తుని కేసు విచారణపై జీవో.. కుట్ర కోణంపై అనుమానాలు

తుని కేసు.. అప్పట్లో ఏపీలో ఓ సంచలనం. కాపు రిజర్వేషన్ల కోసం కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం చేసిన దీక్ష తీవ్ర వివాదస్పదమైంది. 2016లో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో కాపు రిజర్వేషన్ల పేరుతో ముద్రగడ పద్మనాభం తునిలో ఓ సభ నిర్వహించారు. ఈ సభ కాస్తా ఆందోళనలకు తెరలేపింది. ఆ ఆందోళనలు   అదుపు తప్పి..  ప్రయాణీకులతో వెళ్తున్న రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌ను తగులపెట్టారు. ఈ ఘటన రాష్ట్రంలోనే కాదు.. దేశంలోనే ఓ సంచలనంగా మారింది. అలాంటి కేసు ఇప్పుడు మళ్లీ హాట్‌ టాపిక్‌గా మారింది.  ప్రస్తుతం ఈ కేసును తిరిగి దర్యాప్తు చేయాలని ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఆ వెంటనే అలాంటిది ఏం లేదని.. జారీ అయిన జీవోను వెంటనే రద్దు చేస్తున్నట్టు ఆదేశాలు జారీ చేసింది. దర్యాప్తు జరపాలని ఎందుకు అనుకుంది? మళ్లీ వెంటనే వెనకడుగు ఎందుకు వేసింది? అనేదే ఇప్పుడు చర్చ. తుని ఘటన తర్వాత అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ముద్రగడ పద్మనాభం సహా.. అనేక మందిపై కేసులు నమోదు చేసింది. రైల్వే ఆస్తులకు నష్టం వాటిల్లడంతో.. రైల్వే అధికారులు కూడా కఠినమైన సెక్షన్లు పెట్టి కేసులు నమోదు చేశారు. అయితే 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం.. ఈ కేసులను ఎత్తివేసింది. 2021లో విజయవాడలోని 7వ మెట్రోపాలిటన్ అదనపు జడ్జ్, కోర్ట్ ఫర్ రైల్వేస్ కూడా ఈ కేసులను కొట్టివేసింది.  ఇలా అన్ని కేసులు కొట్టివేసిన తర్వాత ఉన్నట్టుండి ప్రభుత్వం నుంచి ఈ కేసులను తిరిగి పునర్‌విచారించాలంటూ హైకోర్టులో అప్పీల్‌కు వెళ్లాలంటూ జీవో జారీ అయ్యింది. ఇందులో పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ను ఆదేశిస్తూ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ కేసులో ముఖ్యులైన ముద్రగడ పద్మనాభం, దాడిశెట్టి రాజా, కామన ప్రభాకర్‌రావులాంటి వారికి మళ్లీ చిక్కులు తప్పవని తేలిపోయింది. కానీ ప్రభుత్వం వెంటనే అప్రమత్తమైంది . తుని కేసును కొట్టేస్తూ రైల్వే కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై అప్పీల్‌కు వెళ్లే ఆలోచన లేదని ఏపీ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.  అసలు జీవో ఎందుకు ఇచ్చారు? ఎవరు ఇచ్చారు? ఎవరి పర్మిషన్‌తో జీవో బయటికి వచ్చింది? అనేది ఇప్పుడు తేలాల్సి ఉంది. ఎందుకంటే తుని కేసును తట్టి లేపడమంటే.. ఏపీలో మరో తేనే తుట్టెను కదిపినట్టే. మొత్తం కాపు  సామాజికవర్గాన్ని కదిలించినట్టే. అంతటి సున్నితమైన అంశం గురించి ఆదేశాలు వెలువడే ముందు కనీసం ఎందుకు క్రాస్ చెక్ చేసుకోలేదు అనేది ఇప్పుడు క్వశ్చన్. అసలు ప్రభుత్వ పెద్దల దృష్టికి రాకుండానే ఈ జీవో వెలువడిందనేది మాత్రం తెలుస్తోంది. అందుకే జీవో విడుదలై వారి దృష్టికి రాగానే వెంటనే నష్ట నివారణ చర్యలు తీసుకున్నారు. క్లారిటీ ఇస్తూ.. జీవోను వెనక్కి తీసుకున్నారు.  ఏ స్థాయి అధికారి ఆమోదంతో ఈ ఫైల్ మూవ్ అయ్యింది.. ఎందుకు జీవోగా మారింది అనే దానిపై ఇప్పుడు ప్రభుత్వ పెద్దలు ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. అసలు సీఎంవో పెద్దల జోక్యం లేకుండా.. సీఎస్ పరిశీలించకుండా.. సీఎం చంద్రబాబు ఓకే అనకుండా ఇలాంటి అత్యంత ముఖ్యమైన జీవో ఎలా బయటికి వచ్చిందనేది ఇప్పుడు ఆశ్చర్యంగా ఉంది. అది కూడా కూటమి ప్రభుత్వం తన ఏడాది పాలనను పూర్తి చేసుకుంటున్న సమయంలో ఈ జీవో రావడం మరిన్ని అనుమానాలకు తెరలేపుతోంది. దీని వెనక మరేదైనా కుట్ర ఉందా? లేక అధికారుల తప్పిదమేనా? అనే దానిపై ఇప్పుడు ఏపీ ప్రభుత్వ పెద్దలు ఫోకస్ చేసినట్టు కనిపిస్తోంది.

యోగా డేపై సీఎం చంద్రబాబు సమీక్ష.. అధికారులకు దిశానిర్దేశం

ఏటా జూన్ 21న జరుపుకునే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్నిఈ ఏడాది ఎపిలో నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రజల నుంచి వస్తున్న స్పందన ఎంతో ఉత్సాహాన్ని ఇస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.   రాష్ట్ర వ్యాప్తంగా  ఇప్పటి వరకు జరిగిన రిజస్ట్రేషన్లు, జిల్లాల్లో జరుగుతున్న యోగా సాధన కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యం అద్భుతంగా ఉందన్నారు. పూర్తి స్థాయి సన్నద్ధతతో, ప్రజల భాగస్వామ్యంతో అత్యధిక మందితో యోగా నిర్వహించి గిన్నీస్ వరల్డ్ రికార్డు సృష్టించాలనే లక్ష్యాన్ని పూర్తి చేయాలన్న చంద్రబాబు,  జూన్ 21న విశాఖలో 5 లక్షల మంది పాల్గొనేందుకు అవసరమైన ఏర్పాట్లు పక్కాగా జరగాలని అధికారులను ఆదేశించారు. జూన్ 21న ప్రధాని నరేంద్రమోడీ రాక సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయనీ, వీటిని దృష్టిలో పెట్టుకుని ఎవరికీ ఎటువంటి ఇబ్బందీ కలగకుండా పక్కా ఏర్పాట్లు చేయాలన్నారు.  యోగాడైపై మంగళవారం (జూన్ 3) నిర్వహించిన సమీక్షలో చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. యోగా డే కంటే ముందు రెండు సార్లు రాష్ట్ర స్థాయిలో భారీగా ప్రీ ఈవెంట్ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.   7వ తేదీ ప్రతి గ్రామంలో, ప్రతి ప్రాంతంలో యోగా డే అవగాహనా ర్యాలీలు, 14 వతేదీ రాష్ట్రంలో లక్ష  ప్రాంతాల్లో యోగా సాధన ఉంటుందన్నారు.  చేస్తారు. ప్రతి విద్యా సంస్థతో పాటు అవకాశం ఉన్న అన్ని సంస్థలు, ప్రాంతాల్లో 14వ తేదీ యోగా నిర్వహించి యోగా డేకు ప్రజలను సిద్దం  చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.  ఈ సమీక్ష సమావేశంలో  మంత్రులు నారా లోకేష్, కందుల దుర్గేష్, వంగలపూడి అనిత, డోలా బాలవీరాంజనేయస్వామి, సత్యకుమార్, సీఎస్ విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా హాజరయ్యారు. యోగా మాసంలో భాగంగా ఇప్పటి వరకు వివిధ స్థాయిల్లో జరిగిన కార్యక్రమాలను, యోగా డే నిర్వహణకు తీసుకుంటున్న చర్యలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. 21వ తేదీన విశాఖలో వర్షం వచ్చినా ఇబ్బంది లేకుండా చేసేందుకు జర్మన్ హ్యాంగర్లతో మరో వేదిక సిద్ద చేసినట్లు అధికారులు తెలిపారు.  

ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కృనాల్ పాండ్యా

ఐపీఎల్ 2025 ఫైనల్ లో ఆర్సీబీ విజయంలో కృనాల్ పాండ్యా కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్ వంటి మెగా టోర్నీ ఫైనల్ లో 191 పరుగుల స్కోరు డిఫెండ్ చేసుకోవడమంటే నిజంగా అద్భుతమనే చెప్పాలి. ఆర్సీబీ ఆ అద్భుతం చేయడంలో కృనాల్ పాండ్యా బౌలింగ్ ప్రధాన కారణమని చెప్పవచ్చు. పంజాబ్ కింగ్స్ ను నియంత్రించడమే కాకుండా రెండు కీలకమైన వికెట్లను కూడా పడగొట్టిన కృనాల్ పాండ్యా మ్యాన్ ఆఫ్ ది ఫైనల్ గా నిలిచాడు. కృనాల్ పాండ్యా తన కోటా నాలుగు ఓవర్లలో కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చి ప్రభ్ సిమ్రాన్, జోష్ ఇంగ్లీష్ లను ఔట్ చేసి ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించాడు.  మొత్తంగా ఐపీఎల్ 2025 సీజన్ లో కృనాల్ పాండ్యా అద్భుతంగా రాణించాడనే చెప్పాలి. ఈ సీజన్ లో ఆడిన 15 మ్యాచ్ ల్లో కృనాల్ పాండ్యా మొత్తం 17 వికెట్లు తీసుకున్నారు. 

కింగ్ సాధించాడు.. ఆర్సీబీని మురిపించాడు!

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 18 ఏళ్ల నిరీక్షణ. 2008లో ఐపీఎల్ తొలి సీజన్ నుంచి ఆర్సీబీ లో భాగమైన కోహ్లీ ఈ 18 ఏళ్లూ అదే జట్టు తరఫున ఆడాడు. ఆర్సీబీతో ఎమోషనల్ గా పెనవేసుకుపోయాడు. ఆర్సీబీ ఐపీఎల్ టైటిల్ కోసం చెమటోడ్చాడు. రక్తం ధారపోశాడు. ఇన్నేళ్లుగా ఒకే ఫ్రాంఛైజ్ కు కట్టుబడి ఆడిన ఏకైక ఆడగాడు విరాట్ కోహ్లీయే.  విరాట్ కోహ్లీ క్రికెట్ ప్రస్థానంలో అండర్ 19 వరల్డ్ కప్ నుంచి మొదలు పెడితే.. వన్డే, టి20 వరల్డ్ కప్ లు, చాంపియన్స్ ట్రోఫీ వంటి ఎన్నో ప్రతిష్ఠాత్మక టోర్నీలలో విజేత జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ తరువాత అంతటి ప్రతిభ, ప్రావీణ్యం ఉన్న ఆటగాడిగా ప్రపంచ వ్యాప్తంగా లెంజడరీ క్రికెటర్లందరి ప్రశంసలూ అందుకున్నాడు. రెండు, మూడు మినహా  సచిన్ రికార్డులన్నిటినీ తిరగరాసి రన్ మెషీన్ గా, పరుగుల దాహం తీరని బ్యాటర్ గా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుని కింగ్ కోహ్లీ అయ్యాడు. అటువంటి విరాట్ కోహ్లీకి ఐపీఎల్ ట్రోఫీ ఇంత కాలం అందని ద్రాక్షగానే ఊరిస్తోంది. వరుసగా 17 ఏళ్ల పాటు ట్రోఫీ గెలవలేకపోయిన జట్టుకు మరే జట్టుకూ లేనంత బలమైన ఫ్యాన్ బేస్ ఉందంటే అందుకు కారణం విరాట్ కోహ్లీయే అనడంలో సందేహం లేదు. తన ఆశలనే కాదు.. ఆర్సీబీ ఐపీఎల్ ట్రోపీ దక్కించుకుని తీరాలన్న కోట్లాది మంది అభిమానుల ఆశలను కూడా విరాట్ కోహ్లీయే ఇంత కాలం ఒంటి చేత్తో మోస్తూ సాగాడు. ఇప్పుడు తన కల నెరవేర్చుకోవడమే కాదు.. అభిమానుల ఆశ కూడా తీర్చి గోప్ప రీలీఫ్ పొందాడు.  విజయానంతరం విరాట్ కోహ్లీ భావోద్వేగానికి లోనయ్యాడు. జట్టు సహచరులతో కలిసి మైదానమంతా కలియతిరిగాడు. ఉత్సాహం పట్టలేక ఉరకలేశాడు. ఆ ఆనందం అందరికీ 2008 నాటి యువ కోహ్లీని తలపించింది. తన భార్య అనుష్కశర్మను హత్తుకుని విజయానందాన్ని పంచుకున్నాడు. అలాగే ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్ వంటి ఆర్సీబీ మాజీ సహచరులతో ఆనంద క్షణాలను పంచుకున్నాడు. 

ఆనందంతో కరిగి కన్నీరైన క్రికెట్ కింగ్

ఆర్సీబీ విజయంతో క్రికెట్ కింగ్ విరాట్ కోహ్లీ కరిగి కన్నీరయ్యాడు. ఉద్వేగానికి లోనయ్యాడు. 18 ఏళ్లుగా ఆర్సీబీ విజయం కోసం తన సర్వశక్తులూ ధారపోసిన కోహ్లీ అది సాధించిన అనంతరం ఆనందం పట్టలేక కన్నీరు పెట్టుకున్నాడు. మైదానంలో మోకాళ్ల మీద కూలబడి కన్నీరుమున్నీరయ్యారు. ఆ తరువాత జట్టు సహచరులతో, ఆర్సీబీ మాజీ ప్లేయర్లు ఏబీడివిలియర్స్, క్రిస్ గేల్ లతో తన ఆనందాన్ని పంచుకున్నాడు. భార్య అనుష్కశర్మను హత్తుకుని మరోసారి కన్నీళ్లు పెట్టుకున్నాడు.ఐపీఎల్ ఆరంభం నుంచీ ఇప్పటి వరకూ జరిగిన 18 సీజన్లలోనూ ఒకే జట్టుకు ఆడిన ఏకైక ఆటగాడు ఎవరైనా ఉన్నారంటే అది కోహ్లీ ఒక్కడే.  విజయం అనంతరం మాట్లాడిన కోహ్లీ ఈ విజయం తనకు, జట్టుకు, ఆర్సీబీ ఫ్యాన్ బేస్ కూ ఎంతో ముఖ్యమైనది, విలువైనది అని చెప్పాడు. ఈ 18 ఏళ్లుగా ప్రతి ఐపీఎల్ సీజన్ లోనూ తాను విజయం కోసమే ఆడానని చెప్పిన కోహ్లీ.. ఆర్సీబీ కోసం తాను సర్వశక్తులూ ఒడ్డాననీ, ఈ విజయం తనకు ఒక అద్భుత అనుభూతి అనీ వివరించాడు.  ఏ విధంగా చూసినా ఐపీఎల్ చరిత్రలో 2005 సీజన్ చిరస్మరణీయంగా నిలిచిపోతుంది. ఈ 18 ఏళ్ల ఐపీఎల్ ప్రస్థానంలో ఇంతటి భావోద్వేగమైన ముగింపు ఇదే ప్రథమం.  పలుసార్లు ట్రోఫీ గెలిచిన జట్లకు కూడా లేనంత బలమైన ఫ్యాన్ బేఃస్ ను సొంతం చేసుకున్న జట్టు ఆర్సీబీ. గత 18 ఏళ్లలో మూడు సార్లు ఫైనల్స్ వరకూ వచ్చి, మరెన్నో సార్లు లీగ్ దశ దాటి నాకౌట్ దశకు వచ్చినప్పటికీ కప్ అందుకోవాలన్న కలకలాగే మిగిలిన జట్టు.  ఎట్టకేలకు నాలుగో సారి ఫైనల్ ఆడుతూ కప్పును ముద్దాడింది. అయితే ఇది కేవలం టైటిల్ విజయం కాదు.. 17 ఏళ్ల పోరాటానికి దక్కిన ఫలితం. ఎన్నో అవమానాలకు, ట్రోలింగ్ లకు చెప్పిన సమాధానం. వీటన్నిటి వెనుకా ఉన్నది ఒకే ఒక్కడు విరాట్ కోహ్లీ. అందుకే ఈ విజయాన్ని, కప్ ను విరాట్ కోహ్లీకి అంకితమిస్తున్నట్లు ప్రకటించాడు జట్టు కెప్టెన్ పటీదార్

