ఉత్తరాఖండ్ లో హెలికాప్టర్ కుప్పకూలి ఆరుగురు దుర్మరణం

అహ్మదాబాద్ లో  విమానం కుప్పకూలి కూలి 274 మంది మరణించిన దుర్ఘటన మరవక ముందే  ఉత్తరాఖండ్ లో ఓ హెలికాప్టర్ ప్రమాదంలో ఆరుగురు మరణించిన ఘటన ఆందోళన కలిగిస్తోంది. ఉత్తరాఖండ్ లో హెలికాప్టర్ కుప్పకూలిన సంఘటనలో ఆరుగురు మరణించారు.   డెహ్రాడూన్ నుంచి   కేదార్‌నాథ్‌కు ప్రయాణికులతో వెళ్తున్న హెలికాప్టర్ ఈ ఉదయం ఐదున్నర గంటల సమయంలో మార్గమధ్యంలో  కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్న ఆరుగురు వ్యక్తులు మరణించారు  డెహ్రాడూన్ నుంచి కేదార్‌నాథ్‌కు బయలుదేరిన హెలికాప్టర్ త్రిజూగీనారాయణ్, గౌరీకుండ్ ప్రాంతాల మధ్య కుప్పకూలింది. ఆ హెలికాప్టర్ లో పైలట్ సహా ఆరుగురు ఉన్నారు. ఈ దుర్ఘటనలో ఆరుగురూ మరణించినట్లు అధికారులు తెలిపారు. హెలికాప్టర్ ప్రమాద సమాచరం అందుకున్న వెంటనే సహాయక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ప్రతికూల వాతావరణమే ఈ ప్రమాదానికి కారణంగా చెబుతున్నారు. 

పూర్వ వైభవం దిశగా తెలంగాణ తెలుగుదేశం!

సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు అన్న మహత్తర ఆశయంతో ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీ  తెలుగు ప్రజల గుండెల్లో గూడు కట్టుకుందనడంలో సందేహం లేదు.  తెలుగు ప్రజల అభ్యున్నతి, ఆత్మగౌరవం లక్ష్యంగా పని చేస్తున్న పార్టీ. అటువంటి పార్టీ రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో కొంత వెనుకబడింది.  ఆంధ్రప్రదేశ్ లో తిరుగులేని శక్తిగా ఉన్న తెలుగుదేశం తెలంగాణలో మాత్రం ఉనికి మాత్రంగానే మిగిలిన పరిస్థితి. అయితే ఇప్పుడు పరిస్థితిలో మార్పు వస్తున్నది. తెలంగాణలో కూడా పూర్వ వైభవం దిశగా అడుగులు వేస్తున్నది.  తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి నాయకుల కొరత ఉందేమో కానీ కార్యకర్తల బలం మాత్రం దండిగా ఉంది. ఈ విషయం పలు సందర్భాల్లో నిర్ద్వంద్వంగా రుజువైంది. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం అండ కోసం అన్ని రాజకీయపార్టీలూ వెంపర్లాడిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్, బీజేపీలు తమ ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం ప్రస్తావనం, ఆ పార్టీపై ప్రశంసల వర్షం కురిపించడం తెలిసిందే. అంతేందుకు అప్పటికి అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కూడా తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ జపం చేసి ఆ పార్టీ కార్యకర్తలకు దగ్గరవ్వాలన్న ప్రయత్నిం చేసింది.  ఇందుకు కారణం ఎవరు ఔనన్నా కాదన్నా  తెలంగాణలో తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఉండటమే. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి నేతలు లేరు కానీ కార్యకర్తలు మాత్రం పార్టీ పట్ల విశ్వాసంతో, అంకిత భావంతో   ఉన్నారు. ఈ సంగతి పలు సందర్భాలలో సందేహాతీతంగా రుజువైంది. రాష్ట్ర విభజన అనంతర రాజకీయ పరిణామాల కారణంగా రాష్ట్రంలో తెలుగుదేశం  ఒకింత ఇన్ యాక్టివ్ అయిన మాట వాస్తవమే.. కానీ ఆ పార్టీ పునాదులు రాష్ట్రంలో ఇప్పటికీ బలంగానే ఉన్నాయి.   పార్టీ అధినేత చంద్రబాబు ఒక్క పిలుపు ఇస్తే చాలు ఇక్కడ తెలంగాణ జెండా ఎగురవేయడానికి క్యాడర్ సిద్ధంగా ఉంది.  2023   తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో అన్ని పార్టీలూ తెలుగుదేశం జెండా పట్టడమే ఇందుకు నిదర్శనం.  2024 ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ అత్యద్భుత విజయం తరువాత.. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తెలంగాణలో పార్టీ బలోపేతంపై దృష్టి సారించారు.  తెలంగాణలో స్థానిక ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ రంగంలోకి దిగుతుందని ప్రకటించారు.  పార్టీ క్యాడర్ ఎంత బలంగా ఉన్నా.. వారిని ముందుండి నడిపించే లీడర్ కూడా అవసరమే. తెలంగాణలో ఆ నాయకత్వ కొరతే తెలుగుదేశం పార్టీకి ప్రధాన సమస్యగా ఇంత వరకూ ఉంది.  ఇప్పుడు ఆ సమస్యను తీర్చడంపై చంద్రబాబు దృష్టి పెట్టినట్లుగా కనిపిస్తోంది.అందుకే గతంలో పార్టీని విడిచి వెళ్లిన వారిని పార్టీలోకి ఆకర్షించే దిశగా చంద్రబాబు ఆలోచిస్తున్నట్లు సమాచారం. తెలంగాణలో బీఆర్ఎస్ పరాజయం, తదననంతర పరిణామాలతో ఆ పార్టీ బలహీనం కావడం కూడా తెలుగుదేశం పార్టీకి ఒక అవకాశంగా చెప్పవచ్చు. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి తెలంగాణలో బీఆర్ఎస్ బలపడటానికి తెలంగాణ తెలుగుదేశం నేతలు అప్పట్లో ఆ పార్టీ గూటికి చేరడం కూడా ఒక కారణం అనడంలో సందేహం లేదు. అయితే  2023 అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ ఓటమి, 2024 ఎన్నికలలో ఏపీలో తెలుగుదేశం ఘనవిజయంతో తెలంగాణలో తెలుగుదేశంను వీడిన నేతలంతా ఇప్పుడు ఆ పార్టీ వైపు చూస్తున్నారు.   ఏపీలో తెలుగుదేశం కూటమి ఘన విజయంతో తెలంగాణ పార్టీకి పునర్వైభవం తీసుకురావాలన్న లక్ష్యంతో చంద్రబాబు ఆలా హోం కమింగ్ అంటూ తెలంగాణలో తెలుగుదేశం గూటికి చేరేందుకు సుముఖంగా ఉన్న నేతలను ఆహ్వానించాలన్న ఉద్దేశంతో ఉన్నారు.  నిజానికి రాష్ట్ర విభజన తరువాత రాష్ట్రంలో పార్టీని వీడి ఇతర పార్టీలలో ఇమడలేక ఉక్కపోతకు గురౌతున్న పలువురు ఇప్పుడు తెలుగుదేశం వైపే చూస్తున్నారు.  ఇప్పటికే పలువురు నేతలు తెలుగుదేశం పార్టీకి టచ్ లోకి వచ్చినట్లు కూడా చెబుతున్నారు.  తాజాగా గతంలో తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా ఉన్న  కేంద్ర మాజీ మంత్రి గుత్తా సుఖేందర్ రెడ్డి చంద్రబాబుతో భేటీ అయ్యారు. శనివారం (జూన్ 14) జరిగిన ఈ భేటీ రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీలో వారి మధ్య జరిగిన చర్చ ఏమిటన్నది అలా ఉంచితే.. ఈ భేటీ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పూర్వ వైభవం దిశగా అడుగులు పడుతున్నాయనడానికి తార్కానంగా నిలిచింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ ఓటమి తరువాత ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు పొలిటికల్ గా ఇన్ యాక్టివ్ అయ్యారు. ఓటమి తరువాత ఆయన ఫామ్ హౌస్ విడిచి బయటకు వచ్చిన సందర్భాలను వేళ్లపై లెక్కపెట్టవచ్చు. అన్నిటికీ మించి కాళేశ్వరం ప్రాజెక్టు  విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అలాగే  ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా ఆయన చిక్కులను ఎదుర్కొనే అవకాశాలున్నాయంటున్నారు. ఇక ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు సైతం ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఏసీబీ విచారణు ఎదుర్కొంటున్నారు. ఇక కేఃసీఆర్ కుమార్తె కవిత తీరు.. ఇలా ఏ విధంగా చూసినా ఆ పార్టీ పరిస్థితి గందరగోళంగా ఉంది.  అలాగే రాష్ట్రంలో  అధికారంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కూడా అంతర్గత విభేదాలతో ఇబ్బందులు పడుతోంది. ఎన్నికల హామీల అమలులో వైఫల్యంతో ప్రజా ఆగ్రహాన్ని కూడా ఎదుర్కొంటోంది.   సరిగ్గా ఈ పరిస్థితుల్లో గుత్తా సుఖేందర్ రెడ్డి వంటి సీనియర్ నాయకుడు చంద్రబాబుతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పరిణామంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ లలో ఉన్న పలువురు మాజీ తెలుగుదేశం నేతల అడుగులు హోంకమింగ్ అంటూ తెలుగుదేశం దిశగా పడే అవకాశాలు మెండుగా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

శరణమా? న్యాయసమరమా?.. తేల్చుకో జగన్.. లోకేష్ మాస్ వార్నింగ్

గుడ్డ కాల్చి ముఖం మీద వేయడం వైసీపీకి అలవాటే. ఆధారాలు లేని ఆరోపణలు చేయడం.. ఆ పార్టీకి ఆవిర్భావం నుంచీ కూడా ఒక ఆనవాయితీగా వస్తున్నది. అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలోనూ అదే చేసింది. న్యాయ సమీక్షకు నిలబడని ఆరోపణలతో తప్పుడు కేసులతో ప్రత్యర్థులను వేధించి, తప్పుడు కేసులు బనాయించి జైళ్లకు పంపిన సంగతి తెలిసిందే.   ముందు కూడా తిరుమలలో పింక్ డైమండ్ అంటూ వైసీపీయులు నానా హంగామా చేసిన సంగతి తెలిసిందే. ఆ తరువాత విచారణలో అసలు శ్రీవారి నగల జాబితాలో పింక్ డైమండే లేదని తేలింది. అలాగే బాబాయ్ హత్య, కోడి కత్తి, గులకరాయి దాడి.. ఇలా ప్రతి విషయంలోనూ ప్రత్యర్థులపై బురద జల్లడం ఆ పార్టీకి ఒక ఆనవాయితీగా మారిపోయింది.  అయితే.. ఇష్టారీతిన ఆరోపణలు చేస్తే సహించేది లేదని లోకేష్ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఆరోపణలు చేసి ప్యాలెస్ లో దాక్కుంటానంటే కుదరదని కుండ బద్లలు కొట్టేశారు. తాజాగా తల్లికి వందనం పథకంలో రెండు వేల రూపాయల విమనహాయింపుపై వైసీపీ నేతల ఆరోపణలను ఖండిస్తూ.. నారా లోకేష్ జగన్ కు సవాల్ విసిరారు. తప్పుడు ఆరోపణలకు క్షమాపణలు కోరి శరణు జొచ్చుతావా.. న్యాయ సమరానికి రెడీ అవుతావో తేల్చుకో జగన్ అంటూ ట్విట్టర్ వేదికగా గట్టి వార్నింగ్ ఇచ్చారు.     తల్లికి వందనం డబ్బులుతన జేబులోకి వెళ్ళాయి అంటూ చేసిన ఆరోపణలను 24 గంటల్లో నిరూపించాలంటూ లోకేష్ సవాల్ కు జగన్ నుంచి సౌండ్ లేకపోయే సరికి మరోసారి ట్విట్టర్ వేదికగా లోకేష్ జగన్ పై సెటైర్ల వర్షం కురిపించారు. తాను ఇచ్చిన 24 గంటల గడువు ముగిసిపోయినా.. జగన్ నుంచి సౌండ్ లేదనీ, అందుకే ఆయనను ఫేక్ జగన్ అంటున్నామని ఆ పోస్టులో పేర్కొన్నారు.  సమయం లేదు మిత్రమా శరణమా, న్యాయ సమరమా తేల్చుకోండి అంటూ అల్టిమేటమ్ జారీ చేశారు.   లోకేష్ ట్వీట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.      అంతే కాదు నారా లోకేష్ ఏ విషయాన్నీ అంత తేలికగా వదిలేరకం కాదని వైసీపీకి బాగా తెలుసు. గతంలో చినబాబు చిరుతిండి అనే శీర్షికతో జగన్ సొంత మీడియాలో ప్రచురితమైన వార్త విషయంలో లోకేష్ చేస్తున్న న్యాయపోరాటం.. ఆ మీడియాను, వైసీపీని ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తోంది. ఇప్పుడు తల్లికి వందనం కేసులో వైసీపీ, జగన్ ఇష్టారీతిగా చేసిన ఆరోపణల విషయంలో లోకేష్ శరణమా, న్యాయ సమరమా అని అల్టిమేటం ఇవ్వడంతో వైసీపీలో వణుకు మొదలైందంటున్నారు. 

లక్కీ నెంబర్ 11.. ఆ సీటయితే .. సేఫేనా?

ఆ సీటులో కూర్చుంటే...ఎంత ఘోర ప్రమాదం సంభవించినా, ఆ సీటులో కూర్చున్న ప్రయాణీకుడు ప్రాణాలతో బయట పడిపోతారు. అహ్మదాబాద్, విమాన ప్రమాదం తర్వాత పిచ్చపిచ్చగా ట్రెండ్ అవుతున్న వింతల్లో ఇదొకటి. ఈ ప్రమాదంలో  ప్రాణాలతో బయట పడిన ఒకే ఒక్క అదృష్టవంతుండు  విశ్వాస్ కుమార్ రమేష్ సీటు నెంబర్ 11. అందుకే, సీటు నెంబర్ 11 లక్కీ నెంబర్ గా సోషల్ మీడియాలో  పోస్టులు పెడుతున్నారు. ఎక్కడెక్కడి  వో పాత కథలను తెచ్చి లింక్ చేస్తున్నారు.  ఇప్పడు తాజాగా.. 27 ఏళ్ల క్రితం సరిగ్గా ఇలాంటి ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన థాయ్‌లాండ్ పౌరుడి సీటు నెంబర్ కూడా 11  కావడంతో.. లక్కీ నెంబర్ 11 స్టోరీ మరింతగా వైరల్ అవుతోంది. ఎప్పుడో 27 ఎలాల్ క్రితం, ఇలాంటి ప్రమాదంలో చిక్కుకుని ప్రాణాలతో  బయట పడిన థాయ్‌లాండ్ పౌరుడు రాంగ్‌సాక్ లోచుసాక్, తను ప్రయాణించిన సీటు నెంబర్ కూడా 11 అని తెలిసి, అవక్కాయారు..ట.   అయితే, ఆహ్మదాబాద్  ప్రమాదానికి, అప్పుడు ఎప్పుడో 27 ఏళ్ళ క్రితం థాయ్‌లాండ్‌లో జరిగిన ప్రమాదానికి మధ్య అంత గొప్ప పోలికలు ఏమీ లేవు. అహ్మదాబాద్  విమాన ప్రమాదంలో, సీటు నెంబర్ 11లో కూర్చున్న ప్రయాణీకుడు  తప్ప అందరూ చనిపోయారు..  కానీ,  1998 డిసెంబర్ 11న దక్షిణ థాయ్‌లాండ్‌లో జరిగిన ప్రమాదంలో, ఒక్క రాంగ్‌సాక్ లోచుసాక్ మాత్రమే కాదు, మరో 45 మంది కూడా సురక్షితంగా బయట పడ్డారు. థాయ్‌లాండ్‌ విమానం  నేలకూలిన సమయంలో,విమానంలో 146 మంది ఉన్నారు.వీరిలో 101 మంది చనిపోయారు. మిగిలిన 45 మంది ప్రాణాలతో బయట పడ్డారు.  అందులో సీటు నెంబర్ 11 ప్రయాణీకుడు  రాంగ్‌సాక్ లోచుసాక్ కూడా ఒకరు. విశ్వాస్‌ది కూడా తనలాగే 11ఏ సీటు అని తెలిసి రాంగ్‌సాక్ ఆశ్చర్యపోయారు. తనూ నాలాగే 11ఏ సీటులో ప్రయాణించాడు  అంటూ ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టారు.  అయితే, ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డాక కూడా తనను ఏదో తెలియని బాధ, చాలా కాలం పాటు వెంటాడిందని అన్నారు. ప్రమాదం తరువాత దాదాపు 10 ఏళ్ల పాటు తాను విమాన ప్రయాణం చేయలేదని తెలిపారు. ప్రమాదం నుంచి బయటపడ్డాక పునర్జన్మ లభించినట్టు భావించానని తెలిపారు. ఇక విశ్వాస్ కూడా దాదాపు ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు.  విమానంలో అంతా మృతి చెందినా తన ప్రాణాలు ఎలా నిలిచాయో తెలియట్లేదని అన్నారు. ఈ నేపథ్యంలో సీటు నెంబర్ 11ఉదంతం మిస్టరీగా మారింది. ఈ రెండు ప్రమాదాల్లోనూ 11 సీటులోని ప్యాసెంజర్‌లు క్షేమంగా బయటపడటం సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్‌గా మారింది.  అదొకటి అయితే,అహ్మదాబాద్, విమాన ప్రమాదంలో  అనూహ్యంగా ప్రాణాలతో బయట పడిన విశ్వాస్ కుమార్ రమేశ్  ఉదంతంతో,ఒక్క ఇండియన్ ఎయిర్ లైన్స్’లోనే కాదు,అన్ని విమాన సేర్విసులలో సీటు నెంబర్ 11తో పాటుగా, ఎమర్జెన్సీ ఎగ్జిట్ కు దగ్గరగా ఉన్న సీట్లకు ముందెన్నడూ లేనంత డిమాండ్ పెరుగుతోంది. అయితే, నిపుణులు మాత్రం, సీటు నెంబర్ కు సంబంధం లేదని అంటున్నారు. సీటు నెంబర్  11 లేదా ఎమర్జెన్సీ ఎగ్జిట్ కి దగ్గరగా ఉన్న సీటు అయితే  సేఫ్  అనుకోవడం తప్పని అంటున్నారు. నిజానికి, విమానం విమానానికి సీటింగ్ అరెంజ్మేంట్ మారుతుంది. అలాగే ప్రమాదాలన్నీఒకేలా ఉండవు.. సో.. సీటు స్థానాన్నిబట్టి.. నెంబర్ బట్టి, ప్రమాదాల, చావు బతుకులు నిర్ధారణ కావని అంటున్నారు.   అయితే, ఎవరు ఎన్ని చెప్పినా, చివరకు, ‘దానే దానే పర్ ఖానే వాలాకా నామ్’లిఖా హువా హాయ్’ అంటే , తినే ప్రతి గింజపైన తినే వాడి పేరు రాసే ఉంటుందన్నదే నిజం., అందుకే, నూకలు చెల్లాయి అనే నానుడి పుట్టింది. లేకుంటే, లంచ్ చేసేందుకు కూర్చున్న వైద్య విద్యార్ధుల నెత్తిన విమానం కూలడం ఏమిటి? కంచాల ముందే 25 మందికి పైగా  కన్నుమూయడం ఏమిటి?  

ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డును అందుకున్న బాలయ్య

  తెలంగాణ గద్దర్ అవార్డు వేడుకల్లో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డును సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ గద్దర్ అన్న పేరు చిరస్థాయిగా మిగిలిపోయేలా ఆయన పేరిట అవార్డులు తెలంగాణ ప్రభుత్వానికి నా కృతజ్ఞతలు తెలిపారు. దళిత కుటుంబంలో పుట్టి అంచలంచెలుగా ఎదిగి ఆయనకంటూ ప్రత్యేక స్థానాన్ని గద్దర్ సంపాదించుకున్నారు. గద్దరన్న పేరుతో అవార్డులు ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వానికి నా కృతజ్ఞతలు. విశ్వాసానికే విశ్వనట రూపం ఎలా ఉంటుందో చూపించిన కారణజన్ముడు నందమూరి తారక రామారావు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ అవార్డులను ప్రారంభించారు.  రాష్ట్రాలు వేరు అయినా మనమంతా తెలుగువాళ్లమే. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో చలన చిత్ర ఉత్సవాన్ని జరుపుతుందన్నందుకు, అందులో నాకు అవార్డు రావడం సంతోషంగా ఉంది. ఎన్టీఆర్ తనయుడిగా ఆ అవార్డును తెలంగాణలో మొట్టమొదటి సారి గ్రహీతను అవడం నా పుర్వజన్మసుకృతంగా భావిస్తున్నా. అవార్డుతో పాటు ఇచ్చారని, ఆ డబ్బును బసవతారకం ఆస్పత్రి సేవలకు వినియోగిస్తాం.’’ అని బాలయ్య వెల్లడించారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ 'పుష్ప-2' సినిమాలో కనబరిచిన అద్భుతమైన నటనకు గాను ఉత్తమ నటుడిగా తెలంగాణ ప్రభుత్వ గద్దర్ అవార్డును అందుకున్నారు. ఆయన నటనకు విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించిన విషయం తెలిసిందే. ఈ అవార్డును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆయన స్వీకరించారు. ఈ వేడుకలో పలు విభాగాల్లో అవార్డులను ప్రకటించారు. ఉత్తమ నటిగా నివేదా థామస్ ఎంపికయ్యారు. 2024 సంవత్సరానికి గాను 'కల్కి' చిత్రానికి దర్శకత్వం వహించిన నాగ్‌ అశ్విన్‌ ఉత్తమ దర్శకుడిగా పురస్కారం అందుకున్నారు. చారిత్రక కథాంశంతో తెరకెక్కిన 'రజాకార్‌' చిత్రం ఉత్తమ చారిత్రాత్మక చిత్రంగా నిలవగా, 'కమిటీ కుర్రోళ్లు' ఉత్తమ తొలి చిత్రంగా అవార్డును దక్కించుకుంది. ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డును నందమూరి బాలకృష్ణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అందుకున్నారు. 'కాంతారావు ఫిల్మ్ అవార్డు'ను విజయ దేవరకొండ, 'బీఎన్ రెడ్డి ఫిల్మ్ అవార్డు'ను సుకుమార్, 'రఘుపతి వెంకయ్య అవార్డు'ను యండమూరి వీరేంద్రనాథ్, 'నాగిరెడ్డి అండ్ చక్రపాణి ఫిల్మ్ అవార్డు'ను అట్లూరి పూర్ణ చంద్రరావు, 'పైడి జైరాజ్ అవార్డు'ను మణిరత్నం అందుకున్నారు.

గోదావరి జలాలను బనకచర్ల ద్వారా ఏపీ దోపిడీ చేస్తున్నది : హరీశ్‌రావు

  కృష్ణా జలాల్లో జల దోపిడి జరిగినట్లుగా గోదావరి జలాలను బనకచర్ల ద్వారా ఆంధ్రప్రదేశ్ దోపిడీ చేస్తుందని.. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి,  మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి మౌనంగా ఉంటున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై, బీఆర్‌ఎస్‌ నేతలపై కేసులు పెట్టడంలో బిజీగా ఉన్నారని.. ప్రతిపక్షాల మీద ఇరిటేషన్‌ తప్ప.. ఇరిగేషన్‌పై దృష్టి లేదని.. రాష్ట్ర ప్రయోజనాలను పదవుల కోసం తాకట్టు పెడుతున్నారని మండిపడ్డారు. ‘బనకచర్ల ప్రాజెక్ట్ పేరుతో ఏపీ చేస్తున్న జల దోపిడి- కాంగ్రెస్ మౌనం’ అన్న అంశంపై హరీశ్‌రావు తెలంగాణ భవన్‌లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీ అక్రమ ప్రాజెక్టు కడుతుంటే.. సీఎం, మంత్రులు మౌనం వెనుక ఉన్న కారణం ఏంటని ప్రశ్నించారు. తెలంగాణ కంటే పది రెట్ల నిధులు ఆంధ్రకి ఇచ్చినమని స్వయంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆంధ్రాలో చెప్పాడని.. కేంద్రంలో పరపతితో చంద్రబాబుపై నుంచి కాకుండా పోలవరం నుంచి నీళ్లు మళ్లించి.. కేంద్రం నుంచి నదుల అనుసంధానం పేరుతో నిధులు తెచ్చుకున్నదని ఆరోపించారు. అయినా రేవంత్ రెడ్డికి, మంత్రులకు కదలిక లేదని.. ఇప్పటికైనా కళ్లు తెరవాలని.. నష్టం పూర్తిగా జరగకముందే గోదావరి బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవాలని డిమాండ్‌ చేశారు.   

