ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు...

- జవాబుదారీతనంతో పని చేయండి  - ఎపి ప్రభుత్వానికి చంద్రబాబు హితవు   కరోనా వ్యాధి నిరోధక చర్యల పట్ల ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దని, ప్రజలకు జవాబుదారీతనంతో సేవలు అందించాలని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఎపి ప్రభుత్వానికి హితవు పలికారు. కరోనాతో ప్రపంచం మొత్తం విలవిలలాడుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.  యూఎస్, స్పెయిన్, ఇటలీలో కరోనా విజృంభిస్తోందని చెప్పారు. భారతదేశంలో  వారం రోజుల్లో 222 శాతం కరోనా పెరగడం ఆందోళనకర పరిణామమని ఆయన వ్యాఖ్యానించారు. సోమవారం హైదరాబాద్ లోని తన నివాసం నుండి చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ఏపీలో వారంలో 1,021 శాతం కరోనా పెరిగిందని, ఇది చాలా ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు. దేశంలో కరోనా పరీక్షలు చాలా తక్కువగా జరుగుతున్నాయని, ఏపీలో కరోనా పరీక్షల పరిస్థితి చాలా దారుణంగా ఉందని ఆయన విమర్శించారు. ఏపీలో కేవలం 6 ల్యాబ్‌లే ఉన్నాయని, టెస్టింగ్‌లు చాలా తక్కువగాజరుగుతున్నాయని చంద్రబాబు ఆరోపించారు. ఏపీలో రోజుకు ఎంతమందికి టెస్టులు చేస్తున్నారో ప్రభుత్వం చెప్పడం లేదని ఆయన విమర్శించారు. వాస్తవాలు బయటకు చెప్పకపోవడం చాలా ప్రమాదకరమని వ్యాఖ్యానించారు.  బాధ్యత కలిగిన వ్యక్తులు జాగ్రత్తగా మానిటర్ చేయాలని, వ్యక్తి, వ్యవస్థ విఫలమైతే చాలా ప్రమాదం వాటిల్లుతుందని ఆయన హెచ్చరించారు. కరోనా విషయంలో ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ప్రభుత్వ సూచనలు పాటిస్తూ, ప్రజలు సహకరించాలని పిలుపునిచ్చారు.  ప్రధాని పిలుపునకు నిన్న దేశ ప్రజలంతా సంఘీభావం తెలిపారన్నారు. తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు ప్రజలు జాగ్రత్త వహించాలని కోరారు. ఇంటి పరిసరాలను ప్రజలు శుభ్రంగా ఉంచుకోవాలని చెప్పారు.  ప్రజలంతా సామాజిక దూరం తప్పనిసరి పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.  పరస్పరం షేక్ హ్యాండ్స్ ఇవ్వడం మానుకోవాలని చెప్పారు. ప్రపంచం మొత్తం ఆర్థిక సంక్షోభం నెలకొందని, అమెరికాలాంటి దేశాల్లో వెంటిలేటర్లు దొరకడం లేదని ఆయన ఆందోళన వెలిబుచ్చారు. యూఎస్ వ్యాప్తంగా  చాలా ఆస్పత్రుల్లో మృతదేహాలు పేరుకుపోయాయని, అంత్యక్రియలు చేయలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనాపై తప్పుడు వార్తల పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రజలను కోరారు. మత, రాజకీయ సదస్సులను నిర్వహించకూడదని తెలిపారు. 60 ఏళ్లు పైబడిన వారు, అనారోగ్య సమస్యలున్నవారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.  కరోనాకు మెడిసిన్ కనుక్కొనే వరకు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చంద్రబాబు సలహా ఇచ్చారు. రాష్ట్రంలో పేదలను ఆదుకోవడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని ఆయన సూచించారు.  రాష్ట్రంలో పేదలకు తొలివిడతగా కనీసం రూ.5 వేలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారని,. తెల్లరేషన్ కార్డుదారులందరికీ డబ్బులు ఇవ్వాలని సూచించారు. కేంద్రం ఇస్తున్న నగదుతో పాటు, రాష్ట్రం కూడా ఇవ్వాలని కోరారు. ఇతరులపై ఆధారపడకుండా రాష్ట్రమే వెంటిలేటర్లను తయారు చేసుకోవాలని ఆయన సలహా ఇచ్చారు. వెంటిలేటర్ల తయారీకి ముందుకొస్తున్న సంస్థలను ప్రభుత్వం ప్రోత్సహించాలని చెప్పారు.  ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారని చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలో మొబైల్ రైతు బజార్లను ఏర్పాటు చేయాలని సూచించారు.  ఆక్వా, హార్టికల్చర్, పౌల్ట్రీ రైతులను ఆదుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.  ఆక్వా ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కోరారు.  ఉద్యోగుల జీతాల్లో కోత విధించడం సరికాదని ఆయన వ్యాఖ్యానించారు. ఉద్యోగుల చేత అవసరమైతే ఇంటినుంచే పని చేయించాలని సూచించారు. డబ్బులు కాంట్రాక్టర్లకు కాదు, ఉద్యోగులకు ఇవ్వాలని హితవు పలికారు. అధికారం ఉంది కదా అని ఇష్టానుసారంగా వ్యవహరించొద్దని ఎపి ప్రభుత్వానికి సూచించారు. మంచి చేయడానికి అధికారం ఉపయోగించుకోవాలని సలహా ఇచ్చారు.  కరోనా కేసులు పెరగడానికి ఓ మతానికి ముడిపెట్టడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.  కేంద్రం నుంచి డబ్బులు వస్తే వైసీపీ వాళ్లు ప్రచారం చేసుకోవడమేంటి? అని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు డబ్బులు పంపిణీ చేయడం దారుణమని వ్యాఖ్యానించారు.  సరైన సమయంలో క్వారంటైన్ చేసి ఉంటే కేసులు పెరిగి ఉండేవి కాదని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వం వాస్తవాలను దాచిపెట్టడం సరికాదని సలహా ఇచ్చారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఓవర్ కాన్ఫిడెన్స్ తో ముందుకెళ్లడంతో అమెరికాకు నష్టం వాటిల్లిందని, ట్రంప్ అసమర్థత చూసైనా జగన్ కళ్లు తెరవాలని చంద్రబాబు హితవు పలికారు. చరిత్రలో ఎప్పుడూ చూడని సమస్య ఇది...  ప్రభుత్వం నిపుణుల సూచనలు తీసుకుని అమలు చేయాలని చంద్రబాబు చెప్పారు.

ప్ర‌పంచానికి లాక్‌డౌన్ శిక్ష కాదు, అవ‌స‌రం!

