షర్మిల ఢిల్లీ టూర్..కారణం ఇదే!
posted on Oct 23, 2022 @ 10:53PM
వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల మళ్లీ ఢిలీకి వెళ్లారు. అక్టోబర్ 21వ తేదీన ఆమె ఢిల్లీలో కంఫ్ట్రోలర్ ఆండ్ అడిట్ జనరల్ (కాగ్)ను కలిసి.. తెలంగాణలో అతి పెద్ద ప్రాజెక్టు కాళేశ్వరం అవినీతిపై ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ... కాళేశ్వరం ప్రాజెక్టులో చాలా అవినీతి జరిగిందని ఆరోపించారు. అందులో సీఎం కేసీఆర్, ఈ ప్రాజెక్ట్ నిర్మించిన కాంట్రాక్టర్ మెఘా సంస్థ అధినేత కృష్ణారెడ్డిలు భారీగా అవినీతి పాల్పడ్డారని విమర్శించారు. ఈ ప్రాజెక్టుకు కేంద్రంలోని వివిధ సంస్థల నుంచి నిధులు వెల్లువెత్తాయని చెప్పారు. దీంతో ప్రాజెక్ట్‌లో చోటు చేసుకున్న స్కాం.. రాష్ట్ర స్థాయిలోనిది కాదని.. జాతీయ స్థాయిలోనిదని ఆమె తేల్చి చెప్పారు.
అయితే ఇదే నెల మొదటి వారంలో వైయస్ షర్మిల ఢిల్లీ వెళ్లి సీబీఐ కేంద్ర కార్యాలయంలోని కీలక అధికారులకు ఇదే అంశంపై ఫిర్యాదు చేసి... అనంతరం ఢిల్లీ వేదికగా వైయస్ షర్మిల ప్రెస్ మీట్ పెట్టి మరీ ఆ తర్వాత తెలంగాణలో అడుగు పెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే మళ్లీ వైయస్ షర్మిల ఢిల్లీకి వెళ్లడం.. అదీ జస్ట్ పదిరోజుల్లోనే కావడం.... అదీ కూడా ఆమె చేస్తున్న పాదయాత్రకు జస్ట్ స్మాల్ బ్రేక్ ఇచ్చి ఇలా ఢిల్లీ వెళ్లడంపై తెలంగాణ సమాజం ఒక రకమైన సందేహన్ని వ్యక్తం చేస్తోంది.
మరోవైపు వైయస్ షర్మిల... వైయస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించి ఏడాది పూర్తి చేసుకొంది. ఆ క్రమంలో తెలంగాణ సమస్యలు తెలుసుకోనేందుకు ఆమె పాదయాత్ర సైతం చేపట్టింది. అలాగే ప్రతి మంగళవారం నిష్టగా దీక్షలు కూడా చేపడుతోంది. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఢిల్లీకి వైయస్ షర్మిల.. ఒకటికి రెండు సార్లు.. ఇలా వెళ్లడం వెనుక పెద్ద మతలబే ఉందనే ఓ చర్చ అయితే.. తెలంగాణ సమాజంలో వాడి వాడిగా.. వేడి వేడిగా సాగుతోంది.
తెలంగాణ సీఎం కేసీఆర్ ముచ్చటగా మూడో సారి అధికార పీఠం ఎక్కాలని భావిస్తున్నారు. అలాగే టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్‌గా మార్చి.. బీజేపీ వ్యతిరేక పక్షాలను ఏకం చేసేందుకు ఆయన ప్రయత్నాలను కూడా ప్రారంభించారు. ఆ క్రమంలో ఆయన కోట్లాది రూపాయిలు వెచ్చించి.. సొంత విమానాన్ని సైతం కొనుగోలు చేశారు. అయితే కేసీఆర్‌కు.. ఆర్థికంగా అండ దండగా.. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన కాంట్రాక్టర్ మెగా కృష్ణారెడ్డి ఉన్నారని.. అందుకే వీరిపై ఫిర్యాదు చేసేందుకు వైయస్ షర్మిల.. ఢిల్లీకి పరుగు తీస్తున్నారని తెలంగాణ సమాజంలో ఓ చర్చ అయితే యమా జోరు జోరుగా నడుస్తోంది.
మరోవైపు నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన జలయజ్జం తాలుకా ప్రాజెక్టులనీ ఈ మెగా కృష్ణారెడ్డే దక్కించుకున్నారని.... అయితే వైయస్ఆర్ ఆకస్మిక మరణంతో ఆయనకు చెందిన కోట్లాది రూపాయిలు ఈ మెగా సంస్థ అధినేత చేతిలో చిక్కుకు పోయాయని.. ఆ తర్వాత సదరు నగదు రాబట్టుకోవాలని ఆ మహానత తనయుడు ప్రస్తుత ఏపీ సీఎం వైయస్ జగన్, ఆయన తనయురాలు వైయస్ షర్మిల ఎంతగా ప్రయత్నించినా.. వారి వల్ల కాలేదనే ఓ టాక్ అయితే తెలంగాణ సమాజంలో కొన.... సాగుతోంది.
ఆ క్రమంలోనే ఆస్తినగదు పంపకాల అంశంలో విజయమ్మ బిడ్డల నడుమ... పులివెందుల సాక్షిగా గట్టిగానే సిగపట్లు పట్టుకోన్నారని ఓ చర్చ సైతం నాడు మీడియాలో బాగానే నడిచిందని సమాచారం. ఆ క్రమంలోనే మెగా సంస్థ నుంచి నగదు రాబట్టు కోవడం కోసం.. రివర్స్ టెండరింగ్ అంటూ.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని మెగా కృష్ణారెడ్డి చేతికి సీఎం జగన్ ఇచ్చారని చర్చ తెలంగాణ సమాజంలోనే కాదు... ఫ్యాన్ పార్టీలోని కీలక నేతల్లో సైతం నేటికి హాట్ టాపిక్‌గానే ఉందని తెలుస్తోంది. వైయస్ జగన్.. ఆ విధంగా మెగా అధినేత నుంచి నగదు రాబట్టుకుంటే.. తన పరిస్థితి ఏమిటనే ఆందోళనతో వైయస్ షర్మిల ఢిల్లీకి దౌడు తీస్తుందనే టాక్ సైతం తెలంగాణలో సాగుతోంది.
ఇంకోవైపు కేసీఆర్ ప్రభుత్వంలో చోటు చేసుకున్న అవినీతిపై ఇప్పటికే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి,బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్.. వివిధ వేదికలపై నుంచే కాకుండా వారు చేపట్టిన పాదయాత్రల్లో సైతం భారీగా ఆరోపణలు సంధిస్తున్నారు. కానీ వీరిద్దరు ఏనాడు ఢిల్లీకి వెళ్లి.. కేసీఆర్ అవినితీపై సీబీఐకి కానీ,డీకి కానీ,జలశక్తి శాఖ కానీ, కాగ్‌కు కానీ ఫిర్యాదు చేసింది లేదని తెలంగాణ సమాజం ఈ సందర్బంగా గుర్తు చేసుకొంటోంది. కానీ వైయస్ షర్మిల మాత్రం.. కేసీఆర్.. బీఆర్ఎస్ పార్టీ ప్రకటన చేసిన జస్ట్ 24గంటలకే ఢిల్లీకి వెళ్లి.. కేసీఆర్,మెగా కృష్ణారెడ్డి అవినీతిపై సీబీఐకి ఫిర్యాదు చేసి వచ్చిందని.. మళ్లీ ఢిల్లీకి వెళ్లి.. కాగ్‌కు ఫిర్యాదు చేసిందని తెలంగాణ సమాజం స్పష్టంగా పేర్కొంటోంది. మెగా కృష్ణారెడ్డి వద్ద ఉన్న సొమ్ము తమదైతే.. సోకు మాత్రం గులాబీ బాస్ కేసీఆర్ చేసుకుంటున్నారనే భావనతో వైయస్ షర్మిల.. ఢిల్లీకి టూర్ కట్టేస్తోందనే ఓ రసవత్తరమైన చర్చ అయితే తెలంగాణ సమాజంలో రంజు రంజుగా సాగుతోంది. మరోవైపు.. వైయస్ షర్మిల ఢీల్లీలోని ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ.. సీబీఐని రాష్ట్రాల న్యాయ పరిధిలోని రాకుండా చేస్తున్నాయి. అదే కాగ్ అయితే.. కేంద్రంలో అయినా.. రాష్ట్రాల్లో అయినా ఆడిట్ చేయవచ్చునని స్పష్టంగా చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ కాళేశ్వరం అవినీతిపై సీబీఐ విచారణ చేయకున్నా.. కాగ్ అయినా చేస్తుందనే ఓ చిన్న ఆశ.. వైయస్ షర్మిలలో ఉందనే ఓ చర్చ సైతం లోటస్ పాండ్‌లోని వినిపిస్తోంది. మరి కాళేశ్వరంలో మింగిన కోట్లాది రూపాయిలను సీఎం కేసీఆర్, మెఘా కృష్ణారెడ్డిలను నుంచి వైయస్ షర్మిల కక్కిస్తుందా లేదా అనేది కాలమే నిర్ణయించాలని తెలంగాణ సమాజం పేర్కొంటోంది.