ఐపీఎల్ విజేత ఆర్సీబీ

ఆర్సీబీ సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. ఐపీఎల్ టైటిల్ ను సొంతం చేసుకుంది.  ఆహ్మదాబాద్ వేదికగా మంగళవారం (జూన్ 3)న జరిగిన ఫైనల్ లో పంజాబ్ కింగ్స్ పై ఆరు పరుగుల ఆధిక్యతతో గెలిచి విజేతగా నిలిచింది.  టాస్ కోల్పోయి తొలుత   బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది. 191 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ లక్ష్య ఛేదనలో చతికిల బడింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 184 పరుగులు మాత్రమే చేసి లక్ష్యాన్నికి ఆరు పరుగుల దూరంలో నిలిచి ఓటమిని మూటగట్టుకుంది. ఈ విజయంతో ఆర్సీబీ ఐపీఎల్ చరిత్రలో తొలి సారిగా ట్రోఫీని అందుకుంది. 17 ఏళ్లుగా ఊరిస్తూ వచ్చిన టైటిల్ ను సొంతం చేసుకుంది. ఇప్పటి వరకూ మూడు సార్లు ఫైనల్ దాకా వెళ్లి కూడా కప్ ను అందుకోవడంలో విఫలమైన ఆర్సీబీ ఈ సారి దానిని సాధించింది. ఈ సాలా కప్ నమ్ దే నుంచి ఈ సాలా కప్ నమ్ దు అని గర్వంగా చాటింది. 

190 పరుగులకే పరిమితమైన ఆర్సీబీ..భారం మొత్తం బౌలర్లపైనే

    ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు శుభారంభం దక్కలేదు దూకుడుగా ఇన్నింగ్స్ ప్రారంభించిన ఫిల్ సాల్ట్.. కైల్ జెమీసన్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. క్రీజులోకి వచ్చిన మయాంక్ అగర్వాల్, విరాట్ కోహ్లీ ఆచితూచి ఆడటంతో పవర్ ప్లేలో ఆర్‌సీబీ వికెట్ నష్టానికి 55 పరుగులు చేసింది. పవర్ ప్లే ముగిసిన వెంటనే యుజ్వేంద్ర చాహల్‌ను రంగంలోకి దింపిన అయ్యర్.. ఆశించిన ఫలితాన్ని రాబట్టాడు. ఫిలిప్ సాల్ట్ 16 పరుగులు,మయాంక్ అగర్వాల్ 24, రజాత్ పాటిదార్ 26  విరాట్ కోహ్లీ(43), పరుగుల వద్ద ఔటయ్యారు.మయాంక్ అగర్వాల్ (24), కెప్టెన్ రజాత్ పాటిదర్(26), లివింగ్ స్టోన్ (25), జితేశ్ శర్మ (24), షెఫార్డ్ (17) పరుగులతో రాణించారు. పంజాబ్ జట్టు విజయం సాధించాలంటే 191 పరుగులు చేయాల్సి ఉంది. ఇక పంజాబ్ బౌలర్లలో జెమిసన్ మూడు వికెట్లు తీయగా, అర్షదీప్ సింగ్ మూడు వికెట్లు, అజ్మతుల్లా ఒమర్ జాయ్, యుజ్వేంద్ర చాహల్, విజయ్ కుమార్ తలో వికెట్ తీశారు.ఆర్‌సీబీ భారం మొత్తం బౌలర్లపైనే పెట్టారు.  

