సచిన్ టెండూల్కర్ కి జన్మదిన శుభాకాంక్షలు

  ‘పరుగుల యంత్రం’ అని అభిమానులు ముద్దుగా పిలుచుకొనే సచిన్ టెండూల్కర్ 39 ఏళ్ళు పూర్తి చేసుకొని ఈరోజు 40సం.లో అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు, క్రికెట్ సంఘాలు ఘనంగా ఆయన జన్మదిన వేడుకలు జరుపుకొంటున్నారు. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ వారు ఒక్కరోజు ముందుగానే కోల్ కోతలో నరేంద్రపూర్ రామకృష్ణ మిషన్ ఆశ్రమం వారి అద్వర్యంలో నడుస్తున్న అందవిద్యార్దుల ఆశ్రమంలో 10 పౌండ్ల భారీ కేకును 100 మంది అంధ విద్యార్ధుల చేత, కట్ చేయించి సచిన్ జన్మ దిన వేడుకలు ఘనంగా జరుపుకొన్నారు. అదేవిధంగా మంగళవారం రాత్రి ముంబైలో ముంబై ఇండియన్స్ టీం యజమాని నీత అంభానీ మరియు టెండూల్కర్ భార్య అంజలి సమక్షంలో ఒక భారీ కేక్ కట్ చేసి సచిన్ జన్మ దిన వేడుకలు ఘనంగా జరుపుకొన్నారు.   ఇక ఈ రోజు కోల్ కోతలో ఐపీయల్ మ్యాచ్ లో ఆడనున్నముంబై ఇండియన్స్ టీం మరియు కోల్ కోత నైట్ రైడర్స్ టీము సభ్యులు అందరు కలిసి ఉదయం డ్రెస్సింగ్ రూమ్ లో విదేశాల నుండి తెప్పించిన కోక్ పౌడర్ తో చేయబడిన 40 పౌండ్స్ బరువున్న ఒక భారీ చాక్లెట్ కేక్ సచిన్ చేత కట్ చేయించి ఆయన జన్మ దిన వేడుక ఘనంగా జరుకొన్నారు. దానిపై ఏప్రిల్2, 2011లో వరల్డ్ కప్ లో గెలిచిన సందర్భంగా తీసిన సచిన్ టెండూల్కర్ ఫోటో ముద్రించారు.   సచిన్ తన 24సం.ల సుదీర్గ క్రికెట్ చరిత్రలో నెలకొల్పిన రికార్డులను ముచ్చటించుకొంటే అదొక పెద్ద గ్రంధమే అవుతుంది. బ్రియాన్ లారా తరువాత అంతటి రికార్డ్ సాదించిన ఘనత ఒక్క సచిన్ టెండూల్కర్ కే దక్కింది.సచిన్ ఇంతవరకు 463 మ్యచ్చుల్లో ఆడి 18,426 రన్స్ చేసారు. కొద్ది నెలలక్రితం వన్డే ఇంటర్నేషనల్ మ్యాచుల నుండి రిటైర్ అయిన సచిన్ టెండూల్కర్ టెస్ట్ మ్యాచులకే పరిమితమయిపోయారిప్పుడు. సచిన్ ఇప్పుడు తన ముంబై ఇండియన్స్ టీం తరపున మాత్రమే ఐపీయల్ మ్యాచ్ లో ఆడుతున్నారు.   భారతదేశానికే గర్వ కారణమయిన సచిన్ టెండూల్కర్ కి ఈ శుభ సందర్భంగా తెలుగు వన్ పరివారం యావత్ రాష్ట్ర ప్రజల తరపున శుభాకాంక్షలు తెలియజేస్తోంది.

