40 వేల ఐసొలేషన్ పడకలు సిద్ధం చేసిన రైల్వేశాఖ!
posted on Apr 6, 2020 @ 7:26PM
కరోనా వైరస్ బాధితులకు చికిత్స అందించడానికి 2500 కోచ్‌లను 40,000 వేల ఐసొలేషన్ పడకలుగా మార్చి సిద్దం చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. నాన్ ఎసి, స్లీపర్ కోచ్‌లను క్వారంటైన్, ఐసొలేషన్ కోచ్‌లుగా మార్పులు చేశారు. మరో 2500 కోచ్‌లను ఐసొలేషన్ బెడ్స్ గా మార్చ పనులు దేశంలోని 133 ప్రదేశాల్లో శరవేగంగా జరుగుతున్నాయి. ఒక రోజుకి 375 కోచ్‌లను ఐసొలేషన్ కోచ్‌లుగా మారుస్తున్నారు. రైల్వేకు సంబంధించిన 16 జోన్లకు లక్షాలు నిర్దేశించి కోచ్‌లను ఐసోలేషన్ బెడ్స్‌గా మార్చి కరోనా రోగుల కోసం సిద్ధం చేస్తున్నారు.
కరోనా వైర్‌సను సమర్థంగా ఎదుర్కొనేందుకు భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఇప్పటికే ప్రశంసలు అందుకుంటున్నాయి. సామాజిక దూరం, లాక్‌డౌన్ పాటించడం కరోనా వ్యాప్తి కట్టడిలో కొన్ని. ఇప్పటి వరకు తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి.
అయితే పొరపాటును కరోనా మూడో దశ లేదా నాలుగో దశకు చేరితే ఎదుర్కొనేందుకు కూడా భారతప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. వైద్య సౌకర్యాలు అంతగా అందుబాటులో లేని గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో కరోనా సేవల కోసం ఇప్పటికే రైల్వే కోచ్‌లను సిద్ధం చేస్తోంది. ముందస్తు ఊహాగానంతో రైల్వే కోచ్‌లను ఐసోలేషన్ వార్డులుగా మార్చే ప్రక్రియను ఆరంభించింది. అయిదు వేల కోచ్‌లను ఐసోలేషన్ వార్డులుగా మార్చాలన్నది ప్రభుత్వ లక్ష్యం. దీంతో ఎనభైవేల పడకలు అందుబాటులోకి వస్తాయిని అంచనా వేసింది. ఇప్పట్టి 40000 వేల బెడ్స్‌ను విజయవంతంగా సిద్ధం చేశారు.
ఏడువందలకు మించి జిల్లాలు ఉన్న మన దేశంలో 7300కు పైగా రైల్వే స్టేషన్లు ఉన్నాయి. అంటే జిల్లా ప్రధానకేంద్రంలోని ఆసుపత్రి సమీపానికి ఈ కోచ్‌లను తీసుకెళ్ళే సదుపాయం ఉంది. అలా ఈ ఆలోచన వచ్చింది. మొదటగా, పదహారు రైల్వే జోనుల్లోని అయిదువేల కోచ్‌లను మారుస్తున్నారు. దీంతో దేశవ్యాప్తంగా ఎనభై వేల పడకలు అందుబాటులోకి వస్తున్నాయి.