ప్రధాని రేసులో నితిన్ గడ్కరీ?

బీజేపీ సీనియర్ నాయకుడు, పార్టీ మాజీ జాతీయ అధ్యక్షుడు, నాగపూర్ ఎంపీ, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ  ప్రధాన మంత్రి పదవిని ఆశిస్తున్నారా? ఆ దిశగా ఆయన అడుగులు పడుతున్నాయా? ప్రయత్నాలు ప్రారంభించారా? అంటే అటు నుంచి అటువంటి సంకేతాలే వస్తున్నాయని అంటున్నారు. ముఖ్యంగా రెండు రోజుల  కిందట నితిన్ గడ్కరీ తమ రాజకీయ భవిష్యత్ గురించి చేసిన వ్యాఖ్యలు   నాగపూర్ నుంచి ఢిల్లీ వరకు పరివార్ వర్గాల్లో సంచలనంగా మారినట్లు తెలుస్తోంది.  , రెండు రోజుల కిందట ఒక టీవీ చానల్  కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో నితిన్ గడ్కరీ..  2029 ఎన్నికల్లో తమ పాత్ర గురించి అడిగిన ప్రశ్నకు సమాధానంగా  ఇంత వరకు చూసింది ట్రైలర్ మాత్రమే అసలు సినిమా ముందుంది  అంటూ మర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. దీంతో గడ్కరీ  తాను ప్రధాని రేసులో ఉన్నాననే సంకేతాలు పంపుతున్నారని  రాజకీయ, పరివార్ వర్గాల్లో చర్చ మొదలైందని అంటున్నారు. అయితే..  ఆ వెంటనే గడ్కరీ,  బీజేపీలో ఎవరు ఏ బాధ్యతలు నిర్వహించాలో పార్టీ నిర్ణయిస్తుందనీ..  పార్టీ తనకు ఏ బాధ్యత అప్పగిస్తే, ఆ బాధ్యత నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నానని కొంత క్లారిటీ ఇచ్చారు. అయితే..  అందులోనూ పార్టీ ఆదేశిస్తే ప్రధాని పదవి చేపట్టేందుకు సిద్దంగా ఉన్నాననే సంకేతం ఉందని  పార్టీ వర్గాలు గుసగుసలు పోతున్నాయి.  అదలా ఉంచితే..  ప్రధాని నరేంద్ర మోదీ, స్వయం ప్రకటిత సార్వజనీన రిటైర్మెంట్  ఏజ్  75 కి చేరువలో ఉన్న సమయంలో.. గడ్కరీ ప్రధాని కుర్చీలో కర్చీఫ్  వేయడం మరింత ఆసక్తిని రేకేత్తిస్తోందని  అంటున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ మరో మూడు నెలలలో.. అంటే  సెప్టెంబర్ 17 న 75 ఏళ్లు దాటి దాటి 76వ పడిలో అడుగు పెడతారు. అంటే..  రిటైర్మెంట్’ ఏజ్ లోకి అడుగు పెడుతున్నారు. అదలా ఉంటే.. మరో వంక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రిటైర్మెంట్ గురించి,మోదీ వారసుని గురించి..  ఇటు పార్టీ, పరివార్ వర్గాల్లో ఏదో ఒక స్థాయిలో ఎంతో కొంత చర్చ అయితే.. మొదలైనట్లు మీడియా కథనాలను బట్టి తెలుస్తోంది.  అయితే..  నిజంగా  మోదీ ఇప్పటికిప్పుడు రిటైర్మెంట్ తీసుకుంటారా లేదా అనే విషయంలో పెద్దగా అనుమనాలు లేవు. ఇటు పార్టీ  నుంచి గానీ అటు పరివార్ నుంచి గానీ  అటువంటి సంకేతాలు, సూచనలు ఏవీ కనిపించడం లేదు.  నిజానికి, 2029 ఎన్నికల తర్వాత కూడా  మోదీ నే ప్రధాని  అని అమిత్ షా సహా  ముఖ్య నాయకులు మరి కొందరు అనేక సందర్భాలాలో స్పష్టం చేశారు. అలాగే..  ఇప్పటికైతే మోదీ మనసు కూడా రిటైర్మెంట్ ఆలోచనలు ఏ మాత్రం  కనిపించడం లేదు.  సో.. మోదీ రిటైర్మెంట్ తీసుకుంటారా, లేదా అనే విషయం పక్కన పెడితే.. బీజేపీ, సంఘ్ పరివార్ వర్గాల్లో గత కొంత కాలంగా  ప్రధాని మోదీ వారసుడు ఎవరన్న.. చర్చ జరుగుతోందన్నది మాత్రం కాదన లేని వాస్తవం. నిజానికి  ఉత్తర ప్రదేశ్ ముఖ్యమత్రి యోగి ఆదిత్య నాథ్, అమిత్ షా తో పాటుగా మరికొన్ని పేర్లు కూడా  ప్రధాని రేసులో ఉన్నట్లు మీడియా చర్చల్లో  వినిపిస్తున్నాయి. సో .. 2029 ఎన్నికల్లో కొత్త చిత్రం’ చూస్తారు అంటూ చేసిన గడ్కరీ ప్రకటన.. సమయం సందర్భం దృష్ట్యా కూడా ప్రాధాన్యత సంతరించుకుందని అంటున్నారు.   నిజానికి..  ఇప్పుడే కాదు  గతంలోనూ ప్రధాని పదవికి గడ్కరీ పేరు   ప్రముఖంగా తెరపైకొచ్చింది. ముఖ్యంగా..  2019సార్వత్రిక ఎన్నికల సమయంలో బీజేపీకి సంపూర్ణ మెజారిటీ రాని పక్షంలో సౌమ్యు డు, వివాద రహితుడుగా పేరున్న గడ్కరీ ప్రధాని రేసులో ఉంటారనే  చర్చ జరిగింది. అయితే..  2019లో ఆ అవసరం రాలేదు.  బీజేపీ సొంతంగానే మెజారిటీ (303)  సాధించింది. ఎన్డీఏ మెజారిటీ మరింత పెరిగింది. మోదీ  మళ్ళీ ప్రధాని అయ్యారు.  2024లో బీజేపీ సొంత బలం కొంత తగ్గినా.. చంద్రబాబు, నితీష్ కుమార్ చెరో చేయి వేయడంతో  మోదీ  మూడవసారి ప్రధాని అయ్యారు. సో.. ఇప్పటికిప్పుడు  మోడీ ప్రధాని బాధ్యతల నుంచి తప్పుకునే పరిస్థితి  అయితే లేదు. అయితే..  2029 నాటికి, పరిసస్థితి ఎలా ఉంటుందో, ఎన్నెన్ని మార్పులు వస్తాయో చెప్పలేము.  అందుకే ఎందుకైనా మంచిదని, గడ్కరీ కర్చీఫ్ వేసి ఉండవచ్చని బీజేపీ, పరివార్ వర్గాలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

విశాఖకు ఐఎన్ఎస్ నీలగిరి

తూర్పు నౌకాదళంలోకి మరో అత్యాధునిక యుద్ధ నౌక చేరింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ముంబైలో తయారైన యుద్ధనౌక  ఐఎన్ఎస్ నీలగిరిని ఈ ఏడాది జనవరి 15న జరిగిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోడీ జాతికి అంకితం చేసిన సంగతి తెలిసిందే. ఈ యుద్ధ నౌకను  ప్రాజెక్ట్ 17A స్టెల్త్ ఫ్రిగేట్ శ్రేణిలో నిర్మించారు. ఈ పద్ధతిలో నిర్మించిన తొలి నౌక ఇది. ఈ నౌకలో వినియోగించిన  స్టెల్త్ టెక్నాలజీ  కారణంగా ఐఎన్ఎస్ నీలగిరి శత్రువు రాడార్‌లలో కనిపించదు. ఈ నౌక విశాఖ తీరానికి చేరుకుంది. ఇప్పటికే విశాఖపట్నం తూర్పు తీర నౌకాదళ ప్రధాన కేంద్రంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐఎన్ఎస్ నీలగిరి రాక విశాఖ నగర రక్షణకు అదనపు అలంబనగా ఉంటుంది.  సంప్రదాయ పద్ధతిలో ఐఎన్ఎస్ నీలగిరికి తూర్పు నౌకాదళం ఘనంగా స్వాగతం పలికింది. 

