బలమైన గుండె కావాలా? ఇవి తినండి చాలు..!
posted on Dec 11, 2025 @ 11:48AM
శరీరంలో ముఖ్యమైన అవయవం గుండె. ఏ ఇతర అవయవాలు సరిగా పని చేయకపోయినా ప్రాణం నిలబడుతుందేమో కానీ.. గుండె కొట్టుకోవడం కొన్ని నిమిషాల పాటు ఆగిపోతే శరీరం నిర్జీవం అవుతుంది. అయితే ఈ మధ్య కాలంలో గుండె సంబంధ సమస్యలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చాలామందిలో గుండె బలహీనంగా మారడం వల్ల తొందరగా గుండె జబ్బులు రావడం జరుగుతోంది. అందుకే గుండెకు బలాన్ని ఇచ్చే ఆహారాలు తీసుకోవాలని వైద్యులు చెబుతారు. గుండెకు బలాన్ని పెంచే ఆహారాలు ఏవి? ఆ లిస్ట్ ఒక్కసారి చూస్తే..
గుండెను బలంగా ఉంచే ఆహారాలు..
సాల్మన్..
సాల్మన్ వంటి కొవ్వు చేపలలో గుండెకు బలాన్ని చేకూర్చే ఒమేగా-3 కొవ్వులు సమృద్ధిగా ఉంటాయి. సాల్మన్ చేపలు EPA, DHA లను అందిస్తాయి. ఇవి ట్రైగ్లిజరైడ్లను తగ్గించడంలో, గుండె లయను స్థిరంగా ఉంచడంలో, రక్త నాళాల లైనింగ్‌ను మెరుగుపరచడంలో సహాయపడతాయి. క్రమం తప్పకుండా తింటే హృదయ సంబంధ సమస్యలను చాలా వరకు తగ్గించడంలో సహాయపడతాయి. ఈ ఒమేగా-3 లు గుండె కణ త్వచాలలో కలిసిపోయి ఆరోగ్యకరమైన విద్యుత్ కమ్యునికేషన్ కు సహాయపడతాయి.
ఆలివ్ ఆయిల్..
ఎక్స్టా వర్జిన్ ఆలివ్ ఆయిల్ నూనెలో మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు, పాలీఫెనాల్స్ అని పిలువబడే యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు మెరుగైన ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్ ను అందిస్తాయి. అలాగే ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఆలివ్ నూనె తీసుకోవడం వల్ల గుండె జబ్బులు తగ్గుతాయి.
అవకాడో..
అవకాడోలు సహజంగా ఒలీక్ ఆమ్లం, ఫైబర్, పొటాషియం, ఫోలేట్, విటమిన్ E లతో నిండి ఉంటాయి. ఈ పోషకాలు ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్, రక్తపోటు స్థాయిలకు మద్దతు ఇస్తాయి.
వాల్నట్స్.
క్రమం తప్పకుండా వాల్‌నట్‌లను తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. వాల్‌నట్‌లలో మొక్కల ఆధారిత ఒమేగా-3లు, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వులు, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. వాల్‌నట్‌లు చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడం ద్వారా ఆరోగ్యకరమైన కొవ్వులను భర్తీ చేయడంలో సహాయపడుతుంది. రక్తనాళాల పనితీరును మెరుగుపరుస్తుంది.
బ్లూబెర్రీస్..
బ్లూబెర్రీస్ యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. బ్లూబెర్రీస్‌లో ఉండే ఆంథోసైనిన్లు, పాలీఫెనాల్స్ రక్తనాళాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయని చెబుతారు. ఇది రక్తపోటును తగ్గించడంలో కూడా ప్రభావవంతంగా ఉంటుందట.
ముదురు ఆకుకూరలు..
ముదురు ఆకుకూరలు రక్తపోటును నియంత్రణలో ఉంచుతాయి. సహజ నైట్రేట్లతో సమృద్ధిగా ఉండటం వల్ల రక్తపోటును నియంత్రణలో ఉంచుతాయి. విటమిన్ K, ఫోలేట్, పొటాషియం, యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. ఇవి గుండెను బలంగా మారుస్తాయి.
*రూపశ్రీ.
గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...