మైగ్రేన్ కు డిప్రెషన్ కు మధ్య లింక్ ఏంటో తెలుసా?

ప్రపంచవ్యాప్తంగా, మానసిక ఆరోగ్య సమస్యలు వేగంగా పెరుగుతున్నట్లు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కోవిడ్-19 తర్వాత ఇది విజృంభించింది. ఇప్పుడు యువత కూడా దీని బారిన పడే పరిస్థితి నెలకొంది. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా అవసరమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మానసిక-శారీరక ఆరోగ్యం ఒకదానికొకటి అనుబంధంగా ఉంటాయి. ఒకదాని ప్రభావం మరొకదాని పై ఉంటుంది.  డిప్రెషన్‌ను కేవలం మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే సమస్యగా మాత్రమే పరిగణించరాదని డిప్రెషన్‌పై అధ్యయనం చేస్తున్న పరిశోధకులు తెలిపారు. అనేక రకాల శారీరక దుష్ప్రభావాల ప్రమాదం కూడా ఉంటుంది. డిప్రెషన్‌కు గురైనట్లయితే, మైగ్రేన్, గుండె జబ్బులు, రక్తపోటు,  రోగనిరోధక శక్తి బలహీన పడటం వంటి సమస్యలు కూడా ఉంటాయి. మైగ్రేన్ కు డిప్రెషన్ కు మధ్య సంబంధం.. మైగ్రేన్ సాధారణ తలనొప్పి సమస్య అని అనుకుంటే పొరపాటే.. మైగ్రేన్ సైకోసోమాటిక్ డిజార్డర్ అని పరిశోధకులు కనుగొన్నారు. మానసిక రుగ్మతలు శారీరక ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే సమస్యలు. ఇవి కూడా శారీరక ఆరోగ్య సమస్యల మాదిరిగానే లక్షణాలను కలిగి ఉంటాయి. డిప్రెషన్‌తో బాధపడుతున్న వ్యక్తులకు మైగ్రేన్‌  వచ్చే అవకాశం మూడు రెట్లు ఎక్కువగా ఉంటుందని, మైగ్రేన్‌ ఉన్నవారు ఐదు రెట్లు ఎక్కువగా డిప్రెషన్‌కు గురవుతారని తేలింది.  మైగ్రేన్ వల్ల డిప్రెషన్ వచ్చే ప్రమాదం..  మైగ్రేన్, డిప్రెషన్, స్ట్రెస్ ఒకదానికొకటి సంబంధం కలిగి ఉంటాయి. వాస్తవానికి, మైగ్రేన్‌ ఉన్న వ్యక్తులు ఇతరులకన్నా డిప్రెషన్‌కు గురయ్యే అవకాశం దాదాపు ఐదు రెట్లు ఎక్కువ. మైగ్రేన్ ప్రారంభమైన కొన్ని నెలలు లేదా సంవత్సరాల తర్వాత చాలా మందిలో డిప్రెషన్ మొదలవుతుంది. మైగ్రేన్,  డిప్రెషన్ రెండూ జన్యుపరమైనవి కూడా కావచ్చు. డిప్రెషన్ ఉన్న రోగులలో మైగ్రేన్ రిస్క్ మైగ్రేన్,  డిప్రెషన్ రెండూ తక్కువ స్థాయి 5-హైడ్రాక్సీట్రిప్టమైన్ (5-HT) లేదా సెరోటోనిన్ రిసెప్టర్లకు సంబంధించినవి. సెరోటోనిన్ ట్రాన్స్పోర్టర్లు కూడా జన్యు మార్పులకు కారణం అవుతాయి. మైగ్రేన్ అనేది జీవిత నాణ్యతను ప్రతికూలంగా మారుస్తుంది. ఇది ఇతర  మానసిక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.  అదేవిధంగా, మైగ్రేన్, డిప్రెషన్ ఉన్నవారిలో కాలక్రమేణా సైకోసోమాటిక్ డిజార్డర్‌గా మార్పు చెందుతాయి.  ఇవి ఒకదాని మీద మరొకటి ఆధారపడి ఉంటాయి కాబట్టి ఏ ఒక్కటి వచ్చినా మరొకటి మెల్లిగా డవలప్ అవుతుంది. కాబట్టి వీటికి దూరం ఉండటం అన్ని విధాలా మంచిది.                                    ◆నిశ్శబ్ద.

కల్తీ...కల్తీ...కల్తీ...ఎటు చూసినా కల్తి

కల్తీ ...కల్తీ ...కల్తీ... ఎటు చూసినా కల్తి గాలి కల్తీ,నీరు కల్తీ,పాలు కల్తీ,తినే తిండి కల్త్ఘీ,నెయ్యి కల్తీ,పళ్ళ లో కల్తీ కూరాగాయలలో కల్తీ,అసలు కల్తీ కి కాదేది అనర్హం అన్న చందాన సర్వం కల్తీ చేసేస్తూ ప్రజాల ప్రణాలను  హరిన్చేస్తున్నారు కల్తీ బాబులు.అసలు ఇందులో ఏది అస్లీ ఏది నకిలీ అన్నదే పెద్ద ప్రశ్న?  అసలు ప్రకృతి ని ఎలాగో కల్తీ చేసేసారు మానవుడు. అయితే సృష్టిలో కల్తీ లేనిది ఒక్క తల్లి పాలలోనే అంటే అతిశయోక్తి కాదు.ఇది నిజం. అని నమ్మక తప్పదు. తల్లిప్రేమలో నాన్న ప్రేమలో కల్తీ ఉండదు.ప్రియుడి ప్రేమలో.ప్రియురాలి ప్రేమలో కల్తీ ఉండచ్చు. ప్రపంచ వ్యాప్తంగా జూన్ నెలలో ప్రపంచ ఆహార సంరక్షణ దినోత్సవం రూపం లో జరుపుకుంటారు.దీనిలక్ష్యం ప్రజలు సురక్షిత మైన ఆహారపు అలవాట్ల పట్ల కల్తీ ఆహారం పట్ల ప్రజలు అప్రమత్తం గా ఉండాలి ఈ సందర్భంగా ప్రజలు నకిలీ ఆహార పదార్ధాల బారిన పడకుండా కల్తీ ఆహారాపదార్ధాలను ఎలా గుర్తించాలో వివరించే ప్రయత్నం చేస్తున్నాము. మార్కెట్ లో మనకు లభ్య మయ్యే చాలా రకాల వస్తువులలో కల్తీ కలుస్తోందన్న విషయం తెలుస్తోంది.అందులో ను అది పండ్లు కవాచ్చు పప్పు దినుసులు కావచ్చు.గోధుమలు,మసాలాలు, పాలు,కూరాగాయలలో రక రకాల రసాయనాలు వాడుతూ వాటిని రూపొందిస్తున్నారు.కల్తీ చేసిన ఆహార పదార్ధాలు తినడం వల్ల  చాలా ప్రామాదం అని దానివల్ల తీవ్ర నష్టం కలుగుతుందని నిపుణులు స్పష్టం చేసారు.కల్తీ చేసిన  వాంతులు.లివర్ కిడ్నీ,ఉదర సంబంధిత రోగాలు,వస్తే తీవ్ర ప్రభావం ఉటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఇలాంటి సమస్యనుండి రక్షణ పొందాలంటే అసలు నకిలీ వస్తువులను గుర్తించాలి.వాటిని గురించి తెలుసుకోవడం అత్యవసరం. కల్తీ పాలను ఎలాగుర్తించాలి? పాలలో కేవలం నీళ్ళు మాత్రమే కలవడం లేదు.పాలను చిక్కగా చేసేందుకు దీనిలో డిటర్జెంట్,లేదా సింథటిక్,పాలు గుర్తించాలంటే 1/2 కప్పులో తక్కువ నీళ్ళు కలపండి.ఇందులో నురుగు వచ్చిందంటే ఇందులో డిటర్జెంట్ కలిపి నట్లే.సింథటిక్ పాలు గుర్తించాలంటే పాలను  వెళ్ళ మధ్యలో రాయడం ద్వారా అది సబ్బు లాగా కనిపిస్తుంది.అలా పాల కల్తీని గుర్తించవచ్చు. మరీ క్రుత్రిమ పాల వ్యాపారం లో కొత్త కొత్త పద్దతులు అవలం బిస్తున్నారు. వ్యవసాయం లో వాడే ఉరియా ఎరువులు,ఫెవికాల్ కలిపి పాల కల్తీకి పాల్పడుతున్నారు.  నకిలీ పసుపు ను ఎలాగుర్తించాలి? ఒక గ్లాసు నీరు తీసుకోండి.అందులో కొంచం పసుపు పొడి కలపండి ఒక వేళనీటి రంగు పసుపు రంగులోకి మారుతుంది.పసుపు గ్లాసు కింది భాగానికి చేరుకుతుంది.కల్తీ ఉన్న పసుపు రంగు నీటిలోకి మారుతుంది.ఆనీళ్ళు పసుపు పచ్చరంగులో ఉంటుందని గుర్తించండి. కల్తీ పండ్లను గుర్తించడం ఎలా? పండ్లు,కూరగాయలలో అన్నిటికన్నా ఎక్కువ కల్తీ జరుగుతుంది.ముఖ్యంగా మనం తినే యాపిల్ పండు బాగా మెరుస్తూ ఉంటుంది.అలా మెరిసేందుకు మైనం లేదా ఇతర  వేజిలేన్ రసయనాలు రాయడం వల్ల ఇదినిజమో కాదో  తెలుసు కోడానికి మీ వద్ద ఉన్న చాకును మెల్లగా దించండి.గట్టిగా ఉంటె చాకు త్వరగా దిగదు అంతకు ముందే  అప్పటికే కొన్ని రకాల వేజిలేన్ మైనం రాయడం వల్ల మెత్తగా ఉండడం వల్ల చాకు త్వరగా దిగుతుంది. నకిలీ నల్ల మిరియాలు... మనం తీసుకునే ఆహారం లో ముఖ్యమైన దినుసులలో ముఖ్య మైనవి మిరియాలు లేదా నల్ల మిరియాలు అంటారు.దీనిని కల్తీ కోవలోకి చేర్చిన ఘనత మనవాళ్ళదే. నకిలీ నల్ల మిరియాల ను ఎలా గుర్తించాలి ముఖ్యంగా పోప్పాయి పండులోని గింజలు నల్ల మిరియాలలో కలపడం వల్ల అసలు మిరియాలు నకిలీ మిరియాలకు తేడా తేలియదు.అసలు నకిలీ మిరియాల లో ఉన్న తేడా గుర్తించాలంటే. ఒక గ్లాసులో నీళ్ళు తీసుకుని అందులో నల్ల మిరియాలు వేయండి.౩,లేదా 4 నిమిషాల తరువాత పోప్పాయి గింజలు తేలిపోతాయి. నకిలీ నెయ్యిని గుర్తించడం ఎలా? కల్తీ లేని నెయ్యి సహజంగా పూస పూస గా ఉంటుంది.మంచి సువాసన వస్తూ ఉంటుంది. దీనిని కల్తి చేసేందుకు బంగాళా దుంప పేస్ట్,లేదా అరారోట్ లేదా రీ ఫైండ్ నూనె డాల్డా ను కలిపి నెయ్యిగా అమ్ముతూ ఉంటారు.ఇటీవలి కాలం లో జంతువుల కలేబరాల నుండి సైతం తీసిన నేతిని కల్తి చేసి మార్కెట్లో అమ్ముతున్నట్లు తెలుస్తోంది.కాగా స్వచ్చమైన అవ్వునేయ్యి లేదా కల్తీ నెయ్యి ని గుర్తించాలంటే నెయ్యిలో అయుదిన్ సొల్యుషన్ కలపండి.దీనిరంగు నీలి రంగులోకి మారుతుంది అందులో గంజి పొడి కలిపి నట్లుగా తెలుస్తుంది. ఎర్రటి ఖారం నకిలీఖారం గుర్తించడం ఎలా? అసలైన ఎర్రటి ఖారం గుర్తించాలంటే ఒక గ్లాసు నీళ్ళలో మిర్చి పొడిని కలపండి.ఎర్రటి మిర్చి పౌడర్ నీటిలో తేలితే అది నకిలీది కాదని.ఒకవేళ నీలాలో మునిగి పోతే ఆ మిర్చి పొడి కల్తీది నకిలీదిగా భావించాలి. నకిలీ ఇంగువను గుర్తించడం ఎలా? నకిలీ ఇంగువకూడా నకిలీ నెయ్యి నూనె వేడిలో వేసినప్పుడు కొంత ఎర్రగా మారుతుంది.అది నకిలీ ఇంగువగా చెప్పవచ్చు.మరో పద్దతిలో ఇంగువను కాల్చి నప్పుడు అంటుకుంటుంది.నిప్పు త్వరగా అంటుకుంటుంది.అది నకికీది కాదనిఆర్ధం. నకిలీ ఇంగువ అంటుకోదు. ఈ విధంగా నకిలీ అసిలీ ఇంగువను ఆర్ధం చేసుకోవచ్చు. అసలైన  కోవా ను గుర్తించడం ఎలా? హిందీలో దీనిని మావా అని అంటారు అంటే మనం స్వీట్స్ లో వాడే కోవా,కలాకండ్, రసగుల్లా,గులాబ్ జాం,కోవా కజ్జి కాయి  వంటి  వి తయారు చేసేందుకు వాడతారు. కోవాలో అసిలి నకిలీ కివా ఎదో గుర్తించడం కష్టం. అసలు కోవా తెల్లగా ఉంటుందని.మరోరకం కోవా కొంచం పసుపు పచ్చటి రంగులో ఉంటుందని అది కల్తీ కోవాగా పేర్కొన్నారు.దీనితో పాటు చేతిలో నలపడం ద్వారా అసలైన కోవా చేతిని విదిచిపెడుతుంది.నకిలీ కోవా అయితే చేతిని అంటి పెట్టుకుని ఉంటుంది. నకిలీ తేనె... ఈ రోజుల్లో తేనె పేరుతో ప్రజలు తీవ్రంగా మోసపోతున్నారు. ముఖ్యంగా పుట్టతేనే అంటూ గిరిజన ఏ జేన్సీ  ప్రాంతాలలో తేనెలో బెల్లం కలిపి ఆమీస్తున్నట్లు తెలుస్తోంది. అసలు తేనె నకిలీధా అసలైన తేనెను గుర్తించడం అవసరం.ఒక గ్లాసు నీళ్ళలో ఒక చంచా తేనె కలపండి మీరు వేసిన తేనె నీటిలో అలాగే ఉండి పోతే అది స్వాచమైన తేనె అని అటు ఇటు కదులుతూ నీటిలో కరిగి పోయే తేనెను నకిలీ తేనెగా గుర్తించారు.ఆ రకంగా మీరు తీసుకునే ఆహారం పట్ల అప్రమత్తంగా ఉండకుంటే మీరు అనారోగ్యం పాలు కావడం ఖాయం. ప్రపంచా ఆహార బద్రత దినోత్సవం సందర్భంగా సర్వేజనా సుఖినోభవంతు. ఆరోగ్యా ప్రాప్తి రాస్తూ.   

బరువు మీద థైరాయిడ్ ప్రభావం ఎంత?

ప్రస్తుత కాలంలో సాధారణ సమస్యలలో బరువు పెరగడం ఒకటి. దీనికి జీవనశైలి లేదా ఆహారపు అలవాట్లు లేదా అనేక అంతర్లీన ఆరోగ్య సమస్యలు వంటి అనేక కారణాలు ఉండవచ్చు. చాలా సార్లు పెరిగిన బరువు థైరాయిడ్ సమస్యగా పరిగణించబడుతుంది. కానీ థైరాయిడ్ వల్ల నిజంగా ప్రతిసారీ బరువు పెరుగుతారా అంటే కచ్చితమైన సమాధానం ఎక్కడా లేదు. బరువు పెరగడం అనేది ఖచ్చితంగా థైరాయిడ్ సమస్యలో ఒక సాధారణ లక్షణం, అంతే కానీ బరువు పెరిగారంటే థైరాయిడ్ ఉన్నట్టు, థైరాయిడ్ వచ్చిందంటే బరువు కచ్చితంగా పెరగాలి అన్నట్టు నిబంధన ఏమీ లేదు.  ప్రపంచ వ్యాప్తంగా థైరాయిడ్ సమస్య చాలా వేగంగా పెరుగుతోంది. దీని గురించి అవగాహన, నివారణ పద్ధతుల గురించి చెప్పాలనే లక్ష్యంతో ప్రతి సంవత్సరం మే 25న ప్రపంచ థైరాయిడ్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ సమస్య ఏ వయసు వారికైనా రావచ్చు, కాబట్టి ప్రతి ఒక్కరూ దీనిపై అవగాహన కలిగి ఉండటం, నివారణ చర్యలను పాటించడం అవసరం.  థైరాయిడ్, బరువు పెరిగే సమస్యలు.. థైరాయిడ్ హార్మోన్ జీవక్రియను నియంత్రిస్తుంది. జీవక్రియలో సమస్యలు బరువుపై ప్రభావం చూపుతాయి. బలహీనమైన థైరాయిడ్ (హైపోథైరాయిడిజం) ఉన్నవారిలో బరువు పెరగడం సాధారణం. థైరాయిడ్ గ్రంధి ద్వారా విడుదలయ్యే హార్మోన్లు జీవక్రియను నియంత్రించడంల సహాయపడతాయి, తద్వారా శరీరం శక్తి కోసం ఆహారాన్ని బాగా ఉపయోగించుకుంటుంది. థైరాయిడ్ తక్కువ హార్మోన్ ఉత్పత్తి చేసినప్పుడు, జీవక్రియ మందగిస్తుంది. అటువంటి పరిస్థితిలో, కేలరీలు బర్న్ చేయకపోతే బరువు పెరుగుతారు. బరువు కూడా తగ్గిస్తుంది.. థైరాయిడ్ రుగ్మత బరువు పెరగడానికి మాత్రమే కాదు, బరువు తగ్గడానికి కూడా కారణమవుతుంది. హైపర్ థైరాయిడిజం, థైరాయిడ్ గ్రంధి చాలా హార్మోన్లను విడుదల చేయడం ప్రారంభించే ఒక రకమైన థైరాయిడ్ రుగ్మత. వేగంగా బరువు తగ్గడం, చేతులు వణుకు, వేగవంతమైన లేదా సక్రమంగా లేని హృదయ స్పందన ఇందులో క్షణాలు . బరువు పెరగడం మరియు తగ్గడం రెండూ థైరాయిడ్ రుగ్మతలకు సంబంధించినవి అని అర్థం. బరువు పెరగడానికి థైరాయిడ్ రుగ్మత మాత్రమే కారణం కాదు.. అయితే థైరాయిడ్ రుగ్మత బరువు పెరగడానికి లేదా తగ్గడానికి మాత్రమే కారణం అని భావించడం కూడా తప్పు. బరువు పెరగడానికి అనేక ఇతర కారణాలు ఉన్నాయి, సరైన కారణాలను తెలుసుకోవడం. వాటికి చికిత్స చేయడం అవసరం. కేలరీలను బట్టి ఆహారం తీసుకోకపోతే సహజంగానే బరువు పెరుగుతారు. కానీ థైరాయిడ్ ఉన్నవారు శారీరక శ్రమ ద్వారా కేలరీలను బర్న్ చేయలేరు. బరువు పెరగడానికి లేదా తగ్గడానికి జన్యుశాస్త్రం కూడా ఒక కారణం కావచ్చు. ఇది మాత్రమే కాకుండా.. అనారోగ్యం, మందులు తీసుకోవడం వంటి ఆరోగ్య పరిస్థితుల వల్ల కూడా బరువు పెరగడం లేదా తగ్గడం జరుగుతుంది. ఒత్తిడి, నిద్ర లేకపోవడం కూడా బరువు పెరగడానికి కారణం అవుతుంది.                                      ◆నిశ్శబ్ద.

ఫైబర్ వల్ల ఇన్ని ప్రయోజనాలున్నాయా?

ఫైబర్ ఎక్కువ ఉన్న ఆహారం గురించి ప్రతి వైద్యుడు, ప్రతి పోషకాహార నిపుణుడు, ఆఖకి ఆరోగ్య స్పృహ ఉన్న ప్రతి వ్యక్తి చెబుతాడు. ఫైబర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి కూడా చాలా విషయాలు వినే ఉంటారు.  ఫైబర్  జీర్ణ ఆరోగ్యాన్ని కాపాడుతుందని, మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుందని అందరికీ తెలిసిందే..   అయితే  ఫైబర్ ఇలా కడుపుకు మాత్రమే కాకుండా శరీరానికి అనేక ఇతర ప్రయోజనలు కూడా చేకూరుస్తుందని  మీకు తెలుసా??   బరువు తగ్గడం నుండి డయాబెటిస్ సమస్యలను తగ్గించడం, మెదడును ఆరోగ్యంగా ఉంచడం వరకు దీని ప్రయోజనాలు చాలా ఉన్నాయి.  అందుకే ఆహారంలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి.  ఫైబర్ శరీరంలో చక్కెర వాడకాన్ని నియంత్రించడంలో సహాయపడుతుందని పరిశోధకులు కనుగొన్నారు, ఇది ఆకలిని, రక్తంలో చక్కెరను నియంత్రణలో ఉంచడానికి అవసరం. పిల్లలు మరియు పెద్దలకు మెరుగైన ఆరోగ్యం కోసం రోజుకు కనీసం 25 నుండి 35 గ్రాముల ఫైబర్ అవసరం, కానీ చాలా మందికి రోజుకు 15 గ్రాములు మాత్రమే ఆహారం ద్వారా ఫైబర్ అందుతూ ఉంటుంది. ఫైబర్ బాగా ఉన్న ఆహారం తీసుకుంటే బరువు తగ్గడం, కొలెస్ట్రాల్ నియంత్రణ మాత్రమే కాకుండా ఎలాంటి ఆరోగ్య సమస్యలకు దూరంగా ఉండొచ్చునంటే.. చిత్తవైకల్యం వంటి వ్యాధుల ప్రమాదం తక్కువగా ఉంటుంది.. హార్వర్డ్ హెల్త్ నిర్వహించిన ఒక అధ్యయనంలో, తగినంత ఫైబర్ తీసుకుంటే, అది చిత్తవైకల్యం ప్రమాదాన్ని తగ్గించగలదని పరిశోధకులు కనుగొన్నారు.  రోజువారీ శరీరానికి కావలసినంత  ఫైబర్ తీసుకునే వారిలో చిత్తవైకల్యం తక్కువగా ఉంటుందని తేలింది.ఆహారంలో  తక్కువ తీసుకునేవారిలో డిమెన్షియా రేటు ఎక్కువగా ఉంది. ముఖ్యంగా రోజుకు సగటున 20 గ్రాముల కంటే తక్కువ ఫైబర్  తీసుకునేవారిలో ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. యాపిల్స్, అరటిపండ్లు.. బెస్టు.. అవకాడో లో ఫైబర్ పుష్కలంగా ఉన్నా అవి సగటు మధ్యతరగతి వారికి అందుబాటులో ఉండవు. అలాంటి వారు అనేక ఇతర పండ్ల నుండి ఫైబర్ పొందవచ్చు, అరటిపండ్లు, యాపిల్స్ ఇందులో ముఖ్యమైనవి. యాపిల్స్‌లో కరిగే, కరగని ఫైబర్ రెండూ ఉంటాయి.. అదేవిధంగా, అరటిపండులో 2.6 గ్రాముల ఫైబర్ ఉంటుంది. అరటిపండ్లు విటమిన్ సి, విటమిన్ బి6, పొటాషియంతో సహా అనేక ఇతర పోషకాలను కూడా అందిస్తాయి. అరటిపండు తినడం ఫైబర్, ప్రోటీన్ రెండింటికీ ప్రయోజనకరంగా ఉంటుంది. నల్ల శనగలు.. ఫైబర్, ప్రోటీన్‌లకు అద్భుతమైన మూలం నల్ల శనగలు. ఇందులో ప్రోటీన్ సమృద్ధిగా ఉంటుంది కాబట్టి ఇది శాకాహారులకు ప్రోటీన్  లోపంతో బాధపడేవారికి బెస్ట్ ఎంపిక. ఆహారంలో నల్లశనగలను చేర్చుకోవడం ద్వారా, జీర్ణక్రియను సరిగ్గా ఉంచడంతో పాటు కండరాలకు ప్రోటీన్‌ను సులభంగా అందేలా చూసుకోవచ్చు.                                    ◆నిశ్శబ్ద.

అల్లం టీని రోజూ తాగితే ఎన్ని లాభాలో తెలుసా?

