ఆస్తమా సమస్య వేధిస్తోందా.. ఈ జాగ్రత్తలు పాటిస్తే చాలు!

ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. కానీ ఆరోగ్యం విషయంలో చాలామంది చాలా దారుణమైన నిర్లక్ష్యం చూపిస్తారు. అందరూ గ్రామాల్లో నివసించేవారికి తగిన వైద్య సదుపాయం ఉండదని ఎద్దేవా చేస్తుంటారు కానీ పట్టణాల్లో నివసించేవారికి చాలా తొందరగా అనారోగ్యాలు వచ్చేస్తాయి. నిత్యం వాహనాల రాకపోకలతో జరిగే వాయుకాలుష్యం కారణంగా అన్ని పట్టణ ప్రాంత ప్రజలలోనూ ఎక్కువ శాతం ఎదుర్కొంటున్న సమస్య ఉబ్బసం. దీన్నే ఆస్తమా అని అంటారు.    ఊపిరితిత్తులు, శ్వాసకు సంబంధించిన ఏదైనా సమస్యలు చాలా అసౌకర్యానికి గురి చేస్తుంటాయి. ముఖ్యంగా ఉబ్బసం వంటి వ్యాధులలో ప్రత్యేక నివారణ చర్యలు తీసుకోవడం అవసరం. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, శ్వాస సంబంధిత సమస్యలను తేలికగా తీసుకోవడం మంచిది కాదు. కేవలం ఈ ఒక్క సమస్య ఎన్నో విధాలుగా హాని కలిగిస్తుంది. సహజంగానే శ్వాసనాళాలు  చిన్నగా ఉంటాయి.  వీటికి ఏమాత్రం అసౌకర్యం కలిగినఆ అవి ఉబ్బుతాయి.  ముఖ్యంగా ఆస్తమా విషయంలో అదనపు శ్లేష్మం ఉత్పత్తి అవుతుంది. ఈ పరిస్థితులు సాధారణ శ్వాస ప్రక్రియలో జోక్యం చేసుకుని ఇబ్బంది పెడతాయి. . కొంతమందికి, ఉబ్బసం సమస్య తీవ్రంగా ఉంటుంది, దీని కారణంగా కొన్నిసార్లు రోజువారీ పనులను నిర్వహించడం కూడా కష్టమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఆస్తమా నివారణకు, నియంత్రణ గురించి అవగాహన పెంచడానికి ప్రతి సంవత్సరం మే నెలలో మొదటి మంగళవారం  ప్రపంచ ఆస్తమా దినోత్సవాన్ని జరుపుకుంటారు.  ఆస్తమా సమస్యలు ఉన్నవారు తీసుకోవలసిన జాగ్రత్తలు, నివారణలు, దాని గురించి అవగాహన చాలా ముఖ్యం.  ఈ కింది విషయాలు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలు.. ఆస్తమాను ప్రోత్సహించే పనులకు దూరంగా ఉండాలి.. రోజూ చేసే కొన్ని పనులు ఆస్తమా సమస్యను మరింత పెంచుతాయి. అలెర్జీని ప్రేరేపించే వాటికి గురికావడం వలన దాని లక్షణాలు మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉంటుంది. ఆస్తమాను పెంచే వాటి గురించి తెలుసుకుని జాగ్రత్త పడటం చాలా ముఖ్యం. దుమ్ము, ధూళి, బాక్టీరియా,  పురుగులు, పెంపుడు జంతువుల నుండి రాలిపడే వెంట్రుకలు..  మొదలైనవి గాలిలో కలిసిపోయి ఉంటాయి. ఇలాంటి గాలి పీల్చుకోవడం వల్ల  శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు ఏర్పడతాయి. కాబట్టి గాలి కాలుష్యానికి దూరంగా ఉండాలి.   శారీరక శ్రమ పట్ల శ్రద్ధ వహించాలి. చల్లని గాలికి దూరంగా ఉండాలి.  నివారణ గురించి జాగ్రత్తగా ఉండాలి.. ఆస్తమాను నివారించడం చాలా అవసరం. దీన్ని నిరవారించడానికి  ఆస్తమాను ప్రేరేపించే కరకాలకు దూరంగా ఉండటంతో పాటు.. యోగా-వ్యాయామాన్ని దినచర్యలో భాగంగా చేసుకోవాలి. శ్వాస తీసుకోవడంలో ఏదైనా అసౌకర్యాన్ని అనుభవిస్తే, ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలి. శ్వాసను పర్యవేక్షించాలి..  ఆస్తమా సమస్య ఉన్నట్లయితే, శ్వాస తీరుపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. తేలికపాటి దగ్గు, శ్వాసలోపం లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. పీక్ ఎయిర్‌ఫ్లో మీటర్‌ని ఉపయోగించి శ్వాసక్రియ రేటును క్రమం తప్పకుండా కొలవాలి. ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచే వాటిని తినాలి.  తద్వారా శ్వాసకోశ సమస్యలు నియంత్రించవచ్చు. మందులు, ఇన్‌హేలర్‌ను జాగ్రత్తగా ఉంచుకోవాలి.. ఆస్తమా విషయంలో సొంత వైద్యం పనికిరాదు. సొంతంగా మందులు తీసుకోకూడదు. లేదా వైద్యులు రాసిన మందులు మార్పులు చేసుకోకూడదు. వైద్యులు సూచించిన మనదులను సరైన మోతాదులో క్రమం తప్పకుండా ఉపయోగించాలి. ఇన్‌హేలర్‌ను ఎల్లప్పుడూ మీతో ఉంచుకోవాలి. అత్యవసర పరిస్థితుల్లో శ్వాస తీసుకోవడానికి ఇవి సహాయపడతాయి. ఇవన్నీ పాటిస్తే ఆస్తమా నుండి చాలా వరకు ఉపశమనంగానే ఉంటుంది.                                   ◆నిశ్శబ్ద.

కొవ్వు చెప్పే కథ వింటే ఆశ్చర్యపోతారు!

నీకు కొవ్వు బాగా పట్టిందిరా.. అంటుంటారు చాలా మంది ఎవరైనా నిర్లక్ష్యంగా, పొగరుగా ప్రవర్తిస్తున్నపుడు. అయితే కొవ్వు అనేది శరీరానికి ఎంత అవసరమో అది హద్దు మించి పెరిగితే ఆరోగ్యానికి అంత చేటు చేస్తుంది. మనిషి ప్రవర్తన కూడా పరిధి మించితే అలాంటి నష్టాన్ని కలిగిస్తుందని దాని ఉద్దేశం. ఇకపోతే మన రక్తంలో కొవ్వు కలిగివుండడం ప్రమాదకరమని అందరికీ స్పష్టంగా తెలుసు. కీళ్ళ నొప్పులు, రక్తపోటు, డయబెటీస్ పరోక్షంగా కారణమని కూడా తెలుసు. అయితే కొవ్వును అయిదు రకాలుగా చెబుతారు. ఈ కొవ్వులకు విరుగుడు, చికిత్స తగ్గించడానికి ఏం చేయాలో మాత్రం వైద్యశాస్త్రంలో సమాధానం దొరకలేదు. మొదటి రకం కొవ్వు: కిలో మైక్రాన్స్ అనే కొవ్వు చర్మంలో నిలవవుంటుంది. దీనిని క్యాంధమన్ అంటారు. గుండెపోటు ఇతర బాధలుండవు, కాని శరీరభాగాలు ఉబ్బెత్తుగా అక్కడక్కడ కనిపిస్తుంది. కండకాదు కొవ్వు అని తెలిసినా మనం చేయగలిగిందేమీలేదు. వ్యాయామం శ్రమ తప్ప. రెండవ రకం కొవ్వు: రెండవ రకం కొవ్వును లిప్రొటిన్స్ అని పిలుస్తారు. ప్రోటీనులలో కొలెస్ట్రాతో కలిసిన కొవ్వు తక్కువ బరువు (తేలికగా) వుంటుంది. గుండెపోట్లకు కారణం ఇదే.  మూడవ రకం కొవ్వు: ట్రిగ్లి సిరిడిన్ అంటారు. బరువు ఎక్కువ కలిగిన లిపోప్రొటీన్సు కొలెస్ట్రాల్లో గుండెపోటులకు కారణం.  నాలుగవ రకం కొవ్వు : తేలికగా వుంటుంది. డయాబెటీస్ వల్ల ఎక్కువ బరువు ఉన్నవారిలో ఇది ఉంటుంది.  అయిదవ రకం కొవ్వు: కిలో మెక్రాన్స్ చిన్న చిన్న లిపోప్రోటిన్స్ కలిసినది. తాగుడు అలవాటుపడ్డ వాళ్ళలో ఇది వుంటుంది. 1,4,5 కొవ్వులు ఆహార నియమం వలన తగ్గించే అవకాశాలు ఉన్నాయి. 2, 3 కొవ్వుల విషయంలో కొలెస్ట్రాల్ తక్కువ ట్రిగ్లిసిరైడ్స్ తక్కువ వుండేలా జాగ్రత్తపడాలి. ఈ కొవ్వులను తగ్గించుకోవడం సమస్య అయితే దీనివలన వచ్చే జబ్బులు సమస్యలు మరింత బాధాకరంగా వుంటుంది. అసలు ఈ కొవ్వు ఎలా నిలవ అయిందనేది సమస్య. కారణాలు చాలా ఉంటాయి. ఆహారంలో కొవ్వు తగ్గించుకోవాలి అని చెప్పడం, కొలెస్ట్రాల్ తగ్గించడం వలన కొవ్వు బెడద తగ్గించుకోవచ్చునని అనుకోవడం తేలిక. అయితే అది ఎంతవరకు వాస్తవము, ఆచరణ యోగ్యం అనేది ఆలోచించాలి. మూడు వందలమందికి కొవ్వు తగ్గించి కొవ్వు లేకుండా ఆహారమిచ్చి మూడు సంవత్సరాలపాటు పరీక్షలో వుంచారు. రెండు వర్గాలలో జబ్బు తీవ్రత మరణాలు కూడా సంభవించాయి. అయితే ఒక విషయం స్పష్టంగా తేలిపోయింది. కొవ్వును అదుపులో పెడితే జబ్బును అదుపులో పెట్టవచ్చు. కొవ్వు తగ్గించుకుంటే గుండెపోటు ఇతర బాధలుండవు. డాక్టర్ కోహెన్ పరిశోధనలో యెమెన్ లో వున్న జ్యూలు చాలా లావుగా వుంటారు. ఎక్కువ కొవ్వు కలిగిన పదార్ధాలు, ఆహారం తింటారు. ఎంత కొవ్వు పదార్థాలు తిన్నా,  ఎంత లావున్నా ఏ జబ్బూ రాలేదు. బలంగా కూడా వున్నారు. అంతే కాదు మరొక విషయం కూడా తేలింది. ఆధునిక ఆహారం బిస్కట్లు, కేకులు, పుడింగులు, బ్రాంది నాగరిక ఆహారం తిని లావెక్కిన వారిలోనే ఈ జబ్బు కనిపిస్తున్నాయి. కానీ పూర్వం తినే ఆహారం తిని లావెక్కిన వాళ్ళలో ఏ జబ్బులూ లేవు. అంచేత మనపూర్వులు ఆదేశించిన ఆహారం సక్రమమైనది బలవర్ధకమైనది అని స్పష్టమవుతుంది.                                   ◆నిశ్శబ్ద.

ఆరోగ్యంగా ఉండాలంటే ఎండ కావాలి...

మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఎండ కావాలి. కాస్త ఎండలో ఉంటేనే ఆరోగ్యంగా ఉంటారని అంటున్నారు నిపుణులు. ఎండ మనకు చెడుపు చేయదు. ---- మీరు ఎండ ను గురించి ఆలోచించినప్పుడు మీకు మొట్ట మొదటగా వచ్చేది ఎండ మనకు చేసే నష్టం గురించి. అతిగా ఏది చేసినా సమస్యే. అన్న మాట ఎంత సత్యమో అంటే సూర్యోదయ వేళ పొద్దు పొడవగానే వచ్చే లేలేత భానుని లేత కిరణాలు  మంచిదే అంటున్నారు నిపుణులు. అసలు మనకు ఎంత ఎండ అవసరం------ ఈ ప్రశ్నకు సమాధానం ఒక్కోరికి ఒక్కోవిధంగా ఉంటుంది. అది మీశరీరం వయస్సు రంగు పై ఆధార పడి ఉంటుంది. మీ ఆరోగ్య చరిత్ర, ఆహారం, మీరు సహజంగా మీరు నివసించే ప్రదేశాలు 5నుండి 15నిమిషాలు లేదా3౦ నిమిషాలు డార్క్ స్కిన్ ఉన్నప్పటికీ అనారోగ్య సమస్యలు లేకుండా ఎండ బాగా పని చేస్తుంది.అలా అయితేనే మీరు ఎక్కువ జీవితకాలం జీవిస్తారు. సన్ స్క్రీన్ వాడకుండా నే మీరు బాగుంటారు. మీ డాక్టర్ తో మీరు ఇప్పుడే మాట్లాడండి. ఎండ ద్వారా విటమిన్ డి ---- సూర్య కాంతి ద్వారా వచ్చే ఆల్ట్రా వైలెట్ కిరణాలు మీ శరీరానికి న్యూట్రీయంట్ గా పని చేస్తుంది. అది మీ ఎముకల కి చాలా అవసరం. రక్త కణాలకి రోగ నిరోధక శక్తిఅవసరం కొన్ని మినరల్స్ కూడా తీసుకునేందుకు దోహదం చేస్తుంది. సూర్య రస్మి ద్వారా కాల్షియం, ప్రోస్పరస్, విటమిన్ డి ఆహారం ద్వారా పొందవచ్చు.ఎవరికైతే శిశువులు కళ్ళు అప్పుడప్పుడే తెరుస్తారో వారి చర్మం ఎముకలు మృదువుగా ఉంటాయో వారి ఎముకల పటుత్వానికి సూర్యరస్మిదోహదం చేస్తుంది. కొన్ని ప్రత్యేక సందార్భాలలో మనకు రక్షణకల్పిస్తుంది----- ఎండలో ఎక్కువ సేపు ఉన్నారంటే మీ చర్మానికి క్యాన్సర్ వస్తుంది. ఎక్కడైతే ఎండ తక్కువగా ఉండే ప్రాంతాలలో జీవిస్తున్నారో చర్మానికి సంబందించిన ఇతర సమస్యలు వాస్తాయి. వక్షోజాల క్యాన్సర్ , కాలాన్ క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, వంటి సమస్యలు, లేదా మల్టిపుల్ స్క్లిరోసిస్, హైబిపి, డయాబెటిస్,గుండె సమస్యలు ఎక్కువ వచ్చే అవకాశంఉందని దీనికి కారణం సూర్య రస్మి తక్కువగా ఉండడమే నని శాస్త్రజ్ఞ్యులు తేల్చారు. మంచి నిద్ర కావాలి ----- సరిగా నిద్రపోవడం మంచి నిద్ర పోవడం చాలా మంచిది. మీ కళ్ళకు సూర్య రస్మి తగలాలి . అది మీ శరీరం లోని అది మీశరీరం లోని ఇతర అవయవాలను సరి చేస్తుంది. ప్రతి రోజూ వచ్చే సూర్య కిరణాలు లేలేత ఉదయ భానుడి కిరణాలు తెల్లారిందని రాత్రి కాలం ముగిసిందని రాత్రి సరిగా నిద్ర పోయారాలేదా అనడానికి సంకేతం.అయితే మీ వయస్సు రీత్యా మీ కళ్ళు చూడ లేకపోవడం గమనించవచ్చు. దీనివల్ల రాత్రి వేళ మీరు సరిగా నిద్ర లేవకపోవడానికి కారణం గా పేర్కొన్నారు. బరువు తగ్గడానికి-- అంటే మీరు మీ శరీరం లో కొవ్వు తగ్గాలంటే---- మీరు తీవ్రంగా ఒబెస్ తో బాధ పడుతున్నారా అయితే ఖర్చులేని చిట్కా ఒకటి చెప్పనా సూర్య రస్మి అంటే సూర్యోదయ కిరణాలు మీ శరీరంలోని కొవ్వును తగ్గిస్తుంది. ఇలా 2౦ -3౦ నిమిషాలు ఉదయం8 గం -నుంచి మాధ్యాహ్నాం చేస్తే ఆవ్యత్యాసం కనిపిస్తుంది. అదీ మీరు సూర్యోదయం వేళ తీసుకుంటే అది పని చేస్తుంది. శాస్త్రజ్ఞుల అభిప్రాయం ప్రకారం సూర్యకిరణాలు కొవ్వు పదార్దాలాను తగ్గిస్తాయి. ఎక్కువ ఎండగా ఉంటె ఎక్కువసేపు సేపు వ్యాయామం చేస్తారు. దీని వల్ల ఎక్కువ బరువు తగ్గుతారు.. సూర్య నమస్కారం- మానవులలో ఉద్వేగాలు తగ్గిస్తుంది--- సూర్య రాస్మి మీ మెదడులో సెరో టానిక్ అనే రసాయనాన్ని అందిస్తోంది. దీని వల్ల మీకు ఎక్కువ శక్తి నిచ్చేందుకు సహకరిస్తుంది. మీరు చాలా ప్రశాంతంగా పోజిటివ్ గా ఉండడం వల్లే అద్భుత మైన సమస్యలను పరిష్కరించే సమార్ధ్యాన్ని దూర దృష్టిని మీకు కలిగించేది సూర్య రస్మి. సూర్య రస్మి కంటి ఆరోగ్యం----- ఆధునిక పరిస్థితులలో జీవితం అంతా అంటే ప్రత్యేకంగా బాల్యం , కౌమారం , యవ్వనం, వివిధ దసలలో మీకు కంటి చూపు సమస్యలువచ్చి ఉండక పోవచ్చు దగ్గరి చూపు సమస్యలు లేదా దూరపు చూపు సమస్యలు రావడానికి కారణం నేరుగా సూర్యుడిని చూడడం కంటి చూపు దెబ్బ తినే ప్రమాదం ఉందని,చూపు మసక  మసక గా ఉండడం అలాగే క్యాట రాక్ట్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెపుతున్నారు. మీ చర్మం పై మీశ్రద్ధ ----- కొంత మంది శాస్త్రజ్ఞులు ప్రధామిక స్థాయిలో చేసిన పరిశోదనలో వివిధ రకాల క్యాన్సర్లు వచ్చినట్లు గుర్తించారు. క్యాన్సర్ లలో మేలనోమా, బాసెల్ సెల్ కార్సినోమా వంటి క్యాన్సర్ లు వచ్చె అవకాశం ఉందని తేల్చారు. దీనికి కారణం ఎక్కువ సేపు ఎండలో గడపడమే అని తేల్చారు. 15 నిమిషాలకు పైగా ఎండలో ఉంటె మాత్రం సన్స్క్రీన్ లేదా కవర్ దీనివల్ల ఆల్ట్రా వైలట్ కిరణాల ప్రభావం తగ్గుతుంది . ఆల్ట్రా వైలెట్ కిరణాలు తక్కువ స్థాయిలో తీసుకుంటే ఎక్సిమా, సోరియాసిస్, బొల్లి,విటిలిగో, వంటి చర్మ వ్యాధులకు ఎండ పనిచేస్తుంది. సూర్య కిరణాలాతో చికిత్స ---- కొన్ని చర్మ సమస్యలకు  జాండిస్ అంటే పచ్చ కామెర్లు వంటి అనారోగ్య సమస్యలకు సూర్య రస్మితో చికిత్స చేయవచ్చు. జాండీస్ వచ్చిన జాండీస్ వచ్చినప్పుడే పుట్టిన బిడ్డ శిశువుకు అది ఉపయోగ పడుతుంది. మీ రక్తంలో బిల్ రూబిన్ వంటి రసాయనం ఎక్కువగా ఉంటె శిశువు చర్మం పసుపు పచ్చగా మారుతుంది. కిటికీకి వెనుక వైపు వచ్చే సూర్య కిరణాలు పిల్లలకు హాని చేయ వచ్చు. బిల్ రూబిన్ ను తగ్గించేందుకు పిల్లలను ముఖ్యంగా అప్పుడే పుట్టిన శిశువును బయట ఎండలో నేరుగా ఉంచవద్దు. అతిగా సూర్య రస్మినితీసుకో కూడదు---- ఎటువంటి సంరక్షణలేకుండా మీరు ఎక్కువ సేపు ఎండలో ఎక్కువసేపు గడిపితే చర్మం క్యాన్సర్ కు దారి తీయ వచ్చు. మీ చర్మం వయస్సు పై బడ్డ ట్టు, ముడతలు పడటం చర్మం  వదులుగా ఉండడం మీ చర్మాన్ని సంరక్షించే రోగ నిరోధక  శక్తి తగ్గించే రక్త కణాలు తగ్గి శరీరం ఇతర వ్యాధుల ను ఎదుర్కునే శక్తిని తగ్గిస్తుంది.  తద్వారా మీఅరోగ్యంప్రమాదంలో పడుతుంది. మీ కంటిని మీరు సంరక్షించు కొండి ------- మీ కంటిని సంరక్షించుకోడానికి కంటి పై ఆల్ట్రా వైలెట్ కిరణాలు పడకుండా సన్ గ్లాస్ ను వాడండి. లేదా పెద్ద పెద్ద టోపీలు కొద్ది సేపు మీరు ఎండలో ఉన్న సూర్య రశ్మి మీ కళ్ళను ఎప్పుడైనా నాశనం చేస్తాయి  కేవలం వేసవి కాలం లోనే కాదు మేఘాలు ఉన్నప్పటికీ కిరణాలు ప్రసరిస్తాయి.మీరు చిన్న పిల్లల విషయం లో ను ఇలాంటి సంరక్షణ తీసుకోడం మర్చి పోవద్దు.  సన్ స్క్రీన్ వాడతారా---- మీరు సన్స్క్రీన్ విషయం లో ను జాగ్రత్తగా ఉండాలి డాక్టర్ సలహా లేకుండా రకరకాల సన్స్క్రీన్ లోషన్లు వాడితే స్కిన్  క్యాన్సర్ కు గురి అయ్యే అవకాశం ఉందని నిపుణులు తేల్చారు. మీరు ఎక్కువ సేపు అంటే15 నిమి షాల నుంచి3౦ నిమిషాల పాటు ఎండలో ఉండాలంటే 3౦ నిమిషాల ముందుగా సన్స్క్రీన్ వేసుకుంటే ఆల్ట్రా వైలెట్ కిరణాల నుండి  మిమ్మల్ని కాపాడు తాయి. మీకు పెదాలు చెవులు మెడ పై ఎక్కువ సన్ స్క్రీన్ వేయండి. మీరు ఒక వేళ ఈతకు వెళ్ళినా ఉదయం 1oగంటల నుండి సాయంత్రం 4గం వరకు దూరంగా ఉండండి. ఈ సమయం లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అది మీ శరీరం పై తీవ్ర ప్రభావం  చూపుతుంది. టన్నింగ్ పడకలు వద్దు---- మీ చర్మం మొత్తం టోన్నింగ్ అయి నట్లైతే కొన్ని లోషన్స్ వాడడం శ్రేయస్కరం. పడకలు సరిగ్గా పడనట్లై తే స్కిన్ క్యాన్సర్ కు దారి తీసే అవకాశం ఉంది. మీకు 3౦ సంవత్సరాల ముందు వస్తే 6౦% మలినోమా కు గురిఅయ్యే అవకాశం ఉంది. ఈ సమస్యకు కొన్ని లోషన్స్ సన్ స్క్రీన్స్ వాడచ్చు.  డెర్మటాల జిస్ట్ దగ్గరకి వెళ్తారా----- ప్రతినెల ఒక్క సారి మీ చర్మాన్ని వీలైనంత వరకు పరీక్షించు కోవాలి. మీ శరీరం పై ఎక్కడెక్కడ ఎలాంటి దద్దుర్లు ఎర్రటి మచ్చలు ఉన్నాయో మీ కుటుంబ సభ్యులకు చూపించండి. అందుకు మీ ఇంట్లో వాళ్ళ సహాయం తీసుకోండి. లేదా మీ ఇంట్లో ఉండే డ్రెస్సింగ్ టేబుల్ పైన ఉండే పొడవైన అద్దం ఉంచుకుని పరిశీలించండి. లేదా చేతిలో అద్దం ఉంచుకుని మీ శరీరాన్ని పరిశీలించండి. ఎక్కడైనా కొత్తగా ఏమైనా మచ్చలు ఒస్తునాయేమో పూర్తిగా పరిశీలించండి.అసహజంగా ఉండే ఎలాంటి వైనాగుర్తిస్తే మీ చర్మ వ్యాధుల నిపుణులను చూడండి. చర్మ సమస్యలకు అడ్డు కట్ట వేయకుంటే సమస్యలే మీ చర్మాన్ని జాగ్రతగా సంరక్షించుకోండి.

కొబ్బరి నీరు ఎక్కువగా తాగుతున్నారా.. ఈ జబ్బులు కొనితెచ్చుకున్నట్లే!

కొబ్బరి నీళ్లను ఆరోగ్యకరమైన పానీయాలలో ఒకటిగా పరిగణిస్తారు. వేసవి కాలంలో శరీరంలో తేమ శాతం మొత్తం కోల్పోతున్నప్పుడు తిరిగి శరీరాన్ని హైడ్రేట్ చేసే ఉద్దేశ్యంతో కొబ్బరి నీరు తాగుతూ ఉంటారు. రహదారుల పక్కన 30 నుండి 50 రూపాయలలోపు లభించే ఈ కొబ్బరి నీరు శీతల పానీయాలకంటే అద్భుతం, ఆరోగ్యం కూడా.  రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో సెలైన్ కొరత ఉన్న సమయంలో దీనిని IV డ్రిప్స్‌లో ఉపయోగించారనే విషయం తెలిస్తే కొబ్బరి నీరు ఎంత శక్తివంతమైందో అర్థం అవుతుంది. అయితే వేసవి తాపాన్ని అరికట్టాలని, వేసవికి చెక్ పెట్టాలని కొబ్బరి నీటిని అతిగా తాగితే మాత్రం కొంప కొల్లేరే అంటున్నారు వైద్యులు. అద్భుతమైన కొబ్బరి నీరు అనోరాగ్యాన్ని ఎలా తెచ్చిపెడుతుందో తెలుసుకుంటే.. కొబ్బరి నీటిలో పొటాషియం చాలా ఎక్కువగా ఉంటుంది, ఇది శరీరంలోని ద్రవ స్థాయిలను సమతుల్యంగా ఉంచడానికి అవసరం. కానీ ఈ పొటాషియం ఎక్కువైతే.. హైపర్‌కలేమియా అనే పరిస్థితికి దారి తీస్తుంది, ఇందులో గుండె కండరాలు రక్తాన్ని కదల్చకుండా చాలా త్వరగా గడ్డకట్టేలా చేస్తుంది. . ఈ సమస్య కారణంగా నత్తిగా మాట్లాడటమనే సమస్య, ఇతర నాడీ సమస్యలు వస్తాయి. చాలా కాలం పాటు ఇది కొనసాగితే గుండె ఆగిపోయే ప్రమాదం ఉంటుంది. కొబ్బరి నీళ్లలో సోడియం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది, 1 కప్పు తాజా కొబ్బరి నీళ్లకు 252 మిల్లీగ్రాముల సోడియం ఉంటుంది. ఇది రోజువారీ తీసుకోవాల్సిన సోఫియం స్థాయిలో పవకు వంతు కంటే ఎక్కువ. ఇలా చూస్తే.. ఎక్కువ కొబ్బరి నీళ్లు తీసుకోవడం వల్ల సోడియం పెరిగి రక్తపోటు లేదా ఇతర సమస్యలు తెచ్చిపెడుతుంది. రోజు వారీ ఆహారంలో శరీరానికి సోడియం అందుతూ ఉంటుంది కాబట్టి కొబ్బరి నీరు మితంగా తీసుకోవాలి. ముఖ్యంగా రక్తపోటు ఉన్నవారు దీంతో జాగ్రత్తగా ఉండాలి.  అధిక బరువు ఉన్నవారు కేలరీలను బర్న్ చేయడంలో చాలా కష్టాలు పడుతుంటారు. కొబ్బరి నీరు తాగితే వెయిట్ లాస్ అవుతారనే ఒక నమ్మకం అందరిలో ఉంది. కానీ కొబ్బరి నీరు అధికంగా తీసుకుంటే ఇందులో కేలరీలు కూడా శరీరం మీద ప్రభావం చూపిస్తాయి. అనేక స్పోర్ట్స్ డ్రింక్స్, పండ్ల రసాలలో ఉన్నంత చక్కెర కొబ్బరి నీళ్లలో లేకపోయినా ఎక్కువ తీసుకుంటే బరువు పెంచగలిగేంత ప్రభావం చూపిస్తుంది.  మధుమేహం ఉన్నవారు కొబ్బరినీరు తీసుకునే విషయంలో తటపటాయిస్తుంటారు. తాగొచ్చనేది చాలామంది నమ్మకం. కొబ్బరి నీళ్లలో చక్కెర శాతం తక్కువగా ఉన్నప్పటికీ, ఇందులో కార్బోహైడ్రేట్లు, కేలరీలు బానే ఉంటాయి. బ్లడ్ షుగర్ ఉన్నవారు ప్రతిరోజూ కొబ్బరి నీళ్లను తీసుకోకూడదు. అలా కాదని రోజూ తీసుకుంటే షుగర్ లెవర్స్ పెరుగుతాయి. కొబ్బరి నీళ్లలో సోడియం ఎక్కువగా ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. సోడియం ఎక్కువగా ఉండటం వల్ల కొందరికి కొబ్బరి నీరు తీసుకున్నప్పుడు షాక్‌గా ఉంటుంది. అధిక రక్తపోటుతో బాధపడుతున్న వ్యక్తులు దీనిని తీసుకోకూడదు ఎందుకంటే ఇది రక్తపోటును పెంచుతుంది. కాబట్టి కొబ్బరి నీరు ఎక్కువగా తాగే ముందు ఈ విషయాలు గుర్తుంచుకోండి.                                      ◆నిశ్శబ్ద.

కడుపు ఉబ్బరం వేధిస్తోందా.. ఈ ఆహారంతో సమస్య పారిపోతుంది!

ఉబ్బరం అనేది అనేది ఇప్పటికాలంలో చాలామంది ఎదుర్కొంటున్న సహజమైన సమస్య. పైకి చాలా సహజం అనేస్తుంటాం కానీ ఇది చాలా సమస్యలకు దారితీస్తుంది. కడుపు బరువు పెరిగినట్టు, లోపలంతా గ్యాస్ నిండుకుపోయినట్టు అనిపిస్తుంది. ఇది కడుపులో నీరు చేరడం  లేదా జీర్ణ సమస్యల వల్ల వస్తుంది. అప్పుడప్పుడు ఇలాంటి సమస్య ఎదురైనా తొందరగా తగ్గిపోతు ఉంటే రోజు డిస్టర్బ్ గా  భావించి దాన్ని సరిచేసుకుంటే సరిపోతుంది. కానీ దీర్ఘకాలిక ఉబ్బరం అనేది ప్రకోప ప్రేగు సిండ్రోమ్, ఉదరకుహర వ్యాధి లేదా గట్ డైస్బియోసిస్ వంటి అంతర్లీన ఆరోగ్య పరిస్థితులకు సంకేతంగా చెప్పవచ్చు. దీన్ని నివారించడానికి సరైన ఆహారం తీసుకోవాలి. ఉబ్బరాన్ని తగ్గించడానికి బోలెడు ఆహారపదార్థాలు ఉన్నాయి. వాటిలో కొన్ని ఇవి.. అల్లం:- అల్లంను శతాబ్దాలుగా జీర్ణ సమస్యలకు సాంప్రదాయ ఔషధంగా ఉపయోగిస్తున్నారు. అల్లంలో జింజెరోల్స్ ఉంటాయి. ఇవి యాంటీ ఇన్ఫ్లమేటరీ,  యాంటీ స్పాస్మోడిక్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి పేగు కండరాలను ఉపశమనం కలిగించి  ఉబ్బరాన్ని తగ్గిస్తాయి. అల్లం జీర్ణ రసాలు,  ఆరోగ్యకరమైన జీర్ణక్రియకు తోడ్పడే ఎంజైమ్‌ల ఉత్పత్తిని కూడా ప్రేరేపిస్తుంది. టీ, చెట్నీ ల దగ్గర నుండి ప్రతిరోజూ అల్లాన్ని వివిధ ఆహాహపదార్థాలలో జోడించి తీసుకోవచ్చు.   పైనాపిల్:- పైనాపిల్‌లో బ్రోమెలైన్ అనే ఎంజైమ్ ఉంటుంది, ఇది ప్రోటీన్ అణువులను విచ్ఛిన్నం చేస్తుంది.  ప్రేగులలో మంటను తగ్గిస్తుంది. ప్రకోప ప్రేగు సిండ్రోమ్,   పెద్దప్రేగులో పండ్లు ఏర్పడటం, వాటి నొప్పి  వంటి జీర్ణ సంబంధ సమస్యలను నయం చేయడంలో  బ్రోమెలైన్ సహాయపడుతుంది.  పెరుగు:- పెరుగులో ప్రోబయోటిక్స్ అని పిలువబడే ప్రయోజనకరమైన బ్యాక్టీరియా ఉంటుంది. ప్రోబయోటిక్స్ గట్ మైక్రోబయోమ్‌ను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది, మంటను తగ్గిస్తుంది మరియు పోషకాల శోషణను మెరుగుపరుస్తుంది. పెరుగులో  కాల్షియం, ప్రోటీన్,  విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.  బొప్పాయి:- బొప్పాయిలో  విటమిన్లు, ఫైబర్ మరియు జీర్ణానికి సహాయపడే  ఎంజైమ్‌లు సమృద్ధిగా ఉంటాయి. పాపైన్ అనేది బొప్పాయి పండు మరియు కాండంలలో కనిపించే ఎంజైమ్. ఇది ఆహారాలలో ప్రోటీన్‌ను విచ్ఛిన్నం చేయడంలో సహాయపడుతుంది, జీర్ణక్రియను సున్నితంగా చేస్తుంది. బొప్పాయి తినడం వల్ల కడుపు ఉబ్బరం, మలబద్ధకం, కడుపు నొప్పి తగ్గుతాయి. సొంపు  విత్తనాలు:- సొంపు గింజలు సాధారణంగా  జీర్ణక్రియకు సహాయపడతాయి. భోజనం చేయగానే కాసింత సొంపు తినడం చాలా చోట్ల కనిపిస్తుంది. రెస్టారెంట్లలో హెవీ ఫుడ్ తిన్నప్పుడు కూడా కాసింత సొంపు తింటే కడుపు భారం కాస్త తగ్గినట్టే అనిపిస్తుంది. ఈ విత్తనాలలో అనెథోల్ ఉంటుంది, ఇది జీర్ణశయాంతర కండరాలను సడలించడం, వాపును తగ్గించడం చేస్తుంది. అంతేకాదు  ఆరోగ్యకరమైన జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. ఫెన్నెల్‌ను పచ్చిగా లేదా ఉడికించి తినవచ్చు. టీలో కూడా  చేర్చుకోచవచ్చు లేదా మసాలా మిశ్రమాలకు జోడించవచ్చు. దోసకాయలు:- దోసకాయలలో నీరు సమృద్దిగా ఉంటుంది. అందుకే ఇది ఉబ్బరాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి మరియు కెఫిక్ యాసిడ్‌తో కూడా నిండి ఉంటుంది, వీటిలో ప్రతి ఒక్కటి జీర్ణాశయ వాపు మరియు చికాకు కలిగించే కణజాలాన్ని ఉపశమనం చేస్తాయి. దోసకాయ జ్యూస్, సలాడ్ లేదా దోసకాయ సూప్‌ వంటి మార్గాలలో  దోసకాయలను తినవచ్చు.                                     ◆నిశ్శబ్ద.

వేసవిలో తొందరగా నీరసం వస్తుందా?.. ఈ ఒక్కటి తింటే మ్యాజిక్ మీకే తెలుస్తుంది!

వేసవి అంటేనే నీరసం. శరీరంలో తేమ శాతం నుండి శక్తి స్థాయిలు తగ్గించడం వరకు చాలా మార్పులు జరుగుతాయి. మంచినీళ్లతో శరీరాన్ని సమర్థవంతంగా ఉంచుకోవడానికి అంత ఛాన్స్ లేదు. తాగిన నీళ్లు తాగినట్టు చెమట ద్వారా బయటకు వెళ్లిపోతుంటాయి. అందుకే పండ్లు, జ్యూస్ లు తీసుకోవాలని చెబుతారు. కానీ అవి కూడా ఎక్కువ కాలం శరీరాన్ని స్టేబుల్ ఉంచలేవు. ఈ అధిక వేడిమిని, ఎండల ధాటిని తట్టుకోవడానికి శక్తి పాళ్లు ఎక్కువ కావాలి. దీనికి బెస్ట్ ఆప్షన్ అత్తిపండు. అందరూ అంజీర్ అని పిలిచే ఈ అత్తిపండు ఈ వేసవిలో శరీరానికి అద్భుతమైన శక్తిని ఇస్తుంది. ఇంతకూ అత్తిపండులో ఉండే పోషకాలు ఏంటి? అవి అందించే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి? పూర్తిగా తెలుసుకుంటే.. అత్తి పండ్లు చెట్టుకు కాచినప్పుడు లేత ఆకుపచ్చ రంగులో ఉంటాయి. పండిన తరువాత ముదురు ఎరుపు రంగులోకి మారి చాలా తియ్యగా ఉంటాయి. ఇవి పండిన తరువాత మూడు నాలుగు రోజులకి మించి నిల్వ ఉండవు. అందుకే వీటిని ఎండబెట్టి నిల్వ చేస్తారు. ఎండిన కొద్దీ మరింత తియ్యగా ఉంటాయి. పండిన పండ్ల కంటే ఎండిన వాటిలో ఎక్కువ పోషక విలువలు ఉంటాయి.  విటమిన్ ఎ,ఇ,కె, క్యాల్షియం, ఐరన్, ఫాస్పరస్, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు ఉంటాయి. ఈ కారణంగా ఏదైనా వ్యాధిబారిన పడి కోలుకుంటున్న వారు తొందరగా బలం పుంజుకుంటారు. అంతేకాదు, ఇది గుండె సమస్యలున్న వారికి చాలా మంచిది. ఎముకలు పెళుసుబారకుండా ఉండాలంటే అత్తిపళ్లు తరచు తింటూ ఉండాలి. అత్తి పండ్లలో ఫైబర్ ఉంటుంది, ఇది మలబద్ధకాన్ని తగ్గించడం, ప్రోబయోటిక్‌గా పనిచేసి జీర్ణ ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంలో సహాయపడుతుంది.  గట్‌లో ఉండే ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాను మరింత పెంచుతుంది. శరీరంలోని ఆక్సీకరణ ఒత్తిడి, రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడంలో అంజీర్‌ పండ్లు సహాయపడతాయి. అంజీర్‌లో ఉండే అబ్సిసిక్ యాసిడ్, మాలిక్ యాసిడ్, క్లోరోజెనిక్ యాసిడ్‌లు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడతాయి. ఆంజీర్ వల్ల కలిగే ప్రయోజనాలు.. కాల్షియం ఫాస్పరస్ అంజీర్ లో అధికంగా ఉంటాయి. దీనివల్ల ఎముకలు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. వేసవిలో బయటకు వెళ్ళినప్పుడు పొటాషియం సమస్య వస్తుంటుంది. పొటాషియం తగ్గితే సోడియం ప్రభావం పెరుగుతుంది. ఇలా జరిగితే రక్త పోటు చాలా ఎక్కువైపోతుంది. పొటాషియం మెండుగా ఉన్న ఆంజీర్ ను తీసుకుంటే కండరాలు, నరాల పనితీరు మెరుగవుతుంది. బయటకు వెళ్ళినప్పుడు కండరాల పనితీరు మందగిస్తే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాలి. కాబట్టి బయటకు వెళ్లేముందు ఒక రెండు అంజీర్ తినడం, లేదా బ్యాగ్ లో వీటిని ఉంచుకోవడం మంచిది. అంజీర్‌లో విటమిన్ సి, ఇ, ఎ వంటి పోషకాలు, శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు  ఉంటాయి. ఇవి చర్మ ఆరోగ్యాన్ని కాపాడతాయి. వేసవిలో అధిక వేడిమి, సూర్యుడి ఎండ వల్ల చర్మానికి కలిగే నష్టాన్ని అత్తిపండు నియంత్రిస్తుంది. కొత్త చర్మకణాలు ఉత్పత్తి కావడం, చర్మం యవ్వనంగా ఉండటం అత్తిపండు వల్ల కలిగే లాభాలు. ◆నిశ్శబ్ద.

వేసవి కాలంలో ఈ మూడు పండ్లు తప్పక తినాలి!

వేసవి కాలం అంటేనే భయం వేస్తుంది.  మనుషుల్ని ఎంతగా హింసించాలో అంతా హింసిస్తుంది ఈ వేసవి. ఉక్కపోత, వడదెబ్బ, అధిక వేడి, శరీరంలో నీటి శాతం తగ్గిపోవడం. ఇలా చాలానే ఉంటాయి. వీటి వల్ల ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. ఇలాంటప్పుడు చల్లగా ఏమైనా తినాలని అనిపిస్తుంది. శరీర అలసట తగ్గి సేదతీరాలని అనిపిస్తుంది. దీనికోసం ఈ వేసవిలో లభ్యమయ్యే పండ్లు చక్కని ఆప్షన్. అధిక ధర లేకుండా అందుబాటులో ఉండే మూడు రకాల పండ్లను తెచ్చుకుంటే వేసవి తాపం అనే మాటే ఉండదు. ఓ కూల్డ్రింక్ బాటల్ కొనే బదులు ఈ పండ్లు కొన్నారంటే గొప్ప ఆరోగ్యమే కాదు, వేసవిని తరిమి కొట్టవచ్చు..  వేసవిలో, శరీరం చాలా త్వరగా డీహైడ్రేట్ అవుతుంది. దీని వల్ల శరీరంలో శక్తి స్థాయి గణనీయంగా పడిపోతుంది. శరీరానికి చల్లదనాన్ని ఇచ్చే పండ్లు, అందరికీ అందుబాటులో ఉండే పండ్లు ఇవే.. పుచ్చకాయ పుచ్చకాయను పిచ్చిగా ఇష్టపడేవారు ఉన్నారు. అధికశాతం నీటితో నిండిన ఈ పండు వేసవిలో ఎంతో మంది ఫెవరేట్ లిస్ట్ లో మొదటి స్థానంలో ఉంటుంది. పుచ్చకాయలు ఆరోగ్యకరమైనవి మాత్రమే కాదు చవగ్గానే దొరుకుతాయి.  ఉందులో విటమిన్ ఎ, మరియు సి పుష్కలంగా ఉంటాయి.  విటమిన్ ఎ రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది, కళ్లకు మేలు చేస్తుంది. ఇక విటమిన్ సి రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. విటమిన్ B6, పొటాషియం పుచ్చకాయలో అధికంగా ఉంటాయి. విటమిన్ B6 రోగనిరోధక శక్తిని ప్రోత్సహిస్తుంది, పొటాషియం శరీరంలో నీటిశాతం తగ్గకుండా చేస్తూంది. గుండెను ఆరోగ్యంగా ఉంచడమే కాక కండరాల తిమ్మిరిని కూడా నివారిస్తుంది. మామిడికాయలు వేసవి అంటేనే మామిడి పండ్లు గుర్తొస్తాయి. మామిడి పండ్లలో అధిక క్యాలరీలు ఉన్నప్పటికీ పోషకాలు కూడా అధికంగా ఉంటాయి. పండ్లలో రారాజు అని పిలిచే మామిడిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. అది మాత్రమే కాదు మామిడిలో 20కి పైగా ఖనిజాలు, విటమిన్లు ఉంటాయి. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఆకలిని నియంత్రించి కడుపు నిండుగా ఉంచుతుంది. మామిడిలో విటమిన్ ఎ, సి, పొటాషియం పుష్కలంగా ఉన్నాయి. మామిడిపండ్లు బోలెడు వ్యాధులను దూరం చేస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచదంలోనూ.. జలుబు ఫ్లూ వంటి జబ్బులను నివారించడంలోనూ సహాయపడతాయి. విటమిన్ సి ఎక్కువగా ఉన్న పండ్లు చర్మానికి కూడా మేలు చేస్తాయి. నారింజ.. నారింజలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది,  అంతేకాదు పొటాషియం మినరల్స్ కూడా ఉంటాయి, ఇవి కండరాల నొప్పిని తిమ్మిరిని తగ్గించడంలో సహాయపడతాయి. నారింజ బలమైన రోగనిరోధక శక్తిని కలిగిస్తుంది. అంటు వ్యాధులతో పోరాడేలా శరీర సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది. వేసవిలో చెమట ఎక్కువగా పడుతుంది. ఈ కారణంగా చెమట ద్వారా పొటాషియం  ఎక్కువ కోల్పోతాము. దీని ఫలితంగా కండరాల తిమ్మిరి, లేదా కండరాల పనితీరు దెబ్బతినడం జరుగుతుంది.  నారింజలో పొటాషియం అధికంగా ఉంటుంది కాబట్టి కండరాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. ముఖ్యంగా వేసవి కాలంలో నారింజ తీసుకోవడం ఉత్తమం. నారింజలో 80% నీరు ఉంటుంది, ఇది శరీరానికి పోషణను అందిస్తూ ఆర్ద్రీకరణకు సహాయపడుతుంది. బయటికి వెళ్లేటప్పుడు నారింజ పండ్లను వెంట ఉంచుకుంటే మరీ మంచిది.  మామిడి, పుచ్చకాయతో పోలిస్తే వీటిని తీసుకెళ్లడం, తినడం కూడా పెద్ద పనికాదు.                                    ◆నిశ్శబ్ద.

తాటి ముంజల గురించి ఈ విషయాలు తెలిస్తే.. తినకుండా ఉండలేరు!

ఏ కాలం వచ్చిన పెద్దగా కలవరపడం కానీ వేసవికాలం వచ్చిందంటే ఉలికులికి పడతాం. రహదారులన్నీ నిప్పుల కుంపట్లుగా మండిపోతాయి, ఇళ్లన్నీ వెచ్చని ఆవిర్లతో కుతకుతలాడతాయి. వీటి మధ్య మనుషుల ప్రాణం వాడిపోయిన మొక్కలా ఊగిసలాడుతూ ఉంటుంది. అయితే ఈ ప్రకృతి చాలా విచిత్రమైనది. కాలానికి తగ్గట్టు కమ్మని రుచులు వెంటబెట్టుకొస్తుంది. వేసవిలో విరివిగా లభించే వాటిలో తాటి ముంజలకు ఓ రేంజ్ ఉంది.. ఐస్ యాపిల్ అని పిలుచుకునే ఈ తాటి ముంజలు తెల్లగా, లేతగా లోపల కాసిన్ని నీళ్లు కలిగి తినడానికి ఎంతో మృదువుగా ఉంటాయి. ఇక వీటి రుచి వర్ణించడం మాటలకందనిది. కేవలం ఇలా రుచికి మాత్రమే కాదు.. ఆరోగ్యాన్ని అందించడంలో కూడా తాటి ముంజలు ది బెస్టు..  వేసవిలో మాత్రమే లభించే వీటిని స్కిప్ చేయకుండా ఎందుకు తినాలి?? వీటి వల్ల కలిగే లాభాలేంటి?? తెలుసుకుంటే… తాటి ముంజల్లో ఉండే పోషకాలేంటంటే.. తాటి ముంజల్లో విటమిన్ బి7, విటమిన్ కె, సోలెబుర్ ఫైబర్, పొటాషియం, కాల్షియం, విటమిన్-ఎ, విటమిన్-డి, విటమిన్-సి, జింక్, ఐరన్ లతో పాటు  న్యూట్రిన్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. తాటి ముంజలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు.. డీహైడ్రేషన్ కు దూరంగా ఉండొచ్చు.. వేసవికాలం అంటేనే శరీరాన్ని వణికించే కాలం. చాలా తొందరగా శరీరంలో తేమ ఆవిరైపోతుంది. శరీరం హైడ్రేట్ గా ఉండటానికి నీరు ఒక్కటే సరిపోదు. ఎన్నో రకాల జ్యూస్లు, పండ్లు తినాల్సి వస్తుంది. ఇవేమీ లేకున్నా తాటి ముంజలు తింటే చాలు, ఎంత ఎండకు అయినా అసలు అలసిపోరు. తాటి ముంజల్లో శరీరానికి కావాల్సినంత మినరల్స్, షుగర్స్ ఉంటాయి. ఇవి శరీరాన్ని బ్యాలెన్స్డ్ గా ఉంచుతాయి. వడదెబ్బ కారణంగా వచ్చే వాంతులు, వికారాలను దూరం ఉంచుతాయి. చలువకు కేరాఫ్ అడ్రస్.. సీజన్లో మాత్రమే లభించే తాటి ముంజలు బెస్ట్ కూలింగ్ ఏజెంట్. శరీరానికి చల్లదనాన్ని అందించడంలో అద్భుతంగా సహాయపడతాయి. వేసవి వల్ల ఒంట్లో పెరిగే వేడిని అమాంతం తగ్గించడంలో తాటి ముంజలు ఫస్ట్ ప్లేస్ లో ఉంటాయి. ముఖం మీద శరీరంలో అక్కడక్కడా వచ్చే వేడి కురుపులు, మొటిమలు తగ్గించడంలో సహాయపడతాయి. క్యాన్సర్ కు కళ్లెం వేస్తుంది.. తాటి ముంజల్లో ట్యూమర్స్‌ను తగ్గించే లక్షణాలు ఉంటాయి. ఇవి బ్రెస్ట్ క్యాన్సర్ కణాలను డవలప్ చేసే ఫైటోకెమికల్స్ ఆంథోసాయనిన్ లను నిర్మూలిస్తాయి. వీటిని తరచుగా తీసుకుంటే.. క్యాన్సర్ కు దూరం ఉండొచ్చు.  అధిక బరువుకు చెక్ పెడుతుంది.. తాటి ముంజల్లో విటమిన్లు, మినరల్స్, ఐరన్, జింక్, పాస్పరస్, పొటాషియం, వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. నీటి శాతం ఎక్కువ, కేలరీలు తక్కువగా ఉండటం వల్ల అధిక బరువుకు చెక్ పెట్టచ్చు. రక్తపోటును దూరంగా ఉండచ్చు.. తాటి ముంజల్లో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల రక్తపోటు నియంత్రణలో ఉంచుకోవచ్చు. పొటాషియం శరీరంలో ఉండే వ్యర్థాలను సమర్థవంతంగా తొలగిస్తుంది. కిడ్నీ, లివర్ సమస్యలు కూడా దూరంగా ఉంటాయి. మలబద్దకంతో ఇబ్బంది పడేవారు తాటి ముంజలు తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. వేసవిలో వచ్చే వేడి వల్ల మోషన్ ప్రొబ్లేమ్స్ వస్తు ఉంటాయి. వాటిని తాటి ముంజలు తీసుకోవడం వల్ల పరిష్కరించవచ్చు,  కడుపు ఉబ్బరం, కడుపులో వికారం, కడుపు నొప్పి, జీర్ణాశయ సమస్యలు కూడా దూరంగా ఉంటాయి.  గర్భవతులకు మంచిది.. గర్భవతులకు కలిగే కండరాల తిమ్మిర్లు, అలసట తగ్గించడంలో తాటి ముంజలు బాగా సహాయపడతాయి..  గర్భిణీ స్త్రీలలో కలిగే వికారం, మలబద్దకం వంటి సమస్యలు తగ్గుతాయి. ప్రసవం తరువాత బాలింతలకు పాలు సమృద్ధిగా పడతాయి. ◆నిశ్శబ్ద.

లివర్‌కు ఇన్ని రకాల సమస్యలు వస్తాయా?

మన శరీరంలోని అతి ముఖ్యమైన అవయవాలలో కాలేయం ఒకటి. ఇది రక్తంలో ఉన్న చాలా రసాయనాల పరిమాణాన్ని నియంత్రించడంలోనూ, శరీరం నుండి వ్యర్థ పదార్థాలను తొలగించడంలో ప్రత్యేక పాత్ర పోషిస్తుంది. కడుపు, ప్రేగుల నుండి వచ్చే రక్తం మొత్తం కాలేయం గుండా వెళుతుంది. కాలేయం కూడా పిత్తాన్ని ఉత్పత్తి చేస్తుంది, ఇది ఆహారం జీర్ణక్రియకు చాలా ముఖ్యమైనది. అందుకే ఈ అవయవం పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరం. కాలేయ వ్యాధులకు సంబంధించిన వ్యాధుల గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం ఏప్రిల్ 19న ప్రపంచ కాలేయ దినోత్సవాన్ని జరుపుకుంటారు. జీవనశైలి, ఆహారం తీసుకోవడంలో ఇబ్బందులు కాలేయానికి  చాలా నష్టం కలిగిస్తాయి. గత ఒకటి లేదా రెండు దశాబ్దాలలో, కాలేయానికి సంబంధించిన  వ్యాధుల కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఆశ్చర్యకరంగా యువత కూడా ఈ సమస్యకు  బాధితులుగా మారుతున్నారు. సర్వే లెక్కల ప్రకారం కాలేయానికి సంబంధించిన వ్యాధుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 1.3 మిలియన్లకు పైగా ప్రజలు మరణిస్తున్నారు. కాలేయానికి వచ్చే కొన్ని తీవ్రమైన వ్యాధులు ఏంటో తెలుసుకుంటే.. ఫ్యాటీ లివర్ డిసీజ్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అనేది కాలేయంలో అదనపు కొవ్వు పేరుకుపోవడం వల్ల వచ్చే సాధారణ సమస్య. ఇందులో  చాలా మందికి ఎటువంటి లక్షణాలు కనిపించవు. నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి, ఈ సమస్య ఆల్కహాల్ తీసుకోని వ్యక్తులకు కూడా వస్తుంది.  జీవనశైలి మార్పులతో దీన్ని నయం చేసుకోవచ్చు. నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్‌కు ప్రధాన కారణం. ఊబకాయం, మధుమేహం, రక్తపోటు. వీటిని నియంత్రించగలిగితే కాలేయ సమస్యలుంల్ రావు. లివర్ ఇన్ఫెక్షన్ సమస్య లివర్ ఇన్ఫెక్షన్ సమస్య కూడా చాలా సాధారణం. హెపటైటిస్ వైరస్ లివర్ ఇన్ఫెక్షన్ కు కారణం అవుతుంది. హెపటైటిస్‌ ఎ , హెపటైటిస్‌ బి, హెపటైటిస్‌ సి వంటి ఇన్‌ఫెక్షన్లు కాలేయానికి తీవ్రమైన సమస్యలను కలిగిస్తాయి. ఇది కాకుండా, కలుషిత ఆహారం లేదా నీటి వల్ల కాలేయం ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది.  ఇన్ఫెక్షన్ ను నిర్లక్ష్యం చేస్తే కాలేయం దెబ్బతినే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కామెర్లు - కాలేయ వ్యాధి కామెర్లు, హైపర్‌బిలిరుబినెమియా అని కూడా పిలుస్తారు, వాస్తవానికి ఇది కాలేయ వ్యాధి. అదనపు బిలిరుబిన్ చేరడం వల్ల ఏర్పడే పరిస్థితి, ఇది చర్మం, కళ్ళు పసుపు రంగులోకి మారడానికి కారణమవుతుంది. బిలిరుబిన్ సాధారణ స్థాయి కంటే ఎక్కువగా ఉండటం కాలేయం లేదా పిత్త వాహిక సమస్యలకు సిగ్నల్ గా పరిగణించబడుతుంది. ఈ కమేర్ల వ్యాధి కేసులు సర్వసాధారణంగా కనిపిస్తాయి. అయితే నిర్లక్ష్యం చేస్తే ప్రాణానికి ప్రమాదం కూడా..                                    ◆నిశ్శబ్ద.

కాఫీ తాగొద్దు ఆరోగ్యానికి నష్టమని బాధపడుతున్నారా?

ఉదయాన్నే కాఫీ గొంతులో పడకపోతే ఏమీ తోచదు చాలా మందికి. పని మొదలుపెట్టాలంటే కాపీ గొప్ప ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. ఒక అంచనా ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ప్రతిరోజూ 2.25 బిలియన్ కప్పుల కాఫీ తాగుతారు. కాఫీ తాగొద్దు ఆరోగ్యానికి మంచిదికాదు అని చాలామంది చెబుతూ ఉంటారు.  అయినప్పటికీ కొన్ని అధ్యయనాలలో, సరైన మోతాదులో కాఫీని తీసుకోవడం వల్ల అనేక తీవ్రమైన వ్యాధులలో ప్రయోజనాలు లభిస్తాయని తెలిసింది. అనేక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా కాఫీ  ప్రయోజనకరంగా ఉంటుంది. కాఫీ  ప్రయోజనాలు, అది కలిగించే హాని గురించి అధ్యయనాలు మిశ్రమ ఫలితాలను కనుగొన్నాయి. సరైన మోతాదులో మరియు సరైన సమయంలో కాఫీ తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుందని అంటున్నారు.  కాఫీ తీసుకోవడం వల్ల కలిగే లాభాలు,  నష్టాల గురించి తెలుసుకుంటే.. కాఫీలో ఏముంటుంది?  కాఫీలో చాలా పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. రిబోఫ్లావిన్ (విటమిన్ బి2), నియాసిన్ (విటమిన్ బి3), మెగ్నీషియం, పొటాషియం, వివిధ ఫినోలిక్ సమ్మేళనాలు,  యాంటీఆక్సిడెంట్లు కాపీలో ఉంటాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ పోషకాలు మన శరీరానికి  ప్రయోజనం చేకూరుస్తాయి. ప్రయోజనాలు ఏమిటంటే.. టైప్ 2 డయాబెటిస్ రిస్క్‌ను తగ్గిస్తుంది.. కాఫీ తీసుకోవడం వల్ల టైప్ 2 డయాబెటిస్ రిస్క్ తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. 2014 అధ్యయన నివేదిక ప్రకారం, 48,000 మందికి పైగా పరిశోధించబడ్డారు మరియు నాలుగు సంవత్సరాలలో రోజుకు కనీసం ఒక కప్పు కాఫీ తాగేవారిలో టైప్ 2 మధుమేహం వచ్చే ప్రమాదం 11 శాతం తక్కువగా ఉందని కనుగొన్నారు. అయితే మధుమేహ వ్యాధిగ్రస్తులు వైద్యుల సలహా మేరకు మాత్రమే కాఫీ తీసుకోవాలి.  కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది.. కెఫిన్ జీవక్రియ రేటును 3-11 శాతం పెంచుతుందని అనేక అధ్యయనాలు చూపిస్తున్నాయి. అందుకే కాఫీని ఫ్యాట్ బర్నింగ్ సప్లిమెంట్‌గా పరిగణించవచ్చు. ఊబకాయం ఉన్నవారి కొవ్వును తగ్గించడంలో కెఫిన్ సహాయపడుతుంది. కాలేయ క్యాన్సర్ ముప్పు తక్కువగా ఉంటుంది.. ఒక అధ్యయనం ప్రకారం, కాఫీ తీసుకోవడం కాలేయ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రోజుకు రెండు నుండి మూడు కప్పుల కాఫీ తాగేవారిలో హెపాటోసెల్యులర్ కార్సినోమా,  క్రానిక్ లివర్ డిసీజ్ వచ్చే ప్రమాదం తగ్గుతుందని US అధ్యయనం నిర్ధారించింది. కాఫీ రక్తపోటును నియంత్రిస్తుంది.. కాఫీలో ఉండే కెఫిన్ రక్తపోటుతో సహా గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఒక అధ్యయనంలో, రోజుకు మూడు నుండి ఐదు కప్పుల కాఫీ తాగడం వల్ల గుండె జబ్బుల ప్రమాదాన్ని 15 శాతం వరకు తగ్గించవచ్చని పరిశోధకులు కనుగొన్నారు నష్టాలేమిటంటే.. జీర్ణమవడంలో  ప్రమాదం కాఫీ వినియోగం కడుపులో యాసిడ్ ఉత్పత్తిని పెంచుతుంది. అదే సమయంలో, శరీరానికి హానికరమైన స్టోమా యాసిడ్ ఉత్పత్తికి కెఫిన్ కూడా కారణం కావచ్చు. దీని కారణంగా జీర్ణవ్యవస్థపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. కాఫీ ఎక్కువగా తీసుకోవడం లేదా కాఫీతో ఉదయం ప్రారంభించడం వల్ల అజీర్ణం, కడుపు ఉబ్బరం, వికారం వంటి సమస్యలు వస్తాయి. డీహైడ్రేషన్ సమస్య తలెత్తుతుంది..  ఉదయం కాఫీతో రోజు ప్రారంభించడం హానికరం. రాత్రిపూట చాలా సేపు కడుపు ఖాళీగా ఉంటుంది.  నీటి కొరతను భర్తీ చేయడానికి ఉదయం నీరు త్రాగాలి. కానీ ఉదయాన్నే కాఫీ తాగితే శరీరంలో నీటి కొరత ఏర్పడి డీహైడ్రేషన్ సమస్య రావచ్చు. కాఫీలో ఉండే కెఫిన్ మూత్రవిసర్జనను పెంచుతుంది, ఇది డీహైడ్రేషన్ ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. వేసవిలో వద్దు.. కాఫీ వల్ల ఎన్ని లాభనష్టాలు ఉన్నా వేసవిలో మాత్రం దానికి దూరంగా ఉండటం మంచిది. కాఫీలో కెఫిన్ శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తుంది. ఈ వేసవిలో ఎంతో హైడ్రేట్ గా ఉండటం అవసరం. కాబట్టి వేసవిలో కాఫీని వీలైనవరకు అవాయిడ్ చేస్తే బెస్ట్.                                  ◆నిశ్శబ్ద.

వేసవిలో ఈ నాలుగు తీసుకుంటే ఎంత ఎండకయినా అలసిపోరు!

వేసవి కాలంలో వేడి గాలి లేదా వేడి స్ట్రోక్ శరీరాన్ని బాహ్యంగా, అంతర్గతంగా ఇబ్బందికి గురిచేస్తుంది. వేడి స్ట్రోక్ కారణంగా అనేక వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. వేసవిలో వేడిగాలి కారణంగా వాత దోషం పెరగడం మొదలవుతుంది.  ఇది చర్మంపై దద్దుర్లు, చర్మం పొడిబారడం, మెరుపు కోల్పోవడం, శరీరంలో తేమశాతం తగ్గడానికి కారణమవుతుంది. అదేవిధంగా ఎసిడిటీ, వికారం, అజీర్ణం వంటి సమస్యలను కూడా ఎదురవుతాయి.  అటువంటి పరిస్థితిలో కేవలం నాలుగే నాలుగు పదార్థాలను తీసుకుంటూ ఉంటే వేడి అనేది మీ శరీరాన్ని ఇబ్బంది పెట్టలేదు. అవేంటో తెలుసుకుంటే.. ఉసిరికాయ.. ఉసిరిలో ప్రయోజనకరమైన ఆయుర్వేద లక్షణాలు ఎన్నో  ఉన్నాయి, వాత పిత్త దోషాలను రెండింటినీ సమతుల్యం చేస్తుంది . ఇది శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. ఉసిరికాయను తీసుకోవడం ద్వారా దగ్గు కూడా తొలగిపోతుంది. ఎండాకాలంలో పచ్చి ఉసిరికాయను  తీసుకోవడం వల్ల శరీరానికి ఎంతో మేలు చేకూరుతుంది. ఉసిరి శరీరాన్ని హీట్ స్ట్రోక్ వల్ల కలిగే నష్టం నుండి కాపాడుతుంది. వేసవిలో ఉసిరి రసాన్ని, పచ్చి కాయను నేరుగా తినడం, , ఊరగాయ, ఉసిరి పొడి ఇలా ఎన్నోరకాలుగా తీసుకోవచ్చు. గుల్కండ్ వేసవి కాలంలో శరీరాన్ని అలసట, నీరసం, మంట, దురద వంటి సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఇది కాకుండా, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం కూడా వేసవిలో కడుపులో మంటను కలిగిస్తుంది. వేసవిలో వచ్చే ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందాలంటే గుల్కండ్ తినాలి. గుల్కండ్ పేగు, కడుపు సమస్యల నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. ఆపిల్ సైడర్ వెనిగర్ వేసవిలో హీట్ స్ట్రోక్ ఉంటే శరీరంలో ఖనిజాలు, ఎలక్ట్రోలైట్ల లోపం ఏర్పడుతుంది. ఉష్ణోగ్రత పెరగడం వల్ల శరీరంలోని పొటాషియం, మెగ్నీషియం వంటి అవసరమైన ఖనిజాల పరిమాణం గణనీయంగా తగ్గుతుంది. దీనిని నివారించడానికి, ఖనిజాల లోపాన్ని తీర్చడానికి, ఆపిల్ వెనిగర్ తీసుకోవాలి. యాపిల్ వెనిగర్ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. రెండు టీస్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్‌ను ఒక గ్లాసు నీటిలో కలిపి రోజుకు రెండుసార్లు తీసుకోవాలి. మారేడు జ్యుస్.. వేసవిలో మారేడు జ్యుస్ ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా పనిచేస్తుంది. మారేడులో విటమిన్ సి, ఫైబర్ పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ జ్యుస్ తీసుకోవడం వల్ల శరీరం చల్లదనాన్ని పొందుతుంది. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. వేసవిలో సంభవించే శారీరక సమస్యల నుండి ఉపశమనం పొందాలనుకుంటే, ఆహారం తీసుకునే ముందు రోజూ రెండుసార్లు మారేడు జ్యూస్ తీసుకోవాలి.                                     ◆నిశ్శబ్ద

పిల్లలు పుట్టడం లేదా... ఇవి ఫాలో అయితే ఫలితాలు ఉంటాయి

పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరూ పిల్లల్ని కనాలని అనుకుంటారు. చాలామందికి పిల్లలను కనడం కల అవుతుంది. పురుషులు  స్త్రీలలో సంతానోత్పత్తి స్థాయిలు రాను రాను తగ్గిపోతున్నాయి. పిల్లలు పుట్టడం లేదని డాక్టర్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నవాళ్ళు కోకొల్లలు. కానీ ఆశించినంత ఫలితాలు ఉండవు.  చాలామంది రోజు వారీ జీవితంలో చేస్తున్న తప్పులను గమనించుకుని కింది చిట్కాలు ఫాలో అయితే పిల్లలు పుట్టడం అనే కల నిజమవుతుంది. చేస్తున్న తప్పులేంటో.. పాటించాల్సినవి ఏంటో వివరంగా తెలుసుకుంటే.. ఆరోగ్యానికి ఆహారం కీలకంగా ఉంటుంది. ఇది సంతానోత్పత్తికి కూడా ఎంతో ముఖ్యం. విటమిన్లు, మినరల్స్, యాంటీఆక్సిడెంట్లు ఫైబర్ వంటి ముఖ్యమైన పోషకాలతో కూడిన ఆహారం సంతానోత్పత్తి స్థాయిలను గణనీయంగా పెంచుతుంది. పండ్లు కూరగాయలు, తృణధాన్యాలు కలిగిన ఆహారాలు, చేపలు, చిక్కుళ్ళు వంటి ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలు చేర్చవలసిన అవస్రం ఎంతో ఉంటుంది.  ప్రాసెస్ చేసిన ఆహారాలు, చక్కెర, అనారోగ్యకరమైన కొవ్వులను తీసుకోవడం తగ్గించడం సంతానోత్పత్తి స్థాయిలను పెంచుతుంది.  ఫోలిక్ యాసిడ్.. ఫోలిక్ యాసిడ్ అనేది మహిళల్లో సంతానోత్పత్తి స్థాయిలను పెంచడంలో సహాయపడే కీలకమైన పోషకం. ఆరోగ్యకరమైన అండోత్సర్గము, ఫలదీకరణ, అండాల అమరికకు ఇది అవసరం. ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉండే ఆహారాలలో ఆకు కూరలు, తృణధాన్యాలు, బీన్స్, గుడ్లు సిట్రస్ పండ్లు ముఖ్యమైనవి. యాంటీ ఆక్సిడెంట్లు.. పురుషులు, స్త్రీలలో ఆరోగ్యకరమైన పునరుత్పత్తి వ్యవస్థకు యాంటీఆక్సిడెంట్లు అవసరం. ఆక్సీకరణ నష్టం నుండి DNA ను రక్షించడంలో, స్పెర్మ్ నాణ్యతను మెరుగుపరచడంలో, అండోత్సర్గాన్ని మెరుగుపరచడంలో ఇవి సహాయపడతాయి. విటమిన్ సి, ఇ, సెలీనియం, బీటా కెరోటిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు గింజలు, పండ్లు, కూరగాయలలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.  కెఫిన్  తో డేంజర్.. కెఫీన్ అనేది కాఫీ, టీ, కొన్ని శీతల పానీయాలలో ఉండే పదార్థం. . అధిక కెఫిన్ తీసుకోవడం వల్ల మహిళల్లో సంతానోత్పత్తి స్థాయిలు తగ్గుతాయి. అందువల్ల, గర్భం ధరించడానికి ప్రయత్నిస్తున్న స్త్రీలు కెఫిన్ తీసుకోవడం తగ్గించాలి.  రోజుకు 200 mg కెఫిన్ కు పరిమితమవ్వాలి.  ఒక కప్పు కాఫీలో 200mg ల కెఫిన్ ఉంటుంది.  ఆల్కహాల్ వద్దు.. మద్యపానం సంతానోత్పత్తి స్థాయిలను గణనీయంగా ప్రభావితం చేస్తుంది. ఆల్కహాల్ స్పెర్మ్ కౌంట్ తగ్గిస్తుంది, టెస్టోస్టెరాన్ స్థాయిలను తగ్గిస్తుంది. మహిళల్లో గర్భస్రావం ప్రమాదాన్ని పెంచుతుంది. అందువల్ల, గర్భం ధరించడానికి ప్రయత్నిస్తున్న జంటలు దీనికి దూరంగా ఉండాలి. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్… మహిళల్లో ఆరోగ్యకరమైన పునరుత్పత్తి వ్యవస్థకు ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు అవసరం. ఇవి హార్మోన్లను నియంత్రించడంలో, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు పురుషులలో వీర్యం నాణ్యతను మెరుగుపరుస్తాయి. చేపలు, గింజలు, విత్తనాలలో  ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉంటాయి.  బరువుతో జాగ్రత్త.. ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడం మొత్తం ఆరోగ్యానికి కీలకం. ఇది సంతానోత్పత్తి స్థాయిలను గణనీయంగా ప్రభావితం చేస్తుంది. అధిక బరువు లేదా తక్కువ బరువు హార్మోన్ ఉత్పత్తికి ఆటంకం కలిగిస్తుంది, ఇది అండోత్సర్గము, స్పెర్మ్ ఉత్పత్తిని ప్రభావితం చేస్తుంది.                                     ◆నిశ్శబ్ద.

