అర్షదీప్ సింగ్ ట్రోలర్స్ కు బంతితో బదులు!
posted on Oct 23, 2022 @ 12:43AM
ఆటలో గెలుపు ఓటములు సహజం. అలాగే క్రీడాకారులు కూడా ఒక్కో సారి అంచనాలను అందుకోలేక విఫలమవ్వడమే సహజమే. ఇవన్నీ ఆటలో భాగమే. గెలవాల్సిన మ్యాచ్ ఓడిపోయినప్పుడు సహజంగానే ఆ ఓటమికి కారణాలపై విశ్లేషణలు వస్తాయి. ఫలానా ఆటగాడు చేసిన తప్పిదం మ్యాచ్ ఫలితాన్ని మార్చేసిందన్న విమర్శలూ సహజమే.
అయితే ఆ విమర్శలు వ్యక్తిగతంగా ఉండటం సమజసం కాదు. వ్యక్తిత్వ హననం లక్ష్యంగా విమర్శలు చేయడం ఎంత మాత్రం సరిగారు. ఈ ఏడాది ఆసియాకప్ సూపర్ 4 మ్యాచ్ లో పాకిస్థాన్ పై టీమ్ ఇండియా పరాజయం పాలైంది. ఆ పరాజయానికి పాక్ బ్యాటర్ ఇచ్చిన సునాయాసమైన క్యాచ్ ను టీమ్ ఇండియా పేస్ బౌలర్ అర్షదీప్ సింగ్ జారవిడవడమే కారణమని విమర్శలు వచ్చాయి. క్రికెట్ లో మిస్ ఫీల్డింగ్, క్యాచ్ లు జారవిడవడమూ అత్యంత ససహమైన విషయాలు.
కానీ అర్షదీప్ సింగ్ క్యాచ్ డ్రాప్ విషయంలో మాత్రం విమర్శలు శృతి మించిపోయాయి. అర్షదీప్ ను లక్ష్యంగా చేసుకుని వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. సామాజిక మాధ్యమంలో తీవ్రంగా ట్రోలింగ్ చేశారు. ఖలిస్తానీ అంటూ విమర్శలు గుప్పించారు. వాటన్నిటినీ పంటి బిగువున భరించిన అర్షదీప్ సింగ్ టి20 వరల్డ్ కప్ లో భాగంగా పాకిస్థాన్ తో ఆదివారం (అక్టోబర్ 23)జరిగిన మ్యాచ్ లో విశ్వరూపం ప్రదర్శించాడు. నాలుగు వికెట్లు పడగొట్టి విమర్శకుల చేతనే ప్రశంసలు అందుకున్నాడు.
బంతితో బుద్ధిచెప్పాడు. గాయంతో భారత్ ఏస్ పేసర్ ఈ టోర్నీకి దూరమైన సంగతి తెలిసిందే. అయితే అర్షదీప్ సింగ్ తన అద్భుత బౌలింగ్ తో బూమ్రా లేని లోటు తెలియనీయలేదు. పాక్ స్టార్ బ్యాటర్లు బాబర్ ఆజమ్, మహ్మద్ తక్కువ స్కోరుకే పెవిలియన్ కు పంపి పాక్ కు తేరుకోలేని దెబ్బ కొట్టాడు. అనంతరం కీలకమైన అసీఫ్ అలీని ఔట్ చేశాడు. ఈ మ్యాచ్ లో నాలుగు ఓవర్లు బౌల్ చేసిన అర్షదీప్ 32 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు.