మంత్రి జగదీశ్ రెడ్డి నివాసంలో ఐటీ సోదాలు

తెలంగాణ రాష్ట్ర మంత్రి జగదీశ్ రెడ్డి నివాసంలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందిన మంత్రి జగదీశ్వరరెడ్డికి మునుగోడు ఉప ఎన్నిక ముందు వరుస ఎదురుదెబ్బలు తగలడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. మొన్నటికి మొన్న కేంద్ర ఎన్నికల సంఘం ఆయన ఎన్నికల ప్రచారంపై రెండు రోజుల నిషేధం విధించింది. అది అలా ఉంటే ఆ నిషేధం ఇలా ముగిసిందో లేదో  సోమవారం రాత్రి నుంచి ఆయన నివాసంపై ఐటీ అధికారులు దాడులు చేపట్టారు. తెలంగాణ విద్యుత్ మంతి నివాసంలో ఐటీ సోదాలు జరుగుతున్న విషయం ఒకింత ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. సోమవారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకే కొనసాగిన ఈ సోదాలో ఐటీ అధికారులకు భారీగా నగదు పట్టుబడినట్లు తెలుస్తోంది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా.. అత్యంత గొప్యంగా ఐటీ అధికారులు ఈ సోదాలు నిర్వహించారు. దాదాపు 15 మంది ఆదాయపన్ను శాఖ అధికారులు ఈ సోదాల్లో పాల్గొన్నట్లు చెబుతున్నారు. ఈ దాడుల్లో అధికారులు పెద్ద మొత్తంలో నగదు, కొన్న డాక్యుమెంట్లు, డైరీలు, కంప్యూటర్ హార్డ్ డిస్కులు స్వాధీనం చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. 

జైలుశిక్షలో ఉన్నవారికి ఓటు హక్కు లేదా?

దేశంలో ఓటర్లు ఎంతమంది, మనకు ఎంతశాతం ఓట్లు వస్తాయి, మన పార్టీవారు వేరే పార్టీవారికి జారిపోకుండా కట్టు దిట్టం చేయాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి మొదలయిన వన్నీ సరిగ్గా ఏదో ఒక ఎన్నికల సమయంలోనే చర్చకు వస్తుంటాయి. ఎన్నికలకు ముందు ఓటర్ల జాబితాలో లేనివారికి ఆ హక్కు కల్పించే యత్నాలూ ముమ్మరంగా చేపడుతుంటారు. అయితే, ఏదో ఒక కేసులో జైళ్లలో మగ్గుతున్నారి సంగతేమిటి? అనే ప్రశ్న కూడా తలెత్తకా పోదు. వారిని కూడా ఓటర్లుగా భావించి ఓటు హక్కు కల్పిస్తారా అన్న అంశంపై చాలా కాలం నుంచే చర్చ ఉంది. కానీ పెద్దగా సీరియస్ గా పట్టించు కున్నట్టు లేదు. వాస్తవానికి 1951 ప్రజాప్రతినిధుల చట్టం జైల్లో ఉన్నవారికి  ఓటు హక్కు లేదు. కానీ వారి ఓటుహక్కు వినియోగానికి వీలు కల్పించాలని కోరడం జరుగుతోంది. దీన్ని గురించి కేంద్ర  ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ యింకా స్పందించాల్సి ఉంది.  అయితే ఈ అంశంలో పిల్ ను అంగీకరించే సమయానికి అంటే డిసెంబర్ 9వ తేదీలోగా  సుప్రీం కోర్టు ప్రధానన్యాయ మూర్తి జస్టిస్ యు.యు.లలిత్, జస్టిస్ ఎస్.రవీంద్రభట్, జస్టిస్ బేలా ఎం. త్రివేదీలతో కూడిన బెంచ్ కేంద్రం, ఈసీ స్పందించాలని ఆదేశించింది.  అయితే,  ప్రస్తుతానికి అమలులో ఉన్న ఏదైనా చట్టం ప్రకారం జైలు శిక్ష లేదా రవాణా లేదా మరేదైనా జైలులో నిర్బంధించబడినా, లేదా పోలీసు చట్టబద్ధమైన కస్టడీలో ఉన్నట్లయితే, ఏ వ్యక్తి ఏ ఎన్ని కల్లోనూ ఓటు వేయకూడదు: ఈ ఉప విభాగంలోని ఏదీ నివారణ నిర్బంధానికి గురైన వ్యక్తికి  వర్తించదని సెక్షన్ 62(5) తెలియజేస్తుంది.   కాగా.  జైల్లో ఉన్న వ్యక్తి  శిక్షాకాలం, చేసిన పని గురించిన స్పష్టత మాత్రం ఎలాంటి స్పష్టీకరణను  ఓటు హక్కు  నిషే ధంలో లేదని , జైలు శిక్ష అనుభవిస్తున్న వారి విషయంలో ఆదిత్య భట్టాచార్య వేసిన పిల్ పేర్కొన్నది.  అంటే  ఎంత కాలం నుంచి జైలు శిక్ష అనుభవిస్తున్నవారికి ఓటు హక్కు ఉండదు, ఎంత స్థాయి నేరం చేసినవారికి  ఉండదూ  అనే అంశాలు స్పష్టంగా లేవని ఆయన పిల్ లో పేర్కొన్నా రు. అంతేగాక, నిర్దోషిత్వం లేదా అపరాధం నిశ్చయంగా నిర్ధారించబడని అండర్ ట్రయ ల్‌లు, వారు కూడా జైలులో నిర్బంధించబడినందున వారి ఓటుహక్కును కోల్పోతారని, అయితే బెయిల్‌పై విడుదలై నప్పటికీ దోషి ఓటు వేయవచ్చని పేర్కొంది.  మొత్తానికి జైలుశిక్షలో ఉన్నవారికి ఓటు హక్కు గురించి సుప్రీంకోర్టు పరిశీలించాల్సి ఉంది. 

వైసీపీ టంగ్ ట్విస్టర్.. మూడంటే మూడు కాదు ఒకటే!

మూడు రాజధానుల మూడుముక్కలాటలో వైసీపీ నోటికొచ్చినట్లు మాట్లాడుతోంది. మూడంటే మూడని కాదు అని చెబుతోంది. ఏపీకి ఒక్కటే రాజధాని అనీ.. అది అమరావతి కాదు.. విశాఖపట్నం అని అంటోంది. ఇక ముఖ్యమంత్రి జగన్ అయితే.. సీఎం ఎక్కడ నుంచి పాలన చేస్తారో అదే రాజధాని అని చెబుతున్నారు. ఇందు కోసం మూడు రాజధానులంటూ రాద్ధాంతం ఎందుకని ప్రకటిస్తున్నారు. సీఎం తనకు ఇష్టమొచ్చిన నగరం నుంచి పాలన సాగించవచ్చనీ, సీఎం ఎక్కడ ఉంటే అక్కడే కేబినెట్ ఉంటుందనీ, అక్కడే సచివాలయం కూడా ఉండాలని చెబుతున్నారు. ఇంతోటి దానికి మూడు రాజధానులంటూ బిల్లులు అసెంబ్లీలో ప్రవేశపెట్టడం.. కోర్టులు మొట్టికాయలు వేయడంతో వాటిని ఉపసంహరించుకోవడం.. మళ్లీ తగుదునమ్మా అంటూ మూడు రాజధానులే ముద్దంటూ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు ప్లకార్డులు పట్టుకుని ప్రదర్శనలు చేయడం ఎందుకని జనం ప్రశ్నిస్తున్నారు.  ఇంత కాలం మూడు రాజధానుల పేరుతో అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి జగన్ చెబుతూ వస్తున్నారు. కర్నూలు న్యాయరాజధాని, అమరావతి శాసన రాజధాని, ఇక విశాఖ పట్నం ఎగ్జిక్యూటివ్ కేపిటల్ అంటూ చెబుతూ వస్తున్నారు. అయితే.. ఇప్పుడు హఠాత్తుగా వైసీపీ స్వరం మారింది.. ధోరణి మారింది. ఉత్తరాంధ్ర మంత్రి ధర్మాన ప్రసాదరావు రాష్ట్రానికి ఒకటే రాజధాని అని కుండ బద్దలు కొట్టేశారు. అయితే ఆ ఏకైక రాజధాని అమరావతి కాదు.. విశాఖపట్నం అని ఆయన చెప్పారు. ఈ అభిప్రాయం పార్టీ అభిప్రాయమా.. లేక ధర్మాన సొంత పైత్యమా అన్నది పక్కన పెడితే.. ఒక ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్ కూడా దాదాపు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రాజధాని విషయంలో రాద్ధాంతం ఎందుకని ఒక ప్రశ్నకు సమాధానంగా చెబుతూ సీఎం ఎక్కడ నుంచి పాలన సాగిస్తే అదే రాజధాని అవుతుందని స్పష్టంగా చెప్పారు. సీఎం ఎక్కడ నుంచి పాలన సాగించాలనుకుంటే అక్కడ నుంచి సాగించవచ్చనీ.. దీనిని ఎవరూ అడ్డుకో జాలరనీ కూడా చెప్పేశారు. అంతే కాదు.. సీఎం ఎక్కడ నుంచి పాలన సాగిస్తే అక్కడే కేబినెట్ కూడా ఉంటుందనీ, అక్కడే సచివాలయం కూడా ఉండాలని జగన్ చెప్పారు. అంటే తాను విశాఖ నుంచే పరిపాలన కొనసాగించాలని భావిస్తున్నాననీ, అందుకే అక్కడే సచివాలయం ఉంటుందనీ, అక్కడే కేబినెట్ కూడా ఉంటుందని అందుకే ఏపీ రాజధాని విశాఖపట్నమే అవుతుందనీ తన మనసులోని మాటను చెప్పకనే చెప్పాశారు. మరి శాసన కేపిటల్, న్యాయ రాజధాని అంటూ ఇంత కాలం ఆడిన డ్రామాకు అర్ధమేమిటో జగన్ చెప్పి తీరాలి. ఇది అలా ఉంచితే.. ఇప్పుడు ధర్మాన తాజాగా ఎత్తుకున్న ఏపీకి ఏకైక రాజధాని విశాఖ పట్నమే అన్న విషయానికి వస్తే.. కర్నూలులో హైకోర్టు ఉంటుంది కానీ అది న్యాయ రాజధాని కాదు.. అలాగే అసెంబ్లీ అమరావతిలోనే కొనసాగినంత మాత్రాన అది శాసన రాజధాని కాదు అని చెబుతున్నారు.   వరుసగా సదస్సులు నిర్వహిస్తూ ఆయన చెబుతున్న మాట ఇదే. ఇప్పుడు జనగ్ మాటలను ఒకసారి పరిశీలిస్తే.. ఆయన కూడా ఏపీ రాజధాని విశాఖపట్నమే అవుతుంది కానీ.. ఇంత కాలం తాము చెబుతూ ఉన్న మూడు రాజధానులు అన్న మాటే ఉండదని అర్ధమౌతుంది.  ఇందుకు ఉదాహరణలుగా  ఒరిస్సా రాజధాని భువనేశ్వర్ అయితే కటక్‌లో హైకోర్టు ఉందని ధర్మాన ఇప్పుడు తాపీగా ఎవరికీ తెలియని రహస్యమన్నట్లు చెబుతున్నారు. అలాగే దేశంలో ఎనిమిది రాష్ట్రాల్లో హైకోర్టు ఓ చోట… రాజధాని మరో చోట ఉన్నాయని చెబుతూ.. అంత మాత్రాన ఆయా రాష్ట్రాలలో న్యాయరాజధాని అంటూ హైకోర్టు ఉన్న  నగరాలను రాజధానులని ఎవరూ పిలవడం లేదన్న ధర్మాన వ్యాఖ్యలతో ఇప్పుడు కొత్తగా రాయల సీమ ప్రాంతంలో ఆందోళనలు అంకురించే అవకాశాలు ఉన్నాయని పరిశీలకలు అంటున్నారు. తాజాగా జగన్, ధర్మానలు చేస్తున్న వాదన వెనుక ఉన్న ఉద్దేశం కూడా అదే అని వివరిస్తున్నారు.  అసలిదంతా ఎందుకంటే ప్రాంతాల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టి.. ప్రజల సెంటిమెంటును రగిలిస్తే తప్ప వచ్చే ఎన్నికలలో విజయం సాధించడం అసాధ్యమన్న అభిప్రాయానికి వైసీపీ అగ్రనాయకత్వం వచ్చేయడంతోనే ఇప్పుడొ  ఏకైక రాజధాని అంటూ కొత్త పల్లవి ఎత్తుకోవడానికి ఇదే కారణమని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.  

వివేకా హత్య కేసు విచారణ బయటి రాష్ట్రానికి బదలీపై సుప్రీం ఆదేశాలు నేడు

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను మరో రాష్ట్రానికి బదలీపై దేశ సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం(నవంబర్ 1) ఉత్తర్వులు జారీ చేయనుంది. ఇప్పటికే కేసు మరో రాష్ట్రానికి బదలీ చేయడానికి అంగీకరించిన సుప్రీం కోర్టు ఏ రాష్ట్రానికి బదిలీ అన్న విషయంపై నవంబర్ 1న ఉత్తర్వులు ఇవ్వనున్నట్ల పేర్కొన్న సంగతి విదితమే. తన తండ్రి హత్య కేసు విచారణ ఇతర రాష్ట్రానికి బదిలీ చేసి దర్యాప్తు వేగవంతం చేయాలని వివేకా కుమార్తె దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన సుప్రీం కోర్టు.. కేసు వేరే రాష్ట్రానికి బదలీ చేయడానికి అంగీకరించి గత నెల(అక్టోబర్) 19న  తీర్పు రిజర్వ్ చేసిన సంగతి విదితమే.   స్థానిక ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి వివేకా హత్య కేసు దర్యాప్తులో జోక్యం చేసుకుంటున్నారని, ఏపీలో నిష్పక్షపాత విచారణ జరుగుతున్న నమ్మకం లేదని, కేసు విచారణ బయట రాష్ట్రాలకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టును సునీతా రెడ్డి కోరగా, ఈ కేసు విచారిస్తున్న సీబీఐ కూడా సునీత చెప్పిన ప్రతి విషయం అక్షర సత్యమని సుప్రీం కోర్టుకు తెలియజేసిన సంగతి విదితమే. దీంతో సుప్రీం కోర్టు వివేకా హత్య కేసు విచారణను వేరే రాష్ట్రానికి బదలీ చేయడానికి అంగీకరించింది.  దీంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ స్వంత బాబాయ్ వైఎస్ వివేకానాందరెడ్డి హత్య కేసు తార్కిక ముగింపు దిశగా సాగుతోందనీ? ఈ కేసు విషయంలో దర్యాప్తును అడ్డుకోవడానికి జగన్ ప్రభుత్వ అధికారాలను దుర్వినియోగం చేశారనీ? ఇంతకాలం వెల్లువెత్తిన అనుమానాలను  దేశ సర్వోన్నత న్యాయస్థానం నమ్మిందని స్పష్టమౌతోంది.   తన తండ్రి మరణం వెనుక ఎవరున్నారో తేలాల్సిందే అంటూ మొక్కవోని దీక్షతో అలుపెరగని న్యాయపోరాటం చేసిన వివేకా కుమార్తె సునీత ఈ కేసు వెనుక ఉన్న సూత్రధారులు, పాత్ర ధారులకు శిక్ష పడాల్సిందేనన్న పట్లు దలతో ఉన్నారు. ఇందుకోసం ఆమె సాహసోపేతమైన పోరాటమే చేశారు. ఆ పోరాటం ఫలించే సూచనలు కనిపిస్తున్నాయి. గత ఎన్నికలకు ముందు వివేకానందరడ్డి తన నివాసంలోనే దారుణ హత్యకు గురయ్యారు. తన పినతండ్రిని హత్య చేసిన వారికి శిక్షపడేలా చూడాల్సిన వ్యక్తే ఆ కేసులో నేరస్థులను కాపాడటానికి తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్న ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. వైఎస్ వివేకా హత్య జరిగిన సమయంలో ప్రస్తుత సీఎం జగన్ విపక్ష నేతగా ఉన్నారు.  ఆ సమయంలో తొలుత తన బాబాయ్ గుండె పోటుతో మరణించారనీ, ఆ తరువాత అది గుండె పోటు కాదు.. గొడ్డలి పోటని బహిర్గతమైపోవడంతో అధికార పక్షమే ఆయన హత్యకు కారణమని.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపైనే నేరుగా ఆరోపణలు చేశారు. ఈ హత్యపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. సరే తరువాత ఎన్నికలలో విజయం సాధించి అధికార పగ్గాలు అందుకున్న తరువాత వివేకా హత్య కేసులో సిబీఐ దర్యాప్తు అవసరం లేదని ప్రభుత్వం కోర్టుకు చెప్పడం గమనార్హం. అసలు వివేకా హత్య జరిగిన క్షణం నుంచీ ఆ కేసును పక్కదారి పట్టించే యత్నాలు, సాక్ష్యాలను మాయం చేసే ప్రయత్నాలు జరిగాయి. రక్తపు మరకలను కడిగి వేయడం.. గుండె పోటు అంటూ స్వంత మీడియాలో పదే పదే చెప్పించడం దగ్గర నుంచి.. అప్పటి ముఖ్యమంత్రే ఈ హత్య చేయించారంటూ ప్రచారం చేయడం ఆరోపణలు గుప్పించడం వరకూ ఈ కేసులో అసలు దోషులను కప్పిపుచ్చే యత్నాలే జరిగాయి.. జరుగుతూ వచ్చాయి. సరే వివేకా కుమార్తె తన తండ్రి హంతకులకు శిక్ష పడాలన్న పట్టుదలతో చేసిన న్యాయపోరాటం ఫలితంగా ఈ కేసును సీబీఐ టేకప్ చేసింది. అయినా కూడా సీబీఐ దర్యాప్తునకు రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ అడుగడుగునా అడ్డంకులు సృష్టించింది. ఈ కేసులో సాక్షులు అనుమానాస్పదస్థితిలో  మరణించడం, అప్రూవర్ గా మారిన  దస్తగిరి ప్రణాలకు ముప్పు ఉందంటూ ఎస్పీని ఆశ్రయించడం, కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులపైనే దాడి యత్నాలు జరగడం, సాక్షాత్తూ సీబీఐ అధికారులపైనే కేసులు నమోదు కావడం వరకూ ఈ కేసును మసిపూసి మారేడుకాయ చేయడం కోసం జరగని ప్రయత్నం లేదు. చివరకు ఏపీలో అయితే ఈ కేసు విచారణ సజావుగా సాగే అవకాశం లేదంటూ సునీత సుప్రీం కోర్టును ఆశ్రయించారు.  ఈ పిటిషన్ విచారించిన సుప్రీం కోర్టు కూడా  ఎపి పోలీసు మీద నమ్మకం లేనద్న భావన వ్యక్తం చేసిందంటే  రాష్ట్ర పోలీసు యంత్రాంగానికి అంతకంటే దారుణమైన అవమానం వేరొ కటి వుండదు. పాత రోజులలో అయితే అటు ముఖ్యమంత్రి, ఇటు డిజిపి వంటి ఉన్నతా ధికారులు సుప్రీంకోర్టు నుంచి ఇటువంటి వ్యాఖ్యలు వెలువడితే  వెంటనే పదవులు వదిలేసే వారు. కానీ విచిత్రంగా జగన్ హయాంలో అటువంటి నైతికతకు చోటు లేని పరిస్థితి ఉంది. అందుకే కేసు విచారణ ఏపీ బయట జరగాలని సుప్రీం కోర్టు అభిప్రాయపడినా జగన్ సర్కార్ లో ఎటువంటి చలనం లేదు. అయితే సుప్రీం ఆదేశాలతో  వివేకా హత్య కేసు వేరే రాష్ట్రానికి బదిలీ అయితే (ఇప్పటికే కేసు విచారణ వేరే రాష్ట్రానికి బదలీ చేయడానికి సుప్రీం అంగీకరించింది. అయితే  నేరస్తులకు ఉచ్చు బిగుసుకున్నట్లే అని పరిశీలకులు, న్యాయ నిపుణులు అంటున్నారు.  ఇదే సమయంలో వివేకా హత్య పై జగన్ కు స్వయాన సోదరి, వైఎస్సార్ టీపీ అధినేత్రి షర్మిల చేసిన వ్యాఖ్యలు హత్యకు కారణమేమిటో, హత్య చేసిన వారెవరో చెప్పకనే చెప్పేశాయని పరిశీలకులు అంటున్నారు. తన చిన్నాన్నను చంపారని, చంపిన వారెవరో అందరికీ తెలుసని ప్రకటించా రామె. ఆమె నోటి వెంట ఆ మాట వెలువడడం వైఎస్ కుటుంబాన్ని చిక్కులలోకి నెడుతున్నది. ప్రజలకు సమాధానం చెప్పుకోవలసిన పరిస్థితి ఏర్పడుతున్నది. ఎంపీ సీటు కోసమే తన చిన్నాన్నను దారుణంగా చంపేశారని షర్మిల పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలతో... ఇప్పటి దాకా కేసును నీరుగార్చడానికి పోలీసు యంత్రాంగం చేసిన ప్రయత్నాలతో వివేకా హత్య కేసులో నేరస్తులను కాపాడడానికి ముఖ్యమంత్రి స్వయంగా ప్రయత్నం చేస్తున్నారని, చర్చ ప్రజలలో విస్తృతంగా జరుగుతోంది. 

దేశద్రోహ చట్టంలో మార్పులకు కేంద్రం ఓకే!

దేశ ద్రోహ చట్టంలో మార్పులకు కేంద్రం ఓకే చెప్పింది. ఇండియ్ పీనల్ కోడ్ సెక్షన్ 124(ఎ)లో వచ్చే వర్షాకాల సమావేశాల్లో మార్పులు తేవాలని భావిస్తున్నట్లు సుప్రీం కోర్టుకు కేంద్రం తెలిపింది. దేశద్రోహ నేరం సెక్షన్ 124(ఎ) చట్టబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన పీటిషన్లపై సుప్రీం కోర్టు సోమవారం (అక్టోబర్ 31) విచారణ జరిగింది. అంతకు ముందే.. విచారణలో భాగంగా కేంద్రానికి నోటీసులు ఇచ్చిన సంగతి విదితమే. ఆ నోటీసులపై కేంద్రం మార్పులు చయనున్నట్లు పేర్కొంటూ వివరణ  ఇచ్చింది. దీంతో కేసు విచారణ వచ్చే ఏడాది జనవరికి వాయిదా పడింది. కాగా దేశ ద్రోహ చట్టంపై సమీక్ష పూర్తయ్యే వరకూ సదరు చట్టం కింద కేసులు నమోదు చేయవద్దని గతంలోనే సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి విదితమే. అలాగే ఈ కేసు కింద అరెస్టయిన వారు బెయిలు కోసం పిటిషన్ దాఖలు చేయవచ్చని పేర్కొంది. అటువంటి బెయిలు పిటిషన్లను కోర్టులు సాధ్యమైనంత త్వరగా విచారించి డిస్పోజ్ చేయాలని మాజీ సీజేఐ ఎన్వీరమణ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం ఆదేశించిన సంగతి తెలిసిందే. సెక్షన్ 124(ఎ)ను పున: పరిశీలించేందుకు కేంద్రానికి అనుమతించిన సర్వోన్నత న్యాయస్థానం ఆ పని పూర్తయ్యే వరకూ ఆ సెక్షన్ కింద కేసులు నమోదు చేయరాదని    అప్పట్లోనే విస్పష్ట ఆదేశాలు జారీ చేసిన సంగతి విదితమే.  

నడ్డా ఉత్తుత్తి హాస్పటల్

తెలంగాణా న‌ల్గొండ జిల్లా ఫ్లోరైడ్ స‌మ‌స్య‌కు నిల‌యంగా మారింది. వాస్త‌వానికి ఇది చాలాకాలం నుంచి ఇక్క‌డ ఉన్న స‌మ‌స్య‌. దీనికితోడు ప్రతిపాదిత ఫ్లోరైడ్ నివార‌ణ కేంద్రాన్ని పశ్చిమ బెంగాల్‌కు తరలించినట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి, దీని ప‌రిష్కా రం విషయమై ప్రజాప్రతినిధులు పలుమార్లు చేసిన విజ్ఞప్తిపై కేంద్రం సానుకూలంగా స్పందించలేదు. ఇది జిల్లాలోని ఫ్లోరైడ్ బాధి తులలో అశాంతిని సృష్టిస్తుంది. జిల్లాలోని చౌటుప్పల్‌ మండలం దండుమల్కాపురంలో ప్రాంతీయ ఫ్లోరైడ్‌ నివారణ కేంద్రం ఏర్పా టు పై నెలకొన్న ప్రతిష్టంభనకు తెరపడడం లేదు. అంతకుముందు, ఫ్లోరోసిస్ బాధితులను క‌లిసి వారి స‌మ‌స్య‌లు విన్న‌ కేంద్ర ఆరోగ్య మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా మర్రిగూడలో 300 పడకల ఆసుపత్రి , చౌటుప్పల్ సమీపంలో ఫ్లోరైడ్ పరిశోధన, నివారణ కేంద్ర ఏర్పాటు కూడా హామీ ఇచ్చారు. ప్రతిపాదిత ప్రాంతీ య ఫ్లోరైడ్ పరిశోధన కేంద్రం రోగనిర్ధారణ, పరిశోధనతో పాటు స్థానిక ప్రాంతాలపై నిఘా, పర్యవేక్షణ ద్వారా ఫ్లోరైడ్, ఫ్లోరోసిస్ భారాన్ని తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది. 2012లో కేంద్ర తాగునీరు, పారిశుద్ధ్య మంత్రిత్వ శాఖ హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టి ట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్ ఐఎన్‌) లో అందుబాటులో ఉన్న సౌకర్యాలను మెరుగుపరచడం, బలోపేతం చేయడం ద్వారా హైదరాబాద్‌లో ప్రాంతీయ ఫ్లోరైడ్ నివారణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. కానీ, స్థల రద్దీని పేర్కొంటూ ఎన్ ఐఎన్ వెలుపల ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఎన్ ఐఎన్‌ ప్రతిపాదించింది. దీంతో జిల్లాలోని చౌటుప్పల్ మండలం మల్కాపూర్‌లో కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారీతో సహా కేంద్రం  అన్ని పనులను పర్యవేక్షించడానికి ఎన్ ఐఎన్‌ శాస్త్రవేత్త డాక్టర్ అర్జున్ ఎల్‌ ఖండారే నోడల్ అధికారిగా నియమితుల‌య్యారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, మహారాష్ట్ర, ఒరిస్సా, మధ్యప్రదేశ్ , మ‌ధ్య‌ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్, అస్సాం మొద‌ల యిన ప‌ది రాష్ట్రాల్లో ఫ్లోరైడ్ సమస్యను పరిష్కరించేందుకు రూ.100 కోట్లతో ప్రాంతీయ ఫ్లోరైడ్‌ నివారణ కేంద్రాన్ని ఏర్పాటు చేయా లని 2014లో కేంద్రానికి సమర్పించిన డిటైల్డ్‌ ప్రాజెక్ట్‌ రిపోర్టులో ప్రతిపాదించారు.  ప్రాంతీయ ఫ్లోరైడ్‌ నివారణ కేంద్రంలో ఆర్ అండ్ బి యూనిట్‌, 20 పడకల ఆసుపత్రి, మొబైల్‌ హెల్త్‌ వ్యాన్‌, సోషల్‌ సైన్స్‌ యూనిట్‌, ట్రైనింగ్‌ యూనిట్‌ అభివృద్ధి చేయాలని కూడా ప్రతిపాదించారు. ఆర్ అండ్ బి యూనిట్లు రీసర్చ్ సబ్-యూనిట్ , బయో ఇన్ఫర్మేటిక్స్ యూనిట్లను కలిగి ఉంటాయి. 20 పడకల ఆసుపత్రి ఫ్లోరైడ్ రోగుల పునరావాసం కోసం ఉద్దేశించబడింది. అలాగే ఇద్దరు వైద్యులు,  ఆపరేషన్ థియేటర్‌తో సహా 16 మంది సిబ్బందిని నియమించారు. ఫ్లోరైడ్ మ్యాపింగ్, ఓరల్ హెల్త్ కేర్, స్థానిక ఫ్లోరైడ్ ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన కల్పించడం కోసం 20 మంది కూర్చునే మొబైల్ హెల్త్ వ్యాన్ కూడా ప్రతిపాదించబడింది. అంతేగాక‌, 18 మంది సిబ్బందితో ప్రతిపాదిత సాంఘిక శాస్త్ర విభాగం ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతంలో ప్రస్తుత తరానికి అవగా హన కల్పించడంలో, ప్రేరేపించడంలో మరియు ప్రవర్తనలో మార్పు చేయడంలో క్రియాశీల పాత్ర పోషిస్తుంది. జిల్లా ఫ్లోరైడ్‌ మాని టరింగ్‌ సెంటర్‌ కోఆర్డినేటర్‌ శంకర్‌బాబు తెలంగాణ టుడేతో మాట్లాడుతూ మల్కాపూర్‌లో ఎనిమిది ఎకరాల భూమిని తమకు అప్పగించాలని 2014 అక్టోబర్‌లో జిల్లా యంత్రాంగం ఎన్‌ఐఎన్‌కు లేఖ రాసిందని, అయితే జాతీయ విద్యాసంస్థ స్పందించలేదని అన్నారు. డీపీఆర్  సమర్పించిన తర్వాత కూడా జాప్యం చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ జూన్ 2014లో డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటే షన్ జాయింట్ సెక్రటరీకి డాక్టర్ అర్జున్ ఎల్ ఖండారే లేఖ కూడా రాశారు. ప్రతిపాదిత కేంద్రంపై తెలంగాణ ప్రజల నుంచి ఒత్తిడి ఎక్కువగా ఉందని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. కనీసం హైదరాబాద్‌లో అద్దె భవనంలోనైనా కేంద్రాన్ని ప్రారంభించి ఉండేవారు. ప్రాంతీయ ఫ్లోరైడ్ నివారణ కేంద్రంపై జరుగుతున్న జాప్యం ఈ విషయంలో దాని నిబద్ధతపై సందేహాలకు ఆస్కారం కలిగిస్తోంది. ఫ్లోరోసిస్ బాధితులకు చికిత్స అందించేందుకు జిల్లాలోని మర్రిగూడ మండల కేంద్రంలో 300 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేస్తా మని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా హామీ ఇచ్చారు. మంగళవారం మర్రిగూడలో భారతీయ జనతా పార్టీ (బిజెపి) రాష్ట్ర విభాగం ఏర్పాటు చేసిన సమావేశంలో బాధితులను ఉద్దేశించి మాట్లాడుతూ, జె.పి.న‌డ్డాను కలిసేందుకు ఇక్కడికి వచ్చిన సుమారు 50 మంది ఫ్లోరోసిస్ బాధితుల బాధలను ఓపికగా విన్న కేంద్ర మంత్రి ఆసుపత్రికి హామీ ఇచ్చారు. 2012లో రాష్ట్ర భాజపా పోరుబాటలో పాల్గొనేందుకు మర్రిగూడ వచ్చిన కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని, కేంద్రాన్ని పాలించిన గత ప్రభుత్వాలు ఈ సమస్యను పరిష్కరించడంలో విఫలమయ్యాయని, ఫ్లోరోసిస్ బాధితుల జీవితాల్లో ఎలాంటి మార్పు రాలేదన్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం ఏర్పాటు చేసేందుకు ఫ్లోరోసిస్ బాధితు లను న్యూఢిల్లీకి తీసుకెళ్తానని నడ్డా హామీ ఇచ్చారు.

పవన్ రావాలి, జగన్ పోవాలి... వైసీపీ విద్యార్ధి భేరీలో నినాదాలు

ఆంధ్రప్రదేశ్ లో రాజధాని విషయంలో ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయానికే కట్టుబడి ఉంది. దీన్ని విపక్షాలు రాజకీయలబ్ధికోసమే ఇలాంటి దారుణ నిర్ణయం తీసుకున్నారని దుమ్మెత్తిపోస్తున్నాయి. మూడు రాజధానుల వల్ల ఉత్తరాంధ్ర కూడా ఎంతో అభవృద్ధి పొందగలదని ప్రభుత్వం చెబుతోంది. కానీ రియల్ఎస్టేట్ దందాను పెంచుకోవడానికి జగన్ తన నిర్ణయానికి కట్టుబడి ఉన్నారేగాని రాష్ట్ర ప్రయోజనాలపరంగా ఆలోచించడంలేదని విపక్షాలు మండిపడుతున్నాయి. అయితే మూడు రాజధా నులే మంచిదని, వికేంద్రీకరణకు మద్దతుగా సోమవారం చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ నాయక త్వంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు ర్యాలి నిర్వహించారు. వైసీపీ ర్యాలిలో విద్యార్థు లు సీఎం జగన్ కు వ్యతిరేకంగాను, అధికారంలోకి  జనసేన  రావాలనీ  నినాదాలు చేయడం నాయకులకు నోట మాట రాలేదు,  ఒక దశలో విద్యార్థులు సీఎం పవర్ స్టార్ అంటూ భారీ నినాదాలు చేయడం అందర్నీ ఆశ్చర్య పరిచింది. ఈ ర్యాలీలో చోడవరం ఎమ్మెల్యే ధర్మ శ్రీ, అనకాపల్లి ఎంపీ సత్యవతి విశాఖ రాజధాని కోసం మాట్లాడారు.  వైసీపీ ప్రభుత్వం వికేంద్రీకరణలో భాగంగా 13 జిల్లాలను 26 జిల్లాలుగా చేయడంలో ఆంతర్యం అన్ని ప్రాంతాలను సమానంగా చూడడం, అభవృద్ధి కూడా సమానంగా జరిగేందుకు అవకాశం ఉంటుందనే అభిప్రాయంతోనే జగన్ ఆ నిర్ణయం తీసుకున్నారని ధర్మశ్రీ అన్నారు.  అమరావతిని రాజధానిగా ప్రజలంతా నమ్ముతున్నారని, అందుకే రైతులు తమ భూములను ఇచ్చారని ఇప్పుడు తన రాజకీయ లబ్ధి కోసం మూడు రాజధానుల అంశాన్ని తెరమీదకు జగన్ తెచ్చారని విపక్షాలు మండిపడుతున్నాయి.  రాయలసీమ ప్రాంతీయులు జగన్ ఆలోచనను సమర్ధించారు. వారి ప్రాంతంలోని కర్పూలును లీగల్ క్యాపిటల్ గా  జగన్ పేర్కొన్నారు. కానీ  మూడు రాజధానులతో ఏ ప్రాంతానికి సమ న్యాయం జరిగే అవకాశం లేదని విపక్షాల నుంచి వ్యతిరేకత వెల్లువెత్తుతోందన్నారు.  టీడీపీ, జనసేన పార్టీ నేతలు విశాఖను పరిపాలన రాజధానిగా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఉత్తరాంధ్ర ప్రజలు ఇంకా ఎన్నాళ్లు బానిసలుగా ఉండాలన్నారు. విశాఖ రాజధాని అయితే అందరికి ఉద్యోగాలు వస్తాయన్నారు. విశాఖ పరిపాలన రాజధాని అయితే విద్యార్థుల భవిష్యత్ బాగుంటుందన్నారు.  కాగా, రాజధాని విషయంలో ప్రస్తుతం రెండు ఉద్యామాలు నడుస్తున్నాయి. అమరావతినే రాజధానిగా కొనసాగించా ల్సిందేనంటూ ఆ ప్రాంత రైతాంగం చాలా రోజులుగా ఉద్యమిస్తున్నారు. అమరావతి నుంచి అరసవిల్లి వరకూ మహా పాదయాత్ర చేపట్టి రాష్ట్రంలో అందరి మద్దతును సంపాదించారు. ఈ పాదయాత్రను అడ్డుకోవడానికి ప్రభుత్వ యంత్రాంగం విశ్వయత్నాలు చేసి విఫలమయింది. వైసీపీ నేతల నుంచి నిరసన వ్యక్తం అవుతోంది. నల్ల బెలూన్లు లతో, మూడు రాజధానుల మద్దతుగా ఫ్లెక్సీలతో మూడు రాజధానుల మద్దతుదారులు, వైసీపీ నేతలు రైతుల పాదయాత్రకు నిరసన తెలుపుతున్నారు. వికేంద్రీకరణకు మద్దతుగా విశాఖలో జేఏసీ ఏర్పాటు చేశారు. ఈ జేఏసీ ఆందోళనలకు వైసీపీ నేతలు మద్దతు తెలుపుతున్నారు. మూడు రాజధానులు కావాలని ఇటీవల విశాఖ గర్జన నిర్వహించారు.  ఇదిలా ఉండగా, మూడు రాజధానులకు మద్దతునిస్తూ విశాఖ జిల్లాలో భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యేల నాయకత్వంలో బైక్ ర్యాలీ చేపట్టారు. వికేంద్రీకరణతో రాష్ట్రంలో అన్ని ప్రాంతాలూ సమ అభివృద్ధికి నోచుకుంటాయని నినాదాలు చేశారు. అంతేగాక మంత్రులు, ఎమ్మెల్యేలు రాజీనామా కి కూడా వెనుకాడటం లేదు. విశాఖ గర్జన విజయవంతమయిందని వైసీపీ నాయయకులు, కార్యకర్తలు ప్రచారం చేసుకుంటున్నారు. కాగా ఇటీవల తిరుపతిలో రాయలసీమ ఆత్మగౌరవ మహా ప్రదర్శన నిర్వహించడం గమనార్హం. తమప్రాంతానికి రాజధాని తేవాలని మూడురాజధానుల యోచనకు మద్దతుగా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి భారీ ర్యాలీ కూడా చేపట్టారు. 

లాజిక్కుకు అందవు .. కేసీఆర్ మాటలు డమ్మీ తూటాలే..