కోడి గుడ్డు గురించి నిజాలేంటో తెలుసుకోకుంటే నష్టపోతారు!

ఆహారం అందరికీ ఎంతో అవసరం. ముఖ్యంగా పోషకాహారం తగినంత తీసుకుంటూ ఉంటే ఆరోగ్యంగా ఉండచ్చు. పోషకాలు సమృద్ధిగా ఉన్న ఆహారాలలో గుడ్లు ప్రధానమైనవి. గుడ్లలో మంచి ప్రోటీన్ ఉంటుంది. ఈ కారణంగా రోజుకు ఒక గుడ్డు తినడం మంచిదని వైద్యులు కూడా చెబుతారు. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ గుడ్డు తినాలి. కానీ గుడ్డు గురించి చాలామందికి అపోహలు కూడా ఉంటాయి. గుడ్డు గురించి కొన్ని అపోహలు.. వాస్తవాలు తెలుసుకుంటే. గుడ్లు గుండె ఆరోగ్యానికి చెడ్డవి.. గుడ్లు గురించి ఉన్న చాలా సాధారణ అపోహలలో అవి గుండె ఆరోగ్యానికి చేటు చేస్తాయనేది ఒకటి. అధిక కొలెస్ట్రాల్ కంటెంట్ కారణంగా గుండె ఆరోగ్యానికి హానికరమని భావిస్తారు. అయితే ఆశ్చర్యపోయే నిజం ఏమిటంటే.. , ఆహారంలో ఉండే  కొలెస్ట్రాల్ ఒకప్పుడు అందరూ ఉలనుకున్నట్టు  రక్త కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచదని అధ్యయనాలు కనుగొన్నాయి. గుడ్డు సొనలు LDL (చెడు), HDL (మంచి) కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచే కొవ్వులను కలిగి ఉంటాయి. కాబట్టి గుడ్డు గుండె ఆరోగ్యానికి చేటు అనే విషయం అవాస్తవం. వండిన గుడ్ల కంటే పచ్చి గుడ్లు ఎక్కువ పోషకమైనవి.. చాలా మంది ప్రజలు పచ్చి గుడ్లు చాలా మంచివని నమ్ముతారు. వాసన విషయంలో వేగటుగా ఉన్నా వాటిని తీసుకోవడానికి ఇష్టపడతారు.   పచ్చి గుడ్లలో ప్రోటీన్, విటమిన్ B12 ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ వంటివి ఎక్కువగా ఉంటాయనే విషయం ప్రచారంలో ఉంది.  అయితే పచ్చి గుడ్లను తీసుకోవడం ప్రమాదకరం. పచ్చి గుడ్లు సాల్మొనెల్లా వంటి హానికరమైన బ్యాక్టీరియాను కలిగి ఉంటాయి, ఇవి ఫుడ్ పాయిజనింగ్‌కు కారణమవుతాయి, ఇది వాంతులు, విరేచనాలు, జ్వరానికి దారితీస్తుంది. గుడ్లను ఉడికించడం వల్ల అందులో ఉండే బ్యాక్టీరియా నాశనం అవుతుంది. అప్పుడు వాటిని సురక్షితంగా తినవచ్చు. కాబట్టి పచ్చిగుడ్లు మంచివి కాదు. గుడ్డులోని తెల్లసొనలో ఎక్కువ పోషకాలు ఉంటాయి.. గుడ్డులోని తెల్లసొన మాత్రమే పోషకమైనది, పచ్చసొనలో కొవ్వు మరియు కేలరీలు ఎక్కువగా ఉంటాయని అనుకుంటారు. చాలామంది గుడ్డులో పచ్చ సొనను తీసేసి తింటుంటారు. అయితే అదంతా  అందరూ తెలుసుకోవలసిన ముఖ్యవిషయం ఏమిటంటే..  గుడ్డు పచ్చ సొనలో తెల్లసొనలో లేని అనేక ముఖ్యమైన పోషకాలు ఉంటాయి, వీటిలో విటమిన్ A, D, E మరియు K ఉంటాయి. అదనంగా, గుడ్డు సొనలు ఆరోగ్యకరమైన కొవ్వులను కలిగి ఉంటాయి, ఇవి మొత్తం ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి.  పచ్చ సొన తింటే కడుపు నిండిన ఫీల్ వస్తుంది. ఫలితంగా ఎక్కువసేపు ఆకలిని నియంత్రిస్తుంది. గుడ్లు బరువు పెంచుతాయి… కొంతమంది గుడ్లు తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారని నమ్ముతారు, నిజానికి గుడ్లలో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి, ఇది కడుపు నిండుగా అనిపించేలా చేస్తాయి. ఈ కారణంగా గుడ్లు బరువు నియంత్రించడంలో దోహదపడతాయి తప్ప బరువు పెరగడానికి దారి తీయవు. అంతేకాకుండా, ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం జీవక్రియను పెంచడంలో సహాయపడుతుంది. తెల్ల గుడ్ల కంటే గోధుమ రంగు గుడ్లు ఆరోగ్యకరమైనవి.. చాలా మంది తెల్ల గుడ్ల కంటే గోధుమ రంగు గుడ్లు ఆరోగ్యకరమైనవి అని అనుకుంటారు. అయితే, గుడ్డు పెంకు రంగు దాని పోషక విలువ లేదా నాణ్యతను ప్రభావితం చేయదు. గోధుమ తెలుపు గుడ్ల మధ్య ప్రాథమిక వ్యత్యాసం ఏదైనా ఉందంటే అది గుడ్లు పెట్టే కోడి జాతిని బట్టి ఉంటుంది.   మధుమేహం ఉన్నవారు గుడ్లు తినకూడదు కొలెస్ట్రాల్ కంటెంట్ కారణంగా మధుమేహం ఉన్నవారు గుడ్లు తినకూడదనేది మరొక అపోహ. అయితే, గుడ్లు మితంగా తీసుకోవడం వల్ల మధుమేహం ఉన్నవారిలో గుండె జబ్బులు వచ్చే ప్రమాదం లేదని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇంకా, గుడ్లు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో, ఆకలిని కంట్రోల్ లో ఉంచడంలో సహాయపడతాయి. రోజూ గుడ్లు తినడం క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది రోజూ గుడ్లు తినే అలవాటు చాలా మందికి ఉంటుంది. ఈ అలవాటు  క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందనే వాదనకు ఎటువంటి ఆధారాలు లేవు. దీనికి విరుద్ధంగా, గుడ్లు అవసరమైన పోషకాలను కలిగి ఉంటాయి, ఇవి కణాలను దెబ్బతినకుండా కాపాడతాయి. గుడ్లు తీసుకోవడం వల్ల మహిళల్లో రొమ్ము క్యాన్సర్ రిస్క్ తగ్గుతుందని తేలింది.                                       ◆నిశ్శబ్ద.

కోవిడ్ వచ్చి తగ్గిన వారిలో ఈ ప్రమాదం ఎక్కువగా ఉందట!

మనషుల్ని వేధించే ఆరోగ్య సమస్యలలో ఎన్నో ఉన్నాయి. వాటిలో పార్కిన్సన్స్ వ్యాధి కూడా ఒకటి. పార్కిన్సన్స్ వ్యాధి  మెదడులోని కొన్ని భాగాలలో  ఏర్పడే రుగ్మత, ఇది శారీరక, మానసిక ఆరోగ్యాన్ని చాలా ప్రభావితం చేస్తుంది. సాధారఁంగా ఉన్న జీవితాన్ని ఒక్కసారిగా కుదుపుకు లోనుచేస్తుంది.   2016 సంవత్సరపు గణాంకాల ప్రకారం, దేశంలో సుమారు 6 లక్షల మంది ఈ వ్యాధి బారిన పడ్డారు, అయితే అప్పటికంటే కూడా కరోనా  తర్వాత, పార్కిన్సన్స్ కేసులలో వేగంగా పెరుగుదల కనిపించండం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. పార్కిన్సన్స్ వ్యాధిలో నడకలో మార్పు రావడం, దేనినైనా పట్టుకోవడం కష్టమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఈ సమస్య నివారణ,  అవగాహన కోసం ప్రతి కృషి చెయ్యాలి.  2019 చివరిలో ప్రారంభమైన కరోనా  యొక్క దుష్ప్రభావాలు పార్కిన్సన్స్ వ్యాధి కేసులను  మరింత  పెంచాయని పరిశోధకులు కనుగొన్నారు. సాధారణంగా ఇది ఒకప్పుడు  వృద్ధాప్య సమస్యగా పరిగణించబడేది, అయితే కరోనా మహమ్మారి తర్వాత అయోమయం, జ్ఞాపకశక్తి కోల్పోవడం, శరీర భంగిమలో అసమతుల్యత వంటి పార్కిన్సన్స్ వ్యాధి యొక్క నాడీ సంబంధిత లక్షణాలు ప్రజలలో  ఎక్కువగా కనిపిస్తున్నాయి. కోవిడ్ వైరస్ కారణంగా మెదడు  కేంద్ర నాడీ వ్యవస్థను ప్రభావితం  అయ్యాయి. ఈ అంటువ్యాధి తరువాత, పార్కిన్సస్స్  కేసులు  పెరిగాయి. ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్ విశ్వవిద్యాలయంలోని పరిశోధకులు నిర్వహించిన ఈ అధ్యయనంలో , SARS-CoV-2 వైరస్ పార్కిన్సన్స్ వ్యాధి సమయంలో మెదడులో జరిగే మార్పులను కనుగొన్నారు. వైరస్ ప్రభావం కారణంగా  మెదడులో తాపజనక ప్రతిస్పందనను ప్రేరేపిస్తుందని కనుగొన్నారు. మెదడులోని మైక్రోగ్లియా అనే రోగనిరోధక కణాలపై కరోనా వైరస్ ప్రభావం చూపుతుందని పరిశోధనలో తేలింది. ఈ కణాలు సాధారణంగా పార్కిన్సన్స్ వ్యాధిలో అతిగా చురుగ్గా పనిచేస్తాయి మరియు తాపజనక రసాయనాలను ఉత్పత్తి చేస్తాయి. కాబట్టి కోవిడ్ వచ్చినవారు ఈ వ్యాధి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పార్కిన్సన్స్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇప్పటి వరకు పార్కిన్‌సన్‌ వ్యాధి రావడానికి సరైన కారణం తెలియరాలేదని, దానికి నిర్దిష్టమైన చికిత్స ఏమీ లేదని పరిశోధకులు చెబుతున్నారు. క్రమం తప్పకుండా ఏరోబిక్ వ్యాయామం చేయడం, ఆహారంలో యాంటీఆక్సిడెంట్ల పరిమాణాన్ని పెంచడం వల్ల ఈ వ్యాధి ప్రమాదాన్ని తగ్గించవచ్చని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పార్కిన్సన్స్ వ్యాధి పెరుగుతోంది, దీనిపై ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది. ఆరోగ్యకరమైన అలవాట్లు, మంచి పోషకాహారం, మంచి నిద్ర, శారీరక వ్యాయామంతో పాటు మానసికంగా దృఢంగా ఉండటానికి ప్రయత్నం చెయ్యాలి. ఇందుకోసం ధ్యానం, ప్రాణాయామం చక్కగా పనిచేస్తాయి. నాడీవ్యవస్థను బలోపేతం చేసే చిట్కాలు పాటించాలి.                                             ◆  నిశ్శబ్ద

ధూమపానం మానేయాలనుకుని విఫలమవుతున్నారా.. అయితే ఇలా చేసి చూడండి

ధూమపానం ఆరోగ్యానికి హానికరం అనే మాట అన్నిచోట్లా చెబుతారు. చివరాఖరికి సిగరెట్ ప్యాకెట్ మీద కూడా అదే విషయం రాసి ఉంటుంది.  చాలామంది ఈ ధూమపానం తెచ్చే చేటును దృష్టిలో ఉంచుకుని దాన్ని మానేయాలని ప్రయత్నిస్తుంటారు. కానీ ఇలా ప్రయత్నించేవారిలో విఫలమయ్యేవారే అధికం. ధూమపానం మానేయాలనే నిర్ణయం  జీవితాన్ని మార్చేదే అయినా ఆ ప్రయత్నంలో వైఫల్యం మళ్ళీ దానివైపు వెళ్ళేలా చేస్తుంది.నికోటిన్ తీసుకోవాలనే  కోరిక ధూమపానాన్ని  విడిచిపెట్టడానికి అతిపెద్ద అడ్డంకులలో ఒకటి. నికోటిన్ తీసుకోకుండా ఉండటానికి సహాయపడే కొన్ని చిట్కాలు తెలుసుకుంటే..  ధూమపానం చెయ్యాలని అనిపించినప్పుడు దృష్టి మరల్చడానికి ప్రయత్నించాలి. సినిమా చూడటం,  సంగీతం వినడం వంటి మీరు ఇష్టపడే పనిని చేయడం లేదా వాకింగ్ వెళ్లడం. ఏదైనా ఇతర పనులను చేయడానికి ప్రయత్నించడం చేయాలి. ఇలా చేస్తే  ధూమపానం గురించి ఆలోచించే అవకాశం తక్కువ. నీరు త్రాగడం వల్ల ధూమపానం కోరికలను తగ్గించవచ్చు. కొన్నిసార్లు బాగా  దాహం వేసినప్పుడు అది ధూమపానం చెయ్యాలనే కోరికగా భావిస్తారు.  ఎప్పుడైనా అలా అనిపించినప్పుడు సిగరెట్ వైపు వెళ్ళకుండా.. ఒక గ్లాసు నీరు త్రాగడానికి ప్రయత్నించండి. ఇది మిమ్మల్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంలో సహాయపడటమే కాకుండా, శరీరంలో పేరుకుపోయిన  నికోటిన్‌ను బయటకు పంపడంలో కూడా సహాయపడుతుంది. రెగ్యులర్ వ్యాయామం ధూమపానం కోరికలను తగ్గించడానికి సహాయపడుతుంది. వ్యాయామం ఎండార్ఫిన్‌లను విడుదల చేస్తుంది. ఈ ఎండార్పిన్లు  శరీరం  సహజ అనుభూతి ద్వారా వెలువడే మంచి రసాయనాలు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా మీరు మంచి అనుభూతి చెందుతారు అలాగే ధూమపానం చేయాలనుకునే కోరిక తగ్గుతుంది. చూయింగ్ గమ్ నమలడం లేదా షుగర్ లేని స్వీట్ ను తినడం  వల్ల నోటికి సాటిసిఫాక్షన్ లభిస్తుంది. ఇది  మెదడు చేసే పనిమీద  దృష్టి కేంద్రీకరించడానికి, ఆ పనిమీద ఏకాగ్రత  అందించడానికి కూడా సహాయపడుతుంది. ధూమపానం మానేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు చుట్టుప్రక్కల వారి  సహాయం చాలా అవసరమవుతుంది.  కుటుంబ సభ్యులు  మరియు స్నేహితులతో మాట్లాడి  వారి మద్దతు తీసుకోవాలి.  ధూమపానం మానేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు నికోటిన్ రీప్లేస్‌మెంట్ థెరపీ (NRT) సహాయక సాధనంగా ఉంటుంది. NRT గమ్, ప్యాచ్‌లు, లాజెంజ్‌లు, ఇన్‌హేలర్‌లతో సహా వివిధ రూపాల్లో వస్తుంది. అవి ఓవర్-ది-కౌంటర్‌లో అందుబాటులో ఉన్నాయి. వీటిని ఎలా ఉపయోగించాలో తెలియకపోతే వైద్యులను అడిగి తెలుసుకుని వాడాలి. నీరసం ధూమపానం చేయాలనే కోరికకు  దారి తీస్తుంది. ఎప్పుడూ చురుగ్గా ఉండేలా చూసుకోవాలి. మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోవడానికి ఏదో  ఒకట్ చేయడానికి  ప్రయత్నించాలలి. బిజీగా ఉండటం వల్ల  మనస్సును ధూమపానం గురించి ఆలోచించకుండా చేసుకోవచ్చు.                                              - నిశ్శబ్ద  

యువత మీ హృదయం కాస్త  జాగ్రత్త...

యువతరానికి గుండెపోట ఇదేమిటి అప్పుడే గుండెపోటు ఏమంత వయసు అయ్యిందని యువత గుండెపోటుకు గురిఅవుతున్నారు అన్నది అందరినీ సందిగ్ధం లో పడేసింది. ఇక్కడ దీనికి సంబంధించి ఒక వాస్తవ సంఘటన గుర్తుకు వస్తుంది. అప్పట్లో కేంద్ర మాజీ మంత్రి ఎం పి బండారు దత్తా త్రేయ కుమారునికి 21 సంవస్త్సరాలు యువకుని పేరు వైష్ణవ్ గుండెపోటు తో మరణించినట్లు సమాచారం. అందరూ ఒక్క సారిగా దిగ్బ్రాంతికి గురియారు.పైగా వైష్ణవ్ ఒక వైద్య విద్యార్ధి కావడం గమనార్హం. చిన్నవయస్సులో గుండెపోటు కు గురికావడం పట్ల సర్వత్రా ఉలిక్కి పడ్డారు అప్పుడే మొదలయ్యింది చిన్నవయస్సులో గుండెపోటు ఏమిటి? ఎందుకు వస్తుంది? అన్న ప్రశ్నలకు సమాధానం రాకుండా నివారించాలేమా? అసలు అంత చిన్న వయస్సులో గుండెపోటు ఎందుకు వస్తోంది అన్న అంశాల పై దృష్టి సారించారు నిపుణులు.మనదేశం లో అత్యధిక మరణాలు గుండెజబ్బుల మూలంగానే అని అనడం లో అతిశయోక్తి లేదు.ఒకవైపు ఆధునికత, మరోవైపు పోటీ తత్వం వృత్తి పరంగా,విద్య లో పోటీ పెరగడం తో విపరీతమైన   ఒత్తిడి పెరగడం తో శరీరం లో ని ప్రతి అవయవమూ ఎంతో కొంత ప్రభావం చూపిస్తుంది. అని అంటున్నారు నిపుణులు ఒత్తిడి కారణంగానే రకరకల రోగాల్ బారిన పడడం గమనించవచ్చు.అవే వారి పాలిట మృత్యు ఘంటి కలుగా మారుతున్నాయి. వాటిలో ప్రధాన మైనది క్రానిక్ కరోనరీ ఆర్టరీ డిసీజ్... క్రానిక్ కరోనరీ ఆర్టరీ డిసీజ్ లో గుండె పంపింగ్ సామర్ధ్యం తగ్గిపోతుంది.శరీర అవసరాలకు తగినంత రక్తాన్ని గుండె సరఫరా చేయలేకపోవడం వైద్యులు అంటూ ఉంటారు. ఫలితంగా నీరసం,ఆయాసం, శరీరం లో ని పదాలు చీలమండలాలలో నీరు చేరడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాగే కొంతకాలం కొనసాగితే గుండె కండరం బలహీన పడడం లేదా బిగుతుగా మారడం వల్ల గుండె కొట్టుకునే సామర్ధ్యం తగ్గి రక్త ప్రసరణ లో వేగం తగ్గుతుంది. కొంత కాలానికి అది ప్రనాన్తకంగా మారుతుంది. ఆర్టరీ డిసీజ్ కు కారణాలు... గతంలో గుందేసమస్యలు కేవలం 5౦ సంవత్సరాలు వచ్చిన వారిలోమాత్రమే కనిపించేది.కనీ ఇప్పుడు25 సంవత్సరాల నుండి 4౦ సంవత్సరాల వయస్సు ఉన్న వారిని సైతం గుండెపోటు కు గురికావడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది ఆందోళనకు గురి చేస్తోంది.ప్రాణాలను హరిస్తోంది.గుండె సమస్య ఏదైనా సరే కారణాలు చాలానే ఉంటాయి. చిన్న వయస్సులో గుండెపోటు రావడానికి కారణాలలో ముఖ్యమైనది సరైన జీవన శైలి లేకపోవడమే,లేదా చెడు అలవాట్లు, ముఖ్యంగా పొగ తాగడం, ఒత్తిడికి గురికావడం, కీలక పరిణామం గా వైద్యులు పేర్కొంటున్నారు.గతంలో ఎన్నడూ లేనివిధం గా యువత లో ఒత్తిడికి గురి అవుతున్నారని ఒత్తిడి ఉన్న కనిపించకుండా ఉండేవారని. ఇప్పుడు సహజంగానే జీవితం లో వస్తున్న మార్పులు జీవితం లో కావాల్సిన అవసరాలు పెరగడం ఆశలు పెరగడం తగిన విధంగా పని చేయాల్సి రావడం తో తీవ్ర ఒత్తిడికి కాక తప్పడం లేదు.పిల్లలలో వారి స్థాయికి మించి ఆశించడం వల్ల బాల్యంనుండే పిల్లలు ఒత్తిడికి గురిఅవుతున్నారు.అలా వయస్సు పెరిగే కొద్దీ మరింత బాధ్యతలు పెరిగి ఒత్తిడిని ఎదుర్కోవడం వల్లే ఒకవైపు గుండె సమస్యలు లేదా ఆత్మహాత్యలకు పాల్పడడం మనం చూస్తున్నాము. జీవన శైలి లో మార్పులు కరనమేనా ... ఏ వృత్తిలో ఉన్నవారైనా శారీరక శ్రమ తగినంత ఉండడం లేదు. తగిన వ్యాయామం చేయడానికి తగిన సమయం దొరకడం లేదు. వీరు తీసుకునే ఆహారం కూడాసమతులంగా ఉండకపోవడం చాలా మందిలో అధిక బరువు స్థూలకాయం సాధారణం గా కనిపిస్తుంది. శరీర బరువు కూడా ఒకకారణ మైతే ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న మరణా లకు ప్రాధాన కారణం ఊబకాయామే అని నిపుణులు అభిప్రాయ పడ్డారు.ఇప్పుడు చాలా మంది యువకులలో చాలా మంది రాత్రి పూట మేలుకునే ఉద్యోగాలాలో ఉంటున్నారు. ఇలాంటి వారిలో స్లీప్ ప్యాత్రాన్ సరిగా లేకపోవడం రకరకాల అనారోగ్యాలకు పరోక్షంగా గుండె కిడ్నీ వంటి ముఖ్యమైన అన్ని అవయవాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. అని నిపుణులు పేర్కొన్నారు.ఒత్తిడి ని తగ్గించే క్రమం లో రక రకాల అలవాట్లకు యువత పాల్పడుతోంది.తాత్కాలిక ఉపసమనం కోసం చేసుకునే అలవాట్లు ప్రతిరోజూ అలవాటుగా మారి దీర్ఘకాలం లో శరీరానికి తీవ్ర నష్టం కలిగిస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలవాట్లు వ్యసనాల కారణంగా బిపి రక్త నాళాల పైన తీవ్రమైన ఒత్తిడి నష్టం చేస్తుంది.ఈ కారణంగానే కార్డియో వ్యాస్క్యులర్ సమస్యలు,హార్ట్ ఎట్టాక్ వచ్చే అవకాశాలు ఉన్న్నాయి. హార్ట్ ఎట్టాక్ వచ్చిన వారిలో గుండె కండరం దెబ్బతినడం,లేదా హార్ట్ ఫైల్యూర్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు నిపుణులు గుర్తించారు.పుట్టుకతో వచ్చే అనారోగ్య సమస్యలు కూడా హార్ట్ ఎట్టాక్ కు కారణమౌతాయి. నివారణ సాధ్యమేనా?... గుండె జబ్బులు వయస్సుతో నిమిత్తం లేకుండా ఎవరికైనా రావచ్చు అనే విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలి లక్షణాలు కనపడ్డ వెంటనే ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి. ప్రాణాలకు ప్రమాదం కాకుండా జాగ్రత్త పడడం అత్యవసరం. దీనికోసం చిన్నపాటి జాగ్రతలు పాటించడం అవసరం... వీలైనంత మేరకు ఒత్తిడికి గురి కాకుండా ఉండడా నికి దూరంగా ఉండే ప్రయాత్నం చేయాలి. ఇందుకోసం యోగా ధ్యానం చేయడం ఉత్తమం... ప్రతిరోజూ అరగంట పాటు వ్యాయామం తప్పని సరిగా చేయడం అలవాటు చేసుకోవాలి... సమతుల పోషక ఆహారం పాలు,కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు,ఆహారం లో భాగం చేసుకోవాలి... కుటుంబ సభ్యులతో కాస్త గడపడం వల్ల ఒత్తిడి ని అధిగమించ వచ్చు.ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలే ప్రాణాపాయ స్థితి నుండి మిమ్మల్ని కాపాడ తాయి. ఎంతో భవిష్యత్తు ఉన్న దేశానికీ అవసరం, మీ ప్రాణం అత్యంత విలువైనది. అని గ్రహించండి. మీ ఆరోగ్యం మీగుందే మీచేతుల్లోనే ఉందని గుర్తించండి.  ప్రధాన కారణం ఊబకయమే అని నిపుణులు అభిప్రాయ పడ్డారు.      

ఆరోగ్యం కాపాడుకోవడానికి అద్భుత మార్గాలు ఇవే!

ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. కానీ నేటి కాలంలో మాత్రం సంపద కోసం ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నారు ఎంతోమంది. ఆరోగ్యం అంటే కేవలం శారీరక ఆరోగ్యమే కాదు మానసిక ఆరోగ్యం కూడా ఇవి రెండూ కలిగి ఉండటం ఎంత ముఖ్యం?? రెండూ కావాలంటే ఏమి చెయ్యాలని వైద్యులు ఇలా చెప్పుకొచ్చారు.. మెరుగైన ఆరోగ్యం అంటే.. శారీరక మరియు మానసిక ఆరోగ్యం రెండింటినీ తెలుసుకోవడం, ఈ రెండింటిని కలిగి ఉండటం అవసరం. కరోనా మహమ్మారి సమయంలో ఏర్పడిన ప్రతికూల పరిస్థితులు ఈ వాస్తవాన్ని మరింత బలపరుస్తున్నాయి. ప్రజల మానసిక ఆరోగ్యంపై మహమ్మారి తీవ్ర ప్రభావం చూపిందని ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన అనేక అధ్యయనాలు నిర్ధారించాయి. గత రెండేళ్లలో ఆందోళన-నిరాశ, ఒత్తిడి సంబంధిత రుగ్మతలతో బాధపడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరగడానికి ఇదే కారణం. మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం పట్ల ప్రాధాన్యత పెంచుకోవాలి.  వైద్యుల అభిప్రాయం ప్రకారం.. మెరుగైన మానసిక ఆరోగ్యం లేకుండా, శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోలేము. ప్రజలు దీని గురించి తెలుసుకోవాలి. మానసిక ఆరోగ్యం ఉన్నప్పుడు మనుషుల్లో అజ్ఞానం ఏర్పడుతుంది. దీనివల్ల తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం, ఏ విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం జరుగుతుంది. దీంతో జీవితమంటే పెద్ద సవాలులా మారుతుంది. ఈ మానసిక సమస్యలను అధిగమించడానికి వైద్యులు మూడు మార్గాలు సూచిస్తున్నారు.  భావాలను వ్యక్తపరచడం.. మనసులో ఏమనిపిస్తుందో దాని గురించి మాట్లాడటం బలహీనతకు సంకేతం కాదు. కొంతకాలంగా మీ మనసులో ఏదైనా సమస్య ఉంటే దాన్ని పరిష్కరించుకోవడానికి ఇలా మాట్లాడటం ఒక మార్గం. వ్యక్తుల పట్ల మీ ప్రేమను, భావాలను వ్యక్తపరచండి.  ఇతరులను కూడా అలా చేయడానికి ప్రేరేపించండి. ఏదో దృష్టిలో పెట్టుకుని కూర్చోవడం వల్ల టెన్షన్, ఆందోళన పెరుగుతాయి. ఈ అలవాటు మిమ్మల్ని మరింత ప్రతికూలంగా మార్చగలదు, ఇది మీ మానసిక ఆరోగ్యాన్ని నేరుగా ప్రభావితం చేస్తుంది. మంచి ఆహారం అవసరం.. మనం తినేవి మన శారీరక, మానసిక ఆరోగ్యం రెండింటిపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి. ఈ కారణంగానే ప్రజలందరూ ఆరోగ్యకరమైన, పోషకమైన ఆహారం తీసుకోవాలని సూచించారు. శరీరంలోని ఇతర భాగాల మాదిరిగానే, మీ మెదడు ఆరోగ్యంగా ఉండటానికి, బాగా పనిచేయడానికి పోషకాలు అవసరం. ఆహారంలో ప్రోటీన్లు, విటమిన్లు, ఫైబర్ అధికంగా ఉండే వస్తువులను పెంచాలి. ప్రాసెస్ చేసిన, ప్యాక్ చేసిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. సంతోషాన్ని కలిగించే పని చేయాలి.. మెరుగైన మానసిక ఆరోగ్యానికి సంతోషంగా ఉండటం చాలా ముఖ్యం. దీని కోసం మీకు నచ్చిన పనులను చేయండి, సృజనాత్మకంగా ఉండండి. మిమ్మల్ని మీరు ఆస్వాదించడం ద్వారా అది ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. మీరు ఆనందించే పనులను చేయడం అంటే మీరు దానిలో నైపుణ్యం ఇవ్వగలరు. ఇలా ఏదైనా  సాధించడం మీ ఆత్మగౌరవాన్ని పెంచుతుంది. మంచి పుస్తకాలు చదవడం, మంచి సంగీతం, సైక్లింగ్ మొదలైనవి చింతలను మరచిపోయి మానసిక స్థితిని ఉల్లాసంగా ఉంచడంలో సహాయపడతాయి.  కాబట్టి పైన చెప్పుకున్న ఈ మూడింటిని తప్పకుండా ఫాలో అయితే మానసిక, శారీరక ఆరోగ్యాన్ని నిక్షేపంలా ఉంచుకోవచ్చు.                                     ◆నిశ్శబ్ద.

వేసవిలో వేడి దెబ్బ కొట్టేస్తుందని భయమా.. అయితే మీకోసమే ఇవి!

వేసవి కాలం వచ్చేసింది హైడ్రేటెడ్ గా ఉండాల్సిన అవసరం చాలా ఉందిప్పుడు. బయటకు వెళితేనే కాదు..  ఇంట్లో ఉన్నా ఇప్పటికాలంలో ఉన్న అగ్గిపెట్టల్లాంటి ఇళ్లలో, గాలి వెళుతూ సరిగా లేక శరీరంలో తేమశాతం చాలా తొందరగా తగ్గిపోతుంది. ఈ  వేసవిలో శరీరానికి ఎక్కువ ద్రవపదార్థాలు అవసరమవుతాయి, ఎందుకంటే పెరిగిన ఉష్ణోగ్రత కారణంగా ఎక్కువగా చెమట పడతుంది. ఈ సమస్య అధిగమించడానికి నీరు ఎక్కువగా తాగాలని చెబుతారు. ఎంత నీరు తాగితేనేం.. నిమిషాలు కూడా గడవకముందే మళ్ళీ దాహం వేస్తుంది, నోరు పిడచకట్టుకుపోతుంది.  చల్లగా, హైడ్రేటెడ్ గా ఉండటానికి నీరు కాకుండా అనేక ఆప్షన్స్  ఉన్నాయి. రుచికి రుచి, శక్తికి శక్తి, ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఇంతకంటే కావాల్సిందేముంది?? ఈ వేసవిలో  మిస్ చేసుకోకూడని.. టాప్ 5 బెస్ట్ డ్రింక్స్ ఇవి.. మీరూ వీటిని ట్రై చేసి చక్కగా హాయిగా ఉండండి. సత్తు తెలుగు వారికి ఇది కాస్త కొత్తే.. ఇది బీహార్ రాష్ట్ర పానీయం. దీన్ని పేదవాడి ప్రోటీన్ ఫుడ్ అని కూడా పిలుస్తారు. ఈ ఒక్కమాటతో ఇది ఎంత శక్తివంతమైనదో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం  సత్తు డ్రింక్ ను దేశ వ్యాప్తంగా తాగుతున్నారు.  ఇందులో ఐరన్, మాంగనీస్, మెగ్నీషియం కూడా ఎక్కువగా ఉంటాయి. సోడియం తక్కువగా ఉంటుంది, ఇది మీకు వేగవంతమైన శక్తిని అందించడంతో పాటు కూలింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. ఇందులో కరగని ఫైబర్స్ ఉండటం వల్ల  ఇది ప్రేగులకు కూడా మంచిది. గ్యాస్, మలబద్ధకం, ఆమ్లతను కూడా నియంత్రిస్తుంది, ఇది వేసవిలో శరీరానికి  చల్లదనాన్ని ఇస్తుంది. శనగపిండితో తయారు చేసే ఈ సత్తు పానీయం చాలా శక్తివంతమైంది.   మజ్జిగ.. అల్లం, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, కాస్త మిర్చితో పోపు వేసిన మజ్జిగ తెలుగువారికి చాలా ఇష్టమైనది. ఈ మజ్జిగను కుండల్లో ఉంచి చల్లగా ఉన్నప్పుడు తాగితే.. కలిగే రిలీఫ్ వేరు.  ఇది శరీరంలోని వేడిని తగ్గించడంలోపాటు డీహైడ్రేషన్‌ను నివారించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో ఎలక్ట్రోలైట్‌ లు ఉంటాయి. ఇవి శరీరంలో పుట్టే వేడి కారణంగా నీరు కోల్పోవడాన్ని నివారిస్తుంది. అందుకే మజ్జిగ ది బెస్ట్..  అందులోనూ ఇది గొప్ప ప్రోబయోటిక్  ప్రేగుల ఆరోగ్యాన్ని సంరక్షించడంలో సహాయపడుతుంది. మారేడు జ్యుస్.. శివుడికి ఎంతో ఇష్టమైన మారేడు దళాల గురించి మాత్రమే మనకు తెలుసు. కానీ మారేడు కాయలను జ్యుస్ చేస్తారని మీకు తెలుసా.. ఇది వేడిని అధిగమించడంలో అద్భుతంగా  సహాయపడే ఉత్తమ పానీయాలలో ఒకటి. బేల్ అని పిలుచుకునే ఈ జ్యూస్ లో రిబోఫ్లావిన్ విటమిన్ బి నిండి ఉంటుంది. ఇది శరీరానికి అద్భుతమైన శక్తిని ఇస్తుంది. ఈ సమ్మర్ లో  శరీరానికి శక్తిని అందించడంలో  కీలక పాత్ర పోషిస్తుంది. దోసకాయ పుదీనా జ్యూస్.. దోసకాయలలో  సహజంగా నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. మరోవైపు, పుదీనా ఆకులు చల్లదనాన్ని రిఫ్రెష్‌ నెస్ ను అందిస్తాయి. ఈ రెండింటిని కలపడం  వేసవికి అద్భుతమైన పానీయం రెడీ అయినట్టే..  దోసకాయ, పుదీన జ్యుస్ తయారుచేసి దానికి కాస్త నల్ల ఉప్పు, నిమ్మరసం జోడిస్తే.. అద్భుతంగా ఉంటుంది. ఈ డ్రింక్స్ తో వేసవిని ఈజీగా అధిగమించవచ్చు.బాబోయ్ ఎండలు అని భయపడకుండా ఛిల్ల్ అవుతూ ఫుల్లు హ్యాపీ ఐపోండి..                                    ◆నిశ్శబ్ద.

మధుమేహం, కీళ్ల వాతం ఉన్నవారిలో ఈ లక్షణాలుంటే కొంప మునిగినట్టే!

ఇప్పటి కాలంలో చాలామందిని వేధించే సమస్య ఏదైనా ఉందంటే.. అది మధుమేహం, కీళ్ల వాతం అని చెప్పచ్చు. ఈ రెండింటికి ప్రధాన కారణం అధికబరువు. అదిక బరువు ఉన్నవారిలో మధుమేహం రావడానికి అవకాశాలు ఎక్కువ. ఈ అధిక బరువే.. కీళ్లు అరిగిపోవడానికి కూడా కారణం అవుతుంది. కానీ మధుమేహం, కీళ్ల వాతం   మూత్రపిండాలను ఎంత నాశనం చెయ్యాలో అంతా చేస్తాయి. ఈ సమస్యను కనుగొనడానికి దీనికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. దీని గురించి వివరంగా తెలుసుకుంటే..  మూత్రపిండాల వ్యాధుల లక్షణాలు మూత్రపిండాల పనితీరు తగ్గడం వల్ల శరీరంలోని వ్యర్థాలు పేరుకుపోవడం లేదా ఎలక్ట్రోలైట్ సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. ఈ రకమైన పరిస్థితిలో, అనేక రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వీటి గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.  మూత్రపిండాల వ్యాధి లక్షణాలు.. వికారం వాంతులు, ఆకలి నష్టం, అలసట మరియు బలహీనత, నిద్ర సమస్యలు తరచుగా లేదా అరుదుగా మూత్రవిసర్జన, కండరాల తిమ్మిరి ఇవన్నీ కొన్నిసార్లు కనబడుతూ ఉంటాయి. కానీ మూత్రపిండాల సమస్యలో ఇవి అధికం. మరీ ముఖ్యంగా కేవలం రెండు సమస్యలు చాలా అధికంగా కనబడతాయి. సాధారణం కంటే ఎక్కువసార్లు మూత్ర విసర్జన చేయాల్సి రావడం.. తరచుగా మూత్ర విసర్జన చేయాలని అనిపిస్తుందా? ఈ సమస్య మూత్రపిండాలు, మధుమేహం రెండు వ్యాధులలో సంభవించవచ్చు. అయితే, ముఖ్యంగా రాత్రిపూట ఇటువంటి సమస్య ఏర్పడటం కిడ్నీ వ్యాధికి సంకేతంగా పరిగణించబడుతుంది. మూత్రపిండాల ఫిల్టర్లు క్షీణించడం ప్రారంభించినప్పుడు, ఇది మూత్ర విసర్జన చేయాలనే కోరికను పెంచుతుంది. కొన్నిసార్లు ఇది పురుషులలో యూరినరీ ఇన్ఫెక్షన్ లేదా ప్రోస్టేట్  విస్తరించడానికి సంకేతం కూడా కావచ్చు. చీలమండలు, పాదాలలో వాపులు పాదాలలో వాపు సమస్య కీళ్ళనొప్పుల వల్ల కూడా కావచ్చు, కానీ కిడ్నీ వ్యాధుల విషయంలో కూడా జాగ్రత్త తీసుకోవాలి. చీలమండలు పాదాలలో వాపు, మూత్రపిండాల సమస్యలు, ముఖ్యంగా మూత్రపిండాల పనితీరు స్తంబించడం  వలన సంభవించవచ్చు. దిగువ కాళ్ళలో వాపు గుండె జబ్బులు, కాలేయ వ్యాధి, కాళ్ళ నరాల సమస్యలకు సంకేతంగా పరిగణించబడుతుంది. ఈ సమస్యలకు సకాలంలో వైద్యం తీసుకోవడం చాలా ముఖ్యం.                                   ◆నిశ్శబ్ద.