Best Quit Smoking Tips Ever

పొగ మానాలనుకుని విఫలమవుతున్నారా?.. ఇది మీకోసమే..

నిజంగా ఒక వ్యక్తి పొగతాగడం మానేయడం సాధ్యమేనా?? ఒకవేళ సాధ్యమైతే అది ఎలా మానగలుగుతాడు? సహజంగా మొట్టమొదట చెయ్యవలసిన పని మానివెయ్యడమే. మొదటి రోజు గంటసేపు, మరునాడు రెండేసి గంటల సేపు, మూడో రోజున మూడేసి గంటల సేపు - ఇలా మానివెయ్యడమా? అసలు ఒకేసారి పూర్తిగా మానివెయ్యడమా? అనేది వ్యక్తిగత విషయం. దాన్ని ఎవరికి వారు నిర్ణయించుకోవచ్చు. ఏమైనా సరే, ఈ విషయంలో ఒక నిశ్చయం చేసుకోవడానికీ, దాన్ని తు.చ తప్పక అమలు చేయడానికి దృఢమయిన మనోనిబ్బరం అవసరం.  అందుకోసం కొన్ని చిట్కాలు: సాధ్యమైనంత వరకు పొగ తాగేవాళ్లకి దూరంగా ఉండాలి. ముఖ్యంగా మొదటి మూడు నాలుగు వారాలపాటు పొగతాగే వారితో, ఆ అలవాటు ఉన్న స్నేహితులతో కలవడకూడదు. వాళ్ళతో కలవకపోతే వాళ్ళు అపార్థం చేసుకుంటారని, ఏదో అనుకుంటారని ఆలోచన వద్దు. వాళ్ళు ఏమైనా అనుకున్నా.. మీరు పొగతాగడం మానేస్తే చాలామంది మీ దృఢ నిశ్చయానికి చాటున ఎంతో మెచ్చుకుంటారు. కాని, మరికొందరు ఏమి కాదు తాగు అంటూ బలవంతం చేస్తారు. కాబట్టి మీరు అనుకున్నది సాధించే వరకు స్నేహితులను కలవద్దు.  పొగాకు వాడకం ఏ రూపంలోనైనా సరే దగ్గరకు రానివ్వకూడదు. పొగాకు అంటే అదొక మత్తు. కేవలం ధూమపానమే కాదు, ఇతర పొగాకు ఆధారిత పదార్థాలను కూడా తీసుకోకూడదు. వీలైతే స్నేహితులను కూడా మీతో జతకలిపి వారు కూడా మానేందుకు ప్రోత్సహించండి.   ఎప్పటి నుండో అలవాటైన పొగ ఒక్కసారిగా మానితే.. మనసు అటే లాగుతుంది. అయితే పొగ తాగాలని అనిపించినప్పుడల్లా ఒకటి రెండు గ్లాసుల నీళ్లయినా లేదా పళ్లరసమైనా తాగాలి. కొంత కాలం ఇలా రోజూ చాలా సార్లు చెయ్యాల్సి వస్తుంది. కానీ తాగిన నీరు పొగ పీల్చాలనే తీవ్ర వాంఛను అరికట్టడానికి సాయపడుతుంది. పైగా, శరీరంలో కలిసిపోయిన నికొటిన్, ఇతర విష పదార్థాలను తొలగించడంలో ఇది తోడ్పడుతుంది. రోజూ రెండుసార్లు వేన్నీళ్ల స్నానం చేసి, ఆ వెంటనే చురుకు పుట్టించే లాగ చన్నీటి స్నానం చెయ్యాలి. ఇది శారీరకంగా ఎంతో మెరుగు చెయ్యడమే కాదు, రక్తప్రసరణ క్రమాన్ని చక్కబరిచి, అనుకున్న పని చేయడానికి సహకరిస్తుంది. మనోనిబ్బరాన్ని పెంచుతుంది.   రోజూ వ్యాయామం చెయ్యాలి. శ్వాస సంబంధ వ్యాయామాలు ఎంతో గొప్పగా సహాయపడతాయి. ప్రశాంతంగా, స్వచ్ఛమైన గాలి ఉన్న ప్రాంతాలకు అలా వాకింగ్ వెళ్లడం శ్వాసకోశాలను శుభ్రపరచి, ఆరోగ్యాన్ని పెంచుతుంది.  ఆహారం విషయంలో జాగ్రత్త.. వీలైనంత ఎక్కువగా తాజా కూరగాయలు, పండ్లు తీసుకోవాలి. పొగాకు వల్ల శరీరంలో చేరిన విషాలకు ఇవి చక్కని విరుగుడుగా పనిచేస్తాయి. నిజం చెప్పాలంటే కొన్ని వారాలపాటు ప్రత్యేకించి పండ్లు, కూరగాయలే తీసుకొని ఉన్నారంటే పొగ తాగాలనే కోరికే లేకుండా పోతుంది. రక్తంలో షుగర్లు నిలకడగా ఉండేందుకు సహాయపడుతుంది. తరచుగా కొంచెం కొంచెంగా తింటూ ఉండాలి. ఒత్తిడి సమయంలో నాడులను స్థిమిత పరచడానికి ఇది తోడుపడుతుంది. ఒత్తిడి ఉన్నప్పుడు తెలియకుండానే ఎక్కువ తినేస్తారు కాబట్టి జాగ్రత్త, ఇది ఊబకాయానికి దారి తీస్తుంది. ఇవన్నీ పాటిస్తే పొగతాగడం ఇంత సులువా అంటారు.. ◆నిశ్శబ్ద

fasting rules for varalakshmi vratham

వరలక్ష్మీవ్రతం రోజు ఉపవాసం ఉండేవారికి బలాన్ని ఇచ్చే ఆహారాలు

పండుగ సమయంలో సంప్రదాయ ఆచారాలు ఎంత ముఖ్యమో, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఉపవాసం కూడా అంతే ముఖ్యం. సంవత్సరానికి ఒకసారి వచ్చే వరమహాలక్ష్మి పండుగ ఆడపిల్లలకు ఇష్టమైన పండుగ. ఈ పండుగను చాలా సాంప్రదాయంగా జరుపుకుంటారు. పూజ సమయంలో చేయవలసిన పనులన్నీ చక్కగా నిర్వహిస్తారు. విగ్రహం అలంకరణ దగ్గర్నుంచి దేవుడి పూజ వరకు కూడా ప్రత్యేకంగా చేస్తారు. ఈ సందర్భంగా మహిళలు ఉపవాసం ఉండి భక్తిశ్రద్ధలతో పండుగను జరుపుకుంటారు. అయితే ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉన్నందున, పండుగ వేడుకలో ఉపవాసం ఉన్నప్పుడు కొన్ని పండ్లు, ఇతర ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను తీసుకోవచ్చు. అరటిపండు: పీచు, పిండి పదార్ధాలతో సమృద్ధిగా ఉండే అరటిపండ్లు ఉపవాసం ఉండేవారికి సహజమైన ఆహారం.  అరటిపండును తక్కువ మొత్తంలో తింటే కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది  శరీరానికి శక్తిని ఇస్తుంది. దీంతో పాటు శరీరానికి చేరాల్సిన క్యాలరీలను అదుపులో ఉంచుకోవాలి అంటే ఉపవాస సమయంలో అరటిపండ్లు తినవచ్చు. పండ్లు: మన ఆకలిని నియంత్రించడంలో పండ్లు ముఖ్యపాత్ర పోషిస్తాయి. వీటిలో ఫైబర్ కంటెంట్ కూడా ఉండటం వల్ల చాలా కాలం పాటు కడుపు నిండుగా ఉన్న అనుభూతిని ఇస్తుంది. వీటిలో అధిక మొత్తంలో పోషకాలు, ఖనిజాలు, నీరు ఉంటాయి. ఉదాహరణకు యాపిల్ పండు, పుచ్చకాయ పండు, నారింజ పండు వీటిలో ఉండే నీటి శాతం ఆరోగ్యానికి చాలా మంచిది. డ్రైఫ్రూట్స్: ఉపవాస సమయంలో బాదం, జీడిపప్పు, ఎండు ద్రాక్ష, వేరుశెనగ వంటివి తీసుకోవచ్చు. ఎందుకంటే అవి శక్తిని అందిస్తాయి. వీటిలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కావాలనుకుంటే చిటికెడు ఉప్పు వేసుకుని తినవచ్చు. కొబ్బరినీరు: కొబ్బరి నీళ్లలో భారీ మొత్తంలో పోషకాలు ఉంటాయి. ఇందులో మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం కూడా ఉంటాయి. మన శరీరానికి మంచి నీటి కంటెంట్ ఇవ్వడం ద్వారా శరీరంలోని ఎలక్ట్రోలైట్ల పరిమాణం బాగా నిర్వహించబడుతుంది. బెల్లం: బెల్లం చాలా ఆరోగ్యకరమైనది. మీరు త్రాగే చాలా పానీయాలకు సహజమైన తీపిని జోడిస్తుంది. ఇది మీ మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఉపవాస సమయంలో బెల్లం తినడం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. బెల్లం వివిధ రూపాల్లో తీసుకోవచ్చు. కాబట్టి పాన్‌లో బెల్లం వేసి వేడి చేసి అందులో చిక్‌పీస్, వాల్‌నట్స్ లేదా బాదంపప్పు వేసి చిరుతిండిగా చేసుకోవాలి.

foods that can help lower your cholesterol

ఈ ఆహారాలు తింటే కొలెస్ట్రాల్ ఐస్ లా కరిగిపోతుంది..!

శరీరాన్ని కబళించే కొన్ని సైలెంట్ కిల్లర్ వ్యాధులు ఉంటాయి.  అలాంటి వాటిలో మధుమేహం, అధిక కొలెస్ట్రాల్ చాలా ప్రధానమైనవి. ముఖ్యంగా అధిక కొలెస్ట్రాల్ కారణంగా అధిక బరువు,  మధుమేహం,  కాలేయం దెబ్బతినడం, గుండె జబ్బులు వంటి సమస్యలు ఒక దాని వెంట ఒకటి వస్తాయి. శరీరంలో ఉన్న అధిక కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి కొన్ని ఆహారాలు అద్భుతంగా పనిచేస్తాయి.  అవేంటంటే.. ఉసిరి.. పచ్చి ఉసిరికాయ తినడం, లేదా ఉసిరి రసం తాగడం,  ఉసిరికాయ పొడిని నీటిలో కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి.  ఇది శరీర కణజాలాలను రిపేర్ చేస్తుంది.  ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో గొప్పగా సహాయపడుతుంది. అవిసె గింజలు.. అవిసె గింజలలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. అవిసె గింజలు మంటను తగ్గిస్తాయి. వీటిని వేయించి తినవచ్చు,  పొడి తయారు చేసి పొడి రూపంలో తీసుకోవచ్చు.  స్నాక్స్, స్మూతీలలో జోడించవచ్చు. సలాడ్స్ లో కూడా చేర్చుకోవచ్చు. పసుపు.. పసుపును ఆహారంలో చేర్చుకోవడం ద్వారా కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించుకోవచ్చు. పసుపు రక్తనాళాలలో పేరుకుపోయిన ఫలకాన్ని తగ్గిస్తుంది.  వంటలలో దీన్ని భాగం చేసుకోవచ్చు. పసుపు పాలు కూడా తీసుకోవచ్చు. నీటిలో కలిపి తాగవచ్చు.  వైద్యుల సలహా మేరకు  పసుపు టాబ్లెట్లు కూడా వాడచ్చు. దనియాలు.. దనియాలను అనేక మాసాలా పొడుల తయారీలో వినియోగిస్తారు. ఇవి చాలా రకాల అనారోగ్యాలను తగ్గించడంలో సహాయపడతాయి. చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో కూడా మెరుగ్గా ఉంటాయి. దనియాలు ఆహారంలో తీసుకోవడం లేదా దనియాల టీ తయారుచేసుకుని తాగడం చేస్తుంటే కొలెస్ట్రాల్ తగ్గడమే కాదు.. శరీరం శుద్ది అవుతుంది. వెల్లుల్లి.. వెల్లుల్లి ఆహారానికి రుచిని, సువాసనను ఇవ్వడమే కాదు.. బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుస్తుంది. పచ్చి వెల్లుల్లి తింటే కొలెస్ట్రాల్ తగ్గడంలో సహాయపడుతుంది. రక్తపోటును కూడా తగ్గిస్తుంది. వెల్లుల్లిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో ప్రభావవంతంగా ఉంటాయి. ఇది గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగ్గా ఉంచుతుంది.                                         *రూపశ్రీ.  

Useful tips For Diabetes

మధుమేహం ఉన్నవారిలో హృదయసమస్యలా?? ఇవిగో అద్భుత చిట్కాలు..

ఆరోగ్యం అందరికీ అవసరమే అయితే ఆ ఆరోగ్యం అనేది కొందరి విషయం లో చాలా సమస్యాత్మకంగా మారుతోంది. ప్రస్తుతకాలంలో ఏదైనా ఒక సమస్య ఎదురైతే... దానికి అనుబంధంగా పెరుగుతూ పోతుంటాయి సమస్యలు. వాటి నుండి బయట పడటం అంత సులువైన విషయం ఏమీ కాదు. మరీ ముఖ్యంగా చిన్న పిల్లలలో, పెద్దవయసు వారిలో  ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుంది. ఈ కారణం వల్ల ఆరోగ్య సమస్యల ప్రభావం ఎక్కువగా ఉంటుంది.  ప్రస్తుతం అన్ని వయసుల వారికి చాలా తొందరదగా మధుమేహ సమస్య వస్తోంది. ఈ మధుమేహ సమస్య తగ్గడం కోసం ఎన్నో రకాల మందులు అందరికీ అందుబాటులోకి వచ్చినా  ఈ మందులు మెల్లిగా గుండె కండరాలను బలహీనం చేసి గుండె పోటు సమస్యకు దారి తీస్తున్నాయనే విషయం చాలా విచారించాల్సిన విషయం. మధుమేహ సమస్య ఉన్న వారిలో గుండె పోటు సమస్యను తగ్గించేందుకు రోజువారి ఉపయోగించుకోగలిగే ఆయుర్వేద ఔషదాలు ఉన్నాయి. వాటిలో అద్భుతమైన అయిదు మూలికల గురించి తెలుసుకుదాం.. పునర్ణవ:-  దీన్నే తెల్లగలిజేరు అని అంటారు. తెల్లగలిజేరు ఆకును గ్రామీణ ప్రాంతాలలో ఆకుకూర స్థానంలో వాడుతుంటారు. ఇది ఎంతో మంచి ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన మొక్క. దీన్ని ఆహారంలో  బాగంగా తీసుకోవడం వల్ల రక్తంలో చెక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను క్రమబద్దీకరిస్తుంది.  మూత్రం సరిగా రాకుండా ఉన్నప్పుడు  ఈ తెల్లగలిజేరు ఆకును వండుకుని తింటే మూత్రవిసర్జన  సాఫీగా జరుగుతుంది. మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కంటిచూపును మెరుగుపరుస్తుంది. మధుమేహం వల్ల వచ్చే రెటీనోపతి, నెప్రోపతి మొదలయిన సమస్యలను నివారించడంలో చక్కగా పనిచేస్తుంది. జీవక్రియను కూడా మెరుగుపరుస్తుంది.  పునర్ణవను ఎలా తీసుకోవచ్చు.. పునర్ణవను గ్రామీణ ప్రాంతాల అలవాటుననుసరించి పప్పుగానూ, పొడికూర కానీ చేసుకుని తినవచ్చు. లేదంటే పునర్ణవను ఎండబెట్టి పొడి చేసి రోజూ 2నుండి 2.5 గ్రాము పొడిని వేడినీటితో తీసుకోవాలి.  శొంఠి:- శొంఠి పొడి అనేది అందరికీ తెలిసిందే.. అల్లంను సున్నంలో ఉడికించి తరువాత ఎండబెట్టి పొడి చేస్తారు. దీన్ని మందుగా ఎప్పటినుండో వాడుతున్నారు. శొంఠి పొడి పాలు, శొంఠి, మిరియాల లేహ్యం వంటివి మాత్రమే కాకుండా శొంఠి పొడిని తేనె తోనూ ఇతర మూలికలతోనూ కాంబినేషన్ గా తీసుకుంటారు. ఇకపోతే శొంఠి గొప్ప ఇమ్యునిటీ బూస్టర్ గానే కాకుండా జీర్ణక్రియకు మంచి ఔషదంగా కూడా ఉపయోగపడుతుంది. దీనివల్ల శొంఠి అనేది మన భారతీయుల రోజువారి జీవితంలో భాగమయ్యింది.  శొంఠి ఎలా తీసుకోవచ్చు.. శొంఠి పొడి రూపంలో ప్రతిరోజూ ఆహారం తీసుకోవడానికి ముందు అరస్పూన్ మోతాదులో తీసుకోవటచ్చు. దీన్ని గోరువెచ్చని నీటితో తీసుకుంటే మంచి ఫలితాన్ని ఇస్తుంది. మిరియాలు:- ఎంతో సులభంగా లభించే మిరియాలు వంటలకు ఇచ్చే రుచి, ఘాటు అంతా ఇంతా కాదు. మరీ ముఖ్యంగా ఈ చలి, వర్షపు వాతావరణానికి మిరియాలు కాసింత ఎక్కువ వాడుకున్నా ఎంతో బాగుంటుంది. కేవలం అలా వంటల్లోకే కాకుండా సలాడ్ లు, సూప్ లు, చాట్స్ ఇలా అన్నిటిలోకి మిరియాల పొడిని జల్లుకోవడం వల్ల రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం సొంతమవుతుంది. అయితే మధుమేహం ఉన్నవారికి మిరియాలు ఒక వరం అని చెప్పుకోవచ్చు. మిరియాలు ఎలా తీసుకోవాలి అంటే…. ప్రతి రోజూ ఉదయాన్నే ఒక నల్ల మిరియం తీసుకోవాలి. దీన్ని నమిలి తినవచ్చు కారంగా అనిపించినా మంచి ప్రయోజనం చేకూరుస్తుంది. యాలకులు:- తీపి పదార్థాలు, బిర్యానీ వంటి వంటకాలలోకి ఎక్కువగా ఉపయోగించే యాలకులు మంచి సువాసనతో ఎంతో ఆహ్లాదంగా ఉంటాయి. వీటిని ఎక్కువగా తీపి పదార్థాలకు జతచేయడం మనకు అనుభవంలోనిదే. మధుమేహం ఉన్నవారిలో వారి సమస్యను బట్టి సహజంగానే తీపి పదార్థాల వైపు మనసు మల్లుతుంది. అలాంటి వారికి ఈ యాలకులు మంచి ఉపశమనాన్ని ఇస్తాయి. తీపి తినాలని అనిపించినప్పుడు యాలకులు తింటే తీపి తినాలనే కోరికలు సాధారణంగానే తగ్గుతాయి. యాలకులు తీసుకుంటే శరీరంలోని నరాలను ఉద్దీపన చెందించవచ్చు. మధుమేహం ఉన్నవారు యాలకులు తీసుకుంటే చాలా మంచి ఫలితం ఉంటుంది. యాలకులు ఎలా తీసుకోవచ్చంటే… దీన్ని సాధారణంగా టీలో జతచేసి తీసుకోవచ్చు. లేదంటే ప్రతి రోజు కనీసం ఒక యాలకుల పొడిని భోజనానికి గంట ముందు గోరువెచ్చని నీటితో తీసుకోవాలి.  అర్జున పత్రం:- అర్జున పత్రం అనగానే చాలామంది కన్ఫ్యూజ్ అవ్వచ్చు. అయితే ఈ అర్జున పత్రాన్ని తెల్లమద్ది అని కూడా అంటారు. ఈ చెట్టు ఆకులు, బెరడు మొదలైనవి ఆయుర్వేదంలో ఎంతో బాగా ఉపయోగిస్తారు. గుండె పనితీరు మెరుగుపరచడానికి, గుండె ఆరోగ్యానికి, రక్తపోటు, కొలెస్ట్రాల్ వంటి సమస్యలకు అర్జున పత్రం మంచి ఔషధంగా పనిచేస్తుంది.  అర్జున పత్రాన్ని ఎలా తీసుకోవాలంటే… దీన్ని ప్రతిరోజు రాత్రి సమయం నిద్రించే ముందు నీళ్లలో వేసి ఉడికించి టీ లాగా చేసుకుని తాగాలి. దీనివల్ల గుండె పనితీరు మెరుగుపడటమే కాకుండా మధుమేహం కూడా నియంత్రించవచ్చు. ◆నిశ్శబ్ద.

Do you know what food is best to eat in the morning

ఉదయాన్నే ఇవి తింటే ఎంతో మేలు తెలుసా?

ఉదయాన్నే తీసుకునే ఆహారం ఆరోజు ఉత్సాహంగా ప్రారంభం కావడంలో కీలకంగా పనిచేస్తుందని ఆహార నిపుణులు,  వైద్యులు చెబుతుంటారు. చాలామంది ఉదయాన్నే కాఫీ, టీ,  గ్రీన్ టీ వంటివి తాగుతుంటారు.  అయితే ఐరన్ లోపం ఉన్నవారు వీటిని తీసుకుంటే శరీరం ఐరన్ గ్రహించడంలో సమస్య ఏర్పడుతుంది.  ఈ కారణంగా ఐరన్ ఆధారిత ఆహారాలు తిన్నా అవి శరీరం గ్రహించలేదు.  అందుకే ఐరన్ లోపం ఉన్నవారు ఉదయాన్నే  కొన్ని ఆహారాలు తినడం మంచిదని ఆహార నిపుణులు చెబుతున్నారు.  అవేంటంటే.. డైటీషియన్ ప్రకారం  శరీరంలో ఐరన్ లోపం ఉంటే రోజూ ఉదయమే రెండు నానబెట్టిన ఖర్జూరాలను తినాలి.  ఖర్జూరంలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది.   శరీరానికి పుష్కలంగా ఐరన్ అందిస్తుంది.   గ్యాస్,  కడుపు ఉబ్బరం సమస్య నుండి బయటపడటానికి అర టీస్పూన్ సెలెరీని వేయించి నమలండి. సెలెరీలో క్రియాశీల ఎంజైమ్‌లు ఉంటాయి.  ఇవి కడుపులోని ఆమ్లాలను మెరుగుపరచడంలో అలాగే అజీర్ణం, ఉబ్బరం,  గ్యాస్ సమస్యలను తొలగించడంలో సహాయపడతాయి.   ఎప్పుడూ   జుట్టు రాలడం వల్ల ఇబ్బంది పడుతుంటే ఉదయాన్నే 2 స్పూన్ల బయోటిన్ మిక్స్ తీసుకోవచ్చు. బయోటిన్ మిక్స్‌లో జింక్, మెగ్నీషియం,  బయోటిన్ వంటి సూక్ష్మ పోషకాలు ఉంటాయి. మొటిమలు, మచ్చలు,  పిగ్మెంటేషన్‌తో బాధపడుతుంటే నానబెట్టిన సబ్జా గింజలను అర టీస్పూన్ తీసుకోవచ్చు. సబ్జా గింజలను ఒక గ్లాసు నీటిలో 10-15 నిమిషాలు నానబెట్టి, ఈ నీటిని త్రాగాలి. ఈ నీటిని రోజూ తాగడం వల్ల ముఖంపై ఉండే మొటిమలు, మచ్చలు పోతాయి.  హైపో థైరాయిడిజం సమస్య ఉంటే ఉదయాన్నే బ్రెజిల్ నట్స్ తినవచ్చు. బరువు తగ్గాలని ప్రయత్నించే వ్యక్తులు ఉదయాన్నే పాలతో టీ తాగకూడదు. బరువు తగ్గడానికి కింది విధంగా టీ తయారు చేసుకుని తాగాలి.  ఒక చెంచా బ్లాక్ టీ, సగం దాల్చిన చెక్క, సగం నిమ్మకాయ రసం, ఒక చెంచా ఆర్గానిక్ తేనె,  4-5 పుదీనా ఆకులు  తీసుకోవాలి. ముందుగా ఒక కప్పు నీళ్లు మరిగించి అందులో బ్లాక్ టీ, దాల్చిన చెక్క ముక్క వేయాలి. 5-6 నిమిషాలు ఉడికిన తర్వాత వడగట్టి కప్పులోకి తీసుకుని నిమ్మరసం, తేనె, పుదీనా ఆకులు వేసి గోరువెచ్చగా సిప్ చేస్తూ తాగాలి. ఈ టీలో జీరో కేలరీలు ఉంటాయి. దీని కారణంగా బరువు తగ్గడంలో ఇది చాలా ప్రభావవంతంగా ఉంటుంది. అంతేకాదు..  అపానవాయువు,  గ్యాస్ సమస్య నుండి కూడా ఉపశమనం కలిగిస్తుంది.                                  *రూపశ్రీ.

Calcium rich foods

ఈ ఆహారాలు తింటే చాలు.. కాల్షియం లోపం భర్తీ అవుతుంది..!

కాల్షియం శరీరానికి చాలా అవసరం.  శరీరంలో ఎముకలు, దంతాల ఆరోగ్యానికి,  పెద్దలలో గుండె ఆరోగ్యం,  కండరాల పనితీరు, నాడీ వ్యవస్థ పనితీరు మొదలైనవాటిలో ముఖ్యపాత్ర పోషిస్తుంది.  కాల్షియం లోపం వల్ల ముఖ్యంగా ఎముకలు బలహీనంగా మారతాయి. ప్రతిరోజూ వయసు బట్టి పెద్దలకు 1300గ్రాముల కాల్షియం అవసరం అవుతుందని  వైద్యులు ఆహార నిపుణులు చెబుతున్నారు. కాల్షియం లోపం ఎందుకు ఏర్పడుతుందో.. కాల్షియం మెండుగా ఉన్న ఆహారాలేంటో తెలుసుకుంటే.. కాల్షియం లోపం.. బులిమియా, అనోరెక్సియా, వంటి  ఇతర రుగ్మతలు, మెర్క్యురీ ఎక్స్పోజర్,  మెగ్నీషియం  అతిగా తీసుకోవడం,  దీర్ఘకాల భేదిమందుల ఉపయోగం. కీమోథెరపీ లేదా కార్టికోస్టెరాయిడ్స్ వంటి కొన్ని మందులను దీర్ఘకాలంగా  ఉపయోగించడం.  చెలేషన్ థెరపీ. పారాథైరాయిడ్ హార్మోన్ లోపం.  చాలా ప్రోటీన్ లేదా సోడియం తీసుకవడం.  కెఫిన్, సోడా లేదా ఆల్కహాల్ అధికంగా తీసుకోవడం ఉదరకుహర వ్యాధి, తాపజనక ప్రేగు వ్యాధి వంటి ఇతర జీర్ణ వ్యాధులు. కొన్ని శస్త్ర చికిత్సలు, మూత్రపిండ వైఫల్యం. విటమిన్ డి లోపం, ఫాస్ఫేట్ లోపం. కాల్షియం ఆహారాలు. విత్తనాలలో సూక్ష్మపోషకాలు అధికంగా ఉంటాయి.   గసగసాలు, నువ్వులు, సెలెరీ మరియు చియా గింజలతో సహా చాలా కాల్షియం అధికంగా ఉంటాయి. పెరుగు, పాలు,  ఫోర్టిఫైడ్ డైరీ ప్రత్యామ్నాయాలు. సోయా మిల్క్,  సార్డినెస్,  సాల్మన్ చేపలు. చీజ్, టోఫు,  గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, బ్రోకలీ, టర్నిప్‌లు, వాటర్‌క్రెస్,  కాలే వంటి బలవర్థకమైన అల్పాహారం తృణధాన్యాలు. బలవర్థకమైన పండ్ల రసాలు,  కాయలు,  గింజలు, ముఖ్యంగా బాదం, నువ్వులు,  చియా,  బీన్స్,  గ్రెయిన్స్,  మొక్కజొన్న  మొదలైనవాటిలో కాల్షియం బాగుంటుంది.                                     *రూపశ్రీ.

What does it mean if the hands get watery while sleeping

నిద్రపోతున్నప్పుడు చేతులలో జలధరింపు వస్తే దాని అర్థం ఏంటి?

  నిద్ర అనేది శరీరానికి విశ్రాంతి దశ.  నిద్రలో ఉన్నప్పుడు  శరీరంలో కొన్ని మార్పులు జరుగుతాయి.  అయితే కొందరు నిద్రపోతున్నప్పుడు శరీరంలో కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కుంటారు. కాళ్లు పట్టేయడం, శ్వాస ఆడటంలో ఇబ్బంది,  ఒళ్లు లాగడం.. ఇలా చాలా సమస్యలు ఉంటాయి.  అయితే కొందరికి నిద్రపోతున్నప్పుడు అకస్మాత్తుగా  చేతుల్లో  జలధరింపు వస్తుంటుంది.  ఇలా జరిగితే కొన్ని వ్యాధులు ఉన్నట్టు సంకేతం అని వైద్య నిపుణులు చెబుతున్నారు. మెదడులో రక్త ప్రసరణలో ఆటంకం ఏర్పడినప్పుడు రక్తం గడ్డకడుతుంది.  దీని కారణంగా స్ట్రోక్ ప్రమాదం పెరుగుతుంది.  ఈ సమస్య ఎదుర్కుంటున్న వ్యక్తులలో నిద్రపోతున్న సమయంలో చేతులలో జలధరింపు వస్తుంది. అంటే చేతులలో జలధరింపు ఉన్న వ్యక్తులలో స్ట్రోక్ ప్రమాదం ఉంటుంది. రాత్రి నిద్రపోతున్నప్పుడు చేతులు జలధరింపుకు గురవుతూ ఉంటే అది గుండెపోటుకు సంకేతం అని అంటున్నారు.  ఇది శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడటం,  మైకంగా ఉండటం వంటి సమస్యల వల్ల వస్తుంది. శరీరంలో విటమిన్-బి12 లోపం ఏర్పడినప్పుడు కూడా ఇలా నిద్రలో చేతులు జధరింపుకు గురవుతాయి.  కండరాల బలహీనత వల్ల ఇలా జరుగుతుంది. రెగ్యులర్ గా రాత్రి సమయంలో మందులు వేసుకునే వారిలో కూడా ఇలా జరిగే అవకాశం ఉంటుంది.  మందుల ప్రభావం వల్ల ఇలా జరుగుతుంది. అయితే ఇలా జరిగినప్పుడు వైద్యుడిని సంప్రదించడం మంచిది. రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగినా, మధుమేహం  పెరిగినా రాత్రి పూట నిద్రలో చేతులు జలధరింపుకు  లోనవుతాయట. శరీరం తగినంత పరిమాణంలో ఇన్సులిన్ ను ఉత్పత్తి చేయనప్పుడు ఇది జరుగుతుంది.                                                   *రూపశ్రీ.

heart attack symptoms

గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటే ఈ లక్షణాలు కనిపిస్తాయి..!

ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మరణాలకు కారణం అవుతున్న జబ్బులలో గుండె జబ్బులు మొదటి స్థానంలో ఉంటున్నాయి.  ఇప్పట్లో చిన్న, పెద్ద వయసు తేడా లేకుండా అందరికీ గుండె జబ్బులు వస్తున్నాయి. గుండె జబ్బుల కారణంగా ప్రాణాలు కోల్పోతున్నవారు చాలామంది ఉన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ప్రతి ఏటా 2కోట్ల మంది గుండెపోటుతో మరణిస్తున్నారు.  అయితే గుండెపోటు వచ్చే ముందు  కొన్ని లక్షణాలు కనిపిస్తాయి.  ఈ లక్షణాలేంటో తెలుసుకోవడం ద్వారా సమస్యను ముందే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఛాతీ బిగుతుగా ఉండటం.. శారీరక శ్రమ చేస్తున్నప్పుడు లేదా ఇతర కష్టమైన పనులు చేస్తున్నప్పుడు ఛాతీ బిగుతుగా మారితే అది గుండె పోటు రావడానికి సంకేతం అని అర్థం.  ఇలా అనిపించినప్పుడు బీపీ చెక్ చేసుకుని దాన్ని నియంత్రించడానికి ప్రయత్నించాలి.  అలాగే బరువు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.  అధిక బరువు, అదిక రక్తపోటు ఉన్నవారిలో గుండెపోటు సమస్యలు ఎక్కువ ఉంటాయి. హృదయ స్పందన.. గుండె సరిగ్గా పనిచేయడం లేదని చెప్పడానికి హృదయ స్పందన సరిగా లేకపోవడం కూడా ఒక కారణం అవుతుంది. హృదయ స్పందన సరిగా లేకపోవడం తో పాటూ ఛాతీ బిగుతుగా అనిపించడం, ఛాతీ భాగంలో నొప్పి వంటివి ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. లేకపోతే స్ట్రోక్ ప్రమాదం పెరుగుతుంది. అలసట.. ఎప్పుడూ అలసటగా అనిపించడం కూడా గుండె జబ్బులను సూచిస్తుంది. శరీరానికి అవసరమైనంత సేపు విశ్రాంతి తీసుకున్నా,  మంచి ఆహారం తింటున్నా, ఎక్కువ శారీరక శ్రమ చేయకపోయినా శరీరం అలసటగా ఉన్నట్టు అనిపిస్తుంటే  శరీరంలో ఆక్సిజన్ లోపించిందని అర్థం.   వాపు.. పాదాలు, చీలమండలలో వాపు వస్తుంటే అది గుండెకు రక్తం సరిగా పంప్ కాకపోవడం వల్ల జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు.  ఇలాంటి లక్షణాలు హార్ట్ ఫెయిల్ కావడానికి కారణం అవుతుందట. చెమటలు.. ఏదైనా పని చేస్తున్నప్పుడు విపరీతమైన చెమటలు పడుతూ ఉంటే అది గుండెపోటును సూచిస్తుంది.  ధమనులలో అడ్డంకి ఏర్పడటం వల్ల కూడా ఇలా చెమటలు పట్టడం జరుగుతుంది.                                        *రూపశ్రీ.

Shocking facts about morning alarm

మార్నింగ్ అలారం గురించి షాకింగ్ నిజాలు..!

  అలారం చాలామంది దినచర్యలో భాగం.  ఉదయాన్నే చదువుకునే వారి నుండి ఉద్యోగాలు చేసుకునే వారి వరకు ఉదయం పనులు పర్పెక్ట్ గా ఫినిష్ కావాలి అంటే అలారం పెట్టుకుంటూ ఉంటారు. చాలామంది ఉదయాన్నే నిద్ర లేవడం అనే అలవాటును అలారం ద్వారానే ఫాలో అవుతారు. స్మార్ట్ ఫోన్లు అందరికీ అందుబాటులో వచ్చాక కేవలం ఒకటి మాత్రమే కాకుండా ఏకంగా మూడు నుండి నాలుగు సార్లు అలారాన్ని నిమిషాల వ్యవధిలో సెట్ చేసేవారు కూడా ఉన్నారు. అయితే ఇలా మార్నింగ్ అలారం సెట్ చేసుకోవడం చాలా ప్రమాదం అని ఇది ఏకంగా గుండెకు గండి పెడుతుందని అంటున్నారు వైద్యులు. వైద్యులు చెబుతున్న విషయాల ఆధారంగా నిద్రలలో శరీరంలో అనేక రకాల మార్పులు చోటు చేసుకుంటాయి. శరీరం ఒక నిశ్చల స్థితిలో ఉన్నప్పుడు అలారం వల్ల కలిగే శబ్దం గుండెను చాలా డిస్బర్బ్ చేస్తుందట. నిద్రపోతున్నప్పుడు శరీరంలో రక్తం చిక్కగా ఉంటుంది.  అలారం గట్టిగా శబ్దం చేసినప్పుడు రక్తపోటు పెరుగుతుంది. దీని కారణంగా  గుండె కొట్టుకునే వేగం కూడా పెరుగుతుంది. ఇది  గుండెపోటు రావడానికి దారితీస్తుందట. మరొక ముఖ్య విషయం ఏంటంటే ఉదయాన్నే ఇలా అలారం పెట్టుకుని నిద్రలేస్తే మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుందట.  రోజంతా ఒత్తిడిలోనే సమయం గడుస్తుందట. అలారం ద్వారా నిద్ర లేవడం అనేది ఒక బలవంతపు అలవాటులాగా మారుతుంది. ఇది మానసికంగా డిస్టర్బ్ చేస్తుంది.   గాఢనిద్ర నుండి అకస్మాత్తుగా మేల్కొనడం వల్ల జ్ఞాపకశక్తి మీద, ఆలోచనా సామర్థ్యం మీద కూడా ప్రతికూల ప్రభావం పడుతుంది.  ఇది రోజూ రిపీట్ అవుతుంటే ఒత్తిడి కూడా పెరుగుతుందట. అలారం మీద ఆధారపడి నిద్రలేచే అలవాటు ఎక్కువగా ఉంటే అది నిద్రా చక్రం అయిన సిర్కాడియన్ రిథమ్ మీద ప్రభావం చూపిస్తుంది.  ఈ సిస్టమ్ చెదిరిపోవడం వల్ల అనేక మానసిక సమస్యలు వస్తాయి. పై సమస్యలను దృష్టిలో ఉంచుకుని నిద్ర లేవడానికి అలారం ఉపయోగించడాన్ని మానేయమని వైద్యులు చెబుతున్నారు. దీనికి బదులుగా సూర్యకాంతి వచ్చే ప్రదేశంలో నిద్రపోవడం,  రాత్రిళ్లు తొందరగా నిద్రపోవడం చేయాలి. దీని వల్ల ఉదయాన్నే మెలకువ వస్తుంది. ఒకవేళ అలా మెలకువ రాకపోతే ఎవరిని అయినా ఉదయాన్నే ఓ నిర్ణీత సమయానికి మేల్కొలిపేలా చేయాలి. మొదట కొన్ని రోజులు ఎవరో ఒకరు నిద్ర లేపుతుంటే కొన్ని రోజులలోనే అదే సమయానికి  మెలకువ వస్తుంది.                                       *రూపశ్రీ.

home remedies for viral fever

వైరల్ ఫీవర్ కోసం సింపుల్ హోం రెమెడీస్!

వర్షాకాలం వచ్చిందంటే చాలు  బ్యాక్టీరియా వైరస్‎లు విజృంభిస్తూ ఉంటాయి. వయసుతో సంబంధం లేకుండా అందరికీ ఇన్ఫెక్షన్ ద్వారా జలుబు, జ్వరం రావడం సాధారణం.   అయితే జలుబు జ్వరం వచ్చినప్పుడల్లా ఇంగ్లీష్ మాత్రలపైన, మందులపైన ఆధారపడటం ద్వారా మన ఇమ్యూనిటీ దెబ్బతింటుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయుర్వేదం ఒక చక్కటి పరిష్కారం అని నిపుణులు సూచిస్తున్నారు. వైరల్ ఫీవర్‌ వంటి జబ్బులకు వంట ఇంటి చిట్కాలను తెలుసుకుందాం. శరీరంలో రోగనిరోధక శక్తి కొద్దిగా తగ్గినా ఆరోగ్యం దెబ్బతిని జ్వరం, జలుబు, దగ్గు అన్నీ ఒక్కొక్కటిగా వేధించడం మొదలవుతాయి. వీటిని దూరం చేసుకోవడానికి కొన్ని సింపుల్ హోం రెమెడీస్ చూద్దాం... తేనె-అల్లం రసం: ఒక టేబుల్ స్పూన్ అల్లం రసంలో ఒక టేబుల్ స్పూన్ తేనె కలిపి తీసుకుంటే జ్వరం, జలుబు, దగ్గు సమస్య క్రమంగా తగ్గుతుంది. పసుపు నీరు: జ్వరం, దగ్గు, కఫం, జలుబు వంటి సమస్యలు ఉంటే ఉదయాన్నే పరగడుపున వేడినీళ్లలో కొద్దిగా పసుపు కలిపి తాగితే సమస్య పరిష్కారం అవుతుంది. తులసి టీ: తులసి ఆకుల్లో ఉండే యాంటీ వైరల్ గుణాలు దగ్గు, కఫం, జలుబు, జ్వరంతో పోరాడుతాయి. కాబట్టి జ్వరం వచ్చినప్పుడు తులసి టీ తాగడం అలవాటు చేసుకోండి. తులసి రసం: రెండు టీస్పూన్ల గోరువెచ్చని నీటిలో ఒక టేబుల్ స్పూన్ తులసి ఆకులను కలపడం అలవాటు చేసుకుంటే శరీర ఉష్ణోగ్రత క్రమంగా తగ్గి జ్వరం కూడా అదుపులోకి వస్తుంది. ధనియాల టీ: ధనియాల గింజల్లో యాంటీ బయోటిక్ గుణాలు ఉన్నాయి, ఇవి వైరల్ ఇన్ఫెక్షన్ల వల్ల వచ్చే జ్వరాన్ని తగ్గిస్తాయి. కాబట్టి కొత్తిమీర గింజల టీ తయారు చేసి తాగడం మంచిది. మెంతులు నానబెట్టిన నీరు: ఒక టేబుల్ స్పూన్ మెంతి గింజలను అరకప్పు నీటిలో నానబెట్టండి. దీన్ని వడకట్టి ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీటిని తాగితే జ్వరం సమస్య నెమ్మదిగా అదుపులోకి వస్తుంది.

Vitamin deficiency Symptoms

ఎప్పుడూ బలహీనంగా అనిపిస్తుందా? ఈ 3 విటమిన్ల లోపమే కారణమట..!

శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం, నిద్ర, అలవాట్లు బాగుండాలి.  అయితే ఇవన్నీ చక్కగా పాటిస్తున్నా సరే బలహీనత ఫీలవుతూ ఉంటారు. ఏ చిన్న పని చేసినా అలసట అనుభూతి చెందడం, ఒళ్లంతా నొప్పులుగా అనిపించడం,  ఏ పని చేయాలన్నా ఆసక్తి లేకపోవడం, బాగా నీరసంగా ఉందని కంప్లైంట్ చేయడం చేస్తుంటారు.  అయితే ఇది కేవలం మూడు రకాల విటమిన్లు లోపించడం వల్ల ఎదురయ్యే సమస్య అని ఆహార నిపుణులు చెబుతున్నారు.  అవేంటో తెలుసుకుంటే.. విటమిన్-డి.. విటమిన్-డి అనేది సూర్యరశ్మి శరీరానికి అందడం ద్వారా శరీరంలో తయారవుతుంది.  విటమిన్-డి లోపిస్తే రోజంతా బలహీనంగా, అలసటగా అనిపిస్తుంది. వర్షాకాలంలో విటమిన్-డి లోపం వచ్చే అవకాశాలు ఎక్కువ. అదే విధంగా ఎక్కువగా ఇంట్లోనే ఉండేవారు,  ఇల్లు దాటి బయటకు రానివారు, సూర్యరశ్మికి, బయటి వాతావరణానికి  దూరంగా ఉండేవారు విటమిన్-డి లోపానికి ఎక్కువగా గురి అవుతారు. ఈ విటమిన్-డి లోపాన్ని అధిగమించడానికి పుట్టగొడుగులు,  పండ్లు, ఆకుపచ్చ కూరగాయలు, పాలు, గుడ్లు, చేపలు తీసుకోవాలి. విటమిన్-బి12.. విటమిన్-బి12 శరీరంలో నాడీ వ్యవస్థకు చాలా ముఖ్యమైనది.  ఇది లోపిస్తే నరాల సమస్యలు వస్తాయి. ఇది లోపిస్తే శరీరం ఎప్పుడూ అలసట అనుభూతి చెందుతూ ఉంటుంది. విటమిన్-బి12 లోపాన్ని అధిగమించడానికి  గుడ్లు, చేపలు, మాంసం, పాలు, గింజలు మొదలైనవి తీసుకోవాలి. విటమిన్-సి.. విటమిన్-సి లోపిస్తే ఎప్పుడూ నిద్ర మత్తుగా అనిపిస్తుంది.  అంతేకాదు ఎక్కువగా నిద్రపోతారు.  కండరాలలో నొప్పి, అలసట ఎక్కువగా ఉంటుంది. విటమిన్-సి ఆధారిత పండ్లు, కూరగాయలు బాగా తీసుకోవాలి. ముఖ్యంగా జామ, నారింజ, బ్రోకలీ బాగా తినాలి.                                                     *రూపశ్రీ.

pomegranate benefits and side effects

దానిమ్మ తినడం వల్ల లాభాలే కాదు.. నష్టాలు కూడా ఉన్నాయ్

ఆపిల్ ఆరోగ్యానికి చాలా మంచిది. రోజుకొక యాపిల్ తింటే వైద్యుని దగ్గరకు వెళ్లాల్సిన అవసరమే ఉండదంటారు. అయితే, యాపిల్స్ కాకుండా ఆరోగ్యకరమైనవిగా పరిగణించబడే అనేక పండ్లు ఉన్నాయి. పండ్లలో అనేక రకాల పోషక మూలకాలు  ఉంటాయి.  విటమిన్లు మరియు ఖనిజాలు ఒకో పండులో ఒకో విధమైన పోషక విలువలు ఉంటాయి. మెరుగైన పోషక విలువలున్న పండ్ల జాబితాలో దానిమ్మను కూడా ఒకటి. దానిమ్మ తినడానికి రుచికరంగా ఉంటుంది. అంతేకాదు  ఇది బోలెడు  వ్యాధులకు ఔషదంగా కూడా పనిచేస్తుంది. శారీరక  బలహీనతల తొలగడానికి వైద్యులు దానిమ్మపండును తినమని సిఫార్సు చేస్తారు. దానిమ్మ విటమిన్ సి, బిలకు మంచి మూలం. మెగ్నీషియం, పొటాషియం, ఫాస్పరస్, సెలీనియం,  జింక్ ఇందులో పుష్కలంగా లభిస్తాయి. దానిమ్మ తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి, కానీ దానిమ్మ తినడం వల్ల కొన్ని నష్టాలు కూడా  ఉన్నాయి. ఈ లాభ నష్టాలేంటో తెలుసుకుంటే.. దానిమ్మ ఆరోగ్య  ప్రయోజనాలు..  దానిమ్మ శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంది. ఇతర పండ్ల రసాల కంటే దానిమ్మ రసంలో ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది  కణాలను దెబ్బతినకుండా కాపాడుతుంది, వాపును తగ్గిస్తుంది. దానిమ్మ రసం క్యాన్సర్‌తో బాధపడేవారికి మేలు చేస్తుంది. ప్రోస్టేట్ క్యాన్సర్ కణాలను నిరోధించడానికి దానిమ్మ రసం తీసుకోవాలి. ఇది క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. దానిమ్మ గింజలు అల్జీమర్స్ వ్యాధి  పెరుగుదలను నిరోధిస్తాయి. జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో సహాయపడతాయి. దానిమ్మ రసం పేగు మంటను తగ్గించడం ద్వారా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అయితే డయేరియా వ్యాధిగ్రస్తులు దానిమ్మ రసాన్ని తీసుకోవద్దని వైద్యులు  సూచించారు. కీళ్ల నొప్పులు, నొప్పి మరియు ఇతర రకాల ఆర్థరైటిస్ వాపులలో దానిమ్మ రసం ప్రయోజనకరంగా ఉంటుంది. దానిమ్మ రసం గుండె జబ్బులకు మేలు చేస్తుంది. గుండె,  ధమనులను వివిధ వ్యాధుల నుండి రక్షించడానికి దానిమ్మ రసం  ప్రయోజనకరంగా ఉంటుంది. దానిమ్మ రసం రక్తపోటు రోగులకు ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. మధుమేహం చికిత్సలో దానిమ్మ రసం త్రాగాలి. దానిమ్మ ఇన్సులిన్‌ను తగ్గించడంలో  రక్తంలో చక్కెరను నియంత్రించడంలో ఉపయోగపడుతుంది. దానిమ్మ తినడం వల్ల కలిగే నష్టాలు.. దానిమ్మ తొక్క, వేరు లేదా కాండం  అధిక వినియోగం మంచిది కాదు, ఎందుకంటే అందులో విషం ఉండవచ్చని పరిశోధకులు అంటున్నారు. తక్కువ రక్తపోటు ఉన్న రోగులు దానిమ్మ రసాన్ని తక్కువ పరిమాణంలో తీసుకోవాలి. ఎందుకంటే ఇది రక్తపోటును తగ్గించే గుణం కలిగి ఉంటుంది. విరేచనాలు అయినప్పుడు దానిమ్మ రసాన్ని తీసుకోకూడదు. చాలామంది చర్మసంరక్షణలో దానిమ్మరసం ఉపయోగిస్తుంటారు. అయితే  చర్మంపై దానిమ్మ రసాన్ని రాసుకుంటే కొందరికి  దురద, వాపు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండవచ్చు. కాబట్టి దానిమ్మరసం లేదా దానిమ్మ గింజలు తినడంలో జాగ్రత్తగా ఉండాలి.                                                 *నిశ్శబ్ద.

Benefits Of Methi Leaves

మెంతి కూర మంచిదే !

మెంతి కూర ఇదేంటి అని మాత్రం అనకండి. ఎందుకంటే మెంతి ఆకు తో చాలానే లాభాలు ఉన్నాయని తెలుస్తోంది .బ్లడ్ షుగర్ నియంత్రణ,బరువు ఊబకాయం తగ్గడం లో మెంతి ఆకు చాలా బాగా పనిచేస్తుంది మెంతి ఆకు వల్ల లాభాలు ఏమిటో చూద్దాం. చలికాలం లో పచ్చటి ఆకు కూరలు బగాలభిస్తాయి. పచ్చటి మెంతి కూర ఆకులు ఈ వాతావరణం లో లభిస్తాయి. ఈ ఆకుతో కూరవండుతారు. మెంతికూర పెసర పప్పు,మెంతికూర టమాట కాస్త చెడు గా తగిలినా నోటికి రుచిగా ఉంటుంది. మెంతికూర పప్పు అదుర్స్,మెంతికూర పరాటా ఇంకా అదుర్స్ఆరోగ్యానికి మంచిది. ఒక వేళా మీకు మార్కెట్లో మెంతికూర లేదా మెంతి ఆకు లభిస్తే తీసుకోండి మెంతి ఆకు వల్ల లాభాలు ఏమిటో తెలుసుకుందామా మరి. బరువు... మెంతి ఆకులో పీచు పదార్ధం అధిక మొత్తంలో ఉంటుంది. మెంతి ఆకు తినడం వల్ల మీకు ఆకలి వేయదు. మీపోట్ట నిండుగా ఉంటుంది.మెంతులు కూడా బరువు తగ్గించేందుకు దోహదం చేస్తాయి. మీరు బరువుతగ్గాలంటే మీరోజువారీ ఆహారం లేదా డైట్ ప్లాన్ లో కూరగా వాడండి.లేదా పులుసుగా వాడవచ్చు. బ్లడ్ షుగర్... మీ బ్లడ్ షుగర్ వస్తే మీకు మెంతి ఆకును తీసుకోవచ్చు. ఇందులో డయాబెటిస్ ను నియంత్రించే గుణాలు ఉన్నట్లు గుర్తించారు. మీ ఆరోగ్యానికి అత్యంత లాభాదాయకం కాగలదని నిపుణులు వివరించారు. పంచేంద్రియాలు... శరీరంలో ఉండే పంచేంద్రియాలలో వచ్చే సమస్యను దూరం చేయడం లో సహాయ పడుతుంది. అది గుండెకు సంబందించిన సమస్యలతో బాధపడే వారికి మెంతి ఆకు కూర తీసుకోవచ్చు. కొలస్ట్రాల్... శరీరంలో బ్లడ్ కొలస్ట్రాల్ ను పెరగడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయి. ఈ సమయం లో మీరు మెంతికూర తీసుకుంటే కొలస్త్రాల్ ను తగ్గించడం లో మీకు సహాయ పడుతుంది. నోటి దుర్వాసన... మీనోటి నుండి దుర్వాసన వస్తుంటే మెంతి ఆకును తినడం ద్వారా మెంతి ఆకు టీ తాగవచ్చు అలా చేయడం ద్వారా నోటి దుర్వాసన నుండి విముక్తి కల్పించడం లో సహాయ పడుతుంది మెంతి ఆకుకు సంబంధించి వచ్చే సమస్య నుండి దూరం చేసేది మెంతి ఆకు మాత్రమే అని నిపుణులు అంటున్నారు.

vitamin B12 symptoms

మీకు ఈ లక్షణాలు కనిపిస్తే విటమిన్-బి12 లోపం ఉన్నట్టే..!

  శరీరానికి విటమిన్లు చాలా  అవసరం. వీటిలో ఏ ఒక్కటి తగ్గినా శరీర పనితీరు దెబ్బతింటుంది.  శరీరానికి చాలా ముఖ్యమైన విటమిన్లలో విటమిన్-బి12 ఒకటి. . ఇది  చాలా వరకు మాంసాహారంలో లభించడం మూలాన  శాకాహారం తీసుకునేవారిలో విటమిన్-బి12 లోపం ఎక్కువగా ఉంటుంది.  శరీరంలో కనిపించే కొన్ని లక్షణాల ఆధారంగా విటమిన్-బి12 లోపాన్ని గుర్తించవచ్చు. శరీరంలో విటమిన్-బి12 పాత్ర ఏంటో.. విటమిన్-బి12 లోపిస్తే కనిపించే లక్షణాలు ఏంటో తెలుసుకుంటే.. విటమిన్-బి12 పాత్ర.. శరీరానికి అత్యంత అవసరమైన విటమిన్లలో విటమిన్-బి12 ప్రధానమైనది. విటమిన్-బి12 శరీరంలో నాడీ వ్యవస్థ సక్రమంగా పనిచేయడంలో దోహదం చేస్తుంది. శరీరంలో కొవ్వును శక్తిగా మార్చడంలో సహాయపడుతుంది. శరీర నరాలకు ప్రోటీన్ ను సరఫరా చేస్తుంది. అంతేకాదు.. శరీరంలో డియన్ఏ,  ఎర్రరక్తకణాలు ఏర్పడటంలో కూడా విటమిన్-బి12 కీలక పాత్ర పోషిస్తుంది.  విటమిన్-బి12 లోపిస్తే శరీరంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. విటమిన్-బి12 లోపం.. లక్షణాలు.. విటమిన్-బి12 లోపం ఉన్న వ్యక్తులలో ఎప్పుడూ అలసట,  బలహీనత ఉంటాయి.  ఎంత తిన్నా, ఎలాంటి ఆహారం తీసుకున్నా విటమిన్-బి12 భర్తీ కాకపోతే బలహీనత, అలసట మనిషిని ఆవరించి ఉంటాయి.  బలవర్థకరమైన ఆహారం తీసుకుంటున్నా కూడా బలహీనత అనుభూతి చెందేవారు వైద్యుడిని కలవడం మంచిది. రక్తహీనత.. విటమిన్-బి12 ఎర్ర రక్తకణాలు ఏర్పడటంలో కీలక పాత్ర పోషిస్తుంది.  విటమిన్-బి12 లోపిస్తే ఎర్ర రక్తకణాల సంఖ్య తక్కువగా ఉంటుంది. కొత్త కణాలు ఉత్పత్తి కావడంలో ఆటంకాలు ఏర్పడతాయి.   ఇది రక్త హీనతకు దారితీస్తుంది.  అప్పటికే రక్తహీనత సమస్య ఉన్నవారు విటమిన్-బి12 లోపం రాకుండా చూసుకోవాలి.  సకాలంలో వైద్యుడిని కలసి చికిత్స తీసుకోవాలి. గుండె వేగం.. సాధారణంగా కష్టమైన పనులు చేసినప్పుడు గుండె కాసింత వేగంతో కొట్టుకోవడం సహజమే.. కానీ విటమిన్-బి12 లోపం ఉన్నవారిలో మాత్రం ఏ చిన్న పని చేసినా గుండె కొట్టుకునే వేగం ఎక్కువగా ఉంటుంది. చాలా కష్టమైన పనులు చేసిన వారికంటే ఎక్కువగా అలసిపోయి గుండె వేగాన్ని అనుభూతి చెందుతారు.  గుండె దడ కూడా ఎక్కువగా ఉంటుంది. శ్వాస.. శరీరంలో వివిధ అవయవాలకు ఆక్సిజన్ ను సరఫరా చేసేది రక్తమే.  విటమిన్-బి12 లోపం కారణంగా శరీరంలో ఎర్ర రక్తకణాలు తక్కువైనప్పుడు, ఆక్సిజన్ సరఫరా కూడా మందగిస్తుంది.  ఇది శ్వాస సరిగా తీసుకోవడంలో ఇబ్బందులు కలిగిస్తుంది. ముఖ్యంగా కింద పడుకున్నప్పుడు,  ఉక్కపోత వాతావరణంలో ఉన్నప్పుడు, పని  చేస్తున్నప్పుడు శ్వాస తీసుకోవడంలో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కుంటారు.                                             *రూపశ్రీ.

health benefits of egg white

ఎగ్ వైట్ మాత్రమే తినే అలవాటుందా? ఈ నిజాలు తెలుసుకోవాల్సిందే..!

పోషకాహారంలో గుడ్లకున్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు.  పిల్లలకు ఓ నిర్ణీత వయసు వచ్చినప్పటి నుండి గుడ్డును ఆహారంలో ఇవ్వడం చాలామంచిదని ఆహార నిపుణులు చెబుతారు. ఇక వయసులో ఉన్నవారికి, గర్భవతులకు, మధ్యవయసు వారికి, వృద్దులకు ఇలా.. అన్ని వయసుల వారికి శరీరానికి తగినంత పోషకాలు భర్తీ చేయడంలో గుడ్లు ఎప్పుడూ ముందుంటాయి. అయితే డైటింగ్ చేసేవారు, రెగ్యులర్ గా గుడ్డు తినేవారిలో చాలామంది కేవలం ఎగ్ వైట్స్ మాత్రమే తిని పచ్చసొన వదిలేస్తుంటారు. పచ్చసొనలో కొవ్వులు ఎక్కువ ఉంటాయని, అది ఆరోగ్యానికి మంచిది కాదనే అపోహ కూడా ఉంది. కానీ  గుడ్డులో పచ్చసొన పడేసేవారు తప్పనిసరిగా ఈ కింది విషయాలు తెలుసుకోవాలి. విటమిన్ ఎ.. గుడ్డు పచ్చసొనలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది కంటిచూపుకు,  రోగనిరోధక పనితీరుకు,  చర్మ ఆరోగ్యానికి అవసరమైన పోషకం. శరీర సహజ రక్షణ వ్యవస్థకు మద్దతు ఇవ్వడంలో విటమిన్ ఎ కీలక పాత్ర పోషిస్తుంది. ఆరోగ్యకరమైన చర్మ కణజాలాల నిర్వహణలో సహాయపడుతుంది.  తక్కువ కాంతి ఉన్న వాతావరణ పరిస్థితులలో కూడా కంటిచూపు మెరుగ్గా ఉండేలా చేస్తుంది. విటమిన్ డి.. గుడ్డు పచ్చసొనలో కనిపించే మరో ముఖ్యమైన విటమిన్ విటమిన్ డి. దీనిని తరచుగా "సన్‌షైన్ విటమిన్" అని పిలుస్తారు. బలమైన ఎముకలు, ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థ,  సాధారణ ఆరోగ్యం  కోసం విటమిన్ డి అవసరం. కాల్షియం శోషణ,  ఎముక ఖనిజీకరణకు విటమిన్ డి తగినంత స్థాయిలో అవసరం. ఇది బలమైన,  ఆరోగ్యకరమైన ఎముకలను నిర్వహించడానికి కీలకమైనది. విటమిన్ ఇ.. గుడ్డు సొనలో విటమిన్ ఇ  పుష్కలంగా ఉంటుంది. ఇది ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి కణాలను రక్షించడంలో సహాయపడే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్. రోగనిరోధక పనితీరు, చర్మ ఆరోగ్యం,  మొత్తం సెల్యులార్ ఆరోగ్యానికి సపోర్ట్  ఇవ్వడంలో విటమిన్ E కీలక పాత్ర పోషిస్తుంది.   విటమిన్ B12.. విటమిన్ B12 శక్తి ఉత్పత్తికి, నరాల పనితీరుకు,  ఎర్ర రక్త కణాల ఏర్పాటుకు కీలకం. విటమిన్ B12 లభించే  కొన్ని ఆహార వనరులలో గుడ్డు పచ్చసొన  ఒకటి.ప్రత్యేకించి శాఖాహారం లేదా శాకాహారి ఆహారాలను అనుసరించే వారికి మొక్కల ఆధారిత మూలాల నుండి తగినంత B12 పొందడానికి కష్టంగా ఉంటుంది. విటమిన్ K.. గుడ్డు సొనలో విటమిన్ కె ఉంటుంది. ఇది రక్తం గడ్డకట్టడానికి, ఎముకల ఆరోగ్యానికి,  గుండె ఆరోగ్యానికి అవసరం. రక్తం సరిగ్గా గడ్డకట్టేలా చేయడంలో విటమిన్ K కీలక పాత్ర పోషిస్తుంది. గాయం అయినప్పుడు అధిక రక్తస్రావం జరగకుండా చేస్తుంది. అదనంగా, విటమిన్ K ఎముక జీవక్రియలో పాల్గొంటుంది. బలమైన,  ఆరోగ్యకరమైన ఎముకలను నిర్వహించడానికి సహాయపడుతుంది. విటమిన్ B2.. రిబోఫ్లావిన్ లేదా విటమిన్ B2, శక్తి ఉత్పత్తి, జీవక్రియ,  ఆరోగ్యకరమైన చర్మం,  కళ్ళ నిర్వహణలో కీలకంగా ఉంటుంది.  గుడ్డు సొనలో రిబోఫ్లావిన్ పుష్కలంగా ఉంటుంది. విటమిన్ B9.. ఫోలేట్ నే విటమిన్ B9 అని కూడా పిలుస్తారు. DNA సంశ్లేషణ, కణ విభజన,  ఎర్ర రక్త కణాల ఏర్పాటుకు అవసరం. పిండం అభివృద్ధికి,  న్యూరల్ ట్యూబ్ లోపాలను నివారించడానికి గర్భధారణ సమయంలో తగినంత ఫోలేట్ తీసుకోవడం చాలా ముఖ్యం.                                   *నిశ్శబ్ద.

మీ ఫిట్నెస్ బాగుండాలా?? అయితే ఈ తప్పు చేయొద్దు!

క్రీడాకారులు అంత ఆక్టివ్ గా, ఫిట్ గా ఉండటానికి ముఖ్యమైన కారణం ఏమిటో తెలుసా?? చాలామంది వారి ఆహారం అని, వారు చేసే వ్యాయామమని అంటారు. కానీ ఇది శుద్ధ తప్పు. అవన్నీ ఎంత పక్కాగా పాటించినా నిద్ర అనేది సరిగ్గా లేనప్పుడు ఎవరూ ఫిట్ గా ఉండలేరు. దీన్ని బట్టి చూస్తే నిద్ర ప్రతి ఒక్కరి జీవితంలో ఎంత గొప్ప పాత్ర పోషిస్తుందో అర్థమవుతుంది. నిద్ర ఒక గొప్ప ఔషధం అని ఊరికే అనలేదు. ప్రపంచంలో ఉన్న చాలా గొప్ప క్రీడాకారులు తమ ఒత్తిడిని చక్కగా అధిగమిస్తున్నారన్నా, రోజును బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నారన్నా దానికి వారి నిద్రా విధానాలే మూల కారణం. మానవ జీవక్రియకు, కణజాలాల పెరుగుదలకు శరీరంలో కండరాల మరమ్మత్తులో నిద్ర కీలక పాత్ర పోషిస్తుంది. అంతే కాకుండా జ్ఞాపకశక్తి బాగుండాలన్నా, చక్కగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలన్న చక్కని నిద్ర ద్వారానే సాధ్యమవుతుంది. సరిగ్గా గమనిస్తే నిద్ర చక్కగా ఉన్నవారు, నిద్రలేమి సమస్య, నిద్రకు సరైన సమయం కేటాయించని వారిని కంపెర్ చేస్తే తేడాలు స్పష్టంగా కనిపిస్తాయి. అందుకే మనిషి ఫిట్నెస్ లో నిద్ర కీ పాయింట్ అని అంటున్నారు. ఏరోబిక్ ఫిట్నెస్ ఏరోబిక్ వ్యాయామాలు శరీరానికి చాలా చక్కని ఫలితాలను ఇస్తాయి. ఈ వ్యాయామాలలో భాగంగా శరీరాన్ని వేగంగా కదిలించడం వల్ల ఆక్సిజన్ సరఫరా మెరుగవుతుంది. శరీరం చాలా రిలాక్స్ అవుతుంది. కండరాల పెరుగుదల కోసం.. శరీర కంధర సామర్థ్యం చక్కగా ఉండాలంటే కండరాలను కష్టపెట్టడమే మార్గం కాదు. ఆ కండరాలు రిలాక్స్ అవ్వడానికి తగిన సమయాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. నిద్ర దానికి చక్కని మార్గం. కండర వ్యవస్థ నిద్రలో బలోపేతం అవుతుంది. అలాగే కండరాలకు తగినంత ప్రోటీన్లు కూడా అందితే కండరాలు దృఢంగా మారతాయి.  హార్మోన్ల గుట్టు టెస్టోస్టెరాన్, గ్రోత్ హార్మోన్ అనేవి అనాబాలిక్ హార్మోన్లుగా పిలవబడతాయి. ఈ రెండూ నిద్రలోనే విడుదల అవుతాయి. ఇవి శరీరంలో ఎన్నో రకాల కార్యకలాపాలలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. కాబట్టి నిద్ర చక్కగా ఉంటే ఈ హార్మోన్ల విడుదల సక్రమంగా జరిగి ఫిట్నెస్ బావుంటుంది. పైన చెప్పుకున్నవి మాత్రమే కాకుండా మంచి నిద్ర వల్ల మెదడుకు విశ్రాంతి బాగా లభిస్తుంది. శారీరక శ్రమ లేకుండా కేవలం మెదడు మీద భారం పడుతూ ఒత్తిడుల మధ్య ఉద్యోగాలు చేస్తున్న ఈ కాలంలో నిద్ర చక్కని ఔషధం. కాబట్టి నిద్ర చక్కగా ఉంటే ఫిట్నెస్ కి మొదటి అడుగు పర్ఫెక్ట్ గా పడినట్టే..                                    ◆నిశ్శబ్ద.

ఫిష్ సప్లిమెంట్లు వాడేవారికి అలర్ట్.. వీటితో ఎంత డేంజర్ తెలుసా?

చేపలు ఆరోగ్యకరమైన ఆహారంలో భాగం. ముఖ్యంగా ఫ్యాటీ ఫిష్ లో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి.  ఇవి గుండె నుండి మెదడు వరకు ప్రతి అవయవానికి ఆరోగ్యం చేకూరుస్తాయి.  కొందరు చేపలు తినని వ్యక్తులు ఫిష్ సప్లిమెంట్లు వాడుతూ ఉంటారు.  ఈ చేప నూనె టాబ్లెట్లు తీసుకోవడం వల్ల ఆరోగ్యకరమైన కొవ్వులు అంది ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని వీరి నమ్మకం.  అయితే ఈ మధ్యకాలంలో జరిగిన కొన్ని అధ్యయనాలు ఫిష్ సప్లిమెంట్లు తీసుకోవడం ప్రమాదంతో చలగాటం ఆడటమే అని చెబుతున్నాయి.  అసలు ఫిష్ సప్లిమెంట్లు ఎందుకు అనారోగ్యం? వీటితో కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి? తెలుసుకుంటే.. సాల్మన్, మాకేరెల్,  ట్రౌట్ వంటి కొవ్వు చేపల నుండి తీసుకోబడిన నూనెను కలిగి ఉన్న క్యాప్సూల్స్  శోథ నిరోధక లక్షణాలు కలిగి ఉంటాయి.  ఇవి  ముఖ్యంగా గుండె జబ్బులు (CVD), అధిక రక్తపోటు, లిపిడ్,  రుమటాయిడ్ ఆర్థరైటిస్‌తో బాధపడేవారికి చాలా మంచివి.  ఈ సమస్యలు ఉన్నవారు ఈ క్యాప్సూల్స్ తీసుకుంటూ ఉంటారు. అయితే ఫిష్ ఆయిల్ సప్లిమెంట్లను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఆరోగ్యకరమైన వ్యక్తులలో గుండె జబ్బులు,  స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉందని అధ్యయనాలలో వెల్లడైంది. ఫిష్ ఆయిల్ సప్లిమెంట్స్ క్రమ రహిత హృదయ స్పందన లేదా స్ట్రోక్ వంటి హృదయ సంబంధ సమస్యలను కలిగిస్తాయని పరిశోధకులు వెల్లడించారు. ఈ సప్లిమెంట్లను తీసుకుంటే  క్రమరహిత హృదయ స్పందన 13శాతం,  స్ట్రోక్ వచ్చే ప్రమాదం 5శాతం  పెరుగుతోందని చెప్పుకొచ్చారు. ఇప్పటికే గుండె జబ్బులు ఉన్నవారు వీటిని తీసుకుంటే  హార్ట్ ఫెయిల్ ప్రమాదం 15శాతం,  మరణించే ప్రమాదం 9శాతం తగ్గించవచ్చట.   అంటే ఇప్పటికే గుండె జబ్బులతో బాధపడేవారికి ఇవి మేలు చేస్తాయి. కానీ ఆరోగ్య స్పృహతో ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు వీటిని వాడితే మాత్రం ముప్పు  వాటిల్లుతుంది. ముఖ్యంగా ఫ్యాటీ యాసిడ్ అసమతుల్యత ఏర్పడుతుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది.                                                   *రూపశ్రీ.

