డిసెంబర్ నెలలో పుట్టిన వారి వ్యక్తిత్వం ఇదే..!
posted on Dec 12, 2025 @ 3:44PM
ప్రతి మనిషి వేర్వేరు వ్యక్తిత్వం కలిగి ఉంటాడు. ఒకే ఇంట్లో, ఒకే తల్లి కడుపున పుట్టిన వ్యక్తులే వేర్వేరు స్వభావాలను కలిగి ఉన్నప్పుడు బయటి వ్యక్తుల స్వభావం ఒకే విదంగా ఉండటం అనేది జరగదు. అయితే బయట కొందరిని చూస్తే వీళ్లు అచ్చు మనలాగే ఉన్నారే అనే ఫీలింగ్ కలిగిస్తుంది. వారి ప్రవర్తన, వారి స్వభావం ఇవన్నీ పెరిగిన వాతావరణం, చుట్టూ ఉన్న పరిస్థితుల ఆధారంగా వచ్చేవే అయినా పుట్టిన నెలను బట్టి వారి వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తారు వ్యక్తిత్వ విశ్లేషణ నిపుణులు, సంఖ్యా శాస్త్ర నిపుణులు, జ్యోతిష్కులు. ఇంతకీ డిసెంబర్ నెలలో ఫుట్టిన వారి స్వభావం, వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసుకుంటే..
సంఖ్యాశాస్త్రం ప్రకారం ప్రతి నెలలో జన్మించిన వ్యక్తులు వేర్వేరు స్వభావాలు కలిగి ఉంటారు. అలాగే డిసెంబర్ నెలలో జన్మించిన వ్యక్తులు కూడా ఇతర నెలల్లో పుట్టిన వ్యక్తులకు భిన్నంగా ఉంటుంది.
సంఖ్యాశాస్త్రం ప్రకారం డిసెంబర్ నెలలో పుట్టిన వ్యక్తులు చాలా ఆకర్షణీయంగా ఉంటారట. వీరిది సహజమైన ఆకర్షణ అని, డబ్బు, హోదా, పలుకుబడి ద్వారా వచ్చే ఆకర్షణ కాదని సంఖ్యాశాస్ర్త నిపుణులు చెబుతున్నారు.
డిసెంబర్ నెలలో పుట్టిన వ్యక్తులు వారి ప్రవర్తన, హావభావాలు, వారి మాట తీరుతో ఇతరుల హృదయాలను గెలుచుకుంటారట. ఇతరుల నుండి మెప్పు పొందడం, ఇతరులతో ఆకట్టుకునేలా మాట్లాడటం వీరికి వెన్నతో పెట్టిన విద్య అని అంటున్నారు.
డిసెంబర్ నెలలో పుట్టిన వారు ఎమోషన్ పరంగా చాలా పీక్స్ లో ఉంటారట. వీరు చాలా భావోద్వేగాలకు లోనవుతారు. దీని వల్ల వారు చాలా సార్లు నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే ఇతరులతో సంబంధాల విషయంలోనూ నష్టాలు చవిచూడాల్సి ఉంటుంది.
మోసపోవడంలో కూడా డిసెంబర్ లో పుట్టిన వారు ఫస్ట్ అని చెప్పవచ్చు. వీరు ఇతరులను చాలా తొందరగా నమ్మేస్తారు. అంతకు మించి వీరిది చాలా స్వచ్చమైన హృదయమట. ఈ కారణంగా వీరు ఇతరుల విషయంలో సులువుగా బోల్తా పడతారు.
డిసెంబర్ లో పుట్టిన వారితో ఎలాంటి సంకోచం లేకుండాస్నేహం చేయవచ్చట. ఎందుకుంటే ఈ నెలలో పుట్టిన వారు స్నేహానికి చాలా ప్రాధాన్యత ఇస్తారట. అలాగే నమ్మకమైన స్నేహితులుగా ఉంటారట. స్నేహం పట్ల పూర్తీ విధేయతతో ఉంటారట.
కొందరు వ్యక్తుల చుట్టూ పాజిటివ్ వైబ్రేషన్ చాలా మెరుగ్గా ఉంటుంది. అలాంటి వారిలో డిసెంబర్ నెలలో పుట్టిన వ్యక్తులు కూడా ఉంటారట. వీరి చుట్టూ సానుకూల శక్తి ఉంటుందట. ఈ కారణంగా వీరి చుట్టూ ఉండే వ్యక్తులకు మంచి జరుగుతుందని, ఎవరికైనా మంచి సలహాలు, పరిష్కారాలు లభించి సమస్యలు కూడా దూరం అవుతాయని అంటారు.
సలహాలు ఇవ్వడంలో డిసెంబర్ లో పుట్టిన వారు ది బెస్ట్ అని చెప్పవచ్చు. వీరు మంచి సలహా దారులు, సమస్యను పరిష్కరించడానికి మంచి సలహాలు, సరైన ప్రణాళిక ఇవ్వగలరట.కాకపోతే వీరిది చంచలమైన మనసు.. అలాగే వీరి స్వభావం కూడా మొండిగా ఉంటుంది. ఈ కారణంగా వీరు కొన్నిసార్లు తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది.
ఇది డిసెంబర్ నెలలో పుట్టిన వారి వ్యక్తిత్వం. అందరూ ఇలానే ఉంటారని కాదు.. సంఖ్యా శాస్ర్తం ప్రకారం నిపుణులు పేర్కొన్న వివరాలే ఇవి.
*రూపశ్రీ.