వర్షాకాలం మొదలవుతున్న సమయంలో ఏ పండ్లు ఆరోగ్యానికి మంచివి? 

  వర్షాకాలం (Monsoon season)లో మన శరీర రోగ నిరోధక శక్తి కొంత తగ్గుతుంది. అలాగని పండ్లు తినడం మానేయడం కాదు. సరిగ్గా ఎంచుకుని తినడం చాలా ముఖ్యం. ఈ కాలంలో కొన్ని పండ్లు ప్రత్యేకంగా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి, అలాగే కొన్ని జాగ్రత్తలతో తినాలి. ఇప్పుడు వాటిని వివరంగా చూద్దాం. వర్షాకాలానికి అనుకూలమైన పండ్లు: యాపిల్  (Apple) లాభాలు: శరీరానికి ఫైబర్, విటమిన్ C, యాంటీ ఆక్సిడెంట్లు అందిస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. జీర్ణక్రియ బాగా జరుగుతుంది. అయితే యాపిల్స్ ను శుభ్రంగా కడిగి తినాలి. పియర్.. (Pear)  శరీరాన్ని హైడ్రేట్ చేయడంతో పాటు, శరీరంలోని వేడిని తగ్గిస్తుంది. పియర్ పండులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది  జీర్ణవ్యవస్థకు చాలా మేలు చేస్తుంది. అరటిపండు (Banana) అరటిపండ్లు అందరికీ చాలా సులవుగా తక్కువ ధరలో దొరుకుతాయి. పైగా అన్ని వయసుల వారు తినదగిన పండు ఇది. అరటిపండు జీర్ణ సమస్యలు నివారించడంలో సహాయపడుతుంది. అరటిపండు శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది. అయితే  ఇతర పళ్లతో కలిపి కాకుండా తినడం మంచిది. ఆరంజ్ (Orange)  ఆరెంజ్ లేదా నారింజ పండులో విటమిన్ C అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. శరీరంలోని విషపదార్థాలను తొలగించడంలో సహాయపడుతుంది. సీజన్ మారుతున్న కాలంలో నారింజ తినడం మంచిదే కానీ.. వర్షాకాలంలో వీటిని పూర్తిగా శుభ్రంగా కడిగి తినాలి. ద్రాక్ష (Grapes) ద్రాక్ష పండ్లు  ఆరోగ్యానికి చాలా మంచివి.  వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు సమృద్దిగా ఉంటాయి. ద్రాక్ష పండ్లు తింటే శరీరం లోపల శుద్ది అవుతుంది.  అయితే ద్రాక్షలో ధూళి, ఫంగస్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా  వర్షాకాలంలో వీటిని  మంచి నీటితో బాగా కడిగి తినాలి. అనాసపండు (Pineapple) అనాస పండు రుచిలోనూ, వాసనలోనూ అందరినీ కట్టిపడేస్తుంది. ఈ సీజన్ మార్పులో అనాసపండు తీసుకుంటే శరీరానికి మంచి  ఎనర్జీ లభిస్తుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. వర్షాకాలంలో చల్లని వాతావరణం వల్ల ఎదురయ్యే కఫం, మలబద్ధకం వంటి సమస్యల నివారణకు మంచిది. తక్కువగా మగ్గిన మామిడిపండ్లు (Semi-ripe Mangoes) వర్షాకాలం ప్రారంభమయ్యి సీజన్ మారుతున్న కాలంలో అక్కడక్కడా ఇంకా మామిడి పండ్లు దొరుకుతూ ఉంటాయి. అయితే జాగ్రత్త,  వర్షాల కారణంగా మామిడిపండ్లలో పురుగులు ఉంటాయి.  అందుకే తక్కువగా మగ్గిన మామిడి పండ్లు తీసుకోవాలి.  వీటిలో విటమిన్ A & C సమృద్ధిగా ఉండి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అయితే తక్కువగా మగ్గినవి అయినా  ఎక్కువగా తింటే మంట, అజీర్ణం కలగవచ్చు. అందుకే  మితంగా తినాలి. వర్షాకాలంలో ఏ పండ్లను జాగ్రత్తగా తినాలి? జామకాయ (Guava)..  జామకాయలను బాగా కడిగి తినాలి. ఎందుకంటే వీటిలో ఫంగస్ ఉండే ప్రమాదం ఎక్కువ. నల్ల ద్రాక్ష (Black grapes)..  నల్ల ద్రాక్ష చాలా వరకు అందరికీ అందుబాటులో ఉండేదే.. అయితే  వీటి శుభ్రతపై ఫోకస్ చేయాలి. శుభ్రంగా లేకుంటే అస్సలు తినకండి. నేరేడు (Jamun)..  నేరేడు పండ్లు ఈ కాలంలో విరివిగా దొరుకుతాయి.  అయితే ఇవి  కొంతమందికి అలర్జీ కలిగించొచ్చు. అందుకే జాగ్రత్త తీసుకోవాలి పండ్లను తినేటప్పుడు పాటించాల్సిన ముఖ్యమైన సూచనలు.. శుభ్రత: పండ్లను మంచి నీటితో బాగా కడగాలి. కొనుగోలు చేసిన వెంటనే నేరుగా తినకూడదు. తాజాగా తినాలి: బయట నిల్వపెట్టిన పండ్లు ఫంగస్ పట్టే ప్రమాదం ఎక్కువ. అందులోనూ ఈ వర్షాకాలంలో  మరీ ఎక్కువ అవకాశాలు ఉంటాయి. మితంగా తినాలి: ఎక్కువగా తినడం వల్ల అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలు రావచ్చు. అందుకే పండ్లు ఆరోగ్యానికి మంచివే అయినా మితంగా తనాలి. రాత్రి పూట జాగ్రత్త: పండ్లు ఎక్కువగా జీర్ణం కావాలంటే ఉదయం లేదా మద్యాహ్నం తినడం ఉత్తమం. రాత్రిపూట తింటే ఇవి జీర్ణం కావడంలో ఇబ్బందులు తలెత్తుతాయి.  ఇది కడుపులో అజీర్తి, గ్యాస్ సమస్యలు ఏర్పడటానికి అవకాశం ఉంటుంది. వర్షాకాలం అంటే జలుబు, జ్వరం వంటి వైరల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా ఉండే కాలం. అందుకే విటమిన్ C, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉన్న పండ్లు తీసుకోవడం ద్వారా రోగ నిరోధకత పెరిగి ఆరోగ్యంగా ఉండవచ్చు.                                       *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...  

జిమ్ లేదా యోగ.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్?

  జిమ్,  యోగా  రెండూ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే వ్యాయామ పద్ధతులే. అయితే ఆరోగ్య లక్ష్యాలు , జీవనశైలి , శారీరక పరిస్థితి,  మానసిక స్థితిని బట్టి ఏది బెస్ట్ అనే విషయంలో మార్పు ఉంటుంది.   అంతేకాదు ఈ రెండింటి మధ్య తేడాలు ఉండటం వల్ల వీటి వల్ల లభించే ఫలితాల్లో కూడా తేడాలు ఉంటాయి.  ఈ రెండు మధ్య తేడాలు,  ఉపయోగాలు తెలుసుకుంటే.. జిమ్ (Gym) — లాభాలు:  బలవర్ధక వ్యాయామం (Strength training): జిమ్‌లో వెయిట్లు, మిషన్లు వాడడం వల్ల కండరాలు (muscles) బలంగా తయారవుతాయి. శరీరాన్ని షేప్‌లోకి తేగలగడం (Body toning): శరీరంలో ఏదైనా ప్రాంతంలో కొవ్వు పేరుకుని ఉంటే.. ఆ ప్రాంతానికి సంబంధించి జిమ్ లో వ్యాయామాలు చేయడం ద్వారా  కొవ్వు కరిగించి ఫిట్ బాడీని పొందవచ్చు. వెయిట్ లాస్ / వెయిట్ గెయిన్ (Weight control): బరువు ఎక్కువ ఉన్నవారు మాత్రమే జిమ్ కు వెళతారు అంటే అది పొరపాటు. జిమ్ చేయడం వల్ల బరువు పెరగవచ్చు కూడా.  దీనికి తగిన వ్యాయామాన్ని ఎంచుకోవచ్చు. ఫిట్‌నెస్ నిపుణులు కూడా సజెస్ట్ చేస్తారు. దీని వల్ల ఆరోగ్యకరంగా బరువు తగ్గడం,  లేదా పెరగడం చేయవచ్చు. ఎనర్జీ స్థాయి పెరుగుతుంది: జిమ్ కు వెళ్లడం వల్ల శరీరం చురుగ్గా మారుతుంది.  దీనివల్ల  రోజువారీ జీవితం energetic గా ఉంటుంది.  కార్డియో ఎక్సర్సైజులు (Cardio workouts): కార్డియో ఎక్సర్సైజులు గుండెకు చాలా మంచివి.  జిమ్ లో చాలామంది చేసే  ట్రెడ్‌మిల్, సైక్లింగ్ వంటివి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.  గుండెను దృఢంగా మారుస్తాయి. యోగా (Yoga) — లాభాలు: మానసిక ప్రశాంతత (Mental peace): యోగా అంటే కేవలం శరీరానికి సంబంధించినది కాదు.. ఇది మనసుకు కూడా సంబంధించినది.  కాబట్టి యోగా వల్ల  మైండ్‌ఫుల్‌నెస్, మెడిటేషన్ ద్వారా ఒత్తిడి తగ్గుతుంది.  శ్వాస,  చైతన్యం పెరుగుతుంది (Improved breathing & awareness): యోగాలో ధ్యానం, ప్రాణాయామం ముఖ్యమైనవి. ప్రాణాయామంలో కూడా చాలా రకాలు ఉన్నాయి.  ఇవి  lungs పనితీరును మెరుగుపరుస్తాయి. శరీర సౌలభ్యం (Flexibility): యోగాలో వివిధ ఆసనాలు, భంగిమలు ఉంటాయి. వీటి వల్ల శరీరంలో అన్ని ప్రాంతాలలోసాధారణంగా అందరూ చేసే వ్యాయామాలకంటే ఎక్కువగా బాడీ ఫ్లెక్సిబుల్ అవుతుంది.  హార్మోనల్ బ్యాలెన్స్: యోగా వల్ల శరీరంలో గ్రంథుల పనితీరు మెరుగవుతుంది.  దీనివల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తగ్గి హార్మోన్లు సక్రమంగా విడుదల అవుతాయి. ఇది  శరీర వ్యవస్థలను సవ్యంగా ఉంచుతుంది. ఊపిరితిత్తులు, జీర్ణవ్యవస్థ, నాడీవ్యవస్థ మొదలైన వాటికి మేలు చేస్తుంది. ఎవరికి ఏది బెటర్? వ్యక్తి లక్ష్యాన్ని బట్టి సరైన ఎంపిక.. దానికి గల కారణం.. బరువు తగ్గాలనుకునే వారు జిమ్ లేదా యోగా + డైట్ చేయడం మంచిది.  అయితే జిమ్ వేగంగా ఫలితం ఇస్తుంది. యోగా మెల్లగా ఫలితాన్ని ఇస్తుంది.  కానీ దీర్ఘకాలిక ప్రయోజనం చేకూరుతుంది. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి అనుకునేవారు యోగా మెడిటేషన్, ప్రాణాయామం చేయాలి. ఇవి మానసిక  శాంతిని ఇస్తాయి. కండరాలు పెంచుకోవాలి అనుకునేవారికి జిమ్ బెటర్. ఎందుకంటే జిమ్ లో వెయిట్ ట్రైనింగ్ ఉంటుంది. ఇది కండరాలు పెరగడానికి  అవసరం. ఫ్లెక్సిబిలిటీ, అంతర్గత ఆరోగ్యం కోసం యోగా చేయాలి. నాడీవ్యూహం, శ్వాస వ్యవస్థ పైన యోగా ప్రభావితంగా ఉంటుంది. అందుకే యోగాఎంపిక మేలు. టైమ్ తక్కువగా ఉంటే జిమ్ కు వెళ్లడం కుదరదు. కాబట్టి అలాంటి వారికి యోగా బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే యోగాను ఇంట్లో కూడా 20-30 నిమిషాలు చేయవచ్చు. మోటివేషన్ తగ్గిపోతుంటే ఇంట్లో జిమ్ అయినా,  యోగా అయినా చేయలేం. అందుకే జిమ్ లో ట్రైనర్, యోగా క్లాసులలో యోగా టీచర్ ఇంకా ఇతర అభ్యాసకులు ఉంటారు.  కాబట్టి ఉత్సాహంగా ముందుకు వెళ్లవచ్చు.   మిక్స్ చేయడం బెస్ట్.. అవకాశం ఉంటే వారంలో 3 రోజులు జిమ్ + 2 రోజులు యోగా చేయడం ఉత్తమ మార్గం. ఫిజికల్ స్ట్రెంగ్త్, ఫ్లెక్సిబిలిటీ, మైండ్ బ్యాలన్సు అన్నీ కలుగుతాయి.                                  *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

చపాతీని ఇలా వండితే చాలా డేంజర్ అంట..!

  చపాతీలు  ఆరోగ్యానికి చాలా మంచివి. ముఖ్యంగా గోధుమ పిండితో తయారు చేసే చపాతీలు చాలామంది డైట్ లో ఉంటాయి.  అధిక శాతం  మంది రాత్రి ఆహారంలో అన్నానికి బదులు చపాతీలు తింటారు. ముఖ్యంగా ఆరోగ్యం మీద స్పృహతో నూనె వేయకుండా చపాతీలు చేసే చపాతీలకు ప్రిఫరెన్స్ ఇచ్చేవారు ఎక్కువ శాతం మంది ఉంటున్నారు. ఇలా నూనె వేయకుండా చేసే చపాతీలను కొన్ని సెకెండ్లు పెనం మీద వేయించి ఆ తరువాత నేరుగా గ్యాస్ స్టవ్ మంట పైన పెడుతుంటారు. ఈ మంటకు చపాతీలు పొంగుతాయి.  ఇవి బాగా మెత్తగా, నూనె లేకుండా ఉంటాయి కాబట్టి చాలా ఆరోగ్యం అనుకుంటారు. అయితే ఇలా చేసే చపాతీలు ఆరోగ్యానికి చాలా డేంజర్ అంటున్నారు ఆరోగ్య నిపుణులు.  దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే..   అధిక ఉష్ణోగ్రతల వద్ద చపాతీని వండటం వల్ల క్యాన్సర్‌కు కారణమయ్యే HCA (హెటెరోసైక్లిక్ అమైన్స్),  PAH (పాలిసైక్లిక్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్స్) వంటి కొన్ని హానికరమైన రసాయనాలు ఉత్పత్తి అవుతాయని కొన్ని పరిశోధనలు వెల్లడించాయి. సహజ వాయువు పొయ్యిలు కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్,  WHO ప్రమాణాలను మించిన సూక్ష్మ కణాలు వంటి ప్రమాదకరమైన వాయువులను విడుదల చేస్తాయి. ఈ వాయువులు శ్వాసకోశ వ్యాధులు, గుండె సమస్యలు,  క్యాన్సర్ వంటి సమస్యలతో ముడిపడి ఉండవచ్చని వైద్యులు, పరిశోధనలు చెబుతున్నాయి. క్యాన్సర్ ప్రమాదం.. అధిక ఉష్ణోగ్రతల వద్ద వంట చేయడం వల్ల క్యాన్సర్ కలిగించే రసాయనాలు ఉత్పత్తి అవుతాయి. కాబట్టి చపాతీలను నేరుగా గ్యాస్ మంట మీద వండటం కూడా ప్రమాదకరం అనే సందేహం చాలామందిలో ఉంది. నిపుణుల మాట.. నేరుగా మంట మీద వంట చేయడం వల్ల క్యాన్సర్‌కు నేరుగా సంబంధం ఉండదని కొందరు అంటున్నారు. అయితే ఇలా వంట చేయడం, నేరుగా చపాతీలు గ్యాస్ స్టవ్ పైన కాల్చడం వల్ల ఖచ్చితంగా కొన్ని రసాయనాలు  దెబ్బతింటాయి. ముఖ్యంగా శరీరంలో DNA దెబ్బ తింటుంది. కానీ శరీరం తనను తాను నయం చేసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అయితే ఎవరైనా అలాంటి ఆహారాన్ని అప్పుడప్పుడు తింటే పర్వాలేదు కానీ.. ఎక్కువగా అదే ఆహారాన్ని తీసుకుంటూ ఉంటే మాత్రం ప్రమాదం ఎక్కువగా ఉంటుందట. మంచి మార్గం ఏదంటే.. పోషకాహార నిపుణురాలు, డైటీషియన్ల ప్రకారం.. 'HCA, PAH,  అక్రిలామైడ్ వంటి రసాయనాలు ముఖ్యంగా స్టార్చ్,  మాంసం వండినప్పుడు ఏర్పడతాయి. అవి క్యాన్సర్‌తో నేరుగా సంబంధం కలిగి ఉండవు. కానీ ముందుజాగ్రత్తగా  బొగ్గు లేదా ఓపెన్ స్టవ్‌పై వండకుండా ఉండటం మంచిదట. గతంలో చపాతీని  ఒక గుడ్డ సహాయంతో పాన్‌పై నొక్కుతూ  తక్కువ మంటపై నూనె వేయకుండా వండేవారు, తద్వారా అది అన్ని వైపుల నుండి సరిగ్గా ఉడికిపోతుంది.  గ్యాస్ మంట మీద నేరుగా కాలదు కూడా. కానీ ఇప్పుడు చపాతీలను  నేరుగా మంటపై కాల్చే అలవాటు చాలా చోట్ల పెరిగింది.  దీని వల్ల సమయం ఆదా అవుతుందని అనుకుంటారు కానీ ఇది ఆరోగ్యానికి హానికరం.  అందుకే చపాతీలను ఎల్లప్పుడూ పాన్ మీద కాల్చడమే మంచిదట.                                      *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

నిపుణుల సలహా లేకుండా ఈ 5 రకాల వ్యక్తులు యోగా అస్సలు చేయకూడదు..!

ఆరోగ్యకరమైన జీవితానికి,  దీర్ఘాయువుకు యోగా కీలకం. అందుకే ఆరోగ్య నిపుణులు ప్రతిరోజూ యోగా చేయాలని సిఫార్సు చేస్తున్నారు. ఇది మాత్రమే కాదు, యోగా  ప్రయోజనాల గురించి ప్రజలకు చెప్పడం,  దాని గురించి ప్రజలకు అవగాహన కల్పించడం అనే లక్ష్యంతో ప్రతి సంవత్సరం జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటారు. సాధారణంగా యోగా అందరికీ ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది, కానీ కొంతమందికి యోగా హానికరం కూడా కావచ్చు. మీరు విన్నది నిజమే. యోగా చేయడం కొంతమందికి హానికరం. యోగా చేయకూడదని చెప్పిన వ్యక్తులు ఉన్నారు.  ఆ వ్యక్తుల గురించి మీకు తెలుసుకుంటే.. అధిక రక్తపోటు లేదా గుండె జబ్బులతో బాధపడుతున్న వ్యక్తులు.. సాధరణంగా, యోగా గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.  రక్తపోటును తగ్గిస్తుంది. అయితే, భుజం నిలబడటం, తల నిలబడటం లేదా వెనుకకు ఎక్కువగా వంగడం వంటి కొన్ని యోగా భంగిమలు రక్త ప్రవాహాన్ని తిప్పికొట్టగలవు.  ఛాతీపై ఒత్తిడి కారణంగా రక్తపోటును పెంచుతాయి. అటువంటి పరిస్థితిలో, కూర్చునే భంగిమలు, ముందుకు వంగడం,  నెమ్మదిగా శ్వాస తీసుకునే వ్యాయామాలు గుండెకు ప్రయోజనకరంగా ఉంటాయి. తలతిరుగుడు లేదా సమతుల్య రుగ్మతలు ఉన్న వ్యక్తులు.. యోగా చేయడం వల్ల సమతుల్యత మెరుగుపడుతుంది,  శరీర కోర్ బలపడుతుంది, కానీ మీకు ఏదైనా వ్యాధి, తల తిరగడం లేదా నాడీ అసమతుల్యతకు సంబంధించిన ఏవైనా అంతర్గత సమస్యలు ఉంటే, వాటిని చేసే ముందు  కొన్ని యోగా ఆసనాలు చేయకుండా ఉండాలి. ఈ ఆసనాలలో వృక్ష భంగిమ, డేగ లేదా నిలబడి ఉన్న భంగిమలు మొదలైనవి ఉన్నాయి. అయినప్పటికీ అలాంటి వారికి యోగా ఇప్పటికీ ఉపయోగకరంగా ఉంటుంది. కానీ దీని కోసం వారు సరైన యోగా ఆసనాలు చేయాలి. గర్భిణీ స్త్రీలు (ముఖ్యంగా మొదటి ,  చివరి త్రైమాసికంలో ఉన్నవారు).. తరచుగా గర్భిణీ స్త్రీలు ప్రసవాన్ని సులభతరం చేయడానికి,  ఒత్తిడిని తగ్గించడానికి యోగా చేయమని సలహా ఇస్తారు. అయితే ఈ సమయంలో యోగా చేసేటప్పుడు కొన్ని విషయాలను గుర్తుంచుకోవడం ముఖ్యం. అందువల్ల గర్భధారణ సమయంలో ట్విస్ట్‌లు, బ్యాక్‌బెండ్‌లు వంటి భంగిమలు ఎక్కువ హాని కలిగిస్తాయి . మొదటి త్రైమాసికంలో, అధిక తీవ్రత గల భంగిమలు ఆకస్మిక ఒత్తిడి లేదా పడిపోవడం వల్ల గర్భస్రావం అయ్యే ప్రమాదాన్ని పెంచుతాయి. ఇది మూడవ త్రైమాసికంలో కూడా హాని కలిగిస్తుంది. అటువంటి పరిస్థితిలో, గర్భధారణ సమయంలో యోగా చేసే ముందు ఖచ్చితంగా  వైద్యుడిని సంప్రదించాలి. వెన్నెముక లేదా డిస్క్ సమస్యలు ఉన్న వ్యక్తులు.. యోగా వెన్నునొప్పిని నయం చేస్తుంది, కానీ ఇది వెన్నెముక లేదా డిస్క్ సమస్యలతో బాధపడేవారికి హాని కలిగిస్తుంది. శస్త్రచికిత్స తర్వాత హెర్నియేటెడ్ డిస్క్, సయాటికా లేదా వెన్నెముక సమస్యలతో బాధపడేవారు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. అటువంటి పరిస్థితిలో వీల్ పోజ్, కోబ్రా లేదా నాగలి పోజ్ వంటి ఆసనాలు చేయకుండా ఉండండి.                                       *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

యోగాలో శక్తివంతమైన ఆసనాలు ఏవంటే..!

యోగ శరీరాన్ని దృఢంగా మారుస్తుంది. యోగాలో చాలా రకాల ఆసనాలు ఉంటాయి. వాటిలో కొన్ని చాలా శక్తివంతమైనవి కూడా ఉన్నాయి.  యోగాలో శక్తివంతమైన (Powerful) ఆసనాలు  శరీరానికి శక్తిని, స్థిరతను, సౌష్టవాన్ని, ధైర్యాన్ని ఇచ్చే ఆసనాలు. ఇవి శారీరకంగా గట్టిగా ఉండటంతో పాటు మానసిక శాంతిని కూడా అందిస్తాయి. ఇవి శక్తి, సహనం, స్తైర్యం, ఫోకస్, ప్రాణశక్తి పెంచే విధంగా పనిచేస్తాయి. అలాంటి శక్తివంతమైన యోగాసనాలు ఏవో తెలుసుకుంటే.. శక్తివంతమైన యోగాసనాలు.. వీరభద్రాసనాలు..   వీరభద్రాసనాలలో మూడు రకాలు ఉన్నాయి.   ఇవి వేస్తుంటే శరీరానికి ధైర్యం, స్థైర్యం కలుగుతుంది. కాళ్ళు, చేతులు, వెన్నెముక బలపడతాయి. మనస్సు కేంద్రీకృతం అవుతుంది.  నౌకాసన (Boat Pose).. నౌకాసనం వస్తుంటే శరీరంలో మధ్య భాగం (core) శక్తివంతంగా తయారవుతుంది. అబ్డోమినల్ మసిల్స్, స్పైన్ బలపడతాయి. మానసిక దృఢత పెరుగుతుంది. బకాసన (Crow Pose).. బలమైన చేతులు, మోకాలుకు సపోర్ట్ కావాలంటే బకాసన వేయడం చాలా మంచిది. ఈ ఆసనం వేయడం వల్ల  ఫోకస్, సమతుల్యత అభివృద్ధి చేస్తుంది.  ధైర్యాన్ని పెంచుతుంది.  ఉర్ధ్వ ధనురాసనం (Upward Bow or Wheel Pose).. ఊర్థ్వ ధనురాసనం వేస్తే వెన్నెముక, గుండె, ఛాతీ తెరుచుకుంటాయి. ఇది  శక్తిని పంచుతుంది, ఉత్సాహం పెంచుతుంది. పరివ్రుత్త పర్వతాసన (Revolved Triangle Pose ) పరివృత్త పర్వతాసన వేయడం ద్వారా శరీరానికి లవణత (flexibility),  బలం ఇస్తుంది. జీర్ణ వ్యవస్థ మెరుగవుతుంది. శరీరాన్ని డిటాక్స్  చేయడంలో సహాయం చేస్తుంది.  అధో ముఖ శ్వానాసన (Downward Facing Dog).. అధోముఖ శ్వానాస వేయడం వల్ల శరీరంలోని అన్ని భాగాలపై ప్రభావం పడుతుంది.  ఇది శక్తిని పునరుత్తేజితం చేస్తుంది. మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. చతురంగ దండాసన (Low Plank).. చేతులు, భుజాలు, మధ్య భాగం బలంగా తయారవుతాయి. శక్తిని కేంద్రీకరించేందుకు ఉపయుక్తంగా ఉంటుంది. ప్రాణాయామం తో కలిపితే.. శక్తివంతమైన ఆసనాలకు ప్రాణాయామం (విశేషంగా కపాలభాతి, బస్ట్రికా) తోడైతే శక్తి స్థాయి మరింత పెరుగుతుంది. సూచనలు: ఆసనాలు సాధన చేయడానికి ముందుగా మైల్డ్ వార్మప్ చేయాలి. శ్వాసపై దృష్టి పెట్టడం ముఖ్యం. మొదట్లో శిక్షణ పొందిన గురువు సూచనతో చేయడం ఉత్తమం.                                         *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...  

కిడ్నీ స్టోన్ సమస్య ఉన్నవారు ఏం తినాలి? ఏం తినకూడదు?

  కిడ్నీలో రాళ్ల సమస్య చాలా మంది ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్య. ఇవి సాధారణంగా యూరిన్‌లో ఉండే ఖనిజాలు, లవణాలు కలిసి కఠిన పదార్థాలుగా ఏర్పడటం వల్ల ఏర్పడతాయి. ఈ రాళ్ల రకాన్ని బట్టి (క్యాల్షియం ఆక్సలేట్, యూరిక్ ఆసిడ్, స్ట్రవైట్, సిస్టైన్ రాళ్లు) ఆహార నియమాలు మారవచ్చు. అయితే సాధారణంగా తీసుకోవాల్సిన, నివారించాల్సిన ఆహారాలు కొన్ని ఉన్నాయి. అవేంటో తెలుసుకుంటే.. తినాల్సినవి .. నీరు (Water) కిడ్నీ రాళ్ల సమస్య ఉన్నవారు రోజుకు 3-4 లీటర్లు నీరు తాగాలి. అధిక యూరిన్ ఉత్పత్తి ద్వారా రాళ్లు ఏర్పడే అవకాశం తగ్గుతుంది. అందుకే కిడ్నీ రాళ్ల సమస్య ఉన్నవారు నీరు బాగా తాగాలని వైద్యులు కూడా చెబుతారు. పళ్లు (Fruits): నిమ్మకాయ, బత్తాయి వంటి సిట్రస్ పండ్లు  బాగా తీసుకోవాలి. ఇవి సిట్రేట్ అనే పదార్థాన్ని ఇచ్చి రాళ్ల ఏర్పాటును అడ్డుకుంటాయి. అలాగే నీరు ఎక్కువగా ఉండే పళ్లు  కర్భూజ,  పుచ్చకాయ వంటివి కూడా చాలా మంచిది. కూరగాయలు.. తక్కువ ఆక్సలేట్ కలిగిన కూరగాయలైన దొండకాయ, దోసకాయ, బీరకాయ, కొబ్బరికాయ మొదలైనవి తీసుకోవడం మంచిది. ఆకుకూరలలో తోటకూర బాగా  తినాలి కానీ  ఎక్కువగా తినకూడదు. ధాన్యాలు.. బ్రౌన్ రైస్, గోదుమ రొట్టెలు, రాగి, జొన్న వంటి ఫైబర్ సమృద్ధిగా ఉండే ధాన్యాలు మంచివి. తక్కువగా తీసుకోవాల్సినవి.. తక్కువ ఫ్యాట్ ఉన్న పాలు, పెరుగు.. తీసుకోవాలి. ముఖ్యంగా క్యాల్షియం బాగా తీసుకుంటే క్యాల్షియం ఆక్సలేట్ కారణంగా రాళ్లు తగ్గే అవకాశం ఉంటుంది. తినకూడని/నివారించాల్సినవి .. ఆక్సలేట్ అధికంగా ఉండే ఆహారాలు అయిన  మెంతి, బీట్రూట్ , పాలకూర, శనగలు, మామిడికాయలు తీసుకోకూడదు. అలాగే  నాచురల్ ఆక్సలేట్ అధికంగా ఉండే పళ్ళు, కూరగాయలకు దూరంగా ఉండటం మంచిది చెక్కెర,  ఉప్పు: అధిక మోతాదులో సాధారణ ఉప్పు  తీసుకుంటే అది  కిడ్నీలో రాళ్లను ప్రోత్సహిస్తుంది. తీపి పదార్థాలు కూడా నివారించాలి.  ముఖ్యంగా సోడాలు, క్యాండీలు, కేకులు మొదలైన తీపి ఆహారాలకు దూరంగా ఉండాలి. మాంసాహారం .. ఎక్కువ మోతాదులో మటన్, చికెన్, ఎగ్స్ తీసుకోవడం వలన యూరిక్ ఆసిడ్ స్థాయి పెరుగుతుంది. అలాగే మాంసాహారం వండటానికి ఉపయోగించే మసాలా దినుసులు తగ్గించాలి. సాఫ్ట్ డ్రింక్స్.. కోలా, సోడా, ఎనర్జీ డ్రింక్స్  తీసుకోకూడదు. ఎందుకంటే వీటిలో ఫాస్ఫేట్లు అధికంగా ఉంటాయి.  ఇవి కిడ్నీలో  రాళ్లను ప్రోత్సహిస్తాయి. విటమిన్ C అధిక మోతాదు.. రోజు 500 mg కంటే ఎక్కువగా విటమిన్-సి ని తీసుకోవడం వల్ల   ఆక్సలేట్ స్థాయిని పెరుగుతుంది. ఇతర చిట్కాలు.. మూత్రాన్ని నిర్ధారంగా రోజుకి 2 లీటర్లకు పైగా ఉత్పత్తి అయ్యేలా చూసుకోవాలి. ఆహారం బట్టే రాళ్ల రకాన్ని గుర్తించి ఆహార నియమాలు మార్చుకోవడం అవసరం. ఉదాహరణకు: క్యాల్షియం ఆక్సలేట్ రాళ్లు ఉంటే ఆక్సలేట్ తగ్గించాలి. యూరిక్ ఆసిడ్ రాళ్లు ఉంటే ప్యూరిన్స్ తగ్గించాలి.  మాంసం, కప్పు టీలో ఉండే పదార్థాలు యూరిక్ ఆసిడ్ రాళ్లకు కారణం అవుతాయి.                                  *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

గ్రీన్ టీ తాగడం వల్ల కలిగే లాభాలు ఏంటి?  ఎలాంటి గ్రీన్ టీ ని ఎంచుకోవాలి?

