క్రమం తప్పకుండా బెండకాయ తింటే ఇన్ని లాభాలుంటాయని తెలుసా..

బెండకాయ, లేడీస్ ఫింగర్, ఓక్రా ఇలా పేర్లు ప్రాంతాలకే కానీ కూరగాయ మాత్రం అందరికీ ఒకటే. అమ్మాయిల వేళ్ళలా సుకుమారంగా ఉంటాయని వీటికి ఈ పేరు పెట్టారేమే. లేతగా ఉన్న బెండకాయలు పచ్చివే రుచిగా ఉంటాయి. వీటి విత్తనాలు కాస్త వగరుగా ఉంటాయి. వేగితే మాత్రం వీటి రుచి అద్భుతం. జిగటగా ఉంటుందని పిల్లలు వీటిని ఇష్టపడరు కానీ బెండకాయ నిజంగా గొప్ప ఔషదగుణాలు కలిగి ఉంది. ఇది ఆఫ్రికాకు చెందిన పుష్పించే మొక్క. భారతదేశం, ధక్షిణ అమెరికా సహా ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాలలో కూరగాయగా పరిగణించబడుతుంది.   బెండకాయలో పోషకాలు..  ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి, ఫైబర్ అధికంగా ఉంటుంది.  విటమిన్ A,  C పుష్కలంగా ఉంటుంది.  అలాగే పొటాషియం,  మెగ్నీషియం వంటి ఖనిజాలు ఉంటాయి. ఇది ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉండే ఫ్లేవనాయిడ్లు,  ఫినోలిక్ సమ్మేళనాలతో సహా యాంటీఆక్సిడెంట్లను కూడా కలిగి ఉంటుంది. బెండకాయ క్రమం తప్పకుండా  తీసుకోవడం వల్ల కలిగే  ప్రయోజనాలు తెలిస్తే అదంటే ఇన్నాళ్లు ఇష్టం లేనివారు కూడా హాయిగా తినేస్తారు. దీని లాభాలేంటో తెలుసుకుంటే.. బెండకాయలో  విటమిన్ A,  C, మెగ్నీషియం, పొటాషియం,  కాల్షియం వంటి అవసరమైన పోషకాలు ఉంటాయి. ఇవి శరీరానికి కావసిన  మొత్తం ఆరోగ్యానికి జీవశక్తికి సహకరిస్తుంది. బెండకాయలో ఫైబర్ అధికంగా ఉంటుంది, ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది.  మలబద్ధకాన్ని నివారిస్తుంది.  ప్రయోజనకరమైన బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహించడం ద్వారా  ప్రేగుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. బెండకాయలో  ఫైబర్ కంటెంట్ కొలెస్ట్రాల్ శోషణను తగ్గిస్తుంది, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.  మొత్తం గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. బెండకాయలో పాలీఫెనాల్స్,  ఫైబర్ వంటి సమ్మేళనాలు ఉన్నాయి.  ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి, మధుమేహం  ఉన్నవారు లేదా మధుమేహం వచ్చే ప్రమాదం ఉన్న వ్యక్తులకు ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. బెండకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది, ఇది యాంటీఆక్సిడెంట్ రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది.  అనారోగ్యాలు,  ఇన్ఫెక్షన్ల నుండి శరీరాన్ని రక్షించడంలో సహాయపడుతుంది. బెండకాయలో ఉండే అధిక ఫైబర్ కంటెంట్ కడుపు నిండుగా ఉండేలా చేస్తుంది. ఈ కారణంగా ఆకలిని నియంత్రించడం,  అతిగా తినడాన్ని నిరోధించడంలో సహాయపడుతుంది.  బరువును నియంత్రిస్తుంది. బెండకాయలో విటమిన్ సి, కాల్షియం,  మెగ్నీషియం బలమైన ఎముకలకు సహాయపడతాయి.   బోలు ఎముకల వ్యాధి, ఎముకలు బలహీనంగా ఉండటం, పెలుసుబారడం  వంటి సమస్యలను దూరంగా ఉంచుతుంది. విటమిన్ ఎ,  సితో సహా బెండకాయలోని యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి, చర్మాన్ని యవ్వనంగా ఉంచడానికి , చర్మం కాంతివంతంగా మారడానికి   సహాయపడతాయి. అవి అకాల వృద్ధాప్యం,  ముడతలను నివారించడంలో కూడా సహాయపడతాయి.                                                   *నిశ్శబ్ద.

ఈ ఆహారాలు మీరు ఎక్కువ తింటారా? కీళ్లను చాలా వేగంగా పాడుచేస్తాయట..

మూత్రపిండాలు శరీరంలో ముఖ్యమైన అవయవాలు. ఇవి ప్రతిరోజూ 200లీటర్ల రక్తాన్ని శుద్దిచేయడం ద్వారా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇక కీళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కీళ్ళు ఆరోగ్యంగా లేకపోతే నడవడం, కూర్చోవడం, కదలడం, శరీర అవయవాలను ఉపయోగించడం ఇలా అన్ని విధాలా సమస్యే. ఈ కీళ్లు, మూత్రపిండాలని పాడు చేసే ఆహారాలు కొన్ని ఉన్నాయి. ఈ ఆహారాలలో ఉన్న యూరిక్ యాసిడ్ దీనికి కారణం అవుతుంది. రక్తంలో యూరిక్ యాసిడ్ అధికంగా ఉండటాన్ని హైపర్యూరిసెమియా అంటారు. ఇది గౌట్,  కిడ్నీలో రాళ్లకు కారణమవుతుంది. యూరిక్ యాసిడ్ ప్యూరిన్ అనే మూలకం నుండి తయారవుతుంది. తినే కొన్ని ఆహారాలలో  ప్యూరిన్లు అధిక మొత్తంలో ఉంటాయి. ఇవి తినడం వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయి చాలావేగంగా పెరిగి శరీరంలో కీళ్లు, మూత్రపిండాలకు నష్టం కలుగుతుంది. జంతువుల మాంసం చాలామంది తింటారు. వీటిలో ముఖ్యంగా కాలేయం, మూత్రపిండాలు వంటి ప్రత్యేక అవయవాలను తినడం చాలామంది గొప్పగా ఫీల్ అవుతారు. ఆల్రెడీ యూరిక్ యాసిడ్ సమస్య ఉన్నవారు ఈ ప్రత్యేక అవయవాల మాంసానికి దూరంగా ఉండాలి. సముద్ర జీవులలో కొన్ని రకాల చేపలు, నత్తలు,  యండ్రకాయలు వంటి వాటిలో ప్యూరిన్ లు ఎక్కువగా ఉంటాయి. ఇవి యూరిక్ యాసిడ్ స్థాయిలు పెంచుతాయి. గొడ్డుమాంసం, పంది మాంసం, గొర్రె మాంసంలో కూడా ప్యూరిన్లు పెద్ద మొత్తంలో ఉంటాయి.  వీటిని తినడం సమస్యను పెంచుకున్నట్టు అవుతుంది. ఆల్కహాల్ లో ప్యూరిన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అందుకే ఏ రకమైన వైన్ అయినా, బీర్ అయినా యూరిక్ యాసిడ్ పెరుగుదలకు కారణం అవుతుంది. ఆల్కహాల్ తీసుకునేవారిలో మూత్రపిండాలు వేగంగా చెడిపోవడానికి ఇదే కారణం. శీతల పానీయాలు తియ్యగా ఉంటాయి అనుకుంటారు. కానీ అధిక ప్రక్టోజ్ కార్న్ సిరప్ లు, చక్కెర పానీయాలు యూరిక్ యాసిడ్ స్థాయిలను వేగంగా పెంచుతాయి. ముఖ్యంగా మార్కెట్లో లభించే శీతల పానీయాలు, ప్లేవర్డ్ డ్రింక్స్ లో ఇది అధికం. ఎండిన బీన్స్, బఠాణీలు, కాయధాన్యాలు, ఆస్పరాగస్, బచ్చలికూర, క్యాలీఫ్లవర్, పుట్టగొడుగులు వంటి కొన్ని కూరగాయలలో కూడా ఇతర కూరగాయలకంటే అధిక మొత్తంలో ప్యూరిన్లు ఉంటాయి. వోట్మీల్, గోధుమ ఊక వంటి కొన్ని తృణధాన్యాలు మధుమేహం ఉన్నవారికి, అధిక బరువు ఉన్నవారికి చాలా మంచివని అంటారు. కానీ వీటిలో  ప్యూరిన్లు ఎక్కువగా ఉంటాయి. వీటిని ఎక్కవగా తీసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్  చాలా వేగంగా పెరుగుతుంది.                                                              *నిశ్శబ్ద.  

దంతాలు, ఎముకలు బలంగా ఉండాలంటే వీటిని డైట్లో చేర్చుకోండి..!!

35 ఏళ్ల తర్వాత నెమ్మదిగా దంతాలు-ఎముకల సమస్యలు ఒక్కొక్కటిగా కనిపించడం ప్రారంభిస్తాయి. మనం తినే జంక్ ఫుడ్ మన ఆరోగ్యాన్ని త్వరగా పాడుచేస్తుంది. దంతాలు, ఎముకల ఆరోగ్యం చాలా ముఖ్యమైనది కాబట్టి, పోషక ఆహారాన్ని తినడం మంచిది.  ఎముకలను ఆరోగ్యంగా ఉంచడంలో కాల్షియం, విటమిన్ డి రెండు ముఖ్యమైన అంశాలు. తగినంత కాల్షియం లేని శరీరం పెళుసుగా ఉండే ఎముకలతో సహా ఇతర సమస్యలను త్వరగా ఆహ్వానించవచ్చు. విటమిన్ కె, విటమిన్ సి, మెగ్నీషియం, ఫాస్పరస్ ఎముకల ఆరోగ్యానికి ఇతర ముఖ్యమైన పోషకాలు. కాబట్టి ఏ ఆహారాలు చాలా ముఖ్యమైనవో తెలుసుకుందాం. పాలు: ఎముకలు, దంతాలకు పాలు ఎంతో మేలు చేస్తాయని అందరికీ తెలిసిందే.  అయితే ఇందులోని పోషకాల గురించి మీకు తెలియకపోవచ్చు. ఇది విటమిన్ ఎ, విటమిన్ డి యొక్క మంచి మూలం. ఇది ఎముకలు,  దంతాలకే కాదు , జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి, చర్మం, జుట్టు, గుండెకు కూడా చాలా మంచిది . మానసిక ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కాబట్టి రోజూ ఒక గ్లాసు పాలు తాగడం వల్ల మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. పెరుగు: పెరుగు కాల్షియం యొక్క అద్భుతమైన మూలం. ప్రోబయోటిక్స్‌లో సమృద్ధిగా ఉంటుంది. గుండె ఆరోగ్యం, రోగనిరోధక శక్తి సహా అనేక విధాలుగా పెరుగు ఆరోగ్యానికి ఒక వరం.  ఇది భాస్వరం, పొటాషియం, విటమిన్ B2,  B12 యొక్క అద్భుతమైన మూలం. పెరుగును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్‌ను నివారించవచ్చు. అత్తిపండ్లు: ఎండిన అత్తి పండ్లలో యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇందులో మంచి కాల్షియం కూడా ఉంటుంది. అదనంగా, అత్తి పండ్లను మంచి మొత్తంలో పొటాషియం, విటమిన్ కె అందిస్తుంది. ఎముకల ఆరోగ్యానికి అవసరమైన రెండు సూక్ష్మపోషకాలను కలిగి ఉంటుంది. గుడ్డు: గుడ్లలో ప్రొటీన్లు, విటమిన్ డి, కాల్షియం పుష్కలంగా ఉంటాయి.  గుడ్లలో విటమిన్ డి మంచి మొత్తంలో ఉంటుంది. ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. విటమిన్ డి పచ్చసొనలో మాత్రమే లభిస్తుంది. కాబట్టి మీరు గుడ్డులోని తెల్లసొన ఆమ్లెట్లను తినడానికి ఇష్టపడితే ఎగ్ తినడానికి ప్రయత్నించండి. బాదం: బాదంపప్పులో కాల్షియం, ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ ఇ, ప్రొటీన్లు పుష్కలంగా ఉండటం వల్ల బాదం ఎముకలు, దంతాలకు చాలా మేలు చేస్తుంది. వాస్తవానికి, ఇది జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. మీ గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.  జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.  

