జలుబే కదా అని నిర్లక్ష్యం చేస్తే.. ఇంతకు దారితీస్తుందా??

సాధారణంగా వాతావరణ మార్పుల వల్ల ఎదురయ్యే ఆరోగ్య సమస్యలతో జలుబు మొదటి స్థానంలో ఉంటుంది. కాస్త చల్లని వాతావరణం ఏర్పడితే చాలు మెల్లగా జలుబు అటాక్ చేస్తుంది. మొదటి దశలోనే దీనికి సరయిన జాగ్రత్తలు తీసుకోకపోతే గొంతు నొప్పి, బ్రాంకైటిస్ మొదలైన శ్వాసనాళ వ్యాధులకి దారి తీయవచ్చు. జలుబు వల్ల ముక్కులోను, శ్వాసనాళంలోను ఇన్ఫ్లమేషన్ ఏర్పడుతుంది. వైరస్ కారణాన, అలర్జీ వల్ల జలుబు రావచ్చు. వైరస్ వల్ల కలిగే జలుబు ముక్కు, గొంతు, నోరు నుంచి బయటికి వెలువడే వాయువుల తుంపర్లు మొదలైన వాటి వల్ల ఒకళ్ళ నుంచి మరొకళ్ళకి వ్యాపిస్తుంది. అందుకని ఎక్కడపడితే అక్కడ చీదడం, ఉమ్మేయడం మంచిది కాదు. దగ్గు వచ్చినప్పుడు నోటికి అడ్డంగా కర్చీఫ్ పెట్టుకోవడం మంచిది. ఇది కనీస సభ్యత, అందరూ గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయం. ఒక్కోసారి దుమ్ము, పొగ, కొన్ని వాసనలు మొదలయినవి పడక అలర్జీ వల్ల జలుబు రావచ్చు. ఈ పరిస్థితులకు, పదార్థాలకు దూరంగా ఉండడం మంచిది. ముక్కు వెంట కేవలం నీరు మాత్రమే వస్తే పెద్ద భయపడాల్సింది ఏమీ లేదు. ఆ జలుబు ఏ వైరస్ కారణానో వచ్చినట్లు! ఆలర్జీ కలిగినప్పుడు తుమ్ములు, నీళ్ళు కారడం కూడా ఆ పరిస్థితులకు దూరమైనప్పుడు తగ్గిపోతాయి. అలా కాకుండా ముక్కు నుంచి చీము వస్తూ గొంతు బొంగురుపోతే వెంటనే డాక్టర్ కు చూపించాలి. ఇలాంటి సమయంలో కొద్దిపాటి జ్వరము కూడా రావచ్చు. గుండె, శ్వాసకోశ వ్యాధులు ఉన్నప్పుడు జలుబు ప్రమాదకరంగా పరిణమించవచ్చు.  జలుబు జాగ్రత్తలు:- జలుబు రాగానే బాగా గాలివచ్చే ప్రదేశంలో ఉంటూ పిల్లలకు, వృద్ధులకు దూరంగా ఉండాలి. వైరస్ వల్ల కలిగే జలుబుకి మందులు వాడడం దండగ, దానంతటదే తగ్గుతుంది గాని, మందులవల్ల తగ్గదు. అవి మాత్రమే కాకుండా  మరికొన్ని శ్వాసనాళ, శ్వాసకోశ అనారోగ్యాలు కూడా ఎదురవుతాయి.  బ్రాంకైటిస్ తీవ్రమైన బ్రాంకైటిస్ తలనొప్పి, గుండెనొప్పి, కళ్ళె, దగ్గు, లేక పొడిదగ్గు వుంటాయి. దీర్ఘమైన బ్రాంకెటిస్ బాధాకరమైన దగ్గు, కళ్ళె కూడా పడుతుండవచ్చు. ఈ జబ్బు బ్రాంకో న్యుమోనియా వంటి వ్యాధులకూ దారి తీయవచ్చు. అందుకని ఈ పరిస్థితుల్లో డాక్టర్ కు చూపించడం ఎంతో అవసరం. దీనికి మందులు, యాంటీ బయోటిక్స్ డాక్టర్ సలహా మీదే వాడాలి. బ్రాంక ఎక్టసిస్ శ్వాసనాళాల విస్తరణని బ్రాంక ఎక్టసిస్ అంటారు. క్రిమిదోషాల వల్ల, శ్వాస నాళాంతర పీడన శక్త్యాధిక్యత వల్ల ఈ జబ్బు రావచ్చు. దగ్గు, దుర్గంధముతో కూడిన కళ్ళె పడడం, ఆయాసము, రక్తం వాంతి ఈ వ్యాధి లక్షణాలు, ఊపిరితిత్తులలో పేరుకుపోయిన కళ్ళె బయటకు పంపడం అవసరం. ఫెరింజైటిస్ గొంతు ఇన్ఫ్రేమ్ కావడం ఫెరింజైటిస్. జలుబుకి కారణాలే ఇందుకూ కారణం అవుతాయి. మింగడం కష్టమై గొంతు పాడి ఆరిపోవడం, గొంతులో దురద లక్షణాలు బాగా ఎక్కువైతే మ్రింగడం కూడా కష్టమైపోతుంది. నీరసం, జ్వరము వస్తాయి. తడిలో నాసడము. చలిగాలి, శ్వాసకోశమును ఇరిటేట్ చేసే పొగలు పీల్చడం, అతిగా మాట్లాడడం తగ్గించాలి. వెంటనే చికిత్స తీసుకోకపోతే ఈ ఇన్ఫెక్షన్ క్రమంగా శ్వాసకోశానికి వ్యాపించవచ్చు. బ్రేకియా అంటే శ్వాసనాళానికి ఇన్ఫ్లమేషన్ వస్తే 'ట్రాకియైటిస్' అంటారు. వీటన్నింటిలో ధూమపానము ఆపేయాలి. గొంతు నొప్పికి డిప్తీరియా కూడా కారణం కావచ్చు. అందుకని పిల్లలో గొంతు నొప్పి వస్తే వెంటనే డాక్టర్ కు చూపడం మంచిది.  ట్యూబర్క్యులోసిస్ (టి.బి) ఇది నెమ్మదిగా శ్వాసకోశాన్ని దెబ్బతీస్తుంది. మైకో బాక్టీరియమ్ ట్యుబర్క్యులోసిస్ అనే సూక్ష్మజీవులు గాలిలో నుంచి ఊపిరి తిత్తులలోకి ప్రవేశించడం వల్ల ఈ అనారోగ్యము కల్గుతుంది. లోపలికి వెళ్ళి ఈ సూక్ష్మజీవులు ఆల్వియోలైలని నాశనం చేస్తాయి. కణాలని చంపేస్తాయి. ముందు ఊపిరితిత్తుల పై భాగంలో ఈ వినాశనం చేస్తాయి. చనిపోయిన కణాల భాగాన్ని ట్యూబర్కిల్ అంటారు. ఈ ట్యూబర్కిల్స్ క్రమంగా పెరగడం వల్ల ఊపిరితిత్తుల లోపల ఖాళీలు ఏర్పడతాయి. శ్వాస కష్టమవుతుంది. మొదట్లో పొడిదగ్గు వస్తుంది. తర్వాత కళ్ళె, చివరికి రక్తం పడుతుంది. కొద్దిపాటి జ్వరం ఉంటుంది, ఆకలి వుండదు. బరువు తగ్గుతుంటుంది. ట్యూబర్క్యులోసిస్ వ్యాధిని ఎక్స్ రే, కళ్లె పరీక్షలు, బరువు తగ్గడంతో కనుక్కోవచ్చు. దీన్నే టి.బి అని కూడా అనడం వినే ఉంటాం. ఏడాదిన్నర లేక రెండేళ్లు వాడితే గాని ఈ వ్యాధి నయం కాదు. అనుమానం రాగానే ప్రారంభదశలోనే డాక్టర్ కి చూపించి, సరయిన చికిత్సని పొందడం ముఖ్యం. మెడలో బయటికి వాపు కనిపిస్తూ టి.బి లింఫాడెంటిస్ రావచ్చు. మెదడుకి క్షయ మెనింజైటిస్ రావచ్చు. ఎముకలకి ఆహార నాళానికి కూడా (ట్యూబర్క్యులోసిస్) క్షయ రావచ్చు.  కాబట్టి జలుబే కదా అని నిర్లక్ష్యం చేయకండి.                                   ◆నిశ్శబ్ద.

మైగ్రేయిన్ అవగాహన వారోత్సవాలు...

మై గ్రెయిన్ వచ్చిందంటే భరించలేని తలనొప్పి తీవ్రంగా ఉంటుంది. తీవ్ర మైన నొప్పి తలతిరగడం తల పట్టేయడం ఒక్కసారి వదల గానే వాంతులు. రావడం తో నరకం చూస్తున్నామని వారు వాపోవడం గమనించవచ్చు.మై గ్రెయిన్ కు అలోపతిలో అందరికీ పనిచేయక పోవచ్చు. మై గ్రెయిన్ తో బాధ పడేవారు ఒక్కోసారి ఆత్మహాత్య చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. మైగ్రేయిన్ ఒక న్యూరో లాజికల్ సమస్యగా డాక్టర్స్ పేర్కొన్నారు. మైగ్రేయిన్ పై అవగాహనా వరాన్ని సెప్టెంబర్ నెలలో ప్రతియేటా నిర్వహిస్తారు. సెప్టెంబర్ 5 వ తేదినుండి 1 4 తేది వరకూ మైగ్రేయిన్ పై అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. మైగ్రేయిన్ వల్ల వచ్చే నొప్పి మామూలు సాధారణ మైన తలనొప్పి కాదు చాలా తీవ్రమైన తలనొప్పి తో పాటు తల నొప్పి తీవ్రమై నప్పుడు కళ్ళు చీకట్లు కమ్మడం వినికిడి సమస్య రావడం గమనించవచ్చు. మైగ్రెయిన్ వచ్చినప్పుడు ఇంటి చిట్కాలు వైద్యం చేయవచ్చు వీటివల్ల కొంతమేర మై గ్రెయిన్ తీవ్రత తగ్గి ఉపసమనం కల్పిస్తుంది. మైగ్రెయిన్ అట్టాక్ నుండి కొంత మేర ఉపసమనం కలిగించే 8 ఉపాయాలు ఉన్నాయని అంటున్నారు నిపుణులు. లేవెండర్ ఆయిల్ తో లాభం... లేవెండర్ ఆయిల్ ను రాయడం ద్వారా మైగ్రేయిన్ వల్ల వచ్చే నొప్పి కొంతమేర ఉపశమనం ఉపశమనం కలుగుతుంది.  లేవెండర్ ఆయిల్ ను వేరే నూనెలో కలిపి రాయవచ్చు. లేవేండర్ నూనెను మీ మెదడుపై మృదువుగా వ్రాయవచ్చు. పెప్పర్ మెంట్ ఆయిల్... పెప్పర్ మెంట్ ఆయిల్ లో కనుగొన్న మెంతాల్  రసాయనం మైగ్రైయిన్ ను నిలువరించే నిరోదించేందుకు సహకరిస్తుంది ఈ విషయం పై పలు పరిశోదనలు నిర్వహించారు. అల్లం... కళ్ళు తిరగడం మైగ్రేయిన్ స్థితికి కారణం కావచ్చు. దీనినుండి బయట పాడేందుకు అల్లం కొంతమేర ఉపసమనం కలిగిస్తుంది. అల్లం వాడకం వల్ల మైగ్రేయిన్ కు కొంతమేర ఉపసననం తోపాటు లాభం చేకూర వచ్చు  యోగాతో మైగ్రేయిన్  కు అడ్డుకట్ట... మైగ్రేయిన్ నుండి ఉపసమనం పొందడానికి యోగ దోహదం చేస్తుంది. యోగాలో శ్వాస తీసుకునే పద్దతులు ధ్యానం సాధన చేయడం ద్వారా ఒత్తిడి తగ్గించవచ్చు. ఆరోగ్యంగా ఉండవచ్చు. 2౦ 15 లో జరిగిన పరిశోదనలో యోగాతో మై గ్రెయిన్  అటాక్ తీవ్రతను తగ్గించవచ్చని తేలింది. ఆహారం లో మెగ్నీషియం పెంచండి... శరీరంలో మెగ్నీషియం తగ్గడం వల్ల మైగ్రేయిన్ నొప్పి మరింత తీవ్రంగా ఉండవచ్చు. అసలు మెగ్నీషియం తలనొప్పికి సంబంధం ఉందని అంటున్నారు. అందుకే మీ ఆహారం లో బాదాం, అవిసగింజలు, ఆకు కూరలు,నట్స్,పీనట్ బట్టర్, ఓట్ మీల్, గుడ్లు,పాలు, ఎక్కువగా తీసుకోండి. ఒత్తిడి నియంత్రించే ప్రయత్నం చేయండి... అమెరికన్ మైగ్రెయిన్ ఫెడరేషన్ సమాచారం మేరకు మైగ్రేయిన్ తోబాద పడుతున్నవారు దాదాపు 8౦%మందిలో ఒత్తిడి కారణం గానే మైగ్రేయిన్ కు కారణంగా నిపుణులు పేర్కొన్నారు. మీరు ఒత్తిడిని అదుపులో ఉంచుకుంటేనే  మైగ్రేయిన్ అటాక్ తగ్గే అవకాశాలు ఉన్నాయని నిపుణులు గుర్తించారు. శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచండి... అమెరికన్ మైగ్రేయిన్ ఫౌండేషన్ సూచన ప్రకారం మైఇగ్రేయిన్ బారిన పడిన వారిసంఖ్య 1/౩ డీహైడ్రేషన్ వల్లే మైగ్రేయిన్ వస్తుందని డీ హైద్రెషన్ నుండి రక్షింప బడాలంటే నీరు తీసుకోవాలి ప్రత్యేకంగా వ్యాయామం చేయాలి ఎండాకాలం లో నీరు మరింత ఎక్కువ తాగాలి. రాత్రి నిద్రపోఎందుకు ప్రయత్నం చేయాలి... నిద్ర మరియు డీ హైడ్రేషన్ కు ఏమైనా సంబంధం ఉందా? అన్న విష్యం తెలియరాలేదు అయితే 2౦16 లో వచ్చిన రిపోర్ట్  ఆధారం గా మైగ్రేయిన్ అట్టాక్ మళ్ళీ మళ్ళీ వస్థూ ఉంటె నిద్రలేకుంటే దీనికి సంబంధం ఉందని తేల్చారు. అందుకే రాత్రి సంపూర్ణంగా నిద్రపోయే ప్రాయాత్నం చ్ఘేయాలంటే నిద్రాపోఎముండు కాఫీ, లేదా టీ తీసుకుంటే నిద్రారాడు దీనివల్ల మరింత సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు పేర్కొన్నారు.మైగ్రేయిన్ పై ఉన్న భిన్నమైన అఫాలు అనుమబాలకు సందేహాలకు సెప్టెంబర్ లో మైగ్రేయిన్ అవగాహన వరాన్ని నిర్వహించడం కొనసాగుతోంది. 

షుగర్ వల్ల ఇన్ని సమస్యలొస్తాయని మీకు తెలుసా?

ఈమధ్య కాలంలో మధ్యవయసు కాదు కదా 30 ఏళ్ళు దాటకుండానే షుగర్ జబ్బు వచ్చేస్తోంది చాలామందికి. అయితే ఈ షుగర్ వల్ల కేవలం తీపి పదార్థాలు తినకుండా ఉండటమే కాకుండా వేరే ఇతర అనారోగ్య సమస్యలు కూడా పొంచి ఉంటాయి. వాటి గురించి తెలుసుకుంటే… గ్లూకోజు పదార్థం సరిగా అందనపుడు, గుండె బలహీనమవుతుంది. అందువల్ల షుగర్ వ్యాధి క్రానిక్ అయిన వారికి గుండె జబ్బులకు దారితీసే అవకాశము ఎక్కువగా ఉంటుంది. ఇతరులతో పోల్చిచూస్తే, మధుమేహ రోగులకు  2 నుండి 4 రెట్లు అధికంగా గుండె జబ్బులు వస్తున్నట్లు పరిశోధనల్లో వెళ్ళడయింది. నిర్ధారించుచున్నారు. షుగర్ వ్యాధి కారకమైన వారిలో చీముకణాల సంఖ్య (పసె సెల్సు) పెరుగుట వల్ల రక్తం కలుషితమవుతుంది. చిక్కబడిపోతుంది అందువల్ల గుండె స్పందన పెరిగి, గుండెఒత్తిడి పెరిగి గుండె జబ్బులొచ్చే ప్రమాదం ఉంది. .  మనశరీరంలోని, అదనపు షుగరును, చీము కణాలను ఎప్పటి కప్పుడు మూత్రపిండములు వడకట్టి బయటకు పంపేస్తూ ఉంటాయి. అయితే షుగర్ ఎక్కువ ఉండటం వల్ల మూత్రపిండాలకు పని ఎక్కువ అవుతుంది. దానికి తోడు శుభ్రమైన  రక్తము లేక మూత్రపిండముల కండరములు బలహీనపడతాయి. అందువల్ల మూత్రపిండ వ్యాధులు సంక్రమిస్తాయి. ఇప్పుడు లెక్కల ప్రకారం కిడ్నీ వ్యాధులతో బాధపడే వారిలో, ప్రతిముగ్గురిలో ఒకరు సుగర్ వ్యాధి పీడితులేనని తెలుస్తోంది.  దాదాపు 15-20 సంవత్సరాల నుండి షుగర్ వ్యాధితో బాధపడేవారికి డయాబిటీస్, రేటినో అనే పార వచ్చే అవకాశం ఉంటుంది. అట్లాంటి వారిలో కంటిలోని రెటీనాకు సంబంధించిన, చిన్నచిన్న రక్తనాళములలో చీము కణాలు (పస్పెల్సు) చేరి పోయి ఆయానాళములు పాడైపోయి రెటీనాకు శుభ్రమైన రక్తము ప్రాణశక్తి అందక, అంధత్యము వస్తుంది. క్రానిక్ షుగర్ వ్యాధిగ్రస్తులకు చాలామందికి కాళ్ళకు పాదములకు  కాలివ్రేళ్ళు తిమ్మిరులెక్కి స్పర్శ తెలియకుండా పోతుంది. అలాంటి స్థితిలో కాలికి ఏమి తగిలినా తెలియదు. కాలిచెప్పులు ఊడిపోయింది గూడా కొందరికీ తెలియదు. కాళ్ళు మనదేహమునకు దిగువన ఉంటాయి కాబట్టి, షుగర్ వ్యాధిగ్రస్తులకు నిర్జీవరోగ పదార్దములు చీము కణాలు హెచ్చుగా ఉంటాయి. అవన్ని  కాళ్ళలో చేరి నిలిచిపోతాయి. అందువల్ల కొందరికి కాళ్ళువాపులు-నీరు కనిపిస్తాయి. గుండె బలహీనత వల్ల చివర్లకంటా రక్తప్రవాహములు సరిగా అందవు. అక్కడ చేరిన నిర్జీవ పదార్ధములు కుళ్ళిపోయి రణాలుగా తయారై కాలిని తినేస్తాయి. అలాంటి స్థితిలో డాక్టర్లు ఆపరేషన్ చేసి కొందరికి, కాలివ్రేళ్లను  మరికొందరికి పాదములను  కొందరికి మోకాలు క్రింద వరకు మరికొందరికి తొడలవరకు కూడా తీసేస్తారు.  షుగర్ వ్యాధిగ్రస్తులలో కొందరికి నోటిపూతగాను, గొంతు సంబంధ సమస్యలు, చిన్నప్రేగులలో తరచుగా పూతలు ఏర్పడటం జరుగుతూ ఉంటుంది, అందువల్ల నోటిలోనూ,  ప్రేగులలోనూ కడుపులో మంటలు కనిపిస్తుంటాయి. ఇలాంటి వారు ఏమాత్రం పులుపు, ఉప్పు, కారములు మొదలైనవి తిన్నా విపరీతమైన మంటలు ఏర్పడతాయి. మరికొందరికైతే, పళ్ల చిగుళ్లు వాపులు వస్తాయి, అంతేకాకుండా చిగుళ్లు నొప్పులు, పళ్ళ వెంట చీము రక్తము కారడం. నోరు వాసన రావడం (పయోరియా లక్షణాలు) కొందరికైతే పళ్లు కదిలి ఊడిపోవడం వంటి సమస్యలు సంభవిస్తాయి.  కాబట్టి షుగర్ వచ్చిందంటే దాంతోపాటు మరికొన్ని సమస్యలు వెనక వస్తున్నట్టు అని గుర్తుంచుకోండి.                                    ◆నిశ్శబ్ద.

లివర్ కు ముప్పొస్తే ఇంత దారుణం జరుగుతుందని తెలుసా??

మన శరీరంలో ముఖ్యమైన అంతర్గత అవయవాలలో లివర్ చాలా ముఖ్యమైనది. నిమిషానికి 1.2 లీటర్ల రక్తం లివర్ ద్వారా ప్రవహిస్తుంటుంది. హిపాటిక్ వీన్స్ ద్వారా లివర్ నుంచి రక్తం బయటకు వెళ్తుంది. ఈ వీన్స్లో అడ్డం పడితే హిపాటిక్ వీన్ థ్రాంబోసిస్ వస్తుంది. ఇది చాలా అపాయకరమైన అనారోగ్యము కానీ హెపాటిక్ వీన్స్ సాధారణంగా బ్లాక్ కావు. లివర్ రెండు లోబ్స్ లోను బైల్ రసం తయారవుతుంది. ఈ రసం బైల్ డక్ట్ అనే మార్గం ద్వారా ఆహార నాళాన్ని డుయోడినమ్ దగ్గర చేరుకుంటుంది. బైల్ డక్ట్, డుయోడినమ్ లోకి ప్రవేశించే ప్రదేశంలో ఒక కవాటము ఉంటుంది. ఆహార పదార్థాలు జీర్ణమవుతూ డుయోడినమ్ లోకి ప్రవేశించినప్పుడు మాత్రం బైల్ రసం లోపలికి వెళ్ళేట్లు చేస్తుంది. మిగతా సమయంలో ఈ రసాన్ని డుయోడినమ్ లోకి రానీయదు. అప్పుడు లివర్లో తయారైన బైల్ రసమంతా మరో మార్గం గుండా గాల్ బ్లాడర్ కి వెళ్ళి నిల్వ ఉంటుంది, అవసరమైనప్పుడు డుయోడినమ్ లోకి వస్తుంది. లివర్, గాల్ బ్లాడర్ నుంచి వచ్చే మార్గాలే కాకుండా పాంక్రియాజ్ నుంచి వచ్చే మార్గం కూడా వీటితో కలసి కామన్డక్ట్ ఏర్పడి, అది డుయోడినమ్కి కలుపబడి ఉంటుంది. అంటే పాంక్రియాటిక్ జ్యూస్ కూడా బైల్ రసంతో పాటే డుయోడినమ్లో కలుస్తుందన్నమాట!  కాబట్టి ఈ మార్గంలో ఎక్కడ అడ్డంకి ఏర్పడ్డా ఈ రసాలు డుయోడినమ్ లోకి ప్రవేశించలేవన్నమాట! పాంక్రియాటైటిస్ అనే జబ్బు మనదేశంలో ఎక్కువగా వస్తోంది. సరయిన పోషకాహారం లేక పాంక్రియాజ్ దెబ్బ తింటే ఇన్సులిన్ ఉత్పత్తి ఉండదు. దాంతో రక్తంలో షుగర్ పెరుగుతుంది. మన శరీరంలో మెదడు తర్వాత అతి క్లిష్టమైన, ముఖ్యమైన అవయవము లివర్. ఇది రక్తాన్ని శుభ్రం చేయడం, బైల్ రసాన్ని ఉత్పత్తి చేయడంతో పాటు మరెన్నో ముఖ్యమైన పనుల్ని కూడా నిర్వర్తిస్తోంది. మనం తిన్న ఆహారాన్ని కేలరీస్ లో శక్తిగా మార్చేది లివరే! క్రొవ్వుల్ని వాటిలో కరిగి వుండే విటమిన్లని స్వీకరించేది లివరే.. లివర్ కె అనారోగ్యం వస్తే క్రొవ్వులు శరీరంలో స్వీకరించబడకుండా మలము ద్వారా బయటకు వెళ్ళిపోతుంటాయి. విటమిన్ ఎ.డి.కె లు క్రొవ్వుల్లో కరిగి ఉంటాయి. కాబట్టి లివర్ కి జబ్బు వస్తే ఈ విటమిన్లను శరీరం స్వీకరించలేదు. ఇవన్నీ మలము ద్వారా బయటకి వెళ్ళిపోతుంటాయి.  విటమిన్ 'ఎ' తగ్గితే రక్తం గాయం ద్వారా బయటికొచ్చేప్పుడు  స్రావం ఆగదు. లివర్ అనారోగ్యం వస్తే ఈ విటమిన్లని ఇంజక్షన్స్ ద్వారా ఇవ్వాల్సి వస్తుంది. సెక్స్ హార్మోన్ల ఉత్పత్తిని కూడా లివర్ క్రమపరుస్తుంటుంది. లివర్ అనారోగ్యం వల్ల ఆడవాళ్ళలో రుతుక్రమం దెబ్బతింటుంది. మగవాళ్ళలో శరీరం మీద వెంట్రుకలు రాలిపోవడం, ఇంపాటెన్సీ కలగవచ్చు. ఏవైనా కణాలు దెబ్బతింటే, ఆ ప్రాంతంలో క్రొత్త కణాలని ఉత్పత్తి చేసే ఎంజైమ్స్, ప్రొటీన్స్ ను కూడా లివరే తయారు చేస్తుంటుంది. కాబట్టి లివర్ కి అనారోగ్యం వస్తే దెబ్బతిన్న కణాల స్థానంలో క్రొత్త కణాలు తయారవడం కూడా ఆలశ్యమవుతుంది. లివర్ జబ్బు వున్న వాళ్ళకు యాక్సిడెంట్లయినా, ఆపరేషన్ అయినా తిరిగి మామూలు స్థితికి రావడానికి ఆలశ్యమవుతుంది. గుండె, ఊపిరితిత్తులు మొదలైన అవయవాలకి అనారోగ్యము వస్తే నొప్పి ద్వారా మను వెంటనే తెలుసుకోగలం, కానీ లివర్ అనారోగ్యం ప్రారంభదశలో ఇలాంటి నొప్పులేమీ ఉండవు కాబట్టి వస్తున్న ఆపాయాన్ని ముందు పసిగట్టలేము. కాబట్టి లివర్ విషయంలో అందరూ తగినంత జాగ్రత్తగా ఉండటమే శ్రీరామరక్ష!!

శరీరం బరువు గురించి యోగా ఏమి చెబుతోంది?

శరీరం బరువు నిరంతరం అడుక్కి త్రొక్కేస్తూ వుంటుంది. అంత శరీర భారాన్ని  చిన్న పాదాలు రెండు మొయ్యవలసివస్తోంది. కనుక నిట్టనిటారుగా  నిలబడితే సరిగా నిలబడలేక తూలిపోయే పరిస్థితి వస్తుంది. మరి ఎలా నిలబడాలి??  కాలి పిక్కల్లోని కండరాలు,  తొడల మీద కండరాలు మనిషి పై భాగపు బరువును మోయాలి. అలా కాకుండా కేవలం పాదాల మీద బరువు మోస్తే..  పిరుదులో, మోకాళ్ళో, కాలికండలో సడలిపోయి తుళ్లి పడిపోతాము. మనిషి శరీరంలో బరువు మొయ్యలేక పాదాలు   వీగిపోతున్నప్పుడు శరీరంలో ఉన్న పిక్కలు, నడుము భాగంలో  కండరాలు  బిగిసిపోయి, ఎలాగో మిమ్మల్ని నిలబెట్టాలని ప్రయత్నిస్తాయి  అప్పుడే మనిషి శరీరం ఊగిపోతుంది. అలా కాకుండా శరీరాన్ని ముందుగానే నడుము, పిక్కలు కండరాల సహాయంతో బ్యాలెన్స్ చేయడం అలవాటైతే ఇలాంటి సమస్యే ఉండదు. మనం సాధారణంగా వెల్లకిలా నేలమీద పడుకున్నాము అనుకోండి!  అప్పుడు  బరువంతా  వీపు మీదనే మోపుకుంటారు కానీ పిక్కల మీద కాదు కదా.. కాబట్టి ఆ స్థితిలో  కండరాలు సాగవలసిన అవసరం లేదు. అందుకే  పిక్కలకు బయటవున్న కండరాలైనా,  తొడలకు ముందున్న కండరాలైనా, పొట్టకండరాలైనా, వీపు కండరాలైనా వాటిని గురుత్వ వ్యతిరేక కండరాలని అంటున్నారు.  మనిషి శరీరం మొత్తంలో ఉన్న కండరాలన్నిటిలోనూ బిగువును ఎక్కువగా కలిగి ఉన్న కండరాలివే. ఈ కండరాలు సహజంగా ఎక్కువగా శరీరంలో పనిచేస్తూ ఉంటాయి. ఈ కండరాలు గంట గంటకి గురుత్వాన్ని ఎదుర్కోవటం అందరికీ కష్టంగానే ఉంటుంది. నిలబడ్డప్పుడు అయితే ఇక చెప్పనవసరం లేదు..  మనిషిలో ఛాతీలోని కండరాలు, మెడకి ఇటూ అటూ ఉన్న కండరాలూ ఎక్కువ వాడుతూ ఉంటాం. అందుకని అవి  బాగా మెత్తబడి పోతూంటాయి. గురుత్వ వ్యతిరేక కండరాలు పుష్టిగా ఉంటేటట్లు అందరూ జాగ్రత్త పడాలి. అప్పుడే అవి గుండెకు బాగా తోడ్పడగలుగుతాయి. నిలబడ్డప్పుడు గురుత్వం కాళ్ళల్లోకి, పాదాలలోకి ప్రసరిస్తుంది. అప్పుడే  గుండె నుంచి రక్తం ఎక్కువగా తోడుతుంది. ఆ రక్తం పాదాలు, కాళ్ళ నుంచి వెనుదిరిగి గుండె, ఊపిరితిత్తులు చేరేటప్పుడు గురుత్వమే నిరోధిస్తుంది.  అప్పుడు  గురుత్వ వ్యతిరేక కండరాలు బిగుసుకొని గురుత్వం వల్ల  గుండెల్లోంచి రక్తాన్ని పూర్తిగా  కాళ్ళల్లోకి దిగిపోకుండా నిరోధించి, అక్కడున్న రక్తం  ఊపిరితిత్తుల్లోకి, గుండెల్లోకి ప్రవహించేలా చూస్తాయి.  కదలకుండా చాలాసేపు నిలబడి నట్లయితే  కాళ్ళల్లో కండరాలు సూక్ష్మరక్తనాళాలను పిండివేసి, కొయ్యబారిపోతాయి. రక్తాన్ని తిరిగి ఊపిరితిత్తుల్లోకి, గుండెల్లోకి చేరకుండా నిరోధించాయన్నమాట! అప్పుడు  గుండె ఓవర్ గా పని చేయవలసి  వస్తుంది. అదే సమయంలో కాళ్ళు పీక్కు పోతాయి. నానా బాధా పడిపోతారు. అందుకే అడుగు మీద అడుగు వేసుకొంటూ ఎంతదూరం నడిచినా కలగని బాధ కొద్దిసేపు నిశ్చలంగా నిలబడటం వల్ల కలుగుతుందన్న మాట! అలాంటప్పుడు ప్రతిరోజూ ఎన్నిగంటలు నిశ్చలంగా మనం నిలబడుతున్నామో ఆలోచించుకోవాలి. వృధాగా అలా నిలబడటం వల్ల దేనిని కోల్పోతున్నామో గ్రహించాలి. పర్యవసానంగా  శరీర సౌష్టవం, దానితో బాటు  శరీరం దాని కంఫర్ట్  తొలగిపోతున్నాయి! మనిషిలో  చెలరేగే నీరసం, నిస్త్రాణాలు  ఈసురోమని అనిపించేటట్లు చేస్తాయి. ఇలాంటి అనుభూతి కలిగినంత సేపు మనిషి తనను తాను ఎప్పుడూ ఉత్తేజవంతుడిగా ఉంచుకోలేడు. ఈ విషయం తెలుసుకున్నవాడు ఉత్తముడు అనుకోవచ్చు.                                    ◆నిశ్శబ్ద.

యాంటి బయోటిక్స్ అతిగా వాడితే!

  మోతాదుకి మించి యాంటి బయోటిక్స్ వినియోగించిన భారత్...లాన్సేట్ నివేదికలో వెల్లడి. కోవిడ్ మొదటి రెండవ విడతలో మోతాదుకు మించిన యాంటి బయోటిక్స్ , ఐ సి యు లో మోతాదుకు మించి మత్తు మందులు వినియోగించి నందువల్లె స్ట్రోక్స్ వచ్చి చనిపోయరాని, అసలు కోవిడ్ సమయంలో ఏమందులు ఎంత మోతాదులో వాడాలో నియంత్రణ లేకుండా విచ్చల విడిగా స్టెరాయిడ్స్, ఇతర ఇంజక్షన్లు రేమిడి సివిర్ లాంటి ఇంజక్షన్లు ఇష్టారీతిన వాడినందువల్లె బ్లాక్ ఫంగస్,వైట్ ఫంగస్ వంటి సమస్యలు బ్రెయిన్ స్ట్రోక్ వంటి సమస్యలు తో కోవిడ్ బాధితులు ఇబ్బందులు పడిన కధనాలు మనం చూసాము,చదివాము.  ఇందులో ఎంతవాస్తవమో మనందరికీ తెలుసు.అయితే లాన్సేట్ రిపోర్ట్ లో 2౦19 సంవత్సరంలో భారత్ లోని ప్రైవేట్ వైద్యులు 47%యాంటి బయోటిక్స్ వినియోగించారంటు నివేదికలో పేర్కొనడాన్ని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా తప్పు పట్టింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య ఎస్ ఎన్ సి ఎం స్టాండింగ్ నేషనల్ కమిటీ మేదిసిన్స్ ఉపాధ్యక్షుడు సీనియర్ ఫర్మాకాలజిస్ట్ వై కే గుప్తా లాన్సేట్ నివేదికను తీవ్రంగా తప్పుపట్టారు. ఈమేరకు లాన్సేట్ నివేదిక అనంతరం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సూర్ డవీయ  విజ్ఞప్తి మేరకు వై కే గుప్తా వివరణ ఇస్తూ అత్యవసర మందుల లిస్టు ను తయారు చేసి ఇస్తామని ఫార్ములాను ఆయా రాష్ట్రాల నియంత్రణ మండలి డ్రగ్ ఆధారిటీ అనుమతితోనే వెలువడతాయని పేర్కొన్నారు.  లాన్సేట్ నివేదికలో ఆమోదం పొందని ఫార్ములా అన్న పదం వాడారని అంటే దాని ఆర్ధం సి డి ఎస్ సి ఓ కాదాని ఈ ఫార్ములాలు ఆయా రాష్ట్రాల డ్రగ్ రెగ్యులేటరీ అధారిటీ ఆమోదించినవే అని అందుక ఈ విషయం లో ఆమోదం పొందని అన్న పదం ప్రయోగించడం పై వై కే గుప్తా తీవ్రంగా వ్యతిరేకించారు. కేంద్ర ప్రభుత్వ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ రెగ్యులేటరీ బాడీ ఫార్మా రంగం లో ఉందని తెలిపారు. లాన్ స్టడీ రిపోర్ట్  చదివిన తరువాత కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి వివరణ కోరారని గుప్తా తెలిపారు. లాన్సేట్ రేపోర్ట్ ను ఉటంకిస్తూ యాంటి బాయిటిక్స్ అతిగా వాడారని అనడం సరికాదాని అభిప్రాయపడ్డారు. ఈమేరకు బ్రెజిల్,రష్యా,యురప్ దేశాలతో పోలిస్తే యాంటి బాయిటిక్స్ వాడకం తక్కువే గానే వినియోగించినట్లు గుప్తా పేర్కొన్నారు. అయినప్పటికీ భారత్లో యాంటి బయోటిక్స్ వినియోగం లో అగ్రభాగాన నిలిచిందని నివేదికలో పేర్కొనడం సరికాదని గుప్తా వెల్లడించారు. భారత్ లో రోజుకు 1౦౦౦ డోస్ లు వాడితే ప్రపంచవ్యాప్తంగా 1౦.4 ఎక్కువగా వినియోగించారని గుప్తా స్పష్టం చేసారు. కాగా 2౦15 లో 1౩ .6% వినియోగించారని లాన్సేట్ నివేదిక ప్రకారం దేశంలో యాంటి బయోటిక్స్ వినియోగం,నియంత్రణ, అమ్మకాలు నిలువరించాల్సిన అవసరం ఉందని గుప్తా అభిప్రాయపడ్డారు. యాంటి బాయిటిక్స్ పై మరిన్ని పరిశోదనలు అవసరమని పేర్కొన్నారు.2౦19 లో అజితో మైసిన్ విరివిగా వాడారని యాంటి బయోటిక్స్ వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అభిప్రాయ పడ్డారు. మార్కెట్ లో నేడు 1౦% ఫార్ములాలు ఉన్నాయని అదనంగా మరో 5౦ % పైగా ఫార్ములాలు ఉండడం వల్ల యాంటి బయోటిక్స్ వాడినట్లు కనిపిస్తోందని అజిత్రో మైసిన్ 5౦౦ ఎంజి ,అమోక్సిలిన్ 5౦౦ ఎం జి,125 ఎం జి సిసిక్షిన్ 2౦౦ ఎం జి విరివిగా వాడారని వాటి పై అవగాహన కల్పించాలని గుప్తా అభిప్రాయ పడ్డారు. ప్రస్తుతం మార్కెట్ లో ప్రైవేట్ రంగం అమ్మకాల సమాచారం మాత్రమే అని ఇంకా పూర్తి వివరణాత్మక సమాచారం కావాలని గుప్తా విజ్ఞప్తి చేసారు. రోగుల సంరక్షణ వారికి వైద్యులు ఎలాంటి ప్రిస్కిప్షన్ లో ఎలాంటి యాంటి బాయిటిక్స్ వాడారు అన్న సమాచారం. మైక్రో బయాలాజికల్ టెస్ట్ లు యాంటి బయోటిక్స్ వినియోగం వంటి నిశితంగా పరిశీలించాల్సి ఉందని ప్రిస్కిప్షన్ సూక్ష్మం గా పరిశీలించడం అసాధ్యమని అత్యవసర సమయాలలో ఎలా వినియోగించారన్నది అంచనా అసాధ్యమని గుప్తా వివరించారు. ఫర్మా ట్రాక్ సాంపిల్ కవర్స్, స్టాకిస్టులు 6౦% మంది మాత్రమే ఉన్నారని.ప్రైవేట్ రంగంలో ఫర్మా అమ్మకాలపై లక్ష్యంగా చేసుకుని నివేదిక చేసినట్లు ఉందని గుప్తా విమర్శించారు.ప్రభుత్వ శాఖాలలో మందుల ప్రోక్యుర్మేంట్ జాతీయ,లేదా అయా రాష్ట్ర స్థాయలో నిర్ణయించిన లిస్ట్ మేరకు మందులు మాత్రమే అని వివరించారు. యాంటి బయోటిక్స్ వినియోగం పై అవగాహన అవసరమని ప్రస్తుతం యాంటి బాయిటిక్స్ ప్రభావం ఉందని కొత్త యాంటి బయోటిక్స్ వాడే అధికారం ఉందని తేల్చి చెప్పారు. ఇది ఇలా ఉంటె కోవిడ్ సమయంలో లేదా యురిన్ ఇన్ఫెక్షన్ సమయంలో గనక యాంటి బయోటిక్స్ వినియోగించడం పై నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మోతాదుకు మించి యాంటి బయోటిక్స్ వాడడం వల్ల శరీరంలో అత్యవర సమయంలో యాంటి బయోటిక్స్ పనిచేయవని శరీరంలో మెటాబాలిజం దెబ్బతిని ఇతర హార్మోన్ సంబంధిత సమస్యలు వస్తాయని మన శరీరంలో మంచి బ్యాక్టీరియా చనిపోతుందని చెడు బ్యాక్టీరియా వృద్ధి చెంది అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని యాంటి బాడీలు ఇమ్యునిటి వ్యవస్థ పై తీవ్ర ప్రభావం చూపిస్తుందని  నిపుణులు పేర్కొన్నారు. కాగా శరీరతత్వాన్ని బట్టి మాత్రమే యాంటి బయోటిక్స్ మోతాదును డాక్టర్ సలహా మేరకు వాడాలె తప్ప మరే ఇతర సమాచారం ఆధారంగా యాంటి బయోటిక్స్ వాడరాదని సూచించారు.

శరీరంలో ఎముకల పాత్ర ఏమిటి?? వాటి వ్యాధులు ఎందుకొస్తాయి??

కండరాల లోపల ఉన్న ఎముకల గురించి చెప్పుకుంటే అవి శరీరానికి ఆకారాన్ని ఇవ్వడమే కాక, ఒకదానికొకటి కలిసి కదలికలకి ఎంతో ఉపకరిస్తాయి. అన్ని అవయవాలకి ఎముకలు ఆధారాలు. మెదడు, వెన్ను, నరము, గుండె, ఊపిరితిత్తులు మొదలయిన అన్ని అవయవాలకి, ఎముకలు చుట్టూ ఉండి గట్టి రక్షణనిస్తున్నాయి. కార్టిలేజెస్ ఎముకలకి ఆధారాన్నివ్వడమే కాకుండా కలువబడే రూపాలుగా కూడా తోడ్పడుతున్నాయి. బయట చెవి, కార్టిలేజ్ సహకారంతోనే అలా వాలిపోకుండా నిలబడగలుగుతోంది. ఎముకల్ని కలపడానికి లిగమెంట్స్ ఉపయోగపడుతుంటాయి.  ఎముకలు వేటి కలయికతో ఏర్పడుతాయో తెలుసా?? కాల్షియమ్, ఫాస్ఫరస్ లాంటి ఆర్గానిక్ పదార్థాలతోపాటు ఇనార్గానిక్ పదార్థాలు కలవడంతో ఎముకలు ఏర్పడతాయి. వయసు పెరిగేకొద్దీ ఎముకలలోని ఆర్గానిక్ పదార్ధాలు తగ్గిపోతూ ఎముకలు పెళుసుగా తయారవుతాయి. విరిగితే అతకడం కూడా కష్టమవుతుంది. ఎముక విరిగినప్పుడు ఆ విరిగిన భాగాలు ఒకదానికొకటి అతుక్కోవడానికి కొత్త పదార్థాన్ని సృష్టిస్తాయి. ఆ కొత్త పదార్థాలు, కాల్షియం, లవణాలు చేరి క్రొత్త ఎముక ఏర్పడుతుంది. ఎముకల చుట్టూ ఉండే పొరని 'పెరి ఆస్టియమ్' అంటారు. దానిలో ఉండే రక్తనాళాల ద్వారా ఆహారం ఎముకలోకి వెళ్తుంది. ఒక్కో చెవిలోని మూడేసి చిన్న ఎముకలతో కలిపి, మన శరీరంలో మొత్తం 213 ఎముకలుంటాయి. పుర్రెలో 22,  వెన్నుపూసలో 33, పక్కటెముకలు 24, చేతులలో 14, కాళ్ళలో 62, మెడలో 11 చాతి ఎముకలు ఉంటాయి. వీటిలో ఏది విరిగినా కష్టమే. ఎముకలు కలిసే ప్రదేశాల్ని కీళ్ళు అంటారు. ఈ కీళ్ళు శరీరం వంగడానికి ఉపయోగపడుతుంటాయి. ఎక్కువగా వాడితే అంటే ఆ ప్రదేశాలలో కదలిక ఎక్కువగా ఉంటే కీళ్ళు తొందరగా అరిగిపోతాయి. కీళ్ళు అరగడం అందరికీ ఒకేలా ఉండదు. వయసుని బట్టికాక వాళ్ళు వాడే పద్ధతుల్ని బట్టి కీళ్ళు అరిగిపోవడం జరుగుతుంది ! కీళ్ళ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తతో పాటు ఎముకలు విరిగితే ఏం చేయాలి ఎముకలకి ఎటువంటి రోగాలొస్తుంటాయి? అసలీ ఎముకల జబ్బులు ఎందుకొస్తుంటాయి? మొదలయిన విషయాలన్నీ తెలుసుకుంటే మనం ముందు జాగ్రత్తగా కొన్ని చర్యలు తీసుకోవడానికి వీలుంటుంది.  ఎముకల వల్ల వచ్చే అనారోగ్యాలేమిటో తెలుసుకుంటే.. పోలియో, వెన్ను నొప్పి, మెడ నొప్పి, భుజాల నొప్పులతో పాటు ఎముకలలో కాన్సర్ రావచ్చు. ఎముకలు విరగడం వల్ల ఎన్నో ఇబ్బందులు వస్తుంటాయి. కాల్షియం ఎక్కువైతే ఎముకల జబ్బులొస్తాయి. అలాగే విటమిన్-డి తక్కువైతే రికెట్స్ అనే వ్యాధి వస్తుంది. సూర్యకాంతి తగలకపోవడం శరీరానికి చాలా నష్టాన్ని కల్గిస్తుంది. రెండు సంవత్సరాలలోపు పిల్లలకి సరయిన పోషకాహారం లేకపోతే, ఎముకలు సరిగ్గా పెరగవు.. మూడు సంవత్సరాలకి పైబడ్డ వాళ్ళలో మూత్రపిండాల సమస్యతో ఎముకల జబ్బులొస్తాయి. కిడ్నీ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు మూత్రంలో కాల్షియం పోయి రీనల్ రికెట్స్ రావచ్చు. అప్పుడు ఎముకలు వంకరతిరిగిపోతాయి, మత్తుగా ఉంటారు. పొట్ట పెరుగుతుంది. కాళ్ళు వెడల్పవుతాయి.  మనం తాగే నీళ్ళలో ఫ్లోరైడ్ ఎక్కువగా ఉన్నా ఎముకలు బలహీనమవుతాయి. అందరినీ ఇబ్బంది పెట్టే..  వాత రోగమూ ఎముకల జబ్బే! స్టిరాయిడ్స్ మొదలయిన వాటిని కొంత మంది వాడుతుంటారు. అప్పుడు ఎముకల్లో కాల్షియం తగ్గి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువవుతాయి. ఒక పద్ధతి ప్రకారం ఎక్కువ కాలం ట్రీట్మెంట్ తీసుకోవాలి. గర్భ కాలంలో శిశువు సరైన స్థితిలో ఉండకపోవడంవల్ల పుట్టే పిల్లల్లో పాదము, మడము కూడా శరీర మధ్య రేఖ వైపు తిరిగి ఉంటాయి. వెంటనే పాదాలు సరైన స్థితిలో ఉండేట్లు స్ప్రింట్ అనే పరికరాన్ని గాని, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ కట్టుగాని వాడాలి. వయసు పెరిగేకొద్ది కీళ్ళు అరుగుతుంటాయి. అప్పుడు ఆస్టియో ఆర్థ్రయిటిస్ అనే జబ్బు వస్తుంది. విటమిన్ సి లోపం వల్ల స్కర్వీ వస్తుంది.  ఇలా ఎముకలకు సంబంధించి నిత్యజీవితంలో ఎన్నో రకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది.                                      ◆ నిశ్శబ్ద.

కలర్ థెరపీ అంటే ?

అన్ని ఉన్నా ఆరోగ్యం లేకుంటే మనిషిజీవితం వృధా . ఆరోగ్యంగా ఉంటేనే బతుకు.ఆరోగ్యంగా ఉంటేనే అడవిలోనైన బ్రతికేయవచ్చు. వందేళ్ళు నిండు నూరేళ్ళు బతకచ్చు అని నిపుణులు నిరూపించారు. నేను అంటున్న మాట మనిషికే కాదు ప్రతిజీవికి ఇదే సూత్రం వర్తిస్తుంది అని అదే మనుగడ లో ముఖ్యమన సూత్రమని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఎరోగాలు రాకుండా ముందుజాగ్రత్త తీసుకుంటే జబ్బులు వచ్చిన వెంటనే చికిత్చ తీసుకోవాలి.బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యంగా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధాన మని.జీవితం అంటే అందమైన హరివిల్లు జీవితం కలర్ ఫుల్ గా ఉండాలని అంటారు అలాగే జీవితానికి కలర్స్ కి సంబంధం ఏమిటి అన్నదే పెద్ద సందేహం అసలు కొన్ని రకాల సమస్యలకి కలర్ తెరఫీ చికిత్చ చేయవచ్చని అంటున్నారు నిపుణులు ఏమిటి కలర్ తెరఫీ దానిగురించి తెలుసుకుందాము.సూర్యరస్మి మనకు తెల్లగా కనిపిస్తుంది. కాని సూర్యరస్మిలో 7 రంగులు ఉంటాయి. అన్నవిషయం అందరికీ తెలుసు. మానవ శరీరంలో 7 చక్రాలకు 7 రంగులకు సంబంధం ఉందని అలాగే 14 మేరీడియన్స్ 2,72,౦౦౦ వేల నాడులపై ప్రభావం చూపిస్తుందని మానవ శరీరం పై సూర్య కిరణాలు ప్రసరింప బడలేదో దానికి సంబందించిన చక్రం నాడులు దెబ్బతింటాయని ప్రాచీన వైద్యం చెపుతోంది.సూర్యకిరణాలు రంగులు శరీరంలోని వాత,పిత్త,కఫ, దోషాలను సవరించేది సమతౌల్యం చేస్తుంది.సూర్యరశ్మిలోని వివిధరంగులు వాటి ఉపయోగాలు ఎలా ఉంటాయి ఇప్పుడు చూద్దాం.  గమనిక.. కలర్ థెరఫీ లేదా ఇతరాచికిత్చలు ప్రధమ చికిత్చ మాత్రమే అని మంచి చికిత్చకోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి.కలర్ తెరఫీ నికేవలం ప్రాత్యామ్నాయ వైద్య విధానం గా భావించాలని ప్రాముఖ్య మైనదిగా భావిస్తున్నారు.నిపుణులు. ముఖ్యంగా మనకు ఇంద్ర ధనుస్సు లో కనిపించే సహజ రంగులన్నిటికీ స్వస్థత చేకూర్చే గుణాలు ఉన్నవిషయం మనకు తెలుసు.ముఖ్యంగా సూర్య రశ్మి లేనిదే జీవరాసి కి మొక్కలకు మనుగడ లేదన్నది వాస్తవం. ముఖ్యంగా సూర్యారస్మికి ఆరోగ్యానికి సంబంధం ఉందని ఒక్కో సారి బాగా మబ్బు పట్టిన సమయంలో రెండు రోజులపాటు సూర్యుడు కనపడకుంటే ఆరోగ్యంగా ఉండలేమని పేర్కొన్నారు. సూర్యరస్మి లేకుంటే ఆందోళనకు గురిఅవుతారని కొందరు సూర్య దర్శనం కానిదే ముద్దకూడా ముట్టరని అంటారు. చీకట్లో ఉండలేరని మనసికరోగులు వెలుతురు చూడలేరని వెలుతురు లేకుంటే వ్యక్తులు ఒత్తిడికి అంటే డిప్రెషన్ కు గురి కవడాన్నిఅనేక పరిశోదన లలో  గమనించవచ్చు.అందుకు కలర్ తెరఫీ సాధన చేసేవారు అటు రంగులను ఇటు వెలుతురును తమ పరికరాలలో ఉపయోగిస్తూ ఉంటారు.  కలర్ తెరఫీ మానసిక బౌతిక ఉదేవగాలకు,ఆధ్య్యాత్మిక సమస్యలకు వేటి కైనా ఉపయోగించ వచ్చునని నిపుణులు విశ్లేషించారు. కలర్ తెరఫీ చరిత్ర... కలర్ తెరఫీ ప్రాచీన ఈజిప్ట్ లో పుట్టిందని తెలుస్తోంది. వివిధ ప్రాచీన నాగరికతలలో కూడా దీనిని ఉపయోగిస్తున్నట్లు పరిశోధకులు శాస్త్రజ్ఞులు వెల్లడించారు. రంగులు వెలుగులపై విస్తృతంగా చేసిన పరిశోదన లలో వ్యాక్తులలో భావోద్వేగా పరమైన ప్రతిస్పందనలు కలిగిస్తాయని చెబుతున్నారు. అయితే ఒకరంగు పట్ల అందరూ ఒకేలా స్పందించక పోవడం విచిత్రంగా ఉందని నిపుణులు పేర్కొన్నారు. మనం ఆకర్షిత మయ్యే రంగులు మనలో మనలో అసమతౌల్యత ఉందొ పట్టి చెప్తాయని కొన్నిరంగులు మనలో సానుకూల భావాలు మరికొన్ని ప్రతికూల భావాలు,రేకేత్తిస్తాయని వీటిని అధ్యయనం చేసిన వారే కలర్ తెరఫీ చేస్తారు. కలర్ తెరఫీ కి వాడే పరికరాలు... రత్నాలు,కొవ్వొత్తులు,దీపాలు,క్రిస్టల్ క్రిస్టల్ లేక గాజు పట్టకం,రంగు బట్టలు,రంగునీటితో స్నానపు చికిత్చ,రంగుకళ్ళ జోళ్ళు, లేజర్లు ప్రధానంగా ఈ పరికరాలను దేరపిస్ట్ చికిత్చ చేస్తారు.ముందుగా మనం వేసుకునే ఎంచుకునే దుస్తులు రంగులు వాటి ప్రభావాల గురించి తెలుసుకుందాము.కొన్ని దుస్తులు గమనిస్తే లేతరంగుల్లోనే ఉంటాయి. వారికి ఆహ్లాదాన్ని విశ్రాంతిని ఇవ్వడానికే ఆరంగులను ఎంచుకుంటారు.మనం ఎంచుకునే రంగులు కూడా మన వ్యక్తిత్వాన్ని ఎంతో కొంత వ్యక్తీకరిస్తాయి.ఫ్యాషన్ పేరుతో వెర్రిగా మనకి సరిపడని రంగులు ధరించడం వల్ల దుష్పరిణామాలు కూడా సంభావుస్తాయి కొన్ని రకాల రంగుల దుస్తులు మన మూడ్స్ నుకూడా ప్రభావితం చేస్తాయి.ఏరంగు ఎలాంటి ప్రభావాన్ని ఇస్తుందో చూద్దాం. 1) ఎరుపు.. ఈ రంగు ఉత్తేజాన్ని నింపుతుంది. అది మనశరీరం లో కొన్నిలక్షణాలను దంకేతంగా ఉంటుంది.ధైర్యం,బలం, ఉత్తేజం,ఉల్లాసం,లక్ష్యం,అప్రమత్తత,లైంగిక ,సృజనాత్మకత,సంకల్ప బలం ,తీవ్రత వంటి లక్షణాలకు ఎరుపుసంకేతం. అయితే ఎరుపురంగు వల్ల కలిగే లాభాలు అనేకం.ఈ రంగును ఉపయోగించడం వల్ల మనలో ఉండే నకారాత్మక ఆలోచనలు అధిగమించ వచ్చు. ఆత్మవిశ్వాసం,స్థిరత్వం,భధ్రత, ఆధిపత్యం,భావన వంటివి పొందవచ్చు. అంతేకాదు ఎరుపు ఆకలిని పెంచుతుంది.అయితే ఎరుపును ఎక్కువగా వినియోగిస్తే అసహనం శత్రుత్వం,భావన,చికాకు ఆగ్రహం వంటివి పెరుగుతాయి.కోపం అధికంగా ఉంటుంది. 2)ఆరంజ్.. ఆరంజ్ రంగు సంతోషానికి ఉల్లాసానికి సంకేతం.వ్యక్తిలోని మానసిక ఉద్వేగాలకు ప్రభావితం చేస్తుంది.ఈ రంగు వ్యక్తిపై కలుపుగోలు తనం,నలుగురికి విశ్వాసంగా ఉండడం విజయం సంతోషం ఉంటాయి. ఈ రంగు వాడడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి. సానుకూల దృక్పదం,ఏర్పడడం ఉల్లాసంగా ఉండగలగడం వంటివి జరుగుతాయి.ఈరంగుస్పూర్తినిస్తుందని ఆసక్తులను పెంచి మన కార్యకలా పాలను విస్త్రుత మయ్యేలా చేస్తుంది. వ్యక్తిగత సంబంధాలతో సంతోషానికి మనలోని సందేహాలను సంకోచాలను తొలగించడానికి ఇది ఉపయోగపడుతుంది.ఈ రంగును అతిగా వాడారో అసహనం చిరాకు ఆకలిపెరగడం జరుగుతుంది అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ౩)పసుపు.. పసుపు అన్నిటా శుభప్రదం ఉత్తేజాన్ని ఎక్కువ స్థాయిలో కలిగిస్తుంది. మానసిక స్పష్టత సంతోషం సానుకూల వైఖరి ఆత్మ గౌరవం,వివేకం స్పూర్తిగా నిలుస్తుంది.ఈ రంగు వాడకం వల్ల జ్ఞాపక శక్తి ఏకాగ్రత ఆశక్తి పెరగడం డిప్రెషన్ తగ్గడం సాదికరాత ఆత్మవిశ్వాసం ,ధైర్యం, ఆందోళన నుండి బయట పడడం శక్తి పెరగడం వంటివి జరుగుతాయి. సరైన సమయం లో సరైన నిర్ణయం తీసుకునేందుకు కూడా తోడ్పడుతుంది పసుపు రంగును అతిగా వాడితే సారహీన ప్రవార్తన,ఆతి క్రియాశీలత వంటి దుష్పరిణామాలు కలుగుతాయి. 4)ఆకు పచ్చ.. ఆకు పచ్చ నూతన ఉత్చాహానినికి శాతికి గుర్తు ఈరంగు. ఇది ప్రేమకు సంకేతం,శాంతి,నవీకరణ, ప్రేమ,ఆశ, సమతుల్యత,సామరస్యం, స్వీయ నియంత్రణ, జీవితం లో వృద్ధి వంటి వాటికి సంజేతమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఆకుపచ్చ రంగును వాడడం వల్ల ఒత్తిడి తగ్గడం, విశ్రాంతి, స్థిరత్వం, శాంతి సౌఖ్యం, సమైక్య భావన,సంభావన వంటి అంశాలు వ్యక్తిపై ప్రభావం చూపుతాయి.అతిగా ఆకుపచ్చని వాడితే బద్ధకం వస్తుందని  దీనిని ఉపయోగించడం లో జాగ్రత్త అవసరం. 5)నీలం రంగు.. నీలం ఇది సంపూర్ణ ఆలోచనలతో అనుసంధానం అయిఉండే రంగు సమాచార మార్పిడి, సృజనాత్మకత వ్యక్తీకరణ, ఉత్తేజం నిర్ణయాత్మకం, విజ్ఞానం, ఆరోగ్యానికి సంకేతాలు ఈరంగును ఎక్కువగా ఉపయోగించడం వల్ల మానసిక విశ్రాంతి నిశ్చలత, నిద్రపట్టేందుకు సహాయపడడం, మాటల్లో ఆత్మవిశ్వాసం, స్పష్టమైన సమాచారం. పిల్లలలో హైపర్ యాక్టివిటీ తగ్గేందుకు సహాయపడుతుంది. అందుకే చాలా పాట శాలలో నీలిరంగు యునిఫాం ఉపయోగించడం గమనించవచ్చు. నీలిరంగును ఎక్కువగా వినియోగిస్తే అభద్రత, నిరాశ, అలసట,ఒత్తిడి, ఉదాసీనత, ఏర్పడవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 6) లేత నీలం.. లేత నీలం ప్రశాంతతకు చిహ్నం, భావ వ్యాక్తీకరణకు సంకేతంగా ఉంటుంది. స్వచ్చత, ఓదార్పు, శాంతం, ఆత్మవిశ్వాసం, అనర్గళంగా మాట్లాడ గలగడం మనసులో నిష్కల్మష మైన ఆలోచనలు లేతనీలం వల్ల విశ్రాంతి,ప్రేమ పూర్వక అభివ్యక్తి, స్వేచ్చాపూరిత భావ వ్యాక్తీకరణ, సుఖనిద్ర,సున్నితత్వం వంటి వాటిని సాధించవచ్చు. లేత నీలం ఎక్కువగా వడం వల్ల పెద్దగా దుష్పరిణామాలు ఏమిలేక పోవడం విశేషం. 7)నెమలి కంఠం రంగు.. ఈరంగు మననరాల వ్యవస్థ విశ్రాంతి పొందేందుకు సాయాపడుతుంది. పైగా మన శరీరం అచేతన వ్యక్తిత్వం తో అనుసంధాన మయ్యే రంగుగా నిపుణులు విశ్లేషించారు.ప్రశాంతత సృజన అవగాహనకు సంకేతమని సహజంగా వారిలో జ్ఞానం చైతన్యం, స్పష్టమైన దృక్పదం గాఢ నిద్ర వంటి ఫలితాలు కలుగుతాయని రంగును వినియోగిస్తే ఒత్తిడి ఇతరులనుండి వేరు పడే భావన కలుగుతాయట. 8) వైలెట్ .. వైలెట్ మన ఆధ్యాత్మిక వ్యక్తిత్వానికి అనుసంధాన మై ఉంటుంది. ఈ రంగు వాడడం వల్ల ఉదారత,నిస్వార్ధ తత్వం, గాఢ నిద్ర నరాలను నేమ్మదింప చేయడం భావోద్వేగాల నియంత్రణ చిరాకు అతిగా ఆకలి వేయడం వంటి ఫలితాలు ఉంటాయని నిపుణులు పేర్కొన్నారు. ఈరంగును అతిగా వాడారో డిప్రెషన్ అభద్రతా భావం, ఆగ్రహం వంటి ఉద్వేగాలు అణచివేయడం వంటివి సాధ్యమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. 9)మేజెంటా రంగు.. వ్యక్తిలో ఉండే భక్తి ప్రేమకు అనుసంధానంఅవుతుందని అంటున్నారు. మేజెంటా విశ్రాంత స్థితి, ఓదార్పు, సున్నితత్వం, వంటి భావాలకు సంధాన మై ఉంటుంది. ఈ రంగును వాడడం వల్ల అంతర్గత  బహిర్గత ఉద్వేగాలు సమతౌల్యం అవుతాయి. శాంతి లభిస్తుంది. అయితే ఈ రంగును అతిగా వాడడం వల్ల నలుగురితో కలవ లేని వారికి మంచిది కాదు.             

ఉషాపానం ఆరోగ్యానికి మేలు!

  ఉషాపానం ఇదేమిటి ఇదేదో సురాపానమా  అని మాత్రం అనుకోకండి.అందరికీ అర్ధమయ్యే రీతిలో చెప్పాలంటే ఉదయం పూట నిద్రలేవగానే పళ్ళు తోముకోకుండా నీటిని తాగితే ఏమౌతుంది? లాభమా నష్టమా? ఈ ప్రశ్నలకు సమాధానం ఈవ్యాసం.ఉదయం వేళలో నిద్ర లేవగానే ముఖం కూడా కడుక్కోకుండా నీళ్ళు తాగడం మన పూర్వీకులకు అలవాటు. ఇది చాలా సహజమే ఇక్కడ ఆశ్చర్యాన్ని కలిగించే అంశం ఏమిటి అంటే నిద్రలేవగానే ముఖం కడుక్కోకుండా మొట్టమొదట నీటిని తాగడం వల్ల మందులతో తగ్గని రోగాలు కూడా తగ్గుతాయని ప్రముఖనాడీ పతి వైద్యులు డాక్టర్ పి కృష్ణం రాజు తెలిపారు. తెలుగు వన్ హెల్త్ తో మాట్లాడుతూ నిద్ర లేవగానే నీరు తాగడం వల్ల నోటిలో లాలా జలము అంతా కడుపులో చేరి శరీరానికి ఎంతో మేలుచేస్తుంది అని ఎన్నోరోగాలు తగ్గుతయాని  అంటారు కృష్ణం రాజు. మనము ప్రతిరోజూ లాలాజలము బయటకు ఉమ్మివేస్తాము లాలాజలము బయటికి ఉమ్మివేస్తాము మీకు తెలుసా మీ లాలా జలము చాలా విలువైనది అద్భుతమైనది అని తెలియక దీనిని వృధా చేస్తున్నాము. ఇకపై దీనిని వృధా చేయకండి.మీరు ఉపయోగించుకోవాలని డాక్టర్ కృష్ణం రాజు తెలిపారు.నిద్రలేవగానే పళ్ళు తోముకోకుండా నీళ్ళు తాగి తాగడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది.పూర్వకాలం లో ఉదయం పూట నిద్రలేవగానే పళ్ళు తోముకోకుండా రాగి చెంబులో నీళ్ళు తాగడం ఆనవాయితీగా వచ్చేది.ఆతరువాతే వేపపుల్ల,లేదా గానుగ పుల్లలతో పళ్ళు తోముకునే వారని పెద్దలు చెప్పుకునే వారు.ఇదేమిటి నీరు తగిన తరువాత పళ్ళుతోముకోవడమా బ్యాడ్ ప్రాక్టిస్ మాత్రం కాదని పెద్దలకు తెలుసు.ఉదయం పరగడుపున అంటే నిద్రలేవగానే మొహం కూడా కడుక్కోకుండా మొట్టమొదటగా నీరు త్రాగాలి.పుక్కిలించకుండానీరు తాగాలనిఅంటారు అసలు దేని వెనక ఉన్నకారణం ఏమిటో తెలుసుకుందాం. మనము రాత్రి  తిని పడుకున్నప్పుడు మనశరీరం లోని క్రిములన్నీ శిధిల మై పోతాయి. కానీ లాలా జలం క్రియ కొనసాగుతూ ఉంటుంది. అది నోటిలో రక రకాలుగా వుంటుంది. కడుపులోకి వెళ్ళదు. అది చాలా విలువైనది అదీ బ్రహ్మ ముహూర్తం లో లాలా జలము ఆసమయంలో ఎన్నో రెట్లు విలువైనదిగా పేర్కొన్నారు.లేచిన వెంటనే నీరు త్రాగడం వల్ల అందులో లాలాజలము అంతా కడుపులో చేరి శరీరానికి ఎంతో మేలుచేస్తుంది.దీనికారణంగా షుగర్ కంట్రోల్ కు వస్తుంది.ముఖ్య్సంగా కడుపులో పుండ్లు,కురుపులు చాలా కాలానికి కానీ మందులతో తగ్గవు.వీరు ఇలా చేస్తే అద్భుత మైన ఫలితాలు చూడవచ్చని డాక్టర్ కృష్ణం రాజు పేర్కొన్నారు.ఇంతే కాకుండా ఉదయం లేవగానే మన నాలుక మీద ఉన్న ఉమ్మిని తీసుకుని కంటిలో పెట్టుకుంటే. కంటి సమస్యలు పోతాయాని అలాగే చర్మం.ముఖం అలాచేయడం వల్ల అద్భుతమైన మార్పులు గమనించవచ్చని అన్నారు ఇందుకు ఉదాహరణగా జంతువుల నుండి మనం గ్రహించాల్సిన విషయం అదే. ఏదైనా దెబ్బ తగిలినప్పుడు ఆ ప్రదేశం లో అక్కడ నాలుకతో నాకడం మొదలుపెడతాయి. లాలా జాలం లో 18 రకాల పోషకాలు ఉన్నాయని అంటారు.కృష్ణం రాజు. అందుకే మన లాలాజలము విలువైనదే అని అంటారు.ఈ పద్దతిని ఉపయోగించడం ద్వారా ఇదే ఉదయం వేళలో ఉషాపానం లో ఉండే ఆరోగ్య రహాస్యం అని అంటున్నారు డాక్టర్ కృష్ణం రాజు.మీ ఆరోగ్యం మీచేతుల్లోనే ఉందన్న విషయం గ్రహించండి. ఆరోగ్యంగా ఉండండి.   

దీర్ఘకాలంగా మిమ్మల్ని వాపు వేధిస్తోందా!?

మిమ్మల్ని నెమ్మదిగా ప్రాణాలు హరిస్తుంది.మీరు దీర్ఘకాలంగా ఇంఫ్లామేషణ్ అంటే వాపు తో బాధ పడుతూ ఉన్నారా మిమ్మల్ని మీ ప్రాణాలే నెమ్మదిగా తీసుకుపోతుంది అని హెచ్చరిస్తున్నారు నిపుణులు. అయితే నిపుణులు నిర్వహించిన అధ్యయనం లో వాపు వైద్య పరిభాషలో చెప్పే ఇంఫ్లామేషణ్ వ్యాధి కాదని నిర్ధారించారు. వాపు ఇంఫ్లామేషణ్ లక్షణాలు ఉండి వేదిస్తూ ఉంటుందని అది ఒక అనారోగ్య స్థితిగా పేర్కొన్నారు. బహుశా మీకు చెడు కొలస్ట్రాల్ గురించి విని ఉండవచ్చు.మీ గుండెలో రక్త ప్రవాహం సరిగా లేనందువల్ల వాపు ఇంఫ్లామేషణ్ ఉండవచ్చు.మీకు ప్రతిరోజూ పొగతాగే అలవాటు ఉన్న వారు జీవన శైలి వల్ల క్యాన్సర్ వల్ల వచ్చే ఇంఫ్లామేషణ్ శరీరంలో లివర్ లో కొవ్వు పేరుకు పోయి లివర్ లో వాపు ఉండడం గమనించవచ్చు మీరు తరచుగా మీరు ఇంఫ్లామేషణ్ అన్న పదం వినిఉండ వచ్చు లేదా అసలు విని ఉండక పోవచ్చు.దీనికి కారణం ఎన్నో అనారోగ్య సమస్యలు కారణం అయ్యిఉండవచ్చు.అని నిపుణులు అంటున్నారు.హార్వర్ల్ద్ మెడికల్ జర్నల్ లో దీర్గ్గ కాలిక తాకువ స్థాయి వాపు లేదా ఇంఫ్లామేషణ్ ఉంటె అది మిమ్మల్ని నిశ్సబ్దంగా మిమ్మని మీ ప్రాణాలే హరిస్తుంది.అని నిపుణులు గుర్తించారు. ఇంఫ్లామేషణ్ లేదా గుండె సంబంధిత సమస్యలు క్యాన్సర్, టైపు2  డయాబెటిస్, ఇతర అనారోగ్య సమస్యలు ఉంటాయని అజర్నల్ లో ప్రచురించారు.ప్రపంచ వ్యాప్తంగా ప్రతి 5 మందిలో ౩ ముగ్గురికి ఇంఫ్లామేషణ్ వాపు వాపు బారిన పడుతున్నారని ఇది అత్యంత ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు . ఇంఫ్లామేషణ్ లో రకాలు... ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో వాస్తవం చెప్పాలంటే ఇంఫ్లామేషణ్ ను రెండు భాగాలుగా విభజించారు. దీర్ఘ కాలిక లేదా తీవ్రమైన ఫ్లామేషణ్ కారణంగా కణాలు నాశనం అవుతాయి.దీనికి కరానం అనుకోకుండా గాయాలు కావడం. కొద్ది కాలం లోనే అది తీవ్రమైన ఇంఫ్లామేషణ్ గా మారవచ్చు.ఇంఫ్లామేషణ్ కొన్ని సార్లు వస్తూ ఉంటుంది.  దీర్ఘ కాలంగా వచ్చే వాపులు ఇంఫ్లామేషణ్ చాలా ఖతినంగా ఉంటుంది.మనం ఇంఫ్లామేషణ్ ను గుర్తిన్చేలోపే తీవ్రంగా మారే అవకాశం ఉంటుందని నిపుణులు పేర్కొన్నారు. దీర్ఘ కాల ఇంఫ్లామేషణ్ వల్ల ఏమౌతుంది... ముఖ్యంగా ఆటో ఇమ్యూన్ దీజార్దర్ తో బాధ పడే ప్రతి వ్యక్తిలో ఉన్న వ్యాధినిరోధక శక్తి ఆరోగ్యంగా ఉన్న కణాలను వ్యతిరేకంగా పనిచేసినప్పుడు. లేదా ఇతర రాసాయ నాలు టాక్సిన్స్ కు లోనై నప్పుడు ఉదాహరణకు వాతావరణ కాలుష్యం, పారిశ్రామిక వ్యార్ధాలు కాలుష్యం కారణం కవ్వచ్చని నిపుణులు అంచానా వేస్తున్నారు. కాగా ఒక్కోసారి దీర్ఘ కాలిక ఇంఫ్లామేషణ్ లేదా వాపుకు దారితీస్తుంది.కొన్ని పరిశోధనలలో తీవ్రాత్తిది పొగత్రాగడం లేదా మాద్యం తాగడం వల్ల ఇంఫ్లామేషణ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి . దీర్ఘ కాలిక ఇంఫ్లామేషణ్ లక్షణాలు... కొన్నిరకాల లక్షణాలు ఉంటె దీర్ఘకాలిక ఇంఫ్లామేషణ్ వస్తుంది. మీరు ఏదయినా లక్షణాలు ఉన్నట్లు గుర్తిస్తే ఈ స్థితికి చేరితే ఇంఫ్లామేషణ్ ఉన్నట్లయితే కొన్ని లక్షణాలు ఉండచ్చు ఉండక పోవచ్చు. *దీర్ఘకాలంగా అసహజమైన భరించలేని నొప్పి  *దీర్ఘకాలంగాఊపిరి తిత్తులలో నొప్పి చెస్ట్ పెయిన్ . *దీర్ఘకాలంగా త్వరగా అలిసి పోవడం . *పలుమార్లు జ్వరం రావాడం. *దీర్ఘకాలంగా చర్మం పై దద్దుర్లు ఇతర లక్షణాలు గుర్తించిన వెంటనే మీరు ఇంఫ్లామేషణ్ బారిన పడ్డాట్లు సంకేతం . దీర్ఘకాలిక ఇంఫ్లామేషణ్ ప్రాణాంతకం కవచ్చు... జోన్ వాప్కిన్స్ మెడిసిన్ జర్నల్ లో ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా పరిశోధకులు గుర్తించిన పలు అంశాలు ఏమిటి అంటే తీవ్రస్తాయి లో ఉన్న ఇంఫ్లామేషణ్ ను మీరు గుర్తించి నట్లయితే గుండె పోటు వచ్చే అవకాశం ఉందని దీనికి క్లినికల్ స్టడీస్ నిర్వహించిన డాక్టర్ కంబాస్ ఇంఫ్లామేషణ్ వల్ల కొలస్ట్రాల్ శాతం స్థాయి లో మార్పు లేకుండా వాపు  ప్రభావం ఎక్కువగా ఉంటుంది.అయితే ఇంఫ్లా మెటరీ సమస్యకు యాంటి ఇంఫ్లా మేటరీ చికిత్చ కు మందులు వాడవచ్చని వాస్తవానికి ఇంఫ్లామేట రీ వచ్చిందంటే గుండెకు చికిత్చ చేయడం అవసరం నిపుణులు విశ్లేషించారు.ఒక్క విష్యం మాత్రం వాస్తవం ఇంఫ్లామేషన్ కు మార్గం ఉందని నిపుణులు పేర్కొన్నారు.ఒకసారి దీర్ఘ కాలిక ఇంఫ్లామేసన్ ను గుర్తిస్తే వాపును గుర్తిస్తే ఇంఫ్లామేట రీ హెర్బ్స్ కొన్నిరకాల మూలికలు స్తేరాయిడ్ లేని యాంటీ ఇంఫ్లామేటర్ మందులు కొన్ని కేసులలో స్తేరాయిడ్ ఇంజక్షన్ ఒక్కక్ విషయం మాత్రం నిజం ఇంఫ్లామేషన్ వాపులకు తప్పనిసరిగా చికిత్చ చేయాలి .

వైరస్ ఇన్ఫెక్షన్ వస్తే కిడ్నీ పాడైపోతుందా?

వైరస్ ఇన్ఫెక్షన్ వస్తే కిడ్నీలు  డ్యామేజ్ అయిపోతాయని కిడ్నీ వ్యాధి సోకి వైరస్ ఇన్ఫెక్షన్ నుండి రక్షించుకునే పద్దతులు ఏవో తెలుసుకుందాం. వైరస్ ఇన్ఫెక్షన్ ను ఎలానివారించాలి... వైరస్ సోకకుండా నిలువరించేందుకు కొన్ని చిట్కాలు సూచించారు.కొన్ని సందర్భాలలో వైరస్ వల్లే కిడ్నీ వ్యాధులకు కారణం కావచ్చు. ముఖ్య అంశాలు... వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల కిడ్నీ సమస్యలు వ్యాధుల వల్ల ప్రమాదం పొంచిఉంది అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చాలా ఇన్ఫెక్షన్లు ఎలా ఉంటాయంటే  అవికిడ్నీని పూర్తిగా నాశనం చేస్తాయి. వైరస్ సోకకుండా నిలువరించేందుకు కొన్ని చిట్కాలు మీకోసం ----- వైరల్ ఇన్ఫెక్షన్లు కిడ్నీ వ్యాధులు... భారత దేశం లో ఏర్పడే వైరస్ వ్యాప్తి ఇన్ఫెక్షన్లు టైఫాయిడ్,గ్యాస్ట్రో ఎంట్ట్రైటేస్ ,హెపటైటిస్ ఏ,ఇ లాంటివి ఆహారం నీరు కలుషితం కావడం వల్లే మలేరియా, లె ప్టో స్టేయిరో సిస్,డెంగు,వంటివి ఉన్నాయి. ఇవన్ని మాన్సూన్ కాలం అంటే వర్షాకాలం లో ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి.వయస్సు మళ్ళిన వాళ్ళు ,లేదా ముందునుండే అనేకరకాల అనారోగ్య సమస్యలు కిడ్నీ సమస్య ఒకటి కావచ్చు. కిడ్నీ సమస్య మరింత తీవ్ర సమస్య ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది అని నిపుణులు పేర్కొన్నారు. చలారకాల ఇన్ఫెక్షన్లు ఎలా ఉంటాయంటే కిడ్నీ ని నాశనం చేస్తాయి.కిడ్నీ లో వచ్చిన వ్యాది కారణంగానే కిడ్నీ డ్యామేజ్ కు కారణంగా నిపుణులు తేల్చారు. ఇక్కడ వైరస్ సోకకుండా ఉండేందుకు కొన్ని చిట్కాలు అందిస్తున్నారు కిడ్నీ సమస్య తీవ్రతరం అయ్యే అవకాసం నుండి కాపాడుకోవచ్చు. వైరల్ ఇన్ఫెక్షన్ ను నివారించడం ఎలా?-- 1)కలుషిత ఆహారం నీళ్ళు... వర్షాకాలం లో వాతావరణం చల్లగా ఉండడం ఒక కారణం గా రోడ్లపై నీరు నిలిచిఉండడం.డ్రైనేజి వ్యవస్థ పనిచేయక పోవడం. నీరు కలుషితం అయ్యే అవకాశాలు ఉన్నాయి.భోజనం నీటి కాలుష్యం వల్ల వచ్చే రోగాల వల్ల ప్రామాదం పెరుగుతుంది.అందుకే చేతిని పరిశుభ్రం చేసుకోవడం అవసరం అనినిపుణులు సూచిస్తున్నారు. 2)పండ్లు --- పండ్లలో వాపును తగ్గించే గుణం ఉండడం కొంత లాభం ఉంది. వర్షాకాలం లో వాతావరణం లో వచ్చే మార్పులు సందర్భంగా ముందుగా కోసిన పండ్లను తినడం మానివేయండి. అలాంటి పండ్లు కోసిన పండ్లకు దూరంగా ఉండండి. ముఖ్యంగా పండ్లను నీటిలో శుభ్రంగా కడిగి పండ్లపై ఉన్నతోక్కను తీసి వేసి పండును తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ౩)డయాబెటిస్ రోగులు అప్రమత్తంగా ఉండాలి.ఎలాంటి వైరస్ ఐనా సోకేందుకు అవకాసం ఉంది. డయాబెటిస్ కిడ్నీ రోగాలు పెరగకుండా ఉండేందుకు షుగర్ బ్లడ్ షుగర్ ను నివారించడం అవసరం. 4)శరీర వ్యాయామం... వర్షాకాలం వాతావరణం లో బయటి కార్యకలాపాలు అసంభవం లేదా సురక్షితం కాదని నడవడం, పరుగెత్తడం, ఈదటం, సైకిల్ నడపడం వంటి వి చేయడం చాలా మందికి అవకాశాలు ఉండవు. ఇంటి వద్దే వ్యాయామం లేదా యోగా,శరీరాన్ని ఫ్లెక్సిబుల్ గా బలంగా ఉండేందుకు శరీర వ్యాయామం దోహదం చేస్తుంది.వైరస్ నుండి వచ్చే పలురకాల సమస్యలకు పైన పేర్కొన్న అంశాలు అమలు చేయడం ద్వారా వైరస్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్లు వాటివల్ల వచ్చే కిడ్నీ సమస్యల నుండి కొంతమేర రక్షించుకోవచ్చని దీర్ఘకాలం పాటు అనారోగ్యం పాలు కాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు.     

పరుగు మంచిది....

మీరు1౦ నిమిషాలు పరుగు తీస్తే చాలు  బ్రెయిన్ ఫంక్షన్ వృద్ది  చెందుతుంది... జపాన్ లో నిర్వహించిన  ఒక పరిశోదనలో  ఒక పదినిమిషాల పాటు  పరుగు పెడితే మన బ్రెయిన్ మరింత చురుకుగా పనిచేస్తుంది. పరిశోధకులు నిర్వహించిన షార్ట్ రన్నింగ్ సెక్షన్స్ లో  మెదడు పనితీరులో నిర్వహణా పనితీరు మెరుగుపడుతుంది. ముఖ్యంగా ముఖ్యంగా శ్రద్ధ ఏకాగ్రత ప్లానింగ్ నిర్వహణ హృదయ స్పందన  హార్ట్ బీట్ పెరుగుతుంది. మనం పరుగుపెట్టడం ద్వారా రక్త ప్రవాహం బెటర్ మూడ్ వ్యాయామం కన్నా పరుగుపెట్టడం ద్వారా ఆరోగ్య లాభాలు ఉన్నాయని  అంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఖర్చులేని లేనిదీ  అందరికీ అందుబాటులో  ఉన్నది కేవలం పరుగే అన్నది వాస్తవం. మనం పరుగుతీయడం ద్వారా కార్డియో  వ్యాస్క్యులర్ హెల్త్, వృద్ధి చెందడమే కాక కండరాలు శక్తివంతమౌతాయి.అలాగే ఎముకలు గట్టిపడతాయి. అదే పరుగు పెట్టడం ద్వారా మానసిక ఆరోగ్యం అభివృధికి  దోహదం చేస్తుంది. జపాన్ కు చెందిన కొంతమంది  టి సుబుబా  విశ్వ విద్యాలయానికి చెందిన శాస్త్రజ్ఞులు 1౦ నిమిషాల పాటు పరుగులు తీస్తే మీ మూడ్ పనితీరు పద్దతులు మెరుగు  పడతాయి.  పరుగు పెట్టిన తరువాత శరీరంలో రక్త ప్రవాహం స్థాయి పెరిగిందని పరుగుపెట్టక ముందు పరుగు పెట్టిన తరువాత ఆ మార్పు స్పష్టంగా కనిపిస్తుంది ప్రి ప్రోంట్ర ల్  కార్టెక్స్ అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది. ఈ అంశాన్ని గురించి  జనరల్ సైన్స్ లో ప్రచురించారు.   పరుగు ప్రభావం మెదడుపై  ఎలా పనిచేస్తుంది... మీ మెదడులో ఉండే సెన్సార్ ల ద్వారా సమాచారం సమాచారం అందించడం తో పాటు శరీరం సమతౌల్యం లో ఉంచుతుంది. పరుగుపెడుతున్నప్పుడు ప్రి ఫ్రంట్రల్  కార్టెక్స్ యాక్టివేట్ అవుతుంది.పరుగు పెట్టడం ద్వారా రక్త ప్రసారం మెరుగు పడుతుంది. అది మెదడు పనితీరు మేరుగుపడానికి దోహదం చేస్తుంది. మనం పరుగుపెడుతున్నప్పుడు మన తలను కిందికి పైకి ఆడిస్తూ ఉంటాం. అది జంతువుల లోను  జరుగుతుంది దీనివల్ల  సిరో టోనిక్  వ్రుదిచేందే అవకాశం ఉంది.  పరుగు విరామానికి వ్యత్యాసం ... ఒక నూతన పరిశోదనలో పరిశోధకులు మెదడు కార్య నిర్వహణ పనితీరు మూడ్ బాగుంటుంది. 1౦ నిమిషాలు  పరుగు తరువాత త్రేడ్ మిల్ తో పోల్చినప్పుడు బ్రెయిన్ పనితీరు మూడ్ తరువాత విశ్రాంతి తీసుకోవాల్సి వస్తుంది. స్టూప్ టాస్క్ ద్వారా కార్యనిర్వహణ సామర్ధ్యాన్ని పరిశీలించారు. అక్షరాలూ ఎర్రగాను నీలిరంగులో కనిపిస్త్సాయి. రక్త ప్రావాహం లో మార్పులు స్పెక్ట్రో స్కోపి నోనిన్విజివ్ ఇమే జింగ్ గా తీసుకుంటారు.  మెదడు ఎప్పుడై తే యాక్టి వేట్ అయ్యిందో ఆ ప్రాంతంలో రక్తం త్వరగా మారుతుంది దైమెంక్షనల్  మూడ్ స్కేల్ ద్వారా దీనిని కొలుస్తారు. పరుమంచిదే అని నిపుణులు సూచిస్తున్నారు.    

గోల్ఫ్ ఆడితే జీవితకాలం పెరుగుతుంది

గోల్ప్‌ ఈ మధ్య పుట్టిన ఆట కాదు. రోమన్ల కాలం నుంచి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఆట. అయితే ఇది ఏనాడూ ప్రజాదరణ పొందలేకపోయింది. ఆట ఆడేందుకు విశాలమైన మైదానాలు, ఖరీదైన పరికరాలూ కావల్సి రావడంతో ఇది కేవలం ధనవంతుల ఆటగా నిలిచిపోయింది. కానీ పరిస్థితులు నిదానంగా మారుతున్నాయి. జీవన ప్రమాణాలు మెరుగుపడటంతో గోల్ఫ్ ఇప్పుడు చాలామందికి అందుబాటులోకి వచ్చింది. ఇన్నాళ్లుగా ఫలానా వ్యాయామం చేస్తే ఈ ఫలితం, ఫలానా ఆట ఆడితే ఆ ఫలితం అని వింటూ వస్తున్నాము. మరి గోల్ఫ్ ఆడటం వల్ల ఉపయోగం ఏమిటా అన్న సందేహం శాస్త్రవేత్తలకి వచ్చింది. దాని ఫలితమే ఈ నివేదిక-     గోల్ఫ్ అండ్‌ హెల్త్‌ ప్రాజెక్ట్‌ World Golf Foundation అనే సంస్థ గోల్ఫ్‌ ఆటకీ ఆరోగ్యానికి మధ్య సంబంధాన్ని గమనించేందుకు ఈ గోల్ఫ్‌ అండ్‌ హెల్త్‌ ప్రాజెక్టుని ఆరంభించింది. ఇందులో భాగంగా బ్రిటన్‌లోని ఎడిన్‌బరో విశ్వవిద్యాలయానికి చెందిన కొందరు శాస్త్రవేత్తలు... గోల్ఫ్‌ మీద ఇప్పటివరకూ జరిగిన ఐదేవేల పరిశోధనలను సమీక్షించారు. గోల్ఫ్‌ ఆడే సమయంలో వారిలో ఎన్ని కేలొరిలు ఖర్చవుతున్నాయి, వారు సగటున ఎంత దూరం నడవాల్సి వస్తోంది, వారి ఆరోగ్యం మీద ఆట ప్రభావం ఏమిటి... తదితర విషయాలను పరిశీలించారు.     జీవతకాలమే మెరుగుపడింది. పరిశోధకుల సమీక్షలో ఆసక్తికరమైన విషయాలు ఎన్నో బయటపడ్డాయి. గుండెపోటు, పక్షవాతం, డయాబెటీస్‌, పేగు క్యాన్సర్ వంటి 40 రకాల తీవ్రమైన రోగాలను గోల్ఫ్‌ నివారించగలుగుతోందని తేలింది. ఒక పరిశోధనలో అయితే గోల్ఫ్‌ అడేవారి జీవితకాలం ఏకంగా ఐదేళ్లపాటు మెరుగుపడినట్లు బయటపడింది. ఇంతేకాదు! వయసుతో పాటు వచ్చే నరాల బలహీనత, ఊపిరితిత్తుల సమస్యలు, గుండె సంబంధ వ్యాధులు... గోల్ఫ్‌ ఆటలో మాయమవుతున్నాయట. గోల్ఫ్‌ ఆటతో శరీరమే కాదు మనసు కూడా ఆరోగ్యంగా ఉన్నట్లు తేలింది. ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం మెరుగుపడటంతో పాటుగా... ఆందోళన, మతిమరపు, క్రుంగుబాటు వంటి వ్యాధుల నుంచి దూరం కావడం జరిగిందట.     కారణం! గోల్ఫ్ ఆటలో ఆటగాళ్లు కిలోమీటర్ల కొద్దీ దూరం నడవాలి. వారి బలమంతా ఉపయోగించి బంతిని కొట్టాల్సి ఉంటుంది. విశాలమైన పచ్చిక బయళ్లలో గుట్టలని దాటుతూ, మైదానాలలో నడుస్తూ ఈ ఆటని ఆడాల్సి ఉంటుంది. ఇందు కోసం వారు దాదాపు 6 నుంచి 13 కిలోమీటర్ల వరకూ నడుస్తారనీ, 500కి పైగా కేలొరీలను ఖర్చు చేస్తారని తేలింది. పైగా గోల్ఫ్‌ ఆటని వయసుతో సంబంధం లేకుండా ఏ వయసువారైనా ఆడవచ్చు. తమ ఓపికను బట్టి ఆటలో మార్పులు చేసుకోవచ్చు. ఈ కారణాలన్నింటి వలనా గోల్ఫ్‌ గొప్ప ఆరోగ్యాన్ని అందించే ఆటగా మారిపోయిందని పరిశోధకులు సంతోషపడిపోతున్నారు. ఇప్పటికే ప్రపంచంలో ఐదుకోట్ల మందికి పైగా ఈ ఆటని ఆడుతున్నారనీ, భవిష్యత్తులో మరింత మంది ఈ ఆట పట్ల ఆసక్తి చూపుతారనీ భావిస్తున్నారు. - నిర్జర.

వయసు పరంగా చర్మంలో మార్పులు వస్తాయా??

మీలో వయస్సు వస్తున్న కొద్దీ మీ శరీరం లో ని చర్మం లో మార్పులు వస్తూ ఉంటాయి.  అలాంటి సమస్యలకు ఎలాంటి చికిత్సలు ఉన్నాయి? అన్న విషయం తెలుసుకుందాం. ఆక్నిక్  కెరటో సిస్ అనేది క్యాన్సర్ కు ముందు చర్మం పై వచ్చే పెరుగుదల. ముఖ్యంగా ఎండకు ఎక్కువగా ఉండడం వల్ల పెరుగుతుందని అందుకే   శాస్త్రీయంగా సోలార్  కేరటో సిస్ గా నామకరణం చేసారు.  దీనిలక్షణం  ఎలా ఉంటుంది. ఎర్రటి మచ్చలు,చారలు  చర్మం పై కొవ్వు పెరిగినట్లు లేదా ఎరుపు, గులాబి రంగులో ఉంటుంది.  ఈలక్షణా లు కలిగి ఉండి వృద్ధి ఎక్కడ వచ్చినా దీనికి కారణం అల్ట్రా వైలెట్ కిరణాలే అది వ్యక్తులు  చేసింది కాదు. చాలా సహజంగా స్కాల్ప్ పై చెవులు,మెడ, ముఖం పై పెదాలు,భుజాలు, లేదా  ముంజేతులు చేయి వెనుక భాగం లో శరీరంలోని ఇతర భాగాలలో ఎక్నిక్ కెర టోసిస్ వస్తుంది. దీనిని వైద్యపరిభాషలో కార్సినోమా గా మారే అవకాశం ఉంది అని నిపుణులు అంటున్నారు.  ఇది ఒకరకమైన చర్మ క్యాన్సర్ ప్రత్యేకంగా పెరుగుదల ఉంటె మీ సమీపం లోని  డెర్మ టాల జిస్ట్ ను సంప్రదించండి. అయాకాలాలలో వచ్చే సమస్యను బట్టి వివిదరకాల  క్రీములు లేదా శస్త్ర చికిత్స ద్వారా అంటే సర్జరీ పద్దతుల ద్వారా వాటిని తొలగించే లేదా నిలుపుదల చేయడం. లేదా ఫ్రీజ్ చేయడం కాల్చడం చేస్తారు. సేబార్ర్హెఇక్ కేరటో సిస్ శరీరం పై ఉన్న చర్మం పై ఆయా వయస్సులను బట్టి సేబార్ రేహేఇక్ కేరోటో సిస్ పెరుగుతుంది. దీనిరంగు చార, లేదా ఉదా రంగులో బ్రౌన్ రంగులో నల్లగా గుండె పై, తల పైన,వెనుక భాగం లో ముఖ్యంగా గుండెపై వచ్చిన  సేబార్ ర్హేఇక్  కేరటో సిస్ మైనం లాగా ఉంటుంది. ఇది చాలా సహాజంగా వస్తుంది. 5౦ సంవత్సరాలు పై బడిన వారిలో కుటుంబాల లో వస్తుంది.ఇవి పెరిగినట్లయితే మరిన్ని పెరిగే అవకాశం ఉంది. అయితే అవి ప్రమాదకరం కాదు. అలా కనిపించక పోవచ్చు.ఇలాంటి చర్మ సంబందిత సమస్యలకు  డ ర్మటా లజిస్ట్ సంప్రదించడం ద్వారా వాటిని తొలగిస్తారు. అయితే శరీరం పై వచ్చిన పెరుగుదల సేబోర్ ర్హేఇక్ కేరోటో సిస్ కదా ? దాని తీవ్రత ప్రభావం ప్రమాదకరమా? లేదా చర్మ క్యాన్సరా? అన్న విష యం తెలుసుకోవాలంటే నిర్ధారణ కావాలంటే బయప్సి చేయాల్సి వస్తుంది. మీరు బట్టలు వేసుకునే  టప్పుడు చర్మానికి రాసుకుని ఇబ్బంది పెడుతుంది. మీ సమీపం లో ఉన్న డే ర్మటా లజిస్ట్ వాటిని సర్జరీ ద్వారా తొలగిస్తారు. లేదా ఫ్రీజ్ చేస్తారు.లేదా లేజర్ చికిత్స చేస్తారు.  సోలార్ఎలాస్తో సిస్.... సోలార్ఎలాస్తోసిస్ దీర్ఘ  కాలం పాటు సూర్యరస్మి లో ఉన్నట్లయితే శారీరకంగా మార్పులు వస్తాయి. అంటే మీ చర్మం సాగిపోతుంది. దీనినే సోలార్ ఎలాస్తో సిస్ అంటారు. దీనికారణంగా ముఖంపై ముడతలు,కొన్నిరకాల చర్మం సాగిపోతుంది దీనినే   సోలార్ ఎలాస్తోలసిస్ అంటారు. దీనికారణం గా ముఖంపై ముడతలు కొన్నిరకాల గుంతలు ఏర్పడడం చూడవచ్చు. బంప్స్ వస్తాయి. శరీరం ముఖం ఎగుడు దిగుళ్ళు, గా తయారు అవుతాయి. చర్మం పసుపు రంగు వర్ణం లోకి మారుతుంది. ఎవరికైనా సోలార్ఎలాక్త్రోలసిస్ రావచ్చు. ఎవరైతే చాలా ఫెయిర్ గా అందమైన చర్మం ఫెయిర్ గా ఉండే అందమైన చర్మం పై వస్తే కాస్త ఇబ్బందిగా ఉంటుంది.  పొగ తాగడం వల్ల చర్మం పాడై పోతుంది.చర్మం సోలార్ ఎలాస్త్రోలసిస్ కు దారి తీయవచ్చు. దీర్ఘ కాలంపాటు  సూర్య రస్మిలో ఉన్నట్లైతే చర్మం పై భయం కరమైన మార్పులు వస్తాయి. దీనికి చర్మ సంరక్షణ కు యంటి ఏ జింగ్  సహజంగా వాడతారు. బయటికి వెళ్ళినప్పుడు సన్ స్క్రీన్ లోషన్ వాడాల్సి రావచ్చు. ఆరకంగా మీ చర్మ సంరక్షణకు  చూసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చు.సోలార్ ఎలాస్త్రో సిస్ చికిత్సకు మీ దగ్గరలోని డ ర్మటా లజిస్ట్  చికిత్స చేస్తారు.లేజర్ తెరఫీ, ఫిల్లర్స్ బోటో క్స్  ఇంజక్షన్ లేదా ఇతర పద్దతులు. అవలంబిస్తారు.  వేరికోస్ వేయిన్స్.... వేరికోస్ వేయిన్స్ అంటే మీ రక్తనాళాలు వ్యకోచిస్తాయి,లేదా అవి మెలితిరిగి ఉండడం గమనించవచ్చు. దీనివల్ల రక్త  నాళాలలో రక్త ప్రసారం సరిగా జరగక  తీవ్ర ఒత్తిడికి గురిఅయి  కాళ్ళలో తీవ్రమైన నొప్పులు వస్తాయి. రక్త నాళాలు చర్మం బయటికి చొచ్చుకు వస్తాయి. హై బిపి వల్లే వేరికోస్ వేయిన్స్ వస్తాయి. కాళ్ళలో పిక్కలు, చీల మండల లో వేరికోస్ వేయిన్స్ బరువు పెరుగుతారు. స్త్రీలలో స్త్రీలలో ముఖ్యంగా  గర్భిణీ  గా ఉన్నవారు., వృద్ధులలో శరీరంలో శరీర వ్యాయామం లేనప్పుడు. దూమ పానం, లేదా కాళ్ళకు గాయం అయినప్పుడు. లేదా హార్మోన్ మార్పిడి జరిగినప్పుడు. లేదా నోటి ద్వారా ముఖ్యంగా గర్భానిరోడక మాత్రలు  వాడినప్పుడు వేరికోస్ వేయిన్స్ వస్తాయి. వేరికోస్ వేయిన్స్ వల్ల కాళ్ళలో తీవ్రమైన నొప్పి చర్మం రంగు మారిపోతుంది. చర్మం పై దద్దుర్లు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. మీ కాళ్ళ నుండి గుండె వరకు 3 నుండి నాలుగు సార్లు ప్రతిరోజూ ఒత్తిడిని పుట్టించే సాక్స్ వేసుకోమని సూచిస్తారు. మీరు సాక్స్ వేసుకున్నప్పటికీ సమాస్య తీవ్రంగా ఉంటె ఇబ్బందిపెట్టే వేయిన్స్ కు ఇంజక్షన్  చేస్తారు. వేరికోస్ వేయిన్స్ చికిత్స కు స్క్లీరో తెరఫి, ధర్మల్ ఎబ్రేషన్ సర్జరీ చేస్తారు. స్పైడ ర్  వేయిన్స్... స్పైడ ర్  వేయిన్స్ వేరికోస్ వేయిన్స్ లో భాగమే. అయితే ఇది అత్యంత ప్రమాదకరం కాదని తెలుస్తోంది.స్పైడర్  వేయిన్స్  తరచుగా కాళ్ళలో వస్తుంది. ముఖ్యంగా పా దాలు,చీల మండలు.వీటిని సూపర్ అఫిషియల్స్ అంటారు. మోకాళ్ళ కింద చర్మం పై ఎర్రగా,మంతపెడుతూ, ఉంటుంది. దురద పెడుతూ ఇతర సమస్యలతో  ఇబ్బంది పెడుతూ ఉంటుంది. మీరు ఒత్తిడి కలిగించే సాక్స్ వేసుకోవచ్చు. అది మీకాళ్ళ పై స్పష్టంగా కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. వాటిని గుర్తించిన వెంటనే దగ్గరలోని డాక్టర్ ను సంప్రదించండి. చికిత్సలో ఉన్న వివిధ రకాల పద్దతుల గురించి పూర్తిగా క్షుణ్ణంగా అడిగి తెలుసుకోండి.చికిత్స చేయించు కొండి. చర్మం పై దురద... శరీరంలో ఉన్న ఆయిల్ గ్లాండ్స్ వల్ల వస్తుంది. వయస్సు రీత్యా శరీరంలో ఆయిల్ తగ్గిన ఫలితంగానే చర్మం ఎండిపోయి నట్లు పొడి బారిపోయి  ఉండడం వల్ల సమస్య  మరింత తీవ్రమౌతుంది. పొడి బారిన చర్మానికి ఏదైనా మోయిస్చరైజర్, సరిపోతుంది. ఇందు కోసం నీరు అధికంగా తాగాలి. చర్మాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు సబ్బులు, హ్యుమిడి ఫైర్లు వాడాలి. దీనివల్ల దురద తగ్గవచ్చు. మీకు పెర్ఫ్యుం గనక వాడే అలవాటు ఉంటె దురగ మరింత పెరిగే అవకాశం ఉందని వైద్యులు చెపుతున్నారు. మీరు కొన్ని వారాలుగా దురదా తో బాధపడుతున్నారా మీరు డాక్టర్ ను సంప్రదించండి. ఇది మరింత తీవ్రతరం కావచ్చు. లేదా కిడ్నీకి సంబంధించి,డయాబెటిస్,రక్త హీనత.లివర్ సమస్య కావచ్చు. ఈ సమస్యను గుర్తించి సత్వరం చికిత్స చేసుకోవడం అవసరం. సమాస్తాను ప్రాధమిక స్థాయిలో గుర్తించి చికిత్స తీసుకుంటే దీర్ఘకాలిక సంమాస్యగా మారకుండా ఉంటుంది. లెగ్ ఉల్సర్స్ / కాలిలో అల్సర్స్... మీ కాళ్ళలో  పండ్లు  ఏర్పడుతాయి. వాటిని  నిర్లక్ష్యం చేయద్దు. అలా బయటికి వచ్చిన పుండ్ల వల్ల బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ అయి అనారోగ్య  సమస్యల కు దారి తీయవచ్చు. డయాబెటిస్, వల్ల కాళ్ లో అల్సర్స్ రావచ్చు.  వేరికోస్ వేయిన్స్ వల్ల ధూమపానం, గర్భవతిగా ఉన్నప్పుడు, ఊబకాయం, ఒక వేళ మీ కాళ్ళలో అల్సర్స్ వస్తే  వైద్యులు లెగ్ అల్సర్స్  క్లినిక్ కు రెఫర్  చేయవచ్చు. లెగ్ అల్సర్స్ కు చికిత్స రోగి వయస్సు పై ఆధార పడి ఉంటుంది. లేదా రోగి పూర్తి ఆరోగ్యం,అల్సర్స్ కు గల కారణం బట్టి ఆధార పడిఉంటుంది. సాధారణం గా  మీగాయాన్ని మీరే శుభ్రం చేసుకోవాల్సి  ఉంటుంది. ఆప్రాంతంలో ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తారు. అంటే కంప్రెషన్ తో కూడిన సాక్స్ లెగ్ అల్సర్స్ ఉన్నవారికి సర్జరీ చేయాల్సి రావచ్చు. కాంటాక్ట్ డెర్మటైటిస్... కాంటాక్ట్ డెర్మటైటిస్ లక్షణం  చ్గార్మాం పై ఎర్రగా ఉంటుంది. దద్దుర్లు తీవ్రంగా ఇబ్బంది పెడతాయి. ఎలర్జీ వల్ల చర్మం ఇరిటే టింగ్ గా ఉంటుంది. కాంటాక్ట్ డెర్మటైటిస్ ను రెండురకాలుగా ఉంటాయని నిపుణులు పేర్కొన్నారు.  ఇరి టేట్  కాంటాక్ట్ డెర్మటైటిస్... ఈ సమస్య చాలా సహజనైనదని ఇతర దద్దుర్లు మాదిరి గానే ఉంటాయి. ఇది కొన్ని రకాల మొక్కల ద్వారా  షాంపూలు ఆల్కాహాల్, బ్లీచ్, డిటర్  జెంట్స్ ఇతర రాసాయనాలు, చర్మం పై ప్రతి చర్య జరిగి ఎలర్జీ గా మారుతుంది.  ఎలర్జీ కాంటాక్ట్ డెర్మటైటిస్... చర్మం యొక్క స్థితి ని బట్టి ఉదాహరణకు...విషపూరిత మైన మొక్కలు వ్యక్తి గత సంరక్షణ ఉత్పత్తులు కృత్రిమ ఆభరణాలు ఇతర రాసాయనాలు కావచ్చు. ఈ సమస్యకు చికిత్సలో భాగం గా ఎలర్జీ ని వృద్ధి చేసే వస్తువులను, సబ్బులు,చర్మం పై మోయిస్చరైజ్, సాధనాలు, క్రీములు, లోషన్లు మీ చర్మాన్ని రక్షిస్తాయి.  స్కిన్ కాన్సర్/ చర్మ క్యాన్సర్... స్కిన్ క్యాన్సర్ సహజమైన కండీషన్ గా నిపుణులు పేర్కొన్నారు. 7౦ సంవత్సరాల వయస్సు పై బడిన వారిలో ప్రతి ఐదుగురిలో చర్మ క్యాన్సర్ బారిన పడుతున్నట్లు తెలుస్తోంది. చర్మ క్యాన్సర్ కు ప్రాధాన కారణం సూర్యరశ్మి ని ఎదుర్కోవడమే. ఎవరైతే చాలా ఫెయిర్ గా ఉంటారో కాళ్ళు రంగులు రంగులు గా ఉంటాయి. ఎర్రటి జుట్టు ఉన్న వారిలో ఇది ప్రమాదకారిగా మారచ్చు. కొంత మందిలో చర్మ క్యాన్సర్ రావడానికి ఎక్కడైతే సూర్య రశ్మి చేరదో అంటే శరీరంలోని చంకలు, లోపలి భాగాలు లేదా జనటిక్స్ టాక్సిస్ క్యాన్సర్  వృధిలో కీలక పాత్ర పోషిస్తుంది. సూర్యరస్మికి దూరంగా ఉంటూ సన్ స్క్రీన్ లోషన్స్ వాడండి. మేఘావృతంగా ఉన్నరోజుల్లో తనింగ్ బర్స్ ను చూదండి. చర్మ క్యాన్సర్ కు రకరకాల చికిత్సలు చేస్తారు. క్యాన్సర్ స్టేజి నిబట్టి క్యాసర్ సైజు ను బట్టి చికిత్సలు చేస్తారు. సోగ్గి స్కిన్ / కుంగి పోయిన చర్మం... మీ చర్మం కుంగి పోయింది బిరుసుగా ఉండే చర్మం. మీ మెడ మీద దవడ ఎముకల ప్రాంతాలాలో సహజంగా ఒడులుగా ఉంటుంది. చాలా మంది ఈ సమాస్యను టర్కీ నేక్ అంటూ ఆట పట్టిస్తూ ఉంటారు.అంటే టర్కీ కోళ్ళ ను పోలి ఉండడం వల్ల ఆటపట్టిస్తూ ఉంటారు. వయస్సు రీత్యా చర్మం సాగి పోతుంది. సాగింగ్ కొవ్వు పదార్ధాలు పేరుకు పోయి దవడ క్రింది భాగం లో గడ్డం కింద సాగిపోతాయి. ఆప్రాంతంలో ముఖం అందవికారంగా తయారవుతూ ఉంటుంది. ఇక మెడ కండరాలు బలహీన పడతాయి. వర్టికల్  గా ఉండే బ్యాండ్స్  వాడాల్సి ఉంటుంది. మీ మెడ పై భాగాన ఉన్న ప్రాంతాన్ని సంరక్షించండి. మీ మెడను సూర్య రస్మికి దూరంగా ఉంచండి. సన్ స్క్రీన్ మోయిస్చ రైజర్స్ రాసుకోండి.మీరు మెడ దవడ, ప్రాంతలాలో వ్యాయామం చేయండి. ఆ ప్రాంతం లో గట్టి పడతాయి. సాగి పోయిన లేదా కుంగి పోయిన అంటే జీవం లేని చర్మం కాకుండా మరే ఇతర  సమస్యలు ఉంటె  డ ర్మటా లజిస్ట్,  సర్జన్ తో సర్జరీ అవసరం  లేకుండా చికిత్సలు ఉన్నాయేమో తెలుసుకోండి.  బ్రుసిన్స్ / అంటే గాయాలు... బ్రూస్ అంటే చర్మం పై గట్టిగా పేరుకు పోయిన లేదా మచ్చలు. గాటు, మీరు మీ టేబుల్ పై చేయిపెట్టినప్పుడు ఏదైనా గాయం అయినప్పుడు. లేదా రక్తనాళాల వద్ద గట్టిగా ఒత్తుకు పోయి రక్తం నల్లగా గడ్డకట్టి నప్పుడు. అదే మీరు గాయాల పాలై మీ శరీరం పై రక్తం గూడు కట్టుకున్నప్పుడు. కాలికి గాయమై ఆప్రాంతమంతా నల్లగా లేదా నీలపు రంగులో గడ్డ కట్టుకున్నప్పుడు. లేదా రక్త నాళాలు చర్మం కింది భాగం లో ఉన్నప్పుడు. చర్మం డ్యామేజ్ అయినప్పుడు రక్తం కారి నప్పుడు. ఆ చర్మం పై ఏర్రరంగులో,ఊకో చోటా నల్లగా, ఇంకోచోట,నీలపు రంగంలో మరక పది పోతుంది. సమస్య  ఉన్న వారిలో వృద్ధులలో బ్రూస్ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. వయస్సు వల్ల చర్మం పల్చబడి పోవడం వల్ల లేదా శరీరంలో కొవ్వు తగ్గిపోవడం వల్ల  చాలా త్వరగా మచ్చలు,గాట్లు,ఏర్పడ తాయి. చాలా రకాల బ్రూస్ కావడానికి కారణం కేవలం చిన్న చిన్న గాయాలే,అదీ కాక ఏది ఏమైనా కొన్ని సమయాలలో చాలా తీవ్రంగా ఉండచ్చు. బ్లడ్ తిన్నర్స్, వల్ల మరకలు, మచ్చలు, పడచ్చు.మీకు భారీ సంఖ్యలో పెద్దపెద్ద మచ్చలు పడతాయి. అది రక్త శ్రావం కారణం కావచ్చు. అప్పడు తప్పని సరిగా మీరు డాక్టర్ ను సంప్రదించాల్సి రావచ్చు. స్కిన్ క్రాఫ్టింగ్, లేదా మీ ముఖం పై పడ్డ మచ్చను తీసివేయడానికి ఫేషియల్ ప్లాస్టిక్ సర్జరీ చేయాల్సి రావచ్చు. వ్రిన్ కిల్స్ / అంటే ముఖం పై ముడతలు.... ముఖ్యంగా ఈ మధ్య కాలం లో వయస్సు రీత్యా ముఖం పై ముడతలు, కంటి కింద చా రలు, మిమ్మల్ని ఆత్మన్యూనతా భావం తో ఉంటారు. వయస్సు వచ్చేసిందా అని భావిస్తూ దీనికోసం ఏమైనా చేయాలనే ఆసక్తిని ప్రదర్శిస్తూ ఉంటారు. ముడతలు వయస్సు పెరుగుతున్న కొద్దీ  వస్తాయి. వయస్సు రీత్యా చర్మం పలుచబడి పోవడం మోయుస్చరైజర్ ను తక్కువగా కలిగి ఉంటుంది. దీనికారణం శరీరం లో తక్కువ శాతం ఆయిల్ ఉండడమే, ఆయిల్ దీనివల్ల శరీరానికి జరిగిన గాయం మానడానికి చాలా మెల్లగా  తగ్గుతూ ఉంటుంది. ముఖం పై ఉన్న కండరాల లో మార్పు వల్ల  రక రకాల  హావ భావాలు వస్తూ ఉంటాయి. ముడతల వల్ల చర్మం మరింత లోతుకు పోయి ముడతలు స్పష్టంగా కనిపిస్తాయి. పొగతాగడం సూర్యరస్మి కారణంగా ముఖం పై ముడతలు వస్తాయి.  మరి ముఖం పై వచ్చే ముడతలను ఏమిచేస్తారు. ప్రతి రోజూ మోయిస్చరైజ్ చేయండి. క్లింజర్స్ వాడండి. పోగాతాగాకండి,ఒక వేళ మీకు అలవాటు ఉంటె  మాని వేయండి. సూర్య  రాస్మికి దూరంగా ఉండండి.తప్పనిసరిగా బయటికి వెళ్ళాల్సి వస్తేసన్ స్క్రీన్ లోషన్ ను వాడండి. ఎ మోస్చారైజర్ వాడాలి, ఏజింగ్ వ్రింకిల్ నివారణకు  ఏది యాంటి ఏజింగ్ కేర్ తీసుకోవాలి తెలుసుకోండి. మీ డెర్మటాలజిస్ట్ ను అవసరమైన పక్షం లో సంప్రదించండి. డాక్టర్ సలహా తీసుకోండి. ముఖంపై ముడతలు వచ్చాయని బాధ పడకండి. ముడతలను ఎదుర్కోడానికి శుద్ధంగా ఉండండి. మీ డర్మటా లజిస్ట్ ఫైల్లెర్ల గురించి  చర్చించండి. కెమికల్ పీల్స్ లేజర్ సర్ఫెసింగ్ సర్జరీ గురించి తెలుసుకోండి.  

మనకు పీచుపదార్థం ఎందుకు అవసరం??

మనిషి తీసుకునే ఆహార పదార్థంలో చాలా రకాలు ఉంటాయి. పిండి పదార్థాలు, ద్రవాలు, పీచు ఇలా పదార్థంలో అంతర్లీనంగా చాలా ఇమిడి ఉంటాయి. అయితే తీసుకునే ఆహారపదార్థాలలో పీచు అధికంగా ఉన్న ఆహారం చాలా మంచిదని, ఇది ఆరోగ్య వ్యవస్థను చాలా దృఢంగా ఉంచుతుందని అంటారు.  అయితే… ఆహార పదార్థాలలో వుండే పీచుపదార్థం అనేది మొక్కలకు సంబంధించిన భాగం అని చెప్పవచ్చు. ఈ పదార్థం మనుషులకు సంభవించే కొన్ని అతి ముఖ్యమైన తీవ్రవ్యాధులను  అరికట్టడంలో  చాలా బాగా సహపడుతుంది. పీచుపదార్థం ఎక్కువగా ఉన్న ఆహారం జీర్ణకోశంలో  చాలా త్వరగా ప్రయాణించగలుగుతాయి. అందువల్ల ఆహారంలోని ప్రమాదకరమైన పదార్థములు దేహంలో శోషణ చెందడానికి ఎక్కువ సమయం ఉండదు.  ఇంకా కొన్ని రకాల ఆహార పదార్థాల వల్ల, ద్రవ పదార్థాల వల్ల కలిగే పైత్య వికారాలను ఈ పీచుపదార్థం బంధించి ఉంచుతుంది. అందువల్ల ఆ పైత్య సంబంధ కారకాలు శరీరంలోకి శోషణ కావు. అంతేగాక మనం తీసుకునే ఆహారంలో దాసగి ఉండే కొలెస్ట్రాల్ నుండి క్రొత్త పైత్య క్షారాలు విడుదల అవుతాయి. ఈ క్షారాలు శరీరంలో కలవకముందే పీచుపదార్థంతో కలిసిపోయి వాటిద్వారానే బయటకు వెళతాయి.   శరీరంలో పేరుకుపోయే కొలెస్ట్రాల్ తగ్గాలి అంటే.. దానికి చక్కని ఉపాయం పీచు పదార్థం అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం. పీచు పదార్థం కొలెస్ట్రాల్ కంటెంట్ ను శరీరంలో నుండి ఎప్పటికప్పుడు తగ్గిస్తూ ఉంటుంది. అందుకే అధికబరువు ఇన్నవారిని పీచుపదార్థం అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకోమని సలహా ఇస్తుంటారు.  దీనివల్ల రెండు ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి పీచుపదార్థం ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటే తొందరగా కడుపు నిండిన ఫీల్ వస్తుంది. అది జీర్ణం కావడానికి ఎక్కువగా సమయం పడుతుంది కాబట్టి ఆకలి నియంత్రణలో ఉంటుంది. ఇక రెండవది పీచుపదార్థం శరీరంలో ఎక్కువగా ఉన్న కొలెస్ట్రాల్ ను క్రమంగా తగ్గిస్తుంది. పీచుపదార్థం కొలెస్ట్రాల్ ను తగ్గించడం వల్ల రక్తనాళాలు గట్టిపడి అవి  పూడుకుపోయే ప్రమాదాన్ని నివారిస్తుంది. కొవ్వును పెరగకుండా అదుపు చెయ్యటంలోను కొలెస్ట్రాల్ నుండి పిత్తాశయంలో ఏర్పడే రాళ్ళని అరికట్టడంలోను పీచుపదార్థం ఎంతగానో సహాయ పడుతుంది. కొందరిలో వంశానుగతంగా  డయాబెటిస్ వ్యాధి వస్తుంది. ఈ డయాబెటిస్ ని పీచు పదార్థాలు అధిక శాతంలో గల ఆహారము తీసుకోవడం ద్వారా చాలావరకు నిరోధించటానికి అవకాశము ఉంటుంది.  కొందరికి ప్రేవులలో అధిక ప్రకంపనలు (వత్తిడిలు) జరగటంవల్ల అవి జారి హెర్నియా వ్యాధికి లోనవటం సంభవిస్తుంది.అదే పీచు పాడ్స్ర్తం పుష్కలంగా ఉన్న ఆహారం తీసుకుంటే..  పీచుపదార్థం ప్రేవులలో సులువుగా ప్రయాణించడం ద్వారా ప్రేవులలో వత్తిడులను  అరికట్టడంలో తోడ్పడుతుంది. ఇక ముఖ్యంగా చెప్పుకోవలసిన విషయం.. భయంకరమైన క్యాన్సర్ వ్యాధిని ఉత్పత్తిచేసే “కార్సినోజినిక్”లను శరీరంలో ఉత్పత్తి కాకుండా నిరోధించటానికి పీచుపదార్థాలు చాలా సహాయపడతాయి. జీర్ణకోశంలో ఆహారం ఎంత ఆలస్యంగా ప్రయానిస్తే అంత ఎక్కువగా ప్రేవులలో ఒత్తిడులు సంభవిస్తాయి. ఈ ఒత్తిడుల కారణంగానే కార్సినోజినిక్ లు పుట్టడం జరుగుతుంది. అందుకే.. కావలసినంత పీచుపదార్థం శరీరంలో ఉన్నప్పుడు జీర్ణంకోశంలోని ఆహారాన్ని త్వరితంగా ప్రయాణింపజేసి, ప్రేవుల మధ్య ఒత్తిడులు అరికట్టడంద్వారా క్యాన్సర్ కు  కారణమైన కార్సినోజినిక్ ల ఉత్పత్తికి విఘాతం కలిగించి క్యాన్సర్ వ్యాధిని నిరోధించగలుగుతుంది.  అందువల్ల మనుషులు తీసుకునే ఆహారంలో అధిక శాతం పీచులేక నార పదార్థం గల ఆహార పదార్థాలను తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో ముఖ్యం. ఆహారంలో పీచుపదార్థం పుష్కలంగా ఉండాలంటే బియ్యం గోధుమలు వగైరా ధాన్యాలను పొట్టు తీయకుండా పిండి పట్టించుకుని వాడుకోవాలి.  ధాన్యాలను ఎక్కువసార్లు కడగకూడదు. కొన్ని కూరగాయలు పచ్చిగా తినడానికి అనువుగా ఉంటాయి. అలాంటి కూరగాయలను పచ్చివిగా తినటం మంచిది. కూరగాయలను తప్పనిసరిగా ఉడికించవలసివస్తే మూతపెట్టి కొద్దిసేపు మాత్రమే ఉడికించాలి. కూరలను ఉడికించినప్పుడు ఆ నీటిని పారేయకుండా వాటిని సూపులు, రసం, చపాతీ పిండి కలిపేటప్పుడు నీళ్లకు బదులుగా వాడటం వంటి మార్గాల ద్వారా వాటిని కూడా ఆహారంగా సేవించే విధానం ఏర్పరచుకోవాలి. ఈ విధంగా క్రమపద్ధతిలో ఆహారాన్ని తయారు చేసుకుని తీసుకుంటూ ఉంటే శరీరానికి కావలసినంత పీచుపదార్థం లభిస్తుంది.                                    ◆నిశ్శబ్ద.

భారత్ కు కోవిడ్ వేవ్ ముప్పు ఉందా?

భారత్ కు మరో మారు కోవిడ్ మూడవ విడత ప్రమాదం పొంచిఉందా ?అంటే అవుననే అంటున్నారు నిపుణులు.దేశంలో పెరుగుతున్న xbb కేసులు ఇపట్టికే 9 రాష్ట్రాలలో ఒమేక్రాన్ కొత్త స్ట్రైన్ ఉన్నట్లు గుర్తించారు.దేశంలో 24 గంటలలో కోరోనా 16౦౦ కేసులు పెరిగాయని xbb స్ట్రైన్ గురించి మాట్లాడితే అక్టోబర్ 2౩ వ తేదివరకూ ౩8౦ కేసులు నమోదు అయ్యాయని. ఇది క్రమంగా పెరుగుతోందని xbb సోకిన వారి సంఖ్య తమిళనాడులో ఎక్కువగా ఉందని నిపుణులు పేర్కొన్నారు.ప్రపంచవ్యాప్తంగా నేడు కోరోనా ప్రమాదం పొంచి ఉందని. ఒమైక్రాన్ యొక్క కొత్తరూపం స్ట్రైన్ xbb తీవ్ర సమస్యలు సృష్టిస్తోంది.సింగపూర్ నుండి భారత్ చేరిందని తమిళనాడులో అత్యదికకేసులు నమోదు అవుతున్నాయని మొత్తం 9 రాష్ట్రాలాలో ఇప్పటికే ఈ వేరియంట్ ప్రభావం చూపుతోందని నిపుణులు అంటున్నారు.జర్మనీకి చెందినా సంస్థ గ్లోబల్ ఇనిషిఏటివ్ ఇన్ఫ్లూయెంజా సమాకు సంబందించిన దాటా పంచుకుందని. కోరోనా వైరస్ లో వస్త్ర్హున్న మార్పులు పై దృష్టి పెటారు. భారత్ లో గతవారం xbb సబ్ వేరియంట్ ప్రభావం ఉన్నట్లు నిర్ధారించారు. తమిళనాడులో 175 కేసులు xbb వైరస్ విషయం లో తమిళనాడు ముందుఉందని.ఇప్పటికే 175 కేసులు నమోదు కాగా 1౦౩ కేసులు పశ్చిమ బెంగాల్ లో రెండవస్థానం లో ఉంది. xbbవేరియంట్ కేసులు పశ్చిమ బెంగాల్ లో నమోదు కవాదం విశేషం. కొన్ని రాష్ట్రాలాలో xbb మూడు రూపాలు... xbb కి మూడు సబ్ వేరియంట్స్ ఉన్నాయి. xbb.1,xbb.౩ రూపాలుగా గుర్తించారు. భారత్ లో లభించిన ౩8౦ కేసులలో అత్యధికంగా 68.4 2 కేసులు xbb2 సబ్ వేరియంట్ గా గుర్తించారు. ఇదే15% క్రేసులు xbb.2 2.౩6 కేసులు xbb.1గా గుర్తించారు.దేశంలోని 9 రాష్ట్రాలలో xbb వేరియంట్ విభిన్నమైన రూపాలలో ఉంటుందని ఇక వివిధరాస్త్రాలలో ఎంతమంది దీనిబారిన పడ్డారో చూదాం తమిళనాడు 175 పశ్చిమబెంగాల్ లో 1౦౩ ఓడిస్సలో ౩5 మహారాష్ట్రాలో21 డిల్లి18 పాండిచ్చేరి 16 కర్నాటక 9 గుజరాత్2 రాజాస్తాన్ 1 కేసు నమోదు అయినట్లు సమాచారం.xbbవేవ్ రూపం లో మున్చుకోస్తోందా?ఒమైక్రాన్ కొత్తరూపం xbb వస్తోందని డబ్ల్యు హెచ్ ఓ ఆందోళన వ్యక్తం చేసింది.ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రధాన శాస్త్రవేత్త సౌమ్యా స్వామినాదన్ మాట్లాడుతూ శరీరంలో రోగానిరోదకశక్తిని మోసం చేస్తూ వ్యక్తికి సంక్రమిస్తుందని.దీనితోపాటు. కొన్నిదేశాలలో కోరోనా కొత్తేవవే పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరోనా కొత్తేవేవ్ ౩౦౦ కు పైగా వేరియంట్లు ఉన్నాయని.ప్రపంచవ్యాప్తంగా xbb చాలా శక్తివంతమైనదని పేర్కొన్నారు.గతంలో మనం అత్యంత ప్రమాదకరమైన కోరోనా వేరియంట్లను చూసామని xbb యాంటి వేరియంట్ పై దాడిచేస్తుందని ఈ కారణంగా కొన్ని దేశాలాలో మళ్ళీ కోరోనా వేవ్ వచ్చే అవకాశం ఉందని దీనికితోడు ba5 ba1 పై దృష్టి పెట్టమని వివరించారు. రెండు వేరియంట్లు అత్యంత ప్రమాదకరమని అన్నారు.  

కీళ్ల ఆరోగ్యం కులాసాయేనా??

ఒకప్పుడు అరవై సంవత్సరాలు దాటినా ఆరోగ్యంగా ఉంటూ ఎన్నో పనులు చేసుకుంటూ చక్కని జీవితం సాగించేవారు. మన అమ్మమ్మలు, తాతయ్యల కాలంలో ఇలాగే ఉండేది. అందుకే వారు ఇప్పటికీ 80,90 సంవత్సరాల వయసుకు చేరువ అయినా ఒకరి మీద ఆధారపడకుండా తమ పనులు తాము చేసుకుంటూ ఉండగలుగుతున్నారు. అయితే వీరి మనవళ్లు, మనవరాళ్లు మాత్రం 40 సంవత్సరాలు కూడా పూర్తి కాకనే కాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులతో ఇబ్బంది పడుతున్నారు. మరీ ముఖ్యంగా కీళ్ల సమస్యలు ఇప్పటి తరాన్ని చాలా వేధిస్తున్నాయి.  ఎముకలు శరీరంలో చట్రాన్ని ఏర్పరిస్తే, అందులో వున్న కీళ్ళు మనిషి కదిలేట్లు చేస్తాయి. రెండు లేక మూడు ఎముకలు కలిసే ప్రదేశాన్ని 'కీలు’ అంటామనే విషయం మనకు తెలిసిందే.. పుర్రెలో వున్న ఎముకల కలయిక తప్ప మిగతా కీళ్ళన్నీ కదిలేవే! కదిలించదగిన కీలులో ఎముకల అగ్రభాగములు పల్చని కార్టిలేజ్ తో కప్పబడి, నునుపైన ఉపరితల ప్రదేశాన్ని కలిగి వుంటాయి. వెన్నుపూసల మధ్య వుండే కార్టిలేజ్ ముక్కలు షాక్ అబ్సార్బర్స్ లాగా పనిచేస్తాయి. ఎముకలు కలిసే ప్రదేశంలో వాటిని ఫైబ్రస్ టిష్యూతో నిర్మింపబడిన తాళ్ళ వంటి లిగమెంటులు కలిసి వుండేట్లు చేస్తాయి. ఈ పొరపై నోవియల్ ఫ్లూయిడ్ అవే ద్రవపదార్థాన్ని  సృష్టిస్తుంది. అది కందెనలా తోడ్పడుతుంటుంది. అయితే చాలామందిలో ఉన్న ప్రశ్న.. కీళ్లు ఎందుకు అలా అరిగిపోతాయి?? చిన్న వయసులోనే కీళ్లు అరిగిపోవడం ఏంటి విచిత్రం కాకపోతే.. అనుకుంటూ వుంటారు.  90°కన్నా ఎక్కువగా మోకాల్ని బెండ్ చెయ్యడం మంచిదికాదు. ఇప్పుడంటే కొన్ని కొత్త ఇళ్లలో టాయిలెట్స్ అన్నీ వెస్ట్రన్ వెర్షన్ వచ్చాయి. కానీ చాలా ఇళ్లలో సాధారణ టాయిలెట్స్ ఉంటాయి. టాయిలెట్ వెళ్ళినప్పుడు మోకాళ్ళ మీద కూర్చుంటూ వుంటాం. ఇలా ఎక్కువగా కూర్చోవటం మంచిదికాదు. మోకాలు కీలుని అంత ఎక్కువగా వంచి కూర్చోవటం వల్ల ఆ కీళ్ళు బాగా అరిగిపోతాయి. ఇలా ఎక్కువగా వాడడం వల్ల ‘జాయింట్స్ ఏజ్' బాగా పెరిగిపోతుంది. మనిషి వయసుతో సంబంధం లేకుండా జాయింట్స్ వయసు పెరిగిపోతుందన్న మాట! కొంతమంది ఇతరులతో కంపేర్ చేసుకుంటూ ఫలానా అతనికి యాభై సంవత్సరాలు దాటినా అరగలేదు, నా కీళ్ళు నలభై అయిదేళ్ళకే అంతగా అరిగిపోయాయేంటి అనుకుంటుంటారు. అయితే ఇక్కడ ముఖ్య విషయం కీళ్ళు వాడకాన్ని బట్టి అరుగుతాయి కానీ వయసుని బట్టి కాదు. కాబట్టి ఇక్కడ చెప్పుకునేది ఏంటంటే… కీళ్లు అనేవి వయసును బట్టి కాదు మనం చేసే పనులు, కీళ్లను ఉపయోగించే విధానం మీద ఆధారపడి అరుగుతాయి.  కీళ్లు బలంగా ఉండటానికి మంచి ఆహారం తీసుకోవాలి. కీళ్ల మీద మరీ ఎక్కువ ఒత్తిడి పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. నిలుచుకోవడం, కూర్చోవడం, పరిగెత్తడం, నడవడం, పడుకోవడం ఇలా చేసే ప్రతి పనిలో కీళ్లు సౌకర్యవంతంగా ఉండే భంగిమ చూసుకోవాలి.  ఆహారం, జాగ్రత్తలు, లైఫ్ స్టైల్ వీటిని సక్రమంగా ఉంచుకుంటే కీళ్ల ఆరోగ్యం కలుక్కుమనకుండా కులాసాగా ఉంటుంది.                                   ◆నిశ్శబ్ద.

నిద్ర మీద శరాఘాతం ఇన్సోమ్నియా!!

కొందరు మానసిక చికాకులవల్ల, ఆలోచనలవల్ల నిద్ర పట్టడం లేదనుకుంటే మరి కొందరు పైకి ఏ కారణం లేకుండానే రోజుల తరబడి సరైన నిద్రపోకుండా గడిపేస్తారు. కొందరు రాత్రిళ్ళు గుడ్ల గూబల్లాగా కళ్ళు తెరచి గడియారం వంక చూస్తూ ఎప్పుడు తెల్లవారుతుందా అని నిరీక్షిస్తూ వుంటారు. ఇలాగే రోజులు, నెలలు, సంవత్సరాలు నిద్ర లేకుండా గడిపే వ్యక్తులు ఎందరో వున్నారు. ఈ రకంగా నిద్ర పట్టకపోవడం కూడా ఒక వ్యాధే. దీనినే వైద్యభాషలో "ఇన్సామ్నియా" అంటారు. అసలు నిద్ర పట్టకపోవడాన్నీ, ఎవరికైనా నిద్రపట్టినా సరిగ్గా పట్టకపోవడాన్ని ఇన్సామ్నియాగా భావించవచ్చు.  సాధారణంగా పెద్దవాళ్ళు రోజుకు ఏడు, ఎనిమిది గంటలు, పిల్లలు 10-11 గంటలు నిద్రపోతారు. చంటిపిల్లలు రోజుకు 18 గంటల వరకూ నిద్రిస్తారు. ఎవరికైనా సరే పడుకున్న గంట తరువాత మంచి నిద్ర పడుతుంది. తరువాత 4 గంటలకు ఆ నిద్ర తీవ్రత తగ్గుతుంది. మళ్ళీ ఒక గంటలో ఆ నిద్ర తీవ్రత పెరుగుతుంది. అంటే ఎనిమిది గంటల పాటు వరసగా నిద్రపోయే వారికి మధ్యలో కొద్దిసేపు నిద్ర తీవ్రత తక్కువగా ఉండి త్వరగా మెలుకువ రావడానికి ఆస్కారం వుంది. ఏది ఏమైనా వయస్సుకు తగినంత నిద్రపోయేవారు. శారీరకంగా, మానసికంగా హాయిగా ఉంటారు. ఆరోగ్యవంతుడైన వ్యక్తికి వరసగా రెండు మూడు రోజులు నిద్ర లేకపోయేసరికి కళ్ళు మండడం, తలనొప్పి అనిపించడం, తలతిరగడం, ఒళ్ళు కూలడం, నరాల బలహీనత, అనవసరంగా ఆందోళన కలగడం లాంటి లక్షణాలు ఉంటాయి. అంతేకాదు, శక్తి లేనట్లు అనిపించడం, ఆలోచనల్లో క్రమం లేకపోవడం, కనురెప్పలు బరువుగా మూసుకుని పోవడం, మాటలు తడబడడం, ఊరికినే కోపం, చికాకు కలగడం కూడా సహజమే. కాని నిద్ర రాని వ్యాధితో బాధపడే వ్యక్తిలో ఇటువంటి లక్షణాలు చాలా తక్కువగా కనిపిస్తాయి. అటువంటి వ్యక్తులు సాధారణంగా న్యూరోటిక్ వ్యక్తులైనా అయి ఉంటారు, లేదా సైకోటిక్ వ్యక్తులయినా ఆయి వుంటారు. న్యూరోటిక్ వ్యక్తులలో మానసిక ఆందోళన, ఆలోచన, గందరగోళం, ఆవేశం ఎక్కువ ఉంటాయి. ప్రతిదానికి భయం, ఆదుర్దా ఉంటాయి. ఇటువంటి ఆందోళనలు, అంతులేని ఆలోచనలు ఉండడంతో నిద్ర పట్టదు. మరి కొందరు మానసిక రోగులకు సైకోసిస్ వల్ల భ్రమలు, భ్రాంతులతో మనస్సునకు స్థిమితం లేక నిద్ర పట్టదు. అలాగే నిరుత్సాహం (డిప్రషన్) వల్ల కూడా కొందరు రోజులతరబడి నిద్రపోకుండా గడిపేస్తూ ఉంటారు. అలాంటి వారు అనవసరంగా చికాకు పడడం, దేనిమీదా సరయిన ఆసక్తి లేకపోవడం, ఎప్పుడూ ముఖంలో ఏదో ఒక విచారము, నఖశిఖ పర్యంతం ఏదో రుగ్మత, నిరాశ, నిస్పృహ ఉండడం, వ్యక్తులతో దూరంగా మసలడం, ప్రతి దానికి తేలికగా అలసిపోవడం లాంటి లక్షణాలు ఉంటాయి.  ఇలాంటి వ్యక్తులు కూడా నిద్ర రాని వ్యాధితో బాధపడడం సహజం. న్యూరోసిస్ గాని, సైకోసిస్ గాని, నిరుత్సాహంగాని మానసిక వ్యాధులే. ఈ మానసిక వ్యాధుల తీవ్రతను బట్టి అసలు నిద్ర పట్టకపోవడమా, కొద్దిగా నిద్రపట్టడమా లాంటివి ఆధారపడి వుంటాయి. డిప్రషన్ తో బాధపడే చాలామంది తాము ఫలానా కారణం వల్ల బాధపడుతున్నామని తెలుసుకోలేక నిద్రపట్టక పోవడం వల్లనే తక్కిన లక్షణాలన్నీ వున్నాయని భావిస్తారు. కాని నిద్ర పట్టకపోవడం కూడా డిప్రషన్ లో ఒక లక్షణమని గుర్తించరు.  నిద్ర రాకపోవడానికి మానసిక వ్యాధులు కారణమయిన పక్షంలో కాస్తో కూస్తో నిద్రను కూడా చెడగొట్టే ఇతర  స్థితులు సైతం "ఇన్సామ్నియా"కి దోహదం చేస్తాయి. కొందరికి నిద్రపట్టి పట్టగానే కాలో చెయ్యో అకస్మాత్తుగా ఎవరో పట్టుకొని గట్టిగా ఊపేసినట్లయి వెలుకువ వచ్చేస్తుంది. కొందరికి మొత్తం శరీరాన్నే కుదిపేసినట్లు అవుతుంది. ఇలా జరగడానికి నిద్రపోయే వ్యక్తిలో ముఖ్య మయిన నాడీ కేంద్రాలు కూడా విశ్రమిస్తే, చిన్న చిన్న నాడీ కేంద్రాలు స్వేచ్ఛ వచ్చినట్లయి ఒక్కసారిగా విచ్చలవిడిగా వ్యవహరించడమే కారణం. నిద్రపట్టక పోవడానికి తగిన మానసిక వ్యాధిని గుర్తించి చికిత్స చేస్తే ఆ వ్యక్తి త్వరగా కోలుకుంటాడు. మానసిక ఆందోళన, చికాకులు నిద్రపట్టకపోవడానికి కారణాలు అయిన పక్షంలో ట్రాన్క్విలైజర్స్, డిప్రషను అయితే అది పోవడానికి మందులు వాడితే మంచి ఫలికాలు కలుగుతాయి. సరైన చికిత్స పొందకుండా ఊరుకుంటే ఆ వ్యక్తిలో వృత్తి నైపుణ్యము తగ్గిపోవడమే కాకుండా ఆరోగ్యం కూడా త్వరగా దెబ్బతింటుంది.   ◆నిశ్శబ్ద.

యమపాశం లాంటి క్షయకు చెక్ పెట్టండి ఇలా...

ఈ మధ్య కాలంలో విస్తృతం అవుతున్న ఆరోగ్య సమస్యలలో టిబి కూడా ఒకటి. దీన్నే క్షయ అని కూడా అంటారు. ఈ క్షయ వ్యాధి చూడడానికి సాధారణ దగ్గులా అనిపించి అయోమయానికి గురి చేస్తుంది. కానీ దీన్ని గురించి తెలుసుకోకుండా నిర్లక్ష్యం చేస్తే ఇది ప్రాణాంతక సమస్యగా  మారే అవకాశం ఉంటుంది.  ఇంతకూ ఈ క్షయ సమస్య ఎందుకు ఎలా వస్తుంది?? దీనికి తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి?? టిబి సోకిన వారికి చావే గతి అని అంటూ ఉంటారు చాలామంది. అది నిజమేనా లేక అపోహనా?? టిబి నయం అవుతుందా?? వంటి ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుంటే ఈ సమస్య గురించి పూర్తి అవగాహన వస్తుంది. ఈ సమస్య నుండి ప్రతి ఒక్కరు తమని తాము కాపాడుకునేందుకు ఆస్కారం వుంటుంది. వీటికి సంబంధించిన వివరాల్లోకి వెళితే… టి.బి ఎందుకు ఎలా వస్తుంది?? టి.బి అనే దాన్ని క్షయ అని కూడా అంటారు. ఇది మైక్రో బాక్టీరియా టుబరంక్యులోసిన్ అనే బాక్టీరియా వల్ల వచ్చే సమస్య. ఈ బాక్టీరియా సాధారణ వ్యక్తి పీల్చే గాలి ద్వారా ఊపిరితిత్తులలోకి ప్రవేశించి క్షయను కలుగజేస్తుంది. ఇది పూర్తిగా అంటువ్యాధి. ఒకరి నుండి మరొకరికి చాలా సులభంగా వ్యాప్తి చెందుతుంది. టిబి సోకిన వారి లక్షణాలు ఎలా ఉంటాయి?? టిబి లేదా క్షయ వ్యాధి సోకిన వారి లక్షణాలు పైకి కనిపిస్తాయి. విపరీతమైన దగ్గు ఉంటుంది. ఈ దగ్గు కూడా కఫంతో కూడి ఉంటుంది. ఇది సుమారు మూడు వారాలకు పైగా ఉంటే వ్యాధి లక్షణంగా అనుమానించాల్సి ఉంటుంది. ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది కలగడం, ఆయాసం, తేలికపాటి జ్వరం, శరీరం శుష్కించిపోవడం, ఆకలి లేకపోవడం వంటి సమస్యలు ఉంటాయి. దగ్గు క్రమంగా పెరిగితే రక్తంతో కూడిన కఫం పడే అవకాశం కూడా ఉంటుంది. టిబి సమస్యకు జాగ్రత్తలు ఏమిటి?? టిబి సోకిన వారు అది ఇతరులకు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. దగ్గుతో ఉంటారు కాబట్టి మాస్క్ ధరించాలి. ఎక్కడంటే అక్కడ ఉమ్మి వేయకూడదు. చల్లని వాతావరణానికి తిరగకూడదు. వైద్యులు సూచించిన మందులు వాడుతూ తమ వస్తువులను విడిగా ఉంచుకుంటూ జాగ్రత్తలు తీసుకోవాలి. టిబి సమస్య లేనివారు తమ చుట్టూ టిబి వ్యాధి వ్యాప్తిలో ఉన్నప్పుడు జాగ్రత్త పాటించాలి. ఎక్కడంటే అక్కడ తినడం, తాగడం చేయకూడదు. బయట ప్రాంతాలలో ఉమ్మివేయకూడదు. ఇతరులతో మాట్లాడేటప్పుడు రద్దీ ప్రాంతాలలో తిరిగెటప్పుడు మాస్క్ ధరించాలి.  టిబి నయం అవుతుందా??  టిబి వ్యాధి గురించి పట్టించుకోకపోతే అది ప్రాణాంతకం అయినప్పటికీ దాన్ని గురించి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వైద్యులు సూచించిన మందులు క్రమం తప్పకుండా వాడితే ఆరు నెలలలోపు జబ్బు తగ్గిపోతుంది. కాబట్టి టిబి వస్తే ఇక చావే గతి అనే అపోహను వదిలేయాలి. క్షయ రోగానికి కేవలం ఇంగ్లీషు వైద్యం మాత్రమే కాకుండా ఆయుర్వేదంలో కూడా వైద్యం అందుబాటులో ఉంది. ఏ రకం వైద్యం అయినా వైద్యులు సూచించిన మందులను క్రమం తప్పకుండా వాడితే టిబి నయమవుతుంది. చలి మరియు వర్షా కాలంలో ఈ సమస్య మరింత విస్తృతం అయ్యే అవకాశాలు ఉన్నందున అందరూ అప్రమత్తంగా ఉండాలి.                                    ◆నిశ్శబ్ద.