మధుర ఫలం...ధర అధ్వాన్నం..ఢీలా పడ్డ మామిడి రైతు

  కడప: మధుర ఫలం మామిడిని పండించే రైతు ధర లేక కుదేలవుతున్నాడు. ఈసారి మామిడి దిగుబడి బాగా వచ్చినా ధర అధ్వాన్నంగా ఉండడంతో ఢీలా డ్డారు. ఉమ్మడి కడప జిల్లాలోని కోడూరు మామిడి కి రాష్ట్రవ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా పేరుంది. ఈ మార్కెట్లో ప్రతి ఏటా 100 కోట్ల రూపాయలు వ్యాపారం జరుగుతుందంటే ఇక్కడ  మామిడి దిగుబడి ఏ స్థాయిలో ఉంటుందో అర్థమవుతుంది. ఇంత పెద్ద ప్రాధాన్యం ఉన్న  కోడూరు మార్కెట్  కళ తప్పింది .కిలో 5 రూపాయల అంటే టన్ను కేవలం 5 వేల రూపాయలకు మాత్రమే ధర పలుకుతుండడంతో మామిడి రైతులు తీవ్ర నష్ట పోయే పరిస్థితి ఏర్పడింది.  మామిడి సాగు చేస్తున్న రైతులకు  ప్రతి ఏటా ప్రతికూల వాతావరణ పరిస ఎదుర్కొంటున్నారు. అకాల వర్షాలు, పెనుగాలులు,మంచు ప్రభావం, మామిడి  దిగుబడుల పై తీవ్ర ప్రభావం చూపుతోంది. అష్టకష్టాలకు గురై  వీటన్నింటిని ఎదుర్కొని మార్కెట్ లో విక్రయించు కోవడానికి వస్తే మధ్య దళారుల బెడద.దీంతో గిట్టుబాటు దరలు లేక నష్టం పోక తప్పడం లేదు.ఈ పరిస్థితుల్లో మామిడి బోర్డు ఏర్పాటు చేసి గిట్టుబాటు ధరలు కల్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.  *డిమాండ్ లేక ఢీలా  ఈ సారి ఇక్కడి మామిడికి డిమాండ్ లేదన్న సాకుతో జ్యూస్ పరిశ్రమల యజమానులు ధరలను  తగ్గించేశారు. దీంతో  ఇటు మామిడి రైతులు, అటు వ్యాపారులు  ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో  వున్న జ్యూస్ పరిశ్రమల్లో ఎక్కువధరలతో మామిడి  కాయాలను ఎగుమతి చేసుకుంటున్నారని  రైతులు పేర్కొంటున్నారు. ఇప్పుడిప్పుడే పుంజు కుంటున్న మామిడి ధరలు ఆశించినంత లేక పోవడంతో రైతులు నష్టాలు చవిచూస్తున్నారు. *55 వేల ఎకరాల్లో సాగు     ఉమ్మడి కడప జిల్లాలోనే అత్యంధికంగా  మంచి మేలు కరమైన మామిడి రైల్వేకోడూరు ప్రాంతంలో 55 వేల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. రైల్వేకోడూరులో పండించే మామిడి కాయల్లో తోతాపూరి అనే కరం గతంలో జ్యూస్ పరిశ్రమలకు దిగుమతి చేసే వారు. రానురాను దాని తర్వాత ఆల్ఫోన్సా(ఖాదర్) ఎక్కువగా జ్యూస్ పరిశ్రమలకు ఎగుమతులు చేసే వారు. అయితే గత ఐదు సంవత్సరాలుగా ఊరగాయాలకు ఉపయోగించే కాయలు తప్ప మిగిలిన అన్ని మామిడి రకాలను జ్యూస్ కు పంపిస్తున్నారు. రైల్వేకోడూరు ప్రాంతంలో పండించే మామిడికి మంచి డిమాండ్ వుంటుంది. ఈ ప్రాంతంలో బేనీషా, నీలం, తోతాపురి, ఖాదర్, మల్లిక, కాలేపాడు, రుమాణి, మల్గోవా, పులిహోరా, హిమాంపసందు రకాలు పండిస్తున్నారు. దక్షిణ భారతదేశంలో రైల్వేకోడూరు మామిడి కాయలు ఎక్కువగా కనిపిస్తాయి. ప్రస్తుతం అన్ని రాష్ట్రాలకు కాయలను రైతులు, వ్యాపారులు ఎగుమతి చేస్తున్నారు.  *చిత్తూరు జ్యూస్ పరిశ్రమలకు  చిత్తూరు జిల్లాలో జ్యూస్ పరిశ్రమలు ఎక్కువగా వున్నాయి. ఈ పరిశ్రమల కు రైల్వేకోడూరు నుంచి ప్రతి రోజూ 10 లారీల్లో మామిడి కాయలనుఎగుమతి చేస్తున్నారు. పులిహోరా రకం టన్ను రూ.5 వేలు, బేనీషా రూ.5 వేలు, తోతాపురి టన్ను రూ.5 వేలుకు జ్యూస్ యజమానులు  సిండికేట్ అయ్యి  ధరలు నిర్ణయించారని రైతులు ఆవేదన  వ్యక్తం చేస్తున్నారు.   పులిహోరా రకం టన్ను  రూ.15వేలు, తోతాపూరి రూ.15 వేలకు పెంచాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అయితే జ్యూస్ పరిశ్రమ యజమానులు ధరలు పెంచేందుకు ససేమిరా అంగీకరించడం లేదని వ్యాపారులు ఆరోపిస్తున్నారు. సీజన్ మధ్యలో రైల్వేకోడూరు నియోజకవర్గం నుంచి రోజుకు సుమారు 100 లారీల్లో జ్యూస్ కు ఎగుమతి చేస్తామని రైతులు అంటున్నారు. జ్యూస్  పరిశ్రమల యజమానులు ధరలు పెంచితే మామిడి కాయలను ఎగుమతి చేస్తామని రైతులు భీష్మించుకు కూర్చుని కొన్ని రోజుల పాటు కోతలు నిలిపివేశారు. కొందరు రైతులు మాత్రమే జ్యూస్ కు ఎగుమతి చేస్తున్నారు. *మామిడి బోర్ ఏర్పాటు చేస్తేనే   ఇటీవల చిత్తూరులో తోతాపూరి మామిడికి గిట్టుబాటు ధరల విషయమై రైతులు, ప్రాసెసింగ్ యూనిట్ ల ప్రతినిధులతో సమావేశాన్ని చిత్తూరు పార్లమెంట్ సభ్యుడు  దుగ్గిమళ్ల ప్రసాద్ రావు, ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్, కలెక్టర్  సుమిత్ కుమార్, చిత్తూరు, పూతలపట్టు, నగరి శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ , మురళీమోహన్, గాలి భాను ప్రకాష్, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల జాయింట్ కలెక్టర్లు జి విద్యాధరి, శుభం బన్సల్, ఆదర్శ రాజేంద్రన్, తుడా చైర్మెన్ కటారి హేమలతలతో కలిపి సమావేశం నిర్వహించారు.  రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలంటే మామడి బోర్డు ఏర్పాటు చేయాలని, ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకు పోవాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు కు మామిడి రైతుల కష్టాలు వివరిస్తామని సమావేశంలో ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు.  మామిడి గుజ్జు, జ్యూస్ ల పై జి.ఎస్.టిలు ఎత్తివేయాలని ఉద్యానశాఖ డైరెక్టర్లు వివరించారు. మామిడి సీజన్ లో తోతాపురి రకానికి సంబంధించిన గిట్టుబాటు ధర విషయంలో రైతులు, ప్రాసెసింగ్ కంపెనీలు సమన్వయం ఎంతో అవసరమని జాయింట్ కలెక్టర్లు సమావేశంలో వివరించారు.  *గుజ్జు కు తగ్గిన డిమాండ్. మామిడిలో షుగర్ లెవల్స్  ఎక్కువగా వున్నాయని, గుజ్జుకు డిమాండ్ తగ్గిందని, ఎనర్జీ డ్రింక్స్ పట్ల ఆసక్తి చూపడంతో మామిడి  డ్రింక్స్ వాడకం తగ్గుతోందని ప్రాసెసింగ్ కంపెనీల ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు.  జ్యూస్ పరిశ్రమల యజమానులు ధరలు పెంచుతారా లేక ఉన్న ధరలతోనే కొనుగోలు చేస్తారా అనే విషయం  తెలియక పోవడంతో రైతులు, వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. *ఎక్స్ పోర్ట్ కు తగ్గిన డిమాండ్. కోడూరు మామిడి కి జ్యూస్ ఫ్యాక్టరీల పరిస్థితే కాదు, దేశంలోని ఇతర ప్రాంతాలకు ఎక్స్ పోర్ట్ డిమాండ్ తగ్గడం కూడా ధరల పతనానికి కారణం అయ్యింది .ఈసారి పంట ఆలస్యంగా రావడంతో ఇంతకంటే ముందే ఢిల్లీ ,ఆగ్రా, అహ్మదాబాద్ ,మహారాష్ట్ర తదితర ప్రదేశాల పరిసర ప్రాంతాల రాష్ట్రాల నుంచి ముందుగానే ఆ ప్రాంతాలకు మామిడి చేరింది. దీంతో ఆలస్యంగా దిగుబడి వచ్చిన కోడూరు మామిడి కి డిమాండ్ తగ్గినట్లు కూడా చెబుతున్నారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకున్న వ్యాపారులు ఐదు రూపాయలకు మించి కొనుగోలు చేయడంలేదు. *ఎమ్మెల్యే ప్రయత్నాలు  మామిడి రైతులు ధరలు లేక రైతులు విల విలలాడుతున్న విషయాన్ని తెలుసుకున్న రైల్వేకోడూరు ఎమ్మెల్యే,ప్రభుత్వ విప్, అరవ శ్రీధర్, కూడ చైర్మెన్ ముక్కా రూపానందరెడ్డిలు రైల్వేకోడూరు మామిడి  యార్డును సందర్శించారు. రైతులతో గిట్టుబాటు ధరల పై చర్చించారు. అనంతరం అన్నమయ్య జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చామకూరి దృష్టికి తీసుకెళ్లారు.  జ్యూస్ పరిశ్రమలకు టన్ను మామిడికాయలను రూ.10 వేలకు తక్కువ కాకుండా చూస్తామని హామీ ఇచ్చి రెండు రోజులు గడుస్తున్నా జ్యూస్ పరిశ్రమల యజమానులు ధరలు పెంచలేదు.రైల్వేకోడూరు మండల రైతులు   మాట్లాడుతూ ప్రతి ఏడాది నష్టాలు తప్పడం లేదన్నారు.ఒక్క కిలో మామిడి కాయలు పండించాలంటే రూ.10లుఖర్చుఅవుతుెదంన, జ్యూస్ పరిశ్రమల యజమానులు రూ.5 లకు అడుగుతున్నారు. మామిడి సాగుకు ఖర్చులు పెరిగాయి, దిగుబడి వస్తే ధరలు లేకుండా పోతాయి,  కాపు రాక పోతే చేసిన కష్టం రాకుండా  పోతుందని వాపోయారు. మామిడి బోర్డు ఏర్పాటు చేసి రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.  

తెలంగాణలో కరోనా కలకలం..పెరుగుతున్న కేసులు

తెలంగాణలో కరోనా కలకలం సష్టించున్నాయి.  రాష్ట్రంలో నాలుగు కరోనా కేసులు నమోదైన నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్ర స్థాయిలో కంట్రోల్ రూంతో పాటు జిల్లాల్లో కంట్రోల్ రూములను ఏర్పాటు చేసింది.  మీడియాతో తెలంగాణ హెల్త్‌ డైరెక్టర్‌ రవీందర్ నాయక్ మాట్లాడుతూ.. రాష్ట్రస్థాయితో పాటు జిల్లాల్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసినట్లు హెల్త్ డైరెక్టర్ రవీందర్ తెలిపారు. కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంపై జిల్లా అధికారులకు మార్గదర్శకాలు జారీ చేస్తున్నామన్నారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, కొన్ని జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుందని సూచించారు. కోవిడ్ నియంత్రణలో ఉందని కోవిడ్ పాండమిక్ స్టేజ్ నుంచి ఎండ్‌మిక్ స్టేజ్‌కి వచ్చిందన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) కోవిడ్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ కాదని ప్రకటించింది. ఇప్పుడు వైరస్ ఎక్కడైనా ఉంటుంది. కాకపోతే చాలా మైల్డ్ లక్షణాలు ఉంటాయి. సాధారణంగా కొన్ని జాగ్రత్తలు ప్రజలు పాటించాల్సిందే. వృద్ధులు, కోమోర్బిడిటీస్ ఉన్నవాళ్లు అప్రమత్తంగా ఉండాలి.. వేరియంట్ అనేది కాలంతో పాటు మారుతూ ఉంటుంది. దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందనేది ముఖ్యం. ఇప్పుడు మైల్డ్ లక్షణాలు ఉంటున్నాయి’’ అని రవీందర్‌ నాయక్‌ వివరించారు.  

