Previous Page Next Page 
డేంజర్ డేంజర్ పేజి 6

   
    "నిజమే. నాకూ చాలా దాహంగా వుంది. ఎందుకో తెలియటం లేదు. అమ్మానాన్నలకి నేను ఒక్కదాన్నే ఆడపిల్లని నాకు ముగ్గురాన్నయ్యలున్నారు. అందరికీ నేనంటే ప్రాణం మా చిన్నన్నయ్యయితే గోమతీ అని పిలవడు గోతి గోతి అంటూ అల్లరి పట్టిస్తాడు. మొదట నాతో ప్రయాణమయ్యాడు. అన్నయ్య ఫ్రెండ్ కి కారు యాక్సిడెంట్ అయి చావు బతుకుల్లో వుండటం వల్ల ఆగిపోయాడు, నాకు ధైర్యం వుందని ఇంట్లో అందరినీ ఎదిరించి అంకుల్ దగ్గరకు వంటరిగా బైలుదేరాను. విమానం ప్రమాదానికి లోనయిందని తెల్సినేను మరణించాననే తలుస్తారు. మా ఇంట్లో అందరూ నాకోసం..." ఆ పై మాట పూర్తి చేయలేకపోయింది, గోమతి కంఠం బొంగురు పోయింది, కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.    
    "మనం దిక్కులేని చావు చావలేదు గోమతి. భగవంతుడి దయవుంటే మన వాళ్ళని మళ్ళీ తప్పక కల్సుకుంటాము. ఇప్పుడు మనం వాళ్ళ గురించి ఆలోచించటం వ్యర్ధం. మన గురించి ఆలోచించాలి. ఇలా అంటున్నానని బాధగా వుందా గోమతి!"    
    "లేదు, మీరు మగవారు మీకున్న ధైర్యం నాకెలా వుంటుంది?"    
    కీర్తి మాట్లాడలేదు.    
    "నాకు చాలా దాహంగా వుంది. ఏం చెయ్యాలి కమల్!" కాసేపాగి గోమతి అడిగింది.    
    "ఇక్కడిదాకా నడవటం వల్ల నా కాలు చాలా నొప్పిచేసింది. ఇంకా నడిస్తే అడుగుతీసి అడుగు పెట్టలే నేమో అనిపిస్తున్నది. ఓ పని చెయ్యి గోమతీ! నా వద్దచాక్ పీస్ వుంది. వీలయినంత వేగంగా గుర్తులు పెట్టుకుంటూ కొద్ది దూరం వెళ్ళిరా."    
    "ఏదయినా ప్రమాదం ఎదురయితే?"    
    "మనమున్నది సిటీలో కాదు ఏదో ఓ రాస్తా పట్టుకు పోవటానికి దారి డొంకలేని అడవిలో ఏ ప్రమాదమైనా ఎదురవుతుంది. ఎటుపోతే ఏం జరుగుతుందో, అని మీన మేషాలు లెక్కపెడుతూ కూర్చుంటే ఆకలి దప్పులకి ప్రాణం గిలగిల లాడి ఆపై హరీ అంటుంది. ఇది మాత్రం కష్టం కాదా! ప్రమాదం కాదా?" కీర్తి కఠినంగా అంది.    
    "వెళతాను ఎంత దూరం వెళ్ళను?" నెమ్మదిగా అంది గోమతి.    
    "పరిసరాలు చూసుకుంటూ సరీగ పావుగంట నడువు. ఆపై గుర్తుల ఆధారంలో వెనుతిరిగిరా. ఇలాగే నలువైపులా చూద్దాం రెండు గంటల్లో పూర్తయిపోవాలి."    
    "మీరు చెప్పింది బాగానే వుంది కమల్! పావుగంట ముందుకి నడుస్తాను. అదే ఒకవైపు గంట నడిస్తే నీరున్న జాడా తెలియవచ్చుకదా! నాలుగు వైపులా తిరిగినదాన్నీ అవుతాను నీరు దొరకక..."    
