వేళ.. ముల్లను తెచ్చి నాటాక మల్లెలు పూస్తాయా అంటూ ఎమోషనల్ సాంగ్ మొదలవుతుంది. కళ్యాణ్, అనామిక ఎవరికి వారు ఒంటరిగా బాధపడుతూ ఆలోచిస్తూ కన్పిస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Guppedantha Manasu: శైలేంద్రకి మను వార్నింగ్.. జస్ట్ మిస్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్- 1115 లో  .. రౌడీలను చితక్కొట్టి నేరుగా శైలేంద్ర దగ్గరకు మను వెళ్తాడు. వీడు ఇంకా చనిపోలేదా? అని శైలేంద్ర చూస్తాడు. దాంతో మను.. ఏంటీ.. అలా చూస్తున్నావ్.. వీడింకా చనిపోలేదేంటనా? నువ్వు కాదు కదా.. నీ తల్లో జేజమ్మ దిగొచ్చినా నన్నేం చేయలేవని మను అంటాడు. ఆ మాటతో శైలేంద్ర.. నువ్వేం మాట్లాడుతున్నావ్ మను.. చనిపోవడం, బతకడం ఏంటి? నీకు మతిపోయిందా అని అంటాడు. అబ్బా ఏం యాక్ట్ చేస్తున్నావ్.. ఒక్కసారి అటు చూడు అంటూ తనని చంపడానికి పంపిన రౌడీలను చూపిస్తాడు. వాళ్లు గేటు బయట చేతులు కట్టుకుని లైన్‌లో నిలబడి ఉంటారు. వాళ్లని చూసిన శైలేంద్ర షాకవుతాడు. రేయ్ చెత్త వెధవల్లారా.. మీరు దొరికిపోయి.. నన్ను ఇరికించార్రా అని శైలేంద్ర అనుకుంటాడు. వాళ్లని పంపించింది నువ్వే కదా అని మను అడుగుతాడు.  హా అవునూ.. నేనే పంపించా.. అయితే ఏంటిప్పుడు అని శైలేంద్ర అంటాడు. అబ్బే ఏం లేదు.. నువ్వు చేయాల్సింది నువ్వు చేశావ్ కదా.. ఇప్పుడు నేను చేయాల్సింది నేను చేస్తానని మను అంటాడ. నువ్వు నన్నేం చేయలేవ్.. నువ్వు నా దారికి అడ్డొస్తున్నావ్.. మర్యాదగా అడ్డుతప్పుకో.. ఈసారికి మిస్ అయ్యింది.. ప్రతిసారీ మిస్ అవ్వదని గుర్తుపెట్టుకో.. ప్రాణంపై ఆశ ఉంటే నా మాట విను అని శైలేంద్ర అంటాడు. ఆ మాటతో మను.. ప్రాణాలకు భయపడే రకాన్ని కాదు.. మెడలు వంచి నీ గుండెల్లో దడ పుట్టించే రకాన్ని అని‌ మను అంటాడు. డైలాగ్‌లు కాదు బ్రదర్.. బరిలోకి దిగి చూడు.. ఈ శైలేంద్ర ప్రతాపం ఏంటో తెలుస్తుంది అని అంటాడు. నీలాగ దొంగదెబ్బ కొట్టే రకం కాదు.. ఏదైనా స్టైట్‌గానే చేస్తా అని మను అనగా.. అసలు నువ్వు ఎందుకొచ్చావ్ రా అని శైలేంద్ర అనడంతో..  నీ తండ్రి ఫణీంద్రకి నీపై కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చా.. నువ్వు నాపై ఎటాక్ చేయించావని ఫణీంద్ర సర్‌ కి చెప్తా.. ఒక్కసారి అటు చూడంటూ.. అప్పుడే ఇంటి నుంచి ఫోన్ మాట్లాడుతూ బయటకు వస్తున్న ఫణీంద్ర‌ని చూపిస్తాడు మను. దాంతో శైలేంద్ర.. నువ్వు చెప్తే మా డాడీ నమ్మకుండా ఉండటానికి నా ప్లాన్‌లు నాకు ఉన్నాయి.. పోయి చెప్పుకో.. ఇక్కడున్నది శైలేంద్ర భూషణ్ అని గుర్తు పెట్టుకో’ అని అంటాడు. దాంతో మను.. హో.. మరి ఆ రౌడీలు వచ్చి చెప్పినా నమ్మరా అని అంటాడు. ఆ మాటతో శైలేంద్ర నోట మాటరాదు. చెప్పు బ్రదర్.. మీ డాడీ ఇప్పుడు నమ్ముతారా నమ్మరా అని మను అంటాడు మను. దాంతో శైలేంద్ర.. నమ్ముతారు.. నమ్ముతారు.. సారీ బ్రదర్.. సారీ.. నేను తప్పుచేశాను. మా డాడీకి చెప్పకు.. ఏం చెప్పొద్దు బ్రదర్.. ఈ విషయం ఆయనకి చెప్తే నన్ను చంపేస్తారని శైలేంద్ర రిక్వెస్ట్ చేస్తాడు. నీ తప్పుడు పనుల్ని నీ తండ్రితో చెప్పాల్సిందేనని ఫణీంద్ర దగ్గరకు మను వెళ్లబోతుండగా.. ప్లీజ్ బ్రదర్.. నీ కాళ్లు పట్టుకుంటా చెప్పొద్దని అంటాడు. ఇంతలో ఫణీంద్ర వచ్చి.. హాయ్ మనూ.. నువ్వెప్పుడు వచ్చావని వస్తాడు.  ఇప్పుడే వచ్చాను సర్ అంటూ శైలేంద్ర భుజంపై చేయి వేసి నవ్వుతాడు మను. దాంతో శైలేంద్ర చెప్పొద్దు ప్లీజ్ అంటూ కనుసైగలు చేస్తాడు. ఏంటి మను.. మా వాడు ఏదైనా వెధవ వేషాలు వేస్తున్నాడా? చెప్పు మనూ తాట తీస్తానని ఫణీంద్ర అంటాడు. హయ్యో డాడీ.. అలాంటిదేమీ లేదు.. మేమ్ సరదాగా మాట్లాడుకుంటున్నాం అంతే అని శైలేంద్ర అంటాడు . వీడు చెప్పేది నిజమేనా మనూ.. ఏం లేదా అని ఫణీంద్ర అడుగుతాడు. అవును సర్.. ఏం లేదు.. క్యాజువల్‌‌గానే మాట్లాడుకుంటున్నామని మను అంటాడు. తప్పైపోయింది.. నన్ను క్షమించమంటూ మను ముందు గుంజీలు తీసేస్తాడు. నువ్వేం చేయమంటే అదే చేస్తాను బ్రదర్.. కానీ ఈ విషయం మాత్రం మా డాడీతో చెప్పొద్దు బ్రదర్.. బుద్దొచ్చింది.. ఇక మారతాననని అంటాడు. అదీ లెక్క.. భయం అంటే ఏంటో తెలిసిందా?? ప్రతిక్షణం.. ఇలాగే భయపడుతూ ఉండు.. ఒకవేళ తోకజాడిస్తే.. మరుక్షణమే నీ తోక కట్ చేస్తానంటూ శైలేంద్రకి మను వార్నింగ్ ఇస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

ఎమోషనల్ డ్రామాగా చిన్ని.. నేడే ప్రారంభం!

  స్టార్ మా ఛానల్‌లో నేటి (జూలై 01) నుంచి ‘చిన్ని’ అనే కొత్త సీరియల్ ప్రసారం కానుంది. సోమవారం నుంచి శనివారం వరకూ రాత్రి 7 గంటలకు ‘చిన్ని’ సీరియల్ ప్రసారం కానుంది. అయితే ఏదైనా కొత్త సీరియల్ వస్తుందంటే.. దాన్ని తీసుకొచ్చి ప్రైమ్ టైమ్ లో పెడుతుంటారు. రాత్రి 7 నుంచి 9.30 వరకూ మంచి ప్రైమ్ టైమ్ కాబట్టి ఆ టైమ్ లో ప్రసారం అయ్యే సీరియల్స్‌కి ఎక్కువ రేటింగ్ వస్తుంటుంది. కాబట్టి కొత్త సీరియల్ ఏదైనా సరే అదే టైమ్ లో పెడుతుంటారు. ఇప్పుడు చిన్ని సీరియల్‌ని రాత్రి 7 గంటలకు ప్రసారం చేస్తుండంటంతో.. ఇతర సీరియల్స్ టైమింగ్స్ మారాయి. ఈ సీరియల్ ప్రోమో ప్రకారం.. చిన్ని జైలులో పుట్టి అక్కడే తన తల్లితో పాటు జైలులోనే పెరుగుతుంది. ఆ జైలునే తన ప్రపంచం అనుకుంటుంది చిన్ని. అక్కడ ఉండే ఖైదీలు, జైలర్, పోలీసులు, పనిచేసేవాళ్లు వీళ్లే ‘చిన్ని’.. బంధువులు, బంధుత్వాలు. పదేళ్లవరకు తల్లితోనే పెరిగిన చిన్ని అనూహ్య పరిస్థితుల్లో తల్లిని వదిలి జైలు నుంచి బయటకు వస్తుంది. తన తల్లి ఇచ్చిన నమ్మకంతో జైలు నుంచి బయటకు వచ్చిన చిన్ని.. తనకి పరిచయం లేని ప్రపంచంలో ఎలా ఉండబోతోంది? ఆమెకు నీడనిచ్చిందెవరు? తిరిగి తన తల్లి ప్రేమను ఎలా దక్కించుకున్నదన్న భావోద్వేగ కథే ‘చిన్ని’.  