కేసీఆర్  మాటల మాంత్రికుడు.. ఎదుటి వారిని మెస్మరైజ్ చేసే వాగ్ధాటి ఆయన సొంతం.. ఆ వాగ్ధాటితోనే తెలంగాణ ఉద్యమాన్ని విజయవంతంగా నడిపించారు. ఆ వాగ్ధాటితోనే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచీ ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో ప్రత్యర్థి పార్టీల ఉనికిని నామమాత్రంగా చేసి దాదాపు ఏకఛద్రాధిపత్యం సాగించారు. కానీ ఇప్పుడు ఆ వాగ్ధాటిలోని డొల్లతనాన్ని విపక్షాలే కాదు.. జనసామాన్యం సైతం గుర్తిస్తున్నారు. ఇష్టారీతిన విమర్శలు గుప్పించేయడం.. ఆధారాలు, హేతువు గురించి ఇసుమంతైనా పట్టించుకోకపోవడం.. యెడాపెడా హామీలు గుప్పించేసి ఆ తరువాత వాటి ఊసే ఎత్తకపోవడాన్ని విపక్షాలే కాదు.. జనం సైతం నిలదీస్తున్నారు. ఉద్యమ సమయంలో ఆయన తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవశ్యకత గురించి ప్రసంగిస్తుంటే.. సైద్ధాంతికంగా ఆయనతో విభేదించే వారు కూడా ఏకీభవించేవారు.. ఆయన మాటల ధార అలాంటిది. అందుకే కాంగ్రెస్, తెలుగుదేశం, ఆఖరికి వామపక్షాలు కూడా తెలంగాణ విషయంలో చీలిక అంచుల వరకూ వెళ్లిపోయాయి. ఉభయ కమ్యూనిస్టు పార్టీలు అయితే ఒకటి సమైక్యాంధ్ర అంటే.. మరొకటి ప్రత్యేక తెలంగాణ అన్నాయి. సమైక్యాంధ్ర అన్న పార్టీలోనూ మెజారిటీ క్యాడర్ ప్రత్యేక తెలంగాణ పల్లవే ఎత్తుకుంది. అలాగే క్రమశిక్షణకు మారు పేగా ఉండే తెలుగేదేశంలో కూడా సమైక్య, ప్రత్యేక వాదాలతో విభేదాలు పెచ్చరిల్లాయి. రెండు ప్రాంతాలలోనూ బలంగా ఉన్న తెలుగుదేశం ఆ కారణంగానే తెలంగాణలో బలహీన పడింది. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే అధిష్ఠానం రాష్ట్ర విభజనకు సై అంటే అధిష్ఘానం నిర్ణయాన్ని ఆంధ్రప్రాంత నేతలు, క్యాడర్ తీవ్రంగా వ్యతిరేకించారు. లగడపాటి, ఉండవల్లి లాంటి వారు రాజకీయ సన్యాసం చేశారు. అలా చేయడానికి ముందు చివరి క్షణం వరకూ సమైక్యాంధ్ర కోసం నినదించారు. అదంతా గతం. కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రిగా అధికార పగ్గాలు చేపట్టిన తరువాత.. గతంలో సమైక్యాంధ్రకు జై కొట్టిన పలువురు ఇతర పార్టీ నేతలను తెలంగాణకు జై అనిపించి పార్టీలో చేర్చుకుని కీలక పదవులు కట్టబెట్టారు. ఇదంతా కేసీఆర్ మాటల మరాఠీ కావడం వల్లనే జరిగింది. అయితే రాను రాను ఆయన మాటలు కోటలు దాటుతున్నాయే తప్ప చేతలు గడప కూడా దాటడం లేదన్న గ్రహింపు జనబాహుల్యంలో కలిగింది. ఎప్పటికీ పూర్తి కాని రుణమాఫీ, ఎవరికి ఎందుకు అందుతోందో అర్థంకాని దళిత బంధు.. కేవలం ఎన్నికల ముందే గుర్తుకు వచ్చే హామీలు.. క్రమంగా ప్రజలలో కేసీఆర్ పట్ల వ్యతిరేకతకు బీజాలు వేశాయి. అవి మొలకలెత్తుతున్న సంకేతాలు దుబ్బాక, హుజారాబాద్ ఉప ఎన్నికల ఫలితాలతోనే కనిపించాయి. ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నిక.. కేసీఆర్ కు ముచ్చటగా మూడో సారి తెలంగాణ ముఖ్యమంత్రిగా అధికారం దక్కుతుందా? లేదా? అన్న విషయాన్ని తేల్చేసే పరీక్షగా మారింది. అయితే ఈ సారి మాత్రం ఆయన మాటల మాయలు సాగడం లేదనడానికి తార్కానాలు కనిపిస్తున్నాయి. ఆయన చేసి నిలుపుకోని వాగ్దానాలపై విపక్షాలే కాదు.. ప్రజలూ గళం ఎత్తుతున్నారు. కేసీఆర్ కేంద్రం డీజిల్, పెట్రోల్ ధరలను విపరీతంగా పెంచి ప్రజల నడ్డి విరిచిందని కేసీఆర్ విమర్శిస్తే.. వ్యాట్ తగ్గించి రాష్ట్ర ప్రజల భారాన్ని మీరే తగ్గించొచ్చుగా అని ప్రజలు నిలదీసే పరిస్థితి ఏర్పడింది. ధనిక రాష్ట్రం అని పదే పదే చెప్పుకుంటున్న కేసీఆర్ ప్రభుత్వోద్యోగుల జీతాలు ప్రతి నెలా మొదటి తేదీకి ఎందుకు ఇవ్వలేకపోతున్నారన్న ప్రశ్న ప్రజల నుంచే వినిపిస్తోంది. ఇక తాజా సంఘటన ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాలపై కేసీఆర్ బీజేపీపై విమర్శల బాణం ఎక్కుపెడితే..ప్రతి విమర్శల అస్త్రాలు సూటిగా వచ్చి కేసీఆర్ కే తగులుతున్నాయి. ఎందుకంటే కేసీఆర్ తమ పార్టీ ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తోందని కేసీఆర్ ఆరోపిస్తే విపక్షాలే కాదు జనం సైతం ఆ అమ్ముడుపోవడానికి సిద్ధపడిన ఎమ్మెల్యేలలో ముగ్గురు ఏ పార్టీ నుంచి శాసనసభకు ఎన్నికయ్యారని అడుగుతున్నారు. కేసీఆర్ ఇరత పార్టీల వారిని ఆకర్షిస్తే ఆపరేషన్ ఆకర్ష్.. అదే పని ఇతర పార్టీ వారు చేస్తే కొనుగోలూనా అని నిలదీసే పరిస్థితి మునుగోడులో ఉందని పరిశీలకులు అంటున్నారు. ఇక తెలంగాణలో పండిన ధాన్యం కొనుగోలుకు ముందుకు రాని కేంద్రం.. ఎమ్మెల్యేల కొనుగోలుకు వచ్చింది అని కేసీఆర్ విమర్శిస్తే.. కొనుగోలు కోసం వారు తీసుకు వచ్చిన సొమ్ము ఏది? సోమ్ము కనిపించకుండా ఉత్తుత్తి ఆరోపణలు చేస్తే సరిపోతుందా అన్న ప్రశ్నలు ఎదురు వస్తున్నాయి.  ఒక వేళ బీజేపీ జంప్ జిలానీలను ప్రోత్సహించడానికి చేసిన ప్రయత్నం నిజమే అయానా.. అది కేసీఆర్ నేర్పిన విద్యయే కదా అని జనం చర్చించుకుంటున్నారు. అందుకే ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల వ్యవహారం టీఆర్ఎస్ కు అనుకున్నంతగా ప్లస్ కాలేదని పరిశీలకులు అంటున్నారు. ఎంత హడావుడి చేసినా, ఎన్ని ఆరోపణలు చేసినా ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల వ్యవహారం టీఆర్ఎస్ కే బూమరాంగ్ అయినట్లుగా కనిపిస్తోందని చెబుతున్నారు.  మొత్తం మీద లాజిక్కు లేని కేసీఆర్ మాటలన్నీ డమ్మీ తూటాలేనని తేలిపోవడం తోనే మునుగోడు ఉప ఎన్నిక లో కేసీఆర్ కు పెద్దగా శుభ శకునాలు కనిపించడం లేదని విమర్శకులు అంటున్నారు. అదే సమయంలో ఢిల్లీ లిక్కర్ స్కాంలో సొంత మనుషులు ఆరోపణలు ఎదుర్కొవడంతో కేసీఆర్ దిక్కు తోచని స్థితిలో మునుగోడు ప్రచారాన్ని గాలికి వదిలేశారని పార్టీ వర్గాలే అంటున్నాయి. మొత్తం మీద ఉప ఎన్నికలు కేసీఆర్ కు పెద్దగా అచ్చి వచ్చినట్లు లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. హుజూరాబాద్ ఫలితం మరోసారి రిపీట్ అవుతుందా అన్న అనుమానాలు పరిశీలకులలోనే కాదు.. పార్టీ శ్రేణుల్లోనూ వ్యక్తమౌతున్నాయి. 

మాజీ మంత్రి నారాయణ బెయిల్ రద్దు

టెన్త్ క్లాస్ ఎగ్జామ్ పేపర్స్ లీక్ కేసులో నారాయణపై చిత్తూరు పోలీసులు కేసు నమోదు చేయడం తెలిసిందే. ఈ కేసులో  ఆయన్ను గత ఏప్రిల్ లో అరెస్టు చేయగా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఆ బెయిల్ రద్దుచేయాలని చిత్లూరు జిల్లా వన్ టౌన్ పోలీసులు అదనపు జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.  దీనిపై విచారణ చేపట్టిన న్యాయ స్థానం సోమవారం  నారాయణ బెయిల్ ను రద్దు చేసింది.  గతేడాది ఏప్రిల్ లో చిత్తూరు జిల్లా నెళ్లేపల్లి హైస్కూల్లో టెన్త్ తెలుగు ప్రశ్నాపత్రం వాట్సాప్ ద్వారా లీకయింది.  అప్పట్లో ఈ కేసులో పోలీసులు 8 మందిని అరెస్ట్ చేశారు. రాష్ట్రంలో ఈ కేసు కలకలం రేపింది. దీనికి వెనుక మాజీ మంత్రి నారాయణ పాత్ర ఉన్నట్టు జిల్లా పోలీసులు ఆరోపిస్తూ కేసు నమోదు చేశారు.  ఆయన్ను కోర్టుకు హాజరుపర్చగా 2014లోనే నారాయణవిద్యాసంస్థల అధినేత బాధ్యతలనుంచి తాను తప్పుకున్నారని ాయన తరఫు న్యాయవాదులు కోర్టెకు తెలిపారు. అప్పుడు ఆయనకు ఇచ్చిన బెయిల్ ఇప్పుడు జిల్లా 9వ అడిషనల్ కోర్టు రద్దుచేసింది. 

బీజేపీ, టీఆర్ఎస్ లక్ష్యం కాంగ్రెస్సే.. మునుగోడు డ్రామా అందుకేనా?

బీజేపీ, టీఆర్ఎస్ ల లక్ష్యం హస్తం పార్టీయేనని మరో సారి తేటతెల్లమైపోయింది. బీజేపీకి టీఆర్ఎస్ బీ టీమ్ అని తెలుగు వన్ ఎప్పుడో చెప్పింది. తాజాగా బీజేపీ ప్రచార సరళి తెలుగువన్ నాడే చెప్పిన విషయం వాస్తవమేనని రూఢీ చేసింది. ఇంతకే విషయమేమిటంటే..? మునుగోడు ప్రచారంలో బీజేపీ కొత్త పుంతలు తొక్కింది. ప్రచారంలో కొత్త ఎత్తుగడలు, వినూత్న పోకడలను తప్పుపట్టాల్సిన పని లేదు. ప్రజలను ఆకర్షించడమే లక్ష్యంగా పార్టీలు ప్రచారం చేసుకుంటాయి. తప్పులేదు. కానీ బీజేపీ తన ప్రచారం కోసం కాంగ్రెస్ నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్సార్ ను పోలిన మనిషిని.. అంటే డూప్ ను తీసుకువచ్చింది. ఆ వ్యక్తి పూర్తిగా వైఎస్సార్ వేషధారణలో.. వైఎస్సార్ ను అనుకరిస్తూ.. ఆయన గొంతును ఇమిటేన్ చేస్తూ బీజేపీ తరఫున ప్రచారం చేస్తున్నారు. వైఎస్సార్ ను రంగంలోకి దింపడం ద్వారా అంటే ఆయనను పోలిన వ్యక్తిచేత ఆయనను అనుకరిస్తూ, గొంతును మిమిక్రీ చేస్తూ ప్రచారం సాగిండం ద్వారా బీజేపీ తన ప్రధాన ప్రత్యర్థి తెరాస కాదు.. కాంగ్రెస్ పార్టీయేనని మరోసారి రుజువు చేసింది. ఎందుకంటే.. మునుగోడులో ప్రధానంగా బీజేపీ- టీఆర్ఎస్ ల మధ్యే పోటీ జరుగుతోందని అంటున్నారు. ఇరు పార్టీలూ కూడా పరస్పర విమర్శలు, దూషణలు, ఆరోపణలతో చెలరేగిపోతున్నాయి. అయితే ఇదంతా పైపైకే.. తెర వెనుక జరుగుతున్న రాజకీయం పూర్తిగా వేరు. మునుగోడులో బీజేపీ టీఆర్ఎస్ లో విజయం కోసం పోరాడుకోవడం లేదనీ ఇరు పార్టీలూ కలిసి కాంగ్రెస్ కు దెబ్బకొట్టే యత్నంలో నిమగ్నమై ఉన్నాయనీ పరిశీలకులు అంటున్నారు. తెలుగువన్ ఈ విషయాన్ని చాలా కాలం కిందటే.. అంటే తెరాసను భారాసగా మారుస్తూ కేటీఆర్ నిర్ణయం తీసుకున్న మరుసటి రోజే వెల్లడించింది. బీజేపీ బీ టీమ్ బీఆర్ఎస్  అన్న శీర్షికన వార్తా కథనంలో బీజేపీకి టీఆర్ఎస్ బీ టీమ్ అన్న విషయాన్ని తేటతెల్లం చేసింది.  ఇప్పుడు తాజాగా బీజేపీ వైఎస్ఆర్ ను పోలిన వ్యక్తి చేత ఆ నాయకుడిని అనుకరిస్తూ చేయించిన ప్రచారం ఈ విషయాన్ని మరో సారి నిర్ద్వంద్వంగా తేటతెల్లం చేసింది. ఎందుకంటే. . అసలు మునుగోడు ఉప ఎన్నిక లో  టీఆర్ ఎస్, బీజేపీల మధ్య. ఇక్కడ కాంగ్రెస్ మూడో స్థానంలో ఉందని ప్రతి సర్వే విస్పష్టంగా తేల్చేస్తోంది.   ఈ పరిస్థితుల్లో చిత్రంగా బీజేపీ కాంగ్రెస్ మహానేత వాయిస్ ను ప్రచారానికి  ఉపయోగించుకోవడం కాంగ్రెైస్ ను ఇక ఎంత మాత్రం పుంజుకోకుండా చేయాలన్న లక్ష్యమే కనిపిస్తోంది.   నిజంగా టీఆర్ఎస్ ను ఓడించాలన్న లక్ష్యంతో బీజేపీ ఉంటే.. ప్రచారానికి కాంగ్రెస్ నాయకుడి వాయిస్ ను కాకుండా.. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వాయిస్ ను మిమిక్రీ చేయిస్తూ ఆ పార్టీపై సెటైర్లు విమర్శలు గుప్పించాలి. కానీ అందుకు భిన్నంగా బీజేపీ వ్యవహరించింది. ఇదే బీజేపీ- టీఆర్ఎస్ ల మధ్య లోపాయికారీ ఒప్పందాన్నీ, ఒడంబడికను, అవగాహననూ ఎత్తి చూపుతోందని పరిశీలకులు అంటున్నారు. అక్టోబర్6వ తేదీన తెలుగువన్ తన వార్తా కథనంలో తెరాస, బీజేపీల మధ్య రహస్య ఒప్పందాన్ని ఎండగట్టింది.  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మంచి మిత్రులు. అక్కడ ఆయన, ఇక్కడ ఈయన ముచ్చటగా మూడవసారి ఎన్నికల్లో గెలిచి ఇద్దరూ హ్యాట్రిక్ సాధించేందుకు, వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.  వ్యూహాత్మక వైరాన్ని ప్రదర్శిస్తున్నారు. నువ్వు కొట్టినట్లు చేయి నేడు ఏడ్చినట్లు చేస్తాను అన్న రీతిలో వ్యవహరిస్తున్నారు. ఇద్దరి మధ్య ఏదో భీకర యుద్ధం సాగుతోందనే భ్రమలు కలిపించేందుకు, అటు నుంచి ఇటు నుంచి అటు ఉభయ పక్షాలూ ఒకరిపై ఒకరు మాటల తూటాలు సంధించుకుంటున్నారు. ప్రజలను మోసం చేస్తున్నారు. ఇది ప్రత్యర్ధి పార్టీలు చేసే ఆరోపణ అనిపించినా, కాదు. నిజం.    ఇప్పడు మరోసారి అదే విషయం తేట తెల్లంగా తెలిసిపోయింది. విజయ దశమి పండగ పూట కేసీఆర్, తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారతీయ రాష్ట్ర సమితిగా మార్చారు. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దే దించేందుకే కేసేఆర్ ప్రాంతీయ పార్టీ పేరు మార్చి జాతీయ పార్టీగా ప్రకటించుకున్నారు. మోడీ గుజరాత్ మోడల్ కు కేసేఆర్ తెలంగాణ మోడల్ ఒక్కటే ప్రత్యామ్నాయం అంటూ చాలా కాలంగా ప్రచారం కూడా జరుగుతోంది.  కానీ, ఇంతా చేసి చివరకు జాతీయ పార్టీ ప్రకటన తర్వాత, ఆయన తమ జాతీయ పోరాటం గుజరాత్ నుంచి కాదు  మహారాష్ట్ర, కర్ణాటక నుంచి ప్రారంభ మవుతుందని ప్రకటించారు. నిజానికి, కర్ణాటక, మహా రాష్ట కంటే ముందుగా గుజరాత్ అసెంబ్లీకి మరో రెండు నెలల్లోనే ఎన్నికలు జరగనున్నాయి. కేసీఆర్ నిజంగా మోడీని, గుజరాత్ మోడల్ ను  వ్యతిరేకించడమే నిజం అయితే, ముందుగా ఆయన తమ జాతీయ పోరాటాన్ని గుజరాత్ నుంచి  ప్రారంభిచాలి. కానీ, అయన అసలు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రస్తావనే తీసుకురాలేదు. దీని భావమేమి చంద్రశేఖర అంటే సమాధానం రాదు.  నిజానికి కేసేఆర్ జాతీయ రాగం ఎత్తుకున్నదే  కేంద్రంలో మళ్ళీ మరో సారి మోడీని గెలిపించెందుకే అని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పదే పదే చెపుతున్న విషయం తెలిసిందే. అంతే కాదు కేసీఆర్ మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీని బలహీన పరిచేందుకు కాంగ్రెస్ మిత్ర పక్షాలను ఏకంచేసి దిశగా ప్రయత్నాలు సాగిస్తునారు. తమిళ నాడులో కాంగ్రెస్ మిత్ర పక్షంగా అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన డిఎంకే అధినేత ఆ ర్రాష్ట ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ను కలిశారు. కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేద్దాం రమ్మని ఆహ్వానించారు.  అలాగే, మహారాష్ట్రలో కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన కూటమిలోని శివసేన, ఎన్సీపీలను కాంగ్రెస్ నుంచి విడదీసే ప్రయత్నం చేశారు. జార్ఖండ్ లోనూ కాంగ్రెస తో కలిసున్న ఝార్ఖండ్ ముక్తి మోర్చా ( జేఎంఎం) ను థర్డ్ ఫ్రంట్ లోకి తెచ్చే ప్రయత్నం చేశారు. ఇలా చెప్పుకుంటూ పొతే కేసేఆర్ థర్డ్ ఫ్రంట్ ఆలోచన కాంగ్రెస్ ను బలహీన పరిచి బీజేపీని బలపరిచేందుకు చేసిన కుట్ర. సరే ఆ ప్రయత్నం ఫలించ లేదనుకోండి అది వేరే విషయం.  ఆ ప్రయత్నం విఫలమైంది కాబట్టే ఇప్పుడు జాతీయ పార్టీ పేరున తక్షణం అసెంబ్లీ ఎన్నికలు జరిగే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్టాలను వదిలేసి బీజేపీ వ్యతిరేక ఓటును చీల్చేందుకు కర్ణాటక,మహారాష్ట్రలను ఎంచుకున్నారు. అంత వరకు ఎందుకు గడచిన ఎనిమిది సంవత్సరాలలో  తెలంగాణలోనే కాంగ్రెస్, తెలుగుదేశం, వైసీపీ, సిపిఐ, పార్టీలకు చెందిన 40 మందికి పైగా ఎమ్మెల్యేలను ఇద్దరు ఎంపీలను ప్రలోభాలకు గురి  చేసి గోడ దూకించిన కేసీఆర్, బీజేపే వైపు మాత్రం కన్నెత్తయినా చూడలేదు. సో ... అనుమానం లేకుండా కేసీఆర్ తెర తీసిన భారతీయ రాష్ట్ర సమితి బీఆర్ఎస్, నిజానికి భారతీయ జనత పార్టీ  (బీజేపీ) బీ టీమ్.  ఇది కూడా ఆరోపణ కాదు నిజం అంటున్నారు. అందుకే, అందరి మీదకు ఒంటికాలు మీద లేచే సిబిఐ, ఈడీ తెలంగాణకు వచ్చే సరికి వట్టి ఊపులే తప్ప గట్టి  చర్యలు తీసుకోవడం లేదని పరిశీలకులు సైతం అంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ నాయకుడు, దివంగత వైఎస్సార్ ను పోలి ఉన్న వ్యక్తితో మునుగోడులో ఎన్నికల ప్రచారానికి టీఆర్ఎస్ దిగడంతోనే టీఆర్ఎస్ లక్ష్యం బీజేపీ కాదన్న సంగతి తేటతెల్లమైపోయింది. కవితకు లిక్కర్ స్కామ్ లో ఆరోపణల సెగ తప్ప, ఆప్ నాయకుడు, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను విచారించినట్లుగా విచారించడానికి సీబీఐ, ఈడీలు ముందుకు రాకపోవడమే తార్కానం. 

త్వరలో  జగనన్నతో చెప్పుకుందాం..!

ప్రజలను ఆకట్టుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నానాతంటాలు పడుతున్నారు. ప్రజోపయోగ పనులుచేసి వారి మనసులు గెలుచుకోవాలసిన నాయకుడు మూడేళ్లు దాటినా ప్రజల నుంచి నిర సనలు, ఛీత్కారాలేఎదుర్కొంటున్నారు. ప్రజలు విసిగెత్తి ఈయన దిగిపోతే బావుణ్ణనే అనుకుం టున్నారు. కానీ చిత్రంగా సీఎం జగన్ మాత్రం చిరునవ్వుతో ఇంకా ప్రజల్ని తన వేపు ఆకట్టకునే మార్గాల అన్వేషణలోనే ఉన్నారు. ఇప్పుడు ఆయనకు తాజాగా మెరుపు లాంటి ఆలోచన తట్టింది. దాని పేరు జగనన్నకు చెబుతాం.. త్వరలో ప్రారంభిస్తారని ఆయన కార్యాలయం ప్రకటించింది. నిజానికి ఈ కార్యక్రమం నవంబర్ 2న ఆరంభించాలి. కానీ మౌలిక సదుపాయాల కల్పనలో రవ్వంత జాప్యం కారణంగా వెనుకబడిందని అధికారులు చెబుతున్నారు.  జగన్కు హఠాత్తుగా వచ్చిన ఆలోచన ఆయనకు కొత్తేమోగాని ప్రజలకు కొత్తకాదు. జనవాణి వంటి కార్యక్రమమే ఇది. గతంలో చంద్రబాబానాయుడు ప్రభుత్వంలో ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడా నికి అప్పట్లో ఒక కార్యక్రమం అమలు చేశారు. దానికి ప్రత్యేకంగా 1100 అనే ఫోన్ నంబర్ కూడా ఉండేది. ప్రజలు తమ సమస్యల్ని నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయానికి తెలియజేయడానికి ఎంతో వీలుండేది. దాన్ని ప్రజలంతా మరీ అవసరమయి నపుడు వినియోగించుకున్నారు. అన్ని రాష్ట్రాలవారూ ప్రశం సించిన కార్యక్రమం. ఇప్పుడు జగనన్న అదే పంధాను అనుస రించడానికి జగన న్నకు చెబుతామని పేరు కొత్తగా పెట్టుకున్నారంతే.  వాస్తవానికి దీనికి మరో స్పూర్తి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరంభించిన దీదీ కో బోలో.  అంచేత కాపీ నుంచీ మరో కాపీ అంటే పెద్ద జిరాక్స్.  అయితే ఈ జిరాక్స్ కూడా వీలయినంత ఆలస్యమే చేశారనాలి. పాలనాపరంగా ప్రజల నుంచి వ్యతి రేకత, విముఖత రావడం, తనకు కుర్చీ మిగిలే అవకాశం పోయే పరిస్థితులు ఏర్పడిన తర్వాతనే దీన్ని ఆరంభించడం చిత్రం. ఎవరన్నా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోమంటారు. అధికారంలోకి రాగానే విపక్షాల మీద విరుచుకుపడటం మానేసి ఇలాంటి కార్యక్రమం అమలు చేసి ఉంటే ప్రజల నుంచి సూచనలు సలహాలు కోకొల్లలే వచ్చేవి. కానీ అప్పట్లో సీఎం జగన్ స్పందన కార్యక్రమం పెద్దగా జనాల్లోకి వెళ్లలేదు.  ఏమయినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో జగనన్నా నాకు ఎంతో కష్టమొచ్చిందని ఏ ప్రాంతం వారు తమ ఆర్తిని వెళ్లగక్కుకుంటారో చూడాలి. ఎందుకంటే రాష్ట్రం అన్ని ప్రాంతాల్లోనూ వైసీపీ నాయ కులు, ఎమ్మెల్యేలు, మంత్రులు జల్లెడ పట్టినట్టు తమ పాలన గురించి అభిప్రాయ సేకరణకు, తమ నాయకుడిని భజన చేయాలని చెప్పడానికి తిరిగి తిరిగి వేసారి రాజ నివాసానికి చేరుకున్నారు. ఇప్పుడు అర్జంట్ గా ఈ బ్రహ్మాస్త్రంతో వచ్చి పడే లబ్ధి మాత్రం శూన్యమే అనాలి.  పక్కనున్న రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీ ఆర్ దేశాన్ని ఏలడానికే ఆలోచిస్తూ దారులు వేసుకోవడానికి ప్రయత్నిస్తు న్నారు. ఇటు ఉన్నదాన్ని చెడగొట్టుకుని మళ్లీ కొత్త కార్యక్రమం టార్చితో దారిని వెతుక్కో వడంలో పడటమే ప్రజలకు గొప్ప కామెడీ అనిపిస్తుంది. కేవలం ఫోన్ నెంబర్ మార్చినంత మాత్రాన ప్రజలు చంద్రబాబుతో సంప్రదించినంత నమ్మకంతో జగన్ ని సంప్రదిస్తారా? అవకాశమే లేదని విశ్లేషకుల మాట. ప్రజల కోసం, ప్రజల మాట వినాలనే 2019లో అధికారంలోకిరాగానే స్పందన అనే కార్యక్రమం ఆరంభించారు. కానీ దానికి వాస్తవానికి అనుకున్నంత స్పందనయితే రాలేదు. కేవలం ప్రచారంలో కొట్టుకుపోయింది. ప్రజలు తమ అభిప్రాయాలు, సూచనలు ఇ మెయిల్, ఫోన్ ద్వారా తెలి యజేయడానికి వీలుంటుదని సీఎం కార్యాలయం తెలియజేసింది. వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి సమ యంలో ప్రజా దర్బార్ ఉండేది. అప్పట్లో అది విజయవంతమయింది. కానీ జగన్ వచ్చిన తర్వాత ఆ కార్య క్రమానికి ఆదరణ లేదు.  ఇప్పుడు ఎన్నికలు ముంచుకువస్తున్నాయి గనుక ముందే తేరుకుని ఇలాంటి కార్యక్రమాలతో ప్రజలతో నేరుగా మాట్లాడి నేనే మీకు సేవకుడిని నా తప్పులు కాయండి అంటూ బతిమాలి బామాలి మళ్లీ అధి కారంలోకి రావాడానికి ఇదో మార్గంగా పెట్టుకున్నారనే అనుకోవాలి. ఎందుకంటే ప్రత్యేకించి, పనిగట్టు కుని జగనన్నకు చెప్పుకోవడానికి ప్రజలకు ప్రత్యేకించి సమస్యల కంటే ప్రధాన సమస్య పాలనాపర సమస్యే ఉంది. అంటే సీఎంతోనే వారికి సమస్య అయినపుడు ఇక ఆయనకు ప్రజలు ఫోన్ చేసి ప్రత్యేకించి విన్నవించుకునేదేముంటుంది? మూడు రాజధానులతో ప్రజల్లో విభేదాలు తలెత్తి, రైతుల పాదయాత్రను అడ్డుకోవడంలో పోలీసు బలగాన్ని, రాజకీయ చతురతను ప్రదర్శించడంలో అవమా నాలు పాలయిన ప్రభువుకి ప్రజలు ఏం చెప్పుకుంటారు. ఓక్క ముక్కలో చెప్పాలంటే పాలకుడే పెను సమస్య అయినపుడు ప్రజలు విన్నవించుకునేదేముంటుంది.. ఎవరికి విన్నవించుకోవాలి.. కేవలం ఓటుతో బుద్ధి చెప్పడం తప్ప. 

పీకే రిపెంట్స్.. జగన్ తో చేరి తప్పు చేశా

వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చేలా సాయం చేసి, తాను చాలా పెద్ద తప్పు చేశానని ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. 2019లో వైసీపీ అఖండ మెజారిటీతో గెలిచే దిశగా నడిపించడంలో ప్రశాంత్ కిశోర్ వ్యూహాలు బాగా పనిచేశాయనే చెప్పొచ్చు. 2014లో నరేంద్ర మోడీని దేశ ప్రధానిగా చేయడంలో, ఆ తర్వాత బీహార్ లో నితిశ్ కుమార్ ను సీఎంను చేయడంలో ప్రశాంత్ కిశోర్ వ్యూహాలు చాలా వరకూ దోహదం చేశాయంటారు. జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీల మహాకూటమి ఏర్పాటయ్యేలా చేసిన ప్రశాంత్ కిశోర్ దాన్ని విజయపథంలో నడిచేలా వ్యూహాలు రచించారు. తర్వాత ఢిల్లీలో ఆప్ సర్కర్, పంజాబ్ లో కెప్టెన్ అమరీందర్ సింగ్ విజయం సాధించేలా తోడ్పాటు అందించారు. కాగా.. ప్రశాంత్ కిశోర్ ఏపీలో వైఎస్ జగన్ అధికారంలోకి రావడానికి సహకరించి తప్పుచేశానని ఇప్పుడు పశ్చాత్తాపం వ్యక్తం చేయడం గమనార్హం. జగనే కాకుండా నితిశ్ కుమార్ కు కూడా సహకరించడం తప్పే అని ఇప్పుడు తాపీగా బాధపడుతున్నాడు ఈ ఎన్నికల వ్యూహకర్త.  వారిద్దరి కోసం కాకుండా  భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి పునరుజ్జీవం కల్పించేందుకు కృషి చేసి ఉండాల్సిందని ఇప్పుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. . రాజకీయాల్లో మార్పు కోసం అంటూ ప్రశాంత్ కిశోర్ ‘జన్ సురాజ్’ పేరుతో జాతిపిత మహాత్మాగాంధీ జయంతి రోజున పశ్చిమ చంపారన్ జిల్లాలోని భితిహర్వా నుంచి 3 వేల 500 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తున్నారు. మహాత్మా గాంధీ కూడా 1917లో ఇక్కడి నుంచి తొలి సత్యాగ్రహ ఉద్యమం ప్రారంభించారు. ప్రశాంత్ కిశోర్ పాదయాత్ర లౌరియా చేరుకున్న సందర్భంగా మాట్లాడుతూ.. జగన్, నితిశ్ కుమార్ కు సహకరించడం తప్పే అని అంగీకరించారు. బీజేపీని అర్థం చేసుకోకుండా దాన్ని ఓడించడం కష్టం అని విపక్ష కూటమికి ప్రశాంత్ కిశోర్ ఓ సూచన కూడా చేయడం గమనించాలి. కాఫీ కప్పులో ఉండే పై నురగ మాత్రమే బీజేపీ అని.. దాని కింద ఉండే అసలైన కాఫీ మొత్తం ఆరెస్సెస్ అంటున్నారు ప్రశాంత్ కిశోర్. సామాజిక వ్యవస్థలోకి చొచ్చుకుపోయిన ఆరెస్సెస్ ను ఓడించడానికి దగ్గర దారులేవీ లేవనే తత్వం బోధపడిందంటున్నారు. కాంగ్రెస్ కు పునరుజ్జీవం పోయడం ద్వారా మాత్రమే గాడ్సే సిద్ధాంతాన్ని ఓడించవచ్చని తనకు చాలా ఆలస్యంగా అర్థమైందంటున్నారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్, బీహార్ సీఎం నితీశ్ కుమార్ల లక్ష్యాలు నెరవేరేందుకు ప్రశాంత్ కిశోర్ సాయపడ్డారు. ఆ తర్వాత వైసీపీ ప్లీనరికీ ప్రశాంత్ కిశోర్ హాజరవడం అందరినీ ఆశ్చపరిచిందనే చెప్పాలి. వైసీపీ అధికారం చేపట్టాక కూడా పలు సందర్భాల్లో జగన్ తో ప్రశాంత్ కిశోర్ సమావేశమయ్యారు. ప్రశాంత్ కిశోర్ ఏర్పాటు చేసిన ఐప్యాక్ బృందం ఇప్పుడు కూడా వైసీపీకి రాజకీయంగా సేవలు అందిస్తోంది. అయితే.. ఇప్పటి ఐప్యాక్ తో ప్రశాంత్ కిశోర్ కు సంబంధాలు లేవు. ఈ నేపథ్యంలో 2019లో వైసీపీకి రాజకీయ వ్యూహకర్తగా అందించిన సేవలపైన ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యలు చేయడం పొలిటికల్ వర్గాల్లో తీవ్రంగా చర్చకు దారితీస్తోంది. ప్రశాంత్ కిశోర్ 2013లో ‘సిటిజెన్స్ ఫర్ అకౌంటబుల్ గవర్నెన్స్’ను స్థాపించారు. 2014 మేలో జరిగిన సార్వత్రిక ఎన్నికలకు సన్నాహకంగా ఏర్పాటు చేసిన ఈ మీడియా ప్రచార సంస్థను తర్వాత ‘ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ- ఐప్యాక్’గా మార్చారు. ఈ క్రమంలో 2017లో ప్రశాంత్ కిశోర్ ను వైఎస్ జగన్ తన రాజకీయ సలహాదారుగా నియమించుకున్నారు. వైసీపీ తరఫున ప్రశాంత్ కిశోర్ ‘సమర శంఖారావం’ పిలుపు, ‘ప్రజా సంకల్ప యాత్ర’ లాంటి ప్రచార కార్యక్రమ వ్యూహాలు రచించారు. ప్రశాంత్ కిశోర్ నేతృత్వంలోని ఐప్యాక్ సంస్త సేవల కారణంగా వైసీపీ 2019 ఎన్నికల్లో 151 స్థానాల్లో గెలుపు సాధ్యమైంది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి 2021లో జరిగిన ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరఫున, తమిళనాడులోని డీఎంకే పార్టీకి కూడా ప్రశాంత్ కిశోర్ ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించారు. ఆ తర్వాత ఇకపై తాను రాజకీయ వ్యూహకర్తగా ఉండబోనని ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ముఖాముఖీలో ఆయన తెలిపారు. తాను వ్యూహాలు రచించేందుకు ఒప్పుకున్న పార్టీకి ప్రత్యర్థి పార్టీల కదలికలు, వాటి వ్యూహాలను పసిగట్టడం, ప్రతి వ్యూహాలు రచించడంలో ప్రశాంత్ కిశోర్ దిట్ట. తనను నమ్ముకున్న పార్టీ బలహీనతను కూడా బలంగా మార్చి చూపించడంలోనూ నేర్పరి. జగన్ తమకు అప్పగించిన పనిని ఏపీలో ప్రశాంత్ కిశోర్ టీమ్ ఐప్యాక్ నూటికి నూరు శాతం సక్సెస్ చేసిందనే చెప్పాలి. ఏపీలో తమకు అఖండ విజయం అందేలా వ్యూహాలు పన్నిన ప్రశాంత్ కిశోర్ నేతృత్వంలోని ఐప్యాక్ కు వచ్చే ఎన్నికల్లో కూడా చాన్స్ ఇవ్వాలని జగన్ భావించారట. కానీ ప్రశాంత్ కిశోర్ వ్యూహాలు వేరేలా ఉన్నాయి. నిరంతరం ఎన్నికల వ్యూహాల రచనలో ఆరితేలిన ప్రశాంత్ కిశోర్ కు నేరుగా ప్రభుత్వానికి సాయం చేసే పని కొత్త కావడంతో జగన్ మాట కాదన్నారు. జగన్ మాటను తిరస్కరించినప్పటికీ.. ఐప్యాక్ లోని దినేష్ నేతృత్వంలోని ఒక బృందం వచ్చే ఎన్నికల్లో వైసీపీ కోసం పనిచేస్తోంది. ఈ క్రమంలో ప్రతి ఎమ్మెల్యే వెంట ఒక ఐప్యాక్ సభ్యుడిని పరిశీలకుడిగా పంపిస్తోంది. ఈ బృందం వద్ద ఉన్న ప్రతి అంశాన్నీ జగన్ కు ఎప్పటికప్పుడు అందజేస్తోంది. ఇలా జగదీష్ బృందం ప్రశాంత్ కిశోర్ కు షాక్ ఇచ్చింది. వైసీపీకి తమ తోడ్పాటు ఇవ్వకూడదని గురువైన తన మాటను కాదని దినేష్ టీం ‘పీకే కార్పొరేట్ సొల్యూషన్స్’ పేరుతో పనిచేయడంతో ప్రశాంత్ కిశోర్ అహం దెబ్బతిన్నదని చెబుతున్నారు. ప్రశాంత్ కిశోర్ అప్పుడు జగన్ కు సాయపడి తప్పు చేశానని ఇప్పుడు చెప్పుకోవడం వెనుక ఇంకా పెద్ద కథ ఏదో ఉండవచ్చని రాజకీయ విశ్లేషకుల అంచనా.

బ్యాగులో రహస్యం బట్టబయలు!

బ్యాగులో పుస్తకాలు పెట్టుకుంటారు, బ్యాగులో దుస్తులు పెట్టుకుంటారు. బ్యాగులో పాముల్లాంటి జాబితాను పెట్టుకు తిరుగుతున్నది మాత్రం బీజేపీ వారే. ఆ బ్యాగులోంచి పెద్ద కాయితాల దొంతర లాగితే ఏకంగా తెలంగాణా నుంచి బీజేపీలోకి జంప్ జిలానీల జాబితానే బయటపడిందిట పోలీసులకు. ప్రస్తుతం తెలంగాణా ప్రతిష్టను దెబ్బతీసిన ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం జంప్ జిలానీల సంఖ్య కొండవీటి చాంతాడంత  ఉందంటూ ఆ జాబితాలో బయటపడటంతో మరింత ఆసక్తి కరంగా మారింది. టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలను అమాంతం తమ వేపు లాక్కోవడానికి కమలనాథులు వేసిన వలలో చిక్కి కండువా మార్చడానికి, కారు వదిలేసి కాషాయం కప్పుకోవడానికి రెడీగా ఉన్నారంటూ బీజేపీ పెద్ద జాబితానే సిద్ధం చేసింది. మొన్న కేసులో దొరికిన ముగ్గురు నిందితులు మొయినా  బాద్ ఫామ్ హౌస్ కి వారిలో ఒకరయిన నందకుమార్ వచ్చిన కారులో నే వచ్చారు. కానీ అందులో డబ్బులు ఉన్నా యన్న అనుమానాలు వ్యక్తం అయినప్పటికీ పోలీసులు మాత్రం అందులోంచి పెద్ద జాబితానే బయటకు లాగారు. ఆ జాబితా ప్రకారం టీఆర్ ఎస్, కాంగ్రెస్ పార్టీల కు చెందిన 50 మంది ఎమ్మెల్యేలు, వీరుగాక మరో 119 మంది తెలంగాణా రాజకీయ నాయకుల పేర్లు ఉన్నాయన్నది బయటపడింది.   27 కాయితాలలో  తెలంగాణా సమస్యలతో పాటు పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్న వారి పేర్లతో సహా ఉందంటున్నారు పోలీసులు. ఈ మెటీరియల్, ఒక డైరీ, ఒక లాప్ టాప్ కూడా   స్టింగ్ ఆఫరేషన్ జరిగిన మొయినాబాద్ ఫామ్హౌస్లోనే   వేరు వేరు బ్యాగుల్లో లభించిందని పోలీసులు ఏసిబీ కోర్టుకు తెలియ జేశారు. డాక్యుమెంట్లు ఒక పేపర్ కవర్లో ఉన్నాయి. అవి కూడా నందకుమార్, బీజేపీ మధ్య సంబం ధాలను తేటతెల్లం చేస్తున్నాయి. ఇవేగాకుండా, పోలీసు అధికారులకు ఒక డైరీ లభించింది. అందులో రామచంద్ర భారతి ప్రయాణాల గురించిన సమాచారం పొందుపరిచి ఉందిట.  ఢిల్లీ నుంచిహైదరాబాద్ కి రావడం, ఇక్కడ అపాయింట్మెంట్లు, సమావేశాలు ఎలా చేపట్టాలో  అంతా నందూ వ్యూహా త్మకంగా నిర్వహించడం గురించిన సమాచారం  అంతా వివరంగా ఉంది. అలాగే తమ పని అయిన తర్వాత ఢిల్లీ తిరిగి వెళ్లేంతవరకూ ఎలా ఉండాలి అన్నది మొత్తం వివరంగా రాసి ఉందిట. ఇక లాప్ టాప్ మాత్రం రామచంద్ర భారతీది అని తేలింది. అలాగే  రెండు వేరు వేరు బ్యాగులో సింహ యాజి, భారతీ దుస్తులు దొరికాయి.  ఇవే గాక, నలుగురు టీఆర్ ఎస్ ఎమ్మెల్యేల పై జరిపిన స్టింగ్ ఆప రేషన్ సంబంధించి స్పై కెమెరాలు, వాయిస్ రికార్డర్లు పోలీసులకు లభించాయి.  రోహిత్ రెడ్డి తమకు వంద కోట్లు ఆశచూపారని ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.  తమకు ముందే సమాచారం అందిందని దాని ప్రకారం సిటింగ్ ఎమ్మెల్యేలను పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారని, వారు హైదరాబాద్ లోనే ఉన్నారని వెంటనే అందుకు సమావేశం ఏర్పాటు చేయాలని, అపా యింట్మెంట్  కావాలని ఉంది. అంతకంటే ముందు వారిలో ముగ్గురు ముందుగా కొంత సొమ్ము ఆశిస్తు న్నారని, వారితో ఆ విషయంలో సంప్రదించడానికి సంతోష్ బీజేపీ అనే కాంటాక్ట్ ను తన ఫోన్ లో సేవ్ చేసుకున్నాడని ఆ సమాచారం స్పష్టంచేసింది.  ఇలాంటివే అనేక ఇతర ఎస్ఎంఎస్ మెసేజ్ లు నింది తుల ఫోన్లలో లభించాయని పోలీసులు తెలిపారు.

సీబీఐకి జనరల్ కన్సెంట్ రద్దు.. కవితకు లభించని ఊరట.. కేసీఆర్ మళ్లీ దెబ్బతిన్నారుగా?

తెలంగాణలో సీబీఐకు జనరల్ కన్సెంట్ రద్దు చేసింది టీఆర్ఎస్ సర్కార్ నిజానికి ఇందుకు సంబంధించిన జీవో ఆగస్టులోనే ఇచ్చినప్పటికీ..  ఇప్పుడు బయటపెట్టారు. ఇప్పటి దాకా గోప్యంగా ఉంచి ఇప్పుడు బయటపెట్టేందుకు కారణం కేసీఆర్ బిడ్డ, ఎమ్మెల్సీ కవిత  సీబీఐ విచారణ బోనులో నిలబడకుండా కాపాడుకోవడానికేనని రాజకీయ వర్గాలు అంటున్నాయి. అయితే కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రంలో సీబీఐకి జనరల్ కన్సెంట్ రద్దు చేయడానికి ముందే ఢిల్లీ లిక్కర్ స్కాం దర్యాప్తును సీబీఐ చేపట్టింది. ఆ కేసు దర్యాప్తులో భాగంగా తెలంగాణలో సోదాలు నిర్వహించింది. కవిత సన్నిహితుడు బోయనపల్లి అభిషేక్ రావును అరెస్టు చేసింది.   అప్పుడెప్పుడూ రాష్ట్రంలో సీబీఐకు జనరల్ కన్సెంట్ రద్దయ్యిందని బయటపెట్టని కేసీఆర్  సర్కార్   ఇప్పుడు దానిని బయటపెట్టడం వెనుక ఎమ్మెల్సీ కవితను సీబీఐ ఏ క్షణంలోనైనా విచారించే అవకాశం ఉందన్న భయమే కరణమని పరిశీలకులు అంటున్నారు. అయితే ఢిల్లీ లిక్కర్ స్కాం విషయంలో తెలంగాణలో మరిన్ని సోదాలను, కవిత సహా మరింత మంది విచారణను సీబీఐకి జనరల్ కన్సెంట్ నిరాకరిస్తూ తెలంగాణ సర్కార్ జారీ చేసిన జీవో ఇసుమంతైనా అడ్డుకోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ఢిల్లీలో నమోదైన లిక్కర్ స్కాం దర్యాప్తులో  భాగంగా  తెలంగాణలో ఎవరినైనా విచారించాల్సి వస్తే, కవితనైనా సరే .. ఆ   తెలంగాణ సర్కార్ తాజాగా  జారీ చేసిన ఉత్తర్వులు ఏ విధంగానూ ఆపజాలవు.  ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సీబీఐ కేసు కూడా ఢిల్లీలోనే నమోదైంది. ఆ కేసు మూలాలు తెలుగు రాష్ట్రాలలో  ఉన్నాయని దర్యాప్తు సంస్థ నిర్ధారించింది. దీంతో  తెలంగాణలో సీబీఐకి జనరల్ కన్సెంట్ రద్దు చేసినా ఏం ఫరక్ పడదు. సీబీఐ ఎప్పుడు కావాలంటే అప్పుడు తెలంగాణకు వచ్చి డిల్లీ లిక్కర్ స్కాం దర్యాప్తును కొనసాగించే అధికారం ఆ దర్యాప్తు సంస్థకు ఉంది. అలాగే దర్యాప్తులో భాగంగా కవిత సహా ఎవరిని విచారించాలనుకున్నా ఎలాంటి అడ్డంకులూ ఉండవు. వాస్తవానికి రాష్ట్రాలు సీబీఐకి జనరల్ కన్సెంట్ రద్దు చేసినంత మాత్రాన సీబీఐ ఆయా రాష్ట్రాలలో అడుగుపెట్టకుండా, దర్యాప్తు చేయకుండా ఆ రద్దు అడ్డుకోజాలవు.  దర్యాప్తు కొనసాగించాలని కోర్టులు ఆదేశిస్తే… రాష్ట్ర ప్రభుత్వాలు చేయగలిగింది ఏం ఉండదు. తెలంగాణ అందుకు మినహాయింపేమీ కాదు.  తెలంగాణ సర్కార్ జారీ చేసిన జీవో వల్ల మహా అయితే ఏం అవుతుందంటే.. రాష్ట్రంలోని కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పని చేస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై అవినీతి కేసు నమోదైతే.. ఆ వివరాలను సీబీఐ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించి.. రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తేనే దర్యాప్తులో ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. అయితే  రాజకీయ పరమైన కేసుల విచారణకు సీబీఐ కోర్టుకెళ్లి జీవోలు రద్దు చేయించుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. ఉదాహరణలుగా  . లాలూ ప్రసాద్ యాదవ్‌ ,  వీరభద్రసింగ్‌,   మధుకోడాల ఉదంతాలు ఉన్నాయి.   ఇక ఇప్పటి వరకూ తమ రాష్ట్రాలలో సీబీఐకి జనరల్ కన్సెంట్ రద్దు చేసిన రాష్ట్రాలలో తెలంగాణ 9వ రాష్ట్రంగా అవతరించింది. వాస్తవానికి జనరల్ కన్సెంట్ ఉంటే..  రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండానే ఏదైనా ఒక కేసు దర్యాప్తును ఆ రాష్ట్రంలో సీబీఐ చేపట్ట వచ్చును. ఈ జనరల్ కన్సంట్ ను రద్దు చేస్తూ  తెలంగాణ ప్రభుత్వం ఆగస్టు 30న జీవో జారీ చేసింది. ఈ జోవోను తెలంగాణ సర్కార్ శనివారం (అక్టోబర్ 29) బయటపెట్టింది. తెలంగాణ అడిషనల్ అడ్వొకేట్ జనరల్ ఈ విషయాన్ని హైకోర్టుకు తెలియజేయడంతో తెలంగాణ ప్రభుత్వం సీబీఐకి జనరల్ కన్సెంట్ ను రద్దు చేస్తూ జీవో రద్దు చేసిన సంగతి బయటపడింది. ఇది కూడా తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల విషయంలో సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలంటూ బీజేపీ దాఖలు చేసిన విచారణ సందర్భంగా అడిషనల్ అడ్వకేట్ జనరల్ (ఏఏజీ) రాష్ట్రంలో సీబీఐకి జనరల్ కన్సెంట్ ను రద్దు చేసిన విషయాన్ని కోర్టుకు తెలిపారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం జనరల్ కన్సెంట్ ను రద్దు చేసినా ఇప్పటికే నమోదైన కేసుల దర్యాప్తు విషయంలో సీబీఐ యథేచ్ఛగా ముందకు సాగే అవకాశం ఉంటుంది. అలాగే రాష్ట్ర బయట నమోదైన  కేసులలో జనరల్ కన్సెంట్ రద్దైన రాష్ట్రాలకు సంబంధించి వ్యక్తులు ఉంటే.. వారిని సీబీఐ విచారించడాన్ని ఆ రద్దు ఏ విధంగానూ అడ్డుకోలేదు. అంటే ఎమ్మెల్సీ కవితకు ఈ జనరల్ కన్సెంట్ రద్దు వల్ల ఎలాంటి ఊరటా లభించే అవకాశం లేదు. దీంతో తన బిడ్డను కాపాడుకోవడం కోసం కేసీఆర్ చేసిన ఈ ప్రయత్నం కూడా విఫలమైనట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

కేబుల్ బ్రిడ్జ్ ఆధునీకరణపైనే అనుమానాలు..140 కి చేరుకున్న మృతుల సంఖ్య

సాయింత్రాలు సరదాగా గడపడానికి పార్కులు, సినిమాలు సరేసరి. కానీ సరదాలు హఠాత్తుగా విషాదభరితంగా  మారు తుందని ఎవ్వరూ ఊహించరు. గుజరాత్ లో అదే జరిగింది. అక్కడి కేబుల్ బ్రిడ్జ్ ఉన్నట్టుండి అమాంతం నీటిలోకి కూలిపోయింది. ఈ సంఘటనలో  మరణించినవారి సంఖ్య 140కి చేరుకుంది. బ్రిటీష్ కాలంనాటి వంతెనను కొద్ది మాసాల క్రితం మరింత మెరుగులు దిద్ది బావుచేశారని చెబుతున్నారు. నాలుగురోజుల నుంచే వంతెన మీదకు సందర్శకులను అనుమతిస్తు న్నారు. ఈ సంఘటనలో 177 మందిని రక్షించగా, తీవ్ర గాయాలకు గురయిన 20 మందిని చికిత్సకు ఆస్పత్రికి తరలించారు. కాగా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఎన్డీఆర్ఎఫ్, ఫైర్ బ్రిగేడ్ వారు రంగంలోకి దిగారు.   కానీ కొంత భాగం ఇటీవలే ఆధునీకరించిన  వంతె ఈవిధంగా కూలిపోవడం పట్ల పర్యాటకులు విస్తు పోయారు. ఇది  ఎవరి లోపం అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బ్రిటీష్ కాలం నాటి వంతెనను ఆధునీ కరించిన  అధికారుల మీద అనుమానాలకు దారితీయిస్తోంది. పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటు న్న వంతెన పట్ల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారా అన్న అనుమానాలు, ప్రశ్నలు వినవస్తు న్నాయి. అయితే ఈ సంఘటనలో ప్రాణాలతో బయట పడినవారు మాత్రం కూలడానికి కారణం అల్లరిమూక లనే చెబుతున్నారు. వారు హఠాత్తుగా వంతెనపై ఆడుతూ విపరీతంగా ఊపడం వల్ల ఈ ప్రమాదం జరిగిందనే అంటు న్నారు. అయినప్పటికీ అంతమాత్రాన కూలిపోతుందని అనుకోవడానికీ వీలులేదు. అల్తరి మూకలు ఆ విధంగా వ్యవహరించడం నేరమే కావచ్చు కాని వంతెనను బాగు చేయించిన కొద్ది మాసాలకే ప్రమాదం జరగడం అనేక ప్రశ్నలకు తావిస్తోంది.  వాస్తవానికి ప్రమాదం జరిగిన సమయంలో 500 మంది వరకూ సందర్శకులు ఉన్నారని, వీరంతా నదిలోకి పడిపోయా రని తెలుస్తొంది. హఠాత్తుగా పడడంతో వెంటనే నదిలోకి దిగి కాపాడేవారు అంతగా లేపోవడంతో వెంటనే స్పందించి రక్షణ చర్యలు తీసుకునేందుకు అవకాశం లేకపోవడం వల్లనే  మరణించినవారి సంఖ్య పెరిగిందని అంటున్నారు. 

సీఎం సభకొస్తే 500 రూపాయలు.. దండోరా వేసి మరీ ఆఫర్.. టీఆర్ఎస్ బరితెగింపేనా?

అసలే మునుగోడు.. ఆపై ముఖ్యమంత్రి కేసీఆర్ సభ.. జనం రాకపోతే ఉన్న ప్రతిష్ట కూడా మంటగలిసిపోతుందనుకున్నారో ఏమో.. సీఎం సభకు వస్తే 500 రూపాయలు ఇస్తామని దండోరా వేసి మరీ ప్రచారం చేసి సభకు జనాన్ని సమీకరించింది టీఆర్ఎస్. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సామాజిక మాధ్యమంలో హల్ చల్ చేస్తున్నది. మునుగోడులో ఎలాగైనా గెలిచిన తీరాలన్న పట్టుదలతో సకల విలువలకూ, నిబంధనలకే తిలోదకాలిచ్చేసి మరీ టీఆర్ఎస్ బరి తెగిస్తోందనడానికి నిలువెత్తు నిదర్శనంగా ఈ వీడియో కనిపిస్తున్నది. మునుగోడు ఉప పోరు ప్రచారం ముగింపు దశకు వచ్చేస్తున్న సమయంలో కేసీఆర్ మునుగోడులో భారీ బహిరంగ సభను ఉద్దేశించి ఆదివారం ( అక్టోబర్30) ప్రసంగించారు. కేసీఆర్ ప్రసంగం, బీజేపీపై విమర్శల వర్షం, హెచ్చరికల పర్వం పక్కన పెడితే.. ఆయన సభకు జనసమీకరణ చేసిన తీరు మాత్రం తీవ్ర వివాదాస్పదం కావడమే కాకుండా.. నిబంధనల ఉల్లంఘనకు పరాకాష్టగా నిలిచింది. చెర్లగూడెంలో సీఎం బహిరంగ సభకు వచ్చిన వారందరికీ మనిషికి 500 రూపాయల చొప్పున ఇస్తామంటూ దందోరా వేశారు. ఈ దండోరాను ఎవరో వీడియో తీసి సామాజిక మాధ్యమంలో పోస్టు చేశారు. రిగ్గింగులు, ఓటర్లకు డబ్జు పంపకాలు ప్రతిష్ఠాత్మకంగా జరగే ఎన్నికలలో మామూలే అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. కానీ ఇంత బహిరంగంగా, ఇంతగా బరితెగించి.. సభకు వస్తే డబ్బులిస్తాం అంటూ డబ్బు కొట్టి చాటింపు వేయడం మాత్రం ఇదే తొలి సారి అని పరిశీలకులు అంటున్నారు. అధికార పార్టీ ఇంతగా బరితెగించడం పట్ల రాజకీయ వర్గాలలోనే కాదు సామాన్యులలో సైతం విష్మయం వ్యక్తం అవుతున్నది. అయితే ఈ వీడియోలో కనిపిస్తున్నట్లుగా డబ్బు కొట్టి   మరీ కేసీఆర్ సభకు వచ్చిన వాళ్లకు 500 రూపాయలు ఇస్తాం అంటూ చాటింపునకు సంబంధించిన వీడియో, ఎవరైనా టీఆర్ఎస్ ను ఇబ్బందుల పాలు చయడానికి ఎవరైనా ప్లాన్ చేసినదా? లేక గులాబీ పార్టీయే బరి తెగించేసి మరీ ఇలా చాటింపు వేయించిందా అన్న విషయంలో స్పష్టత లేదు. కానీ ఇప్పటి వరకూ ఈ వీడియోపై టీఆర్ఎస్ నుంచి ఎటువంటి ఖండనా రాలేదు. ఏది ఏమైనా మునుగోడు ఉప ఎన్నిక మాత్రం రాష్ట్ర వ్యాప్తంగానే కాదు.. దేశ వ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తోందన్నది వాస్తవం.  

ఇంతకీ ఆ డబ్బెక్కడ ?

జగన్ ప్రభుత్వంపై కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి ఓ క్లారిటీ అయితే వచ్చేసిందా? అందుకే.. వచ్చే ఎన్నికల్లో జనసేనతో తప్ప మరో పార్టీతో పొత్తు పెట్టుకోమంటూ ..  ఆ పార్టీ ఏపీ వ్యవహారాల సహ బాధ్యుడు సునీల్ దేవధర్, ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు పలుమార్లు చెబుతున్నారా? ఆ క్రమంలోనే జగన్ ప్రభుత్వంపై.. కేంద్రంలోని పెద్దలు..షంటింగ్ ప్రోగ్రామ్ పెట్టుకున్నారా? అంటే తాజా పరిణామాలను బట్టి చూడబోతే..  అలాగే ఉందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. తాజాగా నిర్మలా సీతారామన్.. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం మండలంలో పర్యటించిన సందర్బంగా చోటు చేసుకున్న పరిణామాలను వారు ఈ సందర్బంగా సోదాహరణగా వివరిస్తున్నారు.   వీరవాసరం మండలంలోని మత్స్యపూరి గ్రామాన్ని నిర్మల సీతారామన్ గతంలో దత్తత తీసుకున్నారని.. సదరు గ్రామంలో తాజాగా ఆమె రక్షిత మంచి నీటి సరఫరా పథకాన్ని ప్రారంభించారని.. ఆ క్రమంలో పరిసర ఆరు గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కారమైందా? అంటూ అక్కడే ఉన్న భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్‌ను ఆమె ప్రశ్నించగా... అందుకు ఆయన కాలేదంటూ సమాధానం ఇవ్వడంతో.. ఈ కేంద్ర మంత్రి గారు ఒక్కసారిగా అవాక్కు అయ్యారని.. తాను 2019 ఎన్నికల ముందే ఈ ఆరు గ్రామాల్లో తాగు నీటి సమస్య పరిష్కరించడం కోసం కోటి రూపాయిలకు పైగా నిధులు విడుదల చేశానని.. నాడు ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు వెళ్లితే.. ఇప్పుడు కర్ణాటక నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నానని..... కానీ అప్పుడు విడుదల చేసిన నిధుల తాలుక లెక్క ఏమైందో.. మీ సమస్యలు ఇంకా ఎందుకు అలాగే ఉన్నాయో.. ఇదిగో ఇక్కడే నిల్చున్న మీ ఎమ్మెల్యే గారు గ్రంధి శ్రీనివాస్‌నే అడగాలి.. మీలో చైతన్యం రావాలి.. ఇలాంటోళ్లని నిలదీయాలంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు తాలుక వీడియో.. సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో హల్‌చల్ చేసి పారేస్తోంది.  ఇది ఒక్కటే కాదు.. జగన్ పార్టీలోని చాలా మంది ఎమ్మెల్యేలు.. ఇప్పటికీ తమ తమ నియోజకవర్గంలో పూర్తిగా పర్యటించిన దాఖలాలు అయితే లేవనే ఓ చర్చ సైతం ఫ్యాన్ పార్టీలోని కేడర్‌లో బలంగా ఉందని సమాచారం. నియోజకవర్గంలోనే పూర్తి స్థాయిలో పర్యటించని ఎమ్మెల్యేలు.. ఇక ప్రజా సమస్యలు ఏమి తీరుస్తారంటూ ఓ ప్రశ్న కూడా ఆ పార్టీలోనే అంతర్గతంగా సాగుతోందని తెలుస్తోంది. ఈ విషయాన్ని సీఎం వైయస్ జగన్ పసిగట్టారని.. అందుకే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారని... ఈ కార్యక్రమానికి సైతం ఎమ్మెల్యేలు డుమ్మా కోడుతుండడం విశేషమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.  రాష్ట్రంలో వైయస్ జగన్ ప్రభుత్వం.. ప్రతి నెల అప్పుల కోసం పడుతోన్న తిప్పలు.. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు బాగా తెలుసునని..అందుకే ఈ విధంగా చురకలంటించి ఉంటారనే రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.  అదీకాక.. జగన్ ప్రభుత్వం రాష్ట్రా అభివృద్ధి, ప్రజా సమస్యలపై దృష్టి సారించకుండా.. సంక్షేమ పథకాలపైనే మాత్రమే దృష్టి సారిస్తే.. వచ్చే ఎన్నికల్లో గెలుపు అనేది అంత సలువు కాదంటూ ఇటీవల ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌కు చెందిన ఐ ప్యాక్ ఓ నివేదికను సైతం.. సాక్షాత్తూ జగన్ చేతిలో పెట్టిన విషయాన్ని ఈ సందర్భంగా రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యేలు.. కేటాయించిన నిధులను ఉపయోగించకుండా..  ప్రజా సమస్యలపై దృష్టి సారించకుండా ఉంటే.. వచ్చే ఎన్నికల్లో గెలుపు సందేహమే అనే రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. అయినా అన్నం ఉడికిందా? లేదా? అనేది ఒక్క మెతుకు పట్టుకుని చూస్తే ఇట్టే తెలిసిపోతోందని... అలాగే అధికార జగన్ పార్టీలోని ఎమ్మెల్యేలు పనిమంతులా? కాదా? అంటే.. భీమవరం ఎమ్మెల్యే గ్రంధీ శ్రీనివాస్ పనితనం చూస్తే చాలని ఓ చర్చ అయితే తాజా తాజాగా సోషల్ మీడియా సాక్షిగా రచ్చ రంబోలా చేసి పారేస్తోంది.

దళితులకు ఆత్మబంధువు మోడీ.. ద్రోహి కేసీఆర్: బండి విమర్శ

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావును బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ దళిత ద్రోహిగా అభివర్ణించారు. అదే సమయంలో ప్రధాని మోడీని దళితుల ఆత్మబంధువుగా పేర్కొన్నారు. ప్రధాని మోడీ అంబేడ్కర్ ను ఆత్మబంధువుగా భావిస్తున్న నేత అనీ, అంబేడ్కర్ భిక్ష వల్లే బీసీని అయిన తాను ప్రధానిని అయ్యాననీ మోడీ పార్లమెంటు సాక్షిగా చెప్పడాన్ని బండి సంజయ్ గుర్తు చేశారు. ఐదు దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో ఆ పార్టీ దళితులను ఓటు బ్యాంకుగా మాత్రమే చూసిందని విమర్శించిన బండి సంజయ్.. .నరేంద్రమోదీ ప్రధాని పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాతే..  దళితుల గౌరవాన్ని పెంచేందుకు, ఆర్దికంగా వారు వారి  కాళ్లపై   నిలబడేందుకు పారిశ్రామివేత్తలు, వ్యాపారవేత్తలుగా తయారు అయ్యేందుకు ఎన్నో పథకాలను తీసుకొచ్చారని చెప్పుకొచ్చారు. ఇప్పటి దాకా బ్యాంకు ముఖం కూడా చూడని దాదాపు మూడు కోట్ల మంది దళితుల చేత బ్యాంకు ఖాతాలు తెరిపించి, పథకాల సొమ్మ నేరుగా వారి ఖాతాల్లో జమయ్యేలా చేసినది మోడీ మాత్రమే అన్నారు. దళితులు ఉద్యోగాలు చేసే వాళ్లుగా మిగిలిపోకేడదనీ, ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని  అర్హులైన దళితులకు ఎలాంటి పూచికత్తు లేకుండా ఏకంగా 5 కోట్ల రూపాయల వరకు లోన్లు ఇచ్చే గొప్ప పథకాన్ని మోడీ తీసుకొచ్చారని బండి అన్నారు. మునుగోడులో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి విజయం సాధిస్తే.. మునుగోడు యువతకు కోట్లాది రూపాయలు రుణాలు ఇప్పించి పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దుతామని బండి  అన్నారు. ఇక కేసీఆర్ అయితే దళిత అధికారులను దగ్గరకూ కూడా రానియడం లేదని బండి విమర్శించారు. కేంద్రం ఇస్తున్న ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లిస్తున్నారని విమర్శించారు.  బీజేపీకి రాష్ట్రపతిని చేసేందుకు 3 సార్లు అవకాశమొచ్చింది ఇప్పటి వరకు… తొలిసారి మైనారిటీ అయిన అబ్దుల్ కలాంగారికి, రెండోసారి రామ్ నాథ్ కోవింద్ గారికి, మూడోసారి గిరిజన బిడ్డ ద్రౌపది ముర్మును రాష్ట్రపతి చేసిన గొప్ప పార్టీ బీజేపీ అని బండి అన్నారు. కేసీఆర్ మాత్రం దళితుడిని సీఎం చేస్తానని హమీ ఇచ్చి మాట తప్పారనీ,  ఇద్దరికి డిప్యూటీ సీఎం పదవులిచ్చి కారణాలు చెప్పకుండా నిర్దాక్షిణ్యంగా తొలగించారని విమర్శించారు.  

ఎండలతో మున్ముందు పెనుముప్పు...హెచ్చరిస్తున్న యూనిసెఫ్

వాతావరణ పరిస్థితుల్లో వస్తున్న పెను మార్పులతో మానవాళి ఆరోగ్య సమస్యలు పెరిగిపోతున్నాయని, దీన్ని గురించి ప్రపంచదేశాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యల గురించి యూనిసెఫ్ , ప్రపంచ ఆరోగ్య సంస్థ చాలాకాలం నుంచి హెచ్చరిస్తూనే ఉన్నాయి. ఇప్పుడే ఐరోపాలో వడగాడ్పుల తీవ్రత అనూహ్యం గా పెరుగవచ్చని అంచనా వేయగా, ఆసియా , ఆఫ్రికాలోని పిల్లలు   చాలా అధిక ఉష్ణోగ్రత లకు గురవు తారని నివేదిక హెచ్చరించింది. ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం, 2050 నాటికి, ప్రపంచవ్యాప్తంగా రెండు బిలియన్లకు పైగా పిల్లలు తరచుగా వేడి గాలులను ఎదుర్కొంటారు, ప్రపంచం తక్కువ స్థాయి గ్లోబల్ హీటింగ్‌ను సాధిస్తుందో లేదో అనే దానితో సంబంధం లేకుండా.  'ది కోడెస్ట్ ఇయర్ ఆఫ్ ది రెస్ట్ ఆఫ్ దెయిర్ లైఫ్స్' అనే నివేదిక ప్రకారం, రాబోయే మూడు దశాబ్దాల్లో దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ  1.7 డిగ్రీల వేడెక్కువయి  పిల్లలకు ఎక్కువ కాలం, వేడిగా , తరచుగా వచ్చే  వేడి తరం గాలను నిరోధించే అవకాశం లేదు.  ప్రస్తుతం, దాదాపు 500 మిలియన్ల మంది పిల్లలు అధిక ఉష్ణ తరంగాల ఫ్రీక్వెన్సీకి గురవుతున్నారని, మరో 600 మిలియన్లకు పైగా తీవ్రమైన అధిక ఉష్ణోగ్రతలతో కూడిన ఇతర అధిక వేడి చర్యలకు గురవుతున్నారని నివేదిక హైలైట్ చేస్తుంది. పాదరసం పెరుగుతోంది  పిల్లలపై ప్రభావం చూపుతుందని యూనిసెఫ్ చీఫ్ కేథరీన్ రస్సెల్ చెప్పారు.  ఇప్పటికే, 3 మంది పిల్లలలో 1 మంది తీవ్రమైన అధిక ఉష్ణో గ్రతలను ఎదుర్కొనే దేశాల్లో నివసిస్తున్నారు దాదాపు 4 మంది పిల్లలలో  ఒక్కరు అధిక  వడగాడ్పులకు  గురవుతున్నారు,  ఇది మరింత తీవ్రమవు తుందని నివేదిక తెలియజేసింది.   వడగాడ్పులు  పెద్దలు,  పిల్లలను వేరు వేరు విధాలుగా ప్రభావితం చేస్తాయి, ఎందుకంటే  మరీ ముఖ్యం గా పిల్లలపై ప్రభావానికి ఎక్కువ అవకాశం ఉంది. పిల్లలు పెద్దవారిలా శరీర ఉష్ణోగ్రతను నియంత్రిం చలేరు.  అందువల్ల దీర్ఘకాలిక శ్వాసకోశ పరిస్థితులు, ఉబ్బసం,  హృదయ సంబంధ వ్యాధు లకు ఎక్కు వహానికి అవకాశం ఉంది. శిశువులు, చిన్నపిల్లలు వేడి-సంబంధిత మరణాల ప్రమాదాన్ని ఎక్కువగా ఎదుర్కొంటారు, ఇది వివరిస్తుంది. అన్ని ప్రభుత్వాలు గ్లోబల్ హీటింగ్‌ను తక్షణమే 1.5 డిగ్రీల సెల్సి యస్‌కు పరిమితం చేయడం కనీస చర్య అని నివేదిక మరింత సూచిస్తుంది. ఐరోపాలో వడగాడ్పుల తీవ్రత అనూహ్యంగా పెరుగుతుందని అంచనా వేయగా, ఆసియా,  ఆఫ్రికాలోని పిల్లలు నివేదిక ప్రకారం చాలా అధిక ఉష్ణోగ్రతలకు గురవుతారు. భారత్, పాకిస్థాన్, సౌదీ అరేబియా, సూడాన్ వంటి దేశాలు రెండు విభాగాల్లోనూ దారుణమైన పరిణామాలను ఎదుర్కొనే అవకాశం ఉందని పేర్కొంది. పంటలపై వేడిగాలుల ప్రభావం,  సాధారణంగా పర్యావరణం అదనపు సవాలుగా మారడాన్ని నివేదిక ప్రత్యేకంగా ప్రస్తావించింది.  పిల్లల భవిష్యత్తు జీవనోపాధిని కొనసాగించడానికి వాతావరణ ఆర్థిక సహా యం, పెరుగుతున్న నిధులు, వాతావరణ మార్పు, విద్య, పటిష్టమైన ఆహార వ్యవస్థల వంటి  చర్యలను ప్రతిపాదిస్తుందన్నది.