దళిత బంధు గ్రామంలో ఈటలకు లీడ్.. కెప్టెన్ గ్రామంలో కారు గల్లంతు 

హుజురాబాద్ ఉప ఎన్నికల కౌంటింగ్‌లో అధికార టీఆర్ఎస్ పార్టీకి దెబ్బమీద దెబ్బ పడుతోంది. గతంలో గులాబీ పార్టీకి కంచుకోటగా ఉన్న ప్రాంతాల్లోనూ కమలం జోరు కనిపిస్తోంది. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న దళిత బంధు పథకం టీఆర్ఎస్ పార్టీకి గుది బండగా మారింది. దళితబంధు పథకాన్ని ముందుగా ముఖ్యమంత్రి కేసీఆర్ శాలపల్లి గ్రామంలో ప్రారంభించారు. శాలపల్లి గ్రామస్తులు సైతం కేసీఆర్‌ను ఊహించని దెబ్బకొట్టారు. శాలపల్లి గ్రామంలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఆధిక్యం కనబరిచారు.     రాజ్యసభ్యులు కెప్టెన్ లక్ష్మీ కాంతరావు ఇలాఖాలో టీఆర్ఎస్‌కు షాక్ తగిలింది. ఇప్పటి వరకు ఆయన కుటుంబానికి మంచి పట్టున్న తుమ్మనపల్లి, బోర్పపల్లి గ్రామాల్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు భారీ ఆధిక్యం వచ్చింది. ఈ గ్రామాల్లో ఈటలకు 350 ఓట్లకు పైగా లీడ్ వచ్చింది. హుజురాబాద్ మండలంలోని వెంకట్రావుపల్లి గ్రామంలోనూ ఈటల 90 ఓట్ల ఆధిక్యం సాధించారు. ఈ గ్రామంలో యాదవ సామాజిక వర్గానికి చెందిన వారే ఎక్కువగా ఉన్నప్పటికీ అదే సామాజిక వర్గానికి చెందిన టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌కు అండగా నిలబడలేదు. 

హుజ‌రా..వార్ వ‌న్‌సైడ్‌.. ఈట‌ల‌నా మ‌జాకా..

హుజ‌రాబాద్‌లో వార్ వ‌న్‌సైడ్‌గా మారింది. రౌండ్ రౌండ్‌లో ఈట‌ల రాజేంద‌ర్ దూసుకుపోతున్నారు. జ‌స్ట్ పోస్ట‌ల్ బ్యాలెట్ మిన‌హా.. నియోజ‌క‌వ‌ర్గం మొత్తం బీజేపీదే హ‌వా. ఒక్కొక్క ఈవీఎమ్ ఓపెన్ చేస్తుంటే.. అధికార పార్టీకి గుండెద‌డ పెరిగిపోతోంది. ఈ రౌండ్‌లోనూ మ‌ళ్లీ ఓట‌మేనా అన్న‌ట్టు గెల్లుకు ముచ్చెమ‌ట‌లు ప‌డుతున్నాయి. ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో కూర్చొని టీవీల్లో రిజ‌ల్ట్స్ చూస్తున్న సీఎం కేసీఆర్‌కు బీపీ రైజ్ అవుతోంద‌ట‌. ప‌క్క‌నే డాక్ట‌ర్‌ను పెట్టుకొని మ‌రీ హుజురాబాద్ ఫ‌లితాలు ప‌రిశీలిస్తున్నార‌ట‌. కారు పార్టీలో అంత‌లా క‌ల‌వ‌రం.. అంత‌కు మించి క‌ల‌క‌లం. 5 మండ‌లాలు. ఏ మండ‌లంలోనూ కారు పార్టీకి ఆశ‌లు లేవు. అంతా కాషాయం రెప‌రెప‌లే. కాక‌పోతే మెజార్టీ కాస్త త‌గ్గుతోందంతే. ఇలా హోరాహోరీగా సాగిన ఎల‌క్ష‌న్‌లో ఆ మాత్రం టైట్ ఫైట్ త‌ప్ప‌దు. ఎంత మెజార్టీ కంటే.. గెలిచామా లేదా అన్న‌దే మేట‌ర్‌. స‌గం కౌంటింగ్ కాక‌ముందే.. హుజురాబాద్ ఫ‌లితాల‌పై క్లారిటీ వ‌చ్చేసింది. బీజేపీ అభ్య‌ర్థి ఈట‌ల రాజేంద‌ర్‌దే విజ‌య‌కేత‌నం అని డిసైడ్ అయిపోయింది.  ఓట‌ర్లు త‌ఢాకా చూపించారు. రాజ్యం అహంకారానికి త‌గిన బుద్ధి చెప్పారు. డ‌బ్బులు ఎరేసి.. ఓట్లు దండుకోవ‌చ్చ‌నే కుతంత్రాన్ని.. అదే ఓటుతో చాచిపెట్టి కొట్టారు. ఈవీఎంలో పువ్వు గుర్తుపై బ‌ట‌న్ గుద్దితే.. ఆ దెబ్బ నేరుగా సీఎం కేసీఆర్‌కు త‌గిలింది. 20 ఏళ్ల స‌హ‌చ‌రుడిని క‌రివేపాకులా తీసిపారేస్తే.. ఆయ‌న త్రాచుపాములా బుస‌లు కొడుతూ హుజురాబాద్ బ‌రిలో నిలిచారు. బానిస భ‌వ‌న్‌గా మారిన‌ ప్ర‌గ‌తి భ‌వ‌న్ గోడ‌ల‌ను బ‌ద్ద‌లు కొట్టేలా విజ‌యంతో తిరిగి అసెంబ్లీలో అడుగుపెట్ట‌బోతున్నారు. ఈట‌ల ఈటెల నుంచి ఇక కాస్కో కేసీఆర్‌..

హుజురాబాద్ లో ఆశలు వదులుకున్న టీఆర్ఎస్! మూడు రౌండ్లలోనూ బీజేపీకి లీడ్... 

తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశ వ్యాప్తంగా హాట్ హాట్ గా మారిన కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. రౌండ్ రౌండ్ కు బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఆధిక్యం పెరుగుతోంది. తొలి రౌండ్ లో 116, రెండో రౌండ్ లో 192 ఓట్ల లీడ్ సాధించిన ఈటల రాజేందర్ కు మూడో రౌండ్ లో 911 పరుగుల భారీ ఆధిక్యత వచ్చింది. దీంతో మూడు రౌండ్లు ముగిసేసరికి ఈటల మెజార్టీ 12 వందల 69కి పెరిగింది. హుజురాబాద్ రూరల్ కౌంటింగ్ ముగియగా.. టౌన్ లెక్కింపు జరుగుతోంది. తాజా ట్రెండ్స్ ను బట్టి హుజురాబాద్ లో టీఆర్ఎస్ ఆశలు వదులుకున్నట్లు కనిపిస్తోంది. హుజురాబాద్ మండలంలో తమకు లీడ్ వస్తుందని పోలింగ్ తర్వాత గులాబీ నేతలు  ధీమా వ్యక్తం చేశారు. ఎగ్జిట్ పోల్స్ లోనూ హుజురాబాద్ మండలంలో గట్టిపోటీ ఉందని తేలింది. అయితే ప్రస్తుతం మాత్రం హుజురాబాద్ లో మంచి మెజార్టీ దిశగానే ఈటల రాజేందర్ దూసుకుపోతున్నారు. వీణవంక, ఇల్లంతకుండ, కమలాపూర్ మండలాల్లో బీజేపీకి మంచి లీడ్ రావచ్చని భావిస్తున్నారు. దీంతో హుజురాబాద్ పై టీఆర్ఎస్ ఆశలు వదులుకుందని తెలుస్తోంది.  హుజారాబాద్ మూడో రౌండ్ టీఆర్ఎస్     2680 బీజేపీ           3727 బీజేపీ  లీడ్  911 బీజేపీ బీజేపీ మొత్తం లీడ్  1269 ఓట్లు  హుజురాబాద్ రెండో రౌండ్ టీఆర్ఎస్     4659  బీజేపీ           4851 కాంగ్రెస్        220  రెండో రౌండ్ లీడ్  192  బీజేపీ మొత్తం లీడ్  358  బీజేపీ  హుజురాబాద్ తొలి రౌండ్ మొత్తం ఓట్లు   9894  టీఆర్ఎస్  4444 బీజేపీ      4610 కాంగ్రెస్  119 తొలి రౌండ్ లీడ్  116 బీజేపీ 

ర‌ఘువీర హౌజ్ అరెస్ట్‌.. తాళ్ల‌తో క‌ట్టేసి..బంధించి..

బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఇది. బ్రేకింగ్ కంటే షాకింగ్ ఎక్కువ ఈ న్యూస్‌లో. మాజీ మంత్రి, మాజీ పీసీసీ చీఫ్ ర‌ఘువీరారెడ్డిని ఆయ‌న ఇంట్లోనే బంధించేశారు. హౌజ్ అరెస్ట్ చేశారు. ఇంటి పిల్ల‌ర్‌కు తాళ్ల‌తో ర‌ఘువీరాను క‌ట్టేశారు. ఆయ‌న చేతులు మూసుకొని మౌనంగా భ‌రిస్తున్నారే కానీ ఎదురు తిరిగి మాట్లాడ‌టం లేదు. త‌న‌నెందుకు ఇలా బంధిస్తున్నావంటూ నిల‌దీయ‌లేదు. ర‌ఘువీరారెడ్డిని ఇలా తాళ్ల‌తో క‌ట్టేసి..బంధించిన ఈ ఫోటో సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ఈ పోస్ట్‌పై చాలా చాలా కామెంట్లు కూడా వ‌స్తున్నాయి. ఇంత‌కీ అక్క‌డ అస‌లేం జ‌రిగింది? ర‌ఘువీరాను ఇలా తాళ్ల‌తో క‌ట్టేసి బంధించింది ఎవ‌రు? అంత పెద్ద స్థాయి లీడ‌ర్‌ను అలా క‌ట్టేసే అంత సాహ‌సం చేసిందెవ‌రు? అవ‌న్నీ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి.  ఈ ఫోటోను కాస్త జాగ్ర‌త్త‌గా ప‌రిశీలిస్తే.. త‌న‌ను ఇలా తాళ్ల‌తో బంధించ‌డాన్ని ర‌ఘువీరా సైతం బాగా ఎంజాయ్ చేస్తున్న‌ట్టు లేదు? అలా బంధించినందుకు ఆయ‌న ముఖంలో కోపం కంటే.. ఆనంద‌మే ఎక్కువ క‌నిపించ‌డం లేదు? అందుకు కార‌ణం.. ర‌ఘువీరాను అలా పిల్ల‌ర్‌కు క‌ట్టేసింది ఏ ప్ర‌త్య‌ర్థులో గిట్ట‌నివారో కాదో.. ఆయ‌న ఇంటి వారే. ర‌ఘువీరాకు ప్రియాతిప్రియ‌మైన ఆయ‌న మ‌న‌వ‌రాలు స‌మైరా. ఆ చిన్నారే తాత‌ను ఇలా తాళ్ల‌తో క‌ట్టేసింది. ఇలా ముచ్చ‌ట తీర్చుకుంది.    ఇంత‌కీ పెద్దాయ‌న మ‌న‌వ‌రాలు స‌మైరా తాత‌ను అలా ఎందుకు బంధించిందో తెలుసా? త‌న‌తో ఆడుకోవ‌డానికి ర‌ఘువీరా టైమ్ ఇవ్వ‌డం లేద‌ట‌. త‌న‌కు కుద‌ర‌దంటూ ఎప్ప‌టిక‌ప్పుడు త‌ప్పించుకుంటున్నార‌ట‌. దీంతో.. తాతా.. ఇంత‌ప‌నికొస్తావా అంటూ.. ఉండు నీ సంగ‌తి చెబుతానంటూ.. తాడు తెచ్చి స్తంభానికి క‌ట్టేసింది ఆ చిన్నారి స‌మైరా. తాత ఎక్క‌డికీ వెళ్లిపోకుండా ఆయ‌న్ను అలా బంధించి.. ఎంచ‌క్కా ఆయ‌న‌తో ఆడుకుంద‌ట ఆ మ‌న‌వ‌రాలు. ఈ విష‌యం తెలుపుతూ.. ఈ ఫోటోను ర‌ఘువీరానే ట్విట‌ర్‌లో పోస్ట్ చేశారు. ఈ పిక్ చూసి నెటిజ‌న్లు ర‌క‌ర‌కాల కామెంట్లు పెడుతున్నారు.  

రెండో రోజు ‘మహా పాదయాత్ర’.. అమరావతి రైతుల జోరు..

అమ‌రావ‌తి రైతుల్లో అదే ఉత్సాహం.. అదే ఉద్వేగం. మా రాజ‌ధాని మాకు కాకుండా చేస్తున్నార‌నే ఉద్రేగం. రెండేళ్లుగా నిర్విరామంగా ఉద్య‌మిస్తున్నా మూడు రాజ‌ధానుల‌పై వెన‌క్కి త‌గ్గ‌ట్లేదు ప్ర‌భుత్వం. అమ‌రావ‌తి ప‌రిర‌క్ష‌ణ స‌మితి సైతం అంతే ప‌ట్టుద‌ల‌గా ఉంది. ఉద్య‌మాలు, దీక్ష‌లు, ధ‌ర్నాల‌తో పాటు సీఎం జ‌గ‌న్‌రెడ్డి మ‌న‌సు మారాల‌ని ఆ దేవ‌దేవుడిని వేడుకోవ‌డానికి క‌దం క‌లిపారు. న్యాయ‌స్థానం నుంచి దేవ‌స్థానం పేరుతో తుళ్లూరు నుంచి తిరుమ‌ల‌కు మ‌హా పాద‌యాత్ర చేప‌ట్టారు.  ఏపీ ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రాజధాని రైతులు, మహిళలు చేపట్టిన మహాపాదయాత్ర రెండో రోజుకు చేరుకుంది. మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న రైతులు.. రెండో రోజు యాత్రను తాడికొండ నుంచి ప్రారంభించారు. అమరావతి పరిరక్షణ సమితి, రాజధాని ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యాత్ర రెండోరోజు గోరంట్లలో ముగియనుంది.  అమరావతి పరిరక్షణ, ఇతర ప్రాంతాలకు ఉద్యమాన్ని విస్తరించడమే లక్ష్యంగా ప్రారంభించిన ఈ పాదయాత్ర.. 45 రోజుల పాటు కొనసాగనుంది. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని 70 ప్రధాన గ్రామాల మీదుగా పయ‌నించి డిసెంబరు 17న తిరుపతిలో ముగించ‌నున్నారు అమ‌రావ‌తి రైతులు. 

హుజురాబాద్ లో కారుకు షాకిస్తున్న రోటీ మేకర్...

హుజురాబాద్ ఉప ఎన్నిక కౌంటింగ్ లో దుబ్బాక సీనే కనిపిస్తోంది. అధికార టీఆర్ఎస్ పార్టీకి ఇండిపెండెంట్ అభ్యర్థికి చెందిన రోటీ మేకర్ గుర్తు గండంగా మారేలా కనిపిస్తోంది. హుజురాబాద్ మండలానికి సంబంధించిన తొలి రౌండ్ ఓట్ల లెక్కింపులో రోటీ మేకర్ కు 122 ఓట్లు పడటంతో కారు పార్టీ నేతల్లో కలవరం కనిపిస్తోంది. తొలి రౌండ్ లో రోటీ మేకర్ కు కాంగ్రెస్ అభ్యర్థి కంటే ఎక్కువ ఓట్లు రావడం ఆసక్తిగా మారింది. కారును గుర్తు పోలిన విధంగా రోటీ మేకర్ గుర్తు ఉండటంతో వల్లే.. ఆ సింబల్ కు ఓట్లు పడుతున్నాని భావిస్తున్నారు. హోరాహోరీ పోరు సాగుతున్న హుజురాబాద్ లో ఇది తమకు ఇబ్బందిగా మారే పరిస్థితి ఉందని గులాబీ లీడర్లు పరేషాన్ అవుతున్నారు. మరోవైపు బీజేపీ సింబల్ కమలాన్ని పోలిన వజ్రం గుర్తుకు కూడా భారీగానే ఓట్లు వస్తున్నాయి. 

పోస్టల్ బ్యాలెట్ లో టీఆర్ఎస్ లీడ్... 

తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశ వ్యాప్తంగా హాట్ హాట్ గా మారిన కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కరీంనగర్ లోని ఎస్సాఆర్ఆర్ కాలేజీలో ఓట్లను లెక్కిస్తున్నారు. మొదటగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించారు. హుజురాబాద్ లో మొత్తం 753 ఓట్లు పోలయ్యాయి. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో అధికార టీఆర్ఎస్ పార్టీకి లీడ్ వచ్చింది. కారు పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్  యాదవ్ కు ఈటల రాజేందర్ పై  మెజార్టీ వచ్చింది. పోస్టల్ బ్యాలెట్ లో టీఆర్ఎస్ కు 503 ఓట్లు రాగా.. బీజేపీకి  159 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థికి 32 ఓట్లు రాగా.. 14 ఓట్లు చెల్లకుండా పోయాయి. పోస్టల్ బ్యాలెట్ లో కారుకు కమలంపై 344 ఓట్ల లీడ్ వచ్చింది. 

