భారతవర్ష.. పూలబాల విరచిత అద్భుత రచన..

బహుభాషా కోవిదుడు పూలబాల రచించిన 1265 పేజీల భారతవర్ష 21 వ శతాబ్దపు అతిపెద్ద తెలుగు ప్రబంధ కావ్యం.  యూజిసి జాతీయ స్థాయి సమావేశాల్లో పాల్గొని ఫ్రెంచ్ జర్మన్ భాషల్లో ప్రసంగించిన పూలబాల  ఆంధ్రప్రదేశ్ నుంచి ఫ్రెంచ్ లో నవల రచించిన తొలి తెలుగు రచయిత.   ప్రపంచ సాహిత్యంలో భారతవర్ష వైశిష్టత: ప్రపంచ సాహిత్య చరిత్రలో  వేయి పేజీలు దాటిన గ్రంధాల రచనకు కనీసం 10 సంవత్సరాల సమయం  తీసుకున్నారు.  గాన్ విత్ ద విండ్ 10 సంవత్సరాలు, జురాసిక్ పార్క్ 10 సంవత్సరాలు,  లె మిజరబుల్స్ 12 సంవత్సరాలు కాగా  1265 పేజీల భారతవర్ష  రచనా  సమయం 8 నెలలు.  ఆ రచయితలంతా వాడుక భాష లో రాసారు . కానీ భారతవర్ష  రచయిత పూలబాల  ప్రాచీన భాష లో (గ్రాంధికం లో)  చందోబద్ద పద్యాలతో కావ్య రచన చేశారు. తెలుగు భాషకు బంగారు పల్లకి:  భారతవర్ష ఆద్యంతం ఉత్కంఠతో సాగే ఆధ్యాత్మిక శృంగారకావ్యం.  ప్రేమ, శృంగారాలను   పాండిత్యం తో రంగరించి  సాహిత్య సరదాలు అద్ది, ఆధ్యాత్మిక, వైద్య, వైమానిక, సాంకేతిక రంగాల్లో అబ్బురపరుచు అరుదైన   విషయజ్ఞానాన్ని హృద్యమైన భాష తో మేళవించిన బహు విషయ జ్ఞాన భండారం భారతవర్ష.   పుట పుట లోను పరుగులెత్తు గోదారిని తలపించే వృత్త పద్యాలు, పద్య సౌందర్యాన్ని  సవాలు చేసే గద్య సౌందర్యం వెరసి  తెలుగు భాషను బంగారు పల్లకి పై ఊరేగించు ప్రబంధకావ్యం భారతవర్ష.   స్నేహధర్మానికి, ప్రేమబంధాలకి పెద్ద పీటవేసి మానవసంబంధాలకు బ్రహ్మ రథం పడుతుంది ఈ  ఆధ్యాత్మిక శృంగారకావ్యం.  భారతవర్ష ఇతివృత్తము: గ్రాంధిక తెలుగున రచించిబడిన ఈ ఆధునిక శృంగార ప్రబంధ కావ్యమందు ప్రౌఢమైన, హృద్యమైన గద్యముతో పాటు తరళ, శార్దూల, మత్తేభ ఉత్పలమాల, చంపకమాల పద్యాలు చదువరులను అలరించు విధముగా ఉంటాయి. మంచిభాషమంచిజీవితానికినాంది. మంచిసాహిత్యం మంచి సమాజానికి నాంది. భారతవర్ష ఇతివృత్తము భారతీయసంస్కృతికి పెద్దపీట వేసి క్రోధము, కామము క్షణికావేశములు. ధనము జీవిత ప్రయోజనము కానీ ధర్మము జన్మాంతర ప్రయోజనము, అటువంటి ధర్మమునకు మూలము సంస్కృతి అని , ఆ సంస్కృతికి నాంది భాష అనే సత్యాన్ని తెలియజేస్తుంది. అన్నిరకముల  భాషాభూషణాలు  శబ్ద అర్థాలంకారాలు  గల భారతవర్షలో  వేయికి పైగా ఉపమానాలు వాడబడ్డాయి. సర్వాలంకార భూషిత కావ్య కన్య భారతవర్ష త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది.   

కౌశిక్ రెడ్డిని తరిమికొట్టిన ఓటర్లు.. హుజురాబాద్ లో హై టెన్షన్..

తెలంగాణ రాజకీయాల్లో కాక రాజేసిన కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల దగ్గర బారులు తీరారు. అధికార టీఆర్ఎస్, బీజేపీ మధ్య హోరాహోరీగా పోరు సాగడంతో పోలింగ్ కేంద్రాల దగ్గర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పోలింగ్ కేంద్రాల దగ్గర ప్రచారాలు చేస్తున్నారని, ప్రలోభాలకు గురి చేస్తున్నారనే ఆరోపణలు చేసుకుంటున్నారు.  వీణవంక మండలం ఘన్ముక్లలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఎన్నికల్లో అభ్యర్థి కాకపోయినప్పటికీ టీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డి పోలింగ్ కేంద్రంలోకి వెళ్లారు. అది గమనించిన బీజేపీ కార్యకర్తలు కౌశిక్ రెడ్డి అడ్డుకున్నారు. పోలింగ్ జరుగుతున్న సమయంలో పోలింగ్ కేంద్రంలో ఎన్నికల ప్రచారం ఎందుకు చేస్తున్నావ్  అంటూ కౌశిక్‌ను నిలదీశారు. దీంతో ఆ పోలింగ్ కేంద్రంలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. పోలీసులు జోక్యం చేసుకొని కౌశిక్ రెడ్డిని అక్కడి నుంచి బయటకు పంపించారు.

బద్వేలులో తిరుపతి స్కెచ్! దొంగ ఓట్లు వేయిస్తున్న వైసీపీ లీడర్స్? 

ఆంధ్రప్రదేశ్ లో ఉప ఎన్నిక జరగుతున్న కడప జిల్లా బద్వేలులో పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం తొలి గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా.. ఉదయం తొమ్మిది గంటల వరకు మొదటి రెండుగంటల్లో 10.45శాతం పోలింగ్ నమోదైంది. ఇప్పుడిప్పుడే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు.  ఉప ఎన్నికలో భారీ మెజార్టీ గెలవాలని భావిస్తున్న అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అక్రమాలకు పాల్పడుతుందని తెలుస్తోంది. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక తరహాలోనే బయటినుంచివ్యక్తులను తీసుకొచ్చి బద్వేలులో దొంగ ఓట్లు వేయించేందుకు ప్లాన్ చేసిందని చెబుతున్నారు. వైసీపీ ప్లాన్‌లో భాగంగా డీఆర్డీఏ‌కి సంబంధించిన ఓ డ్వాక్రా మహిళను దొంగ ఓట్ల కోసంరంగంలోకి దింపినట్లు సమాచారం. అలాగే అట్లూరు మండల కేంద్రంలో డ్వాక్రా మహిళలతో పాటు ఇతరులతో మొత్తం కలిపి 600 మందిని వైసీపీ రంగంలోకి దింపినట్లు సమాచారం.వీరందరిని స్థానిక వైసీపీ శ్రేణుల ఇళ్లలో ఉంచి ఈ ఉపఎన్నికలో దొంగ ఓట్లు వేసేందుకు ప్లాన్ చేస్తునట్లు సమాచారం. పోలింగ్ సరళిని పరిశీలిస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి కమలమ్మ కొందరు దొంగ ఓటర్లను గుర్తించింది. వాళ్లను ప్రశ్నించగా అక్కడి నుంచి వెళ్లిపోయారు. అధికార పార్టీ అక్రమాలకు పాల్పడుతుందని,దొంగ ఓట్లు వేయిస్తుందని కమలమ్మ ఆరోపించారు. బీజేపీ అభ్యర్థి కూడా వైసీపీ నేతలు రిగ్గింగ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు చేశారు. 

అసైన్డ్, అటవీ భూములకు పాస్ బుక్కులు! వైసీపీ ఎమ్మెల్యే కబ్జాలో వేల ఎకరాలు?

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం వచ్చాక అవినీతి, అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందనే ఆరోపణలు వస్తున్నాయి. అధికార పార్టీ నేతలు దేన్ని వదలకుండా అక్రమాలకు పాల్పడుతున్నారని చెబుతున్నారు. అధికారులతో కుమ్మకై... లేదంటే వాళ్లను బెదిరించి తమ ఇష్టం వచ్చినట్లుగా అరాచకాలకు పాల్పడుతూ.. కోట్లాది రూపాయల కుంభకోణాలకు పాల్పడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. తాజాగా వైసీపీ ఎమ్మెల్యేకు చెందిన అక్రమ బాగోతాన్ని ఆధారాలతో సహా బయటపెట్టారు టీడీపీ నేత. ఎమ్మెల్యే అక్రమాలు చూసి అంతా షాకవుతున్నారు.  గుంటూరు జిల్లా వినుకొండ నియోజ‌కవ‌ర్గ ప‌రిధిలోనూ ఓ భారీ భూ దందాను వెలికి తీశారు వినుకొండ మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియ‌ర్ నేత‌, ఆ పార్టీ న‌ర‌స‌రావుపేట పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గ అధ్య‌క్షుడు జీవీ ఆంజ‌నేయులు. 2019 ఎన్నిక‌ల్లో వినుకొండ నుంచి వైసీపీ అభ్య‌ర్థిగా బొల్లా బ్ర‌హ్మ‌నాయుడు విజ‌యం సాధించారు. వైసీపీ ప్రభుత్వమే రావడంతో ఆయన అక్ర‌మాల‌కు తెర తీశారని జీవీ ఆరోపించారు. బొల్లాప‌ల్లిలోని భూముల‌ను కేంద్రంగా చేసుకుని ఎమ్మెల్యే బొల్లా బ్ర‌హ్మ‌నాయుడు భారీ అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డార‌ని చెప్పారు. టీడీపీ నేత జీవీ చెప్పిన వివరాలు ప్రకారం... బొల్లాప‌ల్లిలోని అసైన్డ్ భూముల‌కు కూడా ఎమ్మెల్యే పాస్ బుక్కులు ఇప్పించేశారు. స్థానిక త‌హ‌శీల్దార్‌ను అడ్డం పెట్టుకుని ఈ దందాను న‌డిపించారు. ఒక్కో పాస్ పుస్త‌కానికి రూ.10 వేల చొప్పున ఏకంగా 7 వేల‌కు పైగా పాస్ బుక్కులు ఇప్పించేశారు. ఇలా పాస్ బుక్కుల మీద‌కు ఎక్కిన భూముల్లో చుక్క‌ల భూములు, పోరంబోకు భూములు, ప్ర‌భుత్వ భూములు ఉన్నాయి. పాస్ బుక్కులు ఇప్పించడమే కాదు.. ఈ భూముల‌ను తర్వాత త‌న‌కు కావ‌ల‌సిన వారి పేర్ల‌పైకి మార్చేసి వాటికి పాస్ బుక్కులు కూడా ఎమ్మెల్యే బోల్లా బ్రహ్మ నాయుడు ఇప్పించేశారని జీవీ తెలిపారు. ఇవే పాస్ బుక్కుల‌ను బ్యాంకుల్లో పెట్టి రుణాలు కూడా ఇప్పించేశార‌ట. ఈ రుణాల్లో మెజారిటీ భాగాన్ని బొల్లా త‌న జేబుల్లో వేసుకున్నారని జీవీ ఆరోపించారు. ఈ మొత్తం వ్య‌వ‌హారంలో బొల్లా బ్ర‌హ్మ‌నాయుడు దాదాపు 10 కోట్ల రూపాయలు స్వాహా చేశారని చెబుతున్నారు.ఆ ప‌ని పూర్తి కాగానే.. బొల్లాప‌ల్లి ప‌రిధిలోని అట‌వీ భూముల‌కు కూడా బొల్లా పాస్ పుస్త‌కాలు ఇప్పించేసుకున్నార‌ట‌. ఇవే భూముల‌ను కేంద్రంగా చేసుకుని విప‌క్షంలో ఉండ‌గా.. ఈ భూముల‌న్నింటినీ పేద‌ల‌కు హ‌క్కు ప‌త్రాలు ఇప్పిస్తామ‌ని బొల్లా చెప్పిన వైనాన్ని గుర్తు చేస్తూ జీవీ ఆంజ‌నేయులు సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశారు. అసైన్డ్ భూముల‌ను ఆస‌రా చేసుకుని అధికార యంత్రాంగాన్ని త‌న‌కు అనుకూలంగా మార్చుకుని ఎమ్మెల్యే బొల్లా బ్ర‌హ్మ‌నాయుడు పాల్ప‌డిన అవినీతి దందాపై సీబీఐ చేత విచార‌ణ చేయించాల‌ని జీవీ ఆంజ‌నేయులు డిమాండ్ చేశారు. బొల్లా అవినీతి దందాకు సంబంధించి ఆధారాల‌ను జీవీ ఆంజ‌నేయులు మీడియా సమావేశంలో బ‌య‌ట‌పెట్టారు. సీబీఐ ద‌ర్యాప్తు జ‌రిగితే బొల్లాకు సంబంధించిన మ‌రిన్ని మేర అక్ర‌మాలు వెలుగు చూసే అవ‌కాశాలున్నాయ‌న్నారు. అసైన్డ్ భూముల‌ను పేద‌ల‌కు కాకుండా త‌న‌కు అనుకూలంగా ఉన్న వారి పేరిట రాయించుకున్న ఎమ్మెల్యే బొల్లా బ్ర‌హ్మ‌నాయుడు బొల్లాపల్లి లో తిరిగే పరిస్థితి లేదని జీవీ హెచ్చ‌రించారు.పేద రైతుల దగ్గర పాసు పుస్తకాలకు వసూలు చేసిన డబ్బులు తిరిగి ఇవ్వకపోతే ఎమ్మెల్యే బొల్లాను చొక్కా ఊడదీసి కొడతారని ఆయ‌న‌ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. పట్టణానికి 7 కిలోమీటర్ల దూరంలో సెంటు భూమి ఇచ్చి పేదలను దగా వైసీపీ చేశారని జీవీ విమర్శించారు. ఈ భూ పంపిణీలో కూడా ఎమ్మెల్యే బొల్లా రూ.18 కోట్లు కాజేశారని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. బొల్లాపల్లి భూ అక్రమాలపై ఎమ్మెల్యే బొల్లా పై ఎమ్మార్వో, రెవెన్యూ అధికారులపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని జీవీ ఆంజనేయులు డిమాండ్ చేశారు. మొత్తంగా బొల్లా బ్ర‌హ్మ‌నాయుడు అవినీతి దందాను జీవీ వెలుగులోకి తీసుకుని వ‌చ్చిన నేప‌థ్యంలో వినుకొండ‌లో ఈ విష‌యంపై పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది.

మంగళవారం మరదలమ్మా అని గౌరవించా... మంత్రి నిరంజన్ రెడ్డి వివరణ

తెలంగాణ వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను ఉద్దేశించి మంగళవారం మరదలు అంటూ తెలంగాణ మంత్రి నిరంజన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై దుమారం కొనసాగుతోంది. మంత్రి కామెంట్లపై తీవ్ర విమర్శలు రావడం, కుక్క అంటూ షర్మిల కౌంటర్ ఇవ్వడం మరింత కాక రాజేసింది. దీంతో తన మాటలపై వివరమ ఇచ్చారు మంత్రి నిరంజన్ రెడ్డి. తన వ్యాఖ్యలతో ఎవరైనా నొచ్చుకుని ఉంటే, అందుకు పశ్చాత్తాప పడుతున్నానని మంత్రి చెప్పారు. అయినా తాను ఎవరి పేరును ఉపయోగించి ఈ వ్యాఖ్యలు చేయలేదని, తన వ్యాఖ్యలను మరోసారి గమనించాలని సూచించారు. "మంగళవారం మరదలమ్మా" అంటూ చివరన అమ్మా అని మర్యాద ఇచ్చానని స్పష్టం చేశారు. సంస్కారం ఉన్న వారికి తన మాటలు సంస్కారవంతంగానే ఉంటాయని మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.  షర్మిల తన తండ్రి సమకాలికుడైన కేసీఆర్ ను ఏకవచనంతో సంబోధిస్తుండడం సరైన పద్ధతేనా? అని ప్రశ్నించారు మంత్రి నిరంజన్ రెడ్డి.  తెలంగాణలో పార్టీ పెట్టిన వైఎస్ షర్మిల.. టీఆర్ఎస్ సర్కార్, సీఎం కేసీఆర్ టార్గెట్ గా దూుకుడుగా వెళుతున్నారు. కేసీఆర్ తో పాటు సీఎం కుటుంబ సభ్యులపైనా తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. ప్రతి మంగళవారం నిరుద్యోగ దీక్ష చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి నిరంజన్ రెడ్డి స్పందిస్తూ మంగళవారం మరదలు బయలుదేరింది అంటూ వ్యాఖ్యానించగా తీవ్ర విమర్శలు వచ్చాయి.   

మాజీ మిస్ తెలంగాణ మళ్లీ ఆత్మహత్యాయత్నం..

హైదరాబాదులో బుధవారం ఆత్మహత్యకు ప్రయత్నించిన మాజీ మిస్ తెలంగాణ హాసిని రెండ్రోజుల వ్యవధిలో మరోసారి ఆత్మహత్యకు యత్నించింది. మొన్న ఫ్యాన్ కు ఉరేసుకున్న యువతి, నేడు మున్నేరులో దూకింది. కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం కీసర బ్రిడ్జి పైనుంచి మునేటిలోకి దూకి హాసిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కృష్ణా జిల్లా నందిగామలో బైక్‌ పైవచ్చి కాలువలోకి  హాసిని దూకింది. ద్విచక్ర వాహనంపై వచ్చి బ్రిడ్జి పైన వాహనాన్ని నిలిపి నీటిలోకి దూకింది. హాసినిని బ్రిడ్జి పైనుంచి  దూకడం గమనించి స్థానికులు రక్షించారు. అనంతరం నందిగామ ప్రభుత్వ ఆస్పత్రికి స్థానికులు తరలించారు. 21 ఏళ్ల కలక భవాని అలియాస్ హాసిని స్వస్థలం ఏపీలోని కృష్ణా జిల్లా బూదవాడ గ్రామం. మోడలింగ్ పై ఆసక్తితో హైదరాబాదులో ఉంటోంది. 2018లో హాసిని మిస్ తెలంగాణ అందాల పోటీల్లో విజేతగా నిలిచింది. రెండ్రోజుల కిందట హిమాయత్ నగర్ లోని తన అపార్ట్ మెంట్ లో ఫ్యాన్ కు చున్నీతో ఉరేసుకుంది.తాను చనిపోతున్నానంటూ కుటుంబసభ్యులకు, ఫ్రెండ్స్ కు సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. జగిత్యాలకు చెందిన ఓ స్నేహితుడు పోలీసులకు సమాచారం అందించగా, వారు వెళ్లేసరికి చున్నీ ముడి జారిపోవడంతో ఫ్యాన్ నుంచి మంచంపై పడిపోయిన స్థితిలో హాసిని ఉంది. దాంతో ఆమెను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఆమె కుటుంబ సభ్యులకు విషయం వివరించగా, వారు వచ్చి ఆమెను కృష్ణా జిల్లాలోని తమ స్వగ్రామానికి తీసుకెళ్లారు. అయితే నందిగామ సమీపంలోని కీసర వద్ద ఈ రోజు మున్నేరు బ్రిడ్జిపై నుంచి దూకేసింది. స్థానికులు సకాలంలో గుర్తించి కాపాడడంతో ఆమె ప్రాణాలకు ఎలాంటి ఆపద వాటిల్లలేదు. ప్రస్తుతం నందిగామ ఆసుపత్రిలో హాసిని చికిత్స పొందుతోంది. ఆర్థిక ఇబ్బందులతోనే తాను ఆత్మహత్యకు ప్రయత్నించినట్టు హాసిని మొన్న పోలీసులకు వెల్లడించింది. 

పెరగనున్న వరదలు.. తగ్గనున్న పంటలు.. ప్రమాదపుటంచున ప్రపంచం

విధాన నిర్ణేతలందరూ రాజకీయ నాటకాలు రక్తి కట్టించడంలో తలమునకలై ఉండగా...  ప్రకోపిస్తున్న ప్రకృతి తన ధ్వంస రచనలో బిజీగా ఉంది. ఎన్నికైన ఐదేళ్ల కాలంలో ప్రజా భద్రతను, సంక్షేమాన్ని మరింత సురక్షితం చేసేందుకు పటిష్టమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన శాసనకర్తలు ఫక్తు రాజకీయ పందేరాలకే పరిమితమైపోతున్నారు. ఫలితంగా వాటర్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్, ఎర్త్ పొల్యూషన్ అంతకంతకూ పెరిగిపోతూ ప్రజా జీవనాన్ని అతలాకుతలం చేస్తోంది. ఉదాహరణకు గత కొన్నేళ్లుగా హైదరాబాద్ లోనే వరదల సమస్య నానాటికీ తీవ్రరూపం దాలుస్తోంది. మూసీ ఉప్పొంగినప్పుడు తూతూ మంత్రంగా చర్యలు తీసుకోవడం, ఆ తరువాత ఆ విషయాన్ని అటకెక్కించడం ఆనవాయితీగా మారింది. రాజకీయ నాయకుల, ఆయా ప్రభుత్వాల వైఖరి కారణంగానే ఈ ప్రపంచం సమీప భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోబోతోందని పర్యావరణ నిపుణులు, శాస్త్రవేత్తలు, మానవ సమాజ క్షేమాన్ని కాంక్షించే పలు దేశాల ప్రతినిధులు ఆందోళన చెందుతున్నారు. కానీ ఇండియాలో మాత్రం రాజకీయ పదవులు కాపాడుకోవడం చుట్టూనే కాలమంతా గడిచిపోతోందన్న అసంతృప్తి క్రమక్రమంగా పెరుగుతోంది.  మరికొన్ని గంటల్లో రోమ్ లో జరిగే 16వ జి-20 సదస్సు సందర్భంగా ప్రపంచ దేశాలన్నీ పలు కీలకమైన నిర్ణయాలు తీసుకోబోతున్న తరుణంలో... గ్లోబల్ వార్మింగ్ పై ఐరాస ఆధ్వర్యంలోని ఇంటర్నేషనల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ (ఐపీసీసీ) తాజా నివేదిక విడుదల చేసింది. 40 మంది పర్యావరణవేత్తలు గ్లోబల్ వార్మింగ్ పై అధ్యయనం చేసి ఆ రిపోర్టును విడుదల చేశారు. ఆ రిపోర్టులో ముఖ్యంగా భారత్ అప్రమత్తం కాకపోతే తలెత్తే ఉపద్రవాలపై కూలంకషంగా చర్చించారు. రాబోయే 15-20 ఏళ్లలో ఇదే ప్రకారం 4 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు భారత్ లో ఉష్ణోగ్రతలు పెరుగుతూ పోతే వేడిగాలులు, విపరీతమైన వరదలు, పంటల్లో క్షీణత, చేపల ఉత్పత్తిలో తగ్గుదల 25 రెట్లు పెరుగుతుందని హెచ్చరించారు. ఇదే హీట్ వేవ్స్ 2 డిగ్రీలకు పెరిగితే గనక పైన చెప్పుకున్న దుష్పరిణామాలు 5 రెట్లు పెరుగుతాయని... ఒకవేళ కనీసంగా 1.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగినా పైన చెప్పుకున్న ప్రకృతి బీభత్సం ఒకటిన్నర  రెట్లకన్నా ఎక్కువ బీభత్సం తలెత్తుతుందని హెచ్చరించారు.  ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే 2050 నాటికి కోటీ 80 లక్షల మంది భారతీయుల జీవితాలు రిస్కులో పడతాయని, ఆ వేడిగాలుల కారణంగా హిమానీనదాాలు పెరగడం, అకాల వర్షాలు, వరద బీభత్సాలకు దారితీస్తుందని రిపోర్టు వెల్లడిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఏటా ఇండియాలో కోటీ 30 లక్షల మంది నిరాశ్రయులవడమో, నివాసాలు కోల్పోవడమో, సహాయ శిబిరాల్లో తల దాచుకోవడమో, వారిలో కొందరు గల్లంతవడమో జరుగుతోంది. తెలంగాణ, ఆంధ్రాల్లో కూడా గత ఐదారేళ్ల వరదలతో పోలిస్తే వరద బీభత్సాలు గణనీయంగా పెరగడం ఇక్కడి ప్రజలకు అనుభవంలో ఉన్నదేనని గమనించాలి.  అంతేకాదు... అదుపులేని గ్లోబల్ వార్మింగ్ కారణంగా చెరుకు, వరి, గోధుమ పంటలు దారుణంగా పడిపోతాయని, కరువు కాటకాలు విజృంభిస్తాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఆయా పంటలకు 29 శాతం నీటి డిమాండ్ పెరుగుతుందంటున్నారు. గత 2 దశాబ్దాలుగా ఆస్ట్రేలియా, అమెరికా, ఇండియా వంటి పెద్ద దేశాల్లో దావనలాల తీవ్రత ఎంత పెరిగిపోయిందో కూడా గమనించాలని నిపుణులు అంటున్నారు. పంటల క్షీణత కారణంగా, ఇంకా చెప్పాలంటే వరి, గోధుమ వంటి పంటల ఉత్పత్తి క్షీణించిపోవడం వల్ల భారత్  2050 నాటికి 81 బిలియన్ యూరోల ఆదాయం కోల్పోతుందని, 15 శాతం రైతుల ఆదాయం దారుణంగా పడిపోతుందని హెచ్చరిస్తున్నారు. ఈ సమ్మిట్ కు హాజరవుతున్న ప్రధాని మోడీ ఎలాంటి ప్రతిపాదనలతో ముందుకొస్తారోనని పలు జీ-20 దేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

వరి వద్దంటే గంజాయి సాగు చేయాలా! బీజేపీ ఎంపీ కామెంట్ల కలకలం..