  గ్రీన్ టీ తాగడం ఆరోగ్యానికి చాలా లాభదాయకం. ఇది యాంటీఆక్సిడెంట్లు, పోషకాలు, ఫ్లేవనాయిడ్లు,  క్యాటెచిన్లతో సమృద్ధిగా ఉంటుంది. ఇది శరీరాన్ని డిటాక్స్  చేయడంలో, మెటబాలిజం పెంచడంలో, ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. అసలు గ్రీన్ టీ తాగడం వల్ల కలిగే లాభాలు ఏంటి? అలాగే ఎలాంటి గ్రీన్ టీ తీసుకోవాలి అన్న విషయాలు వివరంగా తెలుసుకుంటే.. గ్రీన్ టీ తాగడం వల్ల కలిగే లాభాలు.. యాంటీఆక్సిడెంట్లు.. గ్రీన్ టీ లో ఉండే క్యాటెచిన్ అనే యాంటీఆక్సిడెంట్లు, ముఖ్యంగా EGCG (Epigallocatechin gallate) కేన్సర్ కారక కణాల ఎదుగుదలని అడ్డుకుంటుంది. మెటబాలిజాన్ని పెంచుతుంది.. రోజూ గ్రీన్ టీ తాగడం వల్ల బాడీ మెటబాలిజం పెరిగి కొవ్వు కాలే ప్రక్రియ వేగవంతం అవుతుంది. ఇది బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. బరువు తగ్గడంలో సహాయం.. ముఖ్యంగా పొట్ట భాగం కొవ్వు కరిగించడంలో గ్రీన్ టీ ఉపయోగపడుతుంది. వ్యాయామంతో పాటు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. హృదయ ఆరోగ్యం.. గ్రీన్ టీ లో ఉండే పొటాషియం, ఫ్లేవనాయిడ్లు రక్తపోటు (BP) ని నియంత్రిస్తాయి, చెడు కొలెస్ట్రాల్ (LDL) తగ్గించి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మెదడు ఆరోగ్యం.. గ్రీన్ టీ లో ఉండే చిన్న మొత్తంలో కేఫిన్ మరియు L-theanine మానసిక ఉత్తేజకంగా పనిచేస్తాయి. ఇది మెమరీ, ఫోకస్ పెరగడానికి సహాయపడుతుంది.  టైప్ 2 డయబెటిస్.. గ్రీన్ టీ శరీరంలో ఇన్సులిన్ పనితీరును మెరుగుపరుస్తుంది, thereby షుగర్ లెవల్స్ ను నియంత్రించడంలో సహాయపడుతుంది.  చర్మం & వెంట్రుకల ఆరోగ్యం.. గ్రీన్ టీ లో ఉండే యాంటీఆక్సిడెంట్లు వయస్సు ప్రభావాన్ని తగ్గిస్తాయి. ఇది చర్మాన్ని మెరుగు పరచడంతో పాటు పింపుల్స్ ను  తగ్గిస్తుంది. డీటాక్స్.. గ్రీన్ టీ ప్రాకృతికంగా శరీరాన్ని టాక్సిన్స్  నుండి శుభ్రం చేయడంలో సహాయపడుతుంది. ఎలాంటి గ్రీన్ టీ ఎంచుకోవాలి? ఆర్గానిక్ గ్రీన్ టీ.. కీటకనాశకాలూ, కెమికల్స్ లేని ఆర్గానిక్ వేరియంట్లు తీసుకోవడం ఉత్తమం. ఇప్పట్లో చాలా ఆర్గానిక్ గ్రీన్ లు మార్కెట్లో అందుబాటులో ఉంటున్నాయి. లూజ్ లీఫ్ గ్రీన్ టీ,  టీ బ్యాగ్స్.. లూజ్ లీఫ్ గ్రీన్ టీలో ఎక్కువగా యాక్టివ్ పదార్థాలు ఉంటాయి. టీ బ్యాగ్స్ కొన్నిటిలో నానోప్లాస్టిక్ పదార్ధాలు ఉంటాయి . అందుకే  చూసి ఎంచుకోవాలి. ఫ్లేవర్ కలిపిన గ్రీన్ టీ..  జాగ్రత్తగా.. జింజర్, లెమన్, తులసి, మింట్ వంటి సహజమైన ఫ్లేవర్స్ ఉన్న గ్రీన్ టీ సరే. అయితే అతి తక్కువ శాతం టీ ఉండే, ఎక్కువ artificial flavor ఉన్నవి తీసుకోకూడదు. ఎప్పుడు తాగాలి? ఉదయం ఖాళీ కడుపు మీద తాగకూడదు. ఎందుకంటే ఇది ఆమ్లత్వం (acidity) కలిగించవచ్చు.  భోజనం తరువాత 30 నిమిషాల లోపల లేదా సాయంత్రం తక్కువ ఆకలిగా ఉన్నప్పుడు గ్రీన్ టీ తీసుకోవడం మంచిది. జాగ్రత్త.. రోజుకు 2–3 కప్పులు గ్రీన్ టీ సరిపోతుంది. మించితే నిద్రలేమి, అధిక ఆమ్లత్వం వంటి దుష్ప్రభావాలు రావచ్చు. గర్భిణీలు, ముదురు వయస్సు వారికి గ్రీన్ టీ తీసుకునే ముందు డాక్టర్ సలహా అవసరం. షుగర్  లేదా తీపి పదార్థాలు కలిపి తాగకూడదు ఎందుకంటే ఇలా చేయడం వల్ల గ్రీన్ టీ వల్ల లభించాల్సిన  అసలు ప్రయోజనం తగ్గిపోతుంది.                                      *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

ఏ ఉప్పు ఆరోగ్యానికి మంచిది? ఆయుర్వేదంలో దీని గురించి ఏం చెప్పారంటే..!

ఉప్పు లేని వంటను ఊహించలేం, అలాగే ఉప్పు లేకుండా ఏమీ తినలేం.  చాలామంది పలుచటి మజ్జిగ తాగాలన్నా సరే.. అందులో కాసింత ఉప్పు వేసుకుని తాగుతుంటారు.  ఉప్పు ఆరోగ్యానికి మంచిదే కానీ సరైన విధంగా ఉప్పు తీసుకోకపోతే అది ఆరోగ్యానికి చేటు కూడా చేస్తుంది. అదేవిధంగా ఉప్పులో రకాలు కూడా ఉంటాయి.  ఏ ఉప్పు ఆరోగ్యానికి మంచిది అనే విషయం ఈ మధ్యకాలంలో చాలా హాట్ టాపిక్ గా మారింది.  ఆయుర్వేదంలో ఆరోగ్యానికి ఏ ఉప్పు మంచిది అనే విషయం స్పష్టంగా ఇవ్వబడింది.  దీని గురించి తెలుసుకుంటే.. ఆయుర్వేదంలో సాధారణంగా "సెంధా నమక్" లేదా "సైంధవ లవణం" ఆరోగ్యానికి అత్యుత్తమమైన ఉప్పుగా పరిగణించబడుతుంది. ఇది హిమాలయ ప్రాంతాల్లో దొరికే సహజ  ఉప్పు. దీనిని ఆంగ్లంలో Himalayan Rock Salt లేదా Pink Salt అని కూడా అంటారు. ఆయుర్వేద దృష్టిలో సైంధవ లవణం విశిష్టత: ఆయుర్వేద గ్రంథాలలో ఆరు రకాల లవణాలు (ఉప్పులు) గురించి చెప్పబడింది. వాటిలో సైంధవ  లవణం ఉత్తమంగా భావించబడుతుంది.  సైంధవ లవణం  యొక్క ఆరోగ్య ప్రయోజనాలు.. త్రిదోష సమతుల్యత.. వాత, పిత్త, కఫ దోషాలను సమతుల్యంలో ఉంచుతుంది. ముఖ్యంగా వాత దోషాన్ని తగ్గించడంలో ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. జీర్ణవ్యవస్థకు సహాయపడుతుంది.. అజీర్ణం, ఉబ్బసం, గ్యాస్ వంటి సమస్యలను నివారించడంలో ఉపయోగపడుతుంది. అపానవాయువు నియంత్రణకు ఉపయోగకరమైందిగా భావిస్తారు. అల్కలైనిటి మేనేజ్‌మెంట్.. శరీరంలో పిహెచ్ స్థాయిని సద్దుమణిగించే లక్షణం కలిగి ఉంటుంది. అమ్లత్వాన్ని తగ్గించి దాహాన్ని నివారిస్తుంది. హృదయ ఆరోగ్యం.. రక్తపోటు నియంత్రణకు సహాయపడుతుందని చెబుతారు. అయితే దీన్ని అత్యధికంగా తీసుకోకూడదు. సోడియం కంటెంట్ తక్కువగా ఉండటం వల్ల హై బీపీ ఉన్నవారు సాధారణ ఉప్పు కంటే దీనిని కొంతమేరకు ఉపయోగించవచ్చు. చర్మ సమస్యలు.. సైంధవ  ఉప్పుతో స్నానం చేస్తే చర్మ వ్యాధులు, అలర్జీలు తగ్గుతాయని నమ్మకం ఉంది. గర్భిణీ స్త్రీలకు అనుకూలం: సాధారణ ఉప్పు కాకుండా సైంధవ లవణంను  ఉపవాసాల సమయంలో, గర్భధారణ సమయంలో ఉపయోగిస్తారు ఎందుకంటే ఇది శరీరానికి మృదుత్వం ఇస్తుంది. ఇవి తెలుసుకోండి.. ఆయుర్వేద ప్రకారం ఇది అధికంగా వాడితే కఫ, పిత్తాన్ని పెంచే అవకాశం ఉంది. శరీరానికి అధిక ఉష్ణతనివ్వడం, రక్తాన్ని కలుషితం చేయడం వంటి సమస్యలు తలెత్తవచ్చు. సముద్ర ఉప్పు.. ఇది కూడా కొన్ని సందర్భాల్లో వాడతారు కానీ ఇది ఎక్కువగా కఫ, పిత్తాన్ని ప్రేరేపించగలదని భావిస్తారు. ఉపయోగించే విధానం.. రోజువారీ వంటల్లో సాధారణ ఉప్పు స్థానంలో తక్కువ మోతాదులో సైంధవ లవణం వాడడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. చట్నీలు, రైతాలు, ఉపవాసకాల వంటల్లో ఇది వాడతారు. స్నాన జలంలో ఈ ఉప్పును కలిపి వాడితే శరీరానికి విశ్రాంతి కలుగుతుంది.                         *రూపశ్రీ గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...  

ఎముకలను చెదపురుగుల్లా తినేసే ఈ వ్యాధి గురించి తెలుసా?

  ఎముకలు శరీరానికి ఊతాన్ని ఇస్తాయి.  ఎముకలు ఎంత బలంగా ఉంటే శరీరం అంత బలంగా ఉంటుందని అర్థం.  అయితే ప్రస్తుత కాలంలో చాలామంది ఎముకల సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఎముకలకు సంబంధించి చాలా వ్యాధులు కూడా ఉన్నాయి.  వాటిలో ఒక వ్యాధి ఎముకలను చెదపురుల్లా తినేస్తుంది. ఇంతకీ ఆ వ్యాధి ఏమిటో.. దాన్నుండి బయటపడే మార్గం ఏమిటో.. ఆ వ్యాధి రాకుండా ఉండాలంటే తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటో.. వివరంగా తెలుసుకుంటే.. ఎముకలు  క్రమంగా బలహీనపడతాయని చాలామందికి తెలియదు. అది కూడా స్పష్టమైన లక్షణాలు లేకుండానే బలహీన పడతాయి.  దీనికి కారణం అయ్యే వ్యాధిని ఆస్టియోపోరోసిస్ అంటారు. ఈ వ్యాధి  ఎముకల బలాన్ని నిశ్శబ్దంగా నాశనం చేస్తుంది. ఆస్టియోపోరోసిస్ లక్షణాలు గుర్తించే సమయానికి, ఎముకలు చాలా బలహీనంగా మారతాయి. చిన్న చిన్న దెబ్బలు కూడా ఎముకల పగుళ్లకు కారణం అవుతాయి. అసలు  ఆస్టియోపోరోసిస్ అంటే ఏమిటి, దాని లక్షణాలు ఏమిటి?  దానిని ఎలా నివారించాలంటే.. ఆస్టియోపోరోసిస్ అనేది ఎముకలు క్రమంగా సన్నగా,  బలహీనంగా మారే వ్యాధి. అవి లోపల నుండి బోలుగా మారుతాయి.  చెదపురుగులు చెక్కను ఆక్రమించినట్లు. బయట నుండి ప్రతిదీ బాగానే కనిపిస్తుంది, కానీ లోపల ఎముకలు బలహీనమవుతాయి.   మహిళలు, ముఖ్యంగా మెనోపాజ్ దశకు చేరుకున్న వారు, 50 ఏళ్లు పైబడిన వారు తక్కువ కాల్షియం,  విటమిన్ డి ఆహారం తీసుకునేవారు ఎక్కువసేపు నిశ్చలంగా ఉండేవారు,  వ్యాయామం చేయనివారు అధికంగా ధూమపానం చేసేవారు లేదా మద్యం సేవించేవారు ఎక్కువ కాలం కొన్ని మందులు  తీసుకునేవారు.. ఇలా వీరందికి ఈ ఆస్టియోపోరోసిస్ వ్యాధి ప్రమాదం ఎక్కువ ఉంటుంది. లక్షణాలు.. ఆస్టియోపోరోసిస్ యొక్క అతిపెద్ద ప్రమాదం ఏమిటంటే ప్రారంభంలో ఎటువంటి లక్షణాలు కనిపించకపోవడమే. ప్రజలు అంతా బాగానే ఉందని అనుకుంటారు కానీ లోపల ఎముకలు బలహీనపడుతుంటాయి. కొన్ని సాధారణ లక్షణాలు కూడా ఉంటాయి. వాటిలో  నిరంతరం వెన్నునొప్పి, నడుము వంగడం ప్రారంభమవుతుంది.  అలాగే  ఎత్తు తక్కువగా మారుతుంద.  చిన్న గాయంలో కూడా చేయి లేదా కాలు ఎముకలు విరిగిపోతాయి. వ్యాధి నిర్థారణ.. ఈ వ్యాధిని BMD (బోన్ మినరల్ డెన్సిటీ) పరీక్ష ద్వారా గుర్తిస్తారు. దీనిని DEXA స్కాన్ అని కూడా అంటారు. ఈ స్కాన్  ఎముకలు ఎంత బలంగా ఉన్నాయో చూపిస్తుంది. నివారణ ఎలాగంటే.. మంచి ఆహారం తీసుకోవాలి.  పాలు, పెరుగు, జున్ను, ఆకుపచ్చ కూరగాయలు, బాదం తీసుకోవాలి. అలాగే వీలైనంత సూర్యకాంతి నుండి విటమిన్ డి లభించేలా జాగ్రత్తలు పాటించాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.  ప్రతిరోజూ నడవాలి. తేలికపాటి యోగా చేయాలి. మెట్లు ఎక్కాలి. ఇది ఎముకలను బలపరుస్తుంది . చెడు అలవాట్లను నివారించాలి.  సిగరెట్లు,  ఆల్కహాల్‌కు దూరంగా ఉండాలి. ఇవి ఎముకలను త్వరగా బలహీనపరుస్తాయి. వైద్యులు ఏమంటున్నారంటే.. ఆస్టియోపోరోసిస్ త్వరగా వచ్చే వ్యాధి కాదు. నెమ్మదిగా ప్రభావితం చేస్తుంది. కానీ అది దాని ప్రభావాన్ని చూపించే సమయానికి చాలా ఆలస్యం అవుతుంది. కాబట్టి ఇప్పటి నుండే  ఎముకలను జాగ్రత్తగా చూసుకోవాలి. రోగం వచ్చాక వైద్యం చేయించుకోవడం కంటే రోగం రాకుండా జాగ్రత్త పడటం మంచిది.                       *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

వెన్నునొప్పి రిపీటెడ్ గా వస్తోందా? దీన్ని సహజంగా తగ్గించడం ఎలాగంటే..!

  వెన్నునొప్పి చాలామంది కంప్లైంట్ చేసే సమస్య. వెన్నునొప్పిని బిజీగా ఉండే రోజులో పెద్దగా పట్టించుకోరు.   ముఖ్యంగా గంటల తరబడి డెస్క్ వద్ద పనిచేసిన తర్వాత లేదా  ఏదైనా బరువులు  ఎత్తిన తర్వాత వెన్నునొప్పి వస్తుంటుంది.  చాలామంది ఈ నొప్పి వచ్చినప్పుడు లైట్ తీసుకుంటారు.  ఓ పది నిముషాలు పడుకుంటే అంతా సర్థుకుంటుంది అని అంటుంటారు.  ఈ వెన్ను నొప్పి పదే పదే వస్తున్నప్పుడు అది కేవలం తాత్కాలిక నొప్పి  అనుకోవడం పొరపాటు అని వైద్యులు అంటున్నారు. పదే పదే వచ్చే వెన్నునొప్పి అసౌకర్యాన్ని కలిగించడం కంటే ఎక్కువ హాని చేస్తుంది.  దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే.. వెన్ను నొప్పి అనేది చాలా మంది సాధారణ సమస్యే అనుకుంటూ ఉంటారు. అయితే వెన్ను నొప్పి  వచ్చినప్పుడు విశ్రాంతి తీసుకున్నా ఈ నొప్పి తగ్గడంలో మార్పు కనిపించకపోతే అది ప్రమాదం. ముఖ్యంగా ఏ చిన్న పని చేసినా వెన్ను బిగుసుకుపోవడం జరుగుతూ ఉంటే అది నిర్లక్ష్యం చేయాల్సిన సమస్య కాదని అంటున్నారు వైద్యులు. కాళ్లు చేతులు తిమ్మిర్లుగా ఉండటం, జలధరింపు లేదా దృఢత్వం గురించి జాగ్రత్త వహించాలని అంటున్నారు.  ఇవి నరాల సమస్యలను,  లేదా వెన్నెముక సమస్యలను సూచిస్తాయని అంటున్నారు. అయితే వెన్నెముక సమస్యలు రాకూడదన్నా,  వెన్నెముక సేఫ్ గా ఉండాలన్నా,  వెన్నెముక సమస్యలను సులువుగా తగ్గించాలని అనుకున్నా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. అవేంటంటే.. బరువు తగ్గడం.. అధిక బరువు వెన్నెముకపై ఒత్తిడిని కలిగిస్తుంది.  బరువును అదుపులో ఉంచుకోవడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది,  బరువు తగ్గడం వల్ల వెన్నెముక సమస్యనే కాదు.. మరిన్ని సమస్యలను నివారించవచ్చు . పొజిషన్.. వంగి ఉండటం ప్రమాదకరం కాదు. కూర్చున్నప్పుడు, వాహనం నడుపుతున్నప్పుడు లేదా నడుస్తున్నప్పుడు  వీపును సమతలంగా ఉంచాలి. వీపుకు మద్దతు ఇచ్చే కుర్చీలను ఉపయోగించాలి. ఎదురుగా ఉన్న పరికరాలపై వంగి ఉండకూడదు. వ్యాయామం.. "నిశ్చల జీవనశైలి వెన్నెముకను బలహీనపరుస్తుంది.  రోజువారీ దినచర్యలో కోర్ బలపరిచేటటువంటి వ్యాయామాలను చేర్చాలి. తేలికపాటి కదలిక కూడా సహాయపడుతుంది. ఎర్గోనామిక్ ఫర్నిచర్ .. అన్నింటి కంటే ముఖ్యంగా చేయాల్సిన పని కుర్చీని వెన్నెముకకు మద్దతు ఇచ్చేలా ఉన్నది ఎంచుకోవడం.  అవసరమైతే ఫుట్‌రెస్ట్‌ను జోడించి, స్క్రీన్‌ను కంటి స్థాయికి పెంచుకోవాలి. లిఫ్టింగ్ టెక్నిక్‌..   ఏవైనా బరువులు ఎత్తేటప్పుడు నడుమును కాదు మోకాళ్లను వంచాలి. సడన్ గా  జెర్కీ కదలికలను నివారించాలి.  బరువైన వస్తువును ఎత్తేటప్పుడు ఎప్పుడూ మెలితిప్పకూడదు.  బరువును.. అధిక బరువు వెన్నెముకపై ఒత్తిడిని కలిగిస్తుంది.  బరువును అదుపులో ఉంచుకోవడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది.  మరిన్ని సమస్యలు రాకుండా ఉంటాయి. నీరు.. హైడ్రేషన్ వెన్నెముక డిస్క్‌ల స్థితిస్థాపకతను నిర్వహించడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా వేడి వాతావరణంలో లేదా వ్యాయామం తర్వాత నీరు తాగాలి.  రోజుకు 6–8 గ్లాసులు త్రాగాలని లక్ష్యంగా పెట్టుకోవాలి. ఎక్కువసేపు కూర్చోవద్దు..   ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల వెన్ను దెబ్బ తింటుంది. ప్రతి 30–45 నిమిషాలకు నిలబడుతూ ఉండాలి.  శరీరాన్ని కాస్త సాగదీయడం,  నడవడం వంటివి ఉపయోగకరంగా ఉంటాయి. నొప్పిని విస్మరించకూడదు.. నొప్పి అనేది శరీరం ఇబ్బందిలో ఉంది అనడానికి ఒక సిగ్నల్. పైన చెప్పిన చిట్కాలు అన్నీ పాటిస్తున్నా అది మళ్లీ మళ్లీ వస్తుంటే వైద్య సహాయం తీసుకోవాలి. ఈరోజు నొప్పిని విస్మరించడం వల్ల రేపు  వెన్నెముక ఆరోగ్యం దెబ్బతింటుందని వైద్యులు గట్టిగా చెబుతున్నారు.                             *రూపశ్రీ.   గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

కోవిడ్-19 వల్ల గుండెపోటు వస్తుందా?

  భారతదేశంలో COVID-19 కేసులు పెరుగుతున్నాయి.  ఆరోగ్య మంత్రిత్వ శాఖ  COVID డాష్‌బోర్డ్‌లోని డేటా ప్రకారం 7131 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అత్యధిక కేసులు ఉన్న రాష్ట్రాలలో కేరళ, గుజరాత్, పశ్చిమ బెంగాల్,  మహారాష్ట్ర ఉన్నాయి. నివారణకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం. COVID-19 అనేక దీర్ఘకాలిక ఆరోగ్య ప్రమాదాలతో ముడిపడి ఉంది.  ఇది వచ్చిన మూడు సంవత్సరాల వరకు ఏదైనా కారణం వల్ల గుండెపోటు, స్ట్రోక్,  మరణ ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతుందని ఇటీవలి అధ్యయనం కనుగొంది.  టైప్ O తో పోలిస్తే A, B లేదా AB రక్త రకాలు ఉన్నవారిలో ఈ ప్రమాదం ఎక్కువగా ఉందని చెబుతున్నారు. దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే.. COVID-19 ఇన్ఫెక్షన్ గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుందా? "COVID తో సంబంధం ఉన్న దీర్ఘకాలిక హృదయ సంబంధ ఆరోగ్య ప్రమాదాన్ని వైద్యులు కనుగొన్నారు. ముఖ్యంగా తీవ్రమైన COVID-19 సమస్య వచ్చి  ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం ఉన్న వ్యక్తులలో ఈ ప్రమాదం అధికం అంటున్నారు.  COVID-19 సంక్రమణ తర్వాత మూడు సంవత్సరాల తర్వాత కూడా గుండెపోటు,  స్ట్రోక్ ప్రమాదం పెరిగింది. విశేషమేమిటంటే కొన్ని సందర్భాల్లో టైప్ 2 డయాబెటిస్ లేదా పరిధీయ ధమని వ్యాధి వంటి  హృదయ సంబంధ ప్రమాద కారకం ఉన్నంత ప్రమాదం పెరిగిందట. పరిశోధనలలో ఏం తేలిందంటే.. పరిశోధకులు చేసిన అధ్యయనాలలో COVID-19 వచ్చిన పెద్దలలో గుండెపోటు, స్ట్రోక్,  మరణాల ప్రమాదం రెండు రెట్లు ఎక్కువగా ఉందని,  COVID-19 తో ఆసుపత్రిలో చేరిన పెద్దలలో ఇన్ఫెక్షన్ చరిత్ర లేని వారితో పోలిస్తే దాదాపు నాలుగు రెట్లు ఎక్కువగా ఉందని పరిశోధకులు కనుగొన్నారు. దాదాపు 3 సంవత్సరాల ఫాలో-అప్ కాలంలో ఈ ఫలితాలు వెల్లడయ్యాయి. ఆసుపత్రిలో చేరిన COVID-19 రోగుల ప్రమాదం.. ఈ అధ్యయనంలో హృదయ సంబంధ వ్యాధులు లేదా టైప్ 2 డయాబెటిస్ లేకుండా COVID-19 తో ఆసుపత్రిలో చేరిన వ్యక్తులకు హృదయ సంబంధ వ్యాధులు,  COVID-19 ఇన్ఫెక్షన్ లేని వ్యక్తులతో పోలిస్తే గుండెపోటు, స్ట్రోక్,  మరణానికి 21% ఎక్కువ ప్రమాదం ఉందని తేలింది. కోవిడ్ ఇన్ఫెక్షన్, రక్త రకం,  గుండెపోటు ప్రమాదం.. O కాని రక్త వర్గాలు COVID-19 కారణంగా ఆసుపత్రిలో చేరేవారి మధ్య జన్యుపరమైన పరస్పర చర్య ఉందని పరిశోధకులు కనుగొన్నారట. తీవ్రమైన COVID-19 ఇన్ఫెక్షన్ ఉన్నవారికి గుండెపోటు,  స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. కానీ A, B లేదా AB వంటి O కాని రక్త వర్గాలు ఉన్నవారిలో ఈ ప్రమాదం ఇంకా ఎక్కువగా ఉందని చెబుతున్నారు.  O రకం రక్తం ఉన్నవారితో పోలిస్తే O కాని రక్త వర్గాలు గుండెపోటు,  స్ట్రోక్ వచ్చే ప్రమాదం 65% ఎక్కువగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా, ఒక బిలియన్ మందికి పైగా ప్రజలు ఇప్పటికే COVID-19 సంక్రమణను అనుభవించారు. నివేదించబడిన ఫలితాలు ఒక చిన్న ఉప సమూహంలో చిన్న ప్రభావం కాదు. ఈ ఫలితాలలో దాదాపు పావు మిలియన్ మంది ఉన్నారట.  వ్యాధి పెరుగుదలకు ఇది ముఖ్య కారణం అని అంటున్నారు.  కాబట్టి కోవిడ్-19 వచ్చిన వారిలో  రక్త రకాన్ని బట్టి చాలామంది గుండెపోటుకు గురయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి.  వీరందరూ జాగ్రత్తగా ఉండటం అవసరం.                                    *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

ఊపిరితిత్తులు బలంగా మారడానికి ఏ ఆహారాలు తినాలి?

ఊపిరితిత్తులు మానవ శరీరంలో ముఖ్యమైన అవయవాలలో ఒకటి.  మానవ శ్వాసక్రియ ఊపిరితిత్తుల మీదనే ఆధారపడి ఉంటుంది.  ఊపిరితిత్తుల పనితీరు సరిగా లేకపోతే శరీర పనితీరు కూడా దెబ్బతింటుంది. ఊపిరితిత్తులు బలంగా ఉండటం ఆరోగ్యానికి చాలా కీలకం. ముఖ్యంగా వాయువుల మార్పిడి, శ్వాస సంబంధిత వ్యాధులు నివారించడానికి. ఊపిరితిత్తుల ఆరోగ్యం మెరుగ్గా ఉండాలి.  ఊపిరితిత్తుల ఆరోగ్యం  మెరుగుపరచడానికి కొన్ని ఆహారాలు చక్కగా సహాయపడతాయి. యాంటీఆక్సిడెంట్లు.. బ్రోకలీ, కాలీఫ్లవర్, క్యాబేజీ వంటి ఆహారాలలో  గ్లూకోసినోలేట్లు ఉండి శ్వాసనాళాలను శుభ్రంగా ఉంచుతాయి. బేరీ జాతి పండ్లైన స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ లలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ C ఎక్కువగా ఉండి ఫ్రీ రాడికల్స్‌ను తగ్గిస్తాయి. టమోటాలు కూడా ఊపిరితిత్తుల ఆరోగ్యానికి చాలా మంచివి. ఇందులో లైకోపిన్ ఉండి ఊపిరితిత్తుల ఇన్ఫ్లమేషన్‌ను తగ్గిస్తుంది. విటమిన్ C, E పుష్కలంగా ఉన్న ఆహారాలు.. నిమ్మకాయ, మామిడికాయ, కమలాపండు, పైనాపిల్, బాదం, సన్‌ఫ్లవర్ సీడ్స్, గోధుమ మొలకలు (Vitamin E కు) మొదలైన ఆహారాలు తీసుకుంటే ఊపిరితిత్తుల ఆరోగ్యానికి అవసరమైన విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. ఒమేగా-3 ఫ్యాటి యాసిడ్లు.. ఫ్యాటీ ఫిష్  (salmon), అవిసె గింజలు, చియా విత్తనాలు మొదలైనవి తీసుకోవాలి. ఇవి ఇన్ఫ్లమేషన్ తగ్గించి ఊపిరితిత్తుల ఫంక్షన్‌ను మెరుగుపరుస్తాయి.  ఔషధ గుణాలు ఉన్న ఆహారాలు.. అల్లం శ్వాసనాళాల కణతులు,  శ్వాసనాళంలో అడ్డంకులు  తొలగించడంలో సహాయపడుతుంది. పసుపులో ఉండే  కర్చుమిన్ వలన శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. తులసి ఆకులు వాడటం వల్ల  బ్రాంకైటిస్, ఆస్థమా వంటి సమస్యలకు ఉపశమనం కలుగుతుంది. పచ్చి ఆకుకూరలు.. పాలకూర, కొర్రగుండ కూర, మునగ ఆకులు మొదలైన ఆకులలో విటమిన్ A, K, ఫోలేట్ పుష్కలంగా ఉంటాయి.  ఊపిరితిత్తుల కణాల పునర్నిర్మాణానికి ఇవి సహాయపడతాయి. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. రోజూ 8-10 గ్లాసుల నీరు తాగడం ద్వారా ముక్కు, శ్వాసనాళాల లోని మ్యూకస్ తొలగిపోతుంది. ధూమపానం చేసే అలవాటు ఊపిరితిత్తులను దెబ్బతీస్తుంది. అందుకే ధూమపానం  నివారించాలి. వ్యాయామం, ప్రాణాయామం ద్వారా ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. రోజులో కొంత సమయం వీటికి కేటాయించాలి.                                         *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే ఈ అలవాట్లే  శ్రీరామ రక్ష..!

  కాలేయం శరీరంలో ఊపిరితిత్తుల కింద భాగంలో ఉండే అవయవం.  కాలేయం ఎంత శుభ్రంగా ఉంటే  అంత ఎక్కువ కాలం జీవించగలుగుతారు.  కాలేయం నుండి విషపూరిత పదార్థాలను తొలగించుకుంటేనే అది సాధ్యం అవుతుంది. రోజువారీ కొన్ని అలవాట్లు ఫాలో అవుతుంటే కాలేయం ఎప్పటికీ ఆరోగ్యంగా ఉంటుంది. దీని వల్ల జీవితకాలం కూడా పెరుగుతుంది.  ఇంతకీ ఆ అలవాట్లు ఏంటో తెలుసుకుంటే.. నీరు తాగాలి.. కాలేయం శుభ్రంగా ఉండాలంటే నీరు బాగా తాగాలి.  నీరు  కాలేయం నుండి విషాన్ని బయటకు పంపుతుంది.  రోజూ కనీసం 8 గ్లాసుల నీరు తాగేలా చూసుకోవాలి.  ఆహారంలో నీటి శాతం ఉన్న పండ్లు,  కూరగాయలు చేర్చుకోవాలి. యాంటీ ఆక్సిడెంట్లు.. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల  కాలేయ ఆరోగ్యం బాగుంటుంది.  బెర్రీలు, బ్రోకలీ,  బచ్చలికూర, పాలకూర వంటి ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు కాలేయ మంటను తగ్గించడంలో సహాయపడుతాయి. కొవ్వులు.. ఆరోగ్యకరమైన కొవ్వులు తీసుకుంటే కాలేయం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అలా కాకుండా చెడు కొలెస్ట్రాల్ కలిగిన ఆహారాన్ని ఎక్కువ తీసుకుంటే కాలేయానికి ఫ్యాటీ లివర్ సమస్య వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇది కాలేయ పని తీరును దెబ్బతీసి కాలేయ ఫెయిల్యూర్ కు దారితీస్తుంది.  అవకాడో,  ఆలివ్ ఆయిల్,  సాల్మన్, మాకేరెల్ వంటి చేపలలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. వెల్లుల్లి.. వెల్లుల్లిని దివ్యౌషధంగా పేర్కొంటారు.  వెల్లుల్లి కాలేయాన్ని శుద్ది చేయడంలో సహాయపడుతుంది.  కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది. గ్రీన్ టీ.. గ్రీన్ టీ లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.  ఇవి కాలేయం మెరుగ్గా పనిచేయడానికి సహాయపడతాయి.  ప్రతి రోజూ ఒకటి లేదా రెండు కప్పుల గ్రీన్ టీని తీసుకుంటే మంచిది. ఫైబర్.. ఫైబర్ అనేది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచే పదార్థం.  ఫైబర్ రిచ్ ఫుడ్స్ తీసుకుంటే కాలేయం కూడా బాగుంటుంది.  తృణధాన్యాలు,  చిక్కుళ్లు,  పండ్లు,  కూరగాయలు బాగా తీసుకుంటే జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుంది.  ఇది కాలేయ పనితీరును కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. పసుపు.. పసుపులో కర్కుమిన్  అనే రసాయనం ఉంటుంది.  ఇది కాలేయాన్ని శుభ్రపరచడంలో సహాయపడుతుంది.  పిత్త ఉత్పత్తిని పెంచుతుంది.   మానాల్సినవి.. మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి చాలా చెడు చేస్తాయనే విషయం తెలిసిందే. అయితే వాటితో పాటు.. ప్రాసెస్ చేసిన ఆహారం,  చక్కెర ఉన్న ఆహారం,  నూనెలు,  ఎక్కువ డీప్ ఫ్రై చేసిన ఆహారాలు మొదలైనవి..  కాలేయాన్ని సంరక్షించుకోవడంలో సహాయవడతాయి.                                              *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

ఇయర్ ఫోన్ లు వాడుతుంటారా?  ఈ నిజాలు తెలుసా?

