అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలతో కేంద్రంతో కేసీఆర్ యుద్ధం మరో లెవెల్ కు

కేంద్రంతో యుద్ధాన్ని కేసీఆర్ మరో లెవెల్ కు తీసుకువెళ్లేందుకే నిర్ణయించుకున్నారు. తెలంగాణ ఆర్థిక ఇబ్బందుల్లో పీకల్లోతు కూరుకుపోవడమే ఇందుకు కారణంగా పరిశీలకులు భావిస్తున్నారు. సంపన్న రాష్ట్రం తెలంగాణకు ఆర్థిక ఇబ్బందులు ఎదురు కావడానికి కేంద్రమే కారణమంటూ కేసీఆర్ అసెంబ్లీ వేదికగా ఎలుగెత్తడానికి రెడీ అయిపోయారు. ఇందు కోసం ఆయన వచ్చే నెలలో వారం రోజుల పాటు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడమే కేంద్రం లక్ష్యంగా కనిపిస్తోందని కేసీఆర్ అసెంబ్లీ వేదికగా చాటేందుకు సిద్ధమైపోయారు. అసలు విషయమేమిటంటే.. తెలంగాణ ప్రభుత్వానికి ఈ ఆర్థిక సంవత్సరంలో అంచనాలకు తగ్గట్లుగా రుణాలు అందడం లేదు. ఎఫ్ఆర్‌బీఎం పరిమితికి అదనంగా కార్పొరేషన్ల ద్వారా అప్పులు చేశారని.. వాటినీ   రాష్ట్ర అప్పులుగానే పరిగణిస్తామని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది.అయితే అదే సమయంలో కేంద్రం ఏపీ పట్ల అవాజ్యానురాకం ప్రదర్శిస్తూ ఎడాపెడా అప్పులకు అనుమతులు ఇస్తుండటంతో సహజంగానే కేంద్రం తెలంగాణ పట్ల రాజకీయ కక్షతో వ్యవహరిస్తోందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. ఆ విషయాన్నేఇప్పుడు అసెంబ్లీ వేదికగా జనానికి వెల్లడించేందుకు కేసీఆర్ రెడీ అయిపోయారు.  తెలంగాణపైక కేంద్రం కక్ష పూరిత ధోరణిలో వ్యవహరిస్తూ పురోగతిని ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటోందని కేసీఆర్ అంటున్నారు. అభివృద్థి బాటలో వేగంగా పురోగమిస్తున్న తెలంగాణను నిలువరించేందుకు అనవసర ఆంక్షలతో కేంద్రం కళ్ళేలు వేస్తున్నదని కేసీఆర్ అసెంబ్లీ వేదికగా చాటాలని నిర్ణయానికి వచ్చేశారు.    తెలంగాణ కు సమకూరవలసిన ఆదాయంలో 40 వేల కోట్ల రూపాయలకు పైగా గండి పడటాన్ని   ప్రజలకు వివరించి  కేంద్రం వివవక్షను  ప్రజలందరికీ సవివరంగా తెలియజెప్పేందుకు వచ్చేనెలలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలలో వారం రోజులపాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కేంద్రం ఆంక్షలపై లోతైన చర్చను చేపట్టేందుకు కేసీఆర్ సర్కారు సిద్ధమైంది.   కేంద్రం అనుసరిస్తున్నఅసంబద్ధ ఆర్థిక విధానాల ద్వారా రాష్ట్రాల భవిష్యత్తుకు, ప్రగతికి ఆటంకంగా మారిందని కేసీఆర్ గత కొంత కాలంగా ప్రతి వేదికపైనా గట్టిగా చెబుతున్న సంగతి విదితమే. ప్రతీ ఆర్థిక సంవత్సరానికి ముందు కేంద్రం విడుదల చేసే బడ్జెట్ గణాంకాలను అనుసరించే రాష్ట్రాలు  బడ్జెట్ ను రూపొందించుకుంటాయి. ఆర్థిక వనరులను సమకూర్చుకునేందుకు ప్రతి రాష్ట్రానికి ఆనవాయితీగా ఎఫ్.ఆర్.బి.ఎం. పరిమితులను ముందస్తుగా కేంద్రం వెల్లడిస్తుంది. 2022-23 ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే తెలంగాణకు ఇచ్చే ఎఫ్.ఆర్.బి.ఎం. పరిమితిని 54 వేల కోట్లుగా కేంద్రం ప్రకటించింది. దీనిని అనుసరించి తెలంగాణ రాష్ట్రం బడ్జెట్ ను రూపొందించుకున్నది. కాగా, కేంద్రం అకస్మాత్తుగా తెలంగాణ రాష్ట్ర ఎఫ్.ఆర్.బి.ఎం. పరిమితిని 39 వేల కోట్లకు కుదించింది. తద్వారా రాష్ట్రానికి అందాల్సిన 15 వేల కోట్ల నిధులు తగ్గాయి. అంతే కాకుండా ఆర్థికంగా పటిష్టంగా వున్న రాష్ట్రాలకు అదనంగా 0.5 శాతం నిధుల సేకరణకు ఎఫ్.ఆర్.బి.ఎం. పరిమితి ఉంటుంది. ఆర్థికంగా అత్యంత పటిష్టంగా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఈ సౌలభ్యాన్ని కూడా పొందనీయకుండా తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ సంస్కరణలు అమలు చేస్తామంటెనే 0.5 శాతం రుణ పరిమితికి అనుమతిస్తామనే వ్యవసాయ వ్యతిరేక రైతాంగ వ్యతిరేక నిబంధనను ముందుకు తెచ్చి బలవంత పెట్టిందని కేసీఆర్ సర్కారు ఆరోపిస్తోంది. అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల నిర్వహణ నిర్ణయంతో మొత్తం మీద కేంద్రంతో అమీతుమీ తేల్చుకునేందుకే కేసీఆర్ సిద్ధమయ్యారని చెప్పాల్సి ఉంటుంది.

రాజ్యాంగ పదవుల్లో రాజకీయ నియామకాలు

రాజ్యాంగ  పదవులలో అధికార నియామకాల విషయంలో, వివాదాలు తలెత్తడం కొత్త విషయం కాదు. సీబీఐ, ఈడీ,సీవీసీ డైరెక్టర్లు, సీఈసీ కమిషనర్ల నియామకాల నుంచి, విశ్వ విద్యాలయాల వైస్ వైస్ చాన్సలర్ల నియామకాల వరకు, అనేక సందర్భాలలో రాజ్యాంగ పదవుల్లో రాజకీయ నియామకాలు జరుగుతున్నాయనే ఆరోపణలు రావడం, ఆ నియామకాలు  వివాదంగా మారడం చాలా కాలంగా ఉన్నదే. ఇప్పడు, మళ్ళీ మరోమారు అలాంటి వివాదమే తెరపైకొచ్చింది.  కేంద్ర ఎన్నికల సంఘం ముగ్గురు కమిషనర్లలో ఒక కమిషనర్ పోస్ట్ చాలాకాలం ఖాళీగా ఉంది, ఈ నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం రెండు రోజుల క్రితం, కేంద్ర న్యాయశాఖ సిఫార్సు చేసిన నలుగురిలోంచి, మాజీ ఐఎఎస్ అధికారి అరుణ్ గోయల్ ను ఎన్నికల సంఘం కమిషనర్‌గా నియమించింది. ఆయన ఆ వెంటనే బాధ్యతలు స్వీకరించారు. అయితే, ఈ నియామక ప్రక్రియను సుప్రీం కోర్టు తప్పు పట్టింది.  కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ నియామకం కోసం న్యాయశాఖ, అనేక పేర్లను పరిశీలించి నలుగురి పేర్లను షార్ట్‌లిస్ట్‌ చేసింది. నవంబరు 18న ఆ ఫైల్‌ను ప్రధాని కార్యాలయానికి పంపించింది. ప్రధాని అదే రోజున ఒక పేరును ప్రతిపాదించారు... ఇలా ఒకే రోజులో ప్రధాని కార్యాలయం నిర్ణయం తీసుకోవడంతో గోయెల్ నియామకం నిబంధనల ప్రకారమే జరిగిందా అని అనుమానం సుప్రీం కోర్టు ధర్మాసనం వ్యక్తం చేసింది. ఎన్నికల కమిషనర్ నియామక ప్రక్రియను ఎందుకంత వేగంగా పూర్తి చేయవలసి వచ్చిందని, ధర్మాసనం ప్రశ్నించింది.  అరుణ్ గోయల్ ఇటీవలే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవడం, ఆ వెంటనే ఎన్నికల కమిషనర్‌గా నియామకం పొందడం వెనుక అనుమానాలు వ్యక్తం చేసింది. కేంద్ర న్యాయశాఖ నలుగురి పేర్లను సిఫార్సు చేస్తే, వారిలో అందరికంటే వయస్సులో చిన్నవారైన అరుణ్‌ గోయల్‌ పేరును ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారు. ఫైల్ సర్క్యులేట్ కాకుండానే, ఒకే రోజులో ప్రధాని కార్యాలయం ఎలా నిర్ణయం తీసుకుంది. ఒకే రోజులో అప్పాయింట్మెంట్ ఎలా జరిగింది. ఎందుకంత హడావుడిగా, వేగంగా ఆమోదించాల్సి వచ్చింది? అని సుప్రీం ధర్మాసనం ప్రశ్నల వర్షం కురిపించింది. ఎన్నికల ప్రధాన కమిషనర్‌ ఎన్నికల కమిషనర్ల నియామకానికి కొలీజియం లాంటి వ్యవస్థను ఏర్పాటు చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు గత 5 రోజులుగా విచారిస్తోంది. జస్టిస్‌ కేఎం జోసెఫ్‌, జస్టిస్‌ అజయ్‌ రస్తోగీ, జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌, జస్టిస్‌ హృషికేశ్‌ రాయ్‌, జస్టిస్‌ సీటీ రవికుమార్‌‌తో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఈ పిటిషన్లను విచారిస్తోంది. ఇదే సమయంలో ఈసీ నియామకం జరగడంతో సుప్రీం కోర్టు, బుధవారం ఆకేసు విచారణ సందర్భంగా అనుమానాలు వ్యక్త పరుస్తూ, ప్రశ్నలు సంధించింది. అరుణ్‌ గోయల్‌ నియామక ప్రక్రియకు సంబంధించిన ఫైళ్లను కోర్టుకు సమర్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు అరుణ్ గోయల్ నియామకానికి సంబంధించిన ఫైళ్లను కేంద్రం తరఫున అటార్నీ జనరల్‌ ఆర్‌ వెంకటరమణి గురువారం (నవంబర్ 24) కోర్టుకు సమర్పించారు.  సదరు ఫైళ్లను పరిశీలించిన సుప్రీంకోర్టు ధర్మాసనం కేంద్రం తీరుపై మరోసారి అసహనం వ్యక్తం చేసింది. 24 గంటలు కూడా గడవక ముందే మొత్తం నియామక ప్రక్రియను ఎలా పూర్తి చేశారని ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇదేం నియామకం?ఎందుకీ తొందర?అంటూ ధర్మాసనం నియామక ప్రక్రియ విషయంలో అసంతృప్తిని వ్యక్తపరిచింది.అయితే అదే సమయంలో సుప్రీం ధర్మాసనం, ఇక్కడ మేం అరుణ్‌ గోయల్‌ సామర్థ్యాలను శంకించట్లేదు.నియామక ప్రక్రియ గురించి మాట్లాడుతున్నాం అని స్పష్టం చేసింది. మే15వ తేదీ నుంచి కేంద్ర ఎన్నికల కమిషనర్‌ పోస్టు ఖాళీగా ఉందని, నాటి నుంచి నవంబరు 18వ తేదీ వరకు ఏం జరిగిందో చెప్పాలని ఏజీని సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది. అటార్నీ జనరల్‌ వెంకటరమణి వాదనలు వినిపిస్తూ.. ఎన్నికల కమిషనర్‌ ఎంపిక ప్రక్రియలో ఎలాంటి పొరపాటు జరగలేదన్నారు. గతంలోనూ 12 నుంచి 24 గంటల్లో నియామకాలు జరిగిన సందర్భాలు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. న్యాయశాఖ ప్రతిపాదించిన నాలుగు పేర్లను డీఓపీటీ డేటాబేస్‌ నుంచే తీసుకున్నారు.ఆ వివరాలన్నీ బహిరంగంగానే అందుబాటులో ఉన్నాయి. ఇక, పేరు ఎంపిక సమయంలో వ్యక్తి సీనియార్టీ, పదవీ విరమణ వయసు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. వయసుకు బదులుగా బ్యాచ్‌ ఆధారంగా సీనియార్టీని పరిగణిస్తారు అని  వివరణ ఇచ్చారు. ఈ అంశంపై విచారణ చేపట్టడం, అనుమానాల నివృత్తి కోసం వేసే ప్రశ్నల ద్వారా.. కేంద్రానికి తాము వ్యతిరేకమని అర్థం చేసుకోకూడదని సుప్రీం ధర్మాసనానికి నేతృత్వం వహిస్తున్న జస్టిస్‌ కేఎం జోసెఫ్‌ వ్యాఖ్యానించారు. తీర్పును రిజర్వ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ వ్యవహారంలో లిఖితపూర్వక వాదనలు దాఖలు చేసేందుకు ఇరుపక్షాలకు 5 రోజుల సమయం ఇచ్చింది. వాద, ప్రతివాదనలు విన్న తర్వాత సీఈసీ, ఈసీలను పారదర్శకంగా నియమించడానికి స్వతంత్ర ప్యానెల్‌ను ఏర్పాటు చేయాలా? వద్దా? అనే అంశంపై సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వనుంది.  అయితే, ఈ వివాదం ఇంతటితో ముగిసి పోతుందని అనుకోలేమని, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ముంగిట జరిగిన ఈ నియామకం విషయంలో రాజకీయ దుమారం చెలరేగినా ఆశ్చర్య పోనవసరం లేదని, రాజీకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అలాగే, రాజ్యాంగ పదవుల నియామకాల్లో తలెత్తే సమస్యలు, వివాదాలకు శాశ్వత పరిష్కారం కనుగొన వలసిన అవసరం ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. తెలంగాణ, కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో ప్రస్తుతం విశ్వవిద్యాలయాల వైస్ చాన్సలర్ల నియామకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు, గవర్నర్లకు మధ్య వివాదాలు రగులుతున్న నేపధ్యంలో, రాజ్యాంగ పదవుల నియామకాల విషయంలో జాతీయ స్థాయిలో సమగ్ర చర్చ అవసరం అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మూడు దశాబ్దాలుగా ఓటమి ఎరగని ఎమ్మెల్యే ..

