షర్మిలకు బర్త్ డే విషెస్ చెప్పని జగన్.. కారణమేంటంటే?
Publish Date:Dec 17, 2025
జగన్.. సొంత చెల్లికి కనీసం బర్త్ డే విషెస్ కూడా చెప్పని వ్యక్తిగా మరోసారి వార్తలలో నిలిచారు. ఔను జగన్ చెల్లెలు షర్మిల బుధవారం (డిసెంబర్ 17) తన జన్మదినం జరుపుకున్నారు. జగనన్న వదిలిన బాణాన్ని అంటూ తన అన్న కోసం సుదీర్ఘ పాదయాత్ర చేసి, 2019 ఎన్నికలలో జగన్ విజయానికి తన వంతు దోహదం చేసిన చెల్లిని అధికారం చేపట్టిన తరువాత జగన్ దూరం పెట్టారు. ఆస్తుల పంచా యితీతో పాటుగా రాజకీయంగా తనకు పోటీ అవుతుందన్న భయంతోనే జగన్ షర్మిలను దూరం పెట్టారన్న ప్రచారం అప్పట్లో జోరుగా సాగింది.
దీంతో షర్మిల తన మకాం హైదరాబాద్ కు మార్చి కొంత కాలం వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రిగా తెలంగాణ రాజకీయాలలో కీలక భూమిక పోషించారు. అయితే.. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమె కాంగ్రెస్ గూటికి చేరి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. అంతే కాకుండా గత అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ తరఫున విస్తృతంగా ప్రచారం కూడా చేశారు. 2019 ఎన్నికలలో జగన్ విజయంలో షర్మిల కీలక పాత్ర పోషిస్తే.. 2024 ఎన్నికలలో జగన్ ఓటమిలో కూడా ఆమె తన వంతు పాత్ర పోషించారని పరిశీలకులు విశ్లేషణలు కూడా చేశారు. ఈ పోలిటికల్ డిఫరెన్సెస్ కు తోడు.. జగన్ షర్మిల మధ్య ఆస్తి వివాదాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా సరస్వతి పవర్ వాటాల బదలీ వ్యవహారంలో వీరి మధ్య ట్రైబ్యునల్ లో కేసు కూడా నడుస్తోంది.
అది పక్కన పెడితే.. కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలిగా షర్మిల తనవంతు పాత్ర పోషిస్తున్నారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం, వైసీపీలపై ఘాటు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ విషయంలో ఆమె తాను ప్రాతినిథ్యం వహిస్తున్న కాంగ్రెస్ గొంతును బలంగా వినిపిస్తున్నారు. అందులో తప్పుపట్టాడినికి ఏమీ లేదు. కాగా షర్మిల జన్మదినం సందర్భంగా కూటమి నేతలు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. వారికి షర్మిల ధన్యవాదాలు తెలుపుతూ బదులిచ్చారు కూడా.
అయితే సొంత అన్న జగన్ షర్మిలకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేయకపోవడం సరికాదని వైసీపీ వర్గాలలోనే చర్చ జరుగుతోంది. తెల్లారి లేస్తే గాంధీ డైనాస్టీ అంటూ.. సోనియా, రాహుల్, ప్రియాంకలపై విమర్శలతో విరుచుకుపడే ప్రధాని నరేంద్ర మోడీ వారి జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేస్తుంటారు. అంతెందుకు నిత్యం చంద్రబాబుపై ఏక వచన ప్రయోగంతో విమర్శలు గుప్పించే జగన్ కు కూడా చంద్రబాబు జగన్ పుట్టిన రోజు సందర్భంగా బర్త్ డే విషెస్ చెప్పారు. తద్వారా వారంతా విభేదించడం, భిన్నాభిప్రాయం కలిగి ఉన్నంత మాత్రాన వ్యక్తిగత వైరం ఉండనవసరం లేదని చాటారు. కానీ జగన్ మాత్రం రాజకీయంగానైనా, కుటుంబ పరంగానైనా సరే తనతో విభేదించిన వారిని శత్రువులుగా చూస్తారనడానికి సొంత చెల్లికి బర్త్ డే విషెస్ తెలపకపోవడాన్ని ఉదాహరణగా చూపు తున్నారు పరిశీలకులు.
మూడో విడతలోనూ ‘హస్తం’దే పై చేయి!
Publish Date:Dec 17, 2025
మూడో విడత సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభంజనం
Publish Date:Dec 17, 2025
ఉపఎన్నికలకు భయపడే అనర్హత వేటు వేయడం లేదు : కేటీఆర్
Publish Date:Dec 17, 2025
పులివెందులలోనూ కదులుతున్న వైసీపీ పునాదులు!?
Publish Date:Dec 17, 2025
రేవంత్ రెండేళ్ల పాలనకు పాస్ మార్కులే!
Publish Date:Dec 16, 2025
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత దాదాపు దశాబ్దకాలం బీఆర్ఎస్ (టీఆర్ఎస్) పాలన సాగింది. 2023 అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 2023 డిసెంబర్‌లో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. రేవంత్ సీఎంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రెండేళ్లు పూర్తయ్యింది. ఈ రెండేళ్ల కాలంలో సంక్షేమం, అభివృద్ధితో పాటుగా అంతర్జాతీయ వేదికలపై తెలంగాణ స్థానాన్ని బలోపేతం చేయడం వంటి అనేక చర్యలతో రేవంత్ ప్రభుత్వం మంచి మార్కులే సంపాదించింది.
రేవంత్ సర్కార్ అధికారంలోకి రాగానే ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలుకు చర్యలు చేపట్టింది. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించింది. అదే విధంగా గృహ జ్యోతి కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నది. ఈ రెండూ మహిళకు సంతృప్తి కలిగించాయనడంలో సందేహం లేదు. దీంతో చాలా వరకూ మహిళలు రేవంత్ సర్కార్ పట్ల సానుకూలంగా ఉన్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఉచిత బస్సు ప్రయాణం పట్టణ, గ్రామీణ అన్న తేడా లేకుండా మహిళాలోకం యావత్తూ హర్షం వ్యక్తం చేస్తున్నది. పరిపాలనలో పారదర్శకత, అవినీతిపై కఠిన వైఖరి కారణంగా ప్రభుత్వ కార్యకలాపాల్లో వేగం పెరిగిందన్నది కూడా జనాభిప్రాయంగా వ్యక్తం అవుతోంది. ఈ సానుకూలతే జూబ్లీ బైపోల్ లో కాంగ్రెస్ అభ్యర్థి సునాయాస విజయానికి కారణమైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
అయితే అంత మాత్రాన రేవంత్ సర్కార్ పట్ల జనంలో ఆల్ ఈజ్ వెల్ భావన ఉందని కాదు. ఆయన పాలన పట్ల సానుకూలత, వ్యతిరేకత కూడా సమపాళ్లలో వ్యక్తం అవుతున్నాయి. అంటే కొంచం ఇష్టం, కొంచం కష్టం అన్నట్లుగా ప్రజలు రేవంత్ రెండేళ్ల పాలనను అభివర్ణిస్తున్నారు. ప్రధానంగా రాష్ట్ర ప్రగతి, పురోగతికి ఆర్థిక సవాళ్లు ప్రతిబంధకంగా మారాయి. అయితే ఈ పరిస్థితి గత బీఆర్ఎస్ ప్రభుత్వ ఆర్థిక అరాచకత్వం కారణంగా వారసత్వంగా వచ్చిందని చెప్పాలి.