నాన్ వెజ్ తిననివారికి సూపర్ ఫుడ్స్ ఇవే..ఇందులో ఐరన్ ఎక్కువ!

మానవ శరీర ఎదుగుదలకు ఒక్కో పోషకం చాలా అవసరం. ఎందుకంటే వాటిలో ఏదో ఒక పోషకాహారం లోపించినా . ఆరోగ్య సమస్యలు వస్తాయి. అందులో ఐరన్ కంటెంట్ కూడా ఒకటి. మానవ శరీరంలోని ప్రతి రక్తనాళానికి ఆక్సిజన్ సరఫరా చేయడం దీని ప్రధాన విధి.ఈ ముఖ్యమైన పోషకాలలో లోపం ఉంటే, దానితో సంబంధం ఉన్న ఆరోగ్యంలో కొన్ని మార్పులు ఉంటాయి. శరీరంలో ఐరన్ లోపించడం వల్ల రక్తహీనత సమస్య కనిపిస్తోందని వైద్యులు చెబుతున్నారు. అయితే ముఖ్యంగా నాన్ వెజ్ తినేవారికి ఐరన్ కంటెంట్ బాగుంటుంది. అయితే నాన్ వెజ్ తిననివారిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఐరన్ కంటెంట్ ఎక్కుగా ఉండే ఆహారాలు ఏవో ఇప్పుడు చూద్దాం. ఐరన్ లోపం ఉంటే: అకస్మాత్తుగా చెమటలు పట్టడం, తల తిరగడం, ఎలాంటి శారీరక శ్రమ లేకున్నా, ఆయాసం, అలసట, ఈ లక్షణాలన్నీ శరీరంలో ఐరన్ లోపానికి కారణం. పాలకూర: చాలా మంది ప్రజలు ఆకు కూరలను తినేందుకు ఇష్టపడరు.  కానీ సహజసిద్ధంగా లభించే ఇలాంటి కూరగాయల్లో మనిషి ఆరోగ్యానికి అవసరమైన అన్ని రకాల పోషకాలు కూడా ఉంటాయి. అందులో పాలకూర ఒకటి.ఈ గ్రీన్ లీఫీ వెజిటేబుల్‌లో ఉండే అధిక నాణ్యత గల విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ కె, జింక్, మెగ్నీషియం, ఐరన్ అనేక వ్యాధుల నుండి దూరంగా ఉంచుతాయి. ప్రధానంగా బచ్చలికూరలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది కాబట్టి, ఇప్పటికే ఐరన్ డెఫిషియన్సీ అనీమియాతో బాధపడుతున్న వారికి ఈ వెజిటేబుల్ చాలా మంచిది. పప్పులు: కేవలం మొక్కల ఆహారాలపై ఆధారపడే మాంసాహారులకు పప్పుల వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ప్రధానంగా పప్పులో ఫైబర్, ప్రొటీన్లు, వివిధ విటమిన్లు, మినరల్స్, ఐరన్,  మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఎరుపు రంగు పప్పుల్లో ఈ పోషకాలన్నీ కాస్త ఎక్కువగానే ఉంటాయని చెబుతున్నారు. అందుచేత ఇంట్లో తయారుచేసే రకరకాల వంటలలో కొన్ని పప్పులను కలుపుకుంటే శరీరంలో ఐరన్ లోపం లక్షణాలు తొలగిపోతాయి. గుమ్మడికాయ గింజలు: గుమ్మడికాయ గింజలు చిన్నగా కనిపించినప్పటికీ, మానవ ఆరోగ్యానికి అవసరమైన అనేక పోషకాలను కలిగి ఉంటాయి. ముఖ్యంగా, ఈ చిన్న విత్తనాలలో ప్రోటీన్, మెగ్నీషియం, రాగి, జింక్, జింక్, ఐరన్ పోషకాలు భారీ మొత్తంలో ఉంటాయి. కాబట్టి ఈ చిన్న గింజలను పచ్చిగా లేదా సాయంత్రం కాల్చి తినవచ్చు. ముఖ్యంగా ఐరన్ కంటెంట్ లోపించి రక్తహీనతతో బాధపడే వారికి దీని వల్ల చాలా ప్రయోజనం ఉంటుంది. డార్క్ చాక్లెట్: చాక్లెట్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు? అలాగే డార్క్ చాక్లెట్ తీసుకోవడం వల్ల శరీరంలో రక్తప్రసరణ మెరుగుపడటమే కాకుండా రక్తపోటు తగ్గి గుండె సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. దీనికి ప్రధాన కారణం కోకో, పాలీఫెనాల్స్ యొక్క బలమైన యాంటీఆక్సిడెంట్ కంటెంట్. కానీ దాని ప్రయోజనాలు రుచికి మాత్రమే పరిమితం కాదు, డార్క్ చాక్లెట్‌లో ఐరన్, మెగ్నీషియం, జింక్ వంటి ముఖ్యమైన ఖనిజాలు కూడా పుష్కలంగా ఉన్నాయి, ఇది ఐరన్ లోపం వల్ల కలిగే రక్తహీనత సమస్యను కూడా తొలగిస్తుంది.

కేవలం ఐదే ఐదు ఆహారాలు తింటుంటే చాలు.. కిడ్నీలు క్లీన్..

కిడ్నీలు శరీరంలో ముఖ్యమైన అవయవాలు. ఇవి ప్రతిరోజూ శరీరంలో 200లీటర్ల రక్తాన్ని శుధ్ధి చేస్తాయి. ఏదైనా కారణం వల్ల కిడ్నీలు పాడైతే ఇక రక్తాన్ని శుద్దిచేయడం కుదరదు. ఈ కారణంగా డయాలసిస్ చెయ్యాల్సి ఉంటుంది. పైగా ఈ ప్రక్రియతో ఎక్కువ కాలం నెగ్గుకురాలేం. కిడ్నీల కారణంగా ఇంత సమస్యలు కొనితెచ్చుకునేపని లేకుండా కిడ్నీలు క్లీన్ గా ఉండాలంటే కేవలం ఐదు ఆహారాలు తీసుకుంటే చాలు. పొటాషియం తక్కువగా ఉన్న ఆహారాలు మూత్రపిండాల వ్యాధికి మంచివిగా పరిగణించబడతాయి. యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి, ఇవి ఫ్రీ రాడికల్స్‌ను తటస్థీకరించడంలో సహాయపడతాయి. కిడ్నీ వ్యాధితో బాధపడేవారు, కిడ్నీ జబ్బులు రాకూడదని అనుకునేవారు ఈ  ఐదు ఆహారాలు తీసుకుంటే కిడ్నీలలో రాళ్ల సమస్య నుండి ఉపశమనం లభిస్తుంది. రెడ్ క్యాప్సికం.. రెడ్ క్యాప్సికమ్ లో  విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు,  ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. వీటిలో పొటాషియం, ఫాస్పరస్,  సోడియం పరిమాణం తక్కువగా ఉంటుంది,   కిడ్నీ సమస్యలు ఉన్నవారు  దాన్ని మొదట్లోనే నియంత్రించాలని అనుకుంటే రెడ్ క్యాప్సికం తినడం మంచిది.  ప్రతిరోజూ అరకప్పు రెడ్ క్యాప్సికం ను ఆహారంలో భాగంగా తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. క్యాబేజీ.. క్యాబేజీ లో విటమిన్ కె, విటమిన్ సి,  ఫైబర్ పుష్కలంగా ఉంటాయి.  అవి మాత్రమే కాదు విటమిన్ బి6,  ఫోలిక్ యాసిడ్‌లు కూడా సమృద్దిగా ఉంటాయి.  ఇందులో పొటాషియం తక్కువగా ఉంటుంది.  డయాలసిస్ రోగులు తమ డైట్‌లో క్యాబేజీ  చేర్చుకుంటే చాలా మంచి ప్రయోజనాలు కలుగుతాయి. ఆకుకూరలు.. ఆకుకూరలలో  విటమిన్లు,  ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ఇది కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచే పనిని పెంచుతుంది. ఇందులో  యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి, ఇవి రక్తాన్ని వడకట్టే పనిని సులభతరం చేయడంలో మూత్రపిండాలకు సహాయపడతాయి. ఉల్లిపాయ.. ఉల్లిపాయలో ఫ్లేవనాయిడ్స్,  క్వెర్సెటిన్ అనే యాంటీఆక్సిడెంట్ ఉన్నాయి. ఇది మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతేకాకుండా, వాటిలో తక్కువ పొటాషియం కూడా ఉంటుంది, ఇది మూత్రపిండాలకు మంచిది. క్యాలీఫ్లవర్.. కాలీఫ్లవర్ విటమిన్ సితో నిండి  ఉంటుంది.  ఫోలేట్,  ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటాయి. క్యాలీఫ్లవర్ బాగా తీసుకోవడం వల్ల  కాలేయంలో ఉండే మురికి పదార్థాలను తటస్థీకరించడంలో సహాయపడే సమ్మేళనాలను కలిగి ఉంటుంది.                                                   *నిశ్శబ్ద.

మధుమేహం ఉన్నవారు పొరపాటున కూడా తినకూడని పండ్లు ఇవే..

డయాబెటిస్ లేదా మధుమేహం అనేది చాలా పెద్ద సమస్య. దీనికి  శాశ్వత నివారణ లేదు. మధుమేహ వ్యాధిగ్రస్తులు వారి రక్తంలో చక్కెరను నియంత్రించడం ద్వారా మాత్రమే మెరుగైన జీవితాన్ని గడపాల్సి ఉంటుంది. రక్తంలో చక్కెరను నియంత్రించడానికి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం.  డయాబెటిక్ రోగులు పండ్లు తినాలా వద్దా  అనే ప్రశ్న చాలామందిలో  తలెత్తుతుంది. డయాబెటిక్ పేషెంట్లు తమ పరిస్థితిని మెరుగ్గా ఉంచుకోవడానికి,  రక్తంలో చక్కెర స్థాయిని,   దాని  లక్షణాలను నియంత్రణలో ఉంచుకోవడానికి  ఆహారంలో పండ్లను ఒక భాగం చేసుకోవాలని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డయాబెటిస్ అండ్ డైజెస్టివ్ అండ్ కిడ్నీ డిసీజెస్ సూచిస్తోంది. పండ్లు,  కూరగాయలు తినడం వల్ల గుండె జబ్బులు,  క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించవచ్చు. పండ్లు విటమిన్లు, ఖనిజాలు,  ఫైబర్  వంటి అద్భుతమైన మూలాలతో కలిగి ఉంటాయి. కొన్ని పండ్లలో అధిక మొత్తంలో చక్కెర కూడా ఉంటుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుకోవడానికి కొన్ని పండ్లను తినకుండా ఉండటానికి కారణం ఇదే. అయితే మధుమేహం ఉన్నవారికి శత్రువు లాంటి  పండ్లు ఉన్నాయి. వాటిని పొరపాటున కూడా ఎప్పుడూ తినకూడదు. పుచ్చకాయ, అరటి పండు.. గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) అనేది ఆహారం తిన్న తర్వాత ఒక వ్యక్తి  రక్తంలో చక్కెర స్థాయి ఎంత పెరుగుతుందో కొలుస్తుంది. ఆహారం  GI స్కోర్ 70 నుండి  100 మధ్య ఉంటే, అది అధిక చక్కెరను కలిగి ఉంటుంది.  పుచ్చకాయ,  అతిగా పండిన అరటిపండ్లు ఈ కోవలో ఉన్నాయి. యాపిల్.. ఒక వ్యక్తి తినే కార్బోహైడ్రేట్ మొత్తం వారి రక్తంలో చక్కెర స్థాయిలపై  ప్రభావాన్ని చూపుతుంది.. యాపిల్,  అరటి పండ్లలో  పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. మామిడి.. మామిడిని పండ్లలో రారాజుగా పిలుస్తుంటారు, ఎందుకంటే దాని రుచి అలాంటిది. కానీ డయాబెటిక్ పేషెంట్ దీన్ని తినేముందు చాలా ఆలోచించాల్సి ఉంటుంది. ఒక మామిడికాయలో 14 గ్రాముల చక్కెర ఉంటుంది, ఇది డయాబెటిక్ రోగులలో రక్తంలో చక్కెర స్థాయిలను గణనీయంగా పెంచుతుంది. పైనాపిల్.. లిచీ.. పైనాపిల్‌లో దాదాపు 16 గ్రాముల చక్కెర ఉంటుంది. దీని GI విలువ కూడా ఎక్కువే. ఇది కాకుండా లిచీ కూడా అలాంటి కంటెంట్ ను కలిగి ఉంటుంది. ఈ జ్యుసి  పండులో 16 గ్రాముల చక్కెర ఉంటుంది. మధుమేహం ఉన్నవారు లిచీ,  పైనాపిల్ తినాలని అనిపిస్తే చాలా  పరిమితంగా  తీసుకోవాలి. మధుమేహం ఉన్నవారు పండ్లరసాలు తాగచ్చా.. భోజనం సమయంలో పండ్ల రసాన్ని తాగడం లేదా  వేరే దేనివల్లనైనా రక్తంలో చక్కెర స్థాయి వేగంగా పెరుగుతుంది. పండ్లను ఎక్కువగా తినేవారికి మధుమేహం వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. కానీ ఎక్కువ మొత్తంలో పండ్ల రసాలు తాగే వ్యక్తులు మధమేహానికి గురయ్యే అవకాశం ఉంది. జ్యూసులకు బదులుగా  మధుమేహం ఉన్నవారు  ఆప్రికాట్లు, బ్లాక్బెర్రీస్, చెర్రీస్, నారింజ, బొప్పాయి, పీచెస్, రేగు, స్ట్రాబెర్రీ  వంటి పండ్లను పుష్కలంగా నేరుగా తీసుకోవచ్చు.                                                                *నిశ్శబ్ద.  

రోజూ ఉదయం ఈ జ్యూస్ తాగితే ఎన్ని ప్రయోజనాలో..!!

రోజుకో ఆపిల్ తింటే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేదని సామేత ఉంది. అవును నిజమే రోజుకో ఆపిల్ తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఆపిల్ తోపాటు ఆపిల్ జ్యూస్ ను రోజువారీ ఉదయపు దినచర్యలో భాగం చేసుకుంటే మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. యాపిల్ జ్యూస్‌లో అవసరమైన పోషకాలు,  యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఆరోగ్యాన్ని కాపాడటంతో కీలక పాత్ర పోషిస్తాయి. రోజూ ఉదయం ఆపిల్ జ్యూస్ తాగితే ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చో ఇప్పుడు చూద్దాం. రోగనిరోధక శక్తిని పెంచుతుంది: యాపిల్ జ్యూస్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక వ్యవస్థను బలపరిచే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్. ఆపిల్ ప్రతిరోజూ తీసుకున్నట్లయితే... మీ శరీరం ఇన్ఫెక్షన్లు,  అనారోగ్యంతో పోరాడటానికి సహాయపడుతుంది. మిమ్మల్ని ఆరోగ్యంగా,  శక్తివంతంగా ఉంచుతుంది. శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది: శరీర పనితీరుకు హైడ్రేటెడ్‌గా ఉండటం చాలా ముఖ్యం. యాపిల్ జ్యూస్ దాహాన్ని తీర్చడమే కాకుండా మీ శరీరాన్ని బాగా హైడ్రేట్ గా ఉంచడానికి అవసరమైన ద్రవాలను కూడా అందిస్తుంది. జీర్ణక్రియకు సహాయపడుతుంది.  చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. సహజ శక్తిని అందిస్తుంది: యాపిల్ జ్యూస్‌లోని సహజ చక్కెరలు శుద్ధి చేసిన చక్కెరల యొక్క హానికరమైన ప్రభావాలు లేకుండా తక్షణ శక్తిని అందిస్తాయి. ఇది కెఫిన్ పానీయాలకు అద్భుతమైన ప్రత్యామ్నాయం, ఇది మీకు సహజమైన, రిఫ్రెష్ ప్రారంభాన్ని ఇస్తుంది. ఆపిల్ జ్యూస్ మీ మెదడును పదునుగా, చురుకుగా ఉంచే సహజ సమ్మేళనాలను కలిగి ఉంటుంది. చర్మ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది: ఆపిల్ జ్యూస్‌లో ఉండే విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు ఆరోగ్యకరమైన, మెరిసే చర్మానికి దోహదం చేస్తాయి. దీని రెగ్యులర్ వినియోగం మచ్చలను తగ్గిస్తుంది, మీ చర్మాన్ని లోపల నుండి హైడ్రేట్ చేస్తుంది. వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది: ఆపిల్ జ్యూస్‌లో డైటరీ ఫైబర్ ఉంటుంది.  ఇది జీర్ణక్రియకు సహాయపడటంతోపాటు.. మలబద్ధకాన్ని నివారిస్తుంది. యాపిల్ రెగ్యులర్ వినియోగం ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థను ప్రోత్సహిస్తుంది. మీ శరీరం పోషకాలను గ్రహించేలా చేస్తుంది.

ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ మూడూ వేరు వేరా? వీటి మధ్య తేడా ఏంటంటే..

ఆరోగ్యం అనగానే ప్రతి ఒక్కరికి శరీరం ఫిట్ గా ఉండటమే గుర్తొస్తుంది. కానీ ఈ మధ్య కాలంలో  శారీరక సమస్యల కంటే మానసిక సమస్యలతో ఇబ్బంది పడేవారే ఎక్కువ. అందుకే మానసిక ఆరోగ్యం మీద రానురానూ అవగాహన పెరుగుతోంది. మానసిక సమస్యల కారణంగా చాలామంది సంతోషకరమైన జీవితానికి దూరం అవుతున్నారు.  విచారించాల్సిన విషయం ఏమిటంటే  తాము మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నామని చాలామందికి తెలియదు. కొందరు ఈ విషయాన్ని అర్థం చేసుకున్నా దానికి  తగిన వైద్యం తీసుకోలేకపోతున్నారు. మానసిక సమస్య అంటే అదేదో తప్పనే భావన, అంటరానితనంలా చూసే చూపు చాలామంది ఈ సమస్యను బయటకు చెప్పుకోవడానికి అడ్డుకుంటుంది. ఈ కారణంగానే అధికశాతం మంది మానసిక సమస్యలు అధిగమించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మానసిక ఆరోగ్యం గురించి తగిన జాగ్రత్తలు తీసుకోలేకపోతే దాని కారణంగా తీవ్రమైన శారీరక సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. ప్రపంచ స్థాయిలో మానసిక ఆరోగ్య సమస్యల గురించి ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో ప్రతి సంవత్సరం అక్టోబర్ 10న ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకుంటారు . మానసిక ఆరోగ్య సమస్యలలో  ఒత్తిడి, ఆందోళన,  నిరాశ వంటి సమస్యలు చాలా సాధారణమైనవి. అయితే ఈ మూడు ఒకటి కాదు, ఇవి  ఒకదానికొకటి భిన్నమైనవి. వాటి మధ్య తేడా ఏమిటో తెలుసుకుని, వాటిని అర్థం చేసుకుంటే.. ఈ సమస్యలను అధిగమించడం కూడా సులువు అవుతుంది. మానసిక ఒత్తిడి..  ఒత్తిడి  ఒక సాధారణ పరిస్థితి.  అది సందర్భానుసారం వస్తూ ఉంటుంది. ఇది  మానసిక లేదా శారీరక సమస్యల వల్ల కూడా సంభవించవచ్చు.  కొన్ని సంఘటనలు లేదా ఆలోచనల కారణంగా ఒత్తిడికి గురవుతూ ఉంటారు. చాలా సందర్భాలలో ఇది దానంతటదే వెళ్లిపోతుంది. అయితే ఒత్తిడి సమస్య చాలా కాలం పాటు కొనసాగితే, అది సాధారణంగా తగ్గకపోతే   ఖచ్చితంగా  వైద్యుడిని సంప్రదించాలి. ఒత్తిడి  అనే విషయాన్ని అర్థం చేసుకుంటే.. ఎప్పుడైనా ఏ విషయంలో అయినా ప్రమాదం అనిపించినప్పుడు, పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నప్పుడు  శరీరంలో కలిగే  ప్రతిస్పందనను ఒత్తిడి అంటారు. పరిస్థితులు డీల్ చేయడం   లేదా నియంత్రించడం కష్టంగా మారుతున్నట్లు అనిపించినప్పుడు ఒత్తిడిలో ఉన్నట్టు చెబుతారు.  సహజంగా పరిస్థితులు మారడంతోనే ఒత్తిడి కూడా తగ్గిపోవడం జరుగుతుంది. ఆందోళన .. ఆందోళనను యాంగ్జిటీ  అని కూడా అంటారు. ఆందోళన ఉన్నవారిలో   భయం, నిలకడగా లేకపోవడం ముఖ్యంగా కలుగుతాయి. ఆందోళలనలో ఉన్నప్పుడు  చెమటలు పట్టడం, చిరాకు,  నాడీ వ్యవస్థలో మార్పులు  అనుభూతి చెందుతారు.  మరీ ముఖ్యంగా   గుండె కొట్టుకోవడం పెరుగుతుంది. ఆందోళన సమస్య తాత్కాలికం. ఇది పరిస్థితులు చక్కబడటంతో పాటే తగ్గిపోతుంది.  అయితే కొన్ని సందర్భాల్లో ఇది దీర్ఘకాలిక దుష్ప్రభావాలను కూడా  కలిగి ఉంటుంది.  ఆందోళన సమస్య మెరుగుపడకపోగా కాలక్రమేణా మరింత తీవ్రమైతే, దానిని యాంగ్జిటీ అని  అంటారు. ఈ సమస్య  రోజువారీ కార్యకలాపాలపై కూడా ప్రభావం చూపుతుంది. చాలా కాలం పాటు కొనసాగే ఈ సమస్య డిప్రెషన్ ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. డిప్రెషన్.. డిప్రెషన్ (డిప్రెసివ్ డిజార్డర్). డిప్రెషన్ ను తీవ్రమైన మానసిక ఆరోగ్య సమస్యగా పరిగణిస్తారు. ఇది ఆలోచనల నుండి పనితీరు వరకు ప్రతి విషయాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. డిప్రెషన్ విచారాన్ని పెంచుతుంది. సంతోషకరమైన జీవితం పట్ల ఆసక్తి కోల్పోయేలా చేస్తుంది. డిప్రెషన్ సమస్య పెరగడం వల్ల ఆత్మహత్య ఆలోచనలు కూడా పెరుగుతాయి. ఇది తీవ్రమైన సమస్య, దీనికి తక్షణమే మానసిక వైద్యుడిని కలవడం చాలా అవసరం.  లేకపోతే పూర్తీ జీవితం మీద దారుణమైన ప్రభావాన్ని చూపిస్తుందిది. ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారు? ఆందోళన,  డిప్రెషన్ మధ్య ప్రధాన వ్యత్యాసం దాని లక్షణాలే అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. డిప్రెషన్ లో ఎప్పుడూ విచారంగా ఉండటం, కుంగుబాటుకు లోనుకావడం జరుగుతుంది. అయితే ఒత్తిడి,  ఆందోళన చాలా వరకు  తాత్కాలికంగా ఉంటాయి.  కొన్ని సందర్భాల్లో వీటి వల్ల కూడా దీర్ఘకాలిక దుష్ప్రభావాల ప్రమాదం  ఉండవచ్చు. ఈ రుగ్మతలకు అనేక కారణాలు ఉండవచ్చు.  వాటిని తొలగించుకోవడానికి చాలా ఓపిక అవసరం. అన్ని వయసుల వారు ఈ సమస్యల బారిన పడే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ  మనస్సును ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఆరోగ్యకరమైన జీవనశైలి, మనసుకు ప్రశాంతత చేకూర్చే పనులు చేయడం అలవాటు చేసుకోవాలి.                                                                 *నిశ్శబ్ద. 

మీకు హైబీపీ ఉందా? ఈ తప్పులు చేయండి. లేదంటే..?

ప్రస్తుత కాలంలో, చాలా మంది ప్రజలు అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు.  దీని కారణంగా గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అంతేకాదు చాలా మంది గుండెపోటు కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. మన బిజీ లైఫ్ స్టైల్,  అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు అధిక బీపీకి కారణమవుతున్నాయి.  అదే సమయంలో, మీకు అధిక బీపీ సమస్య ఉంటే, మీరు కొన్ని తప్పులు చేయకుండా ఉండాలి. ఎందుకంటే మీరు చేసే ఈ తప్పులు ప్రాణాంతకం కావచ్చు. మన శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ రక్త ప్రవాహాన్ని ప్రభావితం చేసినప్పుడు రక్తపోటు సమస్య పెరుగుతుంది. కాబట్టి బీపీ పేషెంట్లు ఈ తప్పులకు దూరంగా ఉండాలి. బీపీని చెక్ చేసుకోవాలి : మీకు రక్తపోటు సమస్య ఉంటే, మీరు ప్రతిరోజూ మీ రక్తపోటును తనిఖీ చేయాలి. ఉదయం నిద్రలేచిన అరగంట తర్వాత బీపీని చెక్ చేసుకోవడానికి ఉత్తమ సమయం. మధ్యాహ్నం పూట రక్తపోటు పెరుగుతుంది కాబట్టి, సాయంత్రం కూడా బీపీని చెక్ చేసుకోవాలి. బీపీ మాత్రలను విస్మరించకూడదు: చాలా సార్లు బీపీ రోగులు రక్తపోటు పెరిగినప్పుడు మందులు తీసుకుంటారు. కానీ, మామూలుగా మారగానే లేదా బద్ధకం వల్ల మందులు తీసుకోవడం మానేస్తారు. బీపీకి చికిత్స జీవితాంతం కొనసాగుతుంది. చికిత్స తీసుకోవాలి: సాధారణ BP 120/80. కానీ, రక్తపోటు 130/90 కంటే ఎక్కువ ఉంటే అది మీకు ప్రమాదకరం. అందువల్ల, మీకు రక్తపోటు సమస్య ఉంటే, దానిని నిర్లక్ష్యం చేయకుండా చికిత్స పొందండి. ఈ పదార్థాలకు దూరంగా: బీపీ రోగులకు ప్రాసెస్ చేసిన ఆహారం విషం.  కాబట్టి మీకు డయాబెటిస్ ఉన్నట్లయితే, మీరు ప్రాసెస్ చేసిన.. స్తంభింపచేసిన ఆహారానికి దూరంగా ఉండాలి. ఎందుకంటే వీటిని తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుంది. బీపీ సమస్య లేని వారు కూడా అలాంటి ఆహారాలకు దూరంగా ఉండాలి.  ఎప్పటికప్పుడు చెక్  చేసుకోవాలి: రక్తపోటు సమస్యలు ఉన్నవారు, వారి బిపి ఎక్కువ లేదా తక్కువ ఉంటే మందులు తీసుకోండి.  బీపీ పేషెంట్లు తమ శరీరాన్ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి.    

సిగరెట్ తాగేవారికి పిల్లలు పుట్టరా? పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే..

ప్రతి మనిషి జీవితంలోనూ పెళ్లి, పిల్లలు, సంసారం అంటూ బోలెడు దశలు మారతాయి.  పుట్టిన వాడు పెరగక మానడు, పెరిగిన వాడు పెళ్లి చేసుకుని పిల్లల్ని కనక మానడు. కానీ ఇప్పటి కాలంలో చాలామంది మగవారు పిల్లలను కనడంలో ఫెయిల్ అవుతున్నారు. నిజానికి ఈ సమాజంలో ఒక స్త్రీకి పిల్లలు పుట్టకపోతే ఎన్నెన్నో మాటలు అంటారు. అదే లోపం మగవాడిలో ఉంటే  అతన్ని కూడా పనికిరాడు అనే మాటను నిర్దాక్షిణ్యంగా అనేస్తుంటారు.  మగవారిలో పిల్లలు కలగడానికి తగిన సామర్థ్యం లేదంటే అది వీర్యకణాల లోపంగా పరిణిస్తారు.  చాలామంది సరదా కోసం, ఫ్యాషన్ కోసం, ఒత్తిడి తగ్గించుకోవడానికి చేసే ధూమపానం  పిల్లలు కలగకపోవడానికి ఒక ప్రధానకారణం అవుతుందనే విషయం ఇప్పుడు ఆందోళనకు గురిచేస్తోంది.  అసలు ధూమపానం మగవారిలో సంతానం కలగకుండా ఉండటానికి ఎలా కారణం అవుతుంది? దీని ప్రభావం ఎంత? మొదలైన విషయాలు వివరంగా తెలుసుకుంటే.. పరిశోధనలు ఏం చెప్పాయంటే.. మగవారిలో ఆరోగ్యకరమైన వీర్యం, వీర్యంలో శుక్రకణాల  సంఖ్య, ఆ శుక్రకణాల కదలిక, వీర్యం చిక్కదనం మొదలైన విషయాలపై మగవారిలో పిల్లలను కనే సామర్థ్యం ఆధారపడి ఉంటుంది.  సంతానోత్పత్తిపై ధూమపానం కలిగించే ప్రభావం గురించి 2016లో జరిగిన ఒక పరిశోధనలో పొగాకు స్పెర్మ్ కౌంట్ ను దారుణంగా దెబ్బతీస్తుందని తెలిసింది. ధూమపానం చేసేవారి  వీర్యంలోని  శుక్రకణాలు అండాలను చేరుకుని ఫలదీకరణం చెందే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ధూమపానం ఎక్కువగా చేసేవారు తమ భాగస్వామితో సంభోగం చేసే సమయంలో అంగస్థంభన విషయంలో చాలా పేలవంగా ఉంటారని సర్వేలు వెల్లడిస్తున్నాయి.  ధూమపానం వల్ల శరీరంలో కలిగే ఆక్సీకణ ఒత్తిడి, తద్వారా ధమనుల పనితీరు మందగించడం వంటి ఇతర కారణాలు కూడా  సంభోగ సమయంలో అంగస్థంభన వైఫల్యానికి దారితీస్తాయి. అందుకే ధూమపానం అలవాటున్నవారు సంభోగం విషయంలో అసంతృప్తిని ఎదుర్కొంటుంటారు.   ఇద్దరికీ నష్టమే.. ధూమపానం చేసేవారు కేవలం వారు మాత్రమే నష్టపోరు. వారి జీవిత భాగస్వాములు కూడా నష్టాన్ని భరించాల్సి వస్తుంది. ఎందుకంటే ధూమపానం చేయడమే కాదు, ఇతరులు ధూమపానం చేసినప్పుడు ఆ పొగను పీల్చడం కూడా దాదాపు అలాంటి నష్టాన్నే కలిగిస్తుంది. అంటే మగవారు ధూమపానం చేస్తే దానికారణంగా ఆడవారు కూడా పిల్లలను కనడంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. కేవలం ఇలా పిల్లలను కనలేకపోవడమే కాదు, పిల్లలు కలగడానికి తీసుకునే వివిధ రకాల చికిత్సలు కూడా ధూమపానం చేసేవారికి సమర్థవంతమైన ఫలితాలు ఇవ్వవు.  అందుకే ధూమపానం చేసే అలవాటు ఉంటే అది పిల్లలు  కలగడంలో దాని ప్రభావాన్ని చూపించకముందే దాన్నిమానేయడం మంచిదని వైద్యులు చెబుతున్నారు. పిల్లల కోసం ప్రయత్నించేవారు తప్పనిసరిగా ధూమపానం మానేయాలని, ఆరోగ్యకరమైన జీవనశైలిని పెంపొందించుకోవాలని హెచ్చరిస్తున్నారు. ఈ సమస్య కూడా పొంచి ఉంది.. ధూమపానం చేసేవారిలో COPD అనే సమస్య వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. COPD అంటే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్. ఇది ఊపిరితిత్తుల నుండి వాయు ప్రసరణకు ఆటంకం కలిగించే దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, దగ్గు, శ్లేష్మం  ఉత్పత్తి,  ఊపిరితీసుకునేటప్పుడు  గురక వంటి లక్షణాలు ఇందులో  ఉంటాయి.  COPD ఉన్న వ్యక్తులలో  గుండె జబ్బులు, ఊపిరితిత్తుల క్యాన్సర్  తో పాటు అనేక ఇతర సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది.                                                    *నిశ్శబ్ద.

ఈ ఆహారాలు రక్తహీనతను దూరం చేస్తాయి..!!

ఆహారం నుండి లభించే పోషకాలు మాత్రమే మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచగలవు. ఇది ఎముకల నొప్పి నుండి రక్తహీనత వరకు అన్నింటిని నయం చేస్తుంది. దీనికి కారణం ఈ ఆహారాలలో లభించే పోషకాలు. మీరు రక్తహీనత వంటి వ్యాధితో కూడా బాధపడుతుంటే, మీరు ఈ ఐరన్‌తో కూడిన ఆహారాలను మీ ఆహారంలో చేర్చుకోవచ్చు. శరీరాన్ని ఐరన్ తో నింపడంతో పాటు రక్తహీనతను కూడా దూరం చేస్తుంది. దీంతో కీళ్ల నొప్పులు, గోళ్ల సమస్యలు, అధిక జ్వరం, కామెర్లు వంటి సమస్యలు దూరమవుతాయి. మీరు ఐరన్  లోపం లేదా రక్తహీనతతో బాధపడుతున్నట్లయితే, మీరు మీ ఆహారంలో ఈ కూరగాయలు, గింజలను చేర్చుకోవచ్చు. ఇవి మీ శరీరంలో ఐరన్ లోపాన్ని తొలగిస్తాయి. ఈ ఫుడ్స్ నొప్పి,  రక్తస్రావం సమస్యల నుండి ఉపశమనం పొందేందుకు సహాయపడతాయి. హిమోగ్లోబిన్ వేగంగా పెరుగుతుంది. వాటి ప్రయోజనాలు, వాటిని ఎలా తినాలో తెలుసుకుందాం. క్యారెట్, బీట్‌రూట్‌లను ఆహారంలో చేర్చుకోండి: బీట్‌రూట్, క్యారెట్ రెండింటిలోనూ ఐరన్ పుష్కలంగా ఉంటుంది. మీరు రక్తహీనతతో బాధపడుతున్నట్లయితే, మీరు వాటిని కూరగాయలతో పాటు జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు. దీని కోసం ఒక కప్పు బీట్‌రూట్, క్యారెట్ తీసుకోవాలి. ఇప్పుడు వాటిని బ్లెండర్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి.  దీన్ని ఫిల్టర్ చేసి రుచికి తగినట్లుగా ఉప్పు, నిమ్మకాయ జోడించండి. ఉదయం ఖాళీ కడుపుతో క్రమం తప్పకుండా త్రాగాలి. ఇది విటమిన్ సిని పెంచుతుంది. అలాగే శరీరంలోని ఐరన్‌ను గ్రహిస్తుంది. వీటిని సలాడ్ రూపంలో కూడా తినవచ్చు. డ్రై ఫ్రూట్స్ కూడా మేలు చేస్తాయి: మీరు ప్రతిరోజూ అత్తి పండ్లను, ఎండుద్రాక్ష,  ఖర్జూరాలను తినవచ్చు. వీటిలో విటమిన్ ఎ, సి, ఐరన్,  మెగ్నీషియం లభిస్తాయి. ఈ మూడు వస్తువులను రాత్రంతా నానబెట్టి ఉంచండి. మీరు ఉదయం నిద్రలేచిన వెంటనే, 2 నుండి 3 ఖర్జూరాలు, అంజిర్,  ఒక చెంచా ఎండుద్రాక్షను తినండి. దీంతో శరీరంలో శక్తి పెరుగుతుంది. ఐరన్ సమం అవుతుంది. వీట్ గ్రాస్: వీట్ గ్రాస్ అనేక పోషకాలు అధికంగా ఉండే గడ్డిలో ఒకటి. ఇందులో బీటా కెరోటిన్, విటమిన్ బి, సి, కె, కాల్షియం, ఫోలిక్ యాసిడ్, ప్రొటీన్, ఐరన్ పుష్కలంగా లభిస్తాయి. ప్రతిరోజూ 3 నుంచి 5 గ్రాముల గోధుమ గడ్డి రసాన్ని తాగడం వల్ల శరీరంలోని రక్తహీనత సమస్య తొలగిపోతుంది. మీ హెచ్‌బిని మెరుగుపరచడంతో పాటు, మీ రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. నల్ల నువ్వులు కూడా దివ్యౌషధం: తెల్ల నువ్వుల కంటే నల్ల నువ్వులు ఎక్కువ ప్రయోజనకరమైనవి. పోషకాలతో సమృద్ధిగా ఉంటాయి. విటమిన్ బి6, ఇ, ఫోలేట్ యాసిడ్, జింక్, ఐరన్, కాపర్,  సెలీనియం నల్ల నువ్వులలో లభిస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలోని అలసట, నొప్పి, రక్తహీనత దూరమవుతాయి. దీన్ని తీసుకోవడానికి, ప్రతి రోజు ఒక టేబుల్ స్పూన్ నల్ల నువ్వులు వేయించుకోండి. దీని తరువాత, ఒక చెంచా తేనె లేదా నెయ్యితో కలపండి. ఐరన్ స్థాయిని పెంచడంతో పాటు శరీరానికి బలం చేకూరుతుంది.   

గంటలు గంటలు డెస్క్ ముందు పనిచేస్తుంటారా? అయితే ఇది మీ కోసమే..

ఇప్పట్లో ఉద్యోగాలన్నీ కంప్యూటర్ల ముందు కూర్చుని చేసేవే ఎక్కువ. డెస్క్ జాబ్ లేదా ఎక్కువసేపు ఒకే చోట కూర్చుని ఉద్యోగం చేయడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని చాలా పరిశోధనలు చెబుతున్నాయి.  ఎక్కువసేపు కూర్చునే ఉద్యోగాల కారణంగా  లైఫ్ స్టైల్ తటస్థంగా మారుతుంది. ఈ  నిశ్చల జీవనశైలి శారీరక,  మానసిక ఆరోగ్యానికి హాని చేకూరుస్తుంది.  ప్రతిరోజూ 8-10 గంటలసేపు  కూర్చొని పని చేస్తుంటే మాత్రం ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.  డెస్క్ ఉద్యోగాలు ఉన్న వ్యక్తులలో  కాలక్రమేణా తీవ్రమైన నరాల సంబంధిత రుగ్మతలు  ఏర్పడే  ప్రమాదం ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు.  ఇది అల్జీమర్స్ వంటి తీవ్రమైన వ్యాధులను కలిగిస్తుంది. చిత్తవైకల్యానికి ప్రధాన కారణాలలో ఒకటైన అల్జీమర్స్ వ్యాధి ఇంతకు ముందు వరకు 60 ఏళ్లు పైబడిన వారిలో ఎక్కువగా వచ్చేది. కానీ   ఈ వ్యాధి ముప్పు  ఇప్పుడు ఎక్కువ సేపు డెస్క్ ముందు కూర్చుని పనిచేసేవారిలో  పెరుగుతోంది. నిశ్చల జీవనశైలి,  చిత్తవైకల్యం ప్రమాదం.. కొన్ని దశాబ్దాల క్రితం వరకు పెద్దవారిలో చిత్తవైకల్యం లేదా అల్జీమర్స్ వ్యాధి ప్రమాదం చాలా తక్కువగా పరిగణించబడింది.  కానీ కాలక్రమేణా కేవలం పెద్ద వయసులోనే కాకుండా  అన్ని వయసుల వారిలో ఈ ప్రమాదం ఎక్కువ అయ్యే అవకాశం ఉంది.  ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, ప్రస్తుతం 55 మిలియన్ల మంది అల్జీమర్స్-డిమెన్షియాతో బాధపడుతున్నారు. జీవనశైలి సమస్యల కారణంగా ఈ ప్రమాదం మరింత పెరిగింది. కొన్ని అధ్యయనాల ప్రకారం  ప్రతిరోజూ 10 గంటల కంటే ఎక్కువసేపు కూర్చొని ఉద్యోగం చేస్తే  డిమెన్షియా సమస్య  అభివృద్ధి చెందుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. నిశ్చలంగా పనిచేయడం ప్రమాదం ఎందుకంటే.. అమెరికన్లలో చేసిన ఒక పరిశోధనలో సగం కంటే ఎక్కువ మంది అమెరికన్లు రోజుకు తొమ్మిదిన్నర గంటల కంటే ఎక్కువ సమయం కూర్చొని గడుపుతారు ఈ అలవాటు మెదడు వృద్ధాప్యం,  అభిజ్ఞా  పనితీరు మందగించడం వంటి  వాటితో  ముడిపడి ఉంటుంది. ఒకే చోట ఎక్కువసేపు ఆఫీసులో కూర్చోవడమే కాకుండా, ఎక్కువసేపు కూర్చొని టీవీ  చూడడం, కంప్యూటర్లలో పని చేయడం,  డ్రైవింగ్ చేయడం వంటివి ఉంటాయి. ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారంటే.. డిమెన్షియా ప్రమాదాల గురించి అధ్యయనం నిపుణుల ప్రకారం  స్థూలకాయం, అధిక రక్తపోటు,  మధుమేహం వంటి అనేక రకాల ఆరోగ్య సమస్యలకు నిశ్చల జీవనశైలి ఇప్పటికే కారణమవుతోందని  తెలిపారు. దీని కారణంగా ఇప్పుడు చిత్తవైకల్యం వచ్చే ప్రమాదం కూడా పెరుగుతోంది.  ఒకే చోట కూర్చుని పనిచేయడం వల్ల శరీరంలో రక్తప్రవాహం మందగిస్తుంది.   ఇది మెదడుకు రక్త ప్రవాహాన్ని తగ్గించడం ద్వారా సెరెబ్రోవాస్కులర్ వ్యాధి ప్రమాదాన్ని పెంచుతుంది.                                                             *నిశ్శబ్ద. 