ఒక్కసారి మంత్రి చేయి గణనాధ... నువ్వు ఓడకుంటే ఒట్టుపెట్టు గణనాధ ... ఇది ఎప్పుడో ఎవరో సినిమా కవి రాసిన పాట. అందరి విషయంలో కాకున్నా, కొందరి విషయంలో అది నిజమే అయింది. మంత్రులే కాదు, ఒక్కసారి  ఎమ్మెల్యేగా గెలిచిన వారు మళ్ళీ రెండవసారికే ప్రజల విశ్వాసం కోల్పోవడం కూడా కొందరి విషయంలో నిజమే. అయితే, వరసగా ఎనిమిది సార్లు, తొమ్మిది సార్లు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా గెలిచిన వారు కూడా లేక పోలేదు.అలాగే అసలు ఓటమి అన్నదే ఎరగని రాజకీయ ఉద్దండులు ఉన్నారు. అలాగే ఉద్దండులు అనుకున్న ఇందిరా గాంధీ, వాజపేయి, అద్వానీ, ఎన్టీఆర్ వంటి మహా నాయకులూ కూడా ఎన్నికల్లో ఓటమి చవిచూశారు.  అయితే, ఇప్పడు ఈ చర్చ ఎందుకంటే, అందుకో కారణముంది. వచ్చే నెల (డిసెంబర్) మొదటి వారంలో ప్రధాని మోడీ స్వరాష్ట్రంలో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే కదా. మొత్తం 182 స్థానాలున్న, గుజరాత్ లో డిసెంబర్ 1, 5 తేదీల్లో రెండు విడతల్లో పోలింగ్ జరుగుతుంది. డిసెంబర్ 8 న ఇప్పటికే పోలింగ్ పూర్తి చేసుకున్న హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపుతో పాటుగా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కూడా జరుగుతుంది. ఈ రెండు రాష్ట్రాలలో ఒకటి ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షాల  స్వరాష్ట్రం గుజరాత్ అయితే, రెండవ రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు, జేపీ నడ్డా స్వరాష్ట్రం. ఆవిధంగా ఈ రెండు రాష్ట్రల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అలాగే, రెండు రాష్ట్రాలఅసెంబ్లీ ఎన్నికలు రెండు రాష్ట్రాలలో ప్రధాన ప్రతిపక్షగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి  కూడా కీలకంగానే భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో సంస్థాగత మార్పులు జరిగి, ఇంచుమించుగా 25 సంవత్సరాల తర్వాత జరిగిన పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో, గాంధీ కుటుంబం వెలుపలి, సీనియర్ నాయకుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షుడుగా ఎన్నికైన తర్వాత జరుగతున్న తొలి ఎన్నికలు కావడం  చేతనూ  హిమాచల్, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు, దేశం దృష్టిని విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఖర్గేకు ఇది తొలి పరీక్ష. అయితే, ఇంతవరకు వచ్చిన  సర్వేలన్నీ, రెండు రాష్ట్రాలలో మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తుందనే అంటున్నాయి. అయితే  సర్వేలు నిజం అవుతాయా లేదా అనేది తేలేందుకు డిసెంబర్ 8 వరకు ఆగవల్సిందే.  సరే, అదెలా ఉన్నా, అది గుజరాత్ అనే కాదు, మరే రాష్ట్రం అయినా అసెంబ్లీ ఎన్నికలు అనగానే, అనేక ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తాయి. అలాగే, ఆసక్తికర వ్యక్తులు, వారి వారి గెలుపు ఓటములు  ఆసక్తిని రేకెత్తిస్తాయి. ఇప్పుడు మనం పైన గుర్తు చేసుకున్న, ‘ఒక్కసారి మంత్రి చేయి గణనాథా, నువ్వు ఓడకుంటే ఒట్టు పెట్టు గణనాథా’ పాటలో లాగా, ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచిన వారే మళ్ళీ గెలవడం అయ్యేపని కాదని అనుకుంటున్న సమయంలో, గుజరాత్ లోని ద్వారకా ఎమ్మెల్యే పణుభా మాణెక్ ఏకంగా వరసగా ఏడు పర్యాలు,అది కూడా ఒకే నియోజక వర్గం, నుంచి గెలిచి, ఇప్పడు ఎనిమిదవ సారి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు మళ్ళీ బరిలో దిగారు.  ఏకంగా 32 ఏళ్లుగా ఒకే నియోజక వర్గం నుంచి గెలుస్తూ వస్తున్న పణుభా మాణెక్ నియోజక వర్గం అయితే మారలేదు కానీ, పార్టీ అయితే మారారు. ముందుగా ఆయన  1990లో తొలిసారిగా స్వతంత్ర అభ్యర్ధిగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అలాగే 1995, 1998లో జరిగిన శాసనసభ ఎన్నికల్లోనూ ఆయన స్వతంత్ర అభ్యర్ధిగానే విజయం సాధించారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ పార్టీలో చేరిన మాణెక్, 2002 ఎన్నికల్లో ఆ పార్టీ టికెట్‌పై గెలుపొందారు. ఆ తర్వాత బీజేపీ తీర్థం పుచ్చుకుని, 2007, 2012, 2017లో జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించి రికార్డు సృష్టించారు. ప్రస్తుతం జరుగుతున్న గుజరాత్‌ ఎన్నికల్లో కూడా బీజేపీ అభ్యర్థిగా అదే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.అయితే,  1995 నుంచి, ఇంచుమించుగా 27 ఏళ్లుగా   రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తుందా రాదా అనే విషయంలో ఎవరికైనా, అనుమానాలు ఉంటే ఉంటాయేమో, కానీ, పణుభా మాణెక్ గెలుపు విషయంలో మాత్రం ఎవరికీ ఎలాంటి అనుమానం లేదని  నియోజక వర్గం ప్రజలు, అదే విధంగా మాణెక్, విశ్వాసం వ్యక్త పరుస్తున్నారు. అదేమంటే ప్రజలతో పెనవేసుకున్న సమబంధాలే తనకు శ్రీరామ రక్ష అంటున్నారు, మాణెక్.

చిక్కుల్లో రఘురామ.. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తెలంగాణ సిట్ నోటీసులు

 వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణ రాజుకు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తెలంగాణ సిట్ నోటీసులు జారీ చేసింది. దీంతో రఘురామ రాజుకు దెబ్బ మీద దెబ్బ  తగులుతోందని చెప్పక తప్పదు.  గతంలో ఏపీ సీఐడీ పోలీసులు ఆయనను అరెస్ట్ చేయడమే కాకుండా ఆయన అరికాళ్ల మీద విపరీతంగా కొట్టారంటూ వచ్చిన ఆరోపణలు గత ఏడాది పెను సంచలనం సృష్టించాయి.  తాజాగా.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో విచారణకు హాజరు కావాలంటూ రఘురామకు తెలంగాణ సిట్ అధికారులు 41ఏ సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేశారు. ఈ నెల 29న బంజారాహిల్స్ లోని సిట్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని సిట్ ఆ నోటీసులలో పేర్కొంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు వంద కోట్ల రూపాయలు సమకూరుస్తున్నాను అని రఘురామ అన్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే రఘురామను విచారణకు హాజరు కావాలని సిట్ నోటీసులు ఇచ్చింది. దీంతో మరోసారి రఘురామకృష్ణరాజు మరోసారి వార్తల్లోకి వచ్చారు. గత ఏడాది మే 14న ఏపీ సీఐడీ అధికారులు రఘురామను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేలా రఘురామ వ్యవహరించారనే అభియోగంతో ఆయనను అరెస్ట్ చేశారు. రఘురామపై 124 ఏ, 153 బీ, 505 ఐపీసీ, 120 బీ సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఇతరుల మధ్య విద్వేషాలు కలిగించేలా వ్యాఖ్యలు చేశారని, ఉన్నత పదవుల్లో ఉన్న వారిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని రాజద్రోహం సహా పలు కేసులు పెట్టారు.  అయితే.. తనను అరెస్ట్ చేసిన తర్వాత పోలీసులు తీవ్రంగా కొట్టారని రఘురామ ఆరోపించడం తీవ్ర సంచలనంగా మారింది.  పోలీసుల దెబ్బలతో తన కాళ్లు వాచిపోయాయని చెప్పడంతో గుంటూరు జీజీహెచ్ లో వైద్య పరీక్షలు నిర్వహించి, ఆయన శరీరంపై గాయాలు లేవని హైకోర్టుకు చెప్పారు. ఆ వెంటనే రఘురామ సుప్రీంకోర్టులో వైద్య పరీక్షలపై పిటిషన్ వేశారు. రఘురామను వైద్య పరీక్షల కోసం సికింద్రాబాద్ లోని ఆర్మీ ఆస్పత్రికి తరలించాలని, రఘురామ జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నందున వైద్యపరీక్షల పర్యవేక్షణకు జ్యుడీషియల్ అధికారిని నియమించాలని అప్పుడు తెలంగాణ హైకోర్టును సుప్రీంకోర్టు అదేశించింది. ఆర్మీ ఆస్పత్రి నివేదిక ప్రకారం.. రఘురామ ఎడమకాలి వేలు ఫ్రాక్చర్ అయిందనీ, ఇతర గాయాలు కూడా ఉన్నట్లు తేలింది. రఘురామ బెయిల్ పిటిషన్ పై తీవ్ర వాదోపవాదనలు జరిగిన తర్వాత సుప్రీంకోర్టు ఆయనకు కండిషనల్ బెయిల్ మంజూరు చేసింది. అప్పటి నుంచీ రఘురామ ఏపీ సీఎం జగన్ లక్ష్యంగా ఆరోపణలు చేస్తూనే ఉండడం విశేషం. రఘురామను సీఐడీ అధికారులు అరెస్ట్ చేయడం, భౌతికంగా కొట్టడంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా స్పందించడం విశేషం. రఘురామ అరెస్ట్ విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరును హెచ్చార్సీ తప్పుపట్టింది. అప్పటి ఏపీ డీజీపీ గౌతం సవాంగ్, హోం మంత్రిత్వశాఖ చీఫ్ సెక్రటరీకి నోటీసులు కూడా ఇచ్చింది. ఇప్పుడు తాజాగా  ఎమ్మెల్యేలకు ఎర  కేసు దర్యాప్తులో భాగంగా రఘురామకు సంబంధించిన పలు కీలక విషయాలను సిట్ సేకరించిందని సమాచారం. ఈ క్రమంలోనే రఘురామను విచారణకు రావాలని తెలంగాణ సిట్ 41ఏ నోటీసు ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. అప్పుడు ఏపీ సీఐడీ యాక్షన్ వెనుక సీఎం జగన్ హస్తం ఉందని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇప్పుడు కూడా రఘురామకు తెలంగాణ సిట్ నోటీసులు ఇవ్వడం వెనుక సీఎం కేసీఆర్ ఉన్నారనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. అక్కడ సీఎం, ఇక్కడ సీఎం ఇద్దరూ ఒకే తానులో ముక్కల్లాంటి వారే అని.. రఘురామను ఇరుకున పెట్టేందుకు ఇద్దరి సంయుక్త వ్యూహం ఏమైనా ఉందా? అనే సంశయాలు రాజకీయ వర్గాలలో వ్యక్తమౌతున్నాయి.

అయ్యో ఏపీ కాంగ్రెస్!

ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పతనం నుంచి పతనానికి ప్రయాణం సాగిస్తోంది.​రాష్ట్ర విభజన ముందు వరకూ ఏపీలో కాంగ్రెస్ బలమైన పార్టీ. కానీ ఎప్పుడైతే రాష్ట్ర విభజన జరిగిందో అప్పటి నుంచీ రాష్ట్రంలో పార్టీ ఆనవాలు వెతుక్కోవలసిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర విభజన జరిగి ఎనిమిదేళ్లయినా రాష్ట్రంలో కాంగ్రెస్ ను పట్టించుకునే నాథుడే లేని పరిస్థితి ఉంది. దేశంలో చాలా రాష్ట్రాలలో కాంగ్రెస్ అధికారానికి దూరంగా ఉంది. సమీప భవిష్యత్ లో పుంజుకోగలదా అన్న అనుమానాలూ వ్యక్తమౌతున్నాయి. అయినా ఆయా రాష్ట్రాలలో కాంగ్రెస్ కు బలమైన క్యాడర్ ఉంది. అది ఎక్కడా చెక్కు చెదరలేదు. క్యాడర్ కు దిశా నిర్దేశం చేసే నాయకులు కరవయ్యారే కానీ.. ఇప్పటికీ దేశంలో ఒక్క ఏపీ మినహా అన్ని రాష్ట్రాలలోనూ కాంగ్రెస్ కు బలమైన క్యాడర్ ఉందనడంలో సందేహం లేదు. కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే గ్రాండ్ ఓల్డ్ పార్టీకి నాయకులు, క్యాడరూ కూడా లేని పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీ ఉనికే ప్రశ్నార్థకంగా మారిపోయి చాలా కాలమే అయ్యింది. హై కమాండ్ కూడా ఏపీలో పార్టీ పుంజుకోవడంపై ఎలాంటి ఆశలూ పెట్టుకోలేదని తాజాగా ప్రకటించిన కమిటీని చూస్తే ఇట్టే అర్దమైపోతుంది. ఇప్పటి వరకూ పీసీసీ చీఫ్ గా ఉన్న సాకే శైలజానాథ్ పదవీ కాలం ముగియడంతో ఆయన స్థానంలో గిడుగు రుద్రరాజును నియమించింది. నలుగురు కార్యనిర్వాహక అధ్యక్షులను మస్తాన్ వలి, జంగా గౌతమ్, సుంకర పద్మశ్రీ, రాకేష్ రెడ్డిలూ ఉన్నారు. అలాగే ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ గా పళ్లం రాజు, ప్రచార కమిటీ చైర్మన్ గా జీవీ హర్షకుమార్, మీడియా, సోషల్ మీడియా కమిటీ చైర్మన్ గా తులసి రెడ్డి నియమితులయ్యారు.  , 18మందితో రాజకీయ వ్యవహారాల కమిటీ, 33 మందితో కోఆర్డినేషన్‌ కమిటీని నియమించారు.  ఇప్పటి వరకూ ఏపీసీసీ చీఫ్ గా ఉన్న సాకే శైలజానాథ్ తన పదవీ కాలం మొత్తంలో రాష్ట్రంలో పార్టీ పుంజుకోవడంపై దృష్టి సారించిన సందర్భాలు పెద్దగా లేవనే చెప్పాలి. ఎప్పుడు పదవీ కాలం పూర్తవుతుందా.. బాధ్యతల నుంచి తప్పుకుందామా అని ఎదురు చూసినట్లుగానే ఆయన వైఖరి ఉంది. ఏపీసీసీ చీఫ్ గా సాకే ఎంత నిర్లిప్తంగా  పదవీ బాధ్యతలు నిర్వర్తించినా.. ఆయనకు పార్టీలో ఒక గుర్తింపు ఉంది. ఎమ్మెల్యేగా గెలిచిన చరిత్ర ఉంది. శింగనమల నియోజకవర్గం నుంచి వరుసగా రెండు సార్లు 2004, 2009 ఎన్నికలలో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. వైఎస్ హయాంలో మంత్రిగా  పని చేశారు. అసెంబ్లీలో బలంగా గొంతు వినిపించారు. సాకే శైలజానాథ్ కు ముందు  ఏపీ పీసీసీ చీఫ్ గా రఘువీరారెడ్డి ఉన్నారు. ఆయన కూడా క్షేత్రస్థాయిలో తనను తాను రుజువు చేసుకుని ఆ పదవి దక్కించుకున్నారు.  1985లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టిన రఘువీరారెడ్డి  1989లో మడకశిర నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున శాననసభ్యుడిగా ఎన్నికయ్యాడు. కోట్ల విజయభాస్కర రెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశాడు. ఆ తరువాత 1994 శాసనసభ ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. 1999, 2004 ఎన్నికలలో వరుసగా రెండు సార్లు విజయం సాధించారు.   వై.ఎస్.రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో వ్యవసాయ శాఖా మంత్రిగా పనిచేశారు.  2009 ఎన్నికల్లో కళ్యాణదుర్గం నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో మళ్లీ వ్యవసాయ శాఖా మంత్రిగా పనిచేశాడు. వై.ఎస్ మృతి తర్వాత కొణిజేటి రోశయ్య మంత్రివర్గంలో రెవిన్యూ శాఖా మంత్రిగా పనిచేశాడు. అనంతరం కిరణ్ కుమార్ రెడ్డి మంత్రి వర్గంలో కూడా రెవిన్యూ శాఖా మంత్రిగా కొనసాగారు. రాష్ట్ర విభజన అనంతరం ఆ పదవిని చేపట్టిన రఘువీరారెడ్డి.. అప్పుడున్న అంతటి ప్రతి కూల పరిస్థితుల్లో సైతం రాష్ట్రంలో పార్టీ కార్యక్రమాలను క్రమం తప్పకుండా నిర్వహించారు. చివరికి 2019 ఎన్నికలలో పార్టీ పరాజయానికి బాధ్యత వహిస్తూ అప్పటి ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రాజీనామా చేసిన తరువాత రఘువీరారెడ్డి అదే బాటలో నడిచి పక్కకు తప్పుకున్నారు. ఆ తరువాత సాకే శైలజానాథ్.. కానీ సాకే శైలజానాథ్ వారసుడిగా కాంగ్రెస్ హై కమాండ్ ఎంపిక చేసిన కమిటీని చూస్తే ఏపీలో పార్టీ భవిష్యత్ పై ఆశలు వదిలేసుకుందా అని పించక మానదు. ఇక ఏఐసీసీ పగ్గాలు అందుకున్న గిడుగు రుద్రరాజు గతంలో ఎమ్మెల్సీగా పని చేశారు. అలాగే ఏఐసీసీ కార్య‌ద‌ర్శిగా ఒడిశా రాష్ట్ర స‌హాయ ఇన్‌చార్జి బాధ్య‌త‌లు నిర్వ‌హించారు. అయితే ప్రత్యక్ష ఎన్నికలలో ఎన్నడూ నిలవలేదు. అలాగే క్షేత్ర స్థాయిలో ప్రజలతో మమేకమై పని చేసిన సందర్బం కూడా లేదు. వైఎస్సార్‌, కెవీపీలకు స‌న్నిహితుడిగా మెలిగారని చెప్పుకుంటారు. అయితే ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవలసిన విషయమేమిటంటే.. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయాలన్న సంకల్పం నిజంగా పార్టీలో ఉంటే.. ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలున్న నేతలకు పీసీసీ పగ్గాలు అప్పగించాలని, అయితే ఆ ఉద్దేశం పార్టీ హైకమాండ్ లో ఉన్నట్లు కనిపించడం లేదని పరిశీలకులు అంటున్నారు. రాష్ట్ర విభజన తరువాత నుంచీ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న సీనియర్లను మళ్లీ క్రియాశీలంగా చేసేందుకు ప్రయత్నాలు చేసి ఉండాల్సింది. అలా కాకుండా ఇప్పటికే ప్రజలతో సంబంధం కోల్పోయిన కాంగ్రెస్ కు అధ్యక్షుడిగా ప్రజలతో సంబంధాలు లేని నాయకుడిని నియమిస్తే ప్రయోజనం ఏమిటన్న ప్రశ్న కాంగ్రెస్ శ్రేణుల్లోనే వినిపిస్తోంది. ఇలా ఉంటే.. తనపై నమ్మకంతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించినందుకు అధిష్ఠానానికి కృతజ్ణతలు చెప్పిన గిడుగు అధిష్ఠానం నమ్మకాన్ని నిలుపుకుంటానని అన్నారు. రాష్ట్రంలో పార్టీ పటిష్టతకు శక్తి వంచన లేకుండా పాటుపడతానన్నారు.

జగన్ మారిపోయారు కానీ..

అవును... ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు  వైఎస్ జగన్మోహన్ రెడ్డి మారిపోయారు. ఆయనలో వచ్చిన ఈమార్పును ఎవరు గమనించారో, ఎవరు గమనించ లేదో ఏమో కానీ, ఆయనలో మార్పు అయితే వచ్చిందని, ఆయన నడక, నడత, మాట తీరును దగ్గరగా చూస్తున్న సన్నిహితులు చెప్పు కొస్తున్నారు.  ఒకప్పుడు జనంలో తిరుగుతూ ముద్దు మురిపాలతో ప్రజలను సమ్మోహితులను చేసిన   జగన్ రెడ్డి,  ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ జనం ముఖం చూసింది లేదు. ముద్దులిచ్చిందీ లేదు. మాట్లాడింది అసలే  లేదు. నిజానికి ముఖ్యమంత్రి దర్శన భాగ్యమే జనాలకు కరువైంది. సామాన్య ప్రజలకు మాత్రమే కాదు, మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ పెద్దలకు కూడా ఆయన అప్పాయింట్మెంట్ ఒక పట్టాన దొరకదని అంటారు.  ఆయన ప్యాలెస్ గడప దాటి బయటకు రారు. సామాన్య జనాలకు ప్యాలెస్ లోకి ప్రవేశం ఉండదు.సో, ఆయన ఎవరికీ కనిపించరు. వినిపించరు అనే ముద్ర పడిపోయింది.  అదలా ఉంటే, ముఖ్యమంత్రి   జగన్మోహన్ రెడ్డి తప్పనిసరై  వచ్చినా, పరదాల చాటునే  ఉండి పోవడం తప్ప, ప్రజల మధ్యకు వచ్చి పలకరించింది లేదు. చివరకు, ప్రజలను చూసి ఒక చిరునవ్వు చిందించిన సందర్భం కూడా లేదంటే, ఆశ్చర్య పోనవసరం లేదు. నిజం. ప్రతిపక్ష నేతగా,  ఒక్క ఛాన్స్ ప్లీజ్  అంటూ ప్రజల వెంటపడిన జగన్ రెడ్డి,ముఖ్యమంత్రి అయిన మరుక్షణం నుంచి, ఎవరికీ కనిపించకుండా నల్లపూసై పోయారని అంటారు.  అయితే, తరుముకొస్తున్న ఎన్నికల ప్రభావమో  దిన...దిన ప్రవర్ధమానంగా దిగజారుతున్న పలుకుబడి ప్రభావమో, వెంటాడుతున్న ఓటమి భయమో కారణం ఏమో కానీ జగన్ రెడ్డి  ఇక వాళ్ళను వీళ్ళను నమ్ముకుని లాభం లేదని స్వయంగా ఆయనే రంగంలోకి దిగాలనే నిర్ణయానికి వచ్చారు. గత కొద్ది రోజులుగా జిల్లాలలో పర్యటిస్తున్నారు. అయితే ఈ  జిల్లాల పర్యటనలోనూ ఆయన ప్రజలకు దగరయ్యే ప్రయత్నం చేయడం లేదు సరికదా, ప్రజల కదలికలపైనే కాదు, వారు ధరించే వస్త్రాలపైన ఆంక్షలు విధిస్తున్నారు. ఇటీవల నరసాపురం సభకు నల్ల చున్నీలు వేసుకుని వచ్చిన ఆడపిల్లల చున్నీలను పోలీసులు తీయించారు. అదేమంటే, పైవారి ఆదేశాలని పోలీసులు తప్పించుకుంటున్నారు.   ముఖ్యమంత్రి వస్తున్నారంటే, పోలీసులు భయానక వాతావరణం సృష్టిస్తున్నారని, ప్రతిపక్షాలు ఆరో పిస్తున్నాయి.  అయితే జగన్ రెడ్డిలో వచ్చిన మార్పు ఇదేనా అంటే,  ఇది మాత్రమే కాదు, ఆయన భాషలోనూ మార్పు వచ్చిందని అంటున్నారు. ఓవంక మీటలు నొక్కి పైసలు పంచుతున్నాను కాబట్టి, ప్రజలు చచ్చినట్లు మళ్ళీ తమకే ఓటు వేసి పట్టం కట్టాలని దబాయింపు ధోరణిలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి మరో వంక స్థాయిని మరిచి ప్రతిపక్ష పార్టీల నాయకులపై దూషణకు దిగుతున్నారు. జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అనే విషయం మరిచి పోయారు, బూతుల మంత్రుల బాధ్యతలను కూడా ఆయనే పుచ్చుకున్నారో ఏమో కానీ, ఒక ముఖ్యమంత్రి నోటి నుంచి రాకుడని మాటలు వస్తున్నాయి. వినకూడని మాటలు వినవలసి వస్తోందని, అంటున్నారు. “ప్రతిపక్షాలు నా వెంట్రుక కూడా పీకలేవు” అంటూ బూతు పురాణానికి శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి, రోజు రోజుకు మరింతగా దిగాజరుతున్నారని, వైసీపీ నేతలు కూడా విచారం వ్యక్తం చేస్తున్నారు. తనను తను రాముడితో పోల్చుకుంటూ, ప్రతిపక్ష పార్టీల నాయకులను రావణాసురునితో  పోల్చడం ఏమిటని, ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి బహిరంగ వేదిక నుంచి ఇలాంటి అసభ్య భాషను ప్రయోగించడం ఎంత వరకు సమంజసమని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.  ప్రతిపక్ష నాయకులనే కాదు, మీడియా సంస్థల అధిపతులనూ పేరు పెట్టి మరీ, దుష్ట చతుష్టయం అంటూ  దూషిస్తున్నారు. ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా మీడియాపై విమర్శలు గుప్పించినా ఆయన ఏనాడు వ్యక్తులను టార్గెట్ చేయలేదని, ఆ రెండు పత్రికలు అంటూ  మాత్రమే తప్పు పట్టరాని గుర్తు చేస్తున్నారు. అయితే జగన్ రెడ్డి ఆ మాత్రం కనీస మర్యాద అయినా లేకుండా మాట జారుతున్నారని అంటున్నారు .అయితే ముఖ్యమంత్రి ఫ్రస్ట్రేషన్ లో ఇలాంటి మాటలు దిగజారుడు భాష మాట్లాడుతున్నారా, లేక  ప్రతిపక్షాలను రెచ్చగొట్టేందుకు ఇలా  ప్రవర్తిస్తున్నారా, అంటే ముఖ్యమంత్రిలో వచ్చిన మార్పుకు ఇంకా వేరే కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ,  ప్రధాన కారణం మాత్రం ఓటమి భయమే అంటున్నారు.  నిజం. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మాటలోనే కాదు. నడకలో, నడతలో చివరకు ఆయన తీసుకుంటున్న ప్రాంతీయ సమన్వయ కర్తల మార్పు వంటి రాజకీయ నిర్ణయాలు కూడా ఆయనలోని ఫ్రస్ట్రేషన్, ఓటమి భయాన్ని చూపుతున్నాయని అంటున్నారు.

దర్యాప్తు సంస్థలపైనే ఎదురు కేసులు.. తెలుగు రాష్ట్రాలలో కొత్త ధోరణి

దర్యాప్తు సంస్థలంటే ఇక రాజకీయ నాయకులకు భయం పోయిందా? వాటి దూకుడుకు అడ్డు కట్ట వేసే కిటుకు వారు కనిపెట్టేశారా? అంటే ప్రస్తత పరిస్థితులను గమనిస్తే ఔననే అనాల్సి వస్తుంది. దర్యాప్తు సంస్థల దూకుడును అరికట్టడానికి ఏం చేయాలో మాత్రం ముందుగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ దారి చూపారని చెప్పాలి.  ఆ తరువాత దానినే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫాలో అవుతున్నారు. రాజకీయ అవసరాలకు, ప్రయోజనాలకు దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  వరుసగా జరుగుతున్న సంఘటనలు ఆ ఆరోపణలను బలపరిచేవిగానే ఉన్నాయి. వాస్తవానికి ప్రస్తుతం తెలంగాణలో పరిస్థితి చూస్తుంటే.. రాష్ట్రంలో  కేంద్రంలోని బీజేపీ సర్కార్, రాష్ట్రంలోని తెరాస సర్కార్ మధ్య యుద్ధం జరుగుతున్నదా అన్నట్లుగానే ఉంది. కేంద్రం తెరాస నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు లక్ష్యంగా కేంద్ర దర్యాప్తు సంస్థలతో దాడులకు పాల్పడుతోందన్న ఆరోపణలు ఎదుర్కొంటుంటే.. తెరాస కేంద్రం నేతలు లక్ష్యంగా ఏకంగా ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్)ను ఏర్పాటు చేసిందన్న ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. మొత్తం మీద రాజకీయ పంజరంలో దర్యాప్తు సంస్థలు బందీ అయిపోయాన్న భావన మాత్రం సామాన్య జనంలో బలంగా ఏర్పడిందనడంలో సందేహం లేదు. ఇక దర్యాప్తు సంస్థల తనిఖీలు, దాడులు, సోదాలను ఎదురుదాడితోనే ఎదుర్కొవాలన్న నిర్ణయానికి రాజకీయ పార్టీలు వచ్చేశాయని చెప్పక తప్పదు. దర్యాప్తు సంస్థల అధికారులపై ఎదురు కేసులు పెట్టడం ద్వారా దర్యాప్తును నీరుగార్చడం, లేదా జాప్యం అయ్యేలా చూడటం అన్న ఎత్తుగడను రాజకీయ పార్టీలు అనుసరిస్తున్నాయి. ఈ ధోరణి వైసీపీ సర్కార్ పాలనలోని ఏపీలో తొలుత మొదలైందని చెప్పాలి. వైఎస్ వివేకా హత్య కేసు ఏపీ సర్కార్ కు ఇష్టం లేకపోయినా సర్కార్ ప్రమేయం లేకుండా నేరుగా హై కోర్టు సీబీఐకి అప్పగించింది. కేసు దర్యాప్తును సీబీఐ చేపట్టీ పట్టడంతోనే తీగలు లాగేసింది.. డొంకలు వరకూ దర్యాప్తు చేరిపోయింది. వివేకా హత్య వెనుక సూత్రధారులు ఇక వెలుగులోనికి వచ్చేసినట్లు అన్న పరిస్థితి ఏర్పడింది. అప్పుడు మొదలైంది సీబీఐ అధికారులపై ఎదురు కేసులు పెట్టడమనే ప్రక్రియ. అలాగే దాడుల ప్రక్రియ. దీంతో కొలిక్కి వచ్చిందనుకున్న దర్యాప్తు పురోగతి మందగించింది. దీంతో స్వయంగా సీబీఐయే హైకోర్టుకు తమపై ప్రైవేటు ఫిర్యాదులు దాఖలు చేస్తున్నారనీ, పరిస్థితి ఇలాగే కొనసాగితే దర్యాప్తు ముందుకు సాగే అవకాశం లేదనీ చెప్పుకుంది. చివరకు వివేకా హత్య కేసు విచారణ  ఏపీ బయట జరిగేలా ఉత్తర్వులు ఇవ్వడానికి తమకు అభ్యంతరం లేదని సుప్రీం కోర్టుకు కూడా విన్నవించుకుంది.ఇక ఇప్పుడు తెలంగాణలో కూడా కేంద్ర దర్యాప్తు సంస్థల దూకుడును సరిగ్గా అలాగే అడ్డుకోవాలని కేసీఆర్ తమ పార్టీ నేతలకు సూచించారు. దర్యాప్తు సంస్థలపై తిరగబడండని ఏకంగా పిలుపు నిచ్చారు. మంత్రి మల్లారెడ్డి కేసీఆర్ చెప్పింది అమలులో పెట్టేశారు కూడా. తన నివాసాలు కార్యాలయాలు, అలాగే తన బంధువుల నివాసాలు, కార్యాలయాలపై ఐటీ అధికారులు ఏకకాలంలో జరిపిన సోదాలను రాజకీయ కక్ష పూరితమైనవేనని ఆరోపించడమే కాకుండా తన కుమారుడిపై ఐటీ అధికారులు చేయి చేసుకున్నారంటూ ఆరోపణలకు గుప్పించారు. ఆస్పత్రి పాలైన కుమారుడిని చూడనీయడం లేదంటూ తన ఆస్పత్రి ముందే ధర్నాకు దిగారు. అంతే కాదు తన కుమారుడిపై ఒత్తిడి తీసుకువచ్చి ఐటీ అధికారులు కొన్ని కాగితాలపై బలవంతంగా సంతకాలు తీసుకున్నారని పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదుపై ఐటీ అధికారపై కేసు నమోదైంది. మొత్తం మీద కేంద్ర దర్యాప్తు సంస్థలు రాజకీయ క్రీడలో పావులుగా మారిపోయి దిక్కు తోచని పరిస్థితుల్లో పడిన పరిస్థితి తెలుగు రాష్ట్రాలలో కనిపిస్తోంది.  దీంతో దర్యాప్తు సంస్థలు సజావుగా తమ పని కొనసాగించే పరిస్థితి అయితే తెలుగు రాష్ట్రాలలో కనిపించడం లేదు. ఇందుకు అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది.

జగన్ దృష్టిలో కొడాలి నాని కూరలో కరివేపాకేనా?

 అధినేత అండ తనకు మెండుగా ఉందనుకున్నారు.. ఆపైన మంత్రి పదవి కూడా ఇవ్వడంతో రెచ్చిపోయారు.. తనకు ఇక తిరుగే ఉండదనుకున్నారు. అబ్బో.. అధినేత తనకు ఎంత ప్రాధాన్యం ఇచ్చేస్తున్నారో.. అని ఊహించుకుని ఓవర్ యాక్షన్ డోస్ పెంచేశారు.  టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ , ఇతర టీడీపీ నేతల పై  నిత్యం నోటికొచ్చిన మాటలతో హద్దులు దాటి విమర్శలు చేశారు. చంద్రబాబును తిడితే చాలు తన స్థానం పదిలం అనుకున్న ఆయన ప్రస్తుతం గుడివాడ ఎమ్మెల్యేగా మాత్రమే మిగిలిన మాజీ మంత్రి కొడాలి నాని. జగన్ రెడ్డి తన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా కొడాలి నాని అమాత్య పదవి పీకేశారు. దాంతో కంగు తిన్న కొడాలిని పల్నాడు ప్రాంతీయ సమన్వయకర్త అనే ముద్ర వేసి కొద్దిరోజులు సంతృప్తి పడమన్నారు. తాజాగా ఆ పదవి నుంచి కూడా పీకేసి నీ స్థాయి ఇదే అని చెప్పకనే చెప్పారు. దీంతో కొడాలి నాని పరిస్థితి ఇప్పుడు కూరలో కరివేపాకులా అయిందని  వైసీపీ శ్రేణులో జోకులేసుకుంటున్నాయి. అచ్చోసిన ఆంబోతులా రెచ్చిపోయిన కొడాలి నానికి తగిన శాస్తే జరిగిందని ప్రత్యర్థులు వ్యాఖ్యానిస్తున్నారు. నోరు తెరిస్తే.. బూతులు మాట్లాడే మాజీ మంత్రి కొడాలి పరిస్థితి ఇప్పుడు అగమ్య గోచరంగా మారిందన్న భావన ఇటు సొంత పార్టీలోనూ, అటు విపక్ష నేతల్లోనూ వ్యక్తమౌతోంది. గతంలో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ సమయంలో మంత్రి పదవి  కోల్పోయిన సందర్భంలో కొన్ని రోజులు తన పశువులపాకలో నులక మంచంపై వెల్లకిలా పడుకుని దిగులుగా కనిపించిన కొడాలి నాని   ఉన్న ఒక్క చిన్న పదవి కూడా చేజారడంతో ఇప్పుడెలా కనిపిస్తారో చూడాలన్న ఆసక్తి వైసీపీ శ్రేణుల్లో కూడా వ్యక్తమౌతోంది. సరే మంత్రి పదవి పోయినప్పుడు కొంతకాలం స్తబ్ధుగా ఉన్న కొడాలి.. మళ్లీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉంటుందనే లీకులు రావడంతో మరోసారి తన బూతుల విశ్వరూపం ప్రదర్శించారు. ఆ తర్వాత కేబినెట్ రీ షఫిల్ విషయాన్ని సీఎం జగన్ పక్కన పెట్టేయడంతో మళ్లీ మౌనంలోకి జారుకున్నారు. తర్వాత విజయవాడలోని డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు తొలగించి, డాక్టర్ వైఎస్సార్ హెల్త్ వర్శిటీగా మార్చినప్పుడు అధినేత ఆదేశానుసారం కొడాలి నాని కిమ్మనకుండా ఉన్నారు. ఒక జిల్లాకే ఎన్టీఆర్ పేరు పెట్టినప్పుడు ప్రశంసించని వారు వర్శిటీ పేరులో ఎన్టీఆర్ తొలగించడంపై ఎందుకు స్పిందిస్తున్నారంటూ తన సహజ బూతుల ధోరణిలో కొడాలి ఆని స్పందించడం గమనార్హం. ఇంకో పక్కన గుడివాడ నియోజకవర్గంలో తనను గెలవనివ్వకూడదని టీడీపీ అధినేత కంకణం కట్టుకుని బలమైన అభ్యర్థిని బరిలో దింపే యత్నాలు చేస్తుండడంతో మళ్లీ రెచ్చిపోయారు. తనపై గుడివాడ బరిలో నేరుగా చంద్రబాబు దిగినా.. నారా లోకేశ్ నిలబడినా.. లేదా కోట్ల రూపాయలు తెచ్చి ఎన్నారైతో ఢీకొట్టాలని చూసినా.. ఓటర్లు తనకే  పట్టం కడతారని కొడాలి నాని గొప్పలు పోయారు. ఇత తాజాగా వైసీపీ కేబినెట్ లో కమ్మ సామాజికవర్గానికి చోటు లేకుండా చేసిన జగన్ తీరును తప్పుపట్టిన మాజీ మంత్రి, సీనియర్ నేత వసంత నాగేశ్వరరావు పై కొడాలి నాని తీవ్రంగా స్పందించడం విశేషం. కేబినెట్ మంత్రి పదవి ఇస్తేనే కమ్మ సామాజికవర్గానికి ప్రాధాన్యం ఇచ్చినట్టా? అని ప్రశ్నించారు. చివరికి కొడాలి నాని ఎంతదాకా వెళ్లారంటే.. ప్రతిపక్ష నేత చంద్రబాబు కమ్మ సామాజికవర్గానికి చెందినవారే కదా..! ఆయనది కేబినెట్ ర్యాంకే కదా అని  వ్యాఖ్యానించేంత వరకూ వెళ్లారు.   ప్రతిపక్షనేత పోస్టును కూడా ప్రభుత్వం ఖాతాలో వేసేందుకు కూడా కొడాలి తెగించేశారు. వైసీపీ అధినేతకు కొడాలి నాని ఎంత గట్టి మద్దతుదారుగా ఉన్నప్పటికీ ఆయన ఒక్కొక్క పదవినీ పీకేస్తూ.. జగన్ నిర్ణయాలు తీసుకోవడం చూస్తే   ఆయన గుడివాడలో  నెగ్గడం  సంగతి దేవుడెరుగు.. అసలు పోటీ చేయడానికి పార్టీ టికెట్టైనా వస్తుందా? అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. అనుమానాలు కలుగుతున్నాయి.  జగన్ ఇప్పటి వరకూ వాడుకుని వదిలేసిన నాయకుల జాబితాలో తాజాగా ఇప్పుడు కొడాలి నాని పేరు కూడా చేరింది. 

మంత్రి కాకాణి ఇరుక్కున్నట్లేనా?.. ఫైల్స్ చోరీ కేసు సీబీఐకి

ఏపీ మంత్రి కాకాణి గోవర్ధర్ రెడ్డికి ఏపీ హైకోర్టులో షాక్ తగిలింది. ఆయనపై ఉన్న ఫైళ్ల చోరీ కేసును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది.  ఈ ఏడాది ఏప్రిల్‌ 13న నెల్లూరు నాలుగో అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో ఓ చోరీ జరిగింది. కొన్ని కీలకమైన ఫైళ్లు మాయం కావడం అప్పట్లో కలకలం రేపింది.  ఈ దొంగతనం కేసులో పోలీసుల దర్యాప్తు సరిగా జరగడం లేదని..  స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపిస్తేనే  వాస్తవాలు బయటపడతాయని నెల్లూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి అప్పట్లో ఇచ్చిన అప్పట్లో నివేదికను సుమోటో పిల్‌గా పరిగణించి విచారణకు స్వీకరించింది. అసలింతకీ  ఏం జరిగిందంటే..  అప్పటి కి ఎమ్మెల్యే అయిన కాకాణి గోవర్థన్  తెలుగుదేశం సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి సోమిరెడ్డికి విదేశాల్లో భారీగా ఆస్తులు ఉన్నాయని.. కొన్ని పత్రాలను మీడియాకు విడుదల చేశారు. వెంటనే స్పందించిన చంద్రమోహన్ రెడ్డి కాకాణిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో కాకాణి విడుదల చేసిన డాక్యుమెంట్లు ఫేక్ అని ఛార్జ్‌షీట్ ఫైల్ చేశారు. కేసు విచారణలో ఉన్న సమయంలోనే  కాకాణికి జగన్ కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో మంత్రి పదవి  దక్కింది. ఈ క్రమంలోనే ఈ ఏడాది ఏప్రిల్‌లో నెల్లూరులోని కోర్టులో చోరీ జరిగింది.  ఈ దొంగతనం కేసులో.. కోర్టు నుంచి కీలకమైన డాక్యుమెంట్లు, ఎలక్ట్రానిక్‌ వస్తువులు చోరీ అయ్యాయని ఆరోపణలు వచ్చాయి. కాకాణి కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లు మాయం అయ్యాయని గుర్తించడంతో ఈ వ్యవహారం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆ కేసునే సీబీఐకి అప్పగిస్తూ ఇప్పుడు ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చింది. కాగా    మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి  ఫైల్స్ చోరీ ఘటనపై దర్యాప్తు  సీబీఐకి అప్పగిస్తే కాకాణి ఇరుక్కోవడం ఖాయమన్న చర్చ అప్పట్లోనే జోరుగా సాగింది.    నెల్లూరు కోర్టులో ఉన్న ఫైల్స్ చోరీ అయ్యాయని ముందుగా ఒప్పంద బెంచ్ క్లర్క్ గా పనిచేస్తున్న నాగేశ్వరరావు చేసిన ఫిర్యాదుపై అసలా ఫైల్స్ కోర్టు అధీనంలోనే లేవని, అవి పోలీస్ స్టేషన్ లో ఉన్నాయని నెల్లూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ సి.యామిని హైకోర్టుకు నివేదిక సమర్పించడం అప్పట్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.   గుర్తు తెలియని వ్యక్తులతో బెంచి క్లర్కు నాగేశ్వరరావు కుమ్మక్కై కట్టుకథ అల్లాడని, పత్రాలు చోరీ అయ్యాయని కోర్టును తప్పదారి పట్టించాడని ఆ నివేదికలో జస్టిస్ యామిని పేర్కొన్నారు. అంతే కాకుండా  ఈ మొత్తం వ్యవహారంపై స్వతంత్ర సంస్థతో సమగ్రంగా దర్యాప్తు చేయించాలని తన నివేదికలో జస్టిస్ యామిని హైకోర్టుకు విన్నవించారు.  ఆ మేరకే ఇప్పుడు హైకోర్టు ఈ కేసును సీబీఐకి అప్పగించింది. 

ఏపీలో 2024లో 2014 ..?

నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజుకు పరిచయం అక్కరలేదు.ఆయన పేరుకు ముందు వెనక వైసీపీ రెబెల్ ఎంపీ అనే విశేషం తగిలించవలసిన అవసరం అసలే లేదు. ఆయన జగమెరిగిన రెబెల్. సన్నికల్లు తొక్కిన నాడే సంసారం యోగం తెలిసొచ్చింది’ అన్నట్లు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే రఘురామ కృష్ణం రాజు, పొంచి ఉన్నజగన్ రెడ్డి సుందర ముదనష్ట పాలన ప్రమాదాన్నిగుర్తించారు. ఇక అక్కడి నుంచి, రచ్చబండ పెట్టి, జగన్ రెడ్డి దుర్మార్గ, దుష్ట పాలనను ఎండగడుతూ వస్తున్నారు. అందుకు, జగన్ రెడ్డి ప్రభుత్వం ఆగ్రహానికి గురయ్యారు. ఒక విధంగా అనేక కష్టాలను ఎదుర్కున్నారు.  అవును, అసలే ఆయన జగన్ రెడ్డి, పైగా ఏసు దేవునితో డైరెక్ట్ గా మాట్లాడే హాట్లైన్ సౌలభ్యమున్న దేవుని పుత్రుడు. దైవాంశ సంభూతుడైన ప్రభువు. అలా  అన్ని మహిమలు, మహత్తులు, అరాచక శక్తులు ఉన్న ముఖ్యమంత్రిని విమర్శిస్తే ఆయన ఊరుకుంటారా? ఊరుకోరు, ఊరుకోలేదు.  ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రభుత్వం ఆయన్ను ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీరు తాగించింది .సామ దాన దండోపాయాలు ప్రయోగించి, ఆయన నోటికి తాళం వేసే ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నం ఫలించలేదు. చివరకు పోలీసులకు పని చెప్పింది. పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయడమే కాకుండా, ఆయన ఒక ఎంపీ అని అయినా చూడకుండా తమదైన పద్దతిలో ఆయనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు.ఆయన మారలేదు దారికి రాలేదు. అన్నిటినీ మించి ఆయన తన సొంత నియోజక వర్గంలో కాలుపెట్టకుండా వైసీపీ ప్రభుత్వం అడ్డుకుంది. ఆయన ఎంపీగా గెలిచి మూడున్నరేళ్ళు అవుతున్నా,మొదటి ఐదారు నెలల్లో తప్పించి, ఆ తర్వాత మళ్ళీ నియోజకవర్గంలో కాలు పెట్టలేదు. పెట్టలేదు అంటే, జగన్ రెడ్డి ప్రభుత్వం, వైసీపీ నాయకత్వం ఆయన నియోజక వర్గంలో అడుగు పెట్టకుండా అడ్డుకుంది.   ఇదంతా నడుస్తున్న చరిత్ర. ఇక ప్రస్తుతంలోకి వస్తే, ఆయన ఐదేళ్ళ పదవీ కాలం ముగింపు కోస్తోంది. 2024 సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్నాయి.రాజకీయ యుద్ద సన్నాహాలు, పొత్తులు ఎత్తులపై చర్చలు మొదలయ్యాయి. లోక్ సభ ఎన్నికలతో పాటే అసెంబ్లీ ఎన్నికలు కూడా  ఉన్న నేపధ్యంలో అటు అధికార వైసీపీ, ఇటు ప్రధాన ప్రతిపక్షం తెలుగు దేశం ఎన్నికలకు సిద్దమవుతున్నాయి. ఈ నేపధ్యంలో రఘురామ కృష్ణం రాజు రాజకీయ భవిష్యత్ ఏమిటి? ఆయన మళ్ళీ నర్సాపురం నుంచి ఎంపీగా పోటీ చేస్తారా? చేస్తే, ఏ పార్టీ టికెట్ మీద పోటీ చేస్తారు? అనేది ప్రశ్నార్ధకంగా మారింది. రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.  వైసీపీ ఆయనకు మళ్ళీ టికెట్ ఇవ్వదు. ఒక వేళ ఇచ్చినా,పుచ్చుకునేందుకు అయన సిద్దంగా లేరు. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. సో... ఆయన ఏ పార్టీలో చేరతారు? అనే ప్రశ్న మళ్ళీ మరో మారు చర్చకు వచ్చింది. ఒకప్పుడు ఆయన బీజేపీలో చేరతారనే  ప్రచారం జరిగింది. మీడియాలో ముహూర్తాలు కూడా ఖరారయ్యాయి.మరోవంక  ఆయన కూడా బీజేపీ వైపు మొగ్గుచూపుతున్న సంకేతాలు ఇచ్చారు. ఢిల్లీ బీజేపీ నాయకులతో పాటుగా,నాగపూర్  ఆర్ఎస్ఎస్ నాయకులతోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నట్లుగా వార్తలొచ్చాయి. పార్లమెంట్ లోపల వెలుపల కూడా ఆయన ఆర్ఎస్ఎస్ భాషలో మాట్లాడుతూ వచ్చారు. బీజేపీ ప్రభుత్వం కూడా ఆయనకు వై కేటగిరీ రక్షణ కలిపించడంతో పాటుగా ఇతర సదుపాయాలు కల్పించింది. అయితే, ఏమైందో ఏమో కానీ,ఆయన బీజేపీలో అయితే చేరలేదు.  అయితే అదలా ఉంటే, ఇప్పడు పుణ్య కాలం పూర్తవుతున్న నేపధ్యంలో, ఆయన తమ రాజకీయ భవిష్యత్ తో పాటుగా రాష్ట్ర రాజకీయ భవిష్యత్ ముఖ చిత్రం గురించి కూడా క్లారిటీ ఇచ్చారు.ఎవరు ఏ పార్టీలో చేరతారు,ఏ పార్టీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటుంది,అనేది అప్రస్తుతం. ప్రజలు అయితే, ఒక నిర్ణయానికి వచ్చారు. అంతే కాదు, 2024 ఎన్నికలలో రెండు కాదు,మూడు ప్రధాన పార్టీలు కలిసి కూటమిగా పోటీ చేస్తాయి, నిజానికి, జనం ఇప్పటికే జగన్ రెడ్డి పాలనకు వీడ్కోలు పలికేందుకు సిద్దంగా ఉన్నారని చెప్పుకొచ్చారు. ఇప్పుడు బంతి నాయకుల చేతిలో ఉందని, పార్టీలు కలవకపోతే నాయకులకే నష్టమన్నారు. ఇక తాను ఏ పార్టీ నుంచి పోటీ చేస్తాననే ప్రశ్నకు ఆయన ఆసక్తికర సమధానమే ఇచ్చారు. వైసీపీని ఓడించే ప్రధాన కూటమి అభ్యర్ధిగా పోటీ చేస్తానని, మర్మగర్భంగా అయినా, ఆయన ప్రధాన ప్రతిపక్ష (టీడీపీ) కూటమి తరపున పోటీ చేస్తానని చెప్పుకొచ్చారు. సరే, నేరుగా తెలుగు దేశం పార్టీలో చేరతారా లేక మరో రూట్’లో టీడీపీ కూటమితో జట్టు కడతారా అనే విషయాన్ని పక్కన పెడితే, నిస్సందేహంగా ఆయన టీడీపీ, చంద్రబాబు నాయుడు సారధ్యంలో టీడీపీ, బీజేపీ,జన సేన కూటమి ఏర్పడాలని కోరుకుంటున్నారు అనేది మాత్రం స్పష్టం చేశారు. అలాగే, ఆయన గద్దె దించేందుకు జట్టు కట్టే కూటమిలో రెండు పార్టీలు (టీడీపీ, జనసేన) ఖచ్చితంగా ఉంటాయని, మూడో పార్టీ (బీజేపీ) కూడా ప్రధాన ప్రతిపక్ష కూటమిలో చేరే అవకాశాలు కూడా ఉన్నాయని.. తేల్చి చెప్పారు. అంతే కాదు  కొంత తటపటాయిస్తూనే అయినా, ముసుగులో గుద్దులాట ఎందుకు.. ఓపెన్‌గా చెబుతున్నా, కచ్చితంగా మూడు పార్టీలు ఉంటాయన్నది తన నమ్మకమని స్పష్టం చేశారు. కొంతమంది రాష్ట్ర నాయకులు ఏమి చెప్పినా, ఏమి మాట్లాడినా, ఢిల్లీ నాయకత్వం మాత్రం మూడు పార్టీల కూటమి వైపే మొగ్గు చూపుతోందని, తన మనసులోని మాటను రఘురామ రాజు బయట పెట్టారు.  రఘురామ కృష్ణం రాజు వ్యక్త పరిచిన అభిప్రాయాన్ని, ఆయన ఆ మనసులోని మాటను, జరుగతున్న పరిణామాలను గమనిస్తే, 2024 లో 2014 పునరావృతం కావడం ఖాయంగా కనిపిస్తోందని పరిశీలకులు భావిస్తున్నారు. తెలుగు దేశం పార్టీకి లభిస్తున్న ప్రజాదరణను, అదే విధంగా వైసేపీ ప్రభుత్వం గడప గడపన ఎదుర్కున్న వ్యతిరేకతను గుర్తించే, బీజేపీ నాయకత్వం పునరాలోచనలో పడిందని, అందులో భాగంగానే, జీ-20 భాగస్వామ్య దేశాల సమావేశాలపై చర్చినేందుకు ప్రధాని నరేంద్ర మోడీ సారధ్యంలో, వచ్చే నెల ( డిసెంబర్) 5న ఢిల్లీలో ఏర్పాటు చేసిన కీలక సమావేశానికి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకి ప్రత్యేక ఆహ్వానం అందిందని పరిశీలకులు భావిస్తున్నారు. నిజానికి, బీజేపీ జాతీయ నాయకత్వం, ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ, అవకాశం చిక్కిన ప్రతి సందర్భంలో చంద్రబాబు నాయుడుతో మైత్రీని కోరుకుంటున్న సంకేతాలు ఇస్తూనే ఉన్నారని, గతంలో ఆగస్టులో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఆజాదీకా అమృతోత్సవ్ పై జరిగిన సమావేశానికి కూడా చంద్రబాబుకు ఆహ్వానం అందింది. ఆ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ, చంద్రాబాబు నాయుడుతో కొద్ది సేపు ప్రత్యేకంగా మాట్లాడారు, ఢిల్లీ వస్తూ ఉండండని చంద్రబాబు నాయుడుకు ఆహ్వానం పలికారు. ఇక అప్పటి నుంచీ కూడా తెలుగుదేశం, బీజేపీల మధ్య దూరం తగ్గుతూ వచ్చింది. డిసెంబర్ 5 సమావేశం తర్వాత ఈ దూరం మరింత తగ్గుతుందని, అంటున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి తెర వెనక సాగిస్తున్న  రాజకీయాలను పసిగట్టిన మోడీ, వారికి చెక్ పెట్టేందుకు చంద్రబాబుతో సఖ్యత కోరుకుంటున్నారని అంటున్నారు. అందుకే రాజకీయాలలో ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చును అంటారు.అది నిజమే అనిపిస్తోంది.

మంత్రి మల్లారెడ్డిపై ఆర్నెళ్ల ముందునుంచే ఐటీ నజర్?!

ఐటీ దాడుల్లో మంత్రి మల్లారెడ్డి అడ్డంగా దొరికేశారా? కేంద్రంతో కాలు దువ్విన కేసీఆర్ ను ఇరుకున పెట్టేందుకే వరుసగా తెరాస నేతల నివాసాలు, కార్యాలయాలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు నజర్ పెట్టాయా అంటే ఔననే పరిస్థితులే ఉన్నా.. మల్లా రెడ్డి వ్యవహారం కొంచం డిఫరెంట్ అంటున్నారు పరిశీలకులు. మల్లారెడ్డి వ్యాపారాలు, నివాసాలపై ఐటీ అధికారుల దాడులు కేవలం ప్రస్తతం ఉన్న రాజకీయ వాతావరణం నేపథ్యంలో చేసినవే అనుకోవడానికి వీల్లేదంటున్నారు.  గత కొన్ని నెలలుగా మల్లారెడ్డి వ్యాపార కార్యక్రమాలపై, కార్యకలాపాలపై ఐటీ నజర్ పెట్టిందంటున్నారు. ఏదో రాష్ట్రంలో రాజకీయ వేడి పుట్టించేందకు జరిగిన దాడులలో వీటిని లైట్ తీసుకోవడానికి వీల్లేనంతగా మల్లారెడ్డి ఇరుక్కున్నారనే విశ్లేషణలు వస్తున్నాయి. గత కొన్ని నెలలుగా ఐటీ అధికారులు మంత్రి మల్లారెడ్డి వ్యాపార కార్యక్రమాలు మ‌ల్లారెడ్డి వ్యాపారాల‌పై ఐటీ అధికారులు దాడులను ఒక‌టిరెండు రోజుల్లో ప్లాన్ చేసింది కాద‌ట‌. గ‌త ఆర్నెళ్లుగా ఐటీ అధికారులు మంత్రి మ‌ల్లారెడ్డి, వారి కుటుంబ స‌భ్యుల అకౌంట్‌ల‌లో న‌గ‌దు వివ‌రాల‌పైనా ఆరా తీస్తున్నారంటున్నారు.   రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారులుగా, తమ భూమిని కొనుగోలు చేయాలంటూ మంత్రి వ‌ద్ద‌ ఐటీ అధికారులు స్టింగ్ ఆపరేషన్ కూడా నిర్వహించారని విశ్వసనీయంగా తెలిసింది. వీటన్నిటినీ బట్టి చూస్తే పక్కా ప్రణాళికతోనే మల్లారెడ్డి వ్యాపారాలపై  ఐటీ అధికారులు సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది.  మంగ‌ళ‌వారం(నవంబర్ 22) రాత్రి వేర్వేరు చోట్ల నిర్వహించిన సోదాలలో దాదాపు రూ.4 కోట్ల రూపాయల నగదు, ఐటీ రిటర్నులు, పన్ను చెల్లింపులకు సంబంధించిన సీడీలు, కంప్యూటర్ డిస్క్ లు ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. బుధ‌వారం(నవంబర్ 23)సైతం కీల‌క ప‌త్రాల‌ను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్న‌ట్లు స‌మాచారం.   మంత్రి మల్లారెడ్డి, ఆయన బంధువుల ఇళ్లు, కార్యాలయాలపై నిర్వహించిన ఐటీ దాడులు ముగిశాయి. సోమవారం నాడు తమ విచారణకు హాజరుకావాలంటూ మల్లారెడ్డి సహా, ఆయన కుమారులు, అల్లుడికి ఐటీ అధికారులు నోటీసులు జారీ చేశారు.  ఇప్పటి మల్లారెడ్డి, ఆయన బంధువులు, సన్నిహితుల ఇళ్లల్లో జరిపిన సోదాలలో స్వాధీనం చేసుకున్న నగదు వివరాలనూ ఐటీ అధికారలు వెల్లడించారు. ఆ ప్రకారం మల్లారెడ్డి నివాసంలో - రూ. 6 లక్షలు, మల్లారెడ్డి పెద్ద కుమారుడు మహేందర్ రెడ్డి నివాసంలో - రూ. 12 లక్షలు, మల్లారెడ్డి చిన్న కుమారుడు భద్రారెడ్డి నివాసంలో - రూ. 6 లక్షలు, మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి నివాసంలో - రూ. 3 కోట్లు, ప్రవీణ్ రెడ్డి ఇంట్లో - రూ. 1.5 కోట్లు, త్రిశూల్ రెడ్డి నివాసంలో - రూ. 2 కోట్లు, రఘునందన్ రెడ్డి నివాసంలో - రూ. 2 కోట్లు, ప్రవీణ్ కుమార్ నివాసంలో - రూ. 2.5 కోట్లు, సుధీర్ రెడ్డి నివాసంలో - రూ. కోటి స్వాధీనం చేసుకున్నారు. 

ఎంసీడీ ప్రచారంలో బీజేపీ మోడీ భజన

దేశ రాజధాని ఢిల్లీ ఇప్పుడు ఎలక్షన్ ఫీవర్ తో రగిలిపోతోంది. అదేంటి సార్వత్రిక ఎన్నికలకు ఇంకా ఏణ్ణర్ధం సమయం ఉంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలూ ఇప్పట్లో లేవు. ఇక ఎన్నికల ఫీవర్ ఏమిటంటారా? ఔను మరి ఇప్పుడు ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం. మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (ఎంసీడీ)కి వచ్చే నెలలో ఎన్నికలు జరగరనున్నాయి. అందుకు సంబంధించిన ప్రచారమే ఇప్పుడు ఢిల్లీని వాయు కాలుష్యాన్ని మించిన శబ్ద కాలుష్యంలో తల్లడిల్లేలా చేస్తోంది.  కేంద్రంలో మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ బీజేపీ దేశంలో ఎక్కడ ఏ ఎన్నికలు జరిగినా విజయమే లక్ష్యం అన్నట్లుగా హడావుడి చేస్తోంది. హంగామా సృష్టిస్తోంది. అవి ఏ ఎన్నికలు, అక్కడ మనకు పార్టీ నిర్మాణం ఉందా, పార్టీ నిర్మాణం ఉందా? కార్యకర్తల బలగం ఉందా ఇవేమీ పట్టవు. రాజకీయం చేసైనా, ఇతర పార్టీలలో చిచ్చు రగిల్చి అయినా కాషాయ జెండా ఎగుర వేయాలి అంతే అన్నదే కమల నాథుల లక్ష్యంగా కనిపిస్తోంది. అవి అసెంబ్లీ ఎన్నికలైనా చివరాఖరికి స్థానిక ఎన్నికలైనా ఒకటే జపం, ఒకటే మంత్రం గెలుపు. ఇందు కోసం పార్టీ సిద్ధాంతాలను బీజేపీ ఎప్పుడో అంటే కేంద్రంలో మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చిన నాడే పక్కన పెట్టేసింది. అప్పటి నుంచీ దేశ వ్యాప్తంగా అధికార విస్తరణ అన్నదే లక్ష్యంగా రాజకీయ వ్యూహాలలో మునిగి తేలుతోంది. ఇప్పుడు ఢిల్లీ మునిసిపల్ ఎన్నికల విషయంలోనూ బీజేపీ అదే పంథాను అనుసరిస్తోంది. అయితే ఢిల్లీలోనైనా, మరెక్కడైనా ఓటు అడగాలంటే తామేం చేశామో, ఏం చేస్తామో చెప్పుకోవాలి. కానీ ఈ ఎనిమిదేళ్ల కాలంలో బీజేపీ ఏం చేశామో చెప్పుకోవడానికి ఏం లేదు. ఏం చేస్తామో చెప్పుకుంటే జనం నమ్ముతారన్న నమ్మకం లేదు. అందుకే బీజేపీకి ఎన్నికల ప్రచారంలో ఒకటే మంత్రం, ఒకటే జపం అదే మోడీ. నమో..నరేంద్రమోడీ. ఎన్నిక ఏదైనా, ఎన్నిక ఎక్కడైనా నమో జపమే గెలిపిస్తుందని బీజేపీ విశ్వసిస్తోంది. డబుల్ ఇంజిన్ లాంటి గంభీరమైన ప్రకటనలు.. కాంగ్రెస్ హయాంలో జరిగిన అవినీతి, అభివృద్ధి లేమి ఇవే ఆ పార్టీకి ఇప్పటికీ ప్రచారాంశాలు.. అంటే కేంద్రంలో అధికార పగ్గాలు చేపట్టిన ఎనిమిదేళ్ల తరువాత కూడా బీజేపీకి తాను చేసిందేమిటో చెప్పుకోవడం కంటే.. గత కాంగ్రెస్ ప్రభుత్వాల వైఫల్యాలు, తప్పిదాలే ప్రచారాంశాలుగా మిగిలాయి. అందుకే మోడీయే పార్టీ ముఖచిత్రం అన్న నినాదంతో ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో ప్రచారంలోకి దిగిపోయింది. మునిసిపల్ ఎన్నికలకు కూడా మోడీయేనా అన్న విపక్షాల విమర్శలను కమలనాథులు ఖాతరు చేయడం లేదు. తమ ప్రచారార్భాటంలో కాంగ్రెస్ విమర్శలు వినబడవన్నదే ఆ పార్టీ నేతల ధైర్యంగా కనిపిస్తోంది. ఢిల్లీ అభివృద్ధికి చేసిందేమైనా ఉంటే.. దానిని చూపి, వివరించి ఓట్లు అడగాలి.. కానీ అదేమీ లేనందునే మోడీ ముఖాన్ని ముందు పెట్టుకుని ప్రచార పర్వంలోకి దిగింది. స్టార్ క్యాంపెయినర్లను ప్రచారంలోకి దించేసింది. సినిమా సహా వివిధ రంగాల సెలబ్రిటీల సేవలనూ బీజేపీ వినియోగించుకుంటోంది. విశేషమేమిటంటే ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ కేంద్రంలో మోడీ సర్కార్ సాధించిన విజయాలనే ఏకరవు పెడుతోంది. మునిసిపల్ ఎన్నికలలో ఢిల్లీ గురించి మాట్లాడకుండా కేంద్రం విజయాలను వల్లెవేస్తోందేమిటని హస్తిన వాసులు ఆశ్చర్యపోతున్నారు. వారి ఆశ్చర్యాలూ, అభ్యంతరాలూ పట్టని బీజేపీ శ్రేణులు మోడీయే పార్టీకి దిక్కు అన్న రేంజ్ లో ఆయనను కీర్తించడానికే మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ ఎన్నికల ప్రచారాన్ని పరిమితం చేశారు. పైగా మోడీ మోడల్ ను ప్రజల వద్దకు తీసుకెళ్లడంలో తప్పేముంది అంటూ కమలనాథులు తమ ప్రచార తీరును సమర్ధించుకుంటున్నారు. ఆశ్చర్యమేమిటంటే.. 2007 నుంచీ మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ కమలం అధీనంలోనే ఉంది. అంటే గత 15 సంవత్సరాలుగా ఎంసీడీలో కాషాయ జెండాయే ఎగురుతోంది. అంటే బీజేపీయే అధికారంలో ఉంది. మరి దశాబ్దంనరగా అధికారంలో ఉండి కూడా ఇన్నేళ్లలో ఢిల్లీ అభివృద్ధికి తామేం చేశామో చెప్పుకోగలిగే పరిస్థితి లేక మోడీ కరిష్మా మీదే ఆధారపడిందన్న మాట.  ఎంసీడీ ఎన్నికల ప్రచారం కోసం ఇప్పటి వరకూ కనీసం నలుగురు బీజేపీ ముఖ్యమంత్రులు హస్తినలో పర్యటించారు. అసోం ముఖ్యమంత్రి  హిమంతా బిశ్వా శర్మ, హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్,  హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరాం ఠాకూర్, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి లు ఎంసీడీ ప్రచారంలో పాల్గొన్నారు. రానున్న రోజులలో మరింత మంది జాతీయ స్థాయి నేతలు కూడా డిల్లీలో ప్రచారానికి వరుస కట్టనున్నారు.  ఇందుకు పకడ్బందీ ప్రచార ప్రణాళికను  రూపొందించారు. ప్రధాన కూడళ్లు, కీలక ప్రాంతాల్లో రోడ్ షఓలు, బహిరంగ సభలకు ప్రణాళికలు రూపొందించారు. అలాగే బీజేపీ ప్రచార రథాలు సైతం ఎంసీడీ ఎన్నికలలో తమ వంతు పాత్ర పోషిస్తున్నాయి. ఆ ప్రచార రథాల నిండా మోడీ ఫటోలే. నుక్కడ్ నాటక్స్ పేరుతో బీజేపీ పెద్ద ఎత్తున ఫ్లాష్ మాబ్స్ ను   నిర్వహిస్తోంది. లోకల్ రాక్ బ్యాండ్స్ ఆధ్వర్యంలో ఇవి  యువ ఓటర్లు, ఫస్ట్ టైం ఓటర్లను ఆకట్టుకోవడమే లక్ష్యంగా సాగుతున్నాయి. ఈ ప్రచార ఆర్భాటం చూసి ఢిల్లీ వాసులు విస్తుపోతున్నారు. ఎంసీడీ ఎన్నికల తరువాత మోడీ దేశ ప్రధానిగా ఉంటారా? లేక ఎంపీడీ మేయర్ గా బాధ్యతలు చేపడతారా అని ప్రశ్నిస్తున్నారు.    