ఈ అప్పుల భారం కారణంగానే సంక్షేమ పథకాల పథకాల అమలు, అభివృద్ధి పనుల కోసం నిధుల సమీకరణ కష్ట సాధ్యంగా మారింది. పథకాల అమలు కోసం నిధులు సమకూర్చుకునేందుకు ప్రభుత్వం అప్పులు తేవడం, అలాగే భూములు అమ్మడం వంటి నిర్ణయాలు అనివార్యంగా తీసుకోవలసి వస్తున్నది. ఈ క్రమంలోనే ప్రభుత్వం ఆదాయ సమీకరణ కోసం చేపట్టిన కంచన్‌బాగ్ భూముల విక్రయం, ‘హిల్ట్ పాలసీ వంటి వాటిపై ప్రతిపక్షం నుంచే కాకుండా ప్రజల నుంచి కూడా వ్యతిరేకత ఎదురైంది. విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక పోతే రేవంత్ ఎన్నికలకు ముందు చెప్పిన ఆరు గ్యారంటీలలో భాగమైన సామాజిక పింఛన్ల పెంపు, తులం బంగారం హామీ వంటివి అమలు కాకపోవడం కూడా రేవంత్ సర్కార్ పై విమర్శలకు కారణమయ్యాయని చెప్పారు. మూసీ ప్రక్షాళన, ఫ్యూచర్ సిటీ, డిసెంబర్ 8, 9తేదీల్లో నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ ల పట్ల సానుకూలత వ్యక్తం అవుతున్నా, వాటి ఫలితాలు ఇప్పుడే అంచనా వేయడం కష్టం.
ఇక పల్లెలలో రేవంత్ పాలనపై, మరీ ముఖ్యంగా రైతాంగంలో ఒకింత తక్కువ సానుకూలత వ్యక్తం అవుతోంది. ముఖ్యంగా విద్యుత్ కోతలు రైతాంగంలో రేవంత్ సర్కార్ పట్ల వ్యతిరేకతకు కారణమౌతున్నాయని అంటున్నారు. సీఎంగా రేవంత్ రెడ్డి రెండేళ్ల పాలనలో ఆర్థిక సవాళ్లు, రాజకీయ పరిమితులు ఉన్నప్పటికీ వాటిని అధిగమిస్తూ ప్రజలకు చేరువ అయ్యిందనే చెప్పాలి. రైతంగంలో ఉన్న వ్యతిరేకతను మినహాయిస్తే రేవంత్ రెండేళ్ల పాలనకు మంచి మార్కులే పడతాయని పరిశీలకులు అంటున్నారు. అయితే.. రేవంత్ సర్కార్ బ్రహ్మాండం, అద్భుతం అన్న ఫీలింగ్ కూడా వ్యక్తం కావడం లేదు. రానున్న మూడేళ్ల కాలంలో రేవంత్ సర్కార్ తీసుకునే నిర్ణయాలు, సంక్షేమ, అభివృద్ధి ఎజెండాతో ఎలా ముందుకు సాగుతారు అన్నది చూడాల్సి ఉంది.
తెలంగాణ భవన్ కు కేసీఆర్.. పంచాయతీ ఫలితాల ప్రభావమేనా?
Publish Date:Dec 15, 2025
కమలానికి కిషన్ మార్క్.. చీడ పట్టిందా?
Publish Date:Dec 13, 2025
గ్లోబంత సంబురం.. పెట్టుబడుల స్వర్గధామం
Publish Date:Dec 10, 2025
జాతీయ మీడియా టార్గెట్ కేంద్ర కేబినెట్ లోని దక్షిణాది మంత్రులేనా?
Publish Date:Dec 9, 2025
మాట మార్చిన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్
Publish Date:Aug 28, 2025
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు 75 ఏళ్లకు రిటైర్ అవ్వాలని వ్యాఖ్యానించిన ఆర్ఎస్ఎస్ చీఫ్ ఇవాళ మాట మార్చారు. 75 ఏళ్లకు రిటైర్ అవ్వాలని నేను ఎవరికీ చెప్పలేదు అన్నారు. 75 ఏళ్ల తర్వాత కూడా చురుగ్గా పనిచేసే శక్తి ఉందని ఆయన తెలిపారు.సంఘ్ ఎలా చెప్తే అలా నడుచుకుంటామని వెల్లడించారు.
కేంద్రం, ఆర్‌ఎస్‌ఎస్ మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ స్పష్టం చేశారు. . రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వందేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. కొన్ని విషయాల్లో అభిప్రాయ బేధాలు ఉండొచ్చు.. వివాదం కాదంటూ చెప్పుకొచ్చారు. దేశ ప్రయోజనాలే ఇద్దరి ప్రాధాన్యతగా పేర్కొన్న మోహన్ భగవత్.. బీజేపీ అధ్యక్షుడి ఎన్నికను ఆర్‌ఎస్‌ఎస్ శాసించదన్నారు. ‘మేం సలహా ఇవ్వగలం .. తుది నిర్ణయం వారిదేని తెలిపారు.