వామును ఎలా తీసుకుంటే ఆరోగ్యం.. ఎవరు తీసుకోకూడదు తెలుసా

వాము వంటింట్లో ఉండే ఒక గొప్ప ఔషదం. కొన్నిరకాల వంటలలో చిటికెడు వామును జోడించడం చాలా మంచిదని పెద్దలు చెబుతారు.  ఇది ఆకలిని పెంచుతుంది,  జీర్ణశక్తిని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఉబ్బరం, అసిడిటీ వంటి సమస్యలతో  అసౌకర్యంగా  ఉన్నప్పుడు వాటిని పరిష్కరిస్తుంది.  ప్రాచీన కాలం నుండే వామును జ్వరం, కడుపు నొప్పి నుండి  నెలసరి ఇబ్బందుల వరకు అనేక సమస్యలు చికిత్స చేయడానికి ఉపయోగించబడింది. వాము గింజలను స్నాక్స్, పిండి వంటలు,  వివిధ రకాల  మసాలాలోనూ ఉపయోగిస్తారు. కడుపుకు సంబంధించిన సమస్యలు,  ప్రేగులు వదులుగా మారడం, దగ్గు మొదలైన  సమస్యలకు వాము గింజల కషాయాన్ని ఆయుర్వేదంలో మొదటి  చికిత్సగా ఉపయోగిస్తారు. వాము గింజలు   యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్,  క్రిమిసంహారక లక్షణాలను కలిగి ఉంటాయి. వామును దేంతో కలిపి తీసుకుంటే ఏ సమస్యలు నయమవుతాయంటే.. నల్ల ఉప్పుతో పాటు వాము పొడి  కలిపి తీసుకుంటే కడుపు నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. నెయ్యి,  పంచదారతో కలిపి వాము గింజల పొడిని తీసుకుంటే   నెలసరి సమయంలో తక్కువగా అయ్యే రక్తస్రావాన్ని సమం చేస్తుంది.  గర్భాశయాన్ని క్లియర్ చేస్తుంది. పెర్షియన్ సాంప్రదాయ వైద్యులు చెవికి సంబంధించిన సమస్యలను  చికిత్స చేయడానికి వాము గింజల నుండి తీసిన నూనెను  కళ్లు, చెవి చుక్కల మందుగా  ఉపయోగించారు. మధ్యప్రదేశ్‌లోని కొన్ని తెగలలో వాము గింజలను  బెల్లం లేదా గుడ్డు,  గోరువెచ్చని నెయ్యితో కలుపుతారు.   గర్భధారణ తర్వాత మహిళలకు శక్తిని అందించడానికి తినిపిస్తారు. ఎన్నో ఏళ్ళ నుండి  బరువు తగ్గడానికి సహజ ఔషధంగా వాము గింజలను  ఉపయోగిస్తున్నారు. వాములో  థైమోల్‌తో సహా  అనేక  సమ్మేళనాలు జీవక్రియను మెరుగుపరచడమే కాకుండా కొవ్వు కణాల విచ్ఛిన్నానికి కూడా సహాయపడతాయి. వాము గింజలతో మరికొన్ని అద్భుతమైన ప్రయోజనాలు  ఉన్నాయి..  బ్యాక్టీరియా,  శిలీంధ్రాలతో పోరాడుతుంది,  కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగుపరుపరుస్తుంది,  రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది.  పెప్టిక్ అల్సర్లను నయం చేయడంలో,  అజీర్ణం నుండి ఉపశమనం కలిగించడంలో సహాయపడుతుంది. ఇందులో  యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. వామును ఎలా తీసుకోవచ్చంటే.. 1 గ్లాసు గోరువెచ్చని వాము నీరు ఉదయాన్నే డిటాక్స్ వాటర్‌గా తీసుకోవడం ఉత్తమ మార్గం. జీర్ణక్రియ సమస్య పరిష్కారం కోసం వాము నూనెను బొడ్డు బటన్‌పై అప్లై చేయవచ్చు. ఇది చేయడం చాలా సులభం.  ఒక కప్పు వేడినీటిలో ఒక టీస్పూన్ వాము గింజలను వేసి ఉడికించాలి. ఇలా వాము టీ తయారుచేసుకోవాలి.  దీన్ని తేనెతో తీసుకోవచ్చు లేదా అదనపు రుచి కోసం కొంచెం నిమ్మకాయను జోడించవచ్చు. వాము ఎవరు తీసుకోకూడదంటే? గర్భిణీ స్త్రీలు వాము తీసుకుంటే తీవ్రమైన వాంతులు, వికారం,  మైకము కలిగించవచ్చు. చిన్న పిల్లలు, అలెర్జీలు ఉన్న వ్యక్తులు, రక్తపోటు మందులు తీసుకునే వ్యక్తులు, శస్త్రచికిత్సలు చేయించుకున్నవారు వామును తీసుకోకూడదు.                                                       *నిశ్శబ్ద.  

ఖాళీ కడుపుతో టీ-కాఫీ బదులు బీట్ రూట్ జ్యూస్ తాగితే ఎన్ని ప్రయోజనాలో..!!

చాలామందికి ఉదయం లేవగానే కాఫీ, టీ తాగే అలవాటు ఉంటుంది. కాఫీ, టీ తాగనిదే రోజూ ప్రారంభం కాదు. వీటిని తీసుకోవడం వల్ల ప్రయోజనాలతోపాటు నష్టాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా వీటిని ఖాళీ కడుపుతో తాగినట్లయితే ఎసిడిటి వంటి సమస్యలు వేధిస్తుంటాయి. అందుకే ఈ మధ్య కాలంలో చాలా మంది కాఫీ, టీలకు ప్రత్యామ్నాయంగా హెర్బల్ టీల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే ప్రతిరోజూ అల్పాహారానికి ముందు ఒక కప్పు బీట్ రూట్ జ్యూస్ తాగడం అలవాటు చేసుకోండి. దీని వల్ల ఎన్నో అరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. గుండెకు చాలా మంచిది: బీట్‌రూట్‌లో చాలా నైట్రేట్‌లు ఉంటాయి. కాబట్టి ఇది రక్త నాళాలకు మంచిది. రక్తపోటును తగ్గిస్తుంది. మరీ ముఖ్యంగా గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. మీ శరీరం యొక్క నాడీ వ్యవస్థను ప్రశాంతంగా ఉంచడంతోపాటు మీ రక్తపోటు తక్కువగా ఉండటం వలన గుండె జబ్బులు రాకుండా చేస్తుంది. క్యాన్సర్‌తో పోరాడుతుంది: బీట్‌రూట్ జ్యూస్ తాగడం వల్ల పెద్ద మొత్తంలో బీటాసైనిన్ లభిస్తుంది. ఇది యాంటీఆక్సిడెంట్, ఇది ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది. మీ శరీరంలో క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తుంది. బీట్‌రూట్ జ్యూస్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఉన్నాయి, ఇవి మీ శరీరంలోని ఏ భాగానైనా మంటను నివారిస్తాయి. కాలేయ ఆరోగ్యానికి మంచిది: రోజూ ఉదయాన్నే కాఫీ టీకి బదులు బీట్‌రూట్ జ్యూస్ తాగడం అలవాటు చేసుకుంటే సహజంగానే కాలేయాన్ని కాపాడుకోవచ్చు. ఎందుకంటే బీట్‌రూట్ జ్యూస్‌లో బీటైన్ ఉంటుంది, ఇది కాలేయ సంబంధిత ఫ్యాటీ లివర్ వ్యాధిని నివారిస్తుంది. మీకు ఇప్పటికే ఈ సమస్య ఉంటే, దాన్ని నయం చేసే ఉపాయం బీట్‌రూట్‌లో ఉంది. అందువల్ల, మీ కాలేయంలో కొవ్వు పదార్ధం పేరుకుపోయే అవకాశం లేదు, మీ శరీరంలో విషపూరిత అంశాలు ఉంటాయి. స్కిన్ గ్లో పెరుగుతుంది: బీట్‌రూట్ జ్యూస్‌ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మీ చర్మ సౌందర్యం మెరుగుపడుతుంది. చర్మ ఆరోగ్యం కూడా ఎక్కువగా, చర్మానికి సంబంధించిన సమస్యలు ఉండవు. ఇది కాకుండా, బీట్‌రూట్ నుండి మీకు ఎక్కువగా లభించే ఐరన్ కంటెంట్ మీ చర్మంలోని కణాల పెరుగుదలను పెంచుతుంది. రక్తహీనత సమస్యను తొలగిస్తుంది. ఇది మీ చర్మం, జుట్టు యొక్క ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. ప్రధానంగా హైపర్పిగ్మెంటేషన్ సమస్య తొలగిపోతుంది. బీట్‌రూట్‌లో ఫైటోన్యూట్రియెంట్‌లు ఎక్కువగా ఉన్నందున, మధుమేహ వ్యాధిగ్రస్తులు ప్రతిరోజూ అరకప్పు బీట్‌రూట్ జ్యూస్ తాగడం అలవాటు చేసుకుంటే, తిన్న తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉంటాయి. బీట్‌రూట్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు మధుమేహంతో బాధపడే వారికి చాలా మేలు చేస్తాయి.  

ఇంట్లో పెద్దవారికి బట్టతల ఉన్నప్పుడు చిన్నవారికి ఆ సమస్య రాకుడదంటే ఇలా చేయాలి!!

ఇప్పటికాలంలో చాలామంది ఎదుర్కొంటున్న సమస్య  జుట్టు రాలడం. ఈ సమస్య అన్ని రకాల వయసుల వారిలో ఉంది. చాలామంది ఆరోగ్యకరమైన ఆహారం, ఆరోగ్యకరమైన జీవనశైలి ఫాలో అవుతున్నా కాలం గడిచేకొద్ది జుట్టు రాలడం జరుగుతూనే ఉంటుంది. మగవారిలో బట్టతల, ఆడవారిలో జుట్టు పలుచబడటం, తలమీది చర్మం బయటకు  కనిపించడం(దీన్ని మహిళలలో బట్టతలగా వర్ణిస్తారు). ఇది జన్యుసమస్యల కారణంగా ఎదురయ్యే సమస్య. బట్టతల పరిష్కారానికి ఎలాంటి ప్రత్యేక వైద్యం అందుబాటులో లేకపోయినప్పటికీ ఈ సమస్యను పరిష్కరించడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. వీటిని ఫాలో అవ్వడం ద్వారా బట్టతలను సమర్థవంతంగా అధిగమించవచ్చు. జుట్టు ఆరోగ్యం  ఆహారంతో దగ్గరి సంబంధం కలిగి ఉంటుంది. బలమైన, ఆరోగ్యకరమైన జుట్టును నిర్వహించడానికి అవసరమైన పోషకాలతో కూడిన సమతుల్య ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో ప్రోటీన్, ఐరన్, బయోటిన్,  విటమిన్ A,D చాలా ప్రాముఖ్యత వహిస్తాయి. ఆహారంలో లీన్ మాంసాలు, చేపలు, గుడ్లు, ఆకు కూరలు, పప్పుధాన్యాలు మరియు గింజలు వంటి ఆహారాలను చేర్చుకోవాలి. ఆహారం ద్వారా సరిపడినంత  పోషకాలు తీసుకోలేకపోతే  సప్లిమెంట్లు కూడా ప్రయోజనకరంగా ఉంటాయి, అయితే ఏదైనా సప్లిమెంట్లను తీసుకునేముందు వైద్యులను సంప్రదించి వారి సలహా మేరకు సప్లిమెంట్లు వాడాలి. ఆరోగ్యకరమైన జీవనశైలితో పాటు వైద్యులు సూచించే మందులు కూడా తీసుకోవాలి. ఇవి జన్యుపరంగా సంభవించే బట్టతలకు అడ్డుకట్ట వేస్తాయి. ఆండ్రోజెనెటిక్ అలోపేసియా ఉన్నవారిలో జుట్టు రాలడానికి కీలకమైన హార్మోన్లను నిరోధించడంలో  మందులు ప్రభావవంతంగా ఉంటాయి.అయితే వీటిని వైద్యుల సలహాతో మాత్రమే వాడాలి. ఎందుకంటే ఇవి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా కలిగి ఉంటాయి.  జుట్టు రాలడానికి చాలామందిలో కారణమయ్యే అంశం ఒత్తిడి. అధిక డిప్రెషన్ జుట్టురాలడాన్ని మరింత వేగవంతం చేస్తుంది. దీన్ని అధిగమించడానికి ధ్యానం, యోగా, ప్రాణాయామం వంటివి చాలా బాగా పనిచేస్తాయి. ధూమపానం, మధ్యపానం వంటి అలవాట్లు ఉంటే మానేయడం. జుట్టు సంరక్షణ చర్యలు తీసుకోవడం. రసాయనాలు లేని  ఉత్పత్తులను వాడటం. వీలైనంత వరకు సహజమైన ఉత్పత్తులను జుట్టుకు వినియోగించడం. ఎప్పటికప్పుడు వైద్యలను కలుస్తూ జాగ్రత్తలు పాటించడం వల్ల  వంశపార్యపరంగా జుట్టురాలిపోయి బట్టతల వచ్చేవారి సమస్యను పరిష్కరించవచ్చు.                                                         *నిశ్శబ్ద.

డెంగ్యూ జ్వరానికి డాక్టర్లు సూచించే ఇంటివైద్యం ఏంటో తెలుసా..

వర్షాకాలం అంటేనే వ్యాధుల కాలం. ఈకాలంలో అనేక వ్యాధులు ఇబ్బంది పెడుతుంటాయి. జలుబు, జ్వరం, వైరల్ ఫీవర్లు వంటివి చాలా ఇబ్బందులకు గురి చేస్తుంటాయి. అందుకే వర్షాకాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు చెబుతుంటారు. ముఖ్యంగా ఈ సీజన్ లో డెంగ్యూ జ్వరం ఎక్కువగా వస్తుంది. ముఖ్యంగా చిన్నారులు డెంగ్యూ జ్వరానికి ప్రధాన లక్ష్యంగా మారుతున్నారు. డెంగ్యూ వైరస్ వల్ల ఈ జ్వరం వస్తుంది. డెంగ్యూకి నిర్దిష్ట యాంటీవైరల్ చికిత్స లేనందున సరైన సంరక్షణ చాలా ముఖ్యం. కాబట్టి ఇంటి నివారణలు లక్షణాల నుండి ఉపశమనం పొందడంలో.. రికవరీ ప్రక్రియలో సహాయపడతాయి. మీరు వైద్యం చేయించుకున్నప్పటికీ.. ఇంటి నివారణలు కూడా ఎంతో సహాయపడతాయి. అన్నింటికంటే, డెంగ్యూ జ్వరానికి ఇంటి నివారణలు ఏమిటి? వైద్యులు ఎలాంటి సలహాలు ఇస్తున్నారో ఇప్పుడు తెలసుకుందాం. నీరు పుష్కలంగా త్రాగాలి: డెంగ్యూ జ్వరం యొక్క లక్షణాలు అధిక జ్వరం, చెమటలు. ఇవన్నీ కూడా  నిర్జలీకరణానికి దారితీస్తాయి. డీహైడ్రేషన్ వల్ల శరీరం శక్తిని కోల్పోతుంది. కాబట్టి డీహైడ్రేషన్‌ను ఎదుర్కోవడానికి, లక్ట్రోలైట్ బ్యాలెన్స్‌ను నిర్వహించడానికి వీలైనంత వరకు కొబ్బరి నీరు, పండ్ల రసాలు వంటి ద్రవాలను పుష్కలంగా తాగడం చాలా ముఖ్యం. విశ్రాంతి: డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్న వారు త్వరగా కోలుకోవడానికి విశ్రాంతి చాలా ముఖ్యం. విశ్రాంతిగా ఉన్నప్పుడు శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ మరింత సమర్ధవంతంగా పనిచేస్తుంది. వేగంగా కోలుకోవడానికి సహాయపడుతుంది. కఠినమైన శారీరక శ్రమలను నివారించడం, తగినంత నిద్ర పొందడం ద్వారా, శరీరం కోలుకోవడానికి సహాయపడుతుంది. సమయానికి మందులు: ఇప్పటికే చెప్పినట్లుగా డెంగ్యూ జ్వరానికి నిర్దిష్ట చికిత్స లేదు. కానీ జ్వరం, నొప్పి వంటి లక్షణాలను తగ్గించుకోవడం చాలా ముఖ్యం. ఎసిటమైనోఫెన్ (పారాసెటమాల్) తరచుగా జ్వరాన్ని నియంత్రించడానికి, నొప్పిని తగ్గించడానికి సూచించబడుతుంది.  అయినప్పటికీ, ఆస్పిరిన్ లేదా ఇబుప్రోఫెన్ వంటి మందులను నివారించాలి, ఎందుకంటే అవి రక్తస్రావం ప్రమాదాన్ని పెంచుతాయి. ప్లేట్‌లెట్ స్థాయిలను చెక్ చేయడం: డెంగ్యూ జ్వరం సమయంలో ప్లేట్‌లెట్ స్థాయిలను ప్రతిరోజూ పర్యవేక్షిస్తారు. నిజానికి డెంగ్యూ జ్వరం వల్ల ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గుతుంది. ఇది రక్తస్రావం వంటి సమస్యలకు దారి తీస్తుంది. ఇంకా, ఈ ప్లేట్‌లెట్ కౌంట్ రక్త పరీక్షల ద్వారా పరీక్షిస్తారు. ఎలాంటి ఆహారం తీసుకోవాలి: ఏదైనా అనారోగ్యం నుండి త్వరగా కోలుకోవడానికి సమతుల్య ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. డెంగ్యూ రోగులకు పౌష్టికాహారం తీసుకోవడం చాలా అవసరం. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్లతో సహా పోషకాలు అధికంగా ఉండే ఆహారాలు రోగనిరోధక వ్యవస్థకు మద్దతు ఇస్తాయి. వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలి: డెంగ్యూ లక్షణాలలో నిరంతర వాంతులు, జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి, అంతర్గత రక్తస్రావం సంకేతాలు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి తీవ్రమైన లక్షణాలు ఉంటాయి. అలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం చాలా ముఖ్యం.  

ఏ వయసులో ఏం తినాలో తెలుసా?

ఆహారమే మనిషి జీవితానికి ముఖ్యమైన వనరు. ప్రాణ శక్తిని అందించేది ఆహారమే. సరైన ఆహారం తీసుకోవడం వల్ల  ఆరోగ్యం బాగుంటుంది. దీర్ఘాయుష్షు సాధ్యమవుతుంది. అయితే వయసుతో పాటు శరీరంలో మార్పులు చోటు చేసుకుంటాయి. అందుకే వయసుకు తగిన ఆహారం తీసుకోవాలని చెబుతుంటారు. పిల్లలు, పెద్దలు అందరికీ పోషకాలు అవసరమే. అయితే పెరిగే కొద్ది కండరాలు, ఎముకలకు తగినంత బలం కూడా కావాలి. టీనేజ్  దాటగానే ఆహారం విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ జాగ్రత్తలే భవిష్యత్తు ఆరోగ్యాన్ని నిర్థేశిస్తాయి. 20, 30, 40, 50 అలా ఏ వయసు దాటిన తరువాత ఏ ఆహారం తీసుకోవాలో తెలిసినవారు చాలా తక్కువ. దీని గురించి తెలుసుకుని వయసుకు తగిన ఆహారం తీసుకోవడం ఎంతో ముఖ్యం. 20 ఏళ్ల వయసులో ఏం తినాలి? 20ఏళ్ళ వయసున్నవారు అన్ని రకాల ఆహారాలు తీసుకోవాలి. వీటిలో  ప్రోటీన్లు,  తృణధాన్యాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు, పండ్లు, కూరగాయలు, పాలు, పాల ఉత్పత్తులు, ఆకుకూరలు, కాల్షియం అధికంగా ఉన్న ఆహారాలు తీసుకోవాలి. అలాగే చేపలు, అవిశె గింజలు, వాల్ నట్ లలో ఒమెగా-3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. వీటిని తీసుకోవాలి. ఇవి శరీరం దృఢంగా ఉండటంలో సహాయపడుతుంది. 30ఏళ్ళ తరువాత ఏం తినాలి? 30ఏళ్ళు దాటగానే శరీరంలో జీర్ణక్రియలు కొద్దిగా నెమ్మదిస్తాయి. ఈ సమయంలో బరువును నియంత్రణలో ఉంచుకోవడం ఎంతో అవసరం. క్వినోవా, బ్రౌన్ రైస్, చిలగడ దుంపలు వంటి వాటిలో ఉండే కార్భోహైడ్రేట్లు శరీరానికి ఎక్కువ శక్తిని ఇస్తాయి. అలాగే కండరాల సామర్థ్యాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. చురుకైన జీవనశైలి ఉన్నవారికి తగినంత ప్రోటీన్లు అవసరం.  విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉన్న ఆహారం, రంగురంగుల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు బాగాతీసుకోవాలి. 40ఏళ్ళ తరువాత ఏం తినాలంటే? 40ఏళ్ళ తరువాత గుండె, ఎముకల ఆరోగ్యం  గురించి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. శరీరంలో హార్మోన్లలో మార్పులు, కండరాల సామర్థ్యం తగ్గడం,  మొదలైనవి కూడా జరుగుతాయి. వీటి ఆరోగ్యం కోసం  చేపలు, పాలు, పాల ఉత్పత్తులు, చికెన్, బీన్స్, చిక్కుళ్ళు, వంటి లీన్ ప్రోటీన్ గల ఆహారాలు తీసుకోవాలి. అవకాడో, నట్స్, గింజలు, ఆలివ్ నూనె, వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు తీసుకోవాలి. ఇవి గుండె ఆరోగ్యాన్ని  మెరుగుపరుస్తాయి.  అదే విధంగా పైబర్ అధికంగా ఉన్న ఆహారం  తీసుకోవాలి. 40ఏళ్ళ తరువాత బోలు ఎముకల వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీన్ని అధిగమించడానికి   కాల్షియం అధికంగా ఉన్న ఆహారం తీసుకోవాలి. 50 ఏళ్ళ తరువాత  ఏం తినాలి? 50ఏళ్ళ తరువాత శరీరంలో ఉన్న శక్తిని కాపాడుకోవాలి.  వయసుకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కండరాలు చాలా బలహీనంగా మారే వయసు ఇది. కండరాలు, ఎముకలు, మెదడు ఆరోగ్యంగా ఉండటం కోసం ప్రోటీన్, కాల్షియం, ఒమెగా-3 బాగా తీసుకోవాలి. 50 ఏళ్ల తరువాత దాహం బాగా తగ్గుతుంది. నీరు తాగడం తగ్గిస్తారు. ఇది కిడ్నీ సమస్యలకు, శరీరం డీ హైడ్రేషన్ కావడానికి కారణం అవుతుంది. అందుకే 50ఏళ్ళ తరువాత నీరు, ద్రవ పదార్థాలు బాగా తీసుకోవాలి.                                             *నిశ్శబ్ద.

ఈ ఐదు అలవాట్లు ఉన్నవారికి వందేళ్ళ ఆయుష్షు గ్యారెంటీ!

తొందరగా చనిపోవాలని ఎవరికీ ఉండదు. ఎక్కువ కాలం ఆరోగ్యంగా, ఎలాంటి శారీరక సమస్యలు లేకుండా హాయిగా జీవించాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. కానీ వయసు పెరిగే కొద్దీ ఏదో ఒక అనారోగ్య సమస్యలు వస్తూనే ఉంటాయి. వీటి కారణంగా వందేళ్ల ఆయుష్షు గడవకముందే మరణిస్తుంటారు. గత కొన్నేళ్ళను గమనిస్తే మనిషి ఆయుష్షు క్రమంగా తగ్గుతూ వస్తోందనే విషయం స్పష్టంగా అర్థమవుతోంది. కానీ కాలం ఎలా మారినా వందేళ్ళు హాయిగా బ్రతికేయచ్చు. ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలలో ప్రజలు చాలా సులువుగా వందేళ్ళు బ్రతుకుతున్నారు. దీనికి కారణం వారు తింటున్న ఆహారం, వారి అలవాట్లు.  అలాగని వారేదో నాన్ వెజ్ తిని పుష్టిగా, ఆరోగ్యంగా ఉన్నారనుకుంటే పొరపాటే. అసలు వారి అలవాట్లేమిటో, అవి వందేళ్ళ ఆయుష్షుకు ఎలా కారణమవుతాయో తెలుసుకుంటే.. వందేళ్లు ఆరోగ్యంగా జీవిస్తున్నవారిలో 95శాతం ఆహారం  మొక్కల ఆధారిత ఆహారమే. వీటిలో పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, చిక్కుళ్ళు, తృణధాన్యాలు, గింజలు మొదలైనవి ఉన్నాయి.  ఆహారం విషయంలో కొన్ని పరిశోధనలలో చాలా ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. మాంసాహారాన్ని మానేసి మొక్కల ఆధారిత ఆహారాన్ని తీసుకోవడం వల్ల గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి ఇతర ప్రమాదకర వ్యాధుల ప్రమాదం గణనీయంగా తగ్గుతోంది.  కాబట్టి మొక్కల ఆధారిత ఆహారం మనిషి ఆయుష్షును పెంచుతుంది. ప్రతి మతంలోనూ ఉపవాసం అనేది ప్రధానంగా ఉంటుంది.  ఉపవాసం శరీరంలో రక్తంలో ఉండే కొలెస్ట్రాల్ ను నియంత్రణలో ఉంచుతుంది. అనేక వ్యాధులకు శరీరంలో అధిక కొలెస్ట్రాల్ కారణం అవుతుంది. అందుకే అప్పుడప్పుడూ ఉపవాసం చెయ్యడం  వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే ఆకలి అనిపించినప్పుడు కడుపు నిండా తినడం చాలా తప్పు. ఎప్పుడైనా సరే ఆహారాన్ని కేవలం 80శాతం మాత్రమే తినాలి.  ఇది శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. మధ్యపానం చాలామందికి ఉన్న చెడ్డ అలవాటు. అయితే ధీర్ఘాయుష్షు కావాలంటే మధ్యపానం తీసుకోవాలి కానీ అది చాలా మితంగా ఉండాలట. ఆల్కహాల్ కూడా శరీరాన్ని ఉత్తేజంగా ఉంచడంలో సహాయపడుతుంది. కానీ దీని మోతాదు ఎక్కువ  కావడం, ఆల్కహాల్ సేవించడం ఒక వ్యసనంగా మాత్రం మారకూడదు. ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేసే వారి శరీరం పర్ఫెక్ట్ గా పనిచేస్తున్న యంత్రంలాంటిది.  శరీరంలో వివిధ అవయవాలు, వాటి పనితీరు వ్యాయామం వల్ల మెరుగవుతుంది. అంతేకాదు వ్యాయామం శరీరంలో కండరాల సామర్థ్యాన్ని పెంచుతుంది. శరీరంలో రోగనిరోధకశక్తి పెరుగుతుంది. నిద్రను గొప్ప ఔషదంగా పరిగణిస్తారు. ప్రతిరోజు కనీసం ఆరు నుండి 8 గంటలసేపు నిద్రపోవడం వల్ల రోజుమొత్తం పనిచేసిన శరీరానికి, మెదడుకు తగినంత విశ్రాంతి లభిస్తుంది. మంచి నిద్ర వల్ల గుండెపోటు, పక్షవాతం, క్యాన్సర్, మధుమేహం వంటి ప్రమాదాలు చాలావరకు తగ్గుతాయి.

బరువు తగ్గాలంటే బ్రేక్‎ఫాస్ట్‎లో ఈ ఫుడ్స్ చేర్చుకోండి..!!

బరువు తగ్గడం అంత తేలికైన పని కాదు. బరువు తగ్గించుకునేందుకు వ్యాయామం చేస్తారు.  అంతే కాకుండా  ఆహారం విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. అయితే చాలా మంది బరువు తగ్గించుకునేందుకు బ్రేక్ ఫాస్ట్ చేయరు. కానీ అల్పాహారం మానేస్తే అనేక సమస్యలకు దారి తీస్తుందని మీకు తెలుసా? అలాంటి పరిస్థితిలో బరువు తగ్గించేందుకు రుచికరమైన చీలాను మీ బ్రేక్ ఫాస్ట్ లో చేర్చుకోండి.   మూంగ్ దాల్ చిల్లా: మూంగ్ దాల్ చిల్లా తయారు చేయడం చాలా సులభం. మీరు దీన్ని మీ బరువు తగ్గించుకునేందుకు మీ డైట్లో  చేర్చుకోవచ్చు. అంతేకాదు ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.  ఈ చీలా చేయడానికి, పెసరపప్పును 5-6 గంటలు నానబెట్టి, ఆపై మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం, ఉప్పు కలిపి పిండిలా సిద్ధం చేసుకోవాలి. పాన్ వేడి చేయండి, చిన్న మొత్తంలో నూనె జోడించండి. పాన్ మీద పిండిని పోసి బాగా విస్తరించండి. రెండు వైపులా కాల్చండి. మూంగ్ దాల్ చీలా రెడీ. సెమోలినా చీలా: సెమోలినాలో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఇది తింటే కడుపు నిండినట్లుగా ఉంటుంది. చాలా సమయం ఆకలి అనిపించదు.  ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. మీరు అల్పాహారం కోసం సెమోలినా చీలా తినవచ్చు. ఈ చీలా చేయడానికి, ఒక గిన్నెలో సెమోలినా, పెరుగు కలపాలి. ఈ మిశ్రమానికి కొంచెం నీరు వేసి బాగా చిలకొట్టండి. దానికి నల్ల మిరియాల పొడి, ఉప్పు, సన్నగా తరిగిన క్యాప్సికమ్ జోడించండి. పాన్ వేడి చేసి, ఇప్పుడు 1 స్పూన్ నూనె వేసి, ఆపై సెమోలినా పిండిని వేసి కొద్దిగా విస్తరించండి. చీలాను రెండు వైపుల నుండి ఉడికించాలి. రాగి చిల్లా: ఫైబర్ అధికంగా ఉండే రాగులు ఆకలిని నియంత్రించడంలో సహాయపడుతుంది. మీరు బరువు తగ్గాలనుకుంటే, రాగులను మీ ఆహారంలో భాగం చేసుకోండి. మీరు దాని నుండి రుచికరమైన చీలా తయారు చేసుకోవచ్చు. ఈ చీలా చేయడానికి, ఒక గిన్నెలో రాగుల పిండిని తీసుకుని, అందులో నీరు కలపండి. పిండిని సిద్ధం చేయండి. ఈ మిశ్రమంలో ఉప్పు,  సన్నగా తరిగిన ఇష్టమైన కూరగాయలను కలపండి. ఇప్పుడు పాన్ వేడి చేసి, ఒక చెంచా నూనె వేసి, రాగుల పిండిని పాన్ మీద పోసి బాగా స్ప్రెడ్ చేయాలి. తరువాత రెండు వైపులా బంగారు గోధుమ రంగు వచ్చేవరకు వేయించాలి.