విశాఖ లో కరోనా రెండో స్టేజ్ కు చేరుకుంది

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఏపీ వైద్య ఆరోగ్యశాఖా మంత్రి ఆళ్ల నాని నేడు విశాఖలో పరిస్థితిపై నాని సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విశాఖలో ఇప్పటికి మూడు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఇప్పటి వరకు మొత్తం రాష్ట్రంలో 7 పాజిటివ్ కేసులు నమోదు జరిగింది. 220 మంది అనుమానితులకు పరీక్షలు చేయగా 168 మంది కి నెగెటివ్ వచ్చింది,మిగిలిన వారికి నివేదికలు కోసం వేచి చూస్తున్నాము. విశాఖ జిల్లా లో మూడు కేసులు నమోదు జరిగింది. విశాఖలో వైరస్ వ్యాప్తి చెందకుండా అధికారులు చేసిన సేవలు అభినందనీయం. ఎంత చేసిన ఇంకా అప్రమత్తం అవ్వాలి. లాక్ డౌన్ ప్రకటించినా ఇంకా ప్రజలు సహకారం ఇవ్వాలి. లాక్ డౌన్ విజయవంతం చేయాలి అప్పుడే వైరస్ వ్యాప్తి అడ్డుకోగలమన్నారు.  విశాఖ లో కరోనా రెండో దశలో అడుగు పెట్టింది.విదేశాల నుంచి వచ్చిన వారి నుంచి వారి కుటుంబ సభ్యులకు వచ్చింది. మూడో దశలోకి రాకుండా విశాఖ వాసులు ప్రభుత్వ సూచనలు పాటించాలి. ఉచిత రేషన్ ఇస్తున్నాము. వచ్చే నెల 4 వ తేదీ ప్రతి ఇంటికి వెయ్యి రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాము అన్నారు డిప్యూటీ సీఎం ఆళ్ల నాని. "విదేశాల నుంచి వచ్చిన వారి వివరాలు ప్రభుత్వానికి తెలియజేయాలి,వారు గృహ నిర్బంధం లో ఉండాలి. సీతమ్మ ధార, అనకాపల్లి, గాజువాక, అల్లిపురం ప్రాంతాలు హై రిస్క్ లో ఉన్నాయి.విశాఖ లో 20 కమిటీలు కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు పనిచేస్తున్నారు. విశాఖలో 1472 మంది విదేశాల నుంచి నగరానికి వచ్చారు.వైద్య సిబ్బందికి మాస్కలు, పిపిఏ కిట్ లు అందుబాటులో ఉంచుతున్నాము. ఔట్ సోర్స్ ఉద్యోగులకు జీతాలు చెలిస్తాము.విదేశాల నుంచి వచ్చిన వారు హోమ్ క్వారంటైన్ తప్పనిసరి గా పాటించాలనీ, " డిప్యూటీ సీఎం ఆళ్ల నాని సూచించారు. లాక్ డౌన్ ప్రకటించిన అనవసరంగా రోడ్ల పై తిరిగితే  ఆ వాహనాలు సీజ్ చేస్తాం.ఈ సాయంత్రం నుంచి మరింత కఠిన ఆంక్షలు విధిస్తున్నామనీ చెప్పారు. ఫార్మా పరిశ్రమలు తక్కువ సిబ్బంది తో పని చేయాలి. మీడియా పై నియంత్రణ లేదు , పోలీస్ సిబ్బంది వారి విధులకు ఆటంకం కలిగించవద్దు.జివిఎంసి మరింత గట్టిగా పనిచేయాలి. రైతు బజార్ లను స్కూల్ గ్రౌండ్స్, పెద్ద మైదాన్లలో నిర్వహిస్తాం. నిత్యావసర వస్తువు ధరలు పెరిగితే వారిపై కేసులు పెడతా మన్నారు మంత్రి పేర్ని నాని.

ఖాళీగావున్న‌సెక్రటేరియట్ ను ఐసోలేషన్ కేంద్రంగా వాడండి!

హైదరాబాద్ సెక్రటేరియట్ ఖాళీగా ఉన్నందున ఐసోలేషన్ కేంద్రంగా ఉపయోగించాలని తెలంగాణా బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ ముఖ్య‌మంత్రికి విజ్ఞ‌ప్తి చేశారు. రాష్ట్రంలో COVID-19 రోగుల సంఖ్య అధికంగా పెరుగుతున్నాయ‌ని ఆయ‌న ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న ఈ క్లిష్ట పరిస్థితులలో, అన్ని సంస్థలు, ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు సమిష్టిగా కృషి చేసి, భయంకర కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ముఖ్య‌మంత్రి తీసుకుంటున్న చర్యలను, భారతీయ జనతా పార్టీ, రాష్ట్ర శాఖ తరపున ప్రత్యేకంగా అభినందిస్తూ లేఖ‌రాశారు. ఈ ప్రమాదకర వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకునే చర్యలకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా మా సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆయ‌న స్పష్టం చేశారు. కొంత మంది ఈ విపత్తును అవకాశంగా తీసుకొని స్వలాభం కోసం స్వార్ధంతో నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలను ఒక్కసారిగా పెంచేశారు. ఫలితంగా సామాన్య, పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ విషయంలో మీరు ప్రత్యేక శ్రద్ద తీసుకొని, ధరల నియంత్రణ చేపట్టగలరని ఆయ‌న విజ్ఞ‌ప్తి చేశారు. ల‌క్ష‌ల సంఖ్య‌లో వున్న బిజెపి కార్య‌క‌ర్త‌లు ప్ర‌భుత్వం చేప‌ట్టే కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నారని ఎం.పి.బండి సంజయ్ కుమార్ తెలిపారు.

బుధ‌వారం నుండి విజ‌య‌వాడ న‌గ‌రంలో కఠిన ఆంక్షలు

ఉ. 6 నుండి ఉ.9 వరుకు మూడుగంటలే రోడ్ల మీదకి అనుమతి. పచారి షాపులు, పళ్లుమార్కెట్, రైతు బజార్లు, కాళేశ్వరరావు మార్కెట్ మాత్రమే ఉ.6 నుండి 9 వరుకు తెరిచి ఉంటాయి. ఉదయం 4 నుండి ఉ. 8 వరుకు మిల్స్ & డైరి ప్రొడెక్ట్ అందుబాటులో ఉంటాయి. ఉ. 5 నుండి ఉ. 9 వరుకు ఏటీయం ఫిల్లింగ్ వెహికల్స్ కు అనుమతి. ఉ. 7 నుండి సాయంత్రం 7 వరుకు టెక్ ఎ వే హోటల్స్ కు అనుమతి. ప్రభుత్వ, పోలీస్, ఫైర్ ,ఎలక్ట్రసిటి, రెవిన్యూ , వీయంసీ , మెడికల్ & హెల్త్ డిపార్ట్‌మెంటు వెహికల్స్ కు మాత్రమే అనుమతి. ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా వెహికల్స్ కు, ఆయిల్ & గ్యాస్ ఫిల్లింగ్ వెహికల్స్, మొబైల్ కమ్యునికేషన్స్ వెహికల్స్ కు ప్రత్యేక అనుమతి. జ్యూవలరీ, పెద్ద మాల్స్, ఎలక్ట్రానిక్ షాప్స్ ,క్లాత్ స్టోర్స్, ఫ్యాన్సీ షాప్స్, హార్డ్ వెర్ ,ఫర్నిచర్ , బేకరీస్ & ఐస్ క్రీమ్ పార్లర్స్, రెడీమేడ్ షాప్స్, హోటల్స్ & రెస్టారెంట్స్, ఫుడ్ కోర్ట్స్, ఐరన్ & స్టీల్ షాప్స్, గ్లాస్ & ప్లైవుడ్ షాప్స్, పిజ్జాకాఫీ షాప్స్, మొబైల్ షాప్స్, ఆటోమొబైల్స్ & ఆటోనగర్ లాక్ డౌన్ అయ్యేవరుకు ఓపెన్ కు అనుమతి లేదు. పదిమంది ఎక్కడా గుమిగూడి ఉండద్దు. నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని విజయవాడ మున్సిపల్ కమీషనర్ ప్రసన్న వెంకటేష్ హెచ్చ‌రించారు.

చైనాలో మరో వైరస్‌.. ఒకరు మృతి.. 32 మందికి వైద్య పరీక్షలు

అసలే చైనా పుణ్యమా అని కరోనా వైరస్ తో ప్రపంచం వణికిపోతుంటే.. తాజాగా చైనాలో మరో వైరస్ వెలుగులోకి వచ్చింది. చైనాలోని యువన్ ఫ్రావిన్సులో 'హంటా వైరస్' బారిన పడి 39 ఏళ్ల వయసున్న ఓ వ్యక్తి సోమవారం మృతి చెందాడు. అతడు హంటా వైరస్‌తో మృతి చెందినట్లు ఆ దేశ అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ వెల్లడించింది. అతడు ఓ బస్సులో ప్రయాణించాడని, దీంతో ఆయన ప్రయాణించిన బస్సులో 32 మందిని టెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. కాగా, ఈ హంటా వైరస్ వ్యాప్తికి ఎలుకలే ప్రధాన కారణమని తెలుస్తోంది. 1959 లో ఈ వైరస్ ను మొదటిసారి గుర్తించగా.. దీనికి సంబంధించిన వ్యాక్సిన్ 2016 నుండి అందుబాటులో ఉంది. అయితే ఓ వైపు కరోనా ప్రపంచాన్ని వణికిస్తున్న వేళ.. ఈ హాంటా వైరస్ రీఎంట్రీ ఇవ్వడం ఆందోళన కలిగిస్తోంది.

ఏటీఎం విత్‌డ్రాలపై కేంద్రం తీపి కబురు 

కరోనా వైరస్ కట్టడికి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ పాటించాలని ఆదేశించిన కేంద్రం క్యాష్ విత్‌డ్రాలపై ఆంక్షలను సడలించింది. ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి నగదును విత్‌డ్రా చేసినా ఎటువంటి చార్జీలు ఉండబోవని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. మూడు నెలల వరకూ ఏ బ్యాంకు ఏటీఎంలోనైనా నగదు విత్‌డ్రా చేసుకోవచ్చని ఆమె తెలిపారు.బ్యాంకు ఖాతాల్లో కనీస నగదు నిల్వ పరిమితిని కూడా ఎత్తేస్తున్నట్లు ఆమె వెల్లడించారు. ఈ నిర్ణయంతో లాక్‌డౌన్‌ను పాటించే ప్రజలకు కొంత ఊరటనిచ్చినట్టయింది. ఈ సడలింపుతో కనీస నగదు నిల్వను కూడా దైనందిన ఖర్చులకు వినియోగించుకునే అవకాశం ప్రజలకు లభించింది.

శానిటైజర్స్, మాస్కులపై పన్నుల రద్దుకు చంద్రబాబు డిమాండ్ 

శానిటైజర్స్,మాస్క్ లు ఇతర పారిశుద్య వస్తువులపై పన్నులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రద్దు చేయాలని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. డిజిటల్ సోషలైజేషన్ మాత్రమే ప్రస్తుత సమయంలో అనేక సమస్యలకు పరిష్కార మార్గమని కూడా  మాజీ ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆయన,ఇటు ప్రభుత్వం, ప్రజలు అంతా కలిసికట్టుగా పనిచేస్తే తప్ప ఈ కరోనా సృష్టించిన సంక్షోభం నుంచి బైటపడలేమన్నారు. "ఇప్పటిదాకా ఈ వ్యాధి ప్రపంచవ్యాప్తంగా 3,75,673మందికి సోకింది. 16,642మంది చనిపోయారు. ఇటలీలో 6,007మంది, చైనాలో 3,277మంది, స్పెయిన్ లో 2,311మంది, ఇరాన్ లో  1,812మంది యుఎస్ ఏలో 553మంది చనిపోయారు. ఇండియాలో కూడా దాదాపు 500మందికి సోకింది, 10మంది చనిపోయారు. చైనాలో పుట్టిన కరోనా ఇప్పటికి 196దేశాలకు విస్తరించింది. మొదటి 67రోజుల్లో లక్షమందికి కరోనా పాజిటివ్ వచ్చింది. గడిచిన 11రోజుల్లోనే 2లక్షల మందికి వచ్చింది. అంటే ఎంత వేగంగా విస్తరిస్తుందో తెలుసుకోవాలి. తొలుత ఒకరిద్దరికి వచ్చిన కరోనా 11రోజుల్లో 2లక్షల మందికి వచ్చింది, ఇప్పుడు 3లక్షల 75వేల మందికి పాకింది. మొదటి దశలో విదేశాలనుంచి వచ్చినవాళ్లనుంచి సోకుతుంది. రెండవ దశలో వారినుంచి స్థానికులకు వ్యాపిస్తుంది. స్టేజి 3లో అంటువ్యాధిగా ఈ మహమ్మారి విజృంభిస్తుంది. 4వ దశకు వస్తే దీనిని ఆపడం అసాధ్యం," అని నాయుడు వివరించారు.    దీని నిరోధానికి వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలనీ,  విదేశాలనుంచి వచ్చిన వారందరికీ క్వారంటైన్ చేయాలనీ,  14రోజులు పకడ్బందీగా క్వారంటైన్ లో ఉండి నెగటివ్ వస్తేనే వాళ్లను బైటకు పంపాలనీ నాయుడు సూచించారు. కానీ ఇక్కడ మనదగ్గర క్వారంటైన్ పెట్టలేక పోయారు. దీనివల్ల కొంత విస్తరించే ప్రమాదం ఏర్పడింది. ఐసొలేషన్ వార్డులు ఏర్పాటు చేస్తే చాలదు, దీనికోసం ప్రత్యేకంగా ఆసుపత్రులు నెలకొల్పాల్సి ఉందన్నారు. ప్రధాని పిలుపు జనతా కర్ఫ్యూకు ప్రజలంతా సంఘీభావంగా నిలిచారు. రైల్వే సర్వీసులు, అంతర్రాష్ట్ర బస్సులు రద్దు చేశారు. అంతర్ జిల్లా రాకపోకలను కూడా మహారాష్ట్ర రద్దు చేసింది. దేశీయ విమాన సర్వీసులు ఈ అర్ధరాత్రి నుంచి ఆపేస్తున్నారని కూడా నాయుడు చెప్పారు. " ఈ పరిస్థితుల్లో మార్గం ఒక్కటే...అందరూ సామాజిక దూరం విధిగా పాటించాలి. డిజిటల్ సోషలైజేషన్ ద్వారా సమాచార మార్పిడి జరగాలి, ఉద్యోగులు తమ విధులను డిజిటల్ సోషలైజేషన్ ద్వారా నిర్వర్తించాలి. సెల్ ఫోన్ ద్వారా ఆన్ లైన్ లో ముఖాముఖి చర్చించుకుని, విధులు నిర్వర్తించాలి. ఫేస్ బుక్, వాట్సప్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా సమాచార మార్పిడి జరగాలి. డిజిటల్ సోషలైజేషన్ మాత్రమే ప్రస్తుత సమయంలో అనేక సమస్యలకు పరిష్కార మార్గం. డిజిటల్ సోషలైజేషన్ ద్వారా డిజిటల్ వర్క్ చేసుకోవాలి. ప్రజల్లో చైతన్యం పెంచేందుకు, అందరిలో అవగాహన కల్పించేందుకు ఇది ఉపయోగకరం. ఇళ్లలోనుంచే కార్యాలయ విధులు నిర్వర్తించే పరిస్థితి కల్పించాలి. డిజిటల్ వర్కింగ్ ద్వారా చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి," అని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివరించారు.   ఒక్కరోజులే మన ఎకానమి 4వేల పాయింట్లు పడిపోయింది. అసంఘటిత రంగంలో కార్మికులు పెద్దఎత్తున ఉపాధి కోల్పోయారు. అనేకరాష్ట్రాలలో 144సెక్షన్ విధించారు. ఇంటికొకరే బైటకెళ్ళి టూ వీలర్ పై ఒకరు, కార్లలో ఇద్దరే బైటకు వెళ్లి అత్యవసర విధులు నిర్వర్తించాలని ఆంక్షలు వచ్చాయి. ప్రపంచంలో 20% ఇళ్లవద్దే ఉండిపోవాల్సిన పరిస్థితి ఉంది. ప్రధాని నరేంద్రమోది ప్రకటించిన లాక్ డౌన్ కంపల్సరీగా  అందరూ ఆమోదించాలి, ఆచరించాలి. అప్పుడే ఈ భయంకరమైన వైరస్ ను నిరోధించ గల్గుతాం.  కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు దీనిని పాటించకపోవడం కరెక్ట్ కాదు, అందరూ దీనిని ఆచరిస్తేనే కరోనా మహమ్మారిని పారదోలగలం. ఇండియా ఏవిధంగా దీనిని నిరోధిస్తుందో చూడాలని, ఇండియా దీనిని కట్టడి చేయగలిగితే ప్రపంచానికి కూడా కొంత ఊరట వస్తుందని, ఈ వ్యాధిని నియంత్రించగలరని ప్రపంచ ఆరోగ్య సమాఖ్య కూడా ఎదురు చూస్తోందని నాయుడు చెప్పుకొచ్చారు. కరవు ప్రాంతాల్లో రైతులు ఇప్పటికే దెబ్బతిని ఉన్నారు. కోళ్ల పరిశ్రమ, ఆక్వా పూర్తిగా దెబ్బతింది. హార్టీకల్చర్ రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వమే చురుగ్గా వ్యవహరించాలి. ఆన్ లైన్ వినియోగం ద్వారా రైతులను ఆదుకునే చర్యలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టాలి. నిత్యావసర వస్తువుల ధరలు ప్రతిచోటా పెరిగిపోతున్నాయి. కూరగాయల ధరలు, నిత్యావసర ధరలు అందుబాటులో ఉండేలా ప్రభుత్వమే చొరవ చూపాలి. పిడిఎస్ ద్వారా ఇంటింటికి డోర్ డెలివరీ ద్వారా నిత్యావసరాలను సరఫరా చేయాలన్నారు నాయుడు.  వ్యక్తిగత పరిశుభ్రత అందరూ పాటించాలి. అందుబాటులో ఉన్న శానిటైజర్లు, సబ్బుల ద్వారా ఎప్పటికప్పుడు చేతులు కడుక్కోవాలి. టచ్ పాయింట్స్ పూర్తిగా తగ్గించుకోవాలి. తలుపులు తీసినప్పుడు, వేసినప్పుడు, లిప్ట్ పాయింట్స్, డోర్ బెల్స్ తదితరాల వినియోగంలో జాగ్రత్తలు పాటించాలి. శానిటైజర్స్,మాస్క్ లు ఇతర పారిశుద్య వస్తువులపై పన్నులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రద్దు చేయాలి. కరెన్సీ నోట్లు, నాణేల వినియోగంలో జాగ్రత్తలు పాటించాలి. ఆన్ లైన్ లావాదేవీలకు ప్రాధాన్యం ఇవ్వాలి. గ్రామాలు,వార్డులలో పరిశుభ్రత పాటించాలి. ఆయా శాఖలు శరవేగంగా స్పందించి పారిశుద్య చర్యలు చేపట్టాలి. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని కూడా నాయుడు సూచించారు.

