కుల‌ రాజకీయాలకు  కాంగ్రెస్ తిరిగి వచ్చిందా? 

కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్ష‌ప‌ద‌వికి జ‌రిగిన ఎన్నిక‌ల‌పై  యింకా కుల ప్ర‌భావం ఉంద‌నాలి. దేశంలోని ఇంగ్లీషు సోష‌ల్ మీడియా, ప్రింట్ మీడియా, టీవీ వార్త‌లు చూస్తుంటే శ‌శిథ‌రూర్‌ని దూత‌గా, త‌న పార్టీ చేతిలో బ‌ల‌యిన వ్య‌క్తిగా అనుకోనే అవ‌కాశం ఉంది. ఆయ‌న సంస్క‌ర్త‌గా, ప్రొఫెస‌ర్‌గా ఆయ‌న విదేశీ అభిమాను ల‌కు క‌న‌ప‌డ‌తారు. ఆయ‌న ర‌చ‌నావ్యాసాంగం, వాక్చాతుర్యం, ప్ర‌సంగాలు అన్నీ ఆయ‌న‌కు సెల‌బ్రిటీ స్థాయిని క‌ల్పించాయి. కానీ ఆయ‌న పార్టీ ప‌ద‌వికి ఎన్న‌డూ పాకులాడ‌ని స్థితికి ఎలా ఉండి పోయారో అర్ధంకాదు. ఇప్పుడు స్పష్టమైన విజేత, 80 ఏళ్ల మల్లికార్జున్ ఖర్గే ఇప్పుడు క‌న‌ప‌డుతున్న తీరుకు విరు ద్ధంగా కార్మిక ఉద్యమా లలో తన రాజకీయ మాట‌కారిత‌నాన్ని త‌గ్గించుకుని, అనేక ప్రాంతీయ ఎన్నికల విజయాలను సాధించాడు. అన్నింటి కంటే మించి దళితుడు, విజయం సాధించాడు. ఖర్గే కూడా కాంగ్రెస్ వర్గాలు, క‌ట్టుబాట్లను తారుమారుచేయ‌గ‌ల నైపుణ్యం ఉన్న‌ పార్టీ వ్యక్తి.  ఇద్దరు వ్యక్తులు దక్షిణానికి చెందినవారు కావడం, కాంగ్రెస్ పోరాటం జాతీయ ఎన్నికల రాజకీయాల ఉత్తరాది స్థిరీ కరణను తలకిందులు చేస్తుందని సూచిస్తుంది. ఏ రెండు సామాజిక వర్గాలు ఒకేలా ఉండవని, సామాజిక వర్గాల మధ్య జరిగే పోటీయే భారత ప్రజాస్వామ్యాన్ని ప్రపంచంలోనే అత్యంత పోటీగా మార్చిందని కూడా ఈ పోటీ తెలియ‌జేసింది. భాష, కులం శక్తి,  థరూర్‌, ఖర్గే మధ్య విభేదాలను నిర్వచించినా, పోటీ లో రాహుల్ గాంధీ వ్యక్తిత్వం పెద్దదిగా ఉంది. ఖర్గే కు మంచి మెజారిటీ వ‌చ్చినా, ఆంగ్ల మాధ్యమం కుట్రలు, కుతంత్రాలతో ఎన్నికల ప్రక్రియను కూడా కించపరిచే ప్రయత్నా లతో కొట్టుమిట్టాడుతోంది, ఇది అనేక విధా లుగా భారత రాజకీయాల స్థితిని స్ప‌ష్టం చేస్తుంది. కాంగ్రెస్ దాని ప్రారంభ పునాదుల రోజుల నుండి భారతదేశంలోని ఆంగ్లం మాట్లాడే ఉన్నత వర్గాలను ఆకర్షించింది. అధికార భాష గా, ఒక శతాబ్దం తరువాత, ఇంగ్లీష్ ఇప్పుడు పాలనను ఆదేశించదు. ఇంకా, ఖచ్చితంగా భారతీయ ఆంగ్ల మీడియా సంస్థలు ఉద్దేశపూర్వకంగా కుల-అంధులుగా ఉన్నందున నిస్సందేహంగా వారి కుల ప్రత్యేకతను కాపాడుకోవడం కోసం థరూర్ తమ అభి మాన అభ్యర్థిగా ఫ్లోటర్ ఓటర్‌ను తిప్పికొట్టడానికి, ఆకాంక్షకు ప్రాతినిధ్యం వహించే అధికారాలతో అంచనా వేయబడింది. ఖర్గే వృద్ధుడే కాదు, తన సొంత అభిప్రాయాలను కూడా కలిగి లేడని కొట్టిపారే శారు. వ్యంగ్యం మాయ‌మై చాలా కాలమ‌యింది. రాజ కీయ కథనాలు, అదృష్టాలు, దిశను మీడియా ప్రభావితం చేయగలిగినంత మేరకు, ఖర్గే విజయం పక్షపాతాన్ని మళ్లీ ధృవీకరించ డానికి ఉపయోగపడింది. థరూర్ గొప్ప‌ ఆస్తి నిజా నికి అతని మీడియా అవగాహన. నరేంద్ర మోడీ రాజ‌కీయ‌తెర‌మీద‌కి వ‌చ్చిన‌ప్పటి నుండి, ఫోర్త్ ఎస్టేట్  సాంప్రదాయ అభిప్రాయాలను రూపొందించే యంత్రాంగానికి ఏదైనా ముఖ్యమైన శక్తి ఉందా అనేది పూర్తిగా అస్పష్టంగా ఉంది. ఖర్గేను ఎన్నుకోవడంలో, ఆంగ్ల మాధ్యమాన్ని కూడా సమర్థ వంతంగా ఎంపిక చేయడంలో, కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ (బిజెపి)తో మాత్రమే ఆడుకుంటోందని చెప్పాలి. దురదృష్ట వశాత్తూ ప్రెస్ మళ్లీ పెద్దగా నష్టపోయినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతానికి, ఆంగ్ల పత్రికలు అధికార పక్షానికి ఎటువంటి ప్రవేశం లేకుం డా పోరాడవలసి ఉంటుంది, అయితే ఇప్పుడు పాత పార్టీ అవమానాన్ని కూడా పొందుతుంది, ఈ ప్రక్రియలో దాని స్వంత విశ్వస నీయత, అధికారాన్ని తగ్గిస్తుంది. భారతదేశంలోని బహుళ-పార్టీ ప్రజాస్వామ్యానికి దాని ఆంగ్ల మాధ్యమానికి ఇది శుభవార్త కాదు. ఖర్గే విజయంలో, కాంగ్రెస్ బదులుగా కులం శక్తిని ప్రదర్శించడానికి ప్రయత్నిస్తుంది. అత్యంత పోటీ తత్వం ఉన్న ఎన్నికల సందర్భంలో, బిజెపి తన స్వంత ప్రయోజనం కోసం కుల మాతృకను ఉపయో గించుకుంది, సాధన చేసింది. పంజాబ్ ప్రచారంలో దళిత ముఖంగా చరణ్‌జిత్ సింగ్ చన్నీ కాంగ్రెస్‌కు ఓట్లను సాధించనప్పటికీ, ఈ ముఖ్యమైన, చారిత్రాత్మకంగా అణచబడిన, ప్రస్తుతం తక్కువ ప్రాతి నిధ్యం లేని సామాజిక వర్గం వైపు పార్టీ కసరత్తు చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇది ఖచ్చితంగా కులాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ  ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేయడం బీజేపీ నిశ్చయాత్మక గుర్తింపు రాజకీయాల నుండి ప్రత్యామ్నాయ దృష్టిని అందిస్తుంది. అయితే, ఇది సింబాలిక్ టోకెనిజం స్థాయిలో మాత్రమే మిగిలి ఉంటే, ఇది కాంగ్రెస్‌కు కోల్పోయిన అవకాశం. నిస్సందేహంగా, హైందవ హిందూ జాతీయవాద యుగంలో కులానికి సంబంధించిన కొత్త రాజకీయాల పునఃస్థాపన కొత్త రాజకీయ ప్రారంభాన్ని అందిస్తుంది. భారతీయ సమాజం ప్రాథమిక నిర్మాణంగా, కులం చాలా కాలంగా భారత ప్రజాస్వామ్యానికి జైలు గృహంగా ఉంది. ఇప్పుడు, అది ఎన్నికల సమీకరణాల కోసం కులపెద్దల సంకేత మరియు సాధన గణనకు అతీతంగా కొత్త ఊహ  రాజకీ యాలకు అర్హమైనది మరియు డిమాండ్ చేస్తోంది. సంక్షిప్తంగా, కొత్త కుల రాజకీయాలు ఇప్పుడు విరక్తి, నకిలీ సోషలిజం విష పూరిత మిశ్రమాన్ని అనుకరించలేవు, ఇది మునుపటి యుగంలోని మండల్ రాజకీయాలను నిర్వ చించింది. అది ప్రభావవంతంగా లేదా స్ఫూర్తిదాయకంగా ఉండదు! చివరగా, కొత్త అధ్యక్షుడు చరిత్రకు తిరిగి వచ్చారు. భారత్ జోడో యాత్ర సామూహిక సంప్రదింపు కార్య క్రమం మధ్య ఖర్గే వైపు తిరిగి, కాంగ్రెస్ రాజకీయశ్రమంతా పాత విభజనకు తిరిగి వచ్చింది. చారిత్రా త్మకంగా, రాజకీయ నాయకత్వం పార్టీ అధ్యక్షత మ‌ధ్య ఎంతో తేడాలున్నాయి. ఇది గాంధీ యుగం నుండి నెహ్రూ వరకు ఇటీవలి యుపిఎ యుపిఎ కాలంలో కూడా ఘర్షణలో లేదా సామరస్యంతో రెండు వేర్వేరు వ్యక్తులచే పార్టీ, ప్రభుత్వం నడిపించబడింది. ప్రజా సంప్రదింపు కార్యక్రమం జరుగుతు న్న సమయంలోనే పార్టీ అధ్యక్ష ఎన్నికలను నిర్వహించడం ద్వారా, కాంగ్రెస్ పార్టీ తన సుదీర్ఘ ఆత్మ సంతృప్తి అధ్యాయం నుండి బయటపడినట్లు కనిపిస్తోంది. కనీసం 2012 నుండి, పార్టీ అద్వితీయమైన ఓటములతో మాత్రమే కాకుండా, కీలకంగా, రాజకీయ భాష కోల్పోవడం వల్ల కూడా ఇరుకైనది. ప్రస్తుతా నికి, హిందూ జాతీయవాద ఆధిపత్యా న్ని అణగదొక్కడానికి ప్రాంతాన్ని, సమా జాన్ని పునర్వ్య వస్థీకరిం చడం ద్వారా కాంగ్రెస్ తన రాజకీయ భవిష్యత్తును కోరుకుంటోందని స్పష్టంగా తెలుస్తుంది. ఈ తరుణం లో, కాంగ్రెస్  రాజకీయ అధికారానికి మార్గం ఇంకా గొప్ప ఆకర్షణీయమైన దృష్టితో వెలిగిపోవాలి.

మూడు రాజధానులకు జనామోదం లేదని చెబుతూనే ఎందుకీ జులుం?

మూడు రాజధానులకు జనం ఆమోదం లేదని వైసీపీకి కూడా అర్ధమైపోయిందా? అందుకే ఉత్తరాంధ్ర మంత్రులలో అసహనం పీక్స్ కు చేరుకుందా? ధర్మాన మాటలు వింటుంటే ఔననే సమాధానం వస్తోంది. ధర్మన ఇటీవలి కాలంలో తరచుగా మూడు రాజధానులకు మద్దతు ఇవ్వడం లేదని విశాఖ వాసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విశాఖ రాజధానికి మద్దతు ఇవ్వని వారంతా విశాఖ ద్రోహులు, ఉత్తరాంధ్ర ద్రోహులు అంటూ వమర్శలు గుప్పిస్తున్నారు. ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మద్దతు ఎందుకివ్వరని కన్నెర్ర చేస్తున్నారు. అయితే మొత్తం మీద విశాఖ రాజధాని అంటే విశాఖ ప్రజలే అంగీకరించడం లేదని ధర్మాన తన చేష్టల ద్వారా పదే పదే రుజువు చేస్తున్నారు.  రోజూ విశాఖ రాజధానిని జనం ఇష్టపడటం లేదనే మాటే చెబుతున్నారు.   విశాఖ రాజధానికి మద్దతు కోసం ఏర్పాటు చేసిన సభలో విశాఖ రాజధాని కోసం చేతులెత్తమని అడిగితే ఒక్కరూ ఎత్తలేదు. దీంతో వారంతా ఉత్తరాంధ్ర ద్రోహులేనని చిటపటలాడారు. ఆ తర్వాత కూడా పలు సందర్భాల్లో  ఆయనకు విశాఖకు అనుకూలంగా స్పందన కనిపించలేదు. దాంతో మళ్లీ కన్నెర్ర చేశారు. విశాఖ రాజధాని కోసం ఉత్తరాంధ్ర వాసులు నోరెందుకు విప్పడం లేదని ఆయన ప్రజల్ని ప్రశ్నిస్తున్నారు. అయితే ధర్మాన విశాఖ రాజధాని పల్లవి ఎందుకు ఎత్తుకున్నారో అందరికీ తెలిసిన విషయమే కనుక ఆయన చిటపటలకు, కోపానికి ఎవరూ బెదరడం లేదు. ఆయన మాటలకు తందాన అనడం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  వాస్తవానికి ఏపీకి రాజధానిని నిర్ణయించే సమయంలో అమరావతే రాజధాని అని ఏకగ్రీవంగా సర్వామోదం తెలిపారు. అప్పట్లో అమరావతికి వ్యతిరేకంగా ఒక్కరంటే ఒక్కరు కూడా చెప్పలేదు. ఇప్పుడు వైసీపీ స్వరం మార్చినంత మాత్రాన ప్రజలు కూడా మారతారని, మారి తీరాలని ఎందుకు అంటున్నారో.. వారికే అర్ధం కాని పరిస్థితి. అందుకే ఆ ఫ్రస్ట్రేషన్ లో ధర్మాన వాస్తవాలు వాగేస్తున్నారు.. విశాఖ వాసులపై అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో ఓ వెలుగువెలిగారు. అయితే వైఎస్ తనయుడు జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత మాత్రం ఆయనకు ఏ మాత్రం ప్రాధాన్యత లేకుండా పోయింది. తొలి మంత్రివర్గంలో స్థానం లభించలేదు. పుండు మీద కారం చల్లినట్లుగా ఆయన సోదరుడికి ఆమాత్యపదవి లభించింది. సరే కంటి తుడుపు చర్యగా మలి కేబినెట్ లో ధర్మాన క్రిష్ట ప్రసాద్ కు ఉద్వాసన పలికి ధర్మాన ప్రసాదరావుకు అవకాశం ఇచ్చారు జగన్. అయితే.. గతంలో ధర్మాన కూడా అమరావతికే మద్దతు తెలిపారు. అలా మద్దతు తెలిపినందునే రైతులంతా భరోసాతో భూములిచ్చారు. ఇప్పుడు అధికారం మారిన తర్వాత .. భూ దందాల కోసం… తాము కబ్జా చేసిన భూములను రక్షించుకోవడం కోసం విశాఖ రాజధాని అని తాము అంటే జనం కూడా తమ మాటకు వంత పాడాలని ధర్మాన జులుం చేస్తున్నారు.  

క్రాకర్స్ తో అలంకరించి కారును కాల్చేశాడు!

పుర్రెకో బుద్ధి జిహ్వాకో రుచి.. ఎవడి పిచ్చి వాడికి ఆనందం.. పిచ్చి పీక్స్.. అంటే.. ఇదే కాబోలు.. అని అనకుండా ఉండలేరు. దీపావళి సందర్భంగా ఓ యూట్యూబర్‌ చేసిన పని అందరినీ విస్తుపోయేలా చేసింది. ఇదేం తిక్కరా నాయనా, వీడెవడండి బాబూ అని అనుకునేలా చేసింది.       అందరిలా మనం కూడా బాణాసంచా కాలిస్తే కిక్కు ఏముందిలే అనుకున్నాడో మరో కారణమో కానీ.. డిఫరెంట్‌గా థింక్‌ చేశాడు. రాజస్తాన్‌లోని అల్వార్‌కు చెందిన యూట్యూబర్‌ అమిత్‌ శర్మ.. కొత్తగా ఏం చేద్దామా అని ఆలోచించి.. ఓ కారును టార్గెట్‌ చేశాడు. దీపావళి సందర్భంగా ఆ కారును ఏకంగా లక్ష టపాసులతో అలంకరించాడు. కారు చుట్టూ లక్ష టపాసులు వరసగా పేర్చాడు. ఆ తర్వాత బాంబులను పేల్చాడు.  దీంతో కాసేపు ఆ ప్రాంతమంతా క్రాకర్స్ శబ్ధంతో మారుమోగిపోయింది. బాంబులు పేలడంతో కారు కలర్‌ మొత్తం మారిపోయింది. పేలిన టపాసుల ధాటికి కారు గ్లాస్‌ పగిలిపోయింది. కానీ, ఇన్ని బాంబులు పేలినా కారు ఇంజిన్‌ పని చేయడం విశేషం. కాసేపటి తర్వాత యూట్యూబర్‌ మళ్లీ కారును స్టార్ట్‌ చేసి డ్రైవింగ్‌ చేస్తూ తన ఫ్రెండ్స్ తో ఎంజాయ్‌ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

విరాట్ అద్భుత ఇన్నింగ్స్ పై అనుష్క లవ్లీ రియాక్షన్

 టీ20 వరల్డ్ కప్‌ సూపర్ 12 మ్యాచ్ లో పాకిస్థాన్‌పై చిరస్మరణీయ విజయం అందించిన విరాట్ కోహ్లీని క్రికెట్ ప్రపంచం మొత్తం పొగడ్తల వర్షంలో ముంచెత్తుతోంది. అయితే విరాట్ భార్య,  బాలీవుడ్ నటి అనుష్క శర్మ తన భర్త అద్భుత ఇన్నింగ్స్ పై చేసిన ఒక ఎమోషనల్ పోస్టు క్రీఢాభిమానులు, సినీ అభిమానులనే కాకుండా అందరినీ ఆకర్షిస్తోంది.  అనుష్క శర్మ తన భర్తపై విరాట్ అద్భుత ఇన్నింగ్స్ అనంతరం తానెలా ఎమోషనల్ అయ్యానో చెబుతూ ఇస్టాగ్రామ్ లో చేసిన ఓ పోస్ట్ క్షణాల్లో వైరల్ అయ్యింది. అందుకు విరాట్ ఇచ్చిన సమాధానం కూడా నెటిజన్ల మనసు దోచుకుంది.  పాకిస్థాన్‌పై అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి భారత్‌కు చిరస్మరణీయ విజయం అందించిన ‘ఛేజింగ్ కింగ్’ విరాట్ కోహ్లీపై   దిగ్గజ ఆటగాళ్లు, రాజకీయ, సినీ, పారిశ్రామిక, ఇతర రంగాల ప్రముఖులు  ప్రశంసలు కురిపిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేశారు.   90 వేల మంది ప్రేక్షకులతో కిక్కిరిసిపోయిన మెల్‌బోర్న్ స్టేడియం ‘విరాట్ కోహ్లీ.. ఇండియా.. ఇండియా’ నినాదాలతో హోరెత్తింది.  తర్వాత దాయాదుల మధ్య జరిగిన క్రికెట్ పోరును ప్రత్యక్షంగానే కాకుండా పరోక్షంగా టీవీల్లో, కంప్యూటర్ తెరలపై వీక్షించిన కోట్లాది మందిలో విరాట్ కోహ్లీ సతీమణి, బాలీవుడ్ నటి అనుష్క శర్మ కూడా ఉంది. మ్యాచ్ తర్వాత ఆమె ‘ నువ్వొక అద్భుతం. నువ్వు ఇవాళ దీపావళి కంటే ముందే చాలా మంది జీవితాల్లో ఎంతో వెలుగుల సంతోషం నింపావు. నువ్వొక వండర్‌పుల్ మ్యాన్‌వి... నీ ధైర్యం, సంకల్పం, నమ్మకం అపూర్వం’ అంటూ తన ఇన్‌స్టాగ్రామ్ లో  పోస్టు చేసింది. ఆ పోస్టులో    తన జీవితంలో  అత్యుత్తమ మ్యాచ్‌ను ఇప్పుడే చూశాననీ, మ్యాచ్‌ తర్వాత ఆనందంతో డాన్స్ చేశాననీ, అరిచాననీ పేర్కొంటూ, తానెందుకు అలా అంత ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నానో అర్ధం చేసుకునే వయస్సు ఇంకా తమ కుమార్తెకు లేకపోయినా, తన తండ్రి అత్యుత్తమ ఇన్నింగ్స్‌ ఆడాడని ఏదో ఒక రోజు తను తప్పకుండా తెలుసుకుని గర్వపడుతుందనీ పేర్కొంది. కెరీర్‌లో ఒక టఫ్ దశను ఎదుర్కొని మునుపెన్నడూ లేనంత బలంగా తిరిగొచ్చి చేసిన నీ ప్రదర్శన  నాకెంతో గర్వంగా ఉంది  నీ ధైర్యం స్ఫూర్తిదాయకం. నీపై నా ప్రేమ అపరిమితం. నీ కష్టాల్లో, విజయాల్లో.. నిన్ను ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటా అన పేర్కొంది. ఆ పోస్టు వెంటనే వైరల్ అయ్యింది. లక్షల మంది లైక్ చేశారు. భార్య ప్రేమ పూర్వక అభినందనకు కోహ్లీ స్పందించి తీరు కూడా నెటిజన్ల మనసు దోచుకుంది. థాంక్యూ మై లవ్‌. ప్రతి విషయంలో, ప్రతి క్షణంలో నాకు మద్దతుగా నిలిచావు. ఐ ఫీల్ సో గ్రేట్‌ఫుల్ అండ్ లవ్‌ యూ సో మచ్ అంటూ కోహ్లీ చేసిన పోస్టు కూడా క్షణాల్లో వైరల్ అయ్యింది. 

ది వాల్ ద్రావిడ్ చేతే గంతులేయించిన కోహ్లీ సూపర్బ్ ఇన్నింగ్స్

విరాట్ కోహ్లీ..పరుగుల యంత్రం, ఛేజింగ్ ఛాంపియన్.. తన కళాత్మక బ్యాటింగ్ తో భారత్ కు పాక్ పై చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. అసలే మాత్రం అవకాశం లేని చోట, ఓటమి తథ్యమని అంతా చేతులెత్తేసిన వేళ.. తనకే సాధ్యమైన అత్యద్భుత ఇన్నింగ్స్ తో విరాట్ కోహ్లీ జట్టుకు విజయాన్ని అందించాడు.   భారత్- పాక్ మధ్య మ్యాచ్ అంటే.. అది కేవలం క్రీడ కాదు.. అంతకు మించి.. క్రికెట్ ప్రపంచమంతా ఎంతో ఉత్కంఠతో చూస్తారు. అటువంటి మ్యాచ్ చివరి వరకూ అంటే చివరి బంతి వరకూ పోటా పోటీగా సాగిందంటే.. స్టేడియంలో ఉన్న 90 వేల పైచిలుకు ప్రేక్షకులే కాదు.. టీవీలకు అతుక్కుపోయి మ్యాచ్ ను కన్నార్పకుండా చూసే ప్రేక్షకులు కూడా మునికాళ్ల మీద నుంచి గోళ్లు కొరుక్కుంటూ ఊపిరి బిగపెట్టి చూస్తారనడంలో సందేహం లేదు. దీపావళి ముందు రోజు మెల్ బోర్న్ వేదికగా భారత్, పాకిస్థాన్ ల మధ్య టి20 వరల్డ్ కప్ లో భాగంగా ఇండియా, పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్ కోట్లాది మంది నరాలు తెగిపోయే ఉత్కంఠతో చూశారు అందులో సందేహం లేదు. అలా చూసి భారత్ గెలుపు అనంతరం ఆనందంతో గెంతులు వేసిన వారిలో క్రికెట్ లెజెండ్ సునీల్ గావస్కర్ కూడా ఉన్నాడు. ఇక మిస్టర్ కూల్ గా క్రికెట్ అభిమానులు పిలుచుకునే టీమ్ ఇండియా హెడ్ కోచ్ కూడా ఆనందంతో చేతులు విసరడం, ఆనందంతో ఉప్పొంగిపోవడం చూశాం.  ఎప్పుడూ కూల్ గా కనిపించే మిస్టర్ వాల్ ద్రావిడ్ శనివారం నాటి  మ్యాచ్‌లో టీమిండియా విజయం తర్వాత   భావోద్వేగాలు నియంత్రించుకో లేకపోయాడు. ద్రావిడ్ ఆనందంతో గంతులు వేశాడు.. విరాట్ కు ఎదురెళ్లి ఆలింగనం చేసు కున్నాడు. ఇందుకు సంబంధించి  ఐసీసీ పోస్టు చేసిన వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్ అవుతోంది.  ఎందుకంటే ఎంతటి ఉత్కంఠ భరితమైన సమయంలోనైనా సరే రాహుల్ ద్రావిడ్ పెద్దగా భావోద్వేగానికి గురికాడు. కామ్ గా ఉంటాడు. కోల్ కతా వేదికగా 2001లో జరిగిన ఆస్ట్రేలియాతో జరిగిన రెండవ టెస్ట్ లో  ఫాలోఆన్ ఆడుతూ రెండో ఇన్నింగ్స్ లో లక్ష్మణ్ తో కలిసి   376 పరుగుల రికార్డు భాగస్వామ్యం సాధించి మ్యాచ్ ను గెలిపించిన సందర్భంలో కూడా ఎలాంటి ఎమోషన్స్ ప్రదర్శించలేదు. గంభీరంగానే ఆ క్షణాలను ఆస్వాదించాడు ద్రావిడ్. వాల్ అన్న తన బిరుదుగు తగ్గట్టుగా గోడలాగే ఎలాంటి ఎమోషన్స్ నూ సాధారణంగా ప్రదర్శించడు. అయితే అటువంటి వాల్ ద్రావిడ్ కూడా దీపావళిని ఒక రోజు ముందే తీసుకువచ్చిన కోహ్లీ సూపర్బ్ ఇన్నింగ్స్ ను చూసి   బ్రేక్ అయ్యాడు. ఉద్వేగాన్ని నియంత్రించుకోలేక పోయాడు. జట్టు సభ్యులతో కలిసి ఆనందాన్ని పంచుకున్నాడు. గంతులు వేశాడు. ఆ తరువాత డ్రెస్సింగ్ రూమ్ కు వస్తున్న విరాట్ కోహ్లీకి ఎదురెళ్లి హత్తుకుని అభినందించాడు 

విభజన చట్టంలో ఉన్నా తెలుగు రాష్ట్రాలకు మొండి చెయ్యే!

 కొన్నివార్తలు అంతే, చస్తూ ఉంటాయి, మళ్ళీ పుడుతూ ఉంటాయి. పునరపి జననం.. పునరపి మరణం...అన్నట్లు అన్నమాట. ఉభయ తెలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ నియోజక వర్గాల పెంపుకు  సబందించిన వార్త కూడా అంతే. నిజానికి, ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచిన చాలా చాలా చెల్లని హామీలలో ఇది కూడా ఒకటి. ఎపీకి ప్రత్యేక హోదా, తెలంగాణకు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ’ వంటి అనేక ఉత్తుత్తి హమీల్లాగానే, ఉభయ తెలుగు తెలుగు రాష్టాల్లో అసెంబ్లీ నియోజక వర్గాల నెంబర్ పెంచే హామీ కూడా ఉత్తుత్తి హమీనే అనే  విషయం అందరికీ తెలిసిందే. అయినా, నియోజక వర్గాల పెంపు అనే మాట వినగానే, ఉభయ తెలుగు రాష్ట్రాలలో రాజకీయ సందడి మొదలవుతుంది. నిజానికి ఇందుకు సంబంధించి గడచిన ఎనిమిదేళ్ళలో తెలుగు రాష్ట్రాల ఎంపీలు పార్లమెంట్’లో అనేక సందర్భాలలో ప్రస్తావన ఇచ్చారు.అయితే ప్రస్తావన వచ్చిన ప్రతి సందర్భంలోనూ కేంద్ర ప్రభుత్వం, అది ఇప్పట్లో కాదని ఖరాఖండిగా చెపుతూనే వుంది. 2026 జనాభా లెక్కలు తేలిన తర్వాత చూద్దాం అన్నట్లుగా దాటవేస్తోంది.  అయితే ఇప్పడు కొత్తగా మరో ఆశ చిగురించింది.ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో శాసనసభ నియోజకవర్గాల పెంపుపై కేంద్ర ప్రభుత్వం, తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు, కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. ఆంధ్ర ప్రదేశ్  పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ నియోజక వర్గాలను పెంచాలని, కానీ, ఇంత వరకూ ఆ ప్రక్రియను మొదలు పెట్టలేదంటూ పర్యావరణవేత్త ప్రొఫెసర్‌ కె.పురుషోత్తమ్‌ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తులు జస్టిస్‌ కేఎం జోసెఫ్‌, జస్టిస్‌ హృషికేశ్‌ రాయ్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది.  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 175 అసెంబ్లీ సీట్లను 225కి, తెలంగాణలోని 119 సీట్లను 153కి పెంచాలని రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్‌ 26లో ఉందని, కానీ, ఇప్పటి వరకూ కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం ప్రక్రియను మొదలు పెట్టలేదని పిటిషనర్‌ తరఫు న్యాయవాది రావు రంజిత్‌ వివరించారు. జమ్ము కశ్మీర్‌ రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న నిబంధన మేరకు అక్కడ నియోజక వర్గాలను పెంచడానికి డీలిమిటేషన్‌ కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ కేంద్ర న్యాయ శాఖ నోటిఫికేషన్‌ జారీ చేసిందని, అదే నిబంధన ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఉన్నా కేంద్రం తగిన చర్యలు తీసుకోలేదని ఆక్షేపించారు. జమ్ము కశ్మీర్‌లో అసెంబ్లీ సీట్లను పెంచుతున్నప్పుడు ఏపీ, తెలంగాణల్లో ఎందుకు పెంచడం లేదని ప్రశ్నించారు.ఈ నేపథ్యంలోనే, సుప్రీం ధర్మాసనం..  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఈసీకి నోటీసులు జారీ చేసింది.   ఇంతవరకు రాజకీయ  పార్టీలు, పార్లమెంట్ సభ్యులు ఇదే ప్రశ్న వేసినా కేంద్ర ప్రభుత్వం పెద్దగా పట్టిచుకోలేదు. మంత్రులు నియోక వారలు పెంచాలంటే రాజ్యాంగ సవరణ అవసరమని సమదాన్నాని డేటా వేస్తూ వచ్చారు. అయితే ఇప్పడు, సుప్రీం కోర్టు  నోటీసులు జారీ చేయడంతో కేంద్ర ప్రభుత్వం ఏమి సమాధానం ఇస్తుందన్న అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ అంశంపై ఏదో ఒక వైఖరి తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వం తప్పించుకోలేదని న్యాయనిపుణులు స్పష్టం చేశారు.  నిజానికి, ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్‌ 26 ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో నియోజక వర్గాలను పెంచాలని రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచీ కేంద్రాన్ని టీఆర్‌ఎస్‌ విజ్ఞప్తి చేస్తూనే ఉంది. అయితే, నియోజక వర్గాల పెంపునకు రాజ్యాంగ సవరణ అవసరమని కేంద్ర ప్రభుత్వం వాదిస్తోంది. అయినా కేంద్ర ప్రభుత్వం అదే ఆవు కథను వినిపిస్తూ వచ్చింది. అయితే తెరాస నియోజక వర్గాలు పెంచాలని కోరినా, బీజేపీ ప్రభుత్వం కాదన్నా అందుకు ప్రధానంగా రాజకీయమే కారణంగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. రాజకీయంగా లాభనష్టాలను బీజేపీ బేరీజు వేసుకుంటుందని, నియోజక వర్గాలు పెంచితే తమకు అనుకూలమని అంచనాకు వస్తేనే ఈ అంశంపై ముందుకెళ్లే అవకాశముందని భావిస్తున్నాయి. అప్పటి వరకూ కేంద్రం కాలయాపన చేస్తూనే ఉంటుందని చెబుతున్నాయి. కాగా, తెలంగాణలో నియోజక వర్గాలు పెరిగితే రాజకీయంగా తమకు నష్టం జరుగుతుందని బీజేపీ నేతలు సైతం పలుమార్లు అభిప్రాయపడ్డారు. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 119 నియోజక వర్గాల్లోనే మెజారిటీ స్థానాల్లో తమ పార్టీకి బలమైన అభ్యర్థులు లేరని, నియోజక వర్గాలను పెంచితే బలమైన అభ్యర్థులు దొరకడం కష్టతరమని అభిప్రాయపడుతున్నారు.అలాగే, తెరాస నియోజక వర్గాల సంఖ్య పెరిగితే మరింత మంది పార్టీ నేతలకు అవకాసం కలిపించి,అసంతృప్తిని తగ్గించుకోవచ్చని ఆశిస్తోంది. అయితే, కోర్టుల్లో ఈ కేసు ఒక కొలిక్కి వచ్చే సరికి పుణ్య కాలం పూర్తవుతుందని అంటున్నారు.

తెలంగాణ సర్కార్.. గవర్నర్ తమిళి సై మధ్య విభేదాలు కంటిన్యూస్!

గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌కు, తెలంగాణ సర్కార్‌కు మధ్య గ్యాప్ రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది.  అసెంబ్లీ ఆమోదం పొందిన బిల్లులకు గవర్నర్ ఆమోద ముద్ర పడలేదు.  6 చట్టసవరణ బిల్లులతో పాటు మరో 2 కొత్త బిల్లులు ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉన్నాయి. వర్సిటీల్లో రిక్రూట్‌మెంట్‌కు కామన్ బోర్డు, మున్సిపాలిటీ యాక్ట్ సవరణ, ఫారెస్ట్ వర్సిటీ, అజామాబాద్‌ పారిశ్రామికవాడ చట్టం బిల్లులకు గవర్నర్ ఇప్పటికీ ఆమోదముద్ర వేయలేదు.  బిల్లులకు ఆమోదం తెలిపే అంశం తన పరిధిలోనిదని తమిళిసై అంటున్నారు. గవర్నర్‌గా   తన పరిధికి లోబడే నడుచుకుంటున్నానని బిల్లులపై త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటాననీ చెప్పిన ఆమె తాను ఎవరికీ వ్యతిరేకం కాదని అన్నారు. కారణాలేమైనా కానీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గవర్నర్ తమిళి సై మధ్య ఆమె గవర్నర్ గా పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పెద్దగా సత్సంబంధాలు లేవు.    తెలంగాణలో బీజేపీ బలపడటమే ఇందుకు కారణంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   నిజమే కావచ్చును, వ్యవస్థల మధ్య, వ్యక్తుల మధ్య విభేదాలు ఉంటే ఉండవచ్చును. కానీ, వ్యక్తుల మధ్య, వ్యవస్థల మధ్య విబేధాలు ఘర్షణాత్మక స్థాయికి చేరుకోవడం మాత్రం  మాత్రం అభిలషణీయం కాదు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, ప్రజాస్వామ్య స్పూర్తికి విరుద్ధం. అయితే తెలంగాణ ప్రభుత్వం,  ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు,, గవర్నర్ తమిళి సై సౌందరరాజన్’ మధ్య నెలకొన్న ఘర్షణాత్మక వాతావరణం మర్యాద గీతను దాటేసిందనే అభిప్రాయమే ప్రముఖంగా వినిపిస్తోంది.  నిజానికి, ముఖ్యమంత్రి ఘర్షణాత్మక వైఖరి అవలబిస్తోంది, ఒక్క గవర్నర్ తో మాత్రమే కాదు. కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ, చివరకు నిన్న మొన్నటివరకు 20 సంవత్సరాలకు పైగా తనతో కలిసి నడిచిన, మాజీ మంత్రి, ప్రస్తుత బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందేర్ .. ఇలా, చెప్పుకుంటూ పోతే, ముఖ్యంత్రి వ్యక్తిగత ద్వేషం పెంచుకున్న వ్యక్తుల చిట్టా చాలా పెద్దదేనని తెరాస శ్రేణులే చెబుతుంటాయి. అంతేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు తన ముఖం చూడడం కూడా ఇష్టం లేదని మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఆరోపించారు. నిజానికి అది ఆరోపణ ఎంత మాత్రం కాదు. వాస్తవం.  ఈటలను చూడలేక ఆయన్ని, ఆయనతో పాటుగా బీజేపీ ఎమ్మెల్యేలు  ముగ్గురినీ, బడ్జెట్ సమావేశాల మొత్తం కాలానికి, సస్పెండ్ చేశారు. ఇక కేవలం మూడు రోజులకు కుదించిన ప్రస్తుత వర్షాకాల సమావేశాలలో పాల్గొనేందుకు కూడా అవకాశం లేకుండా, సాకేతిక కారణాలు చూపించి బడ్జెట్ సమావేశాలలో చేసిన సస్పెన్షన్ ను వర్షాకాల సమావేశాలకు కూడా పొడిగించారు. ఇక ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రానికి వచ్చిన ప్రతి సందర్భంలో ముఖ్యమంత్రి ప్రోటోకాల్ పాటించలేదు. ముఖం చాటేశారు.  సరే అదలా ఉంటే, తెలంగాణ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టి మూడేళ్లు పూర్తి చేసుకున్న తమిళిసై సౌందర్ రాజన్  మూడేళ్లుగా తను ఎదురైన చేదు అనుభవాలను ఏకరువు పెట్టారు. ఎట్ హోంకు వస్తానని చెప్పిన సీఎం రాలేదని ఆమె అన్నారు. వాస్తవాలు ప్రజలకు తెలియాలని చెప్పుకొచ్చారు. 75 ఏళ్ల స్వాతంత్య్ర దినోత్సవాలను జరుపుకుంటున్న సమయంలో కూడా ఇలాంటి  వివక్ష  సరైంది కాదని గవర్నర్ హితవు పలికారు.  ప్రజలను కలవాలని అనుకున్న ప్రతిసారి ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. గతంలో మేడారం జాతరకు వెళ్లేందుకు హెలికాప్టర్‌ అడిగినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదని తమిళిసై అసంతృప్తి వ్యక్తం చేశారు. సమ్మక్క- సారక్క జాతరకు వెళ్లేందుకు రోడ్డు మార్గంలో 8 గంటలు ప్రయాణించానని ఆమె చెప్పుకొచ్చారు. తాను ఎక్కడికి వెళ్లినా ప్రోటోకాల్ పాటించడం లేదని ఆమె మండిపడ్డారు. కొన్ని విషయాలు బయటకు చెప్పడం మంచిది కాదని   గవర్నర్ వ్యాఖ్యానించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా పేదల కోసం తన పని కొనసాగిస్తుంటానని తమిళిసై చెప్పారు. తనకు గౌరవం ఇచ్చిన ఇవ్వకపోయినా పట్టించుకోననని.. రాజ్‌భవన్‌ను గౌరవించాలి కదా అని ఈ సందర్భంగా ఆమె వ్యాఖ్యానించారు. ఎన్నో యూనివర్సిటీలు, హాస్టళ్లను సందర్శించానని, విద్యార్థుల సమస్యలు తెలుసుకున్నానని గవర్నర్ అన్నారు. బాసర ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థుల సమస్యల చూసి చలించిపోయానని ఆమె గుర్తు చేసుకున్నారు. సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రికి లేఖలు రాశానని చెప్పారు. ఆదివాసీ ప్రాంతాల్లో పర్యటించానని తమిళిసై చెప్పారు. నిజానికి,గడచిన మూడు సంవత్సరాలు అనేకంటే, హుజురాబాద్ పరాభవం మొదలు ముఖ్యమంత్రిలో మార్పు వచ్చిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. హుజూరాబాద్ ఓటమి తర్వాతనే ముఖ్యమంత్రి అటు ప్రధాని మోడీని , ఇటు గవర్నర్ తమిళి సై సౌందరరాజన్  తో దూరం పెరిగిందని అంటున్నారు.   తెలంగాణలో గవర్నర్‌, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య పెరిగిన దూరం ఇంకా ఇంకా ముందకు పోతోంది. గడచిన రెండేళ్లలో కేవలం, రాష్ట్ర హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారానికి మాత్రమే ముఖ్యమంత్రి రాజ్ భవన్ గడప తొక్కారు. మరో వంక స్వాతంత్ర, గణతంత్ర  దినోత్సవ వేడుకల సందర్భంగానూ ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ , ముఖ్యమంత్రి ఎవరి దారి వారిది అన్నట్లుగా ఎడముఖం పెడ ముఖంగానే ఉంటున్నారు. చివరకు, రాష్ట్ర శాసన సభ బడ్జెట్ సమావేశాల ప్రారంభంలో, గవర్నర్ ప్రసంగం లేకుండానే సభా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. మరో వంక గవర్నర్ ప్రొటోకాల్ వివాదం ఢిల్లీ వరకు వెళ్ళింది. ఆమె ప్రొటోకాల్ ఉల్లంఘనలకు సంబంధించి, ఢిల్లీలో చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో దుమారం సృష్టించాయి. కాగా, రాజ్యాంగబద్ద వ్యవస్థల మధ్య ఘర్షణాత్మక వైఖరి మంచిది కాదని ఇలాంటి పరిస్థితి చిలికి చిలికి గాలివానగా మారి రాజ్యాంగ సంక్షోభానికి దారితీసే ప్రమాదం లేక పోలేదని రాజ్యాంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాగా తాజాగా గవర్నర్ తమిళిసై పుస్తకావిష్కరణ సందర్భంగానూ ఆమె రాష్ట్ర ప్రభుత్వ తీరు పట్ల నిశితంగా విమర్శించారు. భద్రాచలం వరదలను సీఎం ఇసుమంతైనా పట్టించుకోలేదనీ, తాను వరద ప్రభావిత ప్రాంతాలకు పర్యటనకు వెళుతున్నానని తెలియగానే ఆఘమేఘాల మీద అప్పటికప్పుడు ఏర్పాట్లు చేసుకుని వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనకు బయలు దేరిన విషయాన్ని గుర్తు చేశారు.

బ్రిట‌న్ ప్ర‌ధాని మ‌న రిషీ సునాక్‌

బ్రిటన్ ప్రధాన మంత్రి పదవికి పోటీదారుగా నిలిచిన పెన్నీ మోర్డాంట్ తన అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకున్నారు. దీంతో భారత సంతతికి చెందిన రుషి సునాక్ బ్రిటన్‌కు అత్యంత పిన్న వయస్కుడైన ప్రధాన మంత్రి అయ్యారు. ఆయన  మొదట భారతీయ మూలాలుగల బ్రిటన్ ప్రధాని  అవుతారు. రుషి సునాక్ సెప్టెంబరులో జరిగిన ఎన్నికల్లో లిజ్ ట్రస్ చేతిలో పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఆమె అనేక యూ-టర్న్‌లు తీసుకుని విమర్శలపాలై, చివరికి రాజీనామా చేశారు. దీంతో రవి అస్తమించని సామ్రాజ్యంగా పేరు పొందిన బ్రిటన్‌కు అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో నాయకత్వం వహించేందుకు రుషి సునాక్ ముందుకొచ్చారు. రిషి సునక్ బ్రిటన్ మొదటి భారతీయ సంతతికి చెందిన ప్రధాన మంత్రిగా చరిత్ర సృష్టించారు. అతని మాజీ బాస్ బోరిస్ జాన్సన్ పెన్నీమోర్డాంట్ ఎన్నికల్లో నిలబడేందుకు అవసరమైన 100 మంది ఎంపీల మద్దతును సేకరించలేక పోయారు. పార్ల మెంట్‌లో భగవద్గీతపై యార్క్‌షైర్ ఎంపీగా రిషి సునక్ ప్రమాణం చేశారు. అతను అలా చేసిన మొదటి యూకె పార్లమెం టేరి యన్. ఆయ‌న తల్లిదండ్రులిద్దరూ భారత సంతతికి చెందినవారు. సునక్ తల్లిదండ్రులు, ఫార్మసిస్ట్‌లు, 1960లలో తూర్పు ఆఫ్రికా నుండి యూకె కి వలస వచ్చారు. సునక్ తండ్రి యశ్వీర్ సునక్ నేషనల్ హెల్త్ సర్వీస్ జనరల్ ప్రాక్టీషనర్. తల్లి ఉషా సునక్  కెమిస్ట్ షాప్ నడుపుతున్నారు. రిషి సునక్ ఇన్ఫోసిస్ చీఫ్ నారాయణ్ మూర్తి కుమార్తె అక్షతా మూర్తిని వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు - కృష్ణ,  అనౌష్క. బోరిస్ జాన్సన్ నాయకత్వంలో ఖజానా ఛాన్సలర్‌గా, రిషి సునక్ డౌనింగ్ స్ట్రీట్‌లోని తన నివాసంలో దీపావళి దీపాలను వెలిగించారు. రిషి సునక్ తరచుగా త‌మ‌ వారసత్వం గురించి మాట్లాడుతుంటారు. చాలా భారతీయ గృహాల మాదిరి గానే, సునక్ ఇంటిలో పిల్లల పెంపకంలో విద్య అనేది ఒక ముఖ్య అంశం. రిషి సునక్ స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ ,  ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్. రిషి సునక్ తన భార్య పిల్లలతో కలిసి తన అత్తమామలను కలవడానికి తరచుగా బెంగుళూరుకు వస్తుంటారు.2022 వేసవిలో ప్రధానమంత్రి పదవికి ప్రచార సమయంలో, రిషి సునక్ తన విలాసవంతమైన ఇల్లు, ఖరీదైన సూట్లు,బూట్లతో సహా పలు అంశాలలో విమర్శలను ఎదుర్కొన్నాడు. ఒత్తిడితో కూడిన పరిస్థితులలో భగవద్గీత తరచుగా తనను కాపాడుతుందని విధిగా  ఉండా ల‌ని గుర్తు చేస్తుందని రిషి ఒక ప్రకటనను పంచుకున్నారు. రిషి సునక్ నికర విలువ 700 మిలియన్ పౌండ్లకు పైగా ఉంటుంది, యూకెలో చాలా ఆస్తులు కలిగి ఉన్నారు. ఆయ‌న నిత్యం ఫిట్‌గా ఉండటానికి ఇష్ట‌ప‌డ‌తారు. రిషికీ కొంచెం క్రికెట్ పిచ్చి ఉంది. యూకె ప్రధాన మంత్రి రేసులో పడిపోయిన వారాల తర్వాత, దేశంలో సంక్షోభం లాంటి పరిస్థితుల మధ్య సోమవారం రిషి సునక్ 200 సంవత్సరాలకు పైగా బ్రిటన్‌కు అత్యంత పిన్న వయస్కుడైన ప్రధానమంత్రి అయ్యారు. తమ హీరో బోరిస్ జాన్సన్‌ను దించాడని కన్జర్వేటివ్ పార్టీలోని కొందరు ఆరోపించినప్పుడు, రెండు నెలల కిందటే లిజ్ ట్రస్‌కు నాయకత్వ బిడ్‌ను కోల్పోయిన మిస్టర్ సునక్‌కు ఇది గొప్ప రాబడి. అయితే సున‌క్‌ను దెబ్బతీసిన కొన్ని వివాదాలూ ఉన్నాయి. ముఖ్యంగా కార్మిక‌రంగంలో పెద్దగా స్నేహితులు లేక‌పోవ‌డం. మిడిల్ క్లాసెస్ దేర్ రైజ్ అండ్ స్ప్రాల్' అనే బిబిసి డాక్యుమెంటరీ సిరీస్‌లో, 21 ఏళ్ల మిస్టర్ సునక్ తన స్నేహితుల గురించి మాట్లాడాడు. 2001 నాటి క్లిప్పింగ్‌లో, మిస్టర్ సునక్  త‌న‌కు ఉన్నత తరగతికి చెందిన స్నేహితులు ఉన్నారు, నాకు శ్రామిక వర్గానికి చెందిన స్నేహితులు ఉన్నార‌ని సరే, వర్కింగ్ క్లాస్ కాదని ఆయ‌న త్వరగా సరిదిద్దుకున్నాడు. ప్రజల మనిషిగా ప్రకటించుకునే ఈ క్లిప్ దేశవ్యాప్తంగా మిస్టర్ సునక్‌కు ఎదురుదెబ్బ తగిలింది.  ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కుమార్తె అక్షతా మూర్తిని వివాహం చేసుకున్నారు. అక్షతా మూర్తి తన నివాసేతర స్థితిని కొనసాగించడానికి సంవత్సరానికి 30 వేల‌ పౌండ్లు చెల్లించినట్లు ఈ సంవత్సరం నివేదించబడింది, ఇది విదేశీ ఆదాయంపై యూకె పన్ను చట్టాలకు ఆమె బాధ్యత వహించదు. ప్రజల ఆగ్రహానికి గురైన తర్వాత ఆమె తన నివాసే తర హోదాను వదులుకోవలసి వచ్చింది.

కియోలాకి తెలిసింది జొనాస్‌ క‌ష్టం!

చెట్లు స‌మాచారాన్ని పంచుకుం టాయిట‌, జంతువులు మాట్లాడు కుంటాయిట‌, పిల్ల‌ల క‌ష్టాలు త‌ల్లి గ్ర‌హించ‌గ‌ల‌దు, పెంపుడు జంతు వులు య‌జ‌మాని క‌ష్టాలు తెలు సుకోగ‌ల‌వుట‌..లోకంలో అనేకా నేక అద్భుతాలు. ఎవ‌రో చెబితేనే న‌మ్మ‌క్క‌ర్లేదు.. కొన్ని అనుభ‌వ‌ పూర్వ‌కంగానే తెలుస్తాయి. కియోలాకి తెలిసింది జోలిని జొనాస్ క‌ష్టం అలానే తెలిసింది.   జొలిని జొనాస్, రికీ బాల్య స్నేహి తులు, త‌ర్వాత పెళ్లి చేసుకు న్నారు. వారు ఒక గుర్రాన్ని పెంచుకున్నారు. దాని పేరే కియోలా! ఎంతో స‌ర‌దాగా గ‌డుస్తోంది కాలం. జొనాస్ గ‌ర్భ‌ వ‌తి అయింది. కొద్ది నెల‌ల‌కు కియోలాను కాస్తంత దూరంగా మెదిలేలా చేశాడు రికీ. దానికి అర్ధం కాలేదు. రోజు వ‌చ్చి ముద్దుపెట్టేది ద‌గ్గ‌రికీ రావ‌డం లేద‌ని. ఆమె మెల్ల మెల్ల‌గా న‌డ‌వ‌డం గ‌మ‌నించి ఏదో అయింద‌ని అర్ధ‌మ‌యింది. ఆమె రెండు రోజుల‌కోసారి డాక్ట‌ర్ ద‌గ్గ‌రికి వెళుతూండేది. వ‌చ్చేవ‌ర‌కూ కియో ఎదురు చూస్తుండేది. నెల‌ల నిండుతున్న త‌రుణంలో ఆమె వెన్ను నొప్పితో బాధ‌ప‌డింది. ఒక‌సారి కియో ఆమెను డాక్ట‌ర్‌ద‌గ్గ‌రికి వెళ్ల‌ కుండా అడ్డుకుంది. ఆమెను ద‌గ్గ‌ర‌కి లాక్కుని హ‌త్తుకుంది. దీనికి ఏదో అయింద‌నిపించింది. ఆ త‌ర్వాత నాలుగ‌యిదు రోజులు అలానే డాక్ట‌ర్ దగ్గ‌రికి వెళ్ల‌కుండా చేసింది. దాని అర్ధ‌మేమిటో దంప‌తుల‌కు తెలియ‌దు, కియోలా మాటల్లో చెప్ప‌లేదు.. అదే ఏదో అనారోగ్యంతో బాధ ప‌డుతోందేమో అనుకున్నారు.   కొద్దిరోజుల్లో ఆప‌రేష‌న్ అన‌గా డాక్ట‌ర్ ద‌గ్గ‌రికి వెళ్లింది జొనాస్‌. డాక్ట‌ర్ చెక్ చేసిన‌పుడు ఆశ్చ‌ర్య‌పోయారు. ఆమెకు వెన్నునొప్పికి కార‌ణం ఆమె గ‌డుపులో ఏదో చిప్ ఉండ‌డం వ‌ల్ల‌నే అని ఎక్స్‌రేలో తెలిసింది. అయితే త‌ల్లీ, పాప క్షేమంగా ఇంటికి వ‌చ్చారు. డాక్ట‌ర్లు అనుమానం వ‌చ్చి పోలీసుల‌కు చెబితే వారు అనుమానితులుగా అయిదుగురిని ప‌ట్టుకున్నారు. వారిలో ఒక‌డు జోనాస్ మొద‌ట సంప్ర‌దించిన డాక్ట‌ర్ కూడా ఉన్నాడు. ఆమెకు ఆశ్చ‌ర్య‌మేసింది. వీడే చిప్‌తో ఆరోగ్యాన్ని కంట్రోల్ చేసే య‌త్నాలు చేశాడని తేలింది. ఇది అమెరికాలో నేరం. ఆ గ్యాంగ్‌ని పోలీసులు క‌ట‌క‌టాల్లోకి తోసారు. బిడ్డ‌తో జొనాస్‌, రికీ ఇంటికి వెళ్లారు. రెండు రోజుల త‌ర్వాత బిడ్డ‌ని కియోకి చూపించింది. అది ఎంతో ప్రేమ‌తో ఆమె బుగ్గ‌ల్ని నాకింది. ర‌క్షించినం దుకు ఆమె ముద్దాడింది!  

సోనియా ఆధ్వర్యంలోని ట్రస్టులకు ఎఫ్ సీఆర్ఏ లైసెన్స్ రద్దు

సోనియాగాంధీ ఆధ్వర్యంలో నడుస్తున్న రెండు ట్రస్టులకు కేంద్రం ఎఫ్ సీఆర్ఏ లైసెన్సు రద్దు చేసింది. స్వచ్ఛంద సంస్థలు, ట్రస్టులు విదేశాల నుంచి విరాళాలు సేకరించాలన్నా,  స్వీకరించాలన్నా ఎఫ్ సీఆర్ఏ లైసెన్స్ తప్పనిసరి. ఎఫ్ సీఆర్ఏ అంటే ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్. ఈ లైసెన్సు ఉన్న ట్రస్టులు మాత్రమే విదేశాల నుంచి విరాళాలు స్వీకరించాలి. అయితే కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్  అగ్రనేత సోనియా గాంధీ ఆధ్వర్యంలోని రెండు ట్రస్టులకు ఎఫ్ సీఆర్ఏ లైసెన్స్ రద్దు చేసింది. సోనియా నేతృత్వంలో రాజీవ్ గాంధీ ఫౌండేషన్, రాజీవ్ గాంధీ చారిటబుల్ ట్రస్టు కార్యకలాపాలు కొనసాగిస్తున్న సంగతి విదితమే. అయితే ఈ రెండు సంస్థలు ఆర్థికపరమైన నిబంధనలు ఉల్లంఘించినట్టు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆరోపిస్తోంది. అందుకే ఈ రెండు సంస్థలపై విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్ సీఆర్ఏ) ప్రకారం చర్యలు తీసుకున్నామని, ఎఫ్ సీఆర్ఏ లైసెన్స్ రద్దు చేశామని కేంద్ర హోంశాఖ వెల్లడించింది. హోంశాఖ మంత్రిత్వ కమిటీ దర్యాప్తు నివేదిక ఆధారంగా ఈ చర్యలు తీసుకున్నట్టు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు పత్రాల్లో అవకతవకలు, విదేశీ నిధుల దుర్వినియోగం, అక్రమంగా నగదు చెలామణీ తదితర  అవకతవకలకు ఈ రెండు ట్రస్టులూ పాల్పడినట్లు ఈ కమిటీ గుర్తించినట్టు వారు పేర్కొన్నారు.  కాగా, రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కు నిధులు అందించిన వారి జాబితాలో  చైనా కూడా ఉండడం గమనార్హం. అంతేకాదు, ప్రస్తుతం పరారీలో ఉన్న ఆర్థికనేరస్తుడు మేహుల్ చోక్సీ కూడా గతంలో పీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళం ఇవ్వగా, ఆ నిధులను రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కు మళ్లించినట్టు అప్పట్లో బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ఆరోపించారు. ఈ ఫౌండేషన్ లో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ ఆర్థికమంత్రి పి.చిదంబరం తదితర ప్రముఖులు ట్రస్టీలుగా ఉన్నారు.

భారత్ జోడో యాత్రకు దీపావళి సెలవులు.. ఢిల్లీ వెళ్లిన రాహుల్

భారత్ జోడో యాత్రకు రాహుల్ గాంధీ స్వల్ప విరామం ప్రకటించారు. దీపావళి పండుగ సందర్భంగా యాత్రకు మూడు రోజుల విరామం ప్రకటించి హస్తినకు బయలు దేరి వెళ్లారు. అంతకు ముందు రాహుల్ గాంధీ కర్నాటకలోని రాయచూర్ జిల్లా ఎర్మారస్ నుంచి తెలంగాణలోకి ప్రవేశించారు. మక్తల్ కృష్ణా బ్రిడ్జి మీదుగా రాహుల్ భారత్ జోడో యాత్ర తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా రాహుల్ కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి,  కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ మాణికం ఠాగూర్ తదితరులు ఘన స్వాగతం పలికారు.  తెలంగాణలో తొలి రోజు యాత్ర నాలుగు కిలోమీటర్లు సాగింది. అడుగడుగునా రాహుల్ గాంధీకి తెలంగాణ ప్రజ నీరాజనం పలికింది.  వేలాది మంది కాంగ్రెస్‌ శ్రేణులు, అభిమానులతో భారత్‌ జోడో యాత్ర కిక్కిరిసిపోయింది.  నాలుగు కి.మీ. పాదయాత్ర చేసిన తర్వాత రాహుల్ గాంధీ తన పాదయాత్రకు  విరామం ఇచ్చారు. దీపావళి పండుగ సందర్భంగా పాదయాత్రకు మూడు రోజులు విరామం ప్రకటించి రాహుల్ గాంధీ మక్తల్ నుంచి శంషాబాద్ విమానాశ్రయం చేరకుని అక్కడ నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. విరామం తరువాత పాదయాత్ర యథాతథంగా కొనసాగుతుంది. తెలంగాణలో రాహల్  భారత్ జోడో యాత్ర మొత్తం 12 రోజుల పాటు సాగుతుంది. రాష్ట్రంలో ఆయన 375 కిలో మీటర్లు నడుస్తారు.  ఈ నెల 24, 25 , 26 తేదీల్లో పాదయాత్రకు విరామం ఇవ్వనున్నారు. ఈ నెల 27 నుంచి రాహుల్ గాంధీ పాదయాత్ర నిర్వహించనున్నారు.

భళా ఇస్రో.. అంతరిక్షంలోకి ఒకే సారి 36 శాటిలైట్లు

ఇస్రో ఖాతాలో మరో ఘనత చేరింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చరిత్రలో జీఎస్ఎల్వీ రాకెట్ మొదటి సారిగా ఆరు టన్నుల పేలోడ్‌ను అంతరిక్షంలోనికి తీసుకు వెళ్లింది.  ఎల్‌వీఎం3-ఎం2 రాకెట్ ద్వారా ఒకే సారి 36 శాటిలైట్లను అంతరిక్షంలో విజయవంతంగా ప్రయోగించారు.   ఉమ్మడి నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి   జీఎస్ఎల్వీ నింగిలోకి దూసుకెళ్లింది.శనివారం(అక్టోబర్22) అర్థరాత్రి దాటిన తరువాత జీఎస్ఎల్‌వీ- మార్క్3    నిప్పులు చిమ్మతూ   నింగిలోకి దూసుకెళ్లింది.  అంతకు 24 గంటల ముందు ఈ ప్రయోగానికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది.    ఇస్రో రాకెట్ జీఎస్ఎల్వీ మార్క్-3 ప్రైవేట్ కమ్యూనికేషన్ సంస్థ వన్‌వెబ్‌కు చెందిన 36 ఉపగ్రహాలను ఒకేసారి నింగిలోకి మోసుకెళ్లింది.  వచ్చే ఏడాది మొదట్లో మరో 36 వన్‌వెబ్ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంప నున్నట్లు ఇస్రో ఛైర్మన్ ఎస్. సోమనాథ్ తెలిపారు. భారత్ నుంచి జీఎస్ఎల్వీ మార్క్-3లో  ఉపగ్రహాల ప్రయోగాన్ని చేపట్టి విజయవంతంగా పూర్తి చేయడం ఎన్ఎస్ఐఎల్, ఇస్రోలకు ఒక చారిత్రాత్మక క్షణం అని ఎన్ఎస్ఐఎల్ సీఎండీ రాధాకృష్ణన్ తెలిపారు.ఇస్రో ఈ ప్రయోగాన్ని కమర్షియల్ ఆపరేషన్‌గా చేపట్టింది. న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ (ఎస్ఎస్ఐఎల్) అనే సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు వన్‌వెబ్‌కు చెందిన 36 శాటిలైట్లను లో ఎర్త్ ఆర్బిట్ (ఎల్ఈఓ)లో ప్రవేశపెట్టింది. ఒక్కో బ్యాచ్‌లో 4 ఉపగ్రహాల చొప్పున.. మొత్తం 9 బ్యాచ్‌లలో 36 ఉపగ్రహాలు కక్ష్యలోకి చేరాయి. ఒక్కో ఉపగ్రహం 142 కిలోల బరువు ఉంటుంది. కాగా ఇస్రో ప్రయోగం విజయవంతం అయిన సందర్భంగా ప్రధాని మోడీ, మంత్రి నితిన్ గడ్కరీ అభినందించారు. ఈ మేరకు వేరువేరుగా చేసిన ట్వీట్లలో వారు ఇస్ట్రో ప్రయోగం విజయవంతం కావడం భారత్ కు గర్వకారణంగా పేర్కొన్నారు.  

బాణసంచ దుకాణంలో అగ్ని ప్రమాదం.. ఇద్దరు సజీవ దహనం

బాణసంచ దుకాణంలో సంభవించిన అగ్రిప్రమాదంలో ఇద్దరు మరణించారు. ఏటా ఏర్పాటు చేసినట్లుగానే విజయవాడ గాంధీనగర్ లోని జింఖానా మైదానంలో బాణసంచా దుకాణాలు ఏర్నాటు చేశారు. ఆ దుకాణాలలోని ఓ దుకాణంలో సంభవించిన అగ్నిప్రమాదంలో ఇద్దరు సజీవదహనమయ్యారు. దీపావళి పండుగ వేళ ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు సజీవ దహనమయ్యాయి. విజయవాడలోని గాంధీనగర్ జింఖానా మైదానంలో ఏర్పాటు చేసిన బాణసంచ దుకాణాలలోని ఓ దుకాణంలో సంభవించిన అగ్నిప్రమాదంలో ఇద్దరు సజీవ దహనమయ్యారు. ఆదివారం(అక్టోబర్ 23) ఉదయం ఈ దుర్ఘటన జరిగింది.మైదానంలో ఏర్పాటు చేసన దుకాణాలలోని ఓ దుకాణంలో పేలిన టపాసు కారణంగా ఆ దుకాణం మంటల్లో దగ్ధమైంది. ఆ మంటలు మరో మూడు దుకాణాలకు వ్యాపించాయి. దీంతో ఆయా దుకాణాలలోని బాణ సంచ పెద్ద శబ్ధంతో పేలిపోయాయి. ఆ శబ్ధాలకు చుట్టుపక్కన నివసిస్తున్న ప్రజలు భయంతో ఇళ్లల్లోంచి బయటకు పరుగుతు తీశారు. అగ్నిమాపక సిబ్బంది రంగ ప్రవేశం చేసి మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో మరణించిన ఇరువురూ కూడా ఆయా దుకాణాలలో పని చేసే సిబ్బందిగా గుర్తించారు. అగ్నిమాపక సిబ్బంది రావడం మరి కొంచం ఆలస్యమై ఉంటే.. జింఖానా మైదానంలోని బాణసంచ షాపులన్నీ దగ్ధమై ఉండేవి.  అక్కడకు దగ్గరే ఉన్న పెట్రోలు బంకుకు కూడా మంటలు వ్యాపించేవని స్థానికులు చెప్పారు. 

అర్షదీప్ సింగ్ ట్రోలర్స్ కు బంతితో బదులు!

ఆటలో గెలుపు ఓటములు సహజం. అలాగే క్రీడాకారులు కూడా ఒక్కో సారి అంచనాలను అందుకోలేక విఫలమవ్వడమే సహజమే. ఇవన్నీ ఆటలో భాగమే. గెలవాల్సిన మ్యాచ్ ఓడిపోయినప్పుడు సహజంగానే ఆ ఓటమికి కారణాలపై విశ్లేషణలు వస్తాయి. ఫలానా ఆటగాడు చేసిన తప్పిదం మ్యాచ్ ఫలితాన్ని మార్చేసిందన్న విమర్శలూ సహజమే. అయితే ఆ విమర్శలు వ్యక్తిగతంగా ఉండటం సమజసం కాదు. వ్యక్తిత్వ హననం లక్ష్యంగా విమర్శలు చేయడం ఎంత మాత్రం సరిగారు. ఈ ఏడాది ఆసియాకప్ సూపర్ 4 మ్యాచ్ లో పాకిస్థాన్ పై టీమ్ ఇండియా పరాజయం పాలైంది. ఆ పరాజయానికి పాక్ బ్యాటర్ ఇచ్చిన సునాయాసమైన క్యాచ్ ను టీమ్ ఇండియా పేస్ బౌలర్ అర్షదీప్ సింగ్ జారవిడవడమే కారణమని విమర్శలు వచ్చాయి. క్రికెట్ లో మిస్ ఫీల్డింగ్, క్యాచ్ లు జారవిడవడమూ అత్యంత ససహమైన విషయాలు. కానీ అర్షదీప్ సింగ్ క్యాచ్ డ్రాప్ విషయంలో మాత్రం విమర్శలు శృతి మించిపోయాయి. అర్షదీప్ ను లక్ష్యంగా చేసుకుని వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. సామాజిక మాధ్యమంలో తీవ్రంగా ట్రోలింగ్ చేశారు. ఖలిస్తానీ అంటూ విమర్శలు గుప్పించారు. వాటన్నిటినీ పంటి బిగువున భరించిన అర్షదీప్ సింగ్  టి20 వరల్డ్ కప్ లో భాగంగా పాకిస్థాన్ తో ఆదివారం (అక్టోబర్ 23)జరిగిన మ్యాచ్ లో విశ్వరూపం ప్రదర్శించాడు. నాలుగు వికెట్లు పడగొట్టి విమర్శకుల చేతనే ప్రశంసలు అందుకున్నాడు. బంతితో బుద్ధిచెప్పాడు. గాయంతో భారత్ ఏస్ పేసర్ ఈ టోర్నీకి దూరమైన సంగతి తెలిసిందే. అయితే అర్షదీప్ సింగ్ తన అద్భుత బౌలింగ్ తో బూమ్రా లేని లోటు తెలియనీయలేదు. పాక్ స్టార్ బ్యాటర్లు  బాబర్‌ ఆజమ్‌, మహ్మద్‌ తక్కువ స్కోరుకే పెవిలియన్ కు పంపి పాక్ కు తేరుకోలేని దెబ్బ కొట్టాడు.   అనంతరం కీలకమైన అసీఫ్ అలీని ఔట్ చేశాడు. ఈ మ్యాచ్ లో నాలుగు ఓవర్లు బౌల్ చేసిన అర్షదీప్ 32 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. 

ఈ యుగానికి కోహ్లీయే క్రికెట్ కింగ్!

 విరాట్ కోహ్లీ పని అయిపోయింది. ఇక విరాట్ రిటైర్మెంట్ తీసుకోవాలి. విరాట్ సెంచరీ చేయక మూడేళ్లు అవుతుందని ఆసియా కప్ కు ముందు విరాట్ కోహ్లీ విమర్శలు వచ్చాయి. సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా నడిచాయి. కానీ కోహ్లీ వారికి తన బ్యాట్ తో సమాధానం చెప్పాడు. ఆసియా కప్ లో ఫామ్ లోకి వచ్చాడు. ఆప్ఘానిస్థాన్ పై అద్బుత  సెంచరీ చేసి విమర్శకుల నోళ్లు మూయించాడు. ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ సూపర్ 12 తొలి మ్యాచ్ లో పాకిస్థాన్ పై మ్యాచ్ లో భారత్ ను ఓటమి అంచుల నుంచి గట్టెక్కించి ఒంటి చేత్తో గెలిపించాడు. ఛేజింగ్ లో తనను మించిన మొనగాడు లేడని మరో సారి రుజువు చేశారు. ఆసియా కప్ లో సెంచరీ చేసిన తరువాత కూడా కోహ్లీపై ట్రోలింగ్ కొనసాగింది. పసి కూనపై సెంచరీ చేయడమైతే చేశాడు కానీ.. ఆ తరువాత మళ్లీ కోహ్లీ బ్యాట్ కు పని చెప్పలేదనీ, కోహ్లీ పనైపోయినట్లేనని ట్రోల్ చేశారు.అయితే ఆదివారం (అక్టోబర్ 23)  పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో విరాటుడి బ్యాటింగ్ విన్యాసాలు విమర్శకుల నోళ్లు మూయించాయి. ఇప్పటి వరకూ కోహ్లీ ఫామ్ కోల్పోయాడనీ, ఇక అతడిలో క్రికెట్ అయిపోయిందనీ ఇంత కాలం విమర్శిస్తూ వచ్చని వాళ్లే ఇప్పుడు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.  కింగ్ కోహ్లీ అంటూ ఆకాశానికి ఎత్తుతున్నారు. ఆహా కోహ్లీ..ఓహో కోహ్లీ అంటూ ప్రశంసిస్తున్నారు. కేవలం స్కోరు చేయడమే కాదు.. కోహ్లీలో క్రికెట్ సెన్స్.. ఫిట్ నెస్, వికెట్ల మధ్య సింగిల్స్, డబుల్స్ పరుగులు తీయడం ఇవన్నీ కూడా జట్టులో ఉత్సాహాన్ని నింపుతాయని చెబుతున్నారు.  ఇక పాక్ పై మ్యాచ్ లో కోహ్లీ బ్యాటింగ్ మెరుపులతో క్రికెట్ అభిమానులకు ఒక రోజు ముందే దీపావళి పండుగను తీసుకు వచ్చేశాడంటూ ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా మాజీ క్రికెటర్లు కింగ్ కోహ్లీ ఈజ్ బ్యక్ అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. 31 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న టీమ్‌ఇండియాను కోహ్లీ తన అసమాన బ్యటింగ్ పటిమతో విజయ తీరాలకు చేర్చాడు. కోహ్లీ కెరీర్ లో ఇదే ఉత్తమ కాదు కాదు అత్యుత్తమ ఇన్నింగ్స్ అంటున్నారు.   క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ అయితే కోహ్లీ బ్యాటింగ్ సూపర్బ్, కోహ్లీ కెరీర్ లో ఇదే అత్యుత్తమ ఇన్నింగ్స్ అంటూ పొగడ్తల వర్షం కురిపించాడు. కోహ్లీ ఇన్నింగ్స్ నిర్మించిన విధానం అద్భుతమనీ, 19వ ఓవర్ల లో రవూఫ్ బౌలింగ్ లో బ్యాక్ ఫుట్ కి వెళ్లి లాంగాన్ మీదుగాద కొట్టిన సిక్సర్ బ్రహ్మాండం అని పేర్కొన్నాడు. ఇక ఐసీసీ (అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్) అయితే ‘కింగ్ ఈజ్ బ్యాక్.. టేకే బో కోహ్లీ’ అంటూ ట్వీట్ చేసింది. ఇక మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ అయితే తన జీవితంలో ఇప్పటి వరకూ చూసిన అత్యద్భుత టి20 ఇన్నింగ్ నేటి కోహ్లీ బ్యాటింగే అని ట్వీట్ చేశారు. మన హైదరాబాదీ, వెరీవెరీ స్పెషల్ లక్ష్మణ్ కూడా కోహ్లీని పొగడ్తల్లో ముంచెత్తాడు. టి20 ప్రపంచ కప్ కు కోహ్లీ ఇన్నింగ్స్ సరైన సంరంభం అన్నారు.  క్లిష్ట పరిస్థితుల నుంచి ఒంటి చేత్తో మ్యాచ్ ను భారత్ ఖాతాలో వేసిన కోహ్లీ క్లాస్ ఎప్పుడూ శాశ్వతం అని మరోసారి నిర్ద్వంద్వంగా నిరూపించాడని పేర్కొన్నాడు. మరో మాజీ క్రికెటర్ వసీమ్ జాఫర్ అయితే పాక్ తో మ్యాచ్ లో కోహ్లీ ఇన్నింగ్స్ ను యుగానికొక్క ఇన్నింగ్స్ అని అభివర్ణించాడు. మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్, ఆర్పీ సింగ్ తదితరులు కోహ్లీని అభినందిస్తూ ప్రశంసలు కురిపించారు.  ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తెలంగాణ మంత్రి కేటీఆర్ తదితర ప్రముఖులు కూడా పాక్ పై విజయం సాధించిన టీమ్ ఇండియా జట్టును అభినందిస్తూ కోహ్లీపై ప్రత్యేక ప్రశంసలు కురిపించారు. 

బీజేపీకి రాపోలు గుడ్ బై.. తెరాసలో చేరిక

తెలంగాణలో అధికారం మాదే అని తొడగొట్టి చెబుతున్న బీజేపీకి.. ఆ పార్టీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న మునుగోడు ఉప ఎన్నిక ముందు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. మునుగోడు విజయంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో విజయంపై క్యాడర్ లో మరింత ధీమా పెంచాలన్న ఉద్దేశంతో బీజేపీ కోరి ఆహ్వానించిన ఈ ఉప ఎన్నిక ముంగిట ఆ పార్టీ నుంచి వలసలు చినుకుల్లా ప్రారంభమై తుపానుగా మారాయి. రెండు రోజుల కిందట మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, దాసోజు శ్రవణ్ లు బీజేపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సమక్షంలో కారెక్కిన సంగతి విదితమే. ఆ వెంటనే  రాజ్యసభ మాజీ సభ్యుడు రాపోలు ఆనంద భాస్కర్ బీజేపీకి గుడ్ బై చెప్పి తెరాస గూటికి చేరారు. దీంతో బీజేపీకి మునుగోడు ఉప ఎన్నిక ముంగిట వలసలు పెద్ద తలనొప్పిగా మారాయి. ఈ వలసలు రానున్న రోజులలో మరింత పెరిగే అవకాశం ఉందని తెరాస శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. తాజాగా బీజేపీకి గుడ్ బై చెప్పి గులాబి కండువా కప్పుకున్న రాపోలు ఆనంద భాస్కర్, చేరికకు ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ అయ్యారు. ఆ తరువాత కేటీఆర్ సమక్షంలో తెరాస గూటికి చేరి.. బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. చేనేతపై జీఎస్టీ వేయడం దారుణమని రాపోలు ఆనంద భాస్కర్ విమర్శించారు. చేనేత అభివృద్ధికి మంత్రి కేటీఆర్ చేపట్టిన చర్యలను ప్రస్తుతించారు. 

బూతుల పంచాగంలో నాని, రోజా పోటీపోటీ!

 రోజా... తెలుగు ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు. ఇంకా పక్కాగా చెప్పాలంటే మాత్రం..  శివకాశీ ఫైర్ బ్రాండ్. వెండి తెర మీద హీరోయిన్‌గా ఎంత వెలుగు వెలిగిందో.. బుల్లి తెరపైన బుల్లి బుల్లి కామెడీ షోల్లో జడ్జిగా, అలాగే బతుకు జట్కా బండి తదితర కార్యక్రమాల్లో పెద్దరాయుడిగారి చిన్న చెల్లిలా  కూడా బాగానే పాపులర్ అయ్యారు.   అయితే 2019 ఎన్నికల్లో వైయస్ జగన్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఆమె స్పీడ్ పెరిగిందనీ.. కానీ జగన్ మలి కేబినెట్‌లో పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత..   రోజా.. ఫైర్ బ్రాండ్‌లకే బ్రాంగ్ అంబాసిడర్ గా  తయారైందనే ఓ టాక్ అయితే  వైసీపీలో లీడర్ నుంచి కేడర్ వరకు ఫ్యాన్ తిరిగినట్లు గిర గిరా తిరుగుతోందని అంటున్నారు.  ఆ క్రమంలో   రోజా వ్యవహార శైలి పట్ల వైసీపీ నేతలే కాదు,  కేడర్ సైతం ఒకింత అసహనం వ్యక్తం చేస్తోందని తెలుస్తోంది. తాజాగా విశాఖ గర్జన నేపథ్యంలో విశాఖ ఎయిర్ పోర్టు వద్ద మంత్రి ఆర్కే రోజా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆమె తీరును చూసి ఎయిర్ పోర్ట్ సిబ్బంది సైతం తీవ్ర విస్మయానికి గురైనట్లు తెలుస్తోంది. ఇక రోజా తీరు పట్ల సోషల్ మీడియాలో  నెటిజన్లు ఓ రేంజ్ లో విమర్శలు గుప్పిస్తున్నారు.  జగన్ తొలి కేబినెట్‌లో పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ప్రెస్‌మీట్ పెట్టి.. ప్రతిపక్ష టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేశ్  , జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లపై బూతులు వర్షం కురిపించినట్లుగా.. జగన్ మలి కేబినెట్‌లో  రోజా వ్యవహరిస్తున్నారన్న ఓ చర్చ సైతం రాజకీయ వర్గాలలో, జన బాహుళ్యంలో వాడి వేడిగా నడుస్తోంది. చంద్రబాబు, పవన్, లోకేశ్‌లను తిట్టిపోయడంలో జగన్ పార్టీలో కొడాలి నాని, ఆర్కే రోజా ఇద్దరు   పోటీ పడుతున్నారని ఇప్పటికే.. ప్రజలకు ఓ క్లియర్ కట్‌గా అర్థమైపోయిందని తెలుస్తోంది. అదీకాక.. ఇటీవల మాజీ మంత్రి కొడాలి నాని ప్రెస్ మీట్ పెట్టి.. చంద్రబాబుతోపాటు ఆయన ఫ్యామిలీపై  అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత  రోజా.. మీడియా సాక్షిగా మాట్లాడుతూ.. కొడాలి నానిని ఆయన వ్యాఖ్యలను సమర్థించడం పట్ల.. ప్రపంచంలోని తెలుగు వారంతా తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తున్నారు.  ఓ వైపు ఆర్కే రోజా వ్యవహర శైలిపై తెలుగు ప్రజలు ఆక్షేపిస్తుంటే.. మరోవైపు ఆమె సొంత నియోజకవర్గం నగరిలో ఆర్కే రోజాను ఆసమ్మతి నేతలు గురి చూసి కొడుతున్నారు. దీంతో ఆమె ఉక్కిరి బిక్కిరి అవుతున్న విషయం తెలిసింది.  అందులోభాగంగానే నగరి నియోజకవర్గంలోని నిండ్రం మండలం కొప్పేడులో రైతు భరోసా కేంద్రంతోపాటు వెల్‌నెస్ నెంటర్‌కు భూమి పూజ నిర్వహించారీ అసమ్మతి నేతలు. ఈ విషయం తెలిసి.. ఆర్కే రోజా.. ఆగ్రహంతో రగిలిపోయి.. కన్నీరు మున్నీరు అవుతూ.. ఓ ఆడియోను లీక్‌ చేసి.. ప్రజల్లోకి వెళ్లేలా చేశారనే చర్చ సైతం నగరి నియోజకవర్గంలో గట్టిగా ఊపందుకొంది.  ఇదంతా ఆర్కే రోజా స్వయంకృతపరాధమని ఆమె సన్నిహితులు పేర్కొంటున్నారు. ప్రస్తుత నగరి నియోజకవర్గంలోని అయిదు మండాలలకు చెందిన అసమ్మతి నేతలంతా.. గతంలో ఆమె గెలుపు కోసం ప్రాణాలు పణాం పెట్టి కృషి చేశారని.. ఆమె వరుసగా రెండో సారి ఎమ్మెల్యే అయిన తర్వాత వారిని దూరంగా పెట్టిందని సమాచారం. ఈ నేపథ్యంలో తీవ్రంగా హర్ట్ అయిన వారు.. ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన మరో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి వద్దకు వెళ్లి.. ఆర్కే రోజా వ్యవహరిశైలిని... కళ్లకు కట్టినట్లు వివరించడంతో.. ఈ పంచాయతీని ఆయనే స్వయంగా తాడేపల్లి ప్యాలెస్‌లోని పెద్దల వద్దకు తీసుకు వెళ్లి.. వారికి కీలక పదవులు కట్టబెట్టినట్లు తెలుస్తోంది.  ఈ మొత్తం ఎపిసోడ్‌లో ఎమ్మెల్యే ఆర్కే రోజా వ్యవహార శైలికి నిరసనగా ఆమెను నియోజకవర్గ ప్రజల దూరంగా పెడితే... ఓ రాష్ట్ర మంత్రిగా ఉంటూ.. బూతులు మాట్లాడడం, వెకిలి చేష్టలు చేయడం... బూతులు మాట్లాడే వారిని సమర్థించడం చేయడంలాంటివి చేస్తే.. ఆర్కే రోజా రాజకీయ భవిష్యత్తుకు ప్రజలు పుల్ స్టాప్ పెడతారనే ఓ చర్చ సైతం ఫ్యాన్ పార్టీలో జోరుగా హుషారుగా నడుస్తోంది. ఏదీ ఏమైనా.. వచ్చే ఎన్నికల్లో ఆర్కే రోజా ముచ్చటగా మూడో సారి నగరిలో గెలుపు నల్లేరు మీద నడక కాదని సుస్పష్టం అవుతోందని రాజకీయ విశ్లేషకులు సైతం పేర్కొంటున్నారు.

షర్మిల ఢిల్లీ టూర్..కారణం ఇదే!

వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల మళ్లీ ఢిలీకి వెళ్లారు. అక్టోబర్ 21వ తేదీన ఆమె ఢిల్లీలో కంఫ్ట్రోలర్ ఆండ్ అడిట్ జనరల్ (కాగ్)ను కలిసి.. తెలంగాణలో అతి పెద్ద ప్రాజెక్టు కాళేశ్వరం అవినీతిపై ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ... కాళేశ్వరం ప్రాజెక్టులో చాలా  అవినీతి జరిగిందని ఆరోపించారు. అందులో సీఎం కేసీఆర్, ఈ ప్రాజెక్ట్ నిర్మించిన కాంట్రాక్టర్ మెఘా సంస్థ అధినేత కృష్ణారెడ్డిలు భారీగా అవినీతి పాల్పడ్డారని విమర్శించారు. ఈ ప్రాజెక్టుకు కేంద్రంలోని వివిధ సంస్థల నుంచి నిధులు వెల్లువెత్తాయని చెప్పారు. దీంతో ప్రాజెక్ట్‌లో చోటు చేసుకున్న స్కాం.. రాష్ట్ర స్థాయిలోనిది కాదని.. జాతీయ స్థాయిలోనిదని ఆమె తేల్చి చెప్పారు.  అయితే ఇదే నెల మొదటి వారంలో వైయస్ షర్మిల ఢిల్లీ వెళ్లి సీబీఐ కేంద్ర కార్యాలయంలోని కీలక అధికారులకు ఇదే అంశంపై ఫిర్యాదు చేసి... అనంతరం ఢిల్లీ వేదికగా వైయస్ షర్మిల ప్రెస్ మీట్ పెట్టి మరీ ఆ తర్వాత తెలంగాణలో అడుగు పెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే మళ్లీ వైయస్ షర్మిల ఢిల్లీకి వెళ్లడం.. అదీ జస్ట్ పదిరోజుల్లోనే కావడం.... అదీ కూడా ఆమె చేస్తున్న పాదయాత్రకు జస్ట్ స్మాల్ బ్రేక్ ఇచ్చి ఇలా ఢిల్లీ వెళ్లడంపై తెలంగాణ సమాజం ఒక రకమైన సందేహన్ని వ్యక్తం చేస్తోంది.  మరోవైపు వైయస్ షర్మిల... వైయస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించి ఏడాది పూర్తి చేసుకొంది. ఆ క్రమంలో తెలంగాణ సమస్యలు తెలుసుకోనేందుకు ఆమె పాదయాత్ర సైతం చేపట్టింది. అలాగే ప్రతి మంగళవారం నిష్టగా దీక్షలు కూడా చేపడుతోంది. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఢిల్లీకి వైయస్ షర్మిల.. ఒకటికి రెండు సార్లు.. ఇలా వెళ్లడం వెనుక పెద్ద మతలబే ఉందనే ఓ చర్చ అయితే.. తెలంగాణ సమాజంలో వాడి వాడిగా.. వేడి వేడిగా సాగుతోంది.    తెలంగాణ సీఎం కేసీఆర్ ముచ్చటగా మూడో సారి అధికార పీఠం ఎక్కాలని భావిస్తున్నారు. అలాగే టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్‌గా మార్చి.. బీజేపీ వ్యతిరేక పక్షాలను ఏకం చేసేందుకు ఆయన ప్రయత్నాలను కూడా ప్రారంభించారు. ఆ క్రమంలో ఆయన కోట్లాది రూపాయిలు వెచ్చించి..  సొంత విమానాన్ని సైతం కొనుగోలు చేశారు. అయితే కేసీఆర్‌కు.. ఆర్థికంగా అండ దండగా.. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన కాంట్రాక్టర్ మెగా కృష్ణారెడ్డి ఉన్నారని.. అందుకే వీరిపై ఫిర్యాదు చేసేందుకు వైయస్ షర్మిల.. ఢిల్లీకి పరుగు తీస్తున్నారని తెలంగాణ సమాజంలో ఓ చర్చ అయితే యమా జోరు జోరుగా నడుస్తోంది.   మరోవైపు నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన జలయజ్జం తాలుకా ప్రాజెక్టులనీ ఈ మెగా కృష్ణారెడ్డే దక్కించుకున్నారని.... అయితే వైయస్ఆర్‌ ఆకస్మిక మరణంతో ఆయనకు చెందిన కోట్లాది రూపాయిలు ఈ మెగా సంస్థ అధినేత చేతిలో చిక్కుకు పోయాయని..  ఆ తర్వాత సదరు నగదు రాబట్టుకోవాలని ఆ మహానత తనయుడు ప్రస్తుత ఏపీ సీఎం వైయస్ జగన్, ఆయన తనయురాలు వైయస్ షర్మిల ఎంతగా ప్రయత్నించినా.. వారి వల్ల కాలేదనే ఓ టాక్ అయితే తెలంగాణ సమాజంలో కొన.... సాగుతోంది.   ఆ క్రమంలోనే ఆస్తినగదు పంపకాల అంశంలో విజయమ్మ బిడ్డల నడుమ... పులివెందుల సాక్షిగా గట్టిగానే సిగపట్లు పట్టుకోన్నారని ఓ చర్చ సైతం నాడు మీడియాలో బాగానే నడిచిందని సమాచారం. ఆ క్రమంలోనే మెగా సంస్థ నుంచి నగదు రాబట్టు కోవడం కోసం.. రివర్స్ టెండరింగ్ అంటూ.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని మెగా కృష్ణారెడ్డి చేతికి సీఎం జగన్ ఇచ్చారని చర్చ తెలంగాణ సమాజంలోనే కాదు... ఫ్యాన్ పార్టీలోని కీలక నేతల్లో సైతం నేటికి హాట్ టాపిక్‌గానే ఉందని తెలుస్తోంది. వైయస్ జగన్.. ఆ విధంగా మెగా అధినేత నుంచి నగదు రాబట్టుకుంటే.. తన పరిస్థితి ఏమిటనే ఆందోళనతో వైయస్ షర్మిల ఢిల్లీకి దౌడు తీస్తుందనే టాక్ సైతం తెలంగాణలో సాగుతోంది.  ఇంకోవైపు కేసీఆర్ ప్రభుత్వంలో చోటు చేసుకున్న అవినీతిపై ఇప్పటికే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి,బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్.. వివిధ వేదికలపై నుంచే కాకుండా వారు చేపట్టిన పాదయాత్రల్లో సైతం భారీగా ఆరోపణలు సంధిస్తున్నారు. కానీ వీరిద్దరు ఏనాడు ఢిల్లీకి వెళ్లి.. కేసీఆర్ అవినితీపై సీబీఐకి కానీ,డీకి కానీ,జలశక్తి శాఖ కానీ, కాగ్‌కు కానీ ఫిర్యాదు చేసింది లేదని తెలంగాణ సమాజం ఈ సందర్బంగా గుర్తు చేసుకొంటోంది. కానీ వైయస్ షర్మిల మాత్రం.. కేసీఆర్.. బీఆర్ఎస్ పార్టీ ప్రకటన చేసిన జస్ట్ 24గంటలకే ఢిల్లీకి వెళ్లి.. కేసీఆర్,మెగా కృష్ణారెడ్డి అవినీతిపై సీబీఐకి ఫిర్యాదు చేసి వచ్చిందని.. మళ్లీ ఢిల్లీకి వెళ్లి.. కాగ్‌కు ఫిర్యాదు చేసిందని తెలంగాణ సమాజం స్పష్టంగా పేర్కొంటోంది. మెగా కృష్ణారెడ్డి వద్ద ఉన్న సొమ్ము తమదైతే.. సోకు మాత్రం గులాబీ బాస్ కేసీఆర్ చేసుకుంటున్నారనే భావనతో వైయస్ షర్మిల..  ఢిల్లీకి టూర్ కట్టేస్తోందనే ఓ రసవత్తరమైన చర్చ అయితే తెలంగాణ సమాజంలో రంజు రంజుగా సాగుతోంది. మరోవైపు.. వైయస్ షర్మిల ఢీల్లీలోని ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ.. సీబీఐని రాష్ట్రాల న్యాయ పరిధిలోని రాకుండా చేస్తున్నాయి. అదే కాగ్ అయితే.. కేంద్రంలో అయినా.. రాష్ట్రాల్లో అయినా ఆడిట్ చేయవచ్చునని స్పష్టంగా చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ కాళేశ్వరం అవినీతిపై సీబీఐ విచారణ చేయకున్నా.. కాగ్ అయినా చేస్తుందనే ఓ చిన్న ఆశ.. వైయస్ షర్మిలలో ఉందనే ఓ చర్చ సైతం లోటస్ పాండ్‌లోని వినిపిస్తోంది. మరి కాళేశ్వరంలో మింగిన కోట్లాది రూపాయిలను సీఎం కేసీఆర్, మెఘా కృష్ణారెడ్డిలను నుంచి వైయస్ షర్మిల కక్కిస్తుందా లేదా అనేది కాలమే నిర్ణయించాలని తెలంగాణ సమాజం పేర్కొంటోంది.