  ఇయర్ ఫోన్స్ ఇప్పటి ప్రజల జీవనశైలిలో భాగం అయిపోయాయి.  ఉదయాన్నే వాకింగ్,  జాకింగ్ చేస్తున్నా,  ప్రయాణాలు చేస్తున్నా,  ఎవరితో అయినా ఫోన్  మాట్లాడుతున్నా.. ఇలా చాలా సందర్భాలలో ఇయర్ ఫోన్స్ వాడకం ఎక్కువగా ఉంటుంది.  ఇక నిరంతరం ఫోన్ లు మాట్లాడే వృత్తి లేదా వాతావరణంలో ఉండే వారు రోజులో చాలా గంటల సేపు ఇయర్ ఫోన్స్ వాడుతుంటారు.  ఇక డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్ లు రిసీవ్ చేసుకుని మాట్లాడటానికి వీలు లేని వారు కనీసం ఒక చెవికి అయినా ఇయర్ ఫోన్ లేదా ఇయర్ బడ్ పెట్టుకుని మాట్లాడుతూ డ్రైవ్ చేస్తారు.  చాలా మంది రోజులో 10-12 గంటలు ఇయర్ ఫోన్స్ మాట్లాడుతూ గడిపేస్తారంటే ఆశ్చర్యపోనవసరం లేదు. అయితే పెద్ద సౌండ్స్ తో ఇయర్ ఫోన్స్ వాడేవారు కొన్ని నిజాలు తెలుసుకోవాలి. అవేంటంటే.. ఇయర్‌ఫోన్ వాడకం వల్ల వినికిడి ఆరోగ్యంపై ప్రభావం పెరుగుతోంది. "70 డెసిబెల్స్ (dB) కంటే ఎక్కువ శబ్ద స్థాయిలకు ఎక్కువ కాలం గురికావడం శాశ్వత వినికిడి లోపానికి దారితీస్తుంది. అయితే 100 dB కంటే ఎక్కువ శబ్దాలకు అకస్మాత్తుగా గురికావడం తక్షణ చెవుడుకు కారణమవుతుంది." రద్దీగా ఉండే వీధులు,  80-100 dB ట్రాఫిక్, 120 dB కంటే ఎక్కువ బిగ్గరగా ఉండే కచేరీలు లేదా పటాకులు మోత మొదలైన వాటి కారణంగా శబ్ద స్థాయిలు పెరుగుతాయి.  ఇది వినికిడి లోపానికి కారణమవుతుంది. వీటికి తోడు ఇయర్ ఫోన్ ల వాడకం పెరిగితే తీవ్రమైన సమస్యలు వస్తాయి. ఇయర్ ఫోన్స్ నేరుగా చెవి లోకి ధ్వనిని పంపుతాయి, దీని వలన వినికిడి లోపం వచ్చే ప్రమాదం పెరుగుతుంది. చాలా మంది  తెలియకుండానే తీవ్రమైన శబ్దానికి గురవుతారు. తరచుగా ఎక్కువసేపు సంగీతం లేదా కాల్‌లను ఎక్కువసేపు వింటారు. మరికొందరికి సంగీతం అనేది ఎక్కువ శబ్దం పెట్టుకుని ఆస్వాదించడం అనే అలవాటు కూడా ఉంటుంది.  " 60% కంటే ఎక్కువ వాల్యూమ్‌లలో ఇయర్‌ఫోన్‌లను ఎక్కువసేపు ఉపయోగించడం వల్ల దీర్ఘకాలిక నష్టం జరుగుతుంది". రూల్ ఆఫ్ 60 అంటే.. "60 నియమం" అంటే శబ్దాన్ని  60% కంటే తక్కువగా ఉంచడం.  ఇయర్‌ఫోన్ వినియోగాన్ని రోజుకు 60 నిమిషాలకు మించకుండా పరిమితం చేయడం. అదనంగా ఓవర్-ఇయర్ హెడ్‌ఫోన్‌లు సురక్షితమైన ప్రత్యామ్నాయం, ఎందుకంటే అవి ఇన్-ఇయర్ పరికరాలు చేసే విధంగా చెవి లోకి ధ్వనిని లోతుగా ప్రసారం చేయవు. అధిక వాల్యూమ్ నష్టం.. ఎక్కువసేపు 85dm కంటే ఎక్కువ వాల్యూమ్‌లో సంగీతాన్ని వింటే, అది శాశ్వత వినికిడి లోపానికి కారణమవుతుంది. ఇయర్‌ఫోన్‌లను విరామం లేకుండా నిరంతరం ఉపయోగించడం వల్ల చెవికి ఒత్తిడి వస్తుంది, దీని వలన అసౌకర్యం,  తాత్కాలిక వినికిడి లోపం సంభవించవచ్చు. హెడ్‌ఫోన్‌లను ఉపయోగిస్తున్నప్పుడు, ఇయర్‌బడ్‌లు కర్ణభేరికి దగ్గరగా ఉంటాయి. ఇది ధ్వని ఒత్తిడిని తీవ్రతరం చేస్తుంది.  దెబ్బతినే ప్రమాదాన్ని పెంచుతుంది. బిగ్గరగా సంగీతం వినడమే కాకుండా, ఇయర్‌ఫోన్‌లను ఇతరులకు ఇవ్వడం,  ఇతరులవి తీసుకుని వాడటం వంటివి  లేదా ఎక్కువసేపు వాడటం వల్ల కూడా చెవిలో బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది.                                            *రూపశ్రీ.   గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

స్ట్రాబెర్రీలు తినడం వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయని తెలుసా?

   స్ట్రాబెర్రీ ఒక రుచికరమైన,  ఆరోగ్యకరమైన పండు. ఇది "సూపర్ ఫుడ్" కంటే తక్కువ కాదు.  ప్రత్యేక రుచి,  ఆరోగ్య ప్రయోజనాల విషయంలో దీనికంటూ ఓ రేంజ్ ఉంది. స్ట్రాబెర్రీలను ఎక్కువగా చల్లని ప్రాంతాల్లో పండిస్తారు.  అమెరికా,  యూరప్‌లలో ఎక్కువగా పండిస్తారు. భారతదేశంలో దీనిని ప్రధానంగా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్,  మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలలో సాగు చేస్తారు. స్ట్రాబెర్రీలలో విటమిన్ సి, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు,  ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మొత్తం ఆరోగ్యానికి మేలు చేస్తాయి. స్ట్రా బెర్రీలు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నయాని అంటున్నారు ఆరోగ్య  నిపుణులు.  అవేంటో తెలుసుకుంటే.. రోగనిరోధక శక్తి.. స్ట్రాబెర్రీలలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది వ్యాధులతో పోరాడే శరీర సామర్థ్యాన్ని పెంచడంలో సహాయపడుతుంది. ఇది జలుబు, దగ్గు, ఇతర కాలానుగుణ వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడుతుంది. చర్మం.. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి,  ఎలాజిక్ ఆమ్లం చర్మ కణాలను ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తాయి. ఇది ముడతలను తగ్గించడంలో, మచ్చలను తగ్గించి చర్మాన్ని కాంతివంతం చేయడంలో,  చర్మ ఛాయను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. గుండె ఆరోగ్యం..  స్ట్రాబెర్రీలలో మంచి మొత్తంలో పొటాషియం,  యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుతాయి.  గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఇది రక్తపోటును నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది  జీర్ణవ్యవస్థ.. స్ట్రాబెర్రీలలో  ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.  మలబద్ధకం నుండి ఉపశమనం పొందడంలో సహాయపడతాయి. ఇది కడుపుని తేలికగా ఉంచుతుంది.  జీర్ణక్రియను సరిగ్గా చేస్తుంది. బరువు.. స్ట్రాబెర్రీలలో కేలరీలు తక్కువగా ఉంటాయి.  ఫైబర్ అధికంగా ఉంటుంది, ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇది ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంచుతుంది. అతిగా తినకుండా నిరోధిస్తుంది. కంటి చూపు.. ఇందులో ఉండే విటమిన్ సి,  యాంటీఆక్సిడెంట్లు కళ్ళను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ఇది కంటిశుక్లం,  ఇతర కంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. క్యాన్సర్‌.. స్ట్రాబెర్రీలలో ఎలాజిక్ ఆమ్లం, ఇతర యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలో క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించడంలో సహాయపడతాయి. ఇది శరీరాన్ని నిర్విషీకరణ చేస్తుంది.  వ్యాధుల నుండి రక్షిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలు.. ఇది తక్కువ గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది మధుమేహ రోగులకు సురక్షితమైన,  ఆరోగ్యకరమైన పండు.                                          *రూపశ్రీ.   గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

ప్రోటీన్ పౌడర్లు కాదు.. ఈ డ్రింక్ 15రోజులు తాగితే చాలు.. శరీరం ఉక్కులా మారుతుంది!

  ఎప్పుడూ అలసటగా,  బలహీనంగా ఉంటుందా? బద్దకంగానూ,  మోకాళ్లలో నొప్పితో ఇబ్బంది పడుతున్నారా? వీటిని అధిగమించడానికి  జిమ్ కు వెళ్తున్నా, మార్కెట్‌లో లభించే ఖరీదైన ప్రొటీన్ పౌడర్‌లు తీసుకుంటున్నా అంత ఫిట్ గా అనిపించడం లేదా?   ఈ సమస్యలను గనుక ఎదుర్కొంటున్నట్లయితే, ప్రోటీన్ తీసుకునే విధానాన్ని మార్చుకోవాలి. నిత్యం బలహీనంగా ఉంటే శరీరంలో ప్రాణం ఉండదని, మోకాళ్లలో నొప్పులు వస్తుంటే మంచి ప్రోటీన్ అవసరం అని అర్థం. ఇంట్లోనే ఆరోగ్యకరమైన ప్రొటీన్‌ను ఎలా తయారు చేసుకోవచ్చో,  దాని ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుంటే.. ప్రోటీన్ పౌడర్ కు కావలసిన వస్తువులు.. 60 గ్రాముల వేయించిన శనగలు 2 ఖర్జూరాలు. 1 అపటిపండు 1 గ్లాసు పాలు  బెల్లం రుచికి సరిపడా తయారువిధానం.. ముందుగా వేయించిన శనగలను మిక్సీలో వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి. ఇలా తయారుచేసిన పొడిని సత్తు అని అంటారు. ఇది బీహార్ లో ఫేమస్.  ఇందులో   ప్రోటీన్, కాల్షియం,  ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఈ  పొడిలో అరటిపండు, ఖర్జూరం, బెల్లం, పాలు వేసి కలపాలి.  అంతే ఎంతో పోషకరమైన ప్రోటీన్ డ్రింక్ సిద్దమైనట్టే. ప్రయోజనాలు.. ఈ మిశ్రమాన్ని కేవలం 15 రోజుల పాటు తీసుకోవడం ద్వారా అద్భుతమైన ప్రయోజనాలను పొందుతారు.  బలహీనతతో బాధపడుతున్నవారు దీనిని తప్పనిసరిగా తీసుకోవాలి. ప్రొటీన్లే కాకుండా శరీర సామర్థ్యం పెరగడానికి  అవసరమైన అన్ని పోషకాలు దీంట్లో లభిస్తాయి. ఈ శక్తివంతమైన ప్రోటీన్ డ్రింక్ లో  కాల్షియం వల్ల  కేవలం 15 రోజుల్లోనే  శరీరంలో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. జిమ్ కు వెళ్లే అలవాటున్నా,వర్కౌట్లు చేస్తున్నా ఈ డ్రింక్  కు తీసుకుంటూ ఉంటే శరీరం దృడంగా మారుతుంది. ఎముకలు, కండరాలలో బలం పుంజుకుంటుంది. శరీరం ఉక్కులా మారుతుంది.                                                 *నిశ్శబ్ద. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

విటమిన్-సి లోపం తొలగించి రోగనిరోధక శక్తిని పెంచే సూపర్ ఫుడ్స్ ఇవి..!

శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే చాలా రకాల విటమిన్లు అవసరం అవుతాయి. వాటిలో విటమిన్-సి ముఖ్యమైనది.  విటమిన్-సి శరీరానికి రోగనిరోధక శక్తిని ఇస్తుంది.  జబ్బు పడినప్పుడు విటమిన్-సి ఆధారిత పండ్లు, కూరగాయలు తీసుకుంటే చాలా తొందరగా కోలుకుంటారు.  రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు కూడా విటమిన్-సి ఆధారిత పండ్లు, కూరగాయలు బాగా తీసుకుంటే రోగనిరోధక శక్తి బలపడుతుంది.  సాధారణంగా విటమిన్-సి లోపం రావడం అరుదే అయినప్పటికీ..  ఈ లోపం ఏమాత్రం ఉన్నా ఆరోగ్యం తొందరగా దెబ్బతింటుంది. విటమిన్-సి లోపం తొలగాలన్నా,  రోగనిరోధక శక్తి పెరగాలన్నా ఈ కింది సూపర్ ఫుడ్స్ తప్పనిసరిగా తినాలి. బ్రోకలీ.. బ్రోకలీలో విటమిన్-సి మోతాదు ఎక్కువగా ఉంటుంది.  అలాగే కాల్షియం,  ఫైబర్, పొటాషియం, విటమిన్-ఎ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కూడా ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఉసిరి.. ఉసిరికాయలు విటమిన్-సి కి చాలా మంచి మూలం.  నిమ్మకాయలో ఉండే విటమిన్-సి కంటే 10 రెట్లు విటమిన్-సి  ఉసిరికాయలలో ఉంటుంది.  ఉసిరికాయను పొడి రూపంలో తీసుకున్నా,  జ్యూస్ రూపంలో తీసుకున్నా.. అందుబాటులో ఉన్నప్పుడు నేరుగా రోజూ ఒక కాయను పచ్చిగానే తిన్నా చాలా ప్రయోజనాలు చేకూరుస్తుంది.   రోగనిరోధక శక్తిని బలపరచడమే కాకుండా జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. చర్మం మెరిచేలా చేస్తుంది. చర్మ సంబంధ సమస్యలు తొలగిస్తుంది. నారింజ.. నారింజ సిట్రస్ పండ్లలో ప్రముఖమైనది. నారింజను తినడం వల్ల  రోగనిరోధక శక్తి అద్బుతంగా పెరుగుతుంది.  ప్రతిరోజూ ఒక నారింజ పండు తింటుంటే వృద్దాప్యం త్వరగా రాదట.  జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుందట.  తెల్ల జుట్టు సమస్య అస్సలే ఉండదని ఆహార నిపుణులు అంటున్నారు.  నారింజలో పైబర్,  విటమిన్-ఎ, పొటాషియం, విటమిన్-సి ఉంటాయి.    ఇన్పెక్షన్ ప్రమాదాలు తగ్గించడంలో సహాయపడుతుంది. క్యాప్సికం.. క్యాప్సికంలో విటమిన్-సి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.  ఇందులో విటమిన్-సి,  విటమిన్-ఎ,  బీటా కెరోటిన్ ఉంటాయి.  దీన్ని ఆహారంలో చేర్చుకోవడం వల్ల విటమిన్-సి లోపం తొలగిపోతుంది.  దీన్ని సలాడ్ లలోనూ,  వెజిటబుల్ జ్యూస్ లోనూ జోడించుకోవచ్చు. బొప్పాయి.. బొప్పాయిలో విటమిన్-సి, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి.  బొప్పాయి తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.  ఇధి మాత్రమే కాకుండా ఇది శరీరం డిటాక్స్ కావడంలో సహాయపడుతుంది. అంటే.. శరీరంలో ఉన్న వ్యర్థపదార్థాలు, మలినాలు, విష పదార్థాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది.                                      *రూపశ్రీ గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...  

ఈ టిప్స్ తో నెలరోజుల్లో కంటి చూపు ఊహించనంతగా మెరుగవుతుంది!

నేటి డిజిటల్ యుగంలో స్క్రీన్‌లు మన జీవితంలో అంతర్భాగంగా మారాయి. వర్క్ చేయడం నుండి సరదాగా సమయం గడపడం వరకు మొబైల్, సిస్టమ్, టీవీ, సినిమా హాల్ ఇలా ఎక్కడ చూసినా స్కీన్ కాస్తా ఫ్రంట్ ఆఫ్ ద హుమన్ గా మారింది.  దీన్ని దాటి, దీన్ని కాదని ఏ పని చేయలేని పరిస్థితి నెలకొంది. మంచి అయినా, చెడు అయినా ఇప్పుడు మొత్తం ఈ స్క్రీన్ నుండే అందుతోంది. అందుకే  గత ఇరవై, ముఫ్పై ఏళ్ళ కిందట లేని కంటి సమస్యలు అన్నీ ఇప్పుడు వస్తున్నాయి. సుమారు 10మందిలో 9మందికి అంతో ఇంతో దృష్టిలోపం సమస్య ఉంటోంది. నేటికాలంలో కలుషితమవుతున్న, రసాయనాల నిలయమైన ఆహారం, నీరు, గాలి, పరిసరాలు కూడా ఇందుకు కారణం. దీనికి తోడు జీవనశైలి మరీ దారుణంగా ఉంటుంది కొందరికి. రాత్రెప్పుడో మూడు, నాలుగు గంటలవరకు మొబైల్, సిస్టమ్ లో గడిపి, ఆ తరువాత నిద్రపోతారు. ఉదయం ఎప్పుడో 9 గంటలకు లేస్తారు. ఆ సమయంలో అదరాబదరా తయారయ్యి ఆఫీసులకు,కాలేజీలకు పరిగెడతారు. ఉదయం అల్పాహారం ఈ కారణంగానే చాలామందికి స్కిప్ అవుతుంది. ఆకలేస్తే పాస్ట్ ఫుడ్ సెంటర్ల మీద పడి అడ్డమైన గడ్డి తింటారు. ఈ అన్ని కారణాల వల్లా కొన్ని కామన్ సమస్యలు ఏర్పడుతున్నాయి చాలామందిలో. వీటిలో పైన ప్రస్తావించిన దృష్టిలోపం సమస్య ప్రధానమైనది.  మన కళ్ల ఆరోగ్యం ప్రమాదంలో ఉంది. నిజానికి, పిల్లలు  పెద్దలు ఇద్దరూ ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లతో ఎక్కువ సమయం గడుపడం వల్లే దృష్టిలోపం సమస్య ఏర్పడుతోందనేది వాస్తవం. ఇది చిన్న వయస్సులోనే కంటి సమస్యలకు దారితీస్తుంది. మధుమేహం, థైరాయిడ్ వంటి వ్యాధులు డయాబెటిక్ రెటినోపతి, మాక్యులర్ ఎడెమా, కంటిశుక్లం  గ్లాకోమా వంటి దృష్టి సమస్యలకు ఈ అలవాటు దారితీయవచ్చు. ఇలాంటి పరిస్థితులలో  కంటి చూపును పెంచే కొన్ని టిప్స్ ఫాలో అయ్యి దృష్టిలోపాన్ని సరిదిద్దుకోవడం మంచిది. దృష్టి సామర్థ్యం పెరగడానికి సింపుల్ గా అందరూ చేయగలిగే మూడు టిప్స్ ఉన్నాయి. వీటిని క్రమం తప్పకుండా చేస్తే కేవలం నెలరోజుల్లోపు దృష్టిసామర్థ్యం ఎంతో పెరుగుతుంది.  ఆ టిప్స్ ఏంటో  తెలుసుకుంటే..   అరచేతులతో అద్బుతం.. ఉదయం లేవగానే అరచేతులు రుద్దుకుని కళ్ళకు అద్దుకోవడం చాలామంది చేస్తారు. నిజానికి ఇది దృష్టి సామర్యాన్ని పెంచుతుంది. అరచేతులలో నరాలు, కళ్ల చుట్టూ ఉన్న నరాలకు మధ్య జరిగే సున్నితమైన స్పర్శ  కంటి నరాలను ఉత్తేజం చేస్తుంది.  అరచేతులు వెచ్చగా మారే వరకు  గట్టిగా రుద్దాలి.తరువాత వీటిని  మూసిన కనురెప్పలపై సున్నితంగా  ఉంచాలి. ఈ సందర్భంలో ఎలాంటి ఒత్తిడి ఉపయోగించకూడదు.  చేతుల వెచ్చదనం  కళ్లలోకి ప్రసారమవుతుంది. ఇది కండరాలకు విశ్రాంతినిస్తుంది. నరాలనుకు శక్తిని ఇస్తుంది. రెప్పలు చేసేమాయ.. కనురెప్పలు వాల్చకుండా తదేకంగా సిస్టమ్ లేదా మొబైల్ వైపు చూడటం వల్ల కళ్లు చాలా తొందరగా అలసిపోతాయి. కనురెప్పలు ఆర్పడమనే వ్యాయామం ఇందుకు మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ వ్యాయామం సులభంగానూ, ప్రభావవంతంగా ఉంటుంది. దీన్ని ఆచరించాలంటే హాయిగా కళ్లు తెరిచి కూర్చోవాలి. దాదాపు 10 సార్లు వేగంగా రెప్పవేసి, ఆపై 20 సెకన్ల పాటు విశ్రాంతి తీసుకుంటూ మీ శ్వాసపై దృష్టి సారిస్తూ కళ్లు మూసుకోవాలి. దీన్ని సుమారు 5 సార్లు రిపీట్ చేయండి. ఆరుతూ, వెలుగుతూ ఉండే విద్యుత్ దీపాలు చూడటం, వెలుగుతున్న దీపాన్ని తదేకంగా చూడటం వంటి వ్యాయామాలు  కళ్లను లూబ్రికేట్ చేయడంలో సహాయపడతాయి.  ఎక్కువ సేపు స్క్రీన్‌లను చూస్తూ ఉండటం వల్ల కలిగే ఒత్తిడిని తగ్గిస్తాయి. కంటి భ్రమణం..  తలను కదల్చకుండా కళ్ళను సవ్యదిశలో కదిలించి, ఆపై ప్రతి దిశలో 5-10 నిమిషాలు అపసవ్య దిశలో ఉంచాలి. సింపుల్ గా చెప్పాలంటే కళ్ళను క్లాక్ వైజ్ లో తిప్పాలి, ఆ తరువాత అపసవ్య దిశలో ఇదే విధంగా చేయాలి. ఇలా  కళ్లను తిప్పడం వల్ల కళ్ల కండరాల దృఢంగా మారతాయి.  రక్త ప్రసరణ పెరుగుతుంది, ఇది కంటి చూపును మెరుగుపరుస్తుంది.                                                                     *నిశ్శబ్ద. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

ఖాళీ కడుపుతో మొలకెత్తిన పెసలు తింటే కలిగే లాభాలేంటంటే!

భారతీయుల ఆహారం చాలా విశిష్టమైనది. ఇందులో పేర్కొన్న ప్రతి ఆహారం వెనుకా  ఒక ప్రత్యేక కారణం, బోలెడు ప్రయోజనాలు ఉంటాయి. చాలామంది ఆరోగ్య స్పృహతో తినే ధాన్యాలలో పెసరపప్పు కూడా ఒకటి. పెసరపప్పు ఆహారంగానే కాకుండా ఆయుర్వేదంలోనూ, వైద్యంలోనూ మంచి ఔషదంగా కూడా పరిగణిస్తారు. అయితే  చాలామంది ధాన్యాలను మొలకెత్తించి తినడం చూస్తుంటాం. శనగలు, పెసలు, బొబ్బర్లు వంటి ధాన్యాలు తరచుగా తింటూ ఉంటారు. అయితే మొలకెత్తిన పెసలను ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినడం వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలుంటాయని ఆహార నిపుణులు అంటున్నారు.  ఈ లాభాలేంటో తెలుసుకుంటే.. మొలకెత్తిన పెసలు  బరువు తగ్గించడంలో  సహాయపడుతాయి.  రోజూ ఉదయాన్నే మొలకెత్తిన పెసలు తినడం ద్వారా ఈజీగా బరువు తగ్గవచ్చు. ఇందులో ఫైబర్ అధిక మొత్తంలో ఉంటుంది. ఇది తొందరగా ఆకలి వేయకుండా కడుపును ఎక్కువసేపు నిండుగా ఉంచుతుంది.  ఇది మాత్రమే కాదు.. మొలకెత్తిన పెసలలో కేలరీలు చాలా తక్కువ ఉంటాయి. ఈ కారణంగా ఇవి బరువు పెరగనీయవు. ఇక మొలకెత్తిన పెసలు  కంటి చూపును మెరుగుపరచడంలో కూడా సహాయపడతాయి ఎందుకంటే ఇందులో విటమిన్ 'A' ఉంటుంది. ఇది కాకుండా  ఉబ్బరం,  కడుపులో యాసిడ్లు ఏర్పడటం వంటి సమస్యలలో  కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచడంలో  మొలకెత్తిన పెసలు  సహాయపడుతాయి.  అధిక గ్యాస్, అజీర్ణం,  ఉబ్బరంతో బాధపడేవారు మొలకెత్తిన  పెసలను  తినవచ్చు. ఇది  బలహీనమైన రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది.  మొలకెత్తిన పెసలను  తీసుకోవడం వల్ల రోజంతా  శక్తివంతంగా ఉండచ్చు.  దీన్ని తినడం వల్ల సోమరితనం లేదా బద్దకం దరిచేరదు. మరీ ముఖ్యంగా మొలకెత్తిన పెసలు  శరీరానికి చలువ చేస్తాయి. దీని కారణంగా వేసవిలో వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి చలువ చేస్తాయి. వేసవి తాపం నుండి శరీరాన్ని రక్షిస్తాయి.                                                  *నిశ్శబ్ద. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...