ఆర్థికంగా న‌ష్ట‌పోయినా ప‌ర్వాలేదు. కానీ ప్రాణాలు కాపాడుకోవ‌డ‌మే ముఖ్యం. బోస్ట‌న్ క‌న్స‌ల్టింగ్ గ్రూప్ స‌ర్వే ప్ర‌కారం జూన్ 3వ తేదీ వ‌ర‌కు లాక్‌డౌన్ కొన‌సాగించాలి. పాజిటివ్ కేసుల సంఖ్య భార‌త్‌లో విప‌రీతంగా పెర‌గ‌నుంద‌ని స‌ర్వే హెచ్చ‌రించింద‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ తెలిపారు. మ‌నిషి జీవితంలో గ‌తంలో ఇలాంటి సంఘ‌ట‌న జ‌ర‌గ‌లేదు. ఇలాంటి ప‌రిస్థితుల్లో గ‌త్యంత‌రం లేదు. వేరే మార్గం లేదు. విచిత్ర‌మైన వ్యాది. మందు లేదు. కాబ‌ట్టి నియంత్ర‌ణ పాటించ‌డ‌మే ప‌రిష్కారం. త‌క్కువ వైర‌స్ లోడ్ అయిన వారే బ్ర‌తికి బ‌య‌ట‌ప‌డుతున్నారు. ఫుల్‌గా ఒవ‌ర్‌లోడై వైర‌స్ మ‌నిషిలో విస్త‌రిస్తే బ్ర‌త‌క‌డం క‌ష్ట‌మే అవుతుంది. ప్రారంభంలో ఆసుప‌త్రికి వెళ్తే బ‌య‌ట‌ప‌డే అవ‌కాశం వుంది. వేరే మార్గం లేదు కాబ‌ట్టి లాక్‌డౌన్ ను మ‌రి కొంత కాలం పెంచ‌డ‌మే క‌రెక్ట్ అని త‌న అభిప్రాయంగా ముఖ్య‌మంత్రి చెప్పారు. సామూహిక మ‌ర‌ణాల్ని అరిక‌ట్టాలంటే మ‌రి కొంత కాలం లాక్‌డౌన్ కొన‌సాగించ‌డం త‌ప్ప‌దు. నిజాముద్దీన్ మ‌ర్క‌జ్ నుంచి వ‌చ్చిన 172 మందికి పాజిటివ్ వ‌చ్చింది. వారు మ‌రో 93 మందికి అంటించారు. చ‌నిపోయిన 11 మంది ఢిల్లీ నుంచి వ‌చ్చిన వారే. 1089 మంది మ‌ర్క‌జ్ నుంచి తెలంగాణాకు వ‌చ్చారు. మ‌ర్క‌జ్ నుంచి వ‌చ్చిన యాత్రికుల ద్వారా ఎంత మందికి సోకిందో తెలుసుకోవ‌డానికి వేట కొన‌సాగుతోంది.

వాళ్ళందరూ ఢిల్లీ వెళ్లి వచ్చినవారే: కరోనా పై ఏపీ అధికారులు 

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో నమోదైన 266 కేసుల్లో 243 ఢిల్లీకి వెళ్లినవారు, వారి ప్రైమరీ కాంటాక్టులేనని అధికారులు వెల్లడించారు. కోవిడ్‌ –19పై ఈ రోజు సీఎం  వైయస్‌.జగన్‌ మోహన్ రెడ్డి నిర్వహించిన సమీక్ష లో  మంత్రి మోపిదేవి వెంకటరమణ, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌ రెడ్డి పాల్గొన్నారు. ఢిల్లీ వెళ్లినవారు, వారి ప్రైమరీ కాంటాక్టులకు దాదాపు పరీక్షలు పూర్తయ్యాయన్న అధికారులు. దీని తర్వాత ఇంటింటి సర్వే ద్వారా లక్షణాలు ఉన్నవారికి పరీక్షలు నిర్వహిస్తామన్న అధికారులు. మరీ పరీక్షలు నిర్వహించేలా టెస్టింగ్‌ సామర్థ్యాన్ని పెంచుకుంటున్నామన్న  అధికారులు.  రెడ్‌జోన్ల వారీగా క్లస్టర్లు విభజించి అక్కడ కూడా ర్యాండమ్‌ పరీక్షలు నిర్వహిస్తామన్న అధికారులు. సరిపడా టెస్టు కిట్లు తెప్పించుకోవాలని సీఎం ఆదేశం. క్వారంటైన్లు, ఐసోలేషన్‌ కేంద్రాల్లో సదుపాయాలకు ఎలాంటి లోటు రాకూడదని సీఎం స్పష్టం చేశారు. ఐసీయూ బెడ్లకు సరిపడా వైద్య సిబ్బందిని నియమించాలన్న సీఎం కరోనా విపత్తు వల్ల చీనీ, బత్తాయి, అరటి, టమోటా రైతులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడాలని సీఎం ఆదేశం.  ఈ విషయంలో ప్రభుత్వం నుంచి నిధుల రూపంలో, ఇతరత్రా రూపంలో నూటికి నూరుపాళ్లు సహకారం అందిస్తానని అధికారులకు స్పష్టం చేసిన సీఎం. 1092కు వచ్చే కాల్స్‌ పరిష్కారంపై దృషి పెట్టాలని, సంబంధిత అధికారులు పూర్తి బాధ్యత తీసుకోవాలని ఆదేశించిన సీఎం జగన్.

40 వేల ఐసొలేష‌న్ ప‌డ‌క‌లు సిద్ధం చేసిన రైల్వేశాఖ‌!

కరోనా వైరస్ బాధితులకు చికిత్స అందించడానికి 2500 కోచ్‌ల‌ను 40,000 వేల ఐసొలేష‌న్ ప‌డ‌క‌లుగా మార్చి సిద్దం చేసిన‌ట్లు ద‌క్షిణ మ‌ధ్య రైల్వే వెల్ల‌డించింది. నాన్ ఎసి, స్లీపర్ కోచ్‌లను క్వారంటైన్, ఐసొలేషన్ కోచ్‌లుగా మార్పులు చేశారు. మ‌రో 2500 కోచ్‌ల‌ను ఐసొలేషన్ బెడ్స్ గా మార్చ ప‌నులు దేశంలోని 133 ప్ర‌దేశాల్లో శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ఒక‌ రోజుకి 375 కోచ్‌ల‌ను ఐసొలేష‌న్ కోచ్‌లుగా మారుస్తున్నారు. రైల్వేకు సంబంధించిన 16 జోన్లకు లక్షాలు నిర్దేశించి కోచ్‌ల‌ను ఐసోలేష‌న్ బెడ్స్‌గా మార్చి కరోనా రోగుల కోసం సిద్ధం చేస్తున్నారు. కరోనా వైర్‌సను సమర్థంగా ఎదుర్కొనేందుకు భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఇప్పటికే ప్రశంసలు అందుకుంటున్నాయి. సామాజిక దూరం, లాక్‌డౌన్‌ పాటించడం కరోనా వ్యాప్తి కట్టడిలో కొన్ని. ఇప్పటి వరకు తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. అయితే పొరపాటును కరోనా మూడో దశ లేదా నాలుగో దశకు చేరితే ఎదుర్కొనేందుకు కూడా భారతప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. వైద్య సౌకర్యాలు అంతగా అందుబాటులో లేని గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో కరోనా సేవల కోసం ఇప్పటికే రైల్వే కోచ్‌లను సిద్ధం చేస్తోంది. ముందస్తు ఊహాగానంతో రైల్వే కోచ్‌లను ఐసోలేషన్‌ వార్డులుగా మార్చే ప్రక్రియను ఆరంభించింది. అయిదు వేల కోచ్‌లను ఐసోలేషన్‌ వార్డులుగా మార్చాలన్నది ప్రభుత్వ లక్ష్యం. దీంతో ఎనభైవేల పడకలు అందుబాటులోకి వస్తాయిని అంచనా వేసింది. ఇప్ప‌ట్టి 40000 వేల బెడ్స్‌ను విజ‌య‌వంతంగా సిద్ధం చేశారు. ఏడువందలకు మించి జిల్లాలు ఉన్న మన దేశంలో 7300కు పైగా రైల్వే స్టేషన్లు ఉన్నాయి. అంటే జిల్లా ప్రధానకేంద్రంలోని ఆసుపత్రి సమీపానికి ఈ కోచ్‌లను తీసుకెళ్ళే సదుపాయం ఉంది. అలా ఈ ఆలోచన వ‌చ్చింది. మొదటగా, పదహారు రైల్వే జోనుల్లోని అయిదువేల కోచ్‌లను మారుస్తున్నారు. దీంతో దేశవ్యాప్తంగా ఎనభై వేల పడకలు అందుబాటులోకి వస్తున్నాయి.

