పండ్లు ఎలా తీసుకుంటే ఎక్కువ లాభాలుంటాయి? ఆయుర్వేదం ఏం చెబుతోందంటే..

రోజూ పండ్లు తినడం వల్ల లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మొత్తం శరీరం  మెరుగైన పనితీరుకు అవసరమైన అన్ని పోషకాలను పండ్లు కలిగి ఉంటాయి. పండ్లలో పొటాషియం, ఫైబర్, విటమిన్ సి, ఫోలేట్, ప్రొటీన్, కాల్షియం, విటమిన్లు,  మినరల్స్ ఉంటాయి. పండ్లు క్రమం తప్పకుండా తినడం వల్ల రక్తపోటు తగ్గుతుంది, గుండె జబ్బులు,  పక్షవాతం వచ్చే ప్రమాదం తగ్గుతుంది, అనేక రకాల క్యాన్సర్లను నివారిస్తుంది, మధుమేహం నియంత్రణలోనూ, స్థూలకాయాన్ని తగ్గించడంలోనూ, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలోనూ సహాయపడుతుంది. కంటి సమస్యలు,  జీర్ణ సమస్యలను నివారించడానికి,  రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడం ద్వారా వ్యాధులను నివారించడానికి పండ్లు మంచి ఔషదం. ఆయుర్వేదంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, ఆహారపు అలవాట్లు, జీవనశైలి నియమాలు, కాలానుగుణ నియమాలు ఇలా  మరెన్నో జాగ్రత్తలు ఉంటాయి. పండ్లను సరైన పద్ధతిలో తినడానికి కూడా ఆయుర్వేదం నియమాలను సూచించింది. తద్వారా  పండ్ల నుండి గరిష్ట ప్రయోజనాలను పొందవచ్చు. పండ్లు ప్రపంచంలోనే అత్యంత ఆరోగ్యకరమైన ఆహారాలు.   వాటిని సరైన మార్గంలో  తీసుకుంటే ఆరోగ్యానికి గొప్ప ప్రయోజనం ఉంటుంది. తప్పుడు మార్గంలో,  తప్పు సమయంలో పండ్లు తినడం వల్ల ప్రయోజనాలకు బదులుగా హాని కలుగుతుంది. పండ్లు ఎలా తీసుకోకూడదో ఆయుర్వేదం చెప్పిన నియమాలు ఏంటో తెలుసుకుంటే.. ఆహారంతో పాటు పండ్లు తినకూడదు.. చాలా మంది ఈ తప్పు చేస్తుంటారు. ఆహారంతో పాటు పండ్లు తినడం వల్ల పేగుల్లో విషపదార్థాలు పేరుకుపోతాయి. ఆయుర్వేదంలో కొన్ని విషయాలను 'ఆమ' అంటే విషపదార్థాలు అంటారు. ఆహారంతో పాటు పండ్లను తీసుకోవడం వల్ల అజీర్ణం ఏర్పడుతుంది. ఇది కాకుండా అనేక చర్మ సమస్యలు,  వాపులు వచ్చే ప్రమాదం కూడా ఉంది. పండ్లను జ్యూస్ చేస్తే  ప్రాణానికే ముప్పు.. చాలా సులువుగా ఉంటుందని ఎక్కువ మంది పండ్లు తినడం కంటే పండ్ల రసాన్ని తీసుకోవడానికి ఇస్టపడతారు. అయితే పండ్ల రసం తీసుకున్నంత  మాత్రాన ప్రయోజనం ఉండదు.  పండ్ల నుండి ఎక్కువ పోషకాలను పొందడానికి  మొత్తం పండు తినాలి.  రసం తాగడం ద్వారా  ఫైబర్ తో పాటు  అనేక ఇతర మూలకాలను కోల్పోతారు. డిన్నర్‌లో లేదా సాయంత్రం తర్వాత పండ్లు తినవద్దు.. ఆయుర్వేదం ప్రకారం  పండ్లను సాయంత్రం లేదా రాత్రి భోజనం చేసినప్పుడు తీసుకోకూడదు.  ఈ సమయాన్ని కఫా కాలం అని, ఈ కాలంలో పండ్లు జీర్ణం కావడానికి చాలా బరువుగా ఉంటాయని,  ఇది దోష అసమతుల్యతకు దారితీస్తుందని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. పాలలో పండ్లను కలపవద్దు.. పాలతో పండ్లను తినడం విరుద్ధ ఆహారం అని ఆయుర్వేదం చెబుతోంది. చాలామంది పాలను పండ్లను మిక్సీ పట్టి మిల్క్ షేక్ చేసుకుని ఇష్టంగా తాగుతుంటారు.   అరటిపండు తియ్యగా ఉన్నప్పటికీ పేగులకు భారంగా ఉంటుంది. అందుకే అరటిపండ్లు పాలు కలిపి తినకూడదు. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ఎల్లప్పుడూ సీజనల్ పండ్లను మాత్రమే తినాలి.. సీజన్‌లో లభించే పండ్లను తినడం ఆరోగ్యానికి మంచిది. ఇతర పండ్లు రసాయనాల ద్వారా ఎక్కువ కాలం భద్రపరచబడతాయి. సీజనల్ లేని పండ్లను తినడం ఆరోగ్యానికి తీవ్రమైన హాని కలిగిస్తుంది. పైపెచ్చు సీజన్ కాని పండ్లు సహజంగానే ఎక్కువ ధరకు అమ్ముతుంటారు. కాబట్టి సీజన్ లో లభించే పండ్లను తాజాగా ఉన్నట్టే తినాలి.                                                        *నిశ్శబ్ద.

పురుషుల్లో థైరాయిడ్ సమస్యను ఎలా గుర్తించాలి? దాని ప్రభావం ఎలా ఉంటుంది..

సాధారణంగా థైరాయిడ్ సమస్యతో మహిళలు ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయితే అయితే పురుషులకు కూడా ఈ సమస్య ఉంటుందని మీకు తెలుసా? పురుషులలో థైరాయిడ్ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. హైపర్ థైరాయిడిజం అనేది మీ థైరాయిడ్ గ్రంథి మీ శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువ థైరాయిడ్ హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. దీనిని "హైపర్ థైరాయిడిజం" అని కూడా అంటారు. సకాలంలో చికిత్స చేయకపోతే, ఇది మీ గుండె, కండరాలు, స్పెర్మ్ నాణ్యతను ప్రభావితం చేస్తుంది. ఈ హైపర్ థైరాయిడిజం సాధారణంగా నియంత్రణలో ఉంచుకోవడానికి మందులు అవసరం. కాబట్టి పురుషులలో థైరాయిడ్‌కు ఎలాంటి చికిత్సలు అందించవచ్చో చూద్దాం. పురుషులలో హైపర్ థైరాయిడిజం యొక్క కారణాలు:  గ్రేవ్స్ వ్యాధి పురుషులలో హైపర్ థైరాయిడిజంకు కారణమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.  గ్రేవ్స్ వ్యాధి  ఆరోగ్యకరమైన థైరాయిడ్ గ్రంధిపై  దాడి చేయడం వల్ల వస్తుంది. దీని వల్ల థైరాయిడ్ హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఎక్కువమొత్తంలో అయోడిన్, దుష్ప్రభావాలను కలిగించే మందులను తీసుకోకుండా ఉండాలని సలహా ఇస్తారు. కాబట్టి పురుషులలో థైరాయిడ్ లక్షణాలను ఎలా గుర్తించవచ్చు? -బరువు తగ్గడం లేదా పెరగడం. -క్రమరహిత హృదయ స్పందన -భయం -చిరాకు -అలసట -వేళ్లు, చేతులు వణకడం -చెమటలు -కండరాల బలహీనత -జుట్టు ఊడుట పురుషులు, మహిళలు సాధారణంగా ఈ హైపర్ థైరాయిడిజానికి సంబంధించి  ఒకే విధమైన లక్షణాలను కలిగి ఉన్నప్పటికీ, పురుషులను మాత్రమే ప్రభావితం చేసే కొన్ని ప్రధాన సమస్యలు ఉన్నాయి. అవి, -అంగస్తంభన లోపం -తక్కువ స్పెర్మ్ కౌంట్ -అకాల బట్టతల -లైంగిక ఆరోగ్యంపై ప్రభావం ఈ థైరాయిడ్ హార్మోన్లు పురుషుల వృషణాలలోని కొన్ని కణాల పనితీరును ప్రభావితం చేస్తాయి. హైపర్ థైరాయిడిజం స్పెర్మ్ కణాలను ప్రభావితం చేస్తుంది. ఇది స్పెర్మ్ సాంద్రత, చలనశీలతను తగ్గించడమే కాకుండా, స్పెర్మ్ యొక్క అసలు ఆకారం లేదా రూపాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. అంగస్తంభన పనితీరును ప్రభావితం చేయవచ్చు.వంధ్యత్వానికి కారణం కావచ్చు.తక్కువ స్పెర్మ్ కౌంట్ దారితీస్తుంది. థైరాయిడ్‌కు మందులు, శస్త్రచికిత్స ద్వారా చికిత్స చేయవచ్చు. స్త్రీలు లేదా పురుషులు సంవత్సరానికి ఒకసారి థైరాయిడ్ పరీక్ష చేయించుకోవాలని వైద్యులు సిఫార్సు చేస్తున్నారు. అదనంగా, ఆరోగ్యకరమైన ఆహారం, రోజువారీ వ్యాయామం శరీరానికి చాలా ముఖ్యమైనవి.

మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా? ఈ ఆకులు ఆహారంలో భాగం చేసుకుంటే సరి..

ఈ రోజుల్లో, ప్రజల జీవన విధానం వేగంగా మారుతోంది. రోజురోజుకూ పెరుగుతున్న పనిభారం,బిజీ షెడ్యుల్ ప్రజల శారీరక, మానసిక ఆరోగ్యంపై  ప్రభావం చూపిస్తోంది. ఈ కారణంగా  చుట్టూ ఉన్న చాలా మంది మానసిక ఆరోగ్య సమస్యలతో పోరాడుతున్నారు. ఈ రోజుల్లో చాలా మంది ఒత్తిడి, డిప్రెషన్‌కు గురవుతున్నారు. ఇలాంటి  పరిస్థితిలో ఆరోగ్యాన్ని సరిగ్గా చూసుకోవడం చాలా ముఖ్యం.  అలవాట్లు  జీవనశైలితో పాటు,  ఆహారం కూడా మన ఆరోగ్యంపై గొప్ప ప్రభావాన్ని చూపుతుంది. అందుకే ఆహారంలో సరైన మార్పులు చేయడం ద్వారా శారీరకంగానే కాకుండా  మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుచుకోవచ్చు.  కొన్ని సహజ మూలికలను ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవచ్చు. అశ్వగంధ అశ్వగంధలో చాలా  అద్భుత లక్షణాలు ఉంటాయి. ఇది అనేక సమస్యలకు  దివ్యౌషధంగా పనిచేస్తుంది.  దీనిని సాధారణంగా ఇండియన్ జిన్సెంగ్ అంటారు. అనేక ఆరోగ్య సంబంధిత సమస్యల నుండి ఉపశమనాన్ని అందించడమే కాకుండా, మెదడు పనితీరును పెంచడంలో కూడా ఇది సహాయపడుతుంది, ఇది  మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడం ద్వారా డిప్రెషన్ ను తగ్గిస్తుంది. మానసిక ఒత్తిడికి లోనయ్యేవారు అశ్వగంధ చూర్ణం లేదా అశ్వగంధ టాబ్లెట్స్ తీసుకోవచ్చు. బ్రహ్మి లేదా సరస్వతి..  బ్రహ్మి  మానసిక ఆరోగ్యానికి  చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది మానసిక ఆరోగ్య సమస్యలు లేదా అనారోగ్యాలకు చికిత్స చేయడంతోపాటు దైనందిన జీవితంలోని ఒత్తిళ్లను ఎదుర్కోవడానికి శక్తివంతమైన మూలిక.  బ్రాహ్మీ టీ తీసుకోవచ్చు. పసుపు.. అనేక ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్న పసుపు , ఎన్నో ఏళ్ళ నుండి అనేక ఆరోగ్య సమస్యలకు చికిత్స చేయడంలో ఉపయోగిస్తున్నారు.  జలుబు, దగ్గు లేదా ఏదైనా గాయం ఇలా ఏదైనా సరే  పసుపు అన్నింటికీ దివ్యౌషధం. వీటన్నింటితో పాటు ఇది  మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే సహజ నివారణ. పసుపు పాలు తీసుకుంటే ఒత్తిడి తగ్గుతుంది. తిప్పతీగ.. దీనినే గుడుచి అని కూడా అంటారు. తిప్పతీగ చాలా కాలంగా అనేక సమస్యలకు ఆయుర్వేదంలో ఉపయోగించబడుతున్నప్పటికీ, కరోనా కాలం నుండి  ప్రజాదరణ మరింత పెరిగింది. రోగనిరోధక శక్తిని పెంచే ఈ మూలిక డిప్రెషన్ చికిత్సలో చాలా సహాయపడుతుంది. అంతేకాకుండా ఇది ఒత్తిడిని తగ్గించడంలో,  జ్ఞాపకశక్తిని పెంచడంలో కూడా సహాయపడుతుంది. తులసి.. హిందూ మతంలో తులసికి చాలా ప్రాముఖ్యత ఉంది. మతపరమైన ప్రాముఖ్యతతో పాటు తులసి  ఆరోగ్య ప్రయోజనాల వల్ల  కూడా ప్రసిద్ధి చెందింది. మానసిక ఆరోగ్యం విషయానికి వస్తే, ఇది చాలా ప్రభావవంతమైన మూలికలలో ఒకటి. ఇది మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది.                                                           *నిశ్శబ్ద.  

ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. రెండు నిమిషాలలో కడుపు ఉబ్బరం అంతా తగ్గిపోతుంది..

 తరచుగా అపానవాయువు, బరువు పెరగడం, గ్యాస్, అసిడిటీ, అజీర్ణం, ఉబ్బరం వంటి కడుపు సమస్యలు చాలామంది ఎదుర్కొంటున్నారు. వీటిని అధిగమించానికి చాలామంది జీర్ణశక్తిని పెంచే టాబ్లెట్స్, సిరప్ వంటి వాటిపై ఆధారపడుతుంటారు. కానీ ఇవన్నీ సహజమైన జీర్ణవ్యవస్థను దెబ్బతీసేవే. వీటి వాడకం వల్ల సహజంగా ఆహారం జీర్ణం కాదు.కానీ ఆయుర్వేదం ఈ సమస్యలకు అన్నింటికి మంచి పరిష్కారాలు సూచించింది. అది కూడా ఇంటిపట్టున తక్కువ ఖర్చుతో ఈ సమస్యలు అధిగమించవచ్చు. కడుపు సమస్యలను అన్ని పరిష్కరించడంలో  సొంపు లేదా సోపు చక్కగా సహాయపడుతుంది. అసలు సోపులో ఉన్న ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి? సోపును ఎవరు ఏ విధంగా తీసుకుంటే ఏ సమస్యలు పరిష్కారం అవుతాయి పూర్తీగా తెలుసుకుంటే.. సోపు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు.. సోపు తినడం వల్ల బలం చేకూరుతుంది.  రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది పిత్త దోషం సాధారణంగా  వేడి ఎక్కువ కావడం వల్ల కలుగుతుంది.  అధికవేడి  వల్ల కలిగే రక్తస్రావ రుగ్మతలలో కూడా సోపు ఔషదంగా  ఉపయోగపడుతుంది జీర్ణ శక్తిని పెంచుతుంది.  గుండెకు మంచి టానిక్ లాగా పనిచేస్తుంది.  బహిష్టు సమయంలో నొప్పి నుండి ఉపశమనం కలిగించడంలో ఉపయోగకరంగా ఉంటుంది. సోపు నీరు శరీరంలోని ధాతువులపై ప్రత్యేక ప్రభావాన్ని చూపుతుంది, ఇది పాలిచ్చే స్త్రీలలో తల్లి పాలను పెంచుతుంది. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది సోపులోని సాత్విక లక్షణాలు మనస్సును రిఫ్రెష్ చేస్తుంది. తద్వారా  మానసిక ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. ఇది కళ్ళకు రిఫ్రెష్‌గా కూడా సహాయపడుతుంది. శ్వాసకోశ,  ఊపిరితిత్తులలో పేరుకుపోయిన పెరిగిన కఫాన్ని కూడా తగ్గిస్తుంది.  సోపును ఎవరు ఎలా ఉపయోగించాలంటే.. జీర్ణ సమస్యలకు - అసిడిటీ,  పిత్త సమస్యలకు, అర టీస్పూన్ పంచదారతో 1 టీస్పూన్ సోపు విత్తనాలు కలపాలి. ఈ మిశ్రమాన్ని నమిలి తినాలి. బరువు తగ్గడం, దగ్గు, జలుబు, నెలసరి తిమ్మిర్లు, వికారం, కడుపులో నులిపురుగులు వంటి సమస్యల కోసం సోపుతో హెర్బల్ టీని తయారు చేసుకుని తాగాలి.  సోపు టీ  కోసం..  1 టీస్పూన్ సోపును 1 గ్లాసు నీటిలో 3-5 నిమిషాలు ఉడకబెట్టి, ఫిల్టర్ చేసి, సిప్ బై సిప్ త్రాగాలి. మెరుగైన జీర్ణక్రియ కోసం భోజనానికి ఒక గంట ముందు లేదా తర్వాత సోపు టీని త్రాగాలి. 1 గ్లాసు నీటిలో ఒక చెంచా జీలకర్ర, కొత్తిమీర,  సోపు వేసి 5 నిమిషాలు ఉడికించి వడపోసి, సిప్ బై సిప్ త్రాగాలి. ఇలా చేస్తే కేవలం రెండే రెండు నిమిషాలలో కడుపు శుభ్రమవుతుంది.                                                           *నిశ్శబ్ద

బాదం పప్పు తింటే ఎన్ని లాభాలో అనుకున్నాం కానీ ఈ నిజాలు తెలిస్తే..

బాదం పప్పు తినడం వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రోజూ  బాదంపప్పును రాత్రి నానబెట్టి ఉదయాన్నే తింటె  గుండె ఆరోగ్యంగా ఉంటుంది, మధుమేహం నియంత్రణలో ఉంటుంది, మెదడును చురుగ్గా మార్చుతుంది.  బరువు తగ్గడానికి, బీపీని అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది.  క్యాన్సర్ రాకుండా చేయడంలోనూ, జుట్టు పెరుగుదలలోనూ చర్మాన్ని యవ్వనంగా మార్చడంలో సహాయపడుతుంది. అయినప్పటికీ, బాదం  హానికరం. బాదం పప్పు తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలే కాదు నష్టాలు కూడా ఉన్నాయి. దీనివల్ల  ఎలాంటి నష్టాలు ఉంటాయో తెలుసుకుంటే.. తరచుగా కడుపులో మంట లేదా యాసిడ్స్ ఉత్పత్తి అవ్వడం  గురించి ఫిర్యాదు చేసేవారు,  బాదం తీసుకోవడం తగ్గించాలి, ఇది  సమస్యను మరింత కడుపులో యాసిడ్ సమస్యను మరింత పెంచుతుంది. బాదంపప్పులో ఆక్సలేట్ ఎక్కువగా ఉంటుంది. బాదం పప్పులను ప్రతిరోజూ తీసుకుంటే మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నవారికి తీవ్రమైన హాని కలిగిస్తుంది. అందుకే మూత్రపిండాల సమస్య ఉన్నవారు, మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నవారు బాదం పప్పుకు దూరంగా ఉండాలి. బాదంపప్పులో పీచుపదార్థం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల బాదం పప్పును ఎక్కువగా తీసుకోవడం లేదా నానబెట్టకుండా   తీసుకోవడం వల్ల కడుపులో భారం అంటే ఉబ్బరం, విరేచనాలు,  పొత్తికడుపు నొప్పి వంటివి కూడా కలుగుతాయి. బాదంపప్పులను ఎక్కువగా తీసుకోవడం వల్ల, ముఖ్యంగా పచ్చి బాదంపప్పులు తీసుకోవడం వల్ల నోటి అలర్జీలు, గొంతు నొప్పి,  పెదవుల వాపు వంటివి ఏర్పడతాయి. అందుకే బాదం పప్పు లిమిట్ గా తీసుకోవాలి. బాదంపప్పులో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఈ  అధిక  పైబర్   శరీరానికి ఇతర ఆహారాల  వల్ల లభించే ఐరన్, జింక్  కాల్షియం వంటి పోషకాలను గ్రహించడంలో ఇబ్బంది కలిగిస్తుంది. ఐరన్ తక్కువైతే శరీరంలో రక్తహీనత ఏర్పడుతుంది. ఇది చాలా రకాల అనారోగ్యాలకు మూలమవుతుంది.                                                           *నిశ్శబ్ద.  

పచ్చి పాలు తాగితే ప్రమాదమా?

పచ్చిపాలు తాగితే చాలా లాభాలు సురక్షితం అనికొందరు.  కాదు కాదు పచ్చిపాలు ఆరోగ్యానికి హానికరం అని ఇంకొందరు అంటున్నారు మరి అందులో నిజం ఏది? అనితేలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే. ఇక వివరాల లోకి వెళ్తే మనం ప్రతిరోజూ పాలు ఎదో రూపం లో వాడుతూ ఉంటాము.మనం ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండేందుకు పాలు లాభదాయకంగా ఉంటుంది. అని అందరూ అంగీకరిస్తారు.మరి మీరు తేల్చుకోవాల్సిన అంశం ఏమిటి అంటే పచ్చిపాలు లాభదాయకమని లేదాపేస్టూ రైజ్డ పాలు లాభమా అన్నది ప్రశ్న. మీరు రోజూ పాలు తాగుతారా ?అయితే ఇది చదవడం అత్యవసరం.పాలు మనం ప్రతిరోజూ ఎదోరూపం లో వాడతాము.అసలు పాలు లేకుండా రోజు గడవడం కష్టం.అంటే పాలు లేకుండా ఉండడం కొంచం కష్టం.మీ ఇమ్యునిటీ నిపెంచడం దగ్గరనుంచి ఎముకలు,పళ్ళు బలంగా ఉండేందుకు మెటాబాలిజం పెంచేందుకు పాలు దోహదం  చేస్తాయని అనడంలో సందేహం లేదు. అయితే మీరు పాలను సరైన పద్దతిలో తాగాకుంటే పాలలో ఉండే సంపూర్ణ పోషకాలు లేకుండా మీ శరీరానికి ఉపయోగ పడదు. పచ్చిపాలు తాగ వచ్చా? ఇందులో ఆశ్చర్య పోవాల్సింది ఏమిలేదు మనశరీరానికి పచ్చిపాల లో ఉన్న పోషక తాత్వాలను అందిస్తుంది.ఎందుకంటే గడ్డితిని ఆవులు లేదా గేదెల నుండే పాలు తీస్తారు.ఈ విధంగా పాలు ఎంజయిం ఆరోగ్యం ప్రోటీన్లతో సంపూర్ణంగా ఉంటుంది.ఆయితే కొన్నిరకాల కీటకాలు ,జీవాణువులను చంపాలంటే పాలను ఒకక్రమ పద్దతిలో సాగుతాయి.ఈ కారణంగా ఎలర్జీ తో పాటు గుండె సంబందిత రోగాలు రావచ్చు. పాల వల్ల లాభాలు... కొన్ని ఏళ్లుగా పాలు తాగడం వల్ల కలిగే లాభాలు చెపుతూనే ఉన్నాము.నష్టాలు గురించి తక్కువే చెప్పుకుంటాము పాలలో కాల్షియం,పోస్ఫరస్,విటమిన్ బి,పొటాషియం,విటమిన్ డి,వంటి పోషక తత్వాలు సంపూర్ణంగా ఉంటాయి.దీనితోపాటు ప్రోటీన్ అధికసంఖ్యలో లభిస్తుంది.మన ఎముకలను పటిష్టంగా ఉంచేందుకు పాలు దోహదం చేస్తాయి.కణాలు టిష్యులు రీజేనేవేషన్,లేదా మెదడు చురుకుగా పనిచేసేందుకు ఆరోగ్యంగా ఉంచేందుకు సహకరిస్తుంది.మరి మీరు సరైన పద్దతిలో పాలు తీసుకుంటున్నారా.? పాలు తాగాలంటే సరైన పద్ధతి ఏమిటి? పాలను వినియోగించాలంటే మిల్క్ షేక్,స్మూదీ,టీ,మిటాయి, ఎక్కడైనా ఏరూపంలో ఐనా వాడతారు.ప్రతివ్యక్తి పాలను వాడే సరైన పద్ధతి వేరు వేరుగా ఉంటుంది. కాని చాలామందికి పచ్చి పాలు  తాగడం ఇష్ట పడతారు.ఇది ఏ మాత్రం కలుషితం లేనిదని పవిత్ర మైనవిగా భావిస్తారు. పచ్చిపాలను తాగడం మంచిదేనా? సురక్షితమా? కొన్ని ఏళ్ళుగా ఒక పరంపరగా పచ్చిపాలను తాగడం ఆరోగ్యానికి మంచిదని ధర్మంగా భావిస్తారు.వీటిలో ఏ రకమైన పదార్ధాలు తీయకుండా నేరుగా తాగడం కాలాను గుణంగా ఆలోచనలు పెరిగి మార్పులు వచ్చాయి. ఇప్పుడు పచ్చిపాలు తాగడం సురక్షితం కాదని నిర్ధారించారు. పచ్చి పాలు తాగితే ఏమౌతుంది? పచ్చి పాలు తాగడం వల్ల హానికలగ వచ్చు ఎందుకంటే ఇందులో బ్యాక్టీరియా లిస్టేరియా,ఈ కోలి,కాక్సిఎలా ,సాల్మనేల్ల,కేండి లో బెక్టర్,యార్సినియా,ఆరోగ్యం పంచెంద్రియాల పై సమస్యలు సృష్టించ వచ్చు. ఒక వేళ ఆయా ఆవులు గేదేలలో శరీరం లో ఏమైనా వైరస్ సంక్రమించి ఉంటె సమస్యలు వస్తాయి. గర్భవతులు పాలిచ్చే తల్లుల ఆరోగ్యం పై ప్రభావం చూపుతుంది.

లెమన్ ఎసెన్షియల్ ఆయిల్ తో ఇన్ని ప్రయోజనాలు ఉంటాయని మీకు తెలుసా...

  ఎసెన్షియల్ ఆయిల్స్ గత కొంతకాలంగా బాగా ప్రాచుర్యం పొందాయి. ప్రతి ఒక్కరూ ఈ  నూనెల  సువాసనను ఇష్టపడతారు.  ఇది కేవలం సువాసనే కాదు ఎన్నో సమస్యల్లో ఉపశమనం కూడా ఇస్తుంది. ఇది కాకుండా,  ఈ నూనెలను ఏదైనా ఇతర నూనెతో మిక్స్ చేసి చర్మానికి అప్లై చేయవచ్చు, డిఫ్యూజర్‌లో ఉపయోగించవచ్చు లేదా వాసన చూడవచ్చు. ఈ ఎసెన్షియల్ ఆయిల్స్ లో   లెమన్ ఎసెన్షియల్ ఆయిల్ కూడా ఒకటి. దీని అద్భుతమైన ప్రయోజనాల గురించి  తెలుసుకుంటే.. ఫంగల్ ఇన్ఫెక్షన్ తో పోరాడుతుంది.. చర్మం నుండి బ్యాక్టీరియాను చంపడమే కాకుండా, లెమన్ ఎసెన్షియల్ ఆయిల్ లో  యాంటీ ఫంగల్ లక్షణాలు కూడా ఉన్నాయి. గోళ్ళలో ఫంగస్ లేదా చుండ్రు ఉన్నట్లయితే  టీ ట్రీ ఆయిల్‌కు బదులుగా లెమన్ ఆయిల్‌ని కూడా ఉపయోగించుకోవచ్చు.  దీన్ని చర్మంపై అప్లై చేయడమే కాకుండా, ఎయిర్ డిఫ్యూజర్‌గా కూడా ఉపయోగించవచ్చు. దీని సువాసన గదిలో ఉండే ఫంగస్ మరియు బ్యాక్టీరియాను తగ్గిస్తుంది. యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు.. లెమన్ ఎసెన్షియల్ ఆయిల్ లో  యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి  ఇన్ఫెక్షన్‌కు కారణమయ్యే బ్యాక్టీరియా నుండి రక్షిస్తాయి. నిమ్మకాయతో తయారు చేయబడిన ఎసెన్షియల్ ఆయిల్  స్టెఫిలోకాకస్ ఆరియస్,  ఇ.కోలి వంటి బ్యాక్టీరియా నుండి రక్షించడంలో ప్రభావవంతంగా ఉంటుందని 2019లో చేసిన పరిశోధనలో కనుగొనబడింది. ఈ ఎసెన్షియల్ ఆయిల్ ను  ఏదైనా ఇతర క్యారియర్ ఆయిల్ తో  కలిపిన తర్వాత మాత్రమే ఉపయోగించాలి.  అప్లై చేసే ముందు ప్యాచ్  టెస్ట్ చేయాలి.  ఈ జాగ్రత్త వల్ల  అలెర్జీలను నివారించవచ్చు. గాయాలను త్వరగా నయం చేస్తుంది.. లెమన్ ఎసెన్షియల్ ఆయిల్ లో  ఉండే యాంటీమైక్రోబయల్ లక్షణాలు  గాయాలను త్వరగా నయం చేయడంలో సహాయపడతాయి. లెమన్ ఎసెన్షియల్ ఆయిల్ తో గాయాన్ని శుభ్రం చేయవచ్చు. అయితే ఇతర క్యారియర్ ఆయిల్ తో కలిపే వాడాలి. ఇది బ్యాక్టీరియాను తొలగిస్తుంది.  గాయాలను త్వరగా నయం చేస్తుంది. చలికాలానికి ది బెస్ట్.. చలికాలంలో తలనొప్పి, జలుబు కారణంగా తలంతా బరువుగా ఉన్నా, గొంతులో నొప్పి,  వాపు వంటి సమస్య ఉన్నా లెమన్ ఎసెన్షియల్ ఆయిల్ చక్కగా  ఉపయోగపడుతుంది. ఈ నూనెను  డిఫ్యూజర్‌లో ఉపయోగించడం వల్ల దాని సువాసన శ్వాస ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇది ఓ రకంగా అరోమా థెరపీ అనుకోవచ్చు.  ఇది  గొంతులో వాపు,  నొప్పిని తొలగిస్తుంది. అదే సమయంలో, ఇందులో ఉండే విటమిన్-సి జలుబ,  ఫ్లూ నుండి ఉపశమనం ఇస్తుంది. వికారం వదిలించుకోవడానికి.. వికారం  బాధపెడుతుంటే, నిమ్మ నూనె  సహాయం చేస్తుంది. గర్భిణీ స్త్రీలలో కూడా కలిగే వేవిళ్ళు, ఇతర సందర్భాలలో సాదారణ ప్రజలకు ఎదురయ్యే వికారానికి   ఈ నూనె చక్కగా సహాయపడుతుంది. ఒత్తిడిని దూరం చేస్తుంది.. నిమ్మ నూనె సువాసన  మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. ఈ సువాసన ఆందోళన,  టెన్షన్‌ని దూరం చేస్తుంది.  దీనివల్ల  రిలాక్స్‌గా ఉండచ్చు.   సాధారణంగా లావెండర్ లేదా రోజ్ ఎసెన్షియల్ ఆయిల్‌ను ఆందోళన, డిప్రెషన్  లక్షణాలను తగ్గించడానికి ఉపయోగిస్తారు, అయితే నిమ్మ నూనె ఈ రెండు నూనెల కంటే మెరుగైనది. చర్మానికి మేలు చేస్తుంది.. చర్మంపై మొటిమలు,  చీము తగ్గించడానికి లెమన్ ఎసెన్షియల్ ఆయిల్  ఉపయోగించవచ్చు.  ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి. ఇది సహజంగానే  రక్తస్రావ నివారిణిగా పనిచేస్తుంది.  చర్మం మీది మృత కణాలను శుభ్రపరచడం, మూసుకుపోయిన  రంధ్రాలను తెరవడం ద్వారా పనిచేస్తుంది. నిమ్మకాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని కాంతివంతం చేసి  ఆరోగ్యంగా కనిపించేలా చేస్తాయి. అయితే నిమ్మకాయ చర్మాన్ని సున్నితంగా మార్చుతుంది కాబట్టి ఎండలోకి వెళ్లేటప్పుడు సన్‌స్క్రీన్‌ని అప్లై చేయాలి.                                                               *నిశ్శబ్ద.