వర్షాకాలంలో ఆకుకూరలు తినడం మంచిదేనా?

దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలలో వర్షాలు చాలా ఎక్కువగా పడుతున్నాయి.  కొన్ని ప్రాంతాలలో ఓ మోస్తరు వర్షం అయినా కురుస్తూనే ఉంటోంది.  వర్షాల కారణంగా చెరువులు,  నీరు నిల్వ ఉండే ప్రాంతాలలో కదలిక వస్తుంది. కొత్తనీరుతో పాటూ వివధ ప్రాంతాలలోని వ్యర్థాలు,  కలుషితాలు కూడా నీటితో కలుస్తాయి. వీటినే తాగునీరుగా,  వంటలకోసం ఉపయోగించడం వల్ల ఆహారం, నీరు అన్నీ కలుషితమవుతాయి.  ఒకవైపు ఇలా ఉంటే అధిక తేమ కారణంగా కొన్ని రకాల కూరగాయలు,  ఆకుకూరలు చాలా తొందరగా చెడిపోతాయి.  అలాంటి వాటిలో ఆకుకూరలు కూడా ఒకటి.  ఆకుకూరలను వర్షాకాలంలో తినవద్దని చెప్పడానికి ఇదే ప్రధాన కారణం. తాజాగా లేని ఆకుకూరలను తీసుకోవడం వల్ల కడుపు నొప్పి, డయేరియా, ఫుడ్ పాయిజనింద్ వంటి అనేక ప్రేగు సమస్యలు కూడా వస్తాయి. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వర్షాకాలంలో కూడా ఆకుకూరలను ఆస్వాదించవచ్చని వైద్యులు, ఆహార నిపుణులు చెబుతున్నారు.  ఇందుకోసం ఏం చేయాలంటే.. తాజా ఆకుకూరలు..  నచ్చిన ఆకు కూరలను  కొనుగోలు చేసిన తర్వాత  ఆకుకూరల మధ్యన తడిగా, కుళ్లినట్టు ఉండే ఆకులను వేరు చేయాలి.   ఆరోగ్యంగా, తాజాగా  కనిపించే ఆకులను వేరు చేయాలి. శుభ్రం..  ఆకుకూరల నుండి తాజాగా ఉన్న ఆకులను వేరు చేసిన తరువాత వాటిని శుభ్రం చేయాలి.  ఆకుకూరలు శుభ్రం చేయడానికి చాలామంది మార్కెట్లో లభ్యమయ్యే లిక్విడ్ లను ఉపయోగిస్తుంటారు.   అయితే ఈ  కృత్రిమ క్లీనర్‌లను ఉపయోగించకూడదు.  బదులుగా, ఆకు కూరలను కుళాయి కింద వేగంగా పడుతున్న నీటి ధారలో కడగాలి. ఆరబెట్టాలి.. ఆకుకూరలను కడిగిన తర్వాత అదనపు నీటిని వడకట్టి ఫ్యాన్ కింద ఆకులను ఆరబెట్టాలి. ఆకు కూరలలో తేమ పోయేలా చేయడానికి సలాడ్ స్పిన్నర్‌ను కూడా ఉపయోగించవచ్చు. లేదా కిచెన్ టవల్‌తో ఆరబెట్టవచ్చు. ఈ ఆకుకూరలను వెంటనే అయినా ఉపయోగించవచ్చు. లేదంటే నిల్వ కూడా చేయవచ్చు. జాగ్రత్త..  ఒక గిన్నె నీటిలో  కొంచెం ఉప్పు వేసి నీటిని మరిగించి మంటను ఆపివేయండి. ఇందులో ఆకుకూరలు,  పచ్చిమిర్చి వేసి 30 సెకన్ల పాటు ఉంచాలి. పేర్కొన్న సమయాన్ని మించకుండా చూసుకోవాలి. ఎందుకంటే వాటిని ఎక్కువసేపు వేడి నీటిలో ఉంచడం వల్ల వాటి రంగు,  ఆకుకూరల స్వభావం మారిపోతుంది.    ఐస్ బాత్.. వేడి నీటి నుండి ఆకు కూరలను తీసివేసిన వెంటనే  వాటిని మంచు నీటితో నిండిన గిన్నెలోకి మార్చాలి. ఒక నిమిషం అలాగే ఉంచి  తీసివేయాలి. ఇది ఆకుకూరలు తాజాగా ఉన్నప్పుడు ఎలా ఉంటాయో అలా ఉండేలా చేస్తుంది.                                         *రూపశ్రీ.

ఇది బ్లాక్ టీ కాదు, మధుమేహాన్ని తగ్గించే డార్క్ టీ..!!

నేటికాలంలో మారుతున్న జీవనశైలి, రోజువారీ ఆహారపు అలవాట్లు..ఇవన్నీ కూడా రకరకాల అనారోగ్య సమస్యలకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా మనలో చాలా మంది వయస్సుతో సంబంధం లేకుండా డయాబెటిస్ బారిన పడుతున్నారు. ఇది వ్యాధి కానప్పటికీ...ఒకసారి సోకిదంటే తగ్గదు. దాన్ని కంట్రోల్లో ఉంచుకోవడం అసలైన చికిత్స. ఏమాత్రం నిర్లక్ష్యం చేసిన ప్రాణాలమీదకే వస్తుంది. ముఖ్యంగా సిటీ లైఫ్‌లో ఈ వ్యాధి చాలా త్వరగా వస్తోందని.. ఒక చాప్టర్ రిపోర్టు ప్రకారం ప్రతి పదిమందికి పరీక్షలు చేస్తే కనీసం ఐదారుగురికి మధుమేహం నిర్దారణ అవుతుంది. నిపుణులు అభిప్రాయం ప్రకారం.. జీవనశైలిలో మార్పులు, సరైన ఆహారాన్ని తీసుకుంటే.. ఈ వ్యాధిని నయం చేయవచ్చు. మధుమేహాన్ని నియంత్రించడంతో డార్క్ ప్రయోజనాలేంటో చూద్దాం. డార్క్ టీ గురించి: డార్క్ టీ అనేది..ఇది సూక్ష్మజీవుల కిణ్వ ప్రక్రియ ప్రక్రియకు గురైనప్పుడు.. పూర్తిగా ఆక్సీకరణం చెందుతుంది. ఎందుకంటే ఇక్కడ టీ ఆకులు ఆక్సీకరణ ప్రక్రియకు గురై రంగు మారుతాయి.ఇది చైనాలో ఒక సాధారణ టీ. అక్కడి ప్రజలు దీన్ని నిత్యం తాగుతుంటారు. బ్లాక్ టీతో పోలిస్తే డార్క్ టీ భిన్నంగా ఉంటుంది. బ్లాక్ టీ అధిక ఆక్సీకరణ ప్రక్రియకు లోనవుతుంది. అదే గ్రీన్ టీలో ఆక్సీకరణ ప్రక్రియ జరగదు. డార్క్ టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు: టీ తాగని వారితో పోలిస్తే డార్క్ టీ తాగేవారిలో మధుమేహం వచ్చే అవకాశం 53% తక్కువగా ఉంటుందని.. టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశం 47% తక్కువగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి.ఈ సందర్భంలో వారి వయస్సు, లింగం, వారి శరీర నిర్మాణం,  వారు నివసించే ప్రాంతం పరిగణనలోకి తీసుకుంటారని పరిశోధకులు తెలిపారు. అయితే ఈ టీని తయారుచేసేటప్పుడు ఇందులో చక్కెరను ఉపయోగించకుంటే మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ అధ్యయనంలో సుమారు 2,000 మందిని ఉపయోగించారు. వారిలో 400 మందికి డయాబెటిస్ ఉంది. 350 మందికి మధుమేహం వచ్చే అవకాశం ఉంది.మిగిలిన వారిలో సాధారణ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ఉన్నాయి. వారిలో చాలా మంది టీ తాగలేదు. మరికొందరు ప్రతిరోజూ ఒకే రకమైన టీ తాగారు. పరిశోధకులు వారు ఎంత టీ తాగారు..వారి మూత్రంలో ఎంత గ్లూకోజ్ విసర్జించారో పరీక్షించడానికి వాటిని ఉపయోగించారు. రెండు కారణాల వల్ల డార్క్ టీ తీసుకోవడం వల్ల మధుమేహం తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. మొదటిది, ఇది శరీరంలో ఇన్సులిన్ నిరోధకతను పెంచడంతోపాటు..రక్తంలో చక్కెర స్థాయిలను బాగా నిర్వహించడంలో సహాయపడుతుంది. రెండవది, పెద్ద మొత్తంలో గ్లూకోజ్ మూత్రంలో విసర్జించబడుతుంది. దీని వల్ల శరీరంలో నియంత్రణలో ఉండాల్సిన గ్లూకోజ్ తగ్గిస్తుంది. అధికంగా ప్రాసెస్ చేయబడిన ఆహారాలు తినడం వల్ల మధుమేహం మరింత ఉధృతం అవుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ఎందుకంటే అధిక కొవ్వు పదార్ధాలు, చక్కెర, ఉప్పు పదార్థాలు శరీరంలో పేరుకుపోతాయి. దీని వలన శరీరం మంటగా మారుతుంది. అందువల్ల కూరగాయలు, పండ్లతో కూడిన సహజమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. శరీరంలో యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ కంటెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండాలి. డీహైడ్రేషన్‌ను నివారించడానికి పుష్కలంగా నీరు తాగడం వల్ల శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవచ్చని అధ్యయనం నివేదించింది.