చైనా ఓపెన్ కు సైనా దూరం
posted on Nov 1, 2012 @ 11:52AM
బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ చైనా ఓపెన్‌కు దూరం కానుంది. నవంబర్ రెండో వారంలో ప్రా రంభం కానున్న ఈ టోర్నీలో తాను ఆడబోవడంలేదని సై నా ప్రకటించింది. కుడి మోకాలి నొ ప్పితో కొంత అసౌకర్యంగా ఉన్నందున విశ్రాంతి తీసుకోనున్నట్టు తెలిపింది. 'మోకాలు కొంత అసౌకర్యంగా ఉం ది. అంటే అది డాక్టర్ దగ్గరకు పరిగెత్తాల్సినంత సీరియ స్ విషయమేమీ కాదు. కొద్దిగా ఫిజియోథెరపీ చేస్తే చాలు డెన్మార్క్ ఓపెన్‌లో విజయం సాధించడం, ఆ త ర్వాత ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్‌కు చేరడం ఎంతో సంతోషాన్నిచ్చింది. ఒలింపిక్స్‌లో పతకం గెల్చినప్పటినుంచీ నాలో ఆత్మవిశ్వాసం ఎంతో పెరిగిందని సైనా చెప్పింది.