ఆసుపత్రిలో చేరిన కమల్.. కారణమేమిటంటే?

సుప్రసిద్ధ నటుడు కమల్ హసన్ అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరారు. ఈ వార్త ఆయన అభిమనాలల్లో కలవరం నింపింది. కమల్ హసన్ ఆరోగ్యం నిలకడగానే ఉందనీ, ఖంగారు పడాల్సిందేమీ లేదనీ, గురువారం(నవంబర్ 24) డిశ్చార్జ్ చేస్తామనీ వైద్యులు తెలిపారు. చాలా కాలం పాటు సరైన హిట్ లేక వెనుకబడిన కమల్ హసన్ ఇటీవలె విక్రమ్ సినిమాతో భారీ హిట్ కొట్టారు. దీంతో ఆయనతో సినిమాలు తీయడానికి నిర్మాతలు క్యూ కట్టారు. కమల్ హసన్ కూడా పలు ప్రాజెక్టులతో బిజీ అయినట్లు చెబుతున్నారు. విక్రమ్ సినిమా దాదాపు 400 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసి బిగ్గెస్ట్ హిట్ గా నిలవడంతో కమల్ హసన్ ఫుల్ జోష్ మీద ఉన్నారు.  కాగా ఆయన బుధవారం(నవంబర్ 23) హైదరాబాద్ వచ్చి కళాతపస్వి విశ్వనాథన్ తో భేటీ అయ్యారు. ఇదేమైనా కథా చర్చల్లో భాగమా లేక మర్యాదపూర్వక భేటీయా అన్నది పక్కన ఉంచితే.. సాగర సంగమం, స్వాతి ముత్యం వంటి గొప్ప సినిమాలు వీరి కలయికలో వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కమల్ హసన్, విశ్వనాథ్ ల బేటీ  సినీ వర్గాలలో ప్రాధాన్యత సంతరించుకుంది. విశ్వనాథ్ తో భేటీ తరువాత చెన్నై వెళ్లిన కమల్ హసన్ అస్వస్థతకు గురై ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. కమల్ హసన్ జ్వరంతో బాధపడుతున్నారనీ, అంతకు మించి మరే అనారోగ్యం లేదనీ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఆయనను గురువారం డిశ్చార్జ్ చేయనున్నట్లు పేర్కొన్నాయి.  

పాపం శ్రద్ధావాకర్.. రెండేళ్లుగా నిత్యనరకం!

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధావాకర్ హత్య కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. ప్రేమించి ప్రియుడి కోసం తల్లిదండ్రులను వీడి వచ్చేసిన శ్రద్ధా వాకర్ 2019 నుంచి తనకు నచ్చిన అప్థాబ్ తో లివ్ ఇన్ రిలేషన్ లో ఉంది. ఏడాది పాటు వారి సహజీవనం సంతోషంగానే సాగింది. అయితే 2020 నుంచి అప్తాబ్ ఆమెకు నిత్యం నరకం చూపేవాడని విచారణలో వెలుగులోకి వచ్చింది. అప్తాబ్ తనను చిత్రహింసలు పెడుతున్నాడంటూ శ్రద్ధావాకర్ 2020లోనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను హత్య చేయడానికి ప్రయత్నించాడని కూడా ఆ లిఖిత పూర్వక ఫిర్యాదులో పేర్కొంది. ఒక డేటింగ్ యాప్ ద్వారా 2019లో దగ్గరైన శ్రద్ధ, అఫ్తాబ్‌లు అప్పటి నుంచి సహజీవనం సాగిస్తున్నారు.   శ్ర‌ద్ధావాకర్ పెళ్లి కోసం ఒత్తిడి చేయడం ప్రారంభించినప్పటి నుంచీ అంటే వారి సహజీవనం మొదలైన ఏడాది తరువాత నుంచి అప్తాబ్ చిత్రహింసలు మొదలయ్యాయని ఆమె ఫిర్యాదును బట్టి అర్ధమౌతుంది.  అప్తాబ్ తనను చిత్రహింసలకు గురి చేస్తున్న విషయం అతని తల్లిదండ్రులకూ తెలుసునని శ్రద్ధావాకర్ తన ఫిర్యాదులో పేర్కొంది. అయితే ఆ తరువాత అప్తాబ్ తల్లిదండ్రుల జోక్యంతో ఇకపై గొడవలు పడకుండా జీవిస్తామని అప్తాబ్ పోలీసులకు మరో లేఖ ఇచ్చింది. కానీ అప్తాబ్ తనను చిత్రహింసలకు గురి చేసిన సందర్భంగా గాయాలతో ఉన్న తన ఫొటోలను స్నేహితులకు షేర్ చేసింది. ఆ సమయంలోనే ఆమె గాయాలతో ఆసుపత్రిలో కూడా చేరింది. పెద్దల జోక్యంతో శ్రద్ధా మళ్లీ అప్తాబ్ తో కలిసి సహజీవనం కొనసాగించింది. అయితే శ్రద్ధావాకర్ కు అప్తాబ్ నిత్యనరకం చూపాడు. ఆ విషయాలన్నీ స్నేహితులకు చెప్పుకుని బాధపడేదని పోలీసుల విచారణలో వెల్లడైంది. ఆ క్రమంలోనే అప్తాబ్ శ్రద్ధాను ఈ ఏడాది మేలో హత్య చేశాడు. శ్ర‌ద్ధాను హ‌త్య‌ చేయాల‌ని  ఆఫ్తాబ్ ప్లాన్ వేసుకొని ఉంటాడ‌ని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆఫ్తాబ్ మాత్రం ఆవేశంలో శ్ర‌ద్ధాను హ‌త్య‌చేసిన‌ట్లు పోలీసుల విచార‌ణ‌లో, ఇటీవ‌ల కోర్టులో చెప్పాడు. ఆఫ్తాబ్ నుంచి అస‌లు నిజాలు రాబ‌ట్టేందుకు కోర్టు నార్కో పరీక్షలకు  అనుమ‌తినిచ్చింది. కాగా న‌మ్మి వ‌చ్చిన ప్రియురాలిని అతి కిరాత‌కంగా హ‌త్య‌చేసిన ఆఫ్తాబ్‌ను ఉరితీయాల‌ని దేశ‌వ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోంది.

లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వచ్చాడు.. సూర్యకుమార్ యాదవ్

టీమ్ఇండియా బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్.. అంతర్జాతీయ క్రికెట్ లో ప్రవేశం లేటైందేమో రావడం అయితే వచ్చాడు. వచ్చీ రావడంతోనే రికార్డులను బద్దలు కొట్టేస్తున్నాడు. డివీలియర్స్ తరువాత 360 డిగ్రీల బ్యాటర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అనతి కాలంలోనే ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో అగ్ర స్థానానికి ఎగబాకాడు. అంతే కాదు ర్యాంకింగ్ లో రెండో స్థానంలో బ్యాటర్ తొలి స్థానం గురించి ఊహించడానికే అవకాశం లేనంత అంతరం ఉంచుకున్నాడు. ఔను ఐసీసీ తాజాగా వెలువరించిన టి.20 ర్యాంకింగ్స్ లో సూర్యకుమార్ యాదవ్ 890 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో ఉంటే.. రెండో స్థానంలో ఉన్న పాకిస్థాన్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ రేటింగ్ పాయింట్స్ 836. అంటే ఇద్దరి మధ్య ఉన్న తేడా 54 రేటింగ్ పాయింట్స్ మూడో స్థానంలో కివీస్ బ్యాటర్ డేవన్ కాన్వే 788 పాయింట్లు, నాలుగో స్థానంలో బాబర్ అజాం 778 పాయింట్లు ఉన్నారు. ఇక కింగ్ కోహ్లీ న్యూజిలాండ్ లో సిరీస్ కు దూరం అవ్వడంతో రెండు స్థానాలు దిగజారి 13వ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక టీ20 బౌలింగ్ విభాగంలో ఒక్క భార‌త బౌల‌ర్ కూడా టాప్‌-10లో చోటు ద‌క్కించుకోలేక‌పోయాడు. సీనియ‌ర్ బౌల‌ర్ భువ‌నేశ్వ‌ర్ కుమార్ 11 స్థానంలో నిలువ‌గా న్యూజిలాండ్‌తో సిరీస్‌లో రాణించిన అర్ష‌దీప్ సింగ్ ఒక స్థానం ఎగ‌బాకి 21వ స్థానం, చాహ‌ల్ 40వ స్థానంలో కొన‌సాగుతున్నారు. 704 పాయింట్ల‌తో లంక స్పిన్న‌ర్ హస‌రంగా అగ్ర‌స్థానాన్ని కైవ‌సం చేసుకోగా అఫ్గాన్ స్పిన‌ర్ ర‌షీద్ ఖాన్‌, ఇంగ్లాండ్ స్పిన్న‌ర్ ఆదిల్ ర‌షీద్ లు వ‌రుస‌గా రెండు, మూడు స్థానాల్లో కొన‌సాగుతున్నారు.

గురివింద.. పరనింద

ఇటీవల ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం సాక్షిగా.. టీడీపీ అంటే తెలుగు బూతుల పార్టీ అంటూ.. జనసేన పార్టీ అంటే రౌడీల పార్టీ అంటూ కొత్త భాష్యం చెప్పడంపై నెటిజనులు...  సామాజిక మాధ్యమంలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.  అంతేకాదు వైసీపీ అధినేత వైఖరి గురివింత సామెతను గుర్తుకు తెస్తోందంటూ.. సోషల్ మీడియాలో సోదాహరణలతో ఎండగడుతున్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఆయన తొలి కేబినెట్‌లోని పంచ్ పటాకాలు.. కొడాలి నాని, పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాసరావు, అనిల్ కుమార్ యాదవ్, కురసాల కన్నబాబు.. ప్రెస్ మీట్ పెట్టి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌లపై బూతుల వర్షం కురిపించేవారని వారు ఈ సందర్బంగా గుర్తు చేస్తున్నారు. ఇక పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని పేరు అయితే.. బూతు సరఫరాల శాఖ మంత్రిగా ముద్ర పడిపోయిందని... అలాగే నాటి నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్.. నోటి పారుదల శాఖ మంత్రిగా ఖ్యాతి  గడించారని గుర్తు చేస్తున్నారు...  పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాసు, కురసాల కన్నబాబులు కూడా  ప్రెస్ మీట్ పెట్టి సామిరంగా.. రంగ రంగా అంటూ ఊగిపోయే వారని నెటిజనులు ఈ సందర్భంగా పేర్కొంటున్నారు. అంతదాక ఎందుకు అంబటి రాంబాబు, ఆర్కే రోజా, జోగి రమేశ్‌ తదితరులకు జగన్ మలి కేబినెట్‌లోని చోటు దక్కిందంటే.. అదంతా.. బూతుల మహిమే కదా అని ప్రశ్నిస్తున్నారు. అదీకాక.. విశాఖ ఎయిర్ పోర్ట్ సాక్షిగా మంత్రి ఆర్కే రోజా.. మిడిల్ ఫింగర్ చూపించడం పట్ల.. ఎయిర్ పోర్ట్ సిబ్బందే కాదు.. అక్కడి వారంతా ముక్కు మీద వేలేసుకున్నారని ప్రత్యక్ష సాక్షులు సైతం పేర్కొన్నారని సామాజిక మాధ్యమంలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. జగన్ తొలి కెబినెట్‌లో అయినా.. మలి కేబినెట్‌లో అయినా.. మంత్రిగిరి దక్కిందంటే.. అదంతా.. బూతు కాల మహిమేనన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన... ఈ మూడున్నరేళ్ల కాలంలో .. ఆయన కేబినెట్‌లోని మంత్రులు చేసిన బూతు  పద ప్రయోగాలు.. సదరు ముఖ్యమంత్రి గారికి కడు కమనీయంగా.. రమణీయంగా.. వినసొంపుగా ఉన్నాయని.. నెటిజన్లు సోషల్ మీడియాలో వ్యంగ్య బాణాలు  సంధిస్తున్నారు. అదీకాక అధికార ఫ్యాన్ పార్టీలోని నేతలు చేస్తున్న అరాచకాలు, అవినీతి, దాడులు, ఈ ప్రభుత్వ హయాంలో ప్రజలు పడుతోన్న ఇబ్బందులును ఏ మాత్రం ఈ ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదని.. వాటిని ప్రతిపక్ష టీడీపీ, జనసేన పార్టీలు.. ఎప్పటి కప్పుడు ఎత్తి చూపడంతో.. ముఖ్యమంత్రి వైయస్ జగన్ తట్టుకోలేక ఓ విధమైన ఆందోళనకు గురవుతున్నారని.. ఆ ఆందోళనే నరసాపురం వేదికగా.. ముఖ్యమంత్రి మాటల్లో ప్రతిఫలించిందనీ అంటున్నారు. ఏదీ ఏమైనా ముఖ్యమంత్రి   జగన్‌ తీరు గురివింద సామెతను గుర్తుతెస్తోందనీ, అని.. ఆయన నైజం  పరనింద అని తేటతెల్లమైందని నెటిజన్లు అంటున్నారు. 