రాత మారని ఢిల్లీకి మరో పరాజయం

  ఢిల్లీ మళ్ళీ పరాజయాల బాటలో నడుస్తుంది. ముంబాయి ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో విజయం సాధించిన జట్టు మంగళవారం కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ తో ఐపిఎల్-6 లీగ్ మ్యాచ్ లో మళ్ళీ ఓడిపోయింది. పంజాబ్ కట్టుదిట్టమైన బౌలింగ్ ముందు ఢిల్లీ డేర్ డెవిల్స్ ఆటగాళ్ళు నిలవలేకపోయారు..  ఢిల్లీ కెప్టెన్ మహేళ జయవర్థనే 4 బంతుల్లో 4 పరుగులు (1 బౌండరీ) చేసిన తరువాత ప్రవీణ్ కుమార్ బౌలింగ్ లో మైక్ హస్సీకి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో 95 పరుగులు చేసిన వీరేంద్ర సెహ్వాగ్ 21 బంతుల్లో 23 పరుగులు (2 బౌండరీలు 1 సిక్సర్) కొట్టి ఊపు మీద ఉన్నట్లు కనిపించాడు కానీ హర్మీత్ సింగ్ బౌలింగ్ లో మన్ దీప్ క్యాచ్ పట్టడంతో పెవిలియన్ కు చేరుకున్నాడు. మిడిల్ ఆర్డర్ లో డేవిడ్ వార్నర్ 36 బంతుల్లో 40 పరుగులు (4 బౌండరీలు 1 సిక్సర్) ప్రవీణ్ కుమార్ క్లీన్ బౌల్డ్, జునేజా 20 బంతుల్లో 14 పరుగులు (1 బౌండరీ) హర్మీత్ సింగ్ బౌలింగ్ లో ఆవానా క్యాచ్ పట్టడం ద్వారా అవుటయ్యారు. నాలుగో వికెట్ కు 39 పరుగులు జతచేశారు. మూడు బంతుల వ్యవధిలో జునేజా ను హర్మీత్ బౌలింగ్ లో ఆవానా క్యాచ్ పట్టడంతో, జాదవ్ 0 హర్మీత్ సింగ్ బౌలింగ్ లో మన్ దీప్ క్యాచ్ పట్టడంతో వెనువెంటనే వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఇన్నింగ్స్ చివర్లో ఇర్ఫాన్ పఠాన్ 17 బంతుల్లో 14 పరుగులు (1 బౌండరీ) నాటౌట్, అగార్కర్ 9 బంతుల్లో 9 పరుగులు నాటౌట్ గా నిలిచారు. వాండెర్ మెర్వ్ 8 పరుగులు ఆవానా బౌలింగ్ లో మన్ దీప్ క్యాచ్ పట్టడం ద్వారా, ఇయాన్ బోథా 1 భట్ బౌలింగ్ లో మిల్లర్ క్యాచ్ ద్వారా అవుట్ అయ్యారు. హర్మీత్ సింగ్ 3, ప్రవీణ్ కుమార్ 2, ఆవానా 1, భార్గవ్ భట్ 1 వికెట్లు పడగొట్టారు. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 120 పరుగులు మాత్రమే చేయగలిగింది. టార్గెట్ చిన్నదే అయినా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన పంజాబ్ కు మొదట్లోనే ఎదురు దెబ్బ తగిలింది పంజాబ్ కెప్టెన్ గిల్ క్రిస్ట్ 3 బంతుల్లో 6 పరుగులు (1 బౌండరీ) ఇర్ఫాన్ పఠాన్ బౌలింగ్ లో ఇయాన్ బోథా క్యాచ్ పట్టడంతో పెవిలియన్ చేరాడు. మూడో ఆటగాడిగా బరిలోకి దిగిన 10 బంతుల్లో 18 పరుగులు (3 బౌండరీలు) మెర్వ్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్, ఓపెనర్ మన్ దీప్ సింగ్ 15 బంతుల్లో 24 పరుగులు (5 బౌండరీలు) రనౌట్ గా వరుస బంతుల్లో పెవిలియన్ చేరారు. వీరిద్దరూ కలిసి రెండో వికెట్ కు 44 పరుగులు జోడించారు. వోహ్రా 8ను ఇయాన్ బోథా క్యాచ్ అండ్ బౌల్డ్ ద్వారా అవుట్ చేశాడు. డేవిడ్ మిల్లర్ 39 బంతుల్లో 34 పరుగులు (3 బౌండరీలు) నాటౌట్ డేవిడ్ హస్సీ 21 బంతుల్లో 20 పరుగులు (1 బౌండరీ 1 సిక్సర్)ను నెహ్రా బౌలింగ్ లో ఇయాన్ బోథా క్యాచ్ పట్టడంతో వెనుదిరిగాడు. పియూష్ చావ్లా 5 పరుగులు నాటౌట్ గా నిలిచాడు. 121 పరుగుల టార్గెట్ ను 17 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. ఇర్ఫాన్, నెహ్రా, ఇయాన్ బోథా లకు ఒకొక్క వికెట్ దక్కింది. మూడు కీలక వికెట్లు పడగొట్టిన హర్మీత్ సింగ్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

