4-7-97
రఘుగారికి ,
రిజిస్టరు పోస్టులో పంపిన P.P అప్లికేషన్ అందింది.
మీ నలుగురికి శుభాకాంక్షలతో.
-వడ్డెర చండీదాస్.
5-8-97
రఘుగారికి,
నమస్తే,
"మళ్ళి మళ్ళి అమీర్ మరణం" అందింది. బావుంది. వెనకటి వ్యాసాల్లాగే.
అమెరికా వెళ్ళటం avoidచేస్తున్నాను. అందుకే యింకా passport కి apply చెయ్యలేదు. పబ్లిషర్స్ కి reminder రాసి చూడండి. "మహాద్రసార్తి" అందినట్లూ వార్త వాళ్లకి ఫోన్ చేసినట్లూ రాసిన వుత్తరం కూడా అందింది.
మీ నలుగురికి శుభాకాంక్షలు.
-వడ్డెర చండీదాస్.
4-9-97
రఘుగారికి,
నమస్తే,
"మహాద్రసార్తి" 24-8-97ఆదివారం అనుబంధం ఆంద్రజ్యోతి దినపత్రికలో వొచ్చింది. నిన్న చేరింది. యదాతథంగా వేశారు. మీరు చూడకపోతే కాపి పంపిస్తాను. వార్త వాల్లకిస్తానన్నారు కదా-వాళ్ళు యథాతథంగా వెయ్యమన్నారా? d & l Motilal Banarsidas వాళ్ళకి యిస్తే మేలేమో. ఆలోచించండి.
ఆంధ్రజ్యోతి నండూరి రామమోహనరావుగారికి యిచ్చారా? ఆ వివరాలు రాయండి.
మీ నలుగురికి శుభాకాంక్షలు
-వడ్డెర చండీదాస్.
7-1-98
ప్రియమైన రఘుగారికి,
నమస్తే,
మీ వుత్తరం అందింది. brochers చూశాను - వేస్తానన్నవాళ్ళకి యివ్వకపోవటం కూడా మంచిది కాదు. నా అభిప్రాయం యివ్వమనే. యోగాగొలా వెలుగులోకి రానివ్వండి.
మీ నలుగురికీ శుభాకాంక్షలు.
వుంటాను. ప్రేమతో,
-వడ్డెర చండీదాస్.
1-5-98
రఘుగారికి,
నమస్తే,
అనుక్షణికం టివి సీరియల్ గా అనుమతించటం తప్ప మరేరకంగానూ సహకరించాలేను.
అనుమతించినట్లుగా చెప్పడి.
మీ నలుగుగురికి శుభాకాంక్షలు.
-వడ్డెర చండీదాస్.
26-6-98
రఘుగారికి,
నమస్తే,
వ్యాసం అద్బుతంగా వుంది. మళ్ళి వొస్తారని చూశాను.
మీ నలుగురికి శుభాకాంక్షలు.
-వడ్డెర చండీదాస్.
తిరుపతి 20-7-98
ప్రియమైన రఘుగారికి,
మీ సినిమా అవగాహనకు యెంతగా ఆశ్చర్యపోయనో! చాలా బావుంది.
మీ నలుగురికి శుభాకాంక్షలు.
-వడ్డెర చండీదాస్.
తిరుపతి
29-10-98
రఘుగారికి,
మీ వుత్తరం.
పఠనం కానివ్వండి. నేను కులాసా. టివి చూస్తున్నాను. మీకు సినిమాల గురించి మరో వ్యాసం రాసే ఆలోచనుందా? నాకు మల్లీశ్వరి దేవదాసు నచ్చాయి.
మీ నలుగురికి శుభాకాంక్షలు.
-వడ్డెర చండీదాస్.
తిరుపతి
26-11-98
రఘుగారికి,
"యిప్పటికివరకూ ఆదునిక సాహిత్యంలో వాచకాన్ని శ్రద్దగా, ముఖ్యంగా వాచకంలోని శిల్పాన్ని శ్రద్దగా పరిశిలించిన దాఖలాలు లేవు". యిది గొప్ప పరిశీలన. అవును నిజమే.
మీ నలుగురికి శుభాకాంక్షలు.
-వడ్డెర చండీదాస్.
23-6-99
రఘుగారికి ,
నమస్తే,
మీరు మా అమ్మాయి పదేపదే అన్న మీదట పాస్ పోర్టుకి అప్ల్తే చేస్తున్నాను. మీకు శ్రమ. అన్ని జతపరిచి పంపుతున్నాను. తొందరలేదులెండి.
విశాలంద్ర వాళ్ళని పల్లవి పబ్లికేషన్స్ గురించి అడిగిచూడండి.
మీ నలుగురికి శుభాకాంక్షలు.
-వడ్డెర చండీదాస్.
(పర్మనెంట్ పాస్ పోర్ట్ కావాలి)