లోకేష్ చర్యలతో సత్ఫలితాలు.. ప్రభుత్వ విద్యా సంస్థల్లో వంద శాతం అడ్మిషన్లు!

జగన్ హయాంలో ప్రభుత్వ పాఠశాలలు పూర్తిగా నిర్వీర్యం అయ్యాయి. విష ప్రయోగాలకు జగన్ సర్కార్ విద్యారంగాన్ని వాడుకుంది. సంక్షుమ పథకాలకు తన పేర్లు పెట్టుకోవడం వినా జగన్ రాష్ట్రంలో విద్యా రంగం అభివృద్ధికి చేసిందంటూ ఏమీ లేని పరిస్థిది. జగన్ ఐదేళ్ల హయాంలో రాష్ట్రంలో విద్యావ్యవస్థ దాదాపు కుప్ప కూలిపోయిన పరిస్థితి. అమ్మఒడి అంటూ పథకాన్ని ప్రవేశ పెట్టినా దానిలో కోతలు.  ప్రస్తుత తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ విద్యావ్యవస్థ ను బలోపేతం చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసే లక్ష్యంతో చర్యలు చేపట్టింది. మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా తీసుకున్న చర్యల కారణంగా రాష్ట్రంలో ప్రభుత్వ విద్యావ్యవస్థ బలో పేతమైంది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ప్రభుత్వ కళాశాలలు, పాఠశాల్లో సీట్లు వందశాతం భర్తీ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల మాదిరి ప్రభుత్వ విద్యా సంస్థలలోనూ అడ్మిషన్ల్స కంప్లీటడ్ , సీట్స్ ఫిల్, అడ్మిషన్స్ క్లోజ్ డ్ అన్న బోర్డులు దర్శనమిస్తున్న పరిస్థితి. టెక్కలి, నెల్లూరు ఇలా  చోట్ల  సీట్స్ కంప్లీటడ్ అన్న బోర్డులు ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలలో కనిపించాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియాలో పోస్టు చేసి రాష్ట్రంలో విద్యా వ్యవస్థ బలోపేతమౌతోందనడానికి నిదర్శనమిదిగో అని పేర్కొంటూ హర్షం వ్యక్తం చేశారు.   ఈ పరిస్థితి అంత లేలికగా ఏమీ రాలేదు. గత ఏడాది సార్వత్రి ఎన్నికలలో విజయం సాధించి అధికార పగ్గాలు చేపట్టిన అనంతరం తెలుగుదేశం కూటమి సర్కార్ విద్యా రంగంపై ప్రత్యేక దృష్టి సారించింది. మంత్రి లోకేష్ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకువచ్చే దిశగా చర్యలు చేపట్టారు. పాఠశాలలలో టీచర్ల కొరత లేకుండా చర్యలు తీసుకున్నారు. పాఠశాలల రూపురేకలు మార్చే విధంగా చర్యలు చేపట్టారు. ఆ కృషి ఫలితాలు ప్రస్తుత విద్యా సంవత్సరంలో కనిపిస్తున్నాయి. ప్రజలలో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలో నాణ్యమైన, మెరుగైన విద్య అందుతుందన్న నమ్మకం విద్యార్థలు తల్లిదండ్రులలో ఏర్పడింది. దీంతో ప్రస్తత విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల స్ట్రెంగ్త్ అనూహ్యంగా పెరిగింది. విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలలో చేర్చేందుకు మొగ్గు చూపుతున్నారు. దాని ఫలితమే పలు స్కూళ్లల్లో విద్యా సంవత్సరం ప్రారంభమ్యే సరిగే సీట్లు భర్తీ అయిపోవడం. రాష్ట్ర వ్యాప్తంగా అధిక శాతం సర్కారీ బడుల్లో అడ్మిషన్ల ప్రారంభం నాటికే 90 శాతానికి పైగా సీట్లు భర్తీ అయిపోయాయి.  

భయపెట్టడమేనా వైసీపీ బ్రాండ్?

  ఆవిర్భావం నుంచీ భయపెట్టడమే తన బ్రాండ్  అన్నట్లుగా వైసీపీ తీరు ఉంది. అధికారంలో ఉన్నా, లేకపోయినా వైపీపీ జనాలను భయపెట్టి సాగుతోంది. 2014 ఎన్నికలలో ప్రతిపక్ష హోదా దక్కిన వైసీపీ అప్పుడూ జనాలను భయపెట్టే తీరుతోనే సాగింది. తాను చేసిన తప్పులకు కూడా అప్పటి అధికార పక్షంపై నెపం నెట్టి ప్రజలలో సానుభూతి సంపాదించుకుంది. ఆ తరువాత 2019 ఎన్నికలలో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన తరువాత కూడా వైసీపీ సర్కార్ తీరు మారలేదు. అధికారంలో ఉండగా తీసుకున్న నిర్ణయాలు, వ్యవహరించిన తీరుతో వైసీపీ అంటేనే జనం వణికిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ కారణంగానే 2024 ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైసీపీని దారుణంగా ఓడించారు. కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా వైసీపీకి అర్హత లేదని తీర్పు ఇచ్చారు. జగన్ పాలన వద్దు అన్న నిర్ణయానికి ప్రాంతాలకు అతీతంగా జనం అంతా ఏకాభిప్రాయానికి వచ్చారన్న విషయాన్ని ఆ ఎన్నికల ఫలితాలు నిర్ద్వంద్వంగా తేల్చేశాయి. జగన్ సొంత జిల్లా కడపలోనూ  వైసీపీ చావు దెబ్బ తింది. స్వయంగా జగన్ పోటీ చేసిన పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం లో కూడా ఆయన మెజారిటీ గణనీయంగా తగ్గింది. ఇక కడపలోని పది నియోజకవర్గాలలోనూ తెలుగుదేశం కూటమి ఏడు నియోజకవర్గాలలో విజయకేతనం ఎగుర వేసిందంటేనే జగన్ తన అడ్డాగా చెప్పుకునే జిల్లాలో జనం ఆయనను ఎంత వ్యతిరేకించారో అర్ధమౌతుంది. ఇక ఆ ఎన్నికలలో జగన్ పార్టీ కేవలం 11 అంటే 11 స్థానాలకు పరిమితమైంది.  అయినా కూడా వైసీపీ తీరు ఇసుమంతైనా మారలేదు. ఓడించిన జనంపైనే ఆ పార్టీ కక్ష గట్టిందా అన్నట్లుగా.. 2024 ఎన్నికల ఫలితాలు వచ్చిన ఏడాది తరువాత వెన్నుపోటు దినం నిర్వహించి జనం తనను వెన్నుపోటు పొడిచారంటూ చాటింది. అంతే కాకుండా మళ్లీ అధికారంలోకి వచ్చి రప్పరప్ప నరుకుతాం అంటూ హెచ్చరికలు జారీ చేసే విధంగా వ్యవహరిస్తున్నది. బెదరించి గెలిచేద్దాం అన్న మోడల్ లో ఇప్పటికీ ఫాలో అవుతోంది.  ప్రజలలో మమేకం అవ్వడం కాదు.. వారిని బెదరించి, భయపెట్టి ఓట్లు వేయించుకోవాలన్న లక్ష్యంగా ముందుకు కదులులోందా అనిపించేలా ఆ పార్టీ కార్యక్రమాలు, జగన్, ఇతర వైసీపీ నేతల ప్రసంగాలు ఉంటున్నాయి.   పల్నాడు జిల్లా రెంటపాళ్ల జగన్ పర్యటన సందర్భంగా  ఆ పార్టీ క్యాడర్ ప్రదర్శించిన ఫ్లెక్సీలు  కూడా అదే చాటుతున్నాయి. అలాగే ఆ పర్యటనలో జగన్ ప్రయాణిస్తున్న వాహనం ఢీ కొని ఒక వ్యక్తి మరణించినా కూడా కనీసం వాహనం ఆపకుండా ముందుకు సాగిపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తున్నది. దీంతో వైసీపీ అన్నా,  జగన్ పర్యటన అన్నా జనం భయంతో వణికిపోతున్న పరిస్థితులు ఉన్నాయి.  ఆ పార్టీ తీరు ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికలలో ఆ పార్టీకి  చట్టసభలో ప్రాతినిథ్యం  కూడా లేకుండా పోయే పరిస్థితి ఎదురైనా ఆశ్చర్యం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

