సైలెంట్ గా ఆరు వ్యాధులు మనిషిని చంపేస్తాయి...

ఆరు రకాల వ్యాధులు మిమ్మల్ని సైలెంట్ గా ప్రాణాలు తీసేస్థాయి అన్న విషయం మీకు తెలుసా .మంచి ఆహారం తీసుకుంటూ  మీ జీవన శైలిని మార్చుకుని నిత్యం మీరు ఆరోగ్యంగా ఉండడం కోసం మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు.అయినప్పటికీ దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతూ ఉంటారు. ఒక్కో సారి అనుకోకుండా ముప్పు ముంచుకొస్తుంది. కాగా కొన్ని వ్యాధుల పై ప్రత్యేక శ్రద్ధ అవసరం వాటినే సైలెంట్ కీల్లర్స్ గా  డాక్టర్స్ చెపుతున్నారు. హై బి పి... హై బీపీ  హై బ్లడ్ ప్రెషర్ హై పర్ టెన్షన్ చాలా ప్రమాద కరం. ఒక్క సారి హై బీపీ వచ్చిందంటే ఇతర అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది.  ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం 1.28 బిలియన్ల ప్రజలు దాదాపు 30 -79  సంవత్సరాల వారిలో హై బీపీ అత్యంత ప్రమాదకారి. అయితే బీపీ అమాంతం ఎందుకు పెరుగు తుందో కని పెట్టడం కష్టం లేదా ఒక్కోసారి లో బీపీ కూడా ప్రనాలు తీసేస్తుంది.హై బీపీ నిద్రలోనే వస్తే హార్ట్ స్ట్రోక్, బ్రైన్ స్ట్రోక్, వస్తుంది.  మాసివ్ హార్ట్ స్ట్రోక్ వచ్చిందో హై బీపీ ప్రాణమే తీసేతుంది. అందుకే బీపీ ని నియంత్రించుకోవాలి. లేదా మీ ప్రాణాలకు ముప్పు తప్పదు అని హెచ్చరిస్తున్నారు.వైద్యులు.  కరో నరీ  ఆర్ట్రీ  డీసీజ్... చాలా రకాల వ్యాధులు జీవితానికి ప్రమాదకరంగా మార తాయి.  అందులో కరోనా ఆర్ట్రీ డీసీజ్ ఒకటి.కరో నరీ ద్వారా ఆక్సిజన్ తో పాటు రక్త ప్రసారం జరుగుతుంది.గుండెలో దమనులు కుంచించుకు పోవడం వల్ల గుండె నొప్పి ,గుండె పోటు మొదటి లక్షణం గా చెప్పవచ్చు. డయా బెటిస్.... రక్తంలో హై గ్లూకోజ్ శాతం రెండు రకాలు టైప్ 1,టైప్ 2 డయా బెటిస్ వస్తుంది. శరీరంలో ఉండే ప్యాంక్రియాస్ లో ఉత్పత్తి అయ్యే ఇన్సూలిన్ అందకుంటే టైప్ 2 టిప్1 డయాబెటిస్ మరింత పెరిగే అవకాశం ఉంది. హైపర్ గ్లైసీమీయ తీవ్రంగా వస్తే  తీవ్ర మూత్ర విసర్జన కు వెళ్ళడం.యూరిన్ లో ప్రోటీన్ పోతూ ఉంటుంది. దీనివల్ల కిడ్నీ పాడై పోవడం,డయా బెటిక్ నేఫ్రో పతి,డయాబెటిక్ న్యూరో పతి, డయాబెటిస్ వల్ల కళ్ళు పోయేప్రమాదం ఉంది.హై పర్ టెన్షన్ ,హై షుగర్ ఉంటే గుండెపోటు రావచ్చు.హై షుగర్ వల్ల బ్రైన్ స్ట్రోక్,ఫిట్స్,వంటివి వస్తాయి మీకు తెలియకుండానే నిద్రలో మరణానికి దారితీసుకు పోతుంది.  ఆస్త్రియో ప్రోరోసిస్... ఆస్త్రియో  ప్రోరోసిస్ ఒక ఎముకల వ్యాధి.శరీరంలో ఎముకలలో కాల్షియం తక్కువ గా ఉండడం వల్ల శరీరంలోని ఎముకలలో రాలిపోవడం బలహీన పడిపోతాయి.ముఖ్యంగా ఆస్టియో ప్రోరోసిస్ ముఖ్యంగా స్త్రీలలో ఎకువగా వస్తుంది. ఆస్టియో ప్రోరోసిస్ ఉన్నవాళ్ళు ఒక్కోసారి ఉన్నట్లు ఉండి ఉన్నచోట కుప్పకూలిపోతారు.వ్యక్తి గతంగా  ఆరోగుల  పరిస్తితి ఎలా ఉంటుందో తెలియదు.ఒకోసారి ఎముకలు విరిగి పోతాయి.ఉన్నచోటే ఉండి కుప్పకూలిపోతారు.దీనినినుండి బయట పడడానికి కాల్షియం విటమిన్ డి,తప్పనిసరి ఎలాంటి ఎముకల సమస్య నుండైన వారు వ్యాయామం,నడక,జాగింగ్, మెట్లు ఎక్కడం ప్రతి రోజూ పరీక్షించుకోవడం ముఖ్యం. నిద్ర లేమి... నిద్ర లేమి తీవ్ర అనారోగ్య సమస్య,పెద్దగా గాలిపీలుస్తూ ఉంటారు.ఈ కరణంగా గురక కు దారి తీస్తుంది. నిద్రలేమి వల్ల అలసట చాలామంది నిద్రలేమి సమస్యను ఎదుర్కుంటారు.నిద్రలేమి వల్ల సహజంగా మరణిస్తారు.నిద్రలోనే గుండె పోటు, వస్తుంది.అందుకే ఈ అనారోగ్యాన్ని సైలెంట్ కిల్లర్ గాపేర్కొన్నారు. అప్సెస్సివ్  స్లీప్ అప్నియా వాళ్లమీరు గాలిపీల్చుకునే మార్గాలు మూసుకుపోవచ్చు. ఫ్యాటీ లివర్... ప్రాణాలు తీసెసే సైలెంట్ కీల్ల ర్స్ లో ఫ్యాటి లివర్ అని డాక్టర్స్ చెప్పారు. ఫ్యాటి లివర్ వ్యాధిని గుర్తించడం కష్టం.అతిగా తాగడం వల్ల ఫ్యాతి లివర్ వస్తుంది.లివర్ వాపు,లేదా నల్లని చార వస్తుంది.లివర్ శిరోసిస్ వల్ల పూర్తిగా లివర్ పైపోతుంది ఒక్కోసారి లివర్ డోనార్ దొరికితే లివర్ ట్రాన్స్ ప్లాంట్ చేయాల్సి రావచ్చు.లివర్ నాళాలలో ఇబ్బంది మొదలై.అది ముదిరితే ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది.ప్రాణాలు తీసెసే ఆరు రకాల వ్యాధుల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకునేందుకు జాగ్రతగా పరీక్షలు చేయించుకోవాలి.                    

చలికాలంలో ఉబ్బసం సమస్యకు ఇలా చెక్ పెట్టండి!

ఉబ్బసం అనేది శ్వాస సంబంధ సమస్య. ఈ సమస్య వచ్చిన వాళ్లలో శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది ఉంటుంది. సాధారణ సమయంలో బాగానే ఉన్నా అతి చల్లని వాతావరణం ఉన్నప్పుడు, కొన్ని ప్రతికూల వాతావరణ పరిస్థితులలో సమస్య ఎక్కువగా ఉంటుంది. ఈ ఉబ్బసం సమస్య ఎందుకు వస్తుంది అంటే..  వాతావరణ కాలుష్యం వల్ల, పీల్చే గాలి కలుషితమైపోయి శ్వాస కోశాన్ని దెబ్బతీయడం వల్ల, ఆహారపు అలవాట్ల వల్ల, నేటి కాలంలో కృత్రిమమైన జీవన విధానం వల్లా ఉబ్బసం వ్యాధి వస్తుంది. ఈ ఉబ్బసం వ్యాధినే ఆస్తమా అని కూడా అంటారు. ముఖ్యంగా ఈ చలి కాలములో ఆస్తమా సమస్య ఉన్నవారు మరింత ఎక్కువ ఇబ్బంది పడతారు. వీరు తీసుకునే ఆహారం, జీవనశైలి మొదలైన విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలి. జీవన శైలి.. రాత్రి ఎప్పుడో ఆలస్యంగా పడుకుని, ఉదయమేప్పుడో సూర్యుడు నడినెత్తి మీదకు వచ్చాక నిద్రలేవడం వంటి జీవన విధానాన్ని వదిలిపెట్టాలి. ప్రతిరోజూ సూర్యోదయంతో పాటే నిద్రలేవడం అలవాటు చేసుకోవాలి. ఉదయం నిద్ర లేవగానే కాలకృత్యాలు పూర్తి చేసుకుని ముఖం కడుక్కున తరువాత తేనె, తులసి రసం రెండింటిని సమానంగా కలిపి 10గ్రాముల వరకు తీసుకోవాలి. అంటే 5గ్రాముల తేనె, 5 గ్రాముల తులసిరసం తీసుకోవాలి.  నువ్వుల నూనె తీసుకుని శరీరమంతా పట్టించి బాగా మర్దన చేసుకుని సూర్యుడి లేత ఎండలో గడపాలి. ఎండలో కొద్దిసేపు ఉన్న తరువాత ఒక బకెట్టు వేడి నీరు, ఒక బకెట్టు చల్ల నీళ్లు తీసుకోవాలి. ఈ నీటిని మొదట రెండు చెంబులు తల మీద, వీపు మీద పోసుకోవాలి. ఆ తరువాత చల్ల నీళ్లు తలమీద నుండి పోసుకోవాలి.  ఇలా మార్చి మార్చి నీటిని పోసుకుంటూ స్నానం పూర్తి చేయాలి. వేసవికాలంలో కూడా ఇదే విధంగా స్నానం చేయాలి.  ఆస్తమా సమస్య ఉన్నవారు తీసుకునే ఆహారం ఎలా ఉండాలంటే :-  ఆస్తమా సమస్య ఉన్నవారు తినే ఆహారం కఫం లేకుండా ఉండాలి. ముఖ్యంగా పులుపు, ఉప్పు, కారం మొదలైనవి ఎంత మానుకుంటే అంత మంచిది. నూనెలో వేయించిన పదార్థాలు, దుంపలు మొదలైనవి మానుకోవాలి.  మత్తు మాదకద్రవ్యాలు, కాఫీ, టీలు, ఐస్ క్రీమ్లు చల్లని ఫ్రిజ్లో పెట్టినవి వాడరాదు. పంచదార, బెల్లము తగ్గించి వాడాలి. మలబద్దకం లేకుండా ఉండటానికి  అన్నం తక్కువ కూరలు ఎక్కువ తినాలి. దేహతత్త్యమును బట్టి ఆయా ఋతువులలో దొరికే పండ్లు వాడాలి. పాలు త్రాగాలంటే పిప్పలి, ధనియాలు శొంఠి పౌడరు చేసి డికాషన్ కలిపిన పాలు త్రాగాలి. మనం తినే ఆహారము ఎంత రుచిగా ఉన్నా చాలా తగ్గించి తినాలి. కడుపు నిండుగా అతిగా తినకూడదు. కడుపులో ఎప్పుడూ కాస్త కాళీ ఉండేట్టుగా తినాలి. ఎప్పుడూ ఆకలి కలిగిఉండాలి. చిరుతిండ్ల జోలికి వెళ్లకూడదు.  వ్యాయామము:- ప్రతిరోజూ ఉదయం స్నానం చేయగానే సూర్యనమస్కారములు చేయాలి. ఇలా  చేసినవారికి ఉబ్బసమే కాదు సమస్త వ్యాధులు నయమైపోతాయి.                                                 ◆నిశ్శబ్ద.

మలేరియా నివారణకు వ్యాక్సిన్...

ప్రపంచ ఆరోగ్య సంస్థ వద్ద ఉన్న డాటా ప్రకారం పెద్దమొత్తం లో మలేరియా ప్రభావిత ప్రాంతాలలో దాదాపు ౩౦ దేశాలలో ఉన్నాయని. వ్యాక్సిన్ ద్వారా సంవత్సరానికి 25 మిలియన్ పిల్లల సంరక్షణ చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. మలేరియా వ్యాక్సిన్ ను సూచించిన డబ్ల్యు హెచ్ ఓ యు నిసెఫ్ ద్వారా మొదటి మలేరియా వ్యాక్సిన్ కాంట్రాక్ట్ 17౦ డాలర్లు. ఫర్మా సంస్థలకు చెల్లించింది. యు ఎన్ ఏజెన్సీ సంస్థలు 18౦౦౦ డోసులు ఆర్ టి ఎస్ ఎస్ డోసులు మరో మూడేళ్ళు అందుబాటులో ఉంటాయాని సంవత్సరానికి వేల మంది పిల్లల ఆరోగ్య సంరక్షణ చేయాలనేదే లక్ష్యమని యుని సేఫ్ పంపిణీ విభాగం డైరెక్టర్ ఎట్లేవా కడిల్లీ తెలిపారు. మలేరియా వ్యాక్సిన్ మార్కర్లను అవసరమైన చోట వ్యాక్సిన్ పంపిణీ చేచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.తద్వారా మలేరియా బారిన పడకుండా మలేరియా బారిన పడకుండా మలేరియా ప్రభావం లేకుండా పిల్లలను కాపాడగలమని అభిప్రాయ పడ్డారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ వద్ద ఉన్న సమాచారం ప్రకారం మలేరియా ప్రభావిత ప్రాంతాల దేశాల సంఖ్య ౩౦ దాకా ఉండవచ్చని.౩౦ కి పైగా దేశాల్లో వ్యాక్సిన్ కు డిమాండ్ ఉందని. 25 మిలియన్ ప్రజలకు ప్రతి ఏటా సంరక్షించేందుకు కృషిచేస్తున్నట్లు వెల్లడించారు. మలేరియా వ్యాక్సిన్ ను కనుగొనేందుకు ౩5 సంవత్సరాలు పట్టిందని పరాసైట్ డిసీజ్ కు  తొలి వ్యాక్సిన్ ప్లాస్మోడియం కు వ్యతిరేకంగా పనిచేస్తుందని ప్రేసిఫేరం అత్యంత ప్రమాదకరమైన మలేరియాగా పేర్కొన్నారు దీని ప్రభావం ఆఫ్రికా దేశాలలో ఉందని తెలుస్తోంది. మలేరియా వ్యాక్సిన్ తయారీకి 18 నెలలు... మలేరియా వ్యాక్సిన్ తయారీకి 18 నెలలు సమయం పట్టిందని. చాలా శ్రమించాల్సి వచ్చిందని. మలేరియా వ్యాక్సిన్ ప్రభావ వంతంగా పనిచేస్తుందని. ప్రాధమిక స్థాయిలో వాటికి డిమాండ్ ఉండక పోవచ్చని. ఆతరువాత ఈ వ్యాక్సిన్ కు మరింత డిమాండ్ పెరిగే అవకాశం ఉత్పత్తి పెరగవచ్చని ఆశాభావం వ్యక్తం చేసారు. 2౦ 28 నాటికి సంవత్సరానికి 15 మిలియన్ల డోసులు ఉత్పత్తిచేస్తామని సంవత్సరానికి 1౦౦ మిలియన్ వ్యాక్సిన్లు అవసరం కాగల వాణి అంచనా సంవత్సరానికి ఆఫ్రికాలో 25 మిలియన్ల పిల్లలు పుడతారని వారి సంరక్షణ కు ఉపయోగ పడగలదని. ఈ స్థితిలో వ్యాక్సిన్ ఉత్పత్తి చేసే సాంకేతికతను భారాత్ ఫర్మా రంగానికి ఉందని ఇలా చేస్తే పెద్ద సంఖ్యలో వ్యాక్సిన్ ఉత్పత్తి సంవత్సరాలు పట్టవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. మలేరియాను పూర్తిగా రూపు మాపే ప్రక్రియకు శ్రీకారం చుడ దామాని ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపు నిచ్చింది.

కోడి నిద్ర ప్రమాదం సుమా!

రాత్రి వేళ సరైన నిద్ర అంటే 6 గంటలు నిద్రసరిపోతుంది. వర్తమాన కాల మాన పరిస్థితులలో ఇప్పుడు కనీసం 5 ఘంటలు నిద్రపోవడం గగనంగా మారింది నేటి ఆధునిక జీవన విధానం పనిఒత్థిడి వ్యక్తి జీవితాన్ని మార్చేస్తోంది. మీరు కనీసం 5 గంటలు నిద్రపోకుంటే దీర్ఘకాలిక వ్యాధుల ప్రామాదం పొంచిఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.4౦% ప్రజలలో రెండు లేదా మూడు దీర్ఘ కాలిక వ్యాధులతో బాధపడుతున్నట్లు గుర్తించారు.అదే 25 సంవత్చరాల పై బడ్డ వారే వీరు ఇతరులతో పోలిస్తే 7 గంటలు నిద్రపోయిన వాళ్ళే. 5గంటల కన్నా తక్కువ అంటే మాధ్య రాత్రి నిద్రపోవడం లేదా మాధ్యరాత్రి నిద్రమేల్కోవడం వంటి సమస్యల వల్ల పూర్తిగా ఆరు గంటలు నిద్రపోలేక పోతున్నారా.దీనివల్ల ఖచ్చితంగా రెండు రకాల దీర్ఘకాలిక వ్యాదులబారిన పడక తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.యునివర్సిటి కాలేజ్ అఫ్ లండన్ లోజరిగిన పరిశోదనలో చాలామంది 5 గంటలకన్నా తక్కువగంటలు నిద్ర పోతున్న వారిలో 5౦%నుండి 2౦ %ప్రజలలో దీర్ఘకాల వ్యాధులబారిన పడుతున్నట్లు నిపుణులు గుర్తించారు.4౦% మంది లో రెండు రకాల దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారని 25 సంవత్చారాలు పై బడిన వారితో పోలిస్తే 7 గంటలు నిద్రపోతున్న వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. పరిశోదన వివరాలను పి ఎల్ ఒన్ మెడిసిన్ లో ప్రచురించారు. 5౦-6౦-7౦  సంవత్చరాల వయస్సులో ఉన్నవారు  ౩౦ % నుండి 4౦ % దీర్ఘకాలిక సమస్యలు ఎదుర్కుంటున్నారని.7 గంటల కన్నా ఎక్కువ నిద్ర పోయే వారితే పోలిస్తే అనారోగ్య సమస్యలు మల్టి మార్బిడిటేస్ ను గుర్తించారు.రెండు లేదా చాలా దీర్ఘకాలిక వ్యాధులు అధిక ఆదాయం ఉన్న దేశాలలో మల్టి మార్బిడిటిస్ మధ్య వయస్కులలో రెండు రకాల అనారోగ్య సమస్యలు ప్రజా ఆరోగ్యానికి ఇది పెద్ద సవాలే అని నిపుణులు అంటున్నారు.మల్టి మమార్బి డిటీస్ ఉన్నవారు ఉన్నత ప్రమాణాలు గల వైద్య సేవలు వినియోగించాల్సి ఉంటుంది. ఒక్కోసారి మల్టి మార్బిదిటిస్ ఉండేవారిని అత్యవసరంగా ఆసుపత్రిలో చేర్చాల్సి రావచ్చుఅని డాక్టర్ పరిశోదన శాస్త్రవేత్త డాక్టర్ సబియా వెల్లడించారు. .5౦ సంవత్చారాల లోపు వారు 5 గంటలు నిద్రలేకుంటే 25% మరణానికి దారితీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.వయస్సు పెరుగుతున్న కొద్ది వారు నిద్ర పోయే అలవాట్లు నిద్ర పోయే పద్దతులలో మార్పులు వస్తాయి.అంటే దాదాపు 7 గం--8 గం --రాత్రి నిద్రపోవాలి 5 గం తక్కువ ఉన్నవారు లేదా 5 గం కన్నా తక్కువ నిద్ర పోయినా అంతకన్నా ఆ తరువాత నిద్రపోయిన వారిలో దీర్ఘ కాలిక వ్యాధులు వస్తాయని డాక్టర్ సబియా వరించారు. పరిశోధకులు సహజంగా ఇద్దరూ ఎంత సేపు నిద్రపోయారు. మల్టి మార్బిదిటిస్ ఉంటె మరణాల శాతం గుండెజబ్బులు క్యాన్సర్ డయాబెటిస్ వంటి సమస్యలు 25 సంవత్చరాలు పై బడిన వారిలో వస్తాయి అని నిపుణులు పరిశోదన వివరాలలో పేర్కొన్నారు.చేసిన పరిశోదన ఎంతసేపు ప్రభావవంతంగా నిద్రపోగలుగుతున్నారు. పరిశోదన 7,౦౦౦ మంది పురుషులు 5౦--6౦ --7౦ సంవత్చరాలు ఉన్నవారి మధ్య పరిశోదన 1985 నుండి 1988 సంవత్చారాల మధ్యలో 14,౩౦8 మంది ప్రజల ప్రజల ప్రభుత్వ సేవలు చేసేవారిలో ౩5 నుండి --55 సం --మధ్యవయసులో ఉన్నవారిలో ౩/2%పురుషులు కాగా 1/౩% మంది స్త్రీలు ఉన్నారని పరిశోధకులు వెల్లడించారు.కొందరు అదే పనిగా నిద్రపోతే ఇంకొందరు అసలు నిద్ర పోరు. అసలు రాత్రి కనీసం ఒక్క ఐదు గంటలు అయినా నిద్ర పోనివాళ్ళు చాలామందే ఉంటారు. ఇంకొందరు షార్ట్ స్లీప్ కొద్ది సేపు కోడి నిద్ర పోయినట్లు పొతూ ఉంటారు. అలా ప్రతిరోజూ నిద్రభంగానికి గురిఅవుతూ ఉంటారో వారు మల్టి మార్బిడిటీ ఉన్నవారు రాత్రి సంపూర్ణంగా నిద్రపోవాలి. ఆరోగ్యంగా ఉండాలంటే నిద్ర తప్పనిసరి నిద్రపోయే ప్రదేశం ప్రశాంతంగా ఉండాలి.  చీకటి లేకుండా ప్రకాశ వంతంగా ఉండాలి. నిద్రపోయేముందు కాస్త వేడిగా ఉండాలి.ఎలాక్త్రానికి డివైస్ ను తొలగించాలి. నిద్రపోయే ముందు ఎక్కువ ఆహారం తీసుకోకూడదు. శరీరానికి వ్యాయామం రాత్రి పగలు వెలుతురు ఉండాలి లేదా లైట్ ఉండే విధంగా ఉండాలని మీరు నిద్రపోవాలంటే ఇవి తప్పనిసరి సుదీర్ఘ నిద్ర పోవాలని అంటే 9 గంటలు నిద్రపోయే వారు ఆరోగ్యంగా ఉన్నట్లు గుర్తించారు. దీర్ఘకాలం నిద్రపోఎవల్లలో మల్టి మార్బిడిటీ 5౦ సంవత్చరాలు పై బడిన  వారిలో లేదు.నిద్ర మన ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపుతుందని వాస్తవానికి 4,౦౦౦ మందిపై నిర్వహించిన ఎలెక్ట్రోనిక్ మేజర్ మెంట్ ద్వారా నిర్ధారించినట్లు పరిశోధకులు వెల్లడించారు.ఉద్యోగులు వారు ఆరోగ్యంగా ఉండచ్చు ఇతరులకన్న ఆరోగ్యంగా ఉండచ్చు అని నిర్ధారించారు.               

యోగా చేయండి గుండెపోటు నుండి కాపాడుకోండి...

 చలికాలం లో గుండె పోటు  నుండి కాపాడుకోండి. చలికాలం లో గుండె పోటు రాకుండా రక్షించ బడాలంటే  తప్పకుండా వ్యాయామం లేదా యోగ చేయాలి. అంటున్నారు నిపుణులు. గుండె సమస్యతో బాధ పడే వారు చలికాలం లో ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చాలా మంది నిపుణులు శాస్త్రజ్ఞులు గుండె పై చేసిన పరిశోదనలో తెలిసిన రహస్యం ఏమిటి  అంటే చల్లటి వాతావరణం లో గుండె పోటు వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయని  ఈ వ్యాసం లో నిపుణులు సూచిస్తున్నారు. సహజంగా రోజుకి అరఘంట పాటు నడిచిన చాలని, అలాగే చిన్న పాటి వ్యాయామం చేసినముఖ్యంగా యోగా చేయడం ద్వారా ఎలాంటి సమస్య నుండి అయినా రక్షించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.చలికాలం లో ఎండవేడిమి తగ్గడం వల్ల  శరీరం లో రక్త ప్రవాహం సరిగా లేక రక్త నాళాలు కుంచించుకు పోతాయి. దీనిఫలితంగా బిపి  తో పాటు కొలస్ట్రాల్ పెరిగే అవకాశాలు ఉన్నాయి.ఈ పరిస్థితిలో చలికాలం లో గుండె సమస్యలు  ఉన్న వారు తమ ఆహారం లో అప్రమత్తం గా ఉండాలని వ్యాయామం తో పాటు యోగ సాధన చేయాలని. యోగా ప్రాణా యామం కలిపి చేయడం ద్వారా శరీరం మనసు,ఆత్మ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఏదైనా యోగా నిపుణులైన గురువుల సమక్షం లో యోగ సాధన చేస్తే గుండె పోటు వంటి వి జీవన శైలి సంబందించిన సమస్యలు నిలువరించవచ్చు.హార్ట్ అట్టాక్ ను నివారించ వచ్చు మూడురకాల యోగా పద్దతులు ఆసనాలు తప్పనిసరిగా చేయాల్సిందే ముందుగా యోగ చేసే పద్దతులు విధివిధానం,సాధన చేయాలి,అలాగే వజ్రాసనం,పవన ముక్తాసనం, మండూక ఆ సనం, వంటివి సాధన చేస్తే రక్త ప్రసారం సరిగా జరిగి గుండె పోటును నివారించవచ్చు.  మాండుకాసనం.... యోగ సాధనకు ముందు వజ్రాసనం లో కూర్చోవాలి.దీనిని వజ్రాసన ముద్ర అని అంటారు.మన శరీరంలో ని మోకాళ్ళ పై కూర్చుని వేసే సులభమైన ముద్ర.ఆ తరువాత మీ చేతుల లోని నాలుగు ఉంగరాల లోని లోపలి భాగాలను బాగా నొక్కండి. పిడ్ఫికిలిని మీ మొక్కకు రెండు వైపులా ముందుకు వంగండి.మీ పిడికిలి తో మీ నాభి భాగాన్ని నొక్కడం ప్రారంభించండి. మీ పొట్టను ఎంతవరకూ వీలైతే అంతనిలివుగా ఉంచండి.ఒంగిన తరువాత ముందుకు చూడండి.ఈ ముద్రలో మీ ఊపిరి ని బయటికి పంపండి.ఇలా కొంత సేపు చేయండి.ఇది కొంతమేర మీరు ఉపసమనం  కలిగిస్తుంది. ఈ ముద్రనుండి బయటికి వచ్చే టప్పుడు స్వాస తీసుకోండి.మీ వెనుక వైపు నుక్కును మోకాళ్ళ పైన  మెల్లగా పైకి తీయండి మీ చేతులను మీ భుజాల పైకి తీసుకోండి.మరల యధాస్థితికి రండి.                 

మైగ్రేన్ గురించి చాలామందికి తెలియని విషయాలివే!

చాలామంది తరచుగా తలనొప్పి అంటూ ఉంటారు. అయితే సాధారణ తలనొప్పి కంటే మైగ్రేన్ చాలా పెద్ద సమస్య. . మైగ్రేన్ నొప్పి చాలా డిస్టర్బ్ చేస్తుంది. తలనొప్పి లైటింగ్ చూసినా,  శబ్దాలు విన్నా భరించలేకపోవడం, వికారంగా అనిపించడం ఈ సమస్య తీవ్రతను  మరింత పెంచుతుంది. అయినప్పటికీ, చాలా సందర్భాలలో, మైగ్రేన్ అటాక్ కొన్ని గంటల్లోనే తగ్గిపోతుంది. కానీ తీవ్రమైన మైగ్రేన్ సమస్యలు ఉన్నవారిలో, తీవ్రమైన పరిస్థితులు ఎదురవుతాయి.  మైగ్రేన్ అనేది ఒక రకమైన సైకోసోమాటిక్ డిజార్డర్ అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అంటే మానసిక ఆరోగ్య సమస్య కారణంగా ఇది జరుగుతుంది. అందువల్ల, తరచుగా మైగ్రేన్లు ఉంటే, చాలా శ్రద్ధ, దీనికి మెరుగైన చికిత్స అవసరం అవుతుంది. కొన్ని సందర్భాల్లో, మైగ్రేన్ దాడి ప్రాణాంతక సమస్యలను కూడా కలిగిస్తుంది. మైగ్రేన్  గురించి చాలామందికి తెలియని విషయలేంటంటే.. మైగ్రేన్ ఇన్ఫార్క్షన్..  దీనిని మైగ్రేన్ స్ట్రోక్ అని కూడా పిలుస్తారు, ఇది మహిళల్లో ఎక్కువగా కనిపించే అరుదైన సమస్య. మైగ్రేన్ తలనొప్పితో పాటు ఇస్కీమిక్ స్ట్రోక్ వచ్చినప్పుడు, దానిని మైగ్రేన్ స్ట్రోక్ అంటారు. మెదడులోని రక్తనాళం నిరోధించబడినప్పుడు, రక్త ప్రసరణను ఆగిపోయినప్పుడు ఇస్కీమిక్ స్ట్రోక్ వస్తుంది. . మైగ్రేన్ స్ట్రోక్ అకస్మాత్తుగా రావచ్చు, అత్యవసర పరిస్థితి కాబట్టి తరచుగా మైగ్రేన్ వస్తూ ఉంటే, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించడానికి చర్యలు తీసుకోవాలి. స్ట్రోక్ అనేది ప్రాణాంతక సమస్యగా మారుతుంది.. మైగ్రేన్ వల్ల మూర్ఛ సమస్య చాలా అరుదుగా అయినా.. మైగ్రేన్ కూడా మూర్ఛ సమస్యను కలిగిస్తుంది. తీవ్రమైన మైగ్రేన్లు మెదడును దెబ్బతీస్తాయని, దీనివల్ల  మూర్ఛ వచ్చే ప్రమాదం ఉందని పరిశోధకులు కనుగొన్నారు. మరొక విషయం ఏమిటంటే,. మూర్ఛ సమస్యలు ఉన్నవారికి మైగ్రేన్ వచ్చే అవకాశం ఎక్కువ. అందుకే మైగ్రేన్ నుండి తమను తాము కాపాడుకోవడం చాలా ముఖ్యం. మానసిక ఆరోగ్య సమస్యలు ఇతరులకన్నా మైగ్రేన్‌ వచ్చే వ్యక్తులు ఒత్తిడి, డిప్రెషన్‌కు తొందరగా  గురయ్యే అవకాశం ఉంది. కొన్నిసార్లు మైగ్రేన్ డిప్రెషన్ లేదా యాంగ్జయిటీ వల్ల కూడా రావచ్చు. ఇది కాకుండా మైగ్రేన్ నొప్పి, అసౌకర్యం కూడా నిద్ర సంబంధిత సమస్యలను పెంచుతుంది. తీవ్రమైన మైగ్రేన్ ఎక్కువగా అటాక్ ఇస్తున్నవారిలో నిద్రలేమి ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.  నిద్ర సరిగా లేకపోతే అది కూడా డిప్రెషన్‌కు కారణమవుతుంది.                                      ◆నిశ్శబ్ద.

పాలు మధుమేహం ప్రమాదాన్ని తగ్గిస్తాయా? అసలు నిజం ఏంటి?

ప్రస్తుత కాలంలో చాలామందిని వేధిస్తున్న సమస్య మధుమేహం. ఆందరినీ ఆందోళనకు గురి చేసే విషయం ఏమిటంటే యువత కూడా దీనికి బాధితులుగా మారుతున్నారు. ఎలివేటెడ్ షుగర్ లెవెల్స్ శరీరంలోని మూత్రపిండాలు, నరాలు, కళ్ళు వంటి ఎన్నో అవయవాలను దెబ్బతీస్తాయి.  అలాగే అనేక రకాల ఇతర దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని పెంచుతాయి. అందుకే మధుమేహం నియంత్రణ మీద దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.  కుటుంబంలో ఎవరికైనా ఇప్పటికే మధుమేహం ఉంటే, ఆ కుటుంబ సభ్యులు మరింత అప్రమత్తంగా ఉండాలి. అయితే అందరినీ షాకింగ్ గా అనిపించే విషయం ఏమిటంటే.. క్రమం తప్పకుండా పాలు తీసుకుంటే మధుమేహం వచ్చే ప్రమాదాన్ని తగ్గించవచ్చు. పాలకు డయాబెటిస్ రిస్క్ తగ్గుతుందా? మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ ఫుడ్ డైట్ ప్లాన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. తీసుకునే ఆహారం  రక్తంలో చక్కెర స్థాయిని త్వరగా పెంచుతాయి. అయితే పాలను సంపూర్ణ ఆహారంగా పరిగణిస్తారు. పాలు, ప్రోటీన్లు, కాల్షియం, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఇతర ముఖ్యమైన పోషకాలతో సమృద్ధిగా ఉండటం వల్ల ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది. అయితే పాలు తాగడం వల్ల టైప్ 2 డయాబెటిస్ ప్రమాదం తగ్గుతుందనేది ఇప్పుడు బయటపడిన కొత్త విషయం. పాలు, పాల ఉత్పత్తులు మెటబాలిక్ సిండ్రోమ్, స్థూలకాయం, అధిక రక్తపోటును నివారిస్తాయి.  మధుమేహం ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయని పరిశోధనలు వెల్లడించాయి. తక్కువ కొవ్వు కలిగిన పాల ఉత్పత్తులు మరింత ప్రయోజనకరంగా ఉంటాయి. పాలు, పెరుగు రెండూ మెటబాలిక్ సిండ్రోమ్, టైప్-2 మధుమేహం నుండి ఆరోగ్యాన్ని కాపాడటంలో సహాయపడతాయి. పాలు కాల్షియం, ప్రోటీన్ రెండింటికీ అద్భుతమైన మూలం. కాబట్టి ప్రతి ఒక్కరూ దానిని ఆహారంలో చేర్చుకోవడం చాలా ముఖ్యం. క్యాల్షియం, ప్రొటీన్లు రెండూ పెరుగుతున్న పిల్లలకు మహిళలకు అవసరయ్యేవే. పాలలో ఇవి పుష్కలంగా ఉండటం వల్ల పాలుచాలా ఉపయోగకరం. పాలు తీసుకోవడం అలవాటు చేసుకోవడం వల్ల శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడంతో పాటు దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. ◆నిశ్శబ్ద.

బరువు తగ్గాలని అనుకునేవారికి గుడ్ న్యూస్.. ఇలా చేస్తే ఎంతో ఈజీగా..

శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే బరువు తగ్గడం చాలా ముఖ్యం. బరువు పెరిగేకొద్దీ అనేక వ్యాధుల బారిన పడవచ్చు. అధిక బరువు రక్తపోటు నుండి మధుమేహం, ఇంకా కొన్ని రకాల క్యాన్సర్ల వరకు అన్నింటికీ ప్రధాన కారణమవుతుంది. పరిగా ధికా బరువు ఉంటే తమ పనులు తాము చేసుకోవడంలో చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అందుకే అధిక బరువును వదిలించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ ఆశించిన ఫలితం పొందేవారు తక్కువే. కానీ బరువు తగ్గడం చాలా సులభం అనే విషయం మీకు తెలుసా??  బరువు తగ్గడం ఈజీ అంటున్నారేంటి పిచ్చా?? అని నిందించాల్సిన పనిలేదు. నిజంగానే బరువు తగ్గడం సులువు. అయితే విషయమంతా బరువు తగ్గడానికి పాటిస్తున్న విధానాలలోనే ఉంది.  చాలామంది బరువు తగ్గడానికి ఫుడ్ స్కిప్ చేయడం నుండి జిమ్‌లో గంటలు గడపడం వరకు ఎన్నో చేస్తారు. కానీ వీటి వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. అందుకే సరైన పద్ధతులను శ్రద్ధగా పాటించడం చాలా ముఖ్యం. ఇది బరువు పెరగకుండా నిరోధించడమే కాకుండా ఇతర శరీరక ప్రయోజనాలను కూడా  చేకూరుస్తుంది. బరువు తగ్గాలని అనుకునేవారు అసలు బరువు ఎందుకు పెరుగుతున్నాం అనే విషయం గురించి ఆలోచించాలి.  రోజువారీ చేసే పనులు ద్వారా ఖర్చయ్యే దానికంటే ఎక్కువ కేలరీలు తీసుకుంటే, అది బరువు పెరగడానికి కారణమవుతుంది. అంటే మొదట బరువు పెరగకుండా నియంత్రించాలి. ఎప్పుడైతే బరువు పెరగడం ఆగుతుందో అప్పుడు బరువు తగ్గడానికి చేసే ప్రయత్నాలు పనిచేయడం మొదలుపెడతాయి. రోజు ఏమి తింటున్నారు?? ఎంత పని చేస్తున్నారు?? శారీరక శ్రమ ఎంత ఉంది??. వ్యాయామం వల్ల ఎలాంటి మార్పులు వస్తాయి.. ఇవన్నీ గమనించుకోవడం చాలా ముఖ్యం.  సాధారణంగా బరువు తగ్గాలని అనుకునేవారు ఆహారంలో కేలరీలు తగ్గుతాయి అనే భ్రమతో తిండి తగ్గిస్తుంటారు. దీనివల్ల ప్రయోజనాలు చేకూరకపోగా ఇతర ఆరోగ్య సమస్యలు కారణం అవుతుంది.  కాబట్టి బరువు తగ్గాలి అంటే కేలరీలు తక్కువ ఉండి, కడుపు నింపే ఆహారాలు తీసుకోవాలి. దీనీవల్ల శరీరంలో  కేలరీలు పేరుకుపోవు, అధికబరువు క్రమంగా తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఇందుకోసం రోజులో తీసుకునే చక్కెర-తీపి పానీయాలు, బేకరీ ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్ వంటివి తగ్గించుకోవాలి. వీటికి బదులు సలాడ్స్, పండ్లు, పండ్ల రసాలు తీసుకోవాలి. ఇవి బరువు తగ్గించుకోవడానికి  ప్రయోజనకరంగా ఉంటాయి. వ్యాయామం తప్పనిసరి.. బరువు తగ్గడానికి ఎన్ని పద్ధతులు ఫాలో అయినా వాటికి జతగా వ్యాయామం ఉండాల్సిందే. ఇది బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది. కేలరీలు పొదుపుగా తీసుకుంటూ ఒంట్లో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ను కరిగించడం వల్ల బరువు చాలా ఈజీగా తగ్గుతారు. ఆహార మార్పుల ద్వారా మాత్రమే బరువు తగ్గడం సాధ్యం కాదు. బరువు తగ్గడానికి అందుబాటులో  ఉన్న మరొక గొప్ప  మార్గం యోగ. ప్రతిరోజు యోగ చేస్తూ డైట్ ఫాలో అయితే బరువు తగ్గడం చూసి ఎవరికి వారు ఆశ్చర్యపోతారు.  కాబట్టి ఆహారంలో కేలరీలు తగ్గించడం, వ్యాయామం చేస్తూ కొవ్వును కరిగించడం, డైట్ మెనూ ఫాలో అవ్వడం ఇవి పాటిస్తే అద్బుతమే..                               ◆నిశ్శబ్ద.

గుట్కా తింటే గుటుక్కే!

నోటి క్యాన్సర్... తల మెడ భాగాలకు వచ్చే క్యాన్సార్ లలో నోటి క్యాన్సర్ ముఖ్యమైనది.నోటి లోపలి భాగాన్ని ఓరల్ కావిటి అంటారు. నోటి వెనుక గొంతు పై భాగాన్ని ఓరో ఫారింక్స్ అంటారు. నోటి క్యాన్సర్ రానే కూడదు కాని వచ్చిందంటే మాత్రం చాలా త్వరగానే అతి ప్రమాదకరం గా పరిణమిస్తుంది. అసలు నోటి లోపలి భాగాలు ఏమిటి. *పెదాలు ,దంతాలు, చిగుళ్ళు. *పెదాల లోపలి పోర,బుగ్గల లోపలి పోర. *నాలుకకింది నోటి అడుగు భాగం. *నోటి పై భాగం అంగుటి. *జ్ఞాన దంతాల వెనుక ఉండే స్వల్ప భాగం. గొంతు పై భాగాన ఉండే ఒరోఫర్యర్ లో కింది భాగాలు ఉంటాయి. *నాలుక వెనుక మూడోవంతు భాగం. *మెత్తటి అంగుటి. *టాన్సిల్. *ఓరో ఫారింక్స్  నోటి క్యాన్సర్ నోటిలో ఎబాగామైనా రావచ్చు. సాధారణంగా నాలుకమీద లేక నాలుక కింద గాని క్యాన్సర్ ప్రారంభ మౌతుంది.దాదాపు నోటి క్యాన్సర్లు అన్ని కూడా నోరు, పెదాల పై భాగం పొరల లోని చదును కణాలు ఫ్లాట్ సెల్ల్స్ స్కుమౌస్ కణాలు నుండి మొదలు అవుతాయి.అందుకు నోటి క్యాన్సర్స్ ను స్కుమౌస్ సెల్ కార్సినోమా గా వ్యవహరిస్తారు.సాధారణంగా నోటి క్యాన్సర్ ఇతర శరీర భాగాలకు వ్యాపించడం లింఫ్ వ్యవస్థ ద్వారా జరుగుతుంది. లింఫ్ నోడ్స్ లోకి ప్రవేశించిన క్యాన్సర్ కణాలు వాటిలో స్వాచమైన నీటిలా ఉండే లింఫ్ ద్రవం ద్వారా ఇతర శరీర భాగాలకు వెళ్లి అయాభాగాలకు క్యాన్సర్ ను వ్యాపింప చేస్తాయి.  నోటి క్యాన్సర్ లక్షణాలు... నోటి క్యాన్సర్ సాధారణంగా తెల్లటి మచ్చతో ప్రారంభ మౌతుంది. దీనిని ల్యుకో ప్లేకియా లేక చిన్న గడ్డతో కూడా ప్రారంభం కావచ్చు.ఈ మచ్చ లేదా గడ్డ వద్ద నొప్పి అంటూ ఏమీ ఉండదు కానీ ఒక్కోసారి మంట పెడుతూ ఉంటుంది.గడ్డ పెరిగి కొన్నాళ్ళకి పుండుగా తయారయి లేదా డని చుట్టూ భాగం గట్టిగా ఏర్పడి గద్దమధ్య పగిలి అక్కడ నుంచి రక్తం కారడం,కణితి పక్క కణజాలం భాగాలకు వ్యాపించడం జారుతుంది ఈ విషయాన్ని పరిసీలించాకుంటే తెలియదు. నోటి క్యాన్సర్ కు కారణాలు... నోటి క్యాన్సర్ కొందరికి ఎందుకు వస్తుంది. కొందరికి ఎందుకురాడు.అన్న ఖచ్చితమైన సమాధానం అంటూ లభించదు.అయితే నోటి క్యాన్సర్ అంటు వ్యాధి కాదు.ఈ కింది అలవాట్లు ఉన్న వారికి నోటి క్యాన్సర్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయాని పరిశోదనలు చెపుతున్నాయి. పొగాకు... నోటి క్యాన్సర్ రావడానికి ఎక్కువ సందర్భాలలో పొగాకు ప్రాధాన కారణంగా ఉంటుంది.చుట్ట,బీడీ,సిగరెట్, పైపు,సిగార్ హుక్కా,గుట్కా పొగాకు సేవనం నస్స్యం పీల్చడం మొదలైన పొగాకు సంబందమైన అలవాట్లు కూడా నోటి క్యాన్సర్ రావడానికి కారణాలుగా నిపుణులు నిర్ధారించారు.ముఖ్యంగా దీర్ఘకాలం పాటు అతిగా పొగతాగే వారికి మద్యం తాగే వారికి రిస్క్ మరింత ఎక్కువగా ఉంటుందని మాద్యం పోగాతాగాడం రెండు అలవాట్లూ కలిసి ఉండడం అదీ అధికంగా ఉన్నవాళ్ళకు నోటి క్యాన్సర్ తేలికగా వస్తుంది.ఇక్కడ గమనించాల్సిన విష్యం ఒకటి ఉంది శ్రీకాకుళం జిల్లలో కాలుతున్న చుట్టభాగాన్ని నోటిలో పెట్టుకుని పొగాకు సేవించడం ఒక ఆన వాయితీగా ఉంది వీళ్ళు నోటిక్యాన్సర్  వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని దీనిని చుట్ట క్యాన్సర్ గా పేర్కొన్నారు. మధ్యం... మధ్యం ముట్టని వల్ల కంటే మధ్యం తాగే వారికి నోటి క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ మాధ్యమం ఎంత ఎక్కువ తాగితే అంత ఎక్కువ పరిమాణం  ఉంటుందనిరిస్క్ అంతే ఎక్కువ.మాద్యం పొగాకు రెండూ అలవాట్లూ కలిసి ఉంటె నోటి క్యాన్సర్ త్వరగా వస్తుంది. అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వైరస్ ఇన్ఫెక్షన్లు... హ్యూమన్ పాపిలోమా వైరస్ ఒకరేఅకమైన వైరస్ మూలంగా నోరు గొంతు క్యాన్సర్ కలగ వచ్చు. లైంగిక కలాపాల వల్ల సంక్రమించే వైరస్ లు నాలుక అడుగుభాగాన గొంతు వెనుక భాగాన టాన్సిల్స్ కి మెత్తటి అంగిటి వచ్చే క్యాన్సర్లు ఎక్కువగా హెచ్ పి వి ఇన్ఫెక్షన్ల మూలంగానే వస్తాయి. వక్కపొడి కిళ్ళీ నమలడం వంటి అలవాటు ఉన్న వాళ్ళకి రిస్క్ మరింత ఎక్కువ ఉంటుంది క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయన్నది దీని ఆర్ధం. క్యాన్సర్ చికిత్చ... నోటి క్యాన్సర్ చికిత్చ ప్రారంభ దశలో గుర్తిస్తే రోగికి సర్జరీ ద్వారా రేడియో తెరఫీ ద్వారా కాని చికిత్చ చేస్తారు.క్యాన్సర్ ముదిరితే పరిస్థితిని బట్టి కొన్ని సందర్భాలలో రేడియో తెరఫీ,లేదా కీమో తెరఫీ తార్గేతేడ్ తెరఫీ వంటి చికిత్చాలు చేస్తారు.మీ అలా వాట్లే మీనోటి క్యాన్సర్కు కారణం గా మారచ్చు.        అస్సాం లో పెరుగుతున్న నోటి క్యాన్సర్ బాదితులు.. గౌహతికి చెందినా బి బి సి ఆసుపత్రిలో 56 మంది రోగులకు ఓరల్ మౌత్ క్యాన్సర్ చికిత్చ చేసారు. అదీ 25 సం వత్చరాలనుండి 4౦ సం వత్చరాల వయసు ఉన్నవారు కావడం ఆందోళనకలిగిస్తోంది. అని నిపుణులు అంటున్నారు.ఇది ప్రామాడ ఘంటికలు మొగిస్తోందని నోటిలో వచ్చే కేవిటి నోటి క్యాన్సర్ సహజంగా గుర్తించ వచ్చు సహజంగా 6౦ సంవత్చరాలు వయసు పై బడిన వారిలో రెండు సంవత్చారాల్ క్రితం చూసేవారమని ఇప్పుడు 4౦ సంవత్చారాల లోపు ఉన్న వారిలో నోటి క్యాన్సర్ కేసులు అధికసంఖ్యలో పెరగడం పై అమ్కాలజిస్ట్ లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అత్యధికంగా పొగాకు సేవించడం ప్రాధాన కారణంగా యువత అలాగే గుట్కా కు అలవాటు పడడం క్యాన్సర్ కు కారణం. 2౦21 నాటి గణాంకాల ప్రకారం నార్త్ ఈస్ట్ లో అతిపెద్ద ఆసుపత్రి కి చెందిన క్యాన్సర్ నిపుణుడు డాక్టర్ బారు క్యాన్సర్ ఆసుపత్రి లో 56 మంది 25 సంవత్చారాల రోగులకు నోటి క్యాన్సర్ కు చికిత్చ ను డాక్టర్ నిర్వహించారు.మణి శ్రీ వ కృష్ణ త్రేయ వైద్య క్య్న్సర్ విభాగం ఎపిడమాలాజి యువతలో  క్యాన్సర్ కేసులు పెరగడాన్ని గుట్కాలు  నమలడం ప్రేస్టేజి గా తీసుకుని మరీ పోటి పది తినడం  ఒక కారణంగా పేర్కొన్నారు.అందులో నూ 25 ---4౦ సం మధ్య అస్సాం ఇతర ఉత్తరదేశంలోని రాష్ట్రాలలోని వారే అని నోటి క్యాన్సర్ రోగులు గుట్కా వాడకం వల్లే మరియు పొగాకు ఉత్పత్తుల్లో క్యాన్సర్ కు కారాణం గుట్కా ఇతరాపోగాకు ఉత్పత్తులు ఎక్కువగా యుక్త వయస్సులో ఉన్న వారే అని అంటే టీనేజ్ ఉంటున్నారని క్రిష్ణవర్మ తెలిపారు. ఇందులో ౩8 మంది పురుషులు 18 స్త్రీలు నోటి క్యాన్సర్ బారిన పడ్డ వారిలో 5 గురు మాత్రమే ప్రాధమిక స్థాయి లో ఉన్నవారే అని ఎక్కువ సంఖ్యలో ముదిరిపోయిందని.ఇతర క్యాన్సర్ల లాగానే ముదిరి పోయిందని చాలాకాలంగా ఉంది ఉండవచ్చని కృష్ణ అన్నారు.క్యాన్సర్ అవగాహన కార్యక్రమం లో భాగంగా పలువురు ప్రముఖులు కార్క్రమం లో పాల్గొని క్యాన్సర్ గుర్తించిన వెంటనే సత్వర చికిత్చ చేసుకోవాలని. ఇప్పటికే భారత్ లో 1.6 మిలియన్ల అంటే దాదాపు 1౦ లక్షల క్యాన్సర్ కేసులు సంవత్చారానికి పెరుగుతున్నాయని భగవతి ఆందోళన వ్యక్తం చేసారు అస్సాం చుట్టుపక్కల ప్రాంతాలలో ౩8,౦౦౦ కొత్త కేసులు ప్రతి సంవత్చారం గుర్తిస్తున్నారు.                              

విటమిన్-సి లోపం వచ్చిందని గుర్తుపట్టడం ఎలా?

శరీరాన్ని ఆరోగ్యంగా,  ఫిట్‌గా ఉంచుకోవడానికి, ఆహారంలో పోషకాలు బాగా తీసుకోవాలి.  మనం తీసుకునే ఆహారం శరీరంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. పౌష్టికాహారాన్ని ఎక్కువగా తీసుకునే వ్యక్తులకు  తక్కువ అనారోగ్య సమస్యలు వస్తాయి.  ఆరోగ్యకరమైన, పోషకమైన ఆహారం శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇది వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడుతుంది.  ఇందుకోసం విటమిన్-సి అవసరం. సమతులాహారం తీసుకుంటే శరీరానికి కావల్సిన విటమిన్-సి సులువుగా అందుతుంది. కానీ చాలామంది సమతులాహారం తీసుకోరు. అందుకే అనారోగ్యాలు తొందరగా వచ్చేస్తున్నాయి.  విటమిన్-సి శరీరానికి ఎలా మేలు చేకూరుస్తుందంటే.. విటమిన్ సి ని ఆస్కార్బిక్ యాసిడ్ అని కూడా పిలుస్తారు, ఇది శరీరంలో యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి కణాలను రక్షించడంలో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఆహారం ద్వారా విటమిన్-సిని పొందడం ద్వారా శరీర రోగనిరోధక శక్తిని సులభంగా పెంచుకోవచ్చు. కణాలను రక్షించడంలో వాటిని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడటమే కాకుండా, చర్మం, రక్త నాళాలను ఆరోగ్యంగా ఉంచడానికి కూడా ఇది అవసరం. విటమిన్ సి లోపిస్తే.. శరీర రోగనిరోధక శక్తికి విటమిన్-సి చాలా అవసరం కాబట్టి, అది లోపిస్తే, అంటు వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. ఆహారంలో పోషకాహారం లేని వ్యక్తులలో విటమిన్ సి లోపం ఎక్కువగా ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా, డయాలసిస్ చేయించుకునే కిడ్నీ వ్యాధి ఉన్నవారు, ఎక్కువగా ఆల్కహాల్ తీసుకునే వ్యక్తులు కూడా విటమిన్ సి లోపంతో బాధపడుతుంటారు. ధూమపానం చేసినప్పుడు ఏర్పడే ఫ్రీ రాడికల్ డ్యామేజ్‌ను తిరిగి సాధారణం చేయడానికి  ప్రతిరోజుకు అదనంగా 35 మిల్లీగ్రాముల విటమిన్ సి అవసరం అవుతుంది.  విటమిన్ సి  లోపం ఉందని ఎలా తెలుసుకోవాలంటే.. విటమిన్-సి లోపం వల్ల శరీరంలో అనేక దుష్ప్రభావాలు కలుగుతాయి. పెద్దలలో, విటమిన్ సి లోపం యొక్క లక్షణాలు వారాల నుండి నెలల వరకు డవలప్ అవుతాయి.  దీని కారణంగా బలహీనత, అలసట, చిరాకు, బరువు తగ్గడం, గాయాలు సరిగా మానకపోవడం, తరచుగా ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం వంటివి జరుగుతాయి. విటమిన్-సి లోపం వల్ల స్కర్వీ వ్యాధి వస్తుంది. ఇతర వ్యక్తుల కంటే ఎక్కువగా అనారోగ్యానికి గురైతే, ఇది విటమిన్-సి లోపానికి కూడా సంకేతం. విటమిన్ సి  ఎలా పొందాలంటే.. విటమిన్-సి కోసం, ఆహారంలో చాలా సులభమైన మార్పు చేసుకోవచ్చు. నారింజ, నిమ్మ వంటి సిట్రస్ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది కాకుండా, నల్ల మిరియాలు, స్ట్రాబెర్రీ, బ్రోకలీ, కివి, పైనాపిల్ మొదలైన వాటిని కూడా సులభంగా నెరవేర్చడానికి ఉపయోగించవచ్చు. తీసుకునే ఆహారంలో ఇవి తప్పక ఉండేలా చూసుకుంటే విటమిన్ సి లోపాన్ని అధిగమించవచ్చు.                                   ◆నిశ్శబ్ద.

ప్యాక్డ్ జ్యూసుల గుట్టేంటో తెలిస్తే విస్తుపోతారు!

శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి పండ్లు, పండ్ల రసాలు చాలా మంచివని వైద్యులు చెబుతారు. ఆరోగ్యం మీద అంతో ఇంతో స్పృహ ఉన్నవారు కూడా పండ్లు, పండ్ల రసాల మీద ఆసక్తి చూపిస్తారు. చాలామంది పండ్లు తినడం కంటే పండ్ల రసాలు తీసుకోవడానికే మొగ్గు చూపుతారు. కానీ పండ్ల రసాలు తయారు చేసుకోవాలంటే బద్దకం వల్లా, అవి చేసుకునేంత సమయం లేకపోవడం వల్ల బయట దొరికే వాటికి ప్రాధాన్యత ఇస్తారు. బయట ప్యాక్ చేయబడిన జ్యుస్ ప్యాకేట్స్, బాటల్స్ మీద కూడా 100% ప్యూర్ అనే మాటను చూసి అవన్నీ ఆరోగ్యమే అనే ఆలోచనతో వాటిని బాగా కొని తాగుతూ ఉంటారు. అయితే  ప్యాకేజ్డ్ జ్యూస్‌ల ఎక్కువ కాలం నిల్వ ఉంచడానికి వాటిలో కొన్ని రకాల ప్రిజర్వేటివ్‌లు, కృత్రిమ చక్కెరలు ఉంటాయి.  ఇవి అనేక విధాలుగా హాని చేస్తాయి.  జ్యూస్ ల ద్వారా ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవాలని అనుకుంటే తాజా పండ్ల రసాన్ని మాత్రమే తీసుకోవడం ఉత్తమం. పిల్లలు, పెద్దలు కూడా బయటకెళ్లినప్పుడు పండ్ల రసాన్ని ఇష్టపడతారనడంలో సందేహం లేదు, ప్యాక్‌డ్ జ్యూస్‌లు శరీరానికి మేలు చేస్తాయని అనుకుంటాం కానీ నిజానికి దాని వల్ల మనం అనుకున్నంత ప్రయోజనం ఉండదు.  ప్యాకేట్స్, బాటల్స్ అందంగా కనబడుతూ ఆకర్షిస్తాయి, ఇక ఏ సెలబ్రిటినో వాటిని ప్రమోట్ చెడితే కొనుగోళ్లు జోరందుకుంటాయి. అయితే ఈ జ్యుస్ లు ముమ్మాటికీ హాని చేసేవే..  100% నిజమైన జ్యూస్‌ అంటూ ప్యాకేజ్డ్ జ్యూస్‌లు అమ్ముడవుతున్నాయి. అవన్నీ కూడా ఆమోదం తెలిపినవే అని, తక్షణ శక్తిని ఇస్తాయని ఎన్ని కబుర్లు చెప్పినా వాటిలో చక్కెర, రంగు, రసాయనాలు తప్ప ఇంకేమి ఉండదు.  చాలా వరకు ప్యాకేజ్డ్ పండ్ల రసాలలో ఆర్సెనిక్, సీసం వంటి రసాయనాలు ఉంటాయి.  ఇవి చాలా తీవ్రమైన దుష్ప్రభావాలను కలిగిస్తాయి.  దాదాపు 24  రకాల పండ్ల రసాల బ్రాండ్లను పరీక్షించిన తరువాత అన్నింటిలోనూ సీసం శాతం ఎక్కువగా బయటపడింది. ఇవి పిల్లలలో న్యూరో డెవలప్‌మెంటల్ సమస్యలను కలిగిస్తాయి. మరీ ముఖ్యంగా ఆపిల్ జ్యుస్ కి సంబంధించిన బ్రాండ్లలో ఇది ఎక్కువగా ఉంటుంది.  ఖచ్చితంగా చెప్పాలంటే , ఆర్సెనిక్ అనేది పర్యావరణ కాలుష్యం, అలాంటిది మనిషికి ఇంకెంత ప్రమాదం చేకూరుస్తుందో అర్థం చేసుకోవచ్చు.  యాపిల్స్, ద్రాక్ష సహజంగా మట్టిలో ఉన్న, లేదా పురుగుమందుల కోసం ఉపయోగించే ఆర్సెనిక్‌ను సహజంగానే గ్రహిస్తుంది. ఇలాంటి వాటితో ప్యాక్డ్ జ్యుస్ లు తయారుచేస్తే అవి శరీరానికి మరింత హాని కలిగిస్తాయి.  ప్యాక్ చేయబడిన జ్యుస్ ల గుట్టు ఏంటో తెలుసా.. ప్యాక్ చేయబడిన జ్యూస్ లు బహుశా తక్కువ నాణ్యత గల పండ్ల నుండి తయారు చేయబడతాయి. ఈ జ్యూస్ లు మంచి రుచిని, సువాసనను కలిగి ఉంటాయి. తాగేకొద్ది తాగాలని అనిపిస్తుంది. రంగు కూడా టెంప్టింగ్ గా ఉంటుంది. కానీ అన్నీ కృత్రిమమే అనే విషయం గుర్తుంచుకోవాలి. ఇవన్నీ ఆరోగ్యానికి హాని కలిగించేవే.. డయాబెటిక్ లేదా అధిక బరువు ఉన్నవారు ప్యాక్డ్ జ్యూస్‌లను అసలు తీసుకోకూడదు. ఇంకా ఈ ప్యాక్ జ్యుస్ లు ఎక్కువగా తాగే వారికి తొందరగా డయాబెటిక్, అధిక బరువు సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త.                                  ◆నిశ్శబ్ద.

జుట్టు ఎందుకు తెల్లబడుతుంది... దీన్ని నివారించడానికి ఏమి చేయాలంటే..