Explosions in White House, panic over fake message

  A fake message that appears in Associated Press Council’s Twitter account on Tuesday -"Breaking: Two Explosions in the White House and Barack Obama is injured," created havoc world over. However, it was some handy work of some hackers, who hacks The AP Council social account and posted the fake message. The fake message is posted by a group of hackers which names themselves as "Syrian Electronic Army' and also leaves a message below stating-"Syrian Electronic Army was here."   Twitter is the first to react to message which immediately suspends the account @AP. AP Council also immediately removed the fake message and made a public statement clarifying the issue.   White House officials also condemned the message and declared President Obama is safe and no explosions take place inside the White House.   Journalists E Mc.Morris-Santoro, Buzz feed’s White House reporter, tweeted, "from here in the WH basement, this acct (AP) seems hacked."   Although, the fake message appears for a few minutes, it adversely affects on the US Stock Markets. Dow Jones Industrial Average has lost 130 points, or 0.9 percent, and the S&P has recorded a drop of 12 points.   AP Council officials’ states that probably it happens due to a phishing email message received by some of its employees.   In February this year, leading confectioner Burger King’s Twitter account was also hacked and fake message created havoc, which went like this- “The ‘Burger King’s company has been acquired by McDonald's.”    

రికార్డులు బద్దలు కొట్టిన క్రిస్ గేల్

  వెస్ట్ ఇండీస్ విధ్వంసకర బ్యాట్స్ మెన్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు సభ్యుడు క్రిస్టోఫర్ హెన్రీ గేల్ T20, ఐపిఎల్ చరిత్ర రికార్డులను బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో పూణే వారియర్స్ జరిగిన మ్యాచ్ లో బద్ధలు చేశాడు. టాస్ గెలిచి పూణే వారియర్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బెంగళూరు ఓపెనర్లుగా  గేల్, దిల్షాన్ బరిలోకి దిగారు. మొదటి రెండు బౌల్స్ లో రెండు ఫోర్లు కొట్టిన గేల్ వర్షం పడడంతో మ్యాచ్ కు కాసేపు అంతరాయం కలిగింది. వర్షం నిలిచిపోవడంతో మళ్ళీ క్రీజ్ లో కి వచ్చిన గేల్ మరో మూడు ఫోర్లు కొట్టి మొదటి ఓవర్లోనే 20 పరుగులు రాబట్టాడు. ఆ తరువాత క్రిస్ గేల్ రెచ్చిపోయాడు. కేవలం 17 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తీ చేసుకున్న గేల్ 30 బంతుల్లోనే శతకం సాధించాడు. 34 బంతుల్లో శతకం చేసిన సైమండ్స్ రికార్డు తుడుచిపెట్టుకుపోయింది. తిలకరత్నే దిల్షాన్ 36 బంతుల్లో 33 పరుగులు (5బౌండరీలు) గేల్ కు చక్కటి సహకారం ఆడించాడు. దిల్షాన్, రైట్ బౌలింగ్ లో ముర్తజా క్యాచ్ పట్టడంతో పెవిలియన్ చేరుకున్నాడు. వీరిద్దరూ కలిసి రికార్డు స్థాయిలో మొదటి వికెట్ కు 167 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. మూడో బ్యాట్స్ మెన్ గా క్రీజ్ లోకి వచ్చిన బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ 9 బంతుల్లో 11 పరుగులు (1 సిక్స్) దురదృష్టవశాత్తు రనౌట్ గా పెవిలియన్ చేరాడు. నాలుగో ఆటగాడిగా క్రీజ్ లోకి వచ్చిన ఎబి డివిలియర్స్ సుడిగాలి ఇన్నింగ్స్ లో  8 బంతుల్లోనే 31 పరుగులు (3 బౌండరీలు 3 సిక్స్)లు చేసి మార్ష్ బౌలింగ్ లో మన్హాస్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. పరుగుల వేగం పెంచాలనే ప్రయత్నంలో మనోజ్ తివారీ 2 దిండా బౌలింగ్ లో మార్ష్ కు క్యాచ్ ఇచ్చి, అర్జున్ రామ్ పాల్ 0 దిండా బౌలింగ్ లోనే మార్ష్ కు క్యాచ్ ఇచ్చి వికెట్లు పారేసుకున్నారు.     ఒకవైపు వికెట్లు పడుతున్నా చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో క్రిస్ గేల్ కేవలం 66 బంతుల్లోనే 13 బౌండరీలు, 17 సిక్సర్లు కొట్టి 175 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. బ్రెండన్ మెక్ కల్లామ్ పేరిట ఉన్న 158 పరుగుల అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డు, ఒకే మ్యాచ్ లో 17 సిక్సర్ల రికార్డు, ఐపీఎల్ లో 150కు పైగా(163) సిక్సర్లు కొట్టిన బ్యాట్స్ మెన్ రికార్డు, ఏ ఫార్మాట్ లోనైనా అత్యంత వేగవంతమైన శతకం రికార్డును బద్దలు కొట్టాడు. గతంలో శ్రీలంక, కెన్యాపై చేసిన అత్యధిక 260 పరుగుల రికార్డ్ ను కూడా బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ 5 వికెట్లు కోల్పోయి 263 పరుగులు చేసింది. అశోక దిండా 2, జెఫ్ మార్ష్ 1,ల్యూక్ రైట్ 1 వికెట్లు పడగొట్టారు.   భారీ టార్గెట్ ఛేదించడానికి బరిలోకి దిగిన పూణే వారియర్స్ కు మొదటి ఓవర్లోనే చుక్కెదురైంది. మొదటి ఓవర్ లో రెండో బంతికే ఓపెనర్ రాబిన్ ఊప్పను మురళీ కార్తీక్ బౌలింగ్ లో కవర్స్ లో ఆర్పీ సింగ్ అద్బుతమైన క్యాచ్ పట్టడంతో పెవిలియన్ చేరాడు. ఆ తరువాత పూణే నిలదొక్కుకోలేకపోయింది. ఫించ్ 0ను అర్జున్ రామ్ పాల్ బౌలింగ్ లో మురళీ కార్తీక్ క్యాచ్ పట్టడం ద్వారా, యువరాజ్ సింగ్ 16 ఉనాద్కట్ బౌలింగ్ లో కోహ్లీ క్యాచ్ ద్వారా, రైట్ 7 ఉనాద్కట్ బౌలింగ్ లో డివిలియర్స్ క్యాచ్ ద్వారా, స్మిత్ 31 బంతుల్లో 41 పరుగులు (6బౌండరీలు)అర్జున్ రామ్ పాల్ బౌలింగ్ లో దిల్షాన్ క్యాచ్ ద్వారా, జెఫ్ మార్ష్ 23 బంతుల్లో 25 పరుగులు (2 సిక్సర్లు) వినయ్ కుమార్ క్లీన్ బౌల్డ్ చేయడం ద్వారా, భువనేశ్వర్ కుమార్ 6 ఆర్పీ సింగ్ బౌలింగ్ లో అరుణ్ క్యాచ్ పట్టడం ద్వారా, ముర్తజా 5 గేల్ బౌలింగ్ లో అరుణ్ స్టంపవుట్ ద్వారా, పాండే 0 గేల్ క్లీన్ బౌల్డ్ చేయడం ద్వారా పూణే బ్యాట్స్ మెన్ దూకుడుగా ఆడడానికి ప్రయత్నించడంతో ఒకరి వెనుక ఒకరు పెవిలియన్ దారి పట్టారు. మన్హాస్ 11 నాటౌట్, అశోక దిండా 1 నాటౌట్ గా నిలిచారు. ఐదో వికెట్ కు స్మిత్, జెఫ్ మార్ష్ 58 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. స్టీవ్ స్మిత్ ఒక్కడే పూణే వారియర్స్ జట్టులో రాణించాడు. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 133 పరుగులు మాత్రమే చేసింది. అంటే బెంగళూరు సాధించిన పరుగులలో సగం మాత్రమే చేయగలిగింది. క్రిస్ గేల్ 2, ఉనాద్కట్ 2, అర్జున్ రామ్ పాల్ 2, ఆర్పీ సింగ్ 1, మురళీ కార్తీక్ 1, వినయ్ కుమార్ 1 వికెట్లు పడగొట్టారు. రెండు వికెట్లు తీయడమే కాకుండా 175 పరుగులు చేసిన క్రిస్ గేల్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. బెంగళూరు రాయల్ చాలెంజర్స్ ఆడిన 8 మ్యాచుల్లో 6 మ్యాచులు గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. 

చెన్నైకి వణుకుపుట్టించిన రాజస్థాన్

  ఐపిఎల్ లీగ్ మ్యాచ్ లలో భాగంగా చెన్నైలోని చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ X రాజస్థాన్ రాయల్స్ మధ్య సోమవారం జరిగిన మ్యాచ్ లో ఆఖరి బంతివరకూ ఉత్కంఠభరితమైన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఒక బంతి మిగిలి వుండగానే 186 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్ మొదటి నుండే దూకుడు ప్రదర్శించింది. తొలి వికెట్ కు ఓపెనర్ షేన్ వాట్సన్మ్ అజ్నింకా రహానే 71 పరుగులు జోడించారు. రహానే 15 బంతుల్లో 16 పరుగులు (1 బౌండరీ) చేసిన తరువాత అశ్విన్ క్లీన్ బౌల్డ్ గా పెవిలియన్ కు పంపాడు. వాట్సన్ కు జతకలిసిన యాజ్ఞిక్ 7ను కూడా అశ్విన్ కాట్ అండ్ బౌల్ ద్వారా వెనక్కి పంపాడు. రాజస్థాన్ కెప్టెన్ ద్రావిడ్ (6) క్రీజ్ లోకి వచ్చినా ఎక్కువసేపు నిలబడలేకపోయాడు. డ్వేన్ బ్రావో వేసిన బంతికి కీపర్ ధోనికి క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. తరువాత క్రీజ్ లోకి వచ్చిన స్టువర్ట్ బిన్నీ వాట్సన్ కు చక్కటి సహకారం అందిస్తూ దూకుడుగా ఆడాడు. బిన్నీ 22 బంతుల్లో 36 పరుగులు (3 బౌండరీలు 1 సిక్సర్) నాటౌట్ గా నిలిచాడు. రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియన్ షేన్ వాట్సన్ ఒకవైపు వికెట్లు పడుతున్నా చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో ఆడాడు. 29 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తిచేసుకున్న వాట్సన్ 60 బంతుల్లోనే సెంచరీ పూర్తీ చేసుకున్న తరువాత డ్వేన్ బ్రావో బౌలింగ్ లో భారీ షాట్ కొట్టబోయి ఎక్స్ ట్రా కవర్ లో హస్సీ క్యాచ్ పట్టడంతో పెవిలియన్ దారి పట్టాడు. ఐపీఎల్-6 లో ఇదే మొదటి సెంచరీ కావడం విశేషం. బ్రాడ్ హాడ్జ్ 9 పరుగులతో నాటౌట్ గా ఉన్నాడు. రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి 185 పరుగులు చేసింది. అశ్విన్ 2, డ్వేన్ బ్రావో 2 వికెట్లు పడగొట్టారు. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన చెన్నై సూపర్ కింగ్స్ లక్ష్యం భారీగా ఉండడంతో మొదటి నుంచే దూకుడుగా ఆడింది. ఓపెనర్ మురళీ విజయ్ 3 చండీలా కాట్ అండ్ బౌల్ నిరాశ పరిచినా మైక్ హస్సీ చెలరేగి ఆడాడు. మైక్ హస్సీకి సురేష్ రైనా తోడవడంతో వీరిద్దరూ 61 బంతుల్లోనే 90 పరుగులు జోడించారు. సురేష్ రైనా 35 బంతుల్లో 51 పరుగులు (4 బౌండరీలు 2 సిక్సర్లు) చేసి ఫాల్కనర్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూ గా అవుట్ అయ్యాడు. చెన్నై కెప్టెన్ ధోని, హస్సీతో కలిసి మూడో వికెట్ కు 42 జోడించిన తరువాత 19వ ఓవర్లో భారీ షాట్ కు ప్రయత్నించిన ధోని, ఫాల్కనర్ బౌలింగ్ లో స్టువర్ట్ బిన్నీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. మైక్ హస్సీ 51 బంతుల్లో 88 అప్రుగులు (13 బౌండరీలు 1సిక్సర్) చేసిన తరువాత ద్రావిడ్ స్ట్రైట్ త్రో తో రనౌట్ అవుట్ అయ్యాడు. ఆ మరుసటి బంతికే 'సర్' రవీంద్ర జడేజా 0 పరుగులకు ఫాల్కనర్ క్లీన్ బౌల్డ్ చేశాడు. విజయానికి చివరి ఓవర్లో 11 పరుగులు చేయాల్సి ఉండగా బ్రేవో 9 బంతుల్లో 15 పరుగులు (1 సిక్సర్) 20వ ఓవర్ ఐదవ బంతికి భారీ సిక్సర్ కొట్టడంతో చెన్నై సూపర్ కింగ్స్ 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసి విజయం సాధించింది. ఫాల్కనర్ 3, చండీలా 1 వికెట్లు తీశారు. షేన్ వాట్సన్ సెంచరీ వృధా అయ్యింది. షేన్ వాట్సన్ ఆస్ట్రేలియన్ సహచరుడు మైక్ హస్సీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. బంగళూరు రాయల్ ఛాలెంజర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ ఐదు విజయాలు నమోదు చేసినప్పటికీ రన్ రేట్ ఆధారంగా చెన్నై ఆడిన ఏడు మ్యాచుల్లో ఐదు మ్యాచుల్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో టేబుల్ టాప్ గా నిలిచింది.

Mohan babu keen to join politics

  Veteran actor Manchu Mohan babu is one among the few Telugu film stars, who is very much interested in state politics but lacks courage to join active politics. Perhaps, Chiranjeevi’s failures and his struggle for existence in Congress party might frighten him from joining politics. Yet, he couldn’t stop himself from commenting on state and national level politics. Recently, he and his family members have visited Home Minister Sabita Indra Reddy to console her. Later, he sharply criticized Congress high command stating big robbers are sitting at New Delhi.   Once again, he spoke about his political interests yesterday, but said he doesn’t have that much courage to launch a political party on his own but definitely will take active part on behalf of some political party in the forth coming elections. He said soon he will announce about the party, in which he is going to join. He said he is just looking for a political platform to serve the people and not interested in power.   Since, he is criticizing the Congress party and as he belongs to Chittoor district, it is understood that Congress and TRS were not in his list. Then remain TDP and YSR Congress parties only. His previous association with TDP may encourage him to choose it.   More over he often states that late NTR is like his elder brother and mentor in his film career. Hence, he may feel home at TDP, as there is NTR clan and also there are his co-stars like Murali Mohan, Babu Mohan and Kavita etc in the party. TDP also has approached him some time ago offering a ticket in his native Chittoor district for the forth coming elections. So, he is likely to join TDP.