జగన్ పై కేసు..ధృవీకరించిన గుంటూరు ఎస్పీ

మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ పై కేసు నమోదు చేసినట్లు గుంటూరు ఎస్పీ  సతీష్ కుమార్ ధృవీకరించారు. ఆదివారం రాత్రి మీడియాతో మాట్లాడిన ఆయన   స‌త్తెన‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం రెంట‌పాళ్ల‌లో జగన్ ఈ నెల 18న ప‌ర్య‌టించిన స‌మ‌యంలో  ఆయన అన్ని నిబంధనలనూ ఉల్లంఘించారని స్పష్టం చేశారు.  జగన్ వాహనం ఢీ కొనడం వల్లనే సింగయ్య మరణించారని తేలిందన్నారు. తొలుత సింగయ్య ను ఢీ కొన్నది జగన్ కాన్వాయ్ వాహనం కాదనీ, ప్రైవేటు వాహనమనీ తమకు సమాచారం అందిందనీ, అయితే ఆ తరువాత పలువీడియోలను స్వాధీనంన చేసుకుని పరిశీలించి జగన్ ప్రయాణిస్తున్న  వాహనం ఢీ కొనడం వల్లే సింగయ్య మరణించినట్లు థృవీకరించుకున్నట్లు తెలిపారు. సింగయ్యను ఢీ కొట్టిన తరువాత కూడా వాహనం ఆపకుండా కొంత దూరం ఈడ్చుకుపోయినట్లు కూడా తేలిందని చెప్పారు.  వాస్తవానికి మాజీ సీఎం హోదాలో జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌కు 100 మంది అనుచ‌రులు, కార్య‌క‌ర్త‌ల‌ను, 14 వాహ‌నాల కాన్వాయ్‌కి మాత్ర‌మే అనుమ‌తి ఇచ్చామ‌నిఅయితే జగన్ మాత్రం  తాడేప‌ల్లి నుంచి   50 వాహ‌నాల‌తో వ‌చ్చార‌ని.. దారి పొడ‌వునా హంగామా చేశారని తెలిపారు. ఇవ‌న్నీ.. పోలీసు యాక్టు 30/2 మేర‌కు ఉల్లంఘ‌న‌లేన ని చెప్పారు. దీనిపైనా కేసు న‌మోదు చేసిన‌ట్టు చెప్పారు. అయితే.. సింగ‌మ‌య్య మృతిపై ఆయ‌న స‌తీమ‌ణి  ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తాజాగా మ‌రో కేసు న‌మోదు చేసిన‌ట్టు తెలిపారు. కాన్వాయ్‌కు ఇచ్చిన అనుమ‌తులు,  పోలీసుల నిబంధ‌న‌లు ఉల్లంఘించి జ‌గ‌న్ త‌ప్పు చేశార‌ని ఎస్పీ పేర్కొన్నారు. ఈ క్ర‌మంలో మాజీ మంత్రులు పేర్ని నాని, విడ‌ద‌ల ర‌జ‌నీ, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, మాజీ సీఎం పీఎ నాగేశ్వ‌ర‌రెడ్డిల‌పై కేసులు న‌మోదు చేశామ‌ని, బీఎన్ ఎస్ సెక్ష‌న్ల కింద కేసులు పెట్టామ‌ని వివ‌రించారు. చ‌ట్ట‌ప‌రంగా  చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని తెలిపారు. 

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సోమవారం (జూన్ 23) శ్రీవారి దర్శనానికి వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండియపోయి భక్తుల క్యూలైన్ కృష్ణ తేజ గెస్ట్ హౌస్ వరకూ సాగింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక టైమ్ స్లాట్ దర్శనానికి దాదాపు 6 గంటల సమయం పడుతోంది. అలాగే 300 రూపాయల వ్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులకు శ్రీవారి దర్శనం కావడానికి ఐదు గంటలకు పైగా సమయం పడుతోంది.  ఆదివారం (జూన్ 22) స్వామివారిని మొత్తం 87 వేల 254 మంది దర్శించుకున్నారు. వారిలో 33 వేల 777 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 4 కోట్ల 28 లక్షల రేపాయలు వచ్చింది. 

పాక్ ఎటు వైపు ?.. ఇరాన్ వైపా? అమెరికా వైపా?

అడ్డ కత్తెరలో పోక చెక్క  అనే సామెత అతికినట్లు అక్షరాలా సరిపోయే ఏకైక దేశం పాకిస్తాన్.  ఎందుకంటే  2026 నోబుల్ శాంతి బహుమతికి అమెరికా అధ్యక్షుడ్ని ఎంపిక చేయాలని శనివారం (జూన్ 21)  అన్న పాకిస్థాన్   ఆదివారం (జూన్ 22) మాట మార్చేసింది.   ఇజ్రాయెల్ తో కలసి ఇరాన్ పై బాంబులు వేసిన అమెరికాను వ్యతిరేకించింది. ఇరాన్ ను వెనకేసుకు వచ్చింది.  దీంతో దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది అమెరికా అధ్యక్షుల వారికి.  అరే ఇదేంటి.. పాకిస్థాన్ కి మనం ఇంత చేస్తుంటే అలా అనేసిందేంటని? వాపోవడం ట్రంప్ వంతు అయ్యింది. ఎవరు అవునన్నా కాదన్నా పాక్ ఇస్లామిక్ రెవల్యూషన్ కి కట్టుబడక తప్పదు.   ఇరాన్ యూఎస్ రెండింటిలో పాక్ ఎటువైపు అంటే..   ఆ దేశానికున్న మత ఛాందస వాదం కారణంగా ఇరాన్ వైపు ఉండాల్సిందే.  కానీ అటు అమెరికా  పాక్ కి బిలియన్ డాలర్ల కొద్దీ ఇటు ఐఎంఎఫ్, అటు వరల్డ్ బ్యాంకు నుంచి నిధులు ఇప్పిస్తోంది. అంతే కాదు.. తన సొంత సంస్థ చేత కూడా పెట్టుబడులు పెట్టిస్తున్నారు ట్రంప్. ఇంత పెద్ద ఆపరేషన్ సింధూర్ తర్వాత పాక్ ఈ మాత్రమైనా కోకుకుందంటే అది అమెరికా చలవే అనడంలో సందేహం లేదు.  గతంలో  యూఎస్ నుంచి పూర్తి సహాయ సహకారాలను కోల్పోయాక తన భూభాగంలోని బెలూచిస్తాన్ ని పణంగా పెట్టి చైనాతో చెలిమి చేసింది. అంతేనా ఆ సమయంలో చైనా అధ్యక్షుడు పాక్ వచ్చినపుడు..  తన సోదరుడి ఇంటికి వచ్చినట్టుందని  అనడం అప్పట్లో సంచలనం సృష్టించింది.  పాక్.. ఒక మతమా కాదు. ఒక భావజాలమా కాదు. అయినా సరే బలూచీ- ఖనిజాల కోసం వెంపర్లాట కారణంగా చైనా-పాకిస్థాన్ తో అలాయ్ బలాయ్ అంది.  ట్రంప్ వచ్చే వరకూ పాక్ వెనక ఉన్న దేశమేదైనా ఉందంటే అది చైనా మాత్రమే. చైనా అంతగా ఆర్ధిక అండదండలు అందిస్తూ వచ్చింది.  అయితే   ట్రంప్ రెండో సారి అమెరికా అధ్యక్షుడు అయిన తరువాత స్వరం మార్చారు. ఎలాగైనా సరే పాక్ ని కంట్రోల్లో పెట్టుకుని చైనాను కట్టడి చేయాలని స్కెచ్ వేశారు. పాక్ సైతం బెలూచిస్తాన్ వేరు పడితే.. చైనా అండదండలు ఆవిరైపోతాయని తెలిసి రివర్స్ స్కెచ్ వేసి అమెరికాతో చెలిమి మొదలు పెట్టింది. అయితే..  సరిగ్గా ఈ టైంలో ఇజ్రాయెల్ ఇరాన్ వార్ లోకి దిగడం. ఆ వార్ లో ట్రంప్  ఇజ్రాయెల్ కి వంత పాడటంతో  ఇప్పుడు పాక్ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా మారింది.  అయితే నైతికంగా ఎలాంటి విలువలు లేని కంట్రీ కాబట్టి.. ఈ బాయికాడ ఈ పాట- ఆ బాయికాడ ఆ పాట పాడుతూ  మేనేజ్ చేస్తోంది. అందుకే ఇక్కడ ట్రంప్ కి నోబుల్ శాంతి బహుమతి ఇవ్వాలన్న నోటితోనే ఆయన బాంబులు కురిపిస్తున్న ఇరాన్ కు మద్దతుగా ప్రకటనలు గుప్పిస్తోందంటున్నారు విశ్లేషకులు.