ఈ సీరియల్‌లో మెయిన్ లీడ్ హీరోయిన్‌గా కావ్య శ్రీ (Kavya Sri) నటిస్తోంది. జైల్లో ఖైదీగా.. చిన్నికి జన్మనిచ్చిన తల్లిగా బరువైన పాత్రలో నటించింది కావ్యశ్రీ. ఈమె గతంలో ‘గోరింటాకు’, ‘గువ్వ గోరింక’ వంటి సీరియల్స్‌లో నటించి మెప్పించింది. ప్రస్తుతం చిన్ని సీరియల్‌తో స్టార్ మా టీవీ అభిమానుల్ని అలరించేందుకు రెడీ అయ్యింది. వీరేన్ (Actor Viren) నెగిటివ్ రోల్‌లో కనిపించబోతున్నారు. ఇతను గతంలో అగ్నిపూలు, అభిషేకం, ఎన్నెన్నో జన్మలబంధం వంటి సీరియల్స్‌లో నటించారు. మరో నటుడు రవికిరణ్ కీలకపాత్రలో కనిపించబోతున్నాడు. చిన్ని సీరియల్ రాత్రి 7 గంటలకు ప్రసారం కానుండటంతో.. ఆ టైంలో ప్రసారం అవుతున్న.. ‘నువ్వు నేను ప్రేమ’ సీరియల్ మధ్యాహ్నం 1 గంటకు మారింది. మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రసారం అవుతున్న మామగారు రెండింటికి షిఫ్ట్ అయ్యింది. ఆరు గంటలకు ‘గుప్పెడంత మనసు’ సీరియల్ ప్రసారం అవుతుండగా.. 6.30 గంటలకు మగువా ఓ మగువా, 7.00 గంటలకు నువ్వు నేను ప్రేమ, 7.30కి బ్రహ్మముడి, 8. 00 గంటలకు కార్తీకదీపం సీరియల్స్ ప్రసారం అవుతున్నాయి. అయితే ఇప్పుడు రాత్రి 7 గంటలకు ‘చిన్న’ సీరియల్ వస్తుండటంతో ‘నువ్వు నేను ప్రేమ’ సీరియల్‌ని మధ్యాహ్నం ఒంటగంటకు మార్చేశారు.   

దీపకి సారీ చెప్పిన ప్రిన్సిపల్.. పెళ్లి గురించి క్లారిటీ ఇస్తానన్న కార్తీక్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2' (Karthika Deepam 2). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -84 లో... ఫాథర్స్ డే రోజు శౌర్య దీప గురించి గొప్పగా చెప్పేసరికి.. అందరు దీపని పొగుడుతారు. మీరెంతో మందికి ఆదర్శం మిమ్మల్ని ఆ రోజు తక్కువ చేసి మాట్లాడానంటూ ప్రిన్సిపల్.. దీపకి సారీ చెప్తాడు.  మరొకవైపు ఇక నేను వెళ్తున్నాను.. స్వప్నకి అంటే నిజం తెలియక మాట్లాడుతుంది. నీకేమైంది నిజం తెలుసు కదా అసలు స్వప్నకి ఎప్పుడో నిజం చెప్పాలిసిందని కావేరితో శ్రీధర్ అంటుంటాడు. అప్పుడే స్వప్న వచ్చి ఏం నిజమని అడుగుతుంది. దాంతో కావేరి, శ్రీధర్ లు ఇద్దరు టెన్షన్ పడతారు. ఏం లేదమ్మా తెల్సిన ఫ్యామిలీ ఉంది. అబ్బాయి బాగున్నాడని చెప్తున్నా.. ఆ నిజం ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా తనతో చెప్పేది కదా అంటున్నాని శ్రీధర్ కవర్ చేస్తాడు. ఆ తర్వాత శ్రీధర్ క్యాంపుకి వెళ్తున్నానని వెళ్ళిపోతాడు. నేనే అనవసరంగా తప్పు గా అర్థం చేసుకున్నానని స్వప్న అనుకుంటుంది.  ఆ తర్వాత దీప వెళ్తుంటే.. నర్సింహా ఎదరుపడి నా కూతురిని ఎప్పుడు ఇస్తున్నావ్.. ఇందాక నేను స్కూల్ కి వచ్చాను. నేనే నాన్నని అని చెప్పాలనుకున్న అని నర్సింహా అంటాడు. నా కూతురు నా రక్తమే అయితే నాకు ఇవ్వు అని నర్సింహా తన మాటలతో దీపని టార్చర్ చేస్తాడు. నీకు ఎక్కవ రోజులు టైమ్ ఇవ్వడం లేదు. త్వరగా చెప్పని నర్సింహా వెళ్ళిపోతాడు.  మరొకవైపు కార్తీక్ పెళ్లి గురించి శ్రీధర్ , కాంచనలు కార్తీక్ ని అడుగుతారు. నాకు టైమ్ కావాలని కార్తీక్ అంటాడు. నాకు తెలుసు నువ్వు ఇలాగే అంటావని.. లేట్ అయిన కొద్ది అందరు అనుకుంటున్నదే నిజం అయ్యేలా ఉందని భయంగా ఉందని శ్రీధర్ అనగానే.. కార్తీక్ షాక్ అవుతాడు మీకు పెళ్లి గురించి క్లారిటీ కావాలి కదా ఇస్తాను. ఈ రోజు రెస్టారెంట్ కి వెళ్దాం.. అక్కడ అన్ని చెప్తానని చెప్పి కార్తీక్ వెళ్ళిపోతాడు. ఇప్పటికైన పెళ్లి గురించి ఒక క్లారిటీ ఇస్తానన్నాడు అని శ్రీధర్, కాంచన లు హ్యాపీగా ఫీల్ అవుతారు.  మరొకవైపు శౌర్య అలిగి కూర్చొని ఉంటుంది. ఏం అయిందని దీప అంటుంది. నీకు తెలియదా అని శౌర్య అంటుంది. అప్పుడే నర్సింహా అన్నమాటలు దీప గుర్తుకుచేసుకొని.. నువ్వు ఒక వారం రోజులు ఎక్కడికి వెళ్లొద్దని చెప్తుంది. అప్పుడే కార్తీక్ వచ్చి ఎందుకని అని అడుగుతాడు. ఇప్పుడు నరసింహ గురించి కార్తీక్ బాబుకి చెప్పొద్దని దీప అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

భర్తకి తెలియకుండా భార్య అలా చేసిందా.. ఏం జరిగిందంటే!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఎటో వెళ్లిపోయింది మనసు' (Eto Vellipoindi Manasu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -136 లో... ధన ఇంటికి డ్రింక్ చేసి వస్తాడు. ఏంటి తాగొచ్చావా అని రామలక్ష్మి అడుగుతుంది. కాళీ గా ఉంటున్న కదా అవమానం భరించలేక తాగుతున్నా.. ఇక రోజు తాగుతా అని ధన అంటాడు. ఒరేయ్ నీతో సీతా సర్ బిజినెస్ పెట్టిస్తాను.. పెట్టుబడి పెడతానని నీకు అంత విలువ ఇస్తుంటే అవమానిస్తున్నాడు అంటున్నవేంటి బుద్ది లేకుండా అని రామలక్ష్మి అంటుంది. అయిన నువు ఇప్పుడు గ్రేట్ బిజినెస్ మ్యాన్ భార్యవి అయిపోయావ్ కదా.. అయినా నీకేం తెలుసు నా బాధ అని ధన అంటాడు. నీ ప్రేమ కోసం ఎంత త్యాగం చేసింది మర్చిపోయావా? ఇంకొకసారి ఇలా మీ అక్క గురించి తప్పుగా మాట్లాడకని ధనకి సీతాకాంత్ వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు. ఆ తర్వాత అదంతా చూస్తున్న శ్రీవల్లి.. ఆ ధనని తాగేసి వచ్చావని ఆ చెంప ఈ చెంప వాయించకుండా ఇలా అన్నారని అంటుంది. ఇప్పుడు అక్కాతమ్ముల్ల మధ్య గొడవ మొదలయింది దాన్ని ఇంకా పెద్దది చెయ్యాలి. దాంతో సీతాకాంత్, రామలక్ష్మిల మధ్య మనస్పర్థలు వస్తాయ్.. దాంతో రామలక్ష్మి ఇంట్లో నుండి వెళ్ళిపోతుందని శ్రీవల్లితో శ్రీలత అంటుంది. మా తమ్ముడు అలా మాట్లాడినందుకు సారీ అని సీతాకాంత్ కి  రామలక్ష్మి చెప్తుంది. మరొకవైపు సందీప్ రామలక్ష్మి పెట్టిన నగలు దొంగతనం చేస్తాడు. ఎవరు చూడలేదు ఇక మల్లేష్ అప్పు తీర్చాలని సందీప్ అనుకుంటాడు. ఆ తర్వాత మాణిక్యం, రామలక్ష్మికి ఫోన్ చేసి.. ఇంటి బయట ఉన్నాను రమ్మని చెప్తాడు. రామలక్ష్మి వెళ్లి మాణిక్యంతో మాట్లాడుతుంది. డబ్బులు కావాలి ఒక 500 ఇవ్వమని అంటాడు. దాంతో రామలక్ష్మి ఇస్తుంది. అదంతా పై నుండి శ్రీవల్లి ల, శ్రీలత చూస్తుంటారు. రామలక్ష్మి చాటుగా మాణిక్యంతో మాట్లాడడం.. శ్రీవల్లి వీడియో తీస్తుంది. మరొకవైపు ఎందుకు తాగి వచ్చావంటూ ధనతో సిరి గొడవపడుతుంది. ఆ తర్వాత రామలక్ష్మి ఇందాక రూమ్ లో లేవ్.. ఎక్కడికి వెళ్ళావని సీతాకాంత్ అడుగుతాడు. నాన్న వచ్చి తాగడానికి డబ్బులు తీసుకొని వెళ్ళాడని చెప్తే ఏమంటారోనని.. కిచెన్ లో ఉన్నానని రామలక్ష్మి అబద్దం చెప్తుంది. రామలక్ష్మి బీరువా తాళాలు పెట్టాను కన్పించడం లేదని చూస్తుంది. సీతాకాంత్ కింద పడి ఉన్న తాళాలు ఇస్తాడు. నేను టేబుల్ పై తాళాలు పెట్టాను. ఇక్కడికి ఎలా వచ్చాయని రామలక్ష్మి అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

గుప్పెడంత మనసు సీరియల్ లో అదిరిపోయే ట్విస్ట్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు' (Guppedantha Manasu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -1114 లో.... వసుధార వచ్చి ఎండీ పదవి ఇవ్వండి అని అసలు చెప్పదు.. ఎందుకంటే కాలేజీ గురించి ఆయనకేం తెలియదని ధరణి అంటుంటే.. ధరణిపై దేవయాని కోప్పడుతుంది. ధరణి వాళ్లకి ఇక బుద్ది రాదు. నువు వెళ్లి పని చూసుకోమని ఫణీంద్ర పంపిస్తాడు. ఇక ఎండీ గురించి పక్కన పెట్టి ఏదైనా సాధించే ప్రయత్నం చెయ్ అని శైలంద్రతో ఫణీంద్ర అంటాడు. మరొకవైపు సరోజ వాళ్ళ నాన్నకి రంగా ఇవ్వాలిసిన వడ్డీ డబ్బులు లెక్కెడుతుంటాడు. అప్పుడే సరోజ వాళ్ళ నాన్న వస్తాడు. రంగా వడ్డీ డబ్బులు ఇస్తాడు. వడ్డీ నేనే అసలు ఇచ్చేది ఉందా లేదా అని వెంటకారంగా మాట్లాడతాడు. లేదు మామ ఇస్తానని రంగా అనగానే.. నువ్వు ఇస్తావ్ నేను చూస్తానని అతను అంటాడు. అప్పుడే పెద్దావిడ మధ్యలో కలుగజేసుకొని రంగాకి సరోజకి పెళ్లి చేద్దామని అడుగుతుంది. దాని వాళ్ళ లాభం ఏంటి.. నాకేమైనా వచ్చేది ఉందా.. అసలు డబ్బులుపోవడం తప్ప అని సరోజ వాళ్ళ నాన్న సంజీవయ్య అంటాడు. ఆ తర్వాత సరోజ కూడా రంగాని ఇష్టపడుతుందని పెద్దావిడ అనగానే.. అది వయసులో ఉంది కాబట్టి ఇష్టపడుతుంది కానీ కుదరదని సంజీవయ్య అంటాడు. నానమ్మ ఇప్పుడు పెళ్లి టాపిక్ ఎందుకు.. మీరు నాకు ఇచ్చి పెళ్లి చెయ్యాలనుకున్న నేను చేసుకోను.. నాకు ఇష్టం లేదని రంగా అంటాడు. ఇప్పుడు మగాడు అనిపించుకున్నావని సంజీవయ్య అంటాడు. అప్పుడే వసుధార వస్తుంది. ఎవరు ఈ అమ్మాయి.. సరోజ చెప్పింది నువ్వు కాపాడి తీసుకొని వచ్చావట ఈ అమ్మాయేనా.. తను దూర సందు లేదు మేడకేమో డోలు అన్నట్లు మీరు బ్రతకడమే కష్టంగా ఉంది.. ఇప్పుడు ఈమెనా అని సంజీవయ్య అంటాడు. మరొకవైపు జగతి ఫోటో దగ్గరికి మహేంద్ర వచ్చి ఎమోషనల్ అవుతుంటే.. అప్పుడే తన దగ్గరికి అనుపమ, మనులు వస్తారు. జరుగుతున్న విషయల గురించి మహేంద్ర బాధపడుతుంటే.. మను దైర్యం చెప్తాడు. ఆ తర్వాత మను వెళ్తుంటే కొంతమంది రౌడీలు మను మనుపై ఎటాక్ చేస్తారు. వాళ్ళని మను కొడతాడు. ఎవరు మిమ్మల్ని పంపించారని మను అడుగగా శైలేంద్ర మిమ్మల్ని చంపమని సుపారీ ఇచ్చాడని రౌడీలు చెప్తారు. ఆ తర్వాత మను గాడి గొడవ వదిలి పోతుందని శైలేంద్ర హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు. అప్పుడే మను వచ్చి.. ఏంటి షాక్ అయ్యావంటూ తను కొట్టిన రౌడీలను చూపిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

విడాకులు ఇవ్వమని టార్చర్ చేస్తున్నాడంటూ కేసు పెట్టిన భార్య!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి' (Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -449 లో..  కళ్యాణ్ కి కావ్య నచ్చజెప్పి.. అనామికతో మాట్లాడమని తీసుకొని వస్తుంది. అందరు హాల్లోకి వస్తారు. మళ్ళీ కళ్యాణ్, అప్పుల గురించి అనామిక తప్పుగా మాట్లాడుతుంటే.. తనపై చెయ్యి చేసుకోబోతుంటాడు కళ్యాణ్. అప్పుడే అనామిక పేరెంట్స్ వస్తారు. చూడు నాన్న.. వాళ్ళు నాపై ఎలా దాడి చేస్తున్నారోనని అనామిక అంటుంది. కొట్టి చంపెయ్యండి దుగ్గిరాల ఫ్యామిలీ అంటే గొప్ప ఫ్యామిలీ అనుకున్న కానీ ఇలా చేస్తారనుకోలేదని అనామిక వాళ్ళ నాన్న అంటుంటే.. నీ కూతురు ఎలా మాట్లాడుతుందో చూడు.. నీకు దుగ్గిరాల ఫ్యామిలీ గురించి మాట్లాడే అర్హత లేదని అనామిక నాన్నకి రాజ్ వార్నింగ్ ఇస్తాడు. వాళ్ళని ఈ అనామికనే పిలిచి ఉంటుందని స్వప్న అనగానే.. నేనే పిలిచానని అనామిక అంటుంది. ఎందుకు పిలిచావని ప్రకాష్ అడుగుతాడు. మీ అబ్బాయి విడాకులు ఇస్తానన్నాడు అందుకే అని అనామిక అనగానే.. ఎందుకు ఇస్తానని అన్నాడో తెలియదా అని ప్రకాష్ అనగానే.. మీకు మతిమరుపు ఉందని లోకంలో అందరూ బుర్రతక్కువ వాళ్లే ఉంటారనుకుంటున్నారా అని అనామిక అనగానే.. కళ్యాణ్, ధాన్యలక్ష్మిలు అనామికపై విరుచుకుపడుతారు. ఏం చేసినా చెల్లుతుందనుకుంటుందేమో ఎలాంటి వాల్యూ లేకుండా చేస్తామని అనామికని ఇందిరాదేవి హెచ్చరిస్తుంది. ఇప్పటివరకు ఇది భార్యభర్తలకి సంబంధించిన విషయం.. ఇప్పుడు కుటుంబం పరువు విషయం.. మీ అమ్మాయి నోటిని అదుపులో పెట్టుకుమని చెప్పండి. మా అబ్బాయికి మేమ్ సర్ది చెప్పుకుంటామని ప్రకాష్ అనగానే.. ఇంత మంది మా అమ్మాయిని తప్పు పడుతున్నారు. మీ అబ్బాయి వేరే దానితో కులుకుతున్నాడు కదా అని అనామిక తండ్రి అంటాడు. దాంతో స్వప్న తనపై ఆవేశంగా వెళ్తుంది. ఆ తర్వాత ఎందుకు ఇలా చేస్తున్నావ్ సర్ది చెప్పాడానికి వచ్చిన వాళ్ళు కూడా ఇలా దిగజారిపోయి మాట్లాడుతున్నారు. ఇంత దిగజారి మాట్లాడడం అవసరమా అని అపర్ణ అనగానే.. దిగజారుడు గురించి మీరే మాట్లాడాలి.. నీ భర్త వేరొక దానితో తిరిగి ఒక బాబుని కూడా తీసుకొని వచ్చాడని అనగానే ఏం మాట్లాడుతున్నావంటూ రాజ్ కోప్పడతాడు. అలా అనామిక ఇంట్లో ఎవరికి వాల్యూ ఇవ్వకుండా మాట్లాడేసరికి.. కళ్యాణ్ కి కోపం వచ్చి నీ కూతురుని తీసుకొని ఇక్కడ నుండి వెళ్లిపోరా అని అనామిక