మనం వంటలలో ఉపయోగించే ఎన్నో పదార్థాలలో అల్లం కూడా ఒకటి. అల్లం బరువు తగ్గించడం నుండి జీవక్రియను ప్రోత్సహించడం వరకు ఎన్నో విధాలుగా సహాయపడుతుంది. తాజా లేదా ఎండిన అల్లంను ఎన్నో రకాలుగా ఉపయోగించవచ్చు. కానీ అల్లం ను టీ చేసుకుని తాగితే అద్భుత ఫలితాలు ఉంటాయంటున్నారు వైద్యులు. అల్లం టీ తీసుకోవడం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు ఏమిటంటే.. బరువు తగ్గిస్తుంది.. అల్లం శరీర బరువు తగ్గడంలో,  నడుము చుట్టూ ఉన్న కొవ్వు, పిరుదులు మొదలైన ప్రాంతాలలో పేరుకున్న కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు, లిపిడ్ ప్రొఫైల్‌లు అల్లం టీ తీసుకున్నప్పుడు చాలా కంట్రోల్ అవుతాయి.   వాపును తగ్గిస్తుంది.. ఆర్థరైటిస్, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి అనేక దీర్ఘకాలిక వ్యాధులకు వాపు కారణం. అల్లంలో జింజెరోల్‌లు, షోగోల్‌లు ఉన్నాయి, ఇవి శక్తివంతమైన యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రభావాలను కలిగి ఉంటాయి. వాపును కలిగించే అణువులైన సైటోకిన్‌ల ఉత్పత్తిని నిరోధించడం ద్వారా వాపును తగ్గిస్తుంది. 3వికారం వాంతులు తగ్గిస్తుంది.. అల్లం మోషన్ సిక్‌నెస్, మార్నింగ్ సిక్‌నెస్, కీమోథెరపీ, సర్జరీతో సంబంధం ఉన్న వికారం, వాంతుల నుండి ఉపశమనానికి ఒక గొప్ప నివారణ. అల్లంలో ఉన్న యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు జీర్ణ సమస్యలను తగ్గించడానికి, మొత్తం జీర్ణశయాంతర ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది.. అల్లం ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచడం, గ్లూకోజ్ జీవక్రియను మెరుగుపరచడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. అల్లం టీని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మధుమేహం ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించవచ్చు మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది! అల్లం అభిజ్ఞా పనితీరు, జ్ఞాపకశక్తిని మెరుగుపరిచే సమ్మేళనాలను కలిగి ఉంటుంది. అల్లంలోని యాంటీఆక్సిడెంట్లు న్యూరోప్రొటెక్టివ్, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి, ఇది వయస్సు సంబంధిత అభిజ్ఞా క్షీణతతో ముడిపడి ఉంటుంది. బహిష్టు నొప్పిని తగ్గిస్తుంది.. అల్లం టీ నొప్పిని తగ్గించడం, రక్త ప్రసరణను ప్రోత్సహించడం ద్వారా బాధాకరమైన ఋతు తిమ్మిరి నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. అల్లం కండరాల సడలింపు లక్షణాలు గర్భాశయ కండరాలలో ఒత్తిడిని తగ్గించడంలో సహాయడుతుంది, తద్వారా నెలసరి నొప్పిని తగ్గిస్తుంది. హృదయ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది.. అల్లం టీ రక్తపోటును తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది, ఇవి రెండూ గుండె జబ్బులకు దోహదపడే రెండు ప్రమాద కారకాలు. అల్లంలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ మరియు యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు అథెరోస్క్లెరోసిస్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి, ఈ పరిస్థితి ధమనుల పనితీరు తగ్గించి గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.. అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడతాయి.  తద్వారా శరీరాన్ని బ్యాక్టీరియా, వైరల్ ఇన్‌ఫెక్షన్ల నుండి కాపాడుతుంది. అల్లంలోని సమ్మేళనాలు తెల్ల రక్త కణాల సంఖ్యను ప్రేరేపిస్తాయి. రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి, అందువల్ల అనారోగ్యం వ్యాధుల సంభావ్యతను తగ్గిస్తుంది. మొత్తంమీద, అల్లం టీని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రోగనిరోధక శక్తిని పెంచడం నుండి మెదడు పనితీరును మెరుగుపరచడం వరకు, అల్లం టీ దినచర్యలో భాగం చేసుకుంటే అద్బుతమే..                                   ◆నిశ్శబ్ద.

మగవారిలో నీరసం.. అలసట ఎక్కువగా ఉంటోందా... కారణం ఇదే కావచ్చు!

శరీరం సరిగ్గా పనిచేయాలంటే, హార్మోన్ల స్థాయిని సరిగ్గా ఉండడం అవసరం. మగవారి మంచి ఆరోగ్యం, మెరుగైన శారీరక పనితీరులో టెస్టోస్టెరాన్ హార్మోన్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. టెస్టోస్టెరాన్ సాధారణంగా సెక్స్ హార్మోన్‌గా పరిగణించబడుతుంది, ఇది శరీరంలో ఎన్నో ఇతర ముఖ్యమైన పాత్రలను పోషిస్తుంది. పురుషులలో, ఈ హార్మోన్ సెక్స్ డ్రైవ్ (లిబిడో) నుండి ఎముక ద్రవ్యరాశి, కొవ్వు పదార్ధం, కండరాల ఆరోగ్యం, కండరాల బలాన్ని కాపాడుకోవడం, ఎర్ర రక్త కణాలు, స్పెర్మ్ ఉత్పత్తిని నియంత్రించడం ఇలా ప్రతిదానికీ అవసరం. అయితే అనేక కారణాల వల్ల యువతలో టెస్టోస్టెరాన్ లోపం నిర్ధారణ అవుతోంది, ఇది లిబిడో, సెక్స్ పవర్ సమస్యలను పెంచడమే కాకుండా శరీరంలో ఇతర సమస్యల ప్రమాదాన్ని కూడా పెంచుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మరీ ముఖ్యంగా టెస్టోస్టెరాన్ లోపం ఎముకల వ్యాధుల నుండి తీవ్రమైన అలసట వరకు అన్నింటికీ కారణమవుతుంది. అసలు టెస్టోస్టెరాన్ లోపం ఎందుకు వస్తుంది? శరీరంలో టెస్టోస్టెరాన్ హార్మోన్ లేకపోవడం అనేక కారణాల వల్ల జరుగుతుంది.  కీమోథెరపీ వంటి ఔషదాల  దుష్ప్రభావం, వృషణానికి గాయం లేదా క్యాన్సర్. మెదడులోని గ్రంధుల సమస్యలు (హైపోథాలమస్ మరియు పిట్యూటరీ), ఇది హార్మోన్ ఉత్పత్తిని నియంత్రిస్తుంది. థైరాయిడ్ పనితీరు సమస్యలు, అధిక శరీర బరువు (ఊబకాయం). దీర్ఘకాలిక వ్యాధులు లేదా అంటువ్యాధులు. మొదలైన కారణాల వల్ల ఈ హార్మోన్ లోపం వస్తుంది.  టెస్టోస్టెరాన్ లేకపోవడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయంటే.. శరీరంలో టెస్టోస్టెరాన్ హార్మోన్ లేకపోవడం వల్ల శక్తి లేనట్టుగా ఉంటారు. తరచుగా అలసట-బలహీనతను కలుగుతుంది. వృద్ధాప్యం మీదకొచ్చినట్టు, నిరాశ, నిస్పృహ ఎక్కువగా ఉంటాయి.  చాలా కాలంగా ఇటువంటి సమస్యలను ఎదుర్కొంటుంటే, ఖచ్చితంగా వైద్యులను కలవాలి. టెస్టోస్టెరాన్ హార్మోన్ లోపం ఉంటే ఈ రెండు సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.  మూడ్ మార్పులు తక్కువ టెస్టోస్టెరాన్ స్థాయిలు మానసిక స్థితికి సంబంధించిన సమస్యలను కలిగిస్తాయి. విచారం, పనిలో ఆసక్తి కోల్పోవడం, డిప్రెషన్ వరకు ఈ సమస్యలు ఉంటాయి. కొంతమంది పురుషులలో దీని కారణంగా వ్యక్తిత్వంలో మార్పులు కూడా వస్తాయి. దీని కారణంగా వారిని కాంప్రమైజ్ చేయడం కష్టమైన సమస్యగా మారుతుంది. . టెస్టోస్టెరాన్ స్థాయి సాధారణమైనప్పుడు, అటువంటి సమస్యలు కూడా నయమవుతాయి. కండరాలు, ఎముకల సమస్యలు టెస్టోస్టెరాన్ హార్మోన్ కండరాలను నిర్మించడంలో సహాయపడుతుంది. కాబట్టి, దాని పరిమాణం తగ్గినప్పుడు, కండరాలు, దాని బలం కూడా తగ్గుతుంది. తక్కువ టెస్టోస్టెరాన్ స్థాయిలు ఉన్నవారిలో ఎముక సాంద్రత తగ్గడం నుండి బోలు ఎముకల వ్యాధి వరకు సమస్యలు వస్తాయి.. రెగ్యులర్ గా వ్యాయామం చేయడం వల్ల టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచడంలో సహాయపడుతుంది. వ్యాయామం చేసేటప్పుడు పెద్ద కండరాలు బాగా పనిచేసేలా ప్లాన్ చేసుకోవాలి. దీనివల్ల హార్మోన్ల సమతుల్యత బాగుంటుంది.                                 ◆నిశ్శబ్ద.

గుండె జబ్బుల గురించి ఈ నిజాలు తెలుసుకోకపోతే.. చాలా నష్టపోతారు!

ప్రపంచవ్యాప్తంగా సంభవించే  మరణాలకు గుండె జబ్బులు ప్రధాన కారణం. ఈ మధ్య కాలంలో ఇవి మరీ పెరిగిపోయాయి. గణాంకాల ప్రకారం, ప్రతి సంవత్సరం కరోనరీ హార్ట్ డిసీజ్ (CHD) సుమారు 382,820 మంది మరణానికి కారణమవుతుంది. ప్రజల జీవన విధానం అధ్వాన్నంగా మారడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం మరింత పెరిగింది. యువత కూడా దీనికి బాధితులుగా మారుతున్నారు. శరీరం అంతటా రక్తాన్ని పంప్ చేయడం, శరీరంలో  అవయవాలకు  కణజాలాలకు ఆక్సిజన్ ను, పోషకాలను సరఫరా చేయడం గుండె విధి.  గుండె జబ్బుల కారణంగా, ఈ సాధారణ పనితీరు దెబ్బతింటుంది, ఇది ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాలను చూపుతుంది. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) అంచనా ప్రకారం ప్రతి సంవత్సరం  4 లో 1 మరణాలు గుండె జబ్బుల కారణంగా సంభవిస్తున్నాయి. గుండె జబ్బులకు సంబంధించిన రెండు సమస్యలు ఉన్నాయి - గుండెపోటు,  గుండె వైఫల్యం చెందడం. అందరూ ఈ రెండింటిని ఒకటిగా భావిస్తారు. కానీ ఇవి రెండూ వేరువేరు.   గుండెకు సాధారణ రక్త ప్రసరణకు అంతరాయం ఏర్పడినప్పుడు గుండెపోటు వస్తుంది. అంటే రక్తం సరఫరా లేకపోవడం వల్ల అక్కడ ఆక్సిజన్ సరఫరా కావడం లేదు. ఈ కారణంగా గుండెపోటు వస్తుంది. గుండెపోటుకు వెంటనే చికిత్స చేయకపోతే అది గుండె కణజాలాన్ని దెబ్బతీస్తుంది.  గుండె వైఫల్యం.. శరీరం యొక్క అవయవాలు,  కణజాలాల అవసరాలను సరిపడినంతగా  రక్తాన్ని గుండె  పంప్ చేయలేనప్పుడు గుండె వైఫల్యం  సంభవిస్తుంది. ధమనులు సన్నబడటం వల్ల ఈ రకమైన సమస్య వస్తుంది.  లక్షణాలు ఎలా ఉంటాయి?   గుండెపోటు యొక్క లక్షణాలు భిన్నంగా ఉండవచ్చు  ప్రధానంగా గుండెపోటులో ఛాతీ నొప్పి ఉంటుంది. నొప్పి తేలికపాటి నుండి తీవ్రమైన వరకు ఉంటుంది. ఇది ఛాతీపై ఒత్తిడి లేదా పిండేసినట్టు  అనుభూతిని కలిగిస్తుంది. ఇది కాకుండా, చేతులు, భుజాలు, మెడ లేదా దవడలో నొప్పిని కూడా కలిగిస్తుంది. కొంతమందికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, విపరీతమైన చెమట, మైకము కూడా ఉండవచ్చు.  గుండె వైఫల్యం విషయంలో శ్వాస ఆడకపోవడం ప్రధాన లక్షణం. గుండె శరీరమంతటా తగినంత ఆక్సిజన్‌తో కూడిన రక్తాన్ని సరఫరా చేయలేనప్పుడు, అదనపు ఆక్సిజన్‌ను తీసుకోవడానికి ఊపిరితిత్తులు చాలా కష్టపడాలి. గుండె ఆగిపోయిన సందర్భంలో, బలహీనత లేదా అలసటతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, దృష్టి కేంద్రీకరించడంలో ఇబ్బంది సంభవిస్తుంది.  గోర్లు లేదా పెదవులు నీలం రంగు మారవచ్చు.   సమస్య ఏమిటో తెలుసుకోవడం ఎలా? చాలా కాలంగా గుండె జబ్బులతో బాధపడుతున్న వారు ఈ ప్రమాదాల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. గుండెపోటులో దవడలు, చేతుల్లో నొప్పి చాలా సాధారణం అయితే గుండె ఆగిపోవడానికి శ్వాస ఆడకపోవడం ప్రధాన కారణంగా పరిగణించబడుతుంది. ఈ సంకేతాల ఆధారంగా, శరీరం యొక్క సమస్యలను అంచనా వేయవచ్చు. ఆరోగ్యకరమైన జీవనశైలిని నిర్వహించడం, ఆరోగ్యకరమైన,  పోషకమైన ఆహారం  గుండె-ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈ అలవాటే..  గుండె జబ్బులు, దాని సమస్యల నుండి  రక్షించగలవు.  ఏవైనా గుండె సమస్యలు ఉంటే మాత్రం మద్యం మరియు ధూమపానం పూర్తిగా మానేయండి, ఈ రెండూ గుండెపోటు మరియు గుండె వైఫల్యం వంటి సమస్యలను మరింత పెంచుతాయి.                                  ◆నిశ్శబ్ద

ప్రాణాలను మింగేసే అధిక రక్తపోటు ఎందుకు వస్తుంది.. దాన్ని అదుపు చేయడం ఎలాగంటే!

ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న తీవ్రమైన ఆరోగ్య సమస్యలలో అధిక రక్తపోటు ఒకటి. హైపర్ టెన్షన్ గా పేర్కొనే ఈ సమస్య హృదయ సంబంధ వ్యాధులకు దారితీయవచ్చు. రక్తపోటు పెరగడం అనేది  వృద్ధాప్య సమస్య అని ఇంతకుముందు అనుకునేవాళ్ళు కానీ ఇప్పుడు మాత్రం హైపర్ టెన్షన్ కు యువత కూడా బాధితులుగా మారుతున్నారు.   ఒక అంచనా ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ఒక బిలియన్ కంటే ఎక్కువ మందికి రక్తపోటు సమస్యలు ఉన్నాయి, ప్రతి నలుగురిలో ఒకరు రక్తపోటు బాధితులు. అధిక రక్తపోటు గురించి అవగాహన కల్పించడానికి, నివారణ చర్యలను ప్రోత్సహించడానికి ప్రతి సంవత్సరం మే 17న ప్రపంచ రక్తపోటు దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అంచనా ప్రకారం భారతదేశంలోని ప్రతి నలుగురిలో ఒకరు అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు, అయితే వారిలో 12% మంది మాత్రమే తమ రక్తపోటును నియంత్రించగలుగుతున్నారు. రక్తపోటును నిరంతరం పర్యవేక్షిస్తూ, అదుపులో ఉంచుకోవడమే అందరూ చేయాల్సిన ప్రథమ కర్తవ్యం అని అంటున్నారు వైద్యులు. అసలు యువతలో అధిక రక్తపోటు ఎందుకు వస్తుంది, దానికి గల కారణాలు ఏంటి?? దాన్ని అదుపులో ఉంచుకోవడానికి ఏమి చేయాలి?? తెలుసుకుంటే.. అనారోగ్యకరమైన జీవనశైలి కారణంగా, యువకులు రక్తపోటు సమస్యకు గురవుతున్నారు. క్రమం తప్పకుండా శారీరక వ్యాయామాలు చేయకపోవడం, ఆహారంలో సోడియం అధికంగా తీసుకోవడం, జంక్-ఫాస్ట్ ఫుడ్ అధికంగా తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం ఉంది. గర్భధారణ సమయంలో కూడా అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం ఉంది. ఈ రకమైన జీవనశైలిని గడుపుతున్నట్లయితే, జాగ్రత్తగా ఉండాలి, అది రక్తపోటు ప్రమాదాన్ని పెంచుతుంది.  మీరు మీ దినచర్యలో కొన్ని సాధారణ మార్పులు చేయడం ద్వారా కూడా ఈ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. బరువును అదుపులో ఉంచుకోవాలి.. ఆరోగ్యకరమైన బరువును మైంటైన్ చేయడం వలన అధిక రక్తపోటు ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. ఊబకాయం సమస్య మధుమేహం, అధిక రక్తపోటుతో పాటు అనేక ఇతర దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. శారీరకంగా చురుగ్గా ఉండడంతోపాటు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల బరువు అదుపులో ఉంచుకోవచ్చు.  బరువు పెరుగుతున్నట్లయితే, దానిని నియంత్రించడానికి ప్రయత్నించాలి.  సమతుల్య ఆహారం, సోడియం తీసుకోవడం తగ్గించడం..  సమతుల్య ఆహారం మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడుతుంది. ఆహారంలో సోడియం, చక్కెర మరియు అనారోగ్యకరమైన కొవ్వుల పరిమాణాన్ని తగ్గించడం ద్వారా మీరు రక్తపోటును నియంత్రించవచ్చు. రక్తపోటును అదుపులో ఉంచడానికి, ఇతర వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి ఆహారంలో కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు, గింజల పరిమాణాన్ని పెంచాలి. మిమ్మల్ని  మీరు ఆరోగ్యంగా ఉంచుకోవడం ఎంతో  అవసరం. ఆహారంలో  ఎక్కువ ఉప్పు తీసుకుంటే అది ప్రమాదాలను పెంచుతుంది. వ్యాయామం చాలా ముఖ్యం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం గొప్ప అలవాటు.  ఈ అలవాటు రక్తపోటు ప్రమాదం నుండి రక్షించడంలో సహాయపడుతుంది. గుండె జబ్బులు-మధుమేహం, దాని సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. నిస్సారమైన జీవనశైలిని కలిగున్న వ్యక్తులకు ఈ వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి.. డైలీ లైఫ్ స్టైల్ ను  సరిగ్గా పాటిస్తే.. హైపర్ టెన్షన్ ను అదుపులోకి తీసుకురావచ్చు. తద్వారా దీర్ఘయుష్షు సొంతమవుతుంది.                                      ◆నిశ్శబ్ద.

ఇది తెలుసుకోకుంటే గుండెకు గండి పడుతుంది!!

లావుగా ఉన్నవారిని సాధారణంగా స్థూల దేహం కలవారని, స్థూలకాయులు అని అంటారు. ఇలా లావుగా ఉండటం వల్ల ఎన్నో అసౌకర్యాలు ఉన్నా వాటికంటే ప్రమాదకరమైనది ఆరోగ్య సమస్యల ముప్పు. లావుగా ఉన్నవారిలో ఆరోగ్య సమస్యల ముప్పు ఎక్కువగా ఉంటుంది. మరీ ముఖ్యంగా గుండెకు సంబంధించిన సమస్యలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే… స్థూలదేహాలలో తరచుగా క్రొవ్వు పదార్థము ఎక్కువగా ఉంటుంది. ఈ కారణం వల్ల క్రొవ్వు కణాల సంఖ్య రక్తంలో ఎక్కువ అవుతాయి. అందువల్ల స్థూల శరీరం ఉన్నవారిలో రక్తం  చిక్కగా మారుతుంది. ఈ చిక్కదనం వల్ల రక్త ప్రవాహం నెమ్మదిస్తుంది. ఈ రక్తంలో ఉన్న కొవ్వు కణాలు అన్నీ రక్తనాళాలలో పేరుకుని పోయి అవి ప్లేట్లెట్స్ గా తయారవుతాయి. ఇవన్నీ ముందే నెమ్మదించిన రక్త ప్రవాహానికి మరింత ఆటంకం కలిగిస్తాయి. అంతే కాకుండా ఇవి రక్తనాళాలు కుచించుకుని పోవడానికి కారణం అవుతాయి. ఈ అన్నిటి కారణాల వల్ల గుండెకు జరగాల్సినంత మోతాదులో రక్తప్రవహం జరగదు.   గుండెకు తగినంత రక్తప్రవహం లేకపోతే గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సాధారణంగా గుండె ద్వారములలో వాల్వ్  లు ఉంటాయి. ఈ వాల్వ్ లలో అసమతుల్యత ఏర్పడినప్పుడు కూడా  గుండెజబ్బులు వస్తాయి. ఈ పరిస్థితిని రొమేటిక్ హార్ట్ అని అంటారు. ఇలాంటి పరిస్థితి సాధారణంగా 8నుండి 12 సంవత్సరాల వయసు గల పిల్లలలో ఏర్పడుతుంది.  ఇకపోతే  స్థూలదేహం ఉన్నవారిలో చాలా మందికి కొరోనరీ హార్డు డిసీజ్ (C.A.D.) అనే వ్యాధి తరచుగా వస్తుంది. ప్రస్తుత జనరేషన్ లో ఈ సమస్య కారణంగా వైద్యులను ఆశ్రయిస్తున్నవారే మొదటి స్థానంలో ఉంటున్నారు. దీని కారణంగా సంభవిస్తున్న మరణాల స్థాయి కూడా అధికంగానే ఉంది. గుండె సంబంధ సమస్యల కారణంగా మరణిస్తున్న వారిలో మొదటి స్థానంలో ఈ సమస్య వల్ల మరణించే వారే ఎక్కువగా ఉన్నారు. అందుకే కార్డియాలజిస్టుల సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది.   కొరోనరీ ఆర్టరీస్ అనేవి ప్రాణవాయువుతో గూడిన స్వచ్ఛమైన రక్తాన్ని గుండెలకందించే ప్రధాన నాళాలు.  మన గుండెకు ప్రతిక్షణం స్వచ్ఛమైన రక్తం అందాలంటే కొరోనరీ ఆర్టరీస్ ఆరోగ్యంగా ఉండాలి. స్థూలదేహం గలవారిలో రక్తంలో క్రొవ్వుకణాలు అదనంగా పేరుకొని ఉండటం  వల్ల వీటి మార్గము సన్నగా మారిపోయి ప్రవాహములకు అవరోదం ఏర్పడుతోంది.  ఈ కొరోనరీ ఆర్టరీస్ రెండు రకాలు. అవి గుండెకు కుడి, ఎడమ ప్రాంతాలలో వ్యాపించి ఉంటాయి. ఎడమ భాగంలో ఎడమ డి నెంటరీ ఆర్జరీ అని, నర్ కాంప్లెక్స్  రెండు రకములు గలవు. కుడి భాగములో కుడి డిసెంటరీ ఆర్జరీ మాత్రము ఉంటుంది. వీటి ద్వారా కుడి యడమలందు గల గుండె భాగములకు స్వచ్ఛమైన రక్తం అందించబడుతుంది. అయితే కొన్ని కారణాల వల్ల ఈ లైనింగ్ పొర దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా చుట్ట, బీడీ, సిగరెట్లు త్రాగడం వల్ల వచ్చే నికోటిన్  వల్ల, విషపు మందులు, మత్తు మాదక ద్రవ్యాలు తీసుకోవడం వల్ల రక్తంలోని ప్రాణశక్తి తగ్గిపోయి క్రొవ్వుకణాలు అడ్డుకోవడం వల్లా, ఈ ప్రాంతాలు మైల్డ్ గా  బ్లాక్ అవుతాయి. ఇలాంటి పరిస్థితిలోనే గుండెనొప్పి వస్తుంది.  ఈ గుండె నొప్పి మెల్లగా మొదలై అది భుజము నుండి  ఎడమచేతి మోచేతి వరకు  వ్యాపించడం జరుగుతుంది.   క్రమంగా ఈ ఆర్డరీలు మూసుకొనిపోయే ప్రమాదం గూడా ఉంటుంది. గుండెజబ్బుకు రావడానికి ఇలాంటి కారణాలు చాలా ఉంటాయి. డాక్టర్ల ప్రకారం ఇలాంటివి సుమారు 200 రకాలు ఉన్నాయట. గుండె జబ్బులకు ప్రధాన కారణం అధిక బరువు అయినా ఇవి మాత్రమే కాకుండా  దుర్వ్యసనాలు, మానసిక ఒత్తిడి కొలెస్ట్రాల్ పెరగడం, వేళాపాళా లేని భోజనాలు, బయటి చిరుతిండ్లు, కాఫీ, టీలు, అధికమోతాదు మాంసాహారం ఇలాంటివన్నీ అంటున్నారు వైద్యులు. కాబట్టి గుండె పదిలంగా ఉండాలంటే వీటన్నిటి గురించి జాగ్రత్తలు అవసరం.                                   ◆నిశ్శబ్ద.

50లోనూ 15లా ఉండాలని ఉందా...

5౦ లోనూ 15 లా చెంగు చెంగున ఎగురుతూ మీ టీన్ ఏజ్ ను గుర్తుచేసుకోవాలంటే. కొన్ని సూపర్ ఫుడ్స్ తీసుకోక తప్పదు. అంటున్నారు నిపుణులు. అసలు సూపెర్ ఫుడ్ అంటే ఏమిటి? 5౦ లోనూ 15 సంవత్సరాల యువకుడిగా ఉండాలంటే మీరు ఆరోగ్యంగా ఉండడం కీలకం.అది మీ గుండెకు సంబందించిన అంశం లేదా శరీరంలోని అవయవాల పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది.అందుకే శరీరం పై ఎలాంటి అనారోగ్యం రాకుండా ఉండాలంటే సూపర్ ఫుడ్స్ మన శరీరానికి అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. మన వయస్సు పెరుగుతున్న కొద్ది మన శరీరం తీరు నెమ్మదిస్తుంది. గతంలోలాగా  వేగవంతంగా పనిచేయలేరు.శరీరంలోని అంగాలు సంవత్సరాల తరబడి కష్టపడి అలిసిపోతున్న వయస్సును ఆపలేము.శరీరం పై వార్ధక్యం వేగంగా పెరగడాన్ని కొంతవరకు నియంత్రించ వచ్చు. వయసు పెరిగే  ప్రక్రియను తగ్గించడం లేదా  నియంత్రించడం ఎలాగో తెలుసుకోవడం అవసరం. ఇందులో భాగం గా మన ఆహార విహారాలు ప్రతిరోజూ మనం తీసుకునే ఆహారం మన వయసును ఎదుగుదలలోను నియంత్రించడం లోనూ కీలక భూమిక పోషిస్తాయి. ప్రతి సారీ సూపర్ ఫుడ్ పోషణ శరీరం కోసం లాభాదాయకమని నిరూపించ బడింది.మనశరీరం లోని అన్ని అంగాలు ఆరోగ్యంగా ఉంచడం తోపాటు.5౦ సం వత్సరాలు పై బడిన వారికి చాలా లాభాలు ఉన్నాయని వాటిని సూపెర్ ఫుడ్ బూస్టర్స్ ఇమ్యునిటి  పెంచేవని చేస్తుంది. ప్రాణాలు హరించే రోగాలనుండి బయట పడే విధంగా వీటిని అభివర్ణించారు. మీరు దీర్ఘకాలం జీవించాలంటే 1౦ సూపర్ ఫుడ్స్ ఇవే... నట్స్... డ్రై ఫ్రూట్స్ అన్నివయస్సుల వారు తీసుకోవాల్సిన ఆహారం. మీరు 5౦ సంవత్సరాలు పై బడిన వారు,లేదా తక్కువ వయస్సు ఉన్నవారు సైతం  తీసుకోవాల్సిన ఆహారం మీరు 5౦ సంపై బడిన వారైనా తక్జువ వయస్సువారే అయినా   నట్స్ మీ శరీరాన్ని శక్తి వంతంగా చేస్తుంది.మీశరీర పనితీరు సరిగా ఉండాలంటే ఆక్ రూట్ లాంటి డ్రైఫ్రూట్స్ గుండె సంభందిత అనారోగ్య సమస్యలకు వ్యతిరేకంగా పని చేసి మీ గుండె బలహీన పడకుండా జాగ్రత్త పడుతుంది. పచ్చటి ఆకు కూరలు---- పచ్చటి ఆకు కూరలు ఎవరికైతే మల బద్ధకం ఉంటుందో.వారికి క్యాబేజీ,లెట్స్,పాలకూర,అరటి అందులో పీచు పదార్ధం నిండి ఉంటుంది.శరీరంలో కండరాలు గట్టిగా ఉండాలంటే మరింత బలోపేతం చేసేందుకు ఉపయోగ పడుతుంది. చిరీజ్... రుచికరమైన జూసి గా ఉండే యాంటి ఆక్సిడెంట్ ఫైబర్ తో నిండి ఉంటుంది.మీగుండే ఆరోగ్యానికి సంబంధించి నంత వరకు ఆరోగ్యంగా ఉండేందుకు వీటిని భోజనానికి మధ్య అల్పాహారం గా తీసుకోవచ్చు. ఒక వేళ మీకు స్వీట్ తినాలన్నకోరిక ఉంటె వీటిని డే జర్ట్ రూపం లో తీసుకోవచ్చు.  డార్క్ చాక్లెట్... డార్క్ చాక్లెట్ యాంటి ఆక్సిడెంట్ తో సంపూర్ణంగా నిండి ఉంటుంది. డార్క్ చాక్లెట్ ఇమ్యునిటీని పెంచుతుంది.గుండెకు సంబంధించిన భయంకరమైన స్థితినుండి రక్షిస్తుంది.ఇంతే కాదు డార్క్ చాక్లెట్ టాక్సిన్స్ ను బయటికి తీసి శరీరానికి పోషక తత్వం తో నిండి ఉంటుంది. టమాటా... యాంటి ఆక్సిడెంట్ శరీరంలో సేల్స్ ను రక్షిస్తుంది.వాటిని సరిచేసేందుకు పనిచేసేందుకు లై ఫోడిన్ ,ఫ్రీరాడికల్స్ కు వ్యతిరేకంగా పనిచేస్తుంది.శరీరంలోని విషపదార్దాలాను బయటుకు పంపుతుంది. టమాటో వల్ల గాయాలు మానతాయని నిపుణులు పేర్కొన్నారు. గోధుమలు... శరీరానికి కావాల్సిన శక్తి కోసం మీ ఆహారం లో గోధుమను తప్పనిసరి చేయండి.దీంతో పాటు మీగుండే ఆరోగ్యం సురక్షితంగా ఉండాలంటే టమాటా మంచిదే. చేపలు... సార్టీన్-సామాన్ -లాంటి ఫ్యాటీ చేపలు యాంటి ఆక్సిడెంట్ ఒమేగా ౩ నుండి లభిస్తుంది.మీవయస్సు 5౦ కి పైగా ఉంటె ఈ చేపలను ఆహారం లో భాగం చేసుకోవచ్చు. చేపల నో ఆహారం లో భాగం చేసుకోవడం వల్ల చేపల ద్వారా విటమిన్ సంపూర్ణంగా లభిస్తుందని నిపుణులు పేర్కొన్నారు. పన్నీర్... పనీర్ ఇది కేవలం డెయిరీ ప్రోడక్ట్ తినడానికి మాత్రమే చాలా అద్భుతంగా ఉంటుంది.ప్రోటీన్లతో సంపూర్ణంగా నిండి ఉంటుంది.శరీరంలో మాంసం కండరాల పెరుగుదలకు పన్నీర్ దోహదం చేస్తుంది. ఆలివ్ ఆయిల్... ఆయిల్ యాంటి ఆక్సిడెంట్ సంపూర్ణంగా నిండి ఉంటుంది.ఆలివ్ ఆయిల్ గుండె సంబంధిత తీవ్ర సమస్యలకు పొటాషియం,ఐరన్,మాంగనీస్ తో ఉంటుంది. నీరు.... నీరు తినే ఆహారం లోకి రాదు.అయినా ఇది ఎలాంటి సూపెర్ ఫుడ్ అంటే మనం జీవించేందుకు అత్యవసరంగా హైడ్రేషన్ లేదా శరీరాన్ని ఫ్యాటీ గా ఉంచేందుకు నీరు సహాయ పడుతుంది .పంచెంద్రియాలను సరిగా పనిచేసే విధంగా సహకరిస్తుంది.

ఈ లక్షణాలు మీలోనూ ఉంటే కిడ్నీలో రాళ్లు ఏర్పడుతున్నాయని లెక్క!

మూత్రపిండాలు రక్తాన్ని ఫిల్టర్ చేయడం, శరీరం నుండి వ్యర్థాలు, అదనపు నీటిని తొలగించడం, ఎలక్ట్రోలైట్ స్థాయిలను నియంత్రించడంలో బాధ్యత వహిస్తాయి.  రక్తపోటు నియంత్రణ, ఎర్ర రక్త కణాల ఉత్పత్తి మరియు ఎముకల ఆరోగ్యానికి దోహదపడే ముఖ్యమైన హార్మోన్లను కూడా విడుదల చేస్తాయి. రక్తాన్ని ఫిల్టర్ చేయడం మరియు దాని నుండి వ్యర్థ పదార్థాలను వేరు చేయడం మూత్రపిండాల యొక్క ప్రాథమిక విధి. మూత్రపిండ ధమని నుండి రక్తం నెఫ్రాన్లలోకి ప్రవేశిస్తుంది, ఇవి మూత్రపిండాలలో ఉండే చిన్న వడపోత యూనిట్లు. నెఫ్రాన్లలో, రక్తం గ్లోమెరులర్ ఫిల్ట్రేషన్ అనే సంక్లిష్ట ప్రక్రియ ద్వారా ఫిల్టర్ చేయబడుతుంది. వ్యర్థ పదార్థాలు, అదనపు నీరు మరియు ఎలక్ట్రోలైట్స్ రక్తం నుండి తొలగించబడతాయి ఇవన్నీ  శరీరం నుండి మూత్రం రూపంలో విసర్జించబడతాయి. కానీ కొన్ని ఖనిజాలు,  పదార్ధాల వల్ల మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడతాయి. వీటిని కిడ్నీ స్ఠోన్స్ అని కూడా అంటారు. కిడ్నీ స్టోన్స్  సాధారణ లక్షణాల గురించి చాలా మందికి తెలిసినప్పటికీ, మూత్రపిండాల్లో రాళ్ల ఉనికిని సూచించే కొన్ని అసాధారణ లక్షణాలు కూడా ఉన్నాయి. మూత్రపిండాల్లో రాళ్లకు సంబంధించిన కొన్ని అసాధారణ లక్షణాలేవంటే.. మూత్రంలో రక్తం ఈ లక్షణాన్ని హెమటూరియా అని పిలుస్తారు మరియు రాళ్ళు కదులుతున్నప్పుడు, మూత్ర నాళం యొక్క లైనింగ్‌ను గీసుకుపోతుంది. ఈ కారణంగా  ఇది సంభవిస్తుంది. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి కాకపోయినా దీన్ని ఫేస్ చేసేవారికి ఓ రకంగా నరకం కనిపిస్తూంటుంది.  మూత్రవిసర్జనలో ఇబ్బంది.. కిడ్నీలో రాళ్లు మూత్రాశయం, మూత్రనాళానికి చికాకు కలిగిస్తాయి. ఇది మూత్రవిసర్జన సమయంలో అసౌకర్యం,  నొప్పికి దారితీస్తుంది.  మూత్ర విసర్జన చేసేటప్పుడు ఏదైనా నొప్పి ఎదుర్కొన్నట్టైతే దాన్ని తేలిగ్గా తీసుకోకండి.  చలి, జ్వరం.. మూత్రపిండాల్లో రాళ్ల కారణంగా జ్వరం మరియు చలి అసాధారణం అయినప్పటికీ అది వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రాళ్లు మూత్ర నాళంలో ఇన్ఫెక్షన్‌కు కారణమైనప్పుడు  చలి, జ్వరం  వస్తుంది. ముదురు రంగులో..దుర్వాసనతో కూడిన మూత్రం కిడ్నీ స్టోన్స్ వల్ల మూత్రం కూడా దుర్వాసన వస్తుంది. ఇది మూత్ర నాళంలో బ్యాక్టీరియాతో  కలిసిపోయి ఉంటుంది, ఇది రాళ్ల వల్ల సంభవించవచ్చు. అలసట శరీరం రాళ్లను వదిలించుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, ఇది చాలా ఒత్తిడి మరియు మంటను కలిగిస్తుంది, ఇది  అలసటకు దారితీస్తుంది.  తిమ్మిరి రాళ్లు మూత్ర నాళంలో నరాలపై ప్రభావం చూపినప్పుడు, అది కాళ్లు, గజ్జలు లేదా వీపులో తిమ్మిరి లేదా జలదరింపు అనుభూతిని కలిగిస్తుంది. నిలబడటం లేదా కూర్చోవడంలో ఇబ్బంది  మూత్ర నాళంలో నరాల మీద రాళ్లు ఒత్తిడి కలిగిస్తాయి. ఎక్కువసేపు నడవడం లేదా కూర్చోవడం కష్టమవుతుంది. ఈ లక్షణాలు అన్నీ కాకపోయినా ఏవైనా కొన్ని ఎదురైనా తప్పకుండా వైద్యులను సంప్రదించడం మంచింది.                                       ◆నిశ్శబ్ద.

వేసవి ప్రత్యేక ఔషధం కూర్చిక పానీయం

ఒక గ్లాసు పాలు తీసుకొని, కాచి చల్లార్చి అందులో రెండుగ్లాసుల పుల్లని మజ్జిగ కలపండి. ఈ పానీయాన్ని  ‘కూర్చిక’ అంటారు. ఇందులో “పంచదార” గానీ, “ఉప్పు” గానీ కలపకు౦డానే తాగవచ్చు.  *”ధనియాలు”, “జీలకర్ర”, “శొంఠి” ఈ మూడిఃటినీ  100 గ్రాముల చొప్పున దేనికదే మెత్తగా దంచి, మూడింటినీ కలిపి తగినంత “ఉప్పు” కూడా చేర్చి, దాన్ని ఒక సీసాలో భద్రపరచుకో౦డి. “కూర్చిక”ను తాగినప్పుడల్లా, అ౦దులో దీన్ని ఒక చెంచా మోతాదులో కలిపి తాగ౦డి. వడదెబ్బ కొట్టదు. పేగులకు బలాన్నిస్తు౦ది. జీర్ణకోశ వ్యాధులన్నింటికీ ఇది మేలు చేస్తు౦ది. వేసవిలో కలిగే జలుబుని నివారిస్తుంది. కూర్చిక పానీయం సాంప్రదాయ పానీయాలలో ఒకటి. చాలామంది వేసవి కాలంలో శీతల పానీయాలు ఎక్కువగా సేవిస్తుంటారు. అలాంటి వారు కూర్చిన పానీయం తీసుకుంటే మంచిది. వేసవి దాహార్తిని తీర్చుకోవడంతో శరీర ఊష్ణోగ్రతను తగ్గించడానికి కూర్చిక పానీయం దోహదపడుతుందని ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ క్రాంతికుమార్ తెలిపారు.  

చెమట వాసనకు డియోడరెంట్ వాడుతున్నారా.. అయితే జాగ్రత్త!

మగవారు  ప్రతి రోజూ ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు డియోడరెంట్ వాడటం తప్పనిసరి. ఆడవారి కంటే మగవారిలో చెమట ఎక్కువగా పడుతుంది కాబట్టి ఇది మగవారికి ఎంతో అవసరం కూడా. అయితే ప్రస్తుతం సబ్బుల నుండి షాంపూలు, లోషన్‌ల వరకు. పెర్ఫ్యూమ్‌ల నుండి డియోడరెంట్స్ వరకు ప్తతి ఒక్కడంటలో రసాయనాలు ఉంటాయి. ఈ ఉత్పత్తులన్నీ రసాయనాల మూలంగానే తయారవుతాయి. ఎక్కడైతే రసాయనాలు ప్రభావం చూపిస్తాయో.. అక్కడ ఆ రసాయనాలకు లోనయ్యే కారకాలు కూడా ఉంటాయి. ఇక్కడ చెప్పుకుంటున్న సౌందర్య సాధనాలు కూడా అంతే…  రసాయనాలతో తయారయ్యే షాంపులు, సబ్బుల గురించి ఏమోకానీ.. డియోడరెంట్లు మాత్రం చాలా ప్రమాదమట. ఎండాకాలమైనా, వర్షాకాలమైనా, చెమట పట్టే సమయంలో అయినా అలా లేకపోయినా డియోడరెంట్ వాడటం అలవాటు. ఇది చెమటను దుర్వాసనను దూరం చేస్తుంది. అయితే దీన్ని తప్పుగా ఉపయోగించడం వల్ల సమస్యలు చాలా ఎక్కువ అవుతాయి.  డియోడరెంట్ ఎలా పనిచేస్తుందంటే.. చర్మం ఆమ్లతను పెంచడం ద్వారా దుర్వాసనను నియంత్రించడంలో డియోడరెంట్ పనిచేస్తుంది.  ముఖ్యంగా చంకల్లో దుర్వాసనకు ఈ డియోడరెంట్స్ మంచి ఉపశమనం. ఇవి దుర్వాసనను నియంత్రిస్తాయి కానీ  చెమటను నియంత్రించవు. వీటిలో చెమట వాసన రాకుండా ఉండేందుకు పెర్ఫ్యూమ్‌ను ఉపయోగిస్తారు. దీనితో పాటు, ఆల్కహాల్ కూడా ఉంటుంది. దీన్ని చర్మానికి రాసుకుంటే చర్మం పొడిబారడంతోపాటు రంగు మారడం కూడా జరుగుతుంది.  అలర్జీలు డియోడరెంట్లు కొన్నిసార్లు అలెర్జీలను కలిగిస్తాయి. ఇందులో చర్మంపై దద్దుర్లు, మొటిమలు, చర్మం  ఎరుపుకు మారడం, దురద, మంట  లేదా చర్మంపై వాపుతో పాటు, శ్వాసకోశ లక్షణాలు కూడా వస్తాయి. సాధారణంగా ఇది ఒక రకమైన కాంటాక్ట్ డెర్మటైటిస్. ఇది అల్యూమినియం, ఆల్కహాల్, కృత్రిమ సువాసనల సమ్మేళనం.  డియోడరెంట్లో ఉండే పారాబెన్‌లు, రంగులు లేదా ఇతర రసాయనాల వల్ల అలర్జీలు వచ్చే ప్రమాదం ఉంది. ఇవి గుర్తుపెట్టుకోవాలి.. మొదటి విషయం మీ చర్మం గురించి అవగాహన. మీ చర్మం సున్నితంగా ఉంటే చాలా జాగ్రత్తగా డియోడరెంట్ని ఎంచుకోవాలి. వీలైతే.. చర్మ సంబంధ నిపుణుడిని సంప్రదించి మీ చర్మానికి తగినది ఎంచుకోవచ్చు. శరీరంపై వచ్చే చెమట వల్ల ఎప్పుడూ  దుర్వాసన రాదు. దుర్వాసన అనేది చర్మంపై పెరిగే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. కాబట్టి మీరు శరీర దుర్వాసనతో ఇబ్బంది పడుతుంటే ముందుగా దాని కారణాన్ని తెలుసుకోవాలి. కారణం కాకుండా డియోడరెంట్ను ఎక్కువగా ఉపయోగించవద్దు. ఇష్టమొచ్చినట్టు వాడితే చివరకు వైద్యుల దగ్గరకు వెళ్లాల్సిన అవసరం రావొచ్చు.  డియోడరెంట్ ఎప్పుడూ చర్మంపై నేరుగా అప్లై చేస్తుంటారు. కాబట్టి.. డియోడరెంట్ను అప్లై చేసిన తర్వాత చర్మంపై మంట, దురద, పొడిబారినట్లు అనిపిస్తే, వెంటనే దానిని అప్లై చేయడం మానేయాలి. . శుభ్రమైన కాటన్ దుస్తులు ధరించడం, రోజూ బాగా స్నానం చేయడం, శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం, శరీరంలోని అధిక వెంట్రుకలను తొలగించడం, ఆహారంలో స్వల్ప మార్పులు చేసుకోవడం వల్ల చెమట వాసన చాలా వరకు అదుపులో ఉంటుంది. దుర్వాసన సమస్యను ఆర్మ్పిట్ డిటాక్స్, అలోవెరా, కొబ్బరి నూనె, టీ ట్రీ ఆయిల్, ఎప్సమ్ సాల్ట్ మొదలైన వాటి ద్వారా కూడా నియంత్రించవచ్చు. డియోడరెంట్ వల్ల ఇబ్బంది ఏర్పడినప్పుడు ఇంటి చిట్కాలు పాటించినా ఉపశమనం కల్గకపోతే వైద్యుడిని సంప్రదించాలి.                                 ◆నిశ్శబ్ద.

కార్డియోవాస్కులర్ వ్యాయామాలు చేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

వ్యాయామాలు గొప్ప ఆరోగ్యాన్ని చేకూర్చుతాయి. వీటిలో కూడా కార్డియోవాస్కులర్ వ్యాయామాలు ఎంతో మంచివి. కార్డియోవాస్కులర్ వ్యాయామాలు శరీరం ఆక్సిజన్ గ్రహించడాన్ని,  ప్రసరణను పెంచడం ద్వారా గుండె, ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. కార్డియోవాస్కులర్ వ్యాయామలనే ఏరోబిక్ వ్యాయామాలు అని కూడా పిలుస్తారు, ఈ వ్యాయామాల వల్ల శరీరంలో పెద్ద కండరాలు ఎక్కువ సేపు పనిచేస్తాయి. రన్నింగ్, జాగింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్, చురుకైన నడక, రోయింగ్ వంటివి రోజూ చేయగలిగే కార్డియోవాస్కులర్ వ్యాయామాలు.  హృదయ స్పందన రేటు, శ్వాస రేటును పెంచడం ద్వారా కార్డియోవాస్కులర్ వ్యాయామాలు అద్బుతమే చేస్తాయి. కండరాల కణాలకు రక్త ప్రవాహాన్ని ఆక్సిజన్ సరఫరాను సులభతరం చేస్తాయి. ఈ ప్రయోజనాలతో పాటు కొన్ని మానసిక ప్రయోజనాలను చేకూర్చుతాయి.  రోజూ కార్డియో వ్యాయామాలు చేయడం వల్లకలిగే 9 ప్రయోజనాల గురించి తెలిస్తే ఈరోజే ఈ వ్యాయామాలు మొదలుపెట్టేస్తారేమో.. హృదయనాళాలను ఆరోగ్యంగా ఉంచుతాయి.. కార్డియో వ్యాయామాలు గుండె, రక్త నాళాలు ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది, రక్తపోటును తగ్గిస్తుంది. శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.  బరువు తగ్గడంలో సహాయపడతాయి.. కార్డియో వ్యాయామాలు కేలరీలను బర్న్ చేయడానికి, తద్వారా బరువు తగ్గడానికి సహాయపడతాయి. ఇవి శరీరంలో ఉన్న అదనపు కొవ్వును తొలగించడంలో సహాయపడతాయి,  మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.  ఒత్తిడి, ఆందోళన తగ్గిస్తాయి.. ఒత్తిడి ఆందోళనతో ఇబ్బంది పడుతున్న వ్యక్తులకు కార్డియోవాస్కులర్ వ్యాయామాలు చాలా మంచి ఫలితాలు ఇస్తాయి. ఒత్తిడి, ఆందోళన స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. ఈ వ్యాయామాలు చేసినప్పుడు సహజ మూడ్ బూస్టర్ అయిన ఎండార్ఫిన్‌ల విడుదల అవుతాయి. ఇవి  మొత్తం మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. హృదయ స్పందన రేటు, శ్వాస పెరుగుదల కారణంగా, ఎండార్ఫిన్లు చురుగ్గా పనిచేస్తాయి.  మంచి నిద్రకు సహాయపడతాయి.. కార్డియో వ్యాయామాలు నిద్ర నాణ్యత, నిద్ర వ్యవధిని మెరుగుపరచడంలో సహాయపడతాయి. నిద్రలేమి సమస్యతో బాధపడేవారు, నిద్రమధ్యలో ఎప్పుడూ మెలకువ సమస్యతో ఇబ్బంది పడేవారు కార్డియోవాస్కులర్ వ్యాయామాలు చేస్తే  చక్కని నిద్ర సొంతమవుతుంది. దృఢంగా మారుస్తాయి.. కార్డియో వ్యాయామాలు చేసేవారు తమ రోజువారీ పనులు చేసేటప్పుడు ఎక్కువ అలసిపోకుండా ఉంటారు. ఈ వ్యాయామాల వల్ల  అద్భుతమైన శరీర దారుడ్యం లభిస్తుంది. తినే ఆహారానికి తగినంత పనిచేయడం, శరీరంలో ఉన్న అదనపు కొవ్వును కరిగించడంలో వీటి పాత్ర అమోఘం. బెస్ట్ ఫిట్నెస్ బాడీని బిల్డ్ చేస్తాయివి. దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడం.. కార్డియో వ్యాయామాలు మధుమేహం, స్ట్రోక్, కొన్ని రకాల క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఇది మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి, అకాల మరణ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.. మెదడుకు రక్త ప్రవాహాన్ని, ఆక్సిజన్‌ను మెరుగుపరచడం ద్వారా అభిజ్ఞా పనితీరును మెరుగుపరుస్తాయి. ఇది మెరుగైన దృష్టి, ఏకాగ్రత, మొత్తం మానసిక ఆరోగ్యానికి దారితీస్తుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల మెదడు పనితీరు మరియు అభిజ్ఞా సామర్థ్యాలు మెరుగుపడతాయి, జ్ఞాపకశక్తి, ఏకాగ్రత మరియు నిర్ణయం తీసుకునే నైపుణ్యాలు మెరుగుపడతాయి. మెరుగైన జీవక్రియ కార్డియో వ్యాయామాలు జీవక్రియను పెంచుతాయి, ఇది శరీరం కేలరీలను బర్న్ చేసే రేటు పెంచుతుంది. మొత్తం ఆరోగ్యం, ఫిట్‌నెస్ స్థాయిలకు దారితీస్తుంది. బరువు తగ్గడం, బరువు పెరగకుండా కంట్రోల్ లో ఉండటాన్ని ప్రోత్సహిస్తుంది. ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది శరీరంలో ఆక్సిజన్ సరఫరా ఎంత బాగుంటే అంత ఆరోగ్యంగా ఉంటారు. ఈ మధ్య కాలంలో శ్వాస సంబంధ సమస్యలు చాలా దారుణంగా పెరుగుతున్నాయి. కార్డియోవాస్కులర్ వ్యాయామాలు చేస్తే  శ్వాసకోశ, హృదయనాళ వ్యవస్థ మెరుగుపడుతుంది. ఇది క్రమంగా, గుండె, ఊపిరితిత్తులు మరియు ఇతర కండరాలను బలపరుస్తుంది, హృదయ సంబంధ వ్యాధులు, మధుమేహం, ఊబకాయం ప్రమాదాన్ని తగ్గిస్తుంది.                                       ◆నిశ్శబ్ద.