జగన్ సర్కార్ పై రేణుకాస్త్రం.. అమరావతి రణం

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరికి పరిచయం అక్కరలేదు.హైద్రబాద్ మున్సిపల్ కొర్పొరేషన్’లో  తెలుగు దేశం పార్టీ కార్పొరేటర్’గా రాజకీయ అరంగేట్రం చేసిన రేణుకా చౌదరి కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగారు. అన్నిటినీ మించి ఆమె, ఫైర్ బ్రాండ్ ఇమేజ్, జాతీయ స్థాయిలోనూ ఆమెకు ప్రత్యేక గుర్తింపును తెచ్చి పెట్టింది. ప్రధానమంత్రి నరేందర్ మోడీనే  పెద్దల సభలో ఢీ’కొన్న రేణుకా చౌదరి, ఈ మధ్య కాలంలో     వార్తల్లో అంతగా కనిపించడం లేదు. కారణాలు ఏవైనా ఆమె కొంత సైలెంట్ గా ఉంటున్నారు. రేవంత్ రెడ్డి తెలంగాణ పీసీసీ చీఫ్ అయిన తర్వాత కాంగ్రెస్ కార్యకలాపాల్లో జోష్ పెరిగినా, రేణుకా చౌదరి మాత్రం పార్టీ కార్యకలాపాలకు దూరంగానే ఉంటున్నారు.   అయితే, ఇప్పుడు పొరుగు రాష్ట్రం ఏపీలో, సుదీర్ఘ కాలంగా, సాగుతున్న రాజధాని రైతుల ఆందోళనకు, అమరావతి మహిళలు చేపట్టిన మహాపాదయాత్రకు మద్దతుగా రంగంలోకి దిగారు. ఈసంధర్భంగా ఆమె మరో మారు, తమ బ్రాండ్ ఇమేజ్’కి తగ్గట్టుగా, వైసీపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు. రైతులు దేశానికి వెన్నెముక అని.. అలాంటి వారిని వైసీపీ ప్రభుత్వం కంటతడి పెట్టిస్తోందని విమ‌ర్శించారు మహిళల చేతులకు ఉన్నవి గాజులు కావని విష్ణు చక్రాలు అని జగన్ సర్కార్‌ను హెచ్చరించారు. రాబోయే ఎన్నికల్లో ఏపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల‌ని రైతులు రోడ్డెక్కే పరిస్థితులు కల్పించిన జ‌గ‌న్’ను ఇంటికే ప‌రిమితం చేయాల‌ని పిలుపునిచ్చారు.  ఖమ్మం జిల్లాకు చెందిన రేణుకా చౌదరి, తాను సైనికుడి కూతురిని... దేశంలో ఎక్కడైనా పర్యటిస్తానని అన్నారు. మహిళలు ఓటుతో జగన్ సర్కారుకు బుద్ధి చెబుతారని రేణుక జోస్యం చెప్పారు.అదలా ఉంటే, ఇంతకాలం కొంత మౌనంగా ఉన్న రేణుక చౌదరి, ఇప్పుడు ఏపీ పాలిటిక్స్’ లో ప్రత్యక్షం కావడం విషయంలో రాజకీయ వర్గాల్లో కొంత చర్చ జరుగుతోంది. అయితే,ఖమ్మం జిల్లా, తెలంగాణలో ఉన్నా ఏపీ రాజకీయాల ప్రభావం కొంచెం ఎక్కువగానే కనిపిస్తుంది. అందుకే ఆమె వ్యూహత్మకంగానే అమరావతి మహిళల ఆందోళనకు మద్దతు తెలిపారని అంటున్నారు.

మొదట హుజురాబాద్.. చివరగా కమలాపూర్ కౌంటింగ్

తెలంగాణ రాజకీయాల్లో కాక రాజేసిన. ప్రస్తుతం ఫలితం ఉత్కంఠగా మారిన హుజురాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. మంగళవారం ఉదయం  8 గంటల నుంచి లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. కరీంనగర్లోని ఎస్సారార్ డిగ్రీ కళాశాలలో లెక్కింపు ప్రక్రియను కొనసాగించనున్నారు. స్ట్రాంగ్ రూమ్లలో భద్రంగా ఉన్న ఈవీఎంలను అభ్యర్థులు , ఏజెంట్ల సమక్షంలో విప్పబోతున్నారు. హుజురాబాద్ నియోజకవర్గంలో రికార్డ్ స్థాయిలో 86 శాతం పోలింగ్ నమోదైంది. నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2 లక్షల 36 వేల మంది కాగా.. 2 లక్షల ఐదు వేలకు పైగా ఓట్లు పోలయ్యాయి. నియోజకవర్గంలోని 306 పోలింగ్ కేంద్రాల్లోని ఈవీఎం బ్యాలెట్లను 22 రౌండ్లుగా లెక్కించబోతున్నారు. ఇందుకోసం ఇక్కడ రెండు కేంద్రాలను ఏర్పాటు చేశారు . ఏడు టేబుళ్ల చొప్పున రెండు చోట్ల కలిపి 14 టేబుళ్లను సిద్ధం చేశారు . ప్రతి రౌండ్లో ఈ 14 టేబుళ్ల వద్ద ఏకకాలంలో ఓట్ల తీర్పుని బయటకు తీయనున్నారు. ఉదయం 6 గంటలకే అభ్యర్థుల తరఫున ఏజెంట్లను లోపలికి అనుమతిస్తారు. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు . 8.30 నిమిషాల నుంచి ఈవీఎంలోని ఓట్లను లెక్కిస్తారు. బరిలో ఉన్న 30 మంది అభ్యర్థులకు వచ్చిన ఓట్లను వారికి టేబుల్ వారీగా నమోదు చేసి ఎన్నికల అధికారి అనుమతి పొందిన తరువాతనే రౌండ్ ఫలితాన్ని అధికారికంగా ప్రకటించబోతున్నారు. ఇలా ఒక్కో రౌండ్కు ఎంతలేదన్నా 30 నిమిషాల సమయం పట్టనుంది. దీంతో తుది ఫలితం వచ్చే సరికి మాత్రం సాయంత్రం కానుంది . గత ఎన్నికలకన్నా ఎక్కువగా అభ్యర్థులుండటం వల్ల లెక్కింపు ఆలస్యమవుతుందని అధికారులు చెబుతున్నారు.  మొదట హుజూరాబాద్ మండలంలోని 14 గ్రామాల ఓట్లను లెక్కిస్తారు. తరువాత వీణవంక , జమ్మికుంట , ఇల్లందకుంట , కమలాపూర్ మండలాల పోలింగ్ బూత్ల ఓట్లను లెక్కించనున్నారు. చివరగా కమలాపూర్ మండలంలోని గ్రామాలతో ప్రక్రియ ముగియనుంది.ఈ ఉప ఎన్నికలో.. అత్యధికంగా ధర్మరాజుపల్లిలో 95.11 శాతం (పోలింగ్‌ బూత్‌ 72లో) నమోదు కాగా.. ఇక్కడ 1,002 ఓటర్లకు గాను 953 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అత్యల్పంగా జమ్మికుంటలో 67.13 శాతం నమోదైంది. స్ట్రాంగ్ రూముల వద్ద సీసీ కెమెరాల పర్యవేక్షణతోపాటు ఎవరిని కూడా వీటి దరిదాపుల్లోకి రానివ్వడంలేదు. వెల్లడించే ఫలితాల ప్రక్రియలో భాగంగా ప్రతి రౌండు అవసరమైన ఈవీఎం యంత్రాల్ని వీవీప్యాట్లను లెక్కింపు ప్రాంతానికి తరలించేలా ప్రతి రౌండ్కు కొంతమంది సిబ్బంది ఉండేలా ఏర్పాట్లు చేశారు . ఇలా అధికారుల పర్యవేక్షణలో తీసుకొచ్చినవాటిని యథావిధిగా లెక్కింపు తరువాత కూడా పక్కా పర్యవేక్షణలో వాటిని భద్రపరిచేలా ఏర్పాట్లు చేశారు .  

గవర్నర్‌కు కోపమొచ్చింది.. జ‌గ‌న్ స‌ర్కారుకు మూడిన‌ట్టేనా?