నూతన విద్యా విధానానికి మేం మద్దతిస్తున్నాం. ఇంగ్లీష్ నేర్చుకోవడంలో తప్పులేదు’’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ తరఫున ఆర్‌ఎస్‌ఎస్ నిర్ణయాలు తీసుకుంటుందని ప్రతిపక్షాల నుండి వస్తున్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్రాలతో తమకు మంచి సమన్వయం ఉందని మోహన్ భగవత్ వెల్లడించారు.
రాహుల్ టార్గెట్ గా అరవింద్ విమర్శల వర్షం.. మర్మమేంటంటే?
Publish Date:Aug 28, 2025
కల్వకుంట్ల వారసుల సెపరేట్ అజెండాలు.. క్యాడర్లో కన్ఫ్యూజన్
Publish Date:Jul 25, 2025
సీబీఎన్.. ఐటీ ఇండియన్ ఆఫ్ ది మిలీనియం!
Publish Date:Apr 19, 2025
కడప మహానాడులో బాంబులు పేలనున్నాయా..?
Publish Date:Apr 8, 2025
జాగ్రత్త అమ్మాయిలను ఎప్పుడూ ఈ 7 ప్రశ్నలు అడగకండి..!
Publish Date:Dec 17, 2025
నేటి కాలంలో అమ్మాయిలు అబ్బాయిలతో సహా అన్ని రంగాలలో రాణిస్తున్నారు. అన్ని పనులు చేయగలుగుతున్నారు. కొన్ని సందర్బాలలో అబ్బాయిల కంటే ధైర్యాన్ని చూపగలుగుతున్నారు. అయినా సరే అమ్మాయిల విషయంలో సమాజం నుండి ఇంటి వరకు ప్రతి చోట ఒక చిన్నతనం కనిపిస్తుంది. కొన్ని ప్రశ్నలు అమ్మాయిలను చాలా అసౌకర్యానికి గురి చేస్తుంటాయి. అమ్మాయిలను ఎప్పుడు అడగకూడని ప్రశ్నలు కొన్ని ఉన్నాయి. వీటిని అడగకుండా ఉండటం వల్ల అమ్మాయిల గౌరవాన్ని కాపాడటమే కాకుండా వారి మానసిక స్థితిని కూడా కాపాడిన వాళ్లమవుతాము. ఇంతకీ అమ్మాయిలను ఎప్పుడూ అడగకూడదని ప్రశ్నలేంటి? ఆ ప్రశ్నలను ఎందుకు అడగకూడదు? తెలుసుకుంటే..
శరీరం గురించి..
అమ్మాయిలు లావుగా ఉండటం లేదా చాలా సన్నగా ఉండటం చాలామందిలో ఉంటుంది. ఇది పైకి కనిపించే విషయమే. ఎప్పుడైనా సరే అమ్మాయిలను కామెడీ కోసం లేదా సీరియస్ గా అయినా శరీర ఆకృతి గురించి, బరువు గురించి అస్సలు అడగకూడదు. ఇంత లావుగా ఉన్నావేంటి.. లేదా ఇంత సన్నగా ఉన్నావేంటి? వంటి ప్రశ్నలు ఎప్పుడూ వేయకూడదు. ఇది బాడీ షేమింగ్ చేయడం కిందకు వస్తుంది. ఇలా చేయడం వల్ల అమ్మాయిల ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. శరీరం లావుగా లేదా సన్నగా ఉండటానికి చాలామంది అన్ని జాగ్రత్తలు తీసుకున్నా హార్మోన్స్ ప్రాబ్లమ్ వల్ల అలా ఉంటారు. దీనికి కామెంట్ చేస్తూ ప్రశ్నించడం తప్పు.
పిల్లలు..