తెలంగాణలో అధికార టీఆర్ఎస్, బీజేపీ మధ్య డైలాగ్ వార్ ముదురుతోంది. హుజురాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ కు ముందు హాట్ కామెంట్లతో కాక రాజేస్తున్నారు. సీఎం‌ కేసీఆర్, కేటీఆర్‌లపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్, క్యాబినెట్ మంత్రులను గొర్రెలతో పోల్చాడు. కేటీఆర్ మగాడైతే ప్రజాక్షేత్రంలో‌ తమతో పోరాడాలని సవాల్ విసిరారు. కేసీఆర్‌కు బానిసత్వం చేయటం కంటే.. మంత్రి నిరంజన్ రెడ్డి చావటం మేలని విమర్శించారు.  వ్యవసాయం, ధాన్యం కొనుగోలుపై లైవ్ డిబేట్‌కు రెడీ.... నిరంజన్ రెడ్డి ఇంటికి రావటానికీ సిద్ధమేనా? అని ధర్మపురి అర్వింద్ ప్రశ్నించారు. వరి విత్తనాలు బదులు.. గంజాయి విత్తనాలు అమ్మాలా? అని ప్రశ్నించారు. కేసీఆర్‌కు కాళ్ళు మొక్కినందుకే సిద్దిపేట కలెక్టర్ డ్యూటీలో ఉన్నాడన్నారు. పండించిన ప్రతి గింజను కొంటానన్న కేసీఆర్ ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు ఎంపీ. తెలంగాణ బ్రాండ్‌తో బియ్యాన్ని మార్కెటింగ్ చేస్తామన్న కేసీఆర్ ఎక్కడ? అని ప్రశ్నించారు. సివిల్ సప్లయ్ మంత్రి గంగుల పంట కొంటానంటే.. హరీష్, జగదీష్ రెడ్డిలు కొనమంటున్నారని.. రైతులు ఎవరి మాటలు నమ్మాలన్నారు. కొత్త పరిశ్రమలు ఏర్పాటుకు 20 శాతం కమిషన్ డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. బాయిల్డ్ రైస్‌కు కేంద్రం బోనస్ ఇస్తోందన్నారు.  

బాబు సభలో వైసీపీ కార్యకర్త.. జగన్ కు బిగ్ షాక్.. ఉమ్మడి సీఎంగా కేసీఆర్.. టాప్ న్యూస్@7PM

టీడీపీ మళ్లీ అధికారంలోకి రాగానే వడ్డీతో సహా చెల్లిస్తామని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. తన సొంత నియోజక వర్గమైన కుప్ప నియోజకవర్గంలో పర్యటిస్తున్న ఆయన బహిరంగ సభలో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వంపై  తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కొందరు అధికారులు, పోలీసులు వైసీపీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తాము అధికారంలోకి రాగానే వడ్డీతో సహా  చంద్రబాబు చెల్లిస్తామన్నారు. ---  అమరావతి రైతుల పాదయాత్రకు ఏపీ హైకోర్టు అనుమతిచ్చింది. పాదయాత్ర అనుమతి కోసం లంచ్ మోషన్ పిటిషన్‌పై కోర్టు విచారించింది. పాదయాత్రకు అనుమతి ఇవ్వకూడదని ప్రభుత్వ న్యాయవాది అభ్యంతరం తెలిపారు. పోలీసులు అనుమతి నిరాకరిస్తూ ఇచ్చిన ఉత్తర్వుల్లో సహేతుకమైన కారణాలు లేవని న్యాయవాది లక్ష్మీనారాయణ వాదించారు. పాదయాత్రకు అనుమతిస్తే అభ్యంతరం ఏమిటని హైకోర్టు ప్రశ్నించింది -------- నుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకు సీఎం జగన్ లైసెన్స్ ఇచ్చాడని నరసరావుపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు జి. వి.ఆంజనేయులు చెప్పారు. జగన్ ఇచ్చిన లైసెన్సుతో బొల్లా దోపిడికి పాల్పడుతున్నాడని ఆరోపించారు. ఎమ్మెల్యే బొల్లా ఇళ్ల స్దలాల పేరుతో కోట్లు దోచుకున్నాడన్నారు. రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలకు ఎకరాకు రూ.10 వేలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు -------- తూర్పు గోదావరి జిల్లాలో కరోనా కలకలం సృష్టించింది. రాజోలు మండలంలోని తాటిపాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏడుగురు ఉపాధ్యాయులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పాఠశాలను అధికారులు పూర్తిగా శానిటైజ్ చేయించారు. అధికారులు రెండురోజుల పాటు స్కూలుకి సెలవులను ప్రకచించారు.  -------- శ్రీనివాససేతు నిర్మాణ పనులపై కార్పొరేషన్ కమిషనర్ గిరీషా, నిర్మాణ సంస్థతో సమీక్ష టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి నిర్వహించారు. నవంబర్ మాసం లోపల పనులు పూర్తి చెయ్యాలని అధికారులను చైర్మన్ ఆదేశించారు. టీటీడీ తరుపున చెల్లించాల్సిన నిధులను కూడా త్వరలోనే మంజూరు చెయ్యాలని టీటీడీ అధికారులను ఆదేశించారు. సీఎం జగన్ చేత నవంబరులో శ్రీనివాస సేతును ప్రారంభిస్తామని టీటీడీ చైర్మన్ తెలిపారు. -------- తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్ మొదటి నుంచి కవలపిల్లల్లా కలిసి వెళ్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శించారు. ఉమ్మడి రాష్ట్రం కోసం జగన్, కేసీఆర్ ఆలోచన చేస్తున్నారని తప్పుబట్టారు. జల వివాదాలు పెంచి రెండు రాష్ట్రాలను కలిపే కుట్ర జరుగుతోందని రేవంత్‌ అనుమానం వ్యక్తం చేశారు.జగన్ జైలుకు వెళ్తాడు కాబట్టి ఉమ్మడి రాష్ట్రానికి కేసీఆర్ సీఎం కావాలని అనుకున్నట్లుగా ఉందన్నారు రేవంత్ రెడ్డి. -------- సీఎం‌ కేసీఆర్, కేటీఆర్‌లపై ఎంపీ ధర్మపురి అరవింద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్, క్యాబినెట్ మంత్రులను గొర్రెలతో పోల్చాడు. కేటీఆర్ మగాడైతే ప్రజాక్షేత్రంలో‌ తమతో పోరాడాలని సవాల్ విసిరారు. కేసీఆర్‌కు బానిసత్వం చేయటం కంటే.. మంత్రి నిరంజన్ రెడ్డి చావటం మేలని విమర్శించారు. వ్యవసాయం, ధాన్యం కొనుగోలుపై లైవ్ డిబేట్‌కు రెడీ.... నిరంజన్ రెడ్డి ఇంటికి రావటానికీ సిద్ధమేనా? అని ఆయన ప్రశ్నించారు. -------- రాష్ట్రంలోని హుజురాబాద్ నియోజకవర్గంలో జరుగుతున్న ఉపఎన్నికల సందర్భంగా డబ్బులు అడిగిన ఓటర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఎస్‌ఈసీ శశాంక్ గోయల్ తెలిపారు. తమకు డబ్బులు రాలేదని నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాలో కొంతమంది ఆందోళన చేయడం ఈసీ దృష్టికి వచ్చిందన్నారు. డబ్బుల కోసం ఆందోళన చేసిన వారిపై కేసులు నమోదు చేస్తామని ఆయన ప్రకటించారు. ఓటు కోసం డబ్బులు అడిగిన వారిని గుర్తిస్తున్నామని శశాంక్ తెలిపారు. --- వరి విత్తనాలు అమ్మకూడదన్న సిద్దిపేట కలెక్టర్ ఆదేశాలను సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆ పిటిషన్‌లో తెలంగాణ ప్రభుత్వం, సిద్దిపేట కలెక్టర్, జిల్లా వ్యవసాయ అధికారి మండల వ్యవసాయ అధికారులను ప్రతివాదులుగా పిటిషనర్ చేర్చారు. వరి విత్తనాలు అమ్మకూడదంటూ జారీ చేసిన ఆదేశాలు చట్టవిరుద్ధమైనవని బాతుల నారాయణ పిటిషన్‌లో పేర్కొన్నారు.  ------- కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ గుండెపోటుతో మృతిచెందడపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. ప్రజలు విశేషాభిమానాన్ని చూరగొనిన ప్రతిభావంతుడైన నటుడు పునీత్ రాజ్‌కుమార్ అని, అలాంటి పునీత్‌ను విధి మన నుంచి దూరం చేయడం బాధాకరమని ఓ ట్వీట్‌లో సంతాపం తెలిపారు. చాలా చిన్న వయస్సులోనే ఆయన కాలం చేసినప్పటికీ, ఆయన వ్యక్తిత్వం, ఆయన చేసిన కృషి భవిష్యత్ తరాలకు కూడా గుర్తుండిపోతుందని తెలిపారు. 

జైలుకు జగన్... ఉమ్మడి ఏపీ సీఎంగా కేసీఆర్? 

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను మరోసారి టార్గెట్ చేశారు తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. ప్లీనరీలో తెలుగుతల్లి ప్రత్యక్షం కావడం, మంత్రి పేర్నినాని సమైక్య రాష్ట్ర ప్రతిపాదన తేవడం కేసీఆర్, జగన్‌ తేవడం వెనుక ఉమ్మడి కుట్ర కనిపిస్తోందని గురువారం ట్వీట్ చేశారు రేవంత్ రెడ్డి. ఈ ట్వీట్ పై దుమారం రేగుతుండగానే మరో బాంబ్ పేల్చారు రేవంత్ రెడ్డి కేసీఆర్, జగన్ మొదటి నుంచి కవలపిల్లల్లా కలిసి వెళుతున్నారని అన్నారు.  ఉమ్మడి రాష్ట్ర కోసం జగన్, కేసీఆర్ ఆలోచన చేస్తున్నారని చెప్పారు.  షర్మిల తెలంగాణలో పాదయాత్ర చేయడం, కలిసిపోదాం అని ఏపీ మంత్రి పేర్ని నాని అనడం అనుకోకుండా జరిగినవి కావన్నారు రేవంత్ రెడ్డి.  జల వివాదాలు పెంచి రెండు రాష్ట్రాలను కలిపే కుట్ర జరుగుతోందన్నారు. కేటీఆర్ భీమవరం లో పోటీ చేస్తారో, లేక బొబ్బిలి లో పోటీ చేస్తారో తెలువదు.కానీ ఇలాంటి కుట్రలు ప్రజలు సహించరని అన్నారు. జరుగుతున్న కుట్రలను ప్రజలు ఛేదించాల్సిన అవసరం ఉందన్నారు. జగన్ జైలుకు వెళుతాడు కాబట్టి ఉమ్మడి రాష్ట్రానికి కేసీఆర్ సీఎం కావాలని అనుకున్నట్లుగా ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి. పేర్ని వ్యాఖ్యలను టిఆర్ఎస్ ఎందుకు ఖండించడం లేదని ప్రశ్నించారు. మౌనంగా ఉన్నారంటే నాని వ్యాఖ్యలు స్వాగతించినట్లే కదా అని రేవంత్ రెడ్డి చెప్పారు హైదరాబాద్ లో సోమవారం జరిగిన పార్టీ ప్లినరీలో మాట్లాడిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆంధ్రాలోనూ టీఆర్ఎస్ ను విస్తరించాలని తనకు వినతులు వస్తున్నాయని అన్నారు. ఏపీలో కరెంట్ సమస్య ఉందని, అందుకే అక్కడి ప్రజలు టీఆర్ఎస్ ను కోరుకుంటున్నారని చెప్పారు. కేసీఆర్ మాటలకు ఏపీ మంత్రులు, వైసీపీ నేతలు కౌంటరిచ్చారు.  రెండు రాష్ట్రాల్లో పార్టీ ఎందుకు?  రెండు తెలుగు రాష్ట్రాలను కలిపేస్తే సరిపోతుంది కదా అని కేసీఆర్‌కు సూచించారు ఏపీ మంత్రి పేర్నినాని. ఏపీలో పార్టీ పెట్టే ముందు తెలంగాణ కేబినెట్‌లో తీర్మానం పెడితే బాగుంటుందని  సూచించారు.  రెండు తెలుగు రాష్ట్రాలు కలిసిపోతే ఏపీలో కేసీఆర్ భేషుగ్గా పోటీ చేయొచ్చని నాని పేర్కొన్నారు. నాని చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. రేవంత్ రెడ్డి ఘాటైన కామెంట్లు చేయడం తెలుగు రాష్ట్రాల్లో రచ్చగా మారింది. 

ఎక్కడికొస్తారో రండి.. చూసుకుందాం! జగన్ రెడ్డికి చంద్రబాబు సవాల్...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అరాచకాలు సృష్టిస్తోందని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. జగన్ రెడ్డి  ప్రభుత్వానికి పరిపాలించే అర్హత లేదని హెచ్చరించారు.  ప్రజల సమస్యలు తెలుసుకునే హక్కు తనకు లేదా అని ప్రభుత్వాన్ని చంద్రబాబు నిలదీసారు. తన మీద బాంబు వేస్తామని ఒకాయన అంటున్నారని, తనను ప్రజా దేవుళ్లే కాపాడుకుంటారని చంద్రబాబు పేర్కొన్నారు. వైసీపీ అధర్మ పాలనపై తాను చేసేది ధర్మపోరాటమని అన్నారు.  తన సొంత నియోజక వర్గమైన కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు చంద్రబాబు. రెండు రోజుల పర్యనటలో భాగంగా తొలిరోజు బహిరంగ సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తన పర్యటనకు అడగడుగునా అడ్డంకులు సృష్టిస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. టీడీపీ నేతలను, కార్యకర్తలను వేధిస్తే చూస్తూ ఊరుకోమని  చంద్రబాబు హెచ్చరించారు. ఎక్కడికొస్తారో రండి.. చూసుకుందాం, ధైర్యం ఉందా అని చంద్రబాబు సవాల్ విసిరారు. టీడీపీ ఆఫీస్‌పై దాడి చేసి, టీడీపీ నేతలపైనే కేసులు పెట్టారని చంద్రబాబు ఆరోపించారు. డీజీపీ ఆఫీస్‌లో పనిచేసే వ్యక్తి దాడి సమయంలో ఎందుకున్నాడని ఆయన ప్రశ్నించారు.  ఏపీలో షాక్‌ కొట్టేలా విద్యుత్‌ చార్జీలు పెంచారని మండిపడ్డారు. . పన్నులు పెంచుతూ.. ప్రజలపై భారం మోపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వ్యవసాయరంగం సంక్షోభంలో పడిందన్నారు. రైతులకు కనీస మద్దతు ధర, ఎరువులు ఇవ్వడం లేదని మండిపడ్డారు. జగన్‌రెడ్డి ప్రభుత్వం రైతులను దగా చేస్తోందని ధ్వజమెత్తారు. నకిలీ మద్యంతో ప్రజారోగ్యంతో చెలగాటం ఆడుతున్నారన్నారు. ఏపీని సారాయి, గంజాయి, డ్రగ్స్‌కు కేంద్రంగా మార్చారన్నారు. అక్రమ కేసులకు భయపడి మేం సరెండర్‌ కావాలా అని చంద్రబాబు ప్రశ్నించారు. రాజకీయ పార్టీలు వదిలేసి పారిపోవాలా అని చంద్రబాబు నిలదీసారు.  

చంద్రబాబు సభలో బాంబు కలకలం? కుప్పంలో హై టెన్షన్..  

తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రోడ్ షోలో చంద్రబాబు ప్రసంగిస్తుండగా అతని వైపు జనాల్లోనుంచి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దూసుకువచ్చారు. వాళ్లను టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. చంద్రబాబు వైపు దూసుకొచ్చింది వైసీపీ కార్యకర్తగా అనుమానిస్తున్నారు. దుండగుడి  చేతిలో రాళ్లు, కర్ర ఉండటంతో అంతా షాకయ్యారు. ఈ ఘటనతో చంద్రబాబు సభలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ కార్యకర్త కర్రలు, రాళ్లతో దూసుకురావడంతో చంద్రబాబు సెక్యూరిటీ సిబ్బంది ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. చంద్రబాబుకు రక్షణ కవచంగా నిలబడ్డారు. ఈ ఘటన తర్వాత టీడీపీ కార్యకర్తలు వైసీపీ ప్రభుత్వానికి, సీఎం జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. చంద్రబాబుపై వేయడానికి బాంబులు తీసుకుని వైసీపీ కార్యకర్తలు వచ్చారని ఆరోపించారు. చంద్రబాబుపై బాంబులు వేస్తామని ఇటీవలే కొందరు వైసీపీ నేతలు ప్రకటించారు. ఈ నేపథ్యంలో కుప్పం చంద్రబాబు పర్యటనలో రాళ్లు, కర్రలతో వైసీపీ కార్యకర్త హల్ చల్ చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. 

హుజూరాబాద్ పై ఆంధ్రా బుకీల బెట్టింగ్స్! గంటగంటకు మారుతున్న ఈక్వేషన్స్..

హుజూరాబాద్ ఎన్నికల ఫలితాలను క్యాష్ చేసుకునేందుకు బెట్టింగ్ రాయుళ్లు రంగంలోకి దిగారు. యావద్దేశ రాజకీయాల్లో ఆసక్తి రేపుతున్న, అత్యంత ఖరీదైన ఎన్నికగా చెబుతున్న హుజూరాబాద్ ఫలితాలపై దేశవ్యాప్తంగా బెట్టింగ్ దందా నిర్వహించే ముఠాలు ముంబై, బెంగళూరు నుంచే కాక ముఖ్యంగా ఆంధ్రా నుంచి పెద్దఎత్తున  రంగంలోకి  దిగినట్టు విశ్వసనీయ సమాచారం. హుజూరాబాద్ కు సమీపంలోనే ఉన్న కరీంనగర్, హన్మకొండ జిల్లా కేంద్రాల్లోని పలు లాడ్జీల్లో తిష్ట వేసి బెట్టింగ్ దందా నిర్వహిస్తున్నారు. కొందరు సుదూరంగా ఉన్న ముఠాలైతే  హుజూరాబాద్ లోని తమకు తెలిసినవారి ద్వారా సమాచారం తెలుసుకొని పందేలు కాస్తున్నట్టు  తెలుస్తోంది. తెలంగాణ రాజకీయాలపై ఆసక్తి చూపే ఆంధ్రా బుకీలు... సంక్రాంతి సీజన్లో నిర్వహించే కోడిపందేల్లాగే పెద్దఎత్తున బెట్టింగ్ నిర్వహించి పెద్దఎత్తున సొమ్ము చేసుకునేందుకు ప్లాన్ వేశారు.  స్థానికంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ బెట్టింగ్ రూ. వందల కోట్ల రేంజ్ దాటి వేల కోట్లకు  చేరిందంటున్నారు. కరీంనగర్, హన్మకొండ జిల్లాల్లోని లాడ్జీలు, గెస్ట్హౌజ్ లతో పాటు ప్రత్యేకంగా తీసుకున్న గదుల్లో ఉంటూ ఈ వ్యవహారం అంతా నడిపిస్తున్నట్లు సమాచారం. తమపై ఎలాంటి దాడులు జరగకుండా ఉండేందుకు బుకీలంతా కలిసి ఇద్దరు, ముగ్గురు వ్యక్తులను ఓ బృందంగా ఏర్పాటు చేసుకుని బెట్టింగులు నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ బృందం సభ్యులు పోలీసులు, మీడియా, ఇతరులను మేనేజ్చేస్తూ వారికి ఎంతో కొంత ముట్టజెపుతూ తమ వ్యవహారం సాఫీగా నడిచేందుకు ప్రణాళికలకు రూపొందించుకుంటున్నారు.  హుజూరాబాద్ ఫలితాలపై తొలినుంచీ ఓ జాతీయ పార్టీకి ఎడ్జ్ ఉంటుందని అన్ని సర్వేలూ తేల్చి చెప్పిన క్రమంలో ఆ పార్టీ అభ్యర్థిపై పెట్టిన సొమ్ముకు ఆరింతలు ముట్టజెప్పే విధంగా బుకీలు బెట్టింగ్ నిర్వహిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఇక్కడ దాదాపు ఆరు నెలలుగా ఉత్కంఠ భరిత ప్రచారం కొనసాగగా, ఇప్పుడు అందరి దృష్టీ ఓట్లు, ఫలితాలపైనే ఉంది. ఎన్నికల్లో ఈటల రాజేందరే గెలుస్తాడని కొందరు, లేదు.. గెల్లు శ్రీనివాసే గెలుస్తాడని ఇంకొందరు జోరుగా బెట్టింగ్ కడుతున్నారు. అంతేకాదు... ఆయా పార్టీలకు ఇంత మెజారిటీ వస్తుంది.. అంత మెజారిటీ వస్తుందని,  ఓ పార్టీ అభ్యర్థికైతే అసలు డిపాజిటే రాదని.... ఇలా సర్వేల ద్వారా తాము నమ్ముతున్న మేరకు బెట్టింగ్లు జోరందుకున్నాయి. కొందరైతే  ప్రత్యేకంగా ప్రైవేటు  సంస్థల ద్వారా ప్రాంతాలు, కులాల వారీగా సర్వే చేసుకుని ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయోనని తెలుసుకుని మరీ పెద్ద ఎత్తున పందేలు కాస్తున్నట్లు తెలుస్తోంది.  సుమారు నెల రోజుల ముందు నుంచే బెట్టింగులు షురూ అయ్యాయి. వందల కోట్ల రూపాయల నుంచి ప్రారంభమైన బెట్టింగ్ పోలింగ్కు గడువు సమీపిస్తుండడంతో అది దాదాపు వేయి కోట్లకు చేరినట్లు సమాచారం. బెట్టింగ్ నిర్వహించే బుకీలు ఆన్లైన్తోనే ఎక్కువగా దందా సాగిస్తున్నట్లు చెబుతున్నారు. తెలంగాణే కాకుండా ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ, పశ్చిమగోదావరి జిల్లా, నెల్లూరు, గుంటూరు, విశాఖపట్నం, తూర్పు గోదావరి, కడప, ఇక మహారాష్ట్రకు చెందిన నాందేడ్, ముంబై, షోలాపూర్, గుజరాత్ తదితర రాష్ట్రాల వారు కూడా ఇందులో పాల్గొంటున్నట్టు తెలుస్తోంది.  ఈ బెట్టింగ్ వ్యవహారం ఆన్లైన్, ఆఫ్లైన్ పద్ధతిలో సాగుతోంది. ఒక్కో వ్యక్తి సుమారు రూ.5వేల నుంచి రూ.10 లక్షల వరకూ పెట్టుబడి పెడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. బెట్టింగ్ వేసే వ్యక్తి చెప్పినట్టుగా ఫలానా అభ్యర్థి గెలిస్తే అతను పెట్టిన డబ్బులకు ఐదు, పది రెట్లు ఇస్తామని బుకీలు చెబుతుండడంతో బెట్టింగ్ రాయుళ్లు చాలా మంది ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో గెలుపు అవకాశాలున్నాయని భావిస్తున్న పార్టీ వైపే పెద్దఎత్తున డబ్బు గుమ్మరిస్తున్నారు. 

జగన్ సర్కార్ కు బిగ్ షాక్.. అమరావతి రైతు పాదయాత్రకు హైకోర్టు అనుమతి..

అంధ్రప్రదేశ్ లో జగన్ రెడ్డి ప్రభుత్వానికి మరో బిగ్ షాక్ తగిలింది. అమరావతి రైతుల పాదయాత్రపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఏపీ హైకోర్టు కొట్టివేసింది. అమరావతి రైతుల పాదయాత్రకు ఏపీ హైకోర్టు అనుమతిచ్చింది. నవంబరు 1 నుంచి డిసెంబరు 17 వరకు తలపెట్టిన పాదయాత్రను రైతులు చేసుకోవచ్చని ఆదేశించింది.  ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ 22 నెలలుగా ఆందోళన చేస్తున్నారు రాజధాని ప్రాంత రైతులు. అందులో భాగంగానే అమరావతి నుంచి తిరుమల వరకు 'న్యాయస్థానం నుంచి దేవస్థానం’ పేరిట పాదయాత్ర చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం అనుమతి కోరుతూ పోలీసులకు లేఖ ఇచ్చారు. అయితే అమరావతి రైతుల పాదయాత్రకు అనుమతి ఇవ్వడం లేదని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. ఏపీ ప్రభుత్వం, పోలీసుల తీరుపై హైకోర్టును ఆశ్రయించారు రైతులు. పాదయాత్ర అనుమతి కోసం అమరావతి రైతులు వేసిన లంచ్ మోషన్ పిటిషన్‌పై కోర్టు విచారించింది. పాదయాత్రకు అనుమతి ఇవ్వకూడదని ప్రభుత్వ న్యాయవాది అభ్యంతరం తెలిపారు. పోలీసులు అనుమతి నిరాకరిస్తూ ఇచ్చిన ఉత్తర్వుల్లో సహేతుకమైన కారణాలు లేవని న్యాయవాది లక్ష్మీనారాయణ వాదించారు. పాదయాత్రకు అనుమతిస్తే అభ్యంతరం ఏమిటని హైకోర్టు ప్రశ్నించింది. రైతుల పాదయాత్రపై గ్రామాల్లో రాళ్లు వేసే ప్రమాదం ఉందని, శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని  ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. రైతులు శాంతియుతంగా పాదయాత్ర చేస్తారని పిటిషనర్ల తరపు న్యాయవాది లక్ష్మీనారాయణ తెలిపారు. దీంతో రైతుల పాదయాత్రకు షరతులతో న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. హైకోర్టు అనుమతి ఇవ్వడంతో పాదయాత్రకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు అమరావతి రైతులు. నవంబరు 1 నుంచి డిసెంబరు 17 వరకు 45 రోజుల పాటు పాదయాత్ర చేపట్టనున్నట్లు అమరావతి జేఏసీ, రైతు సంఘాల నేతలు ప్రకటించారు.

రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసిన వైసీపీ మంత్రులు.. కారణం ఆయనేనా?  

తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు ఏపీలోని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు. నిత్యం టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్ ను తిట్టడమే పనిగా పెట్టుకునే వైసీపీ మంత్రులు.. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడుపై విరుచుకుపడుతున్నారు. సీఎం కేసీఆర్ తో పాటు ఏపీ సీఎం జగన్ పై ఆయన చేసిన వ్యాఖ్యలకు కౌంటరిస్తున్నారు. సీఎం కేసీఆర్ రాజ్యవిస్తరణ కాంక్షకు తెలంగాణను బలిచ్చే కుట్ర జరుగుతోందని గురువారం రాత్రి రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. ప్లీనరీలో తెలుగుతల్లి ప్రత్యక్షం కావడం, మంత్రి పేర్నినాని సమైక్య రాష్ట్ర ప్రతిపాదన తేవడం కేసీఆర్, జగన్‌ల ఉమ్మడి కుట్ర కనిపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. వందల మంది ఆత్మబలిదానాలతో తెలంగాణ ఏర్పడిందని, తెలంగాణ జోలికి వస్తే ఖబడ్దార్‌ అని రేవంత్‌రెడ్డి ట్వీట్‌ చేశారు. రేవంత్‌రెడ్డి ట్వీట్‌పై మంత్రి  పేర్ని నాని కౌంటరిచ్చారు. రోజూ రాజకీయాల్లో ఉండాలనుకునే వారు ఇలాగే మాట్లాడతారని చెప్పారు. రేవంత్‌కు రోజూ రాజకీయాలు కావాలని విమర్శించారు. సీఎం కేసీఆర్ చెప్పిన మాటలపైనే మాట్లాడానని తెలిపారు. సీఎం జగన్ ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడతారని, ఇలా డొంకతిరుగుడు ఉండదని పేర్ని నాని స్పష్టం చేశారు. ఏ పార్టీ వారైనా డైరెక్ట్‌గా మాట్లాడాలని, నోటితో నవ్వి నొసటితో వెక్కిరించకూడదని సూచించారు. తెలంగాణలో ఒక తీర్మానం చేస్తే రెండు రాష్ట్రాలు కలిసిపోతాయని, మళ్లీ కొత్త పార్టీ ఎందుకు అని పేర్ని నాని ప్రశ్నించారు. హైదరాబాద్ లో సోమవారం జరిగిన పార్టీ ప్లినరీలో మాట్లాడిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆంధ్రాలోనూ టీఆర్ఎస్ ను విస్తరించాలని తనకు వినతులు వస్తున్నాయని అన్నారు. ఏపీలో కరెంట్ సమస్య ఉందని, అందుకే అక్కడి ప్రజలు టీఆర్ఎస్ ను కోరుకుంటున్నారని చెప్పారు. కేసీఆర్ మాటలకు ఏపీ మంత్రులు, వైసీపీ నేతలు కౌంటరిచ్చారు.  రెండు రాష్ట్రాల్లో పార్టీ ఎందుకు?  రెండు తెలుగు రాష్ట్రాలను కలిపేస్తే సరిపోతుంది కదా అని కేసీఆర్‌కు సూచించారు ఏపీ మంత్రి పేర్నినాని. ఏపీలో పార్టీ పెట్టే ముందు తెలంగాణ కేబినెట్‌లో తీర్మానం పెడితే బాగుంటుందని  సూచించారు.  రెండు తెలుగు రాష్ట్రాలు కలిసిపోతే ఏపీలో కేసీఆర్ భేషుగ్గా పోటీ చేయొచ్చని నాని పేర్కొన్నారు. నాని చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. రేవంత్ రెడ్డి ఘాటైన కామెంట్లు చేయడం తెలుగు రాష్ట్రాల్లో రచ్చగా మారింది. 

వైసీపీ పాలనలో గంజాయి స్మగ్లింగ్.. జ‌న‌సేనాని సొల్యూష‌న్‌..

గంజాయి సాగు కొంద‌రికీ ఉపాధి. గంజాయి దందా మ‌రికొంద‌రికి వ్యాపారం. గంజాయి స్మ‌గ్లింగ్‌పై ఉదాసీన‌త చాలామంది పెద్ద‌ల‌కు క‌న‌క‌వ‌ర్షం. ఇలా విశాఖ మ‌న్యంలో గంజాయి.. అంశాన్ని అనేక కోణాల్లో చూడాల్సి ఉంటుంది. తాజాగా, జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ సైతం ఇదే ర‌క‌మైన అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు. ఇటీవ‌ల కాలంలో ఆయ‌న గంజాయి అంశంపై వ‌రుస ట్వీట్లు చేస్తున్నారు. తాజాగా మ‌రోసారి ట్విట‌ర్‌లో వైసీపీ తీరును ఏకిపారేశారు. ఆంధ్రా-ఒరిస్సా సరిహద్దులో ‘గంజాయి స్మగ్లింగ్’ అంశాన్ని సామాజిక-ఆర్థిక సమస్యగా చూడాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ట్విటర్ వేదికగా గంజాయి అంశంపై స్పందించారు. ‘‘ఈ సమస్య అకస్మాత్తుగా తలెత్తలేదు, ఇది 15-20 ఏళ్లుగా ఉంది. నేను 2018 నుండి ఈ అంశాన్ని హైలైట్ చేస్తున్నాను. ప్రస్తుత వైసీపీ పాలనలో గంజాయి స్మగ్లింగ్ మరింత ఎక్కువైంది. YCP ప్రభుత్వం ఈ ముప్పును అరికట్టాలి. ఈ వేల కోట్ల విలువైన గంజాయి వ్యాపారాన్ని అంతం చేయడానికి పటిష్టమైన చట్టాన్ని అమలు చేయాలి. సమాన ఉపాధి అవకాశాలను సమాంతరంగా సృష్టించాలి’’ అంటూ 2018లో గంజాయి గురించి తాను మాట్లాడిన వీడియోను పవన్ పోస్ట్ చేశారు.

రూల్స్ పాటించకుండా అరెస్టు! పట్టాభి కేసులో ఇద్దరు పోలీసులపై వేటు..

తెలుగు దేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ ఇంటిపై వైసీపీ శ్రేణుల దాడి ఘటన ఏపీలో తీవ్ర దుమారం రేపింది. తర్వాత ఆయన అరెస్ట్ వ్యవహారం వివాదాస్పదమైంది. అధికార పార్టీ నేతల ఆదేశాలతో పోలీసులు అతిగా చేశారనే ఆరోపణలు వచ్చాయి. పట్టాభి అరెస్ట్ విషయంలో కొందరు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్సించారు. రూల్స్ పాటించకుండా వ్యవహరించారనే విమర్శలు వచ్చాయి. వాళ్లంతా ఇప్పుడు చిక్కులో పడ్డారు.  టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ అరెస్ట్ వ్యవహారం పోలీసుల మెడకు చుట్టుకుంది. అరెస్ట్ చేసిన సందర్భంలో పోలీసులు న్యాయబద్ధంగా వ్యవహరించలేదని హైకోర్టు కూడా సీరియస్ గా స్పందించింది. పట్టాభి అరెస్ట్ సమయంలో రూల్ ఆఫ్ లా పాటించలేదంటూ హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఈ అంశంపై దృష్టిసారించిన పోలీసులు కేసు విచారణ చేపట్టారు. ఏ పోలీస్ అధికారి ఇలా ప్రవర్తించారనే దానిపై ఆరా తీశారు. చివరకు ఇద్దరు పోలీసు అధికారులపై వేటు వేశారు. పట్టాభిని అరెస్ట్ చేసే సమయంలో నిబంధనల ప్రకారం వ్యవహరించలేదని ఆ పోలీసు అధికారులపై బదిలీ వేటు వేశారు. విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సీటీసీ ఏసీపీగా ఉన్న రమేష్‌ను డీజీపీ కార్యాలయంలో, సీఐ నాగరాజును ఏలూరు రేంజ్‌ డీఐజీకి రిపోర్టు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఎస్‌బీలో పనిచేస్తున్న సురేష్‌ను గవర్నర్‌పేట ఇన్‌చార్జి సీఐగా సీపీ శ్రీనివాసులు నియమించారు. పట్టాభికి బెయిల్‌ మంజూరులో అసంపూర్తి నోటీసులు, అయన నుంచి వివరణ తీసుకోకుండానే అరెస్టు అంశాలు కీలకమయ్యాయి. పోలీసు ఉన్నతాధికారులు దీన్ని పరిగణనలోకి తీసుకుని బాధ్యతగా వ్యవహరించలేదన్న కారణంతో బదిలీ చేసినట్లు తెలుస్తోంది.

హుజురాబాద్‌లో మాయం.. వ‌రంగ‌ల్‌లో ఈట‌ల‌ ప్ర‌త్య‌క్షం.. చంపుకుంటారో-సాదుకుంటారో!

హుజురాబాద్ హోరెత్తుతోంది. ప్ర‌చారం ముగిసినా.. డ‌బ్బుల‌ పందేరం జోరుగా సాగుతోంది. అధికార పార్టీ వాళ్లు ఓటుకు 6వేలు ఇస్తున్నారు-అంటున్నారు. కొన్నిచోట్ల టీఆర్ఎస్ ఇచ్చే ఆరు వేలు త‌మ‌కు అంద‌లేదంటూ మ‌హిళ‌లు ధ‌ర్నాకు దిగ‌డం ఆస‌క్తిక‌రం. ఆ రేంజ్‌లో సాగుతోంది డ‌బ్బుల పంప‌కం. అయితే, ఓట‌ర్ల‌కు డ‌బ్బులు ఇవ్వ‌డంలో బీజేపీ బాగా వ‌న‌క‌బ‌డింద‌ని అంటున్నారు. ఈట‌ల త‌ర‌ఫు వాళ్లు ఓటుకు 1500 నుంచి 2 వేలు మాత్ర‌మే ఇస్తున్నార‌ని.. అంత‌కుమించి ఇవ్వ‌డం లేద‌ని టాక్‌. ఆ ఇచ్చేది కూడా కొంద‌రికే అట‌. ఫ‌లానా వాళ్లు ప‌క్కాగా త‌మ‌కే ఓటేస్తార‌ని అనిపిస్తేనే.. డ‌బ్బులిస్తున్నార‌ట‌. లేదంటే లేదు. ఆ కాస్త డ‌బ్బులు కూడా ఇవ్వ‌కుండా ఇటు టీఆర్ఎస్ కేడ‌ర్‌, అటు ప్ర‌భుత్వ యంత్రాంగం బీజేపీ డ‌బ్బు పంపిణీని బాగా క‌ట్ట‌డి చేస్తున్నాయ‌ని అంటున్నారు. ఈట‌ల మ‌నుషుల చుట్టూ.. గులాబీ మ‌నుషులు మోహ‌రించి.. పైస‌లు పంచ‌కుండా అడ్డుకుంటున్నార‌ని తెలుస్తోంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో బీజేపీ అభ్య‌ర్థి ఈట‌ల రాజేంద‌ర్ స‌డెన్‌గా హుజురాబాద్ నుంచి మాయ‌మ‌వ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ఇంత‌కీ ఆయ‌న ఎక్క‌డికి వెళ్లారంటే.. మరికొద్ది గంటల్లో హుజూరాబాద్ ఉపఎన్నిక జరగనుంది. పోలింగ్‌కు అవసరమైన ఏర్పాట్లన్నీ జరిగిపోయాయి. కేవ‌లం డ‌బ్బుల పందేర‌మే న‌డుస్తోంది. ఇలాంటి కీల‌క స‌మ‌యంలో ఈటల రాజేందర్.. హుజురాబాద్ నుంచి ఎల‌క్ష‌న్ కోడ్ లేని వరంగల్ జిల్లాలో వాలిపోయారు. ఆయ‌న వ‌చ్చే స‌రికే ప‌లువురు బీజేపీ కీల‌క నేత‌లు వ‌రంగ‌ల్‌లో ఈట‌ల కోసం ఓ హోట‌ల్‌లో వేచి చూస్తున్నారు.  వ‌రంగ‌ల్‌లోని హోటల్‌లో బీజేపీ నేతలు-ఈట‌ల రాజేంద‌ర్ సమావేశం కావాల్సి ఉంది. విలేక‌రుల స‌మావేశమూ జ‌ర‌గాల్సి ఉంది. అయితే ఈ భేటీని పోలీసులు అడ్డుకున్నారు. ఈటల హోటల్ లోపలికి వెళ్ల‌కుండా పోలీసులు రోడ్డు మీదే అడ్డుకున్నారు. దీంతో బీజేపీ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులను వారించి రాజేందర్‌ను బీజేపీ నేతలు వివేక్ వెంకటస్వామి, రావు పద్మ తదితరులు హోటల్ లోపలికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఈటల భావోద్వేగానికి లోనయ్యారు. ‘ప్రజలతో 19ఏళ్ల బంధం నాది. చంపుకుంటరో-సాదుకుంటరో మీకిష్టం నేను చచ్చినా బతికినా మీవెంటే’ అంటూ ఆవేదన చెందారు.  

కేసీఆర్ పై భగ్గుమన్న ఓయూ.. తెలుగు రాష్ట్రాలను కలిపే కుట్రలా? 

రాజకీయ నాయకుల అనాలోచిత వ్యాఖ్యలు ఎటువంటి అనర్ధాలకు దారి తీస్తాయో ఉహించడం కష్టం. అయితే గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, రాజకీయ నాయకులు ముఖ్యంగా కీలక పదవుల్లో ఉన్న నాయకులు నోటిని అదుపులో పెట్టుకోవడం అవసరం. అలాకాకుండా ముందు వెనకా చూసుకోకుండా నోటికి ఎదోస్తే అది, మాట్లాడితే ఇదిగో ఇలాంటి పరిస్థితినే ఎదుర్కోవలసి వస్తుంది.  తెలంగాణ ముఖ్యమంత్రి, తెరాస అధ్యక్షుడు కేసీఆర్, ఇటీవల జరిగిన పార్టీ ప్లీనరీలో, తమ గొప్పలు చెప్పుకునే క్రమంలో, రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఏపీ ప్రజలు తమ రాష్ట్రంలో కూడా తెరాస పెట్టాలని కోరుతున్నారని, కుప్పలు, కుప్పలుగా విజ్ఞప్తులు పంపుతున్నారని అన్నారు. కేసీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో  దుమారం రేపాయి. ఏపీ మంత్రి పేర్ని నానీ, కేసీఆర్ వ్యాఖ్యలఫై స్పందిస్తూ చాలా  క్యాజువల్’ గా మళ్ళీ ఇక్కడో పార్టీ, అక్కడో పార్టీ ఎందుకు, రెండు రాష్ట్రాలను కలిపేస్తే, అక్కడా ఇక్కడా పోటీ చేసి ఉమ్మడి రాష్ట్రాన్ని మీరే ఎలుకోవచ్చును కదా ..అని అన్నారు.  ఇలా, కేసీఆర్ రేపిన తెనేపట్టుతో ఇప్పుడు ఉస్మానియాలో భగ్గుమంది. ఓయూ జేఏసీ విద్యార్థి నేతలు కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. తెలంగాణ ,ఆంధ్ర రాష్ట్రాలను కలపాలని కేసీఆర్,జగన్ లు కుట్ర చేస్తున్నారని విద్యార్థి జేఏసీ నేతలు ఆరోపించారు. ఓయూ ఎన్సీసీ గేట్ వద్ద జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ దిష్టి బొమ్మను దహనం చేశారు. టిఆర్ఎస్ నిర్వహించిన ప్లీనరీలో తెలంగాణ తల్లి విగ్రహం బదులు తెలుగు తల్లి విగ్రహాన్ని పెట్టి అమర వీరుల త్యాగాలను కేసీఆర్ కించపరిచాడని ఆరోపించారు. అలాగే కేసీఆర్;కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.  నిజానికి కేసీఆర్ కోరుకున్నది కూడా ఇదే. హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ కు ముందు సెంటిమెంట్ ను రెచ్చగొట్టేందుకే, కేసీఆర్ ప్లీనరీలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఓయూ విద్యార్ధులు ఆయన కోరుకున్నవిధంగానే స్పందించారు, అయితే ఇది ఇంతటితో ఇది ఆగుతుందా, లేక మరోమారు బలిదానాల వరకు వెళుతుందా ..అనేది చూడవలసి ఉంది.