భారత్ బంద్ వైపు ప్రధాని మొగ్గు 

ఈ రోజు రాత్రి  ప్రధాని మోదీ భారత్ బంద్ ప్రకటించే అవకాశం. రాష్ట్రాలకు సీఆర్ఫీఎఫ్,ఆర్మీ బలగాలోచ్చే అవకాశం. భారత్ లో కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో, ప్రధాని చేయబోయే ప్రకటన కీలకం కాబోతోందని తెలుస్తోంది. ముంబైలో మూడుకు చేరిన మృతుల సంఖ్య. నిన్న సాయంత్రం ప్రాణాలు కోల్పోయిన 65 ఏళ్ల వ్యక్తి. భారత్ లో కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తోంది. ప్రమాద ఘంటికలను మోగిస్తోంది. ఈరోజుకు దేశ వ్యాప్తంగా కరోనా యాక్టివ్ కేసులు 446కి చేరుకున్నాయి. నిన్న ఒక్క రోజే 99 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. మొత్తం 9 మంది ఈ మహమ్మారి బారిన పడి ప్రాణాలను పోగొట్టుకున్నారు. ముంబై నగరంలో ముగ్గురు మరణించారు. నిన్న సాయంత్రం 65 ఏళ్ల వ్యక్తి చనిపోయారు. ఈయన  ఈనెల  15న యూఏఈ నుంచి అహ్మదాబాద్ వచ్చారు. మార్చి 20న అక్కడి నుంచి ముంబైకి వచ్చారు. కరోనా లక్షణాలతో ఉన్న ఆయనను కస్తూర్బా ఆసుప్రతిలో చేర్చారు. చికత్స పొందుతూ ఆయన నిన్న సాయంత్రం చనిపోయారు. ఈ పరిస్థితులన్నింటి నేపథ్యంలో , ప్రధాని ఈ రాత్రి చేయబోయే ప్రసంగం లో వచ్చే నెలాఖరు వరకూ నేషనల్ లాక్ డౌన్ ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే దేశం లోని అన్ని రాష్ట్రాల నుంచి, ఆయా రాష్ట్రాల్లో ఉన్న మిలిటరీ బలగాల లెక్కల్ని కేంద్రం అడిగి తీసుకున్నట్టు సమాచారం.

ప్రతి రోజు 20వేల మందికి కరోనా టెస్టులు!

క‌రోనా ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా వుండండి! నిర్లక్ష్యం వద్దంటున్న కిషన్ రెడ్డి. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 15 లక్షల 24 వేల 266 మందికి క‌రోనా వైర‌స్‌కు సంబంధించి స్క్రీనింగ్ చేసిన‌ట్లు కిషన్ రెడ్డి వెల్లడించారు. దేశంలో 492 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆయ‌న తెలిపారు. 37 మంది డిశ్చార్జ్ అయినట్లు చెప్పారు. 69వేల 436 మందిని హౌస్ క్వారంటైన్ చేశామన్నారు. 20,707 మంది శాంపిల్స్‌ టెస్ట్ చేశామని వివ‌రించారు. ల్యాబ్‌ల సంఖ్యను 118కి పెంచామని కిషన్ రెడ్డి వెల్లడించారు. దేశ వ్యాప్తంగా 94,963 క్వారంటైన్ బెడ్లను సిద్ధం చేశామన్నారు. ప్రతి రోజు 20వేల మందికి కరోనా టెస్టులు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కేంద్రం ఖర్చుతో 48 దేశాల నుంచి 2040 మంది భారీతీయులను తీసుకొచ్చామన్నారు. కరోనా విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, విదేశాల నుంచి వచ్చిన వాళ్ల కుటుంబాలకు కరోనా సోకుతోందని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కరోనా నివారణ కోసం చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కరోనా రాదనుకునే భావన ఎవరిలో ఉండొద్దని హెచ్చరించారు. కరోనా వైరస్‌కు ధనిక, పేద, గ్రామం, నగరం అనే తేడా ఏమీ లేదని, ముందస్తు జాగ్రత్తలే మనల్ని రక్షిస్తాయని చెప్పారు.

విశృంఖల శృంగారానికి తెర దించిన ఐరోపా సెక్స్ క్యాపిటల్

* ' వైఫ్ స్వాపింగ్ ' కు స్వస్తి చెప్పాలని దేశ ప్రజలకు బెల్జియం ఆరోగ్య మంత్రి డే బ్లాక్ విజ్ఞప్తి * కరోనా దెబ్బకు, విచ్చలవిడి శృగారం వద్దని బెల్జియం ప్రకటన    * ముగ్గురు కి మించి పాల్గొనే విచ్చలవిడి మదన కేళికి ' షార్ట్ బ్రేక్ ' ప్రకటించాలని పార్లమెంట్ సాక్షిగా విన్నపం * మానవ-జంతు శృంగారానికి మాత్రం మినహాయింపు నిచ్చిన బెల్జియం * కింగ్ లియోపోల్డ్-II అలవాటు చేసిన వికృత సంస్కృతి తో బెల్జియం దేశానికి చెడ్డపేరు * 16 వ శతాబ్దం లో ఆంధ్ర ప్రాంతం లో చెలరేగిన ఈ విష సంస్కృతికి చరమ గీతం పాడిన ఆంధ్ర పాలకుడు బెల్జియం ప్రభుత్వం ఒక కఠోర నిర్ణయాన్ని ప్రకటించింది. విచ్చలవిడి , విశృంఖల శృంగారానికి తెర దించాల్సిందిగా ఆ దేశ పౌరులకు పార్లమెంట్ సాక్షిగా విజ్ఞప్తి చేసింది. భార్యల మార్పిడి ని తమ దేశ సంస్కృతిలో భాగంగా భావించే బెల్జియం దేశానికి యూరోప్ సెక్స్ క్యాపిటల్ అని కూడా పేరుంది. అంతే కాదు బెల్జియం అంటే బీర్బలుల దేశం గా ( అంటే బీరు ను అమితంగా సేవించే ప్రజలున్న దేశంగా ) మిగతా ప్రపంచం అంతా కూడా బెల్జియం ను పిలుస్తుందనే విషయం చాలా మందికి తెలుసు. సరే, ఇదేదో బయట దేశాల వారు అనుకుంటే లేదా గొణుక్కుంటె, అదేదో తేలిగ్గా తీసేయచ్చులే అనుకునే వారికి కళ్ళు బైర్లు కమ్మేలా, ఆ దేశ ఆరోగ్య శాఖా మంత్రి డే బ్లాక్ ఏకంగా పార్లమెంట్ లోనే ప్రకటించిందంటే, ఆ దేశం లో విశృంఖల శృంగారానికి ఎంత ప్రయారిటీ ఇస్తారో వేరే చెప్పక్కర్లేదు. తమ తమ ఇళ్లల్లో ఇద్దరికి మించి ఎవరూ శృంగారం లో పాల్గొనవద్దని, కోవిడ్ -19 వైరస్ పై పోరాటం లో భాగంగా 'సామాజిక దూరం' పాటించాలని, అందువల్ల ముగ్గురు లేదా అంతకు మించిన వారు పాల్గొనే  'నాన్ ఎసెన్షియల్ సెక్సువల్' కార్యకలాపాలను బెల్జియం లో నిషేధిస్తున్నామని మహిళ కూడా అయినా ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి డే బ్లాక్ ఏకంగా పార్లమెంట్ లోనే ప్రకటించింది. బెల్జియం దేశానికి బాహ్య ప్రపంచం లో ' బీర్ డ్రింకిన్గ్, ఇంకా " ఐరోపా సెక్స్ క్యాపిటల్" అని ఉన్న చెడ్డ పేరు దృష్ట్యా, అనివార్యంగా తానూ పార్లమెంట్ లో ఈ ప్రకటన చేయాల్సి వచ్చిందని ఆరోగ్య మంత్రి డే బ్లాక్ స్పష్టం చేశారు. భార్యల మార్పిడి, అలాగే ముగ్గురుకి మించి పాల్గొనే విశృంఖల శృంగార కార్యకలాపాలు , బెల్జియం దేశం లో కోవిడ్ -19 అదుపులోకి వచ్చేంతవరకూ నిషేధిస్తున్నట్టు ఆమె పార్లమెంట్ వేదికగా ప్రకటించారు. అయితే, ఒకరు లేదా ఇద్దరి మధ్య సాగే విచ్చలవిడి శృంగార కార్యకలాపాలను, అంటే -హస్త ప్రయోగం, యానల్ సెక్స్, ఓరల్ సెక్స్ , ఇంకా మానవ-జంతు శృంగార (బెస్టాలిటీ) కార్యకలాపాలను మాత్రం బెల్జియం ఆరోగ్య మంత్రి నిషేధించలేదు. ఇప్పుడు ప్రకటించిన శృంగార నిషేధాజ్ఞలు మానవ శృంగారానికి పరిమితమని, మానవ-జంతు శృంగార కార్యకలాపాలకు ఇవి వర్తించవని ఆమె ప్రకటించటం తో మీడియా ప్రతినిధులు నిర్ఘాంత పోయారు. 2018 లో జరిగిన ఒక సర్వే ప్రకారం- బెల్జియం లోని 78 శాతం దంపతులు ' భార్యల మార్పిడి ' శృంగారాన్ని బహిరంగంగానే ప్రాక్టీస్ చేస్తారని వెల్లడైంది. 19 వ శతాబ్దం లో బెల్జియం ను పాలించిన కింగ్ లియోపోల్డ్-II ఈ తరహా వికృత శృంగార క్రీడ ను తమ దేశ సంస్కృతి లో ఒక భాగం గా మార్చేసినట్టు చారిత్రిక ఆధారాలున్నాయి.  74 ఏళ్ల వయసులో మరణించేంత వరకూ కూడా కింగ్ లియో పోలండ్-II ఈ 'వైఫ్ స్వాపింగ్ ' కు,  తమ సంస్కృతిలో భాగంగా విస్తృత ప్రచారం కల్పించినట్టు చరిత్ర కారులు చాలా చోట్ల ప్రస్తావించారు. అయితే, ఈ తరహా వికృత , విశృంఖల స్వేచ్ఛా శృంగార మదన కేళి 16 వ శతాబ్దం నుంచి ఆంధ్ర ప్రాంతం లోని కృష్ణా, గోదావరీ పరీవాహక ప్రాంతాల్లో ' కంచుకోత్సవం ' పేరిట రాజ ప్రాసాదాలు ప్రోత్సహించిన సందర్భాల గురించి పలు చారిత్రిక గ్రంధాల్లో అంతర్లీన ప్రస్తావన ఉంది. అయితే, ఆ విచ్చలవిడి క్రీడకు చరమ గీతం పాడిన సంస్కరణల రూపకర్త అయిన , ఒక ఆంధ్ర పాలకుడి గురించి 'తెలుగు వన్ ' ప్రత్యేక కథనం త్వరలో మీ కోసం..

కర్ఫ్యూ ఉల్లంఘిస్తే 2లక్షల‌రూపాయ‌ల‌ జరిమానా!

సౌదీ అరేబియాలో మహమ్మారి కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో కింగ్ సల్మాన్ ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా 21 రోజుల పాటు అక్కడి సర్కార్ కర్ఫ్యూ విధించింది. కర్ఫ్యూ సమయంలో ఎవరైతే ఆంక్షలను ఉల్లంఘిస్తారో వారిపై కఠిన చర్యలు ఉంటాయని తాజాగా అంతర్గత మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. 10వేల రియాల్స్(రూ.2లక్షల 2వేలు) జరిమానాతో పాటు జైలుకి కూడా వెళ్లాల్సి ఉంటుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. అయితే వైద్య రంగానికి చెందిన ఉద్యోగులు, సెక్యూరిటీ, మిలిటరీ అధికారులకు మినహాయింపు ఇచ్చింది. సౌదీలో ఇప్పటి వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 562కి చేరింది. ఇక కర్ఫ్యూ సమయంలో దేశ పౌరులతో పాటు ప్రవాసులు కూడా ఇళ్లకే పరిమితం కావాలని అధికారులు సూచించారు.

షహీన్‌బాగ్ శిబిరాన్ని ఎత్తేసిన పోలీసులు

కరోనా వైరస్ వ్యాపిస్తున్న తరుణంలో ఢిల్లీ లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో సీఏఏ వ్యతిరేక నిరసన శిబిరాన్ని తొలగించామని పోలీసులు చెప్పారు. పెద్ద సంఖ్యలో వచ్చిన సాయుధ పోలీసులు పొక్లెయినర్ల సాయంతో శిబిరాన్ని కూల్చివేసి లారీలో టెంటు, కుర్చీలు, ఇతర సామాన్లను తరలించారు. దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ అమ‌లులో వుంది. ఈ నేప‌థ్యంలో ఢిల్లీ పోలీసులు మంగళవారం ఉదయం షహీన్‌బాగ్ నిరసన శిబిరాన్ని బలవంతంగా ఖాళీ చేయించారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కొన్ని నెలలుగా వందలాది మంది మహిళలు షహీన్‌బాగ్ శిబిరంలో నిరసన తెలుపుతున్నారు. ఈ శిబిరంలో ఉన్న కొందరు మహిళలు ప్రతిఘటించినా పోలీసులు 9 మందిని అదుపులోకి తీసుకొని షహీన్‌బాగ్ నిరసన శిబిరాన్ని ఖాళీ చేయించారు. 144 సెక్షన్ ను ఉల్లంఘించారని 9మంది నిరసనకారులపై ఢిల్లీ పోలీసులు కేసులు నమోదు చేశారు.

రాజ్యసభ ఎన్నికల్ని వాయిదా వేసిన ఈ.సి.

కరోనా వైరస్  నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం రాజ్యసభ ఎన్నికలు వాయిదా వేసింది. గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మార్చి 26న రాజ్యసభ ఎన్నికల పోలింగ్ జరగాల్సి ఉంది. దేశంలోని పది రాష్ట్రాల్లో 37 సీట్లు ఇప్పటికే ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 18 సీట్లకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ మిగిలిన సీట్లకు దాఖలైన నామినేషన్లు పరిశీలన పూర్తయింది. కానీ ఎన్నికలు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది ఈ.సి. ప్ర‌క‌టించింది. తదుపరి పోలింగ్, కౌంటింగ్ తేదీలను ప్రకటించనున్నారు.  వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO సైతం కరోనాను ప్రపంచ అంటువ్యాధిగా ప్రకటించింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో రాజ్యసభ ఎన్నికలను వాయిదా వేస్తున్నాం. ఇప్పటి వరకు జరిగిన ప్రక్రియ అలాగే కొనసాగుతుంది. కరోనా వైరస్ తదుపరి పరిస్థితిని సమీక్షించిన అనంతరం తేదీలు ప్రకటిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటనలో వెల్ల‌డించింది.

ఇండియాలో 25 లక్షలమంది మృత్యువాత పడవచ్చట‌!

భారత్‌లో కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తోంది. ప్ర‌స్తుతం 500 కేసుల‌తో దూకుడు పెంచింది. వీరిలో 40 మంది విదేశీయులు ఉన్నారు. కరోనా బారిన పడి ఇప్పటి వరకూ మన దేశంలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంటికే పరిమితం కావడం, సామాజిక దూరం పాటించడం వల్ల కరోనా కేసుల సంఖ్యను 62 శాతం వరకు తగ్గించొచ్చని.. తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటితో పోలిస్తే కేసుల సంఖ్యను 89 శాతం వరకు తగ్గించగలమని ఐసీఎంఆర్ తెలిపింది. కరోనా లక్షణాలు కనిపించని వారిని కనీసం 75 శాతం మందిని గుర్తించగలిగితే కరోనా వేగంగా వ్యాప్తి చేయకుండా అడ్డుకోగలమని తెలిపింది. కరోనా లక్షణాలు కనిపించని 90 శాతం మందిని గుర్తించగలిగితే.. ఈ వ్యాధి సగటు సమయాన్ని 20 రోజులకు వాయిదా వేయగలమని ఐసీఎంఆర్ అంచనా వేసింది. ఇండియన్ మెడికల్ కౌన్సిల్ రీసెర్చ్ భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తిని అంచనా వేస్తూ ఒక జర్నల్ ను ప్రచురించింది. వైరస్ వ్యాప్తి ఫిబ్రవరి నుంచి 50రోజుల వ్యవధిలో ఢిల్లీలో ఒక కోటి కేసులు - ముంబైలో 40లక్షల కేసులు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. అయితే మెడికల్ కౌన్సిల్ రీసెర్చ్ ప్రచురించిన ఈ జర్నల్ పూర్తిగా మ్యాథమెటికల్ మోడల్ అని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ్ తెలిపారు. వైరస్ ఇండియాలో ప్రవేశించడానికి ద్వారాలైన ఢిల్లీ - ముంబై - కోల్ కతా - బెంగళూరు వంటి నగరాల్లోని విమానాశ్రయాలపై ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఈ రిపోర్ట్ను తయారుచేసినట్టు తెలిపారు. దేశంలో కరోనా వ్యాప్తి ఇలాగే ఉంటె 30 కోట్ల మంది భారతీయులకి కరోనా సోకే అవకాశం ఉంది అని cddep డైరెక్టర్ రామణన్ లక్ష్మి నారాయణ ఆందోళన వ్యక్తం చేసారు. ఇప్పటినుండే ప్రజలు ప్రభుత్వాలు జాగ్రత్తలు పాటిస్తే ఈ సంఖ్యని 20 కోట్ల వరకు తగ్గించవచ్చు అని - లేదంటే దాదాపుగా 25 లక్షలమంది మృత్యువాత పడవచ్చని హెచ్చరించారు. అమెరికా బ్రిటన్ లో వైరస్ వ్యాప్తి పై అధ్యయనం చేసి ఈ వివరాలు చెప్పినట్టు అయన వెల్లడించారు.

కరోనా చావు ఎలా వుంటుందో తెలుసా?

ఒక పేషెంట్ చనిపోతే  పిక్ లో చూపించినట్లుగా బాగ్ లో చుట్టి  ప్లాస్టిక్ బాక్స్ లో సీల్ వేస్తారు కనీసం బాడీ ని ఇంటికి కూడా పంపించరు కాలిన తర్వాత బూడిద  కూడా ఇస్తారో ఇవ్వరో  తెలియని పరిస్థితి ఇది ఒక భయంకరమైన  వీడ్కోలు... ఇంతలా ఆ మహమ్మారి విజృంభించకూడదని కేంద్ర  రాష్ట్ర  ప్రభుత్వాలు లాక్ అవుట్ ప్రకటిస్తే కనీసం పట్టించుకోకుండా  రోడ్లపై తిరుగుతున్న  మిమ్మల్నెమనాలి. ఒక వారానికి సరిపడా  సరుకులు  లేవా మీ మీ ఇళ్లల్లో.... ఒక వారం ఇంట్లో ఉండలేరా  పెళ్ళాం పిల్లలతో ... దేశ భవిష్యత్ ఆలోచించిన  పెద్దలే  స్వయం  నిర్బంధం చేసుకుంటుంటే  నీకేమైందిరా ద‌రిద్రుడా.... మాములు జబ్బైతే  నువ్వొక్కడివే  పోతావ్  ఇది గాలితో కలిసి నిన్నూ నీ కుటుంబాన్ని ఈ సమాజాన్ని  కూడా నాశనం చేయగలిగే శక్తివంతమైన వైరస్ అని ఇంకెప్పుడు తెలుసుకుంటావ్ ...  రెండవ దశ లో ఉంది కాబట్టే ఇలా అయినా కంట్రోల్ చేయగలవు నీ వంతుగా..  స్టేజి దాటిందో  పర్యవసానాన్ని  ఊహించలేవు గుర్తు పెట్టుకో.. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకో...

ఆర్టికల్ 360 కింద అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తారా?

ప్రాణాంతక మహమ్మారి కరోనా వైరస్ కారణంగా అతలాకుతలం అవుతున్న దేశ ఆర్థిక వ్యవస్థను చక్కబెట్టేందుకు కేంద్రం ఆర్థిక ఎమెర్జెన్సీని విధించనుందా? ప్రస్తుత పరిస్థితుల్లో దీనికి అవకాశం కల్పించే ఆర్టికల్ 360ని ఆశ్రయించడమే మార్గమని నరేంద్ర మోదీ ప్రభుత్వం భావిస్తోందా? దేశ వ్యాప్తంగా ఇప్పుడు వ్యక్తమవుతున్న ఊహాగానాలివి. ప్రధాని నరేంద్ర మోదీ గానీ, ప్రభుత్వ అధికారులు గానీ ఎవరూ ఇప్పటి వరకు ఆర్టికల్ 360 ఊసెత్తకపోయినప్పటికీ, సోష‌ల్ మీడియాలో ఈ అంశం చ‌క్క‌ర్లు కొడుతోంది. భారత సెక్యురిటీ మార్కెట్లు ఇవాళ ఘోరంగా పతనం కావడంతో ఇక ఆర్టికల్ 360 విధించడం ఖాయమన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఎన్నడూ లేని విధంగా సెన్సెక్స్ ఏకంగా 3,934 పాయింట్లు పతనమైంది. ట్రేడింగ్ ముగిసే సమయానికి 25,981 వద్ద క్లోజ్ అయ్యింది. మరోవైపు డాలర్‌తో పోల్చితే రూపాయి విలువ సైతం 76 పైసలకు పడిపోయింది. ఆర్థిక వ్యవస్థపై కరోనా వైరస్ తీవ్ర ప్రతికూల ప్రభావం చూపించడమే దీనికి కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. ఆర్టికల్ 360 అంటే ఏమిటి? ప్రధాన మంత్రి, కేంద్ర మంత్రి మండలి సలహా మేరకు దేశంలో ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించేందుకు రాష్ట్రపతికి అధికారమిచ్చే చట్టమే ఆర్టికల్ 360. దీని ద్వారా రాష్ట్రాలు తమ ఆర్ధిక వనరులను ఎలా ఉపయోగించాలో ఆదేశించే అధికారం కేంద్రానికి లభిస్తుంది. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను సవరించేందుకు కూడా ఈ చట్టంతో కేంద్రానికి అధికారం కల్పిస్తుంది. ‘‘దేశ ఆర్ధిక వ్యవస్థ స్థిరత్వానికి, లేదా దేశంలోని ఏదైనా ప్రాంతానికి చెందిన ఆర్థిక వ్యవస్థకు ప్రమాదం ముంచుకొచ్చే పరిస్థితి ఉందని రాష్ట్రపతి భావిస్తే.. అధికారిక ప్రకటన ద్వారా ఆయన దీన్ని అమల్లోకి తేవచ్చు..’’ అని ఈ చట్టంలోని 1వ ప్రకరణం చెబుతోంది. ఒక వేళ ఆర్టికల్ 360ని అమల్లోకి తీసుకొస్తే ఆ తర్వాతి రెండు నెలల వరకు లేదా రాష్ట్రపతి దీన్ని రద్దు చేసినట్టు ప్రకటించే వరకు ఇది చెల్లుబాటు అవుతుంది. ఒకవేళ 2 నెలలకు మించి పొడిగిస్తే.. దీన్ని పార్లమెంటు ఉభయ సభల్లో ప్రవేశపెట్టి ఆమోదించుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రంలో, అరుదైన సందర్భాల్లో, రాజ్యాంగ యంత్రాంగం పూర్తిగా విఫలమయ్యే వేళ పరిస్థితుల్ని కేంద్రం తన అధీనంలోకి తెచ్చుకోవడానికి, చక్కదిద్దడానికి ఉద్దేశించబడిన ఆర్టిక‌ల్ 360 అధికరణాన్ని ఉపయోగించడానికి కేంద్ర ప్రభుత్వం స‌న్న‌ధం అవుతోంద‌నే ప్ర‌చారం విస్తృతంగా జ‌రుగుతోంది. అయితే ఆర్టికల్ 360 కింద అత్యవసర పరిస్థితి ఇంతవరకు జారీ చేయబడలేదు. ఈ కరోనా మహమ్మారి భారతీయ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్ర‌భావం చూపుతోంది. 72 ఏళ్ళ వెనుక‌కు నెట్టేసింది. 1. రిజర్వ్ బ్యాంక్ మొత్తం చరిత్రలో ఇంతకు ముందెన్నడూ చేయని భారతీయ ఆర్థిక వ్యవస్థపై 90 మంది వ్యక్తులతో ఒక రిజర్వ్ బ్యాంక్ ఇప్పటికే ఒక యుద్ధ గదిని ఏర్పాటు చేసింది. 2. విదేశీ పెట్టుబడిదారులు కేవలం 15 ట్రేడింగ్ సెషన్లలో భారత మార్కెట్ నుండి 1.08 లక్షల కోట్ల రూపాయలను ఉపసంహరించుకున్నారు. 3. దాదాపు 80% భారతీయ కంపెనీలు తమ ఉద్యోగులను ఇంటి నుండే పని చేయమని అడుగుతున్నాయి, మ‌రి కొన్ని కంపెనీలు చాలా మంది ఉద్యోగులను కూడా తొలగించాయి. 4. దేశంలోని దాదాపు 80% ప్రధాన ఆర్థిక కేంద్రాలు బెంగళూరు, ముంబై, పూణే, Delhi , లక్నో, కాన్పూర్, హైదరాబాద్, జైపూర్, చెన్నై, కోల్‌కత్తా, గుర్గావ్, నోయిడా, అహెందాబాద్, సూరత్‌తో సహా లాక్డౌన్లో ఉన్నాయి. 5. యుఎస్ డాలర్ భారత కరెన్సీకి వ్యతిరేకంగా అత్యధిక విలువను కలిగి ఉంది, 1 USD 75.62 కు సమానం. 6. ఈ వ్యాసం రాసే సమయంలో భారతదేశంలో కరోనా కేసులు 470 కి చేరుకున్నాయి. 7. హోటళ్ళు, రెస్టారెంట్లు, నైట్ క్లబ్‌లు, బార్‌లు, విమానయాన సంస్థలు, బిపిఓ, టూరిజం, ఎంటర్టైన్మెంట్ & బాలీవుడ్, ఆటో-మొబైల్, ఏవియేషన్, హాస్పిటాలిటీ, దుస్తులు, కన్స్యూమర్ డ్యూరబుల్స్ మరియు ఎలక్ట్రానిక్స్, పౌల్ట్రీ మరియు సీఫుడ్, నిర్మాణం, రవాణా, రైల్వేతో సహా అనేక రంగాలు చెత్తగా ఉన్నాయి ఈ మహమ్మారి దెబ్బతింది. 8. చమురు-పెట్రోల్, భద్రతా సేవా పరిశ్రమ మరియు వారి ఆదాయాలపై ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా పైన పేర్కొన్న రంగాలపై ఆధారపడిన అనేక ఇతర రంగాలు కూడా వారి ఆదాయాలపై భారీ ప్రభావాన్ని చూపాయి. 9. కరోనావైరస్ నిప్పు వ‌లే వ్యాప్తి చెందుతోంది మరియు సమీప భవిష్యత్తులో భారతీయ ఏజెన్సీలు దీనిని నియంత్రించలేవు, పొర‌పాటున నాల్గవ దశలోకి ప్రవేశిస్తే స్వతంత్ర భారతదేశ చరిత్రలో అత్యంత ఘోరమైన సంక్షోభం ఎదుర్కోక త‌ప్ప‌దు. 10. ప్రస్తుతం కరోనావైరస్ ధనవంతులు మరియు ఉన్నత వర్గాలలో మాత్రమే ఉంది, వారు ఆర్థిక భారాలను నిర్వహించగలుగుతారు మరియు ఆరోగ్య సంరక్షణ, పని, ఆర్థిక పొదుపు పరంగా బహుళ వనరులను కలిగి ఉంటారు మరియు ఇంకా స్వీయ వేరుచేయడం మరియు వ్యాప్తి చెందకుండా నిరోధించగలరు కాని ఒకసారి అది ప్రజలలోకి ప్రవేశిస్తుంది. పేదరిక రేఖ క్రింద, దానిని నియంత్రించడం దాదాపు అసాధ్యం మరియు పరిస్థితిని నిర్వహించడానికి భారతదేశ ఆదాయంలో పెద్ద భాగం పెట్టుబడి అవ‌స‌రం అవుతుంది. 11. ప్రస్తుత ప్రభుత్వానికి ఆర్‌బిఐ బహుళ మొత్తాలను పెద్ద మొత్తంలో ఇచ్చిన తరువాత రిజర్వ్ బ్యాంక్ నిల్వ చేసిన నిధులు ఆకస్మిక నిధులు & అత్యవసర నిధులతో ఇప్పటికే క్షీణించాయి. 12. భారతదేశంలో అనేక ప్రైవేటు మరియు ప్రభుత్వ బ్యాంకులు అత్యధిక ఎన్‌పిఎను కలిగి ఉన్నాయి మరియు రుణ ఎగవేతదారులు త్వరలో దాన్ని చెల్లించే మానసిక స్థితిలో లేరు. 13. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఇ) & బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బిఎస్ఇ) తో సహా భారతదేశ వాటా మార్కెట్లు నిరంతరం పడిపోతున్నాయి. 1 నుండి 13 వరకు అన్ని పాయింట్లను కనెక్ట్ చేస్తోంది. కరోనావైరస్ తో పోరాడటం మరియు దేశ ఆర్థిక వ్యవస్థను నియంత్రించడం ప్రస్తుత ప్రభుత్వానికి దాదాపు అసాధ్యమని అనిపిస్తుంది. ఆర్థిక వ్యవస్థను నియంత్రించడానికి ఎటువంటి చర్యలు సహాయపడకపోతే, నరేంద్ర మోడీకి ఆర్టికల్ 360 ప్రకారం భారతదేశంలో ఆర్థిక అత్యవసర పరిస్థితిని విధించడం తప్ప వేరే మార్గం ఉండదు మరియు దేశం అన్ని కాలాలలోనూ అత్యంత ఘోరమైన మరియు భయంకరమైన మాంద్యంలోకి వెళుతుంది.

హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ ను వైద్యుల పర్యవేక్షణ లోనే వాడాలి: ఆంధ్ర ప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ 

హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను వినియోగిస్తే కరోనా రాదనే భావన కొన్ని పత్రికా కథనాల ద్వారా ప్రచారం లోకి వచ్చిందనీ, ఇది వాస్తవం కాదనీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.  సాధారణ వ్యక్తులెవ్వరూ కూడా ఈమందును వినియోగించకూడదు. దుష్పరిణామాలకు దారితీస్తుందని కూడా ఆ శాఖ స్పష్టం చేసింది. కరోనా సోకిన వారికి మాత్రమే ఈమందును వాడాలని అఖిల భారత వైద్య పరిశోధన మండలి స్పష్టంచేసింది. ఇదికూడా ప్రత్యామ్నాయంలో భాగమే నని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ  పేర్కొంది.  అంతేకాక కరోనా సోకిన రోగులకు, సేవలందిస్తున్న వైద్యులకు, సిబ్బందికి ముందు జాగ్రత్తగా మాత్రమే హైడ్రాక్సీ క్లోరోక్వీన్‌ వినియోగిస్తున్నారు. ఇది పూర్తిగా వైద్యుల పర్యవేక్షణలో దీన్ని పాటిస్తున్నారు. అందువల్ల కరోనా రాకుండా ఉండాలంటే. హైడ్రాక్సీ క్లోరోక్వీన్‌ వాడితే సరిపోతుందన్న భావనలోకి ప్రజలెవ్వరూ వెళ్లవద్దని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విజ్ఞప్తి చేసింది.  సాధారణవ్యక్తులెవ్వరూ కూడా ఈ మందును వినియోగించవద్దని కోరుతున్నాం.  హైడ్రాక్సీ క్లోరోక్వీన్‌ను కేవలం నిపుణుల పర్యవేక్షణలో, వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే ఇస్తున్నారు. కోవిడ్‌ సోకినవారికి, వారితో ఉన్నందువల్ల వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నవారికి పూర్తిగా వైద్యుల పర్యవేక్షణలో ఇస్తున్న మందు మాత్రమే. మందు తీసుకున్న వారు పూర్తి వైద్య పర్యవేక్షణలో ఉంటున్నారు. ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించాలని ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ విజ్ఞప్తి చేసింది.

ఆంధ్ర ప్రదేశ్ లో పదో తరగతి పరీక్షలు వాయిదా

 ఆంధ్ర ప్రదేశ్ లో పదో తరగతి పరీక్షలు వాయిదా వేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. వాస్తవానికి మార్చ్ 6 వ తేదీన జరిగిన సమావేశం లో, ఏపీలో స్ధానిక సంస్ధల ఎన్నికల నిర్వహణ కారణంగా ఈ నెల 23 నుంచి జరగాల్సిన పదో తరగతి పరీక్షలు వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘానికి సమాచారం ఇచ్చింది. స్ధానిక ఎన్నికలతో పదోతరగతి పరీక్షల వాయిదా ఏపీలో ఈ నెల 23 నుంచి జరగాల్సిన పదో తరగతి పరీక్షలను స్ధానిక సంస్ధల ఎన్నికల నేపథ్యంలో వాయిదా వేసుకుంటున్నట్లు ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల సంఘానికి సమాచారం ఇచ్చింది. ఈ విషయాన్ని మార్చ్ 6 న రాజకీయ పార్టీలతో సమావేశం తర్వాత నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వెల్లడించారు. అయితే ప్రభుత్వం నుంచి మాత్రం అధికారిక ప్రకటన ఏదీ వెలువడలేదు.   ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను ఈ నెల 21, 24 తేదీల్లోనూ, మున్సిపల్ ఎన్నికలను ఈ నెల 27న నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం లోగడ నిర్ణయించింది. ఈ మేరకు షెడ్యూల్ కూడా విడుదల చేసింది. అదే సమయంలో ఈ నెల 23 నుంచి పదో తరగతి పరీక్షలు మొదలు కావాల్సి ఉంది. అసలే ఎన్నికల సీజన్ కావడంతో పదో తరగతి పరీక్షలకు సిద్దమయ్యే అభ్యర్ధులకు ప్రిపరేషన్ లో ఇబ్బందులు ఎలాగో తప్పవు. కనీసం పరీక్షలు అయినా వాయిదా వేస్తే ఊరట లభిస్తుందని తల్లితండ్రులు భావించారు. అయితే, తదనంతర పరిణామాల్లో, కరోనా వైరస్ కారణంగా మొత్తం ఎన్నికల షెడ్యూల్ నే ఆరు వారలు వాయిదా వేస్తూ ఎన్నికల సంఘం ప్రకటించటం, దరిమిలా, రాష్ట్ర ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి మధ్య ఘర్షణ పూర్వక వాతావరణం నెలొకొనడం అందరికీ తెలిసిన విషయమే. అయితే, కరోనా తీవ్రత దృష్ట్యా, రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు పదో తరగతి పరీక్షల వాయిదా నిర్ణయాన్ని ప్రకటించింది. దీంతో పిల్లలు, వారి తల్లితండ్రులు కూడా ఊపిరి పీల్చుకున్నారు.  

బ్రతకండి.. బ్రతికించండి.. బయటకు వెళ్లకండి...!

ఆరోగ్యమే మహాభాగ్యం. బ్రతికుంటే ఏమైనా చేయవచ్చు. ముందు బ్రతకండి. తరువాతే బ్రతుకుదెరువు గురించి ఆలోచించండి. లేదంటే మన దేశం మరో ఇటలీ ఔతుంది. చైనా వాళ్ళు జనవరి 23 నుంచి ఇంట్లో కూర్చుని lockdown లో ఉంటే 60 రోజుల తరువాత, కొత్త cases రాకుండా ఆగాయి. దీనిని బట్టి మనం ఎన్ని రోజులు - ఎంత జాగ్రత్తగా ఉండాలో ఒక్కసారి బాగా ఆలోచించండి. మాకు ఏమి కాదులే అని అనుకుంటే పొరపాటే. ఒకసారి ఈ వైర‌స్ విస్త‌రిస్తూ పోతే కనీసం 1 కోటి మంది చనిపోతారు. వెల్లుల్లి, అల్లం, హోమియో, పసుపు ఇవన్నీ వైరస్ ని చంపేసేవి అయితే, ప్రపంచం అంతా ఎప్పుడో అది వాడి దీన్ని కంట్రోల్ చేసేది. దయచేసి ఆ వెధవల మాటలు నమ్మకండి. దయచేసి ఇంట్లో ఉండండి. చదువు కోని వాళ్ళకి దీని ప్ర‌ధాన్య‌త‌ చెప్పండి. కొంత డబ్బు చేతిలో ఉంచుకోండి. ATMలు బాంకుల పరిస్థితి ఏమి టో చెప్పలేము. డబ్బు చాలా చాలా జాగ్రత్త గా వాడండి. తిండికి, మందులకీ తప్పితే అనవసరంగా దేనికి రూపాయి వృథా చేయవద్దు. సింపుల్ గా జీవించండి. ఇటలీలో 1000 మందికి 2.5 బెడ్స్ ఉంటే నే అంత మంది చచ్చి పోయారు. మ‌న ఇండియాలో 1000 మందికి 0.5 బెడ్స్ మాత్రమే ఉన్నాయ్ హాస్పిటల్స్ లో. మన హాస్పిటల్స్ లో వసతులు అంతంత మాత్రం. మేము బాగున్నాం, మాకు ఎం కాదు, అని అనుకుంటే పొరపాటే. ఇది గాలి లో నుంచి కూడా వస్తుంద‌ని WHO చెప్పింది. ఇది ఆయుర్వేద, హోమియో, యునాని మరి ఏ ఇతరత్రా పద్దతి ద్వారా తగ్గేది కాదు. అలా తగ్గు తుంది అని లేదా రాదు అని ఎవరైనా చెపితే అది కేవలం వాళ్ళు డబ్బులు చేసు కోవడం కోసమే. దయ చేసి డాక్టర్ల‌కు, నర్సులకు పని పెంచవద్దు. ఎక్కడికి వెళ్లద్దు. మీకు ఎవరి మీద అయిన ప్రేమ ఉంటే, వాళ్ళకి దూరంగా ఉండండి. ముఖ్యంగా, బయట అంతా తిరిగి ఇంట్లో ముసలి వారిని బలి చేయకండి. ఇంటికి రాగానే బట్టలు డెట్టాల్ లో నానబెట్టండి. ఫ్రెష్ గా స్నానం చేసి తరువాత ఇంట్లో మిగతా వారిని కలవండి. బయట నుండి ఇంట్లోకి వచ్చిన పది నిమిషాల్లో మీ స్నానం అయిపోవాలి. దయచేసి ఎవరిదో పెళ్లి అనో, చూద్దాం అనో, చాలా రోజులు అయిందనో పోయి కలవ వద్దు. కావాలంటే, ఫోను contact list చూసి, ప్రతి ఒక్కరితో మాట్లాడండి. నీ ఫోన్లో ఉన్న ప్రతి ఒక్క నంబరుకీ ఈ సమాచారం పంపించు. కరోనా గురించి మాట్లాడు. నీకు తెలిసిన సమాచారం వారికి తెలియ జేయండి. ఇండియా వాళ్ళకి ఇమ్యూనిటీ ఎక్కువ, మాకు ఎండలు ఎక్కువ, వైరస్ చస్తుంది. ఇవన్నీ నిజాలు కావు. అది ఏ temperature లో అయిన వ్యాపిస్తుంది. 1918 లో ఇలానే ఫ్లూ వస్తే భారతదేశంలో 1 కోటి మంది చచ్చి పోయారు. అప్పుడు, రవాణా సదు పాయాలు, ప్రజల కదలిక ఇంత లేదు. అయినా కూడా అంతా వ్యాపించింది. india లో 470 కేసులు మాత్రమే ఉన్నాయి. తక్కువ తీవ్రత అని అనుకోకండి. 1 వారంలోనే ఇటలీ, ఇరాన్ లలో 300 నుంచి 6000-7000 వరకు, 2 వారాలు లో 20,000 కు పెరిగి పోయాయి. ఇప్పుడు రోజుకు వందల మంది చని పోతున్నారు. చేతులు శుభ్రంగా సబ్బు తో కడుక్కోండి. కనీసం 20 సెకన్లు పాటు కడగాలి. ఊరికే మొహం, ముక్కు, నోరు, కళ్ళు, తాకవద్దు. వీలయి నంత ఇంట్లోనే ఉండండి. దగ్గు, జలుబు ఉంటే అస్సలు ఎవరినీ తాకవద్దు. ఏ ఇబ్బంది ఉన్నా, వెంట నే గవర్న మెంట్ ఆసుపత్రికి వెళ్లి పరీక్ష చేయించు కోండి. మాస్క్ వేసుకొని, చేతులు కడుక్కుంటే. కరోనా రాదు అనే భ్రమ లో ఉండకండి. ఫుల్ బాడీ సూటులు వేసు కుని, అన్ని జాగ్రత్తలు పాటిస్తున్న డాక్టర్లకు కూడా ఇది వ్యాపించింది. మనుషు లందరూ ఒకరికొకరు, వీలయి నంత దూరంగా ఉండటం చాలా ముఖ్యం. ఇంట్లో, పని ప్రదేశంలో అందరూ ఒకరి కొకరు, వీలయి నంత దూరంగా ఉండండి. మీకు వైరస్ సోకిందన్న విషయం, మొదటి పది రోజులు మీకు కూడా తెలియదు (incubation period) కానీ, ప్రక్క వారికి వ్యాప్తి చేస్తారు. ఎదుటి వారి ఫేస్ టు ఫేస్, మొహం వంక చూస్తూ మాట్లాడ కండి. వీలయి నంత దూరంగా ఉండి, తల వంచు కొని మాట్లాడండి. కంటికి కనపడ కుండా, ఒకరి నోటి తుంపర్లు వేరొకరి మొహం మీదా. బట్టల మీద పడతాయి. తద్వారా, మీకూ వైరస్ సంక్రమిస్తుంది.