విటమిన్ బి12 లోపం..ఈ వ్యాధులకు కారణం..!!

శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి అత్యంత అవసరమైన విటమిన్లలో  విటమిన్ బి-12 కూడా ఒకటి . విటమిన్ B12 శరీరంలో సహజంగా ఉత్పత్తి అవ్వదు. ఇది ఆహారం, పానీయాల నుండి మాత్రమే లభిస్తుంది. ఈ విటమిన్ ఎర్ర రక్త కణాలు, DNA ఏర్పడటానికి అవసరం. మెదడు, నరాల కణాల అభివృద్ధిలో విటమిన్ B-12 చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అంటే మన శారీరక, మానసిక ఆరోగ్యానికి ఈ విటమిన్ చాలా అవసరం. వృద్ధాప్యంలో దాని లోపం కారణంగా, డిమెన్షియా సమస్య ఉండవచ్చు. పెద్దలు మాత్రమే కాకుండా పిల్లలు కూడా దాని లోపానికి గురవుతారు. అల్జీమర్స్ వ్యాధి, చిత్తవైకల్యం మెదడుకు సంబంధించిన సమస్యలు. 60 సంవత్సరాల వయస్సులో, ఈ రెండు వ్యాధుల ప్రమాదం పురుషుల నుండి స్త్రీలకు పెరుగుతుంది. ఈ వ్యాధిలో ఆలోచించే, అర్థం చేసుకునే సామర్థ్యం ప్రభావితమవుతుంది. కొన్ని విటమిన్ల లోపం వల్ల కూడా డిమెన్షియా వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అందులో ఒకటి విటమిన్ బి-12. విటమిన్ బి12 లోపం వల్ల డిమెన్షియా వచ్చే ప్రమాదం: డిమెన్షియా అనేది ఒక వ్యాధి, దీనిలో వయస్సు పెరుగుతున్న కొద్దీ మరచిపోయే సమస్యలను కలిగి ఉంటారు. దీనికి ప్రధాన కారణం శరీరంలో విటమిన్ బి12 లోపం. ఇది మన మనస్సును నేరుగా ప్రభావితం చేస్తుంది. డిమెన్షియాలో, ఒక వ్యక్తి ఆలోచించే, అర్థం చేసుకునే సామర్థ్యం ఎక్కువగా ప్రభావితమవుతుంది. విటమిన్ B-12 వల్ల కలిగే ఇతర సమస్యలు: కీళ్లు,ఎముకల నొప్పి: శరీరంలో విటమిన్ బి-12 లోపం వల్ల ఎముకలు, కీళ్ల నొప్పుల సమస్య కూడా రావచ్చు. దీని కారణంగా, నడుము, వెన్నులో నిరంతర నొప్పి ఉండవచ్చు. గర్భంలో సమస్య: విటమిన్ B-12 లోపం యొక్క ప్రభావం గర్భిణీ స్త్రీలలో కూడా కనిపిస్తుంది. ఈ కారణంగా, పిల్లల అభివృద్ధి సమయంలో, గర్భధారణ సమయంలో సమస్యలు పెరుగుతాయి. దాని లోపం కారణంగా, గర్భం ధరించడంలో ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది. చర్మ వ్యాధి: శరీరంలో విటమిన్ బి12 లేకపోవడం వల్ల చర్మానికి సంబంధించిన సమస్యలు కూడా వేధిస్తాయి. దాని లోపం వల్ల జుట్టు కూడా చాలా వేగంగా రాలిపోతుంది. రక్తహీనత: శరీరంలో విటమిన్ బి-12 లోపం వల్ల రక్తహీనత వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. విటమిన్ బి-12 లోపం వల్ల ఎర్ర రక్త కణాలు సరిగా ఉత్పత్తి కావు. అటువంటి పరిస్థితిలో, హిమోగ్లోబిన్ తగ్గడం ప్రారంభమవుతుంది. రక్తహీనత పూర్తి అవకాశాలు ఉన్నాయి. విటమిన్ B-12 లోపానికి చికిత్స చేసే ఆహారాలు: విటమిన్ B12 లోపాన్ని అధిగమించడానికి, మీ ఆహారంలో పాలు, చీజ్, ఇతర పాల ఉత్పత్తుల మొత్తాన్ని పెంచండి. మీరు మాంసాహారులైతే, ముఖ్యంగా మీ ఆహారంలో గుడ్లు, మాంసాన్ని చేర్చుకోండి. మీరు డాక్టర్ సలహాపై ఈ విటమిన్ యొక్క సప్లిమెంట్లను కూడా తీసుకోవచ్చు.

వైరల్ ఫీవర్ కోసం సింపుల్ హోం రెమెడీస్!

వర్షాకాలం వచ్చిందంటే చాలు  బ్యాక్టీరియా వైరస్‎లు విజృంభిస్తూ ఉంటాయి. వయసుతో సంబంధం లేకుండా అందరికీ ఇన్ఫెక్షన్ ద్వారా జలుబు, జ్వరం రావడం సాధారణం.   అయితే జలుబు జ్వరం వచ్చినప్పుడల్లా ఇంగ్లీష్ మాత్రలపైన, మందులపైన ఆధారపడటం ద్వారా మన ఇమ్యూనిటీ దెబ్బతింటుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయుర్వేదం ఒక చక్కటి పరిష్కారం అని నిపుణులు సూచిస్తున్నారు. వైరల్ ఫీవర్‌ వంటి జబ్బులకు వంట ఇంటి చిట్కాలను తెలుసుకుందాం. శరీరంలో రోగనిరోధక శక్తి కొద్దిగా తగ్గినా ఆరోగ్యం దెబ్బతిని జ్వరం, జలుబు, దగ్గు అన్నీ ఒక్కొక్కటిగా వేధించడం మొదలవుతాయి. వీటిని దూరం చేసుకోవడానికి కొన్ని సింపుల్ హోం రెమెడీస్ చూద్దాం... తేనె-అల్లం రసం: ఒక టేబుల్ స్పూన్ అల్లం రసంలో ఒక టేబుల్ స్పూన్ తేనె కలిపి తీసుకుంటే జ్వరం, జలుబు, దగ్గు సమస్య క్రమంగా తగ్గుతుంది. పసుపు నీరు: జ్వరం, దగ్గు, కఫం, జలుబు వంటి సమస్యలు ఉంటే ఉదయాన్నే పరగడుపున వేడినీళ్లలో కొద్దిగా పసుపు కలిపి తాగితే సమస్య పరిష్కారం అవుతుంది. తులసి టీ: తులసి ఆకుల్లో ఉండే యాంటీ వైరల్ గుణాలు దగ్గు, కఫం, జలుబు, జ్వరంతో పోరాడుతాయి. కాబట్టి జ్వరం వచ్చినప్పుడు తులసి టీ తాగడం అలవాటు చేసుకోండి. తులసి రసం: రెండు టీస్పూన్ల గోరువెచ్చని నీటిలో ఒక టేబుల్ స్పూన్ తులసి ఆకులను కలపడం అలవాటు చేసుకుంటే శరీర ఉష్ణోగ్రత క్రమంగా తగ్గి జ్వరం కూడా అదుపులోకి వస్తుంది. ధనియాల టీ: ధనియాల గింజల్లో యాంటీ బయోటిక్ గుణాలు ఉన్నాయి, ఇవి వైరల్ ఇన్ఫెక్షన్ల వల్ల వచ్చే జ్వరాన్ని తగ్గిస్తాయి. కాబట్టి కొత్తిమీర గింజల టీ తయారు చేసి తాగడం మంచిది. మెంతులు నానబెట్టిన నీరు: ఒక టేబుల్ స్పూన్ మెంతి గింజలను అరకప్పు నీటిలో నానబెట్టండి. దీన్ని వడకట్టి ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీటిని తాగితే జ్వరం సమస్య నెమ్మదిగా అదుపులోకి వస్తుంది.

అధిరిపోయే ఆరోగ్యానికి రెయిన్ బో డైట్..

  శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఆరోగ్యకరమైన,  పోషకమైన ఆహారాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం చాలా ముఖ్యం. పౌష్టికాహారం  తీసుకుంటేనే  మనకు అవసరమైన అన్ని పోషకాలు లభిస్తాయి. అనారోగ్యకరమైన ఆహారం, శారీరక శ్రమలేకపోవడం  అనే రెండు చెడు అలవాట్లే ప్రస్తుతం చాలా వ్యాధులకు ప్రధాన కారణమని డైటీషియన్లు చెబుతున్నారు.ఆహారంలో పోషక విలువలపై మాత్రమే శ్రద్ధ వహిస్తే, మధుమేహం,  గుండె వంటి ప్రాణాలను బలికొనే వ్యాధుల   ప్రమాదాన్ని 40 శాతం తగ్గించవచ్చు. అయితే చాలామందికి పోషకాహారం తినడమే కాదు, దాన్ని సమకూర్చుకోవడం, పోషకాహరంలో ఏ ఆహారం ఉండాలి?  ఎలాంటి ఆహారం ఉండాలి అనే అవగాహన ఉండదు.  ఆరోగ్యకరమైన పోషకాహారానికి,  మంచి ఆరోగ్యానికి  మధ్య ఉన్న సంబంధాల గురించి ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 1 నుండి 7 వరకు జాతీయ పోషకాహార వారోత్సవాలను జరుపుకుంటారు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, మొత్తం శరీరం ఆరోగ్యంగా,  ఫిట్‌గా ఉండాలంటే రెయిన్‌బో డైట్‌ను అనుసరించడం చాలా ముఖ్యం. అసలు రెయిన్ బో డైట్ అంటే ఏంటి? ఇందులో ఏయే ఆహారాలు, కూరగాయలు, పండ్లు ఉండాలి?   ఈ విషయాల గురించి పూర్తీగా తెలుసుకుంటే.. రెయిన్‌బో డైట్ సమర్థవంతమైన ఆరోగ్యానికి రెయిన్ బో డైట్ చాలా ముఖ్యమైనది. ఇది పూర్తీ శరీర సామర్థ్యానికి సహాయపడుతుంది.  రెయిన్‌బో డైట్ అంటే వివిధ రంగుల పండ్లు  కూరగాయలను ఆహారంలో చేర్చడం. రంగురంగుల పండ్లు,  కూరగాయలలో  విటమిన్లు, ఖనిజాలు,  యాంటీఆక్సిడెంట్లు సమృద్దిగా ఉంటాయి, ఇవి శరీరానికి అనేక విధాలుగా ప్రయోజనాన్ని చేకూరుస్తాయి.  రెయిన్‌బో డైట్‌లో ముఖ్యమైనవి ఏవంటే.. ఎరుపు రంగు పండ్లు,  కూరగాయలు.. ఎరుపు రంగు పండ్లు,  టమోటాలు, స్ట్రాబెర్రీలు  లాంటి  ఇతర కూరగాయలు విటమిన్లు, పోషకాలను సమృద్ధిగా కలిగి  ఉంటాయి. చాలా పండ్లలో విటమిన్ ఎ, పొటాషియం,  యాంటీఆక్సిడెంట్లు  ఉంటాయి, ఇవి శరీరానికి అనేక విధాలుగా మేలు చేస్తాయి. రోజువారీ ఆహారంలో ఎరుపు రంగు పండ్లు, కూరగాయలను చేర్చుకోవాలి. ఆరెంజ్ పండ్లు,  కూరగాయలు.. ఎరుపు రంగు పండ్లతో పాటు నారింజ రంగు పండ్లు  కూరగాయలను కూడా ఆహారంలో చేర్చుకోవాలి. ఎరుపు,  నారింజ కూరగాయలలో అధిక మొత్తంలో విటమిన్ ఎ ఉంటుంది, ఇది నోటిలోని లాలాజల గ్రంథులు,  శ్లేష్మ కణజాలాల ఆరోగ్యానికి అవసరం. ఈ విటమిన్ లోపం వల్ల దంతాలు బలహీనపడతాయి. విటమిన్ ఎ  కళ్ళ ఆరోగ్యానికి చాలా అవసరం.  నారింజ రంగు పండ్లు, కూరగాయల ద్వారా విటమిన్ ఎ శరీరానికి సమర్థవంతంగా అందుతుంది. తెలుపు రంగులో ఉండే  పండ్లు, కూరగాయలు.. తెల్లటి పండ్లు,  కూరగాయలు   శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంతో పాటు అధిక రక్తపోటు సమస్య నుండి ఉపశమనాన్ని అందిస్తాయి.  వాటిని తీసుకోవడం వల్ల గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో  చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది శరీర రోగనిరోధక శక్తిని పెంచే ప్రభావాన్ని కూడా కలిగి ఉంటుంది. తెల్లటి పండ్లు,  కూరగాయలలో లభించే పోషకాలు పెద్దప్రేగు, ప్రోస్టేట్ మరియు రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి. క్యాలీ ఫ్లవర్, అరటిపండు, సీతాఫలం, పచ్చి టమోటా, ముల్లంగి వంటివి ఇందులో భాగంగా తీసుకోవచ్చు. ఆకు కూరలు, ఆకుపచ్చ కూరగాయలు, పండ్లు.. ఆకుకూరల్లో  ఫోలేట్‌లో సమృద్ధిగా ఉంటుంది. ఇది న్యూరోట్రాన్స్‌మిటర్ ఉత్పత్తికి,  మానసిక స్థితి స్థిరత్వానికి బాగా పనిచేస్తుంది. అలాగే ఆకుపచ్చ రంగులో ఉండే బ్రోకలి, క్యాప్సికమ్, కాకర వంటి కూరగాయలు, ఆకుపచ్చ రంగులో ఉండే పండ్లలో ఫోలెట్ పొందవచ్చు. పర్పుల్ కలర్ ఆహారాలు.. ద్రాక్ష, బ్లాక్‌బెర్రీలు, రేగు వంటి ఊదారంగు పండ్లను ఆహారంలో చేర్చుకోవాలి. వీటిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ,  న్యూరోప్రొటెక్టివ్ ప్రభావాలను కలిగి ఉన్న ఆంథోసైనిన్‌లు ఉంటాయి. తృణధాన్యాలు.. క్వినోవా, బ్రౌన్ రైస్,  హోల్ వీట్ వంటి రంగురంగుల తృణధాన్యాలను ఎంచుకోవాలి. ఈ ధాన్యాలు స్థిరమైన శక్తిని అందిస్తాయి,  మెరుగైన మానసిక స్థితిని,  అభిజ్ఞా పనితీరును మెరుగు పరుస్తాయి. గింజలు,  విత్తనాలు.. బాదం, వాల్‌నట్‌లు, చియా గింజలు,  అవిసె గింజలు వంటి వివిధ రకాల  గింజలను అల్పాహారంలో భాగం  చేయాలి.  వీటిలోని ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్  మెదడు ఆరోగ్యానికి తోడ్పడే అవసరమైన పోషకాలను అందిస్తాయి. కొవ్వులు.. చేపలు, చికెన్, చిక్కుళ్ళు,  టోఫు వంటి  ప్రోటీన్ మూలాలను ఆహారంలో భాగం చేసుకోవాలి. ఈ ఆహారాలు న్యూరోట్రాన్స్మిటర్ ఉత్పత్తికి అవసరమైన అమైనో ఆమ్లాలను అందిస్తాయి. మూలికలు, సుగంధ ద్రవ్యాలు.. పసుపు, అల్లం,  రోజ్మేరీ వంటి మూలికలు, సుగంధాలను తీసుకోవాలి. అవి యాంటీ ఇన్ఫ్లమేటరీ,  కాగ్నిటివ్-పెంచే లక్షణాలను కలిగి ఉండే సమ్మేళనాలను కలిగి ఉంటాయి.                                                        *నిశ్శబ్ద.  

ఈ పండ్లు తిన్న తర్వాత నీళ్లు తాగకూడదని మీకు తెలుసా?

చాలామంది ఆహారం తిన్న వెంటనే లేదంటే భోజనం చేయగానే నీళ్లు తాగుతుంటారు. ఆహారం తిన్న వెంటనే నీళ్లు తాగకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలా చేస్తే జీర్ణసమస్యలు వస్తాయని పేర్కొంటున్నారు. అలాగే కొన్ని పండ్లను తిన్న వెంటనే మంచినీళ్లు తాగడం వల్ల కడుపు సంబంధిత సమస్యలు వస్తాయంటున్నారు. అవేం పండ్లు? అవి తింటే ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో తెలుసుకుందాం. ఆమ్ల ఫలాలు: నారింజ, ఉసిరి, ద్రాక్ష వంటి పుల్లని పండ్లను తిన్న తర్వాత  నీరు త్రాగకూడదు. ఇలా చేయడం వల్ల శరీరంలోని pH స్థాయికి భంగం కలుగుతుంది. ఇది జీర్ణవ్యవస్థకు ఆటంకం కలిగిస్తుంది. పియర్స్: ఫైబర్, విటమిన్ ఎ, విటమిన్ సి పుష్కలంగా ఫోలిక్ యాసిడ్, పొటాషియం, పియర్స్ జీర్ణక్రియకు సహాయపడతాయి. పియర్స్ తిన్న తర్వాత నీళ్లు తాగడం వల్ల జీర్ణక్రియ దెబ్బతింటుంది. పుచ్చకాయ: శరీరంలో నీటి కొరతను అధిగమించడానికి పుచ్చకాయ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. తిన్న తర్వాత నీళ్లు తాగితే జీర్ణవ్యవస్థ చెడిపోతుంది. లూజ్ మోషన్ అయ్యో అవకాశం ఉంటుంది. అరటిపండు: అరటిపండులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. మలబద్ధకం, కడుపు సమస్యల నుండి ఉపశమనం పొందుతుంది. కానీ అరటిపండు తిన్న తర్వాత నీళ్లు తాగితే జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. దానిమ్మ: శరీరంలో రక్తాన్ని పెంచడానికి, రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి దానిమ్మ ఉపయోగపడుతుంది. దానిమ్మ తిన్న తర్వాత నీళ్లు తాగడం వల్ల వికారం, అసిడిటీ, వాంతులు అవుతాయి.

ఉదయాన్నే నానబెట్టిన అంజీర్ తింటే ఆరోగ్య ప్రయోజనాలెన్నో!

చూడటానికి గుండ్రంగా కనిపించే అంజీర్ అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది.   ఓ రెండు అంజీర్ పండ్లను రాత్రంతా నీటిలో నానబెట్టి, ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీటిని తాగితే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. కొందరు బాదం, వాల్‌నట్‌లను, అత్తి పండ్లతో నానబెట్టి తింటుంటారు.  అంజీర్ నానబెట్టిన నీటిని తాగడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పునరుత్పత్తి వ్యవస్థకు మంచిది: అత్తి పండ్లలో ఎక్కువ మొత్తంలో ఖనిజాలు ఉంటాయి. ఇవన్నీ మిమ్మల్ని సమతుల్యంగా ఉంచుతాయి. ఉదాహరణకు జింక్, మాంగనీస్, మెగ్నీషియం, ఇనుము మొదలైనవి. ఇవన్నీ కూడా మీ జీర్ణవ్యవస్థకు అనుగుణంగా ఉంటాయి. అంజీర్ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది మహిళల్లో రుతుక్రమం తర్వాత, హార్మోన్ల సమస్యలకు ప్రత్యేకంగా సహాయపడుతుంది. మెనోపాజ్ సమస్యలకు ఇది దివ్యౌషధం వంటిది. షుగర్ కంట్రోల్లో ఉంటుంది: మీ రక్తంలో చక్కెర స్థాయిలను మెరుగ్గా నిర్వహించగల గుణం అత్తి పండ్లలో ఉంటుంది. ఎందుకంటే ఇందులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుంది. ఇప్పటికే టైప్ 2 డయాబెటిస్‌తో బాధపడుతున్న వారు నీటిలో నానబెట్టిన అంజీర పండ్లను తీసుకోవడం చాలా మంచిది. ఓట్స్‌తో పాటు అత్తి పండ్లను కూడా ఆహారంలో చేర్చుకోవచ్చు. మలబద్ధకం  నుంచి ఉపశమనం: చాలా మందికి కడుపుకు సంబంధించిన సమస్యలు ఉంటాయి. మలవిసర్జన సరిగా జరగకపోవడం వల్ల జీర్ణవ్యవస్థ విచ్ఛిన్నమై మలబద్ధకం సమస్య ఏర్పడుతుంది. అలాంటి వారికి రాత్రిపూట అంజూర పండును నానబెట్టి, ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఆ నీటిని తాగడం వల్ల మలవిసర్జన సులభతరం చేయబడి, దీర్ఘకాలంగా ఉన్న మలబద్ధకం సమస్య దూరమవుతుంది. చర్మ ఆరోగ్యానికి మంచిది: ఉదయం పూట రాత్రంతా నానబెట్టిన అంజీర్ నీటిని తాగడం వల్ల మన శరీరంలోని టాక్సిన్స్ తొలగిపోతాయి. ఇది మన చర్మ కాంతిని పెంచడంతోపాటు  చర్మ సమస్యలను  నయం చేస్తుంది. తద్వారా మీ అందం పెరుగుతుంది. బరువు తగ్గుతారు: ఈ రోజుల్లో శరీర బరువు తగ్గించుకోవడానికి చాలా కష్టపడుతున్నారు. దీని కోసం ఆహార నియమాలు, వ్యాయామాలు అనుసరిస్తున్నారు. కానీ బరువు తగ్గించుకోవడానికి ఫైబర్ కంటెంట్ అవసరం ఎక్కువగా ఉంటుంది. అత్తిపండ్లు మనకు అవసరమైన ఫైబర్‌ని అందిస్తాయి. అయితే దీన్ని రెగ్యులర్‌ పరిమాణంలో తీసుకోవాలి. అధిక బరువు ఉన్నవారు దీన్ని ఎక్కువగా తింటే మళ్లీ బరువు పెరిగే అవకాశం ఉంది.  