ఊరందరిదీ ఒక దారి అయితే, ఉలిపి కట్టెది వేరొక దారి. రాష్ట్రంలో జరుగుతున్న పరినామాల‌ను గమనిస్తే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానిది కూడా అదే ‘అడ్డదారి’ అనుకోవలసి వస్తోంది. ఏపీ ప్రభుత్వమే కాదు, అన్ని ప్రభుత్వాలు అప్పులు చేస్తాయి, కానీ, ఏపీ ప్రభుత్వం అప్పులు మాత్రమే చేస్తుంది. అప్పుల కోసం తప్పులు చేస్తుంది. అడ్డదారులు తొక్కుతుంది. అది ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి ప్రత్యేకత. అంతే కాదు. అప్పుల కోసం ఏ తప్పు చేసేందుకు అయినా వైసీపీ ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుందనే స్థాయికి రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చింది. ఇదీ ఈ రెండున్నరేళ్ళ జగన్ రెడ్డి పాలనలో అందరికీ అర్థమైన నిజం. ఇంతవరకు ఏపీ ప్రభుత్వం చేసిన అప్పులు రోజుకు అక్షరాల రూ. 116 కోట్లు వడ్డీ కట్టే (అసలు అప్పు రూ. 6 లక్షల కోట్లు అలా ఉండగా) దౌర్భాగ్యస్థితిలో రాష్ట్రం ఉందంటే, ప్రభుత్వం అప్పుల కోసం ఎన్నెన్ని తప్పులు చేసిందో, ఎన్నెన్ని అడ్డదారులు తొక్కింది  వేరే చెప్పనక్కర లేదు. అందుకే ఏపీ అంటే అప్పుల రాష్ట్రం, అరాచక రాష్ట్రం అనే పేర్లు ట్యాగ్’ లైన్’ గా చేరిపోయాయి. అందుకే  గతంలో అంతర్జాతీయ సంస్థలు ఏపీ ప్రభుత్వం తప్పుడు విధానాలను పసికట్టి, ఒప్పందాలను వెనక్కి తీసుకున్నాయి. పెట్టుబడుల విషయంలో వెనకడుగు వేశాయి.  ఇప్పుడు, అప్పులకోసం ప్రభుత్వం ఏకంగా తమ పేరునే ఉపయోగించుకోవడం పట్ల రాష్ట్ర గవర్నర్ ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి వచ్చింది. వివరాలోకి వెళితే, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అభివృద్ధి సంస్థ వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి రూ.25 వేల కోట్ల అప్పు తెచ్చింది. ఇందుకోసం ఏకంగా రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ పేరును వాడేసుకుంది. ఇంకా స్పష్టంగా చెప్పుకోవాలంటే, జగన్ రెడ్డి ప్రభుత్వం గవర్నర్’ కున్న సార్వభౌమాదికారాలను రూ. 25 వేల కోట్లకుకు తాకట్టు పెట్టింది. ఇది ఎవరో చేసిన ఆరోపణ కాదు. రాష్ట్ర హైకోర్టు సంధించిన ప్రశ్న. అప్పు ఒప్పంద పత్రంలో గవర్నర్ పేరు ఎలా చేరుస్తారని, రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. నిజానికి కోర్టు అక్షింతలు వేసిన తర్వాతనే ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలలోకి వస్తే, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్‌ (ఎస్‌డీసీ) ద్వారా తీసుకున్న అప్పులు, జరిపిన లావాదేవీలకు సంబంధించిన ఒరిజినల్‌ డాక్యుమెంట్లన్నింటినీ తమ ముందుంచాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంతేకాదు ఈ విషయంలో కౌంటరు దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి కూడా నోటీసులు జారీ చేసింది. ఏపీఎస్‌డీసీ ద్వారా రూ.25వేల కోట్ల రుణం పొందేందుకు... బ్యాంకులతో చేసుకున్న ఒప్పందంలో వ్యక్తిగతంగా గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ పేరు ఎలా చేరుస్తారని న్యాయస్థానం ప్రశ్నించింది. ఆస్తులు తనఖా పెట్టి తీసుకున్న రుణం చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైతే గవర్నర్‌కు ఆయా బ్యాంకులు నోటీసులు జారీ చేసి, కేసులు పెట్టేందుకు వీలు కల్పించడాన్ని న్యాయస్థానం తప్పుపట్టింది. రాజ్యాంగంలోని 361 అధికరణ ప్రకారం గవర్నర్‌పై సివిల్‌, క్రిమినల్‌ కేసులు నమోదు చేయడానికి వీల్లేకుండా రక్షణ ఉందని గుర్తు చేసింది. ఒప్పందం ద్వారా గవర్నర్‌ సార్వభౌమాధికారాన్ని తొలగించడం సరికాదని తెలిపింది. ఇక‌, వ్యక్తిగతంగా తన పేరును చేర్చడంపై గవర్నర్‌ బిశ్వభూషన్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారాన్ని బ‌ట్టి తెలుస్తోంది. ఇలా ప్రభుత్వం అప్పు పత్రంలో తమ పేరును చేర్చడం పట్ల గవర్నర్ అసహనంతో ఉన్నారని, దీంతో ఆయనకు వివరణ ఇచ్చేందుకు ముఖ్యమంత్రి కార్యాలయం, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు పడరాని పాట్లు పడుతున్నారని అధికార వర్గాల్లో వినవస్తోంది. అదే సమయంలో కొందరు అధికారులు, పాలకుల పాపాలకు తాము తలవచుకోవలసి వస్తోందని వాపోతున్నారు.   నిజానికి భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్రానికి అధిపతి గవర్నర్‌.. ప్రభుత్వ కార్యకలాపాలన్నీ గవర్నర్‌ పేరు మీదనే జరుగుతాయి. అయితే గవర్నర్‌ పేరును ఎక్కడా కూడా ప్రస్తావించరు. ప్రస్తావించరాదు. ప్రభుత్వం జారీ చేసే జీవోలు ఇతర ఉత్తర్వులలో  కూడా, ‘గవర్నర్ పేరున’( 'ఇన్‌ ద నేమ్‌ ఆఫ్‌ గవర్నర్') అని మాత్రమే ఉంటుంది. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేసుకున్న రుణ ఒప్పందంలో గవర్నర్ పేరును చేర్చారు. అంతే కాదు, రేపు ప్రభుత్వం ఒప్పందం ప్రకారం అప్పు తిరిగి చెల్లించలేక పొతే,  నోటీసులు ఎవరికి ఇవ్వాలి? అన్నచోట బిశ్వభూషన్‌ హరిచందన్‌ అని గవర్నర్‌ పేరు రాశారు. దీనిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.  నిజానికి ఈ ఉచ్చులోంచి ఎలా బయట పడాలి అనే విషయంలో అధికారాలు మల్లగుల్లాలు ప‌డుతున్నారు. అంతే కాదట, వారి ఆందోళనకు ఇంకో కారణం కూడా ఉందట. తీగలాగితే ఇంకెన్నిడొంకలు కదులుతాయో, ఇంకెందరు అధికారులు బలిపశువులు అవుతారో అన్న ఆందోళన అధికారవర్గాల్లో వ్యక్తమవుతోంది. మరోవంక ఈ మధ్య కాలంలో ప్రభుత్వం జీవోలని దాచేయడంతో రాజకీయ వర్గాల్లోనూ, జగన్ రెడ్డి అప్పుల లోగుట్టు మీద అనుమానాలు వ్యక్త మవుతున్నాయి. అలాగే, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ ప్రతిష్టను దిగజార్చడంతో పాటుగా, రాష్ట్ర హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కౌంటర్ దాఖలు చేయలని కోరింది. ఈ నేపధ్యంలో జగన్ రెడ్డి ప్రభుత్వం తేలుకుట్టిన దొంగలా.. తప్పులను కప్పిపెట్టేందుకు కేంద్రంతో కాళ్ళబేరానికి వచ్చినట్లు సమాచారం.

రివ‌ర్స్ పాల‌న‌కు గండి.. రేవంత్ జ‌నజాగ‌ర‌ణ.. ప‌వ‌న్ గాడిద‌ప‌ళ్లు తోమాడా? టాప్‌న్యూస్ @7pm

1. స్థానిక సంస్థ‌ల ఎన్నికల్లో ఓటర్లు ఏకమై వైసీపీని ఓడిస్తేనే రివర్స్ పాలనకు గండి పడుతుందని టీడీపీ అధినేత చంద్ర‌బాబు పిలుపిచ్చారు. వైసీపీని ఓడిస్తేనే ప్రజల ధన-మాన-ప్రాణాలకు రక్షణ ఉంటుందన్నారు. జగన్ రెండున్నరేళ్ల పాలనలో ప్రజల్ని, రైతుల్ని సంక్షోభంలోకి నెట్టారు. రాజధాని ఏదో చెప్పుకోలేని దుస్థితి కల్పించారు. గంజాయిపై ప్రశ్నించినవారిపై కేసులు, దాడులు చేస్తున్నారు. డ్రగ్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్‌ లక్ష్యంగా టీడీపీ పోరాటం చేస్తుందని చంద్రబాబు చెప్పారు.  2. ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యింది. ఈ నెల 15న జరిగే ఎన్నికలకు 3వతేదీ నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. 17న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఏపీలో మిగిలిపోయిన పంచాయతీలు, పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, వార్డు మెంబర్ల స్థానాలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్  సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. దాదాపు అన్ని జిల్లాల్లో ఈ ఎన్నికలు ఉన్నాయి.  3. ఈ నెల 14 నుంచి 21 వరకు ఏడు రోజులు గ్రామాల్లో జన జాగరణ యాత్రలు నిర్వహించనున్నట్లు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ప్ర‌క‌టించారు. డిసెంబర్ 9న సికింద్రాబాద్‌ పరేడ్ గ్రౌండ్‌లో రాహుల్ గాంధీతో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఇక‌, కాంగ్రెస్ సభ్యత్వం తీసుకున్న సభ్యుల రక్షణ కోసం 2 లక్షల ఇన్సూరెన్స్ సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు తెలిపారు. చిల్లర రాజకీయ పార్టీలు కాంగ్రెస్‌కు పోటీనే కాదంటూ ప‌రోక్షంగా ష‌ర్మిల పార్టీని విమ‌ర్శించారు. ఇతర పార్టీల నాయకత్వంలో సగం బ్రోకర్లు, సగం లోఫర్లు ఉన్నారని వ్యాఖ్యానించారు.  4. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌కు అమ్ముడుపోయారని, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే టీఆర్ఎస్‌కు వేసినట్టేనని వైఎస్‌ఆర్‌టీసీ అధినేత్రి షర్మిల అన్నారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతీ ఒక్కరికీ పెన్షన్‌ ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా సీఎం కేసీఆర్‌లో చలనం లేదని మండిప‌డ్డారు. రాజన్న బిడ్డగా తెలంగాణ ప్రజలకు సేవ చేయడం తన హక్కు కాదా? అని షర్మిల ప్రశ్నించారు. 5. స్టీల్‌ప్లాంట్ విషయంలో పవన్‌కల్యాణ్‌ ఇన్నాళ్లూ గుడ్డిగాడిద పళ్ళు తోమాడా? అని మంత్రి అప్పలరాజు విమర్శించారు. ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకున్న బీజేపీని ఎందుకు ఒక్క మాట అనరని ఆయన ప్రశ్నించారు. ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకున్న బీజేపీకి బద్వేల్, తిరుపతి ఎన్నికల్లో పవన్‌ ఎలా మద్దతు ఇచ్చారని అన్నారు. పవన్ విమర్శలు ఆయన రాజకీయ అజ్ఞానానికి నిదర్శనమన్నారు మంత్రి అప్ప‌ల‌రాజు. 6. రాజధాని రైతుల పాదయాత్ర మొదటిరోజు ముగిసింది. తాడికొండ సాయిబాబా గుడి దగ్గర తొలిరోజు పాదయాత్రకు విరామిచ్చారు. తొలిరోజు 14.5 కిలోమీటర్లు మహా పాదయాత్ర కొనసాగింది. అమరావతి పోరులో భాగంగా న్యాయస్థానం టు దేవస్థానం వరకు జరిగే అమరావతి రైతుల మహా పాదయాత్ర సోమవారం నుంచి ప్రారంభించారు. వైసీపీ మిన‌హా మిగ‌తా రాజ‌కీయ పార్టీలు, ప్ర‌జాసంఘాలు రాజధాని రైతుల మహా పాదయాత్రకు మద్దతు తెలిపాయి. 7. రైతులు చేపట్టిన మహా పాదయాత్రకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంఘీభావం తెలిపారు. ఇది పాదయాత్ర కాదని.. రాష్ట్ర పరిరక్షణ కోసం చేస్తున్న యాత్ర అన్నారు. రాష్ట్ర భవిష్యత్ కోసం భూములను త్యాగం చేసిన పుడమి తల్లి వారసులు చేస్తున్న ఉద్యమమని తెలిపారు. మహా పాదయాత్ర ద్వారానైనా పాలకులకు కనువిప్పు కలగాలని అన్నారు. ప్రతీకారాలు, కూల్చివేతలపై ఉన్న శ్రద్ధ రాష్ట్రాభివృద్ధిపై లేదని విమర్శించారు చంద్ర‌బాబు.  8. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ విత్తన భాండాగారంగా ఐక్యరాజ్య సమితి– అంతర్జాతీయ ఆహార సంస్థ గుర్తించినట్టు వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. వ్యవసాయ, విత్తన రంగ అభివృద్ధ్యే లక్ష్యంగా  నవంబర్ 4, 5 తేదీలలో ఇటలీలోని రోమ్ నగరంలో విత్తన పరిశ్రమల సమగ్ర అభివృద్దిపై నిర్వహించే “అంతర్జాతీయ విత్తన సదస్సు” కు తెలంగాణ రాష్ట్రానికి ఆహ్వానం అందినట్టు మంత్రి ఒక ప్రకటన విడుద‌ల చేశారు.  9. సర్దార్ వల్లబాయ్ పటేల్‌కు బీజేపీకి సంబంధం ఏంటి? అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ప్రశ్నించారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చరిత్రను వక్రీకరిస్తున్నారని తప్పుబట్టారు. వల్లబాయ్ పటేల్‌తోనే తెలంగాణ విమోచనం అయిందన్న కిషన్‌రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తున్నానని చెప్పారు. కమ్యూనిస్టుల సాయుధ పోరాటం వలనే నిజాం‌ తలొగ్గాడని, గోబెల్స్ ప్రచారాన్ని ఆపి.. బీజేపీ నేతలు ప్రజలకు క్షమాపణ చెప్పాలని చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. 10. విశాఖలో నార్కోటిక్ ట్రాఫికింగ్‌పై ఇంటర్ స్టేట్ కో-ఆర్డినేషన్ సమావేశం జ‌రిగింది. ఈ మీటింగ్‌కి ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్, తెలంగాణ, ఒడిశా ఛత్తీస్‌గఢ్‌, కర్ణాటకకు చెందిన పలు రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు. డీఆర్ఐ, ఎక్సైజ్, నార్కోటిక్, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణ, గంజాయి సాగు, నివారణ, ఇతర అంశాలపై చర్చించారు.    

వైసీపీ గుర్తింపు రద్దు!.. యాక్ష‌న్‌లోకి ఈసీ!..

మాట్లాడితే కేసులు.. ప్ర‌శ్నిస్తే దాడులు.. ఏపీలో అరాచ‌కం రాజ్య‌మేలుతోంద‌ని ప్ర‌తిప‌క్షం విమ‌ర్శ‌లు. ప‌ట్టాభి వ్యాఖ్య‌ల‌తో బీపీ తెచ్చుకొని.. వైసీపీ రౌడీ మూక‌లు టీడీపీ కార్యాల‌యాల‌పై దాడి చేసి విధ్వంసం సృష్టించారు. దేవాల‌యంలాంటి ఎన్టీఆర్ భ‌వ‌న్‌పై మూక దాడులు జ‌ర‌గ‌డాన్ని టీడీపీ సీరియ‌స్‌గా తీసుకుంది. ఆ పార్టీ అధినేత చంద్ర‌బాబు ఆ విధ్వంస ఆన‌వాళ్ల సాక్షిగా.. 36 గంట‌ల దీక్ష చేశారు. ఢిల్లీ వెళ్లి రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్‌కోవింద్‌కు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో రాష్ట్ర‌ప‌తిపాల‌న విధించాల‌ని కోరారు. అటు, టీడీపీ ఎంపీల బృందం సైతం త‌మ వంతుగా ఢిల్లీలో ప‌లు రాజ్యాంగబ‌ద్ధ సంస్థ‌ల దృష్టికి విష‌యాన్ని తీసుకెళుతున్నాయి. ఇప్ప‌టికే ఘ‌ట‌న‌పై సీబీఐ విచార‌ణ జ‌రిపించాల‌ని టీడీపీ గ‌ట్టిగా డిమాండ్ చేస్తోంది. మ‌రోవైపు, అరాచ‌కాల‌కు కేరాఫ్‌గా మారిన వైసీపీ గుర్తింపును ర‌ద్దు చేయాల‌ని నేరుగా కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న్‌కు ఫిర్యాదు చేసింది టీడీపీ.  తాజాగా, కేంద్ర ఎన్నికల సంఘాన్ని టీడీపీ నేతలు కలిశారు. ఢిల్లీకి వెళ్లిన పలువురు ఎంపీలు ఈసీ అధికారుల్ని కలిసి.. వైసీపీ గుర్తింపును రద్దు చేయాలని కోరారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలపై చేస్తున్న దాడులు, మంత్రులు చేస్తున్న దుర్భాష‌ల‌ను ఎల‌క్ష‌న్ క‌మిష‌న్‌ దృష్టికి తీసుకెళ్లారు.  గంజాయి సహా రాష్ట్రంలోని సమస్యలను ప్రస్తావిస్తే తమపై దాడులు చేస్తున్నారని, తగిన చర్యలు తీసుకోవాలని టీడీపీ ఎంపీల బృందం ఈసీకి విజ్ఞ‌ప్తి చేసింది. ఘ‌ట‌న‌పై విచారించి త‌గు చర్యలు తీసుకుంటామని ఈసీ తమకు హామీ ఇచ్చినట్టు టీడీపీ నేతలు తెలిపారు. 

రూ.2000 దాటిన గ్యాస్ సిలిండర్ ధర.. బాదుడే బాదుడు..

తెల్లారితే చాలు. రోజూ సేమ్ న్యూస్‌. ఈ రోజు మ‌ళ్లీ పెరిగిన గ్యాస్ ధ‌ర‌. మ‌రోసారి పెట్రోల్ మంట‌. కొన్ని వారాలుగా ఇదే తంతు. ఏ రోజుకు ఆ రోజు ఫ్రెష్‌గా పెంచేస్తున్నారు ధ‌ర‌లు. ఓవైపు సైలెంట్‌గా గ్యాస్ సిలిండ‌ర్ స‌బ్సిడీని ఎత్తేస్తూ.. మ‌రోవైపు రోజుకింత చొప్పున రేట్లు పెంచేస్తూ.. సామాన్యుల నుంచి కాసులు పిండుకుంటోంది కేంద్ర స‌ర్కారు. ఇటు, గృహ వినియోగ గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర రూ.వెయ్యి వైపు ప‌రుగులు పెడుతుంటే.. అటు క‌మ‌ర్షియ‌ల్ సిలిండర్ రేట్ ఏకంగా రూ.2వేలు దాటేసింది. వాణిజ్య సిలిండర్‌పై రూ. 266 పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి దేశీయ చమురు సంస్థలు. దీంతో దేశ రాజధాని దిల్లీలో 19 కేజీల వాణిజ్య సిలిండర్‌ ధర రూ.2000 దాటేసింది.   తాజా పెంపుతో వాణిజ్య సిలిండర్ ధర.. ఢిల్లీలో రూ.2000.5, ముంబయిలో రూ.1950, కోల్‌కతాలో రూ.2073.50, చెన్నైలో రూ.2133గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలకు అనుగుణంగా ప్రతి నెలా ఒకటి, 15వ తేదీన గ్యాస్‌ సిలిండర్‌ ధరలను చమురు సంస్థలు సవరిస్తుంటాయి. గ‌త కొంత‌కాలంగా డొమెస్టిక్ సిలిండ‌ర్ల‌పై వాయింపు జ‌ర‌గ్గా.. లేటెస్ట్‌గా క‌మ‌ర్షియ‌ల్ సిలిండ‌ర్ల ధ‌ర‌ల మోత మోగించాయి చ‌మురు కంపెనీలు.   ఈ విష‌యం తెలిసి.. హ‌మ్మ‌య్యా వంట‌గ్యాస్ ధ‌ర‌లు పెర‌గ‌లేద‌ని సంబ‌ర‌ప‌డ‌టానికి లేదంటున్నారు. త్వ‌ర‌లోనే వంట‌గ్యాస్ మ‌రింత మంట పుట్టించ‌డం ఖాయ‌మని తెలుస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పెరిగిన దృష్ట్యా.. వంట‌గ్యాస్‌ సిలిండర్‌పై రూ.100 మేర నష్టం వస్తోందని, దాన్ని భర్తీ చేసుకోవడానికి రేటు పెంచక తప్పదని చమురు కంపెనీలు అంటున్నాయి. ఇప్పటికే ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకూ వంట గ్యాస్‌ ధర రూ.205 పెరిగి సిలిండర్‌ ధర రూ.1000కి చేరువైంది. గత నెల ఒకటో తేదీన కూడా వాణిజ్య సిలిండర్ ధరను పెంచి, ఆరో తేదీన డొమెస్టిక్‌ సిలిండర్ రేటు పెంచేశారు. అలానే ఈసారి కూడా మ‌రో వారంలో మ‌ళ్లీ వంట‌గ్యాస్‌పై వ‌డ్డింపు త‌ప్ప‌ద‌ని చెబుతున్నారు. వ‌రుస‌గా పెరుగుతున్న గ్యాస్ ధ‌ర‌ల‌పై సామాన్యులు మండిప‌డుతున్నారు. అచ్చే దిన్ అంటే ఇవేనా అని ప్ర‌శ్నిస్తున్నారు. ఇటు పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు.. అటు గ్యాస్ రేట్లు.. అన్నీ క‌లిసి పేద‌లు, మిడిల్‌క్లాస్ న‌డ్డి విరిచేస్తున్నాయ‌ని మోదీ స‌ర్కారుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. 

జ‌గ‌న్‌కు ఝ‌ల‌క్ ఇచ్చేందుకు ఇదే మంచి ఛాన్స్‌.. చంద్ర‌బాబు అల‌ర్ట్‌..

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయింది. సీఎం జ‌గ‌న్ అరాచ‌క పాల‌న‌కు త‌గిన గుణ‌పాఠం చెప్పేందుకు ఇదే మంచి అవ‌కాశ‌మ‌ని టీడీపీ భావిస్తోంది. అందుకే, స్థానిక సంగ్రామంలో శాయ‌శ‌క్తులా పోరాడాల‌ని పార్టీ అధినేత చంద్ర‌బాబు పిలుపిచ్చారు. ఓటర్లంతా ఏకమై వైసీపీని ఓడిస్తేనే రివర్స్ పాలనకు గండి పడుతుందని అన్నారు. వైసీపీని ఓడిస్తేనే.. ప్రజల ధన-మాన-ప్రాణాలకు రక్షణ ఉంటుందన్నారు చంద్ర‌బాబు.  ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని ఏదో చెప్పుకోలేని దుస్థితి కల్పించారని చంద్ర‌బాబు మండిపడ్డారు. జగన్ రెండున్నరేళ్ల పాలనలో ప్రజల్ని, రైతుల్ని సంక్షోభంలోకి నెట్టారని విమర్శించారు. ధాన్యం కొనుగోళ్లలో అధికారుల నిర్లక్ష్యంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. రూ.4 వేల కోట్ల బియ్యం కుంభకోణంపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అప్పుల కోసం గవర్నర్ సార్వభౌమాధికారాలనూ తాకట్టుపెట్టారని విమర్శించారు. పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్, సెస్ తగ్గించే వరకు పోరాటం చేస్తామన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే.. యథావిధిగా ఎయిడెడ్ స్కూళ్ల వ్యవస్థ ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు. డ్రగ్స్, గంజాయి విషయంలో ప్రభుత్వ డొల్లతనం బయటపడిందన్నారు. గంజాయిపై ప్రశ్నించిన వారిపై కేసులు, దాడులు చేస్తున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. డ్రగ్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్‌ లక్ష్యంగా టీడీపీ పోరాడుతుందని చెప్పారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ విషయంలో వైసీపీ ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. జగన్‌రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు.   

టీమిండియా ఓట‌మికి మెయిన్‌ రీజ‌న్స్‌.. ఎందుకు ఫ‌స‌క్ అయ్యారంటే...

ఐపీఎల్‌లో దుమ్ము రేపారు. పోటాపోటీగా దూకుడు ప్ర‌ద‌ర్శించారు. అటు బ్యాట్స్‌మెన్‌, ఇటు బౌల‌ర్స్‌.. అంతా చెల‌రేగిపోయారు. కోట్ల‌కు కోట్లు సంపాదించుకున్నారు. క‌ట్ చేస్తే.. ఐసీసీ టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌. అంతా ఐపీఎల్‌లో రాణించిన వారే. అంతా మెరిక‌ల్లాంటి ఆట‌గాళ్లే. 11మంది ఆణిముత్యాల‌ను ఏర్చి-కూర్చి ప్ర‌పంచ క‌ప్‌కు పంపిస్తే.. వ‌రుస మ్యాచుల్లో ఫ‌స‌క్ అనిపించారు. చిర‌కాల ప్ర‌త్య‌ర్థి పాకిస్తాన్‌పై చిత్తు చిత్తుగా ఓడిపోయిన దారుణ అనుభ‌వం మ‌ర్చిపోక‌ముందే.. న్యూజిలాండ్ చేతిలోనూ ఓట‌మి చ‌వి చూశారు. సెమీస్ ఛాన్సెస్ దాదాపు గ‌ల్లంతు చేసుకున్నారు. అస‌లేం జ‌రిగింది? ఎందుకింత చెత్త‌గా ఓడిపోయారు? ఐపీఎల్ స్టార్స్‌.. ఐసీసీ కొచ్చే స‌రికి ఎందుకిలా హ్యాండ్స‌ప్ అనేశారు. టీమిండియా ఓట‌మికి మెయిన్ రీజ‌న్స్ ఏంటి? క్రికెట్ ఫ్యాన్స్‌లో ఇప్పుడిదే చ‌ర్చ‌..ర‌చ్చ‌. అల‌స‌ట‌. అలుపెర‌గ‌ని ఆట‌. ఇదే ఇండియా ఓట‌మికి ప్ర‌ధాన కార‌ణం అంటున్నారంతా. ఎంతైనా మ‌నోళ్లు అంత వేస్ట్ ప్లేయ‌ర్స్ కాద‌నే విష‌యం మ‌న‌కే కాదు యావ‌త్ ప్ర‌పంచానికి తెలుసు. అయినా.. అంత‌మంది పోటుగాళ్లున్న టీమ్‌.. ఇలా ఫ‌స‌క్ ఫ‌స‌క్ అన‌డాన్ని ఫ్యాన్స్ త‌ట్టుకోలేక‌పోతున్నారు. ఐపీఎల్ వ‌ల్లే ఐసీసీ మ్యాచ్‌ల‌పై ఎఫెక్ట్ ప‌డింద‌ని అంటున్నారు. బీసీసీఐ కాసుల క‌క్కుర్తితో ఆట‌గాళ్ల‌ను విశ్రాంతి లేకుండా ఆడిస్తోంద‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి. గత కొన్నేళ్లుగా ఇలానే జరుగుతోంది. ఇక‌, బయోబబుల్ సిస్ట‌మ్‌తోనూ ప్లేయ‌ర్స్‌పై ఒక‌ర‌క‌మైన మాన‌సిక ప్ర‌భావం ప‌డింద‌ని అనేవారూ ఉన్నారు. మ‌రి, ఆ ఎఫెక్ట్ ఐపీఎల్‌లోనూ ఉంటుందిగా అంటూ మ‌రికొంద‌రు కౌంట‌ర్ ఇస్తున్నారు. ఏది ఏమైనా.. కంటిన్యూయ‌స్‌గా, రెస్ట్ లేకుండా క్రికెట్ ఆడ‌ట‌మే.. ప్ర‌స్తుత ఓట‌మిల‌కు కార‌ణ‌మ‌నేది మెజార్టీ అభిప్రాయం.  బ్యాటింగ్‌..బౌలింగ్‌.. రెండింటిలోనూ టీమిండియా ఘోరంగా విఫ‌ల‌మైంది. మ్యాచ్ త‌ర్వాత కెప్టెన్ కోహ్లీ మాట‌లే అందుకు నిద‌ర్శ‌నం. ‘‘ఆశ్చర్యంగా ఉంది. బ్యాట్‌తో కానీ.. బంతితో కానీ తెగించి ఆడలేకపోయాం. నిజానికి రక్షించుకునేంత స్కోరు చేయలేదు కానీ.. కనీసం పోరాడలేకపోయాం. భారత జట్టుకు ఆడుతుంటే భారీ అంచనాలుంటాయి. అంతేకాదు తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. జట్టుగా ఆడి దీన్ని అధిగమించాలి. కానీ గత రెండు మ్యాచ్‌ల్లో ఆ పని చేయలేకపోయాం. ఈ టోర్నీలో ఇంకా మ్యాచ్‌లు మిగిలున్నాయి. వాటిలోనైనా మెరుగ్గా ఆడాలని కోరుకుంటున్నాం’’ అని కోహ్లీ విశ్లేషించారు. కెప్టెన్ మాట‌ల ప్ర‌కారం.. టీమిండియాలో టీమ్ స్పిరిట్ క‌రువైంద‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఓట‌మికి ఇది మ‌రో మెయిన్ రీజ‌న్‌.  టీ20 ప్రపంచకప్‌ ముందు భారత జట్టులోని ఆటగాళ్లంతా దుబాయ్‌లోనే ఐపీఎల్‌ ఆడారు. బ్యాట్స్‌మెన్ ట‌న్నుల‌కు ట‌న్నుల ప‌రుగులు చేశారు. విరాట్‌ కోహ్లీ (405), రోహిత్‌ శర్మ (381), కేఎల్‌ రాహుల్‌ (626), సూర్య కుమార్‌ యాదవ్‌ (317), రిషబ్‌ పంత్‌ (419), ఇషాన్‌ కిషన్‌ (241), రవీంద్ర జడేజా (227) పరుగుల వరద పారించారు. మ‌రి, వీళ్లంతా ఇప్పుడు ఒకే జ‌ట్టు త‌ర‌ఫున ఆడుతుంటే.. ఎందుకిలా విఫ‌ల‌మ‌వుతున్నార‌నేది ప్ర‌శ్న‌. ఓపెనింగ్‌ జోడీ కుదురుకోకపోవడంతో మిడిలార్డర్‌ మీద ఒత్తిడి పడుతోంది. వ‌రుస‌గా వికెట్లు ప‌డ‌తుండ‌టంతో సైకిల్ స్టాండ్‌గా మారింది.  బ్యాంటిగే కాదు బౌలింగ్‌లోనూ తేలిపోయారు. ఒక్క వికెట్ అయినా తీయ‌లేక బౌల‌ర్లు ఎలా హ్యాండ్స‌ప్ అన్నారో చూశాం. ష‌మీ, భువ‌నేశ్వ‌ర్‌, బుమ్రా, శార్దూల్ ఠాకూర్‌, ర‌వీంద్ర జ‌డేజా, వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి.. ఇలా పేరు గొప్ప ప్ర‌ద‌ర్శ‌న సున్నా.. బౌల‌ర్లుగా మారారు మ‌నోళ్లు.  ఇక‌, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇటు బ్యాటింగ్‌లోనూ అటు కెప్టెన్సీలోనూ విఫ‌ల‌మ‌వ‌డం ఓట‌మికి మ‌రో ప్ర‌ధాన కార‌ణం అంటున్నారు. కోహ్లీలో మునుప‌టి ఆట అట‌కెక్కేసింద‌ని చెబుతున్నారు. ప్రపంచకప్‌ తర్వాత కెప్టెన్సీ వదులుకుంటాన‌ని కోహ్లీ ఇప్ప‌టికే ప్రకటించ‌గా.. ఆ ప్ర‌భావం అత‌ని ఆట మీద ప‌డిందా? అనే అనుమాన‌మూ వ్య‌క్త‌మ‌వుతోంది. లాస్ట్ సిరీస్‌ను ఛాలెంజింగ్‌గా కాకుండా.. లైట్ తీసుకున్నారా? అని నిల‌దీస్తున్నారు ఫ్యాన్స్‌. ఇలా ప‌లు కార‌ణాల‌తో ఐసీసీ వాల్డ్ క‌ప్‌లో టీమిండియా చెత్త ప్ర‌ద‌ర్శ‌ణ‌తో ఫ్యాన్స్‌ను ఫుల్ డిస‌ప్పాయింట్ చేసింది. సెమీస్‌కి ఛాన్సెస్ క‌రువ‌వ‌డంతో మ‌న‌కు ప్ర‌పంచ‌ క‌ప్ ఫ‌స‌క్‌. 

ఆ రెండూ లేని రాష్ట్రం అంధ‌కార‌మ‌యం.. మ‌హా పాద‌యాత్ర‌కు చంద్ర‌బాబు సంఘీభావం

అమరావతి ఉద్యమం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు టీడీపీ అధినేత చంద్ర‌బాబు. మహా పాదయాత్ర ద్వారానైనా పాలకులకు కనువిప్పు కలగాలని ఆకాంక్షించారు. వైసీపీ ప్ర‌భుత్వానికి ప్రతీకారాలు, కూల్చివేతలపై ఉన్న శ్రద్ధ.. రాష్ట్రాభివృద్ధిపై లేదని విమర్శించారు. మూడు రాజధానుల పేరుతో రివర్స్ పాలనకు తెరలేపారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.  న్యాయ‌స్థానం నుంచి దేవ‌స్థానం పేరుతో తుళ్లూరు నుంచి తిరుమ‌ల‌కు అమ‌రావ‌తి రైతులు చేపట్టిన మహాపాదయాత్రకు టీడీపీ అధినేత చంద్రబాబు సంఘీభావం తెలిపారు. ఇది పాదయాత్ర కాదని.. రాష్ట్ర పరిరక్షణ కోసం చేస్తున్న యాత్ర అని అన్నారు. రాష్ట్ర భవిష్యత్ కోసం కన్నతల్లిలాంటి భూములను త్యాగం చేసిన పుడమి తల్లి వారసులు చేస్తున్న ఉద్యమమని తెలిపారు. అవమానాలు ఎదురైనా ఆశయ సాధన కోసం పోరాడుతూనే ఉన్నారన్నారు. ఐదుకోట్ల ప్రజల ఆత్మగౌరవానికి ‘అమరావతి’ ప్రతీక అన్నారు.  అమరావతి ఉద్యమంపై పాలకపక్షం ఎన్ని అసత్య ప్రచారాలు, అవహేళనలు, అవమానాలకు గురిచేసినా అనుకున్న ఆశయ సాధన కోసం చేస్తున్న ఈ ఉద్యమం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. విభజన జరిగినప్పుడు రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మిగిలిందన్నారు. అమరావతి నిర్మాణంతో స్వర్ణాంధ్రప్రదేశ్‌గా మారుతున్న తరుణంలో మూడు రాజధానుల పేరుతో రివర్స్‌ పాలనకు వైసీపీ పాల‌కులు తెరలేపారని తెలిపారు. అమరావతి, పోలవరం లేని రాష్ట్రాన్ని ఊహించలేమని.. అమరావతిని కాపాడుకోకపోతే రాష్ట్రం అంధకారమవుతుందని చంద్ర‌బాబు చెప్పారు. పాదయాత్రకు ప్రజలు, వివిధ సంఘాలు, టీడీపీ నేతలు, కార్యకర్తలు, రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించే ప్రతి ఒక్కరూ మద్దతు తెలపాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.  

అమ‌రావ‌తి రైతుల‌ పాద‌యాత్ర‌కు చెక్‌?.. అందుకేనా స్థానిక ఎన్నికల షెడ్యూల్?

అమ‌రావ‌తినే ఏపీకి ఏకైక రాజ‌ధానిగా కొన‌సాగించాలంటూ రైతులు, మ‌హిళ‌లు, ప్ర‌జాసంఘాలు మ‌హా పాద‌యాత్ర చేస్తున్నారు. న్యాయ‌స్థానం నుంచి దేవ‌స్థానం పేరుతో తుళ్లూరు నుంచి తిరుమ‌ల‌కు పాద‌యాత్ర‌గా క‌దులుతున్నారు. వైసీపీ మిన‌హా అన్ని పార్టీలు, సంఘాలు రైతుల పాద‌యాత్ర‌కు మ‌ద్దతు ప‌లికాయి. 45 రోజుల పాటు ప‌లు జిల్లాల మీదుగా సాగే పాద‌యాత్ర‌తో అమ‌రావ‌తి నినాదం మారుమోగనుంది. ఆ సౌండ్‌కు జ‌గ‌న్ స‌ర్కారు షేక్ అవుతుంద‌ని భావిస్తున్నారు. అందుకే, మొద‌ట్లో పాద‌యాత్ర‌కు ప్ర‌భుత్వం ప‌ర్మిష‌న్ ఇవ్వ‌లేదని అన్నారు. హైకోర్టు జోక్యం చేసుకుంటే కానీ అనుమ‌తి రాలేదు. అందులోనూ కొర్రీలు పెట్టారంటూ విమ‌ర్శ‌లు ఉన్నాయి. అందుకు త‌గ్గ‌ట్టే ప‌రిణామాలు వేగంగా మారుతున్నాయి.  ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యింది. ఈ నెల 15న జరిగే ఎన్నికలకు 3వతేదీ నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. 17న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఏపీలో ఎన్నిక‌లు జ‌ర‌గాల్సి ఉన్న పంచాయతీలు, పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, వార్డు మెంబర్ల స్థానాలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. దాదాపు అన్ని జిల్లాల్లో ఈ ఎన్నికలు జ‌ర‌గ‌నున్నాయి.  అయితే, అమరావతి రైతుల మహా పాదయాత్ర ప్రారంభమైన గంటల వ్య‌వ‌ధిలోనే ఈ నోటిఫికేషన్ విడుదల కావ‌డం అనుమానాల‌కు కార‌ణ‌మ‌వుతోందని అంటున్నారు. పాద‌యాత్ర‌కు డీజీపీ ఇచ్చిన పర్మిషన్‌లో.. ఎన్నికల కమిషన్ విధించే ప్రవర్తనా నియమావళికి కట్టుబడి ఉండాలని షరతు విధించారు. ఈ నేపథ్యంలో మ‌హా పాద‌యాత్ర మొద‌ల‌వ‌గానే.. స్థానిక సంస్థ‌ల‌ ఎన్నికల నోటిఫికేషన్ రావడం చర్చనీయాంశంగా మారింది.  

పిచ్చోడి చేతిలో రాయిలా పీకే వ్యూహాలు!.. త‌ల ప‌గిలేది ఎవ‌రికో?