నిశ్శ‌బ్దంగా అన్నీ కుప్ప‌కూలి పోతున్నాయి...!

ఎక్క‌డో చైనాలో వ‌చ్చింది. మ‌న‌కేం కాదులే అనుకున్నాం. చైనా వాళ్లు ఏం చేసినా ఓవ‌ర్ అనుకున్నాం. త‌మ దేశానికే గోడ క‌ట్టుకున్న మొండివాళ్లు, వైర‌స్‌ని కూడా అంతే మొండిగా త‌రిమేశారు. అది కాస్త ప్ర‌పంచం మీదికి వ‌చ్చి ప‌డింది. ఎక్క‌డో ఉంద‌న‌కుంటే , మ‌న ఊరికి కూడా వ‌చ్చేసింది. అమెరికాలోని జాక్స‌న్‌విల్లీలో క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. ఆ ఊరికి మ‌న‌కు ఏ సంబంధం లేదు ఒక‌ప్పుడు.  కానీ ఇప్పుడు మా పిల్ల‌లు అక్క‌డే చ‌దువుతున్నారు. విన్న‌ప్ప‌టి నుంచి టెన్ష‌న్‌. ఇది  ప్ర‌పంచ‌మంత‌టి బాధ‌. న్యూయార్క్‌లో ఆంక్ష‌లు పెడితే నూజివీడులోని వంద‌లాది మంది త‌ల్లిదండ్రులు నిద్ర‌పోరు. కాలిఫోర్నియాలో క‌రోనా వ‌స్తే క‌రీంన‌గ‌ర్‌లోని ఒక త‌ల్లి దుక్కిస్తుంది. ప్ర‌పంచం చిన్న‌దై పోయింద‌ని సంతోష ప‌డ్డాం, ప్ర‌పంచంలో ఎక్క‌డేం జ‌రిగినా దుక్కించాల్సిందే. ప్ర‌పంచంలోనే అన్ని రాజ‌కీయాలు ప‌క్క‌కెళ్లిపోయాయి. అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల గురించి ఎవ‌రికీ ఆలోచ‌న లేదు. సిరియా సంక్షోభంపైన వార్త‌లు లేవు. ఇరాన్ రాజ‌కీయాలు మానేసి ప్ర‌జ‌ల్ని ఎలా కాపాడుకోవాలా అని ఆలోచిస్తూ ఉంది. జిహాద్ అని అరిచేవాళ్లు కూడా ఈ కొత్త శ‌త్రువుకి భ‌య‌ప‌డుతున్నారు. పాకిస్తాన్‌కి ఇపుడిపుడే అర్థ‌మ‌వుతూ ఉంది. తాలిబ‌న్లు కూడా చ‌ర్చ‌లు గురించి మాట్లాడ‌డం లేదు. దేశాల‌కి దేశాలే ఐసోలేష‌న్‌లో వెళ్లిపోవ‌డం ఎప్పుడూ జ‌ర‌గ‌లేదు. పార్కుల్లో మ‌నుషులు లేరు, ఆల‌యాలు ఖాళీ, థియేట‌ర్లు లేవు. మ‌నుషులంద‌రినీ క‌లిపే సంబ‌రాలు, ఉత్స‌వాలు లేనేలేవు. ఈ క‌రోనా మ‌నుషుల్ని ఆర్థికంగా నాశ‌నం చేయ‌డం ప్రారంభించింది. కోళ్ల రైతు దివాళా ద‌శ‌లో ఉన్నాడు. కొనే వాళ్లు లేరు. ఊళ్ల‌లో ఊరికే ఇచ్చినా తీసుకునే వాళ్లు లేరు. దీని మీద ఆధార‌ప‌డిన ల‌క్ష‌లాది మంది బ‌తుకులు ధ్వంస‌మై పోతున్నాయి. క‌రోనా వైర‌స్ ఒక‌రి నుంచి ఇంకొక‌రికి అంటుకున్న‌ట్టు , ఆర్థిక మాంద్యం కూడా అంటువ్యాధే. రోడ్డు మీద చికెన్ ప‌కోడి అమ్మేవాడి ద‌గ్గ‌రి నుంచి రెస్టారెంట్లో చికెన్ బిర్యానీ అమ్మేవాడి వ‌ర‌కు బాధితులే. కోళ్ల‌దాణాకి డిమాండ్ లేక‌పోవ‌డంతో మొక్క‌జొన్న రైతు క‌ష్టాల్లో ఉన్నాడు. షూటింగ్‌లు ఆగిపోయే స‌రికి దేశ వ్యాప్తంగా ల‌క్ష‌లాది మంది సినీ కార్మికులు రోడ్డున‌ప‌డ్డారు. రోడ్డు మీద మ‌నుషులు లేక‌పోయే స‌రికి ఆటో డ్రైవ‌ర్ పెళ్లాం పిల్ల‌లు ప‌స్తులుంటున్నారు. కిరాయి క‌ట్ట‌క‌పోతే ఇల్లు ఖాళీ చేయిస్తారు. కిస్తు క‌ట్ట‌క‌పోతే ఆటో లాక్కుంటారు. ఆక‌లి ఆత్మ‌హ‌త్య‌ల్ని పెంచుతుంది. నేర‌స్తుల్ని చేస్తుంది. వ్యాపారాలు లేక‌పోతే జీఎస్టీ ఆదాయం రాదు. డ‌బ్బులు లేక‌పోతే ప్ర‌భుత్వాలు స‌రిగ్గా న‌డ‌వ‌వు. ఆ భారం ఉద్యోగులు మోయాలి. క‌రోనా దెబ్బ‌తినే ప్ర‌ధాన రంగం మీడియా. అస‌లే అంతంత మాత్రంగానే ఉన్న మీడియాకి యాడ్ రెవెన్యూ త‌గ్గిపోతుంది. అర‌కొర జీతాల‌కి బ‌దులు పూర్తిగా ఇవ్వ‌డం మానేస్తారు. బెంగ‌ళూరులో ప‌నులు దొర‌క్క కొన్ని వేల మంది రాయ‌ల‌సీమ వ‌ల‌స కూలీలు తిరిగి ప‌ల్లెలు చేరుకుంటున్నారు. క‌రోనా ప్ర‌భావం ఇంకొద్ది రోజులు కొన‌సాగినా హైద‌రాబాద్‌లో ఉన్న వేలాది మంది ఒరిస్సా , యూపీ కార్మికులు ఇళ్ల‌కు వెళ్లిపోతారు. ఈ విధ్వంసం సూక్ష్మంగా జ‌రిగిపోతూ ఉంది. ఆయుధాల‌తో అంద‌రినీ వ‌ణికించే అమెరికా కూడా క‌రోనాకి వ‌ణికిపోతూ ఉంది. ఎందుకంటే అది సూక్ష్మ‌జీవి. ఎంత పెద్ద‌వాళ్లైనా దానికి లెక్క‌లేదు. ట్రంప్ కూడా రోజుకి ప‌దిసార్లు చేతులు క‌డుక్కుని ముఖం ద‌గ్గ‌రికి చేతులు రాకుండా చూసుకుంటూ ఉన్నాడట‌. త‌నంత‌ట వాడు లేడు అనుకున్నప్పుడు, మ‌నిషికి తానేంటో ప్ర‌కృతి చూపిస్తూ ఉంటుంది. మ‌నం బాగుండాలి, కానీ మ‌నం మాత్ర‌మే బాగుండాలి అంటే ప్ర‌కృతి ఒప్పుకోదు. ఈ భూమి అంద‌రిదీ. మ‌నిషి రాత‌కోత‌లు నేర్చుకుని త‌న‌ది అని రిజిస్ట‌ర్ చేయించుకుంటున్నాడు.  గూడు ఎక్క‌డ క‌ట్టుకోవాలో తెలియ‌క , పిచ్చిదానిలా తిరిగే ఒక పిచ్చుక‌కి కూడా ఈ భూమ్మీద హ‌క్కుంది. దానికి రియ‌ల్ ఎస్టేట్ తెలియ‌క‌పోవ‌చ్చు. మ‌నం రోడ్ల కోసం చెట్లు న‌రుకుతున్న‌ప్పుడు వేలాది ప‌క్షి పిల్ల‌లు గొంతు ఎండేలా ఏడ్చి చ‌చ్చిపోయి ఉంటాయి. ఒక ఉడ‌త‌ని కూడా దాని బ‌తుకు దాన్ని బ‌త‌క‌నివ్వాలి. లేక‌పోతే మ‌న‌ల్ని బ‌త‌క‌నివ్వ‌ని జీవులు అదే క‌రోనా వైర‌స్ లాంటి సూక్ష్మ‌జీవులు  భూమ్మీద పుడుతాయి. ఇప్పటికైనా కులాల పట్ల, మతాల పట్ల, ప్రాంతం, భాష  అనే వివక్ష లేకుండా బ్రతుకుదాం.