పసుపు పాలు ఎవరు ఎలా తాగాలి? ఎలా తాగితే మంచి బెనిఫిట్స్ ఉంటాయంటే..

పసుపు పాలు రోజూ తాగడం వల్ల శరీరానికి బలం చేకూరుతుందని పెద్దలు చెప్పడం మీరు వినే ఉంటారు. పసుపును ఆయుర్వేదంలో ఔషధంగా ఉపయోగిస్తారు. ఇది సహజ యాంటీబయాటిక్గా పరిగణించబడుతుంది. అయితే కాల్షియం, ప్రోటీన్ తో సహా  అనేక విటమిన్లు పాలలో ఉంటాయి. పసిపిల్లల నుండి వృద్దుల వరకు పాలు తాగడం ఎంతో అవసరమని వైద్యులు ఎన్నో ఏళ్ళ నుండి చెబుతూనే ఉన్నారు. ఇలా ఔషద గుణం కలిసిన పసుపు, ఆరోగ్యం చేకూర్చే పాలు రెండింటిని కలిపి తాగడం వల్ల ఆరోగ్యానికి డబుల్ ప్రయోజనాలు పొందవచ్చని సాధారణంగా చెబుతూనే ఉంటారు. ముఖ్యంగా పసుపు పాలు తాగితే ఇమ్యూనిటీ పెరుగుతుందనే నమ్మకం ఉంది. అది నిజం కూడా.. కానీ రోజూ  రాత్రి పడుకునే ముందు పసుపు పాలు తాగితే ఇమ్యూనిటి మాత్రమే కాదు ఇంకా బోలెడు ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో తెలిస్తే ఈ రోజు నుండే రాత్రి పూట పసుపుపాలు తాగడం మొదలెట్టేస్తారు. పసుపు పాలను గోల్డెన్ మిల్క్ అని పిలుస్తారంటే దాని రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.  ఏ సమస్య ఉన్నవారు పసుపు పాలను ఎలా తయారుచేసుకోవాలో.. పసుపుపాలు కేవలం ఇమ్యూనిటికే కాకుండా ఇంకా ఏ ప్రయోజనాలు చేకూరుస్తుందో తెలుసుకుంటే.. రాత్రిపూట నిద్ర సంబంధ సమస్యలతో బాధపడేవారు పసుపు పాలు తాగాలని కొందరు సలహా ఇస్తారు.  ప్రశాంతంగా నిద్రపోవాలనుకుంటే, రోజూ రాత్రిపూట ఒక గ్లాసు పసుపు పాలు తాగాలి. ఇది  బాగా నిద్రపోవడానికి సహాయపడుతుంది.  పసుపు రోగనిరోధక శక్తిని పెంచుతుందనే విషయం అందరికీ తెలిసిందే. రాత్రి పూట పసుపు పాలు తాగడం  ద్వారా దగ్గు, జలుబు , జ్వరం వంటి సమస్యలు  నివారించవచ్చు. బోలెడు వ్యాధుల నుండి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.  సీజన్ ఏదైనా  తప్పనిసరిగా పసుపు పాలు తాగడం మంచిది. పసుపులో శక్తివంతమైన యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. కీళ్ల నొప్పులతో బాధపడే వారికి పసుపు పాలు దివ్యౌషధం. ఇది వాపు,  నొప్పి నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. అందుకే ప్రతిరోజు పసుపు పాలు తాగుతుంటే కీళ్ళు, ఎముకల సమస్యలు మెల్లిగా తగ్గుతాయి. పసుపును వందల ఏళ్ళ నుండి  చర్మ సంరక్షణలో  ఉపయోగిస్తున్నారు. ఇది చర్మాన్ని మెరిసేలా చేస్తుంది.  హానికరమైన బ్యాక్టీరియాను తొలగిస్తుంది. పసుపు పాలు తీసుకోవడం వల్ల  చర్మం ఆరోగ్యంగా, కాంతివంతంగా మారుతుంది. ఏ సమస్య ఉన్నవారు పసుపు పాలు ఎలా తాగాలంటే.. సాధారణంగా ఇమ్యునిటీ కోసం తాగాలని అనుకుంటే ముందుగా పాలు మరిగించాలి. రుచికి చిటికెడు పసుపు, పంచదార లేదా బెల్లం  జోడించాలి. అసలు తీపి జోడించకపోయినా పర్లేదు. పడుకునే ముందు వేడిగా లేదా గోరువెచ్చగా తాగాలి.  మధుమేహం, గుండె జబ్బులు, కీళ్ల నొప్పులు ఉన్నవారు పసుపు పాలలో  చిటికెడు జాజికాయ కూడా  కలిపి తాగవచ్చు. ఇది చక్కగా పనిచేస్తుంది. థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు  పసుపు పాలు తయారుచేసేటప్పుడు  కొన్ని జీడిపప్పులను కూడా కలుపుకోవచ్చు. లేదంటే జీడిపప్పు పొడిగా చేసి పాలు మరిగేటప్పుడు కొద్దగా జోడించవచ్చు. పసుపు పాలలో చిటికెడు నల్ల మిరియాల పొడి వేసి మరిగించి తాగితే   గొంతు నొప్పి,  ఇన్ఫెక్షన్‌లు తగ్గుతాయి.                                                *నిశ్శబ్ద.

మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఈ పండ్లు తింటే ఎంత ప్రమాదమో తెలుసా?

పండ్లు తినడం మంచి అలవాటు. ఆరోగ్యానికి అన్నివిధాలా మేలు చేస్తాయి. అంతేకాదు మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడుతాయి. కానీ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం...మీరు ఏం తింటున్నారో దానిపై శ్రద్ధ వహించడం ముఖ్యం. కొన్ని పండ్లు మధుమేహవ్యాధిగ్రస్తులు అస్సలు తినకూడదు. ఎందుకంటే అవి రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతాయి. షుగర్ పేషంట్లు ఎలాంటి పండ్లను తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. అరటిపండు: అరటిపండు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ప్రతిరోజూ అరటి పండు తినడం వల్ల ఫైబర్, ప్రొటీన్లు, విటమిన్లు, మాంగనీస్, పొటాషియం మొదలైన అనేక పోషకాలు లభిస్తాయి.  NCBI అధ్యయనం ప్రకారం, అరటిపండ్లు తినడం వల్ల రక్తంలో చక్కెర ఎక్కువగా ఉంటుంది.  ఎందుకంటే వాటిలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులకు అరటిపండు తినడం మంచిది కాదు. అనాస పండు: మధుమేహ వ్యాధిగ్రస్తులు పైనాపిల్‌ను మితంగా తినాలి. విటమిన్ సి పుష్కలంగా ఉన్న ఈ రుచికరమైన పండ్లను ఎక్కువగా తినడం వల్ల రక్తంలో చక్కెర వేగంగా పెరుగుతుంది. ఇందులో అధిక మొత్తంలో కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇది రక్తంలో త్వరగా కరిగి గ్లూకోజ్‌ని పెంచుతుంది. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు ఈ పండు తినకపోవడమే మంచిది. పుచ్చకాయ: పుచ్చకాయను వేసవిలో హైడ్రేషన్ కారణంగా తినాలి. అయితే దీన్ని ఎక్కువగా తినకూడదు. దీని GI విలువ సుమారు 72, ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా ప్రమాదకరం. ఖర్జూర: ఖర్జూరం చాలా చక్కెరను కలిగి ఉంటుంది.  ఇది ఎండిన తర్వాత ఇందులో చక్కెర శాతం పెరుగుతుంది. ఎంతగా అంటే అందులోని విటమిన్లు, మినరల్స్ కూడా దాని ముందు తక్కువగా కనిపించడం ప్రారంభిస్తాయి. అందుకే మధుమేహ వ్యాధిగ్రస్తులు దీనిని తినకూడదు.

డ్రైఫ్రూట్స్ లో తేనె కలిపి తింటే ఎన్నో లాభాలో తెలుసా?