నిమ్మగడ్డ దెబ్బకు 'ఏపీ సర్కార్' అబ్బా!

వార్డు వాలంటీర్ల సాయంతో, స్థానిక సంస్థలకు పోటీ చేస్తున్న పాలక వై ఎస్ ఆర్ సి పీ అభ్యర్థులు ప్రజలకు ఆర్ధిక సహాయం అందచేయటం పై ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఈ విషయమై ఫిర్యాదులు వస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎం. రమేష్ కుమార్ అన్నారు.  ఈ విషయం పై బిజిపి అధ్యక్షుడు, సిపిఐ కార్యదర్శి వాటిని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువచ్చారని, 13 జిల్లాల జిల్లా ఎన్నికల పరిశీలకులు / జిల్లా కలెక్టర్లు లకు సోమవారం లేఖ రాశామని ఆయన తెలిపారు. ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్ క్షుణ్ణంగా పరిశీలించిందన్నారు.  కరోనా పరిస్థితి సమయంలో ప్రజలకు ప్రయోజనాల చేకూర్చే పంపిణీ కొత్త పథకం ఎన్నికల ఉల్లంఘన కింద రాదని, ప్రస్తుతం ఎన్నికల కోడ్ వాడుకలో లేదని తెలిపారు. ఏది ఏమయినప్పటికీ, ఈ సంధి కాలంలో ఎన్నికల ప్రచారంపై నిషేధం కొనసాగుతుందని తెలియ చేస్తున్నామన్నారు. పోటీ చేసే అభ్యర్థులు వారి స్వయ ప్రయోజనం కోసం ప్రచారం చెయ్యడం, ఓటర్లు ను ప్రభావితం చెయ్యడం ఎన్నికల ప్రక్రియ ఉల్లంఘనగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుందన్నారు. కాబట్టి, అటువంటి సంఘటన పై క్షేత్రస్థాయిలో దృష్టి సారించి, నిజానిజాలను విచారించి, ఎన్నికల కమిషన్  దృష్టికి తీసుకుని రావాలన్నారు. సంబంధిత అధికారులందరూ పర్యవేక్షణ ద్వారా అటువంటి సంఘటనలకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకోవాలని ఎన్. రమేష్ కుమార్  లేఖలో పేర్కొన్నారు.

రాచకొండ పరిధిలో కొత్త టెక్నాలజీ అమలు

ఈరోజు నుండి రాచకొండ కమిషనరేట్ పరిధిలో రెండు కొత్త టెక్నాలజీలను అమలు చేస్తున్నట్టు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ ప్రకటించారు. డ్రోన్ టెక్నాలజీ సైనాట్ టెక్నాలజీ తెలంగాణ పోలీస్ తో ఒప్పందం కుదుర్చుకుందని, సైబరాబాద్ లో ఇప్పటికే అమలు చేస్తున్నామని ఆయన చెప్పారు.  ఈరోజు నుండి రాచకొండ లో కూడా అమలు చేస్తున్నామన్నారు. కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను బాలాపూర్, మౌలాలి, పహాడీ షరీఫ్ ఇలాంటి ప్రాంతాల్లో పూర్తి లాక్ డౌన్ అమలు చేసే విధంగా ఈ డ్రోన్ సహాయపడుతుందని ఆయన చెప్పారు.  ఆ ఏరియాలలో సాయంత్రం ఆరు తరువాత కూడా ఎవరైనా ఉంటే, షాప్స్ మూసివేయడం తో పాటు, వారందరినీ కూడా డ్రోన్ సహాయంతో అలర్ట్ చేయవచ్చునన్నారు.  వెహికల్ డిస్ ఇన్ఫెక్షన్ టెక్నాలజీ హర్ష టయోటా అందించిందని,  తమ సిబ్బంది మెడికల్ అధికారులతోపాటు క్వారంటైన్ సెంటర్స్ కు వెళ్తున్నారని, ఈ రోజు నుంచి తమ వెహికల్స్ ను డిస్ ఇన్ఫెక్షన్ టెక్నాలజీతో  ఎప్పటికప్పుడు క్లీన్ చేయిస్తున్నామని మహేష్ భగవత్ చెప్పారు.

వేతనాల్లో కోతకు స్వచ్చందంగా ముందుకువచ్చిన రాష్ట్రపతి

ఎంపీల వేతనాల్లో ఏడాది పాటు 30 శాతం కోత  రెండేళ్ల పాటు ఎంపీ లాడ్స్ రద్దు ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ నిర్ణయం కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా దేశ వ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర కేబినెట్ రెండు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎంపీల వేతనాల్లో ఏడాది పాటు 30 శాతం కోత విధించాలని, ఎంపీలకు ఇచ్చే నిధుల (ఎంపీ లాడ్స్) ను రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఏడాది పాటు ఎంపీల వేతనాలు, అలవెన్స్ లు, పెన్షన్లలో ఈ కోత ఉండేలా ఓ ఆర్డినెన్స్ ను తెచ్చారు. ఈ నేపథ్యంలో 1954 చట్టాన్ని సవరించారు. ఈ విషయాలను కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి జవదేకర్ ఈరోజు మీడియాకు వివరించారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, ఎంపీ లాడ్స్  2020-21, 2021-22కు సంబంధించి మొత్తం నిధులు రూ.7900 కోట్లు అని, ఈ మొత్తంతో కన్సాలిడేటెడ్ ఫండ్ రూపంలో ఓ నిధిని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ‘కరోనా’ నేపథ్యంలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, రాష్ట్రాల గవర్నర్లు తమ వేతనాల్లో కోతకు వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారని చెప్పారు.

చంద్రబాబు సైకాలజీ పై సైంటిస్ట్ పేర్ని నాని రిపోర్ట్

* ఐ సి యు లో ఉన్న టీ డీ పీ కి రోజూ ఆక్సిజన్ ఎక్కిస్తున్న వై ఎస్ ఆర్ సి పీ * నాయుడు అంతర్జాతీయ తీవ్రవాది అని తేల్చిన పేర్ని నాని * ఏజెంట్ పేర్ని నాని పరిశోధనలో బయటపడ్డ నాయుడు అంతర్రాష్ట్ర లింకులు పిచ్చ పీక్ కు వెళిపోతే, ఇలాంటి ఆరోపణలే చేస్తారు మరి. ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గురించి మాట్లాడేటప్పుడు, ఉండాల్సిన కనీస మర్యాదను కరకట్ట దారిలో తొక్కేసి మరీ, కసిగా రాష్ట్ర రవాణా,సమాచార పౌరసంబంధాల శాఖమంత్రి పేర్నినాని చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారాయి. రాష్ట్రం లో నిరుటి ఎన్నికల్లో పరువు కోల్పోయి, 23 సెగ్మెంట్స్ కు పరిమితమైన చంద్రబాబు నాయుడు, పార్టీ ఉనికి కోసం ఏదో తనదైన శైలిలో రోజు వారీ చేసే అనుగ్రహ భాషణాల్లో కూడా కుట్ర కోణాలు వెతికే పేర్ని నాని ని చూసి సోషల్ మీడియా జాలిపడుతోంది. ఐ సి యు లో ఉన్న తెలుగు దేశం పార్టీకి మూడు రాజధానుల ఇష్యూ తో తిరిగి ఆక్సిజన్ ఎక్కించిన పాలక వై ఎస్ ఆర్ సి పీ నాయకులు , తాజాగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు పై ఒళ్ళు మరిచి చేస్తున్న విమర్శలూ, ఆరోపణలూ కూడా సోషల్ మీడియా కి కావాల్సినంత ఆహారం ఇస్తున్నాయి. ఈ కోవలోనే పేర్ని నాని సైంటిస్ట్, ఇంకా ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అవతారాలు ఎత్తారు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఎప్పుడు , ఎక్కడ, ఏమి చేస్తున్నారు, ఎలా చేస్తున్నారనే మినిట్ to మినిట్ ప్రోగ్రాం వివరాలు తన దగ్గర ఉన్నాయంటూ విలేకర్ల సమావేశం లో వెల్లడించారు.  చంద్రబాబు పక్కరాష్ట్రం లో బతుకుతున్నారని కనుక్కున్న ఆయన, తన పరిశోధనలో చంద్రబాబుకు, అంతర్జాతీయ తీవ్రవాదులకు పెద్ద  తేడా కనిపించడం లేదనే విషయాన్ని కనుక్కున్నారు. చంద్రబాబు మనస్తత్త్వం చూస్తే అంతర్జాతీయ తీవ్రవాదిలా ఉన్నారన్న పేర్ని నాని, తన పరిశోధన లో వెల్లడైన మరిన్ని సంచలన విషాలను షేర్ చేశారు.  "తీవ్రవాదులు కూడా వేరే దేశంలో ఉంటూ ఇక్కడ బాంబులు పెడుతూ,రకరకాల వైరస్ లు పంపుతుంటారు. నాశనం కోరుకుంటారు. పాజిటివ్ కేసులు వచ్చినచోట్ల కూడా(రెడ్ జోన్లు) వైద్యులు,పారిశుధ్యకార్మికులు,రెవిన్యూ, ఏఎన్ఎంలు, ఆశావర్కర్లు వాలంటీర్లు వీరంతా చిరుద్యోగులు ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్నారు.మిలటరీలో దేశాన్ని కాపాడటానికి ఏ విధంగా సైనికులు పోరాడుతున్నారో అదే విధంగా వారందరూ సేవలందిస్తున్నారు.విలేకరులను చూసైనా చంద్రబాబు సిగ్గుతెచ్చుకోవాలి.ఆర్దిక బాధలు దిగమింగి ప్రజలను అప్రమత్తం చేయడం లో, ప్రభుత్వసూచనలు ప్రజలకు చేరవేయడంలో ప్రజలను మేలుకొల్పుతూ వ్యాధిని అరికట్టడంలో విలేకరులు సేవలందిస్తున్నారు. మీడియా వారు సామాజిక బాధ్యతగా పనిచేస్తున్నారు. ఇంకా వ్యాధి ప్రబలుతుందని చంద్రబాబు చెబుతున్నారు.అంటే మీరు ఎవర్ని దెబ్బతీయదలుచుకున్నారు.ఎవరి ఆత్మస్దైర్యం దెబ్బతీస్తున్నారు.ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్నవారిని వారి ఆత్మస్ధైర్యాన్ని దెబ్బతీస్తున్నారా. కరోనా వ్యాధి వస్తుందనే ముందువరకు కూడా చాలా డిపార్ట్ మెంట్లను తిట్టుకునే పరిస్దితి నుంచి ఈరోజు ఆ యా డిపార్ట్ మెంట్లను,ఉద్యోగులను ప్రజలు నేడు వారి సేవలు చూసి వేనోళ్ల కొనియాడుతున్నారు. కరోనా లెక్కలు దాచామని చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారు.చంద్రబాబు లెక్కలు చెబితే వారికి పరీక్షలు చేయిస్తాం," అని కూడా పేర్ని నాని సవాల్ చేశారు. ఆంధ్ర  రాష్ట్రంలో ఐదుకోట్ల మంది ఉంటే ఐదుకోట్ల మందికి పరీక్షలు చేస్తారా.ఎక్కడైతే వ్యాధిప్రబలుతుంటే అక్కడ పరీక్షలు చేస్తారు.14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన తనకు ఇవి తెలియవా, అంటూ కూడా పేర్ని నాని ప్రశ్నించారు.  దొంగలెక్కలు రాయడం చంద్రబాబుకే అలవాటు.దుర్మార్గమైన ఆలోచనలు చంద్రబాబు మానుకోవాలని సూచించిన పేర్ని నాని పరిశోధన లో తేలిన విషయాలేమిటంటే, చంద్రబాబు కు మానవత్వం లేదు.మానవీయకోణం లేవని. వేల సంఖ్యలో మరణాలు ఉన్నాయి కాని ప్రభుత్వం దాస్తుందనే విధంగా చంద్రబాబు మాట్లాడుతున్నారంటే విలేకరులు వాస్తవాలు దాస్తున్నట్లుగా మాట్లాడుతున్నట్లేకదా అని కొత్త లాజిక్ ని కూడా పేర్ని నాని తీశారు. కరోనా సోకిందనే బాధ కంటే ఇలాంటి దిక్కుమాలిన వ్యక్తి మమ్మల్ని ఇన్నాళ్లు పాలించారా అని ప్రజలు బాధపడుతున్నారని కూడా పేర్ని నాని కనుగొన్నారు.  ఈ యుధ్ద వాతావరణంలోనే కాదు చంద్రబాబు పాలనలో రైతులకు ఇవ్వాల్సిన సబ్సిడీలు ఇవ్వకుండా, ధాన్యం కొని వారికి డబ్బులు చెల్లించకుండా, విత్తనాలు అందించకుండా అన్ని విధాలా బాధ పెట్టిన విషయాన్నీ కూడా పేర్ని నాని కనుగొన్నారు.

ఈ డ్రగ్ తీసుకుంటే, రెండు రోజుల్లో కరోనా పరార్!

* హెచ్ఐవీ, డెంగ్యూ, జికా, ఇన్ ఫ్లుయెంజా లను కూడా ఛాలెంజ్ చేసి నిలిచిన ఇవెర్ మెక్టిన్   ఇదొక లేటెస్ట్ ఆవిష్కరణ. మానవ దేహంలోని పరాన్నజీవులను తరిమికొట్టే ఇవెర్ మెక్టిన్ అనే,  యాంటీ పారసైటిక్ ఔషధం -ప్రయోగశాలలో సృష్టించిన కరోనా వైరస్ కణజాలంపై ఇవెర్ మెక్టిన్ ప్రభావవంతంగా పనిచేసిందని, వైరస్ అభివృద్ధిని సమర్థంగా నిరోధించిందని ఓ అధ్యయనం వెల్లడించింది. కేవలం 48 గంటల్లో కరోనా వైరస్ ను రూపుమాపిందని ఈ పరిశోధనలో పాలుపంచుకున్న కైలీ వాగ్ స్టాఫ్ తెలిపారు. ఇవెర్ మెక్టిన్ ప్రమాదకర హెచ్ఐవీ, డెంగ్యూ, జికా, ఇన్ ఫ్లుయెంజా తదితర వైరస్ లపై ప్రభావశీలంగా పనిచేస్తుందని గతంలోనే గుర్తించారు. తాజాగా కరోనాను కూడా ఇది దీటుగా తిప్పికొడుతుందని అధ్యయనంలో పేర్కొన్నారు.  ఇవెర్ మెక్టిన్ ఎంతో సురక్షితమైన ఔషధం అని, మనుషుల్లో కూడా సరైన మోతాదులో ఉపయోగిస్తే మంచి ఫలితాలు వస్తాయని వాగ్ స్టాఫ్ తెలిపారు. అయితే, కరోనాను ఇవెర్ మెక్టిన్ ఎలా రూపుమాపుతుందన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదని ఆమె వెల్లడించారు. కొన్నిరకాల వైరస్ లు ఆతిథ్య కణాలను మందగింపచేస్తాయని, ఆ సామర్ధ్యంపైనే ఇవెర్ మెక్టిన్ బలంగా దెబ్బతీస్తుందని, కరోనా వైరస్ విషయంలోనూ ఇవెర్ మెక్టిన్ అలాంటి పనితీరునే ప్రదర్శిస్తుందని భావిస్తున్నామని వివరించారు.

తెలంగాణ లో ర్యాపిడ్ ఫీవర్ సర్వే!

తెలంగాణాలో పాజిటివ్ కేసులున్న వారి ఇళ్ల చుట్టుపక్కల కిలోమీటరు పరిధి వరకు వైద్యశాఖ బృందాలతో ఇంటింటికీ ర్యాపిడ్ ఫీవర్ సర్వే చేయనున్నారు. ఈ సర్వే ఆధారంగా జ్వరం - జలుబు - ఇతరత్రా కరోనా లక్షణాలున్నట్లు అనుమానాలుంటే వారి రక్త నమూనాలని తీసుకోని - ప్రభుత్వ ఆస్పత్రుల్లోని పరీక్షా కేంద్రాలకు పంపించి ఎంతమందికి కరోనా పాజిటివ్ ఉన్నదీ తెలుసుకుంటారు. ఇలా ఒకే ప్రాంతంలో పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్నట్లయితే ఆప్రాంతంలోని వారు ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా - ఇతరప్రాంతాల వారు ఆ ప్రాంతంలోకి రాకుండా పోలీసులు నిర్వహించే కార్డన్ ఆఫ్ వంటివి చేపట్టాల‌ని తెలంగాణా ప్ర‌భుత్వం ఆలోచిస్తోంది. కరోనా వైరస్ తెలంగాణ రాష్ట్రంలో వేగంగా విస్తరిస్తుంది. ఈ నేప‌థ్యంలో కరోనా కట్టడి కార్యక్రమాలు పకడ్బందీగా నిర్వహించేందుకు ముఖ్యమంత్రి ఆదేశాలకి అనుగుణంగా చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ పోలీస్ - వైద్య అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. అలాగే మర్కజ్ సంబంధీకులున్న ప్రాంతాల జియోట్యాగింగ్ పనులు వేగంగా చేస్తున్నారు.

విలేక‌రులైనా దందా చేస్తే శిక్ష త‌ప్ప‌దు! చ‌ట్టానికీ అతీతులుకారు!

జ‌ర్న‌లిస్ట్‌లు చ‌ట్టానికి అతీతం కాదు? నైతిక‌త‌కు విరుద్ధంగా విలేక‌రులు ఏం చేసినా చెల్లుతుంద‌నుకోవ‌డం దారుణ‌మే! లాక్‌డౌన్ న‌డుస్తోంది. స‌ద‌రు ప‌త్రిక‌కు స్థానికంగా విలేక‌రి వున్నాడు. ఏదైనా వివ‌ర‌ణ కావాల్సి వ‌స్తే అత‌నితో తెప్పించుకోవ‌చ్చు. కానీ అలా జ‌ర‌గ‌లేదిక్క‌డ‌. త‌మ‌కు అవ‌స‌రం అనుకున్నారేమో 80 కిలో మీట‌ర్ల వ‌ర‌కు ప్ర‌యాణం చేసి ఓ రాజ‌కీయ నేత‌తో బేరం పెట్టుకున్నారు. అత‌ను గుట్టుగా మొత్తం వ్య‌వ‌హారం రికార్డు చేసి జ‌ర్న‌లిస్టుల బ‌తుకు రోడ్డు మీద కీడ్చాడు.  జ‌ర్న‌లిస్టులు రెడ్ హ్యాండెడ్‌గా పోలీసుల‌కు ప‌ట్టుబ‌డ్డారు. చ‌ట్ట విరుద్ధ చ‌ర్య‌లకు ఎవ‌రు పాల్ప‌డినా,  విలేక‌రులైనా, రాజ‌కీయ‌నేత‌లైనా చ‌ట్ట ప్ర‌కారం శిక్ష ప‌డాల్సిందే. అప్పుడే ఇత‌రుల‌కు బుద్ధి వ‌స్తుంది. ఇలాంటి సంఘ‌ట‌న‌లు మ‌ళ్ళీ పున‌రావృత్తం కావు. ఇలాంటి సంద‌ర్భాల్లో జ‌ర్న‌లిస్టు సంఘాలు జ‌ర్న‌లిస్టుల‌ను వెన‌కేసుకొని రాకుండా వాస్త‌వాల్ని గ్ర‌హించి నిజాయితీతో ఖండించాల్సిన అవ‌స‌రం వుంది. అస‌లు విజ‌య‌బాబు ఇంటికి ఎందుకు వెళ్ళారు? బ‌్లాక్ మెయిల్ చేయ‌డం నేరం కాదా. ప్ర‌జ‌లు జ‌ర్న‌లిస్టుల‌ను అస‌హించుకునే దుస్థితి రాకుండా చూసుకోవాల్సిన స‌మ‌యం ఇది. జ‌ర్న‌లిజం వ్య‌వ‌స్థ‌ను స‌ర్వ‌నాశ‌నం చేస్తున్నారు. ఇది పెద్ద క‌ళంకం.  జ‌డ్జి లాంటి వాడు జ‌ర్న‌లిస్ట్‌. అయితే ముద్దాయిలా ఎందుకు విజ‌య‌బాబు ఇంటికి వెళ్ళారు. మీ స్థానిక విలేక‌రి అక్క‌డున్నా 80 కిలోమీట‌ర్లు ప్ర‌యాణం చేసి  వివ‌ర‌ణ కోసం వెళ్ళారు స‌రే. బేర‌సారాలు ఎందుకు ఆడాల్సి వ‌చ్చింది. ఆ వీడియోకు ఏం స‌మాధానం చెబుతారు? తాను నిజాయితీగా పని చేశానని, తనపై నిరాధార వార్త‌లు రాస్తూ డ‌బ్బులు డిమాండ్ చేశార‌ని మువ్వా చెబుతున్నారు. కనీసం 15 లక్షల రూపాయలు అయినా ఇస్తే తాము కథనాలు రాయడం నిలిపి వేస్తామని వారు చెప్పినట్లు విజయ్ బాబు తెలిపారు. అయితే తాను అంత ఇవ్వలేని ఆయన స్పష్టం చేశారు. చివరకు ఐదు లక్షల రూపాయల నగదు, 500 పత్రికలకు సంవత్సర చందా కట్టే విధంగా ఒప్పందం కుదిరింది. మాజీ డీసీసీబీ చైర్మన్‌ మువ్వా విజయ్‌బాబు ఫిర్యాదు మేరకు విలేకరులయిన మూర్తి, సత్యనారాయణ, శ్రీకాంత్‌ లపై  ఒక బెయిబుల్‌, మరో నాన్‌ బెయిబుల్‌ సెక్షన్‌ ల తోకూడిన కేసు నమోదు అయింది.