దాదాపు అన్ని వయసుల వారిలోనూ జుట్టు సమస్యలు వేగంగా పెరుగుతున్నాయి. జుట్టు రాలడం నుండి జుట్టు బూడిద రంగులోకి మారడం వరకు, సమస్యలు చాలా సాధారణంగా కనిపిస్తుంటాయి.  అయితే దాని వెనుక కారణం మీకు తెలుసా? కాలుష్యం, ఆహార అలవాట్లు, ఒత్తిడి వంటి పరిస్థితులు జుట్టుపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సాధారణంగా 50 ఏళ్ల తర్వాత జుట్టు తెల్లబడటం ప్రారంభిస్తుంది, కానీ కొందరిలో ఈ సమస్య 20-30 ఏళ్ల వయస్సులో లేదా అంతకంటే ముందే కూడా రావచ్చు. జుట్టు తెల్లబడటానికి గల  కారణాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. వృద్ధాప్యంలో సాధారణంగా వెంట్రుకల కుదుళ్లలో రంగు ఉత్పత్తి తగ్గడం ప్రారంభమవుతుంది.  ఈ కారణంగానే జుట్టు రంగు మారడమనే సమస్య ఏర్పడుతుందని వైద్యులు అంటున్నారు. కానీ ఇది ఎందుకు జరుగుతుంది?? దానిని ఎలా నిరోధించవచ్చు?? పూర్తిగా తెలుసుకుంటే.. జుట్టు కుదుళ్లలో వర్ణద్రవ్యం ఉత్పత్తి చేసే కణాలు ఉంటాయి, ఇవి జుట్టుకు నలుపు రంగును ఇచ్చే మెలనిన్ అనే రసాయనాన్ని తయారు చేస్తాయి. ఈ కణాలు చనిపోవడం వల్ల మెలనిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. దీని కారణంగా జుట్టు సమస్యలు మొదలవుతాయి, ముఖ్యంగా జుట్టు బూడిదరంగు లేదా తెల్లగా మారుతుంది.  ఒకసారి ఒక ఫోలికల్ మెలనిన్ ఉత్పత్తిని ఆపివేస్తే, అది మళ్లీ ప్రారంభమయ్యే అవకాశం లేదు. చిన్న వయసులో వచ్చే సమస్యలు.. వయసు పెరిగే కొద్దీ జుట్టు తెల్లబడటం సహజమే, అయితే ఈ సమస్య చిన్న వయసులోనే ఎందుకు మొదలవుతుంది? అనే విషయాలు పరిశీలిస్తే.. అధిక ఒత్తిడిని తీసుకోవడం లేదా ఏదైనా అంతర్లీన ఆరోగ్య సమస్య వంటివి జుట్టు సమస్యలకు కారణమవుతాయి.  జుట్టు సమస్యలు ఎక్కువగా జన్యువులపై ఆధారపడి ఉంటాయని  నిపుణులు చెబుతున్నారు.  ఇది జుట్టు ఎప్పుడు నెరిసిపోతుందో నిర్ణయిస్తుంది. తల్లిదండ్రులలో ఎవరికైనా 30 సంవత్సరాల వయస్సులో జుట్టు నెరిసి ఉంటే, పిల్లలకు కూడా ముందుగా నెరిసిపోయే అవకాశం ఉంది.  తప్పక  తెలుసుకోవలసిన ముఖ్య విషయాలు.. విటమిన్ B12 లోపం. న్యూరోఫైబ్రోమాటోసిస్ - నరాలు, ఎముకలు, చర్మాన్ని ప్రభావితం చేసే ఒక వారసత్వ వ్యాధి. బొల్లి సమస్య - ఈ పరిస్థితి మెలనోసైట్లు (వెంట్రుకల కుదుళ్ల బేస్ వద్ద వర్ణద్రవ్యం ఉత్పత్తి చేసే కణాలు) వాటి వర్ణద్రవ్యాన్ని కోల్పోతాయి. అలోపేసియా అరేటా సమస్య జుట్టు రాలడానికి సంబంధించినది, అయితే దీనివల్ల జుట్టు బూడిద రంగులోకి మారుతుంది. జుట్టు తెల్లబడకుండా ఆపడం ఎలా? వంశపారంపర్య ప్రమాదాన్ని తగ్గించలేనప్పటికీ, జుట్టు రంగు మారడాన్ని నివారించడానికి కొన్ని ప్రయత్నాలు చేయవచ్చు. యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్స్ ఎక్కువగా తినాలి. కూరగాయలు పండ్లలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి జుట్టు నెరసిపోకుండా నిరోధించడంలో సహాయపడతాయి. ధూమపానం అలవాటుంటే మానేయాలి... ఆహారం నుండి తగినంత విటమిన్లు పొందాలి. మీ జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి విటమిన్ B-12 అవసరం. తగినంత ఖనిజాలను పొందాలి.  జుట్టు పెరుగుదలలో ,  కణాలను ఆరోగ్యంగా ఉంచడంలో ఖనిజాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.                                    ◆నిశ్శబ్ద.

ప్లాస్టిక్ వాడితే జ్ఞాపక శక్తి కోల్పోతారా?

ప్లాస్టిక్ వాడకం వల్ల పిల్లలలో జ్ఞాపకశక్తి కోల్పోతారా బలహీన పడతారని యోగా గురువు బాబా రామ్ దేవ్ స్పష్టం చేసారు. * ప్లాస్టిక్ వాడకం వల్ల క్యాన్సర్ ప్రమాదం పొంచి ఉందని నిపుణులు అభిప్రాయ పడ్డారు.  * ఇంట్లో మనం వాడే ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేదించాలని కోరుతున్నారు. కాగా ప్లాస్టిక్ వాడకం వల్ల వచ్చే వివిదతకాల అనారోగ్య సమస్యలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని నిపుణులు పేర్కొన్నారు. ప్లాస్టిక్ పుట్టుక... 115 సంవత్సరాల క్రితం ప్లాస్టిక్ కనుగొన్నారని చారిత్రిక ఆధారాలు ఉన్నాయని పరిశోధకులు అంటున్నారు. ఈ అంశాల పై మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అప్పట్లో దీనిని అపరిచిత వస్తువుగా నే గుర్తించారు.అలాగే సింథటిక్,పాలిమర్ నాణ్యత కారణంగా ఎన్నో ఏళ్ళు నడిపించారు.చీటి ధర చాలా తక్కువగాను అందంగా ఉండడం తో దీనికి తోడు గట్టిగా ఉండడం తో ప్లాస్టిక్ ఇంట్లోకి, ఆఫీస్లోకి, అక్కడనుంచి బజారు లోకి చేరింది.నేడు కరెన్సీ నుండి  దీని వినియోగం ప్రతిరోజూ పెరుగుతూనే ఉంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇచ్చిన నివేదిక ప్రకారం గత 5౦ ఏళ్లలో ప్లాస్టిక్ వాడకం 2౦% పెరిగింది.పిల్లల జ్ఞాపక శక్తి కోల్పోయెంతగా బలహీన పడేవిధంగా ప్రభావితం చేసే రసయానాలు బిస్టినోల్ ఏ శరీరం లో ని హార్మోన్ తయారు చేసే చేసే విధానం వాటి లెవెల్స్ ను ప్రభావితం చేసే  అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. వీటిలో ఉండే విష పదార్ధాలు రసాయనాలు మహిళల ఆరోగ్యం పై నేరుగా ప్రభావం చూపిస్తుంది. ఒక పరిశోదన ప్రకారం గాలిలో  తేలి యాడె మైక్రో ప్లాస్టిక్ పార్టికల్స్ ముక్కు ముఖం ద్వారా శరీరం లోకి చేరతాయని ఈ కారణంగా హార్ట్ ఎట్టాక్ కిడ్నీ ఫెయిల్యూర్ తో పాటు ఊపిరి తిత్తుల లో తీవ్ర ఇబ్బందులు పెరుగుతాయని విశ్లేషించారు.ఒక పరిశోదన వివరాల ప్రకారం గాలిలో తేలే ప్లాస్టిక్ పార్టికల్స్ వల్ల గర్భస్థ మహిళల  ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇన్నిరకాల సమస్యలు ఉన్నప్పటికీ ప్రాణాంతక వస్తువుల వినియోగం ఆగడం లేదు.ప్రస్తుతం అందుతున్న గణాంకాల ప్రకారం అమెరికా తరువాత భారత దేశంలోనే ప్లాస్టిక్ వినియోగం ఎక్కువగా ఉందని దీనిఆదారంగా మన అంచనా ప్రకారం ౩4 లక్షల టన్నుల ప్లాస్టిక్ చెత్త కేవలం మనదేశం లోనే వస్తోందని నివేదిక వెల్లడించింది. కొంత ఉపసమనం కలిగించే అంశం ఏమిటి అంటే ప్రాణాంతక ప్లాస్టిక్ పోల్యుషణ్ కాలుష్యం ప్లాస్టిక్ లో 19 రకాల వస్తువులపై నిషేధం విదించారు.సింథటిక్ పాలిమర్ వల్ల రోగాలు క్యాన్సర్ నుండి రక్షించుకునే ఉపాయం  ప్లాస్టిక్ ప్రాణాంతకం... * వేడిగా ఉండడం వల్ల బెస్ఫినోల్ ఏ లీక్ అవుతుంది. * తినే తాగే వస్తువులలో నికిల్ ఉంటుంది. * ప్లాస్టిక్ పార్టికల్స్ శరీరం లో చేరాయో క్యాన్సర్ వస్తుంది. ప్లాస్టిక్ పోల్యుషణ్ వల్ల ప్రమాదం... * పిల్ల జ్ఞాపక శక్తి బలహీన పడుతుంది. * హార్మోనల్ ఇం బ్యాలెన్స్ లెవెల్ స్థిరంగా ఉండదు. * గర్భస్థ మహిళల ఆరోగ్యం పై ప్రభావం ఉంటుంది. ప్లాస్టిక్ నుండి రక్షిమ్పబడాలంటే  వంటశాలలో ఈ మార్పులు చేయండి.. * స్టీల్ పాత్రల వాడండి. * అల్యూమినియం పాత్రలు వాడండి. * ప్లాస్టిక్ కన్ టైనర్లు నిషేదించండి * అల్యూమినియం ఫాయిల్స్ వినియోగించండి. ప్లాస్టిక్ వినియోగం వల్ల సమస్యల నుండి రక్షించుకోండి... * యోగా ప్రాణాయామం ప్రతిరోజూ చేయండి. * రోజులో ఒక్కసారైనా గెలోయ్ ను త్రాగండి * పసుపు పాలు తాగండి. * విటమిన్ సి కోసం పుల్లటి పండ్లు తినండి. * బయటికి వాచ్చినప్పుడు మాస్క్ ధరించండి. ప్రణాలతో చెలగాట మాదే ప్లాస్టిక్ ను సర్వత్ర నిషేధం తప్పనిసరి అని శాస్త్రజ్ఞులు,సామాజిక సంఘాలు ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని. ఈమేరకు ప్రజా ఆరోగ్యం పరిరక్షణ కు ఉద్యమ స్పూర్తితో ప్రజలు ప్రభుత్వం స్వచ్చంద సంస్థలు ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

తలనొప్పికి, కంటికి ఉన్న లింకు ఇదే!

కంటి ఆస్పత్రికి వచ్చే రోగులను పరిశీలిస్తే ఎక్కువ మంది తలనొప్పితో వస్తారని తెలుస్తుంది.  అసలు తలనొప్పికి కారణమేమిటి ? తలనొప్పి ఉన్నప్పుడు కంటి ఆసుపత్రికి రావడం ఏంటి?? తలనొప్పికి కంటికి గల సంబంధం ఏమిటి?? చాలామందికి ఈ విషయాల గురించి తెలియదు.  వీటికి సంబంధించి విషయాలు తెలుసుకుంటే.. మనిషి శరీరంలో ఒక్కొక్క స్పర్శను తెలియ జేయడానికి ఒక్కొక్క నాడి వుంటుంది. నొప్పి, వేడి, చల్లదనం, రుచి, వాసన, దృష్టి మొదలైన వాటిని తెలిపే నాడులు మెదడులో ప్రత్యేకంగా వుంటాయి. శరీరంలో ఏ భాగంలో నొప్పి ఎక్కడ పుట్టినప్పటికీ, ఇది నాడీ మండల వ్యవస్థకు సంబంధించిన నొప్పేకాని ఇది వ్యాధి కాదు. ఇది వ్యాధిని సూచించే ఒక లక్షణం. మెదడులో నొప్పిని తెలిపే ఒక ప్రత్యేక నాడి వుంటుంది. దాన్ని ఉత్తేజిత పరిస్తే బాధ కలుగుతుంది. అయితే దాన్ని లేకుండా చేస్తే అసలు నొప్పి అనే ప్రశ్నే రాదు. నొప్పితో మొదలైన వ్యాధులన్నీ తీవ్రమైనవి కావు. అదేవిధంగా నొప్పి లేని వ్యాధులన్నీ స్వల్పమైనవీ కావు. నొప్పి అనేది మనలను మేల్కొలుపుతుంది. శారీరకంగా మనం ఇబ్బంది పడేలా చేస్తుంది. వ్యాధి మనిషిలో అంతర్గతంగా ఉంటుంది. ఇది అంత తొందరగా బయటపడదు. కాని వ్యాధి కంటె నొప్పే ఎక్కువ బాధిస్తుంది. కాన్సరు రోగిని పరిశీలిస్తే, కాన్సరు గడ్డ కాని, పుండుకాని నొప్పి లేకుండానే బయలు దేరుతాయి. ఇది మొదలైనప్పుడు మనిషికి ఎలాంటి లక్షణాలు కనబడవు. ఇది కాస్త ముదిరిన తరువాతే శరీరాన్ని హింస పెట్టడం మొదలుపెడుతుంది.  కావున ఈవ్యాధిలో నొప్పి అనేది చాలా చివరి దశ. అదేవిధంగా కుష్టు రోగిని పరిశీలిస్తే. అతని శరీరంలోని పలుచోట్ల గాయాలు, పుండ్లు ఏర్పడటానికి కారణం నొప్పి లేకపోవడమే. స్త్రీలైతే పొయ్యి మీద నుండి పాత్రలు దించేటప్పుడు కాల్చుకుంటారు. సిగరెట్లు పీల్చే వ్యక్తితే వేళ్ళపై పుండ్లు ఏర్పడతాయి. కాలుకి రాయి తగిలి గాయం ఏర్పడుతుంది. ఇవన్నీ సహజంగా అందరికీ  ఏర్పడే ప్రమాదాలే.  ఈ సంధర్భాలలో నొప్పి వుండి వుంటే ముందుగా వైద్యుని సంప్రదించి తగిన చికిత్స పొందడానికి అవకాశం వుంది. నొప్పి అనేది ఒక అవసరమైన స్పర్శ. తలనొప్పిని తెలియ జేయడానికి ప్రత్యేక మైన నాడులు వున్నాయి. వాటిని ఉత్తేజింప జేయడం వలన తలనొప్పి ఏర్పడుతుంది. ఆ నాడుల పేర్లు - (ప్రైజెమినల్ నాడీ, సర్వైకల్ నాడులు). తలలో గాని, కంటి లో గాని మెదడులోగాని వ్యాధి ఏర్పడ్డప్పుడు ఈ నాడులు ఉత్తేజింప బడతాయి. తద్వారా మనకు తలనొప్పి ఏర్పడుతుంది.  దూరదృష్టి, హ్రస్వ దృష్టి, అక్షలోపము, నేత్ర ద్వయ శక్తి లోపము, నేత్రద్వయ సమన్వయ లోపము, ఛత్వారము, నీటి కాసులు, రక్తపు పొర వాపు, గాజుపొర పుండు (మెల్ల), కంటిగూడు వాపు, కంటి నాడి వాపు, మొదలైనవి. తలనొప్పి కలిగించే కంటి వ్యాధులు. కాబట్టి తలనొప్పి వచ్చినప్పుడు కంటి వైద్యుడిని సంప్రదిస్తారు. కంటి వైద్యులు కంటికి సంబంధించిన నాడుల కదలిక ఆధారంగా వ్యాధిని నిర్ణయించి తగిన పరిష్కారం సూచిస్తారు.                                         ◆నిశ్శబ్ద.

ఈ పండు తింటున్నారా!

  రోజుకో పండు తింటే ఆరోగ్యానికి మంచిదని తెల్సిందే. అయితే సాదారణంగా మనం మనకి అందుబాటులో వున్నా పండ్లనే  ఎంచుకుంటాం, కాని కొన్ని పండ్లలో మన ఆరోగ్యానికి పనికొచ్చే ఎన్ని పోషకాలు వుంటాయి, వాటిని తప్పక తిని తీరాలి అంటున్నారు వైద్యులు. అలాంటి పండ్లలో 'కివి' ఒకటి....   'కివి' తో మనం పొందే ఐదు లాభాలు :- * మొట్టమొదటి లాభం కొలెస్ట్రాల్ ని నియంత్రణలో వుంచడం. దాని వల్ల గుండె జబ్బుల వంటి వాటి బారిన పడకుండా ఉంటాం. * అలాగే 'కివి' పండులో బత్తాయి,కమలా వంటి పండ్ల లో కన్నా ఎక్కువగా 'సి' విటమిన్ వుంటుంది. దీని వలన శ్వాసక్రియ ఇబ్బందులు వంటివి దగ్గరికి చేరవు. * ఇంకా ఈ పండులో పీచు పదార్దం కూడా ఎక్కువే, జీర్ణవ్యవస్థకు పీచు పదార్దం ఎంతో మేలు చేస్తుంది. * ఇక విటమిన్ 'ఎ', ' ఇ' లు కూడా కలిగి ఉండే ఈ పండుతో మరో ముఖ్యమైన లాభం ఆహారంలోని ఐరన్ ని శరీరం త్వరగా మెరుగ్గా గ్రహించే శక్తిని ఇచ్చే గుణం కలిగి వుండటం. * ఇక చెప్పుకో దగ్గ మరో లాభం 'కివి' పండులోని యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలో తయారయ్యే ఫ్రీ రాడికల్స్  ప్రభావాన్ని అదుపు చేస్తాయి. అలాగే ఎముకల బలహీనత, కీళ్ళ బలహీనత, క్యాన్సర్, ఆస్మా వంటి వ్యాధుల నుంచి కాపాడతాయి. ఇన్ని లాభాలు వున్నాయని తెలిసాకా 'కివి' పండుని తినకుండా వుంటామా. రోజూ ఓ 'కివి' ఆరోగ్యానికి మంచిది అంటా హాయిగా తినేద్దాం.

మన భావోద్వేగాలే మన అనారోగ్యానికి కారణం?

మనిషి అన్నవాడు ఉద్వేగానికి గురి అవ్వకుండా ఉండడు. ఏదైనా ఘటన జరిగిన వెంటనే స్పందించని మనిషి అంటూ ఉండడు. అయాసందార్భాను సారంగా స్పందించడం మానవనైజం. అది సహజ లక్షణం. భావోద్వేగం అంటే ఎమోషన్స్ మనము కొన్ని కొన్ని టికీ చాలా తీవ్రంగా స్పందిస్తే కొన్నిసార్లు మామూలుగా స్పందిస్తాము. మనలో వచ్చే భావోద్వేగాలే మనశరీరానికి హానిచేస్తాయని అదే అనారోగ్యానికి కారణమని మనపూర్వీకులు వెల్లడించారని  ప్రముఖ నాడీ పతి వైద్యులు డాక్టర్ కృష్ణం రాజు విశ్లేషించారు. ఈమేరకు డాక్టర్ కృష్ణం రాజు చేసిన పరిశోదనలో ఒక్కో భావోద్వేగం ఒక్కో అవయవం పై ప్రభావం చూపుతుందని నిపుణులు పేర్కొన్నారు.ఉద్వేగాల లో మనకు తెలిసిన కొన్ని టి గురించి చూద్దాం. ఒత్తిడి, భయం, క్రోదం,ఆవేదన ,ఆందోళన వంటి ఉద్వేగాలు మీ శరీరంలోని అవయవాల కు హానికలిగిస్తాయి. ఏ ఏ ఎమోషన్స్ మీ మీ అవయవాల పై ప్రభావం చూపుతాయో తెలుసుకుందాం. భయం, లేదా మీకు షార్ట్ టెంర్  ఉంటె మీ కిడ్నీ పై ప్రభావం చూపిస్తుంది. మీకు ఉద్వేగాలాలో గమనించిన ముఖ్య అంశం --కోపం ఉంటె లివర్ పై ప్రభావం చూపుతుంది. మీరు ఎప్పుడు విచారం ఆందోళనలో ఉంటె--లేదా తీవ్ర ఒత్తిడి కి గురి అయితే ---పొట్టలో గ్యాస్ ట్రిక్ సమస్యలు అరుగుదల లేకపోవడం గమనించవచ్చు. మీరు నిత్యం ఒత్తిడిలో ఉంటె --గుండె సంబంధిత సమస్యల కు దారి తీస్తుంది. మీరు ఏమిచెయ్యాలో తెలియక టెన్ క్షణ్ లో ఉంటె --మీ మెదడుపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. మీరు ఎల్లప్పుడూ గ్రీఫ్ గా ఉంటె---అది మీ ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతుంది. జాయ్ ఆనందం గా ఉంటె బలాన్ని ఇస్తుంది. మీరు ఎల్లప్పుడూ విచార వదనంతో ఉదాసీనంగా ఉంటె అది మీ ప్లీహము పై ప్రభావము చూపుతుంది. సహజంగా వచ్చే ఉద్వేగాల ను నియంత్రించడం ద్వారా కొంతమేర అవయవాల పై పడే తీవ్రతను గుర్తించవచ్చు. తద్వారా అవిపూర్తిగా నాశనం కాకుండా మర్మ కళ ద్వారా నివారణ చేయవచ్చని ముఖ్యంగా నాడీ పతిలోని 1౦7 రకాల మర్మకళ తో అక్యు పంక్చర్ ను వినియోగించి చికిత్చ చేయవచ్చని నాడిపతి వైద్యులు  డాక్టర్ కృష్ణమ రాజు స్పష్టం చేసారు. మీ అనారోగ్గ్యానికి మీభావోద్వేగాలే అని తెలుసుకోవాలి.

అధికవేడి చేస్తోందా?? భయం వద్దు.. ఇలా తగ్గించేయండి.