సీఎం చంద్రబాబుతో సినీ ప్రముఖుల సమావేశం వాయిదా..ఎందుకంటే?

  రేపు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన  జరగాల్సిన సినీ ప్రముఖుల సమావేశం వాయిదా పడింది. రేపు షెడ్యూల్‌ ప్రకారం ఈనెల 15న సాయంత్రం 4 గంటలకు ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో ఈ సమావేశం జరగాల్సి ఉంది. అయితే.. షూటింగ్‌ల కారణంగా పలువురు ఇతర ప్రాంతాల్లో ఉండటం, ముఖ్యమైన పెద్దలు అందుబాటులో లేకపోవడంతో సమావేశం వాయిదా పడినట్టు సమాచారం.  షూటింగ్స్‌ కారణంగా కొంతమంది సినీ పెద్దలు రేపు అందుబాటులో లేకపోవడంతో సమావేశం వాయిదా వేశారు. మళ్లీ తిరిగి భేటీ ఎప్పుడు ఉంటుందనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. కాగా, థియేటర్ల బంద్‌ పిలుపు నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ సినీ పరిశ్రమపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఏపీ ప్రభుత్వాన్ని మర్యాదపూర్వకంగా కలిసేందుకు టాలీవుడ్ పెద్దలు నిర్ణయించారు.

నేడు జై జగన్ అన్నందుకు కూటమి ప్రభుత్వం కీలక పదవి

  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పర్యావరణ, అడవి శాఖ సలహాదారుడుగా కొమిర జాజి  (అంకారావు) అనే వ్యక్తికి కూటమి ప్రభుత్వం కీలక పదవి కట్టబెట్టింది. జై జగన్ అన్న లేదని తోట చంద్రయ్య ను వైసిపి నేతలు గొంతు కోసిన విషయం అందరికి తెలిసిందే.. ఇటీవల కొమర జాజి  జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకల్లో భాగంగా కేక్ కటింగ్ చేసి.. జై జగన్ అన్నందుకు కూటమి ప్రభుత్వం కీలక పదవి కట్ట పెట్టడంలో.. కూటమి శ్రేణులు అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే నరసరావుపేట పార్లమెంట్  వైసిపి  బీసీ సెల్ అధ్యక్షుడుగా  2018లో నియమితులయ్యారు.  అప్పటిలో అంబటి రాంబాబు నరసరావుపేట పార్లమెంట్ అధ్యక్షుడిగా పనిచేస్తున్న అంబటి రాంబాబు చేతుల మీదగా వినతి పత్రాన్ని పొందారు. ఇప్పటికి కూడా వైసిపి పార్టీకి కొమెర జాజి అనే వ్యక్తి  ఇప్పటికి కూడా వైసీపీ పార్టీ కి రాజీనామా చేయలేదంటూ కూటమి శ్రేణులు బహిరంగనే చెప్పుకుంటున్నారు. వైసీపీకి చెందిన వ్యక్తికి కూటమి ప్రభుత్వం కీలక పదవి ఇవ్వడంతో కూటమి శ్రేణులు  సీఎం చంద్రబాబు నాయుడు , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై కూటమి శ్రేణులు మండిపడుతున్నారు. కూటమి శ్రేణులు తెలిసి తెలియక చిన్న తప్పులు చేస్తేనే.. పార్టీ నుండి సస్పెండ్ చేసే అధినేతలు.. ఇలాంటి విషయాల్లో.. నియోజకవర్గ నాయకుల ప్రమేయం లేకుండా ఇలాంటి నిర్ణయం తీసుకోవడంపై పార్టీ శ్రేణులు పూర్తిగా ఆసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం పర్యావరణ శాఖ సలహాదారుడు జై జగన్ అంటున్న వీడియో టిడిపి సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది. సీఎం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో.. కూటమి శ్రేణులు ఎదురుచూస్తున్నారు.

లోకేష్ విసిరిన సవాల్ స్వీకరించే దమ్ము జగన్‌కు ఉందా? : మంత్రి అనిత

  వైసీపీ అధినేత జగన్‌పై ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ అమరావతిలో మీడియాతో హోంశాఖ మంత్రి మాట్లాడుతు రాష్ట్రంలో సీఎం చంద్రబాబు ఉన్నంత వరకూ  జగన్ ఆటలు సాగవని ఆమె హెచ్చరించారు. మహిళల రక్షణ విషయంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంటే, దానిపై వైసీపీ కడుపు మంటతో విమర్శలు చేస్తోందని ఆరోపించారు. వైసీపీ మహిళా నేతలు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని హితవు పలికారు. శాంతిభద్రతలకు ఎలాగైనా విఘాతం కలిగించాలని చూసే జగన్ కుట్రలు రాష్ట్రంలో సాగనివ్వబోమని ఆమె కుండ బద్దలు కొట్టారు. రాష్ట్రంలో మహిళలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చే దిశగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని వివరించారు. దీనికి ఎవ్వరు విఘాతం కలిగించాలని చూసినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.  అమరావతిని "వేశ్యల రాజధాని" అంటూ చేసిన అనుచిత వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, అలాంటి వ్యక్తిని వైసీపీ నేతలు, మాజీ మంత్రులు సమర్థించడం దారుణమని మంత్రి అనిత అన్నారు. "అదే అమరావతిలో జగన్మోహన్ రెడ్డి, భారతి రెడ్డి ఇల్లు కట్టుకోలేదా? మాజీ మంత్రులు, ఎంపీలు, వారి కుటుంబాలు నివసించడం లేదా?" అని ఆమె ప్రశ్నించారు. మహిళలను అగౌరవపరిచేలా మాట్లాడిన వ్యక్తికి సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇస్తే, దాన్ని సమర్థిస్తూ జగన్ ట్వీట్ చేయడం మహిళల పట్ల ఆయనకున్న గౌరవాన్ని తెలియజేస్తోందని విమర్శించారు. కొమ్మినేని శ్రీనివాస్‌కు ఇచ్చిన బెయిల్ షరతుల్లో టీవీ డిబేట్లలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకూడదని స్పష్టంగా ఉందని, దీన్నిబట్టి ఆయన వ్యాఖ్యలు తప్పని సుప్రీంకోర్టు కూడా నిర్ధారించిందని  హోం మంత్రి గుర్తుచేశారు.

కంగారూలపై సఫారీల ఘన విజయం.. వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌ షిప్‌ను కైవసం

  ఫైనల్స్ అంటే ఒత్తిడికి గురవుతారన్న అపవాదు ఉన్న సఫారీలు దాన్ని అధిగమించి కంగారూలపై ఘన విజయం సాధించారు . దక్షిణాఫ్రికా జట్టు అస్ట్రేలియాపై అద్భత విజయం సాధించి వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌ షిప్‌ను కైవసం చేసుకుంది. లార్డ్స్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో బవుమా సేన విజేతగా నిలిచింది. 213/2 స్కోరుతో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన సఫారీ జట్టు మరో మూడు వికెట్లు కోల్పోయి 83.4 ఓవర్లలో 285 పరుగులు చేసింది. ఐదెన్‌ మార్‌క్రమ్‌ (136) అద్భుత శతకం సాధించాడు. విజయానికి 6 పరుగుల దూరంలో ఉండగా హేజిల్‌వుడ్‌ బౌలింగ్‌లో ట్రావిస్‌ హెడ్‌ చక్కటి డైవింగ్‌ క్యాచ్‌ అందుకోవడంతో అయిదో వికెట్‌గా వెనుదిరిగాడు.  అప్పటికే విజయం ఖాయం కావడంతో తర్వాత వచ్చిన బ్యాటర్‌ పని పూర్తి చేశాడు. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా జట్టు 212 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌ ప్రారంభించిన దక్షిణాఫ్రికా జట్టు 138 పరుగులకే కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ జట్టు 207 పరుగులు చేసింది. 282 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సఫారీ జట్టు అనూహ్యంగా పుంజుకుంది. బౌలర్లకు సహకరించిన పిచ్‌పై ఐదెన్‌ మార్‌క్రమ్‌, తెంబా బవుమా (66) పోరాట పటిమ ప్రదర్శించారు. బవుమా ఔటైనా.. మార్‌క్రమ్‌ దాదాపు చివరి వరకు క్రీజులో ఉండి దక్షిణాఫ్రికా జట్టుకు చిరస్మరణీయమైన గెలుపును అందించడంలో కీలక పాత్ర పోషించాడు. 5 వికెట్ల తేడాతో లంచ్‌ బ్రేక్‌కు ముందే మ్యాచ్‌ను గెలిచి, వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌ షిప్‌ను దక్షిణాఫ్రికా జట్టు కైవసం చేసుకుంది. చివరిసారిగా 1998లో ఛాంపియన్స్ ట్రోఫీని సఫారీ జట్టు గెలుచుకుంది. ఇప్పుడు 27 ఏళ్ల తర్వాత మరోసారి ఐసీసీ టైటిల్‌ను నెగ్గింది.

అగ్ని ప్రమాద ఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే ఎంజీఆర్

  శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం హిరమండలం మండలం అంతకపల్లి గ్రామపంచాయతీలో ఆధ్యాత్మికంగా భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా ప్రకృతి సేద్యం చేస్తూ రాధాకృష్ణ పారాయణం పటిస్తున్న  కుర్మా గ్రామంలో ఇటీవలే సంభవించిన అగ్ని ప్రమాద విషయాన్ని తెలుసుకొన్న పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు  ఘటన స్థలాన్ని పరిశీలించారు.  అనంతరం అయన మాట్లాడుతూ అగ్ని ప్రమాద స్థలాన్ని పరిశీలించి నివేదికను త్వరితగతిన ఉన్నత అధికారులను ఆదేశాలు జారీ  చేశారు అనంతరం తన వంతు సహాయ సహకారాలు ఉంటాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల తహసిల్దారు,ఎంపీడీవో,సర్కిల్ ఇన్స్పెక్టర్,సబ్ ఇన్స్పెక్టర్, సచివాలయం సిబ్బంది,తోపాటు ఎంపీపీ ప్రతినిధి తూలుగు తిరుపతిరావు,మండల అధ్యక్షులు యళ్ళ నాగేశ్వరరావు,మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు

కూర్మ గ్రామంలో అగ్ని ప్రమాదంపై డిప్యూటీ సీఎం పవన్ విచారం

  శ్రీకాకుళం జిల్లా హిరమండలం మండల పరిధిలోని కూర్మ గ్రామంలో  అగ్నికి ఆహుతవ్వడం దురదృష్టకరమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్  విచారం వ్యక్తం చేశారు. ఆధుని హంగులు లేకుండా ఆధ్యాత్మిక చింతనతో జీవించేలా తీర్చిదిద్దుతున్న గ్రామం కూర్మ అక్కడ అగ్నిప్రమాదంపై అనుమానాలు ఉన్నాయని డిప్యూటీ సీఎం తెలిపారు. పోలీసులు లోతుగా విచారణ చేయాలి వారు డిమాండ్ చేశారు. ఈ ప్రమాదం దీపాల వల్ల జరిగిందని అల్లరి మూకలపై ప్రమేయం లేదని పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు. ప్రశాంతతకు భంగం వాటిల్లింది. ఆధ్యాత్మిక చింతనతో, ప్రకృతి ఒడిలో జీవనం సాగించే ఈ గ్రామంలోని ఇస్కాన్ రాధాకృష్ణ మందిరం కొన్నిరోజుల కిందట జరిగిన అగ్నిప్రమాదంలో పూర్తిగా కాలిపోయింది.  ఇది ప్రమాదవశాత్తూ జరిగిందా లేక ఎవరైనా దుండగులు ఉద్దేశపూర్వకంగా నిప్పుపెట్టారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గతంలో కూడా ఇలాంటి దుశ్చర్యలు జరిగాయని మందిర నిర్వాహకుల్లో ఒకరైన ప్రభుదాస్ పోలీసులకు వివరించారు.  కూర్మ గ్రామంలో ప్రస్తుత పరిస్థితిపై జిల్లా అధికారులతో మాట్లాడి, వారికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు. సనాతన ధార్మిక జీవనం కోసం ఇస్కాన్ ఆధ్వర్యంలో ఈ గ్రామం ఏర్పాటైంది. కూర్మ గ్రామవాసులు యాంత్రిక జీవన విధానాలకు భిన్నంగా మట్టి ఇళ్ళల్లో ఉంటూ ప్రకృతి వ్యవసాయం చేసుకొంటూ జీవిస్తున్నారు. వేద విద్యను అభ్యసించే చిన్నారులు సంస్కృతం, తెలుగు, హిందీ, ఆంగ్లం అనర్గళంగా మాట్లాడుతూ ఉంటారు. వర్తమాన కాలంలో విశిష్టంగా ఉన్న ఈ గ్రామం పునరుద్ధరణపై దృష్టి సారించాలి" అని పవన్ స్పష్టం చేశారు.  

2 సార్లు టికెట్ క్యాన్సిల్ .. మూడోసారి తిరిగిరాని లోకాలకు

గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాణీ విషయంలో విధి వక్రీకరించింది. అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంలో మరణించిన గుజరాత్‌ మాజీ ముఖ్యమంత్రి విజయ్‌ రూపాణీ ప్రయాణానికి సంబంధించి అదే జరిగిందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. లండన్‌లో ఉన్న తన భార్య, కుమార్తెను కలిసేందుకు వెళ్తున్న రూపాణీ.. అంతకుముందు రెండుసార్లు వెళ్లేందుకు సిద్ధమై టికెట్‌ రద్దు చేసుకున్నారంట. చివరకు మూడోసారి బయలుదేరినప్పటికీ గమ్యాన్ని చేరకముందే విమాన ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. అంతేకాదు ఆయన లక్కీ నంబర్‌గా భావించే 1206 సంఖ్య కలిగిన తేదీనే ఆయనకు చివరి రోజయ్యింది. రూపాణీ వ్యక్తిగత వాహనాలన్నీ అదే నంబరుతో ఉన్నట్లు సమాచారం. విజయ్‌ రూపాణీ ఆయన భార్యతో కలిసి మే నెలలోనే లండన్‌ వెళ్లేందుకు ఎయిరిండియా 171 విమానంలో టికెట్‌ బుక్‌ చేసుకున్నారు. కొన్ని కారణాల వల్ల తన పర్యటనను రద్దు చేసుకున్న ఆయన.. తన భార్యను అక్కడికి పంపించారు. జూన్‌ 5న వెళ్లేందుకు మళ్లీ బుక్‌ చేసుకున్నప్పటికీ.. అనివార్య కారణాల వల్ల ఆ టికెట్‌ను కూడా క్యాన్సిల్  చేసుకున్నారు. బీజేపీ పంజాబ్‌ ఇన్‌ఛార్జీగా ఉన్న రూపాణీ.. లుధియానా ఉపఎన్నిక నేపథ్యంలోనే తన ప్రయాణాన్ని రెండుసార్లు విరమించుకున్నట్లు తెలుస్తోంది. చివరకు జూన్‌ 12 లండన్‌కు ప్రయాణమైన రూపాణీ.. విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. అహ్మదాబాద్‌కు సమీపంలోని ఆనంద్‌ ప్రాంతానికి చెందిన మోనాలి, సన్నీ దంపతులు కూడా విమాన ప్రమాదంలో మృతిచెందారు. లండన్‌కు వెళ్లేందుకు వీరు జూన్‌ 6నే టికెట్‌ బుక్‌ చేసుకున్నప్పటికీ వ్యక్తిగత కారణాల వల్ల దాన్ని రద్దు చేసుకున్నారు. చివరకు 12వ తేదీన ఎయిరిండియా విమానంలో బయలుదేరిన వారిద్దరు కానరాని లోకాలకు వెళ్లడాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని వారి బంధువులు వాపోతున్నారు.

వైసీపీ ఆరోపణలు నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తా : మంత్రి సవిత

  వైసీపీ ఆరోపణలు నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత వైసీపీ  సవాల్ విసిరారు. మంళగిరి టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. వైసీపీ ఆరోపిస్తున్నట్లు ‘తల్లికి వందనం’ నిధులు మంత్రి లోకేష్ జేబులోకి వెళ్లినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తా, నిరూపించలేకపోతే పులివెందుల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయగలరా? అని జగన్‌కు సవాల్ విసిరారు.విద్య విలువ తెలిసిన నాయకుడు నారా లోకేష్ అయితే.. విద్యకు ప్రాధాన్యతనిచ్చిన ప్రభుత్వం ఎన్డీయే ప్రభుత్వం అన్నారు. ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు ఇంటిలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అమ్మఒడి ఇచ్చి మాట నిలబెట్టుకున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆనందంగా ఉన్నారు. రూ.67లక్షల 27వేల 164 మందికి తల్లికి వందనం అందజేశామని పేర్కొన్నారు.  దాదాపు రూ. 8,745 కోట్లు తల్లికి వందనం కింద డైరెక్టుగా తల్లుల అకౌంట్లలోకి నిధులు జమ అయ్యాయి. తల్లిదండ్రులు, పిల్లలు చాలా ఆనందంగా ఉన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పులు కట్టుకుంటూ తల్లికి వందనం ఇవ్వడం గొప్ప విషయం. ఇందులో చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్ బాబు ల కృషి ఎనలేనిదని మంత్రి సవిత పేర్కొన్నారు. ఒక్కో విద్యార్థికి రూ.15 వేలు ఇస్తుండగా, అందులో రూ.2 వేలు పాఠశాల అభివృద్ధికి, మిగిలిన రూ.13 వేలు తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. "ఇంట్లో ఒకరుంటే రూ.13 వేలు, ఇద్దరుంటే రూ.26 వేలు, ముగ్గురుంటే రూ.39 వేలు, నలుగురుంటే రూ.52 వేలు, ఐదుగురుంటే రూ.65 వేలు అందజేశాం. ఒక కుటుంబంలోని ముగ్గురు ఆడబిడ్డలకు ఈ పథకం అందడంతో వారు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు" అని మంత్రి పేర్కొన్నారు.  

కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎమ్మెల్యే కూనంనేని సంచలన వ్యాఖ్యలు

  తెలంగాణలో గత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా విఫలమైందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే  కూనంనేని సాంబశివరావు విమర్శించారు. ఈ ప్రాజెక్టు కోసం ఇకపై ప్రజాధనాన్ని వెచ్చించవద్దని ఆయన ప్రభుత్వానికి సూచించారు. హైదరాబాద్‌లో ఈ రోజు ఉదయం కూనంనేని మీడియాతో మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అన్నీ తానై వ్యవహరించిన కేసీఆర్, ఇప్పుడు మాత్రం ప్రాజెక్టుతో తనకు ఎలాంటి సంబంధం లేనట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఈ ప్రాజెక్టుతో రాష్ట్రంలో అదనంగా ఒక్క ఎకరాకు కూడా సాగునీరు అందలేదని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం పంటలకు అందుతున్న నీరంతా ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారానే వస్తోందని స్పష్టం చేశారు.  కాళేశ్వరం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని, ఇది పూర్తిగా నిరుపయోగమైన ప్రాజెక్టు అని కూనంనేని అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వంపైనా కూనంనేని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్డీయే సర్కార్ మానవ హక్కులను ఉల్లంఘిస్తోందని ఆరోపించారు. మావోయిస్టుల మృతదేహాలను చూసి కూడా కేంద్రంలోని పెద్దలు భయపడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. మావోయిస్టు నేత కేశవరావు మృతదేహాన్ని వారి కుటుంబ సభ్యులకు అప్పగించకపోవడం అత్యంత దారుణమని కూనంనేని అన్నారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఆయన తీవ్రంగా ఖండించారు.  

వృక్షాసన భంగిమ లో మానవ హారం.. గోష్పాద క్షేత్రంలో యోగాంధ్ర

కొవ్వూరు గోష్పాద క్షేత్రం విఐపి ఘాట్ లో "యోగాంధ్ర" రాష్ట్రస్థాయి కార్యక్రమం శనివారం (జూన్ 14) విజయవంతంగా జరిగింది.  ఈ కార్యక్రమంలో   ప్రజా ప్రతినిధులు, వేద పాఠశాల విద్యార్థులు, వయో వృద్ధులు, మహిళలు, యువత, జిల్లా అధికారులు, వివిధ శాఖల సిబ్బంది తో "ఆర్ట్ ఆఫ్ లివింగ్" సంస్థకు చెందిన యోగ గురువు సరోజ యోగాసనాలు వేయించారు. అనంతరం బ్రహ్మకుమారి సోదరి రాజయోగ ధ్యానం చేయించారు. జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని మే 1 నుంచి నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా యోగా కార్యక్రమాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి విదితమే. అందులో భాగంగానే కొవ్వూరు గోష్పాద క్షేత్రంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.  ఈ కార్యక్రమానికి  కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, జిల్లా కలెక్టర్ ప్రశాంతి పాల్గొన్నారు.  మంచి ఆరోగ్యానికి, మానసిక ప్రశాంతతకు ప్రతి ఒక్కరూ యోగ సాధన చేయాలని సూచించారు. జూన్ 21 తేదీన మరింత మంది యోగా సాధన కార్యక్రమం లో పాల్గొనాలని  పిలుపు ఇచ్చారు. ఈ సందర్భంగా యోగా వృక్షాసన భంగిమలో  మానవహారం అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. కాగా పర్యాటక ప్రాధాన్యత దృష్ట్యా ఈ యోగా కార్యక్రమానికి గోష్పాద క్షేత్రాన్ని ప్రభుత్వం ఎంపిక చేసిందని వివరించారు.   ఎన్టీఆర్ జిల్లాలో కొండపల్లి ఖిల్లాపై  ఇక ఎన్టీఆర్ జిల్లాలో కూడా యోగాంధ్ర ను వినూత్నంగా నిర్వహిస్తున్నారు.  యోగాతో పాటు జిల్లాలో పర్యాటక ప్రాంతాలకు ప్రాచుర్యం కల్పించేలా ప్రణాళికా బద్ధంగా యోగాంధ్ర కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా కృష్ణా జిల్లా రాష్ట్రంలోని జిల్లాల కంటే ముందుంటోంది.  ఇటీవల కృష్ణా నదిలో బోట్లపైన యోగాసనాలు ప్రదర్శించి ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్న ఎన్టీఆర్‌ జిల్లా   శనివారం (జూన్ 14) ప్రముఖ పర్యాటక ప్రదేశమైన కొండపల్లి ఖిల్లాపై యోగాసనాలు ప్రదర్శించి అందరినీ ఆకర్షించింది. కొండపల్లి ఖిల్లాపై   యోగాసనాల ప్రదర్శనే కాకుండా పర్యాటకంగా కొండపల్లి ఖిల్లాకు ప్రాచుర్యం కల్పించేలా జిల్లా యంత్రాంగం ప్రణాళికా బద్ధంగా వ్యవహరించింది.    యోగాపై అందరిలోనూ అవగాహన ఏర్పడేందుకు ఎంతగానో దోహదపడేలా ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం చేస్తున్న కృషి పట్ల సర్వత్రా అభినందనలు వ్యక్తం అవుతున్నాయి.