పెళ్లైన ప్రతి స్త్రీ కి ఎదురయ్యే ప్రశ్న పిల్లల గురించి. కొత్తగా పెళ్లైన దగ్గర నుండి పిల్లలు కలగడం ఆలస్యమయ్యే వారి వరకు ఎప్పుడూ పిల్లలను ఎప్పుడు కంటావ్ అని అడుగుతారు. పిల్లలను కనాలనే నిర్ణయం కేవలం అమ్మాయిలది మాత్రమే కాదు.. వారి కుంటుంబానిది, మరీ ముఖ్యంగా భర్త కూడా దీనికి కీలకం. అందుకే పిల్లల గురించి మహిళలను పదే పదే ప్రశ్నలు వేయకూడదు. ఇది వారిని మానసిక ఒత్తిడికి గురి చేస్తుంది.
వివాహం..
వయసు పెరుగుతున్నా వివాహం ఆలస్యం అవుతున్న అమ్మాయిలు కూడా ఉంటారు. లేదంటే భర్త చనిపోయిన తరువాత వివాహం చేసుకోకుండా అలాగే ఉండిపోయిన మహిళలు కూడా ఉంటారు. ఇలాంటి వారితో ఎందుకు పెళ్లి చేసుకోలేదు అని ప్రశ్నలు వేయకూడదు. వివాహం అనేది మహిళల వ్యక్తిగతం. అలాగే అది కుటుంబ సమస్య కూడా. దీని గురించి ప్రశ్నించడం వల్ల వారి ఆత్మగౌరవం దెబ్బతింటుంది.
వృత్తి..
మగవారికి వారి జీవితకాలం వృత్తి పరమైన కెరీర్ ఉంటుంది. కానీ చాలామందికి మహిళలు తమ కెరీర్ మధ్యలో వదిలేస్తారు అనే ఆలోచన ఉంటుంది. పెళ్లి అయిన తరువాత పిల్లలు పుడితే ఇక మహిళలు తమ కెరీర్ ను కొనసాగించలేరేమో అనే అభిప్రాయంతో ఉంటారు. కానీ ఇది చాలా తప్పు. మహిళల కెరీర్ వారి ఇష్టం. వారు తమ కుటుంబాన్ని చూసుకుంటూ వారి కెరీర్ కొనసాగించుకుంటే వచ్చే నష్టం ఏమీ లేదు. అనవసరంగా వారి కెరీర్ ఇంకెన్నాళ్లు ఉంటుంది అని ప్రశ్నించకూడదు.
సమయం..
చాలామంది మహిళలు బయటకు ఎక్కడికి వెళ్లినా ఎప్పుడైనా ఆలస్యం అయితే అందరూ అడిగే ప్రశ్న ఇంత ఆలస్యం ఎందుకైంది అని. అదే తొందరగా వారు ఎక్కడికైనా హాజరైతే ఇంత త్వరగా ఇంటి నుండి వచ్చావేంటని. ఇవి మహిళలను అసౌకర్యానికి గురిచేస్తాయి. మహిళలు కుటుంబాన్ని, తమ పనులను చేసుకోవడంలో ప్రాధాన్యతలు, టైం మేనేజ్మెంట్ దగ్గర చాలా ఇబ్బందులు పడుతుంటారు. వారి ఆలస్యం గురించి కానీ, వారి తొందర గురించి కానీ అలా అడగకూడదు. ఇది విమర్శ చేసినట్టు అనిపిస్తుంది.
సోషల్ మీడియా..
సోషల్ మీడియా ఇప్పట్లోచాలా సహజం. అయితే సోషల్ మీడియాలో చురుగ్గా ఉన్న మహిళలు అనేకం. చాలామంది అలాంటి మహిళల పట్ల ఎందుకు సోషల్ మీడియాలో అంత యాక్టీవ్ ఉంటావు అని ప్రశ్నిస్తూ ఉంటారు. సోషల్ మీడియాలో గడపడం మహిళల వ్యక్తిగతం, అది వారి అభిరుచి, ఆసక్తి ఆధారంగా ఉంటుంది. దాని గురించి అందరూ ప్రశ్నించాల్సిన అవసరం లేదు.
డ్రస్సింగ్..
ప్రతి మహిళ తమ సౌకర్యం గురించి ఆలోచిస్తుంది. కొందరు ప్యాషన్ ట్రెండ్ ను ఫాలో అవుతుంటారు. ఏది ఏమైనా మహిళల డ్రెస్సింగ్ గురించి వారు ధరించే దుస్తుల గురించి ప్రశ్నించడం, కామెంట్ చేయడం అస్సలు మంచిది కాదు.
పైన పేర్కొన్న 7 విషయాలు మహిళల వ్యక్తిగతం, కుటుంబానికి సంబంధించినవి. వాటిని ప్రశ్నించడం వల్ల మహిళల వ్యక్తిగత జీవితంలో జోక్యం చేసుకున్నట్టే. అంతేకాదు.. పై ప్రశ్నలు అడగడం వల్ల మహిళలు చాలా అసౌకర్యానికి ఫీలవుతారు. అలాగే వారి ఆత్మ విశ్వాసం కూడా దెబ్బతింటుందని వ్యక్తిత్వ విశ్లేషణ నిపుణులు అంటున్నారు.
*రూపశ్రీ.
సైడ్ ఇన్కమ్ కావాలా.. ఈ సూపర్ మార్గాలు మీ కోసమే..!
Publish Date:Dec 16, 2025
నకిలీ స్నేహితులను గుర్తించే మార్గాలు ఇవే..!
Publish Date:Dec 13, 2025
డిసెంబర్ నెలలో పుట్టిన వారి వ్యక్తిత్వం ఇదే..!
Publish Date:Dec 12, 2025
జాగ్రత్త పడండి బాస్.. మోసం చేసే ముందు అమ్మాయిలు ఈ పనులు చేస్తారట..!
Publish Date:Dec 11, 2025
డయాబెటిక్ ఫుడ్స్.. ఈ ఆహారాలు తింటే చాలా ఈజీగా షుగర్ వచ్చేస్తుంది..!
Publish Date:Dec 17, 2025
రక్తంలో చక్కెర శాతం ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉండటాన్ని చక్కెర వ్యాధి లేదా డయాబెటిస్ అని అంటారు. ప్రపంచ దేశాలలో చక్కెర వ్యాధి బాధితులు భారతదేశంలోనే ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగించే అంశం. కేవలం తీపి పదార్థాలు, స్వీట్లు, పంచదార వంటివి తినడమే డయాబెటిస్ కు కారణం అనుకుంటే పొరపడినట్టే.. రోజువారీ ఆహారపు అలవాట్ల మీద డయాబెటిస్ ముడిపడి ఉంటుందని వైద్యులు అంటున్నారు. రోజు వారి తీసుకునే కొన్ని ఆహారాలు.. ఇవి ఏం చేస్తాయి లే అనుకునే పదార్థాలు టైప్-2 డయాబెటిస్ కు కారణం అవుతాయని అంటున్నారు వైద్యులు. ఈ ఆహారాలను ఎక్కువగా తినడం వల్ల డయాబెటిస్ ఈజీగా వస్తుందట. డయాబెటిస్ కు కారణమయ్యే ఆహారాలు ఏంటో తెలుసుకుంటే..
డీప్ ఫ్రైడ్ స్నాక్స్..
సమోసాలు, పకోడాలు, చిప్స్ ఇవన్నీ చిన్న పిల్లల నుండి పెద్ద వారి వరకు చాలా ఇష్టమైన స్నాక్స్. కానీ ఈ ఆహారాలలో అనారోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఈ కొవ్వు క్రమంగా శరీరంలో పేరుకుపోతుంది. బరువు పెరగడానికి దారి తీస్తుంది. బరువు పెరగడం ఇన్సులిన్ నిరోధకతను పెంచుతుంది, ఇది టైప్ 2 డయాబెటిస్‌కు ప్రధాన కారణం. ఫాస్ట్ ఫుడ్‌లో ఉపయోగించే నూనెను పదే పదే వేడి చేయడం వల్ల ట్రాన్స్ ఫ్యాట్ ఏర్పడుతుంది. ఇది రక్తంలో చక్కెరను మరింత పెంచుతుంది.
మార్కెట్ ఫుడ్స్..
మార్కెట్లో అమ్మే గ్రానోలాతో పాటు అనేక బ్రేకఫాస్ట్ తృణధాన్యాలు ఆరోగ్యకరమైనవని అనుకుంటారు. కానీ వాటిలో షుగర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. గ్రానోలా బార్‌లు, ఓట్ బార్‌లు, రెడీ టూ ఈట్ ఫుడ్స్ లో చాలా ఎక్కువ మొత్తంలో చక్కెరలు ఉంటాయి. వీటి వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు చాలా వేగంగా పెరుగుతాయి.
ప్రాసెస్డ్ మీట్..
సాసేజ్, బేకన్, సలామీ వంటి ప్రాసెస్ చేసిన మాంసాలలో సోడియం, నైట్రేట్లు అధికంగా ఉంటాయి. ఇవి గుండెకు హాని చేయడమే కాకుండా డయాబెటిస్‌కు నేరుగా కారణం అవుతాయి. ప్రాసెస్ చేసిన మాంసాలు వాపును పెంచుతాయి, జీవక్రియను నెమ్మదిస్తాయి. రక్తంలో చక్కెరను నియంత్రించడం కష్టతరం చేస్తాయి.
డ్రింక్స్..
శీతల పానీయాలు, ప్యాక్ చేసిన సోడాలలో చక్కెర చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక సోడా డ్రింక్ లో ఉండే చక్కెర పరిమాణం కొన్ని రోజులు తీసుకునే నేచురల్ చక్కెర కంటే ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఈ పానీయాలు వెంటనే రక్తంలో గ్లూకోజ్‌ను పెంచుతాయి. క్లోమంపై ఒత్తిడిని ఎక్కువగా కలిగిస్తాయి. ఇలాంటి డ్రింక్స్ తీసుకున్న ప్రతి సారి శరీరం అదనపు ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. ఇది కాలక్రమేణా ఇన్సులిన్ నిరోధకతను పెంచుతుంది.
రిపైండ్ ఫ్లోర్, బ్రెడ్..
తెల్ల బ్రెడ్, బన్స్, కుకీలు, నాన్ వంటి ఆహారాలు మైదాతో తయారు చేస్తారు. ఈ ఆహారాలలో గ్లూకోజ్ చాలా త్వరగా విచ్చిన్నమవుతుంది. ఈ రిఫైండ్ ఫ్లోర్ లో ఫైబర్ ఉండదు. దీని వల్ల రక్తంలో చక్కెర వేగంగా పెరుగుతుంది. అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ ఆహారాలను తరచుగా తీసుకోవడం వల్ల శరీరం రక్తంలో చక్కెర సమతుల్యతను కాపాడుకోవడానికి కష్టపడి పనిచేయవలసి వస్తుంది. ఈ అలవాటు క్రమంగా మధుమేహం ప్రమాదాన్ని పెంచుతుంది.
వైట్ రైస్..
తెల్ల బియ్యం భారతీయ ఆహారంలో ముఖ్యమైన భాగం. కానీ ఇందులో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ. దీని గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా ఎక్కువే. ఇది తిన్న తర్వాత గ్లూకోజ్‌గా మారుతుంది. ఇది నేరుగా రక్తంలో చక్కెరను పెంచుతుంది. రోజూ పెద్ద మొత్తంలో తెల్ల బియ్యం తినడం వల్ల బరువు పెరగడం, రక్తంలో చక్కెర నియంత్రణ బలహీనపడటం జరిగి, టైప్ 2 డయాబెటిస్ ప్రమాదం పెరుగుతుంది. ముఖ్యంగా చాలా పాలిష్ పట్టిన బియ్యంతో వండే అన్నం ఎక్కువ తినడం మానేయాలి.
*రూపశ్రీ.
గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
టీతో పాటు బిస్కెట్లు తింటున్నారా? దిమ్మ తిరిగే నిజాలు ఇవి..!
Publish Date:Dec 16, 2025
వందేళ్లకు పైగా బ్రతకడానికి ఆయుర్వేదం చెప్పిన రహస్య చిట్కాలు..!
Publish Date:Dec 13, 2025
వారెవ్వా మందారం టీ.. బెనిఫిట్స్ తెలిస్తే ఎగిరి గంతేస్తారు..!
Publish Date:Dec 12, 2025
బలమైన గుండె కావాలా? ఇవి తినండి చాలు..!
Publish Date:Dec 11, 2025