త‌న ఆరోగ్యం మెరుగ్గానే ఉందంటూ ఆసుపత్రి నుంచి బ్రిటన్ ప్రధాని బోరిస్ సందేశం!

తన ఆరోగ్యం ప్రస్తుతం మెరుగ్గానే ఉందని బ్రిటన్ ప్రధాని ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ప‌ది రోజులు పూర్తయినా తనలో ఇంకా వైరస్ లక్షణాలు కనిపిస్తున్న‌ట్లు డాక్ట‌ర్లు చెప్పారు. శరీర ఉష్ణోగ్రత కూడా ఎక్కువగా ఉండ‌టంతో తాను ఆసుప‌త్రిలో చేరాన‌ని బోరిస్ పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వైరస్ లక్షణాలు పూర్తిగా తొలగిపోయేంత వరకు సెల్ఫ్ క్వారంటైన్‌లోనే ఉంటానని వీడియోలో వివరించారు. మార్చి 27న జాన్సన్‌కు నిర్వహించిన పరీక్షల్లో కొద్దిపాటి కరోనా లక్షణాలు కనిపించాయి. దీంతో ఆయన గత వారం రోజులుగా డౌనింగ్ స్ట్రీట్ నివాసంలో సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. పది రోజులుగా సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్నప్పటికీ కరోనా లక్షణాలు తగ్గకపోవడంతో తన వ్యక్తిగత వైద్యుని సలహ మేరకు బ్రిటన్‌ ప్రధాని ఆసుపత్రిలో చేరారు.

UK లో చిక్కుకుపోయిన తెలంగాణ విద్యార్థులను వెనక్కు తీసుకురండి!

తెలంగాణా విద్యార్థుల్ని వెన‌క్కి తీసుకురావాలంటూ చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు డాక్టర్ జి. రంజిత్ రెడ్డి కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్ కు లేఖ రాశారు. Covid-19 కారణంగా UK లో పరిస్థితి అధ్వాన్నంగా మారింది. దాదాపు 4,500 మరణాలు మరియు 42,000 కంటే ఎక్కువ కేసులతో అక్కడ ఉన్న మన విద్యార్థులు మాత్రమే కాకుండా UK లోని భారతీయులు చాలా ఆందోళన చెందుతున్నారు. నిన్నటి నుండి యుకె రవాణాను కూడా నిలిపివేసింది. విదేశీయులను తమను తామే రక్షించుకోవాలని uk ప్రభుత్వం కోరింది. ప్ర‌స్తుత పరిస్థితుల్లో వారికి సహాయం చేయడం చాలా కష్టమని అక్కడ ఉన్న వారు భావిస్తున్నారు. UK లోని భారతీయులంతా ఆందోళ‌న‌కు గురి అవుతున్నారు. వారితో పాటు ఇక్క‌డున్న వారి కుటుంబసభ్యులు మరింత ఆందోళనకు గురి అవుతున్నారు. ఇండియాలో వున్న వారు త‌మ పిల్లలను, బంధువులను UK నుండి రక్షించాలని సందేశాలను పంపుతున్నారని ఎం.పి.రంజిత్ రెడ్డి మంత్రి దృష్టికి తీసుకువెళ్ళారు. భారతదేశంలో చిక్కుకున్న యుకె పౌరులను తిరిగి పంపించడానికి ఎయిర్ ఇండియా ఆరు విమానాలను - ఢిల్లీ నుండి 4 మరియు ముంబై నుండి 2 నడుపుతుంది. కాబట్టి యుకె నుండి తిరిగి వచ్చేటప్పుడు, అదే విమానాలు యుకెలోని వివిధ ప్రాంతాలలో చిక్కుకున్న భారతీయ విద్యార్థులను తీసుకురావాల‌ని ఎం.పి. సూచించారు. వారు ఇక్కడ దిగిన తర్వాత వారిని నిర్దేశిత కాలంపాటు క్వారెంటిన్ లో ఉంచిన తరువాత మాత్రమే ఇంటికి వెళ్ళడానికి అనుమతించవచ్చని ఎం.పి. త‌న లేఖ‌లో పేర్కొన్నారు. వివిధ విశ్వవిద్యాలయాల నుండి సుమారు 380 మంది భారతీయ విద్యార్థులు UK లోని ఇండియన్ హైకమిషనర్ కు భారతదేశానికి తిరిగి వెళ్ళడానికి సహాయం చేయమని అభ్యర్థించారు. విద్యార్థులు మరియు ఇతరుల వివరాలన్నీ హైకమిషన్ వద్ద ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం నుండి 50 మంది విద్యార్థులు ఉన్నారని మరియు వారిని రక్షించాలని మంత్రిని కోరారు.

కాణిపాకం గెస్ట్ హౌస్ క్వారంటైన్ సెంటరా?

* మాజీ సి ఎస్ ఐ.వై. ఆర్. మండిపాటు  * చెప్పులతో గెస్ట్ హౌస్ లో కరోనా బాధితులు నడుస్తున్న వీడియో వైరల్  * విషయాన్ని తేలిగ్గా తీసుకున్న డీ జీ పీ కార్యాలయం హిందూ ఆలయాల్లో అన్యమత ప్రచారం జరుగుతోందనే విషయం ఇప్పటికే రచ్చ రచ్చ అయింది. అయినా ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ప్రఖ్యాత కాణిపాకం ఆలయంలో అన్యమతస్తులకు ఏపీ ప్రభుత్వం వసతి ఏర్పాటు చేయడం కలకలం రేపుతోంది. ఈ ఘటనను ఏపీ రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు తప్పుబట్టారు. ఈ అంశంపై ఏపీ ప్రభుత్వం వెంటనే వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని ఐవైఆర్ అన్నారు. ఇది ఆలయ ప్రాంగణమా? లేక వసతి సదుపాయమా? అని నిలదీశారు. ఇంకెక్కడా వసతి సదుపాయమే లేనట్టు... దీన్ని అన్యమతస్తుల కోసమే వాడుతుండటంలో అంతరార్థం ఏమిటని మండిపడ్డారు. ఇతర మతస్తులను ఆలయ ప్రాంగణంలోకి ఎలా అనుమతించారని ప్రశ్నించారు. ప్రాంగణం నుంచి అన్యమతస్తులు వెలుపలకు వస్తున్న వీడియోను షేర్ చేశారు. అయితే, డీ జీ పీ కార్యాలయం మాత్రం ఆలయం గెస్ట్ హౌస్ ను క్వారంటైన్ సెంటర్ చేయటం లో తప్పేమీ లేదన్నట్టు ఒక క్లారిఫికేషన్ ఇచ్చేసి చేతులు దులిపేసుకుంది. 

అక్ర‌మంగా మ‌ట్టిని త‌వ్వే మాఫియాను అడ్డుకోరా?

మంత్రి అనుచ‌రులైతే అక్ర‌మంగా మ‌ట్టి త‌రలిస్తారా? ఒక ప‌క్క లాక్‌డౌన్ అమ‌లు అవుతోంది. అయినా మంత్రి అనుచ‌రులు ట్రాక్ట‌ర్ల ద్వారా మ‌ట్టిని అక్ర‌మంగా త‌వ్వి, క‌ళ్యాణ‌మండ‌పంతో పాటు మూడు ప్లాట్‌ల‌కు త‌ర‌లిస్తున్నారు. లాక్‌డౌన్ మీకు వ‌ర్తించ‌దా? అని గ్రామ‌స్థులు నిల‌దీస్తే జ‌నం మీద‌కే ట్రాక్ట‌ర్ల‌ను న‌డ‌ప‌డానికి వెళ్ళుతూ భ‌య‌పెడుతున్నార‌ట‌. గ్రామ‌స్థులంతా ఏక‌మై ట్రాక్ట‌ర్ల‌ను అడ్డుకున్నారు. ఒక పక్క ప్రభుత్వం కరోనా వ్యాప్తి ని నివారించడానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంటే గుడివాడ నియోజక వర్గ పట్టణ నడి బొడ్డు లో గౌతమ్ స్కూల్ దగర కొన్ని ఖాళీ స్థలాల్ని పూడ్చడానికి మట్టి ని ఇష్టానుసారంగా తరలిస్తున్నారు ఇదేమిటి అని స్థానికులు ప్రశ్నించగా మంత్రి కొడాలి నాని తాలూకా అని దౌర్జన్యం చేస్తున్న వైనం. సామాన్యుడు కి ఒక న్యాయం మంత్రి అనుచ‌రుల‌కు ఒక న్యాయం అని జ‌నం తిరగబడ్డారు. వి.ఆర్‌.వో. ద‌గ్గ‌రుండి మ‌ట్టి త‌ర‌లిస్తున్నార‌ని గ్రామ‌స్థులు ఆరోపిస్తున్నారు. తాము కూర‌గాయ‌లు కొన‌డానికి వెళ్ళితే వెంట‌బ‌డి పోలీసులు త‌రుముతున్నారు. కానీ ఇక్క‌డ మంత్రి అనుచ‌రులు అక్ర‌మంగా మ‌ట్టి త‌వ్వి ఇత‌ర ప్రాంతాల‌కు త‌ర‌లిస్తున్నా పోలీసులు, మీడియా చూసి ప‌ట్టించుకోవ‌డం లేద‌ని గ్రామ‌స్థులు మండిప‌డుతున్నారు.

కరోనా దెబ్బకి ఇలా కూడా జ‌రిగింది!

మ‌ద్యం షాపులు బంద్ కావ‌డంతో సంపూర్ణ మద్య నిషేధం అమలు అయింది. దిక్కుమాలిన తెలుగు సీరియల్స్ ఆగిపోయాయి. పెద్ద నగరాల్లో ఆఫీస్ నుంచి ఇంటికి చేరే సమయంలో నాలుగు గంటల దాకా బయటే ట్రాఫిక్ లో గడిచిపోయే పరిస్థితి వుండేది. ఇప్ప‌డు రోడ్ల‌న్నీ ఖాళీగా వున్నాయి. అత్య‌వ‌స‌రం వున్న వారే రోడ్ల మీద క‌నిపిస్తున్నారు. ఎంత పెద్ద ప‌ట్ట‌ణం అయినా ఏ చౌర‌స్తా చూసిన ఎక్క‌డా ట్రాఫిక్ జామ్ లేదు. కాలుష్య రహిత న‌గ‌రాలుగా మారాయి. ఇంట్లో వుండి కుటుంబంతో స‌ర‌దాగా ఆట పాట‌ల‌తో గ‌డుపుతున్నారు. పిల్ల‌ల చ‌దువు గురించి తెలుసుకోవ‌డం, పిల్ల‌లు ఎలా వుంటున్నారో చూసే అవ‌కాశం ఇంటి పెద్ద‌కు దొరికింది. మగవాళ్ళు ఇంటి పనుల్లో, వంట పనుల్లో సాయం చేయడంతో భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య అనురాగం పెరిగింద‌ట‌. డబ్బులు నగలు, షాపింగ్, ఇతర అనవసర వస్తువులు మీద తగలకుండా, అవసరమైనవి మాత్రమే కొనుక్కోవడంతో పొదుపు చేసే అల‌వాటు అవుతుంద‌ట‌. డబ్బులు అతి జాగ్రత్తగా పొదుపు గా వాడుకోవడం. బయట అడ్డమైన దరిద్రాలు తినకపోవడం లాక్‌డౌన్ వ‌ల్లే సాధ్య‌మైంద‌ని జ‌నం చెప్పుకుంటున్నారు. వ్యక్తిగత శుభ్రత మీద, పరిసరాల శుభ్రత మీద జాగ్రత్తలు తీసుకోవటం. బండిలో పెట్రోల్ తగలేసి తిర‌గ‌డం త‌గ్గింద‌ని ఇంట్లోవాళ్ళు సంతోష‌ప‌డుతున్నారు. జ‌నం సాధ్యమైనంతవరకు నాన్వెజ్ మానేసి వెజ్ తినడానికే ప్రాధాన్య‌త ఇస్తున్నారు. చిన్న‌ప్పుడు బామ్మ చెప్పిన సాంప్రదాయ పద్ధతులు గుర్తు తెచ్చుకుని మ‌రీ పాటిస్తున్నార‌ట‌. సామాజిక బాధ్యత గురించి ఆలోచించడం, పక్కవారికి రోగాలు రాకూడదు, వాళ్ళు కూడా మంచిగా ఉండాల‌ని కోరుకోవడం క‌రోనా వైర‌స్ నేర్పించిదంటున్నారు. పని మనిషి లేకపోయినా సంతోషంగా ఇంటి పనులు కలసి మెలసి అంతా చేసుకోవడం ఇప్పుడిప్పుడే అల‌వాటౌతోంది.

క‌రోనా నుంచి త‌ప్పించుకునే ట‌న్నెల్‌!

కరోనా నివారణకు తమిళనాడు ప్రభుత్వం ప‌లు జాగ్ర‌త్త‌లు తీసుకుంటోంది. ప్ర‌జ‌లు ర‌ద్దీగా తిరిగే ప్ర‌దేశాల్లో ప్ర‌త్యేక ట‌న్నెల్స్ ఏర్పాటు చేస్తున్నారు. మ‌నం ఇక్క‌డ చూస్తున్న ట‌న్నెల్ తిరుపూర్ మార్కెట్ ప్రాంతంలో ఏర్పాటు చేశారు. త‌మిళ‌నాడు రాష్ట్రం తిరుపూర్ జిల్లాకు చెందిన డి.వెంక‌టేష్ వాట‌ర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ న‌డుపుతూ వుంటాడు. అయితే స్థానిక జిల్లా యాంత్రాంగం స‌హ‌కారంతో కరోనా బారి నుంచి తప్పించుకోవడానికి 16 ఫీట్‌ల ట‌న్నెల్ రూపొందించాడు. ఈ ట‌న్నెల్ లోప‌ల‌కు ప్ర‌వేశించ‌డానికి ముందు చేతులు శుభ్రంగా క‌డుక్కోవాలి. ఈ ట‌న్నెల్ ను మార్కెట్ బ‌య‌ట ఏర్పాటు చేశారు. మార్కెట్‌కు వ‌చ్చిన ప్ర‌తి ఒక్క‌రూ ఈ ట‌న్నెల్ ద్వారానే వెళ్ళాల్సి వుంటుంది. ముందుగా చేతులు క‌డుక్కొని ఈ ట‌న్నెల్ ప్ర‌వేశించి ఐదు సెకెండ్లు న‌డ‌క కొన‌సాగిస్తున్నారు. నీటితో క‌లిపిన సోడియం హైపో క్లోరైడ్ ద్రావ‌ణాన్ని స్ప్రే చేస్తున్నారు. ఇలా మ‌నుషుల్ని శుభ్రం చేస్తున్నారు. ఒకసారి ఒక వ్యక్తి ఇందులోకి వెళ్లి న‌డ‌క కొన‌సాగితే విద్యుత్‌ ఆధారంగా నడిచే పంపు ఇన్‌ఫెక్షన్లను నిర్మూలించే హైపోసోడియం క్లోరైడ్‌ ద్రావణాన్ని పిచికారీ చేస్తుంది. మార్కెట్ ఏరియాలో ప్ర స్తుతం దీన్ని వినియోగిస్తున్నారు. భ‌విష్య‌త్‌లో వాహ‌నాలు కూడా ఇందులోంచి వెళ్ళేలా ఏర్పాట్లు చేస్తున్నామ‌ని జిల్లా క‌లెక్ట‌ర్ కార్తికేయ‌న్ తెలిపారు. ఈ 16 ఫీట్‌ల ట‌న్నెల్ ఎన్‌క్లోజర్‌కు ఇరువైపులా స్టీల్ ఫ్రెమ్‌లు ఏర్పాటు చేశారు.

క‌రోనాను జ‌యించే రోజు వ‌స్తుంది!

కాంతి రుజు మార్గంలో ప్రయాణిస్తుందనుకునే వారు. ఐన్ స్టీన్ రాకతో కాంతి పెద్ద ఖగోళాల దగ్గర గురుత్వాకర్షణ కు లొంగి, ఒంగి ప్రయాణిస్తందని తేలింది. ఒకప్పుడు స్ఫోటకం అమ్మోరు వల్ల వస్తుందనుకుని బలులు, జాతర్లు చేశారు. ఇప్పుడు సూక్ష్మ జీవశాస్త్రం రోగాలకు కారణం వైరస్ కారణమనే సరికి, టీకాలతో దాన్ని నిర్మూలించారు. అంగ వైకల్యం జరిగితే పూర్వ జన్మ వికృత ఫలితమని సర్దుకున్నారు. కాని, ఇప్పుడు రెండు పోలియో టీకా చుక్కలతో దాన్ని అంతమొందించారు. గ్రహణమొస్తే బయటకు రాకూడదని, చూడకూడదని ,అది ఐన తర్వాత పూజలు చేసే వారు. కాని, నేడు లక్షలాది మంది , కాంతి ఫిల్టర్ల సాయంతో గ్రహణందాలను వీక్షిస్తున్నారు. ఒకప్పుడు దెయ్యం పట్టిందని వేప మండలతో థూ థూ అని తూతూ మంత్రాలు పెట్టిస్తే, నేడు అది మానసిక వికారమని, మందు బిళ్ళలతో నయం చేయించుకుంటున్నారు. ఒకప్పుడు కలరా విరోచనాలు వస్తే జాతర్లకు లంకించుకున్నారు, కాని, కలుషిత చెరువు నీరు వద్దని, ఫిల్టరు వాటర్ తాగి ద్రవ విరోచనాలను నిర్మూలిస్తున్నారు. ఒకప్పుడు నలతగా ఉందని మంత్రాలు పెట్టించుకుంటే, నేడు డాక్టర్లతో వైద్యం చేయించుకుంటున్నారు. ఒకప్పుడు పాము కరిస్తే పాముల నరసయ్యలకు ఫోను చేసి, మంత్రాలు పెట్టించుకుంటే, నేడు, హాస్పటల్ ఫ్రిజ్ లో నిల్వ ఉంచిన యాంటీ సీరం ఇంజక్షన్ ను చేయించుకుని బతుకు తున్నారు. ఒకప్పుడు వేరు, ఇప్పుడు వేరు. పెరిగిన జ్ఞానం, పెరిగిన చికిత్స. క‌రోనాను క‌ట్ట‌డి చేసే రోజు వ‌స్తుంది. దీనికీ టీకాని కనుగొంటారు, ఈ రోజు కాకపోతే రేపు. ప్రస్తుతానికి, లాక్‌డౌన్‌. ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డే వ‌ర‌కు ధైర్యంగా స్వ‌యం నియంత్ర‌ణ‌లో వుండ‌ట‌మే మేలు. పులి వేటాడేట‌ప్పుడు ఓపిక‌గా ఒక చోట కూర్చొని ఎదురుచూసిన‌ట్లు మ‌నం కూడా ఇంట్లోనే వుందాం. క‌రోనా విస్త‌రించ‌కుండా స‌హ‌క‌రించుదాం. క‌రోనా కాటు నుంచి త‌ప్పించుకుందాం.

దీపం వెలిగించ‌డంలోనూ క‌మ్యూనిస్టు మార్కు రాజ‌కీయం!

ఇండియ‌న్ క‌మ్యూనిస్టులు ఎలా వుంటారో షీలా ర‌షీద్ ట్వీట్ చూస్తే అర్థం అవుతుంది. ప‌క్క‌నున్న దేశాల‌పై వున్న ప్రేమ పుట్టిన గ‌డ్డ‌పై వుండ‌దు. ఢాకా బాధితుల‌కు క్యాండిల్ వెలిగిస్తుంద‌ట‌! కానీ భార‌త్‌లో మాత్రం వెలిగించ‌లేనంటుంది. డిన్న‌ర్ చేయ‌డానికి వంట చేసుకోవాల‌ట‌. ఎంత బ‌లుపు. ఈ సెల‌బ్ర‌టీకి. సంమ‌యం, సంద‌ర్భం లేకుండా ప్ర‌తి దానికి రాజ‌కీయాలు చేయ‌డం క‌మ్యూనిస్టు సిద్ధాంతాలు అనుస‌రించే వారికి అల‌వాటుగా మారింది. ప్ర‌జ‌ల్లో త‌మ‌కు ప‌లుకుబ‌డి పోతున్నా అల‌వాట్లు మాత్రం మార్చుకోలేక‌పోతున్నారు క‌మ్యూనిస్టు మేధావులు, సెల‌బ్రిటీలు.