దేశంలో ఉభయ తెలుగు రాష్ట్రాలు సహా, పదికి పైగా రాష్ట్రల్లో బీజేపీ ప్రత్యర్ధి పార్టీలు అధికారంలో ఉన్నాయి. అందులో మూడు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కూడా ఉన్నాయి. అయినా, కేంద్ర ప్రభుత్వాన్నిముఖ్యంగా ప్రధాని మోడీ, హోమ్ మంత్రి అమిత్ షా జోడీని ఢీ అంటే ఢీ అని ఢీకొనే ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా అంటే , పశ్చిమ బెంగాల్ ముఖ్యమత్రి మమతా బెనర్జీ ఒక్కరే, కనిపిస్తారు. మమతా బెనర్జీ గురించి ఇంకే విషయంలో అయినా ఎవరికైనా అభ్యంతరం లేదా భిన్నాభిప్రాయం ఉంటే ఉండవచ్చును కానీ, మోడీ, షా జోడీని ఎదిరించే దమ్మున్న‌ ముఖ్యమంత్రి దీదీ ఒక్కరే అనే  విషయంలో మాత్రం ఎఎరికీ భిన్నాబిప్రాయం ఉండదు. నిజానికి ఆమె రాజకీయ జీవితం అంతా అలాగే సాగుతూ వచ్చింది అనుకోండి అది వేరే విషయం.  అదలా ఉంటే, వరసగా మూడవసారి బెంగాల్ ముఖ్యమంత్రి పదవిని అందుకున్నమమతా దీదీ దృష్టి ఇప్పుడు జాతీయ రాజకీయాల వైపు మరలింది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ విస్తరణ కార్యక్రమంలో భాగంగా ఇటీవల గోవాలో పర్యటించిన ఆమె తమ మనసులో కోరికను నేరుగా బయట పెట్టేందుకు, కొద్దిగా చాలా సిగ్గును అభినయించినా, ప్రధాని పదవిపై ఆమె మనసు పారేసుకున్నారు, అనేది మాత్రం నిజం.అది ఇప్పటికే దేశం అంతటికీ తెలిసిన బహిరంగ రహస్యం.   కాగా, గోవాలో పర్యటనలో మీడియా ముందుకొచ్చిన మమత 2024 ప్రధాని రేసులో ఉన్నారా అని అడిగితే, “అన్నీ ఇప్పుడే చెప్పెస్తే ఎలా ... రేపు చెప్పుకునేందుకు ఏముంటుంది?” అంటూ చిరు నవ్వుతో సమాధానాన్ని దాట వేశారు. నిజానికి దీదీ ప్రధాని ప్రధాని రేసులో ఉన్నారనే వార్త ఇప్పుడు కాదు  చాలా కాలంగా జాతీయ రాజకీయాల్లో చక్కర్లు కొడుతోంది. అయితే, ఇంతవరకు తృణమూల్ కాంగ్రెస్ కానీ, మమతా దీదీ కానీ, చివరకు ఆమెను పీఎం చేసే ‘కాంట్రాక్టు’ పుచ్చుకున్న ‘కిరాయి’ వ్యుహకర్త ప్రశాంత్ కిశోర్ కానీ, ఎక్కడా ఆవిషయం  చెప్పలేదు.కానీ, 2024 ఎన్నికల్లో ప్రధాని పదవికి దీదీ పోటీలో ఉంటారనే  ఊహాగానాలు మాత్రం షికారు చేస్తున్నాయి.  అయితే, జాతీయ రాజకీయాల్లోకి వచ్చే సరికి, తృణమూల్ కాంగ్రెస్’ పేరుకు జాతీయ పార్టీ అయినా, ఆ పార్టీ ప్రభావం, ఈరోజు వరకు అయితే చాలా వరకు  బెంగాల్ వరకే పరిమితం. లోక్ సభ మొత్తం స్థానాల సంఖ్య 543 అందులో తృణమూల్ గట్టిగా పోటీ ఇవ్వగల స్థానాలు, బెంగాల్’లోని 42 స్థానాలు మాత్రమే. అక్కడ కూడా తృణమూల్, బీజేపీ నుంచి గట్టి పోటీ ఎదుర్కుంటోంది. 2019 లోక్ సభ ఎన్నికల్లో తృణమూల్ 22 స్థానాలు గెలుచుకుంటే బీజేపీ 18 స్థానాలు గెలుచుకుంది. మిగిలిన రెండు స్థానాలు కాంగ్రెస్ గెలుచుకుంది.  ఒరిస్సా, అస్సాం, జార్ఖండ్, బిహార్, అండమాన్’ లలో కూడా తృణమూల్ 2019 లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసినా ఎక్కడా ఒక్క సీటులో  కూడా దీదీ గెలవలేదు. జాతీయ స్థాయిలో  తృణమూల్’కు వచ్చింది 22 సీట్లు (అన్నీ బెంగాల్ నుంచే), అలాగే, జాతీయ స్థాయిలో ఆ పార్టీ వచ్చిన ఓట్లు కేవలం నాలుగు శాతం మాత్రమే. అదే కాంగ్రెస్ విషయాన్ని తీసుకుంటే, కేవలం 52 సీట్లు మాత్రమే వచ్చిన 2019 ఎన్నికల్లోనూ దేశం మొత్తంలో కాంగ్రెస్ పార్టీకి ఇంచుమించుగా 20 (19.49) శాతం వరకు ఓట్లు పోలయ్యాయి.(మూడు వందలకు పైగా సీట్లు దక్కించుకున్న బీజేపీకి వచ్చింది, 32శాతం ఓట్లు మాత్రమే) అయితే, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ వరసగా మూడవ సారి విజయం సాధించడం, అధికారానికి నిచ్చెనలు వేసిన బీజేపీ, ముఖ్యంగా ఈ ఎన్నికలను సవాలుగా తీసుకున్న మోడీ, షా జోడీ చతికిల పడడంతో మమతా దీదీ, నేషనల్ ఇమేజ్ హటాత్తుగా పెరిగిపోయింది. మరో వంక, ఆమెను గెలిపించిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇమేజ్ కూడా ఫైపైకి పాకింది. దీంతో, బీజేపీ వ్యతిరేక శక్తులకు ఆ ఇద్దరూ ఆశా జ్యోతిగా కనిపించారు.  మరోవంక పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే కిరాయి వ్యూహాలకు ఇక స్వస్తి అని ప్రకటించిన ప్రశాంత్ కిశోర్, కొత్త అవతారంలో కాంగ్రెస్/రాహుల్ గాంధీ కేంద్ర బిందువుగా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకంచేసే ప్రయత్నం చేశారు. అలాగే, ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారనే ప్రచారం కూడా జరిగింది. అయితే, చివరకు బీజేపీ, మోడీని ఓడించడం రాహుల్ గాంధీతో కాంగ్రెస్ తో కాదని, నిర్ణయానికి వచ్చారో, లేక అది కూడా వ్యూహంలో భాగమో ఏమో కానీ, ప్రశాంత్ కిశోర్ మకాం బెంగాల్’కు  మార్చారు. మమత పంచన చేరి కాంగ్రెస్’ టార్గెట్’ గా మరో వ్యూహంతో ముందుకు సాగుతున్నారు.మమతను  జాతీయ నేతను చేసి 2024 ఎన్నికల్లో మోడీకి ప్రత్యర్ధిగా నిలిపే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే, ప్రశాంత్ కిశోర్ సూచనల మేరకు పార్టీ విస్తరణకు మమత నడుం బిగించారు.వచ్చే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలు జరిగే, గోవాలో కాలు పెట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. మరో వంక 2024 లోక్ సభ ఎన్నికలు లక్ష్యంగా పార్టీ విస్తరణకు శ్రీకారం చుట్టారు. ఒక్క గోవాలోనే కాదు, వచ్చే ఏడాది ఎన్నికలు జరిగి యూపీ సహా ఇతర రాష్టల్లోనూ కాంగ్రెస్ నాయకులను తృణమూల్’లో చేర్చేందుకు, ప్రశాంత్ కిశోర్ బృందం పనిచేస్తోంది. గోవా మాజీ ముఖ్యమంత్రి, లూయిజినో ఫిలేరియో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, తృణమూల్’లో చేరారు. అలాగే, మహిళా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ కుమారుడు, యూపీలో ఇద్దరు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్ల్యేలు కూడా  తృణమూల్ తీర్థం పుచ్చుకున్నారు. అయితే, కాంగ్రెస్ టార్గెట్’గా సాగుతున్న తృణమూల్ కాంగ్రెస్ విస్తరణ, పరోక్షంగా బీజీపీకి మేలు చేస్తుందే, కానీ, ప్రధాని పీఠం ఎక్కాలనే, దీదీ కలను ఎలా నిజం చేస్తుందనేది,ఇప్పుడు దేశం ముందున్న ప్రశ్న.అయితే ఇది  ఒక్క పీకేకు మాత్రమే తెలిసిన రహస్యం. ఆయన గుప్పిట విప్పితేనే కానీ, అసలు వ్యూహం ఏమిటి? అనేది తేలదు. రాహుల్ పోయి .. మమత వచ్చే .. అన్నట్లుగా  మరో బాంబు పేలుస్తారా ... చూడవలసిందే.. పిచ్చోడి చేతిలో రాయి ఏ తలకు అయినా తగలవచ్చును కదా...