జగన్ కు శవరాజకీయాలంటేనే ఇష్టమా?.. ఎందుకని?

జగన్ కి శవరాజకీయాలే కలిసివస్తున్నాయా అంటు? అంటే ఔననే అంటున్నారు విశ్లేషకులు. జగన్ తండ్రి మరణం ద్వారా  వెలుగులోకి వచ్చారు.   వైఎస్సార్ బతికి ఉంటే ఆయన రాజకీయాల్లో ఇంతగా కనిపించేవారు కారని అంటారు.  వైయస్ చనిపోవడంతో గుండె ఆగి చనిపోయారని కొందరిని   ఎంపిక చేసుకుని జగన్   ఓదార్పు యాత్ర మొదలు పెట్టారు. ఇక్కడా మరణాలే జగన్ రాజకీయ ఎదుగుదలకు సోపానాలుగా పని చేశాయి.  ఆపై 2014లో జగన్ ప్రత్యక్ష రాజకీయాల్లో తొలిగా భారీ ఎన్నికల సంగ్రామాన్ని ఎదుర్కున్నారు. కానీ, ఏమంత రాణించలేక పోయారు. కారణం 'చావుల వాసన' ఎక్కడా లేక పోవడమేనంటారు.  కట్ చేస్తే 2019 ఎన్నికల ముందు మార్చి 15న వైఎస్ వివేకా హత్య  నింద మొత్తం నాటి బాబు ప్రభుత్వం మీద వేసి, ఎలాగోలా ఆ సెంటిమెంటుతో నెగ్గుకొచ్చేశారు.  అంతేనా,  అదే ఎన్నికల ముందు.. 'డెడ్ లైన్'  పాలిటిక్స్ ప్లే చేశారు. ఇక్కడ ప్రత్యేక హోదా కోసం తన ఎంపీలను రాజీనామా చేయిస్తానని బెదిరించి బ్లాక్ మెయిల్ చేశారు.  ఆ నాటి ఎన్డీఏ నుంచి టీడీపీ కూడా బయటకొచ్చేలా చేసి నానా యాగీ చేశారు. ఎట్టకేలకు అనుకున్నది సాధించి, ఆ తర్వాత ఆ ప్రత్యేక హోదాను పక్కన పడేశారు.  కట్ చేస్తే.. అధికారం పోయింది. ఇప్పుడాయన  కేవలం పులివెందుల ఎంపీ. కనీసం ప్రతిపక్ష నేత కూడా కాదు. అయినా సరే  చావులెక్కడ ఉంటే అక్కడ వాలిపోతుంటారని  అంటారు. తన పాత కాలపు డెడ్లీ పాలిటిక్స్ కి జగన్ తెరలేపారు. అందులో భాగంగా   ఇటీవలి  పాపిరెడ్డిపల్లె ఘటనలోనూ ఒక అభిమాని చనిపోయారంటూ నానా హంగామా చేశారు. కట్ చేస్తే  రెంటపాళ్లలోనూ నాగమల్లేశ్వరరావు అనే కార్యకర్త చనిపోయిన ఏడాది తర్వాత ఓదార్చడానికి వెళ్తే.. అక్కడ మరో వ్యక్తి దుర్మరణం. సింగయ్య అనే ఒక వ్యక్తి జగన్ కారు కింద పడి మరణించడంతో.. ఆ కారు తోలిన డ్రైవర్ ని విచారిస్తున్నారు పోలీసులు.  జగన్ జీవితంలో ఎటు చూసినా ఈ రక్తసిక్త అధ్యాయాలు కనిపిస్తాయని అంటున్నారు విశ్లేషకులు.

సీఎం రేవంత్‌రెడ్డి చేతులెత్తేశాడు..ఇక బీజేపీనే రక్షణ : కిషన్‌రెడ్డి

  ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతులెత్తేశాడని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పులు ఇచ్చేవారు లేరని, నన్ను ఎవరు నమ్మేవాడు లేడని  చేతులెత్తేశాడని కేంద్ర మంత్రి అన్నారు. సికింద్రాబాద్‌లో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. ఎన్నో పోరాటాలు చేసి స్వ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం.. త్యాగాలు చేసి తెచ్చుకున్న తెలంగాణ, ఒక కుటుంబం బారినపడి ఏ రకంగా బలి అయ్యామో మనకు తెలుసన్నారు. ధనిక రాష్ట్రంగా మొదలైన తెలంగాణ.. లక్షల కోట్లు అప్పుల పాలైందని కిషన్ రెడ్డి అన్నారు.  ఇక గడిచిన ఏడాదిన్నర కాలంలో కాంగ్రెస్‌ను నమ్మి ఓటేస్తే  ఆరు గ్యారెంటీల పేరుతో మోసిందన్నారు. మహిళలు, రైతులు, నిరుద్యోగ యువకులు, దళితులకు డిక్లరేషన్ల పేరుతో అనేక హామీలు ఇచ్చి వెన్నుపోటు పొడిచారని విమర్శించారు.  పరిపాలన చేతకాక, హామాలు అమలు చేయలేక కాంగ్రెస్‌ ప్రభుత్వం రాష్ట్రంలో చేతులెత్తేసిందని కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు.అవినీతి పాలనతో, దోపిడీ, కుంభకోణాలతో, అహంకారంతో, కుటుంబ పాలనతో తెలంగాణను దెబ్బతీశారో చూశామన్నారు. ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా బీఆర్​ఎస్​ పార్టీ ఏ రకంగా పనిచేసిందో మనం చూశామని చెప్పుకొచ్చారు.  

ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కేటీఆర్ జైలుకు వెళ్లడం ఖాయం : టీపీసీసీ చీఫ్

  స్థానిక సంస్థల ఎన్నికలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. రేపు జరిగే మంత్రి వర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. సోమవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన మహేశ్ కుమార్ గౌడ్, ఫోన్ ట్యాపింగ్ అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన  ట్యాపింగ్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రమేయంతోనే ట్యాపింగ్ జరిగినట్లు భావిస్తున్నట్లు తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కు గురైన బాధితుల పేర్లను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తక్షణమే బయటపెట్టాలని ఆయన స్పష్టం చేశారు. "ఈ వ్యవహారంలో దోషులు ఎవరైనా సరే, ఎంతటి వారైనా సరే ఉపేక్షించే ప్రసక్తే లేదు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది" అని గౌడ్ స్పష్టం చేశారు. ఈ కుంభకోణంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరూ చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సిందేనని, దోషులు ఎంతటి వారైనా జైలుకు వెళ్లడం ఖాయమని ఆయన హెచ్చరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. కోట్ల ప్రజాధనాన్ని నీళ్లలో పోసిందని ఆరోపిస్తూ ఆర్థిక దుర్వినియోగంపై తీవ్ర విమర్శలు చేశారు.  బనకచర్ల ప్రాజెక్టు విషయంలో తెలంగాణ హక్కుల కోసం వెనక్కి తగ్గమని, ఈ అంశంపై అఖిలపక్ష సమావేశం జరిగినప్పటికీ బీఆర్ఎస్ నేతలు అనవసర ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇంకా రాజకీయ నేతలు, సినీ తారలు, జడ్జీల ఫోన్లను ట్యాప్ చేసిన నీచమైన చరిత్ర బీఆర్ఎస్ పార్టీకి ఉందని మండిపడ్డారు. 2022 నుంచి 650 మంది కాంగ్రెస్ నాయకుల ఫోన్లు ట్యాప్ చేయబడ్డాయని, ఈ విషయంలో సిట్ ముందు సాక్షిగా వాంగ్మూలం ఇచ్చానని ఆయన తెలిపారు

పోలీసుల అదుపులో జగన్ కారు డ్రైవర్‌

  వైసీపీ అధినేత జగన్ కారు డ్రైవర్‌ రమణారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి నల్లపాడు పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. కారు కింద పడిన వ్యక్తిని గుర్తించారా? ఆ సమాచారాన్ని జగన్‌కు తెలియజేశారా? ప్రమాదం జరిగిన వెంటనే వాహనం ఆపకుండా ఎందుకు వెళ్లిపోయారు? తదితర విషయాలపై జగన్‌ కారు డ్రైవర్‌ నుంచి సమాచారాన్ని పోలీసులు తెలుసుకుంటున్నారు. మరోవైపు జగన్‌ పర్యటనకు సంబంధించి వీడియోలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఆయన పర్యటనను ఎవరెవరు వీడియోలు తీశారనే దానిపై ఆరా తీస్తున్నారు.  వారి నుంచి ఫుటేజీని సేకరిస్తున్నారు. కాగా జగన్ పల్నాడు పర్యటనలో సింగయ్య అనే వ్యక్తి కారు టైరు కింద పడి మృతి  చెందిన వీడియో వైరల్ అవుతుంది. ఈ కేసులో A1గా కారు డ్రైవర్ రమణారెడ్డిని, A2గా వైఎస్ జగన్‌ను, A3గా కారు యజమానిని చేర్చాలని పోలీసులు నిర్ణయించారు.ఈ నేపథ్యంలోనే ఎఫ్ఐఆర్‌లో అదనంగా 304 పార్ట్ 2 సెక్షన్ వర్తించే అవకాశం ఉంది. బీఎన్‌ఎస్ చట్టంలోని సెక్షన్ 105 కింద కేసు నమోదు చేసే అవకాశం కూడా ఉంది. ఎఫ్ఐఆర్‌లో సెక్షన్స్ మార్చి కోర్ట్ మెమో పంపాలని అధికారులు నిర్ణయించారు. 

బసవతారకం ఆస్పత్రి సిల్వర్ జూబ్లీ వేడుకలు.. పాల్గొన్న గవర్నర్‌

  హైదరాబాద్‌‌లోని బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రిలో  సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఆస్పత్రి ఛైర్మన్‌ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ పైలాన్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి దామోదర  మాట్లాడారు. సిల్వర్ జూబ్లీ సందర్భంగా బసవతారకం ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది, మేనేజ్‌మెంట్‌కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. క్యాన్సర్‌ వ్యాధితో మరణించిన ఎన్‌టీఆర్‌ సతీమణి బసవతారకం పేరు మీద 25 ఏళ్ల క్రితం ఏర్పాటైన ఈ ఆస్పత్రి.. ఇప్పటివరకు లక్షల మంది రోగులకు వైద్య సేవలు‌ అందించిందని గుర్తుచేశారు.ఎన్టీఆర్ ఐకానిక్ లీడరని, లెజెండరీ యాక్టరని మంత్రి కొనియాడారు. ఈ సందర్బంగా ఆస్పత్రి ఛైర్మన్‌ బాలయ్య మాట్లాడుతు తన తల్లి బసవతారకం కోరిక మేరకు ఈ క్యాన్సర్‌ ఆస్పత్రి స్థాపించటం జరిందని అన్నారు.  క్యాన్సర్‌ పేషెంట్స్‌కు అండగా ఉండటం కోసం ఎంతో మంది దాతలు ఆస్పత్రికి సహాయ సహకారాలు అందించారని పేర్కొన్నారు. డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతోనో లేక లాభాలు పొందాలనే ఆశతోనో ఈ ఆస్పత్రిని ప్రారంభించలేదని ఈ సందర్భంగా బాలకృష్ణ చెప్పారు. తనకు దామోదర రాజ నరసింహ పేరుతో ఒక సినిమా చేయాలని ఉందన్నారు. 110 పడకలతో మొదలై.. నేడు దేశంలోనే అత్యున్నత ఆస్పత్రుల్లో ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంది. త్వరలోనే 1000 పడకలతో అమరావతిలోనూ క్యాన్సర్‌ వైద్యశాల ఏర్పాటు చేస్తాం. మొదటి దశలో 300 పడకలతో ప్రారంభిస్తాం. మాకు అన్నివిధాలుగా సహకారం అందిస్తోన్న తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు, ముఖ్యమంత్రులకు ధన్యవాదాలు’’ అని బాలయ్య అన్నారు.  బాలకృష్ణ దాతృత్వం కలిగిన నటుడు, నేత. పేదలకు మంచి వైద్యం అందించాలనేదే బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రి లక్ష్యమని గవర్నర్ జిష్ణుదేవ్ అన్నారు . రానున్న కాలంలోనూ పేదలకు మెరుగైన సేవలు అందించాలని కోరుకుంటున్నామని ఆయన తెలిపారు. తెలంగాణలో ప్రతి ఏటా 50 నుంచి 55 వేల మంది కొత్తగా క్యాన్సర్‌ బారిన పడుతున్నారని మంత్రి రాజనర్సింహ తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మొబైల్ క్యాన్సర్‌ స్క్రీనింగ్ యూనిట్లను ప్రారంభించబోతున్నామని మంత్రి తెలిపారు. ప్రతి జిల్లాలో క్యాన్సర్‌ కేర్ సెంటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించామని చెప్పారు. త్వరలోనే వీటిని ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని, క్యాన్సర్‌ స్క్రీనింగ్, డయాగ్నొస్టిక్‌, డే కేర్ కీమోథెరపి, పాలియేటివ్ కేర్ వంటి సేవలన్నీ ఈ సెంటర్లలో‌ అందిస్తామని అన్నారు.  

విజయ్ దేవరకొండపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు.. ఎందుకంటే?

  టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండపై హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీసు స్టేషన్‌లో ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైంది. రెట్రో ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో గిరిజనులను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని ఆయనపై గిరిజన సంఘాలు ఫిర్యాదు చేశాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పాక్ మీద ఇండియా ఎటాక్ చేయాల్సిన పనే లేదని.. అక్కడి ప్రజలకు విరక్తి వచ్చి వాళ్ల ప్రభుత్వం వాళ్లే మీద ఎటాక్ చేస్తారన్నారు. కరెంట్, నీళ్లు లేకుండా ఆ దేశంలో పరిస్థితులు ఇదే విధంగా కంటిన్యూ అయితే..500 ఏళ్ల క్రితం ట్రైబల్స్ కొట్టుకున్నట్లు బుద్ధి లేకుండా, పని లేకుండా కొట్లాడుతారన్నారు. మనమంతా సమష్టిగా కలిసి ఉండాలి’ అని అన్నారు. విజయ్‌ దేవరకొండ ఆదివాసులను అవమానించేలా మాట్లాడారని ట్రైబల్స్‌ లాయర్స్‌ అసోసియేషన్‌ బాపూనగర్‌ అధ్యక్షుడు కిషన్‌రాజ్‌ చౌహాన్‌ కిషన్ సహా గిరిజన సంఘాలు తప్పుబట్టాయి.

పహల్గామ్ ఉగ్రదాడి కేసులో కీలక పురోగతి

  జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడి కేసులో ఎన్ఐఏ పురోగతి సాధించింది. టెర్రరిస్టులకు ఆశ్రయమిచ్చిన ఇద్దరిని ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చిన పర్వీజ్ అహ్మద్, బషీర్‌ను అదుపులోకి తీసుకున్నారు. హిల్ పార్క్‌కు చెందిన  బషీర్  అహ్మద్ ఉగ్రవాదులకు సాయం చేశారని ఎన్ఐఏ తెలిపింది. ఈ ఘటనలో లష్కరే తొయిబాకు చెందిన ముగ్గురు పాక్ ఉగ్రవాదుల హస్తమున్నట్లు ధ్రువీకరించింది.  అరెస్టు చేసిన ఇద్దరు నిందితులపై చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం (యూఏపీఏ)లోని సెక్షన్ 19 (ఉగ్రవాదికి ఆశ్రయం కల్పించినందుకు శిక్ష) కింద కేసు నమోదు చేసినట్లు ఎన్ఐఏ తెలిపింది. ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు స్పష్టం చేశారు.ఏప్రిల్ 22న పహల్గాంలోని ప్రముఖ ప్రాంతమైన బైసరన్‌ లోయలో పర్యాటకులపై ఉగ్రవాదులు పాశవిక దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 26 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. దీనికి ప్రతీకారంగా ఉగ్రవాదుల పీచమణిచేందుకు భారత సైన్యం ‘ఆపరేషన్‌ సిందూర్‌’ చేపట్టి పాక్‌, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేసిన విషయం తెలిసిందే.   

సత్తెనపల్లిలో సింగయ్యని తొక్కించింది జగన్ కారే

    మాజీ సీఎం జగన్ ఇటీవల గుంటూరు జిల్లా సత్తెనపల్లి పర్యటనలో రోడ్డు సింగయ్య అనే వ్యక్తి మృతి షాకింగ్ వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది.  సింగయ్య తొలుత జగన్ కాన్వాయ్‌లోని వాహనం ఢీకొని మృతి చెందాడని భావించారు. అయితే, జగన్ కారే స్వయంగా సింగయ్య మెడపై నుంచి వెళ్లిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  సింగయ్యను ఢీకొట్టింది సాక్షాత్తూ జగన్ ప్రయాణించిన వాహనమేనని న్యూస్ రావడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఘటన జరిగిన ప్రదేశంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించడంతో పాటు, ప్రత్యక్ష సాక్షుల నుంచి వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.ఈ క్రమంలో పోలీసులకు కీలకమైన వీడియో ఆధారం లభించింది. జగన్ ప్రయాణిస్తున్న కారు చక్రాల కింద ఓ వ్యక్తి పడి నలిగిపోతున్న దృశ్యాలు ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నాయి.  వీడియోలో జగన్ కారు పైనుంచి వైసీపీ పార్టీ కార్యకర్తలకు అభివాదం చేస్తుండగా, అదే సమయంలో ఓ కార్యకర్త (సింగయ్య) కారు టైర్ల కింద పడి నలిగిపోవడం స్పష్టంగా రికార్డయింది. మరో వీడియోలో, కారు కింద వృద్ధుడు పడినట్టు స్థానికులు కేకలు వేస్తున్నా, వాహనాన్ని ఆపకుండా ముందుకు పోనిచ్చినట్టు కనిపించింది. జగన్ కాన్వాయ్ వాహనం కాకుండా వేరే వాహనం తగిలి ప్రమాదంలో సింగయ్య చనిపోయాడు గతంలో గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్  తెలిపారు. ఈ వీడియో బయటకు రావడంతో సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సింగయ్య మృతికి కారణమైన వారిపై, ముఖ్యంగా జగన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంతటి దారుణ ఘటన జరిగినా, తన కాన్వాయ్ కారణంగా సొంత పార్టీ కార్యకర్త మరణిస్తే కనీసం సంతాపం కూడా వ్యక్తం చేయకపోవడంపై జగన్ తీరును పలువురు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

సోనియా గాంధీ..ఇరాన్ వైపు ఎందుకున్న‌ట్టు ఆమె క్రిష్టియ‌న్ క‌దా?

  కాంగ్రెస్ ని బేసిగ్గా ఖాన్.. గ్రెస్ అని అంటారు. ఎందుకంటే ఈ పార్టీ తొలి  నుంచి ముస్లిం ప్రీతి  పాత్ర‌మైన పార్టీగానే పేరు సాధిస్తూ వ‌చ్చింద‌ని చెబుతారు. ఇదంతా ఇలా ఉంటే సోనియా గాంధీ ఫ‌క్తు క్రిష్టియ‌న్. ఒక వేళ ఆమె ఇరాన్- ఇజ్రాయెల్ మ‌ధ్య యుద్ధం జ‌రుగుతుంటే స‌పోర్ట్ చేయాల్సింది ఇజ్రాయెల్ కి. కార‌ణం ఆమె పాటించే క్రైస్త‌వం పుట్టిందే ఇజ్రాయెల్ లోని బెత్లెహామ్ లో. బెత్లెహామ్ జెరూస‌లేమ్ కి ద‌క్షిణంగా ప‌ది కిలోమీట‌ర్ల దూరంలో ఉండే ఒకానొక చిన్న ప‌ట్ట‌ణం. బైబిల్ ప్ర‌కారం.. ఏసు ఒక తొట్టెలో ఇక్క‌డ మ‌రియా జోసెఫ్ ల కుమారుడిగా జ‌న్మించాడు. ఇక్క‌డి చ‌ర్చ్ ఆఫ్ నేటివిటీని ఏసు జ‌న్మ‌స్త‌లంగా భావిస్తారు.మీరు కావాలంటే చూడండి.. భార‌త్ లోని అత్య‌దిక క్రైస్త‌వులు.. ఇరాన్ వైపా ఇజ్రాయెల్ వైపా అంటే తాము ఇజ్రాయెల్ వైపేనంటారు.  కార‌ణం ఇజ్రాయెలే క్రైస్త‌వ జ‌న్మ‌స్థ‌లి  కాబ‌ట్టి వారి అభిమానం అలా ఉంటుంది.  కానీ ఇక్క‌డ చూస్తే సోనియాగాంధీ ఆచారం పాటించ‌డానికి క్రైస్త‌వం పాటిస్తారు. త‌న కుమార్తెను సైతం ఒక క్రైస్త‌వుడైన రాబ‌ర్ట్ వాద్రాకిచ్చి పెళ్లి చేశారు. కానీ ఇరాన్ వైపు వంత పాడుతున్నారు. బేసిగ్గా ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధాన్ని అర్ధం చేసుకోద‌లిస్తే.. ఇక్క‌డేం క‌నిపిస్తుందంటే ఇరాన్ ద‌గ్గ‌ర అణు శ‌క్తి క‌రెక్టు కాదు. కార‌ణం ఆ నిల్వ‌ల  కార‌ణంగా హ‌మాస్, హిజ్బుల్లా త‌దిత‌ర ఇస్లామిక్ సంస్థ‌ల చేతుల్లోకి ఈ అణు శ‌క్తి మొత్తం వెళ్తుంది. గ‌తంలో ఇదే పాకిస్తాన్ అణు దేశ‌మైన‌పుడు. ఆ దేశ అణు శాస్త్ర‌వేత్త సుల్తాన్ బ‌షీరుద్దీన్.. లాడెన్ కి అణు సాంకేతిక ప‌రిజ్ఞానం ఇవ్వ‌డానికి ప్ర‌య‌త్నించాడు. ఈ విష‌యంపై ఎఫ్ బీ ఐ కూడా సీరియ‌స్ అయితే.. ఐఎస్ఐ అత‌డ్ని విచారించ‌డ‌మే కాదు అప్ప‌ట్లో అత‌డి ప‌ద‌వి నుంచి కూడా తొల‌గించారు.అందుకే ఇజ్రాయెలీ మొస్సాద్ ఇరాన్ కి సంబంధించిన అణు శాస్త్ర‌వేత్త‌ల‌ను వ‌రుస బెట్టి హ‌తం చేస్తూ వ‌చ్చింది. ఆప‌రేష‌న్ నార్నియా పేరిట 2022 నాటి నుంచి వీరిపై టార్గెట్ పెడుతూ వ‌స్తోంది.  తాజా యుద్ధంలో  కూడా ఇరాన్ అణు కేంద్రాల‌పై బాంబులు వేయ‌డం మాత్ర‌మే కాకుండా అణు శాస్త్ర‌వేత్త‌ల‌ను ఇప్ప‌టి  వ‌ర‌కూ చాలా మందిని హ‌త‌మార్చింది. ఇదంతా ఒక ప‌ద్ధ‌తి ప్ర‌కార‌మే ఇజ్రాయెల్ చేస్తోంది. దీన్ని అర్ధం చేసుకోకుండా ఇరాన్ వైపు సోనియాగాంధీ ఉండ‌ట‌మేంట‌న్న‌ది చాలా మందికి అర్ధం  కాని  ప్ర‌శ్న‌.1979 వ‌ర‌కూ ఇరాన్, ఇజ్రాయెల్ మిత్ర దేశాలే. ఎప్పుడైతే.. ఇరాన్ ఇస్లామిక్ రెవ‌ల్యూష‌న్ ప్రకారం వ్య‌వ‌హ‌రించ‌డం మొద‌లైందో అప్ప‌టి నుంచి.. ఇరాన్ మ‌త‌ప‌ర‌మైన విధానాలు పాటిస్తూ వ‌చ్చింది. లెబ‌నాన్ కి దాని ఉగ్ర సంస్థ అయిన హిజ్బుల్లాకు నిధులు, ఆయుధాలు ఇవ్వ‌డంతో పాటు ఈ తీవ్ర‌వాదుల‌కు శిక్ష‌ణ కూడా ఇవ్వ‌డం  మొద‌లైంది. ఇక హామాస్ సంగ‌తి స‌రే స‌రి. ఇరానియ‌న్ ఇస్లామిస్టులు హ‌మాస్ కి వీరాభిమానులు. ఒక వేళ ఇజ్రాయెల్ వీరిపై దాడులు చేయ‌కుంటే..  ఈ దేశం ఉనికి ఇక్క‌డి క్రైస్త‌వం మొత్తం మ‌ట్టి కొట్టుకుపోతుంది. క్రీస్తు పుట్టిన ఆన‌వాళ్ల‌ను హ‌మాస్ నామ‌రూపాల్లేకుండా చేస్తుంది.అలాంటి త‌న జ‌న్మ‌త‌హ వ‌చ్చిన క్రైస్త‌వాన్ని వ‌దిలి.. ఇరాన్ వైపు సోనియా నిలుస్తాన‌ని అన‌డంలో అర్ధ‌మేంటి? అన్న‌దెవ‌రికీ అర్ధం కావ‌డం లేదు. దానికి తోడు ఇజ్రాయెల్ ఇప్ప‌టి వ‌ర‌కూ మ‌న‌కు ఎంతో సాంకేతిక స‌హ‌కారం అందిస్తోంది. మొన్న‌టి ఆప‌రేష‌న్ సిందూర్  విష‌యంలో.. స్కై స్ట్రైక‌ర్లను మ‌నం అంత విజ‌య‌వంతంగా ప్ర‌యోగించామంటే అందుకు కార‌ణం ఇజ్రాయెల్ ఆయుధ సాంకేతిక ప‌రిజ్ఞాన‌మే. మ‌నం సంప్ర‌దాయంగా ఇజ్రాయెల్ వైపు ఉంటూ వ‌స్తున్నాం. కార‌ణం మ‌నం ఇస్లామిక్ ఉగ్ర‌వాదానికి విప‌రీత‌మైన బాధితులం. కానీ సోనియా చూస్తే తాము ఇరాన్ వైపే ఉంటామ‌న‌డంలో అర్ధ‌మేంటి? అంటే ఇస్లామిక్ తీవ్ర‌వాదానికి కొమ్ము కాస్తామ‌నా? అన్న‌ది త‌మ‌కు అర్ధం కావ‌డం లేదంటున్నారు చాలా మంది.  

ఓరినాయ‌నో..ట్రంప్‌కి నోబుల్ శాంతి బ‌హుమ‌తా?

  ఈ ప్ర‌పంచానికి ఏదో అయ్యింది. త‌న చేతుల‌కు ఇన్నేసి  ర‌క్త‌పు మ‌ర‌క‌ల‌ను అంటించుకుంటోన్న ట్రంప్ ని ఏకంగా నోబుల్ శాంతి బ‌హుమ‌తికి అది కూడా పాకిస్థాన్న లాంటి ఉగ్ర పిశాచ దేశం  ప్ర‌తిపాదించ‌డం అంటే. ఈ క‌లియుగం దాదాపు అంతానికొచ్చేసిన‌ట్టేనా. అంటే అవున‌నే తెలుస్తోంది.మొన్నంటే మొన్న యూఎస్ జ‌న‌ర‌ల్ పాక్ జ‌న‌ర‌ల్ మునీర్‌ గురించి మాట్లాడుతూ.. ఆయ‌న ఉగ్ర‌వాద నిరోధంలో కీల‌క పాత్ర పోషించార‌న‌డం ఎలాంటిదో.. ఇప్పుడు ట్రంప్ ప్ర‌పంచ యుద్ధ వాతావ‌ర‌ణం కంట్రోల్ చేస్తున్నార‌ని పాక్  కామెంట్ చేయ‌డం కూడా స‌రిగ్గా అలాంటిదేన‌ని అంటారు కొంద‌రు అంత‌ర్జాతీయ దౌత్య వ్యాపారాల నిపుణులు.మునీర్ ఎంత‌టి ఉగ్ర వ్య‌తిరేఖో, ట్రంప్ కూడా అంతటి యుద్ధ వ్య‌తిరేకి, శాంతి  పిపాసిగా చూడాల్సి వ‌స్తుంద‌ని అంటారు వీరంతా.  కార‌ణ‌మేంటంటే మొన్నంటే మొన్న జీ7 నుంచి వెళ్తూ వెళ్తూ ఫ్రాన్స్ అధ్య‌క్షుడు మెక్రాన్  ప్ర‌శ్న‌కు స‌మాధానం చెబుతూ.. కాల్పుల విర‌మ‌ణ కాదు అంత‌క‌న్నా మించి జ‌ర‌గ‌బోతుంద‌ని అన్న ట్రంప్ కి నోబుల్ శాంతి బ‌హుమ‌తా? ఇరాన్ రాజ‌ధాని టెహ్రాన్ వాసులంతా త‌మ త‌మ ఇళ్ల‌ను వ‌దిలి వెళ్లాల్సిందేన‌ని సూచించిన వ్య‌క్తికి నోబుల్ శాంతి బ‌హుమ‌తా? ఇప్ప‌టికే ప‌శ్చిమాశియాకి త‌న యుద్ధ నౌక‌ల‌ను త‌ర‌లించ‌డంతో పాటు భారీ ఎత్తున బంక‌ర్ బ‌స్ట‌ర్ బాంబుల‌ను త‌ర‌లించ‌మ‌ని ఆదేశించిన వ్య‌క్తికి నోబుల్ శాంతి బ‌హుమ‌తా? ర‌ష్యాతో ఉక్రెయిన్ యుద్దంలో ఉండ‌గానే అరుదైన ఖ‌నిజ నిల్వ‌లు త‌మ‌కు ద‌క్కేలా ఒప్పందాలు చేసుకున్న బేహారి ట్రంప్ కి శాంతి బ‌హుమ‌తా? తాము 85 కోట్ల రివార్డు ప్ర‌క‌టించిన హ‌ఫీజ్ స‌యీద్.. అక్క‌డ త‌న కొడుకు త‌ల్హాతో స‌హా ఉగ్ర విధ్వంస‌కాండ చేస్తుంటే.. అత‌డికి అత‌డి కొడుక్కీ పాక్ సైన్యం పెద్ద ఎత్తున భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేస్తుంటే.. ఉగ్ర‌వాదుల మ‌ర‌ణాల స‌మ‌యంలో సైనికాధికారులు వెళ్లి మ‌రీ వారి మృత‌దేహాల‌కు జాతీయ జెండా క‌ప్పి వ‌స్తుంటే.. సుల్తాన‌న్ బ‌షీరుద్దీన్ అనే ఒక అణు ఉగ్ర‌వాది  కొడుకు ఏకంగా  ఆ దేశ డీజీఐఎస్పీఆర్ గా  సైన్యంలో అత్యంత పెద్ద హోదాలో ఉంటే..  ఇంకా ఇంకా ఎన్నెన్నో ఉగ్ర అరాచ‌కాల‌కు కేంద్ర‌మై చేతినిండా ర‌క్త‌పు మ‌ర‌క‌లు అంటుకున్న పాక్ ఏమిటీ? అంత‌క‌న్నా  ర‌క్త‌పు మ‌ర‌క‌లు అంటించుకుంటోన్న ట్రంప్ కి నోబుల్ శాంతి బ‌హుమ‌తి కి సిఫార్సు చేయ‌డ‌మేంటి? అది కూడా మునీర్ కి ట్రంప్ విందు ఇచ్చిన మూడు రోజుల త‌ర్వాత పాక్ నుంచి ఈ ప్ర‌క‌ట‌న రావ‌డ‌మేంటి? అయితే ఇక్క‌డ మునీర్ కే ఇంత ప్ర‌యారిటీ ఏంట‌ని చూస్తే.. డ‌బ‌ల్యూఎల్ఎఫ్ వంటి త‌న  కుటుంబ సంస్థ‌లో పాకిస్తాన్నే  ఏకంగా తాక‌ట్టు పెట్టేందుకు ఆయ‌న ద‌గ్గ‌రుండి ఒప్పంద ప‌త్రాల‌పై సంత‌కాలు చేయించ‌డం వ‌ల్లే.. ఇదంతా జ‌రుగుతున్న‌ట్టు ఒక అంచ‌నా. లేకుంటే ఆప‌రేష‌న్ సిందూర్ లో వార్ ప్లాన్స్ లేవు ఓన్లీ ప్రేయ‌ర్సే అని చేతులెత్తేసిన మునీర్ కి.. యూఎస్ ఆర్మీ 250వ పెరెడ్ కి అందుకే పిలిచిన‌ట్టుగా ఒక స‌మాచారం. అంతే కాదు మునీర్ కి పాక్ చ‌రిత్ర‌లోనే  రెండో సారి  ఫీల్డ్ మార్ష‌ల్ హోదా ర‌ప్పించ‌డంలోనూ ట్రంప్ పాత్ర ఉన్న‌ట్టు తెలుస్తోంది. అలాంటి మునీర్ ఏం చేస్తాడు.. భార‌త్ పైకి ఉగ్ర‌వాదుల‌ను ప్రేరేపించేలా కామెంట్లు చేస్తాడు. ఆ త‌ర్వాత వారు.. పహెల్గాం వంటి దాడుల‌కు తెగ‌బ‌డ‌తారు. ఇక ఐఎంఎఫ్, వ‌ర‌ల్డ్ బ్యాంక్ నుంచి భారీ ఎత్తున ప్యాకేజీలు పాక్ కి రావ‌డంలోనూ ట్రంప్ పాత్ర బ‌లంగా ఉంది. ఈనిధుల్లోని కొంత మొత్తాల‌ను మ‌సూద్ అజ‌ర్ వంటి  ఉగ్ర‌నాయ‌కుల‌కు న‌ష్ట‌ప‌రిహారం కింద ఇస్తుంది  పాక్. మొన్నంటే మొన్న ప‌హెల్గాం సూత్ర‌ధారి క‌సూరీని ఐక్య‌రాజ్య స‌మితి ఉగ్ర‌వాద జాబితాలో చేర్చితే.. అదో గ‌ర్వ‌కార‌ణంగా అత‌డు ప‌బ్లిగ్గా రోడ్ల మీద తిరుగుతూ కామెంట్లు చేస్తుంటే పాక్  పిన్ డ్రాప్ సైలెన్స్. అలాంటి  పాకిస్థాన్ చేసే ప్ర‌తి ఉగ్ర చ‌ర్య‌నూ ఖండించాల్సింది పోయి విందులూ వినోదాలు గౌర‌వాలు ప‌ద‌వులతో పాటు నిధులు ఇప్పిస్తోంది ట్రంప్ స‌ర్కార్.  ఈ మొత్తం వ్య‌వ‌హారంతో పాటు చైనాకి ప్ర‌స్తుతం ఎంతో ద‌గ్గ‌ర‌గా ఉన్న  పాక్ ద్వారా ట్రంప్ ప‌రిపాల‌న మ‌రింత‌గా ఏదో ఆశిస్తున్న‌ట్టుగా భావిస్తున్నారు. దీంతో ఈ సంబంధ బాంధ‌వ్యాలు మ‌రింత‌గా బ‌ల‌ప‌డేలా ఈ రెండు దేశాలు వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్టు క‌నిపిస్తోందని అంచనా వేస్తున్నారు. తొలి ట్రంప్ పాల‌న ఇదే పాకిస్థాన్ కి హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. మీ దేశంలోని ఉగ్ర‌వాదాన్ని మీరు క‌ట్ట‌డి చేయ‌కుంటే నిధులివ్వ‌మ‌ని ఖ‌రాకండిగా చెప్పారు కూడా. అదే  సెకండ్ ట‌ర్మ్ వ‌చ్చేలోగా.. పాక్ చైనాకు మ‌రింత ద‌గ్గ‌ర కావ‌డంతో.. ఇదిగో దాన్ని బుజ్జగించి.. చైనాను దారికి తెచ్చుకోవ‌డంలో భాగంగా ట్రంప్ ఇటు మునీర్ ద్వారా త‌మ సంస్థ‌ల్లో పాక్ ని ఇన్వాల్వ్ చేయ‌డం.. అటు అత‌డి ద్వారా ఇటు భార‌త్, చైనాల‌కు ఏక కాలంలో చెక్ పెట్టేలా అడుగులు వేయ‌డం వంటివి జ‌రుగుతున్న‌ట్టు భావిస్తున్నారు నిపుణులు.అయితే ఇక్క‌డ కొస‌మెరుపు ఏంటంటే ఖ‌మైనీ అంత‌మే ధ్యేయంగా సాగుతున్న ఇజ్రాయెల్ కి ఇంత స‌పోర్ట్ చేస్తూ.. ఇదంతా శాంతి కోసం చేస్తున్న  య‌త్న‌మ‌ని.. త‌న‌లాంటి శాంతి  కాముకుల‌కు నోబుల్ శాంతి బ‌హుమ‌తి రాద‌ని ఆయ‌న‌కు ఆయ‌న రివ‌ర్స్ స్టేట్ మెంట్ ఇచ్చుకోవ‌డం ఏదైతే ఉందో.. అది ట్రంప్ కి తెలిసినంత మ‌రెవ‌రికీ తెలీద‌ని చెప్పాలంటారు దౌత్య‌నిపుణులు.