మునుగోడు ఉప ఎన్నిక… చల్లబడ్డ కేసీఆర్.. జోరు పెంచిన బీజేపీ

మునుగోడు అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికను అన్ని పార్టీలూ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. సిటింగ్ స్థానాన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ ప్రకటించిన తర్వాత తొలిసారిగా ఎదుర్కొంటున్న ఎన్నికలో జెండా గులాబీ జెండా రెపరెపలాడించి, కాలర్ ఎగరేయాలనే వ్యూహంతో టీఆర్ఎస్, దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో వచ్చిన ప్రోత్సాహంతో ముచ్చటగా మూడో ఎన్నికను కూడా తన ఖాతాలో వేసుకుని కేసీఆర్ కు చెక్ పెట్టాలని భారతీయ జనతాపార్టీ తన సైన్యాన్ని ముందుకు నడిపిస్తోంది. మునునుగోడులో మొనగాడిగా నిలబడాలనే వ్యూహంలో భాగంగా కేసీఆర్ తన పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, జిల్లా, మండల స్థాయి నేతలను ప్రచారానికి పంపారు. ఒక్కొక్కరికి ఒక్కో ప్రాంతం బాధ్యతలు అప్పగించారు. చివరికి గ్రామస్థాయిలో కూడా బాధ్యులను నియమించారు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నట్లు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ తాను కూడా ఓ గ్రామం బాధ్యతలు తీసుకోవడం విశేషం. ఢిల్లీ టూర్ కు వెళ్లక ముందు మునుగోడు ఉప ఎన్నిక విషయంలో గులాబీ బాస్ చేసిన హడావుడి చూసిన జనం ఇంకేముంది.. అక్కడ కారు పార్టీ జోరుమీదే ఉంది. గెలుపు తథ్యం అని భావించారు. అయితే.. ఇప్పటిదాకా ఒక లెక్క ఇక నుంచి మరో లెక్క అన్నట్లు.. కేసీఆర్ ఇటీవల ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత ఎందుకో కేసీఆర్ లో ముందటి స్పీడు ఉన్నట్లు కనిపించడం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఢిల్లీలో కమలం పార్టీ పెద్దల నుంచి ఆయనకు ఎలాంటి ఇరకాటమో, ఇబ్బందో ఎదురై ఉంటుందని అందుకే ఆయన చల్లబడినట్లు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే మునుగోడు ఉప ఎన్నిక కన్నా ఆపరేషన్ గులాబీ ఆకర్ష్ మీదే బాగా దృష్టి పెట్టినట్లు కనిపిస్తోందంటున్నారు. అది కూడా మునుగోడు ఉప ఎన్నికకు ఏమాత్రం సంబంధం లేని దాసోజు శ్రవణ్, స్వామి గౌడ్ లకు స్వయంగా ఫోన్ చేసి మరీ ఆపరేషన్ చేశారంటూ వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. కేసీఆర్ పిలిచిందే ఆలస్యం అన్నట్లు వారిద్దరూ శుక్రవారం రాత్రికి ప్రగతి భవన్ మెట్లెక్కారు. టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువాలు కప్పుకుని వీడియోలు, ఫొటోలకు ఫోజులిచ్చారు. వారిద్దరూ గతంలో టీఆర్ఎస్ గుడ్ బై చెప్పేసి ఇతర పార్టీల్లో చేరిన వారే. ఇప్పుడు బీజేపీ లో ఉన్న వారిని టీఆర్ఎస్ లోకి లాక్కోవడం గమనార్హం. మునుగోడు ఉప ఎన్నికను అంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేసీఆర్ ఢిల్లీ వెళ్లి, పది రోజులు ఉండడం ఒక ఎత్తయితే.. అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాతైనా వెంటనే మునుగోడులో టీఆర్ఎస్ ప్రచారంపై సమీక్షించాలి. పార్టీ నేతలు, శ్రేణులందర్నీ పరుగులు పెట్టించాలి. కానీ అలాంటిదేమీ లేకుండా ఆ ఎన్నికకు సంబంధం లేని, బీజేపీకి ఏమాత్రం నష్టం కలిగే అవకాశం లేని నేతలకు ఆపరేషన్ ఆకర్ష్ చేయడమేంటనే ప్రశ్నలు వస్తున్నాయి. ఢిల్లీ టూర్ కు ముందు కేసీఆర్ లో కనిపించిన గెలుపు ధీమా ఇప్పుడు ఆయనలో కనిపించడం లేదంటున్నారు. ఇవన్నీ చూస్తుంటే.. మునుగోడు ఉప ఎన్నిక విషయంలో ఆయన చేతులెత్తాశారా? అనే అనుమానాలు టీఆర్ఎస్ వర్గాల్లో సైతం వస్తున్నాయంటున్నారు. అంటే మునుగోడులో ఎన్నికల ఫలితంపై కేసీఆర్ కు ముందే స్పష్టత వచ్చినట్లుందని, అందుకే ఇప్పుడు ఈ అంశాన్ని ఆయన లైట్ తీసుకుంటున్నారా? అనే సందేహాలు వస్తున్నాయి. లేదా ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత కేసీఆర్ లో ముందు ఉన్నంత పట్టుదల, పంతం ఇప్పుడు తగ్గడానికి మరేదైనా సొంత వ్యవహారంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందనే భయం ఆయనకు పట్టుకుందా? అంటున్నారు. ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న తన కుమార్తె కవిత విషయంలో ఇరకాటం కేంద్రం నుంచి ఎదురయ్యే ప్రమాదం ఉందని ఆయన వెనక్కి తగ్గారా? అనే సందేహాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి. కాగా.. బీజేపీ విషయానికి వస్తే.. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంపై పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించాలని ఆ పార్టీ కేంద్ర నాయకత్వం నుంచి రాష్ట్రస్థాయి నేతలకు చాలా స్పష్టమైన ఆదేశాలు వచ్చాయంటున్నారు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచార సమయం ముగిసే దాకా అక్కడే ఉండాలని, రాత్రిళ్లు కూడా నియోజకవర్గంలోనే ఉండాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. బీజేపీకి రాజీనామా చేసి స్వామి గౌడ్, దాసోజు శ్రవణ్ టీఆర్ఎస్ లో చేరడంతో ఢిల్లీ పెద్దలు వ్యూహం మార్చినట్లు కనిపిస్తోందంటున్నారు. మునుగోడు ఉప ఎన్నికను బీజేపీ పెద్దలు సీరియస్ గానే తీసుకున్నారంటున్నారు. నవంబర్ మూడో తేదీన మునుగోడులో పోలింగ్ జరుగుతుంది. నవంబర్ ఒకటో తేదీ సాయంత్రంతో ప్రచారం ముగుస్తుంది. ప్రచారం గడువు ముగిసేదాకా ఎన్నికల ప్రచారంపై మాత్రమే దృష్టిపెట్టాలని రాష్ట్ర స్థాయి నేతలకు కేంద్ర నాయకత్వం ఆదేశించింది. నవంబర్ ఒకటో తేదీ వరకు ఏ ఒక్కరూ హైదరాబాద్ రావద్దని, రాత్రిళ్లు మునుగోడులోనే బసచేయాలంటూ కచ్చితమైన అల్టిమేటం ఇచ్చిందంటున్నారు. బీజేపీలోని కీలక నేతలతో పాటు స్థానిక నాయకులు కూడా ప్రచారానికి పూర్తి సమయం కేటాయించాలని చెప్పింది. హైదరాబాద్ లో ఉన్న పార్టీ నేతలంతా వెంటనే మునుగోడు వెళ్లాలని బీజేపీ అగ్రనాయకత్వం ఆదేశించింది. దీంతో పాటు పోల్ మేనేజ్ మెంట్ పైన కూడా బీజేపీ నేతలు కొత్త ప్రణాళికలు రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీలు కోవర్టులు ఎవరు.. పార్టీకే కట్టుబడి కృషిచేసేవారెవరనే దానిపై బీజేపీలో కాస్త అయోమయం నెలకొందని, అందుకే వ్యూహం మార్చి ముందుకెళ్లాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. తెలంగాణలో మరీ ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో బీజేపీ బలం పుంజుకోవాలనే వ్యూహంలో భాగంగా కోమటిరెట్టి రాజగోపాల్ రెడ్డి చేత ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి బీజేపీ అధిష్టానం రాజీనామా చేయించినట్లు చెబుతారు. అందుకే ఇప్పుడు మునుగోడులో రాజగోపాల్ రెడ్డి గెలుపు బాధ్యతను కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. అందుకే మునుగోడు ఉప ఎన్నికకు మరింత ప్రాధాన్యత వచ్చిందంటున్నారు.