వాళ్ళ నాన్నని అంటాడు. వెళ్తాను నిన్ను వదిలి పెట్టను.. నీ అంతటా నువ్వే వచ్చి కాళ్ళమీద పడి క్షమించమని అడిగేలా చేస్తానని అనామిక సవాలు విసిరి వెళ్తుంది. ఈ రోజు హాయిగా పడుకుంటానని కళ్యాణ్ ఎమోషనల్ అవుతాడు. ఆ తర్వాత ధాన్యలక్ష్మి దగ్గరికి కావ్య వచ్చి.. బాధపడకండి అత్తయ్య అని అంటుంది. ఇదంతా నీ వళ్లే కదా అని ధాన్యలక్ష్మి తిడుతుంటే.. అపర్ణ వచ్చి కావ్యకి సపోర్ట్ గా మాట్లాడుతుంది. ఇంకొకసారి నా కోడలు గురించి తప్పుగా మాట్లాడితే బాగుండదని ధాన్యలక్ష్మికి అపర్ణ వార్నింగ్ ఇస్తుంది. ఆ తర్వాత అనామిక తనకి అన్యాయం జరిగిందంటూ న్యూస్ లో డిబేట్ లో వస్తుంది. అది దుగ్గిరాల ఫ్యామిలీ చూసి షాక్ అవుతారు. తరువాయి భాగంలో కళ్యాణ్ కి విడాకులు ఇప్పిద్దామనుకుంటున్నానని రాజ్ అంటాడు. మరోవైపు పోలీసులు కళ్యాణ్ అరెస్ట్ చెయ్యడానికి వస్తారు. మీ భార్యని డివోర్స్ ఇవ్వమని టార్చర్ చేస్తున్నారని కంప్లైంట్ ఇచ్చిందని అనగానే అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

బ్రహ్మముడి కామెడీ పీస్... సీరియల్ లోకి విలన్ ఎంట్రీ!

  బ్రహ్మముడి సీరియల్ ఫేమ్ గిరి శంకర్ ఇప్పుడు గుప్పెడంత మనసు సీరియల్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. గత కొన్ని నెలలుగా రిషి కోసం గుప్పెడంత మనసు సీరియల్ అభిమానులు ఎదురుచూస్తుండగా అతను రంగా అనే కొత్త పాత్రగా ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు ఈ కథ అంతా రంగా చుట్టూనే తిరుగుతుంది. స్టార్ మా టీవీలో ప్రసారమయ్యే టాప్- 5 లో బ్రహ్మముడి, గుప్పెడంత మనసు ఉన్నాయి. అయితే ఇప్పుడు అవి రెండు ఫుల్ ట్రెండింగ్ లో ఉన్నాయి. అటు రిషీధార, ఇటు కావ్య రాజ్ ల జోడీలు ఆన్ స్క్రీన్ మీద హిట్ జోడిగా నిలిచాయి. అయితే బ్రహ్మముడి సీరియల్ లో ధాన్యలక్ష్మికి భర్తగా చేస్తున్న ప్రకాష్ అలియాస్ గిరి శంకర్.. ఇప్పుడు గుప్పెడంత మనసులో సరోజకి నాన్నగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. బ్రహ్మముడిలో మతిమరుపు క్యారెక్టర్ గా గుడ్ కామెడీతో ప్రేక్షకులని మెప్పిస్తున్న ప్రకాష్.. ఇప్పుడు సీరియస్ రోల్ లో దర్శనమివ్వబోతున్నాడు. గుప్పెడంత మనసులో కొన్ని ఎపిసోడ్ ల క్రితం రంగాకి మరదలిగా సరోజ క్లోజ్ గా ఉంటుంది. అయితే అదే సమయంలో రంగా వాళ్ళ నానమ్మ తన గురించి కొన్ని మాటలు అంది.. " నువ్వేమో వాడికోసం క్యారేజ్ తెస్తావ్.‌. మీ నాన్నేమో వడ్డీ డబ్బుల కోసం వాడిని తిడతాడు"  అని అంటుంది. అయితే దీన్నిబట్టి రంగాకి సరోజ వాళ్ళ నాన్న అప్పు ఇచ్చినట్లు తెలుస్తోంది. దాంతో తరువాతి ఎపిసోడ్ లలో రంగాకి వార్నింగ్ ఇచ్చే సీన్లు ఉండబోతాయని స్పష్టంగా తెలుస్తుంది. దీంతో సరోజ వాళ్ళ నాన్న సంజీవయ్య విలన్ గా కన్పించబోతున్నాడు. మరి ఆ సీరియల్ లో కామెడీ పీస్.. ఈ సీరియల్ లో విలన్ అంటే ప్రేక్షకులు ఎలా చూస్తారో చూడాలి మరి.

రియాజ్ గాడి వల్ల మా ఫ్లైట్ మిస్ అయింది.. యూట్యూబ్ లో ట్రెండింగ్!

  సద్దాం.. పటాస్‌ షో ద్వారా ఫేమస్‌ అయ్యాడు. తనదైన పంచులతో ఆ షో జడ్జ్‌లని కడపుబ్బా నవ్వించే సద్దాం.. శ్రీదేవి డ్రామా కంపెనీకి వచ్చి ఎన్నో స్కిట్లు చేశాడు. ఇతని స్కిట్ల కోసమే సగం మంది శ్రీదేవి డ్రామా కంపెనీ చూస్తారనేది వాస్తవం. ఎందుకంటే సెటైరిల్‌ డైలాగ్స్‌తో, అతని తోటి టీమ్‌ సభ్యులపై పంచ్‌లు వేస్తూ నవ్విస్తుంటాడు. అయితే కొన్ని నెలల క్రితం జబర్దస్త్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు సద్దాం. సద్దాం, యాదమరాజు కలిసి ఒకేసారి జబర్దస్త్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే జబర్దస్త్‌ షోలో రాఘవ, బుల్లెట్‌ భాస్కర్‌ స్కిట్స్‌  తర్వాత మళ్లీ అంతటి ఫ్యాన్‌ బేస్‌ వచ్చింది సద్దాం స్కిట్స్‌కే అని అనడంలో ఆశ్చర్యం లేదు. అప్పట్లో సద్దాం, యాదమరాజు కలిసి జబర్దస్త్‌ లో ‘ఓసేయ్‌ రాములమ్మ’ స్పూఫ్‌ చేసారు. ఆ స్కిట్‌ ఫుల్‌ ట్రెండింగ్ లో ఉండేది. అయితే సద్దాం రెండు సంవత్సరాల క్రితం సొంతంగా ఒక యూట్యూబ్‌ ఛానెల్‌ని స్టార్ట్‌ చేశాడు. ఇందులో తన పర్సనల్‌ విషయాలని, టూర్స్‌, లొకేషన్స్‌, స్కిట్స్‌ అంటూ కొన్ని వ్లాగ్‌లని పోస్ట్‌ చేస్తున్నాడు. కాగా ఈ వ్లాగ్‌లకి ఇప్పుడు ఫుల్‌ క్రేజ్‌ వస్తుంది. సద్దాంకి యూట్యూబ్ లో 1.59 లక్షల సబ్ స్క్రైబర్స్ ఉన్నారు. ఇప్పుడు ' రియాజ్ గాడి వల్ల ఫ్లైట్ మిస్ అయింది ' అనే వ్లాగ్ ని అప్లోడ్ చేసాడు.  ఇందులో నరేశ్, రియాజ్, సద్దాం కలిసి ఎక్కడికో ఈవెంట్ కి వెళ్తుంటారు. అయితే ఫ్లైట్ అయిదు గంటలకి అవుతే రియాజ్, నరేశ్ ఎనిమిదింటికి వచ్చారంటూ తిట్టసాగాడు. మీ వల్ల ముప్పై వేలు బొక్కరా అంటూ సద్దాం ఇద్దరిపై కోప్పడ్డాడు. ఇక ఎయిర్ పోర్ట్ లో వారి కష్టాలని అన్నింటిని ఇందులో చెప్పుకొచ్చాడు సద్దాం. శ్రీదేవీ డ్రామా కంపెనీలో నరేశ్, సద్దాం జోక్స్ ఇప్పటికి ఇన్ స్టాగ్రామ్ లో ట్రెండింగ్ లో ఉంటున్నాయి. సద్దాం యూట్యూబ్ ఛానెల్ లో ఉన్న ఈ వ్లాగ్ ని ఓ సారి చూసేయ్యండి.