కారం బాగా తినే అలవాటు ఉన్నవారికి షాకింగ్ న్యూస్.. అసలు నిజాలు తెలుసా?
posted on Feb 14, 2025 @ 9:30AM
ఇటీవల స్పైసీ ఫుడ్ ట్రెండ్ అవుతోంది. దీనికి తగినట్టే హాట్ సాస్ మార్కెట్ ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతోంది. ఇక ఇంట్లో వండే వంటల్లో కూడా కారం ఎక్కువ కావాలని డిమాండ్ చేసేవారు చాలా మంది ఉన్నారు. మిరపకాయలు తినే పోటీల నుండి రెస్టారెంట్ మెనూలలోని వస్తువుల వరకు కారంగా ఉండే ఆహారం ప్రతిచోటా ఉంటుంది. చాలా మందికి స్పైసీ ఫుడ్ అంటే చాలా ఇష్టం. అందుకే ఆహారంలో మిరపకాయలు వేసి రుచిని పెంచుతారు. కారం బాగా తిన్న శరీరం ఇది.. బాగా గట్టిగా ఉంటుంది అనే డైలాగ్ కూడా వింటుంటాం. అయితే స్పైసీ ఫుడ్ తినడం వల్ల లాభాల సంగతి ఏంటో కానీ నష్టాలు మాత్రం ఉంటాయని అంటున్నారు ఆహార నిపుణులు. ఇంతకీ దీనివల్ల కలిగే నష్టాలు ఏంటో తెలుసుకుంటే..
కారంగా ఉండే ఆహారం తింటే ఏమవుతుంది?
ఆహారానికి కారం ఇవ్వడంలో చాలా రకాల పదార్థాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. వాటిలో మిరియాలు కూడా ఒకటి. మిరియాలలో క్యాప్సైసిన్ అనే రసాయన సమ్మేళనం ఉంటుంది. కారంగా ఉండే ఆహారాలు తిన్నప్పుడు ఈ క్యాప్సైసిన్ అనే సమ్మేళనం శరీరంలో వేడిని ఉత్పత్తి చేస్తుంది. ఈ క్యాప్సైసిన్ నోటిలో, నాలుక ఉపరితలంపై, జీర్ణవ్యవస్థ.. ఇలా అంతటా ఉండే నొప్పి గ్రాహకాలకు అంటుకుంటుంది.
కారం ఎక్కువ తింటే నష్టాలు..
గ్యాస్ట్రిక్ సమస్యలు..
ఎక్కువ కాలం పాటు కారంగా ఉండే ఆహారాన్ని ఎక్కువ పరిమాణంలో తీసుకోవడం వల్ల గుండెల్లో మంట లేదా ఇతర గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి.
గ్యాస్ట్రిటిస్ లేదా అల్సర్లను మరింత దారుణ స్థితికి తీసుకెళ్లే శక్తి కారానికి ఉంటుంది. ఇప్పటికే గ్యాస్టిటిస్, అల్సర్ వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్టైతే కారానికి దూరంగా ఉండటం మంచిది.
అతిసారం..
చాలా కారంగా ఉండే ఆహారాన్ని తిన్నప్పుడు మొదట్లో నోరు మండుతున్నట్లు అనిపిస్తుంది తరువాత నార్మల్ అయిపోతుంది. కానీ ఈ ఆహారం జీర్ణశయాంతర ప్రేగులోకి వెళ్లినప్పుడు, అది జీర్ణక్రియ రేటును పెంచుతుంది. ఇది విరేచనాలకు కారణమవుతుంది, అలాగే బాధాకరమైన ప్రేగు కదలికలకు కారణమవుతుంది.
తలనొప్పి..
కారం ఎక్కువగా తిన్న తర్వాత థండర్‌క్లాప్ తలనొప్పి రావచ్చు. ఇది బాధాకరమైన, అకస్మాత్తుగా వచ్చే తలనొప్పి రకం. చాలామంది కారం ఎక్కువగా తిన్నప్పుడు తలనొప్పి అని కంప్లైంట్ చేస్తే ఎగతాళి చేయడం లేదా నవ్వడం చేస్తారు. కానీ నిజంగానే కొందరికి తలనొప్పి వస్తుంది.
లాభాలు కూడా..
స్పైసీ ఫుడ్స్ తినడం వల్ల నష్టాలు ఉన్నా కారాన్ని ఒక పరిమిత మోతాదులో తినడం వల్ల కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
పరిమిత పరిమాణంలో కారం తినేవారికి కారం చాలా తక్కువ తినే వ్యక్తులతో పోలిస్తే ఆయుష్షు ఎక్కువ ఉంటుందట. అలాగని మరీ కారం ఎక్కువ తినకూడదు.
కారం తినడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుందట.
కారం లో ఉండే క్యాప్సైసిన్ ఆకలిని తగ్గిస్తుంది. జీవక్రియను పెంచుతుంది. ఇది ఎక్కువ కేలరీలను బర్న్ చేయడంలో సహాయపడుతుంది.
పరిమిత మొత్తంలో తీసుకునే క్యాప్సైసిన్ కడుపులో ఆమ్ల ఉత్పత్తిని నిరోధిస్తుందని, ఇది అల్సర్లను నివారించడంలో సహాయపడుతుందని చాలా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.
*రూపశ్రీ
గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...