చాలు బాబూచాలు.. ప్రభుత్వ సలహాదారు నియామకాలపై పార్టీ శ్రేణుల్లోనే పెదవి విరుపు !

ఈ కలికాలంలో దేవుడు కరుణిస్తాడో? లేదో? కానీ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాత్రం అస్మదీయులను తెగ కరుణించేస్తున్నారు. అయితే ఆయన కరుణ.. వైసీపీ శ్రేణుల్లోనే ఒకింత అసంతృప్తికి కారణమౌతోందంటున్నారు. సలహారుల పేరిట జగన్ ఎడాపెడా చేస్తున్న నియామకాల పట్ల వైసీపీలోనే చిర్రుబుర్రులు మొదలయ్యాయని అంటున్నారు. తాజాగా గాయని మంగ్లీని.. శ్రీవెంకటేశ్వర భక్తి చానల్‌(ఎస్వీబీసీ)లో సలహాదారుగా నియమించడం పట్ల  వైసీపీలోనే  విస్మయం  వ్యక్తమౌతోంది. ఇప్పటికే టాలీవుడ్ ప్రముఖ నటులు ఆలీ, పోసాని కృష్ణమురళీలకు ఇటీవల జగన్ ప్రభుత్వం.. సలహాదారు పదవులు కట్టబెట్టిన సంగతి తెలిసిందే. ఆ తరువాత కూడా పలువురు సలహాదారుల నియామకాలు జరిగాయి. ఈ సలహాదారు నియామకాల పట్ల విపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కాంట్రాక్టర్లకు బిల్లల చెల్లింపులకు ఎగనామం పెట్టి, ఉద్యోగులకు సకాలంలో వేతనాలు ఇవ్వాలన్న ధ్యాసే లేకుండా వ్యవహరిస్తున్న సర్కార్ అస్మదీయులకు ఎడాపెడా లక్షల రూపాయల వేతనాలతో సలహాదారు పదవులు పందేరం చేయడమేమిటని వైసీపీ శ్రేణుల్లోనే ఆగ్రహం వ్యక్తం అవుతోంది. జగన్ సర్కార్ బిల్లులు ఎగ్గొట్టిన కాంట్రాక్టర్లలో వైసీపీ వారూ ఉన్న సంగతిని వారు గుర్తు చేస్తున్నారు.  తాజాగా మంగ్లీకి సలహాదారు పదవిని కట్టబెట్టడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు చెబుతున్నారు.  అయితే ఈ నియామకాల వెనుక పెద్ద కథే ఉందని వైసీపీ శ్రేణులే అంటున్నాయి.  గతంలో అంటే.. 2019 ఎన్నికల వేళ.. అలీ, పోసాని, మంగ్లీలు ముగ్గురూ కూడా  వైసీపీ కోసం పని చేశారనీ.. ఇప్పుడు మళ్లీ ఎన్నికలలో కూడా వీరి సేవలు వినియోగించుకోవాలని జగన్ భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే వీరికీ పదవులను కట్టబెట్టారని అంటున్నాయి. ఒక వేళ పదవులు ఇవ్వకుంటే వారు వచ్చే ఎన్నికల్లో వైసీపీకి మద్దతుగా ప్రచారం చేయరన్న భయంతోనే జగన్ ముగ్గురికీ సలహాదారు పదవులు కట్టబెట్టారని అంటున్నారు. గత ఎన్నికల సమయంలో అలీ, పోసానిలకు మంచి స్థానాలు కల్పిస్తానని జగన్ వాగ్దానం చేశారనీ, అందుకే సలహాదారు పదవులను వారికి కట్టబెట్టినా వారు ఒకింత అసంతృప్తితోనే ఉన్నారనీ, ఈ పరిస్థితుల్లో వారు వచ్చే ఎన్నికల్లో గతంలోలా పార్టీ కోసం చురుగ్గా పని చేసే అవకాశాలు అంతంత మాత్రమేనని పార్టీ వర్గాల్లోనే చర్చ జరుగుతోంది. ఇక మంగ్లీ విషయానికి వస్తే అలీ, పోసానిలకు పదవులు ఇచ్చి.. మంగ్లీని వదిలేస్తే ఆమె చిన్నబుచ్చుకుంటుందన్న ఉద్దేశంతోనే ఆమెకూ ఒక పదవి ఇచ్చారని అంటున్నారు.  అదీకాక.. వచ్చేది ఎన్నికల సీజన్.. ఇప్పటికే జగన్ ఫ్యామిలీలోని వారంతా దాదాపుగా దూరం జరిగిపోయారని.. దీంతో వచ్చే ఎన్నికల్లో పార్టీ తరఫున, పార్టీ కోసం సెలబ్రిటీల ప్రచారం లేకుంటే.. ఓట్లు రాలే పరిస్థితులు లేవన్న బెదురు జగన్ లో ఏర్పడిందంటున్నారు. అందుకే ఇప్పటికీ పార్టీనే అంటిపెట్టుకుని అసంతృప్తిని పెదవుల బిగువున అదిమిపెట్టుకుని సహనంతో వేచి చూస్తున్న ముగ్గురికీ సలహాదారు పదవులు కట్టబెట్టారన్న చర్చ అయితే పార్టీలో జోరుగా సాగుతోంది. ఈ మాత్రం పదవులైనా ఇవ్వకుంటే వచ్చే ఎన్నికల్లో వీరు కూడా పార్టీ ప్రచారానికి అందుబాటులోకి రారన్న జంకే వారికి పదవులు కట్టబెట్టేలా చేసిందని అంటున్నారు. లేకపోతే మూడేళ్ల పాటు వారిని పూర్తిగా విస్మరించిన జగన్ ఇప్పటి కిప్పుడు హడావుడిగా సలహాదారు పోస్టులను వారి కట్టబెట్టి ఉండరని అంటున్నారు. అదలా ఉంచితే.. మంగ్లీకి ఎస్వీబీసీ సలహాదారు పోస్ట్ కట్టబెట్టడంతో.. గత ఎన్నికల సందర్భంగా ఆమె జగన్ కోసం ప్రచారం చేసిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే గత ఎన్నికల వేళ ప్రచారం చేసినందుకు...  దాదాపు మూడున్నరేళ్ల తర్వాత ఆలీ, పోసాని, మంగ్లీలకు పదవులిచ్చి జగన్ వచ్చే ఎన్నికల్లో   పార్టీ కోసం పని చేస్తామన్ వాగ్దానం తీసుకున్నారని అంటున్నారు.   ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. జగన్ సలహాదారుల నియామకాలు మరింత జోరందుకునే అవకాశం లేకపోలేదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే జగన్ సలహాదారులుగా నియమిస్తున్న వారి ప్రచారం రానున్న ఎన్నికలలో పార్టీకి ఎంత వరకూ మేలు చేస్తుందన్న అనుమానాలు పార్టీ వర్గాలలో వ్యక్తమౌతున్నాయి. అలీ కానీ, పోసాని కానీ, చివరాఖరికి మంగ్లీ కానీ పెద్దగా ప్రజాకర్షణ శక్తి ఉన్నవారు కాదని వారీ సందర్బంగా అంటున్నారు.  

ప్రభుత్వాస్పత్రుల్లో రోగుల పస్తులు!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చివరికి రోగులకు కూడా అన్నం పెట్టలేని దౌర్బాగ్య స్థితికి చేరుకుంది. కోససీమలోని ప్రభుత్వాసుపత్రిలో మంగళవారం(నవంబర్ 22) నుంచి ప్రభుత్వాస్పత్రుల్లో రోగులకు భోజనం సరఫరా బంద్ అయ్యింది. దీంతో ప్రభుత్వాస్పత్రులలో రోగులు రెండు రోజులుగా పస్తులుండాల్సిన దుస్థితి నెలకొంది. నెలల తరబడి  భోజనం కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా పెండింగ్ లో పెట్టడంతో వారు భోజన సరఫరా బంద్ చేసేశారు. కొనసీమలోని మొత్తం 11 ప్రభుత్వాసుపత్రుల్లోనే ఇదే పరిస్థితి.. లక్షల్లో బిల్లులు పెండింగ్ లో ఉండటంతో తామింక ప్రభుత్వాస్పత్రులకు భోజనాలు సరఫరా చేయలేమంటూ కాంట్రాక్టర్లు చేతులెత్తేశారు.  కోనసీమ జిల్లా వ్యాప్తంగా మొత్తం 38లక్షల రూపాయలకు పైగా బిల్లులు బకాయిలు ఉన్నట్లు కాంట్రాక్టర్లు చెబుతున్నారు. భోజనాల సరఫరా నిలిచిపోవడంతో ఆస్పత్రుల్లో రోగులు నానా ఇబ్బందులూ పడుతున్నారు. జగన్ సర్కార్ నిర్వాకం వల్ల ఇప్పటికే రాష్ట్రంలో ప్రభుత్వ పనులు అవి ఎంత చిన్నవైనా సరే చేయడానికి కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రాని పరిస్థితి ఉంది. చేసిన పనులకు బిల్లులు చెల్లించకపోవడమే కాదు.. బిల్లుల గురించి అడిగితే బెదరింపులూ, దబాయింపులూ ఎదురౌతున్నాయని కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా బిల్లులు పెండింగ్ లో పడి ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన వారిలో వైకాపాకు చెందిన వారూ ఉన్నారు. డబ్బుల ఎగవేతలో జగన్ సర్కార్ కు తనా పరా బేధం లేదని అంటున్నారు. వాడుకోవడం.. ఆపై ఎంగిలి విస్తరాకులా విసిరేడం అనేది జగన్ సర్కార్ తీరుగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.   ఇక కోనసీమ ప్రభుత్వాప్పత్రుల్లో భోజన కాంట్రాక్టులకు సంబంధించిన బకాయిల విషయానికి వస్తే అత్యధికంగా అమలాపురం  ప్రభుత్వాసుపత్రిలో అత్యధికంగా 13 లక్షల రూపాయల బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి. అలాగే  రామచంద్రాపురంలో రూ. 9 లక్షలు, కొత్తపేటలో రూ. 6 లక్షలు, రాజోలులో రూ. 5 లక్షలు, అల్లవరం, కపిలేశ్వరంలో రూ. లక్ష, చొప్పున, ఆలమూరులో రూ. 91వేలు, ముమ్మడివరంలో రూ. 81వేల బిల్లులు నిలిచిపోయినట్లు కాంట్రాక్టర్లు చెబుతున్నారు.  కు భోజనాలు అందిస్తున్నాయి.

కెప్టెన్సీకి విండీస్ స్టార్ బ్యాటర్ పూరన్ గుడ్ బై

ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టి20 వరల్డ్ కప్ లో జట్టు వైఫల్యానికి బాధ్యత వహిస్తూ విండీస్ స్టార్ బ్యాటర్ నికోలస్ పూరన్ కెప్టెన్సీకి గుడ్ బై చెప్పేశాడు. ఆ వరల్డ్ కప్ లో విండీస్ ఘోరంగా ఆడి కసీనం సూపర్ 12 దశకు కూడా వైదొలగిన సంగతి తెలిసిందే. క్వాలిఫయర్ లోనే జింబాబ్వే చేతిలో చిత్తై పూరన్ సేన ఇంటి ముఖం పట్టింది. టి20లలో రెండు సార్లు వరల్డ్ చాంపియన్ గా నిలిచిన విండీస్ ఇంతఘోరంగా విఫలం కావడంపై ఇంటా బయటా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే జట్టు ఘోర ప్రదర్శనకు నైతిక బాధ్యత వహిస్తూ కెప్టెన్సీకి గుడ్ పై బెబుతున్నట్లు పూరన్ ప్రకటించారు. ఇన ఇస్టాలో ఈ విషయాన్ని పూరనే స్వయంగా వెల్లడించాడు. కీరన్ పోలార్డ్ రిటైర్ మెంట్ తో పూరన్ కు విండీస్ క్రికెట్ జట్టు సారథ్య  బాధ్యతలను ఆ దేశ క్రికెట్ బోర్డు పూరన్ కు అప్పగించింది. కానీ కనీసం ఏడాది కూడా పూరన్ కెప్టున్ గా కొనసాగకుండానే సారథ్యాన్ని వదులుకున్నాడు. “టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో జ‌ట్టు ప్ర‌ద‌ర్శ‌న   తీవ్ర నిరాశ‌కు గురిచేసింది. అప్ప‌టి నుంచి కెప్టెన్ గా కొనసాగాలా వద్దా అని ఆలోచిస్తున్నా.. చివరకు సారథ్య బాధ్యతల నుంచి వైదొలగాలని నిర్ణయం తీసుకున్నానని పేర్కొన్నాడు. 15 వన్డేలు, 15 టి20లకు విడీస్ కెప్టెన్ గా పూరన్ ఉన్నాడు.