చాపకింద నీరులా పిల్లల్ని కబళించే జబ్బు.. ప్రతి తల్లిదండ్రి తెలుసుకోవాలి!

మానవ ఆరోగ్య ప్రపంచంలో చాలా జబ్బులు ఉన్నాయి. పిల్లల నుండి పెద్దల వరకు ఎన్నో జబ్బులొస్తాయి. ముఖ్యంగా తల్లుల ఆరోగ్యం తగినంత సమర్థవంతంగా లేకపోతే పుట్టే పిల్లలు కూడా అనారోగ్యంతో పుడతారు. ఎవరికీ ఎక్కువగా తెలియని జబ్బు తలసేమియా.. ఇది ఒక జన్యుపరమైన రుగ్మత, దీని కారణంగా రోగి ఎర్ర రక్త కణాలు అంటే RBCలు తగినంత హిమోగ్లోబిన్‌ను ఉత్పత్తి చేయవు. ఇది రక్తహీనతకు దారితీస్తుంది. 1938లో భారతదేశంలో మొదటి తలసేమియా కేసు నమోదైంది. 1994లో తొలిసారిగా అంతర్జాతీయ తలసేమియా సమాఖ్య మే 8న ప్రపంచ తలసేమియా దినోత్సవాన్ని జరుపుకుంది. అప్పటి నుండి ఈ వ్యాధి గురించి అవగాహన కల్పిస్తూ ప్రతి యేడూ మే 8 వ తేదీన తలసేమియా దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ వ్యాధి బాధితులు నిరంతరం పెరుగుతూనే ఉండటం అందరినీ కలవరపెడుతున్న విషయం. బాధితుల సంఖ్య కొన్ని కోట్లలో ఉంది. ఈ వ్యాధి వచ్చినవారు  బ్రతకాలంటే ప్రతి రెండు నుండి మూడు వారాలకు రక్తమార్పిడి అవసరం. వ్యాధి మూడు దశలుగా ఉంటుంది... మొదటి దశ.. మొదటి దశను మైనర్ తలసేమియా అంటారు. ఇందులో ఒక జన్యువు తల్లి నుండి మరొకటి తండ్రి నుండి వస్తుంది. ఒక జన్యువులో తలసేమియా లక్షణాలు ఉన్న వ్యక్తులను క్యారియర్లు అంటారు. ఇందులో వ్యక్తికి తేలికపాటి రక్తహీనత మాత్రమే ఉంటుంది. రెండవ దశ.. రెండవ దశను ఇంటర్ మీడియా అంటారు. ఇందులో తేలికపాటి నుండి తీవ్రమైన లక్షణాలు కనిపిస్తాయి. మూడవ దశ మూడవ దశను మేజర్ తలసేమియా అంటారు. ఇది తలసేమియా అత్యంత తీవ్రమైన రూపం. ఇది ఒక పిల్లవాడు ప్రతి పేరెంట్ నుండి రెండు జన్యువులను పొందడం ద్వారా వచ్చే సమస్య. తలసేమియా మేజర్ ఉన్న పిల్లవాడు జీవితంలో మొదటి సంవత్సరంలో తీవ్రమైన రక్తహీనత లక్షణాలను ఎదుర్కొంటాడు. ఈ సమస్య ఉన్నవారు జీవించడానికి ఎముక మజ్జ మార్పిడి లేదా సాధారణ రక్త మార్పిడి అవసరం. తలసేమియా వ్యాధిలో కనిపించే లక్షణాలు.. రక్తహీనత - బలహీనమైన ఎముకలు, ఆలస్యంగా లేదా నెమ్మదిగా శారీరక అభివృద్ధి, శరీరంలో ఐరన్ ఓవర్లోడ్, ఆకలి లేకపోవడం - చర్మం సున్నితంగా మారిపోవడం, విస్తరించిన ప్లీహము లేదా కాలేయం తలసేమియాకు పరిష్కారాలు.. తరచుగా రక్తమార్పిడి అవసరం. ఈ రోగులలో కొన్నిసార్లు హెపటైటిస్ లేదా హెచ్ఐవి కూడా కనిపిస్తుంది. రక్త మార్పిడి వల్ల కూడా ఇది జరగవచ్చు. తలసేమియా మేజర్‌తో బాధపడుతున్న పిల్లవాడు 30 కిలోల బరువు ఉంటే, ఆ పిల్లవాడికి రక్తం ఎక్కించడం, ఐరన్ కోసం ఏటా రెండు లక్షల రూపాయలు ఖర్చు చేయాలి. అంటే ఆ పిల్లాడు 50 ఏళ్లు బతికితే కోటి రూపాయలు వెచ్చించాల్సి ఉంటుంది.  పౌష్టికాహారం, వ్యాయామం ద్వారా కొంత వరకు నియంత్రించవచ్చు. అలాగే, నవజాత శిశువుకు , గర్భిణీ తల్లికి క్రమం తప్పకుండా టీకాలు వేయడం కూడా ప్రభావవంతంగా ఉంటుంది. ఈ వ్యాధికి ఏకైక నివారణ..  చెలేషన్ థెరపీ, ఎముక మజ్జ మార్పిడి ఒక ఎంపిక. ఎముక మజ్జ మార్పిడి ఖరీదైనది. దీని కోసం దాత HLA పొందడం అవసరం. అందుకే చాలా మంది రోగులు రక్తమార్పిడితో బతుకుతున్నారు ఐరన్ నియంత్రణ చాలా ముఖ్యం. ఐరన్ పెరుగుదల కాలేయం, గుండె పై దుష్ప్రభావాలను కలిగిస్తుంది. అయితే, ఐరన్  మొత్తాన్ని నియంత్రించడానికి వైద్యులు  కొన్ని మందులు ఇస్తారు.  శరీరంలో రక్తం పాత్ర, హిమోగ్లోబిన్ పాత్ర చాలా కీలకమైనది కాబట్టి ఈ జబ్బు మొత్తం శరీరం మీద ప్రభావం చూపిస్తుంది. ముందు జాగ్రత్తలు, అవగాహన చాలా అవసరం.                                     ◆నిశ్శబ్ద.

డిప్రెషన్ తో బాధపడేవారికి ఈ ఆహారం ఔషధమే!

మనిషిని వేధించే సమస్యలలో మానసిక సమస్యలు చాలా ఘోరమైనవి. పని ఒత్తిడి, కరోనా సమస్య అనేక సామాజిక కారణాల వల్ల గత కొన్ని సంవత్సరాలుగా అనేక రకాల మానసిక ఆరోగ్య సమస్యలు పెరిగాయి. ఒత్తిడి, ఆందోళన వంటి మానసిక ఆరోగ్య సమస్యలు చాలా హానికరం. మానసిక ఆరోగ్య సమస్యలను ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వీటిని నిర్లక్ష్యం చేస్తే ఇవి ప్రాణాలమీదకు తెచ్చిపెడతాయి.  జీవనశైలి, ఆహారపు అలవాట్లను సరిగ్గా ఉంచుకోవడం ద్వారా మానసిక సమస్యల ప్రమాదాన్ని తగ్గించవచ్చు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, పోషకాహారం మనిషి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ప్రయోజనకరంగా ఉంటుంది. శారీరకంగానూ, మానసికంగానూ మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఆహారం ముఖ్యపాత్ర పోషిస్తుంది. డిప్రెషన్ సమస్యతో బాధపడుతున్నవారు కేవలం మందుల మీదనే ఆధారపడితే.. కొలుకోవడం కష్టం. రోజూ తీసుకునే ఆహారంలో ఈ కిందున్న వాటిని చేర్చుకుంటే మంచి ప్రయోజనాలు ఉంటాయి. తృణధాన్యాలు తృణధాన్యాలు మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తాయి. తృణధాన్యాలలో సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు, వివిధ రకాల పోషకాలలు కలిగి ఉంటాయి. తృణధాన్యాలు మెదడు ట్రిప్టోఫాన్‌ను గ్రహించడంలో సహాయపడతాయి. ఈ కారణంగా నిరాశ ఆందోళనను తగ్గించడంలో కూడా ప్రయోజనకరంగా ఉంటాయి. వీటిని రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటే డిప్రెషన్ ను తగ్గించుకోవడం సుగమం అవుతుంది. పాలకూర పాలకూర , పచ్చి ఆకుకూరలు ఆరోగ్యానికి పోషకమైన ఆహారాలు. దీన్ని తీసుకోవడం ద్వారా, మెదడుకు తగినంత ఫోలిక్ యాసిడ్ లభిస్తుంది, ఇది డిప్రెషన్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మానసిక ఆరోగ్యం కారణంగా నిద్రలేమి సమస్య ఉన్నవారు పాలకూర తినాలి. అధ్యయనం ప్రకారం, పాలకూరలో ఉండే సమ్మేళనాలు వృద్ధులలో చిత్తవైకల్యం ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. డ్రై ఫ్రూట్స్ మానసిక ఆరోగ్యం కోసం డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ లో  ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అద్భుతంగా ఉంటాయి. ఇది నిరాశతో పోరాడటానికి సహాయపడుతుంది. కొన్నింటిని పరిశీలిస్తే..  జీడిపప్పులో   మెగ్నీషియం మెదడుకు ఆక్సిజన్‌ను అందిస్తుంది.  బాదంపప్పులో ఉండే ఫెనిలాలనైన్ అనే సమ్మేళనం మెదడుకు డోపమైన్ మరియు ఇతర న్యూరోట్రాన్స్‌మిటర్‌ల ఉత్పత్తికి సహాయపడుతుంది.  కాబట్టి పై పదార్థాలు రోజూ ఆహారంలో ఉండేలా చూసుకుంటే డిప్రెషన్ ను చాలా వరకు తగ్గించుకోవచ్చు.                                ◆నిశ్శబ్ద.

ఇన్సులిన్ రోజూ తీసుకుంటే క్యాన్సర్ వస్తుందా?

ఇన్సులిన్ రోజూ తీసుకుంటే టైప్ వన్ డయాబెటీస్ రోగులకు క్యాన్సర్ వస్తుందని శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తున్నారు.డయాబెటిస్ నిర్వహణలో చాలా చికిత్చలు ఉన్నాయి. ఎన్నోతేరఫీలు ఉన్నాయి అందులో సంజీవనిగా ఇన్సులిన్ ను పిలుస్తారు.అని సీనియర్ దయాబెటాలజిస్ట్ డాక్టర్ బారాస్కర్ అన్నారు. ఇన్సులిన్ క్యాన్సర్ కు దారితీస్తుందా ప్రమాదమా ?... టైప్ వన్ డయాబెటిస్ దీర్ఘకాలిక వ్యాధి మనకు పొత్తికడుపులో ఉండే ప్యాంక్రియాస్ అనే అవయవం కొంచంగానో లేదా అస్సలు ఇన్సులిన్ ఉత్పత్తి జరగనట్లయి తే ఈ సమస్య వస్తుంది. అప్పుడే ఇన్సులిన్ డోస్ ప్రతిరోజూ తీసుకోవాల్సి ఉంటుంది.అదీ చర్మం కిందిభాగం లో ఇన్సులిన్ తీసుకోవాలి లేదా ఇన్సులిన్ పంప్ చేయాల్సి ఉంటుంది. శరీరానికి అవసరమైన ఇన్సులిన్ ఇవాల్సి ఉంటుంది. ఇన్సులిన్ డోసేజ్ ను అవసరమైన విధంగా మార్చుకోవచ్చు... డయాబెటిస్ అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని డయాబెటిస్ పై జామా విశ్వవిద్యాలయం నిర్వహించిన పరిశీలనలో ప్రతిరోజూ మానవుడికి సహజంగా ఇంజక్షన్ ఎన్నిసార్లు తీసుకోవాలి టైప్ వన్ డయాబెటిస్ రోగులు సమాచారం డయాబెటిస్ ను అదుపు చేయడం వచ్చే ఇతర సమస్యలు డి సి సి టి ఎపిదమాలజిస్ట్లు లు డయాబెటిస్ ఇంటర్ వెంక్షన్స్ ఇతర పరిణామాల పై వివరంగా పరిసోదించారు. క్యాన్సర్ వచ్చే అవకాశం పై జరిగే ఘటనలు 28 సంవత్సరాల డయాబెటీస్ ఉన్న వారిలో క్యాన్సర్ వచ్చే అంశం పై పరిశోదన చెపట్టారు. 1,౩౦౦ ౩ రోగులపై జరిపిన పరిశోదన లో ఎక్కువడోస్,తక్కువ డోస్ మధ్య వ్యత్యాసం తక్కువ డోస్ విభాగం లో 5౦ రకాల రిస్క్ ఉన్నట్లు గుర్తించారు.పొగతాగడం, మధ్యం సేవించడం ఇతర మందులు కుటుంబ చరిత్ర కీలకంగా పరిగణలోకి తీసుకున్నారు శాస్త్రజ్ఞులు.1,౩౦౩ రోగులలో 9౩ మంది అంటే 7% క్యాన్సర్ ను గుర్తించారు. ప్రతివెయ్యి మందిలో 95%   2.8సంఘటనలు చోటుచేసుకున్నట్లు శాస్త్రజ్ఞులు పేర్కొన్నారు.5 సంవత్సరాల పరీక్షలు నిర్ధారణ చేయగా వారికి 75 సంవత్సరాల పైనే ఉండచ్చు. 9౩ రోగులలో 57 మంది మహిళలు 61% ఉన్నట్లు అందులో ౩6 మంది పురుషులు క్యాన్సర్ బారిన పడ్డారు. 1౦ సంవత్సరాల లోపు 11-2౦ సంవత్సరాల్ 58%పెరిగిందని. 21-2 8 సంవత్సారాల వయస్సు ఉన్నవారిలో క్యాన్సర్ వ్యాపించడాన్ని గమనించారు నిపుణులు. ఏది ఏమైనా ఇన్సూలిన్ ప్రతిరోజూ తీసుకుంటే ప్రమాదమే అన్నది మాత్రం వాస్తవం. ఎప్పటికప్పుడు మీ సమీపంలో ఉన్న డాక్టర్ ను సంప్రదిస్తూ డోస్ మార్పిడి చేసుకుంటూ క్యాన్సర్ బారిన పడకుండా చూసుకోవాలి.                                  

ఈ ఒత్తిడితో ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టచ్చు!! 

మన శరీరంలో ఏ అయస్కాంత ప్రవాహమైతే ప్రవహిస్తుందో దాని స్విచ్ బోర్డు మన యొక్క రెండు అరచేతులలో, రెండు అరికాళ్లలో ఉంది. చిత్రంలో వేర్వేరు స్పర్శ బిందువులు ఎక్కడెక్కడ ఉన్నాయో చూపబడ్డాయి. 1. మెదడు 2. మానసిక రోగం 3. పిట్యూటరీ 4. పీనియల్ 5. మస్తిష్క నర్క్స్ 6. గొంతు, కంఠము 8. థైరాయిడ్ 9. వెన్నుపూస 10. అర్ష్-మసా 11. ప్రోస్టేట్ 12. యోని మార్గము 13. జననేంద్రియము 14. గర్భాశయము 15. అండాశయము 16. నడుము, ప్రక్క ఎముకల క్రింది భాగం 17. తొడ 18. మూత్రాశయం 19. ప్రేగులు 20. గుదము 21. ఎపండిక్స్ 22. పిత్తాశయం 23. కాలేయం 24. భుజం 25. ప్యాంక్రియాస్ 26. కిడ్నీ 27. జఠరము 28. అడ్రిన్ 29. సూర్య కేంద్రం 30. ఊపిరి తిత్తులు  31. శక్తి కేంద్రము 33. నరము - చెవి 34. నరము - జలుబు 35. కన్ను 36. గుండె 37. కాలేయం 38. థాయమస్.  ఒత్తిడి ఎలా కలిగించాలంటే… ఇందులో అరచేతుల యొక్క, అరికాళ్ల యొక్క బిందువుల పైన వాటి సమీపంలో ఒత్తిడి కలిగింపబడుతుంది. ఇలా చెయ్యడం వల్ల బిందువుతో కలిసి ఉన్న అవయవాల వైపు అయస్కాంత ప్రవాహం జరుగుతుంది. ఎలాగంటే - బ్రొటన వ్రేలియందున్న మస్తిష్క బిందువుపై ఒత్తిడి చేసినచో అయస్కాంత ప్రవాహము మస్తిష్కము వైపు ప్రవహిస్తుంది. అది మస్తిష్కమును అధిక క్రియాశీలము చేస్తుంది. బ్రొటన వ్రేలితో గాని లేక చూపుడు వ్రేలితో గాని లేక మొనలేని పెన్సిల్తోగానీ బిందువులపై ఒత్తిడి చేయవచ్చు. ఏ బిందువుపై ఐనా 4-5 సెకండ్ల వరకు ఒత్తిడి కలిగించాలి. 1-2 సెకండ్ల ఒత్తిడిని కలిగించడం ఆపి తిరిగి ఒత్తిడి కలిగించాలి. ఇలా 1-2 ని॥ల వరకు పంపింగ్ చేసే విధంగా ఒత్తిడిని కలిగించాలి. తిరిగి భారముతో గూడిన మర్దనము చెయ్యాలి. బిందువుపై ఒత్తిడి భారము అనుభవంలోకి వచ్చేంత ఒత్తిడి మాత్రమే చెయ్యాలి. అధికంగా ఒత్తిడిని కలిగించకూడదు. సున్నితమైన చేతిపై తక్కువగా ఒత్తిడి కలిగించినా అది అనుభవంలోకి వస్తుంది. అంతఃస్రావి గ్రంధుల బిందువులు తప్పించి ప్రతి బిందువుపైనా అడ్డంగా ఉన్న బ్రొటనవ్రేలి ద్వారా భారము వేయుట వలన ఆవశ్యకమైన ఒత్తిడి పడగలదు. అంతఃస్రావి గ్రంధుల బిందువులపై అధిక ఒత్తిడి కలిగించడానికి నిలువు బ్రొటన వ్రేలిని పెన్సిలు లేక పెన్నును ఉపయోగించి చేయవచ్చు. శరీరం యొక్క కుడిభాగమందలి అవయవాలందు బాధ కలిగినా లేక నొప్పి కలిగినా కుడి అరచేతి లేక కుడి అరికాలి బిందువులపై ఒత్తిడి చెయ్యాలి. ఇలాగే శరీరం యొక్క ఎడమ భాగములో బాధలకు తత్సబంధమైన ఎడమ అరచేతి లేక ఎడమ అరికాలు యొక్క ఒత్తిడి బిందువులపై ఒత్తిడి వేయాలి. శరీరం యొక్క వెనుక భాగము అంటే వెన్నెముక, జ్ఞాన తంతువులు, నడుము, సాయటికా నరము, తొడ మొ||వి వస్తాయి. వాటి కొరకు అర చేతి వెనుక భాగములో లేదా కాలిపై భాగములో ఒత్తిడి చేయవచ్చు. ఏ రోగానికైనా లేక అవయవ లోపానికైనా అరచేతి బిందువులపై రోజుకు మూడుసార్లు 1-2 ని॥ల వరకు ఒత్తిడి కలిగించవచ్చు. అరికాలి బిందువులపై ఒకేసారి 5ని॥ల వరకు ఒత్తిడి కలిగించవచ్చు. బిందువుల నొప్పి తగ్గనంత వరకు ఈ  చికిత్సను కొనసాగించవచ్చు. 

చియా విత్తనాలు ఆరోగ్యానికి మంచివే.. కానీ ఇన్ని ప్రమాదాలు ఉంటాయని తెలుసా?

చియా విత్తనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సబ్జా గింజలు, చియా విత్తనాలు ఎన్నో రకాల పానీయాలలో దర్శనమిస్తుంటాయి. ఇవి సూపర్ ఫుడ్ అనే చెప్పొచ్చు. వీటిలో ఉండే అధిక పోషక విలువలు, ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిస్తే వీటిని వాడకుండా ఉండలేరు. చియా విత్తనాలలో ఫైబర్, ప్రోటీన్, కొవ్వులు ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడికి వ్యతిరేకంగా రక్షణను అందిస్తాయి. దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి. అయినప్పటికీ, చియా విత్తనాలను అధిక మొత్తంలో తీసుకోవడం వల్ల దుష్ప్రభావాలు కూడా ఉంటాయి. చియా విత్తనాలు ఆరోగ్యానికి ఎలా ఇబ్బంది కలిగిస్తాయో తెలుసుకుంటే వాటిని ఎలా వాడుకోవాలో ఇట్టే అర్థమవుతుంది.   చియా విత్తనాలు తీసుకోవడం వల్ల కలిగే 7 దుష్ప్రభావాలు: 1. జీర్ణ సమస్యలు చియా విత్తనాలను అధిక మొత్తంలో తీసుకోవడం వల్ల కలిగే అత్యంత సాధారణ దుష్ప్రభావాలలో ఉబ్బరం ఒకటి. గ్యాస్, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలు ఎదురవుతాయి. ఎందుకంటే చియా గింజల్లో అధిక ఫైబర్ ఉంటుంది. ఇది పొట్టలో అసౌకర్యం కలిగించి  జీర్ణ సమస్యలకు దారితీస్తుంది. 2. రక్తం పలుచన అవుతుంది చియా గింజలు రక్తాన్ని పలుచన చేసే లక్షణాలను కలిగి ఉంటాయి. ఇది రక్తపోటు తగ్గడానికి దారితీస్తుంది. ఇప్పటికే బ్లడ్ థినర్స్ తీసుకుంటున్న లేదా తక్కువ రక్తపోటు సమస్యలు ఉన్నవారికి ఇది ప్రమాదకరం. చియా విత్తనాలు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్‌లు, మొక్కల ఆధారిత ప్రోటీన్‌లు పుష్కలంగా కలిగి ఉంటాయి. అయినప్పటికీ, ఒమేగా-3-రిచ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తం పలుచన అవుతుంది.  3. అలెర్జీ కలిగిస్తాయి కొంతమందికి చియా విత్తనాలు తీసుకున్నప్పుడు  అలెర్జీ కలుగుతుంది. చర్మంపై దద్దుర్లు, కళ్ళ దురద, గొంతులో ఇబ్బంది,  శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు ఉండవచ్చు. నువ్వులు లేదా ఆవపిండి తీసుకుంటే అలెర్జీకి గురయ్యేవారు చియా గింజలు తీసుకున్నప్పుడు అలెర్జీకి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది.  ఎందుకంటే ఇవన్నీ ఒకే మొక్కల కుటుంబానికి చెందినవి 4. డీహైడ్రేషన్ చియా గింజలు వాటి బరువుకు ముప్పై రెట్ల నీటిని పీల్చుకుంటాయి.  అధిక మొత్తంలో చియా గింజలను తీసుకుంటే శరీరంలో నీటిశాతం తగ్గిపోవడానికి  దారితీస్తుంది. ఇవి తీసుకున్నప్పుడు తగినంత నీరు తాగకపోతే చాలా  ప్రమాదకరం. 5. మందుల మీద ప్రభావం.. రక్తపోటు, మధుమేహంకు సంబంధించిన ఎన్నో మందులు రోజూ వాడేవారు ఈ కాలంలో అధికంగా ఉంటారు. వీరు చియా విత్తనాలను తీసుకున్నప్పుడు అవి మందులమీద ప్రభావం చూపుతాయి. మందులు పనిచేయకుండా చేయడం, మందులు వ్యతిరేక ప్రభావం చూపించేలా చేయడం జరుగుతుంది.  అందువల్ల చియా విత్తనాలను ఆహారంలో చేర్చుకునే ముందు ఆరోగ్య నిపుణులను సంప్రదించి  వారి సూచన ప్రకారం తీసుకోవడం మంచిది. 6. రక్తస్రావం పెరిగే ప్రమాదం చియా విత్తనాలు రక్తస్రావం ప్రమాదాన్ని పెంచుతాయి, ప్రత్యేకించి ఆస్పిరిన్ లేదా వార్ఫరిన్ వంటి రక్తాన్ని పలచబరిచే మందులతో తీసుకుంటే చాలా ప్రమాదం ఎదుర్కోవాలి. రక్తస్రావం రుగ్మత ఉన్నవారు, ఇందుకోసం మందులు వాడేవారు చియా విత్తనాలకు దూరంగా ఉండాలి. 7. హార్మోన్ల అసమతుల్యత చియా విత్తనాలు శరీరంలో ఈస్ట్రోజెన్ ప్రభావాలను అనుకరించే ఫైటోఈస్ట్రోజెన్‌లను కలిగి ఉంటాయి, ఇది హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తుంది.  రొమ్ము లేదా అండాశయ క్యాన్సర్ వంటి హార్మోన్ సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న మహిళలకు  ప్రమాదకరమైన పరిణామాలను కలిగిస్తుంది.