డ్రై ఫ్రూట్స్‌లోని పోషకాలు ఒక్క వ్యక్తిని ఆరోగ్యంగా ఉంచడంలో ఎంతగానో సహాయపడతాయి.  అనారోగ్యానికి వ్యతిరేకంగా మీ శరీరాన్ని బలోపేతం చేయడానికి దోహదపడతాయి. తేనె అంటువ్యాధులతో పోరాడుతుంది. ఇది మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. డ్రైఫ్రూట్స్ లో కొవ్వు, కేలరీలు తక్కువగా ఉంటాయి. తేనె అనేది యాంటీఆక్సిడెంట్లు, ఇతర పోషకాలను కలిగి ఉన్న సహజ స్వీటెనర్. పోషణ,శక్తికి మూలం: తేనె పూసిన డ్రై ఫ్రూట్స్ రెండింటిలోని పోషక ప్రయోజనాలను మిళితం చేస్తాయి. వాటిలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు, డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటాయి, అవసరమైన పోషకాల యొక్క సాంద్రీకృత మూలాన్ని అందిస్తాయి. తేనె, డ్రైఫ్రూట్స్‌లోని సహజ చక్కెరలు త్వరిత శక్తిని ప్రోత్సహిస్తాయి. శారీరక కార్యకలాపాల శక్తి స్థాయిలను తిరిగి నింపడంలో సహాయపడతాయి. రోగనిరోధక శక్తిని పెంచుతుంది: తేనె దాని సంభావ్య యాంటీ బాక్టీరియల్ లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. డ్రైఫ్రూట్స్ లోని విటమిన్లు, ఖనిజాలతో కలిపినప్పుడు, ఇది మొత్తం రోగనిరోధక వ్యవస్థకు సపోర్టు చేస్తుంది. శరీరాన్ని ఇన్ఫెక్షన్ నుండి రక్షించడంలో సహాయపడుతుంది.వాటి పోషకాలు జింక్, సెలీనియం, పొటాషియం, కాపర్ , మెగ్నీషియం. అవి విటమిన్లు B, C , ఐరన్ కు  మంచి మూలం. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది: డ్రై ఫ్రూట్స్ లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియలో సహాయపడుతుంది. సాధారణ ప్రేగు కదలికలను ప్రోత్సహిస్తుంది. డ్రై ఫ్రూట్స్‌ని తేనెతో కలిపి తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. హృదయనాళ ఆరోగ్యం: ఎండుద్రాక్ష, ఆప్రికాట్ వంటి డ్రైఫ్రూట్స్  తేనెతో కలిపి తీసుకుంటే గుండె ఆరోగ్యానికి దోహదం చేస్తుంది. ఇవి పొటాషియం, ఫైబర్,ఫినాలిక్ సమ్మేళనాలు వంటి పోషకాలను కలిగి ఉంటాయి, ఇవి హృదయ ఆరోగ్యానికి తోడ్పడతాయి. యాంటీఆక్సిడెంట్ రక్షణ: తేనె, డ్రైఫ్రూట్స్‌లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కోవడంలో సహాయపడుతుంది. శరీరంలో హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను తటస్థీకరించడం ద్వారా దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది బరువును నిర్వహించడానికి: డ్రై ఫ్రూట్స్ శక్తికి మంచి మూలం.  తేనె బరువును తగ్గించడంలో సహాయపడుతుంది. బాదం, ఖర్జూరం, అంజీర, ఎండుద్రాక్ష మొదలైన డ్రై ఫ్రూట్స్‌లో విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి, హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడానికి, దృష్టిని మెరుగుపరచడంలో సహాయపడతాయి.  

స్త్రీలకు ఇలాంటి సమస్యలు ఉంటే గర్భం దాల్చడం కష్టం..!!

  జనాభాలో మన భారతదేశం అగ్రస్థానంలో ఉన్న మాట నిజమే. అయినప్పటికీ చాలా మంది దంపతులు బిడ్డను కనేందుకు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. మీరు ఆరోగ్యకరమైన ఆహారం, సంతానోత్పత్తి మందులను ఉపయోగిస్తున్నప్పటికీ మీరు గర్భవతి కాకపోతే, దానికి గల కారణాలు ఇప్పుడు తెలుసుకుందాం. క్రమరహిత ఋతు చక్రం: ప్రతి 28 లేదా 30 రోజులకు రుతుక్రమం రాని స్త్రీలకు సంతానోత్పత్తి సమస్యలు ఉంటాయి. మీ యుక్తవయస్సు దాటిన తర్వాత, మీ ఋతు చక్రాలు సక్రమంగా ఉండాలి. క్రమరహిత సైకిల్ వంధ్యత్వానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే, ఇది అండోత్సర్గ సమస్యను ప్రోత్సహిస్తుంది. నిజానికి, క్రమరహిత కాలాలు అనేక కారణాలను కలిగి ఉంటాయి. కారణాలు: -అధిక బరువు లేదా తక్కువ బరువు -విపరీతమైన వ్యాయామం -హైపర్ప్రోలాక్టినిమియా -తక్కువ అండాశయ నిల్వ -ప్రాథమిక అండాశయ లోపం -థైరాయిడ్ సమస్య. 35 ఏళ్లు పైబడిన వారికి వంధ్యత్వ సమస్య: వైద్యుల ప్రకారం, 35 ఏళ్ల తర్వాత మహిళల్లో సంతానోత్పత్తి తక్కువగా ఉంటుంది. ఇది సహజంగా వంధ్యత్వానికి దారితీస్తుంది. స్త్రీ, పురుష సంతానోత్పత్తి వయస్సుతో తగ్గుతుంది. 35 సంవత్సరాల వయస్సులో స్త్రీలలో వంధ్యత్వానికి గురయ్యే ప్రమాదం పెరుగుతుంది. మగ వంధ్యత్వం: సంతానం లేని స్త్రీలు వారి వంధ్యత్వానికి నేరుగా నిందించాల్సిన అవసరం లేదు. పురుషులు కూడా వంధ్యత్వాన్ని అనుభవించవచ్చని తెలుసుకోండి. పురుషులలో తక్కువ స్పెర్మ్ గణనలు లేదా నిరోధించబడిన స్పెర్మ్ చలనశీలత వీర్యం విశ్లేషణ ద్వారా నిర్ణయించబడుతుంది. అటువంటి సమస్యను గుర్తించడానికి సంతానోత్పత్తి పరీక్షను ఉపయోగించవచ్చు. దీర్ఘకాలిక వ్యాధులు: మీకు దీర్ఘకాలిక వ్యాధులు ఉంటే.. చికిత్స పొందుతున్నట్లయితే, ఇది సంతానోత్పత్తిని కూడా ప్రభావితం చేస్తుంది. ఉదాహరణకు, అధిక రక్తపోటు, మధుమేహం, ఉదరకుహర వ్యాధి, హైపోథైరాయిడిజం, అనేక ఇతర సమస్యలు వంధ్యత్వ ప్రమాదాన్ని పెంచుతాయి . అలాగే, థైరాయిడ్ హార్మోన్లు సక్రమంగా పీరియడ్స్ రావడానికి కారణమవుతాయి.  గర్భస్రావం: సాధారణంగా గర్భం దాల్చడానికి అసమర్థతతో ముడిపడి ఉంటుంది. అయినప్పటికీ, పదేపదే గర్భస్రావాలు అనుభవించే స్త్రీకి ఆరోగ్యంగా గర్భం దాల్చడం కష్టమవుతుంది. మీరు వరుసగా రెండు గర్భస్రావాలు కలిగి ఉంటే, గర్భం ధరించడానికి ముందు మీ వైద్యుడిని సంప్రదించండి.

ఈ నాలుగు సింపుల్ పనులు చేస్తే చాలు.. పొట్ట భాగంలో కొవ్వు ఐస్ లా కరిగిపోతుంది!!

  అందంగా ఆకర్షణీయంగా కనబడాలంటే శరీర సౌష్టవం చక్కగా ఉండాలి. పొట్ట భాగం ముందుకు చొచ్చుకుని వచ్చి రూపాన్నంతా పాడుచేస్తుంది. చాలామంది పొట్ట కనిపించకుండా కవర్ చేయడానికి దుస్తుల ఎంపిక మీద ఆధారపడతారు. అయితే ఇలా దుస్తుల మీద ఆధారపడటం కంటే పొట్ట తగ్గించుకుని శరీరాన్ని ఫిట్ గా మార్చుకోవడం మంచిది. పొట్ట తగ్గించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం ఉండటం లేదని నిరాశ పడేవారు చాలామంది ఉంటారు. కానీ కేవలం నాలుగు సింపుల్ పనులు చేయడం ద్వారా పొట్టలో కొవ్వును ఐస్ లా కరిగించేయచ్చు. ఇవి అందరూ చేయదగ్గవే. ఆ సింపుల్ పనులేంటో తెలుసుకుంటే.. పొట్టభాగంలో కొవ్వు వల్ల ఉబకాయం క్రమంగా పెరుగుతుంది. దీన్ని వదిలించుకోవడం అంత ఈజీ ఏమీ కాదు. దీనికి ప్రధాన కారణం వ్యాయామం లేకపోవడం, జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం, శీతలపానీయాలు, బేకరీ ఫుడ్స్ వంటివి తినడం. జంక్ ఫుడ్ లో చెడు కొలెస్ఠ్రాల్ ఉంటుంది. దీన్ని శరీరం ఉపయోగించుకోలేదు. ఎక్కువసేపు కూర్చుని పనిచేసేవారు ఒకే పొజిషన్ లో గంటల తరబడి కూర్చోవడం వల్ల ఆ భాగంలో ఫ్యాట్ చేరుతుంది. ఇది పొట్ట భాగమైనా, పిరుదుల భాగం అయినా, తొడలు, నడుము ఇలా ఏ భాగంలో అయినా   పేరుకుపోతుంది. దీన్ని తొలగించుకోవాలంటే మొదట ఈ జంక్ ఫుడ్స్ తినడం ఆపేయాలి. బర్గర్లు, సమోసా, మైదాతో చేసే పదార్థాలు, స్వీట్లు,  డీప్ ఫ్రై ఫుడ్స్, ప్యాక్డ్  ఫుడ్స్ మొదలైనవి వదిలేయాలి. ఈ పని పెద్ద కష్టమేమీ కాదు. జిహ్వచాపల్యం వదులుకుంటేనే బరువు తగ్గగలరు. మద్యపానం, ధూమపానం, పొగాకు ఉత్పత్తులు తీసుకునే అలవాటు ఉంటే ఈ అలవాటును తక్షణమే మానేయండి. ఇవి శరీరంలో కణాలలోకి చొచ్చుకువెళ్ళి కణాలను, హార్మోన్లను అస్తవ్యస్తం చేస్తాయి. హార్మోన్ల అసమతుల్యత కారణంగా ఆకలి ఎక్కువ కావడం, జంక్ ఫుడ్ తినాలని అనిపించడం జరుగుతుంది. పైబర్ ఆహారాలు బరువు తగ్గడంలో తోడ్పడతాయి. కరిగే ఫైబర్ ఆహారాలు తీసుకున్నప్పుడు అవి శరీరంలో నీటిని గ్రహించి జెల్ లాగా మారతాయి. ఇవి కడుపులో నిండుగా ఉన్న అనుభూతి ఇస్తాయి. ఎక్కవు సేపు ఆకలి కాకుండా నిరోధిస్తాయి. ఓట్స్ ఫైబర్ కు మంచి మూలం. ఓట్స్ ను ఆహారంలో భాగం చేసుకోవాలి. ఉదయం అల్పాహారంగానో, లేక రాత్రి సమయంలో ఓట్స్ తో దోశ, ఇడ్లీ, కిచిడి లాంటివి తీసుకోవాలి. రాత్రి 8గంటలలోపు భోజనం ముగించాలి. భోజనం తరువాత కనీసం ఓ 10నిమిషాల తేలికపాటి నడక అలవాటు చేసుకోవాలి.   బరువు తగ్గాలని అనుకునేవారు  ఫైబర్ అధికంగా ఉన్న పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. ఇవి మాత్రమే కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్కటైనా సిట్రస్ పండు తీసుకోవాలి. నిమ్మ, బత్తాయి, నారింజ ఇలా ఏదో ఒకటి తినాలి. వీటితో  పాటు మంచినీరు శరీరానికి కావలసినంత తాగాలి.                                                           *నిశ్శబ్ద.  

ఏ వయసులో ఎలాంటి మానసిక సమస్యలు వస్తాయో తెలుసా?

ప్రపంచవ్యాప్తంగా, మానసిక ఆరోగ్య సమస్యల కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా కరోనా  తర్వాత దాని ప్రమాదం మరింత పెరిగింది. అన్ని వయసుల వారిలోనూ మానసిక ఆరోగ్య రుగ్మతల కేసులు నమోదవుతున్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. భారతదేశంలో మానసిక ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు తొందరగా బయటపడవు. ఈ కారణంగా మానసిక సంబంధ వ్యాధుల బాధితులు ఎక్కువ మంది ఉన్నారు.  ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, దేశంలో ప్రతి ఐదుగురిలో ఒకరికి భావోద్వేగ,  ప్రవర్తనా సమస్యలు ఉన్నాయి. దేశంలో 60 నుండి 70 మిలియన్ల మంది ప్రజలు తేలికపాటి,  తీవ్రమైన మానసిక రుగ్మతలతో బాధపడుతున్నారు. ఒక్క ఏడాదిలోనే ఆత్మహత్యల కేసులు కూడా పెరిగాయి. WHO డేటా ప్రకారం భారతదేశంలో ప్రతి లక్ష మందిలో సగటు ఆత్మహత్యల రేటు 10.9గా ఉంది. కాబట్టి  మానసిక ఆరోగ్య సమస్యల గురించి అవగాహన పెంచుకోవడం ఎంతో అవసరం. పిల్లలు,  యువతలో పెరుగుతున్న సమస్య..  విచారించాల్సిన విషయం ఏమిటంటే భారతదేశంలోని పిల్లలు, యువత కూడా మానసిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. చాలామంది కనీసం తమది మానసిక సమస్య అనే విషయం గ్రహించలేని పరిస్థితులలో ఉన్నారని  మానసిక ఆరోగ్య నిపుణులు అంటున్నారు. సామాజంలో జరిగే తప్పుడు పనులు, పిల్లల మీద జరిగే చర్యలు, మానసిక ఆరోగ్యం పట్ల ప్రతికూల దృక్పథాలు, యువత సహాయం కోరకుండా అడ్డుపడుతున్నాయి. ఇంకా దేశంలో మానసిక ఆరోగ్య సంరక్షణ సులభంగా అందుబాటులో లేకపోవడం కూడా ఈ విషయంలో ప్రమాదాలను పెంచుతోంది. నేషనల్ మెంటల్ హెల్త్ సర్వే (NMHS) 2015-16 ప్రకారం, 18 ఏళ్లు పైబడిన వారిలో ఈ  ప్రమాదం పెరుగుతోంది. గణాంకాలు ఎలా ఉన్నాయంటే.. మానసిక ఆరోగ్య సంరక్షణ కోసం ఆన్‌లైన్ సహాయ కేంద్రముంది. ఇదే  TeleManas. ఇది వెల్లడించిన  గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. Tele Manas Cell  షేర్ చేసిన సమాచారం ప్రకారం, సహాయం కోసం కాల్ చేసేవారిలో 80 శాతం కంటే ఎక్కువ మంది 18-45 ఏళ్ల మధ్య వయస్కులే, అంటే ఈ వయస్సులో ఆరోగ్య సమస్యలు ఎక్కువగా నమోదవుతున్నాయి. టెలి మనస్ అనేది నిపుణుల నుండి మానసిక ఆరోగ్య సంబంధిత సహాయాన్ని పొందడానికి దేశంలోని ఏ మూల నుండి అయినా కాల్ చేయగల టోల్-ఫ్రీ హెల్ప్‌లైన్. దీని కోసం 14416 లేదా 18008914416 నంబర్లకు కూడా కాల్ చేయవచ్చు. యువతలో సమస్యలు.. టెలి మనస్  పంచుకున్న డేటా ప్రకారం, యువత జనాభాలో మానసిక ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. 12 ఏళ్లలోపు పిల్లల్లో మేధో వైకల్యం, దృష్టి లోపం సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. పరీక్ష సంబంధిత ఒత్తిడి, కోపం సమస్యలు, ప్రవర్తన లోపాలు  డిప్రెషన్ కేసులు 13-18 సంవత్సరాల వయస్సులో కనిపిస్తున్నాయి. అదే సమయంలో, 18-45 సంవత్సరాల వయస్సు గల వారిలో డిప్రెషన్, ఆందోళన,  కుటుంబ సమస్యల కారణంగా మానసిక ఆరోగ్యం దెబ్బతినడం వంటి కారణాలు ఉంటాయి. వృద్ధులలో  సమస్యలు.. 46-60 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులలో మానసిక ఆరోగ్య రుగ్మతల కేసులు నమోదవుతున్నాయి.  కానీ ఈ కేసుల సంఖ్య తక్కువగానే ఉంది. ఈ వయస్సులో చాలా మంది డిమెన్షియాతో పాటు డిప్రెషన్,  కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారు. అదే సమయంలో 60 ఏళ్లు దాటిన వారిలో డిమెన్షియా, జ్ఞాపకశక్తి సంబంధిత సమస్యలు, కుటుంబ సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.  ఏ వయసు వారికి ఎలాంటి సమస్య వచ్చే అవకాశం ఉందో తెలుసుకుని వాటిని పరిష్కరించడం వల్ల మన కుటుంబంలోని వారే డిప్రెషన్ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు.                                                            *నిశ్శబ్ద.

దానిమ్మ తినడం వల్ల లాభాలే కాదు.. నష్టాలు కూడా ఉన్నాయ్

ఆపిల్ ఆరోగ్యానికి చాలా మంచిది. రోజుకొక యాపిల్ తింటే వైద్యుని దగ్గరకు వెళ్లాల్సిన అవసరమే ఉండదంటారు. అయితే, యాపిల్స్ కాకుండా ఆరోగ్యకరమైనవిగా పరిగణించబడే అనేక పండ్లు ఉన్నాయి. పండ్లలో అనేక రకాల పోషక మూలకాలు  ఉంటాయి.  విటమిన్లు మరియు ఖనిజాలు ఒకో పండులో ఒకో విధమైన పోషక విలువలు ఉంటాయి. మెరుగైన పోషక విలువలున్న పండ్ల జాబితాలో దానిమ్మను కూడా ఒకటి. దానిమ్మ తినడానికి రుచికరంగా ఉంటుంది. అంతేకాదు  ఇది బోలెడు  వ్యాధులకు ఔషదంగా కూడా పనిచేస్తుంది. శారీరక  బలహీనతల తొలగడానికి వైద్యులు దానిమ్మపండును తినమని సిఫార్సు చేస్తారు. దానిమ్మ విటమిన్ సి, బిలకు మంచి మూలం. మెగ్నీషియం, పొటాషియం, ఫాస్పరస్, సెలీనియం,  జింక్ ఇందులో పుష్కలంగా లభిస్తాయి. దానిమ్మ తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి, కానీ దానిమ్మ తినడం వల్ల కొన్ని నష్టాలు కూడా  ఉన్నాయి. ఈ లాభ నష్టాలేంటో తెలుసుకుంటే.. దానిమ్మ ఆరోగ్య  ప్రయోజనాలు..  దానిమ్మ శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంది. ఇతర పండ్ల రసాల కంటే దానిమ్మ రసంలో ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది  కణాలను దెబ్బతినకుండా కాపాడుతుంది, వాపును తగ్గిస్తుంది. దానిమ్మ రసం క్యాన్సర్‌తో బాధపడేవారికి మేలు చేస్తుంది. ప్రోస్టేట్ క్యాన్సర్ కణాలను నిరోధించడానికి దానిమ్మ రసం తీసుకోవాలి. ఇది క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. దానిమ్మ గింజలు అల్జీమర్స్ వ్యాధి  పెరుగుదలను నిరోధిస్తాయి. జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో సహాయపడతాయి. దానిమ్మ రసం పేగు మంటను తగ్గించడం ద్వారా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అయితే డయేరియా వ్యాధిగ్రస్తులు దానిమ్మ రసాన్ని తీసుకోవద్దని వైద్యులు  సూచించారు. కీళ్ల నొప్పులు, నొప్పి మరియు ఇతర రకాల ఆర్థరైటిస్ వాపులలో దానిమ్మ రసం ప్రయోజనకరంగా ఉంటుంది. దానిమ్మ రసం గుండె జబ్బులకు మేలు చేస్తుంది. గుండె,  ధమనులను వివిధ వ్యాధుల నుండి రక్షించడానికి దానిమ్మ రసం  ప్రయోజనకరంగా ఉంటుంది. దానిమ్మ రసం రక్తపోటు రోగులకు ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. మధుమేహం చికిత్సలో దానిమ్మ రసం త్రాగాలి. దానిమ్మ ఇన్సులిన్‌ను తగ్గించడంలో  రక్తంలో చక్కెరను నియంత్రించడంలో ఉపయోగపడుతుంది. దానిమ్మ తినడం వల్ల కలిగే నష్టాలు.. దానిమ్మ తొక్క, వేరు లేదా కాండం  అధిక వినియోగం మంచిది కాదు, ఎందుకంటే అందులో విషం ఉండవచ్చని పరిశోధకులు అంటున్నారు. తక్కువ రక్తపోటు ఉన్న రోగులు దానిమ్మ రసాన్ని తక్కువ పరిమాణంలో తీసుకోవాలి. ఎందుకంటే ఇది రక్తపోటును తగ్గించే గుణం కలిగి ఉంటుంది. విరేచనాలు అయినప్పుడు దానిమ్మ రసాన్ని తీసుకోకూడదు. చాలామంది చర్మసంరక్షణలో దానిమ్మరసం ఉపయోగిస్తుంటారు. అయితే  చర్మంపై దానిమ్మ రసాన్ని రాసుకుంటే కొందరికి  దురద, వాపు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండవచ్చు. కాబట్టి దానిమ్మరసం లేదా దానిమ్మ గింజలు తినడంలో జాగ్రత్తగా ఉండాలి.                                                 *నిశ్శబ్ద.