Previous Page Next Page 
అష్టపది పేజి 6


    
    శీతల్ తాలూకు ఆ పరమ రహస్యాన్ని దాచి గోవర్ధనరావు అందమైన అబద్దం బహు సుందరంగా ఆడాడు.
    
    శీతల్ ముఖం చూసి ఏదో వుందనుకున్నారు. కొందరు తల్లీ తండ్రిని విడిచి అమెరికా వెళ్ళాలంటే దిగులు కాదా ఏమిటి? అనుకున్నారు మరికొందరు.  

 

    తమ ఇంట్లోంచి బైటపడే మార్గం లేదా!
    
    వుంది ఒకే ఒక మార్గం.
    
    అది-
    
    రంజిత్ చాకచాక్యంమీద ఆధారపడి వుంది.
    
    తను రజియా పంపిన వార్త వింటూనే రంజిత్ రంగంలోకి దిగి ఇక్కడ నుంచి తనని తప్పిస్తాడు. రజియా ఏ నిమిషాన అయినా వచ్చి రంజిత్ ప్లాను తనకి చెపుతుంది. అంతే తను రెక్కలు కట్టుకు ఎగిరిపోవడం ఖాయం.    

 

    పది...పదకొండు...పన్నెండు....ఒకటి....రెండు...మూడు...మొత్తం ఆరుగంటలు. ఈ ఆరుగంటల్లో తను ఈ ఇల్లు దాటితే దాటినట్టు లేకపోతే నయనబాబుకి భార్య కావాలి....
    
    'ఇంపాజిబుల్' గట్టిగా అరవాలనుకుంది శీతల్.
    
    సరిగ్గా ఆప్పుడే చార్లీ సెంట్ సువాసన గదిలో దూసుకువచ్చింది. పరిమళంతో పాటు శీతల్ స్నేహితురాలు గలగలలాడుతూ గదిలోకి దూరారు.    

 

    'ఇది పిన్ని చేసిన పని' అనుకుంది శీతల్.
    
                                                                  *    *    *
    
    సురేంద్రనాథ్ తలఎత్తి చూశాడు.
    
    అది చూసి "పూర్తిగా చదివారుగా?" అని సి.బి.ఐ అధికారి అడిగాడు.
    
    "ఇందులో అర్ధం కానిది ఏముంది?"
    
    "మూడువారాల క్రితం యేదో దినపత్రికలో యీ వార్త కొద్దిగా చదివాను. ఇప్పుడు దీనిలో మరికొద్ది వివరం వుంది. జరిగిన హత్య గురించి నాకెలా తెలుస్తుంది హత్యా చేసిన హంతకుడు యెక్కడ ఉన్నాడా అని వెతుకుతూ మీరు బయలుదేరి వుంటారు. యామై కరెక్ట్.
    
    "కొంతవరకు కరెక్టు. కాని హత్య చేసింది హంతకుడు కాదు హంతకురాలు" సి.బి.ఐ. అధికారి ఓ పొడిదగ్గు గా చెప్పాడు.  

 

    "మీరిచ్చిన ఈ పేపరు కటింగ్ లో రాసి ఉండదు హత్యచేసింది మగవాడు కాదు స్త్రీ అని అనుమానిస్తున్నాము అని ఇన్ స్పెక్టర్ అన్నమాటలు మాత్రమే."

   
    "మాకు కొన్ని ఆధారాలు దొరికాయి. ఉపేంద్ర కుమార్ ని హత్య చేసింది అతని గర్ల్ ఫ్రెండు అని తెలుసుకో గలిగాము.
    
    అందం, ఆకర్షణ గల ఉపేంద్రకుమార్ కి చాలా దురలవాట్లు ఉన్నాయి. మంచి మాటకారి. తన అందంతో అమ్మాయిలను ఆకర్షిస్తూ, మాటకారితనంతో మభ్యపెడుతూ లొంగదీసుకుని అనుభవించి వదిలేవాడు..."
    
    "ఇదంతా నాకెందుకు చెబుతున్నారు?" సురేంద్ర నాథ్ అడిగాడు.
    
    "వివరంగా చెబితేగాని మీకు అర్ధం కాదు కాబట్టి."
    
    "నాకు అర్ధం కావడం ఎందుకు? ఇది మగపెళ్ళివారి విడిది. నేను పెళ్ళికొడుకు తండ్రిని. ఉపేంద్రకుమార్ అనే వాడిని ఏ స్త్రీయో హత్యచేస్తే..." కొద్ది ఆవేశంతో ఈ మాటలంటున్న సురేంద్రనాథ్.... ఏ స్త్రీయో హత్యచేస్తే మీ దగ్గర ఠకీమని ఆగిపోయాడు ఏదో అనుమానం రాగా.
    
    సి.బి.ఐ. అధికార్లుగాని, వాళ్ళతో వచ్చిన ఆమెగాని పెదవి కదపలేదు. సురేంద్రనాథ్ ని చూస్తూ ఉండిపోయారు.
    
    "మా బంధువర్గం, లేక స్నేహితులు, వాళ్ళ తాలూకు స్త్రీ అన్నా ఈ హత్య చేసింది అన్న అనుమానంతో దగ్గరకు వచ్చారా!" సురేంద్రనాథ్ అడగలేక అడిగాడు.
    
    "ఎస్" సి.బి.ఐ. అధికారి ఒక్క ముక్కలో అన్నాడు.  

 

    సురేంద్రనాథ్ ముఖం తెల్లగా పాలిపోయింది. "మా వాళ్ళల్లో ఎవరు?" నెమ్మదిగా అడిగాడు.
    
    "ఇంకా పూర్తిగా మీవాళ్ళు కాలేదు. ఇహ అవుతారు."
    
    "మీరు ఏం చెపుతున్నారో నా కర్ధం కావడంలేదు దయచేసి వివరంగా చెపుతారా?"
    
    "చెపుతుంటే మీరు అడ్డు తగిలారు."
    
    "చెప్పండి"
    
    "హతుడు ఉపేంద్రకుమార్ ఎందరో ఆడపిల్లల స్నేహంచేసి ఆ తర్వాత వాళ్ళను వదిలెయ్యడం జరిగింది అతనివల్ల మోసగించబడ్డ ఆడపిల్లలు ఎందరికో అతనిమీద పీకలదాకా కోపం వుంది కసితో ఓ ఆడపిల్ల సమయం చూసి నేక్ గా అతడిని హతమార్చింది. ఆధారాలు దొరికాయి కొంతవరకు. నిజమో కాదో తెలుసుకుందాము మేము బైలుదేరి వచ్చాము. నిజమయితే వెంటనే అరెస్ట్ చేయడం, అబద్దం అయితే గప్ చిప్ గా మా దోవన మేము వెళ్ళిపోవడం జరుగుతుంది" అతను వివరించాడు.
    
    "ఆ అమ్మాయి మా బంధువుల్లో ఉందంటారా గత్యంతరంలేని పరిస్థితులలో సురేంద్రనాథ్ అడిగాడు జరిగేది శుభకార్యం. ఇలాంటప్పుడు హత్య కేసు బయటపడితే ఎంత గోల అవుతుంది? అందులో తన వాళ్ళు ఎవరు!
    
    "ఉంది" ముక్తసరిగా ఒక్క మాటలో జవాబిచ్చాడు అధికారి.
    
    "అత్యంత వైభవంగా జరుగుతున్న పెళ్ళిలో వార్త బైటపడితే నానారభస అవుతుంది. హత్య ఆ మాట చాలు కార్చిచ్చులాగా నలువైపులా పాకాడానికి పరువు, మర్యాదగల పెద్ద కుటుంబాలు ఇవి. పరువుపోతే ప్రాణం తీసుకునే పరిస్థితి జరుగుతుంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS