ఆ వ్యక్తి నిర్లక్ష్యానికి తెలుగురాష్ట్రాలు వ‌ణుకుతున్నాయి!

విశాఖలోని ప్రభుత్వ అంటువ్యాధుల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వృద్ధుడికి (65) కరోనా సోకినట్టు పాజిటివ్‌ రిపోర్టు వచ్చింది. ఈనెల 12 నుంచే జ్వరం ఉన్నా.. మామూలుదేనని భావించి రెండు తెలుగు రాష్ట్రాల్లో తిరిగినట్టు తెలియడంతో యంత్రాంగం అప్రమత్తమైంది. వ్యాధి లక్షణాలతో ఈనెల 17న విశాఖలోని అంటువ్యాధుల ఆసుపత్రిలో చేరారు. అతని ప్రయాణ వివరాలు చూస్తే.. * ఫిబ్రవరి 21న జెద్దా నుంచి మక్కాకు, అక్కడినుంచి మదీనాకు విమానాల్లో వెళ్లారు. * మళ్లీ మక్కా వచ్చి మార్చి 9న హైదరాబాద్‌కు వచ్చారు. * 10న విమానాశ్రయం నుంచి మెహిదీపట్నంలోని కుమార్తె ఇంటికెళ్లారు. 11న విశాఖ-కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌ బీ1 బోగీలో బయల్దేరి విశాఖకు 12న వచ్చారు. అల్లీపురంలోని ఆయన ఇంట్లో పలువురు వచ్చి కలిశారు. * 13న శుక్రవారం ఓ మసీదులో సామూహిక ప్రార్థనల్లో పాల్గొన్నారు. * 14న జ్వరంతో మంచం మీదనుంచి లేవలేకపోయారు. అదేరోజు సాయంత్రం 6.30 గంటలకు ఓ ల్యాబ్‌కు వెళ్లి పరీక్షలు చేయించుకున్నారు. * 17న మర్రిపాలెంలో వైద్యుడి వద్దకు వెళ్లగా.. ఆయన కరోనా లక్షణాలు గమనించి ప్రభుత్వ అంటువ్యాధుల ఆసుపత్రికి పంపారు. క్లినిక్‌లో ఈ వృద్ధుడు ముగ్గురు వైద్యసిబ్బందిని నేరుగా కలిశారు. తర్వాత నమూనాలు పంపిన రెండు రోజులకు వ్యాధి ఖరారైంది. * ఆయన కుటుంబంలో 58 ఏళ్ల భార్య, 18 ఏళ్ల కుమార్తె ఉన్నారు. భార్యకూ కరోనా అనుమానిత లక్షణాలు ఉండటంతో అంటువ్యాధుల ఆసుపత్రికి తరలించారు. * గోపాలపట్నంలో ఉంటున్న తల్లి, ఇద్దరు సోదరులు సన్నిహితంగా ఉన్నట్లు తెలిసి వారినీ పరీక్షలకు తరలించారు. * మర్రిపాలెంలో ఆయన్ను పరీక్షించిన వైద్యుడు హోమ్‌ క్వారంటైన్‌లో ఉంటానని తెలిపారు. ఆ వ్యక్తి నిర్లక్ష్యానికి క‌రోనా ఎంత మందికి సోకిందోన‌ని ఏపీ, తెలంగాణా అధికారులు భ‌య‌ప‌డుతున్నారు. ఇప్ప‌ట్టికైనా క‌రోనాను క‌ట్ట‌డి చేయ‌డానికి మన కోసం...మనం బ్రతికే సమాజం కోసం అప్ర‌మ‌త్తంగా వుందాం.

కుటుంబ‌స‌భ్యుల‌తో స‌ర‌దాగా బీజేపీ నేత‌లు

బీజేపీ తెలంగాణా రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ జనతా కర్ఫ్యూ లో భాగంగా కుటుంబంతో ఇంట్లో సమయాన్ని గడుపుతున్నారు. కుటుంబ‌స‌భ్యులతో స‌ర‌దాగా చెస్ ఆడుకున్నారు. ప్ర‌ధాని పిలుపు మేర‌కు ప్ర‌జ‌లంతా ఐక్య‌త ప్ర‌ద‌ర్శిస్తున్నార‌ని ఆయ‌న ఈ సంద‌ర్భంగా చెప్పారు. తెలంగాణా రాష్ట్రంలో ఈ కార్య‌క్ర‌మం విజ‌య‌వంతం అయిందని ఆయ‌న అన్నారు. ఇలాంటి క‌ర్యాక్ర‌మాన్ని చేప‌ట్టి ప్ర‌పంచానికే మార్గ‌ద‌ర్శ‌కంగా ప్ర‌ధాని మోదీ నిలిచార‌ని సంజ‌య్ అభిప్రాయ‌ప‌డ్డారు. తెలంగాణా ఈ వైర‌స్ ఉధృతి పెరుగుతున్న నేప‌థ్యంలో సి.ఎం. ఇచ్చిన పిలుపు మేర‌కు 24 గంట‌లు పాటించ‌డం సంతోష‌క‌రమ‌ని ఆయ‌న అన్నారు. మాజీ అధ్య‌క్షులు డాక్ట‌ర్ ల‌క్ష్మ‌ణ్‌. మేమంతా ఇంటికే ప‌రిమితం అయ్యాం. మీరు కూడా ఈ కార్య‌క్ర‌మంలో భాగంగా ప్ర‌జ‌లు బ‌య‌టికి వెళ్ళ‌కుండా ఐక్య‌త ప్ర‌ద‌ర్శించాలని కోరారు. కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాలు తీసుకున్న‌నిర్ణ‌యానికి ప్ర‌జ‌లంతా మ‌ద్ద‌తు తెలుపుతున్నార‌ని డాక్ట‌ర్ ల‌క్ష్మ‌ణ్‌ చెప్పారు.

విజయవాడ లో కరోనా పాజిటీవ్ కేసు

విజయవాడ నగరంలో మొదటి కరోనా పాజిటీవ్ కేసు నమోదైంది. దీంతో జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. కరోనా పాజిటీవ్ కేసు నమోదైన ప్రదేశంలో దాదాపు 500 ఇళ్ళలో మెడికల్ చెకప్ లు చేస్తున్నారు. అంతే కాడు మూడు కిలోమీటర్లమేర ప్రజలను అప్రమత్తం చేశారు. ఎవరెవరిని కలిశాడో వారిని , ఇంట్లో వారివి శాంపిల్స్ కలెక్ట్చేశాము. ప్రైవేట్ టాక్సీలో వచ్చిన వ్యక్తిని కూడా పరిశీలిస్తున్నాం. ప్రైవేట్ క్యాబ్ హైదరాబాద్ నుంచి విజయవాడ, అక్కడినుంచి గుంటూరుకు ముగ్గురు ప్యాసింజర్లను తీసుకు వెళ్లిన‌ట్లు తెలిసింది. కరోనా పాజిటీవ్ కేసు రావడంతో సిటీని హై అలర్ట్ చేశారు. ఈ కర్ఫ్యూని ఇంకో రెండు రోజులు చేస్తే బాగుంటుందే అభిప్రాయం వ్య‌క్తం అవుతోంది. అయితే సిటీలో 144 సెక్షన్ అమలులో ఉంది. విజయవాడ నుంచి గుంటూరు ప్రయాణించిన ప్రయాణికులు స్వచ్చందంగా ముందుకు రావాలని క‌లెక్ట‌ర్ పిలుపునిచ్చారు. స్వచ్చందంగా ప్రజలు గుమ్మికూడకుండా సహకరుంచాలని లేదంటే నిర్బందంగా అయినా చర్యలు తీసుకుంటామని క‌లెక్ట‌ర్ హెచ్చ‌రించారు. 

చప్పట్లు ఎందుకు కొట్టాలి? దీని వెనుక సైన్స్ వుందా?

జ్యోతిషశాస్త్రం అధ్యయనం చేసిన వారు, జ్యోతిషశాస్త్రం మరియు సైన్స్ పరిజ్ఞానం ఉన్నవారు ప్ర‌ధాని మోడీకి మార్గనిర్దేశం చేసివుంటార‌ట‌. ఎందుకంటే.... మార్చి 22 అమావాస్య. ఈ నెలలో చీకటి రోజు. అన్ని వైరస్, బ్యాక్టీరియా మరియు దుష్ట శక్తులు అటువంటి రోజుల్లో అంటే అమావాస్య రోజున గరిష్ట సామర్థ్యాన్ని మరియు శక్తిని కలిగి ఉంటాయి. ఒకేసారి 130 కోట్ల మంది 5 PM- చప్పట్లు కొట్టడంతో వైబ్రేషన్లను సృష్టించ‌బ‌డ‌తాయ‌ట‌. వైరస్ త‌న శక్తిని కోల్పోతుంది. సాయంత్రం 5 గంటలకు చప్పట్లు కొట్టడం చాలా ఆసక్తికరంగా ఉంది. ఆ సమయంలో చంద్రుడు రేవతి అనే కొత్త 'నక్షత్రా'నికి వెళుతున్నాడు. ఆడటం మరియు చప్పట్లు కొట్టడం సంచిత కంపనం శరీరంలో రక్త ప్రసరణను ప్రోత్సహిస్తుంది. పర్వతాలపై పాత శక్తి దేవాలయాలలో వారు భారీ, గాంగ్ లాంటి గంటలు కలిగి ఉండటానికి కారణం ఇదేన‌ట‌. చాలా పరిజ్ఞానం ఉన్నవారే ప్ర‌ధాని మోడీకి మార్గనిర్దేశం చేస్తున్నారు. అందుకే మీరు కూడా త‌ప్ప‌కుండా చ‌ప్ప‌ట్లు కొట్ట‌డం మ‌ర్చిపోవ‌ద్దు.

నాంపల్లి రైల్వే స్టేషన్‌లో కరోనా కలకలం

నాంపల్లి రైల్వే స్టేషన్‌లో కరోనా కలకలం సృష్టించింది. ముంబై ఎక్స్‌ప్రెస్‌లో కరోనా లక్షణాలున్న వ్యక్తిని రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అత‌ని చేతికి ఉన్న స్టాంప్‌ ఆధారంగా ప్రయాణికుడికి కరోనా లక్షణాలున్నట్టు రైల్వే పోలీసులు గుర్తించారు. వెంట‌నే అతన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. రైల్వే పోలీసులు అతడిని ప్రశ్నించారు. ఎక్కడి నుంచి వచ్చాడు, ఏ టైమ్ లో రైల్లో ప్రయాణించాడు, ఏ దేశం నుంచి వచ్చాడు అనే ప్రశ్నలు అడిగారు. అయితే ఆ వ్యక్తి మాత్రం నోరు విప్పలేదు. దీంతో అనుమానం వచ్చిన రైల్వే పోలీసులు స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తే అస‌లు విష‌యాలు బ‌య‌టికి వ‌చ్చాయి. జ‌న‌తా క‌ర్ఫ్యూ రోజు తెల్ల‌వారుఝామున 22-3-20న 05.47 గంటలు tr. నెం .17031 ముంబై ఎక్స్. PF.NO లో వచ్చారు. HYB స్టేషన్ యొక్క 6. సైరామ్ బెర్త్ అనే ఒక ప్రయాణీకుడి నుండి వచ్చిన సమాచారం మీద .బి 1 కోచ్ ఫోన్ నంబర్: 9916482332, ఒక నిందితుడు (కోవిడ్ -19 బారిన పడ్డాడు) బెర్త్ నెం. అదే కోచ్‌లో 6 మందిని అదుపులోకి తీసుకున్నారు మరియు ధృవీకరణపై అతను తన పేరు మౌసిన్ అలీ వయస్సు 33 సంవత్సరాలు ఎస్ / ఓ అర్షద్ అలీ, మొరాదాబాద్, యుపికి చెందినవాడు. ఫోన్ నంబర్: 7567432757. 21.3.20 న లాగోస్ (నైజీరియా) నుండి అబుదాభి మీదుగా ముంబై చేరుకుంది. ఈ రైలులో హైడ్‌కు మరింత ప్రయాణించారు .అతని తల్లి తన అన్నయ్యతో కలిసి మంగళల్‌హట్, హెచ్‌వైడిలో ఉంటున్నారు. అతని ఎడమ చేతి మణికట్టు మీద హోమ్ దిగ్బంధం యొక్క స్టాంప్ ఉంది. అతన్ని పిఎఫ్‌లో ఒంటరిగా ఉంచారు. నం .5 & 6. ASC / SC, IPF / HYB మరియు GRP సిబ్బంది పాల్గొన్నారు. ర్యాలీ డాక్టర్ / హెచ్‌వైబి సూచన మేరకు నిందితుడిని 108 మందికి అప్పగించారు, చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి 07.25 త‌ర‌లించారు. హైదరాబాద్ మొజంజాహిమార్కెట్ కూడలి లో ట్రాఫిక్ డీసీపీ బాబురావు మరియు ట్రాఫిక్ సిబ్బందితో కలిసి జనతా కర్ఫ్యూ పై వాహన చోదకులు అవగాహన కలిపిస్తున్నారు. ప్లేయకార్డులు పట్టుకొని కోవిడ్ 19 మహమ్మారి పై అవగాహన కలిపిస్తున్న ట్రాఫిక్ పోలీస్‌లు త‌మ విధులు నిర్వ‌హిస్తున్నారు.

బుల్లెట్ కంటే క‌రోనానే ఎక్కువ భ‌య‌పెట్టింద‌ట‌!

జ‌న‌తా క‌ర్ఫ్యూ సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లో ఖాళీగా క‌నిపిస్తున్న రోడ్లు! నిర్మానుష్యంగా మారిన పాత‌బ‌స్తీ. బుల్లెట్ కంటే క‌రోనానే హైద‌రాబాదీల‌కు ఎక్కువ‌గా భ‌య‌ప‌ట్టించింద‌ట‌. మ‌త‌క‌ల‌హాలు జ‌రిగిన‌ప్పుడు క‌ర్ఫ్యూ వున్నా ఫైరింగ్ జ‌రుగుతుంద‌ని తెలిసినా జ‌నం రోడ్ల‌మీద‌కు వ‌చ్చి అల్ల‌ర్లు చేసేవార‌ట‌. బుల్లెట్‌ల‌ను కూడా లెక్క చేసేవారు కాద‌ట‌. అయితే క‌రోనా సంద‌ర్భంగా ప్ర‌క‌టించిన జ‌న‌తా క‌ర్ఫ్యూ స‌క్సెస్ చూస్తుంటే క‌రోనాతో ప్ర‌జ‌లు ఎంత ఆందోళ‌న చెందుతున్నారు అర్థ‌మ‌వుతుందంటున్నారు పోలీసులు. స్వ‌చ్ఛందంగా జ‌న‌తా క‌ర్ఫ్యూ ను అమ‌లు చేస్తూ జ‌నం ఎవ‌రూ బ‌య‌టికి రాలేదు. ఆదివారం అయినా హైద‌రాబాద్ ర‌ద్దీగానే క‌నిపిస్తోంది. ఎందుకంటే హాలిడే కాబ‌ట్టి చాలా మంది షాపింగ్ కోసం చార్మినార్ వైపే ప్ర‌యాణం చేస్తారు. పైగా రోడ్డు పైనే అతి త‌క్కువ ధ‌ర‌కు అన్ని ర‌కాల వ‌స్తువులు ల‌భించే అవ‌కాశం చార్మినార్ ప‌రిస‌ర ప్రాంతాల్లో దొరుకు తుంది. అందుకే జ‌నంతో ఓల్డ్ సిటీ ర‌ద్దీగా క‌నిపిస్తుంది. అయితే ఈ రోజు జ‌న‌తా క‌ర్ఫ్యూ కార‌ణంగా రోడ్ల‌న్నీ బోసి పోయి క‌నిపిస్తున్నాయి. జ‌నం బ‌య‌టకు రావ‌డం లేదు. గ‌తంలో ఎప్పుడో మ‌త‌క‌ల‌హాలు జ‌రిగిన‌ప్పుడు ఇలాంటి సీన్‌యే క‌నిపించేది. ఇప్ప‌డు క‌రోనా దెబ్బ‌కు జ‌నం భ‌య‌ప‌డి ఇళ్ల నుంచి బ‌య‌టికి రావ‌డం లేదు. ఎక్క‌డా వాహ‌నాలు క‌నిపించ‌డం లేదు. రోడ్ల‌పై అమ్ముకునే వ్యాపార‌స్థులు సైతం త‌మ వ్యాపారాల‌ను బంద్ చేసుకుని ఇళ్ల‌కే ప‌రిమితం అయ్యారంటే క‌రోనా భ‌యం జ‌నాన్ని ఏ మేర‌కు ప్ర‌భావం చూపిస్తుందో అర్థం చేసుకోవ‌చ్చు. మ‌రో వైపు ట్రాఫిక్ పోలీసులు చౌర‌స్తాల‌ వ‌ద్ద ప్లేయకార్డులు పట్టుకొని కోవిడ్ 19 మహమ్మారి పై అవగాహన కలిపిస్తున్న దృశ్యాలే క‌నిపిస్తున్నాయి కానీ జ‌నం ఎక్క‌డ రోడ్ల మీద క‌నిపించ‌డం లేదు. ఉద‌యం కేవ‌లం న్యూస్ పేప‌ర్‌, ఇళ్ల‌కు పాలు వేసే వారే రోడ్ల మీద క‌నిపించారు. హైదరాబాద్ మొజంజాహిమార్కెట్ కూడలి లో ట్రాఫిక్ డీసీపీ బాబురావు మరియు ట్రాఫిక్ సిబ్బందితో కలిసి జనతా కర్ఫ్యూ పై వాహన చోదకులు అవగాహన కలిపిస్తున్నారు. ట్రాఫిక్ పోలీస్‌లు త‌మ విధులు నిర్వ‌హిస్తున్నారు. గ‌తంలో మ‌త‌క‌ల‌హాలు జ‌రిగిన సంద‌ర్భంగా క‌ర్ఫ్యూ విధించిన‌ప్ప‌ట్టికీ జ‌నం గ్రూప్‌లు గ్రూప్‌లుగా ఒకే సారి రోడ్ల‌పైకి వ‌చ్చే వారు. పోలీసు ఫైరింగ్ చేస్తార‌నే భ‌యం కూడా లేకుండా వ‌చ్చే వారు. అయితే పోలీస్ బుల్లెట్ కంటే క‌రోనాకే ఓల్డ్ సిటీ ప్ర‌జ‌లు భ‌య‌ప‌డ్డార‌ని పోలీసులు ఆస‌క్తిగా చ‌ర్చించుకుంటున్నారు.

కరోనా కారణంగా ఉద్యోగుల విధుల నిబంధనలు సడలించిన ఏ.పి . సర్కార్ 

కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వ కార్యాలయాల్లో ను చర్యలు చేపడుతూ ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.   సాధారణ పరిపాలన శాఖ జారీ చేసిన ఈ ఉత్తర్వుల ప్రకారం, సచివాలయంలో సెక్షన్, అసిస్టెంట్ సెక్షన్ అధికారుల సహా దిగువ స్థాయి కేడర్ లోని ఉద్యోగులంతా రెండు గ్రూప్ లు గా ఏర్పడి ప్రత్యామ్నాయ వారాల్లో విధులకు హాజరు కావలసి ఉంటుంది. ఇంటి వద్ద నుంచే పని చేసేందుకు అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చిన ప్రభుత్వం .అటు హెచ్ ఓ డి కార్యాలయాలు, జిల్లాల కార్యాలయాల్లో ను రెండు గ్రూప్ లు గా ఉద్యోగుల విధులకు హాజరు కావొచ్చని స్పష్టం చేసిన ప్రభుత్వం.గెజిటెడ్ అధికారులు మాత్రం విధులకు హాజరు కావాలని సాధారణ పరిపాలన శాఖ స్పష్టం చేసింది.  60 ఏళ్ల వయసు పైబడిన సలహాదారు లు, చైర్ పర్సన్లు ఇంటి వద్ద నుంచే పని చేయాలని ఆదేశాలు.50 ఏళ్ళు వయస్సు పైబడి శ్వాసకొస సమస్యలు, మధుమేహం లాంటి వ్యాధులతో ఇబ్బంది పడుతున్న అధికారులు ఏప్రిల్ 4 తేదీ వరకు  ధ్రువీకరణ లేకపోయినా ఇంటి వద్దే ఉండొచ్చని స్పష్టం చేసిన ప్రభుత్వం.ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించినట్టే కాంట్రాక్టు ఉద్యోగులకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని ప్రభుత్వం  స్పష్టం చేసింది.  ఉద్యోగులు కు 9.30, 10, 10.30 గంటల వేర్వేరు షిఫ్టు  లో హాజరుకు అనుమతి.ఇంటి వద్ద నుంచి పని చేసేందుకు అనుమతి లభించిన ఉద్యోగుల ఈ-ఆఫీసు ద్వారా విధులు నిర్వహించాలని జి.ఏ.డి. ఆదేశాలిచ్చింది. ఈ ఉత్తర్వులు అత్యవసర సేవల విభాగాలకు వర్తించవని స్పష్టం చేసిన ప్రభుత్వం.  రాష్ట్రానికి చెందిన ప్రభుత్వ రంగ సంస్థలకు , సహకార సంస్థలు, స్వతంత్ర్యప్రతిపత్తి కలిగిన సంస్థలకు వర్తిస్తుందని అదేశాల్లో పేర్కొన్న ప్రభుత్వం.తదుపరి ఉత్తర్వుల వరకు ప్రభుత్వ కార్యాలయాల్లో ఫిర్యాదులు స్వీకరించబోమని స్పష్టం చేసిన ప్రభుత్వం. వీలైనంత మేరకు ప్రభుత్వం కార్యాలయంలోకి సందర్శకులను అనుమతి లేదని కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది. సచివాలయం, హెచ్ ఓ డి కార్యాలయాలు, జిల్లా కార్యాలయాల్లో 50 శాతం మందికి విధులకు హాజరు అయ్యేలా, మరో 50 శాతం మంది ఇంటి వద్ద నుంచే పని చేసేలా చర్యలు చేపట్టాలని ఆదేశాలు.ఈ ఉత్తర్వులు ఏప్రిల్ 4 వరకు అమల్లో ఉంటాయని స్పష్టం చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహానీ.   

క‌రోనా నియంత్ర‌ణ‌కు హాంకాంగ్ రాజీలేని పోరాటం!

వీలైనంత దూరం పాటించండి. శుభ్రంగా వుండండి. ఆరోగ్య‌ప‌రంగా ఏమైనా అనుమానం వుంటే వెంట‌నే డాక్ట‌ర్‌ను సంప్ర‌దించండంటూ హాంకాంగ్ ప్ర‌భుత్వం విస్తృత ప్ర‌చారం చేస్తోంది. మ‌న ఆరోగ్యంతో పాటు సామాజిక ఆరోగ్యాన్ని కాపాడుకుందాం అంటు నినాదం ఇచ్చింది హాంకాంగ్ ప్ర‌భుత్వం. హాంకాంగ్‌లో ప‌రోక్షంగా క‌ర్ఫ్యూ అమ‌లులో వుంది. గ‌త రెండు నెల‌లుగా సామాన్య జీవ‌నంలో పూర్తిగా స్థంభించిపోయింది. ఎప్పుడు సంద‌డిగా క‌నిపించే ఈ దేశం బోసిపోయి క‌నిపిస్తోంది. అత్య‌వ‌స‌ర విభాగాలు త‌ప్ప మిగ‌తా వాటికి హాలిడే ప్ర‌క‌టించి ష‌ట్‌డౌన్ చేశారు. ఈ ప‌రిస్థితి మే వ‌ర‌కు కొన‌సాగనుందంటున్నారు.  విదేశాల్లో నుంచి వ‌చ్చిన వారంద‌రూ క్వారంటీన్ చేయాల్సిందేన‌ని హాంకాంగ్ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. విమానాశ్ర‌యంలోనే స‌ద‌రు వ్య‌క్తి చేతి మ‌ణిక‌ట్టుకు ఎల‌క్ట్రానిక్ బ్రేసెలెట్ తొడిగిస్తున్నారు. అత‌నికి చెందిన‌ ఫోన్‌లో స్టే హోం సేఫ్ అనే యాప్‌ను డౌన్‌లోడ్ చేసి ఇస్తున్నారు. ఈ యాప్ ద్వారా వారిపై నిఘా పెట్టి ప‌రిశీలిస్తున్నారు. విదేశాల నుంచి వ‌చ్చిన వాళ్ళంద‌రూ క్వారంటీన్ చేయ‌డానికి ప్ర‌త్యేక ఏర్పాట్లు చేసింది అక్క‌డి ప్ర‌భుత్వం.  హాంకాంగ్‌లో రోజు రోజుకు క‌రోనా వైర‌స్ బాధితుల సంఖ్య పెరుగుతున్న‌ప్ప‌ట్టికీ పూర్తిగా అదుపులో వుంద‌ని హాంకాంగ్ ఆరోగ్య‌శాఖ ప్ర‌క‌టించింది.  రానున్న రెండు మూడు వారాల్లో వ‌చ్చే విదేశీయుల‌తో జాగ్ర‌త్త‌గా వుండేలా ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటోంది. అంతే కాదు స్థానికులు  జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌ల‌ని ప్ర‌భుత్వం హెచ్చ‌రిస్తోంది.  అవ‌స‌ర‌మైతే ఇత‌ర దేశాల నుంచి వారిపైనే ఆంక్ష‌లు పెట్టే అంశాన్ని కూడా హాంకాంగ్ ప్ర‌భుత్వం ఆలోచిస్తోంది.  మ‌రో ప్ర‌క్క ప్ర‌జ‌లు ఇంటి వ‌ద్ద నుంచే ప‌ని చేస్తున్నారు. విద్యార్థులు ఆన్‌లైన్ స్కూలింగ్ చేస్తున్నారు. టీచ‌ర్లు ప్ర‌త్య‌క క్లాస్‌ల‌ను ఆన్‌లైన్‌లో బోధించ‌డానికి కొత్త విద్యావిధానాన్ని అమ‌లుచేస్తున్నారు. షాపింక్‌మాల్స్‌, సూప‌ర్‌మార్కెట్‌ల‌ను ఎప్ప‌ట్టిక‌ప్పుడు శానిటైజ్ చేస్తూ జాగ్ర‌త్త‌లు పాటిస్తున్నారు.  రోజువారీగా చిన్న ఉద్యోగాలు చేసేవారు షాపులు మూసివేయ‌డం వ‌ల్ల వారు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. సామాన్య ప్ర‌జ‌లు ఇలాంటి వారికి స‌హాయం చేయ‌డానికి ముందుకు వ‌స్తున్నారు.  వారికి అవ‌స‌ర‌మైన నిత్యావ‌స‌ర వ‌స్తువుల్ని అందిస్తూ హాంకాంగ్ రూల్ మోడ‌ల్‌గా ఆద‌ర్శంగా నిలుస్తోంది.  ఇప్పటి దాకా కరోనా వైరస్‌ కేవలం మనుషుల్లోనే వ్యాప్తి చెందుతుందని తెలుసు. కానీ హాంకాంగ్‌లో ఓ పెంపుడు కుక్కకు కరోనా సోకింది.  ఇది మ‌నిషి నుంచి జంతువుకా, లేదా జంతువు నుంచి మ‌నిషి వ‌చ్చిందా?  దీనిపై ప‌రిశోధ‌న‌లు జ‌రుగుతున్నాయి.  హాంకాంగ్ లో కోవిడ్-19 రోగి అయిన 60 ఏళ్ళ మహిళ పెంపుడు కుక్కకు కూడా ఈ వైరస్ సోక‌డంతో హాంకాంగ్ ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్త‌మై జంతువుల‌పైన కూదా దృష్టి పెట్టింది. ఆ పెంపుడు కుక్క‌కు టెస్టులు జరపగా  'వీక్ పాజిటివ్' లక్షణాలున్నట్టు తేలింది. దీంతో దాన్ని జంతువుల క్వారంటైన్ కు పంపించి   క్రమం తప్పకుండా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షల్లో దానికి బలహీన స్థాయిలో కరోనా వైరస్ ఉందని రిపోర్ట్ వ‌చ్చింది. ఆ త‌రువాత ఆ కుక్క చ‌నిపోయింది. దీనిపైన సీరియ‌స్‌గా ప‌రిశోధ‌న‌లు జ‌రుగుతున్నాయి.

గవర్నర్ సాబ్... నా పదవిని కాపాడండి: ఏ పీ పీ ఎస్ సి చైర్మన్ 

* కరోనా వైరస్ రాక ముందే , క్వారంటైన్ అయిన ఉదయ్ భాస్కర్  * టీ  డీ పీ హయాం లో నియమితులైన ఆరుగురు సభ్యులూ కూడా , ఇపుడు చైర్మన్ ను పట్టించుకోవటం లేదు  తనపై రాష్ట్ర ప్రభుత్వం కత్తి కట్టిందని ఆరోపిస్తున్న ఈయన పేరు ఉదయభాస్కర్ . హోదా  ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్   సర్వీస్ కమిషన్ చైర్మన్.  అంటే ఏ పీ పీ ఎస్ సి అనే ఒక  రాజ్యాంగ బద్ధ సంస్థ కు ఈయన పెద్ద దిక్కన్న మాట.  అయితే,ఇప్పుడు  ఆయనకే  దిక్కు లేకుండా పోయిన పరిస్థితి.  ఏమి చేయాలో పాలు పోనీ పరిస్థితి లో ఆయన రాజ్ భవన్ మెట్లెక్కారు. ఒక మూడు పేజీల వినతిపత్రం కూడా  సమర్పించారు. తనను  నాలుగు నెలల క్రితమే, ఈ ప్రభుత్వం ' ఐసొలేట్ '  చేసిందనీ,తనకు ఆఫీసు లో ఒక గది మినహా,  పీఏ, అటెండర్లు కూడా లేకుండా చేసిందనీ ఉదయ్ భాస్కర్ వాపోయారు. తాను  చేయాల్సిన పనులూ సెక్రటరీతోనే  చేయిస్తున్నారని,ఫైళ్లపై సభ్యులు గుడ్డిగా సంతకాలు చేస్తున్నారనీ ఉదయ్ భాస్కర్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు వివరించారు. తానుండగానే ఇన్‌చార్జ్‌ చైర్మన్‌ నియామకం జరిపితే, కోర్టుకెళ్లిన విషయాన్నీ కూడా ఉదయ్ భాస్కర్ గవర్నర్ ముందు ప్రస్తావించారు.  నిజానికి, వచ్చే సంవత్సరం నవంబర్ వరకూ ఉదయ్ భాస్కర్ పదవీ కాలం ఉన్నప్పటికీ, ఆయనకు  పనిచేసే వాతావరణం అక్కడ   లేదనీ, అయినా కూడా నాలుగు నెలలుగా భరిస్తున్నాననీ, సహిస్తున్నాననీ ఆయన గవర్నర్ కు  వివరించారు. వాస్తవానికి ఏ పీ పీ ఎస్ సి చైర్మన్ ను   తొలగించాలంటే, ముందుగా గవర్నర్ నోటీస్ లో  పెట్టాలి,  ఆ తర్వాత చైర్మన్ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించినట్టుగా  ఒకవేళ గవర్నర్  భావిస్తేదానిపైన , తదుపరి చర్యల నిమిత్తం రాష్ట్రపతి దృష్టికి విషయాన్ని తీసుకువెళ్లాలి. దాన్ని , రాష్ట్రపతి  కార్యాలయం సుప్రీం కోర్టు నోటీస్ లో  పెట్టిన తర్వాత, అప్పుడు  సుప్రీమ్ కోర్టు తన నిర్ణయం  వెల్లడిస్తుంది.   ఇంత ప్రొసీజర్  ఉండగా,రాష్ట్ర ప్రభుత్వం ఉదయ్ భాస్కర్ ను  పూర్తిగా పక్కన పెట్టేసి, కార్యదర్శి తోనే కథ నడిపేస్తోంది. ఈ  మొత్తం వ్యవహారాన్ని ఉదయ్ భాస్కర్  గవర్నర్ దృష్టి కి  తీసుకెళితే, తగు విచారణ జరిపించి వాస్తవాలు కనుక్కుంటానని గవర్నర్ ఆయనకు హామీ ఇచ్చినట్టు  తెలిసింది.  మొత్తానికి,ఈ వ్యవహారం లో  మనకు బోధ పడే విషయమేమిటంటే , కరోనా వైరస్ రాక ముందే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, ఏ పీ పీ ఎస్ సి చైర్మన్ ఉదయ్ భాస్కర్ ను క్వారంటైన్ చేసిందనే విషయం. ఏ మాటకా మాట చెప్పాలి ధర్మ ప్రభువులు, ఏమి చేసినా చాలా పద్ధతిగా,  వివరంగా,ఇంకా వైనంగా చేస్తారు. 

క‌రోనా స్పెష‌ల్ ఆఫర్లు ప్ర‌క‌టించిన జియో, ఈరోస్ నౌ!

ఈరోస్ నౌ యాప్ ప్రజలకు బంపరాఫర్ ప్రకటించింది. రాబోయే రెండు నెలలు ఉచితంగా వాడుకునే అవకాశాన్ని వినియోగదారులకు కల్పిస్తోంది. ఈ యాప్ లో ఎవరైతే 'స్టే ఫ్రీ' అని ఇంగ్లీష్ కోడ్ ఉపయోగిస్తారో వాళ్లకు రెండు నెలలు యాప్ లోని సినిమాలు.. ప్రోగ్రామ్స్, రియాలిటీ షోలను ఉచితంగా పొందవచ్చు. కాగా, ఇదే పద్దతిలో అమెజాన్ ప్రైమ్, హాట్ స్టార్ వంటి అప్లికేషన్స్ కూడా ప్లాన్స్ రెడీ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో ఇంటి నుంచి పని చేసేవారికి అదనపు ప్రయోజనాలను కలిగిస్తూ నూతన 4జీ డేటా వోచర్లను తాజాగా ప్రకటించింది. 4జీ సౌకర్యంతో పాటుగా టాక్‌టైమ్‌ను రూ. 11 నుంచి రూ. 101 ప్లాన్స్ వరకు అందుబాటులో ఉంచింది. ఒకసారి అధిక వేగంతో డేటా ముగిసిన తర్వాత 64 కేబీపీఎస్‌తో అపరిమితంగా ఇంటర్నెట్‌ను ఉపయోగించుకునే సౌక‌ర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది జియో. కేవ‌లం 11 రూపాయ‌ల‌కు - 800ఎంబీ డేటా.. 75 నిమిషాల టాక్‌టైమ్‌. 21 రూపాయ‌ల‌కు - 2జీబీ డేటా.. 200 ని.టాక్‌టైమ్‌, 51 రూపాయ‌ల‌కు - 6జీబీ డేటా.. 500 ని.టాక్‌టైమ్‌, 101 రూపాయ‌ల‌కు - 12 జీబీ డేటా.. 1000 ని.టాక్‌టైమ్ అందిస్తున్నారు. అయితే రూ.251 వోచర్‌కు మాత్రం అదే పాత ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది. దేశవ్యాప్తంగా ఉన్న కొన్ని సంస్థలు తమ ఉద్యోగులను ఆఫీసులకు రాకుండా ఇంటి నుంచి పని చేయాలని కోరిన నేప‌థ్యంలో గత కొద్దిరోజులుగా ఇండియా అంతటా భారీగా ఇంటర్నెట్ వినియోగం పెరిగింది.

ఏపీకి పధ్నాలుగో ఆర్థిక సంఘం నిధులు వ‌చ్చాయ‌ట‌!

పధ్నాలుగో ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు మూడు రాష్ట్రాలకు పట్టణ స్థానిక సంస్థలకు ఈ ఆర్థిక సంవత్సరానికి రూ. 1600 కోట్లుకుపైగా విడుదల చేసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి రూ. 431 కోట్లు ఉన్నాయి. వీటిని రాష్ట్ర ఖాతాలో జమ చేసినట్లుగా.. కేంద్రం సమాచారం పంపింది. అది విష‌యం. మార్చి 31లోపు స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయడం వల్ల పధ్నాలుగో ఆర్థిక సంఘం నిధులు రావని వైసీపీ నేతలు ఆందోళన చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా వేశారు. నిజానికి మున్సిపల్ ఎన్నికలు ఏపీలో జరగలేదు. వాయిదా పడ్డాయి. నామినేషన్ల ప్రక్రియ కూడా పూర్తి కాలేదు. అయినప్పటికీ..దీన్నేమి పట్టించుకోకుండా.. కేంద్రం నిధులు విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి తాజా వ‌చ్చిన ఈ 431 కోట్ల రూపాయ‌ల ఆర్థిక సంఘం నిధులను పదిహేను రోజుల్లో స్థానిక సంస్థల ఖాతాకు బదిలీ చేయాల్సి ఉంటుంది. లేకపోతే.. ఆర్బీఐ వడ్డీ వసూలు చేస్తుంది. ఇప్పుడు మున్సిపల్ కోటాకు సంబంధించిన నిధులను విడుదల చేశారు.. త్వరలో మండల, పంచాయతీలకు సంబంధించిన నిధులను కూడా విడుదల చేస్తార‌ట‌. మొత్తంగా ఏపీకి పధ్నాలుగో ఆర్థిక సంఘం ద్వారా.. రూ. 3,500 కోట్ల నిధులు స్థానిక సంస్థలకు వస్తాయన్న అంచనా ఉంది.

రాజకీయ నేతల ప్రమేయం వల్లే ఆయేషాకు న్యాయం దొర‌క‌లేదు!

పన్నెండేళ్ల క్రితం అత్యాచారం, హత్యకు గురైన తన కుమార్తెకు ఇప్పటికీ న్యాయం జరగలేదని ఆయేషా తల్లి శంషాద్ బేగం ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఆయేషా హత్య కేసులో రాజకీయ నేతల ప్రమేయం వల్లే న్యాయం జరగలేదని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆడపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించేలా ప్రత్యేక చట్టాలు తేవాలని ఆమె ఆకాంక్షించారు. సీపీ సీపీ సజ్జనార్ లాంటి పోలీసు అధికారి తమ కుమార్తె కేసు దర్యాప్తు చేసి ఉంటే తమకు న్యాయం జరిగి ఉండేదేమోనని ఆమె అన్నారు. దిశపై హత్యాచారానికి పాల్పడిన నిందితులందరూ సామాన్యులని.. అందుకే ఎన్‌కౌంటర్ చేయగలిగారని అన్నారు. ఎలాంటి రాజకీయ అండదండలు లేకపోవడంతో నిందితులను ఈజీగా కాల్చి చంపేశారన్నారు. ప్రాంతీయ, కులతత్వం, హోదా, డబ్బువల్లే తమ కుమార్తె కేసును నీరుగార్చారని ఆరోపించారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసినా న్యాయం జరగలేదని అన్నారు. ఆయేషా కేసులో పోలీసులే నిందితులని ఆమె అన్నారు. బీ ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరాను తన హాస్టల్‌లోనే అత్యాచారం చేసి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన 2007లో విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం ఉమెన్ హాస్టల్‌లో జరిగింది. అప్పట్లో ఆయేషా మీరా హత్యాచార ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఆ కేసులో అసలైన నిందితులను రాజకీయ నాయకుల ప్రమేయంతో తప్పించారని.. తమకు న్యాయం చేయాలని ఆయేషా తల్లి శంషాద్ బేగం కోరుతున్నారు. దాదాపు 12 ఏళ్ల కిందట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలన సృష్టించిన బీఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్యాచారం కేసును ప్రస్తుతం సీబీఐ దర్యాప్తు చేస్తోంది. విజయవాడ శివారులోని ఇబ్రహీంపట్నంలోని ఓ ప్రైవేట్ హాస్టల్లో ఆయేషా మీరా హత్యాచారానికి గురైంది. నిర్బయ చట్టం తీసుకొచ్చారని దాని వల్ల ఎలాంటి ఉపయోగం లేదని అన్నారు. దేశం ధనికులు, పేదలు అనే రెండు వర్గాలుగా చీలిపోయిందన్నారు. తన కుమార్తె పేరుతో ఎలాంటి చట్టాలు తీసుకురాలేదని ఆమె ఆవేద‌న వ్య‌క్తం చేశారు. త‌న కుమార్తె కేసులోనూ నేరస్థులను పట్టుకుని, సీబీఐ ద్వారా శిక్ష వేయిస్తే చాలా గర్విస్తామని అన్నారు. తన కుమార్తె పేరుతో ఆయేషా చట్టాన్ని ముఖ్య‌మంత్రి జగన్ తీసుకురాగలరా? అని ఆమె ప్రశ్నించారు.

ఇండోనేషియ‌న్లు పెట్టిన చిచ్చు.. కరీంనగర్‌లో 76వేల మందికి స్క్రీనింగ్

ఇండోనేషియా నుంచి వచ్చిన వారు 70మంది కలిసినట్టు అధికారులు గుర్తించారు. ఇంటింటికీ వెళ్లి అనుమానితులను వైద్య బృందాలు గుర్తిస్తున్నాయి. మూడు రోజుల్లో ఎవరెవరిని కలిశారు? ఏయే ప్రాంతాల్లో సంచరించారు? అనే విషయాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. కలెక్టరేట్‌‌కు అతి సమీపంలోని మ‌సీదుల‌కు వెళ్లినట్లుగా తెలుస్తోంది. మార్చి 14,15 తేదీల్లో పట్టణంలోని కొన్ని ప్రాంతాల్లోనూ వీరు సంచారించారని అధికారులు గుర్తించారు. ఇంకా వీరు తిరిగిన ప్రాంతాలను తెలుసుకునేందుకు పోలీసులు సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. తెలంగాణలో కరోనా వైరస్ చాప కింద నీరులా విజృంభిస్తోంది. రోజురోజుకి కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు రాష్ట్రంలో 21 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఇక ఇండోనేషియన్ల పుణ్యమా అని కరోనా వైరస్ కరీంనగర్ కు పాకింది. ఇండోనేషియా నుంచి కరీంనగర్ కు వచ్చిన మత ప్రచారకుల బృందంలో 9మందికి కరోనా పాజిటివ్ ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది. కరోనా సోకిన ఇండోనేషియన్లు కరీంనగర్ లో బస చేశారు. కరీంనగర్ నగరంలో కరోనా బాధితులను గుర్తించే పనిలో బిజీగా ఉన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో కరీంనగర్ ను జల్లెడ పడుతున్నారు. కరీంనగర్‌లో 50 వేల మందికి పరీక్షలు చేశాం. అయితే ఒక్క పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాలేదు. ప్రజలకు అసౌకర్యం కలగొద్దని కరీంనగర్‌ పర్యటన వాయిదా వేసుకున్నానని ముఖ్య‌మంత్రి కేసీఆర్ తెలిపారు. ఇండోనేషియన్లు ఎక్కడెక్కడ తిరిగారో విచారణ చేస్తున్నాం. ఎయిర్‌పోర్టులు, పోర్టులు మూసివేయాలని ప్రధానికి చెప్పాను. ఒకేసారి మూసివేయడం కూడా సాధ్యం కాదని సి.ఎం. చెప్పారు.

క‌రోనాను టెస్ట్‌ క్రికెట్‌తో పోల్చిన టెండూల్క‌ర్‌

భారత దేశంలో ఇప్పటికే 294 మందికి కరోనా సోకగా.. నలుగురు మృత్యువాత పడ్డారు. శ‌ర‌వేగంతో విస్త‌రిస్తున్న క‌రోనాను అడ్డుకోవ‌డానికి టెస్టు క్రికెట్ మ్యాచ్ త‌ర‌హాలో సిద్ధం కావాల‌ని స‌చిన్ అంటున్నారు. పిచ్‌ పరిస్థితులను, బౌలర్‌ శైలిని మనం అర్థం చేసుకుని సుదీర్ఘంగా బ్యాటింగ్‌ చేయాలి. ఇక్కడ అత్యంత రక్షణాత్మకంగా ఆడటం కూడా చాలా ముఖ్యం. ప్రస్తుత ప్రపంచానికి కావాల్సిందే ఓర్పు. కరోనాపై మనల్ని రక్షించుకోవాలంటే ఎంతో ఓపిక అవసరం' అని సచిన్‌ వివరించారు. ఈ పోరులో ప్రజలందరికీ సహనం, సమష్టితత్వం, అప్రమత్తత అవసరమని సచిన్‌ తెలిపారు. వైరస్‌ సోకకుండా, వ్యాప్తి చెందకుండా ప్రజలంతా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రభుత్వాల సూచనలను తప్పకుండా పాటించాలని కోరారు. 'జనతా కర్ఫ్యూ'కు అందరూ సహకరించాలని కోరారు. అంతా కూడా స్వీయ నిర్భందాన్ని పాటించాలన్నారు. అంతకుముందు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) 'సేఫ్‌ హ్యాండ్స్‌' చాలెంజ్‌ను సచిన్ స్వీకరించారు. చాలెంజ్‌లో భాగంగా తన చేతులను శుభ్రం చేసుకుంటున్న వీడియోను సచిన్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసారు. దాదాపు 20 సెకండ్లు సచిన్ చేతులు శుభ్రం చేసుకున్నారు.

కూక‌ట్‌ప‌ల్లిలో వెలుగులోకి వ‌చ్చిన క‌రోనా, దేశంలో బాధితుల సంఖ్య 294

ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా విస్తరిస్తోన్న మహమ్మారి కరోనా వైరస్‌ను నిరోధించకపోతే రాబోయే రోజుల్లో లక్షలాది మంది చనిపోయే ప్రమాదం ఉందని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ హెచ్చరించారు. దావానంలా వ్యాపిస్తున్న కరోనా వైరస్‌ను కట్టిడి చేయకుండా అలాగే వదిలేస్తే పరిస్థితి చేయిదాటిన ప్రాంతాల్లో లక్షల సంఖ్యలో ప్రజలు మరణించే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 11 వేల మందిని బలితీసుకున్న ఈ వైరస్‌తో విశ్వవ్యాప్తంగా ఆరోగ్య పరిస్థితులు దిగజారాయని ఐక్యరాజ్యసమితి అభిప్రాయపడింది. ప్రస్తుతం దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య 294కి చేరింది. వీరిలో 267 మందికి ఐసోలేషన్ వార్డుల్లో ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు. 23 మంది మాత్రం ఇప్పటివరకూ రికవరీ అయ్యారు. మృతుల సంఖ్య 4గా ఉంది. కరోనా వ్యాధి సోకిన వారిలో భారతీయులు 256 మంది ఉండగా... విదేశీయులు 38 మంది ఉన్నారు. మొత్తం పాజిటివ్ కసుల్లో విదేశాల నుంచి వచ్చిన భారతీయులతో పాటు.. స్థానికులు 256 మంది ఉంటే.. దేశానికి వచ్చిన విదేశీయులు 38 మంది కరోనా పాజిటివ్ గా తేలింది. దేశంలో ఇప్పటివరకూ 63 కేసులతో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. కేరళ 40 కేసులతో రెండో స్థానంలో ఉంది. ఢిల్లీ 26, ఉత్తరప్రదేశ్ 24, రాజస్థాన్ 23 కేసులతో ఉండగా... తెలంగాణ 21 కేసులతో ఆరో స్థానంలో ఉంది. మరో తెలుగు రాష్ట్రం ఏపీలో 3 పాజిటివ్ కేసులు ఉన్నాయి. హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ ఫేజ్-2లో ఉండే ఓ మహిళకు కరోనా వైరస్ ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది. ఆ మహిళను వైద్యం కోసం గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. ఆమె సోదరుడు ఇటీవలే బ్రిటన్ నుంచి వచ్చినట్టు గుర్తించారు. ఇంటిలో ఉన్న మరో ఇద్దరికి కరోనా ఉన్నట్టు అనుమానిస్తున్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తిపై ప్రజలు భయాందోళనకు గురికావొద్దని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని అన్నారు. పూర్తి అవగాహనతో జాగ్రత్తలు పాటించాలని పిలుపునిచ్చారు. ఒంగోలులో నమోదైన కరోనా పాజిటివ్ బాధితుడి ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. అతనితో సంబంధం ఉన్న అందరినీ గుర్తించామన్నారు. వాళ్లని కూడా ఐసోలేషన్‌లో ఉంచి పరిశీలన చేస్తున్నామన్నారు. బాధితుడి కుటుంబం సభ్యుల నమూనాలను పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యి కేసులు వైద్యుల పరిశీలనలో ఉన్నాయి.ఇప్ప‌ట్టి వ‌ర‌కు 3 కేసులు పాజిటివ్ వచ్చాయి'అని మంత్రి తెలిపారు.

రేపు ఉదయం నుంచి 24గంటల పాటు తెలంగాణ బంద్

* పక్క రాష్ట్రాల బస్సులకూ అనుమతి లేదు: ముఖ్యమంత్రి  * సరిహద్దుల్లో 52 చెక్ పోస్టులు  * మెట్రో రైలు సర్వీసులు కూడా రేపు ఉండవు  * విదేశాల నుంచి వచ్చిన వారు స్వచ్ఛందంగా డాక్టర్లను సంప్రదించాలి: సి ఎం   విదేశాల నుంచి వచ్చిన వారు స్థానిక హాస్పిటల్ లో కానీ,పోలీస్ స్టేషన్ లలో స్వచ్ఛందంగా వారి వివరాలు వెల్లడించాలని కె సి ఆర్ సూచించారు. విదేశాల నుంచి వచ్చిన వారు ఇలా చేయడం వల్ల వైరస్ స్ప్రెడ్ కాకుండా చూసుకోవచ్చు..ఇది మన సామాజిక బాధ్యతగా చేయాలన్నారు ముఖ్యమంత్రి.  జ్వరం,దగ్గు,జలుబు ఉన్న వాళ్ళు డాక్టర్ ను సంప్రదించండి..మీరు సమాచారం ఇస్తే చాలు మేమె హాస్పిటల్ కి తీసుకెళ్లి చికిత్స చేయిస్తాం..విదేశాల్లో నుంచి వచ్చిన వారు ప్రతి ఒక్కరు స్వచ్ఛద్దంగా రిపోర్ట్ చేయండి..డాక్టర్లని సంప్రదించండి..రేపు ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు ఇంట్లోనే వుండండని కూడా కె సి ఆర్ సూచించారు. తెలంగాణ మొత్తం ఆర్ టీ సి  బస్సులు నిలిపివేస్తున్నాం..తప్పనిసరి పరిస్థితిలో డిపోలో 5 బస్సులు పెడతాం...వేరే రాష్ట్రాల బస్సులను కూడా తెలంగాణలోకి రానివ్వమనీ చెప్పారు ముఖ్యమంత్రి. ..మెట్రో ట్రైన్ లు కూడా బంద్...ఎమర్జెన్సీ కోసం 5 మెట్రో ట్రైన్ లు అందుబాటులో ఉంటాయి..షాప్స్,మాల్స్ అన్ని మొత్తం బంద్ చేయాలనీ సి ఎం ఆదేశించారు. 

కరోనా ఎఫెక్ట్.. కేసీఆర్ కు చప్పట్లు.. కవితకు చివాట్లు!!

కరోనా.. కరోనా.. కరోనా.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే వినిపిస్తుంది. రోజురోజుకి దేశంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. తగు చర్యలు తీసుకుంటున్నాయి. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై.. కేంద్రం కూడా సంతృప్తి వ్యక్తం చేసింది. సీఎం కేసీఆర్ సూచనలు తీసుకుంది. అయితే ఒక వైపు కరోనా కోసం సీఎం కేసీఆర్ ఇంతలా చర్యలు తీసుకుంటుంటే.. ఆయన కూతురు కల్వకుంట్ల కవిత మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ.. విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నేపథ్యంలో కవితకు ఎమ్మెల్సీ టిక్కెట్‌ను కేటాయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ క్యాంప్ రాజకీయాలు నిర్వహిస్తుంది అంటూ కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణ కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో ఒక వీడియో పోస్ట్ చేసింది. హైదరాబాద్ శివారులోని ఓ రిసార్ట్స్‌కు జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లను తరలించినట్లు తెలుస్తోంది. వీడియోలో.. ఒకేచోట 500 మందికి పైగా మందు చిందులతో హల్‌చల్ చేస్తుండటం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఒకవైపు ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ.. సమావేశాలు, వివాహాలు, వేడుకలు వంటి వాటికి దూరంగా ఉండాలని ప్రజలకు సూచిస్తుంటే.. మరోవైపు అధికార పార్టీ నేతలే ఇలా రిసార్ట్స్ లో గుంపులుగా ఉంటూ చిందులేయడంతో నెటిజనులు మండిపడుతున్నారు. ప్రజాక్షేమం కంటే రాజకీయం ముఖ్యమా? ఓ వైపు కరోనా అంతలా విజృంభిస్తుంటే ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎలా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. https://twitter.com/INCTelangana/status/1241259152942350341?s=20  

ఓ వైపు కరోనా వణుకుపుట్టిస్తుంటే.. ఆ మంత్రికి ఎన్నికలు కావాలట!!

కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో.. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను ఆరువారాల పాటు వాయిదా వేస్తూ.. ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఎన్నికల సంఘం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందంటూ అధికార పార్టీ ఎన్నికల వాయిదాను తప్పుబట్టింది. సీఎం వైస్ జగన్ మొదలుకొని మంత్రులు, ఇతర నేతలు ఎన్నికల సంఘంపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన ప్రతిపక్ష నేత చంద్రబాబుతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. సీఎం కూడా రమేష్ కుమార్ పై ఇవే వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, కరోనా గురించి అంతగా భయపడాల్సిన అవసరం లేదు.. పారాసిటమాల్, బ్లీచింగ్ పౌడర్ తో కరోనాకు కళ్లెం వేయొచ్చని చెప్పుకొచ్చారు.  కానీ కరోనా సీఎం చెప్పినంత తేలికగా లేదు. కరోనాకి ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. అయినా జగన్ సర్కార్ మాత్రం అబ్బే అంత ప్రమాదం లేదు.. ఎన్నికలు జరిపించాలంటూ.. సుప్రీంకోర్టు గడప తొక్కింది. సుప్రీం కూడా ఎన్నికల వాయిదాను సమర్థిస్తూ జగన్ సర్కార్ కి షాకిచ్చింది. తర్వాతర్వాత కరోనా మరింత విజృంభిస్తుండటంతో.. దాని ప్రభావం ఏపీ సర్కార్ కి కూడా తెలిసొచ్చినట్టుంది. చాలా రోజుల తరువాత ఆరోగ్యమంత్రి మీడియా ముందుకి వచ్చారు. సీఎం కూడా అధికారులతో సమీక్షలు జరుపుతూ.. కరోనాని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అంతేకాదు ఉగాదికి చేయాలనుకున్న పేదవారికి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని వాయిదా వేశారు. మొత్తానికి ఏపీ సర్కార్ కి కరోనా ప్రభావం తెలిసొచ్చింది, చర్యలు తీసుకుంటుంది అనుకుంటుంటే.. మరోవైపు రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వ్యాఖ్యలు మాత్రం విమర్శలకు దారితీస్తున్నాయి. స్థానిక ఎన్నికలను వాయిదా వేయడం అప్రజాస్వామ్యం అని మంత్రి బుగ్గన అన్నారు. ఎన్నికల వాయిదాపై ప్రభుత్వాన్ని ఈసీ సంప్రదించిందా? రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ఆరోగ్య శాఖను సంప్రదించిందా? రాష్ట్రంలో కరోనా ఏ స్థాయిలో ఉందో ఈసీకి తెలుసా? అని బుగ్గన ప్రశ్నించారు. స్థానిక ఎన్నికల్లో ఎవరెన్ని కుట్రలు చేసినా ప్రజలు అధికారపక్షం వైపే ఉంటారని బుగ్గన చెప్పుకొచ్చారు. ఇదే ఇప్పుడు విమర్శలకు దారి తీస్తోంది. ఒకవైపు ప్రజలు కరోనా భయంతో బిక్కుబిక్కు మంటుంటే.. మంత్రి గారికి ఎన్నికలు కావాల్సి వచ్చాయా అని ప్రజలు మండిపడుతున్నారు. కరోనాపై ప్రజలకు అహగాహన కలిగించాల్సిన స్థాయిలో ఉన్న మంత్రి బుగ్గన.. ఇలా ఎన్నికల కోసం తాపత్రయ పడటం ఏంటని విమర్శిస్తున్నారు.

బీ అలెర్ట్.. కరెన్సీని టచ్ చేస్తే.. కరోనా సోకినట్టే!!

కరోనా ఎఫెక్ట్ తో ప్రస్తుతం జనమంతా 'షేక్ హ్యాండ్ వద్దు నమస్కారం ముద్దు' అంటున్న సంగతి తెలిసిందే. షేక్ హ్యాండ్ ఇస్తే ఎక్కడ వైరస్ ఒకరి నుండి ఒకరికి అంటుకుంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అందుకే షేక్ హ్యాండ్ అంటే నై నై అంటున్నారు. అయితే కరోనా ఉన్న వ్యక్తుల్ని తాకడం వల్లనే కాదు, వారు తాకిన వస్తువుల్ని తాకినా వైరస్ అంటుకుంటుంది. అందుకే అనవసరంగా వేటిని తాకవద్దని, ఎప్పటికప్పుడు వెంటనే చేతులు శుభ్రంగా కడుక్కోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే అసలు మనం ఊహించని విధంగా కూడా వైరస్ విస్తరించే అవకాశముందని తెలుస్తోంది. అదే కరెన్సీ. నోట్లు ఒకరి చేతి నుండి మరొకరి చేతికి మారడం వల్ల కూడా వైరస్ విస్తరించే ప్రమాదముంది. నోట్ల రద్దు పుణ్యమా అని.. మన దేశంలో ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ అలవాటైంది. టీ స్టాల్, కిరాణ షాపులు మొదలు పెద్ద పెద్ద షాపింగ్ ల వరకు.. మొబైల్ యాప్స్ తో డబ్బు చెల్లించడం యువతకి అలవాటైంది. అయితే ఇది పదిశాతం కూడా ఉండదు. తొంబై శాతానికి పైగా నగదు ఇప్పటికీ చేతులు మారుతూనే ఉంది. ఇదే ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. కొందరికి నోట్లు లెక్కించేటప్పుడు.. వేలిని నాలుకపై పెట్టి తడి చేయడం అలవాటు. ఒక వేళ కరోనా సోకిన వ్యక్తి  తడి చేసి నోట్లను లెక్కిస్తే.. ఆ వైరస్‌ నోట్లకూ పాకుతుంది. కరోనా వైరస్‌ వ్యక్తి నుంచి నోట్లు బయటకి వస్తే.. ఆ నోట్ల పై ఉన్న వైరస్ అంతరించేలోపు.. ఎందరో చేతులు మారే అవకాశముంది. అదే జరిగితే ఎందరో చేతికి వైరస్‌ చేరినట్లే. దాని వల్ల జరిగే నష్టం ఊహకు కూడా అందదు. అందువలన ఎవరైనా సరే.. నోట్లను నోటితో తడి చేయకుండా లెక్కిస్తే మంచిది. అదేవిధంగా వీలైనంతవరకు నగదు చెల్లింపులు.. మొబైల్ పేమెంట్ యాప్స్ లేదా ఆన్ లైన్ ద్వారా చెల్లిస్తే మంచిది.