ఏపీలో 4 కొత్త ఎయిర్‌పోర్టులు : సీఎం చంద్రబాబు

  ఆంధ్రప్రదేశ్‌లో అమరావతి, కుప్పం, దగదర్తి, శ్రీకాకుళంలో ఎయిర్‌పోర్టులు నిర్మించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. పోర్టులు, ఎయిర్‌పోర్ట్‌లు, ఫిషింగ్ హార్బర్లపై సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. త్వరలో ఏపీ లాజిస్టిక్స్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు.పీపీపీ విధానంలో రద్దీ మేరకు రాష్ట్ర రహదారుల విస్తరణ చేపట్టనున్నట్టు వివరించారు. హైవేలతో అన్ని రాష్ట్ర రహదారులను అనుసంధానం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.అలాగే. సీఎం చంద్రబాబు ఇవాళ యోగా దినోత్సవం పై సమీక్ష నిర్వహించారు. జూన్ 21 నిర్వహించబోయే యోగ కార్యక్రమం పై చర్చించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూటమి సర్కార్ ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాది.  పోర్టులు, ఫిషింగ్ హార్బర్లను రాష్ట్ర సంపదగా తీర్చిదిద్దాలని  అధికారులకు ముఖ్యమంత్రి తెలిపారు.. ఈ సమావేశానికి మంత్రులు నారా లోకేష్, కందుల దుర్గేష్, హోంమంత్రి అనిత, మంత్రి డోలా, మంత్రి సత్య కుమార్ యాదవ్ హాజరయ్యారు. 

ఐపీఎల్ 2025 ఫైనల్ టాస్ గెలిచిన పంజాబ్..ఆర్సీబీ బ్యాటింగ్

  అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం వేదిక జరిగే ఐపీఎల్ 2025 ఫైనల్ బెంగళూరుతో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి  బౌలింగ్ ఎంచుకుంది. ఈ స్టేడియం ఈ సీజన్‌లో అత్యధిక స్కోర్లు నమోదైన వేదికగా ప్రసిద్ధి గాంచింది. ఈ సీజన్‌లో ఇక్కడ జరిగిన 8 మ్యాచ్‌లలో, మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 7 సార్లు 200కు పైగా స్కోరు సాధించింది. 4 సార్లు 220ను కూడా దాటింది. న‌రేంద్ర‌మోడీ స్టేడియం త్రివ‌ర్ణ శోభిత‌మైంది. ‘ఆప‌రేష‌న్ సిందూర్‌కు ప్ర‌తీక‌గా గ‌గ‌న‌త‌లంపై వైమానిక ద‌ళాలు మువ్వ‌న్నెల జెండాను ప్ర‌ద‌ర్శిస్తూ అభిమానుల్లో జోష్ నింపాయి. స్వ‌రమాంత్రికుడు శంక‌ర్ మ‌హ‌దేవ‌న్  బృందం సైతం దేశ‌భ‌క్తి పాట‌ల‌తో స్టేడియాన్ని హోరెత్తిస్తున్నారు. ఈ సీజన్‌లో ఐపీఎల్‌కు కొత్త ఛాంపియన్‌ రావడం​ ఖరారైపోయింది. ఆర్సీబీ, పంజాబ్‌ జట్లలో ఏ జట్టు గెలిచినా చరిత్రే అవుతుంది. ఇప్పటివరకు ఈ రెండు జట్లు ఒక్కసారి కూడా టైటిల్‌ సాధించలేకపోయాయి. ఆర్సీబీ 3 సార్లు, పంజాబ్‌ ఓసారి ఫైనల్‌కు చేరినా రన్నరప్‌తో సరిపెట్టుకున్నాయి.  లీగ్‌ దశలో పంజాబ్‌, ఆర్సీబీ సమంగా మ్యాచ్‌లు గెలిచి (14లో 9) పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి. లీగ్‌ దశలో ఇరు జట్ల మధ్య జరిగిన రెండు మ్యాచ్‌ల్లో తలో మ్యాచ్‌ గెలిచాయి. క్వాలిఫయర్‌-1లో పంజాబ్‌పై ఆర్సీబీ పైచేయి సాధించింది.   జట్ల వివరాలు.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు : ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లి, మయాంక్ అగర్వాల్, రజత్ పాటిదార్(సి), లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ(w), రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్, జోష్ హాజిల్‌వుడ్ ఇంపాక్ట్ సబ్స్: రసిఖ్ సలామ్, మనోజ్ భాండాగే, టిమ్ సీఫెర్ట్, స్వప్నిల్ సింగ్, సుయాష్ శర్మ. పంజాబ్ కింగ్స్: ప్రియాంష్ ఆర్య, జోష్ ఇంగ్లిస్(w), శ్రేయాస్ అయ్యర్(c), నెహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, అజ్మతుల్లా ఒమర్జాయ్, కైల్ జామీసన్, విజయ్‌కుమార్ వైషాక్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్ ఇంపాక్ట్ సబ్స్: ప్రభ్‌సిమ్రాన్ సింగ్, ప్రవీణ్ దూబే, సూర్యాంశ్ షెడ్గే, జేవియర్ బార్ట్‌లెట్, హర్‌ప్రీత్ బ్రార్  

వైసీపీ పాల‌న‌కి తొలి వ‌ర్ధంతి శుభాకాంక్ష‌ల‌తో

  చాలా మంది జ‌గ‌న్ అనేవాడు. చాలా చాలా బాధ ప‌డుతున్నాడు. నీర‌సించి పోయాడు..అస్స‌లు డ‌బ్బులు లేవంట‌ క‌నీసం ఆఫీసు రెంటు కూడా క‌ట్ట‌లేక పోతున్నాడంట‌..అని తీవ్ర నిరాశా నిస్పృహ‌ల‌తో అల‌మ‌టించిపోతున్నారుగానీ.. జ‌గ‌న్ ప‌రిస్థితి అలాగేం లేదు. అందుకు మ‌చ్చు తున‌క మ‌ద్యం కుంభ‌కోణం. ఒక్క మ‌ద్యం కుంభ‌కోణం విలువ 3వేల ఆరు వంద‌ల కోట్లంటే.. మిగిలిన కుంభ‌కోణాల ప‌రిస్తితి ఏంటి? ఒక్క‌సారి ఆలోచించుకోండి. ఒక రోజుకు జ‌గ‌న్ క‌లెక్ష‌న్ కొన్ని కోట్ల‌ల్లో ఉండేవ‌ని.. ఆయ‌న ప్రాంగ‌ణానికి వెళ్లివ‌చ్చిన అకౌంటెంట్లు చెప్పేవార‌ప్ప‌ట్లో. అదే త‌ర్వాతి  రోజుల్లో కంటైన‌ర్ల రూపంలో బ‌య‌ట‌కెళ్లాయ‌న్న టాకుండేది.. ఈ విష‌యం ఎవ‌రో ఎన్నారై వ‌చ్చి ఎలుగెత్తి చాటే వ‌ర‌కూ ఇక్క‌డెవ‌రికీ తెలిసింది కాదు. ప్ర‌స్తుతం జ‌గ‌న్ కి వ‌చ్చిన ఇబ్బందేం లేదు. ఆయ‌న అప్పులు చేసి మ‌రీ రాష్ట్రాన్ని దివాలా తీయించి మ‌రీ ఒక‌రు క‌ష్ట‌ప‌డి క‌ట్టిన  ప‌న్నుల‌ను ఇత‌రుల‌కు ధారాద‌త్తం చేసి.. అదంతా తానే ఇచ్చిన‌ట్టు బిల్డప్ ఇచ్చేవాడు. దీంతో జ‌గ‌న్ ద‌య‌గ‌ల ధ‌ర్మ ప్ర‌భువు. దాత అనే  పేరుండేది.  ఒక వేళ నిజంగానే అంత‌టి ధ‌ర్మాత్ముడైతే బెజ‌వాడ వ‌ర‌ద‌ల‌పుడు కోటి రూపాయ‌లు ఇస్తాన‌న్నాడు. ఇచ్చాడా? ఏదీ ఆ కోటి రూపాయ‌ల విరాళం? అప్ప‌న్న గోడ కూలి చ‌నిపోయిన వారికి మిగిలిన ఎక్స్ గ్రేషియా 75 ల‌క్ష‌లు తాను అధికారంలోకి వ‌చ్చాక ఇస్తానంటాడు. అదే తాను ఇవ్వొచ్చు. కానీ ఇవ్వ‌డు. ఇదంతా జ‌నం సొమ్ము జ‌నానికే పంచి.. ధ‌ర్మప్ర‌భువ‌నే పేరు సాధించే ఎత్తుగ‌డ‌లో ఒక భాగం. అంతేనా.. మీరు న‌న్ను గెలిపిస్తేనే నేను మీకు మిగిలిన ప‌రిహారం ఇస్తాన‌నే బ్లాక్ మెయిల్. చూశారా బిల్డ‌ప్పు బ్లాక్ మెయిల్ రాజాగా మ‌న జ‌గ‌న‌న్న‌కు ఎంత‌టి తెలివితేట‌లున్నాయో! ఆమాట‌కొస్తే జ‌గ‌న్ త‌న స‌మీక్షా స‌మావేశాలు కూడా ఓట్ ఆర్ నోట్ దిశ‌గానే న‌డిపేవాడ‌న్న పేరుంది. అయితే ఓట్లు లేకుంటే నోట్లు గ‌ల‌గ‌ల‌లాడితేనే జ‌గ‌న్ అనేవాడు ఉన్న‌త స్థాయి స‌మీక్షా స‌మావేశాలు నిర్వ‌హించేవాడంట‌. మీకు తెలుసా? ఉన్న‌త విద్యామండ‌లికి సంబంధించి స‌మీక్ష  ఉంది సార్ అని అధికారులు అంటే అందులో ఓట్లు గానీ నోట్లు గానీ వ‌చ్చేదుందా? అలాంటిదేం ఉండ‌దు సార్.. ఇది ఉన్న‌త విద్య క‌దా.. పైపెచ్చు మ‌న‌మే ఎదురు ఖ‌ర్చు చేయాల్సి ఉంటుంద‌ని అంటే.. అయితే మ‌న‌కేం అక్క‌ర్లేద‌ని అధికారుల‌తో మొహాన  అనేవాడ‌ట‌. అలా ఆయ‌న వివిధ మార్గాల ద్వారా త‌న సొంతానికి డ‌బ్బు పెద్ద ఎత్తున  సంపాదించుకున్న‌ట్టు టాక్.  ఈ అవినీతికి జ‌న‌సంక్షేమం అనే అడ్డు గోడ‌ల‌ను క‌ట్టుకున్న‌ట్టు ఒక అంచ‌నా. అందుకే చూడండి.. జ‌గ‌న్ చుట్టూ ఉన్న ప్ర‌తి ఒక్క‌రూ ఏదో ఒక స్కామ్ లో ఉంటారు. ఉండి తీరుతారు. ఆఖ‌ర్న ఏపీడీసీ అనేదాన్లో కూడా కోట్లాది రూపాయ‌ల మొత్తంలో అవినీతి జ‌రిగిందంటే ప‌రిస్థితేమిటి? అందిన కాడికి అందిన‌ట్టు దోచుకుని.. ఇవాళ కొంద‌రు చేసిన పాపానికి ఊచ‌ల్లెక్కెడుతుంటే.. మ‌రి కొంద‌రు జైలుకెళ్లే దారి మ‌ధ్య‌లో ఉన్నారంటే కార‌ణం ఇదే. అలాంటి జ‌గ‌న్ ప్ర‌స్తుతం ఎలాంటి సిట్యువేష‌న్లో ఉన్నాడంటే.. తాను బ‌య‌ట‌కొస్తే చాలు జ‌నం ఎగ‌బ‌డుతున్నారు అది త‌న  పాపులారిటీ అని చెప్పుకోవ‌డంలో భాగంగా.. అక్క‌డా డ‌బ్బులిచ్చి మ‌రీ జ‌నాన్ని పోగేసుకుని సీన్ క్రియేట్ చేసుకుంటున్నాడట‌. ఒక‌నాటికి త‌న‌నుగానీ అరెస్టు చేస్తే.. ఇదిగో ఈ జ‌నాన్నే ప్ర‌యోగించి అల్ల‌క‌ల్లోలం చేస్తానంటూ హింట్ ఇస్తున్నాడట జ‌గ‌న్.

అహ్మదాబాద్‌లో వర్షం..మ్యాచ్ రద్దయితే కప్ ఎవరికంటే?

  ఐపీఎల్ 2025 ఫైనల్ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), పంజాబ్ కింగ్స్ జట్లు మధ్య జరిగే అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం వద్ద వర్షం మొదలైంది. ఇప్పుడిప్పుడే అభిమానులు స్టేడియంలోకి  అడుగుపెడుతున్నారు. వర్షం కురుస్తుండటంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. అయితే మ్యాచ్ ప్రారంభనికి సాయంత్రం 7:30 గంటలకు సమయం ఉండటంతో అప్పటిలోగా వాన తగ్గే ఛాన్సుంది. కాగా వర్షం పడి మ్యాచ్ రద్దు అయితే రేపు రిజర్వేడే ఉంది. అప్పుడూ కుడా మ్యాచ్ సాధ్యం కాకపోతే లీగ్ స్టేజీలో టాప్‌లో నిలిచిన పంజాబ్ కింగ్స్  దే టైటిల్. చిరు జల్లులు కాస్త భారీ వర్షంగా మారితే ప్రమాదం అని... గ్రౌండ్ బాయ్స్ కూడా చాలా కష్టపడుతున్నారు. వెంటనే  మోదీ స్టేడియం మొత్తం కవర్స్ తో కప్పే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఇవాళ వర్షం లేదని ఉదయం వాతావరణ శాఖ స్పష్టం చేసింది. నేటి మ్యాచ్‌లో మొదట టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ తీసుకునే ఛాన్స్ ఉంది  

సాయంత్రం 6 గంటలకు ఐపీఎల్ ముగింపు వేడుకలు

  ఐపీఎల్ 2025  ముగింపు వేడుకలు నేటి సాయంత్రం 6 గంటలకు అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఆపరేషన్ సిందూర్ విజయం నేపథ్యంలో భారత సాయుధ దళాలకు కృతజ్ఞతలు తెలుపుతూ బీసీసీఐ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమన్ని నిర్వహిస్తోంది. ముగింపు వేడుకల్లో ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్, ఆయన కుమారులు శివం, సిద్ధార్థ్ మహదేవన్ పాల్గొననున్నట్లు సమాచారం. ఆపరేషన్ సిందూర్‌లో సేవలందించిన భారత త్రివిధ దళాల ప్రతినిధులకు ఈ సందర్భంగా సత్కరించనున్నారు. అంతేకాకుండా, పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులు అర్పించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఎలాగైన కప్ గెలిచి తమ అభిమానుల కోరికను నెరవేర్చాలని ఆర్‌సీబీ వ్యూహాలు రచిస్తోంది. ఈ లీగ్‌ ఆవిర్భావం (2008) నుంచీ బరిలో నిలిచి టైటిల్‌ను ముద్దాడే క్షణం కోసం 18 ఏండ్లుగా వేచి చూస్తున్న ఆర్‌సీబీ , పంజాబ్‌ కింగ్స్‌ తమ కలను నెరవేర్చుకునే ప్రయాణంలో ఆఖరి దశకు చేరుకున్నాయి.  సీజన్‌ ఆసాంతం స్ఫూర్తిదాయక విజయాలతో ఫైనల్‌ చేరిన ఈ ఇరుజట్ల మధ్య మంగళవారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఐపీఎల్‌-18 ఫైనల్‌ జరుగబోతున్నది.ఇక ఫైనల్ మ్యాచ్ విషయానికొస్తే, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు గతంలో 2009, 2011, 2016 సంవత్సరాల్లో ఫైనల్స్ వరకు చేరినా, విజేతగా నిలవలేకపోయింది. సుదీర్ఘ విరామం తర్వాత, 2025 సీజన్‌లో మరోసారి ఫైనల్‌కు అర్హత సాధించి, టైటిల్‌పై గట్టి పట్టుదలతో ఉంది. మరోవైపు, పంజాబ్ కింగ్స్ జట్టు 2014లో ఒకసారి ఫైనల్‌కు చేరి, రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఇన్నేళ్లకు మళ్లీ ఫైనల్‌ బరిలో నిలిచి, తమ తొలి టైటిల్‌ను కైవసం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది.ఫైనల్ ముందు ఆర్సీబీ అభిమానులకు గుడ్ న్యూస్. ఈ మ్యాచ్‌కు ముందు ఓపెనర్‌ ఫిల్‌ సాల్ట్‌ జట్టుతో చేరాడు.తన భార్య తొలిబిడ్డకు జన్మనివ్వడంతో స్వదేశానికి వెళ్లాడు. తిరిగి మంగళవారం వేకువ జామున 3 గంటల సమయంలో తిరిగి జట్టుతో చేరాడు. యూకేకి వెళ్లిన ఆయన తిరిగి ఈ ఉదయం అహ్మదాబాద్ చేరుకున్నట్లు క్రీడావర్గాలు తెలిపాయి.

జైలు నుంచి ఆస్పత్రికి.. ఆస్పత్రి నుంచి జైలుకు!

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నాయకుడు వల్లభనేని వంశీని మళ్లీ విజయవాడ జిల్లా జైలుకు చేరుకున్నారు. ఆనారోగ్యం కారణంగా ఇటీవల వంశీకి కోర్టు మధ్యంతర బెయిలు మంజూరు చేసి మెరుగైన వైద్య చికిత్స అందించాల్సిందిగా ఆదేశించిన సంగతి తెలిసిందే.    ఈ మధ్యంతర బెయిల్ ఆసుపత్రిలో చికిత్స వరకే కొనసాగుతుందని, చికిత్స పూర్తి కాగానే రద్దు అవుతుందని అప్పుడే  కోర్టు స్పష్టం చేసింది. అంతే కాకుండా  వైద్య పరీక్షలకు సంబంధించిన నివేదికను జూన్ 5లోగా   సీల్డ్ కవర్ లో అందించాలని కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో వంశీని  విజయవాడలోని ఆయుష్ ఆస్పత్రికి జైలు అధికారులు తరలించారు.   దళిత యువకుడి కిడ్నాప్, గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి, భూకబ్జాలు, నకిలీఇళ్ల పట్టాల పంపిణీ, అక్రమ మైనింగ్… ఇలా పలు కేసులలో వల్లభనేని వంశీ నిందితుడిగా కేసులు ఎదుర్కొంటున్న సంగతి విదితమే.  కిడ్నాప్ కేసులో అరెస్టు అయిన వంశీ…ఆ తర్వాత ఈ కేసులనూ ఎదుర్కోక తప్పలేదు. ఒక కేసులో బెయిల్ వస్తే… మరో కేసులో రిమాండ్ పొడిగించడం వంటి కారణాలతో వంద రోజులకు పైగానే వంశీ బెజవాడ జైలులో రిమాండ్ ఖైడీగా ఉంటున్నారు. ఈ క్రమంలో  అనారోగ్యానికి గురైన వంశీ వైద్యం చేయించుకునేందుకు బెయిలు ఇవ్వాలంటూ కోర్టును ఆశ్రయించారు.  వంశీ పిటిషన్ ను విచారించిన ఏపీ హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిలు మంజూరు చేసింది. దీంతో ఆయనను జైలు నుంచి డిశ్చార్జ్ చేసిన జైలు అధికారులు విజయవాడలోని ఆయుష్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ మూడు రోజుల పాటు చికిత్స పొందిన వంశీ సోమవారం (జూన్ 2) సాయంత్రం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కోర్టు ఆదేశాల మేరకు జైలు అధికారులు వంశీని ఆస్పత్రి నుంచి జైలుకు తరలించారు.  ఇక ఆయుష్ ఆస్పత్రి  వైద్యులు వంశీ ఆరోగ్యానికి సంబంధించిన సమగ్ర నివేదికను గురువారం (జూన్ 5) కోర్టుకు అందించనున్నారు.  

జూన్ 5న తెలంగాణ కేబినెట్ సమావేశం

  తెలంగాణ కేబినెట్ సమావేశం జూన్ 5 మధ్యాహ్నం 3 గంటలకు  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం సచివాలయంలో నిర్వహించానున్నారు. రాజీవ్ యువవికాసం, ఇందిరమ్మ ఇళ్లు, భూభారతి,  వానాకాలం పంటలపై కేబినేట్‌లో చర్చ జరగనున్నాది. దరఖాస్తుల పూర్తి పరిశీలన తర్వాతే రాజీవ్‌ యువ వికాసం అర్హులను ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్‌లో చర్చించిన తర్వాతే రాజీవ్‌ యువ వికాసంపై తుది నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం.  ఒక్క అనర్హుడికి కూడా ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరడదని సీఎం అన్నారు. ఉద్యోగుల సమస్యలపై డిప్యూటీ సీఎంకు ఇప్పటికే నివేదిక అందింది. నివేదికను సీఎం, మంత్రులకు భట్టి విక్రమార్క వివరించారు. ఉద్యోగుల సమస్యలపై కేబినెట్‌లో చర్చించాలని నిర్ణయించారు. ధాన్యం కొనుగోళ్లు సమర్థవంతంగా నిర్వహించినందుకు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డికి సీఎం, మంత్రులు అభినందనలు తెలిపారు. మే 29, 30 తేదీల్లో జిల్లాల్లో పర్యటించిన మంత్రులు ఈ నాలుగు అంశాలపై అధికారులతో సమీక్షలు నిర్వహించారు.  

ప్ర‌భాక‌ర్ రావు రాక‌తో ఫోన్ ట్యాపింగ్ కేసు కొలిక్కి వ‌చ్చేనా?

ఎట్ట‌కేల‌కు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ1 నిందితుడి విచార‌ణ చేయ‌డానికి సిట్ కి దారులు బార్లా తెరుచుకున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కూ అంటే గ‌త 14 నెల‌లుగా అమెరికాలో ఉన్న ప్ర‌భాక‌ర్ రావు వ్య‌వ‌హారం, ఎన్నో మ‌లుపుల మీద మ‌లుపులు తిరిగి,  ఆయ‌న ఎట్ట‌కేల‌కు హైద‌రాబాద్ వ‌చ్చే  వ‌ర‌కూ సాగింది. త‌న‌కు ముంద‌స్తు బెయిలు ఇస్తేనే హైద‌రాబాద్ వ‌స్తానంటూ ఆయ‌న హైకోర్టుకెక్కారు. హైకోర్టు స‌మ్మ‌తించ‌లేదు. దీంతో సుప్రీం కోర్టుకు వెళ్లారు.. అక్క‌డ ఊర‌ట ల‌భించింది. మేము చెప్పే వ‌ర‌కూ ఆయ‌న్ను అరెస్టు చేయ‌వ‌ద్దంటూ సుప్రీం కోర్టు  తీర్పునివ్వ‌డంతో.. ఆయ‌న హైద‌రాబాద్ రిట‌ర్న్ అయ్యారు. సీట్ ఆయనను గురువారం (జూన్ 5)న విచారించనుంది.  అయితే గ‌తంలో ప్ర‌భాక‌ర్ రావు పాస్ పోర్టును  కేంద్ర ప్ర‌భుత్వం ర‌ద్దు చేసింది. ఆయ‌న పాస్ పోర్టును పున‌రుద్ద‌రించాల‌ని సుప్రీం ఆదేశించ‌డంతో ఆయ‌న అమెరిక‌న్ ఎంబ‌సీని క‌ల‌సి త‌న సింగిల్ విజిట్ పాస్ పోర్టును తీసుకుని హైద‌రాబాద్ వ‌స్తున్నారు. తానేమీ త‌ప్పు చేయ‌లేదు. అన్నీ నిరాధార‌మైన ఆరోప‌ణ‌లంటారు ప్ర‌భాక‌ర్ రావు. అలాంటి ప్ర‌భాక‌ర్ రావు గురువారం (జూన్ 5) జ‌రిగే విచార‌ణ‌లో నిజాలు చెబుతారా? ఇప్పటికే ఎస్ఐబీ చీఫ్ ప్ర‌ణీత్ రావు.. ఆయ‌న కింద ప‌ని చేసిన రాధాకిష‌న్ రావు, భుజం గ‌రావు, వేణుగోపాల రావు, భూప‌తి..  వీరంతా అరెస్ట‌య్యారు. క‌ న్ఫెష‌న్ లో..  నిజాలు ఒప్పుకున్నారు. త‌మ ఉన్న‌తాధికారి చెప్ప‌డం వ‌ల్ల మాత్ర‌మే తామిలా చేశామ‌ని అన్నారు. ఆ ఉన్న‌తాధికారి మ‌రెవ‌రో కాదు ప్ర‌భాక‌ర్ రావే. మ‌రి ప్ర‌భాక‌ర్ రావు ఈ నింద‌ను ఎవ‌రిపై కి నెడతారంటే..  మిగిలింది గ‌త పాల‌క వ‌ర్గం. అంటే బీఆర్ఎస్ అధినాయకుడైన కేసీఆర్. మ‌రి ప్ర‌భాక‌ర్ రావు..  కేసీఆర్ త‌దిత‌రుల పేర్లు బ‌య‌ట పెడ‌తారా? అన్న స‌స్పెన్స్ న‌డుస్తోంది. ప్ర‌భాక‌ర్ రావు అనే ఈ వెల‌మ రిటైర్డ్ ఐపీఎస్  తెలంగాణ ఇంటెలిజెన్స్ చీఫ్ గా చేసింది నాటి బీఆర్ఎస్ ప్ర‌భుత్వంలో. ఆయ‌న కింద  సిరిసిల్ల డీఎస్పీగా ఉన్న ప్ర‌ణీత రావును ఎస్ఐబీ చీఫ్ గా నియ‌మించారు. ప్ర‌ణీత్ కింద రాధాకిష‌న్ వంటి అధికారులు గ్రౌండ్ లెవ‌ల్లో వ‌ర్క్  చేసేలా ఒక ఆర్డ‌ర్ సెట్ చేశారు. ప్ర‌భుత్వం మారాక ప్ర‌ణీత్ త‌న  ఆఫీసులో ఈ ఫోన్ ట్యాపింగ్ మెటీరియ‌ల్ మొత్తం ధ్వంసం చేసేయ‌త్నం చేయ‌డంతో మొద‌లైందీ కేసు. 2023 డిసెంబ‌ర్ 4 న ఆయ‌నీ ప‌నులు చేయ‌గా.. 2024 మార్చిలో పంజాగుట్ట‌లో కేసు న‌మో ద‌య్యింది. అలా ఈ కేసు బ‌య‌ట ప‌డింది.   వీరంతా క‌ల‌సి ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా చేయాల్సిందేంటంటే.. ఆనాటి ప్ర‌త్య‌ర్ది వ‌ర్గాల వారైన రాజ‌కీయ సినీ వ్యాపార  ప్ర‌ముఖులు మాట్లాడే మాట‌ల‌ను విన‌డం. ఆ స‌మాచారం ద్వారా వారి ఆర్ధిక మూలాల‌ను క‌ట్ట‌డి చేయ‌డం. అలా రేవంత్ రెడ్డి ఇంటి ముందు 200 మీ. ప‌రిధిలో.. తిరుగుతూ ఆయ‌న మాట్లాడిన ప్ర‌తి  మాట‌నూ విన్న‌ట్టుగా తెలుస్తోంది. ఈ ప‌రిక‌రాల‌ను ఒక సాఫ్ట్ వేర్ కంపెనీ పేరిట తెప్పించారు. బేసిగ్గా వీటిని.. తీవ్ర‌వాదుల‌ను అరిక‌ట్ట‌డానికి మాత్ర‌మే వాడుతారు భార‌త్ లో. అలాంటి ట్యాపింగ్ మిష‌న్ల‌ను మ‌రెక్క‌డా వాడ్డానికి వీల్లేదు. ఎందుకంటే ఇది రాజ్యాంగం ప్రసాదించిన గోప్య‌త హ‌క్కును హ‌రిస్తుంది. ఈ హ‌క్కును కాల‌రాసే అధికారం ఎవ‌రికీ లేదు. ఇప్ప‌టి వ‌ర‌కూ భార‌త్ లో ఎవ‌రి మీదా ఈ త‌ర‌హా కేసు పెట్ట‌లేదు. అయితే 1988లో క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి రామ‌కృష్ణ హెగ్డే ఈ ఆరోప‌ణ‌ల  కార‌ణంగా త‌న ప‌ద‌వి నుంచి దిగిపోవ‌ల్సి వ‌చ్చింది.  ఇప్పుడీ కేసు లో ఏవ‌న్ గా ఉన్న ప్ర‌భాక‌ర్ రావు త‌న‌పై స్థాయిలో ఉన్న ఆనాటి సీఎం ప్ర‌భుత్వాధినేత కేసీఆర్ చెప్ప‌డం వ‌ల్లే ఇలా చేశాన‌ని చెబితే.. కేసు అటు ట‌ర్న్ తీసుకుంటుంది. దీంతో  ఇటు కాళేశ్వ‌రం దెబ్బ అటు  ఫోన్ ట్యాపింగ్ దెబ్బ ఒకే సారి గులాబీ బాస్ గూబగుయ్యిమ‌నిపించ‌డం ఖాయం.  మ‌రి ఆ దిశ‌గా ప్ర‌భాక‌ర్ రావు చెప్పే అవ‌కాశ‌ముందా? లేక త‌న ఐపీఎస్ బుర్రంతా వాడి త‌ప్పించుకుంటారా? ఈ ప‌ద‌నాలుగు నెల‌ల పాటు ఆయ‌న అమెరికాలో క్యాన్స‌ర్ చికిత్స చేయించుకునే నెపంతో వెళ్లి అక్క‌డ‌ ఏం ప్లాన్ చేసి ఉంటారు? అన్న‌ది తేలాల్సి ఉంది.

ఆర్సీబీ జెర్సీలో కర్నాటక డిప్యూటీ సీఎం.. ఎందుకంటే?

ఐపీఎల్ 2025 ముగింపు దశకు వచ్చింది. మంగళవారం (జూన్ 3)  సాయంత్రం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య ఫైనల్ తో ఐపీఎల్ విజేత ఎవరన్నది తేలిపోతుంది. ఈ సారి ఫైనల్స్ లో ఇటు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు గెలిచినా, అటు పంజాబ్ కింగ్స్ విజయం సాధించినా.. చరిత్రే. ఎందుకంటే.. ఇప్పటి వరకూ 17 సార్లు   జరిగిన ఐపీఎల్ లో ఈ రెండు జట్లూ విజేతగా నిలిచింది లేదు. అందుకే ఈ రెండు జట్లలో ఏ జట్టు గెలిచినా తొలి సారి ఐపీఎల్ ట్రోఫీ అందుకున్న జట్టుగా నిలుస్తుంది.  అదంతా పక్కన పెడితే.. ఐపీఎల్ జట్లన్నిటిలోనూ అతి పెద్ద ఫ్యాన్ బేస్ ఉన్న జట్లు బెంగళూరు మాత్రమే. అందులోనూ ఆ జట్టు కీలక ఆటగాడు కింగ్ కోహ్లీ జెర్సీ నంబర్ 18.. అలాగే ఇప్పుడు జరుగుతున్నది కూడా 18వ ఎడిషన్ కావడంతో ఈ సారి బెంగళూరు జట్టు ట్రోఫీ ముద్దాడటం ఖాయమన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతోంది. దేశంలోనే అత్యంత పెద్ద ఫ్యాన్ బేస్‌ ఉన్న ఆర్సీబీ ఐపీఎల్‌లో 18 సీజన్లలో ఏకంగా పది సార్లు ప్లే ఆఫ్స్‌కు చేరుకున్నప్పటికీ, టైటిల్ మాత్రం అందుకోలేకపోయింది.  దీంతో ఫ్యాన్స్ ఈ సారి ఎలాగైనా ఆర్సీబీయే కప్ సాధిస్తుందన్న విశ్వాసంతో ఉన్నారు. ఇందు కోసం పూజలు చేస్తున్నారు. 'ఈ సాల కప్ నమ్దే!' అంటూ ఉత్సాహంతో రెచ్చిపోతున్నారు. ఆర్సీబీ ఫ్యాన్ బేస్ లో దిగ్గజ మాజీ క్రికెటర్లు కూడా ఉన్నారు. లిటిల్ మాస్టర్, లెజండరీ సునీల్ గావస్కర్ ఈ సారి ఆర్సీబీ ఐపీఎల్ టైటిల్ గెలిస్తే.. దేశంలో ఇప్పటి వరకూ ఎన్నడూ చూడని స్థాయిలో సంబరాలు అదే సెలిబ్రేషన్స్ చూస్తామని వ్యాఖ్యానించారు. మరో దిగ్గజ మాజీ క్రికెటర్ సెహ్వాగ్ అయితే.. తాను పంజాబ్ కింగ్స్ కే సపోర్ట్ చేస్తానని ట్వీట్ చేశాడు. అలా ట్వీట్ చేసి ఊరుకోలేదు.. తాను మద్దతు పలికిన జట్టు గెలవదు అంటూ ముక్తాయించాడు. అంటే తాను ఎంత గట్టిగా ఆర్సీబీ విజయాన్ని కోరుకుంటున్నానన్నది సెహ్వాగ్ అలా వ్యక్తం చేశాడు. ఇక పొలిటీషియన్స్ లో కూడా ఆర్సీబీకి బిగ్ ఫ్యాన్స్ ఉన్నారు. కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అయితే ఏకంగా ఆర్సీబీ జెర్సీ ధరించి ఈ సాల కప్ నమ్దే అంటూ వీడియో రిలీజ్ చేశారు.  ఇది ఒక మ్యాచ్ మాత్రమే కాదు. మన క్షణం. మన కప్. ఆల్ ది వెరీ బెస్ట్ ఆర్‌సీబీ..  కర్ణాటక ప్ర‌జ‌లందరూ మీకే మద్దతు ఇస్తూ మీ వెంటనే ఉన్నారంటూ డీకే శివకుమార్ పేర్కొన్నారు.  చూద్దాం మరి అశేష అభిమానుల కలను ఆర్సీబీ ఈ సారి నెరవేరుస్తుందేమో.