ఒళ్ళు ముట్టుకుంటే సాధారణంగానే ఉంటుంది కానీ.. ఆ వ్యక్తికి మాత్రం లోపల నిప్పులు కురిసినట్టే ఉంటుంది. గొంతంతా తడి ఆరిపోతూ ఉంటుంది.. ఎన్ని నీళ్లు తాగినా దాహం తీరదు. నోరు పిడచకట్టుకుపోతుంది. పెదవులు ఎండిపోయి నిర్జీవంగా తయారవుతాయి. ఊపిరి వదులుతుంటే వేడిగా సెగలు కొడుతుంది. చర్మం అంతా కళ కోల్పోతుంది. మొత్తానికి మనిషి వాడిపోయిన పువ్వులా తయారవుతాడు. ఇదంతా అధిక వేడి వల్ల కలిగే ఇబ్బంది. ఎదుటివారు మాత్రం నీకేమి కాలేదు ఊరుకో… అని అంటుంటారు. తమను అర్థం చేసుకోకపోగా అపార్థం చేసుకుంటున్నారు ఏంటి వీళ్ళు అనే ఒకానొక బాధ మనుషుల్ని పట్టి పీడిస్తుంది. ఇలా శరీర సమస్య కాస్తా మానసిక సమస్యగానూ తయారవుతుంది. వైద్యులను కలసి మందులు వాడితే… వారు ఇచ్చే ఇంగ్లీష్ మందులు కూడా శరీరానికి వేడిని పెంచేవే… మరి ఈ సమస్యకు పరిష్కారం ఎలా?? అని బాధపడేవారు కంగారు పడాల్సిన అవసరం లేదు. దానికీ కొన్ని చిట్కాలు ఉన్నాయి..  వేడి తగ్గడానికి సహజమైన చిట్కాలు.. అందరికీ సులువుగా దొరికేది వేప. దీని రుచి గురించి పక్కన పెట్టి కాస్త ఓపికగా వాడితే మంచి ఫలితం ఉంటుంది.  వేపాకుల రసం 20-50 మి.లీ.  తీసుకోవాలి. అందులోకి 5 నుండి20 గ్రా॥ల పటిక బెల్లము కలపాలి. చేదు ఎక్కువ భరించలేము అన్నవారు పటికబెల్లం ఎక్కువగా అంటే 20 గ్రాముల వరకు. చేదు తీసుకోగలం అనేవారు 5గ్రాములు మోతాదు కలుపుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని ఒక వారము రోజులు తాగడం వల్ల వేడి తగ్గుతుంది. మామిడి చెట్టు లోపలి బెరడు తీసుకోవాలి, తరువాత అత్తి (మేడి) చెట్టు వేరు బెరడును, ఇంకా మర్రి చిగుళ్ళను తీసుకోవాలి. వీటి నుండి రసాన్ని తీయాలి. ఈ రసాన్ని 10 నుండి 40 మి.లీ. తీసి,  అందులో 1 నుండి 2 గ్రా॥ల జీలకర్ర, 5 నుండి 20 గ్రా॥ల పటిక బెల్లము కలపాలి. ఈ మిశ్రమాన్ని తాగటం వల్ల ఎలాంటి వేడి అయినా తగ్గిపోతుంది. సోంపు మనందరికీ తెలిసిందే. ఇప్పట్లో హోటళ్లలో తిన్న తరువాత స్వీట్ సొంపు ఇస్తారు మౌత్ ఫ్రెషనర్ గా. ఈ సొంపు, జీలకర్ర, పటిక బెల్లమును మూడింటిని రాత్రి పూట నీళ్లలో నానబెట్టాలి. ఉదయాన్నే దీన్ని వడపోసి పరగడపున త్రాగాలి. ఇలా చేస్తుంటే  శరీరంలోని వేడి మొత్తం తగ్గిపోతుంది. అందరికీ అతి సులువుగా ఏ కాలంలో అయినా లభించేది నిమ్మకాయ. ఈ  నిమ్మరసంలో పఠిక బెల్లం వేసి జ్యుస్ లాగా తయారుచేసుకోవాలి. దీన్ని తాగుతుంటే కూడా అధికవేడి దెబ్బకు తగ్గిపోతుంది.  అధికవేడి సమస్య అన్ని కాలాలలో ఉన్నా వేసవికాలంలో ఎక్కువగా వేధిస్తుంది. ఈ వేసవి కాలంలో అందరికీ దొరికే అద్భుతమైన ఫలం పండ్లకు రారాజు మామిడి. ఈ మామిడి పండు పచ్చిగా ఉన్నది తీసుకోవాలి. దాన్ని తోలు తీసి నీటిలో మరిగించాలి. తర్వాత దాని గుజ్జును చల్లని నీటిలో పిసికి రసము తీసి నచ్చినట్టుగా అందులో  ఉప్పు, జీలకర్ర, చెక్కెర మొదలయినవి కలిపి తాగాలి. దీనిని ప్రస్తుతం చాలామంది ఆమ్ పన్నా అని పిలుస్తుంటారు. పచ్చిమామిడితో చేసే ఈ జ్యుస్ అధికవేడి సమస్యకు చాలా పవర్ఫుల్ గా పనిచేస్తుంది. మరీ ముఖ్యంగా వడదెబ్బ సమస్య రాకుండా వేసవిలో ఈ జ్యుస్ ను తీసుకుంటూ ఉంటారు.   చెరకు రసం అద్భుతమైన ఔషధం. ఒకప్పుడు చెరకును నేరుగా తినేవారు. ప్రస్తుత కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇది అరుదైపోయింది. అయితే అక్కడక్కడా చెరకు రసం అమ్ముతూ ఉంటారు. ఈ చెరకు రసాన్ని రోజూ తీసుకుంటూ ఉంటే అధికవేడి సమస్య క్రమంగా తగ్గిపోతుంది. అలాగే కడుపులో మంట లాంటి సమస్యలు కూడా తగ్గుతాయి.  దానిమ్మపండ్లు అన్నిచోట్లా లభ్యమవుతాయి. ఈ దానిమ్మ పండు రసం తీసినా.. లేదా నేరుగా అలాగే విత్తనాలు తిన్నా మంచి ఫలితం ఉంటుంది. ముఖ్యంగా వేసవిలో తలనొప్పి వచ్చినా, వడదెబ్బ తగిలినా, కళ్ళు ఎరుపెక్కినా, దానిమ్మ పండు రసం తాగితే ఫలితం ఉంటుంది.  ఇలా సహజమైన చిట్కాలు ఉపయోగించి శరీరాన్ని మండించే అధికవేడిని తరిమేయచ్చు..    ◆నిశ్శబ్ద.  

మీకూ ఈ లక్షణాలుంటే పొగాకు వ్యసనంగా మారినట్టే!

ప్రపంచవ్యాప్తంగా పొగాకు వినియోగం వల్ల పెరుగుతున్న తీవ్రమైన వ్యాధుల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం మరియు పొగాకు ద్వారా సంక్రమించే వ్యాధుల భారాన్ని తగ్గించే లక్ష్యంతో పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ ఏడాది.. 'మనకు ఆహారం పొగాకు కాదు. పొగాకు ఉత్పత్తి చేసే రైతులను ప్రత్యామ్నాయ పంటలకు ప్రోత్సహించడమే దీని లక్ష్యం' అనే థీమ్ ను ప్రజలముందుకు తెచ్చింది.  పొగాకు ఉత్పత్తులను గుట్కా, ఖైనీ, సిగరెట్ల రూపంలో తీసుకుంటే వెంటనే మానేయాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇవన్నీ మన శరీరాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయనే విషయం చిన్న పిల్లలకు కూడా తెలుసు.  పొగాకు నమలడం వల్ల నోరు, గొంతు సమస్యలు  వచ్చే ప్రమాదం పెరుగుతుంది, అయితే ధూమపానం ఊపిరితిత్తుల క్యాన్సర్, రక్త నాళాల విస్తరణ ప్రమాదాన్ని పెంచుతుంది . పొగాకు అనేది ఒక వ్యసనం, దీని నుండి బయటపడటానికి ప్రయత్నాలు అవసరం, లేకుంటే అది ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది  పొగాకు వ్యసనంగా మారిందని తెలుసుకోవడం ఎలా?? పొగాకు-సిగరెట్ లేకుండా ఒక రోజు కూడా ఉండలేకపోతే.. దాని వ్యసనానికి బలి అయ్యారనే సంకేతం. అయితే ఈ వ్యసనం ఎందుకు ఏర్పడిందో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. పొగాకులో నికోటిన్ ఉంటుంది, ఈ రసాయనం వ్యసనానికి ప్రధాన కారణం. నమలడం లేదా ధూమపానం చేయడం ద్వారా పొగాకు రక్తప్రవాహంలోకి శోషించబడినప్పుడు, అది అడ్రినలిన్ అనే రసాయనాన్ని విడుదల చేస్తుంది. నికోటిన్, మరోవైపు, డోపమైన్ హార్మోన్ పెరుగుదలను కూడా ప్రేరేపిస్తుంది. ఇది మెదడును సంతోషపెట్టే హార్మోన్.  దీని కారణంగా చాలా రిలాక్స్ అయినట్టు అనిపిస్తుంది. పదే పదే ఈ సంతోషం కోసమే పోగాకుకు అలవాటు పడతారు. పొగాకు వ్యసనం లక్షణాలు..  పొగాకు వ్యసనం లక్షణాలు  పైకి స్పష్టంగా కనబడతాయి.  పొగాకు మానేయడానికి ప్రయత్నించినప్పటికీ ధూమపానం లేదా పొగాకు నమలడం ఆపలేకపోవడం. ఒకరోజైనా  వదిలేయాలని ప్రయత్నించినప్పుడు, చేతి వణుకు, చెమటలు పట్టడం, అశాంతి, గుండె వేగం పెరగడం వంటి అనేక రకాల సమస్యలు మొదలవుతాయి. భోజనం తర్వాత ధూమపానం చేయాలని, పొగాకు నమలాలని అనిపించడం.  పొగాకు వ్యసనం, దాని  లక్షణాలు, పొగాకు వల్ల ఎదురయ్యే సమస్యలు, ఇవన్నీ తెలుసుకుని స్ఫూర్తి వంతంగా పోగాకుకు దూరమైతే ఆరోగ్యం బాగుంటుంది.                                        ◆నిశ్శబ్ద.

ఈ మూడు సమస్యలు ఉన్నవారిలో ఒత్తిడి చాలా ప్రమాదం కలిగిస్తుంది!

ఏవైనా ఊహించని సంఘటనలు జరిగినప్పుడు ఆందోళన పడటం సహజం. ఆ ఆందోళన కాలక్రమేణా నయమవుతుంది. కానీ , కారణాలు పెద్దగా లేకున్నా తరచుగా ఆందోళన చెందేవారు చాలామంది ఉంటున్నారు. ఇలా ఆందోళన చెందేవారు ఈ ఆందోళన కారణంగా ఒత్తిడికి గురవుతారు. ఇలాంటివారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది డిప్రెషన్ వంటి తీవ్రమైన సమస్యల ప్రమాదాన్ని పెంచడమే కాకుండా,  శారీరక ఆరోగ్యంపై అనేక దుష్ప్రభావాలను కూడా కలిగిస్తుంది. అందుకే ఆరోగ్య నిపుణులు ఒత్తిడి నియంత్రణ చర్యలను తీసుకోవడం చాలా ముఖ్యమని చెబుతున్నారు.   ఆందోళన చాలా కాలంగా ఉంటూ అది అదుపులోకి రాకపోతే ఈ సమస్యకు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. అలా తీసుకోకపోతే  ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు పెరుగుతాయి. ఆందోళన-ఒత్తిడి సమస్యలు నాడీ వ్యవస్థ, మధుమేహం నుండి రక్తపోటు, గుండెపోటు ప్రమాదాన్ని కూడా పెంచుతాయి. ఎక్కవగా ఆలోచించడం, ఆందోళన చెందడం ఈ కింది సమస్యలున్నవారితో ప్రమాదం పెంచుతాయి.  మధుమేహ వ్యాధిగ్రస్తులలో సమస్యలు పెరిగే అవకాశం ఉంది..  దేనిగురించైనా ఆందోళన చెందుతున్నప్పుడు, ఒత్తిడి హార్మోన్ అయిన కార్టిసాల్ విడుదల అవుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతుంది. ఒత్తిడి మధుమేహానికి కారణం కాదని పరిశోధకులు కనుగొన్నారు, కానీ అది మీ రక్తంలో చక్కెర స్థాయిలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలలో హెచ్చుతగ్గులు కళ్ళ నుండి గుండె జబ్బులు, నరాల వరకు ప్రతిదానిని ప్రభావితం చేయడం ప్రారంభిస్తాయి. అందుకే మధుమేహ వ్యాధిగ్రస్తులు ఒత్తిడి నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని చెబుతున్నారు. నరాల మీద దుష్ప్రభావాలు..  నరాలు మెసేజింగ్ నెట్‌వర్క్‌ల లాగా పనిచేస్తాయి. ఎక్కువగా ఆందోళన చెందడం వల్ల  హృదయ స్పందన రేటు, శ్వాసను ప్రభావితం చేసే ఒత్తిడి హార్మోన్లను ప్రేరేపించవచ్చు. చాలా కాలం పాటు అనియంత్రిత ఒత్తిడి స్థాయిలు రక్తంలో చక్కెర, నరాల సమస్యలకు దారితీస్తాయి.  ఒత్తిడి-డిప్రెషన్‌తో బాధపడేవారిలో స్ట్రోక్ ప్రమాదం కూడా ఎక్కువగా ఉండడానికి ఇదే కారణం. గుండె ఆరోగ్యంపై ప్రభావం.. ఒత్తిడి సమస్య చాలా కాలం పాటు కొనసాగితే, అది  రక్తపోటు ఎక్కువగా ఉండేలా చేస్తుంది. అధిక రక్తపోటు, గుండెపోటు లేదా స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది. ఎప్పుడూ ఒత్తిడికి లోనవుతూ, ఆలోచిస్తూ ఉంటే , శరీరంలో విడుదలయ్యే కార్టిసాల్ హార్మోన్  గుండె వేగంగా కొట్టుకునేలా చేస్తుంది. ఇలా పదే పదే జరిగితే,  రక్తనాళాలు ఎర్రబడి, తీవ్రమైన గుండె జబ్బుల బారిన పడే ప్రమాదం ఉంది. ఒత్తిడిని అదుపులో ఉంచుకోవడం చాలా అవసరమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇది మానసిక ఆరోగ్య సమస్యలే కాదు.  మొత్తం శరీర ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది.                                         ◆నిశ్శబ్ద.