    "స్టాఫ్ గోమతి! స్టాప్. ఈ అడవిలో మనం ఓ ప్రక్కన వున్నామో నట్టనడుమ వున్నామో తెలియదు. అడవి చివరి భాగంలోనే వుండి కళ్ళు మూసుకు ఓకే దారిన బైలుదేరిపోతామనుకో సరిగ్గా ఆ దారి మన్ని అడవి మధ్యకి చేరిస్తే అప్పుడు మన పని? కాబట్టి పరిసరాలు చూసుకుంటూ వెళ్ళొచ్చావంటే నీవు చెప్పిన గుర్తులను బట్టి నేను కొంచెం ఊహించగలను. పోనీ చెట్టుఎక్కగలవా?"    
    "ఉహు ఇందాక ఇధయినా చిన్నచెట్టు గాబట్టి దిగాను చెట్టు ఎక్కటం చాతగాదు. అయిన ఇప్పుడు చెట్టేక్కేపని ఏముంది?"    
    "ఎత్తైన చెట్టు చివరిదాకా ఎక్కి నలువైపులా చూస్తే కనుచూపు మేర ఏముందీ కనిపిస్తుంది. నా కాలుఇలా తయారయింది కీటకాల పుణ్యమా అని, కాలు చెయ్యి సరిగ్గా వుంటే కీకారన్యాల తుదీ మొదలు గంటల్లో తేల్చి వేయగలను.  
    కీర్తి మాటల్లో నిజం విన్పించింది గోమాతికి. కమల్ మంచిధైర్యస్తుడు అనుకుంది.    
    "ముందుగా ఎటు వెళ్ళను?" వెళ్ళతానికే నిశ్చయించుకున్న గోమతి అడిగింది.    
    "ఇటు వెళ్ళు" అని చాక్ పీసు యిచ్చి ఎలా గుర్తులు పెట్టాల్సింది ఏం చేయవలిసింది వివరంగా చెప్పింది కీర్తి.    
    "పావుగంట పోను పావుగంట రాను. అరగంట తర్వాత సే రాకపోతే!"    
    "నువు దారి పొడుగూత పెట్టిన గుర్తులుంటాయిగా అవి చూసుకుంటూ నే వస్తాను."    
    "వెళ్ళొస్తా కమల్?"    
    "ధైర్యం వచ్చిందే."    
    "ఊ."    
    "పరిసరాలు గమనించు. వచ్చిం తరువాత వర్ణించి చెపుదువుగాని నే చెప్పినవి జాగ్రత్తగా గుర్తున్నాయిగా?"    
    "ఆ"    
    "నువ్వొచ్చిందాకా ఇక్కడె వుంటాను."    
    "ఊ"    
    గోమతి ముందుకు వెళ్ళిపోయింది.    
    వెళుతున్న గోమతిని చూస్తూ వుండిపోయింది కీర్తి.
    
                                      5
    
    అరగంటకి తిరిగి రావల్సిన గోమతి పావుగంటకే తిరిగి వచ్చింది.    
    "అప్పుడే వచ్చాశావేం?" అంది కీర్తి.    
    "చాలా వేగంగా నడుస్తూ ముందుకు వెళ్ళాను. పోను పోను చెట్ల సందున దారికూడా లేదు. పెద్ద పెద్దచెట్లు దగ్గరగా వున్నాయి. చెట్టు చెట్టుకి మధ్య చోటు లేకుండా లతలల్లుకుని వున్నాయి. తెంపినా లతలు తెగేట్టె లేవు. ఇవేవో పళ్ళు వాటికుంటే తెంపుకు వచ్చాను" చీరచెంగులో నిమ్మకాయంత పళ్ళని ఒకడజను తెచ్చింది, అవి క్రిందపెట్టింది గోమతి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS